జగన్‌ స్పీక్స్‌' : వీడియో సిరీస్ ప్రారంభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ స్పీక్స్‌' : వీడియో సిరీస్ ప్రారంభం

జగన్‌ స్పీక్స్‌' : వీడియో సిరీస్ ప్రారంభం

Written By news on Sunday, November 5, 2017 | 11/05/2017


 పులివెందుల:  ప్రజాసంకల్పయాత్ర చేయబోతున్న వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సోషల్‌ మీడియాలోనూ నెటిజన్లతో మమేకమయ్యేందుకు కొత్తగా 'జగన్‌ స్పీక్స్‌' పేరుతో వీడియో సిరీస్‌ ప్రారంభించారు. పాదయాత్రలోని అనుభవాలను ఈ కార్యక్రమం ద్వారా నెటిజన్లతో పంచుకోనున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తన అధికారిక ఫేస్‌ బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసిన 'జగన్‌ స్పీక్స్‌' తొలి వీడియోకు విశేషమైన స్పందన వచ్చింది. పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు.
ఈ వీడియోలో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..
తెలుగు ప్రజలకు నమస్కారం. ఇది వరకు ప్రకటించిన విధంగా  ప్రజా సంకల్పయాత్ర సోమవారం నుంచి ప్రారంభిస్తున్నాను. వైఎస్‌ఆర్‌ కుటుంబం ద్వారా మీరు నా కుటుంబంలో భాగమయ్యారు. నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్నందుకు మనస్పూర్తిగా మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 6 నుంచి 7 నెలలపాటూ దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా సాగే ఈ పాదయాత్రతో మీకు మరింత దగ్గరగా అయ్యే ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పే ప్రతి అంశాన్ని వింటాను. మీ కష్టాలను నష్టాలను పరిష్కరించే ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేస్తాను. నవరత్నాలను గతంలోనే మీతో పంచుకున్నాను. ఆ నవరత్నాల్లోనూ కూడా మెరుగు పరచడానికి మీరేదైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు కూడా తెలుసుకుంటూ అడుగులు ముందుకు వేస్తాను. చివరకు ఈ పాదయాత్రలో నా ప్రయత్నం ఏమిటంటే .. మనం  ఎన్నికల సమయాని విడుదల చేసే మేనిఫెస్టో ఆఫీసుల్లో కూర్చొని దిద్దిన మేనిఫెస్టోలా కాకుండా ప్రజలు దిద్దిన మేనిఫెస్టోలా బయటకు రావాలి. ఆ దిశగా మీ సలహాలు, మీరు చెప్పే అంశాలతో, మీరు చేసే మార్పులతోనే ఆ మేనిఫెస్టో విడుదల చేయాలన్న తాపత్రయంతోనే నా ఈ పాదయాత్ర సాగుతుంది. దాదాపు 6 నుంచి 7 నెలలపాటూ సాగే ఈ పాదయాత్రలో డిజిటల్‌ మీడియా ద్వారా మీ అందరితో ఇంకా దగ్గరకావడానికి ప్రయత్నం చేస్తాను. మీమ్మల్ని అందర్ని కూడా ఈ పాదయాత్రలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. జగన్‌ స్పీక్స్‌ వీడియో సిరీస్‌ ద్వారా మీ అందరికి అందుబాటులో ఉంటా..
Share this article :

0 comments: