30 April 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్‌ జగన్‌ కోసం ప్రసాద్‌ సాహసం

Written By news on Saturday, May 6, 2017 | 5/06/2017



హైదరాబాద్‌ : జననేత పట్ల ఓ విద్యార్థి అభిమానం ఊళ్లు దాటేలా చేసింది. చిన్నప్పటి నుంచి తాను ఎంతగానో ఇష్టపడే వ్యక్తిని కలవాలనుకున్న అతడు.. ఇంట్లో చెప్పాపెట్టకుండా రైలెక్కేసి హైదరాబాద్ చేరుకున్నాడు. కర్నూలు జిల్లా బేతంచలర్ల మండలం ముద్దవరంకు చెందిన ఏడో తరగతి విద్యార్థి ప్రసాద్‌ కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం.

వైఎస్‌ జగన్‌ను కలిసి, మాట్లాడి ఫోటో దిగాలని కోరిక. స్కూల్‌కు వేసవి సెలవులు కావడంతో ప్రసాద్‌... ఎలాగైనా వైఎస్‌ జగన్‌ను కలవాలని ఇంట్లో ఎవరికి చెప్పకుండా హైదరాబాద్‌ రైలు ఎక్కాడు. కాచిగూడా స్టేషన్‌లో దిగిన  అతడు అక్కడి నుంచి వాళ్లను, వీళ్లను అడుగుతూ  వైఎస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యాలయం చేరుకున్నాడు.  

కార్యాలయం వరకు వచ్చాడు  కాని తన అభిమాన నేతను ఎలా కలవాలో తెలియని పరిస్థితి ప్రసాద్‌ది. చివరికి ధైర్యం చేసి తానెవరో, ఎక్కడి నుంచి వచ్చాడో వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయ సెక్యూరిటీ సిబ్బందికి తెలిపాడు. ఎలాగైనా వైఎస్‌ జగన్‌ ను  కలిసే అవకాశం కల్పించాలని ప్రాధేయపడ్డాడు.  అది సాధ్యం కాదని చెప్పినా వినకుండా  కార్యాలయం బయటే కూర్చుండిపోయాడు. 
అయితే ప్రసాద్‌ విషయం తెలుసుకున్న వైఎస్‌జగన్‌ వెంటనే స్పందించి, అతడిని పిలిపించుకుని మాట్లాడారు. అంతేకాకుండా ప్రసాద్‌ ఉండేందుకు ఏర్పాట్లు చేసి భోజనం కూడా పెట్టించారు. అతనితో ఫొటో దిగడమే కాకుండా ఆ ఫొటో ఫ్రేమ్‌ కట్టించి మరీ ఇచ్చారు. అయితే ఇంట్లో చెప్పకుండా వచ్చాడన్న విషయం తెలుసుకున్న వైఎస్‌ జగన్‌...అతడి క్షేమసమాచారాలు ప్రసాద్‌ కుటుంబసభ్యులకు తెలియచేశారు.
రెండు రోజుల పాటు పార్టీ కార్యాయంలో గడిపిన  ప్రసాద్‌ అనుకోని ఆతిధ్యానికి మురిసిపోయాడు. పలకరిస్తే చాలని వస్తే ఇంతటి ఆప్యాయత దక్కుతుందని ఊహించలేదని తెలిపాడు. అనంతరం అతడిని క్షేమంగా ఇంటికి చేర్చే ఏర్పాటు చేశారు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. దీంతో తాను అభిమానించే నాయకుడు తనపై ఇంత అభిమానం చూపుతాడని అసలు ఊహించలేదని ఇంటికి బయల్దేరాడు ప్రసాద్.



విజయవాడలో వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ

Written By news on Friday, May 5, 2017 | 5/05/2017


విజయవాడలో వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ
హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఈసారి విజయవాడ వేదిక కానుంది. జూలై 8,9 తేదీల్లో విజయవాడలో పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నట్లు ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన శుక్రవారం వైఎస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...జూన్‌ 19,20,21 తేదీల్లో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్లీనరీ సమావేశాలు జరుగుతాయన్నారు.
ఆ మూడు రోజుల్లో ఏదో ఒకరోజు జిల్లా ప్లీనరీ సమావేశాలు ఉంటాయన్నారు. ఇక​ మే చివరివారంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు, రెండోదశలో జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. జిల్లా స్థాయి సమావేశాల్లో వివిధ అంశాలపై కులంకుషంగా చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో తెలంగాణ జిల్లాల విస్తృత స్థాయి సమావేశాలు ఉంటాయని వెల్లడించారు.

అప్పుడలా.. ఇప్పుడిలా!

Written By news on Monday, May 1, 2017 | 5/01/2017


చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతూ రైతులను దగా చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆయన గుంటూరు మిర్చియార్డు సమీపంలో రెండు రోజుల రైతు దీక్షను ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

  • కడుపు మండుతున్నా, పండించిన పంటకు ధరలు రాక అవస్థలు పడుతున్నా, చంద్రబాబు నాయుడు పట్టించుకునే పరిస్థితి లేదని కడుపులో బాధ ఉన్నా.. మన అవస్థలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని, ఆయనకు బుద్ధి రావాలని రైతులందరం ఒక్కచోట ఏకమై దీక్ష కార్యక్రమం చేస్తున్నాం
  • చంద్రబాబు పాలన చూసి, రైతుల బాధలు, అవస్థలు చూసి రైతులకు తోడుగా ఉండేందుకే దీక్షా కార్యక్రమం చేపట్టాం
  • చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులతో పని అయిపోయిన తర్వాత, ఓట్లు వేయించుకోవడం అయిపోయాక మరో విధంగా మాట్లాడుతున్నారు
  • 2010లో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ దగ్గర చంద్రబాబు ధర్నా చేశారు.. హూడా కమిటీ సిఫార్సులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని, కష్టాల్లో ఉన్న రైతులకు ఎకరాకు 10-15 వేలు ఇవ్వాలని ఆయన దీక్ష చేశారు
  • ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు హూడా కమిటీ సిఫార్సులు కనిపించాయి.
  • అప్పుడు ఆ మాట మాట్లాడిన ఇదే చంద్రబాబు హూడా ఎవరు, ఆయన సిఫార్సులేంటి, తనకు తెలియదని మాట్లాడటం చూస్తుంటే.. ఈయనా మన ముఖ్యమంత్రి అనిపిస్తుంది
  • ఇదే చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రజలతో, రైతులతో అవసరం ఉన్నప్పుడు.. రైతుల కోసం 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి తీసుకొస్తానని, ఏ రైతూ బాధపడకుండా చూస్తానని, ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకపోతే ఈ నిధితో ఆదుకుంటానని చెప్పారు

    [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]
     
  • ఆయనకు అప్పుడు హఠాత్తుగా 5వేల కోట్లు ఇవ్వాలని ఎందుకు అనిపించిందంటే, అప్పుడు జగన్ 3వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతానన్నాడు కాబట్టి జగన్‌కు ఎక్కడ ఓట్లు పడతాయోనని వెన్నులో భయం మొదలై.. 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి అన్నారు
  • ఇప్పుడు ఎన్నికలయిపోయాయి, ప్రజలు, రైతులతో పని అయిపోయింది.. ఇప్పుడు ఆ నిధి గురించి ఊసే లేదు
  • ఇదే చంద్రబాబు ఎన్నికలకు ముందు రైతులకు కనీస మద్దతుధర చాలా తక్కువగా ఉందని, అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలుచేస్తామని, ఖర్చు మీద 50 శాతం లాభం వేసి మరీ ధర ఇప్పిస్తానని అన్నారు
  • ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు పాలన మొదలై మూడేళ్లయిపోయింది.. కనీస మద్దతుధర పరిస్థితి ఏంటంటే వరికి 50, 50, 60 రూపాయల చొప్పున ముష్టివేసినట్లు ఇస్తున్నా ఈయన నోట్లోంచి మాట రాదు
  • పత్తికి కూడా 50, 50, 60 రూపాయల చొప్పున ఇచ్చారు. కనీసం ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువగా రేట్లు పెంచుతున్నా ఈయన మాట్లాడరు
  • కనీసం ప్రధానమంత్రికి ఒక్కటంటే ఒక్క లేఖ కూడా రాయలేదు
  • ఇప్పుడు స్వామినాథన్ ఎవరో కూడా గుర్తురావట్లేదని చంద్రబాబు నోట్లోంచి మాటలు వస్తున్నాయి
  • ఇదే చంద్రబాబు ఎన్నికల సమయంలో రైతులకు తోడుగా నిలబడగానని, కుటుంబ పెద్దగా నిలబడతానని అన్నారు
  • 2013-14లో వరుస తుఫాన్లు వచ్చాయి, ఆ తర్వాత కరువు వచ్చింది
  • అప్పుడు ఈయన రాష్ట్రంలో తిరుగుతూ.. అదిగో ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ముఖ్యమంత్రి కాగానే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటానని చెప్పారు
  • కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడేళ్లలో ఒక్క ఇన్‌పుట్ సబ్సిడీ అక్షరాలా 4394 కోట్లు బకాయిలు పడ్డారు, పూర్తిగా ఎగనామం పెట్టారు
  • వరుసగా మూడేళ్లలో 2306 కోట్లు, 326 కోట్లు, 1762 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీకి పూర్తిగా ఎగనామం పెట్టారు
  • రైతుల రుణాలన్నీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు
  • రైతులు పొరపాటున ఆయన మాటలు వినకుండా పోతారోనని భయపడి ప్రతి గ్రామంలోను వాల్‌పోస్టర్లు, హోర్డింగులకు లైట్లు పెట్టి రాత్రిపూట కూడా కనిపించేలా పెట్టారు.
  • బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని, రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని రాయించారు
  • ఇంటికి వెళ్లి టీవీ ఆన్ చేస్తే చాలు.. మనకు కనిపించింది, వినిపించింది కూడా ఇదే
  • ఇప్పుడు చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి ఏంటంటే.. కోటి 4 లక్షల అకౌంట్లకు గాను 40 లక్షల రైతుల అకౌంట్లు ఓవర్ డ్యూ, ఎన్‌పీఏ అకౌంట్లుగా తయారయ్యాయి.
  • ఆయన పాలన చూసి తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
  • ఇదే మిర్చియార్డుకు ఐదువారాల క్రితం నేను వచ్చాను
  • అప్పుడు రేటు క్వింటాలుకు 6000-7000 వరకు పలుకుతోంది
  • ఇది అన్యాయమని, గత సంవత్సరం 14వేల వరకు పలికిందని అన్నాను
  • అప్పుడు చంద్రబాబు మొసలి కన్నీరు కార్చారు
  • ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే.. ఇప్పుడు 2500-4000కు మిర్చి రేటు పడిపోయింది
  • ఎక్కడైనా ముఖ్యమంత్రి అంటే రైతులకు తోడుగా ఉండేందుకు స్థిరీకరణ నిధి పెట్టి రైతులను ఆదుకోవాలి
  • మార్కెట్లో పోటీ సృష్టించాలి.. రైతులకు తోడుగా నిలబడేందుకు ఆయన 8వేలకు కొంటానన్నారు
  • అది తక్కువే అనుకున్నా, కనీసం ఆ రేటుకైనా ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తే మార్కెట్లో పోటీ పెరుగుతుంది
  • వ్యాపారులు అంతకంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేసేందుకు పరుగులు తీస్తారు
  • కానీ చంద్రబాబు రైతులకు తోడుగా నిలబడలేదు.. వ్యాపారులకు తోడుగా నిలబడ్డారు
  • వ్యాపారులు కొంటే, ఈయన ముష్టేసినట్లు 1500 ఇస్తారట. అది కూడా 8వేలకు ఎంత తక్కువైతే అంతే ఇస్తారట
  • ఒక్కో రైతు 20 క్వింటాళ్లు మాత్రమే తేవాలట..
  • పొలాలన్నీ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రైతులు ట్రాక్టర్లలో తీసుకొస్తున్నారు
  • మిర్చి కోసిన తర్వాత మార్కెట్ యార్డు వరకు ఖర్చులు చూస్తే క్వింటాలుకు 2500 దాటింది. కానీ కొనుగోలు ధర బాగోలేదు
  • ఇక్కడకు తెచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు.. కోల్డ్ స్టోరేజిలోకి తీసుకెళ్తే అక్కడ స్థలం ఇవ్వబోమని ఇప్పటికే టిక్కీ రేటు పెంచారు. ఏడాదికి 160 రూపాయలు ఉంటే అది 190కి పెరిగిపోయింది.. అయినా స్థలాలు లేవు
  • నాలుగైదు రోజుల పాటు రైతులు రోడ్డుమీద పడుకోవాల్సి వస్తోంది
  • మిర్చి మాత్రమే కాదు.. పసుపు గత ఏడాది 9వేలయితే ఈసారి 4వేలకు కూడా కొనుగోలు చేయట్లేదు
  • మామిడి, వరి, సుబాబుల్.. ఏ పంటకూ సరైన ధర రావడం లేదు
  • 2016-17 సంవత్సరంలో ఏ ఒక్క పంటకూ రేటు ఉండని పరిస్థితి కనిపిస్తోంది
  • ఈ దారుణమైన మోసానికి నిరసన తెలుపుతూ, చంద్రబాబుకు జ్ఞానం రావాలని దీక్ష చేపడుతున్నాం

జగన్‌ బాహుబలి ..ఆయనది బ్రహ్మానందం క్యారెక్టర్‌


‘జగన్‌ బాహుబలి ..ఆయనది బ్రహ్మానందం క్యారెక్టర్‌’
గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  రైతులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గుంటూరులో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన దీక్షలో ఆయన సోమవారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ..చంద్రబాబు రాష్ట్రానికి సీఎంగా కాకుండా ఈవెంట్‌ మేనేజర్‌ గా వ్యవహరిస్తున్నారన్నారు. రైతుల పట్ల ముఖ్యమంత్రి వైఖరి దారుణమన్నారు. గతంలో చేసిన పాదయాత్రలను చంద్రబాబు ఇప్పుడు చేస్తే... ఆయనను కర్రలు, చీపుర్లతో తరిమే పరిస్ధితి ఉందన్నారు. అబద్ధాల హామీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు. ఏదైనా బుక్‌ షాపుకు వెళ్లి అబద్ధాలు చెప్పడం ఎలాగో నేర్చుకునే పుస్తకం ఇమ్మంటే... తడుముకోకుండా టీడీపీ మేనిఫెస్టో ఇస్తారని ఆయన ఎద్దేవా చేశారు.

దేశవ్యాప్తంగా బాహుబలి చిత్రం సునామీ  సృష్టిస్తుంటే... మూడేళ్లుగా చంద్రబాబు దెబ్బకు రైతులు, మహిళలు, విద్యార్థులతో పాటు అందరూ బలి అయ్యారని చురకలు అంటించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరూ చిన్న పొరపాటు కూడా చేయవద్దని అనిల్‌కుమార్‌ యాదవ్‌ సూచించారు. ప్రజల కోసం కష్టపడుతున్న వైఎస్‌ జగన్‌ ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎలాంటి సువర్ణపాలన అందించారో, అంతకన్నా గొప్పగా వైఎస్‌ జగన్‌ పాలిస్తారని అన్నారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్‌... అందినకాడికి రాష్ట్రాన్ని దోచుకుంటుందని అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఓటుకు అయిదు నుంచి పదివేలు అయినా ఖర్చుపెట్టేందుకు వెనకాడేది లేమని టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, అయితే డబ్బుతో, అహంతో ప్రజలను కొనలేరని ఆయన అన్నారు.
ఇక నారా లోకేశ్‌ విషయానికి వస్తే ...ఏమీ తెలియని వ్యక్తికి మంత్రిగా బాధ్యతలు ఎలా అప్పగిస్తారన్నారు. వైఎస్‌ జగన్‌ కు నారా లోకేశ్‌కు పోలికే లేదని, అసలు ఇద్దరి మధ్య పోలిక ప్రసక్తే వద్దని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. జగన్‌ బాహుబలి అయితే, లోకేశ్‌ బ్రహ్మానందం లాంటి క్యారెక్టర్‌ అని అన్నారు. ధర్మం, నీతి, నిజాయితీ వైపు నిలబడి పోరాటం చేస్తున్న వైఎస్‌ జగన్‌ దేశంలో గర్వించదగ్గ నాయకుడని ఆయన పేర్కొన్నారు.
లోకేశ్‌ కు కనీసం సరిగ్గా పేపర్‌ కూడా చదవడం రాదని, అలాంటిది ఆయన మంత్రి...భవిష్యత్‌లో కాబోయే ముఖ్యమంత్రి అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం అమెరికా వెళుతున్నారని తాను అనుకోవడం లేదని, ఇటీవలి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని, గజినిగా మారిపోయిన ఆయన...ట్రీట్‌మెంట్‌ కోసమే అక్కడకు వెళుతున్నారని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు.

నేటి నుంచి జగన్‌ రైతు దీక్ష


నేటి నుంచి జగన్‌ రైతు దీక్ష
♦ అన్నదాతలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రెండురోజుల దీక్ష
♦ ఎన్నికల సమయంలో రైతన్నలకు చంద్రబాబు హామీలు
♦ వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానన్న బాబు
♦ పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ఉద్ఘాటన  
♦ బాబు అధికారంలోకి వచ్చాక అన్నదాతలకు అన్నీ కష్టాలే
♦ మాఫీ కాని రుణాలు.. పంటకు దక్కని మద్దతు ధరలు


సాక్షి, అమరావతి: పంట రుణాలు మాఫీ కాక, పండించిన పంటలకు మద్దతు ధరల్లేక కష్టాలు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఏమాత్రం ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి రెండు రోజులపాటు ‘రైతు దీక్ష’ చేపట్టనున్నారు. రుణమాఫీ హామీకి ముఖ్యమంత్రి పాతర అన్నదాతల ఆక్రోశాన్ని ఎలుగెత్తి చాటి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వైఎస్‌ జగన్‌ రైతు దీక్షకు పూనుకుంటున్నారు.

 ప్రతికూల పరిస్థితుల్లో నూ ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి, పసుపు, ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలకు కనీస మద్దతు ధరలు లభించక రైతన్నలు ఆర్థికంగా దిగజారిపోతున్నారు. పంటల సాగు కోసం బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను బేషర తుగా మాఫీ చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కాక ఆ హామీకి పాతరేశారు. మూడేళ్లుగా రుణాలను మాఫీ చేయకుండా రైతాంగాన్ని వెన్నుపోటు పొడిచారు.

వర్షాభావ పరిస్థితులను ఎదిరించి, కష్టపడి పండించిన పంటలను మార్కెట్‌ యార్డులకు తరలిస్తే మద్దతు ధరలు దక్కడం లేదు. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వమేమో చోద్యం చూస్తోంది. మద్దతు ధర కల్పించి రైతన్నల్లో భరోసా పెంచాల్సింది పోయి కుంటిసాకులతో కాలం గడుపుతోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ‘ధరల స్థిరీకరణ నిధి’కి ముఖ్యమంత్రి చంద్రబాబు నీళ్లొదిలేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రైతు దీక్ష తలపెట్టారు. ఈ దీక్షతోనైనా ప్రభుత్వంలో చలనం వచ్చి, తమను ఆదుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు బస్టాండ్‌ సెంటర్‌లో మేడే పతాకావిష్కరణ
వైఎస్‌ జగన్‌ సోమవారం ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు గుంటూరు బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుంటారని చెప్పారు. అక్కడ నిర్వహించే కార్మిక దినోత్సవంలో పాల్గొని పతాకావిష్కరణ చేస్తారని వెల్లడించారు.

అనంతరం దీక్షా స్థలికి వస్తారని వివరించారు. జగన్‌ సోమవారం ఉదయం 10.30 గంటలకు రైతు దీక్షకు శ్రీకారం చుట్టనున్నారు. రైతు దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరులోని నల్లపాడు రోడ్డులో ఉన్న మిర్చి యార్డు సమీపంలో ప్రైవేటు ప్రాంగణంలో దీక్ష జరగనుంది. ప్రధాన వేదిక, రైతన్నల కడగండ్లపై కళాకారుల ప్రదర్శనకు మరో వేదిక నిర్మాణం పూర్తయ్యాయి. పార్టీ ముఖ్యులు, రైతులు, ప్రజలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

Popular Posts

Topics :