తిరుపతి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం తిరుమలకు రానున్నట్లు వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి తెలిపారు. 6.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుని కరకంబాడి, మంగళం మీదుగా తిరుమల కొండకు వెళతారు. రాత్రికి అక్కడే బస చేసి శనివారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆదివారం కడపకు చేరుకుని పెద్దదర్గాను దర్శించుకుంటారు. సోమవారం ఇడుపులపాయనుంచి ప్రజా సంకల్పయాత్రను చేపడతారు. 8 నెలల పాటు చేపట్టనున్న ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో... లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదువుతున్న తన పెద్ద కుమార్తె హర్షను చూసేందుకు ఇటీవల లండన్ వెళ్లిన వైఎస్ జగన్ గురువారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం రోజంతా పార్టీ నేతల సమావేశాలతో గడిపారు
Home »
» నేడు తిరుమలకు వైఎస్ జగన్
నేడు తిరుమలకు వైఎస్ జగన్
Written By news on Friday, November 3, 2017 | 11/03/2017
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment