
సాక్షి, హైదరాబాద్ : యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్‌సీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా వి. విజయసాయిరెడ్డి(రాజ్యసభ ఎంపీ) నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డి.. ఇకపై జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారని ప్రకటనలో పేర్కొన్నారు. సాయిరెడ్డి నియామకంపై పలువురు పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment