
సాక్షి, అమరావతి : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలు సిన్సియర్‌గా నిర్వహించాలని ఆయన సూచించారు. ఏ మాత్రం ఏమరపాటు తగదని ప్రతి ఒక్క సమన్వయకర్త పూర్తిస్థాయి సమయాన్ని వెచ్చించడంతో పాటు అన్ని శక్తియుక్తుల్నీ కూడదీసుకుని చంద్రబాబు పార్టీ పునాదుల్ని కదిపేలా ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల వరకూ ప్రతి క్షణం ఎంతో విలువైందని, ప్రజాస్వామిక యుద్ధానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పేర్కొన్నారు. అంతా ఒక్కటై ముందుకు నడవాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు.
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పార్టీ పరిశీలకులతో వైఎస్ జగన్ బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. దాదాపు రెండున్నర గంటలసేపు ఈ సమావేశం కొనసాగింది. వైఎస్ జగన్ నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. పాదయాత్ర సమయంలోఒక జిల్లాలో యాత్ర చేపడుతున్న సమయంలో మిగిలిన 12 జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, నిర్వహించాల్సిన కార్యక్రమాలపై అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా నేతలను కోరారు. దాదాపు 50మందికి పైగా తమ అభిప్రాయాలను పార్టీ అధ్యక్షుడికి వెల్లడించారు. వారి సలహాలు, సూచనలను వైఎస్ జగన్ నోట్ చేసుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు పాదయాత్ర సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.






0 comments:
Post a Comment