సాక్షి, ఇడుపులపాయ: చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోందని, ఈ నాలుగేళ్ల పాలనలో గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు చేయని అక్రమాలు, అరాచకాలు లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో రైతులు, అక్కాచెల్లెమ్మలు మోసపోయారని, విద్యార్థులు, నిరుద్యోగులు దగాపడ్డారని, అందుకే రైతుల నుంచి అక్కాచెల్లెమ్మల వరకు అందరిలోనూ చంద్రబాబు అంతటి మోసగాడు దేశ చరిత్రలోనే ఉండడు అనే మాట వినిపిస్తోందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని, రాష్ట్రంలోని ఏ ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేదని, ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ భరోసా ఇచ్చేందుకు తాను పాదయాత్ర చేపడుతున్నట్టు వైఎస్ జగన్ అన్నారు. సోమవారం ఆయన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి 'ప్రజాసంకల్ప యాత్ర' ప్రారంభించారు. మొదట వైఎస్ఆర్ ఘాట్‌ను సందర్శించిన వైఎస్ జగన్ కుటుంబసభ్యులతో కలిసి.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జనసంద్రమైన ఇడుపులపాయ నుంచి ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా తొలి అడుగులు వేశారు. ఇడుపులపాయ ఎగ్జిట్ వద్దకు నడుచుకుంటూ వచ్చి.. బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..
చంద్రబాబు వయస్సులో నా వయస్సు సంగం ఉంటుంది
'నా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఎంతటి దూరాన్నైనా లెక్కచేయకుండా వచ్చి ఆప్యాయత, అనురాగాలను చూపుతున్న అన్నాదమ్ములు, అక్కాచెళ్లెలు, అవ్వలు, తాతలు, అందరి ప్రేమాభిమానాలకు, చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ రోజు ఇడుపులపాయలో మహానేత రాజశేఖర్‌రెడ్డి మన అందరి కళ్ల ముందే కనిపిస్తున్నారు. ఆ దివంగత నేతకు మరణం లేదు' అని వైఎస్ జగన్ అన్నారు. 'జగన్‌ను రాజకీయాల్లో ఇబ్బంది పెట్టాలన్న ఒకే ఒక కారణంతో, జగన్‌ను రాజకీయాల నుంచి తప్పించాలనే ఒకే కారణంతో అధికారంలో ఉన్న నేతలు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు వయస్సులో నా వయస్సు సగం కూడా ఉండదు. చంద్రబాబు కొడుకు వయస్సులో నేను ఉంటానేమో. కానీ చంద్రబాబు రాక్షసత్వం చూసి.. నన్ను రాజకీయల్లో తప్పించాలన్న చంద్రబాబు తీరు చూసి బాధ కలుగుతోంది' అని అన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ అందించిన ఇంతపెద్ద కుటుంబాన్ని చూసినప్పుడు ఆ బాధ నుంచి ఊరట కలుగుతుందన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వంలోని పెద్దలతో పోరాటం చేస్తున్నానని, రాజకీయాలలో చేయని పోరాటం లేదని గుర్తుచేసుకున్నారు. తాను నడిచిన నా ప్రతి అడుగులోనూ ప్రజలందరూ అండగా నిలబడ్డారు కాబట్టే చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. తనకు తోడుగా నిలిచిన రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని మరిచిపోనని, వారి రుణాన్ని తీర్చుకోలేనని అన్నారు.

ప్రజల ద్వారా ప్రజలతో ప్రజా మ్యానిఫెస్టో తయారుచేస్తాం!
చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలనతో ఏ ఒక్క కుటుంబమూ సంతోషంగా లేదని తెలిపారు. 13 జిల్లాలో మూడువేల కిలోమీటర్ల మేర తన పాదయాత్ర కొనసాగుతుందని, పాదయాత్రలో భాగంగా ప్రతి ప్రాంతానికి వెళ్లి.. ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి ఒక్కరిని కలుస్తామని, వాళ్ల కష్టనష్టాలను తెలుసుకొని, అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కారమిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాల పథకాలను ఇంకా మెరుగుపరిచేందుకు ప్రజలు ఇచ్చే సలహాలు తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబు తరహాలో తమది మోసపూరిత ప్రభుత్వం కాబోదని, ప్రజల నుంచి ప్రజా మ్యానిఫెస్టో రూపొందించాలన్నదే పాదయాత్ర ఉద్దేశమని చెప్పారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టో ఇంటర్నెట్లో వెతికినా ఎక్కడా కనబడదని, ఆ మ్యానిఫెస్టో ఇప్పుడు దొరికితే.. అది పట్టుకొని ప్రజలు చంద్రబాబు కాలర్ పట్టుకొని నిలదీస్తారనే భయంతోనే.. మ్యానిఫెస్టో కనబడకుండా చేశారని వైఎస్ జగన్ విమర్శించారు. 'ఫలనా వాడు మా నాయకుడు అనేలా నాయకత్వం ఉండాలి. కానీ చంద్రబాబును చూసి ఈ నాయకుడు మా నాయకుడు కాదు.. ఈ మోసగాడు మా నాయకుడు కాదు అని ఆయన పార్టీ కార్యకర్తలే అంటారు' అని దుయ్యబట్టారు. చంద్రబాబు మాదిరిగా బుక్కులుబుక్కులుగా మ్యానిఫెస్టోను ప్రకటించబోమని, 2019 అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండే రెండు పేజీల మ్యానిఫెస్టో ప్రకటిస్తామని తెలిపారు. ఇది మ్యానిఫెస్టో అని, దీనిని మేం కచ్చితంగా అమలుచేసి తీరుతామని ప్రజలకు చెప్పి.. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా అమలుచేస్తామని చెప్పారు. తమ మా మ్యానిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పనవి కూడా చేసి.. ఆ తర్వాతి ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్నారు. చంద్రబాబు పాలన కారణంగా రాష్ట్ర అప్పు రూ. రెండు లక్షల ఆరువేల కోట్లకు పెరిగిపోయిందని, రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రం అప్పు రూ. 96వేలకోట్లు కాగా.. తన నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై మోపిన అప్పుభారం రూ. లక్ష తొమ్మిదివేల కోట్ల రూపాయలని అన్నారు.
0 comments:
Post a Comment