22 January 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

మహిళలని కూడా చూడకుండా రక్తాలు వచ్చేలా కొట్టారు

Written By news on Friday, January 27, 2017 | 1/27/2017


'అతి పెద్ద రౌడీ, గూండా చంద్రబాబే'
తిరుపతి :
జర్మనీలో గోబెల్స్ పార్లమెంటును కాల్చేసి, ప్రతిపక్షాలను ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం ఎలా చేశారో.. చంద్రబాబు కూడా అలాగే ఇనుప సంకెళ్లతో ప్రజలను బంధించి, వాళ్లను హంతకులు, రౌడీలుగా చిత్రీకరిస్తున్నారని.. నిజానికి రాష్ట్రంలో అతిపెద్ద రౌడీ, గూండా చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఒక వినోద క్రీడ కోసం తమిళులంతా కలిసొచ్చారన్న స్ఫూర్తితో వైఎస్ జగన్ పిలుపు మేరకు శాంతియుత ప్రదర్శన చేస్తామన్న ప్రకటనకే వణికి చచ్చిన చంద్రబాబు.. రక్తాలు వచ్చేలా మహిళలను కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో శుక్రవారం కూడా మహిళలపై పోలీసులు విరుచుకుపడి వాళ్లను కొట్టిన నేపథ్యంలో ఆయన తిరుపతి ఎంపీ వరప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం శాంతియుతమైన నిరసన.. అది కూడా కొవ్వొత్తుల ప్రదర్శన మాత్రమే చేస్తామని చెప్పారని, దానికే ఇంత హింసకు పాల్పడటం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోట్ల కేసులో కోట్లాది రూపాయలు వెనకేశా, అమరావతి భూముల్లో లక్షల కోట్లు కొట్టేశా, విచారణ జరపకండి, మాకు ప్రత్యేక హోదా అక్కర్లేదని కేంద్రం కాళ్ల వద్ద సాగిలబడ్డారని మండిపడ్డారు. 
 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్నవాళ్లు, ఇస్తామన్నవాళ్లు గత రెండున్నరేళ్లుగా ఏమీ చేయకపోవడం వల్లే ప్రతిపక్షంగా వైఎస్ఆర్‌సీపీ ముందుకొచ్చి ఆందోళన చేసిందని తిరుపతి ఎంపీ వరప్రసాద్ చెప్పారు.  అలా చేసినందుకు ప్రతిపక్షంగా వైఎస్ఆర్‌సీపీ ముందుకొచ్చి ఆందోళన చేసిందని అన్నారు. కానీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేస్తున్నవాళ్లను పోలీసు స్టేషన్‌కు తీసుకురావడం దారుణమన్నారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే అడ్డుకోవడాన్ని ఎక్కడా చూడలేదని, మహిళలని కూడా చూడకుండా రక్తాలు వచ్చేలా కొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 

వైజాగ్‌ను తగలబెట్టడానికి ఎవరు వచ్చారు: రామకృష్ణారెడ్డి


వైజాగ్‌ను తగలబెట్టడానికి ఎవరు వచ్చారు: రామకృష్ణారెడ్డి
హైదరాబాద్ :
వైఎస్ఆర్ కుటుంబం మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు బురద జల్లుతున్నారని వైఎస్ఆర్‌సీపీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వైజాగ్‌ను తగలబెట్టడానికి ఎవరు వచ్చారని అడిగారు. గురువారం నాటి ఘటనలు, అనంతరం చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో చెప్పిన అంశాలపై ఆయన శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దాదాపు గంట పాటు ప్రశాంత వదనంతో మాట్లాడిన ముఖ్యమంత్రి, మెత్తటి మాటలతో దారుణమైన వ్యాఖ్యలు చేశారన్నారు. ఎంత దారుణమైన పనులు చేశారు, ఎన్ని ఘోరాలు ఆపాల్సి వచ్చింది, వాటన్నింటికీ ఒక వ్యక్తి కారణం, అతడి కుటుంబ నేపథ్యం ఇదీ అన్నారని చెప్పారు.

ఈ కుటుంబానికి ఒక చరిత్ర ఉందన్నారని, ఏం చరిత్ర ఉందని రాజశేఖరరెడ్డిని రెండు సార్లు ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారని అడిగారు. వైఎస్ ఉన్న ఐదేళ్లలోనే కదా విశాఖకు సాఫ్ట్‌వేర్ పార్క్ వచ్చింది, టూ టైర్ అభివృద్ధి కోసం నిధులొచ్చింది, ఆయన ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఉండేది అని గుర్తుచేశారు. వాల్తేర్ క్లబ్‌లో ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. గత ఎన్నికల్లో ఓడినంత మాత్రాన ఏమీ కాదని.. తర్వాత మళ్లీ తాము అక్కడ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కానీ, అసలు పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలను రూపుమాపేందుకు ప్రయత్నించిన ఒక నాయకుడి కుటుంబం గురించి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నతండ్రి 1998లో హత్యకు గురైతే.. ఆ కేసులో ప్రధాన నిందితుడికి రక్షణ కల్పించింది నాటి సీఎం చంద్రబాబేనని, అతడికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి మరీ రక్షించారని చెప్పారు. ఒక నాయకుడిని రాజకీయంగా బలహీనం చేయడానికి ఇంట్లో పెద్దాయనను హత్య చేసినా, ప్రతీకారానికి ఆయనేమీ ప్రయత్నించలేదని అన్నారు. వైఎస్ఆర్ దుర్మరణం మీద కూడా తమకు అనుమానాలున్నాయని, అది జరిగిన పద్ధతి చూస్తే ఎవరికైనా అనుమానాలు వస్తాయని.. అయినా ఆ కుటుంబం ఎప్పుడూ దాని గురించి మాట్లాడలేదు గానీ, మీరు మాత్రం దాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. 
 

ఏమీ లేని స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారని చంద్రబాబు ప్రశ్నించారని, ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామికాభివృద్ధి ఎలా జరుగుతుందని చూపించమన్నారని.. ఏమీ లేకపోతే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో టీడీపీ నాయకులు కూడా వెళ్లి ఎందుకు పరిశ్రమలు పెడుతున్నారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప్రయోజనం లేకపోతే, పెద్ద పరిశ్రమ పెట్టడానికి మూడేళ్ల సమయం సరిపోతుంది, రెండేళ్లు చాలవు కాబట్టి పది, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని ఎన్నికల సమయంలో ఎందుకు అడిగారని, వెంకయ్య నాయుడు పార్లమెంటులో అదే విషయం ఎందుకు ప్రస్తావించారని ఆయన నిలదీశారు. 900 కిలోమీటర్లకు పైగా తీరప్రాంతం ఉండి, మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా వస్తే మరింత అభివృద్ధి ఉంటుందన్నది అందరి ఆకాంక్ష అని, హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోవడం వల్ల హోదా ఇస్తామని వాళ్లే అన్నారని చెప్పారు. ప్రస్తుత వేగంతో వెళ్తే ఐదేళ్లు కాదు.. 50 ఏళ్లలో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందడం కష్టమని ఆయన అన్నారు. 
 
 
ఇక విశాఖపట్నంలో గురువారం జరిగిన ఘటనలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రిపబ్లిక్ డే ఒక పవిత్రమైన రోజని, ఆ రోజును అంతా ప్రశాంతంగా, పండగలా చేసుకుంటారని, కొవ్వొత్తుల ర్యాలీ అనేది ఏరకంగానూ దానికి భంగం కలిగించేది కాదు, భావప్రకటనా స్వేచ్ఛను పండుగలా చేసుకున్న రోజు కాబట్టే తలపెట్టారని రామకృష్ణారెడ్డి అన్నారు. ఆరోజు బంద్, హర్తాళ్ లాంటివి చేస్తామంటే తప్పు గానీ, పావురాలు ఎగరేయడం, కొవ్వొత్తులు వెలిగించడం లాంటివి తమ భావాన్ని ప్రకటించడమే అవుతుందని, ఇంత ప్రశాంతమైన కార్యక్రమాన్ని రెచ్చగొట్టేలా చేసింది ఎవరని ప్రశ్నించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు అక్కడకు వచ్చారని, ఆయన చేతుల్లో ఏమీ లేకపోయినా కనీసం లాంజ్‌లోకి కూడా రానివ్వకుండా రన్‌వే మీదే ఆపడంలో ఉద్దేశం ఏంటని సూటిగా అడిగారు. దానికి ముందు ఆర్కే బీచ్ మొత్తం కర్ఫ్యూ వాతావరణం ఎందుకు సృష్టించాల్సి వచ్చిందని మండిపడ్డారు. సెలవు కాబట్టి మామూలు రోజుల కంటే కూడా ఎక్కువ మంది వస్తారని, అలాంటప్పుడు ఎందుకు బీచ్‌ను దిగ్బంధించారని ప్రశ్నించారు. విచ్ఛిన్నకరశక్తులు, టెర్రరిస్టులు వైజాగ్‌ను తగలబెట్టడానికి వస్తుంటే ఆపద్దా అన్నారని, ఇంత క్రూరమైన మాటలను అంత ప్రశాంతంగా చెప్పినందుకు హ్యాట్సాఫ్ అని అన్నారు. 
 
పోలవరం ప్రాజెక్టు విభజన చట్టంలో ఉందని, అందులో ఈయన కొత్తగా తెచ్చింది ఏముందని అడిగారు. మొత్తం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని చట్టంలో ఉంటే.. మనకు మనం కుదించుకుని, పని మనం చేస్తామని వెళ్లడం ఎందుకని, చేతులారా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని తెలిపారు. ప్యాకేజిలో కొత్తగా ఏమీ లేవని, యూనివర్సిటీలు, ఇతర సంస్థలు అన్నింటినీ ముందే చెప్పారని అన్నారు. ఎన్టీ రామారావును తప్పించి విజయవంతంగా పార్టీ నాయకుడు అయ్యి, ఇంతకాలం పార్టీని నడుపుతున్నవాళ్లకు కొంత ఎక్కువే జ్ఞానం ఉండొచ్చు గానీ, ఎదురుగా ఉన్నవాళ్లకు విచక్షణ లేదనుకుని మాట్లాడితే ఎలాగని ఎద్దేవా చేశారు. 

అదే ముఖ్యమంత్రిని ఇలా పట్టుకుంటావా


ఎల్లో మీడియాలో దుష్ప్రచారం
 ప్రత్యేక హోదా ఉద్యమానికి అసలు సిసలు చిరునామాగా మారిన వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోను ఉపయోగించుకుని ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెరతీసింది. అందులో జగన్‌ చేసినట్లుగా ఉన్న కొన్ని వ్యాఖ్యలను వక్రీకరించి ప్రసారం చేయడంలో ఒక చానెల్‌ అత్యుత్సాహం ప్రదర్శించింది.

‘నేను ప్రతిపక్ష నాయకుడిని నన్ను అడ్డగిస్తున్నారు. అదే ముఖ్యమంత్రిని ఇలా పట్టుకుంటావా’ అన్న వ్యాఖ్యను వక్రీకరించి నేను ముఖ్యమంత్రిని నన్నే పట్టుకుంటావా అని వ్యాఖ్యానించినట్లుగా సొంతపైత్యం జోడించారు. ప్రతిపక్ష నాయకుడు అనని మాటలను ఆపాదించి ప్రసారం చేసి పండుగ చేసుకుంటున్న సదరు చానెల్‌పై కూడా సోషల్‌ మీడియాలో హోదా ఉద్యమకారులు దుమ్మెత్తిపోశారు. ఈ ఉత్సాహం హోదా పోరాటానికి మద్దతివ్వడంలో చూపించాలన్న వ్యాఖ్యానాలు కనిపించాయి.

బాధ్యత గలిగిన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఒక శాంతియుత పోరాటానికి వెళ్తుండగా అడ్డగించడమేకాక అనుచితంగా వ్యవహరించిన పోలీసులపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం నిజమే. ప్రతిపక్ష నేత, ఎంపీలకు ప్రొటోకాల్‌ పాటించకపోతే పోయారు కనీసం ఒక సాధారణ ప్రయాణీకుడికి ఇచ్చిన మర్యాదైనా ఇవ్వరా అని ఆశ్చర్యపోయిన మాటా నిజమే. ఆ విషయాలను వదిలేసి రామాయణంలో పిడకల వేటలా కోడిగుడ్డుపై ఈకలు పీకడం సదరు చానల్‌ యజమానికి పరిపాటేనని నెటిజన్లు చర్చించుకోవడం కనిపించింది.

జగన్ పట్ల పోలీసుల దౌర్జన్యం

Written By news on Thursday, January 26, 2017 | 1/26/2017


జగన్ పట్ల పోలీసుల దౌర్జన్యం
విశాఖపట్నం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌తో విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి ఇక్కడకు చేరుకున్న ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమానాశ్రయం లోనికి కూడా అనుమతించకుండా పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పార్టీకి చెందిన ఎంపీలు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, నాయకులు అంబటి రాంబాబు తదితరులతో కలిసి గురువారం మధ్యాహ్నం జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్నారు.
 
విమానాశ్రయంలో దిగగానే జగన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఎయిర్ పోర్టు లాబీల్లోకి చేరుకుంటుండగా పోలీసులు అడ్డంగా నిలబడి వారిని అడ్డుకున్నారు. డొమెస్టిక్ లాబీల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు వచ్చి చుట్టుముట్టి వారిని ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. ఈ ఆకస్మిక పరిణామానికి విస్మయం చెందిన నాయకులు మీరెవరంటూ ప్రశ్నించినా వారి నుంచి సమాధానం రాలేదు. విమానం నుంచి దిగివస్తున్న తమను టెర్మినల్ లోకి వెళ్లేందుకు అనుమతించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినా వారినుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో ఆగ్రహించిన నేతలు విమానాశ్రయం లాబీల్లోకి ఎందుకు అనుమతించడం లేదంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న వారికి తోడుగా మరికొందరు పోలీసులు వచ్చి ఆ నాయకులను వెనక్కి తోయడం ప్రారంభించారు.
 
కేంద్రప్రభుత్వ భద్రతా సిబ్బంది (సీఐఎస్ఎఫ్) సంరక్షణలో ఉండాల్సిన విమానాశ్రయంలో మీరంతా ఎవరు? ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించినా వారి నుంచి సమాధానం లేకపోగా నేతలను బయటకు వెళ్లనివ్వకుండా, విమానాశ్రయం లాబీల్లోకి కూడా అనుతించకుండా తోసేశారు. నాయకులపై చేతులు పెట్టి వెనక్కి నెట్టడం ప్రారంభించారు. ప్రతిపక్ష నాయకుడు, ఎంపీలు అన్నది కూడా చూడకుండా వారిని తోయడం, వారి చుట్టూ ఒక చైనులా ఏర్పడి ముందుకు కదలకుండా అడ్డుకోవడం వంటి దుశ్చర్యలకు దిగారు. ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు నేతలను వారు వెనక్కి ఈడ్చుకెళ్లారు. 
 
సివిల్ డ్రెస్ లో ఉన్న మీరంతా ఎవరు? అని అడిగినా సమాధానం రాలేదు. ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారన్న కనీస మర్యాద పాటించకుండా వ్యవహరించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండాల్సిన నేతల విషయంలో ఇలా సివిల్ డ్రెస్సులో ఉన్న వాళ్లు అడ్డుకోవడం మొత్తం యావత్ ప్రజలను విస్మయపరిచింది. ఎవరినైనా అడ్డుకోవాలన్నప్పుడు మరీ ముఖ్యంగా కేబినేట్ స్థాయి నేత, పార్లమెంట్ సభ్యుల విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాంటిదేమీ లేకుండా సివిల్ డ్రెస్సుల్లో రన్ వే వైపు పెద్ద సంఖ్యలో ముందుగానే పోలీసు బలగాలను మోహరించడం గమనిస్తే ప్రతిపక్ష నాయకుడిని ఎట్టి పరిస్థితుల్లో విమానాశ్రయం నుంచి బయటకు రానివ్వకూడదన్న ఎత్తుగడతోనే ఉన్నట్టు అక్కడున్న పరిస్థితులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
 
విమానం నుంచి దిగీదిగగానే ఇదేంటి? మమ్మల్ని ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ వారిపై జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారని ముందస్తు సమాచారం ఉండగా, కొన్ని గంటల ముందే విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ప్రజలను తరిమి తరిమి కొట్టారు. ఆ పరిసరాల్లో పెద్దఎత్తున పోలీసు బలగాలను నియమించి ఎవరినీ అటువైపు రానీయకుండా అడ్డుకున్నారు. డీజీపీ స్వయంగా విమానాశ్రయం వద్దకొచ్చి పరిస్థితిని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు.
 
రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలన్న డిమాండ్‌పై విశాఖలోని ఆర్కే బీచ్ లో గురువారం సాయంత్రం భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ తలపెట్టగా ఆ ర్యాలీలో పాల్గొంటానని జగన్ మోహన్ రెడ్డి ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం నుంచి ఆర్కే బీచ్ కు ఎవరినీ రానీయకుండా పోలీసులు ప్రజలను.. మరీ ముఖ్యంగా యువతీ యువకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఉదయం నుంచి విశాఖ తీరంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించడమే కాకుండా కనుచూపు మేరలో ఎవరు కనిపించినా తరిమికొట్టారు. 
 
ఒకవైపు విశాఖపట్నం మొత్తంలో పోలీసులను మోహరించి ఒక టెర్రర్ వాతావరణం సృష్టించిన అదికారులు తీరా జగన్ మోహన్ రెడ్డి విశాఖ విమానాశ్రయం చేరుకున్న తర్వాత దాన్ని మరింత తీవ్రం చేశారు. విమానాశ్రయం రన్ వే వైపు లోపలే అడ్డుకోవడం పట్ల జగన్ మోహన్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రన్ వే పైనే మమ్మల్ని అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. ఇలా అడ్డుకుంటున్న మీరంతా అసలు పోలీసులేనా (అంతా సివిల్ డ్రెస్సులో ఉన్నారు) అని, మీలో ఒక్కరు కూడా కనీసం ఐడీ కార్డులు ప్రదర్శించడం లేదని మండిపడ్డారు. రన్ వే పైన ప్రయాణికులను, అందులో ప్రతిపక్ష నాయకుడితో పాటు పార్లమెంట్ సభ్యులను అడ్డుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
పోలీసులు తమను రన్‌వే మీదనే అడ్డుకోవడం, అసలు లాంజ్ వైపు కూడా వెళ్లనివ్వకపోవడంతో.. 'మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ? ఇటువైపు వీఐపీ లాంజ్ ఉంది, అటువైపు అరైవల్ లాంజ్ ఉంది. అక్కడకు వెళ్లండి. అయినా అసలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలోకి రాష్ట్ర పోలీసులు ఎలా వస్తారు? ఒక ప్రయాణికుడిగా కూడా నన్ను లోపలకు పోనివ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? లోపలకు అనుమతించండి, అక్కడ మాట్లాడదాం. ఎంతసేపు ఇక్కడ నిలబెడతారు? మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఇంకా ఎక్కువ చేస్తే ఇక్కడే కూర్చుంటాం, తర్వాతి విమానం వచ్చిన తర్వాతైనా మీరు తలుపులు తీయాల్సిందే '' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా డిపార్టుమెంటులో ఎలా ఉన్నారని అడిగారు. డొమెస్టిక్ ఎరైవల్స్ అని బోర్డు కూడా కనిపించడంలేదా, ప్రయాణికులను అక్కడకు అనుమతించాలని మీకు తెలియదా అంటూ నిలదీశారు. తలుపు తీయాలని.. డొమెస్టిక్ ఎరైవల్స్ వద్దకు కూడా వెళ్లనివ్వకుండా రన్ వే మీద ఆపడం ఏంటని ప్రశ్నించారు.
 
ప్రతిపక్ష నేత ఎంతగా ప్రశ్నించినా అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అలాగని ముందుకు అనుమతించలేదు. దాంతో తమను అనుమతించాల్సిందేనంటూ జగన్ మోహన్ రెడ్డితో సహా నేతలంతా రన్ వే నుంచి లాబీల్లోకి వెళ్లే దారిలో బైఠాయించి అక్కడే నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాల్సిందేనంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగిస్తున్నారు. 
 
జగన్ మోహన్ రెడ్డిని విమానాశ్రయం లాబీల్లోకి కూడా అనుమతించకుండా లోపలే నిర్భంధించారని తెలిసి విశాఖ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విమానం నుంచి జగన్ మోహన్ రెడ్డి దిగినా గంటల తరబడి ఆయన బయటకు రాకపోవడంతో లోపల ఏం జరుగుతుందో తెలియక పరిసర ప్రాంతాల్లో దూరంగా ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదాపై నినాదాలు కొనసాగించారు. కొందరు యువకులు విమానాశ్రయం సమీపంలోకి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డగించారు.
 
జగన్ మోహన్ రెడ్డి విశాఖ చేరుకోవడానికి ముందుగానే వైఎస్సార్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్ తదితర నేతలందరినీ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయ పరిసర 

ఏంటిది.. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు?

)
ఏంటిది.. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు?
విశాఖపట్నం :
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలీ చేసేందుకు వచ్చిన తమను కనీసం డొమెస్టిక్ ఎరైవల్స్ వద్దకు కూడా వెళ్లనివ్వకుండా ఎలా ఆపుతారని పోలీసులను ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు. రన్ వే మీద నుంచి తనను లాక్కెళ్లడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రన్‌వేకు కొన్ని మీటర్ల దూరం వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు దాదాపు అరగంట పాటు ఆయనను అక్కడే అడ్డుకున్నారు. దాంతో, వైఎస్ జగన్ వాళ్ల తీరును నిరసించారు. ఈరోజు పోలీసులు ఇద్దరిని కిడ్నాప్ చేశారని, వాళ్లలో ఒకరు లోక్ సభ సభ్యుడని ఆయన మండిపడ్డారు. అసలు రన్‌వే మీద ఆపడం ఏంటని, వచ్చినవాళ్లు పోలీసులేనా, వాళ్లకు ఒక ఐడీ కార్డు కూడా లేదని.. ఈ వ్యవహారం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడితో ప్రవర్తించాల్సిన విధానాన్ని పోలీసులు పాటించకపోవడంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. 
 
పోలీసులు తమను రన్‌వే మీదనే అడ్డుకోవడం, అసలు లాంజ్ వైపు కూడా వెళ్లనివ్వకపోవడంతో.. 'మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ? ఇటువైపు వీఐపీ లాంజ్ ఉంది, అటువైపు అరైవల్ లాంజ్ ఉంది. అక్కడకు వెళ్లండి. అయినా అసలు కేంద్ర ప్రభుత్వ ప్రాంతంలోకి రాష్ట్ర పోలీసులు ఎలా వస్తారు? ఒక ప్రయాణికుడిగా కూడా నన్ను లోపలకు పోనివ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? లోపలకు అనుమతించండి, అక్కడ మాట్లాడదాం. ఎంతసేపు ఇక్కడ నిలబెడతారు? మీరు ఇంకా ఎక్కువ చేస్తే ఇక్కడే కూర్చుంటాం, తర్వాతి విమానం వచ్చిన తర్వాతైనా మీరు తలుపులు తీయాల్సిందే '' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 
 
తమను ఏం చేయాలని ఆపుతున్నారని, ప్రతిపక్ష నేతతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా డిపార్టుమెంటులో ఎలా ఉన్నారని అడిగారు. డొమెస్టిక్ ఎరైవల్స్ అని బోర్డు కూడా కనిపించడంలేదా, ప్రయాణికులను అక్కడకు అనుమతించాలని మీకు తెలియదా అంటూ నిలదీశారు. తలుపు తీయాలని.. డొమెస్టిక్ ఎరైవల్స్ వద్దకు కూడా వెళ్లనివ్వకుండా రన్ వే మీద ఆపడం ఏంటని ప్రశ్నించారు.

దేశ చరిత్రలో ఇదే ప్రథమం

తనను నిర్బంధించడం అన్యాయమని, ఒక ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తమను నిర్బంధించడం అన్యాయమని, ప్రతిపక్ష నాయకులకు ఉన్న రాజకీయ హక్కులను కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖ విమానాశ్రయం రన్‌వే మీద బైఠాయించిన ఆయన.. తనతో సహా పలువురు ఎంపీలు, నాయకులను అదుపులోకి తీసుకోడానికి పోలీసులు చేసిన ప్రయత్నాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. 
 
రాష్ట్రానికి మేలుచేసే అంశం కోసం శాంతియుతంగా కొవ్వొత్తులతో ప్రదర్శన చేస్తామంటే.. దాన్ని అడ్డుకునేందుకు ఏకంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని విమానాశ్రయం రన్‌వే మీదనే అరెస్టు చేసిన ఘటన విశాఖపట్నంలో ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించింది. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తుతాయని, తద్వారా ఉద్యోగావకాశాలు వస్తాయని భావించి, కేవలం ఒక మౌన ప్రదర్శన చేస్తామంటే విమానాశ్రయం నుంచే నిర్బంధం లోకి తీసుకోడానికి పోలీసులు ప్రయత్నించారు. జర్కిన్లు, ట్రాక్ సూట్‌లు వేసుకుని ఉన్న కొంతమంది వచ్చి వైఎస్ జగన్ తదితరులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అసలు వాళ్ల వద్ద ఐడీ కార్డులు కూడా లేకపోవడంతో వాళ్లు పోలీసులో కాదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అదే విషయమై అడిగినా ఎలాంటి సమాధానం రాకపోవడం గమనార్హం. కాగా, లోపల జగన్‌ను నిర్బంధించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసి విమానాశ్రయం బయట పెద్ద సంఖ్యలో యువత గుమిగూడారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

వాళ్లు పోలీసులో.. గూండాలో కూడా తెలీదు


వాళ్లు పోలీసులో.. గూండాలో కూడా తెలీదు
విశాఖపట్నం :
విమానం దిగగానే తమను పోలీసులు అడ్డుకున్నారని, వ్యాన్ ఎక్కమని చెప్పారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. రన్‌వే మీదనే తమను అడ్డుకున్నారని, స్థానిక పోలీసులు మఫ్టీలో వచ్చి అక్కడ ఆపారని అన్నారు. అసలు మఫ్టీలో వచ్చామంటున్న వాళ్లు పోలీసులో గూండాలో కూడా తమకు తెలియడంలేదని ఆయన అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన, ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మరికొందరు నాయకులు విశాఖ విమానాశ్రయం రన్‌వే మీద బైఠాయించారు. 
 
అసలు అక్కడకు వచ్చింది స్థానిక పోలీసులు అయినా, వాళ్లు రన్‌వే మీదకు రావడమే తప్పన్నారు. ఇదంతా చాలా అప్రజాస్వామికంగా జరుగుతోందని, చివరకు అసలు ప్రయాణికుల లాంజ్ వద్దకు కూడా తమను వెళ్లనివ్వలేదని ఆయన చెప్పారు. ప్రివెంటివ్ ఆర్డర్లు ఉన్నాయని, 144 సెక్షన్ అమలులో ఉందని అంటున్నారని రాంబాబు అన్నారు. 

విశాఖలో వైఎస్ జగన్ నిర్బంధం, రన్ వేపై బైఠాయింపు


విశాఖలో వైఎస్ జగన్ నిర్బంధం, రన్ వేపై బైఠాయింపు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో విశాఖపట్నం ఆర్కే బీచ్ లో కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. గురువారం సాయంత్రం విశాఖపట్నం వెళ్లిన వైఎస్ జగన్ ను విమానాశ్రయం రన్ వేపైనే పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు నిరసనగా ఆయన రన్ వేపై బైఠాయించారు. విమానాశ్రయంలోనే పోలీసులు వైఎస్ జగన్ ను నిర్బంధించారు. ఆయన వెంట పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సీపీ శ్రేణులు నినాదాలు చేశారు.

వైఎస్‌ జగన్‌ రాక నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టుకు కిలోమీటరు దూరం వరకు నిషేధాజ్ఞలు విధించారు. ఎయిర్ పోర్టు పరిసరాల్లో వైఎస్ఆర్ సీపీ నాయకుల్ని, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉంది.
 

విశాఖ చేరుకున్న వైఎస్ జగన్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టేందుకు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. వైఎస్‌ జగన్‌ రాక నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాల్లో భారీగా బందోబస్తును ఏర్పాటుచేశారు. సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉంది. 
 
అయితే పోలీసులు ముందుగానే జగన్ కాన్వాయ్‌ని అడ్డగించి, ఆయన సెక్యూరిటీ సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయ పరిసరాల్లో కూడా భారీగా పోలీసులను మోహరించారు. ఎయిర్‌పోర్టుకు కిలోమీటరు దూరం వరకు నిషేధాజ్ఞలు విధించారు.

ఇలాంటి అరెస్ట్ లు ఎక్కడా జరగలేదు


‘ఇలాంటి అరెస్ట్ లు ఎక్కడా జరగలేదు’
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ లో అప్రజాస్వామిక పాలన సాగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ప్రజలను ఆకాంక్షను అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని, ప్రపంచంలో ఇలాంటి అరెస్ట్ లు ఎక్కడా జరగలేదని వాపోయారు. దుష్ట సంప్రదాయానికి ప్రభుత్వం తెరలేపిందని ధ్వజమెత్తారు. ఎంత అణచివేస్తే ఉద్యమం అంత ఉధృతమవుతుందని ధర్మాన హెచ్చరించారు.

అణచివేత, బెదిరింపులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని మాజీ మంత్రి బాలరాజు అన్నారు. విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజలు ప్రత్యేక హోదా కావాలంటున్నారని, చంద్రబాబు ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించాలని కోరారు.

వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ వాహనాల అడ్డగింత!


వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ వాహనాల అడ్డగింత!
విశాఖపట్నం: ప్రత్యేక హోదా ఆందోళన కోసం ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం వైజాగ్‌కు వస్తుండటంతో పోలీసులు ఓవరాక్షన్‌కు తెరతీశారు.  వైఎస్‌ జగన్‌ రాక నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాల్లో భారీగా బందోబస్తును మోహరించారు. ఎయిర్‌పోర్టులో డీజీపీ సాంబశివరావు స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ రోజు సాయంత్రం వైజాగ్‌ బీచ్‌రోడ్డులో జరిగే మహా కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్‌ జగన్‌ పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. ఆర్కే బీచ్‌లో సాయంత్రం ఆరు గంటలకు ఈ ర్యాలీ మొదలవుతుంది. ఆర్కే బీచ్‌ నుంచి పార్కు హోటల్‌ వద్దనున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుంది. అయితే, ఈ ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ర్యాలీ నిర్వహించే ప్రాంతంలో పోలీసులు అడుగడుగునా మోహరించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు వైజాగ్‌లో ప్రత్యేక హోదా ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. శాంతియుత పోరాటానికి సిద్ధమైన యువతను పోలీసులు, ప్రత్యేక బలగాలు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.

అందుకే హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు


‘అందుకే హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు’
హైదరాబాద్: ప్రత్యేక హోదా పోరాటాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. అందుకే తమ పార్టీ నేతలు, విద్యార్థులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. కొన్నిచోట్ల పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామని, ఎప్పుడూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని గుర్తు చేశారు. ఉద్యమాలను అణచివేస్తే బ్రిటీష్‌ వారికి పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందని హెచ్చరించారు.

బీచ్ లో బికినీ ప్రదర్శనలకు అనుమతిస్తారు కానీ, హోదా కోసం పోరాడే వారిని రానివ్వరా అని ప్రశ్నించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తామని అఫిడవిట్ కూడా ఇచ్చామని, అయినా చంద్రబాబు సర్కారు రాజ్యాంగబద్దమైన హక్కుని కాలరాస్తోందని మండిపడ్డారు. ఎంత అణచివేస్తే ప్రత్యేక హోదా ఉద్యమం అంత ఉధృతం అవుతుందని.. మోదీ, చంద్రబాబు మెడలు వంచుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం అణచివేతకు భయపడం, పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా వైఎస్‌ జగన్ విశాఖ వెళ్లి తీరుతారని స్పష్టం చేశారు.

విశాఖలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు


'విశాఖలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు'
హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్‌ జగన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... తెలుగు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం చట్టాలను సవరించుకుని రిపబ్లిక్‌ కంట్రీగా అవతరించిందన్నారు.  ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. బ్రిటిష​ పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు. 68 ఏళ్ల క్రితం మనం రాసుకున్న చట్టాలు ఇప్పుడు అమలు అవుతున్నాయా అని నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన పార్టీ నేతలను హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నేతలను అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. విశాఖ ఆర్కే బీచ్‌ పరిసరాల్లో ఆంక్షలు విధించడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం వాకర్స్‌ను కూడా బీచ్‌ ​పరిసరాల్లోకి అనుమతించడంలేదన్నారు. విశాఖలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయమన్నందుకు కాపు నేత ముద్రగడ, ఆయన కుటుంబసభ్యులను ఏ విధంగా హింసించారో మనం చూశామన్నారు. సాక్షాత్తూ చంద్రబాబే స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు ఇచ్చి తమ పార్టీలో చేర్చుకున్నారన్నారు.​ ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా...సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారన్నారు. రాజ్యాంగ నిర‍్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద‍్కర్‌ రాసినా చట్టాలనే అపహాస్యం చేస్తున్నారన్నారు. దళితుల భూములను అక్రమంగా లాక్కుంటున్నారని ఆక్షేపించారు. పట్టా భూములకు 1400 గజాలు, బీసీ, దళితుల భూములకు వెయ్యి గజాలు ఇస్తూ వివక్ష చూపుతున్నారన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నీరుగారుస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయిందన్నారు.  
ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. ఫ్లెక్సీలు, టీవీల్లో గోడలపై జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఐదున్నర కోట్ల ప్రజలను బాబు వెన్నుపోటు పొడిచారన్నారు. అబద్ధాలు చెప్పే నేతల కాలర్‌ పట్టుకుని ప్రశ్నిస్తే మార్పు వస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకురావడానికి కలిసికట్టుగా కృషిచేయాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.
విశాఖలో జరుగుతున్న కొవ్వొత్తుల ర్యాలీకి హాజరు అవుతాను

Written By news on Wednesday, January 25, 2017 | 1/25/2017

ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో జరుగుతున్న కొవ్వొత్తుల ర్యాలీ కి తాను స్వయంగా హాజరు అవుతానని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఇందులో పాల్గొనాలని ఆయన అన్నారు.ఒకవేళ అరెస్టు చేయదలిస్తే దానికి కూడా సిద్దమని ఆయన స్పష్టం చేశారు. జూన్ వరకు చూస్తామని, ఆ తర్వాత తమ పార్టీ ఎమ్.పిలు రాజీనామా చేస్తారని ఆయన ప్రకటించారు.తమిళనాడులో జల్లికట్టు కోసం ముఖ్యమంత్రి స్వయంగా అన్ని పార్టీలను కలుపుకుని డిల్లీ వెళ్లి సుప్రింకోర్టు వద్దన్నదానినే సాదించుకున్నారని ఆయన అన్నారు. ఒక ఆట కోసమే తమిళనాడు అంతా ఒకటైతే , మనకు జీవన్మరణ సమస్య అయిన ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎందుకు అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు. డిల్లీకి చంద్రబాబు అఖిలపక్షాన్ని తీసుకు వెళితే తాము కూడా ఆ బృందంలో ఉంటామని జగన్ తెలిపారు.ఎన్నికల సమయంలో పదిహేను ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు నోరెత్తడం లేదని ఆయన ప్రశ్నించారు.

ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు


హోదా ప్రస్తావన రాకుండా తొక్కేస్తున్నారు?: వైఎస్‌ జగన్‌
హైదరాబాద్‌: ప్రత్యేక హోదా ఆకాంక్షను దేశవ్యాప్తంగా చాటేందుకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు సన్నద్ధమవుతుండగా.. వారి ఆకాంక్షను కట్టడి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా ప్రస్తావనకు రాకుండా సీఎం చంద్రబాబు తొక్కేస్తున్నారని, హోదా ఆకాంక్షను కట్టడి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించడం బాధాకరమని అన్నారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ బుధవారం విలేకరులతో మాట్లాడారు.

గతంలో చాలాసార్లు ప్రత్యేక హోదా అంశంపై తాము పోరాడామని, ధర్నాలు, నిరాహార దీక్షలు చేశామని, ఢిల్లీలోనూ ఆందోళనలు నిర్వహించామని వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. ప్రత్యేక హోదా సాధనకు మద్దతు నిలువాల్సింది పోయి సీఎం అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ విజభన సందర్బంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటను నిలుపుకోలేని పరిస్థితిలో ప్రజాస్వామ్యం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రే రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. హోదాలోని అన్ని అంశాలు కూడా ప్యాకేజీతోపాటు వచ్చాయని, అందుకే హోదా అడుగటం లేదని సీఎం చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. నిజంగా హోదాలో ఉన్న అన్ని అంశాలు మనకు అందాయా? అని వైస్‌ జగన్‌ ప్రశ్నించారు. హోదాలోని అంశాలు, రాయితీలు ఏవీ ఏపీకి రాలేదని స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే 100 శాతం ఆదాయపన్ను మినహాయింపుతోపాటు, ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు, జీఎస్టీ నుంచి మినహాయింపు తదితర పారిశ్రామిక రాయితీలు వస్తాయని, ఈ రాయితీలు ఉంటేనే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఈ విషయం సీఎం చంద్రబాబు తెలుసునని, అందుకే ఆనాడు ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు 15 ఏళ్లు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారని, వెంకయ్యనాయుడు కూడా ఇదే డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు.జగన్ ఇంకా ఏమన్నారంటే...
 • చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు, ఎన్నికల సమయంలో చెప్పిన ఒక్క హామీని అమలు చేయలేదు
 • ఆయన పోరాటం చేయాల్సిన అంశం మీద పోరాటం చేయడు, ఆంధ్రప్రదేశ్‌ ను తాకట్టు పెట్టారు.
 • పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని సాధించుకునేందుకు ఏమీ చేయడం లేదు
 • వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
 • కృష్ణా, గోదావరి జలాల విషయాల్లోనూ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
 • ఏ దేశానికి పోయినా సీఎం సుందర ముఖారవిందాన్ని చూసి పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రారు
 • ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు మాదిరిగా వంద శాతం పారిశ్రామిక రాయితీలు ఇస్తేనే పెట్టుబడులు పెడతారు
 • ఈవెంట్ మేనేజ్ మెంట్ చేస్తూ అబద్దాలతో మోసపుచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు
 • ఏదైనా టెంపరరీ అంటారు, ఎక్కడి వెళ్లినా ప్రైవేటు విమానాల్లోనే వెళతారు
 • నామినేషన్ల పద్ధతిలో పనులు ఇవ్వడం, నచ్చినవారికి టెండర్లు కట్టబెట్టడం చేస్తున్నారు
 • అన్నింట్లోనూ కుంభకోణాలే, వీటి నుంచి బయటపడేందుకు కేంద్రాన్ని ప్రశ్నించరు
 • మూడేళ్లలో తాను చేసిన స్కాములపై విచారణ జరగకుండా జాగ్రత్త పడ్డారు
 • నల్లధనాన్ని సూట్ కేసుల్లో పెట్టి ఇస్తూ అడ్డుగోలుగా ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోయి జైలుకు వెళ్లని సీఎం చంద్రబాబు ఒక్కరే
 • ఓట్లు కోట్లు కేసులో అడ్డంగా దొరికినా పదవికి రాజీనామా చేయని పరిస్థితి ఏపీలోనే ఉంది
 • తన సొంత ప్రయోజనాల కోసం ఏ స్థాయిలో రాజీ పడ్డారో అర్థమవుతుంది
 • పెట్టుబడులు విషయంలో చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్దాలే
 • సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం 2014-15, 2015-16లో ఏటా రూ. 4 వేల కోట్లకు మించి పెట్టుబడులు రాలేదు
 • చంద్రబాబు మాత్రం రూ. 4 లక్షల 68 వేల కోట్ల ఎంవోయులు చేసుకున్నట్టు గొప్పగా చెబుతున్నారు
 • ఎలాంటి ఆహ్వానం లేకపోయినా దావోస్‌ వెళ్లి రూ. 7 కోట్లు ఖర్చు చేశారు
 • పెట్టుబడుల కోసం చంద్రబాబు విదేశీ యాత్రలు చేయక్కర్లేదు. ప్రధాని దగ్గరకు వెళ్లి ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని కోరితే చాలు
 • ముఖ్యమంత్రి హోదాలో చేయాల్సిన పోరాటమైనా  నిజాయితీగా చేయాలి

వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన విజయభాస్కర్‌ రెడ్డి

Written By news on Tuesday, January 24, 2017 | 1/24/2017


వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన విజయభాస్కర్‌ రెడ్డి
హైదరాబాద్: బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ.. ప్రజల వెంట నడుస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. పలువురు నాయకులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ స్వభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయభాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు.

ఇక, మాజీ మంత్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్‌ కూడా వైఎస్సార్‌సీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29న పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పార్టీలో చేరబోతున్నారు.

ప్రత్యేక హోదా కోసం 26న 13 జిల్లాల కేంద్రాల్లో భారీ ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన


♦ ప్రత్యేక హోదాపై మరింత ఉధృతంగా పోరాటం: వైఎస్‌ జగన్‌
♦ పార్టీలకతీతంగా చేయికలుపుదాం.. సమైక్య పోరాటంతో సాధిద్దాం
 రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం రోజున మరో చారిత్రాత్మక పోరాటానికి రాష్ట్రం సన్నద్ధమవుతోంది. ప్రత్యేకహోదా సాధించడం కోసం మరింత ఉధృత పోరాటానికి సమాయత్తం కావాలని యువతకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీలకతీతంగా చేయి కలుపుదామని, సమైక్యపోరాటంతో హోదా సాధిద్దామని ఆయన ఆకాంక్షించారు. ఈనెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా ప్రత్యేకహోదాకు మద్దతు పలకాలని విద్యార్థులకు, ప్రత్యేకించి యువతకు జగన్‌ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం జరిగే ఏ కార్యక్రమానికైనా వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలుస్తుందని జగన్‌ సోమవారంనాడు ట్వీట్‌ చేశారు.

ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ రెండున్నరేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న సంగతి తెల్సిందే. తాజాగా çతమిళనాట జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో యువత ప్రత్యేకహోదా సాధన దిశగా ఉధృతపోరాటానికి ఉరకలు వేస్తోంది. జల్లికట్టు సాంప్రదాయాన్ని రక్షించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టిన తమిళనాడు యువకుల తెగువ తెలుగునాట స్ఫూర్తిని నింపింది. వైఎస్‌జగన్‌ పిలుపుమేరకు 26న రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది యువకులు ప్రత్యేకహోదా సాధన ఉద్యమానికి మద్దతుగా చేయీచేయీ కలపనున్నారు. కొవ్వొత్తుల ప్రదర్శనలో పాలుపంచుకునేందుకు సమాయత్తమవు తున్నారు. ఇదేసమయంలో ప్రత్యేకహోదాపై సీఎం చంద్రబాబు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టుకు ప్రత్యేకహోదాకు సంబంధమేమిటని ఆయన ప్రశ్నించడంతో యువకుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం ముందుండి కేంద్రంపై పోరాడాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి విస్మరించడంపై ఇప్పటికే నిరుద్యోగయువత మండిపడుతోంది.

అందరూ మద్దతు పలకండి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను కోరుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న 13 జిల్లాల కేంద్రాల్లో భారీ ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనలో పాల్గొనటం ద్వారా ప్రజాస్వామికంగా, శాంతియుత పద్ధతిలో ప్రత్యేక హోదా డిమాండుకు మద్దతు పలకాల్సిందిగా విద్యార్ధులకు, యువతకు ప్రత్యేకించి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలని కాంక్షిస్తూ పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని కోరారు. ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారు ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని విన్నవించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలంటే అది ప్రత్యేక హోదా వల్ల మాత్రమే సాధ్యమని, ప్రజాపక్షంగా వైఎస్సార్‌సీపీ రెండున్నరేళ్లుగా అటు పార్లమెంటులోను, ఇటు శాసన సభల్లోను, వినతుల ద్వారా, విభిన్న నిరసన కార్యక్రమాల ద్వారా పోరాటం చేస్తోంది..

రెండున్నరేళ్లుగా అవిశ్రాంత పోరాటం
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండున్నరేళ్లుగా అవిశ్రాంతపోరాటం సాగిస్తుండడాన్ని విద్యార్ధులు, యువకులు నిశితంగా గమనిస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం పార్లమెంటులోనూ వెలుపలా నిరంతరాయంగా పోరాడుతున్నది వైఎస్సార్‌కాంగ్రెస్‌ ఒక్కటేనన్న అభిప్రాయం యువతలో నెలకొంది. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించడమే కాక 2015 ఆగస్టు 10న జగన్‌ దేశరాజధాని ఢిల్లీలో ధర్నా చేసి ప్రత్యేకహోదా అంశం దేశం దృష్టిని ఆకర్షించేలా చేశారు. 2015 జూన్‌ 3,4 తేదీల్లో మంగళగిరిలో చేసిన సమరదీక్ష, అదే ఏడాది అక్టోబర్‌లో నల్లపాడు వద్ద చేసిన ఆమరణదీక్ష ప్రత్యేకహోదా విషయంలో వైఎస్‌ జగన్‌ పట్టుదలను చాటిచెప్పిందని నిరుద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ముఖ్యనగరాలు, పట్టణాలలో వరుసగా జరుపుతున్న యువభేరి సదస్సులతో విద్యార్థులు, నిరుద్యోగ యువతలో చైతన్యం నింపుతున్నారు. ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలను కలుపుకుని నిర్వహించిన రాష్ట్రవ్యాప్త బంద్‌లు ప్రజల్లో ప్రత్యేక హోదా పట్ల ఉన్న ఆకాంక్షను స్పష్టంగా వెల్లడించాయి.

హోదా ఉద్యమకారులపై నిర్బంధం
ప్రత్యేక హోదా కోసం తాను పోరాడకపోగా పోరాడుతున్న యువతపై చంద్రబాబు నిర్బంధం ప్రయోగిస్తున్నారు. బంద్‌లలో పాల్గొన్న యువకులపై కేసులు మోపి వేధిస్తున్నారు. ధర్నాలు, దీక్షలలో పాల్గొననీయకుండా గృహనిర్బంధం చేస్తున్నారు. జగన్‌ నిర్వహిస్తున్న యువభేరి సదస్సులకు అనుమతినివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. యువభేరి సదస్సులకు వెళ్లవద్దని విద్యార్థులను, నిరుద్యోగులను బెదిరిస్తున్నారు. ప్రత్యేకహోదా కోసం పోరాడేవారిపై పీడీ యాక్టు ప్రయోగిస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. యువభేరి సదస్సుకు హాజరయ్యారన్న నెపంతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినాయకులను కాలేజీనుంచి సస్పెండ్‌ చేయడం కలకలం సృష్టించిన సంగతి తెల్సిందే. ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకునేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ప్యాకేజీ ఎక్కడ ఇచ్చారు...?
ప్రత్యేక హోదా.. పార్లమెంటు సాక్షిగా దేశ ప్రధాని ఇచ్చిన హామీ. దానికి కూడా దిక్కులేకపోతే ఎలా అన్నది ఇపుడు రాష్ట్రంలో యువతను వేధిస్తున్న ప్రశ్న. అర్ధరాత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటననే ఓ గొప్ప ప్యాకేజీగా తెలుగుదేశం, బీజేపీ నాయకులు, మంత్రులు ప్రకటిస్తుండడం చూసి అందరూ విస్తుపోతున్నారు. విభజనచట్టంలోని హామీలనే వరుసగా వల్లెవేశారు తప్ప రాష్ట్రానికి కొత్తగా ఇచ్చిన ప్యాకేజీ ఏమిటో ఇప్పటివరకు ఎవరికీ అర్ధం కాలేదు. జాతీయహోదా ఉన్న పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తిచేయాల్సి ఉండగా ఆబాధ్యతను రాష్ట్రప్రభుత్వం తీసుకోవడం ఎందుకో అందరికీ తెలిసిందే. కాంట్రాక్టులు నచ్చినవారికి కట్టబెట్టడం, కమీషన్లు దండుకోవడం కోసమే తప్ప పోలవరం బాధ్యత చంద్రబాబుకు ఎందుకు తీసుకున్నారని యువకులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం కోసమే ప్రత్యేకహోదాను వదులుకున్నానని చంద్రబాబు ప్రకటించడంపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హోదాపై మాటమార్చిన ముఖ్యమంత్రి
ప్రత్యేకహోదాపై పదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాల్సిందేనని ఎన్నికల సభల్లో డిమాండ్‌ చేసిన చంద్రబాబు పదవినధిష్టించగానే మాటమార్చడం చూసి ప్రజలు విస్తుపోయారు. ప్రత్యేకహోదా ఏమన్నా సంజీవనా అని వ్యాఖ్యానించిన నోటితోనే ప్రత్యేక హోదా మన జీవన్మరణ సమస్య అని కూడా చంద్రబాబు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని రాజ్యసభలో అరుణ్‌జైట్లీ ప్రకటించగానే తన రక్తం మరిగిపోయిందని ఊగిపోయిన చంద్రబాబు అర్ధరాత్రి విలేకరుల సమావేశం పెట్టి మరీ జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. అసలు కేంద్రం ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకపోయినా అదేదో పెద్ద ప్యాకేజీ ఇచ్చినట్లు అది ప్రత్యేక హోదా కన్నా మెరుగైనదన్నట్లు చంద్రబాబు గొప్పగా చెబుతుండడం చూసి యువతలో అసహనం పెల్లుబుకుతోంది. విభజన హామీలతోపాటు, ప్రత్యేక హోదాను సాధించడం కోసం ముందుండి పోరాడాల్సిన ముఖ్యమంత్రి ఇలా కేంద్రం ముందు సాగిలపడడమేమిటని యువకులు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. మరోవైపు రాజ్యసభలో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా పదేళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇపుడు అసలు ప్యాకేజీయే లేకపోయినా అది ప్రత్యేకహోదా కన్నా మెరుగైనదని ప్రచారం చేస్తున్నారు. అది కూడా తనవల్లే వచ్చినట్లుగా సన్మానాలు చేయించుకున్నారు. విభజనచట్టంలోని హామీలు తప్ప ఏపీకి కొత్తగా ఒరిగిందేమీ లేకపోయినా అబద్దపు ప్రచారాలు చేస్తుండడంపై యువకులు, ముఖ్యంగా నిరుద్యోగులు రగిలిపోతున్నారు.

చంద్రబాబుకు.. దావోస్‌కు ప్రత్యేక అనుబంధం

Written By news on Monday, January 23, 2017 | 1/23/2017


'చంద్రబాబుకు.. దావోస్‌కు ప్రత్యేక అనుబంధం'
హైదరాబాద్ :
తాను చేస్తున్న విదేశీ పర్యటనలు, పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆయన ఇంతవరకు 13 సార్లు దావోస్ వెళ్లారని, కానీ ఎందుకు వెళ్లారో, ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. చంద్రబాబుకు.. దావోస్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని ఎద్దేవా చేశారు. స్విస్ బ్యాంకు లెక్కలు సరిచూసుకోడానికే ఆయన దావోస్ వెళ్తున్నారా అని ప్రశ్నించారు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశం తరహాలో అమరావతి ఉంటుందని ఆయన చెబుతున్నారని విమర్శించారు. 
 
చంద్రబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అబద్ధాలు చెబుతున్నారని, విదేశాల్లో ఇలాంటి అబద్ధాలు చెబితే 420 కేసు పెట్టి జైల్లోకి తోస్తారని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆకాంక్షను చంద్రబాబు నీరుగార్చుతున్నారని, హోదా కోసం ప్రజలంతా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని అంబటి రాంబాబు చెప్పారు. అందరం కలిసి ప్రత్యేక హోదా సాధిద్దామని పిలుపునిచ్చారు.
 

రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ


పార్వతీపురం: హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో గాయపడిన వారిని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందున్న వారిని ఆయన కలిశారు. బాధితులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అన్నివిధాలా అండగా ఉంటామని భరోసాయిచ్చారు.

బాధితులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారని వైద్యులను అడిగారు. క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స వివరాలను జగన్ కు వైద్యులు వివరించారు. బాధితులు త్వరగా కోలుకునేందుకు మెరుగైన వైద్యం అందిచాలని డాక్టర్లకు జగన్ సూచించారు.


హోదా కోసం ఏ పోరాటమైనా స్వాగతిస్తాం: వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ఏ కార్యక్రమాన్ని, సభను నిర్వహించినా తాము స్వాగతిస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలందరూ ముఖ్యంగా యువత ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు అనుకూలంగా చేపట్టే కార్యక్రమాలకు మద్దతు తెలపాలని, ఈ కార్యక్రమాలను విజయవంతం  చేయాలని ఆయన ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు.

తమిళుల జల్లికట్టు ఉద్యమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఉద్యమ వాతావరణం నెలకొంటున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్నజననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రజా ఉద్యమానికి పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తున్నారు.
Any program or event demanding  is welcome.Request all supporters esp youth to come forward, support & make these events a big success

Popular Posts

Topics :