05 February 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

బ్రాహ్మణితో మాట్లాడించి.. రోజాకు నిర్బంధమా?

Written By news on Saturday, February 11, 2017 | 2/11/2017


బ్రాహ్మణితో మాట్లాడించి.. రోజాకు నిర్బంధమా?
గుంటూరు: జాతీయ మహిళా సదస్సుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి.. మరీ నిర్బంధించిన ఏపీ ప్రభుత్వం తీరును ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర తప్పబట్టారు. రోజాను ఆహ్వానించి మరీ అవమానించారని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబు కోడలు బ్రాహ్మణితో మహిళా సదస్సులో మాట్లాడించి.. ఎమ్మెల్యే అయిన రోజాను ఎందుకు నిర్బంధించారని ఆయన ప్రశ్నించారు.

ఈ సదస్సు మహిళల గౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడేది కాదని ఈ చర్యతో తేలిపోయిందన్నారు. చంద్రబాబు పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా వాడుకోవడం మంచిది కాదని హితవు పలికారు. వెంకయ్యనాయుడు డోలు నాయుడుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, మోదీ గురించి డోలు కొట్టడమే వెంకయ్య పని అని పేర్కొన్నారు.

నన్ను చంపెయ్యరని గ్యారెంటీ ఏంటి?


'నన్ను చంపెయ్యరని గ్యారెంటీ ఏంటి?'
జాతీయ మహిళా సాధికారత సదస్సు అని ఆహ్వానం పంపి విమానాశ్రయంలో తనను ఓ టెర్రరిస్టులా అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. శనివారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. విమానశ్రయంలో ఆపి బాంబులు, తుపాకులు, కత్తులు ఉన్న వారిలా అదుపులోకి తీసుకోవడం దారుణమని అన్నారు. మహిళలపై చంద్రబాబు ప్రభుత్వ చిన్నచూపును వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం తనను చంపెయ్యదని గ్యారెంటీ ఏంటి? అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 

మహిళలకు ఇదేనా మీరిచ్చే ప్రోత్సాహం


మహిళలకు ఇదేనా మీరిచ్చే ప్రోత్సాహం
హైదరాబాద్ :
మహిళా సాధికారతకు తాము కృషి చేస్తున్నామని, వాళ్లకు సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడానికే మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహిస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం.. ఒక మహిళా ఎమ్మెల్యేను ఆహ్వానించి మరీ పోలీసులతో కిడ్నాప్ చేయించడం ఏంటని పీఏసీ చైర్మన్, వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే అడ్డుకుని అక్కడినుంచి పోలీసులతో బలవంతంగా తరలించిన వైనాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఆయన శనివారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒక శాసనసభ్యురాలిని ఆహ్వానించి, కమిటీలో సభ్యురాలిగా కూడా పెట్టి వచ్చినప్పుడు హాజరయ్యేందుకు కూడా అవకాశం లేకుండా కిడ్నాప్ చేసినట్లు తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఫోన్‌లో కెమెరా ఆన్ చేసుకుని మాట్లాడుతుంటే వెనకాల నుంచి పోలీసులు ఆ ఫోన్‌ను కూడా లాగేసుకున్నారని, దానికి విజువల్స్ రూపంలో సాక్ష్యాలున్నాయని చెప్పారు. అసలిది ప్రజాస్వామ్యమేనా, భారతదేశంలోనే ఉన్నామా అని ప్రశ్నించారు. ఇంట్లో పెళ్లికి ఆడవాళ్లను పిలిపించుకుని, అదే పెళ్లికి వాళ్లను రాకుండా మధ్యలో ఆపేస్తే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ఇది అలాగే ఉందని విమర్శించారు. శాసనసభ్యురాలిని అసలు ఎందుకు రానివ్వడం లేదని, మీ భయానికి కారణం ఏంటని సూటిగా ప్రశ్నించారు. 
 
ఇంతకుముందు కూడా రోజాను అసెంబ్లీలో ఏవో వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో సంవత్సరం పాటు సస్పెండ్ చేశారని, కోర్టు నుంచి ఆదేశాలు తీసుకొచ్చినా, మార్షల్స్‌ను పెట్టి కనీసం అసెంబ్లీ ప్రాంగణంలోకి కూడా రానివ్వకుండా ఆపారని అన్నారు. విశాఖపట్నంలో సీఐఐ సదస్సు జరుగుతుంటే, అదే రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సివిల్ పోలీసులు రన్ వే దగ్గరే ఆపేసి అటు నుంచి అటే మళ్లీ బలవంతంగా హైదరాబాద్‌కు పంపేశారని, అసలు ఎందుకంత భయపడుతున్నారని అడిగారు. ఒకరిద్దరు వ్యక్తులు వస్తేనే ఇంత భయపడాల్సిన అవసరం ఏముందని, మీలో ఏవో లోపాలు లేకపోతే భయం ఎందుకని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలను పాల్గొనేందుకు ఉత్తేజపరచడానికి సదస్సు నిర్వహిస్తున్నామన్నారని, ఇదేనా ఉత్తేజపరచడమని నిలదీశారు. ఏదో నియంత పాలన ఉన్న దేశాల్లో జరుగుతున్నట్లుగా ఇక్కడ ఉందని, పోలీసు శాఖను ఇంత దారుణంగా ఎవరైనా వాడుకుంటారా అని అడిగారు. 
 
ఈ సదస్సు వల్ల లాభం ఏమిటంటే.. కేవలం సెల్ఫ్ ప్రమోషన్ మాత్రమేనని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఏమైనా అంటే తాము నిజాయితీగా ఉన్నామంటున్నారని, అమరావతిని చూస్తే అక్కడ చేసేదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా ప్రాజెక్టులలో కమీషన్లు తీసుకోవడం విన్నాం గానీ, కేవలం కమీషన్ల కోసమే కట్టినది పట్టిసీమ ప్రాజెక్టు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. పుష్కరాలకు 3500 కోట్లు ఖర్చుపెట్టామంటున్నారని, ఆ డబ్బుతో లెట్రిన్లు కట్టారా అని ప్రశ్నించారు. 
 
అసలు సర్పంచి నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరినైనా పనిచేయనిస్తున్నారా అని, ఏమైనా అంటే జన్మభూమి కమిటీలు అంటున్నారని మండిపడ్డారు. వితంతువులకు పింఛను కావాలంటే ఆ కమిటీ వాళ్లు లంచాలు తీసుకుంటున్నారని, రుణాలలో కూడా పర్సంటేజిలు అడుగుతున్నారని.. ఇలా అవినీతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లిపోయారని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిజంగా మనం సరిగా పాలన చేస్తే ఫొటోలు జేబులో పెట్టుకోవక్కర్లేదని, అవి ప్రజల హృదయాల్లో ఉంటాయని చెప్పారు. ఇప్పుడు చేస్తున్న పనులకు ప్రభుత్వం నూరుశాతం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రజలకు అన్నిరకాలుగా ఇబ్బందులు కలిగించి, వాటిని తారస్థాయికి తీసుకెళ్తేనే గతంలోనూ విప్లవాలు వచ్చాయని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని తెలిపారు. ఓటు ద్వారా ప్రజలు నూటికి నూరుశాతం ఆ వ్యతిరేకతను చూపిస్తారని అన్నారు. 

తెలియని రోజా ఆచూకీ!


పోలీసులు అదుపులోకి తీసుకున్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా ఆచూకీ తెలియడం లేదు. గుంటూరు జిల్లా మేడికొండూరు దాటిన తర్వాత నుంచి ఫోన్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయారు. పేరేచర్ల జంక్షన్ వద్ద పోలీసులు ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. మధ్యలో ఒకచోట రోజా పెద్దగా కేకలు పెట్టారని, రక్షణ కోసం పోలీసు వాహనం నుంచి కిందకు దిగేందుకు కూడా ప్రయత్నించారని కొందరు అంటున్నారు. ఆ ప్రయత్నంలో ఆమె కింద పడిపోయారని, కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని చెబుతున్నారు. ఆ సమయంలో పోలీసులు బలవంతంగా ఆమెను మళ్లీ వాహనంలోకి తోసేశారని సమాచారం. తన పట్ల పోలీసుల దుష్ప్రవర్తనపై రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు.
విజయవాడలో బస చేయాల్సిన హోటల్‌కు తీసుకెళ్తున్నామని చెప్పి ఆమెను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మేడికొండూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు చెప్పినా, తీరా అక్కడ చూస్తే ఆమె లేరు. మళ్లీ రోజాను సత్తెనపల్లి వైపు తీసుకెళ్తున్నట్లు సమాచారం అందింది. ఎక్కడో గన్నవరం విమానాశ్రయం నుంచి ఇప్పుడు సత్తెనపల్లి వరకు అంటే.. దాదాపు 90 కిలోమీటర్లకు పైగా దూరం ఒక మహిళా ఎమ్మెల్యేను ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకట్లేదు. 
పోలీసులే రోజాను కిడ్నాప్ చేసి ఉంటారని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై డీజీపీ సాంబశివరావును కలిసేందుకు నాయకులు వెళ్తున్నారు. మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రోజాను పోలీసులు అక్కడే అడ్డుకుని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను ఎక్కడకు తీసుకెళ్తున్నదీ కూడా చెప్పకుండా పోలీసు వాహనంలో తరలించారు. 

విద్యార్థినికి సమాధానం చెప్పలేకపోయిన బాబు


మీ పథకాలేవీ అమలవట్లేదు
ప్రశ్నించిన ఓ విద్యార్థిని.. సమాధానం దాటేసిన చంద్రబాబు

సాక్షి, అమరావతి : ఎన్నికలప్పుడు అది చేస్తాం.. ఇది చేస్తాం అని హామీ ఇచ్చే నేతలు ఎన్నికలయ్యాక వాటి గురించి పట్టించుకోరంటూ ఒక విద్యార్థిని నేరుగా సీఎం చంద్రబాబును ప్రశ్నించడం జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సులో కలకలం రేపింది. ఇలాంటి విషయాలు చర్చించడానికి ఇది వేదిక కాదంటూ బాబు ఆ విద్యార్థిని  ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటవేశారు. జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సులో శుక్రవారం సాయంత్రం  9 రకాల అంశాలపై బృంద చర్చలు జరిగాయి. ఈ  సదస్సుకు హాజరైన విద్యార్థినులు, ప్రతినిధులు వంద మంది ఒక బృందంగా ఏర్పడి తమకు కేటాయించిన అంశంపై గంట పాటు చర్చించారు.

ఆ సమయంలో సీఎం ఒక బృందం వద్దకు వచ్చి చర్చ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని తమ గ్రామ పాఠశాలలో, తమ ప్రాంతంలోని కాలేజీలో అనేక సమస్యలున్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నట్టు చెబుతున్నా, అవేవీ అమలు కావడం లేదన్నారు.ఈ ప్రశ్నకు సీఎం బదులిస్తూ.. మహిళల సాధికారతకు రాష్ట్రంలో ఒక పెద్ద సదస్సును ప్రభుత్వ పరంగా  ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థినులు, మహిళలు తమ సమస్యలపై గట్టిగా ప్రశ్నించేందుకు ఉపయోగించుకునే అవకాశం కల్పించామన్నారు. ఇప్పుడు అడిగిన ప్రశ్నలను ఇంకొక వేదికపై చర్చిద్దామని  జవాబు దాటవేశారు.

ఎమ్మెల్యే రోజా నిర్బంధం, విజయవాడ తరలింపు


ఎమ్మెల్యే రోజా నిర్బంధం, విజయవాడ తరలింపు
మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు వైఎస్‌​ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆహ్వానించి గన్నవరం ఎయిర్ పోర్టులోనే నిర్బంధించారు. సదస్సులో పాల్గొనేందుకు ముందుగానే అందరు ఎమ్మెల్యేలలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆమె.. శనివారం గన్నవరం చేరుకున్నారు. అయితే ఎయిర్‌ పోర్టులో పోలీసులు రోజాను అడ్డుకున్నారు. దలైలామా అక్కడకు వస్తున్నారని సాకుగా చూపించి ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే పోలీసులు అడ్డుకుని ఒక గదిలో బంధించారు. ఆమె చుట్టూ పోలీసులు మోహరించి బయటకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు.
 
గంటసేపు ఎయిర్‌ పోర్టులోనే నిర్బంధించి.. ఆ తర్వాత పోలీసు బందోబస్తుతో రోజాను విజయవాడకు తరలించారు. సదస్సులో కూడా ఆమెను అడ్డుకునేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. వాస్తవానికి  ప్రభుత్వ అధికారులే మహిళా సదస్సుకు రమ్మంటూ ఆహ్వానించి, పాస్ జారీ చేశారు. తీరా సదస్సు కోసం విమానాశ్రయం వరకు వచ్చిన తర్వాత అడ్డుకున్నారు. ఒక వైపు మహిళల హక్కుల కోసం పార్లమెంటేరియన్ల సదస్సు నిర్వహిస్తూ.. మరోవైపు మహిళా ఎమ్మెల్యేను నిర్బంధించడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపణలు వస్తున్నాయి.
 
డీజీపీని నిలదీస్తాం: జోగి రమేష్‌
ఎమ్మెల్యే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని వైఎస్‌ఆర్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ విమర్శించారు. మహిళా పార్లమెంట్‌ సదస్సులో పాల్గొనాలంటూ ఆహ్వానించి, పాస్‌ ఇవ్వడంతోనే ఆమె ఇక్కడకు వచ్చారని గుర్తు చేశారు. ఎయిర్‌ పోర్టులో రోజాను అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై డీజీపీని నిలదీస్తామన్నారు.

ఆరు నెలల్లో లేపేస్తానంటూ ఏపీ మంత్రి తనయుడు వార్నింగ్

Written By news on Friday, February 10, 2017 | 2/10/2017


మంత్రి బొజ్జల తనయుడి నుంచి నాకు ప్రాణహాని!
తిరుపతి: వైఎస్ఆర్ సీపీ నేతను ఆరు నెలల్లో లేపేస్తానంటూ ఏపీ మంత్రి తనయుడు వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి బెదిరింపు రాజకీయాలకు తెర తీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డిపై సుధీర్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో సహా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆరు నెలల్లో లేపేస్తానని సుధీర్ రెడ్డి తనకు వార్నింగ్ ఇచ్చాడని, ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎస్పీని కోరారు.

టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోలేదని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ గతంలో శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో భ్రమరాంబపై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. 'ఆలయంలో పాలనా వైఫల్యాలపై మాకు సూచనల వరకు ఒకే గానీ మీరే స్వయంగా తనిఖీలు చేయవద్దు' అంటూ మంత్రి సతీమణికి ఈవో స్పష్టం చేయగా.. బృందమ్మ మాత్రం అదే తీరుగా వ్యవహరించడంతో ఈవో సెలవుపై వెళ్లడానికి సిద్ధం కావాల్సి వచ్చింది. తరచుగా టీడీపీ నేతలు, మంత్రులు.. వారి సన్నిహితులు మహిళలు, అధికారులపై దాడులకు పాల్పడుతూ రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/complaint-against-minister-bojjala-gopalakrishna-son-sudhir-reddy-448768?pfrom=home-top-story

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శిగా శేషుబాబు


ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్న కు మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ సమాధానం


పోలీస్‌స్టేషన్‌లా.. టీడీపీ ఆఫీసులా?

Written By news on Wednesday, February 8, 2017 | 2/08/2017


– టీడీపీ నాయకులు చెప్పిందే వేదంగా పంచాయితీలు
– మండిపడ్డ మాజీ ఎంపీ అనంత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

అనంతపురం సెంట్రల్‌ : జిల్లాలో పోలీసుస్టేషన్‌లు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలు మండిపడ్డారు. ధర్మవరం పోలీసుల దాడిలో గాయపడి అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకులను వారు పరామర్శించారు. ఏ తప్పు చేయకున్నా తమను అన్యాయంగా సీఐ హరినాథ్‌బాబు కేసులో ఇరికిస్తున్నారని బాధితులు సాయికుమార్, ప్రకాష్ , ఇస్మాయిల్, పవన్‌కుమార్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులను కూర్చోబట్టి వారి కళ్లెదుటే తమను చితకబాదారని కన్నీటి పర్యంతమయ్యారు.

అనంతరం అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలు మాట్లాడుతూ జిల్లాలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సీఐలు, ఎస్‌ఐలు జిల్లా ఎస్పీ, డీజీపీ ఆదేశాలు కాకుండా స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారని విమర్శించారు. వారు తెచ్చిన పంచాయితీలను సెటిల్‌మెంట్స్‌ చేస్తూ చెరిసగం పంచుకుంటున్నారన్నారు. దీని వలన జిల్లాలో శాంతి భద్రతలకు భంగం వాటిళ్లుతోందని అన్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, వామపక్ష నేతలను అణగదొక్కడమే లక్ష్యంగా టీడీపీ నాయకులు, పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు.

అధికార పార్టీ నాయకులకు పోలీస్‌స్టేషన్‌లు పంచాయితీ కార్యాలయాలుగా మారాయన్నారు. ఎలాంటి తప్పు చేయకున్నా పోలీస్‌స్టేషన్‌లకు తీసుకొచ్చి చితకబాదుతున్నారని తెలిపారు. అదే టీడీపీ నేతలు ఏం చేసినా చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌లను గాడిలో పెట్టాలని ఇప్పటికే జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఇదే విధంగా కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.  ధర్మవరం పోలీసుల చేతిలో గాయపడిన యువకులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబే అసలైన ఫ్యాక్షనిస్టు


చంద్రబాబే అసలైన ఫ్యాక్షనిస్టు
ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

 రాష్ట్రంలో అసలైన ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబును ఎన్టీఆర్‌ గాడ్సేతో పోల్చారని, దానికన్నా జగన్‌ తక్కువ మాట (ముఖ్య‘కంత్రి) అన్నారని టీడీపీ నేతలు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులపై, ప్రత్యేకించి రాయలసీమపై ప్రభుత్వ వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఉరవకొండ ధర్నాతో టీడీపీ పునాదులు కదులుతున్నాయన్న భయంతో ఎప్పుడూ కలవని టీడీపీ నేతలు వైఎస్‌ జగన్‌ను ఫ్యాక్షనిస్టుతో పోల్చడంపై అగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ‘మనసులో మాట’ అనే పుస్తకంలోని మాటల్ని మాత్రమే జగన్‌ ఉదహరించారని, దాన్ని మంత్రులు తప్పుపట్టడం హాస్యాస్పదమన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కానీ, ఆయన కుమారుడు  జగన్‌ గానీ ఏది చెబుతారో, అది చేసి చూపిస్తారని చెప్పారు. అంతే కానీ టీడీపీ నేతల్లా ప్రజల సొమ్మును దోచుకుంటూ ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేయరని విమర్శించారు.  ప్రాజెక్టులన్నీ వైఎస్సార్‌ పుణ్యమే అని ప్రకాష్‌ రెడ్డి స్పష్టం చేశారు.   తెలుగుగంగను ఎన్టీఆర్‌ మానసపుత్రికగా చెప్పుకుంటున్న టీడీపీ నేతలు ఆ ప్రాజెక్టులో అత్యధిక శాతం పనులు చేసింది వైఎస్సార్‌ అనే సంగతి తెలుసుకుంటే మంచిదన్నారు.

పచ్చని పంటపొలాలు.. ఫ్యాక్టరీలకా?

Written By news on Monday, February 6, 2017 | 2/06/2017


పచ్చని పంటపొలాలు.. ఫ్యాక్టరీలకా?: వైఎస్‌ జగన్‌
అనంతపురం: ప్రైవేటు ఫ్యాకర్టీకి భూములు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం రైతులను బలి చేస్తున్నదని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని అమ్మవారిపల్లెలో రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. నిన్నమొన్నటివరకు ఈ ప్రాంతంలో నీళ్లులేక రైతులు నానా అవస్థలు పడేవారని, ఇప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్‌ రావడంతో వ్యవసాయం చేసుకొని బాగుపడుదామనుకుంటున్న రైతుల కుటుంబాలకు చంద్రబాబు సర్కారు తీవ్ర అన్యాయం చేస్తున్నదని అన్నారు. రిజర్వాయర్‌ కింద ఉన్న పచ్చని పంటపొలాలను ప్రైవేటు ఫ్యాక్టరీలకు ఇవ్వడం ధర్మమా? అని ఆయన ప్రశ్నించారు.

సస్యశామలంగా ఉన్న పొలలాను స్మశానంగా
రైతుల నుంచి ప్రభుత్వం భూములను బలవంతంగా లాక్కుంటున్నదని, 70, 80 సంవత్సరాల కిందట డీకేటి పట్టాగా ఈ భూములను ఇచ్చారని, ఇప్పుడు ఈ భూములు మీవి కావు.. ప్రభుత్వానివని బెదిరించి బలవంతంగా లాక్కుంటున్నారని రైతులు ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌కు చెప్పారు. ఈ భూములు లాక్కుంటే తాము ఇక్కడినుంచి వలసపోవాల్సి ఉంటుందని, తమ జీవితం అగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ కింద ఉన్న సస్యశామలంగా ఉన్న భూములను లాక్కొని స్మశానంగా మారుస్తున్నారని మహిళా రైతు ప్రమీలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగాల్‌లో చేసిందే ఇక్కడా చేస్తాం!
తాతల కాలం నుంచి రైతులు సాగుచేసుకుంటున్న పొలాలను ప్రైవేటు ఫ్యాక్టరీకి ధారాదత్తం చేయడం న్యాయం కాదని వైఎస్‌ జగన్‌ అన్నారు. రైతుల నుంచి రాష్ట్ర సర్కారు బలవంతంగా భూములు లాక్కోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భూముల విషయంలో బాధిత రైతులకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, అవసరమైతే ధర్నాలు చేస్తుందని, కోర్టులకు కూడా వెళుతుందని ఆయన స్పష్టం చేశారు. రెండేళ్లు ఓపిక పడితే ఎన్నికలు వస్తాయని, ఎన్నికల్లో మన ప్రభుత్వమే వస్తుందని వైఎస్‌ జగన్‌ అన్నారు. అప్పుడు బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం చేసినవిధంగానే బలవంతంగా రైతుల నుంచి లాక్కున్న భూములను తిరిగి వారికి ఇచ్చేస్తామని చెప్పారు. భూముల విషయంలో ఎవరూ అధైర్య పడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన భరోసా ఇచ్చారు.

బాలునాయక్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ
ఇటీవల పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో గుండెపోటుతో మరణించిన రైతు బాలు నాయక్‌ కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. భూములు కోల్పోతున్నామన్న బాధతో భూసేకరణ సమావేశంలోనే బాలు నాయక్‌ కుప్పకూలారు. మాక్కాజీపల్లిలోని ఆయన కుటుంబసభ్యులను కలిసి.. వైఎస్‌ జగన్‌ వారికి ధైర్యం ఇచ్చారు.
 

కాలువల ద్వారా అమెరికాకు కూడా నీళ్లిస్తామని అనగల గొప్ప ముఖ్యమంత్రి..

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాదు.. ముఖ్య కంత్రీ అని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గానికి హంద్రీ-నీవా నీళ్లు ఇవ్వాలని కోరుతూ ఆయన నేతృత్వంలో అనంతపురం జిల్లా ఉరవకొండలో మహా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 
 • అనంతపురం జిల్లా కరువు, కాటకాలకు పుట్టినిల్లు
 • వలసలు, ఆత్మహత్యలు రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలోనే ఉన్నాయి
 • రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో అతి తక్కువ వర్షపాతం ఉండేది. మనం ఇప్పుడు ఆ జిల్లాతో పోటీ పడుతున్న అధ్వాన పరిస్థితిలో ఉన్నాం
 • ఈ జిల్లాకు సంజీవని మాదిరిగా ఏమైనా ఉందా అంటే, ఈ జిల్లా ప్రజలను ఆదుకోవాలంటే దీనికి హంద్రీనీవా సుజల స్రవంతి ఒక్కటే మార్గం
 • దీనికోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం
 • ఆ ప్రాజెక్టు శ్రీశైలం నుంచి 40 టీఎంసీల నీటితో రాయలసీమ నాలుగు జిల్లాలకు కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 
 • దీనికి సంబంధించి 6800 కోట్లు ఖర్చవుతాయి. దీనికి దివంగత నేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని పూర్తి చేయాలన్న నిజాయితీ కనిపించింది. 
 • అప్పట్లో దీనికి 4వేల పైచిలుకు కోట్ల నిధులను కేటాయించారు, పనులు చేశారు
 • హంద్రీ నీవా సుజల స్రవంతిలో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. 
 • మిగిలిన పది శాతం పనులు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను ఇంతవరకు ఈ ప్రభుత్వం చేయకపోవడంతో రైతాంగం అల్లాడుతోంది
 • పది శాతం పనులు పూర్తి చేసి ఉంటే హంద్రీనీవా మొదటి దశ పూర్తయ్యేది
 • పది లక్షల మందికి సాగునీరు అందించే పరిస్థితి ఉండేది
 • ఈ ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే 80 వేల ఎకరాలకు సాగునీరు అందేది
 • ఈవాల్టికీ కూడా చంద్రబాబు సీఎం అయ్యి మూడేళ్లవుతున్నా ఈ పది శాతం పనులు పూర్తి కాక మనం కొట్టుమిట్టాడుతున్నాం
 • గతంలో చూస్తే, ఇదే చంద్రబాబు తొమ్మిదేళ్లు పాలించారు
 • అప్పుడు ఇదే ప్రాజెక్టుకు తొమ్మిదేళ్లలో కలిపి కేవలం 24 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు
 • అవి ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోలేదు
 • ఆయన హంద్రీనీవా ప్రాజెక్టు గురించిపట్టించుకోలేదు, ఒక్క కిలోమీటరు కాల్వ తవ్వలేదు, ఒక్క లిఫ్టు పెట్టలేదు, ఒక్క ఇటుక కూడా పెట్టిన పాపాన పోలేదు
 • కానీ ఇదే చంద్రబాబు ఎన్నికలు ఉన్నప్పుడల్లా 1996లో ఉరవకొండకు వచ్చాడు
 • అప్పుడు 5.5 టీఎంసీలకు దీని సామర్థ్యాన్ని కుదిస్తూ, ఈ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు
 • మళ్లీ 99లో ఎన్నికలు వచ్చినప్పుడు ఆత్మకూరుకు వచ్చి, దీనికి రెండోసారి శంకుస్థాపన చేశారు
 • ఒకో ప్రాజెక్టుకు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వచ్చి టెంకాయలు కొట్టి వెళ్లిపోతారు
 • ఎన్నికలు అయిపోయాక అనంతపురం జిల్లా రైతులు ఎటుపోతే నాకేంటని ఆలోచన చేస్తారు
 • ఈయనకు రైతుల మీద ప్రేమలేదు, నీటిపారుదల ప్రాజెక్టుల మీద అంతకన్నా లేదు
 • ఇదే చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉండగా 'మనసులో మాట' అనే పుస్తకం రాశారు
 • ఆ పుస్తకంలో ఆయన ఏం రాశారో తెలుసా.. 'ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టుల మీద కోట్లు ఖర్చుపెడితే రైతుల నుంచి వచ్చే నీటితీరువా కేవలం లక్షల్లోనే ఉంటుంది, అందుకే ప్రాజెక్టులు కట్టడం వేస్ట్' అని రాశారు
 • అంత గొప్ప ముఖ్యమంత్రి మన చంద్రబాబు
 • ఇదే చంద్రబాబుకు హంద్రీ నీవా మీద ఎంత ధ్యాస ఉందని ఈ మూడేళ్లు చూద్దాం
 • హంద్రీ నీవా పూర్తి కావాలంటే యుద్ధప్రాతిపదికన 2వేల కోట్లు కేటాయించి పనులు చేయాలి
 • 2014-15లో దీనికి 100 కోట్లు మాత్రమే
 • 15-16లో ఇచ్చింది 380 కోట్లు
 • 16-17లో కేటాయింపులు చేసింది 504 కోట్లు మాత్రమే
 • ఇదే చంద్రబాబుకు ఒక్క విషయం అర్థం కావడం లేదు
 • ఈ సంవత్సరం ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు హంద్రీ నీవాలో మోటార్లు ఆడించారు. అందుకు 359 కోట్ల కరెంటు బిల్లులు వచ్చాయి. 
 • మరి ఈయన కేటాయించిన 500 కోట్లలో ప్రాజెక్టు పనులకు ఏమిస్తారని అడుగుతున్నా
 • ఈయనకు ప్రాజెక్టుల మీద ధ్యాస లేదు, కాంట్రాక్టర్లతో కక్కుర్తి పడి లాలూచీ పడతారు
 • కమీషన్ల కోసం కుమ్మక్కు అవుతారు
 • ప్యాకేజి నెం. 36 అని ఒకటుంది. అందులో పెండింగు పనులు 35 కోట్లు
 • కాంట్రాక్టర్‌ నుంచి ఆ పనులు తీసేశారు. దానికి మళ్లీ అంచనాలు వేయించి 363 కోట్ల కింద తనకు నచ్చినవారికి ఇచ్చే కార్యక్రమానికి పూనుకుంటున్నారు
 • ఇదే చంద్రబాబుకు ప్రాజెక్టుల మీద ఎంత చిత్తశుద్ధి ఉందంటే, పక్కన గాలేరు నగరి ప్రాజెక్టు ఉంది. దానిలో 11 కోట్ల పనులు మిగిలాయి.
 • వాటికి రీ ఎస్టిమేట్ వేయించి తనవాళ్లతో పనులు పూర్తి చేయించారు. వాటికి 110 కోట్లకు అంచనాలు వేయించారు
 • ఇంతటి దారుణంగా చంద్రబాబు పాలన సాగుతోంది
 • మొట్టమొదటి నుంచి ఆయన పాలన ఇంతే
 • ఆయనకు ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేస్తూ మేనిఫెస్టో పెడతారు
 • ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు.. కలెక్షన్ మేనిఫెస్టో తీసుకొస్తారు
 • కాంట్రాక్టర్ల నుంచి ఎలా డబ్బులు రావాలని చూస్తారు
 • ఇదే చంద్రబాబు హంద్రీ నీవా గురించి జిల్లాలో చాలాసార్లు చెబుతారు
 • హంద్రీనీవా ప్రాజెక్టు ఆయనే కట్టినట్లు ఫొటోలకు పోజులిస్తారు
 • వచ్చిన ప్రతిసారీ ఈ ప్రాజెక్టు తన కలల్లోకి వస్తోందని, దానికోసం ఎంతో కష్టపడుతున్నానని, ఇక్కడే మంచం వేసుకుని పడుకుంటున్నానని అంటారు
 • కానీ వాస్తవంలో ఈ ప్రాజెక్టుకు దివంగత నేత రాజశేఖరరెడ్డి హయాంలో 4వేల కోట్లతో మొదటి దశలో 90 శాతం పనులు పూర్తయ్యాయి
 • 2012లోనే కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా, ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు
 • వాటన్నింటినీ ప్రజలు మర్చిపోతారనుకుని, కొత్తగా మళ్లీ వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తారు
 • ప్రాజెక్టులు కట్టినవాళ్లు గొప్పవాళ్లా.. వాటి వద్దకు వెళ్లి గేట్లు ఎత్తేవాళ్లు గొప్పవాళ్లా అని అడుగుతున్నా
 • మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ తీసుకున్నారు
 • ఇదే హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయండని, అలా అయితే ప్రతి ఎకరాకు నీళ్లొస్తాయని, అనంతపురం జిల్లాలోనే 1.18 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయని విశ్వేశ్వరరెడ్డి ధర్నాలుచేస్తూ, దీక్షలు చేస్తూ చంద్రబాబును నిలదీశారు
 • దానికి ఇదే చంద్రబాబు.. తన ప్రాధాన్యతలు తమకున్నాయని, మీరు చెప్పినట్లు మేం చేయాలా అని రైతుల కళ్లల్లో మట్టికొట్టారు
 • నేను ఇక్కడకు రావడానికి ముందు మంత్రులు చెరువుల దగ్గర నిలబడి, కొందరు అందులో ఈతలు కొట్టారు
 • 30 టీఎంసీల నీళ్లు ఇచ్చినట్లు చెప్పారు. అలా ఇస్తే కనీసం 4 లక్షల ఎకరాల పంటలు సస్యశ్యామలంగా ఉండాలి
 • నిజంగా అలా అయితే 63 మండలాలు కరువు మండలాలుగా ఎందుకు ప్రకటించారని ప్రశ్నిస్తున్నా
 • పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, వెలిగొండ ప్రాజెక్టులు చూసుకున్నా చేసింది ఇంతే
 • పబ్లిసిటీ ఎక్కువ, రైతులకు మేలు చేయలేదు
 • గతంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి కరువు పరిస్థితులున్నాయని, ఈ ఒక్క జిల్లానుంచి నాలుగైదు లక్షల మంది వలసలు వెళ్తున్నారని, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను ఆదుకోవాలని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించారు.
 • ఎస్ఆర్ఎంసీని 11వేల క్యూసెక్కుల నుంచి మరో 44వేలు పెంచుతూ 55వేల క్యూసెక్కులకు తీసుకెళ్లారు
 • రైతులకు తోడుగా ఉండేందుకు 85 శాతం పనులు పూర్తి చేశారు
 • ఆ మిగిలిన 15 శాతం పనులు ఇంకా పూర్తికాలేదు
 • ఏ ప్రాజెక్టు చూసినా మిగిలిన 20 శాతం పనులను మూడేళ్లలో చంద్రబాబు చేసిన పాపాన పోలేదంటే ఈయన అసలు ముఖ్యమంత్రేనా అని అడుగుతున్నా
 • ఈయన హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు..
 • ఆయన చంద్రబాబు కన్నా బొంకడంలో నాలుగురెట్ల పీహెచ్‌డీ ఎక్కువ తీసుకున్నారు
 • అవకాశం వచ్చినప్పుడు ఏదైనా చెరువు కనిపిస్తే ఈతలు కొట్టి, తానే నీళ్లు తెచ్చానంటారు
 • గతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్ఆర్ పెంచితే, ఇదే మంత్రి ప్రకాశం బ్యారేజి మీద అప్పట్లో ధర్నాలు చేశారు
 • అదే నాయకుడిని చంద్రబాబు మంత్రి చేశారు. వీళ్లకు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల మీద ప్రేమ ఉందని చెవిలో పూలు పెడతారు
 • వైఎస్ఆర్ బతికుంటే హంద్రీనీవా పనులు 2011-12 ప్రాంతంలోనే పూర్తయ్యేవి, వలసలు వెళ్లాల్సి వచ్చేదికాదు, రైతుల పొలాలన్నీ సస్యశ్యామలం అయ్యేవి
 • ఆయన చనిపోయాక రైతులకు తోడుగా నిలబడే మనిషి కరువయ్యాడు
 • డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు పూర్తయితే లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిసి కూడా పట్టించుకోవట్లేదు
 • రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం దుస్థితి ఏంటంటే.. శ్రీశైలంలో 854 అడుగులపైన 120 రోజులు నీటిమట్టం ఉంది. 
 • మన్యాల ప్రాజెక్టు 800 అడుగుల్లో పనిచేస్తుందని తెలిసినా, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలు ఈరోజుకూ కరువు ఛాయల్లో ఎందుకున్నాయని ప్రశ్నిస్తున్నా
 • తుంగభద్ర డ్యాం పూడిక వల్ల నీటిని తీసుకొచ్చే హైలెవెల్ కెనాల్‌లో నీరు తగ్గిపోయింది
 • దీనిపై ఏం చేస్తున్నారని ప్రతి సంవత్సరం అడుగుతున్నాం అయినా పట్టించుకోరు
 • అనంతపురం జిల్లా రైతులు కేరళ వెళ్లి భిక్షాటన చేస్తున్నారంటే చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి
 • ఉపాధి హామీ పనులు కూడా వారికి ఇవ్వడం లేదు
 • రాజశేఖరరెడ్డి హయాంలో 98 శాతం వరకు లేబర్ కాంపొనెంట్ పెట్టేవారు
 • 150 రోజుల పనులు కూడా కల్పించిన సందర్భాలున్నాయి
 • ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక, ఉపాధి హామీ పనులు నత్తనడకన సాగుతున్నాయి
 • కేరళకు వెళ్లి రైతులు అడుక్కుంటున్నా 40 శాతానికి మించి లేబర్ కాంపొనెంట్ పెట్టడంలేదు
 • చంద్రబాబు పుణ్యమాని రైతులకు రుణమాఫీలు అమలు కావడం లేదు 
 • బ్యాంకులలో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు
 • బాబు సీఎం అయ్యారు గానీ, బంగారానికి బ్యాంకులు వేలం పాటలు పెడుతున్నాయి
 • ఆడవాళ్లని చూడకుండా పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెళ్లను వదల్లేదు
 • తానే ఈ సంఘాలను కనిపెట్టానని, వాళ్ల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు
 • చంద్రబాబు రైతులను, ఆడవాళ్లను, చివరకు చదువుకునే పిల్లలను కూడా వదల్లేదు
 • జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు
 • జాబ్ ఇవ్వలేకపోతే ఇంటింటికీ 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు
 • చంద్రబాబు తనకు 64వేల బాకీ ఉన్నాడని విజయనగరంలో ఒక యువకుడు అన్నాడు
 • ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు ఎక్కువ. అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులు దాదాపు 25 మంది చనిపోయారు
 • ప్రతి ఇంటికీ వెళ్లి వాళ్లకు చేతనైనంత వరకు తోడుగా ఉండే ప్రయత్నం చేశాను
 • ఆరోజు ముఖ్యమంత్రి కావడానికి.. చేనేత కార్మికుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని, వారిని నట్టేట ముంచారు
 • ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి లక్షన్నర పెట్టి షెడ్డు, ఇల్లు కట్టిస్తానన్నారు, అదీ చేయలేదు
 • వడ్డీ లేకుండా మరో లక్ష రుణం ఇప్పిస్తానన్నారు
 • చంద్రబాబు సీఎం అయ్యేనాటికి ప్రతి కుటుంబానికి 600 సబ్సిడీ వచ్చేది, దాన్ని కూడా ఎత్తేశారు
 • రైతులకు రుణమాఫీ కాక.. వాళ్లు బ్యాంకులకు పోయే పరిస్థితి లేదు
 • చంద్రబాబు రానంతవరకు రైతులకు వడ్డీ లేకుండా రుణాలు వచ్చేవి
 • ఇప్పుడు అపరాధ వడ్డీలు కట్టాలని నోటీసులు వస్తున్నాయి
 • రుణాలు రెన్యువల్ కాలేదు కాబట్టి ఇన్సూరెన్స్ కూడా రావడంలేదు
 • దేశంలో రాజకీయాల్లో చాలామంది నాయకులను చూశాం. ప్రతి ఒక్కరికీ కొన్ని గుణగణాలుంటాయి
 • చంద్రబాబుకు ఉన్న విచిత్రమైన గుణగణాలు తెలుసా.. ఆయన సీఎం అవుతూనే ఆయనతోపాటు కరువు వచ్చేస్తుంది
 • కరువొచ్చినా రైతులకు ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ అంతంతగానే వస్తాయి
 • రైతులకు కొత్త రుణాలు రావు
 • రెయిన్ గన్స్ అంటూ వర్షంతో యుద్ధమని, నాలుగు రోజుల్లో కరువును జయించేశానని అంటారు
 • ఆయన కేంద్రంతో ఎప్పుడూ స్నేహం చేసి, రాష్ట్రంతో యుద్ధం చేస్తాడు
 • ఈయన సీఎం అయితే కాంట్రాక్టర్లతో స్నేహం చేసి, రైతులతో యుద్ధం చేస్తాడు
 • ఈయన ఎన్టీఆర్‌తో కయ్యం ఆడతాడు, బాలకృష్ణతో వియ్యం ఆడతాడు
 • మోదీగారు బలహీనంగా ఉంటే ఆయనతో ఢీ అంటాడు.. ఆయన బలంగా ఉంటే ఆయన కాళ్లు పట్టుకుని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తాడు
 • అందితే కేసీఆర్ జుట్టు పట్టుకుంటారు, దొరికిపోతే కేసీఆర్ కాళ్లు పట్టుకుంటారు
 • అటునుంచి అటు పై రాష్ట్రం నీళ్లు ఎత్తుకుపోతున్నా కనీసం అడగడానికి కూడా ధైర్యం చేయడు
 • కోతలు కొండంత కోస్తాడు.. చేతలు చూస్తే చీమ తలకాయంత కూడా చేయడు
 • ఈయన పార్టీ పేరు తెలుగుదేశం, పొద్దున్న లేస్తే విదేశాల్లోనే కనిపిస్తాడు
 • ఒకరోజు సింగపూర్, దావోస్, చైనా, జపాన్.. ఇలా అంటారు
 • ఏ దేశానికిపోతే దాన్ని ఇక్కడకు తెచ్చేస్తానంటారు
 • అవినీతి మీద యుద్ధం చేస్తామంటారు.. చేసేది మాత్రం పూర్తిగా అవినీతి రాజ్యం
 • ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అంటారా.. ముఖ్య కంత్రీ అంటారా అని అడుగుతున్నా
 • చంద్రబాబు గుణగణాలు చెప్పాల్సి వస్తే మోసం, కుతంత్రం, నయవంచన, అవినీతి, దురాశ, దుర్మార్గం, దుష్టత్వం, ప్రలోభం లాంటివన్నీ కేవలం చంద్రబాబులోనే కనిపిస్తాయి
 • ఇవన్నీ ఉన్నా తాను చాలా మంచివాడినని నిరంతరం అబద్ధాలు ఆడతారు. 
 • ఈయన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పర్యటిస్తే ఆయనకు రాజకీయాలు గుర్తుకొస్తాయి
 • పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఇస్తున్నానంటారు
 • అక్కడ 45 టీఎంసీలకు గాను శ్రీశైలం నుంచి అదనంగా తీసుకోవచ్చని జీవో ఇవ్వరు
 • డెల్టాలో ఆయన పర్యటించినపుడు పట్టిసీమ కట్టాను, డెల్టా రైతులను కాపాడి, 45 టీఎంసీల నీళ్లు ఇచ్చానంటారు
 • అదే డెల్టాలో ఉన్న పులిచింతలలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద తెలంగాణ రైతులకు 125 కోట్లు ఇస్తే నీళ్లు స్టోరేజి పెంచుకోవచ్చని తెలిసినా చేయరు
 • ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి పోయే నీళ్ల సంగతేంటంటే ఏమీ మాట్లాడరు
 • నమ్మేవాళ్లు ఉండాలేగానీ, హంద్రీ నీవా ద్వారా శ్రీకాకుళానికి నీళ్లిస్తామంటారు
 • కాలువల ద్వారా అమెరికాకు కూడా నీళ్లిస్తామని అనగల గొప్ప ముఖ్యమంత్రి ఈయన
 • నమ్మేవాళ్లుండాలే గానీ చెవుల్లో ఎంత పెద్ద పువ్వయినా పెట్టడానికి వెనకాడడు
 • పదవి కోసం సొంతమామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవగలరు, ఎన్నికలు వస్తే ఆయన విగ్రహానికి దండలూ వేయగలడు
 • వైఎస్ఆర్‌ గారి పుణ్యమాని ప్రాజెక్టులు ఒక కొలిక్కి వస్తే, మిగిలి ఉన్న పనులు చేయడు, కొద్దో గొప్పో చేసి అక్కడ కుళాయిలు తిప్పి, ప్రాజెక్టులన్నీ తానే కట్టానని డబ్బాలు వాయించుకుంటాడు
 • రాజశేఖరరెడ్డి మరణించాక గ్రామగ్రామాన విగ్రహాలు వచ్చాయి
 • తనను ఎవరూ గుర్తుంచుకోరేమోనని మొన్న విశాఖలోని భాగస్వామ్య సదస్సులో తన విగ్రహానికి ఆయనే పూలమాల వేసుకుంటారు
 • నాయకుడిని ప్రజలు ఎందుకు గుర్తుంచుకుంటారు?
 • ప్రజలకు మంచి చేస్తే గుర్తుంచుకుంటారని దివంగత నేత వైఎస్ఆర్‌ చెప్పేవారు
 • చంద్రబాబు పాలసీ ఏంటో తెలుసా.. మంచి చేసినా చెయ్యకపోయినా ప్రచారం చేసుకుంటే చాలనుకుంటారు
 • ప్రజలు రాజశేఖరరెడ్డిని గుర్తుంచుకుంటారు, చంద్రబాబును కూడా గుర్తుంచుకుంటారు
 • ఎక్కడైనా మంచి కనిపిస్తే గుర్తుకొచ్చేది దివంగత నేత రాజశేఖరరెడ్డి
 • ఎక్కడైనా మోసం కనిపిస్తే, కరువు కనిపిస్తే గుర్తుకొచ్చేది చంద్రబాబు పేరు
 • సాయంత్రం అయ్యేసరికి ఐదారుగురు మంత్రులు టీవీల ముందుకు వచ్చి, జగన్ అలా, వాళ్ల నాయన ఇలా అని ఏకరువు పెడతారు
 • ఈ మాటలు విని ప్రజలకు విసుగొచ్చింది
 • ప్రాజెక్టులు కట్టేది కాంట్రాక్టర్ల కోసం కాదు.. రైతుల కోసమని చెవికి ఎక్కితే చాలు, ఆ మేరకు బుద్ధి, జ్ఞానం వస్తే చాలని అంటున్నా
 • ఆయన సీఎం అయ్యి మూడేళ్లు కావస్తోంది
 • దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో.. అప్పట్లో దేశమంతా 8 లక్షల ఇళ్లు కడితే ఒక్కమన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టారు
 • చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదు
 • చంద్రబాబు బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు దగ్గర్లోనే ఉందని చెబుతున్నా
 • చూస్తూ చూస్తూ మూడేళ్లయిపోయింది. మరొక్క సంవత్సరం గడిస్తే ఎన్నికల సంవత్సరం. 
 • ఆ తర్వాత నాకు రెండేళ్ల సమయం ఇవ్వండి.. హంద్రీ నీవా పూర్తిచేసి చూపిస్తా

ఇంతకీ 'చీరాలకు చీడపురుగు'లో ఏముంది


ఇంతకీ 'చీరాలకు చీడపురుగు'లో ఏముంది?
చీరాల :
ప్రకాశం జిల్లా చీరాల గడియారం సెంటర్‌లోని పోలీసు స్టేషన్ ఎదురుగానే ఒక పాత్రికేయుడిని ఎమ్మెల్యే సోదరుడు స్వయంగా కర్ర పట్టుకుని చితకబాదిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పక్కా ప్లానింగ్‌తో ముందుగానే ఒక దళితుడిని పోలీసు స్టేషన్‌కు పంపి, అతడితో నాగార్జునరెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టించి ఆ తర్వాత కొద్ది సేపటికే దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఇసుక అక్రమ రవాణా, భూముల ఆక్రమణలు.. ఇలా ఆమంచి సోదరులు చేస్తున్న అక్రమాలను వెలికితీసి పత్రికలలో రాయడం వల్లే ఈ దాడి జరిగిందన్నది బహిరంగ రహస్యమే అయినా పోలీసులు మాత్రం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేకపోయారు. దీనిపై తనమీద దాడి జరిగిన ప్రదేశంలోనే జర్నలిస్టు నాగార్జునరెడ్డి సోమవారం ఉదయం ధర్నా చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా ప్రశ్నించారు. ఎమ్మల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు స్వయంగా తనను కొట్టాడని చెప్పారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా ఉండటంతో.. దీనిపై పోలీసులను 'సాక్షి' ప్రశ్నించగా, పాలేటి రామారావు ఇంటివద్ద గొడవ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో తాము అక్కడికి వెళ్లామని, ఆ సమయంలో సరిగ్గా ఇక్కడ దాడి జరిగిందని చెప్పారు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారని, వారిని తప్పకుండా పట్టుకుని అరెస్టు చేస్తామని చెప్పారు. 
 
స్వతంత్ర సభ్యుడిగా గెలిచి, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ 'కాదేదీ దోపిడీకి అనర్హం' అన్నట్లుగా భూమి, ఇసుక, నీరు, బియ్యం, చెట్లు, ప్రజల ఆస్తులు, ప్రజాధనం దేననీ వదలకుండా దోచుకుతింటున్న గజదొంగ అని నాగార్జున రెడ్డి తాను రాసిన 'చీరాలకు చీడపురుగు' కథనంలో పేర్కొన్నారు. 'మట్టిచేతుల బాస' అనే మాసపత్రిక తాజా సంచికలో ఈ కథనం ముఖచిత్ర కథనంగా వచ్చింది. మొత్తం 14 పేజీల స్టోరీ రాశానని, అందులో ప్రతి ఒక్క విషయానికీ పూర్తి ఆధారాలు ఉన్నాయని నాగార్జునరెడ్డి చెప్పారు. దళితులు, గిరిజనుల భూములను ఆక్రమంచి, వాటికి అధికారబలంతో పట్టాదారు పాస్ పుస్తకాలు సంపాదిస్తున్నారని, అక్రమ పద్ధతుల్లో రెవెన్యూ రికార్డులు సృష్టిస్తున్నారని కూడా అందులో రాశారు. ప్రశ్నించేవారిపై అక్రమకేసులు బనాయిస్తారని, అడ్డుగా వస్తున్నారనుకున్నవారి ఆస్తులను ధ్వంసం చేసి భయానక పరిస్థితులు సృష్టించి తన పబ్బం గడుపుకొంటారని పేర్కొన్నారు. మచ్చుకి కొన్ని అంశాలు పరిశీలిద్దాం అంటూ.. సుదీర్ఘంగా అక్రమాల చిట్టాను బయటపెట్టారు. దాంతో ఆయనపై దాడి జరిగింది. 

కొడికొండలో వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం


కొడికొండలో వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం
అనంతపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం కొడికొండ చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు.

అనంతపురం జిల్లా రైతులకు అండగా నిలుస్తూ, హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో వైఎస్‌ జగన్‌ సోమవారం ఉరవకొండలో మహాధర్నా చేపట్టనున్న విషయం తెలిసిందే.

Popular Posts

Topics :