
ఓ మహా సంకల్పంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ కీలక నేత తలశిల రఘురామ్ తెలిపారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజా సంకల్ప యాత్ర విశేషాలను ఆయన వివరించారు.
నవంబర్ 6వ తేదీన ఉదయం 9 గంటలకు వైఎస్ జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పిస్తారని, ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసగించాక జగన్ పాదయాత్ర మొదలౌతుందని రఘురామ్ చెప్పారు. కడప జిల్లాలో 7 రోజులపాటు మొత్తం వంద కిలోమీటర్లు యాత్ర కొనసాతుందన్నారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు.. ఇలా ఐదు నియోజకవర్గాల కొనసాగే యాత్ర ఆపై కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు మీదుగా శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురంతో ముగుస్తుందని పేర్కొన్నారు. 13 జిల్లాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తారని.. ప్రజలందరినీ ఆయన కలుస్తారని రఘురామ్ తెలిపారు.
గతంలో వైఎస్సాఆర్‌సీపీ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహించామని.. అన్నీ దిగ్విజయంగా పూర్తయ్యాయని, ఇప్పడు కూడా శాంతియుత వాతారణంలోనే కొనసాగుతుందన్న నమ్మకం ఆయన వ్యక్తంచేశారు. అయితే ప్రభుత్వం మాత్రం యాత్రకు అవరోధాలు కల్పించాలని చూస్తోందని రఘురామ్ చెప్పారు. వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతం అయితే తమ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడట్లేనన్న భయంతో తెలుగుదేశం నేతలు కుట్రలకు తెరలేపుతున్నారన్నారు. పాదయాత్ర ప్రాధాన్యత తగ్గించేలా ప్రయత్నాలు ఏస్తున్నారని.. వాటిని తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
ప్రజా స్వామ్య దేశంలో పాదయాత్రలు చేసుకునేందుకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ముద్రగడ పద్మనాభం యాత్రతో ప్రజా సంకల్ప యాత్రకు సంబంధం లేదని. ముద్రగడ చేపట్టింది కాపు హక్కుల పోరాటం అని, కానీ, ప్రతిపక్ష నేతగా, వైఎస్ జగన్ ప్రజా హక్కుల కోసం.. వారి సమస్యలు వినిపించేందుకు పాదయాత్ర చేపట్టబోతున్నారని.. జన నేతకి ఆహ్వానం పలికేందుకు 13 జిల్లాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని రఘురామ్ చెప్పారు. చంద్రబాబు పాలనలో జాబులు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఏపీని అభివృద్ధిలో ముందుంచాలన్నదే వైఎస్ జగన్ లక్ష్యమని.. దివంగత నేత వైఎస్‌ఆర్ పాలనలోని స్వర్ణయగం కోసమే ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని రఘురామ్ స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment