01 January 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఆ మాట వెనకున్న ఆంతర్యమేంటి?

Written By news on Saturday, January 7, 2017 | 1/07/2017






♦ సీఎంపై వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ధ్వజం
♦ పోలవరానికి, ప్రత్యేక హోదాకు సంబంధమేంటి?




సాక్షి, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదాను వదులుకున్నానని సీఎం చంద్రబాబు చెప్పడంలో ఆంతర్యం ఏమిటని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధం ఏమిటని నిలదీశారు. పార్టీ కేంద్రకార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరాన్ని విభజన చట్టంలో పొందుపరిచారని, ఆ ప్రాజెక్టును నిర్మించే పూర్తి బాధ్యత కేంద్రానిదేనన్నారు. కేంద్రం నుంచి పోలవరం ప్యాకేజీ తీసుకోవటంవల్ల చంద్రబాబు, ఆయన బినామీలే లబ్ధి పొందారన్నారు. పోలవరం తన స్వప్నంగా చంద్రబాబు చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు.




పోలవరం రాష్ట్ర ప్రజలందరి స్వప్నమన్నారు. అందుకే దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో అంకురార్పణ చేశారని చెప్పారు. 2004కు ముందు చంద్రబాబు, ఆయన పార్టీ అధికారంలో ఉన్నా ఆ కల నెరవేర్చాలనే ఆశయం కలగలేదా? అని ఎద్దేవా చేశారు. ఆనాడు పోలవరాన్ని ఆపటానికి టీడీపీ చేసిన ప్రతి ప్రయత్నం, ప్రతి పేజీ చూపిస్తామని చంద్రబాబు, టీడీపీ నేతలకు బొత్స సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కలల పంట పోలవరం పూర్తవ్వాలని కోరుకుంటున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీయేనన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంతో చంద్రబాబు ఇంకో దోపిడీకి తెరదీశారని బొత్స మండిపడ్డారు. రాష్ట్రంలో పోలవరం, అమరావతి, మరే అభివృద్ధికీ వైఎస్సార్‌సీపీ అడ్డంకి కాదని, కేవలం ప్రభుత్వం చేస్తున్న అవినీతినే తాము వ్యతిరేకిస్తున్నామని బొత్స స్పష్టం చేశారు. దోపిడీ, వ్యక్తిగత ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టొద్దన్నారు.



వైఎస్‌ ప్రయార్టీ ప్రాజెక్టులు..: చంద్రబాబు ప్రభుత్వం ప్రయార్టీ హైదరాబాద్‌ అయితే.. తమ ప్రభుత్వ ప్రయార్టీ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులని వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలి మంత్రివర్గ సమావేశంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందాకు వివరించారని బొత్స తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై మోహన్‌కందా ప్రజెంటేషన్‌ ఇస్తున్నప్పడు అదే సమావేశంలో ఉన్న జేసీ దివాకరరెడ్డి వీటిని చంద్రబాబు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారని ఆయన చెప్పారు. ప్రభుత్వాలకు ప్రయార్టీలుంటాయని, సముద్రంలోకి వెళ్తున్న వృథాజలాల్ని అరికట్టాలని వైఎస్‌ కోరటంతో ఈ ప్రాజెక్టులను మీ ముందు పెట్టామని మోహన్‌కందా బదులిచ్చారని బొత్స వివరించారు. వాస్తవాలు తెలిసి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని జేసీకి హితవు పలికారు.

ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్నవారే అసలైన సీఎం

)


ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్నవారే అసలైన సీఎం
చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ హితవు


♦ కర్నూలు జిల్లాలో రెండో రోజు రైతు భరోసా యాత్ర
♦ టీడీపీ పెద్దలకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు.. ప్రజలంటే చులకన
♦ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చలేదు
♦ రైతులు, డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలను మాఫీ చేయలేదు


రైతు భరోసా యాత్ర  నుంచి ‘సాక్షి’ ప్రతినిధి, కర్నూలు: ‘‘ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలోకి వెళ్లినవారు బుద్ధి, జ్ఞానం ఉంటే రాజీనామా చేయాలి. లేదంటే పార్టీలో చేర్చుకున్న బుద్ధి, జ్ఞానం లేని ఆ పెద్ద మనిషి వారిని అనర్హులుగానైనా ప్రకటించాలి. ప్రజా స్వా మ్యంపై వీళ్లకు(టీడీపీ పెద్దలు) గౌరవం లేదు. ప్రజలంటే వీరికి చులకన భావన. రైతులంటే ఇంకా ఇంకా చులకన. సీఎంగా మళ్లీ గెలవాలంటే ఎంపీటీసీలను లాక్కోవడ మో, కార్పొరేటర్లను లాక్కోవడమో, ఎమ్మెల్యే లను లాక్కోవడం వల్లనో అది నెరవేరదు. ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకుం టేనే ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

కర్నూలు జిల్లాలో జగన్‌ చేపట్టిన రైతు భరోసా యాత్ర రెండో రోజు శుక్రవారం శ్రీశైలం నుంచి మొద లై ప్రకాశం జిల్లా దోర్నాల మీదుగా ఆత్మకూ రుకు చేరుకుంది. ఈ సందర్భంగా దోర్నాల, ఆత్మకూరు బహిరంగ సభల్లో కిక్కిరిసిన జనసందోహాన్ని ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. అంతకుముందు ఆయన శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. బహిరంగ సభల్లో జగన్‌ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్ర బాబు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నా రంటూ నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో అబద్ధాలు చెప్పేవాళ్లను, మోసం చేసేవాళ్లను, వెన్నుపోటు పొడిచే వాళ్లను మనందరం కలిసికట్టుగా ఒక్కటై బంగాళాఖాతంలో కలుపుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే...

రైతన్నల పరిస్థితి దయనీయం  
‘‘కర్నూలు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 40 మందికిపైగా రైతులు ఆత్మహ త్యలు చేసుకున్నారు. అయితే, నష్ట పరిహారం అందించింది అధికారిక లెక్కల ప్రకారమే నలుగురంటే నలుగురికి మాత్రమే. రాష్ట్రంలో రైతులు చనిపోతే ఆదుకునే పరిస్థితి లేదు. అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిం ది. రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తా మని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార సభల్లో ఇదే మాట చెప్పారు. ఏ టీవీలో చూసినా ఇదే హామీ. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావా లంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు. చివరకు చదువుకుం టున్న పిల్లలను, చదువులు పూర్తి చేసుకున్న యువతను కూడా వదల్లేదు. జాబు రావాలం టే బాబు ముఖ్యమంత్రి కావాలని ఊదర గొట్టారు. ఒకవేళ జాబు ఇవ్వలేకపోతే ప్రతీ ఇంటికీ నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాటలు చెప్పారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి జాబు తెచ్చుకున్నారు. కుర్చీలో కూర్చున్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇవాళ ఒక్కటే అడుగుతున్నా... రైతన్నల, డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలన్నీ నిజంగా మాఫీ అయ్యాయా? రైతన్నల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే... బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారు చంద్ర బాబు మాటలు నమ్మి వాటిని తిరిగి చెల్లించ లేదు. రుణాలు కట్టకుండా ఉన్నందుకు ఇవాళ బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. ఇంతకుముందు రూ.లక్ష లోపు రుణాలన్నీ వడ్డీ లేకుండా వచ్చేవి. రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు తీసుకుంటే పావలా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇవాళ సున్నా వడ్డీలు, పావలా వడ్డీలు కనిపించకుండా పోయాయి. రైతన్నలు బ్యాంకుల వద్దకు వెళితే రూపాయిన్నర వడ్డీ వసూలు చేస్తున్నారు.
 
పంటలకు గిట్టుబాటు ధరలేవీ?
రైతుల రుణాలు రెన్యూవల్‌ కాకపోవడంతో ఇన్సూరెన్సు కూడా రాకుండా పోయింది. రబీలో రాష్ట్రవ్యాప్తంగా రూ.24 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, రబీలోనే రూ.9,800 కోట్ల టర్మ్‌ రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఇచ్చింది ఎంతో తెలుసా? కేవలం రూ.4,900 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రైతులు 2, 3 రూపాయల  వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది. రబీలో 24 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉండగా ఈసారి రైతులు కేవలం 11 లక్షల హెక్టార్లల్లో మాత్రమే పంటలు వేశారు. అంటే 48 శాతం కూడా పంటలు వేయలేదు. కర్నూలు జిల్లాలో కిలో ఉల్లిపాయలకు రూ.2కు కూడా రాకపోవడం తో రైతులు పంటను చేనులోనే వదిలేస్తున్నా రు. కేజీ టమోటా రూ.2కు కూడా అమ్ముకోలే ని పరిస్థితులు ఉన్నాయి. మిరప పంటకు మద్దతు ధర రావడం లేదని రైతులు నాతో చెప్పారు. రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. నిన్న శ్రీశైలం డ్యాంకు వెళ్లాను. డ్యాంలో 844 అడుగుల నీరు ఎప్పటి నుంచి ఉందని అని ఇంజనీర్లను అడిగా. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉందని చెప్పారు. అంటే 130 రోజులుగా నీరుంది. అయినా డ్యాం నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీరివ్వలేదు.

బాబు వచ్చారు.. కరువును తీసుకొచ్చారు
రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లాలో వెయ్యి అడుగుల లోతులో బోర్లు వేస్తే తప్ప నీరు పడని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రై దాదాపు మూడేళ్లు కావొస్తోంది. ఈ మూడేళ్లలో చంద్రబాబు ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా నిర్మించలేదు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడేళ్లలో ఆయనతోపాటు వచ్చినవి ఏమిటంటే.. వరుసగా కరువు కాటకాలు లేదా అకాల వర్షాలే. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.2,000 కోట్లు కేటాయించి, యుద్ధప్రాతిపదికన పనులను పరుగెత్తించాల్సింది పోయి ముష్టి వేసినట్లు బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లు ఇచ్చాడు. ఈ ప్రాజెక్టులో భాగంగా 18.82 కిలోమీటర్ల పొడవైన మొదటి సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం 13.73 కిలోమీటర్లే తవ్వారు.

ఇంకా 5 కిలోమీటర్లు తవ్వాలి. 18.83 కిలోమీటర్ల మేర రెండో సొరంగాన్ని తర్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే తవ్వకాలు జరిపారు. అంటే ఇంకా 8.83 కిలోమీటర్లు తవ్వకం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. తక్షణమే రూ.1,000 కోట్లు కేటాయించి వేగంగా పనులు కొనసాగిస్తేనే ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుంది. ముష్టి వేసినట్లు కేవలం రూ.100 కోట్లు ఇస్తే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చంద్రబాబు నాయుడే చెప్పాలి. సొరంగాల తవ్వకం పూర్తయ్యేలోగా హెడ్‌రెగ్యులేటర్‌ పనులు పూర్తి చేయాలి. అప్పుడే హెడ్‌లెగ్యులేటర్‌ గుండా సొరంగాల్లో కి నీటిని పంపించగలుగుతాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం హెడ్‌లెగ్యులేటర్‌ పనులనే ఇంకా ప్రారంభించలేదు.

ఆయనకు డబ్బు తప్ప ఇంకేం వద్దు
సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారు. కారణం ప్రాజెక్టులను పూర్తిచేయాలన్న చిత్తశుద్ధి ఆయనకు లేదు. రైతన్నలపై చంద్రబాబుకు ప్రేమ లేదు. కాంట్రాక్టర్లపై మాత్రమే ఆయన ప్రేమ ఒలకబోస్తున్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేసి, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకునే కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు పనులు చేయకపోయినా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. డబ్బు... డబ్బు... డబ్బు తప్ప చంద్రబాబు ఇంకేమీ అవసరం లేదు. చంద్రబాబు ఇవాళ అద్దాల మేడ నుంచి సామాన్య ప్రజల వద్దకు వస్తే వారు రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది.

వచ్చేది రైతుల పరిపాలనే..
దేవుడి దయ వల్ల చూస్తుండగానే మూడేళ్లు గడిచిపోయాయి. ఇక సంవత్సరమో, రెండేళ ్లలోనో ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత మనం దరి ప్రభుత్వమే వస్తుంది. రైతుల పరిపాలన వస్తుంది. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను రెండు మూడేళ్లలోనే పూర్తి చేస్తా మని గట్టిగా చెబుతున్నా.ఈ చంద్రబాబు చేసి నా చేయకపోయినా గట్టిగా మాటిస్తున్నాం. వెలిగొండ ప్రాజెక్టుకు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఎవరైనా ఏదైనా చేశారూ అంటే అది దివంగత నేత రాజశేఖర్‌రెడ్డే. ఆయన కుమారుడిగా ఈ ప్రాజెక్టును నేను పూర్తిచేస్తా. చంద్రబాబు నైజమంతా ఇవాళ ఎంత డబ్బు సంపాదించాం? ఇవాళ ఎంతమంది ఎమ్మెల్యేలను కొనేశాం? ఎంతమంది ఎంపీటీసీలను కొనుగోలు చేశాం? అన్నదే. రాజకీయ వ్యవస్థను ఎట్లా భ్రష్టు పట్టించాలన్నదే ఆయన ఆలోచన. నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ ఒకమాట చెబుతుండేవారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదు... ఎట్లా బతికామన్నదే ముఖ్యం అని అనేవారు. అలాంటి గొప్ప నాయకుడు పరిపాలించిన రాష్ట్రంలో ఈరోజు దిక్కుమాలిన వ్యక్తి పరిపాలన చేస్తున్నాడు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను  జోక్‌గా మార్చారు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వాస్తవానికైతే ఉప ఎన్నికలు రావాలి. కర్నూలు జిల్లా నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. చంద్రబాబూ! రెప్పొద్దున గెలవాలంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే కాదు. ప్రతీ పేదవాడి ఇంట్లో నీ ఫొటో ఉండేటట్టు చేసుకో.. అప్పుడే గెలుస్తావు. ముఖ్యమంత్రిగా మళ్లీ గెలవాలి అంటే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. ఇవాళ అందరం బతికే ఉన్నాం. రేపోమాపో ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. చనిపోయిన తర్వాత ప్రతి వ్యక్తి ఇంట్లో ఫొటో ఉండాలని ఆరాటపడే వ్యక్తే అసలైన రాజకీయ నాయకుడు. దివంగత నేత రాజశేఖరరెడ్డి మా నాన్నగారని చెప్పడానికి గర్వపడతాను. ఆయన మా నాయకుడు అని ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకుంటారు.

చంద్రబాబు గురించి భవిష్యత్తులో ఎవరూ చెప్పుకునే పరిస్థితి ఉండదు. కారణం.. ఆయన ఏం చేశారంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలనే ఆకాంక్షతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్వీర్యం చేశారు. రూ.లక్షకుపైగా అయ్యే చదువులకు రూ.20 వేలో, రూ.30 వేలో ఇస్తామని చెబుతున్నారు. మిగిలిన సొమ్మును అప్పుల పాలై మీరు తెచ్చుకోండి అని అంటున్నారు. ఇవాళ ఫీజులు చూస్తే ఇంజనీరింగ్‌ కాలేజీలో రూ.లక్ష, మెడికల్‌ కాలేజీల్లో రూ.11 లక్షలకు పైగా ఉన్నాయి. ఆస్తులు, పొలాలు అమ్ముకుంటే తప్ప పేదవాడు చదువుకోలేని పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్లిపోయింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఒక జోక్‌గా మార్చేశారు. నవ్వుకునేటట్టు చేశారు. దేశం మొత్తం 48 లక్షల ఇళ్లు కడితే... వైఎస్‌ రాజశేఖరరెడ్డి దేశంతో పోటీపడి కేవలం ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు. ప్రతీ పేదవాడికి తోడుగా నిలిచారు. ఇవాళ ఇళ్లు లేవు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. దాదాపు మూడేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టించిన పాపాన పోలేదు. ఇక పెన్షన్ల పరిస్థితి దారుణంగా మారింది. గ్రామంలో ఎవరైనా చనిపోతే తమకు పెన్షన్లు వస్తాయని ఎదురు చూసే పరిస్థితులు రాష్ట్రంలో దాపురించాయి.

చంద్రబాబు మోసాల గురించి చెప్పిస్తాం..  
రైతులు ఎలా బతుకుతున్నారు? వారికి ఏం చేయాలన్న ఆలోచనను కేబినెట్‌ సమావేశాల్లో చేయరు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చారు. డయాలసిస్‌ రోగి కిడ్నీలు చెడిపోయిన ఆసుపత్రికి వెళితే సంవత్సరం తర్వాత రాపో అని అంటున్నారు. రైతుల వద్ద ఎంత భూమి తీసుకోవాలి? కమీషన్లు తీసుకుని ఎవరికి అమ్మాలి? ఎవరికి ఇవ్వాలని మాత్రమే కేబి నెట్‌ మీటింగుల్లో చర్చిస్తున్నారు. రైతన్నలు, డ్వాక్రా అక్కాచెల్లెమ్మల బాధలు చంద్రబాబు కు అర్థమయ్యే విధంగా వారితోనే చెప్పిస్తాం. చదువుకున్న పిల్లలకు మైక్‌ ఇచ్చి వారితోనే చంద్రబాబు మోసం గురించి చెప్పిస్తాం.  

మళ్లీ రాజన్న పాలన రావాలి
చంద్రబాబును చూసిన ఇతను మా నాయకుడు అని కార్యకర్తలు చెప్పుకునే పరిస్థితి లేదు. చంద్రబాబును చూపించి ఇలాంటి వెన్నుపోటుదారుడు, ఇలాంటి మోసగాడు, ఇలాంటి దుర్మార్గుడు దేశంలో ఎక్కడా ఉండడని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన రావాలి. ఆ స్వర్ణయుగం మళ్లీ రావాలి. రాజకీయాల్లో అబద్ధాలు చెప్పేవాళ్లను, మోసం చేసేవాళ్లను, వెన్నుపోటు పొడిచే వాళ్లను మనందరం కలిసికట్టుగా ఒక్కటై బంగాళాఖాతంలో కలపాలి. అప్పటివరకు చేతిలో చెయ్యి వేసి, అడుగులో అడుగు వేసి తోడుగా నిలవాలని ప్రతి ఒక్కరినీ సవినయంగా వేడుకుంటున్నా’’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Popular Posts

Topics :