
సాక్షి, ఇడుపులపాయ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీలోని ఉద్యోగ వర్గాలపై హామీల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి ఉద్యోగికి స్థలం ఇచ్చి.. ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఉద్యోగులకు కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ను అమలుచేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం ఇడుపులపాయలో 'ప్రజాసంకల్ప యాత్ర'ను ప్రారంభించిన సందర్భంగా ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు.
బాబు రావాలంటే జాబు రావాలని గత ఎన్నికల్లో ప్రచారంతో ఊదరగొట్టారని, కానీ ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాల్సిందేనని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. 50 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఈ మేరకు జరిగిన ప్రొసీడింగ్స్‌ను 'సాక్షి' దినపత్రిక బయటపెట్టడంతో అబ్బే అలాంటిదేం లేదని ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ ప్రొసీండిగ్స్ బయటకు వచ్చేసరికి.. వీటిని వెల్లడించారనే సాకుతో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారని, ఇలా ఉద్యోగులను సస్పెండ్ చేయడం న్యాయమేనా? అని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
0 comments:
Post a Comment