12 February 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

గుంటూరు యువభేరి ముఖ్యాంశాలు

Written By news on Thursday, February 16, 2017 | 2/16/2017


నువ్వు కూడానా... చంద్రబాబూ?
► ద్రోహం చేసిన ముఖ్యమంత్రికి తెలుగుజాతి సూటి ప్రశ్న
► అభివృద్ధి చెందిన నగరాలతో మనం ఎలా పోటీ పడగలం
► లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ చంద్రబాబు మోసం చేస్తున్నారు
► ఎవరికి పడితే వాళ్లకు సూటు, బూటు వేసి ఎంఓయూలు చేశామని చూపించారు
► గుంటూరు యువభేరిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
 
గుంటూరు:
రోమన్ చక్రవర్తి సీజర్‌ను తన స్నేహితుడు బ్రూటస్ కత్తితో వెన్నుపోటు పొడిచినప్పుడు ''యూ టూ.. బ్రూటస్'' అంటారని, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తెలుగుజాతి కోసం పోరాటం చేయాల్సిన ఈ వ్యక్తి వెన్నుపోటు పొడిచినప్పుడు యావత్ తెలుగుజాతి ''నువ్వు కూడానా చంద్రబాబూ'' అని ప్రశ్నిస్తోందని వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గుంటూరు సమీపంలోని నల్లపాడులో గురువారం నిర్వహించిన 'యువభేరి' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
 
 • ఎన్ని అడ్డంకులు పెట్టినా, మా శ్వాస, హక్కు ప్రత్యేక హోదా అంటూ మీరంతా వచ్చారు
 • పేరుపేరునా అందరికీ చేతులు జోడించి, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా
 • ప్రత్యేక హోదా సాధన కోసం మనమంతా ఇక్కడ ఏకమయ్యాం
 • మామూలుగా ఎక్కడైనా దేశం కోసం త్యాగాలు చేస్తే వాళ్లను స్వాతంత్ర్య సమరయోధులు అంటాం
 • రాష్ట్రం కోసం ఎవరైనా త్యాగాలు చేస్తే వాళ్లను అమరజీవులు అంటాం
 • ఇక్కడ ఉన్న ప్రతి చెల్లెమ్మ కోసం, ప్రతి తమ్ముడి కోసం త్యాగాలు చేసేవాళ్లను తల్లిదండ్రులు అంటాం
 • దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చినట్లుగా మనందరికీ తెలుసు
 • అప్పుడు దేశ జనాభా 33 కోట్లు. ఇప్పుడు దగ్గర దగ్గర 130 కోట్ల మంది వరకు ఉన్నారు
 • అప్పటితో పోలిస్తే మన ఆదాయాలు మారాయి, మన ఆహారధాన్యాల ఉత్పత్తి మారింది, విద్యుత్ వినియోగం పెరిగింది, వాహనాల అందుబాటులో కూడా చాలా తేడాలున్నాయి
 • రోడ్ల నిర్మాణంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి, ఉద్యోగావకాశాలు పెరిగాయి
 • ఏ అంశం చూసినా ఈ 70 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి
 • ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు ఆలోచించాలి


   
 • ఏ దేశమైనా, రాష్ట్రమైనా, గ్రామమైనా కుటుంబమైనా ఏం కోరుకుంటుంది
 • మొన్నటి కంటే నిన్న, నిన్నటి కంటే నేడు, నేటికంటే రేపు బాగుండాలనే కోరుకుంటారు
 • దీన్నే ఆర్థికశాస్త్రంలో చెప్పాలంటే సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ అంటారు
 • ఇంతకుముందు సాధించిన అభివృద్ధిని నిలబెట్టుకుంటూ, మరింత ప్రగతి సాధించడం దాని అర్థం
 • ఒక కుటుంబాన్నే తీసుకుంటే తాత కంటే తండ్రి, తండ్రి కంటే కొడుకు ఎక్కువ చదువుకోవాలి, ఆర్థిక పరిస్థితి, నివసించే ఇల్లు, మొత్తం జీవితం నాణ్యత మెరుగుపడాలి. దీన్ని సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ అంటారు
 • ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, ఇక్కడున్న చాలామందిలో 3జీ, 4జీ మొబైల్స్ కనిపిస్తాయి
 • మీ తల్లిదండ్రుల చిన్నతనం గురించి అడిగితే.. 40 ఏళ్ల క్రితం ఇంట్లో ఫోన్ ఉంటే చాలా సంపన్నుల కుటుంబం అనేవారు
 • ట్రంక్ కాల్ బుక్ చేస్తే ఆ రోజు కనెక్ట్ కాదు, మర్నాడు వచ్చేది
 • బైకులు అందుబాటులో లేవు, కార్లు కూడా అరుదుగా ఉండేవి
 • కరెంటు లేని ఇళ్ల కథ దేవుడెరుగు, కరెంటులేని గ్రామాలు కనిపించేవి
 • టీవీ చూడాలంటే ఊరంతా ఒక్కచోట ఏకం కావాలి.. ఆ ఒక్క ఇంట్లోనే దూరదర్శన్ మాత్రమే చూసేవారు
 • పూరిగుడిసెలు ఉండేవి తప్ప మేడలంటే ఏంటో తెలిసేది కాదు
 • ప్రభుత్వ బడుల్లో కూడా చదివించే స్థోమత లేక తల్లిదండ్రులు అగచాట్లు పడేవారు
 • కడుపు మాడ్చుకుని, తమ కనీస అవసరాలను కూడా త్యాగం చేసి పైసలు లెక్కపెట్టి పిల్లల్ని చదివించిన మహానుభావులు మనందరి తల్లిదండ్రులు
 • వాళ్ల గతం ఏంటో వాళ్లనే ఒక్కసారి అడిగి చూడండి.. మీ పెద్ద చదువుల వెనక పెద్ద మనసులు, వాళ్లు చేసిన పెద్ద త్యాగాలు ఉన్నాయి
 • ఆ తల్లిదండ్రులకు సెల్యూట్ చేస్తూ యువభేరి కార్యక్రమం మొదలుపెడుతున్నా
 • ప్రభుత్వం బాగుంటే పురోగతి బాగా కనిపిస్తుంది, అది బాగోకపోతే వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది
 • హైదరాబాద్ నగరాన్నే మనం గమనిస్తే.. బీడీఎల్, హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీలు, ఇక్రిశాట్, మిధాని, సీసీఎంబీ, ఐఐసీటీ, ఈసీఐఎల్, హెచ్ఎంటీ, డీఆర్‌డీఓ, డీఆర్‌డీఎల్, డీఎంఆర్ఎల్.. ఇలా అనేక సంస్థలు కనిపిస్తాయి
 • హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అన్నీ ఈ 70 ఏళ్లలో ప్రభుత్వాలు అందించిన తోడ్పాటుతో అభివృద్ధి చెందిన నగరాల జాబితాలో నిలిచాయి
 • ఇప్పుడు ఈ నగరాలతో మనం పోటీ పడాల్సి వస్తోంది.. ప్రభుత్వ సాయం లేకుండా ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నాను
 • రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లపోతే, 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే మన పరిస్థితి ఏంటని అడుగుతున్నా
 • సాధించిన అభివృద్ధిని నిలబెట్టుకోవాలి, మరో మెట్టు ఎదగాలి
 • ఇలా ఎదగాలంటే దీనికి ప్రత్యేక హోదా అనే ఒకే ఒక్కటి బ్రహ్మాస్త్రంగా తోడయితేనే ఇది సాధ్యం అవుతుంది
 • ఇవన్నీ ఈ ప్రభుత్వాలకు తెలియనివి కావు.. 
 • గతంలో ఎన్నికలకు ముందు వెంకయ్య నాయుడు, చంద్రబాబు కూడా హోదా గురించి మాట్లాడారు
 • ప్రత్యేక హోదా అంటే ఏంటన్న విషయానికి వస్తే.. అది మన పిల్లలకు మన ప్రాంతంలోనే, మన జిల్లాలోనే, మన రాష్ట్రంలోనే మంచి జీతంతో మంచి ఉద్యోగాలు రావడం


   
 • ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి కాకుండా, ఉద్యోగాలే వేరే రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి రావడమే ప్రత్యేక హోదా
 • ఇలాంటి ప్రత్యేక హోదాను దగ్గరుండి చంద్రబాబు కత్తితో పొడుస్తున్నారు
 • తాను పోరాటం చేయకపోగా చేసేవాళ్లను కూడా అణిచేస్తున్నారు
 • ప్రత్యేక హోదా కోసం బంద్ చేస్తే, దగ్గరుండి ఆర్టీసీ బస్సులు తిప్పిస్తారు
 • ధర్నాలు చేస్తే దగ్గరుండి ధర్నాలను నీరుగార్చే కార్యక్రమాలు చేస్తారు, ఎవరైనా వస్తే పిల్లలని కూడా చూడకుండా వాళ్ల మీద పీడీయాక్ట్ పెట్టాలని ఆదేశిస్తారు
 • జనవరి 26న కొవ్వొత్తులతో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా ర్యాలీలు చేయాలని తలపెడితే ఇదే చంద్రబాబు దగ్గరుండి ర్యాలీలో పాల్గొనకుండా ప్రతిపక్ష నాయకుడిని కూడా ఎయిర్‌పోర్టులోనే రన్‌వే మీదే ఆపడాన్ని చూశాం
 • మనం బస్సు రోకో, రైల్ రోకో చూసి ఉంటాం.. విమానాల రోకో కూడా చంద్రబాబు హయాంలో తొలిసారి చూశాం
 • గతంలో రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్‌ అన్న మాటలు గుర్తుకొస్తాయి 
 • సీజర్‌ను తన స్నేహితుడు బ్రూటస్ కత్తితో వెన్నుపోటు పొడిచినప్పుడు ''యూ టూ.. బ్రూటస్'' అంటారు
 • ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తెలుగుజాతి కోసం పోరాటం చేయాల్సిన ఈ వ్యక్తి వెన్నుపోటు పొడిచినప్పుడు యావత్ తెలుగుజాతి ''నువ్వు కూడానా చంద్రబాబూ'' అని ప్రశ్నిస్తోంది
 • హోదాయే సంజీవని అని ఆవాళ చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు
 • ఇదే చంద్రబాబు, ఇదే వెంకయ్య నాయుడు ఇద్దరూ కలిసి ఐదున్నర కోట్లమంది ప్రజలను వెన్నుపోటు పొడుస్తుంటే యావత్ రాష్ట్రం నివ్వెరపోయి చూస్తోంది
 • తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు
 • తెలుగు వాళ్ల ప్రయోజనాలను ఢిల్లీలో కాళ్ల మీద పారేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుందేమో అనిపిస్తోంది
 • ఇంత దారుణంగా మన జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు
 • ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు పెట్టారు
 • గత సంవత్సరం 2016 జనవరిలో కూడా ఇలాంటి కార్యక్రమం పెట్టారు, అప్పుడు రూ. 4.67 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో వస్తున్నాయని, ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు
 • ఇన్ని ఎంఓయూలు చేస్తే.. ఇందులో 2.82 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని కూడా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు
 • ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతుంటే వ్యవస్థలో మార్పు ఎలా వస్తుంది
 • సాధారణంగా ఎంఓయూలు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తారు, దాన్ని ఐఈఎం అంటారు. ఇది రెండో దశ
 • ఇది చేయకపోతే పీసీబీ క్లియరెన్సులు రావు, బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వవు
 • 4.67 లక్షల కోట్లకు ఎంఓయూలు చేశామని, 2.82 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని చంద్రబాబు అబద్ధాలు చెబుతుంటే, కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం 2016 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం ఫైల్ అయిన ఐఈఎంలు కేవలం 34,464 కోట్ల రూపాయలు మాత్రమే
 • కానీ ఐఈఎంలు ఫైల్ చేసిన ప్రతి ఒక్కరూ పరిశ్రమలు పెడతారని కూడా కాదు
 • ఇదే 2015లో అయితే 21,300 కోట్ల ఐఈఎంలు ఫైల్ చేశారు.. 2014లో 21,526 కోట్లు ఫైల్ అయ్యాయి
 • వీటిలో ఎన్ని ఇంప్లిమెంట్ అయ్యాయంటే, 2014లో 2,804 కోట్లు మాత్రమే. 2015లో రూ. 4,542 కోట్లు మాత్రమే
 • దీన్ని బట్టి చూస్తే 2016 సంవత్సరానికి మహా అయితే మరో 7వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వస్తాయి
 • చంద్రబాబు ఇంతలా అబద్ధాలు చెబుతుంటే, మోసాలు చేస్తుంటే ఈ పెద్దమనిషిని చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కావట్లేదు
 • 2016లో 4.67 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఇంత మోసం చేసి, 2017లో ఇంకా పెద్దమోసం చేయడానికి సిద్ధమయ్యారు
 • 2017 జనవరిలో ఏకంగా 10.54 లక్షల కోట్ల ఎంఓయూలు సంతకాలు చేశామంటూ అబద్ధాలు మొదలుపెట్టారు
 • ఆయన ఎవరికి పడితే వాళ్లకు సూటు, బూటు వేసి, వాళ్లతో ఎంఓయూలు చేసేసుకున్నారు
 • త్రిలోక్ కుమార్ అనే వ్యక్తి చంద్రబాబుతో ఎంఓయూ సంతకం చేశారు. ఈయన విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందినవారు. ఈయన చేసే పని పారిశ్రామిక వేత్త గంధం నందకుమార్ వద్ద నుంచి ప్రెస్‌నోట్లు తెచ్చి, విలేకరులకు ఇస్తారు. అంటే కంపెనీ పీఆర్వో.
 • ఇతడికి సొంత వాహనం కూడా లేదు. ఈ మనిషి.. మొన్న చంద్రబాబుతో ఎంఓయూ చేసుకున్నారు
 • మరోవ్యక్తి పేరు సుధీర్. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందినవాడు. పాత పెంకుటిల్లు, భార్య అంగన్‌వాడీ టీచర్. ఈయన చేసేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఏజెంటు. ఈయనకు కూడా సూటు, బూటు తగిలించి చంద్రబాబు ఎంఓయూ చేసుకున్నారు
 • రాష్ట్రం బాగుండాలని, పెట్టుబడులు రావాలని అందరూ ఆశిస్తాం. కానీ ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశంతో ఎవరితో పడితే వాళ్లతో ఎంఓయూలు చేసేసి 10.54 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెబుతుంటే ఆయన ప్రభుత్వంలో సాల్మన్ ఆరోఖ్యరాజ్ అని పారిశ్రామిక శాఖ కార్యదర్శి ఉన్నారు. ఆయన అసలు సంతకాలు పెట్టనని నిరాకరించారు
 • పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే చంద్రబాబు దావోస్, సింగపూర్, చైనా, జపాన్‌లకు వెళ్లాలనుకోవడం మూర్ఖత్వం
 • చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి ఎవరూ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రారు, జగన్ చెప్పాడని ముందుకు రారు
 • పరిశ్రమలు పెడితే ప్రత్యేక హోదాతో మాత్రమే వచ్చే పారిశ్రామిక రాయితీలు ఇస్తేనే వస్తారు
 • ఇన్‌కం టాక్స్, ఎక్సైజ్ డ్యూటీ కట్టక్కర్లేదు, రవాణా వెనక్కి ఇస్తారు, బ్యాంకు రుణాల్లో 3 శాతం వడ్డీ సబ్సిడీ ఉంటుంది
 • ఇలాంటి రాయితీలు ఇస్తేనే ఎవరైనా పరిశ్రమల కోసం ముందుకొస్తారు
 • ఇదే చంద్రబాబు రాష్ట్రమంతా బ్రహ్మాండంగా ఉందని, హోదా లేకపోయినా పెట్టుబడులు వస్తున్నాయని, హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రంలో ఉన్నవాళ్లకు సంకేతాలు ఇస్తున్నారు
 • కేంద్రంలో ఉన్నవాళ్లు చంద్రబాబు ఎలా ఆడమంటే అలా ఆడుతున్నారు
 • పరిశ్రమలు రావాలంటే అవి పెట్టడానికే రెండు మూడేళ్లు పడుతుంది కాబట్టి ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలని చెప్పారు
 • వెంకయ్య నాయుడు కూడా ఐదు కాదు.. పదేళ్లు హోదా ఇవ్వాలని పార్లమెంటులో చెప్పారు
 • అలాంటి వాళ్లిద్దరూ ఇప్పుడు హోదా గురించి పచ్చి అబద్ధాలు చెబుతూ, మాటలు మారుస్తున్నారు
 • ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఏమొస్తుందని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు
 • ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు దేశంలో 11 మాత్రమే ఉన్నాయి. వీటి జనాభా కేవలం 7.5 కోట్లు
 • 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో ఇది 6.5 శాతం 
 • ఈ రాష్ట్రాలకు 76980 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంటులు ఇచ్చారు
 • మిగిలిన 93.5 శాతం జనాభాకు 186820 కోట్లు కేంద్రం నుంచి గ్రాంటులు ఇచ్చారు
 • అంటే, 6.5 శాతం జనాభాకు 30 శాతం గ్రాంటులు ఇస్తున్నారన్న మాట
 • కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా చూద్దాం
 • ఏపీ విడిపోకముందు 8.54 కోట్ల జనాభా ఉండేది
 • 2013-14లో చూసుకుంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులు 32460 కోట్లు వచ్చాయి
 • అంటే, ఆ 11 రాష్ట్రాలకు కలిపినా ఆంధ్ర రాష్ట్రం కంటే జనాభా తక్కువ. కానీ వాళ్లకు 91980 కోట్లు వచ్చాయి
 • ఇదంతా చంద్రబాబుకు కనిపించడం లేదా
 • కేంద్రప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి శనక్కాయలు, పప్పు బెల్లాల్లా చిన్న చిన్న పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు. వాటిని చూసి ఎవరూ ముందుకు రావట్లేదు
 • ఇవే రాయితీలను పక్కన తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకూ ఇచ్చారు
 • చంద్రబాబు ఎప్పుడూ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు
 • పక్కన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఉన్నాయి. ప్రత్యేక హోదా లేకుండా వాటితో మనం ఎలా పోటీ పడగలం?
 • ప్రత్యేక హోదా అన్నది ఒక్క జగన్ మాత్రమే పోరాడితే సాధ్యమయ్యే పనికాదు.. మనం అడగడం మానేస్తే ప్రత్యేక హోదా అడిగేవాడు ఎవ్వరూ ఉండరు
 • మనం గట్టిగా నిలదీస్తేనే వాళ్లు మర్చిపోకుండా ఉంటారు
 • రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్లు సాధించుకున్నారు, పార్లమెంటు సాక్షిగా మనకిచ్చిన మాటను మనమంతా గట్టిగా నిలబడితే ఎందుకు సాధ్యం కాదని అడుగుతున్నా
 • రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా ఒత్తిడి తీసుకొస్తాం
 • రేపు జూన్, జూలై నెలల్లో మూడేళ్ల పాలన ముగుస్తుంది.. అప్పుడు పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు ఏర్పాటైతే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారు, దేశం మొత్తం చూసేలా చేస్తారు

గుంటూరులో యువభేరి


నేడు గుంటూరుకు వైఎస్ జగన్
హాజరుకానున్న జగన్‌

 ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా సాధన అవసరాన్ని చాటి చెప్పడానికి గుంటూరులో గురువారం నిర్వహిస్తున్న ‘యువభేరి’ లో ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొంటున్నారు. స్థానిక నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కన, గతంలో ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అమరణ దీక్ష చేపట్టిన ప్రాంగణంలోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

ఉదయం 9.30 గంటల కు జరిగే ఈ కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులతో ముఖా ముఖి మాట్లాడతారు.గుంటూరులోని నల్లపాడు రోడ్డులో  మిర్చియార్డు సమీపంలో యువ భేరి ప్రాంగణంలో  విద్యార్థులతో ముఖా ముఖి నిర్వహిస్తారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్యర్యంలో ఈ సదస్సు జరుగుతుంది.

ఈ అన్యాయం ఎక్కువరోజులు నిలబడదు

Written By news on Wednesday, February 15, 2017 | 2/15/2017


హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ప్రలోభాలు పెట్టి ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని.. ఈ అన్యాయం ఎక్కువరోజులు నిలబడదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు. అధర్మం గెలిచినట్టుగా కనిపించినా చివరకు ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు గంగుల ప్రభాకర్‌ రెడ్డి... వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ‘గుంగుల ప్రభాకర్‌ రెడ్డి మా పార్టీలో చేరడం ఆనందాన్ని కలిగిస్తోంది. గంగులన్నను వైఎస్సార్‌ సీపీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. అన్నిరకాలుగా ఒకరికొకరు తోడుగా ఉంటాం. రాజకీయాలను ఎంత అన్యాయమైన స్థాయిలోని తీసుకుపోయారన్నది మనం చూస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని మాపై అన్యాయాలు చేస్తున్నారు. మూడేళ్లు గడిచిపోయింది. ఇంకో ఏడాది గడిస్తే ఎన్నికల సంవత్సరం వస్తుంది. ఆ తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వమే. రామాయణం, మహాభారతం, ఖురాన్‌, బైబిల్ లలో ఎక్కడైనా సగం వరకు అధర్మం, అన్యాయం గెలిచినట్టు కనిపిస్తుంది కానీ చివరకు ధర్మం, న్యాయమే గెలుస్తుంద’ని అన్నారు. గంగుల నాని, టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధులు, అనుచరులు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరడంతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.
 

ప్రజాభీష్టం మేరకే...


‘వారి సలహా మేరకే పార్టీ మారాం’
హైదరాబాద్: ప్రజాభీష్టం మేరకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరామని గంగుల ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. తన కుమారుడు గంగుల నాని, మద్దతుదారులతో కలిసి ఆయన బుధవారం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీలో ప్రజా సమస్యలపై చర్చించడం లేదని విమర్శించారు.

భూమా నాగిరెడ్డిని టీడీపీలో చేర్చుకోవద్దని చంద్రబాబును కోరినా పట్టించుకోలేదని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్‌ విభజన జరుగుతుందని, పార్టీలో గౌరవం ఉంటుందని తనను బుజ్జగించే ప్రయత్నం చేశారని చెప్పారు. పలుమార్లు మద్దతుదారుల అభిప్రాయంగా కోరగా టీడీపీని వదిలిపెట్టాలని తనకు సలహాయిచ్చారని తెలిపారు. వారి అభీష్టం మేరకు తమ కుటుంబం వైఎస్సార్‌ సీపీలోకి వచ్చిందని వివరించారు.

వైఎస్ఆర్ సీపీలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి


వైఎస్ఆర్ సీపీలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. బుధవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఇంఛార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. వైఎస్ జగన్ కండువా కప్పి గంగులను పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కొప్పన మోహన్‌ రావు మంగళవారం వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. వైఎస్‌ జగన్‌ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.

బాబుకు బ్రిటన్‌ షాక్‌!


అంత సొల్లొద్దు
బాబుకు బ్రిటన్‌ షాక్‌!
⇒ రాజధానిపై ఊహాగానాలు కాకుండా వాస్తవాలు చెప్పాలని సూచన
⇒ లండన్‌ పర్యటన రద్దు చేసుకున్న సీఎం
⇒ ఆయన స్థానంలో మంత్రి నారాయణ


సాక్షి, అమరావతి: చంద్రబాబుకు బ్రిటన్‌ ప్రభుత్వం షాకిచ్చింది. దీంతో ఆయన తన లండన్‌ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. ఆయన స్థానంలో మంత్రి నారాయణ వెళుతున్నట్లు సీఆర్‌డీఏ మీడియా సలహాదారు ఒక ప్రకటనలో వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు..బ్రిటన్‌ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ విభాగం ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు లండన్‌లో ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ వాటర్‌ టెక్నాలజీపై ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పురోగతి, మార్కెటింగ్‌ అవకాశాలపై విస్తృత చర్చలు జరపడం ఈ సదస్సు ముఖ్యోద్దేశం. ఇందులో పాల్గొనేందుకు మరికొందరితో పాటు ఏపీ సర్కారుకూ ఆహ్వానం అందింది.

అయితే సదస్సులో చెప్పాలనుకునే విషయాన్ని ముందుగా తమకు తెలియజేయాలని ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ విభాగం కోరింది. ఏ దేశం వెళితే ఆ దేశంలా, ప్రపంచస్థాయిలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పే చంద్రబాబు ఈసారి కూడా.. భవిష్యత్తులో ఎంత అద్భుతంగా రాజధానిని తీర్చిదిద్దబోయేదీ సవివరంగా తెలియజేసేలా ఓ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాబు డైరెక్షన్‌ మేరకు అధికారులు ప్రజెంటేషన్‌ను తయారు చేశారు.

చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని నిర్మాణానికి రైతులంతా భూములిచ్చారని, ఆయన తన సమ్మోహనా శక్తితో లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని, ఇంటర్నేషనల్‌ స్కూళ్ళు, కాలేజీలు తరలి వస్తున్నాయని, పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, రాజధాని పరిధిలో భవిష్యత్‌లో 3 లక్షల ప్రత్యక్ష, 5.5 లక్షల పరోక్ష ఉద్యోగాలు రాబోతున్నాయంటూ గ్రాఫ్‌లతో సహా అద్భుత ఊహాచిత్రానికి రూపకల్పన చేసి సీడీ రూపంలో బ్రిటన్‌కు పంపారు. అయితే ప్రభుత్వం పంపిన నివేదికపై బ్రిటన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఊహాగానాలు కాకుండా ఇప్పటివరకు సాధించిన పురోగతి చెబితే బాగుంటుందని తెలిపింది. సదస్సులో వాస్తవాలను ప్రస్తావించాలని సూచించినట్టు తెలిసింది. లండన్‌ వేదికగా మరోసారి అంతర్జాతీయ సమాజానికి లెక్చర్‌ ఇవ్వాలనుకున్న చంద్రబాబు ఊహించని ఈ పరిణామంతో తన పర్యటన రద్దు చేసుకున్నారని అధికారవర్గాలు తెలిపాయి.

తాత్కాలికానికి ఇంత దుబారా?


తాత్కాలికానికి ఇంత దుబారా?
⇒ రూ.220 కోట్ల అంచనాల సచివాలయానికి రూ. 1,200 కోట్లు ఖర్చు పెట్టారు
⇒ అసెంబ్లీ నిర్మాణ పనులు పరిశీలించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు


సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: తాత్కాలిక సచివాలయం అంటూనే వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని చంద్రబాబు ప్రభుత్వం దుబారా చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శాసన సభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి రూ. 220 కోట్ల అంచనాలతో మొదలుపెట్టి ఇప్పటికి రూ.1,200 కోట్లు ఖర్చు చేయడాన్ని ఆయన తప్పు బట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బూడి ముత్యాలనాయుడు బృందం మంగళవారం సచివాలయంలో నిర్మాణంలో ఉన్న అసెంబ్లీ, శాసన మండలి హాలును పరిశీలించారు.

అనంతరం పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ, మండలి భవనాలను పరిశీలించి రావాలన్న తమ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో తాము వచ్చినట్టు చెప్పారు.  తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మా ణానికి రూ. 1,200 కోట్లు ఎలా ఖర్చు పెట్టా రని ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో విపక్ష నాయకుడికి కనీసం పేషీ కూడా కేటాయించ లేదని విమర్శించారు. ఈ విషయంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఏపీ సీఎం చంద్రబాబు పునరాలోచించాలన్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు జగన్‌ బాసట


అగ్రిగోల్డ్‌ బాధితులకు జగన్‌ బాసట
⇒ విజయవాడలో మార్చి 3 నుంచి బాధితుల దీక్ష
⇒ సహకరించాలని విపక్ష నేతకు అసోసియేషన్‌ వినతి
⇒ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 101 మంది చనిపోయారని ఆవేదన


సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ బాధితుల ఆందోళనకు విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంఘీభావం తెలిపారు. అగ్రిగోల్డ్‌ కస్ట మర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘ నేతలు, పెద్ద సంఖ్యలో బాధితులు మంగళవారం జగన్‌ను ఆయన నివాసంలో కలసి తమకు న్యాయం జరగడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందంటూ గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే మార్చి 3 నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించామని, అందుకు సహకారం కావాలని వారు జగన్‌ను అభ్యర్థించారు. ఈ మేరకు వారు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో జగన్‌ తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ వైఖరితోనే సమస్య జటిలం
అగ్రిగోల్డ్‌ బాధితులకు యాజమాన్యమే అన్యాయం చేస్తోందని ఇంతకాలం భావించామని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే తమకు న్యాయం జరగడంలో జాప్యం జరుగుతోం దనేది స్పష్టం అవుతోందని అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.విశ్వనాథరెడ్డి, ప్రధాన కార్య దర్శి వి.తిరుపతిరావు చెప్పారు. ప్రభుత్వ వైఖరి వల్ల ఇప్పటికి 101 మంది చనిపో యారని తెలిపారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లా డారు. అగ్రిగోల్డ్‌ సమస్య జటిలం కావడా నికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని ఖాతా దారులంతా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను 20 నెలల క్రితమే జప్తు చేసినా వాటిని అమ్మకుండా ప్రకటనలు చేస్తూ ప్రభుత్వం ఈ సమస్యను మరింత జటిలం చేస్తోందన్నారు.

యాజమాన్యం లోని సీతారామ్‌ అనే వ్యక్తి బ్రహ్మంగారి మఠం వద్దగల భూములను అమ్ముకున్నా ఆయన్ను అరెస్టు చేయలేదన్నారు. అగ్రి గోల్డ్‌ ఆస్తులను వేలంలో కొనడానికి ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వమే ఆక్షన్‌లో పాల్గొని వాటిని తీసుకోవాలన్నారు. ప్రభు త్వమే చిన్న ఖాతాదారులకు బకాయిలు తక్షణం చెల్లించాలని, పెద్ద ఖాతాదారులకు హామీ పత్రాలు ఇవ్వాలని వారు కోరారు.  తమ పోరాటానికి మద్దతునివ్వాల్సిందిగా వైఎస్‌ జగన్‌ను కోరామని అందుకాయన స్పందించి మద్దతు పలికారని చెప్పారు. నిరాహార దీక్షా శిబిరాన్ని తానూ సందర్శిస్తానని భరోసా ఇచ్చారని వారు వివరించారు.

యువభేరికి చకచకా ఏర్పాట్లు

నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కన వేదిక
* స్థలాన్ని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు 
విద్యార్థులు, మేధావులు భారీగా తరలిరావాలని పిలుపు
 
సాక్షి, అమరావతి బ్యూరో/ పట్నంబజారు: గుంటూరులో ఈనెల 16వ తేదీన జరిగే యువభేరి కార్యక్రమానికి  ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చర్చించారు. విద్యార్థులు, మేధావులు,యువకులను చైతన్యపరిచి పెద్ద ఎత్తున యువభేరికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అనంతరం యువభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. పార్టీ సీనియర్‌ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా అ«ధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు ఆధ్వర్యంలో పోస్టర్‌ను విడుదల చేశారు.  పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ప్రత్యేకహోదా సాధనకు ఆమరణ దీక్ష చేసిన నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కనున్న స్థలాన్నే యువభేరికి వేదికగా ఎంపిక చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని వారు వివరించారు. ప్రత్యేక హోదా ఆకాంక్షతో పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
 
ఏర్పాట్లను పరిశీలించిన నేతలు...  
యువభేరి వేదిక వద్ద ఏర్పాట్లను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, ,  సలాంబాబు, రాష్ట్ర కార్యదర్శి ఎండీ నసీర్‌ అహ్మద్,  గుంటూరురూరల్‌ జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరిఽ కొటే«శ్వరరావు పరిశీలించారు. పలు విభాగాల నేతలు కొత్తా చిన్నపరెడ్డి, డైమండ్‌ బాబు, మొట్టు వెంకట అప్పారెడ్డి, ఉప్పుటూరి నర్శిరెడ్డి, దాసరి కిరణ్‌, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, దుగ్గంపూడి యోగేశ్వరరెడ్డి, పానుగంటి చైతన్య, జగన్‌కోటి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు యువభేరి నేపథ్యంలో స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. దానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. తలశిల రఘురామ్‌ మాట్లాడుతూ యువభేరికి అంతా సన్నద్ధమైందని, 16న జగన్‌ గుంటూరులో జరిగే యువభేరిలో పాల్గొంటారని తెలిపారు. ప్రత్యేక హోదా ఆకాంక్షను బలంగా వినిపించడానికి యువతను దీనిలో భాగస్వాములను చేయడానికి సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మర్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, ఉపాధి కల్పన ఉంటుందని చెప్పారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ వివిధ రకాల ఒత్తిళ్ల ద్వారా తమను ఆటంకపరచడానికి ప్రయత్నించడం సరైన చర్య కాదన్నారు.  
 
జిల్లాలో ఉపాధి ఊసేలేదు..
జిల్లాలో ఉపాధి కల్పన సమస్యాత్మకంగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచి ఇప్పటి వరకు 51,959 మంది పట్టభద్రులు ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో నమోదు చేసుకోగా, వారిలో వెయ్యి మందికి మాత్రమే ప్రైవేటు  ఉద్యోగాలు అందిన పరిస్థితి. ప్రతిఏటా జిల్లాలో 20వేలమంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు, 15వేల మంది డిగ్రీ విగ్యార్థులు, ఇతర వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులు మరో 80వేల మంది చదువు పూర్తి చేస్తున్నారు.  జిల్లాలో కొత్త పరిశ్రమలు రాకపోవడంతో ఉపాధి అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి. ఇతర ప్రాంతాలకు వెళుతున్నా ఉపాధి లభించని పరిస్థితి. ప్రత్యేక హోదా వస్తే రాయితీ ఉండటంతో పరిశ్రమలు వస్తాయి. తద్వారా ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉంది.

వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీమంత్రి

Written By news on Tuesday, February 14, 2017 | 2/14/2017


వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీమంత్రి
హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కొప్పన మోహన్‌ రావు మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఆయనను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొప్పన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ పోరాటాలు, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన అభివృద్ధికి ఆకర్షితుడై పార్టీలో చేరినట్టు తెలిపారు. వైఎస్‌ జగన్‌ ను సీఎం చేసేందుకు జిల్లాలో తన వంతు కృషి చేస్తానన్నారు. కాగా కొప్పన మోహన్‌ రావు కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి హయాంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు.  
 

అమరావతి ‘ఫర్‌ సేల్‌’!

Written By news on Monday, February 13, 2017 | 2/13/2017రాసిస్తా.. రాజధాని
అమరావతి ‘ఫర్‌ సేల్‌’!.. పూలింగ్‌ భూములిక ప్రైవేట్‌ సంస్థలకు అమ్మకం

అనుకున్నంతా అయ్యింది.‘సాక్షి’ చెప్పింది అక్షరాలా నిజమయ్యింది.
రాజధానిలో  సర్కారు ‘రియల్‌’ వ్యాపారం షురూ అయ్యింది. అమరావతి భూములను నచ్చినవారికి మెచ్చిన ధరలకు అమ్మేయబోతోంది. పక్కా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అనువుగా రాజధాని భూ కేటాయింపు నిబంధనలను ప్రభుత్వం సవరించింది. సామదానభేద దండోపాయా లు ఉపయోగించి రాజధాని రైతులనుంచి సమీకరించిన వేల ఎకరాల భూములు బినామీ సంస్థల పరం కాబోతున్నాయి.

పైసా పెట్టుబడి లేకుండా రైతుల భూములతో బాబు ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయబోతోందని ‘సాక్షి’ పలు సందర్భాలలో ప్రత్యేక కథనాలను ప్రచురించిన సంగతి తెల్సిందే. కోట్ల రూపాయల విలువైన రైతుల భూములను కైంకర్యం చేయడానికి వీలుగా రాజధాని భూ కేటాయింపు నిబంధనలను సవరించడం.. సర్కారు ‘రియల్‌’ దాహాన్ని రుజువు చేసింది. ప్రైవేటు కంపెనీలు, సంస్థలకు మాత్రమే మేలు చేసే ఆ సవరణల ను చూసి ప్రభుత్వ అధికారులే నివ్వెరపోతు న్నారు. బినామీలకు మేలు చేయడానికి ఇంతగా బరితెగించడం మరెవరికీ సాధ్యం కాదన్న రీతిలో ప్రభుత్వ పెద్దలు వ్యవహరిం చారని సీఆర్‌డీఏ వర్గాల్లో వినిపిస్తోంది.

భూ కేటాయింపు నిబంధనలలో సవరణలు
అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి సమీకరించిన విలువైన భూములతో వ్యాపారం చేయాల ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అమరావతి భూముల కేటా యింపు నియమ నిబంధనల్లో సవరణలను తీసుకొచ్చింది. గత ఏడాది డిసెంబర్‌ 7న జరిగిన ఏపీ సీఆర్‌డీఏ 7వ అధికారుల సమావేశంలో ఈ సవరణలకు ఆమోదం తెలిపారు. ఈ భూములను పారిశ్రామిక, విద్య, వైద్యం, వినోదం, వాణిజ్యం, రియల్‌ ఎస్టేట్‌ తదితర  కార్యకలాపాల కోసం ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులకు విక్రయించాల ని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సేల్‌ డీడ్‌ చేసేందుకు సీఆర్‌డీఏకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

లీజు లేదు ఏకంగా సేల్‌ డీడ్‌
ఏదైనా ప్రాజెక్టు ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వస్తే తొలుత లీజుకు భూములను కేటాయిస్తారు. ఆ ప్రాజెక్టు ఏర్పాటు పూర్తయిన తరువాతనే ఆ భూములను ఆ ప్రాజెక్టు పేరు మీద బదలాయిస్తారు. అలాంటిది రాజధానిలో మాత్రం ప్రాజెక్టు ఏర్పాటు కాకుండానే ముందుగా భూములను ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులకు అమ్మేయబోతున్నారు. ఒకవేళ ఆ సంస్థలు ఆ భూములపై రుణాలు తీసుకుని, ఆ తర్వాత ప్రాజెక్టు ఏర్పాటు చేయకుండా పోతే పరిస్థితి ఏమిటని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ప్రభుత్వానికి ఆ భూములపై ఎలాంటి హక్కూ ఉండదు..
రాజధాని ప్రాంతంలో ఏదైనా సంస్థ ఏర్పాటుకు 100 ఎకరాల భూములు అవసరమనుకోండి. కొత్త నిబంధనల ప్రకారం అనుకున్నదే తడవుగా ఆ 100 ఎకరాలను సదరు సంస్థకు కేటాయించడమే కాదు ఆ సంస్థ ఏర్పాటు కాకుండానే ఆ వంద ఎకరాలను ఆ సంస్థ పేరు మీద విక్రయించేస్తారు. ఈ విధంగా విక్రయించేస్తేనే ఆ సంస్థ ఆ భూమిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలను తీసుకోవడం సులువవుతుంది.

అమరావతి భూముల కేటాయింపు నియమ నిబంధనల్లో తొలుత ఇలాంటి దుర్మార్గపు వెసులుబాటు లేదు. ప్రాజెక్టు అమలు చేయక ముందే సేల్‌ డీడ్‌ చేసేందుకు ఆస్కారం లేదు. ఇప్పుడు సేల్‌ డీడ్‌ చేసేందుకు వీలుగా కేటాయింపుల నియమ నిబంధనల్లో సవరణలు తీసుకువచ్చారు. ప్రభుత్వ పెద్దలకు నచ్చిన వ్యక్తులు, సంస్థలకు రాజధాని ప్రాంతంలోని భూములను రియల్‌ ఎస్టేట్‌ లేదా వాణిజ్య, వినోద తదితర కార్యకలాపాలపేరుతో ఏకంగా అమ్మేయనున్నారు. ఈ విధంగా భూములను ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులకు అమ్మేసిన తరువాత ప్రభుత్వానికి ఎటువంటి హక్కూ ఉండదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

12 సంస్థలకు 1020.5 ఎకరాలు..
ఇప్పటికే రాజధాని ప్రాంతంలో 12 సంస్థల ఏర్పాటునకు ప్రభుత్వం 1020.5 ఎకరాలను కేటాయించింది. ప్రైవేట్‌ సంస్థలకు ఫ్రీ హోల్డ్‌ విధానంలో భూములను కేటాయించగా ప్రభుత్వ సంస్థలకు లీజు విధానంపై భూములను కేటాయించింది. అంతేకాదు ప్రభుత్వ సంస్థలలో ఒక్క సంస్థను తీసుకున్నా గరిష్టంగా 50 ఎకరాలు కూడా మించలేదు.. కానీ ప్రైవేటు సంస్థలకు మాత్రం వందల ఎకరాలను కేటాయించింది. అంటే ప్రభుత్వ సంస్థల విషయంలో ఒకలా ప్రైవేటు సంస్థల విషయంలో మరోలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నమాట. ప్రైవేటు సంస్థలంటే ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు, వారి బినామీలేనని, అందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని అధికారవర్గాలంటున్నాయి.  ప్రాజెక్టు అమలు చేయకముందే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ఆ భూములను పూర్తిస్థాయిలో విక్రయించడం ఎక్కడా లేదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి..


Popular Posts

Topics :