19 March 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పిచ్చి పుల్లయ్యలా తయారయ్యారు!

Written By news on Saturday, March 25, 2017 | 3/25/2017


పిచ్చి పుల్లయ్యలా తయారయ్యారు!
విజయవాడ :
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరుకు తగ్గట్లే పిచ్చిపుల్లయ్యలా తయారయ్యారని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు గౌతం రెడ్డి మండిపడ్డారు. ఆయన తీరు పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టుకున్నట్లుందని ఎద్దేవా చేశారు. తాను అగ్రిగోల్డ్ సంస్థకు లీగల్ అడ్వైజర్‌నని ఆయన చెప్పారని, దమ్ముంటే దాన్ని నిరూపించాలని చాలెంజ్ చేశారు. ఈ విషయమై ఆయన శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు ఒక విషయంపై విచారణ పూర్తికాగా, దానిపై ఆయన విచారణకు ఆదేశిస్తామంటున్నారని, ఇదెక్కడి వ్యవహారమని ప్రశ్నించారు. చంద్రబాబు మాట్లాడమంటే ఈయనేదో మాట్లాడేస్తారని విమర్శించారు. రెండు ఎకరాల భూమి కొన్న వ్యక్తి తన భూమికి దారి లేదని, దారి చూపించాలని అడిగితే.. దానిపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీసీఐడీ విచారణ జరిగిందని ఆయన తెలిపారు.

ఈ భూములతో తనకు గానీ, తన కుమారుడికి గానీ సంబంధం లేదని పోలీసులు తమ నివేదికలో తెలిపారని, అలాగే అగ్రిగోల్డ్‌తో కూడా సంబంధం లేదని చెప్పారని.. స్వయంగా డీజీపీయే దీనిపై డిక్లరేషన్ ఇచ్చారని అన్నారు. మీ పోలీసులు ఇచ్చిన నివేదికలను మీరు నమ్మరా అని ప్రత్తిపాటి పుల్లారావును గౌతం రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే విచారణ అయిపోయిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు విచారణకు ఆదేశిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి కొన్నట్లు ఆయనే చెప్పారని.. తాను మాత్రం రైతుల నుంచి తన కుమారుడి పేరు మీద కొన్నానని చెప్పారు. తాను కూడా అగ్రిగోల్డ్ బాధితుల్లో ఒకడినని, తనకు రావాల్సింది అడగలేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలో 18 లక్షల మందికి పైగా ఉన్నబాధితుల గోడును వినిపించుకోవడం లేదని, ప్రత్తిపాటి పుల్లారావు మీద పరువునష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు.

దొడ్డిదారిలో చట్టసభకు లోకేశ్


'దొడ్డిదారిలో చట్టసభకు లోకేశ్'
కాకినాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్‌ ఇటీవల చేసిన ట్వీట్లపై వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. దొడ్డిదారిలో చట్టసభకు వచ్చిన లోకేశ్‌కు ప్రతిపక్షాన్నికానీ, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డినిగానీ విమర్శించే అర్హత లేదన్నారు. కాకినాడలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. అవినీతి, అక్రమాలతో సీఎం చంద్రబాబు పాలన చాలా దరిద్రంగా ఉందన్నారు.

ప్రతిపక్షం వరెస్ట్ అంటూ టీడీపీ నేతలు లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారు.. కానీ త్వరలో టీడీపీకే రెస్ట్ రాబోతోందని వైఎస్సార్ సీపీ నేత ఎద్దేవా చేశారు. మారు వేషాల్లో తండ్రీకొడుకులు ఒకసారి ప్రజల్లో తిరిగితే వారు తమ గురించి ఏమనుకుంటున్నారో చంద్రబాబు, లోకేశ్‌లకు తెలుస్తుందని కన్నబాబు చెప్పారు. ఎమ్మెల్యే కోటాలో లోకేశ్ ఎమ్మెల్సీగా ఇటీవలే ఎన్నికైన విషయం తెలిసిందే.

వైఎస్ జగన్ దయాదాక్షిణ్యాలపై గెలిచి...


వైఎస్ జగన్ కచ్చితంగా సీఎం అవుతారు
అమరావతి: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కచ్చితంగా సీఎం అవుతారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ సీఎం కావాలనుకోవడం తప్పా అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ రాజకీయ వ్యభిచారులని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. అధికారం, మంత్రి పదవి, డబ్బుల కోసమే వారు వైఎస్ఆర్ సీపీని వీడి టీడీపీలో చేరారని అన్నారు. ఈ ముగ్గురికి ఏమాత్రం నైతికత లేదని, నైతికత ఉంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేవారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ దయాదాక్షిణ్యాలపై గెలిచి, ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రూపాయల చిల్లర కోసం ఆయనపై విమర్శలు చేయడం దారుణమని అన్నారు. రాజకీయ వ్యభిచారులను అసెంబ్లీలో మాట్లాడించి ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నీచ సంస్కృతికి తెరలేపారని విమర్శించారు.

గ్రాఫిక్స్ చూపించి మోసం


చెవిలో కాలీఫ్లవర్లు పెడుతున్నారు: రోజా
అమరావతి: శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు మరో డ్రామాకు తెర లేపారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  ఏపీ రాజధానిని సింగపూర్‌లా కడతామంటూ గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని ఆమె  ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ రాజధానిపై ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు...సింగపూర్ డిజైన్లను గాలికొదిలేశారా అని ప్రశ్నించారు. మాకీ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని మరో సంస్థకు మార్చడం వెనుక మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఎవరితో చర్చించకుండానే చంద్రబాబు రాజధానిని ఎంపిక చేశారని,ఆనాడు రాజధాని ఎంపిక విషయంలో ప్రతిపక్షాన్ని, అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని రోజా సూటిగా ప్రశ్నించారు.

రాజధానిలో డిజైన్లలో 51 శాతం గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకునే చంద్రబాబు ....మూడు పంటలు పండే 33వేల ఎకకాల భూమిని లాక్కుని ఎక్కడ నుంచో తెచ్చి చెట్లు పెడతానని  చెవిలో కాలీఫ‍్లవర్లు పెడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ప్రస్తుత రాజధానిలో చూసేందుకు ఓ చెట్టుకూడా లేదని అన్నారు. ఇక మహిళా మంత్రులు, ప్రతినిధులు వెళ్లేందుకు టాయిలెట్లు కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆమె పేర్కొన్నారు.


మొదట సింగపూర్‌ డిజైన్లు, తర్వాత పొగ గొట్టాల డిజైన్లను తెర మీదకు తెచ్చారని, తాజాగా ఫోస్టర్‌ సంస్థ డిజైన్లపై ప్రజంటేషన్‌ ఇస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆ రెండు గ్రాఫిక్‌లను పక్కనపెట్టి ఇప్పుడు మూడో గ్రాఫిక్‌ ను తెచ్చారని, దాన్ని కూడా ఖరారు చేస్తారో లేదో తెలియదన్నారు. రైతుల సమస్యలపై చర్చించాలని తాము కోరితే, గ్రాఫిక్‌ డిజైన్ల పేరుతో సభా సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు.
గతంలో సింగపూర్‌ సంస్థతో కుదుర్చుకున్న సీల్డ్‌ కవర్‌ ఒప్పందాన్ని అసెంబ్లీలో ఎందుకు బయటపెట్టలేదని రోజా డిమాండ్‌ చేశారు. అలాగే రాజధాని డిజైన్లలో ఏపీ సర్కార్‌ తమతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంపై మకీ సంస్థ కేంద్రానికి ఫిర్యాదు చేసిందన్నారు. దానిపై ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడంలేదని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు చూపించాల్సింది బొమ్మలు కాదనీ, భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే రాజధాని కావాలన్నారు. శాశ్వత రాజధాని డిజైన్లను సభలో ప్రదర్శించాలని రోజా డిమాండ్‌ చేశారు. గొప్పలు చెప్పుకుంటూ డిజైన్ల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగానే, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ కు వైఎస్‌ఆర్‌ సీపీ హాజరు కాలేదని ఆమె తెలిపారు.

ఎవర్ని మోసం చేయడానికి...: వైఎస్‌ జగన్‌


అమరావతి: మూడేళ్లు అయినా ఏపీ రాజధాని నిర్మాణానికి ఇటుక కూడా పెట్టలేదని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. రాజధాని డిజైన్లను ఇవాళ అసెంబ్లీలో ప్రదర్శించారు. అయితే ఆ ప్రజంటేషన్‌ కు వైఎస్‌ జగన్‌ హాజరు కాలేదు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ఎవరిని మోసం చేయడానికి రాజధాని డిజైన్లపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజంటేషన్‌ తో మరో గంట సమయం వృథా తప్ప ఒరిగేదేమీ లేదన్నారు.

కాగా మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ఇచ్చిన రాజధాని పరిపాలనా నగరం వ్యూహ డిజైన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ కొన్ని మార్పులు సూచించిన విషయం తెలిసిందే.  పాలనా నగరం మీదగా నిర్మించాలనుకుంటున్న జలమార్గం, అందుకు అవసరం అయిన నీరు, రాజధాని భవిష్యత్‌ జల అవసరాలు, పులిచింతల ప్రాజెక్టు దిగువన నిర్మించబోయే బ్యారేజీ నుంచి వచ్చే నీటిపై జలవనరుల శాఖ, బ్లూ, గ్రీన్‌ కన్సల్టెంట్లతో చర్చించి తుది ప్రణాళిక ఇవ్వాలని సీఎం సూచనలు చేశారు.

అవినీతి బైటపెడితే చాలెంజ్‌లా?


అవినీతి బైటపెడితే చాలెంజ్‌లా?
ఏపీ సీఎం బాబుకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ప్రశ్న

 మరి మేం చేసిన చాలెంజ్‌ల మాటేమిటి?
⇒ ‘ఓటుకు కోట్లు’లో వాయిస్‌పై చాలెంజ్‌ను ఒప్పుకోగలవా?
⇒ 21మందిని డిస్‌క్వాలిఫై చేసి ప్రజల్లోకి వెళదామన్న చాలెంజ్‌కు సిద్ధమా?
 ‘లక్ష కోట్లు’ నిరూపిస్తే 10% ఆస్తులు రాసిస్తా అనే చాలెంజ్‌కు ఓకేనా?
⇒ నా దగ్గరున్న ఆధారాలన్నీ అగ్రిగోల్డ్‌ బాధితులు ఇచ్చినవే
⇒ సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌


సాక్షి, అమరావతి: ‘అగ్రిగోల్డ్‌ బాధితుల తరపున మేం అసెంబ్లీలో మాట్లాడితే రాజకీయాలకు ముడిపెడుతూ చాలెంజ్‌లు విసురుతారా? మరి మా చాలెంజ్‌ల మాటే మిటి? వాటిని ఎందుకు ఒప్పుకోవడం లేదు?’అని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. గతంలో మేము మూడు విషయాలపై చాలెంజ్‌.. చాలెంజ్‌ అని సభలోనే చెప్పాం, వాటిపై ఎందుకు వెనక్కు పోతు న్నారని ఆయన నిలదీశారు. లక్షలాది మంది అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను పక్కకు తప్పించేం దుకు, ప్రత్తిపాటి పుల్లారావును ఎలాగైనా ఈ సమస్యనుంచి బయటపడేసేందుకు కొత్త కథలను తెరమీదకు తెస్తున్నారని జగన్‌ విమర్శించారు. పుల్లారావు ఒక్కరే ఇందులో దోషి కాదని,   చాలామంది పెద్దలు ఉన్నారన్నారు. శుక్రవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత తన చాంబర్‌లోనూ, సాయంత్రం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలోనూ జగన్‌ మీడియాతో మాట్లాడారు. ముఖ్యాం శాలు ఆయన మాటల్లోనే...

ఆ మూడు చాలెంజ్‌లకు ఒప్పుకుంటారా?
‘‘ఓటుకు నోట్ల కేసులో ఆ వాయిస్‌ నీది కాదు అని ప్రూవ్‌ చేయగలవా? చాలెంజ్‌ అని చెప్పాం. దానికి చంద్రబాబు ఎందుకు రావడం లేదు. ఎందుకంటే ఫోరెన్సిక్‌ రిపోర్టులో వాయిస్‌ ఆయనదే అని తేలింది. అడ్డగోలుగా ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోయి, నల్లధనాన్ని సూట్‌కేసుల్లో తీసుకుని పోయి అది పంపిణీ చేసి దొరికిపోయిన కథ. ఇదే సభలో చాలెంజ్‌ చేశాం.  ఏమాత్రం సిగ్గున్నా, ప్రజాస్వా మ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలను డిస్‌క్వా లిఫై చెయ్యి. వాళ్లు మా పార్టీ గుర్తుమీద గెలిచిన ఎమ్మెల్యేలు. ఎన్నికలకు వెళ్దాం. అదే రెఫరెండంగా తీసుకుందాం. మాకు మెజార్టీ వస్తే మీ పదవి నుంచి నువ్వు తప్పుకుంటావా అని ఛాలెంజ్‌  చేసా. దానికి ఒప్పుకోడు. ఎమ్మెల్యేలతో వ్యక్తిగత దూషణలు చేయిం చారు.

టీడీపీ, కాంగ్రెస్‌ వాళ్లే పిటిషనర్లుగా నాపై కేసు వేశారు. కాంగ్రెస్‌లో ఉన్నన్నాళ్లు, రాజశేఖర్‌రెడ్డి బతికినన్నా న్నాళ్లు నాపైన కేసులు లేవు. వైఎస్‌ చనిపోయిన తర్వాత,  నేను కాంగ్రెస్‌ విడిచిపెట్టాక..చంద్రబాబు, కాంగ్రెస్‌ కుమ్మక్కై కేసులు వేశారు. ఆరోపణల ఆధారంగా (నిజాలు కావు) సీబీఐ రూ.1200 కోట్లు అని చెబితే... ఒకరేమో లక్ష కోట్లు, ఒకరేమో 43 వేల కోట్లు అంటారు..... ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ అదే గోబెల్స్‌ ప్రచారం. చివరకు నాకు 10 పర్సెంట్‌ ఇవ్వండయ్యా ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతా అని చెప్పా. చాలెంజ్‌ కూడా చేశాను. రూ. 4300 కోట్లకు డీడీ ఇవ్వచ్చుగా. లేదంటే  10వేల కోట్లకు డీడీ ఇవ్వచ్చుగా. ఏదైనా వాళ్లు చాలెంజ్‌ చేస్తే... మేము చేసిన చాలెంజ్‌లను కూడా ఒప్పుకోవాలి కదా. కానీ వాళ్లు ఒప్పుకోరు.

ఆ ఆధారాలన్నీ బాధితులు ఇచ్చినవే..
ఇవన్నీ కూడా నాకు అగ్రిగోల్డ్‌ బాధితులు ఇచ్చిన సాక్ష్యా ధారాలే...(రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లను చూపిస్తూ...) వారే నా వద్దకు వచ్చి వీటిని అసెంబ్లీలో ప్రస్తావించాల్సిందిగా కోరారు. ప్రతిపక్షనేతగా అది నా బాధ్యత కనుక వాటిని ప్రస్తావించాలని ప్రయత్నించాను. 20 లక్షల మంది బాధిత కుటుంబాల తరపున మాట్లాడ్డానికి నాకు 20 నిమిషాలు సమయం ఇవ్వలేదు కాని, మాకు చాలెంజ్‌ విసురుతూ మాట్లాడ్డానికి రెండు రోజులు సమయం వృథా చేశారు. వాస్తవానికి జాతీయ స్థాయిలో బోఫోర్స్‌ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు బయట పెడితే వచ్చినవే... మరి అప్పటి కేంద్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలకు రాజకీయ చాలెంజ్‌లు చేయలేదే.... అగ్రిగోల్డ్‌లో ఉన్న డైరెక్టర్లు, బంధువులు, చాలా భూములు వాళ్ల వ్యక్తిగత పేర్లతో కంపెనీలో ఉంటూ వాళ్ల ఆస్తులు ఇష్టానుసారంగా పెంచుకుంటున్నారు... తిరుపతిలో 1.03 ఎకరాల వెంకటాద్రి హోటల్‌ రూ.14 కోట్లకు అమ్ముకున్నారు.

ఆ ఆస్తి ఇందులోకి వస్తే మాకు మేలు జరుగుతుంది కదా అంటూ డిపాజిటర్లు ఆధారాలు ఇస్తున్నారు. లావాదేవీలకు సంబంధించి ఆధారాలు కూడా ఇచ్చారు. ఈ ఆధారాలు చూస్తే  ప్రత్తిపాటి పుల్లారావుకు సంబంధముందని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అటువంటి ఆరోపణలపై విచారణ వేసి నివృత్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైన ఉంది. అది చేయకపోగా ప్రత్తిపాటి పేరు బయటికి వస్తే డొంకంతా ఎక్కడ కదులుతుందోనన్న భయంతో సమస్యను తప్పుదారి పట్టించారు.   

సభలో నేనైనా... పుల్లారావైనా ఉండాలట!
పుల్లారావైనా.. నేనైనా ఒకరే సభలో ఉండాలని తీర్మానం చేయడం ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్ష నేత చేసిన ఆరోప ణలు నిజమైతే పుల్లారావు శాసనసభ నుంచి వైదొలుగు తారట. రుజువుకాని పక్షంలో జగన్‌ శాసనసభ నుంచి వైదొలగాలట. నిజంగా చంద్రబాబుకు మెదడు ఉండే ఇలాంటి తీర్మానాలు చేస్తున్నారా అనిపిస్తుంది. చంద్ర బాబుకు పూర్తిగా అనుకూలంగా ఉండే పత్రికకు చెందిన విలేకర్లకు ఎప్పుడూ గౌరవం ఇవ్వకుండా పోలేదే. వాళ్లను కూడా అందరు రిపోర్టర్ల లాగే చూస్తా. అంతేగానీ నచ్చలేదు కదా అని తొక్కడం ఏంది? న్యాయం అనేది జరగాలంటే  మేము చెప్పిన వాటికి కూడా వాళ్లు ఒప్పుకోవాలి కదా? ప్రాథమిక సాక్ష్యాధారాలకు సంబంధించిన వివరాలు నేను చూపిస్తున్నా. వాటిని చూసి జ్యుడిషియల్‌ విచారణ చేయాలి. సీబీఐ సహకారం కూడా తీసుకుని చెయ్యాలి.
ఆ తర్వాత ప్రభుత్వం ఒక నిర్ధారణకు రావాలి. అంతేగానీ నేనెక్కడ ఆధారాలూ చూపిస్తానో అన్న భయంతో నాకు అవకాశం ఇవ్వకుండా...  నిరూపించలేకపోతే పక్కకు తప్పుకోవాలన్న ఏకపక్ష నిర్ణయం ఏంది?  ఇంతకన్నా మెరుగైన ఆధారాలు ఉంటే చూపించండి. సభ జరగాలి గానీ, కుళాయిల దగ్గర కొట్టుకున్నట్లు కాదు. అక్కడన్నా కొద్దిగా హుందాగా ఉంటారు. కుళాయిల దగ్గర మగాళ్లు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సభ. సమస్యలుండి మాట్లాడలేని వారి గొంతును ప్రతిపక్షం వినిపిం చాలి. అగ్రిగోల్డ్‌ బా«ధితులు ఇచ్చిన ఆధారాలను సభలో చూపించాల్సిన ధర్మం, బాధ్యత ప్రతిపక్షానిది. వాళ్లే (బాధితులే) వీటిని సభలో చెప్పాల్సిందిగా నాకు విజ్ఞప్తి చేశారు.  ఇందులో పుల్లారావు ఒక్కరిదే టాపిక్‌ కాదు. ఇందులో ఆయన పాత్ర చీమంత మాత్రమే.

హైకోర్టు సిటింగ్‌ జడ్జి పర్యవేక్షణలో  సీబీఐ విచారణ జరపాలి
అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌తో సహా వారు 8 మంది సోదరులైతే ఇద్దరినే అరెస్టు చేశారు. అగ్రిగోల్డ్‌ వెనుక చాలా మంది పెద్దలున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ లావాదేవీలు, ఆ సంస్థ ఆస్తుల వ్యవహారాలపై హైకోర్టు సిటింగ్‌ న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ ఆధ్వర్యంలో విచారణ జరిపించాలి.  సిట్టింగ్‌జడ్జితో విచారణ ఆధ్వ ర్యంలో చేస్తూ, ఓ వైపు వేలం కొనసాగుతూ, మరోవైపు విచారణ జరుగుతూంటే అగ్రిగోల్డ్‌ ఆస్తులన్నీ బయటకు వస్తాయి. దీంతో బాధితులకు ఎక్కువ సొమ్ము  ఇవ్వచ్చు. అగ్రిగోల్డ్‌ బాధితులు కష్టపడి ఇన్ని ఆధారాలు సేకరించి నాకు ఎందుకు ఇచ్చారు? ఇక్కడికొస్తే న్యాయం జరుగుతుం దన్న ఆశ.  తిరుపతిలో వెంకటాద్రి హోటల్‌ అమ్మకం గురించి చెప్పాను...అది పుల్లారావుది కాదు కదా. బ్రహ్మం గారి మఠంలో కొన్ని ఆస్తులు అమ్ముకున్న డైరెక్టర్‌ సీతారాం గురించి చెప్పాను కదా... అది పుల్లారావుకు ఏం సంబంధం? ఎక్కడ జరిగినా  ఆస్తులు బయటకు రావాలి.

సాక్ష్యాధారాలివిగో...
రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్యకు భూములు అమ్మిన ఉదయ్‌ దినకరన్‌ అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. హ్యాయ్‌ ల్యాండ్‌ను నిర్వహిస్తున్న ఆర్కా లీజర్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు. 2010 నుంచీ ఆయన ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. రామ్‌ నివాస్‌ కంపెనీలో కూడా ఆయన కొనసాగుతు న్నారు. అగ్రిగోల్డ్‌ ప్రజలకు టోపీ పెడుతోం దన్న సమయంలోనే...  2014 జూలై 31న వెంకటకృష్ణ ఆంజనేయ ప్రసాద్‌ అనే వ్యక్తి వద్ద నుంచి దినకరన్‌ భూములు కొనుగోలు చేశారు. ఆ తరువాత 2014 డిసెంబర్‌ 24న నెల్లూరులో అగ్రిగోల్డ్‌ సంస్థపై కేసు పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2015 జనవరి రెండోతేదీన కేసు నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన డీఎస్పీ 2015 జనవరి నాలుగో తేదీన అగ్రిగోల్డ్‌ సంస్థ ఛైర్మన్‌ ఇంటిపై దాడులు నిర్వహించారు.

ఆ వెంటనే హాయ్‌ల్యాండ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ దినకరన్‌ జనవరి 19వ తేదీన పుల్లారావుకు తక్కువ రేటుకు భూములు అమ్మారు. లంచం ఇస్తామన్నట్లుగా... తీసుకుంటామన్నట్లుగా ఈ లావాదేవీ జరిగింది. పుల్లారావు భార్య వెంకాయమ్మ పేరిట ఈ భూములు కొన్నారు. ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదు. ఇక్కడ నేనడిగేది ఒక్కటే.... సీఐడీ విచారణ వద్దు. సీబీఐ విచారణ సిటిం గ్‌ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో జరగాలి. ఒక్క పుల్లారావే కాదు, దీని వెనుక ఉన్న పెద్ద గద్దలు అందరి మీద విచారణ జరిపి వారి వద్ద ఉన్న ఆస్తులను వేలం పరిధిలోకి తెచ్చి అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి. నేనిచ్చే ఆధారాలు ఏ మేరకు సరిపోతాయో నేను చెప్పలేను కానీ... ఇది పక్కాగా ప్రాథమిక సాక్ష్యాధా రాలు ఉన్న కేసు అని చెప్పగలను.

ఆ ఆస్తులు ఎందుకు వేలంలోకి రావడం లేదు?
అగ్రిగోల్డ్‌కు సంబంధించిన హాయ్‌ల్యాండ్‌ ప్రాపర్టీ వేలంలోకి ఎందుకు రాలేదు? విశాఖపట్నం జిల్లా యారాడ వద్ద ఉన్న ఆస్తులు ఎందుకు వేలంలోకి రావడం లేదు? ఖరీదైన అతిహయ షాపింగ్‌ మాల్‌ వేలంలోకి రాలేదే? ఎందుకు వీటిని వేలంలోకి తేవడం లేదంటే దీని వెనక మంత్రుల నుంచి అందరూ ఉన్నారు కాబట్టి. ఇలా విలువైన ఆస్తులు ఒకటిన్నర సంవత్సరం నుంచి వేలం ప్రక్రియ జరుగుతున్నా డిపాటిజ్‌ దారులకు ఇచ్చింది కేవలం రూ.16 కోట్లే. వీటికి వడ్డీలెంత అవుతాయి వాళ్ల గురించి ఎవరైనా పట్టించుకున్నారా? అసలు వాళ్లకు రూ.1182 కోట్లు  ఇస్తే 14 లక్షల మందికి మేలు జరుగుతుంది.

గవర్నమెంటు దగ్గరే ఆస్తులు ఉన్నాయి. ఆ ఉపశమనం చేయచ్చు కదా. ముఖ్యమంత్రి నుంచి ఏదైనా మంచి మాట వస్తుందేమోనని బాధితులు ఆశించారు. కానీ రాలేదు.  టాపిక్‌ డైవర్ట్‌ చేసేందుకు కొత్తగా చాలెంజ్‌ అంట. అంటే రేపు పొద్దున ఎవరైనా ఆరోపణ తీసుకుని వస్తే అది వినకుండా దాన్ని సైడ్‌లైన్‌ చేసేదానికి నువ్వు ప్రూవ్‌ చెయ్యలేకపోతే రాజీనామా చేస్తావా అని సమస్యను పక్కదారి పట్టిస్తారు. మేము చాలెంజ్‌ చేస్తే వాళ్లు తీసుకోరు.

కిడ్నీ, ప్లోరోసిస్‌ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలి

Written By news on Friday, March 24, 2017 | 3/24/2017


ఢిల్లీ: ఈ నెల 28, 29 తేదీల్లో ప్రకాశం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కాడ్నీ సమస్యలపై కేంద్ర బృందం అధ్యయనం చేయనుందని, బృందంతో ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో తాను వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ రెండు జిల్లాలో కిడ్నీ, ప్లోరోసిస్‌ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

ఇది వేల కోట్ల స్కాం.. సీబీఐ విచారణ అవసరంఅగ్రిగోల్డ్ పేరుతో జరిగినది వేల కోట్లతో కూడిన అతిపెద్ద స్కాం అని, ఇందులో 20 లక్షల కుటుంబాలకు నెత్తిన టోపీ పెట్టారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దీనిపై హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో సంస్థ భూములు, ఇతర ఆస్తులను వేలం వేసి మొత్తం బాధితులందరికీ వాళ్ల సొమ్ము ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ అంశం గురించి అసెంబ్లీలో మాట్లాడేందుకు, తనకు బాధితులు ఇచ్చిన ఆధారాలను చూపించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. దానిపై ఆయన ఏమన్నారంటే... • ఈరోజు అసెంబ్లీ జరిగిన తీరును అంతా చూసే ఉంటారు
 • ఇంత దారుణమైన కౌరవ సభ దేశంలో ఎక్కడా ఉండి ఉండదు
 • సాక్ష్యాధారాలు చూపిస్తూ, 20 నిమిషాల టైం ఇవ్వండి, ఆధారాలతో నిరూపిస్తానన్నాను
 • అగ్రిగోల్డ్ సమస్య నాకు.. పుల్లారావుకు మధ్య వ్యక్తిగత సమస్య కాదని చెప్పాను
 • ఆ టైం ఆయన ఇచ్చి ఉంటే ఈ ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు
 • నేను చూపుతున్న ఈ ఆధారాలతో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నాను
 • బాధితులే ఈ ఆధారాలను తీసుకొచ్చి నాకు ఇచ్చారు.. ఇవేవో నేను తెచ్చినవి కావు
 • ఈ ఆస్తులన్నీ బయటకు వెళ్లిపోతే తమకు డబ్బులు రావని.. పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని చెప్పారు
 • అందుకే ఈ ఆధారాలను మాకు తీసుకొచ్చి ఇచ్చారు
 • మాకు ఇవ్వాల్సిన సొమ్ము రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు
 • కానీ గురువారం అగ్రిగోల్డ్ టాపిక్ జరుగుతుంటే మధ్యలో స్పీకర్ మైక్ కట్ చేశారు
 • ఆడవాళ్ల గురించి తాను చేసిన వ్యాఖ్యల గురించిన ప్రెస్‌మీట్ వీడియోను ప్రదర్శించి చూపించారు
 • అంత దారుణంగా విషయాన్ని డైవర్ట్ చేశారు
 • ఈరోజు కూడా అలాగే జరిగింది.. ఆధారాలు ఉన్నాయి, చూపిస్తానంటే అవకాశం ఇవ్వలేదు
 • వాళ్ల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే గద్దల మాదిరిగా తన్నుకుపోతోంది
 • ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నాకు చాలెంజ్ చేస్తారు
 • 20 లక్షల కుటుంబాలకు టోపీ పెట్టి, వేలకోట్లు మింగేసిన అతిపెద్ద స్కాం
 • ఈ స్కాంలో పుల్లారావు అనే వ్యక్తి చిన్న చీమలాంటి వారు
 • ఈయన లాంటివాళ్లు చాలామంది పెద్దమనుషులున్నారు.. వాళ్ల పేర్లు బయటకు రావాలి
 • ఆ పెద్దమనుషుల చేతుల్లోంచి అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలి
 • వాటిని మళ్లీ అటాచ్‌మెంట్‌లోకి తీసుకొచ్చి, డిపాజిట్ దారులకు మేలు జరిగేలా చూడాలి
 • ఆస్తులను అమ్మి వాళ్లకు డబ్బులు ఇప్పించాలి
 • మాట్లాడలేని ఆ గొంతుకలను నేను అసెంబ్లీలో వినిపించే ప్రయత్నం చేశాను
 • దానికి నాకు, పుల్లారావుకు మధ్య ఏదో గొడవ ఉన్నట్లు చూపించారు
 • సభలో ఆయనైనా ఉండాలట.. లేకపోతే నేనైనా ఉండాలట.
 • అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానం వల్ల అగ్రిగోల్డ్ బాధితులకు మంచి ఏమైనా జరుగుతుందా?
 • ఆరోపణలు వినాలన్న ఉద్దేశం లేదు గానీ టాపిక్‌ను డైవర్ట్ చేస్తున్నారు
 • దేశంలో బోఫోర్స్, స్పెక్ట్రం, కోల్ స్కాంల మీద విచారణ ఎలా మొదలైంది.. ప్రతిపక్షాలు తమవద్ద ఉన్న ఆధారాలను పార్లమెంటులో ప్రస్తావిస్తే చర్చ జరిగి ఆ తర్వాత విచారణ జరిగింది, అప్పుడే స్కాంలు బయటకు వచ్చాయి
 • ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.. బాధితులు ఇచ్చిన ఆధారాలను చూపించడానికి అసెంబ్లీలో 20 నిమిషాల సమయం అడిగినా ఇవ్వకుండా చాలెంజ్ అనే కొత్తపేరు తీసుకొచ్చారు
 • ఇదే చంద్రబాబును అడుగుతున్నా.. చాలెంజ్ మీద నమ్మకం ఉంటే ఇదే సభలో ఎన్నిసార్లు మేం చాలెంజ్ చేశాం.. ఆయనేమైనా స్పందించారా?

   
 • 21 మంది మా శాసన సభ్యులను కండువాలు కప్పి మీవైపు కూర్చోబెట్టుకున్నావు
 • ఆ 21 మంది నీ పార్టీ గుర్తుతో గెలవలేదు.. వాళ్ల మీద అనర్హత వేటు పడకుండా సీఎం, స్పీకర్ కలిసి నాటకం ఆడుతున్నారు
 • వాళ్లంతా అధికారపక్షం బెంచీలలో కూర్చున్నారు. వాళ్లను ఎందుకు అనర్హులుగా ప్రకటించడం లేదు
 • ప్రజల మీద నమ్మకం ఉంటే, వాళ్లపై అనర్హత వేటు వేసి, నీ పార్టీ గుర్తుమీద వాళ్లను పోటీ చేయించు
 • ప్రజలిచ్చే మాండేట్‌ను రిఫరెండంగా తీసుకుందాం.. మాకు మెజారిటీ వస్తే దాన్ని ప్రజాతీర్పుగా తీసుకొమ్మని సవాలు చేశాం
 • తెలంగాణలో కోట్ల రూపాయల లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయారు
 • సుప్రీంకోర్టు ఆ కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. ఆ గొంతు చంద్రబాబుది కాదని నిరూపించగలరా అని చాలెంజ్ చేశాం.. వినలేదు
 • ఆయన చాలెంజ్ తీసుకోరు గానీ, అవతలి వాళ్లు మాత్రం రెచ్చిపోయి, చాలెంజ్ తీసుకోవాలట. లేకపోతే ఏదో తప్పు చేసినట్లు అవుతుందట
 • అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వాలి.. ఆరోపణలు వచ్చినప్పుడు సాక్ష్యాలలో పస ఉంటే విచారణ పిలిపించాలి
 • 16 ఎకరాల హాయ్‌ల్యాండ్ భూములను ఎందుకు వేలం వేశారో ఎవరికీ తెలియదు
 • విలువైన ఆస్తులు ఎందుకు బయటకు రావడం లేదో ఎవరికీ అర్థం కావట్లేదు
 • ఎంపీలకు హస్తం ఉందని, చంద్రబాబు కొడుక్కి కూడా హస్తం ఉందని ఆరోపణలున్నాయి
 • ఇప్పటివరకు అగ్రిగోల్డ్ బాధితులకు వచ్చింది కేవలం 16 కోట్లు మాత్రమే
 • కేవలం 1152 కోట్లు ఇస్తే మొత్తం 14 లక్షల మందికి పైగా ఉన్న బాధితులందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు
 • కానీ చంద్రబాబుకు మాత్రం ఈ విషయాలేవీ పట్టవు
 • అగ్రిగోల్డ్ గురించి మాట్లాడకుండా ఎలా కట్టడి చేయాలని మాత్రమే ఇలాంటి తీర్మానాలు చేస్తారు
 • ఈ కేసులో ఇప్పటికి ఇద్దరిని మాత్రమే అరెస్టు చేశారు. చైర్మన్, ఆయన తమ్ముడు మాత్రమే
 • ఈ కేసులో ఇంకా చాలామంది ఉన్నారు.. అంతా కంపెనీలలో ఉంటూ ప్రజల డబ్బులను దుర్వినియోగం చేసి, వాటితో బయట ఆస్తులు కొన్నారని అసెంబ్లీ దృష్టికి తెచ్చాను
 • ఒక్క ప్రత్తిపాటి పుల్లారావు మాత్రమే కాదు, తిరుపతిలో 14.5 కోట్లకు ఒకటిన్నర ఎకరాల భూమిని అమ్మేశారు
 • బ్రహ్మంగారి మఠంలో వాళ్లకున్న భూములను అమ్ముకున్నారని, 2016లో కూడా జరిగిందని చెప్పాం
 • ఇన్ని జరుగుతుంటే, వీటిని వినాలన్న ఉద్దేశం లేదు
 • ప్రత్తిపాటి పుల్లారావు భార్యకు భూములు అమ్మిన వ్యక్తి ఉదయ దినకరన్
 • ఆయన అగ్రిగోల్డ్ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్నాడు, హాయ్‌ల్యాండ్ ప్రాపర్టీకి కూడా డైరెక్టర్‌గా ఉన్నాడు
 • ఆర్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌లో 2010 మార్చి 8 నుంచి ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు
 • ఈ పెద్దమనిషి ఆ ఒక్క కంపెనీయే కాదు.. రామవ్వాస్ అనే మరో కంపెనీలో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు
 • ఒకవైపు అగ్రిగోల్డ్ ప్రజలకు టోపీ పెడుతోందని ఆరోపణలు వస్తున్నా, 2014లో ఈయన భూములు కొనుగోలు చేశారు
 • వెంకట కృష్ణ ఆంజనేయ ప్రసాద్ నుంచి దినకరన్ 2014 జూలైలో కొన్నారు
 • ఆ తర్వాత.. అగ్రిగోల్డ్ మీద కేసులు పడ్డాయి. 2015 జనవరి4న పశ్చిమగోదావరి జిల్లా పెదపాడులో కేసులు నమోదయ్యాయి
 • ఇదే హాయ్‌ల్యాండ్‌లో ఉన్న డైరెక్టర్ ఉదయ్ దినకరన్ 19వ తేదీన ప్రత్తిపాటి పుల్లారావుకు భూములు అమ్మారు
 • ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ.. ఉదయ్ దినకరన్ నుంచి భూములు కొన్న సేల్ డీడ్ కాపీ కూడా ఉంది
 • స్పెక్ట్రం కేసులోను, కోల్ స్కాంలోను, బోఫోర్స్ స్కాంలోను ప్రతిపక్షాలు ఏం మాట్లాడాయో నాకు తెలియదు గానీ, వాటి మీద సీబీఐ విచారణ జరిగింది
 • ఇప్పుడు నేను ఆధారాలతో సహా చూపిస్తున్నాను.. సీఐడీ విచారణ వద్దు, అది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది
 • హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరగాలి
 • అది జరిగినా కూడా అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు నష్టం మాత్రం జరగకూడదు.
 • ఒక్క పుల్లారావే కాదు.. గద్దలు అందరిమీద విచారణ చేసి, ఆస్తులన్నింటినీ వెనక్కి తీసుకొచ్చి వాటిని రీ ఎటాచ్ చేసి, వాటిని వేలం వేయగా వచ్చిన డబ్బును డిపాజిట్‌దారులకు అందజేయాలి
   
 • ఈ విషయాలు చెప్పడానికి 20 నిమిషాల సమయం అడిగితే ఇవ్వలేదు
 • నేనేమైనా సీబీఐ అధికారినా, పోలీసునా.. నేను పిలిస్తే చంద్రబాబు, ఆయన కొడుకు ఏమైనా వస్తారా..
 • ఇది 20 లక్షల కుటుంబాలకు సంబంధించిన సమస్యే తప్ప జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత సమస్య కాదని చెప్పాను
 • అందరి సంక్షేమం కోసం 20 నిమిషాల సమయం ఇవ్వమని అడిగితే వెంటనే మైక్ కట్ చేసేస్తున్నారు
 • ప్రజాస్వామ్యంలో స్పీకర్ ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలియాలి
 • స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేముందు 14 రోజుల సమయం ఉండాలని నిబంధనలు ఉన్నాయి
 • కానీ ఇంతకుముందు స్పీకర్ దాన్ని తోసిపారేసి.. వెంటనే అవిశ్వాసం చేపట్టారు
 • ఎందుకంటే, 21 మంది సభ్యులకు విప్ జారీ చేసే అవకాశం మాకు ఇవ్వకూడదని
 • ఇప్పుడు కూడా దాదాపు అలాగే చేస్తారు.. తీర్మానం వీగిపోయేలా చేస్తారు
 • అయినా అవిశ్వాస తీర్మానం పెడతాం.. ఎందుకంటే, ఈ సభలో ఉన్నది మనుషులు కారు, రాక్షసులని ప్రజలకు తెలియాలి
 • చివరకు ప్రజలు మొట్టికాయలు వేస్తారు, పైనుంచి దేవుడు కూడా మొట్టికాయలు వేయాల్సిందే

రుణమాఫీపై అసెంబ్లీలోనూ అబద్ధాలే

ఆ తర్వాత రైతు రుణమాఫీపై వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో చెప్పిన విషయాలు, వాటిలోని అబద్ధాలను సాక్ష్యాధారాలతో సహా జగన్ నిరూపించారు. విశాఖపట్నానికి చెందిన వైఎస్ఆర్‌సీపీ నాయకుడు కరణం ధర్మశ్రీ కుటుంబానికి చెందిన మూడు రుణాలు పూర్తిగా మాఫీ అయిపోయినట్లు మంత్రి చెప్పారని, కానీ అదంతా పచ్చి అబద్ధమని చెప్పారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపించారు. ఈ సందర్భంలో జగన్ ఏమన్నారంటే..
 • చంద్రబాబు సీఎం అయ్యేనాటికి రైతులకు 87,612 కోట్ల రుణాలు ఉన్నాయి
 • ఆయన కట్టొద్దన్నందుకు రైతులు ఆ రుణాలు కట్టలేదు, దాంతో వారికి బ్యాంకులు అపరాధ వడ్డీ వేస్తున్నాయి
 • వీళ్లు ఏడాదికి 3500 కోట్లు ఇస్తూ మొత్తం రుణమాఫీ చేసేశామంటున్నారు
 • దాదాపు 40 లక్షల రైతుల అకౌంట్లు ఎన్‌పీఏలుగా బ్యాంకులు ప్రకటించాయి
 • మరోవైపు రైతుల రుణభారం విపరీతంగా పెరుగుతోంది.. ఇప్పుడు దాదాపు 1.05 లక్షల కోట్లకు చేరుకుంది
 • కరణం ధర్మశ్రీకి 1.36 లక్షల రుణాలు మాఫీ అయ్యాయని చెప్పారు
 • విషయం ఏమిటంటే.. ప్రత్తిపాటి పుల్లారావు మూడు సందర్భాలు ప్రస్తావించారు
 • ధర్మశ్రీ భార్య విజయలక్ష్మి 49 సెంట్ల భూమి పెట్టి 2007లో 35 వేలు తీసుకున్నారని, కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అంత రాదని చెప్పారు
 • వడ్డీతో కలిపి ఇది 70వేలు అయ్యిందని చెప్పారు, దీనికి 13794 రుణమాఫీ చేశామని చెప్పారు
 • విజయలక్ష్మికి మొత్తం 4 ఎకరాల భూమి ఉంది
 • రెండు విడతలుగా ఆమెకు మొత్తం 5793 రూపాయలు మాత్రమే ఇప్పటికి మాఫీ అయింది
 • రెండో కేసు.. ధర్మశ్రీ పేరుతో ఉన్నది 2013లో 50 వేల రుణం
 • దీనికి మొత్తం రుణమంతా మాఫీ అయిపోయిందని పుల్లారావు చెప్పారు
 • మొదటి దఫా 10 వేలు ఇచ్చారు. అందులో అసలు 3200, ఇంకా వడ్డీ ఉన్నాయి
 • రెండోదఫాలో 11వేలు ఇచ్చారు..
 • ఈవాల్టికి 46వేలు, దానిపై వడ్డీ కలిపి 51వేల రుణం అలాగే ఉంది

వీఆర్ఏలకు 15 వేల జీతం ఇప్పిస్తా


వీఆర్ఏలకు 15 వేల జీతం ఇప్పిస్తా
విజయవాడ :
మూడేళ్లుగా పోరాటం చేస్తున్న వీఆర్ఏలకు ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సంఘీభావం తెలిపారు. వచ్చే ఏడాది ఎటూ ఎన్నికల సంవత్సరమేనని, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం ఏర్పడుతుందని.. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే వీఆర్ఏలకు రూ. 15 వేల వేతనం కచ్చితంగా ఇప్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా వీఆర్ఏ నాయకులు, ఆందోళన చేస్తున్న వారు హర్షధ్వానాలతో నిరసన ప్రాంగణాన్ని హోరెత్తించారు.

పక్క రాష్ట్రమైన తెలంగాణలో వీఆర్ఏలకు రూ. 10,700 వేతనం ఇస్తుంటే ఏపీలో మాత్రం చాలీచాలని జీతాలు ఇస్తున్నారని, దీనిపై మూడేళ్లుగా పోరాడుతున్నా సీఎం చంద్రబాబు మాత్రం ఎవ్వరి మాటలు వినిపించుకోవడం లేదని, ఆయన చర్మం మందమెక్కి పోయిందని జగన్ మండిపడ్డారు. మనం ఏం చెప్పినా ఆయన చెవికి ఎక్కించుకునే పరిస్థితిలో లేరన్నారు. ఈ ఏడాది, ఏడాదిన్నర కూడా గట్టిగా ప్రయత్నిద్దామని, అయినా చంద్రబాబుతో పనిచేయించుకోలేకపోతే.. ఎన్నికల తర్వాత వచ్చే మనందరి ప్రభుత్వంలో కచ్చితంగా వీఆర్ఏలకు రూ. 15,000 జీతం ఇప్పిస్తానని తెలిపారు. వీఆర్ఏల సంఘం నాయకులతో పాటు సీపీఎం బాబూరావును కూడా పిలిపించుకుని.. మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు చూస్తానన్నారు. ఎవ్వరూ అధైర్యపడద్దని భరోసా ఇచ్చారు.
 

20 నిమిషాలివ్వండి.. అన్నీ నిరూపిస్తా


20 నిమిషాలివ్వండి.. అన్నీ నిరూపిస్తా
విజయవాడ :
అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై తాను చేసిన ఆరోపణలన్నింటినీ నిరూపిస్తానని, అందుకు తనకు 20 నిమిషాల సమయం ఇవ్వాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఒకవేళ స్పీకర్ తనకు మైకు ఇవ్వకపోతే ఇవే ఆధారాలను తీసుకెళ్లి బయట మీడియాకు ఇస్తానని చెప్పారు. అయితే.. ఈ ఆధారాల గురించి చెప్పడం కాదని, జ్యుడీషియల్ విచారణకు సిద్ధమో కాదో చెప్పాలని అధికార పక్షం పట్టుబట్టింది. విచారణలో ప్రత్తిపాటి మీద ఆరోపణలు రుజువైతే ఆయన రాజీనామా చేస్తారని, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మంత్రి పుల్లారావు కొన్న భూములపై సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వైరీ కోరింది తామేనని, ఆరోపణలను నిరూపించే అవకాశం ఇవ్వాలని జగన్ కోరారు. తనకు కొద్దిపాటి సమయం ఇస్తే తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ సభ ముందు ఉంచుతానని వైఎస్ జగన్ పదే పదే కోరినా అందుకు స్పీకర్ అంగీకరించలేదు.

జగన్ ఇలా మాట్లాడుతుండగానే మధ్యలో మంత్రులు యనమల రామకృష్ణుడు, పైడికొండల మాణిక్యాలరావు తదితరులు అడ్డుకుని తమదైన రీతిలో ఎదురుదాడికి దిగారు. జగన్ వద్ద ఉన్న ఆధారాలన్నీ బోగస్ పేపర్లని, వాటితో ఆయన ఈ కేసును నిరూపించలేరని యనమల అన్నారు. అగ్రిగోల్డ్ అంశంపై రెండు రోజులు సభాసమయాన్ని వృథా చేశారన్నారు. అనంతరం ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ సుదీర్ఘంగా చదివారు. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
 

ఒక్క ఛాలెంజ్‌ కే రూలింగ్‌ ఇస్తారా?


అమరావతి: ప్రతిపక్షం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అసంతృప్తి వ‍్యక్తం చేశారు. అసెంబ్లీ పదినిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియాతో మా‍ట్లాడుతూ....సభలో ఒక్క ఛాలెంజ్‌ కే రూలింగ్‌ ఇస్తారా, తమ ఛాలెంజ్‌ లపై రూలింగ్‌ ఇవ్వారా అని ప్రశ్నించారు. దేనికైనా ధర్మం, న్యాయం ఉండాలని పార్టీ మారిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్‌ విసిరామని, కానీ స్పీకర్‌ ను అడ్డం పెట్టుకుని అనర్హత వేటు పడకుండా చూస్తున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు.
అనర్హత వేటు వేస్తే ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామన్న సవాల్‌ కు స్పందించలేదని, ఓటుకు కోట్లు కేసులో మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మి అనే వాయిస్‌ చంద్రబాబుదో, కాదో చెప్పాలని సవాల్‌ విసిరామని, దానిపై ఇప్పటివరకూ స్పందనలేదన్నారు.  ప్రతిపక్షం సవాళ్లపై స్పందించరని, అదే అధికారపక్షం సవాల్‌పై మాత్రం స్పందించాలని ఎదురు దాడి చేయడం సరికాదని వైఎస్‌ జగన్‌ అన్నారు. స్పీకర్‌ కూడా అధికారపక్షం వైపే ఉన్నారన్నారు.

చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీ కలిసి తనపై తప్పుడు కేసులు వేయించారని, అందుకే అవిశ్వాసం సమయంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కార్‌ను చంద్రబాబు కాపాడారని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. తన ఆస్తి లక్ష కోట్లు అని ఒకసారి, రూ.43వేల కోట్లని మరోసారి చెబుతున్నారని, అందులో 10శాతం ఇవ్వాలని తాను సవాల్‌ చేస్తే ప్రభుత్వం పారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. తన సవాళ్లపై స్పందించేందుకు ఇంతవరకూ ఒక్కరు కూడా ముందుకు రాలేదన్నారు. మళ్లీ అవే ఆరోపణలు తనపై చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఎప్పుడైనా వన్‌సైడ్‌ ఛాలెంజ్‌ ఉండదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వ్యవహారంలో తాను చేసిన సవాల్‌ కు సర్కార్‌ నుంచి స్పందనే లేదన్నారు.
అధికార పార్టీ నేతలకు సంబంధించి అగ్రిగోల్డ్‌ బాధితులు తనకు చాలా సమాచారం ఇచ్చిరని వైఎస్‌ జగన్‌ తెలిపారు. సభలో వాటిని తాను బయటపెడతాననే భయంతో మాట్లాడకుండా అడ్డుకుంటున్నారన్నారు. వాస్తవాలు చెబుతుంటే మైక్‌ కట్‌ చేస్తున్నారని ఆయన అన్నారు. సభలో తనను అడ్డుకున్నా టీడీపీ నేతలు, ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. సాయంత్రం మీడియా ఎదుట మొత్తం ఆధారాలతో సహా వెల్లడిస్తానని ఆయన తెలిపారు.
హాయ్‌లాండ్‌ ఆస్తులు ఎందుకు వేలానికి రాలేదని, యారాడ ప్రాపర్టీస్‌, షాపింగ్‌ మాల్స్‌ ను ఎందుకు వేలంలో చేర్చలేదని సూటిగా ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ బాధితులను ప్రభుత్వం మోసం చేస్తోందని, బాధితుల వద్దకు తాను వెళ్లి వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మృతులకు రూ.10 ల​క్షల చొప్పున చెల్లిస్తామనగానే కాస్త చలనం వచ్చిందన్నారు. మొదట రూ.3 లక్షల పరిహారాన్ని ప్రకటించి ...ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచిందని వైఎస్‌ జగన్‌ అన్నారు.

సభలో తాను మాట్లాడిన ప్రతిసారి మైక్‌ కట్‌ చేస్తున్నారని, అధికారపక్ష సభ్యులు లేచి సభను దారి మళ్లిస్తున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు. అగ్రిగోల్డ్‌పై ప్రభుత్వాన్ని నిలదీయగానే నలభై రోజుల కిందట వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ప్రజల గొంతు తాము వినిపిస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటోందని, సభలో తమపై ఆరోపణలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాళ్ల ట్రాప్‌ లో పడకుండా సంయమనం పాటిస్తే మళ్లీ తప్పుబడుతున్నారన్నారు. తమ సవాళ్లను చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరని ఆయన అన్నారు.

ఆ ఒక్కమాట చెప్పు


'చంద్రబాబూ ఆ ఒక్కమాట చెప్పు'
అమరావతి: 'మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ' అని ఆడియో టేపుల్లో వినిపించిన మాట 'నాది కాదు' అని అసెంబ్లీలో ఒక్కమాట చెప్పండి అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరారు. ఓటుకు కోట్లు కేసుపై అసెంబ్లీలో చర్చ జరగాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం అసెంబ్లీలో పట్టుబట్టింది. అయితే సభలో అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. అధికారపక్షం మాత్రం సభను తప్పుదోవపట్టించేలా వ్యక్తిగత దూషణలకు దిగింది.

ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఓటుకు నోట్లు కేసులో ముఖ్యమంత్రిపై వస్తున్న ఆరోపణలను సభలో చర్చించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబును తాము ముఖ్యమంత్రిగానే చూస్తున్నామని అన్నారు. ఆడియో టేపుల్లోని వాయిస్‌ నాది కాదు అని చెబితే.. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం కాపాడటానికి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినవారిపై పోరాటం చేస్తామని అన్నారు. ఆడియో టేపులోని వ్యాఖ్యలను అసెంబ్లీలో ప్లే చేయాలని శ్రీధర్‌రెడ్డి అన్నారు.

అందుకే మా గొంతు నొక్కుతున్నారు: వైఎస్‌ జగన్‌


అందుకే మా గొంతు నొక్కుతున్నారు: వైఎస్‌ జగన్‌
అమరావతి: అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో నిజానిజాలు బయటకు రాకుండా సభలో తమ గొంతు నొక్కుతున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ పదినిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆధారాలను సభముందు ఉంచేందుకు ప్రయత్నిస్తుంటే... తన ప్రయత్నాన్ని అధికారపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారన్నారు. సభలో పుల్లారావు భూముల కొనుగోలుపై తాను ఆధారాలు ప్రవేశపెట్టాక, తర్వాత వాళ్ల దగ్గర గొప్ప ఆధారాలుంటే సభలో ఇవ్వొచ్చన్నారు. ఇద్దరి వాదనలు విన్నాక తప్పెవరిదో ప్రజలే నిర్ణయిస్తారని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. అయితే ఆ అవకాశాన్ని స్పీకర్‌ తమకు ఇవ్వడం లేదన్నారు.

నీటి కుళాయిల దగ్గర సవాళ్ల మాదిరిగా విసురుతున్న సవాళ్లకు అర్థం లేదన్నారు. ఇదే సభలో గతంలో తాను విసిరిన సవాల్‌ కు ప్రభుత్వం పారిపోయిందని వైఎస్‌ జగన్‌ అన్నారు. తనపై కేసులకు సంబంధించి విసిరిన సవాల్‌ కు ప్రభుత్వం నోరు విప్పలేదన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజాలు బయటకు వస్తే మంత్రి పుల్లారావు సహా అధికార పార్టీ నేతల బండారం బయటపడుతుందనే భయం పట్టుకుందన్నారు. అందుకే తాను మాట్లాడటానికి ప్రయత్నిస్తే మైక్‌ కట్‌ చేస్తున్నారన్నారు. సభను ముందుకు తీసుకెళ్లాల్సిన స్పీకర్‌ ఆ పని చేయడం లేదని, సభ విలువలను, గౌరవాన్ని దిగజార్చుతున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు.

తమ బాగోతం బయటపడుతుందనే భయం: రోజా


తమ బాగోతం బయటపడుతుందనే భయం: రోజా
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా అధికారపక్ష సభ్యులు వైఎస్‌ జగన్‌ పై వ్యక్తిగత దూషణలు చేస్తూ సభను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా, కరువు, అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యల సహా ఏ ఒక్క అంశాన్ని ప్రభుత్వం చర్చకు అనుమతించలేదని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు.  చర్చ జరిగితే తమ బాగోతం బయటపడుతుందనే భయం అధికార పక్షానికి పట్టుకుందన్నారు. అందుకే ప్రతిసారి అధికారపక్ష సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు.  

ఓటుకు కోట్లు కేసు ఛార్జిషీటులో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీంకోర్టు నోటీసులపై చర్చించాలంటూ తాము వాయిదా తీర్మానం ఇస్తే...దానిపై చర్చించకుండా... అదో పనికిమాలిన కేసు అని, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఒకరు, పక్క రాష్ట్రంలో జరిగినదాన్ని తీసుకు వచ్చిన ఏపీ అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు అని మరొకరు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. స్పీకర్‌ తమకు తండ్రిలాంటివారని, ఆయనపై తమకు గౌరవం ఉందన్నారు.
ఇక ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్కయ్యారని, ఆడియో, వీడియో టేపుల్లో ఆయన దొరికిపోయారన్నారు. బ్రీఫ్‌ డ్‌ మి అన్న వాయిస్‌ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్‌ పరీక్షల్లో తేలిందని, చంద్రబాబు డబ్బులిచ్చారని రేవంత్‌ రెడ్డి స్వయంగా చెప్పారని రోజా పేర్కొన్నారు.

మిర్చి రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖీ


మిర్చి రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖీ
 వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం గుంటూరు మిర్చి యార్డ్‌ లో పర్యటించారు. ఈ సందర్భంగా మిర్చిరైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి తగ్గిందని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేదన్నారు. పంట అమ్మితే కూలి డబ్బులు కూడా రావడం లేదన్నారు. ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ...వైఎస్‌ జగన్‌ వద్ద వాపోయారు.
ఈ మధ్యనే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మార్కెట్‌ యార్డ్‌ ను సందర్శించారని, ఆ తర్వాత మిర్చి క్వింటాల్‌ ధర మరింత పడిపోయిందని రైతులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే 60శాతం ధరలు పడిపోయాయన్నారు. పట్టిసీమ నుంచి కృష్ణాలో ఏ కెనాల్‌ కు నీళ్లు ఇవ్వలేదన్నారు. కల్తీ విత్తనాలు, నీరు అందకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని, రోజురోజుకు రైతులపై రుణభారం పెరుగుతూ ఉందని రైతులు తమ గోడు వెలిబుచ్చారు.

'అగ్రిగోల్డ్‌' అంశాన్ని అటకెక్కించేందుకే: వైఎస్‌ జగన్‌

Written By news on Thursday, March 23, 2017 | 3/23/2017


'అగ్రిగోల్డ్‌' అంశాన్ని అటకెక్కించేందుకే: వైఎస్‌ జగన్‌
హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ అంశంపై చర్చను పక్కదోవ పట్టించేందుకే స్పీకర్‌ వ్యాఖ్యల అంశాన్ని తెరపైకి తెచ్చారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 20 లక్షల కుటుంబాలను రోడ్డున పడేసిన అగ్రిగోల్డ్‌ అంశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి పేరు ప్రస్తావనకు రావడంతోనే ఉద్దేశపూరితంగా అసెంబ్లీలో చర్చను అటకెక్కించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు నెల రోజుల కిందట జరిగిన మహిళా పార్లమెంటు సదస్సు సందర్భంగా ప్రెస్‌మీట్‌లో స్పీకర్‌ చేసిన వ్యాఖ్యల అంశాన్ని కావాలనే తెరపైకి తెచ్చారని విమర్శించారు.

మహిళల అత్యాచారాలపై స్పందిస్తూ స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలను ఒక్క 'సాక్షి' మీడియానే కాకుండా రాష్ట్రంలోని అన్ని చానెళ్లు, జాతీయ మీడియా సైతం ప్రచురించాయని, అలాంటప్పుడు ఒక్క 'సాక్షి' మాత్రమే ఆయన వ్యాఖ్యలను ప్రచురించినట్టు ప్రభుత్వం హంగామా చేస్తున్నదని దుయ్యబట్టారు. ఇంటియా టుడే, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, డెక్కన్‌ క్రానికల్‌ వంటి ఆంగ్ల మీడియాలో సైతం ఏపీ స్పీకర్‌ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి అంటూ కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు డైరెక్షన్‌కు కాలువ శ్రీనివాసులు యాక్షన్‌, స్పీకర్‌ రియాక్షన్‌..ఇలా అన్ని కలిసొచ్చి అగ్రిగోల్డ్‌ అంశం అటకెక్కిందని తప్పుబట్టారు. ఇంకా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..
 

 • స్పీకర్‌ వ్యాఖ్యల అంశం అసలు సభకు సంబంధించినది కాదు. ఈ అంశంపై వీడియోలు ప్రసారం చేయడం సభ సమయాన్ని వృథా చేయడమే.
 • ప్రజాస్వామ్యం నాలుగుకాళ్ల మీద నడువాలంటే అందరూ ఏకం కావాలి
 • నచ్చని టీవీ చానెళ్ల మీద ఇష్టమొచ్చినట్టుగా చర్య తీసుకుంటామంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది.
 • తెలంగాణలో ఎమ్మెల్సీ కొనుగోలు ప్రయత్నించి.. నోటుకు ఓటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. 
 • అప్పుడు చంద్రబాబు మాట్లాడిన ఆడియో, వీడియో క్లిప్పింగులు ఎందుకు అసెంబ్లీలో ప్రదర్శించడం లేదు
 • ఆ టేపులు శాసనసభలో ప్లే చేయాలని చంద్రబాబుకు, స్పీకర్‌కు అనిపించలేదా?
 • అగ్రిగోల్డ్‌కు రూ. 7వేల కోట్ల విలువచేసే భూములు ఉన్నాయి
 • అయినా, ఏడాదిన్నర కాలంలో కేవలం రూ.16 కోట్ల ఆస్తులు మాత్రమే అమ్మారు
 • అగ్రిగోల్డ్‌ ఆస్తుల నుంచి రూ. 1180 కోట్లు ఇస్తే 13 లక్షలమంది బాధితులకు న్యాయం జరుగుతుంది. ఇదే అగ్రిగోల్డ్‌ బాధితుల ప్రధాన డిమాండ్‌. కానీ ఆ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
 • అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో 105మంది చనిపోయారు. వారికి కేవలం రూ. 3 లక్షల పరిహారం ఇచ్చారు. చంద్రన్న పథకం కింద రూ. 5 లక్షల ఎక్స్‌గ్రెషియా ఇస్తూ.. అగ్రిగోల్డ్‌ బాధితులకు ముష్టి మూడు లక్షలా?
 • అగ్రిగోల్డ్‌ చైర్మన్‌, అతని ఒక తమ్ముడిని మాత్రమే అరెస్టు చేశారు. మిగతావారు బయట ఉండి ఆస్తులు అమ్ముతున్నారని బాధితులు చెప్పారు.
 • సీఐడీ విచారణ ప్రారంభించాక అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొంతమంది కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు
 • అందులో మంత్రి పత్తిపాటి పుల్లారావు సతీమణి ఉన్నారు
 • అగ్రిగోల్డ్‌పై కేసులు నమోదయ్యాక తక్కువ ధరకు ఆ భూములు కొన్నట్టు మంత్రి పుల్లారావే స్వయంగా అంగీకరించారు
 • అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌ సీతారాం తిరుపతిలోని హోటల్‌ను రూ. 14 కోట్లకు అమ్మారు
 • సీతారాం భార్య పుష్పలత 31 ఎకరాలు, కూతురు 8 ఎకరాలు విక్రయించారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు.
 • మంత్రి పుల్లారావు  దినకరన్‌ నుంచి భూములు కొనుగోలు చేశారు. ఆ దినకరన్‌ హాయ్‌లాండ్‌కు సీఈవో, డైరెక్టర్‌.
 • కానీ మంత్రేమో దినకరన్‌కు, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదంటున్నారు
 • హాయ్‌లాండ్‌ ఆస్తులు వేలం పరిధిలోకి రావా?
 • అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో హాయ్‌ల్యాండ్‌ ఆస్తులు, యరాడ వద్ద ఉన్న విలువైన ఆస్తులు ఎందుకు పట్టించుకోవడం లేదు. ఈ ఆస్తులను కూడా వేలం వేయాలి.
 • మా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిబోయి.. స్పీకర్‌ను అడ్డం పెట్టుకొని సభను తప్పుదోవ పట్టించారు.
 • పుల్లారావు భూముల కొనుగోలుపై హౌజ్‌ కమిటీ వేద్దామని ప్రభుత్వం అంటోంది
 • హౌస్‌ కమిటీ వేస్తే.. ప్రివిలేజ్‌ కమిటీలానే ఉంటుంది
 • ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే సిట్టింగ్‌ జడ్జితో జ్యుడీషియల్‌ విచారణ జరపాలి

సాక్షి ఒక్కటే కాదు...మిగతా ఛానల్స్‌ మాటేంటి?


సాక్షి ఒక్కటే కాదు...మిగతా ఛానల్స్‌ మాటేంటి?
అమరావతి: అగ్రిగోల్డ్‌ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నుతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడుతూ... టీడీపీకి మాత్రమే న్యాయం అన్నట్లుగా సమాధానం చెప్పాల్సిన సర్కార్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ కు పాల్పడుతోందని విమర్శించారు. తాము అగ్రిగోల్డ్‌ అంశాన్ని లేవనెత్తిన తర్వాతే ప్రభుత్వం దానిపై ఇవాళ సభలో ప్రకటన చేసిందన్నారు. సభలో స్పీకర్‌ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని మాట్లాడుతున్నారని, ఆయనకు తెలియకుండానే అసెంబ్లీ లోపలి దృశ్యాలను దొంగలించినప్పుడు ఆయన ప్రతిష్టకు భంగం వాటిల్లలేదా అని ప్రశ్నించారు.

మహిళా పార్లమెంట్‌ సదస్సు సందర్భంగా స్పీకర్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌ ను కు సాక్షి మీడియా రాలేదని, అయితే ఆ సందర్భంగా స్పీకర్‌ మహిళలపై చేసిన వ్యాఖ్యలను జాతీయ మీడియాతో సహా మిగతా అన్ని ఛానల్స్‌ ప్రసారం చేశాయన్నారు. మరి మిగతా ఛానళ్ల గురించి ఎందుకు ప్రస్తావించలేదని రోజా ప్రశ్నలు సంధించారు. సాక్షి చెబితేనే మిగతా ఛానల్స్‌ ఆ విజువల్స్‌ ప్రసారం చేయడానికి... ఆ ఛానల్స్‌ కు సాక్షి మీడియా చుట్టమో, ఫ్రెండో కాదని, వాటికేమీ ‘సాక్షి’  జీతాలు చెల్లించడం లేదని అన్నారు. మిగతా  ఛానళ్ల క్లిప్పింగ్‌ లను కూడా సభలో ప్రదర్శించాలని రోజా డిమాండ్‌ చేశారు.
ఒక్క సాక్షి మీడియా గురించే మాట్లాడుతున్నారంటే... నిజాలు ప్రజలకు తెలుస్తున్నాయందునే గొంతు నొక్కేందుకు చూస్తున్నారని అన్నారు. అగ్రిగోల్డ్‌ అంశంపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స‍్పందించాల్సి ఉండగా, మధ్యలో అచ్చెన్నాయుడు అత్యుత్సాహంతో కలగచేసుకుని విచారణకు తాము సిద్ధం అంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎప్పుడో జరిగిపోయిన అంశాన్ని ఇప్పుడు తెరమీదకు తెచ్చి అగ్రిగోల్డ్‌ అంశాన్ని పక్కదారి పట్టించారని ఆమె అన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని రోజా పేర్కొన్నారు.

వైఎస్‌ జగన్‌ సవాల్‌ తో ఇరుకునపడ్డ ప్రభుత్వం


అమరావతి: అగ్రిగోల్డ్ అంశంపై సవాళ్లు ప్రతిసవాళ్లతో గురువారం ఏపీ అసెంబ్లీ వేడెక్కింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూములపై హౌస్‌ కమిటీ విచారణకు ప్రభుత్వం సిద్ధమని తెలిపింది. అయితే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలంటే హౌస్‌ కమిటీతో కాదని... సిట్టింగ్‌ జడ్డితో జ్యుడీషియల్‌ విచారణ జరగాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సభలో డిమాండ్ చేశారు. 
అగ్రిగోల్డ్ ఆస్తులను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి కొనుగోలు చేసినట్లు, గతంలో పుల్లారావే అంగీకరించిన విషయాన్ని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. హౌస్ కమిటీ వేస్తే, ప్రివిలేజ్ కమిటీ మాదిరిగానే ఉంటుందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఏపీలో అధికార, ప్రతిపక్షమే ఉందని... ప్రివిలేజ్‌ కమిటీలోసభ్యుల్లో, ఐదుగురు అధికారపక్షం వారేనని, ఒకరు మాత్రమే ప్రతిపక్ష సభ్యుడు ఉంటారని, దాంతో తమకు ఎలాంటి న్యాయం జరుగుతుందన్నారు.  

ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అగ్రిగోల్డ్ అంశంపై జుడీషియల్ విచారణకు ముందుకు రావాలని జగన్ సవాల్ విసిరారు. దీంతో ఇరుకునపడ్డ ప్రభుత్వం ప్రతిపక్షంపై ఎమ్మెల్యేలు, మంత్రులతో ఎదురుదాడికి దిగింది.  ఈ సందర్భంగా సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సభను పదినిమిషాలు పాటు వాయిదా వేశారు.
మరోవైపు అగ్రిగోల్డ్‌ విచారణకు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేందుకు సిద్ధమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్‌ జగన్ డిమాండ్‌ను తాను స్వీకరిస్తున్నాని...ప్రత్తిపాటి సవాల్‌ను ప్రతిపక్ష నేత జగన్ స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. ఎవరిది తప్పో తేలితే వారిని సభ నుంచి బహిష్కరిద్దామని అన్నారు.

చంద్రబాబు కనీస మానవత్వం చూపలేదు
అమరావతి: అగ్రిగోల్డ్‌ బాధితుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవత్వంతో వ్యవహరించాలని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సభలో అగ్రిగోల్డ్‌ అంశంపైబ ప్రకటన చేశారు. అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... ’అగ్రిగోల్డ్‌ బాధితులు వెయ్యికళ్లతో చంద్రబాబు ప్రకటనపై ఆశగా ఎదురుచూశారు. కానీ ఆయన కనీస మానవత్వం కూడా చూపలేదు. 1,182 కోట్లు ఇస్తే 13లక్షల 83వేలమందికి న్యాయం జరుగుతుంది.
మేం వాయిదా తీర్మానం ఇచ్చాకే ప్రభుత్వం ప్రకటన చేసింది. అలాగే అగ్రిగోల్డ్‌ డిపాజిటరల్లతో పాటు, బాధితుల వివరాలు ఆన్‌ లైన్‌ లో పెట్టాలి. అరెస్ట్‌ల విషయంలోనూ పక్షపాతం చూపారు. అగ్రిగోల్డ్‌ చైర్మన్‌తో పాటు ఆయన సోదరుడిని అరెస్ట్‌ చేసి మిగతావారి జోలికి వెళ్లలేదు. డైరెక్టర్లలో ఒకరైన సీతారాం అనే వ్యక్తిని అరెస్ట్‌ చేయలేదు. సీఐడీ విచారణ ప్రారంభించాక అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొంతమంది కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అందులో మంత్రి ప్రత‍్తిపాటి పుల్లారావు సతీమణి ఉన్నారు.’  అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకుని... తాము కొన్న భూములు అగ్రిగోల్డ్‌ కు సంబంధించినవి కావన్నారు. అగ్రిగోల్డ్‌ భూములు కొన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు.

అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ తాను రుణమాఫీ అంశంపై మాట్లాడితే...అగ్రిగోల్డ్‌ అంశం పక్కదారి పడుతుందని అన్నారు. అందుకే దాని జోలికి పోదల్చుకోలేదన్నారు. అగ్రిగోల్డ్‌ పై కేసులు నమోదు అయ్యాకే తక్కువ ధరకు ఆ భూములు కొన్నట్లు మంత్రి పుల్లారావే స్వయంగా అంగీకరించారన్నారు. అగ్రిగోల్డ్‌ డైరెక‍్టర్ సీతారాం తిరుపతిలోని ఓ హోటల్‌ ను రూ.14కోట్లకు అమ్మారని, ఆయన భార్య పుష్పలత 31 ఎకరాలు, కుమార్తె 8 ఎకరాలు ఇటీవల విక్రయించారన్నారు.
అయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. మంత్రి కొన్న భూములు కొన్న దినకరన్‌... అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ కు చెందిన హాయ్‌లాండ్‌ కు సీఈవో, డైరెక్టర్‌ అని, అయితే మంత్రి మాత్రం దినకరన్‌ కు అగ్రిగోల్డ్‌ సంస్థకు ఎలాంటి సంబంధం లేదంటున్నారన్నారు. దీనిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు.

హోదాపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం


అమరావతి: విపక్షం నిరసనలు, నినాదాలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది.  గురువారం సమావేశాలు ప్రారంభం కాగానే ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి సభలో తీర్మానం చేయాలంటూ వైఎస్‌ఆర్‌ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. అయితే వాయిదా తీర‍్మానంపై చర్చించాల్సిందేనంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి నిరసన తెలుపుతూ చర్చ జరపాలంటూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాపై శాసనసభలో మరోసారి తీర్మానం చేయాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం వాయిదా తీర్మానం ఇచ్చింది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్‌ అంశంపై ప్రకటన చేయనున్నారు. ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, వ్యవసాయం, విద్యుత్‌, అటవీశాఖ పద్దులపై చర‍్చ జరగనుంది.

ధైర్యం ఉందా బాబూ... ప్రజల దగ్గరకెళ్దాం : వైఎస్ జగన్

Written By news on Wednesday, March 22, 2017 | 3/22/2017ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలకు రావాలని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మరోసారి సవాలు చేశారు. ''ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అధికారం ఉంది కదా అని పోలీసులను ఉపయోగించి, అడ్డగోలుగా డబ్బులు గుమ్మరించి పరోక్ష ఎన్నికల్లో నాలుగు ఓట్లతో మూడు సీట్లు గెలిచినంత మాత్రాన గొప్ప విజయంగా చెప్పుకొంటున్న చంద్రబాబుకు మరోసారి సవాలు విసురుతున్నా... దమ్ము, దైర్యం ఉంటే ఎన్నికలకు సిద్ధపడాలి'' అన్నారు.

బుధవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన వారితో ధైర్యం ఉంటే చంద్రబాబు రాజీనామా చేయించి లేదా వారిపై అనర్హత వేటు వేయించి ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు. పరోక్ష ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలిచామని అదేదో గొప్ప విజయంగా చెప్పుకున్న చంద్రబాబు ప్రజలతో ప్రత్యక్ష ఎన్నికల్లో చావుదెబ్బ తింటే ఒక్క మాట మాట్లాడలేదని జగన్ ఎద్దేవా చేశారు. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఎందుకు ఒక్కమాట కూడా మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రజలతో ప్రత్యక్షంగా జరిగే ఎన్నికల్లో నిలబడే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. అయిదు చోట్ల ఎన్నికలు జరిగితే నాలుగు చోట్ల టీడీపీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని, చదువుకున్న వాళ్లు, ఉపాధ్యాయులు తమకు ఓటు వేశారని చెబుతూ ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని ప్రస్ఫుటం చేసే తీర్పు అని వ్యాఖ్యానించారు. ఇది ప్రజల తీర్పు అని చంద్రబాబు ఘనంగా చెప్పుకున్న విజయం 2500 ఓట్లలోపే, సీఎం హోదాలో ఉండి పోలీసులను ఉపయోగించి, డబ్బు గుమ్మరించి కొనుక్కొని గెలిచారని ధ్వజమెత్తారు.

''అదేదో విజయంగా అసెంబ్లీలో మాట్లాడుతున్న చంద్రబాబుకు మరోసారి సవాలు చేస్తున్నాం. పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో  రాజీనామా చేయించండి. లేదా వాళ్లపై అనర్హత వేటు వేయించండి. దమ్మూ ధైర్యం ఉంటే ఎన్నికలకు రావాలి. ప్రజల దగ్గరకు పోదాం. అభ్యర్థులను పెడదాం. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇంగితం ఉంటే ఉప ఎన్నికలకు రావాలి.. ఈ ఎన్నికలను మేం రెఫరెండంగా తీసుకుంటాం..'' అని జగన్ తన సవాలును పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఒక విలేకరి జోక్యం చేసుకుంటూ, చంద్రబాబు 67 స్థానాల్లో (వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో మాత్రమే) ఎన్నికలు నిర్వహిద్దామని అంటున్నారని ప్రస్తావించారు. దానిపై జగన్ స్పందిస్తూ,  కేవలం 67 స్థానాల్లోనే ఎందుకు... ధైర్యం ఉంటే రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లో ఎన్నికలకు వెళ్లమనండి.. మేం సిద్ధంగా ఉన్నాం అని సమాధానమిచ్చారు. కమాన్ రమ్మనండి... మేం సిద్ధంగా ఉన్నాం... అంటూ తన సవాలును మరోసారి పునరుద్ఘాటించారు.

జాతిని జాగృత పరుస్తాం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడమే అత్యంత కీలకమైన అంశమని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ, జూన్ వరకు ఎదురుచూస్తాం. మేం చేసే పోరాటాన్ని దేశం మొత్తం చూడాలి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నది మా ఉద్దేశం. దేశాన్ని జాగృత పరుస్తా... అని చెప్పారు.

అసెంబ్లీలో ఇలాగేనా ప్రవర్తించేది?
బుధవారం శాసనసభలో జరిగిన విషయాలను జగన్ ప్రస్తావిస్తూ తనను మాట్లడనీయకూడదన్న ఉద్దేశంతోనే అసెంబ్లీని వాయిదా వేశారని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు ఇవ్వకుండానే ఏదో పేపర్లు తెచ్చి ప్రతిజ్ఞ అంటూ ఒక ప్రకటన చేయడాన్ని ఆయన పేర్కొంటూ రాష్ట్రం పట్ల చంద్రబాబువి నిజాయితీ, అంకిత భావం లేని మాటలు. నా ఇల్లు... నా ఓటు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. చంద్రబాబులా హైదరాబాద్ లో లేదు. అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబుకు నిజాయితీ, అంకితభావం లేవు. వరల్డ్ వాటర్ డే పురస్కరించుకుని చంద్రబాబు చేసిన ప్రకటనపై ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాట్లాడుతుంటే అరగంట పాటు అంతా విన్నాం. ఏదో ప్రకటన చేసి వెళ్లిపోతామంటే ఎలా? సీఎం అంటే సానుకూలంగా ఉండాలే తప్ప రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. ఆయన ఉద్దేశపూర్వకంగానే 2004-09 విషయాలను కావాలనే ప్రస్తావించారు. సీఎం ప్రసంగం మొత్తం అలాగే ఉంది. ఆత్మస్తుతి, పరనింద తప్ప అందులో ఏమీ లేదు.
"ప్రకటన చేసిన తర్వాత ఇక ఎవరికీ అవకాశం ఇవ్వరు. ఇంత దారుణంగా సీఎం మాట్లాడుతున్నప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాలనుకున్నా అవకాశం ఇవ్వడం లేదు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలని అడిగినప్పుడు మైకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కనీసం రెండు నిమిషాలు కూడా సమయం ఇవ్వడం లేదు.కనీసం పాయింట్ ఆఫ్ ఆర్డర్ విషయాన్ని వినడానికి కూడా సిద్ధంగా లేరు. సీఎం ప్రకటన చేసినప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేదంటూ తప్పుగా చెబుతున్నారు. (ఈ సమయంలో అసెంబ్లీ రూల్స్ పుస్తకాన్ని చూపించి, ఈ విషయం చెప్పారు) ప్రతిపక్ష నాయకుడన్న గౌరవం కూడా చూపడం లేదు. అందుకే బాబు ప్రసంగం అయ్యాక మేమంతా సభలోకి వెళ్లాం. అప్పుడు కూడా మా వాదన వినలేదు. అవకాశం ఇవ్వకపోగా రాజకీయం చేశారు. మళ్లీ ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ చేయని వారు నీటి సంరక్షణ చేయరా?" అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

నీటి సంరక్షణ విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉండి ఉంటే... ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేవని చెప్పారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందే రాష్ట్రంలోని చాలా ప్రాజెక్టుల 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. హంద్రీనీవా, పోలవరం కెనాల్స్.. ఇలా ఏం తీసుకున్నా 80 శాతం పనులు ముందే పూర్తయ్యాయి. అలాంటి వాటిని కూడా చంద్రబాబు ఇప్పటికీ పూర్తి చేయలేయలేదు. అలాంటి మనిషి ఎమ్మెల్యేలతో ప్రతిజ్ఞ చేయించడం నిబద్దత అనిపించదని మండిపడ్డారు.

"పోతిరెడ్డిపాడు కనీసం 20 శాతం పనులు కూడా చెయ్యలేదు. గండికోట, చిత్రావతి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అయ్యాయి. బాబు వచ్చి మూడేళ్లవుతున్నా మిగిలిపోయిన చిన్న పనులు కూడా కాలేదు. శ్రీశైలం లో నీళ్లు ఉన్నా సీమకు నీళ్లివ్వలేని పరిస్థితి. ఇలాంటి సీఎంకు నిజాయితీ ఎక్కడిది. పిల్ల కాలువ పనులు పూర్తి చేసినా అనంతపురం జిల్లాకు నీళ్లు ఇవ్వొచ్చు. పులిచింతల ప్రాజెక్టు చంద్రబాబు సీఎం అయ్యేనాటికే పూర్తయ్యింది. కానీ ఇప్పటికీ అక్కడ ఆర్ అండ్ ఆర్ అమలు చేయలేదు. పట్టిసీమ స్టోరేజీ కెపాటిసీ ఆలోచించమని చెప్పాం. కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయి." అని పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు అసెంబ్లీలో ఇలాగేనా ప్రవర్తించేదని ప్రశ్నించారు. ప్రతిజ్ఞ చేయించాలనుకుంటే దానికో పద్ధతి ఉంటుంది. మంచి మాటలు తప్పులేదు. అసెంబ్లీలో ఇలాంటివి తగునా? అధికారపక్షం నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. నాకు అసెంబ్లీలో టైమ్ ఇచ్చి ఉంటే ఇదే చెప్పేవాళ్లం... అని జగన్ అన్నారు.

Some leaders can be bought or threatened but people always stay true. I thank you from the bottom of my heart.Congratulations to the winners

Popular Posts

Topics :