15 January 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఇప్పటికైనా స్పందించకుంటే ఉధృతంగా పోరాటం చేసి తీరుతాం..

Written By news on Friday, January 20, 2017 | 1/20/2017

పీసీ పల్లి: ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ కోసం రూ.910కోట్లు కావాలని సంబంధిత శాఖ కోరితే రూ.568 కోట్లు మాత్రమే ఇచ్చారని, అందులో రూ.368కోట్లు బకాయిలకే సరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రకాశంలో జిల్లాలోని పీసీ పల్లిలో ఫ్లోరోసిస్‌, కిడ్నీ బాధితులతో ఆయన ముఖాముఖి అయ్యారు.

ఈ సందర్భంగా కిడ్నీ బాధితులు వైఎస్ జగన్‌ ముందు కిడ్నీ బాధితులు మొరపెట్టుకున్నారు. డయాలసిస్‌కు తమకు రూ.20 వేలు అవుతుందని వాపోయారు. ఆర్థిక స్తోమత లేక పేదలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటుచేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. వెలుగొండ జలాలకోసం పోరాటం చేయాలని ఆయనను కోరారు. అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో కుంటికాలుతో నడుస్తోందని అలా నడిచేందుకు కూడా దాదాపు రూ.400 కోట్లు పైగా కావాలని అభిప్రాయపడ్డారు.

తాను అధికారంలోకి రాగానే వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులుపాలు కాకుండా చూసుకుంటానని, ఈ విషయం గతంలోనే చెప్పామని, ఒక వేళ వైద్యంలో భాగంగా ఇంటి వద్దే ఆ వ్యక్తి విశ్రాంతి తీసుకుంటుంటే అతడి కుటుంబం నడిచేందుకు కావాల్సిన సహాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని బతికించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కిడ్నీలు బాగోలేకుంటే మాస్టర్‌ స్థాయి నుంచి చికిత్స ప్రారంభిస్తారని పరీక్షలకు నెలకు దాదాపు రూ.4వేలు అవుతాయని, ఆ తర్వాత డయాలసిస్‌ మొదలవుతుందని, అది కూడా వారానికి రెండు మూడుసార్లు డయాలసిస్‌ చేయాల్సి వస్తుందని డయాలసిస్‌ ఒక్కసారి చేయాలంటే రెండు నుంచి మూడు వేల రూపాయలు అవసరం అవుతుందని చెప్పారు.

ఇలా ప్రతి 16 నుంచి 24 వేలు అవుతాయని ఈ లెక్కన ఏడాదికి ఎన్ని లక్షలు అవసరం అవుతాయో ఊహించుకోవచ్చని తెలిపారు. వైఎస్‌ హయాంలో ప్రతి ఒక్కరికీ కార్పొరేట్‌ వైద్యం అందిందని చెప్పారు. ఏ రోగికైనా క్యాన్సర్‌ వస్తే రూ.8లక్షలు అవసరం అవుతాయని, అది ప్రభుత్వం చేయాలని, కానీ ఈ విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.


చిన్నపిల్లలకు ఎలాంటి సమస్య వచ్చిన నాటి వైఎస్‌ సర్కార్‌ ఆదుకునేదని, కానీ ఈ ప్రభుత్వం వారికి రెండేళ్ల గడువు పెట్టి ఆరోగ్యాన్ని దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 108కి ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ వస్తుందో లేదో తెలియడం లేదని, గత ఐదు నెలల నుంచి ఆశా వర్కర్లకు జీతాలే రావడం లేదని వైఎస్‌ జగన్‌ చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు వస్తేనే ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య పోతుందని స్పష్టం చేశారు.
ఇంకా ఏం చెప్పారంటే..
  • ప్రస్తుతం ఆరోగ్యం శ్రీకి రూ.1460 కోట్లు ఇవ్వాలి
  • అంబులెన్సుల్లో టెస్టు పరికరాలు లేవు
  • ఆరోగ్యశ్రీని దారుణంగా నడిపిస్తున్నారు
  • ప్రకాశం జిల్లాలో కిడ్నీ సమస్యతో రెండేళ్లలో 424మంది బలయ్యారు.
  • ఆరోగ్య శ్రీ కింద డయాలసిస్‌ లేదు
  • ఒక్క ప్రకాశం జిల్లాలో 424 మంది కిడ్నీ వ్యాధితో చనిపోతే సర్కార్‌ పట్టించుకోవడం లేదు
  • జిల్లాలోని 56 మండలాలకు 48 మండలాల్లో ఫ్లోరైడ్‌ సమస్యతో తాగడానికి నీళ్లు లేకుండా పోయాయి
  • వెలుగొండ పూర్తి చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది
  • వెలుగొండకు వైఎస్ఆర్‌ రూ.4700 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం మాత్రం ఆ ప్రాజెక్టును గాలికి వదిలేసింది.
  • ఒక డయాలసిస్‌ యూనిట్‌కు కేవలం రూ.పది లక్షలు మాత్రమే అవుతుంది
  • నేను వచ్చే వరకు కూడా చంద్రబాబు జీవోలు ఇవ్వడం లేదు
  • ఇలా చేస్తున్నందుకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి
  • వైవీ సుబ్బారెడ్డి కనిగిరి నియోజకవర్గం కోసం 2016లో ఎంపీ గ్రాంటు నుంచి రూ.12 లక్షలు ఇచ్చారు
  • ఎంపీ గ్రాంటు ఉన్నా ఇప్పటి వరకు డయాలసిస్‌ యూనిట్‌ రాలేదు
  • కానీ, కిడ్నీ బాధితులకోసం వస్తున్నానని తెలిసి చంద్రబాబు రెండు రోజుల కిందట మూడు డయాలసిస్‌ సెంటర్ల కోసం జీవోలు జారీ చేశాడు
  • కిడ్నీ సమస్యతో చనిపోయినవారికి రూ.10లక్షలు ఇవ్వాలి
  • నెలకు మందుల కోసం రూ.10 వేలు ఇవ్వాలి
  • గత రెండేళ్లుగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పది లేఖలు రాసినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు
  • ఇప్పటికైనా చంద్రబాబునాయుడికి బుద్ధి జ్ఞానం దేవుడు ప్రసాధించాలి
  • కిడ్నీ సమస్యపై చంద్రబాబు ఇప్పటికైనా స్పందించకుంటే చాలా ఉధృతంగా పోరాటం చేసి తీరుతాం.

హోటళ్లలో కప్పులు కడుగుతున్నాం

)
హోటళ్లలో కప్పులు కడుగుతున్నాం
అప్పుడు పూల తోటల్లో రూ.500 కూలి వచ్చేది 
ఇప్పుడు హోటల్‌లో రూ. 200 కూడా రావడం లేదు 
మహిళా కార్మికుల ఆవేదన 
 
సాక్షి, అమరావతి: ‘‘అయ్యా! అప్పుడు పూలు, కూరగాయల తోటల్లో పని చేసుకునేవాళ్లం. ఇప్పుడు కాఫీ హోటళ్లలో కప్పులు కడుగుతున్నాం. అప్పుడు మధ్యాహ్నం వరకు పనిచేస్తే రూ.500 కూలి వచ్చేది. ఇప్పుడు సాయంత్రం వరకు పని చేసినా రూ.200 కూడా రావడం లేదు’’ అని మందడం గ్రామానికి చెందిన డి.కోటమ్మ, ఆదెమ్మ, సత్యవతి కన్నీటి పర్యంతమయ్యారు. రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయం ప్రధాన గేటు వద్దకు వచ్చారు. గేటుకు సమీపంలోని హోటల్లో పనిచేస్తున్న కోటమ్మ, ఆదెమ్మ, సత్యవతిలు జగన్‌ను రాకను గమనించి పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. జగన్‌ వాహనం నుంచి దిగి వారిని పరామర్శించారు. వారంతా తమ గోడు వెళ్లగక్కారు. రాజధాని నిర్మాణం పేరిట పచ్చటి పంట పొలాలను ప్రభుత్వం లాగేసుకోవడంతో పనులు దొరక్క ఎలా బతకాలో తెలియడం లేదని విలపించారు.  
 
ప్రజా రాజధాని కావాలి.. - ఎమ్మెల్యే ఆర్కే
అమరావతిలో ప్రజలు, రైతులు ఉండే రాజధాని కావాలని, రియల్‌ ఎస్టేట్‌ రాజధాని వద్దని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. మంగళగిరి మండలం నిడమర్రులో గురువారం వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి రాజధాని ప్రాంత రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘‘రైతుల భూములను దోచుకోవడం పద్ధతి కాదు. భూసేకరణ పేరుతో మూడు పంటలు పండే భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. సమాజానికి అన్నం పెట్టే రైతుల నుంచి భూములను లాక్కోవడం ఎంతవరకు సమంజసం? ప్రశ్నించిన రైతులపై కేసులు నమోదు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్‌ జగన్‌ పోరాడుతారని ఆయన భరోసానిచ్చారు.

అఖిలప్రియపై ఎలాంటి దాడి జరగలేదు

Written By news on Thursday, January 19, 2017 | 1/19/2017


‘అఖిలప్రియపై ఎలాంటి దాడి జరగలేదు’
గుంటూరు: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై తమ పార్టీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారన్నది కల్పిత కథనమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అఖిలప్రియ వాహనానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ ఎదురైన సమయంలో తాను అక్కడే ఉన్నానని, ఎలాంటి దాడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు కూడా ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని చెప్పారు. వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకే టీడీపీ దుర్మార్గపు ప్రచారానికి దిగిందని విమర్శించారు.

అఖిలప్రియ కంటే ముందు అదే దారిలో జూపూడి ప్రభాకర్‌ వెళ్లారని... అఖిలప్రియ వచ్చే సమయానికి అభిమానులు పెరగడంతో ఆమె తన కారును వెనక్కు తిప్పుకుని వెళ్లిపోయారని అంబటి రాంబాబు వివరించారు. అఖిలప్రియపై దాడి చేసేందుకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు యత్నించారని కొన్ని చానళ్లు ప్రసారం చేయడంతో ఆయన వివరణయిచ్చారు.

కొత్త రాజధాని చుట్టూ స్కాములే


'కొత్త రాజధాని చుట్టూ స్కాములే'
లింగాయపాలెం: రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న దారుణాలు చూస్తుంటే గుండెతరుక్కుపోతుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అక్కడ వస్తుంది.. ఇక్కడ వస్తుందంటూ లీకులిచ్చి తనకు కావాల్సిన వారికి మంచి జరిగేలా చూసుకొని రైతులను మాత్రం చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతాల్లోని గ్రామాల్లో పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం వైఎస్‌ జగన్‌ లింగాయపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజధాని పేరుతో బలవంతంగా ల్యాండ్‌ పూలింగ్‌ చట్టం పేరిట ఇష్టమొచ్చినట్లుగా భూములు లాక్కోవడం ఒక్క చంద్రబాబు నాయుడికే చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను తీవ్రంగా దెబ్బకొట్టి తన బినామీలకు, తన చెప్పుచేతల్లో ఉండే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అనూకూలంగా భూసేకరణ చేశారని, అది కూడా అవసరానికి మించి వేల ఎకరాలను లాగేసుకుని రైతును రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రావాల్సిన లాభాలను తనకు వచ్చేలా చంద్రబాబు చేసుకున్నారని అన్నారు. రైతులకు మేలు జరగకూడదనేదే తన అభిమతం అన్నట్లుగా చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో లింగాయపాలెంలో రైతుల అరటి తోటల్ని చంద్రబాబు చెప్పుచేతల్లో ఉండేవారే తగులబెట్టారని చెప్పారు. రాజధాని చుట్టుపక్కల ప్లాట్లు ఒక్క అడుగు కేవలం రూ.పదిహేనువందలతో కడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం తాత్కాలిక సెక్రటేరియట్‌ను ఒక్క చదరపు అడుగును పదివేల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఏం చేసినా టెంపరరీ.. టెంపరరీ, టెంపరరీగానే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని చుట్టుపక్కల జరిగేవన్నీ కూడా కుంభకోణాలే అని అన్నారు. బొగ్గు, ఇసుక, మద్యం, ఆఖరికి గుడి భూముల్లో కూడా చంద్రబాబు కుంభకోణాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజు మరెంతో దూరం లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్‌ భూములు చంద్రబాబు తన అత్తగారి సొమ్మని అనుకుంటున్నారని, అందుకే వివక్ష చూపిస్తూ వారికి కేవలం 500గజాలు ఇస్తానని చెప్పి అంతటితో సరిపెట్టుకోమంటున్నారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. దళితుల భూములు లాక్కుంటున్న చంద్రబాబు వారికి ముష్టి వేసినట్లుగా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్‌ భూముల దళితుల పేరిట ఉన్నప్పటికీ కంప్యూటర్‌ అడంగల్‌లో మాత్రం ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఎస్సీలకు ఇస్తామన్న ప్యాకేజీ కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఎస్సీల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.
ఇంకా ఏం చెప్పారంటే..
  • ల్యాండ్‌ పూలింగ్‌ పేరు చెప్పి 27 వేల ఎకరాలు తీసుకున్నారు
  • మరో 21 వేల ఎకరాలను మళ్లీ లాక్కునే కార్యక్రమం చేశారు
  • మొత్తంగా చంద్రబాబు ఆధీనంలో 48వేల ఎకరాలు ఉన్నాయి
  • చంద్రబాబు పరిపాలన వచ్చి మూడేళ్లయినా రాజధాని కోసం ఒక్క ఇటుక పెట్టిన పాపాన పోలేదు
  • టెంపరరీ సచివాలయం కట్టడానికి రూ.650కోట్లు ఖర్చు చేశారు
  • దళితుల భూములంటే చంద్రబాబుకు లెక్కలేకుండాపోయింది
  • దళితుల భూములను లాక్కునే స్వేచ్ఛం ఉందని తన అత్తగారి సొమ్మని చంద్రబాబు అనుకుంటున్నారు
  • మంత్రులు, అధికారులను భూముల గురించి రైతులు నిలదీస్తుంటే ఇక్కడ దళితులకు భూములే లేవంటున్నారు
  • కొంతమందికి ప్లాట్లు ఇచ్చినా అవి ఎక్కడ ఇచ్చారో వారికే తెలియదు
  • ఎస్సీల జీవితాలతో చంద్రబాబు సర్కార్‌ చెలగాటమాడుతోంది
  • అరిస్తే అరెస్టులు చేస్తామంటూ బెదిరిస్తున్నారు
  • ఈ రెండేళ్లు కూడా సెంటు భూమి పోకుండా కోర్టులను ఆశ్రయించి ఆపుదాం
  • దళితులు వారి భూముల పత్రాలు జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి
  • లంక భూముల విషయంలో దళితులు భయపడాల్సిన పనిలేదు
  • చంద్రబాబు అన్యాయం చేస్తే అసలే ఊరుకోం
  • డీకే పట్టాలు, అడంగల్‌ ఆధారంగా వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే తిరిగి భూములు ఇచ్చేస్తాను
  • రైతుల కన్నీళ్లతో వ్యాపారం చేయాలని చంద్రబాబు చేస్తున్నారు
  • కమీషన్లు తీసుకొని చంద్రబాబుకు నచ్చిన వ్యక్తికి భూములు కట్టబెడుతున్నారు
  • చంద్రబాబు రాజధాని కడతాడన్న నమ్మకం ప్రజలకు పోయింది
  • వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే రైతుల ముఖాల్లో సంతోష వెల్లివిరిసేలా రాజధాని నిర్మిస్తాను
  • ప్రజల, రైతుల అండదండలతో చక్కటి రాజధాని నిర్మిస్తాను
  • చంద్రబాబుకు దేవుడు మొట్టికాయలు వేస్తాడు
  • చంద్రబాబు భూదాహం ఇంకా తీరలేదు. మార్కెట్‌ విలువ కట్టించి ఇవ్వాలనే ఆలోచన కూడా బాబుకు లేదు
  • భూసేకరణ పేరుతో ఇంకా భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు
  • రైతు కూలీలకు అన్యాయం చేయడం ఏమాత్రం సరికాదని చంద్రబాబును హెచ్చరిస్తున్నాను

వైఎస్ జగన్ కాన్వాయ్‌ పై ఆంక్షలు


వైఎస్ జగన్ కాన్వాయ్‌ పై ఆంక్షలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని గ్రామాల్లో సాగుతున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. వెలగపూడి మార్గంలో కురగల్లు వెళ్లేందుకు వైఎస్ జగన్ కాన్వాయ్‌ లో నాలుగు వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. జగన్ వెంట ఉన్న మిగతా వాహనాలను పెద్దపరిమి వైపు దారి మళ్లించారు.

టీడీపీ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తున్న బాధిత రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి మనోభావాలను తెలుసుకునేందుకు జగన్ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనకు చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోంది. ప్రతిపక్ష పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

రాజధానిలో ఇల్లు కొనుక్కుని ఉంటా

‘రాజధానిలో ఇల్లు కొనుక్కుని ఉంటా’
నిడమర్రు: తాము అధికారంలోకి రాగానే ప్రజా రాజధాని నిర్మిస్తామని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజధానిలో మంచి జరగాలంటే ఒక్క వైఎస్సార్‌ సీపీ ద్వారానే అవుతుందని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నిడమర్రులో రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ... రాజధానిని తామే కడతామన్నారు. చంద్రబాబు ఇక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నారని, రాబోయే రోజుల్లో తాను ఇల్లే కొనుక్కుని ఇక్కడ ఉంటానని ప్రజల హర్షద్వానాల మధ్య జగన్‌ ప్రకటించారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆక్షేపించారు. రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. తన బినామీల భూములున్న ప్రాంతాలను రియల్‌ ఎస్టేట్‌ జోన్‌ లో పెట్టి, రైతుల భూములను మామూలు జోన్ లో పెట్టారని ఆరోపించారు. రైతులకు ఇచ్చే వాణిజ్య స్థలాల్లో మాల్స్ పెట్టకూడదని ఆంక్షలు విధించడం అన్యాయమని అన్నారు. చంద్రబాబుకు భూములు ఇచ్చిన వారు మాత్రం 22 అంతస్థులు కట్టుకుని మాల్స్ పెట్టేందుకు అనుమతి ఇస్తున్నారని చెప్పారు.

రైతులకు ఏదైనా ఆదాయం వచ్చేట్టు చేయాలి కానీ, ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయమని ప్రశ్నించారు. చంద్రబాబు రైతుల కళ్లల్లో కన్నీళ్లు చూస్తున్నాడని, ఈ పరిస్థితి మారుస్తామన్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరగనీయబోమని, ప్రతి రైతుకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. మరో రెండేళ్లు ఎలాగోలా భూములు కాపాడుకుంటే తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమని జగన్ అన్నారు. తర్వాత ఎవరూ భయంతో బతకాల్సిన అవసరముండదని భరోసాయిచ్చారు. రైతులకు అన్ని రకాలుగా వైఎస్సార్‌ సీపీ తోడుగా ఉంటుందని హామీయిచ్చారు.

అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు


విజయవాడ :
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వాటికి పప్పు బెల్లాలు ఇచ్చినట్లు ఇస్తే ఎలా కుదురుతుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా ఆయన కనకదుర్గ వారధి వద్ద సీడ్ క్యాపిటల్ యాక్సెస్ హైవే బాధిత రైతులు, ఇతరులను కలిసి మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

 
  • సీడ్ క్యాపిటల్ యాక్సెస్ అని రోడ్డు పెట్టి, దానికోసం 300 కుటుంబాలను నేలమట్టం చేసి, 25 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా బాధ కలిగించే అంశం. 
  • ఇప్పటికే సూరాయపాలెం నుంచి మంగళగిరి టోల్ ప్లాజా వరకు ఎన్ హెచ్ 5, 9 లను లింక్ చేస్తూ, గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తుళ్లూరుకు రోడ్డు వేయడానికి గత ప్రభుత్వం హయాంలోఏ భూములు తీసుకున్నా, చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్ల నుంచి ఇంతవరకు రోడ్డు పనులు మొదలుపెట్టలేదు. 
  • నిజంగా రోడ్డు పని చేసి ఉంటే, సీడ్ క్యాపిటల్ కు యాక్సెస్ అనేది అయిపోయి ఉండేది
  • ఈ భూములు తీసుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. 
  • ఇప్పటికే భూములు తీసుకున్నా, విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి గుంటూరు రోడ్డు కోసం భూములు సిద్ధంగా ఉన్నా.. పనులు చేపట్టలేదు. 
  • ఎవరైనా ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త రాజధానికి రోడ్డు పనులు చేయాలి. 
  • ఈయన సీఎం అయి మూడేళ్లు కావస్తున్నా ఆ పని కావాలని ముట్టుకోకుండా పక్కన పెట్టారు. 
  • ఇప్పుడు ఈ భూములను కూడా సీడ్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్డు పేరుతో 25 ఎకరాలు బలవంతంగా లాక్కుని, 300 కుటుంబాలను కూలుస్తున్నారు. 
  • ఇక్కడ ఎకరం 15 కోట్ల వరకు పలుకుతోంది. దానికి 30 లక్షలు మాత్రమే ఇస్తామని చెబుతుంటే తాము ఎలా బతకాలి, ఎవరికి చెప్పుకోవాలని బాధపడుతున్నారు. 
  • ఇక్కడ ఉన్నదంతా చిన్న, సన్నకారు రైతులే. 
  • 20 సెంట్లు, 40 సెంట్ల చొప్పున ఉన్నవాళ్లంతా ఈ రోడ్డు పుణ్యమాని రోడ్డున పడాల్సి వస్తోంది. 
  • అలా రోడ్డున పడేయడం ధర్మమేనా? 

     
  • అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు.. 
  • 25 ఎకరాల భూమికి ఎకరా 15 కోట్లు ఇచ్చి తీసుకొమ్మని అడుగుతున్నాం. 
  • మోసం చేసి, రోడ్డు మీద పారేయకండి. 
  • ప్రభుత్వమే లాక్కుంటే మేం ఎవరికి చెప్పుకోవాలని చంద్రబాబును ఇక్కడివారు నిలదీస్తున్నారు. 
  • చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వీళ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుందని హామీ ఇస్తున్నాం. 
  • ఇదే ప్రాంతంలో వేరే ఆవాసం కూడా కల్పించకుండానే ఇళ్లు కూల్చేస్తున్నారు. 
  • బలవంతంగా భూములు లాక్కుంటున్నారు, ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
  • ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రమంతా చూసేలా చేయాలి. చంద్రబాబుకు తెలిసేలా వీళ్ల నోళ్ల నుంచి వస్తున్న మాటలతో ఆయనకు బుద్ధి రావాలని అనుకుంటున్నాం. 
  • ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అడిగేది ఒక్కటే. 
  • పక్కనే విజయవాడ, అన్నీ ఫ్లాట్లే ఇక్కడ.. మేం ఫ్లాట్లు కట్టుకుంటే 15 కోట్ల వరకు వచ్చే పరిస్థితి ఉంది. 
  • పప్పు బెల్లాలు ఇచ్చి మా భూములు తీసుకుంటే సన్న, చిన్నకారు రైతులం ఏం చేయాలని అడుగుతున్నారు. 
  • మా భూములు తీసుకోవాలంటే పూర్తిగా ఎకరాకు 15 కోట్లు ఇచ్చి తీసుకోండి.. లేదా మా భూములు మాకు వదిలేయండని గట్టిగా అడుగుతున్నారు.
  • వాళ్ల కోరిక సమంజసమే. అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు, కానీ పేదవాళ్ల కడుపు కొట్టడం అభివృద్ధి కాదు, ధర్మంగా పేదవాళ్లకు ఇవ్వాల్సింది ఇచ్చి తీసుకోవాలి. 
  • ఆయనపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తాం. 
  • 300 ఇళ్లు తీసుకునేటప్పుడు ఇదే ప్రాంతంలో ఇళ్లు కట్టించి, ఆ తర్వాత ఇళ్లు తీసుకోవాలని అడుగుతున్న వారి కోరిక సమంజసమే. 
  • మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 
  • మిగిలిన గ్రామాల్లో ఉన్న సమస్యలను కూడా చంద్రబాబు గారికి అర్థమయ్యేలా చెబుతాం. 
  • ఈ పోరాటంలో మీకు అండగా ఉంటామని, ముందుండి పోరాడతామని హామీ ఇస్తున్నాం. 
 
ఈ పర్యటనలో భాగంగా ఆయన సీడ్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్డు బాధితులతో ముఖిముఖి మాట్లాడారు. వాళ్ల ఆవేదనను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
 
వైఎస్ తర్వాత ఎవరూ మంచి పనులు చేయలేదు
ఆ 20 ఎకరాల్లో 45 కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్లంతా ఇప్పుడు రోడ్డున పడాల్సిందే. చంద్రబాబు చేసే పని ఏమీ లేదు. ఎప్పుడో వైఎస్ఆర్ మంచి పనులు చేశారు. ఆ తర్వాత ఎవరూ మంచి పని అన్నది చేయలేదు. అందరికీ తలా అర ఎకరం, 40 సెంట్లు.. ఇలా పోతున్నాయి. 
-రామిరెడ్డి
 
ప్రభుత్వమే లాక్కుంటే ఎవరికి చెప్పాలి
మేమిక్కడ 20 ఏళ్ల నుంచి ఉంటున్నాం. 30 సెంట్ల భూమి, ఒక చిన్న డాబా ఇల్లు ఉన్నాయి. ఇవి యాక్సెస్ రోడ్డు కోసం పోతున్నాయి. ఇప్పుడు మేం ఎలా బతకాలి? ఏడాది పొడవునా ఆ భూమిలో గులాబి పూలు వేసుకుని నెలకు 10 వేల రూపాయలు సంపాదించుకుంటున్నాం. ఇప్పుడు ఇల్లు, భూమి పోతే చిన్న పిల్లలతో మేం ఎలా బతకాలి? ప్రభుత్వమే మా భూములు లాక్కుంటే ఇక మేం ఎవరికి చెప్పుకోవాలి? 
-ఆశ
 
పుష్కరాల నాడే ఇళ్లు తీసేశారు
మేం చేపలు అమ్ముకుంటాం. అమ్మానాన్నల సమయం నుంచి మేం అక్కడే ఉండేవాళ్లం. పుష్కరాల సమయంలో ఇళ్లు తీసేశారు. తర్వాత వేరేచోట మమ్మల్ని ఉంచారు. అక్కడ దోమలు కుట్టి మా చెల్లెలు చనిపోయింది. మూడు నెలల్లో వేరేచోట ఇళ్లు ఇస్తామన్నారు ఇంతవరకు ఇవ్వలేదు. చేపలు అమ్ముకునేవాళ్లను అమ్ముకోనివ్వరట, చేపలు పట్టుకోనివ్వడం లేదు.
-మంగమ్మ

జగన్ ని కలిసిన కృష్ణా జిల్లా రైతులు


'టీడీపీ నేతల పొలాల్లోనే సర్వేలు చేస్తున్నారు'
కృష్ణా : పంట నష్టపరిహారంలో అధికారులు వివక్ష చూపుతున్నారని కృష్ణా జిల్లా రైతులు వైఎస్‌ జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను బాపులపాడు, గన్నవరం మండలాల రైతులు కలిశారు.

మినుము పంటకు తెగుళ్లు సోకి తీవ్రంగా నష్టపోయామని రైతులు జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. పరిహారం కోసం చేసిన సర్వేలో అధికారులు వివక్ష చూపుతున్నారని...కేవలం అధికార పార్టీ నేతల పొలాల్లోనే సర‍్వే చేస్తున్నారన్నారు. ఏలూరు కాల్వ కింద శివారు భూములకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు జగన్‌కు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కారించేందుకు కృషి చేస్తామని వైఎస్‌ జగన్‌ రైతులకు హామీ ఇచ్చారు.

వైఎస్‌ జగన్‌ పర్యటనపై ఆంక్షలు

Written By news on Wednesday, January 18, 2017 | 1/18/2017


వైఎస్‌ జగన్‌ పర్యటనపై ఆంక్షలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వైఎస్సార్ సీపీ రూట్ మ్యాప్ ప్రకారం జగన్ పర్యటనకు అనుమతిచ్చేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు. తాము చెప్పిన మార్గంలోనే పర్యటన చేయాలంటూ షరతులు పెట్టారు.

పోలీసుల తీరును వైఎస్సార్ సీపీ నేతలు తప్పుబట్టారు. ప్రతిపక్ష నేత పర్యటనపై ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజధాని బాధిత రైతులను పరామర్శించకూడదా అని నిలదీశారు. జగన్ వస్తున్నారని తెలియగానే రంగంలోకి దిగిన మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు నిన్న లింగాయపాలెం గ్రామస్తులను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వారు వెనక్కు తగ్గారు.

వైఎస్ జగన్ రేపు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారు. ఉదయం 9.30 గంటలకు మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు నుంచి జగన్ పర్యటన ప్రారంభమవుతుందని ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు లింగాయపాలెం చేరుకుని బాధిత రైతులతో జగన్ మాట్లాడతారని చెప్పారు.
 

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీలోకి కోటగిరి శ్రీధర్‌

Written By news on Sunday, January 15, 2017 | 1/15/2017

హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని మాజీమంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్‌ కలిశారు.  ఆయన ఆదివారం లోటస్‌ పాండ్‌ లో వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. కోటగిరి శ్రీధర్‌  ఈ నెల 28న వైఎస్‌ఆర్‌ సీపీలో చేరనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగే బహిరంగ సభలో ఆయన అధికారికంగా పార్టీలో చేరతారు.  
శ్రీధర్‌ తో పాటు పార్టీ నేతలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఆళ్ల నాని కూడా వైఎస్‌ జగన్‌తో సమావేశం అయ్యారు. కాగా ఇటీవలే మాజీమంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్‌ రెడ్డి, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్‌ కూడా వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన విషయం తెలిసిందే.

Popular Posts

Topics :