రెండే రెండు పేజీలు.. చెప్పినవన్నీ చేస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రెండే రెండు పేజీలు.. చెప్పినవన్నీ చేస్తాం

రెండే రెండు పేజీలు.. చెప్పినవన్నీ చేస్తాం

Written By news on Tuesday, November 7, 2017 | 11/07/2017


వేంపల్లి :  దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన రెండోరోజు వేంపల్లిలోని శ్రీనివాస కల్యాణ మండలంలో రచ్చబండ నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన వృద్ధులు, మహిళలు, యువకులు... ఈ ముఖాముఖిలో పాల్గొని తమ సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... ‘ ఎన్నో హామీలిచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ మేనిఫెస్టో చూద్దామన్నా కనిపించడం లేదు.

అర్హులైన పేదలందరికీ ఇళ్లు
అయితే వైఎస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో మాత్రం అలా ఉండదు. రెండే రెండు పేజీలుంటుంది. అందులో చెప్పినవన్నీ చేస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేసి మళ్లీ గర్వంగా ప్రజల వద్దకు వస్తాం. ఇప్పటికే నవరత్నాలు ప్రకటించాం. మీ సలహాలు స్వీకరించి మరింత మెరుగ్గా చేస్తాం. అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్‌, అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం.

వృద్ధులకు రూ.2వేలు పెన్షన్‌
అలాగే అవ్వా, తాతలకు ప్రస్తుతం రూ.1000 ఉన్న పెన్షన్‌..మేం అధికారంలోకి రాగానే రూ.2.వేలు చేస్తాం. ఒకవేళ చంద్రబాబు నాయుడు రూ.2వేల పెన్షన్‌ ఇస్తే... నేను రూ.3వేలు చేస్తా. అలాగే ఎవరూ లేని ఒంటరి వృద్ధుల సంక్షేమం కోసం ప్రతి మండలంలో ఓ వృద్దాశ్రమయం ఏర్పాటు చేస్తా. వృద్ధులను అన్ని రకాలుగా ఆదుకుంటా.
లక్షా 42వేల ఉద్యోగులు భర్తీ
అలాగే ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తా. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఏపీకి ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడదాం. ప్రస్తుతం రాష్ట్రంలో కౌరవ పాలన నడుస్తోంది. జాబు రావాలంటే బాబు రావాలని చంద్రబాబు మోసం చేశారు.
విద్యార్థుల ఖర్చులకు రూ.20వేలు
 విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడమే కాకుండా కాలేజీ విద్యార్థులకు ఖర్చుల కోసం రూ.20వేలు ఇస్తాం. అధికారంలోకి రాగానే ఆరు నెలల్లోగా కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి, మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేసి యువతకు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. .’ అని హామీ ఇచ్చారు.
Share this article :

0 comments: