02 April 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ములాయంతో వైఎస్ జగన్ భేటీ

Written By news on Friday, April 7, 2017 | 4/07/2017


ములాయంతో వైఎస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ :
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తున్న విషయమై ఢిల్లీలో పలువురు పెద్దలను కలుస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. శుక్రవారం ఉదయం సమాజ్‌వాదీపార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపుల వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ఆర్‌సీపీ తరఫున గెలిచి, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టిన వైనాన్ని వివరించారు. దాదాపు అరగంట పాటు ములాయంతో సమావేశమైన జగన్.. అసలు స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు పెండింగులో ఉండగానే ఆ నలుగురిని ఎలా మంత్రులు చేస్తారని అడిగారు.

ఇలాగే జరుగుతుంటే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని కోరారు. తాము ఇచ్చిన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఫిరాయింపుల నిరోధక చట్టానికి పదును పెట్టాల్సి ఉందని  ఆయనకు తెలియజెప్పారు. ముఖ్యమంత్రి, స్పీకర్, గవర్నర్.. ఈ ముగ్గురూ ఉన్నా కూడా ప్రజాస్వామ్యానికి పాతరేశారని చెప్పారు. వైఎస్ జగన్ వాదనకు ములాయం సింగ్ యాదవ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ములాయం సింగ్‌ను కలిసిన వారిలో వైఎస్ జగన్‌తో పాటు పార్టీ ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహనరెడ్డి ఇతర నేతలు ఉన్నారు.

చంద్రబాబు అనైతికతను అందరికీ వివరిస్తాం

Written By news on Thursday, April 6, 2017 | 4/06/2017



న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఫిరాయింపుల వ్యవహారాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దృష్టికి తీసుకు వెళ్లామని ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను పాటించే దిశగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రి పదవి నుంచి తొలగించేలా గవర్నర్‌కు తగు ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్రపతికి విన్నవించామన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఎలా అపహాస్యం చేస్తున్నారో రాష్ట్రపతికి వివరించి, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయనకు కోరినట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఒక వినతిపత్రం సమర్పించినట్లు వైఎస్‌ జగన్‌ తెలిపారు.  రాష్ట్రపతితో భేటీ అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు.
రాష్ట్రంలో అనైతిక, అప్రజాస్వామిక వ్యవహారం నడుస్తోందని, అనర్హత పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే  ఫిరాయింపుదారుల్లో కొందరికి ఏకంగా మంత్రి పదవులే కట్టబెట్టారన్నారు. అలా మంత్రి పదవులు ఇవ్వడం దారుణమన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ...ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ పరిస్థితులను నివారించకుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు అనైతిక వ్యవహారాలపై  అన్ని పార్టీల నేతలను కలుస్తామని వైఎస్‌ జగన్‌ తెలిపారు.
 ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి జరిగింది, రేపు మరో పార్టీకి ఇదే పరిస్థితి ఎదురు కావచ్చని అందరి దృష్టికి తీసుకు వెళతామన్నారు. బీజేపీని ప్రభావితం చేసే ప్రతి పార్టీ నేతను ఖచ్చితంగా కలుస్తామని ఆయన అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా  ఆడియో, వీడియోల్లో దొరికిపోయారని, బ్లాక్‌మనీ విచ్చలవిడిగా సంపాదించి, ఆ అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొంటున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. చంద్రబాబు అవినీతిని కాగ్‌ కూడా తప్పుపట్టిందన్నారు.
ఇటుక నుంచి మట్టి వరకూ, మట్టి నుంచి మద్యం వరకూ, మద్యం నుంచి బొగ్గు వరకూ బొగ్గు నుంచి కాంట్రాక్టర్ల వరకూ, కాంట్రాక్టర్ల నుంచి జెన్‌కో వరకూ జెన్‌కో నుంచి గుడి భూములు వరకూ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవస్థలో మార్పు రావాలని, లేకుంటే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుందన్నారు. ఫిరాయింపుల విషయంలో అందరినీ కలిసి మార్పుతెచ్చే ప్రయత్నం చేస్తామని వైఎస్‌ జగన్‌ అన్నారు.



ఇది ప్రజాస్వామ్యమేనా?

Written By news on Monday, April 3, 2017 | 4/03/2017


సార్‌.. ఇది ప్రజాస్వామ్యమేనా?: వైఎస్‌ జగన్‌
హైదరాబాద్‌: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్యమేనా? అని గవర్నర్‌ను ప్రశ్నించినట్టు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రభుత్వం తన మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని ఆక్షేపిస్తూ వైఎస్‌ జగన్‌ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారాన్ని తప్పుబడుతూ గవర్నర్‌కు లేఖ అందజేశామని.. 'సార్‌ ఇలా చేయడం ప్రజాస్వామ్యమేనా' అని ఆయనను అడిగామని వైఎస్‌ జగన్‌ చెప్పారు. వేరే పార్టీ గుర్తు మీద గెలిచి.. ఆ పార్టీ ద్వారా సాధించిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా.. పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం, వారిపై అనర్హత వేటు వేయకుండా పదవుల్లో కొనసాగించడం ధర్మమేనా? అని గవర్నర్‌ను ప్రశ్నించినట్టు తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
  • తెలంగాణలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇదేవిధంగా పార్టీ మారి.. మంత్రి పదవి పొందినప్పుడు..  ఇదే చంద్రబాబు నాయుడు ఏమాటలు మాట్లాడారు గుర్తుతెచ్చుకోండి
  • పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ప్రమాణం స్వీకారం చేయడమంటే.. రాజకీయ వ్యభిచారమేనని నాడు చంద్రబాబు పోల్చారు.
  • అదే చంద్రబాబు నేడు చేస్తున్న చేష్టలు సబబేనా గవర్నర్‌ను అడిగాం.
  • ఇలా చేయడం ప్రజాస్వామ్యం కాదు.. ఇలా చేయడం తప్పు అని చెప్పాం.
  • స్పీకర్‌ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు
  • అందుకే గత అసెంబ్లీ సమావేశాలలో 66మంది ఎమ్మెల్యేల బలం వైఎస్‌ఆర్‌ సీపీకి ఉందని చెప్పారు.
  • ఓవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడకుండా స్పీకర్‌ కాపాడుతున్నారు.. మరోవైపు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వారికి మంత్రి పదవులు ఇస్తున్నారు
  • ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేలా, వారి రాజీనామాలు ఆమోదం పొందేలా చూడాలని గవర్నర్‌ను కోరాం.
  • ఒకవేళ రాజీనామా చేయకపోతే వారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశాం.
  • ఇటువంటి తప్పులు జరగకుండా చూసేందుకే గవర్నర్‌ పదవి ఉంటుంది.
  • అటువంటి గవర్నర్‌తో ఇటువంటి దారుణాలు చేయిస్తే.. ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడుతారు?
  • ఈ లేఖను, ఈ పోరాటాన్ని జాతీయస్థాయిలో ఢిల్లీకి తీసుకుపోతాం. రాష్ట్రపతిని, ఎన్నికల సంఘాన్ని కలుస్తాం.
  • అన్ని పార్టీలను కలిసి వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళుతాం.
  • ఇలాంటి ఫిరాయింపు అక్రమాలను అడ్డుకోకపోతే.. రేపొద్దున మీకు కూడా ఇలాగే జరుగుతుందని పార్టీల దృష్టికి తీసుకెళుతాం.
  • వీలుంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేస్తాం
  • దీనిని ఇంతటితో వదిలిపెట్టం. రాజీనామాలు ఆమోదించి.. ఉప ఎన్నికలు వచ్చేలా చేస్తాం.

ఈడీ, సీబీఐ ఏం చేసినా జగన్‌కు అంటగడతారా?

Written By news on Sunday, April 2, 2017 | 4/02/2017


'ఈడీ, సీబీఐ ఏం చేసినా జగన్‌కు అంటగడతారా?'
హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ర్పచారం చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆదివారం అన్నారు. కేసుల విషయంలో జగన్‌ ఎప్పుడూ భయపడలేదని, ఎవరికీ లొంగలేదని చెప్పారు. చంద్రబాబు మాత్రం ఓటుకు కోట్లు కేసులో కేంద్రం కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. జనంలో జగన్‌కు ఉన్న ఆదరణను చూసి ఎల్లో మీడియా, చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.

జగన్‌ను ఎదుర్కోవడం చేతకాక చీప్‌ట్రిక్స్‌ చేస్తున్నారని అన్నారు. జగన్‌ కంపెనీలపై ఈడీ దాడులంటూ ఒక పత్రిక తప్పుడు కథనాలు రాసిందని చెప్పారు. అది సూట్‌ కేసు కంపెనీలు, మనీలాండరింగ్‌ అంటూ బురదజల్లే యత్నమని అన్నారు. సీబీఐ, ఈడీ ఏం చేసినా జగన్‌కు అది అంటగడతారా? అంటూ ప్రశ్నించారు. అధికార పార్టీ అరాచకాలను ప్రశ్నించాల్సిన ఎల్లో మీడియా.. జగన్‌ను అప్రతిష్టపాలు చేయాలని యత్నిస్తోందని అన్నారు. చంద్రబాబు చేసే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలని చెప్పారు.

Popular Posts

Topics :