అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుంది: వైఎస్‌ జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుంది: వైఎస్‌ జగన్‌

అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుంది: వైఎస్‌ జగన్‌

Written By news on Wednesday, November 8, 2017 | 11/08/2017


 వీఎన్‌పల్లి: ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత కనుమరుగైపోయిందని, రాజకీయాల్లో ఒక మాట అంటూ ఇస్తే.. ఆ మాటకు కట్టుబడి ఉండే పరిస్థితి కనిపించడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నాలుగేళ్ల చంద్రబాబు పాలన నిదర్శనంగా నిలిచిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఆయన గుర్తుచేశారు. ప్రజలకు ఫలానాది చేశానని చెప్పుకోలేని పరిస్థితుల్లో టీడీపీ సర్కారు ఉందని ఆయన విమర్శించారు. ‘ప్రజాసంకల్పయాత్ర’ చేపడుతున్న వైఎస్‌ జగన్‌కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. బుధవారం మూడోరోజు పాదయాత్ర సందర్భంగా వీఎన్‌పల్లిలో ప్రజలను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. రాజకీయ వ్యవస్థ మారాలంటే ప్రజల్లోంచి చైతన్యం రావాలని, ఎన్నికల్లో ప్రజలకు ఒక మాట ఇస్తే.. దానిని అమలుచేయలేకపోయినప్పుడు ఆ నాయకుడు రాజీనామా చేసి పక్కకు తప్పుకొనే పరిస్థితి రావాలని, అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుందని వైఎస్‌ జగన్‌ ఉద్ఘాటించారు.
భవిష్యత్తులో మంచి కలుగుతుందనే భరోసా ఇచ్చేందుకు..
‘రాబోవుకాలంలో మంచి రోజులు వస్తున్నాయి.. భవిష్యత్తులో మంచి జరగబోతుందన్న ఆశ కల్పించేందుకు.. ప్రతి రైతుకు, రాష్ట్రంలోని ప్రతి వర్గానికీ తోడుగా ఉండేందుకు నేను ఈ పాదయాత్ర చేస్తున్నా’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. తన పాదయాత్రలో భాగంగా ప్రతి సామాజిక వర్గాన్ని కలుస్తామని,  వారు చెప్పినవన్నీ విని.. ప్రజలందరి సలహాలు తీసుకుంటామని తెలిపారు. నవరత్నాలు పథకాలతో ప్రతి ఇంట్లో చిరునవ్వులు విరబూయాలని కోరుకుంటున్నామని, నవరత్నాల విషయంలో ప్రజలు ఇంకా ఏమైనా సలహాలు ఇస్తే తీసుకుంటామని, దారిపొడవునా ప్రజలు చెప్పే ప్రతి సలహాను స్వీకరిస్తామని చెప్పారు. చంద్రబాబు మాదిరి ఇంతింత బుక్కులు మ్యానిఫెస్టోగా పెట్టి మోసం చేయబోమని, ప్రజల చేత దిద్దబడిన మ్యానిఫెస్టో మాత్రమే రెండు, మూడు పేజీల్లో ఉంటుందని చెప్పారు. తమ ప్రణాళికలో చెప్పిన ప్రతి పనిని చేస్తామని, చెప్పినవే కాదు.. చెప్పనవి కూడా చేసి చూపించి.. 2024 ఎన్నికలు వచ్చినప్పుడు.. ఇవి చేశామని చెప్పి.. మళ్లీ ఆశీర్వదించమని ప్రజలను కోరుతామని అన్నారు. తన పాదయాత్ర కార్యక్రమానికి ప్రజలందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలని, దేవుడి దయ కావాలని ఆయన కోరారు.
 


వైఎస్‌ జగన్‌ ఇంకా తన ప్రసంగంలో ఏమన్నారంటే..
  • నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
  • రైతుల రుణాలన్నింటీని బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు
  • నాలుగేళ్లు అయినా మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా? కాలేదు
  • బాబు పుణ్యాన రైతులే కాదు డ్వాక్రా మహిళలు కూడా మోసపోయారు
  • బాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు, డ్వాక్రా మహిళలకు ఇచ్చే సున్నా వడ్డీకే రుణాలు పూర్తిగా పక్కనబెట్టారు
  • చంద్రబాబు సీఎం అయ్యాక పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మల రుణాలు మాఫీ అయ్యాయా? కాలేదు
  • జాబు రావాలంటే.. బాబు రావాలని, ఒకవేళ జాబు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు
Share this article :

0 comments: