14 May 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

శ్రీకాకుళం జిల్లా జగతిలో ప్రతిపక్షనేత ముఖాముఖి

Written By news on Saturday, May 20, 2017 | 5/20/2017


చంద్రబాబు తోలుమందం.. గట్టిగా ఒత్తిడి చేద్దాం
- ఉద్దానం కిడ్నీ బాధితులతో వైఎస్‌ జగన్‌
- శ్రీకాకుళం జిల్లా జగతిలో ప్రతిపక్షనేత ముఖాముఖి
- ఏడాదిన్నరలో వచ్చేది ప్రజా ప్రభుత్వమే..
- మహానేత కలల పథకం ఆరోగ్యశ్రీని ఇంకా ఉన్నతంగా తీర్చి దిద్దుకుందాం


జగతి:
 ఉద్ధానం కిడ్నీబాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. ఉద్ధానం ప్రాంతంలోని జగతి గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కిడ్నీ బాధితులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ బాధలు జగన్‌కు విన్నవించుకున్నారు. ఆరోగ్యశ్రీని, 108, 104 సర్వీసులను నిర్వీర్యం చేస్తోన్న సీఎం చంద్రబాబుకు తోలు మందమని, అంతా కలిసి గట్టిగా ఒత్తిడి చేద్దామని వైఎస్‌ జగన్‌.. కిడ్నీ బాధితులతో అన్నారు.

‘ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. పేదలకు సంజీవిని లాంటి 108 వాహనాలు మూలన పడ్డాయి. 108కి ఫోన్‌ చేస్తే డీజిల్‌ లేదనే సమాధానం వస్తోంది. 104 వాహనాల పరిస్థితీ అంతే తయారైంది. గతంలో కిడ్నీ పేషెంట్లకుగానీ, మూగ, చెవిటి పిల్లలకుగానీ ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేసేవారు. చంద్రబాబు సర్కారు ఇప్పుడు వాటిని ఎత్తేసింది. కిడ్నీ వ్యాధి బారిన పడివాళ్లకు మొదట మందులు ఇస్తారు. బ్లడ్‌ లెవెల్స్‌ మెయింటెనెన్స్‌ కోసం వారం లేదా రెండు రోజులకు ఒకసారి ఇంజక్షన్‌ ఇస్తారు. ఒక్కో ఇంజక్షన్‌కు రూ.650 ఖర్చవుతుంది. మందులకు రూ.2 వేల నుంచి రూ.5వేల దాకా ఖర్చవుతోంది. అప్పటికీ జబ్బు తగ్గకపోతే డయాలసిస్‌లోకి వెళతారు. దీనికి నెలకు రూ.20 వేల దాకా ఖర్చవుతుంది. ఇక చివరిస్టేజ్‌.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌. ఈ ఆపరేషన్‌ ఖర్చు రూ.10 లక్షలు, ఆపరేషన్‌ తర్వాత మందులకు అయ్యే ఖర్చు అదనం. వ్యాధికిగురయ్యేవారిలో అధికులు పేదలే. వాళ్లందరిదీ వైద్యం చేయించుకోలేని పరిస్థితే. అలాంటి వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.


ఆరోగ్యశ్రీని మరింత ఉన్నతంగా తీర్చి దిద్దుతా
తలకు మించిన భారాన్ని మోస్తున్న ఉద్దానం బాధితులు ఇంకొక్క ఏడాదిన్నర ఓపిక పట్టాలని, వచ్చేది ప్రజాప్రభుత్వమేనని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. ‘ఆరోగ్యశ్రీ.. వైఎస్సార్‌ కలల పథకం. వచ్చే ప్రభుత్వంలో ఆ పథకాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. ఏ పేదవాడూ అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదు. ప్రైమరీ సెంటర్లల్లోనే డయాలసిస్‌ సెంటర్లు పెట్టిస్తాం’ అని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.


ఇదీ బాబుగారి విధానం!
‘ఉద్దానం ప్రాంతంలో అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయనేదానిని పరిశోధించడానికి రీసెర్చ్‌ సెంటర్‌ పెట్టాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు కూడా తీసుకోలేదు. గడిచిన మూడేళ్లలో ఆ ఆలోచనైనా చేయలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్‌ ద్వారానైనా సెంటర్‌ ఏర్పాటుకు ప్రత్నించారా అంటే, అదీ చేయలేదు. గత పార్లమెంట్‌ సమావేశాల్లో వైసెస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ఉద్దానం సమస్యలపై పార్లమెంటులో ప్రశ్నించారు. ‘ఉద్ధానంలో రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వచ్చిందా?’ అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని కేంద్రం సమాధానం చెప్పంది. ఇదీ బాబుగారి విధానం. ఆయన తోలు మందం అన్న సంగతి మనకు తెలుసుకాబట్టి, ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతూనే, రాబోయే ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసుకుందాం’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.
 

తప్పకుండా వస్తాం తప్పులన్నీ సరిచేస్తాం


తప్పకుండా వస్తాం తప్పులన్నీ సరిచేస్తాం
వంశధార నిర్వాసితులకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా
- 2013 చట్టం ప్రకారం అందరికీ న్యాయం చేస్తాం..
వైఎస్‌ హయాంలోనే వంశధార పనులు 90శాతం పూర్తి
నిర్వాసితులందరికీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది..
ఏడాదిన్నరలో వచ్చేది మనందరి ప్రభుత్వమే.. ధైర్యంగా ఉండండి


సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘‘వంశధార ఫేజ్‌–2, స్టేజ్‌–2 ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వం మూడేళ్లలో చేసిందేమీ లేదు. తన బినామీలుగా ఉన్న కాంట్రాక్టర్ల కోసం నిర్మాణ వ్యయం పెంచుకొని 30 శాతం కమిషన్లు దండుకో వడం తప్ప. లక్షలాది మంది రైతుల విశాల ప్రయోజ నాల కోసం నిర్వాసితులు చేసిన త్యాగం వెలకట్టలేని ది. అధైర్య పడవద్దు. చంద్రబాబు పాలన ఎంతో కాలం కొనసాగదు. మరో ఏడాదీ ఏడాదిన్నరలోగా మన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వస్తుంది. భూసేకరణ చట్టం –2013 ప్రకారం వంశధార నిర్వాసిత కుటుంబాలన్నింటికీ పూర్తి న్యాయం జరిగేలా చేద్దాం.

ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులన్నీ సరిచేస్తాం. అందరికీ అండగా నిలబడతాం’’  అని  శ్రీకాకుళం జిల్లా హిరమండలం లో శుక్రవారం సాయంత్రం జరిగిన ‘వంశధార నిర్వా సితులతో ముఖాముఖి’ కార్యక్రమంలో ప్రతి పక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం జగన్‌ శుక్రవారం ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు రణస్థలం వచ్చారు. సాయంత్రం ఆరు గంటలకు హిరమండలంలో వరలక్ష్మి థియేటర్‌ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. వంశధార నిర్వాసితులతో నిర్వహిం చిన ముఖాముఖిలో జగన్‌ వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

కమీషన్లు దండుకోవడం కోసమే..
‘‘జిల్లాను సస్యశ్యామలం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా వంశధార ప్రాజెక్టును రూ.934 కోట్లతో నిర్మించేందుకు సంకల్పించారు. ఆ మహానేత హయాంలోనే ప్రాజెక్టు పనులను దాదాపుగా 90 శాతం వరకు పూర్తి చేశారు. మిగిలిన పది శాతం పనులు సుమారు రూ.53 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవి. ఏ ముఖ్యమంత్రికైనా రైతులంటే కొంచెం ప్రేమ ఉన్నా ఒక్క ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేసేవారు.  కానీ మన ముఖ్యమంత్రికి మాత్రం రైతుల మీద ప్రేమ లేదు. ఆయనకు కాంట్రాక్టర్ల మీద మాత్రం వ్యామోహం ఉంది.  అందుకే ఈపీసీ విధానంతో పూర్తి స్థాయిగా పనులు పూర్తి చేయాల్సిన కాంట్రాక్టర్‌కు మేలు జరిగేలా వ్యవహరించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా వ్యయాన్ని ఏకంగా 400 కోట్ల రూపాయలకు చంద్రబాబు పెంచేశారు.

ఆయన అధికారంలోకి వచ్చేసరికి వంశధార ప్రాజెక్టు పనులకు రూ.875 కోట్లు ఖర్చు కాగా, కేవలం 53 కోట్ల పనులు మాత్రమే మిగిలాయి. ఈపీసీ విధానం ద్వారా పూర్తి స్థాయిగా ఖచ్చితంగా పనులు చేయాల్సిన కాంట్రాక్టర్‌ ఈ పది శాతం పనులను వదిలేసినప్పుడు ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలి. కేసులు నమోదు చేయించాల్సి ఉంది. అయితే అలా కాకుండా...ఈ పనులను తన అనుయాయుడు, రాజ్యసభ ఎంపి సిఎం రమేష్‌కు ఇప్పించారు.  అలాగే ఈ కాంట్రాక్ట్‌ పనుల అంచనా లను భారీగా పెంచి లాభాలు తెచ్చేలా ప్రత్యేక జీవో కూడా జారీ చేసారు. ఈ వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు ఓ వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తే అన్ని ప్రా జెక్టులు పూర్తయ్యేవి కదా...! ఈ జిల్లాలో వంశధార, తోటపల్లి ప్రాజెక్టులు ఎవరైనా చేసారా.. అంటే అది కేవలం దివంగత నేత వైఎస్‌ఆర్‌ మాత్రమే.

యువతను బుజ్జగించడానికే ప్యాకేజీ..
గట్టిగా డిమాండ్‌ వస్తుండడంతో యూత్‌ ప్యాకేజీ అని యువతను బుజ్జగించడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు అవకతవకలకు పాల్పడుతున్నారు. 2015 డిసెంబర్‌ 31 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఇంటి స్థలం ఇవ్వాలనేది ప్రభుత్వ హామీ. కానీ ఇల్లు లేదా ఇంటి స్థలం ఇవ్వలేమంటూ ఇపుడు రూ. 5 లక్షలు ఇస్తామని చెబుతున్నారు. రకరకాల షరతులతో అదీ అందరికీ దక్కకుండా చేస్తున్నారు. అసలు నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వడానికి ఈ షరతులేమిటి? యూత్‌ లేకపోవడం ఆ కుటుంబాలు చేసిన నేరమా? యువత ధర్నాలు చేస్తారు కాబట్టి వాళ్లను మంచి చేసుకోవడానికి ఏదో ఇస్తామన్నారు గానీ అవి కూడా సరిగా ఇవ్వడం లేదు. మొత్తం 11 వేల నిర్వాసిత కుటుంబాలకు యూత్‌ ప్యాకేజీ అమలు చేయాలి.

నిర్వాసితులకు పూర్తి స్థాయి న్యాయం చేస్తా..
వంశధార ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలు ప్రత్యక్షంగా 19, పాక్షికంగా 14 గ్రామాల్లో మొత్తం 11 వేల మంది బాధితులున్నారు. గత పదేళ్ల క్రితం ఎకరా భూమికి లక్షో, లక్షా ఇరవై వేల రూపాయలే ఇచ్చి వదిలేసారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయండని ప్రభుత్వాన్ని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తుంటే మాత్రం పోలీసులు, అధికారులతో బెదిరింపులకు దిగుతున్నారు. జిల్లాలో కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి భూసేకరణలో భాగంగా ఎకరాకు రూ.18 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, అదే జిల్లాలో ఉన్న వంశధార నిర్వాసితులకు మాత్రం ఈ విధానం, చట్టం అమలు చేయడం లేదు. గట్టిగా డిమాండ్‌ వస్తుండడంతో యూత్‌ ప్యాకేజీ అని యువతను బుజ్జగించడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు అవకతవకలకు పాల్పడుతున్నారు.

కేవలం అధికార పార్టీ నేతలు, జన్మభూమి కమిటీల సిఫారసులున్న వారికి మాత్రమే ప్యాకేజిలు అందేలా చేస్తున్నారు. అందులో కూడా ఎమ్మెల్యేకి కూడా కమీషన్‌ ఇవ్వాలి. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తాయి. ఈసారి ఖచ్చితంగా మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. రాగానే ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పూర్తి స్థాయి న్యాయం చేస్తాం. ధైర్యంగా ఉండండి. మరో ఏడాదిన్నర లోగానే ఎన్నికలు వస్తాయి. మీ అందరి ఉసురుతో టీడీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసి పోతుంది’’ అని జగన్‌మోహన్‌రెడ్డి నిర్వాసితులకు భరోసా ఇచ్చారు.

11వేల కుటుంబాలకు న్యాయం జరిగేలా ఖచ్చితంగా చేస్తాం

Written By news on Friday, May 19, 2017 | 5/19/2017


కమీషన్ల కోసమే కాంట్రాక్టర్లకు పెంచుతున్నారు!
హిరమండలం :
రైతులకు వెయ్యికోట్లిస్తే చంద్రబాబుకు ఏమీ రాదని, అదే కాంట్రాక్టర్లకు ఇస్తే మాత్రం 30 శాతం కమీషన్ వస్తుందని, అందుకే వంశధార రెండోదశ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా ఆయన ఆపుతున్నారని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ధర్నాలు చేసి గొడవ చేస్తారు కాబట్టి యువకులను దువ్వడానికి యూత్ ప్యాకేజి పేరుతో మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. వంశధార రెండోదశ ప్రాజెక్టు నిర్వాసితులతో శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే...
 • వంశధార రెండోదశ ప్రాజెక్టు అందరికీ కావాలి. 934 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో దాదాపు 700 కోట్ల పైచిలుకు పనులు వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయి
 • తర్వాత చంద్రబాబు సీఎం అవ్వడానికి ముందే మరో 190 కోట్లు మళ్లీ ఖర్చుచేశారు
 • అంటే వంశధార రెండోదశ ప్రాజెక్టుకు చంద్రబాబు సీఎం అయ్యేనాటికే 870 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. మిగిలినది కేవలం 53 కోట్ల రూపాయల పనులే
 • అంటే ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయిపోయాయి
 • మిగిలిన 10 శాతం పనులు పూర్తిచేసి ప్రతి రైతుకు ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇచ్చే ఒకే ఒక్క కార్యక్రమం పెండింగులో ఉన్నా, చంద్రబాబు ప్రభుత్వం వచ్చి మూడేళ్లయినా ఇంకా చేయలేదు
 • రైతులంటే కొంచెం ప్రేమ ఉన్నా ఒక్క ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేసేవారు
 • కానీ మన ముఖ్యమంత్రికి మాత్రం రైతుల మీద ప్రేమ లేదు
 • ఆయనకు కాంట్రాక్టర్ల మీద మాత్రం వ్యామోహం ఉంది
 • 934 కోట్ల రూపాయల పనుల్లో కేవలం 54 కోట్ల రూపాయల పనులే ఆయన సీఎం అయ్యేసరికి మిగిలాయి
 • దీన్ని ఈపీసీ ప్రాజెక్టు కింద కాంట్రాక్టు ఇచ్చారు. అంటే కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకపోతే జైలుకు కూడా పంపచ్చు
 • కానీ చంద్రబాబు కాంట్రాక్టర్లతో లాలూచీ పడి మిగిలిన 54 కోట్ల పనులను 400 కోట్లకు పెంచేశారు
 • తన పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్‌ కూడా ఆయన బినామీగా కాంట్రాక్టులు చేస్తున్నారు
 • రేట్లు ఎందుకు పెంచారంటే.. పెట్రోలు పెరిగింది, డీజిల్, సిమెంటు, స్టీలు పెరిగాయని చెవుల్లో పూలు పెడుతున్నారు
 • కాంట్రాక్ట్ ఇచ్చే సమయానికి, ఇప్పటికి చూస్తే పెట్రోలు, డీజిల్, స్టీలు, సిమెంటు తగ్గాయి, ఇసుక ఉచితంగా ఇస్తున్నా రేట్లు ఎందుకు పెంచారని గట్టిగా ప్రశ్నించాను
 • చంద్రబాబు మాత్రం కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం విపరీతంగా పెంచేశారు
 • మరి రైతులకు ఎందుకు ప్యాకేజి పెంచలేదని ఈ రైతులే చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు
 • అప్పట్లో ప్రాజెక్టు పూర్తి కావాలని దానికోసం ఆశపడి, అప్పట్లో త్యాగమూర్తులు భూములిచ్చారు.
 • వాళ్లంతా ఇప్పుడు అడుగుతున్నది ఒకటే. అప్పటి నుంచి పదేళ్లు పూర్తయినా ప్రాజెక్టు పూర్తికాలేదని, 2013కు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కావాలని అడిగితే తప్పేంటని రైతులు అడుగుతున్నారు
 • మీరు అడిగే దాంట్లో తప్పేం లేదు, రైతులకు నేను అండగా నిలబడతా
 • చంద్రబాబు సీఎం అయ్యేసరికి 97 వేల కోట్ల అప్పులున్నాయి. ఈ మూడేళ్లలో ఆ భారాన్ని 2.16 లక్షల కోట్లకు తీసుకుపోయారు
 • అంటే మూడేళ్లలో 1.18 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు.
 • బడ్జెట్ చూస్తే లక్షన్నర కోట్లు, అప్పులు 1.18 లక్షల కోట్లు.. మరి శ్రీకాకుళం జిల్లాకు వెయ్యి కోట్లు ఇచ్చి ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది కదా అని అడిగినా ఆయన ఈ పనులు చేయరు
 • రైతులకు వెయ్యి కోట్లు ఇస్తే, ఆయనకు కమీషన్లు రావు.. కాంట్రాక్టర్లకు ఇస్తే 30 శాతం కమీషన్లు తీసుకోవచ్చు
 • తోటపల్లి, వంశధార ప్రాజెక్టు పనులుఎవరైనా చేశారంటే వైఎస్ మాత్రమేనని చెప్పుకోవచ్చు
 • కేవలం 10 శాతం మిగిలి ఉన్న పనులను చంద్రబాబు పూర్తి చేయకుండా, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వకుండా పబ్బం గడుపుకొంటున్నారు
 • యువత ధర్నాలు చేస్తారు కాబట్టి వాళ్లను దువ్వడానికి ఏదో ఇస్తామన్నారు గానీ అవి కూడా సరిగా ఇవ్వలేదు.
 • మేమంతా భూములు కోల్పోయాం, నా పిల్లలకు వయసు తక్కువని డబ్బులు ఇవ్వకపోతే ఏ డబ్బు ఇస్తారని మహిళా రైతులు అడుగుతున్నారు
 • ఇదే శ్రీకాకుళం జిల్లాలో పక్కన 18 లక్షలు ఇస్తున్నారు, మాకు ఇల్లు లేదు, మన్ను లేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు
 • చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదు.. ఏడాది, ఏడాదిన్నర పోతే వచ్చేది మన పరిపాలన
 • అప్పుడు కచ్చితంగా 2013 భూసేకరణ చట్టం అమలుచేసి, మిగిలిన పరిహారం కూడా ఇస్తాం
 • ప్రతి ఒక్కరికీ, ప్రతి ఇంటికీ మేలు చేసే కార్యక్రమం చేస్తాం
 • సమస్య ఎక్కడ వస్తోందంటే, ప్రతి కుటుంబంలోను తక్కువ రేటు ఇచ్చి భూములు కొనుగోలు చేశారు
 • పక్కనే ఇదే జిల్లాలో 18 లక్షల చొప్పున అణు విద్యుత్ ప్లాంటుకు భూమి తీసుకుంటున్నారు
 • యూత్ ప్యాకేజి కూడా ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లు ఉంది
 • మొత్తం 11 వేల కుటుంబాలకు కూడా యూత్ ప్యాకేజి అమలుచేయాలి
 • కనీసం అప్పుడైనా కొద్దో గొప్పో న్యాయం కనిపిస్తుంది.
 • మీకు నచ్చినవాళ్లకు, కమీషన్లు ఇచ్చినవాళ్లకు మాత్రమే ప్యాకేజి ఇస్తున్నారు
 • నచ్చినవాళ్లకు మాత్రమే ఇస్తూ ప్యాకేజిని అపహాస్యం చేస్తున్నారు
 • ముంపు గ్రామాలకు సంబంధించి అవస్థలు పడుతున్న ప్రజల నోట్లోంచి మాటలు విన్నాం
 • కడుపునిండా బాధ ఉన్నా చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయత కనబరుస్తున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా
 • న్యాయాన్ని పక్కనపెట్టి చేస్తున్న అన్యాయం కళ్లెదుటే కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు
 • చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేపడదాం
 • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నిరకాలుగా అండదండలు కల్పిస్తుంది
 • మీరు ధర్నా చేస్తున్నప్పుడు వచ్చి సంఘీభావం తెలిపాను, ఇప్పుడు మరోసారి వచ్చా
 • ఎవరూ అధైర్యపడొద్దు.. చంద్రబాబు ప్రభుత్వం సంవత్సరం మాత్రమే ఉంటుంది
 • ఆయన ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసే రోజు ముందుంది
 • కచ్చితంగా 2013 భూసేకరణ చట్టాన్ని అమలుచేస్తామని చెబుతున్నా
 • నష్టపోయినదానికి మీ అందరికీ ఆ చట్టం ప్రకారం నష్టాన్ని పూడుస్తాం
 • మొత్తం 11వేల కుటుంబాలకు న్యాయం జరిగేలా కచ్చితంగా చేస్తామని హామీ ఇస్తున్నాం
 • ధైర్యంగా ఉండండి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలుగా మీకు తోడుగా ఉంటుంది.

రణస్థలంలో వైఎస్‌ జగన్‌కు బ్రహ్మరథం


రణస్థలంలో వైఎస్‌ జగన్‌కు బ్రహ్మరథం
శ్రీకాకుళం: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఘనస్వాగతం లభించింది. వంశాధార ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలిచేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతంతో బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసిరెడ్డి వరద రామారావు వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వాసిరెడ్డిని పార్టీలోకి వైఎస్‌ జగన్‌ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మరింతమంది స్థానిక నేతల వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. హీరమండలం పాతపట్నం నియోజకవర్గంలోని వంశధార ప్రాజెక్టు నిర్వాసితులపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మొత్తం 13 గ్రామాల బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్‌ జగన్‌ ప్రస్తుతం రణస్థలం చేరుకున్నారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ పర్యటనలో శుక్రవారం నిర్వాసితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం ఐదు గంటలకు హీరమండలంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

వైఎస్ జగన్ పర్యటనలో అధికారుల నిర్లక్ష్యం


విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన ఏర్పాట్లలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తాళాలు మరిచిపోయిన ప్రభుత్వ సిబ్బంది వాహనం డోర్‌ను లాక్ చేశారు. ప్రొటోకాల్ అధికారుల నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తోంది. దీంతో మరో వాహనం కోసం శ్రీకాకుళం ఎస్పీకి సమాచారం ఇచ్చారు. కానీ అక్కడినుంచి వాహనం రావడానికి గంటన్నర సమయం పట్టే అవకాశం ఉండటంతో అధికారులు, సిబ్బంది హైరానా పడుతున్నారు.

వైజాగ్ పోలీస్ కమిషనర్‌కు కూడా సమాచారం ఇచ్చారు. వేరే వాహనం వచ్చేలోగా వైఎస్ జగన్‌ వస్తే పరిస్థితి ఏమిటని పోలీసులు, ప్రొటోకాల్‌ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయంగా వైఎస్సార్‌సీపీ నేతలు ప్రైవేటు వాహనం ఏర్పాటు చేస్తుండగా విశాఖ కమిషనర్‌ వేరే వాహనాన్ని ఏర్పాటు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో లాక్ పడిన వాహనం ఫొటోలు తీస్తున్న ‘సాక్షి’  ఫొటోగ్రాఫర్లపై పోలీసుల చిందులు తొక్కడం గమనార్హం.

మరోవైపు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయలుదేరిన వైఎస్ జగన్ విశాఖ నేటి ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ప్రియతమ నేత వైఎస్ జగన్‌కు వైఎస్ఆర్‌సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకుంటారు. పాతపట్నం నియోజకవర్గంలోని హీర మండలంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖీ  కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

పాకిస్తాన్‌కు చంద్రబాబుకు తేడా లేదు

Written By news on Thursday, May 18, 2017 | 5/18/2017


‘పాకిస్తాన్‌కు చంద్రబాబుకు తేడా లేదు’
తిరుపతి: ఏపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా అందరూ పోస్టింగ్‌ లు చేయాలని, ప్రజాభిప్రాయంగా అందరూ వీటిని ఆహ్వానిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ప్రజాభిప్రాయాన్ని తట్టుకోలేక టీడీపీ నేతలు ప్రతీకారంతో రగిలిపోతున్నారని, అయితే టీడీపీ తాటాకు చప్పుళ్లకు మేం భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్‌ మీడియాలో టీడీపీ నేతల అరాచకాలపై నెటిజన్లు పోస్టింగులు పెట్టడాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ ప్రశ్నించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ అధికారిక వెబ్‌సైట్లలోనే అశ్లీల, అసభ్య పోస్టులు పెట్టారని గుర్తుచేశారు.

మీకు భజంత్రీలు మోగించే పత్రికలకు మద్ధతిస్తూ, ప్రతిపక్షాల గొంతునొక్కడాన్ని భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్ధతు ఇవ్వడం అంటారా అని ప్రశ్నించారు. సోషల్‌ మీడియా మీ చేతిలో లేదని బాధ పడుతున్నారని అధికార పార్టీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే దాయాది పాకిస్తాన్‌ కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు తేడా ఏమీ లేదన్నారు. వైఎస్సార్‌ సీపీ నేతలు ఎన్నో విషయాలపై ఫిర్యాదు చేస్తే ఒక్కరోజు కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై, మా నాయకురాలిపై దారుణమైన పోస్టింగ్‌ లు పెట్టినప్పుడు టీడీపీ నేతలు వికటాట్టహాసం చేస్తూ పైశాచిక ఆనందం పొందడం నిజం కాదా అంటూ మండిపడ్డారు. మీ నేతలు చేసిన దారుణమైన పోస్టింగ్‌ లు గుర్తుకులేవా అని సీఎం చంద్రబాబును భూమన సూటిగా ప్రశ్నించారు.
ఇప్పుడు అదే ప్రభుత్వం ఏ చిన్న విమర్శను సహంచకుండా పోస్టింగ్స్‌ చేసిన వారిని అరెస్ట్‌ చేయడమే, భావ ప్రకటనా స్వేచ్ఛకు వారిచ్చే విలువ ఏపాటిదో అర్థమైందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రశ్నించాలనుకున్న అందరూ మీ ప్రతిభకు, మీ మేథస్సుకు పదునుపెట్టి లక్షల కొద్ది పోస్టింగ్‌ లు పెట్టి మీ పోరాటం ఉధృతం చేయాలని ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నేత భూమన పిలుపునిచ్చారు.

సోషల్‌ మీడియా స్వచ్ఛంద కార్యకర్తల అరెస్ట్‌ రాజ్యాంగ విరుద్ధం

Written By news on Wednesday, May 17, 2017 | 5/17/2017


ఏపీ ప్రభుత్వం తీరుపై జస్టిస్‌ కట్జూ ఆగ్రహం
న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా స్వచ్ఛంద కార్యకర్తల అరెస్టులపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార‍్కండేయ కట్జూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌ రవికిరణ్‌ అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. సోషల్‌ మీడియా స్వచ్ఛంద కార్యకర్తల అరెస్ట్‌ రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కార్టూన్లు అనేవి భావ స్వేచ్ఛ ప్రకటనలో ఓ భాగమని కట్జూ  అన్నారు.
 
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉందని ఆయన అన్నారు. ఆర్టికల్‌ 19 (1) ఏ కింద ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్నారు. ప్రజాస్వామ్య విధానంలో రాజకీయవేత్తలను విమర్శించే హక్కు ప్రజలకు ఉందని, ఇక్కడ ప్రజలే ప్రభువులని కట్జూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం తీరు అనాగరికం, అప్రజాస్వామికమని, ఏపీ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సర్కార్‌పై ఆర్టికల్‌ 356 ప్రయోగించాలని అని కట్జూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఆయన లేఖ రాశారు.

I appeal to @RashtrapatiBhvn @PMOIndia to dismiss the @ncbn govt over the unconstitutional arrest of cartoonist Ravi Kiran under Article 356

రైతులు సమస్యల్లో ఉంటే యార్డ్‌ను మూసేస్తారా?

Written By news on Tuesday, May 16, 2017 | 5/16/2017


సింధుపై ఉన్న ప్రేమ రైతులపై లేదు: వైఎస్‌ జగన్‌
అమరావతి: రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా అనంతరం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘ప్రభుత్వానికి పీవీ సింధు మీద ఉన్న ప్రేమ రైతులపై లేదు. ఒక క్రీడాకారిణిగా సింధుపై అభిమానం ఉండటంలో తప్పులేదు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా?. ఇప్పటివరకు మిర్చి కొనుగోలుకు రూ.2 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇవాళ్టి నుంచి మిర్చి యార్డ్‌కు సెలవు ప్రకటించారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి కాబట్టే యార్డ్‌కు సెలవు ఇచ్చారు. రైతులు సమస్యల్లో ఉంటే యార్డ్‌ను మూసేస్తారా?.

మిర్చికి కేంద్రం రూ.5వేలు ఇస్తానన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని మోసం చేశారు. రుణమాఫీ విషయంలోనూ మాట తప్పి రైతులను దగా చేశారు. జీఎస్టీ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదు. అయితే రెండు నిమిషాల్లో అయ్యేదానికి ప్రభుత్వం రాద్ధాంతం చేసింది. రైతుల సమస్యలపై మాట్లాడదామంటే తప్పించుకుంది. అ అంటే అభివృద్ధి అమరావతి కాదు. అ అంటే అవినీతి, అ అంటే అరాచకాలు, అ అంటే అనారోగ్యం, అ అంటే అబద్ధాలు.’ అని  ఆయన వ్యాఖ్యానించారు. కాగా పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్‌ పదవి ఇచ్చేలా  బిల్లుకు సవరణలు చేసి ఏపీ అసెంబ్లీ ఇవాళ ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు


రాష్ట్రంలో ప్రభుత్వం పాటిస్తున్న అస్తవ్యస్త విధానాల వల్ల రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని, అందుకే వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం దావుపల్లిలో లాలు నాయక్ అనే మిర్చిరైతు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. రెండెకరాల్లో పత్తి సాగు చేస్తే 70 వేల ఖర్చు వచ్చిందని, మొత్తం పది క్వింటాళ్ల పత్తి పండగా.. క్వింటాలుకు రూ. 4వేల చొప్పున మొత్తం రూ. 40 వేలు రాగా 30 వేల రూపాయల నష్టం మిగిలిందని ఆయన చెప్పారు.

ఇటీవలే అతడి భార్య తన బంగారం అమ్మి కూతురి పెళ్లి చేసిందని, ఆ సందర్భంలో కూతురికి పెట్టిన బంగారాన్ని మళ్లీ అల్లుడికి నచ్చజెప్పి తెచ్చుకుని దాన్ని బ్యాంకులో కుదువపెట్టి రూ. 40వేలు అప్పు తెచ్చారని జగన్ తెలిపారు. దాన్ని కూడా విడిపించే పరిస్థితి లేదని, పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. ఇక్కడ పక్కనే నాగార్జున సాగర్ ఉన్నా.. వెయ్యి అడుగుల లోతుకు వెళ్తే తప్ప బోర్లలో నీళ్లు పడవని చెప్పారు. ఇంత దారుణమైన పరిస్థితిలో ప్రజలున్నారని, అయినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకుందని అన్నారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం బుద్ధి, జ్ఞానం ఉన్నా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రవికిరణ్‌ ను పరామర్శించిన విజయ సాయిరెడ్డి


రవికిరణ్‌ ను పరామర్శించిన విజయ సాయిరెడ్డి
 గుంటూరు సబ్‌జైల్లో ఉన్న పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌ రవికిరణ్‌ను మంగళవారం మధ్యాహ్నం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్షసాధింపు చర‍్యల‍్లో భాగంగానే రవికురణ్‌ను చంద్రబాబు సర్కార్‌  అరెస్టుచేసి జైల‍్లో పెట్టిందని ఆరోపించారు. రవికిరణ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వంపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే సోషల్‌ మీడియాలో జనం స్పందిస్తున్నారన్నారు.
తమపై టీడీపీ పార్టీ వాళ్లు చాలా కార్టున్లు వేశారని, మరి వాళ్లను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని విజయ సాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. పత్రికల‍్లో, సోషియల్‌ మీడియాలో వచ్చే కార్టూన‍్లలో వ‍్యంగం సహజమని, మిగతావారిని కూడా ఇలాగే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి కొమ‍్ముకాస్తూ అమాయకులను అరెస్టు చేస్తున్నారని ధ‍్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెట్టినవారిని వదలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. కాగా విజయ సాయిరెడ్డితో పాటు పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, ఆత్కూరు ఆంజనేయులు ఉన్నారు.

నా షెడ్యూల్ ఇదీ.. మరి బాబు ఎక్కడికెళ్లారు?

Written By news on Monday, May 15, 2017 | 5/15/2017రైతుల సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద ప్రధానమంత్రిని కలవకపోతే అమెరికా అధ్యక్షుడిని కలుస్తామా అని ప్రశ్నించారు. తాను ఎప్పుడో ఫిబ్రవరిలో ప్రధానికి రాసిన లేఖకు అప్పుడే అక్కడినుంచి సమాధానం కూడా వచ్చిందని, దాన్ని ఇప్పుడు రాసినట్లుగా ఆంధ్రజ్యోతి ప్రచురించిందని, వాళ్లకు అది ఏ అధికారి నుంచి వచ్చిందో వాళ్లనే అడగాలని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి ప్రధాని చాలా సావధానంగా విన్నారని, ఆయన హోదా ఇస్తారనే ఆశ తమకు ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాము హోదానే ప్రధాన అంశం చేస్తామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
 • జీఎస్టీ బిల్లుకు సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న బిల్లు ఒక ఫార్మాలిటీ
 • కేంద్రం ఇదివరకే నాలుగు బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదించిన నేపథ్యంలో సీజీఎస్టీ, ఐజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినవి అన్నీ కేంద్రం చేసింది.
 • రాష్ట్రానికి సంబంధించిన జీఎస్టీని రాష్ట్రాలకు పంపడం ఒక ఫార్మాలిటీ
 • జీఎస్టీకి ఎవరూ వ్యతిరేకం కాదు. దానివల్ల మంచి జరుగుతుంది, పన్నుల మీద పన్నులు పడే పరిస్థితి ఉండదు కాబట్టి రేట్లు తగ్గుతాయనే ఆశ ప్రతి సామాన్యుడిలోను ఉన్న నేపథ్యంలో అందరూ దీన్ని స్వాగతిస్తున్నారు
 • వైఎస్ఆర్‌సీపీ తరఫున కేంద్రంలో ఈ బిల్లుకు మద్దతిచ్చాం, రాష్ట్రంలో కూడా మద్దతివ్వడంలో ఎలాంటి అనుమానం లేదు
 • ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోడానికి బిల్లు పెడుతున్నారు గానీ, రైతు ఆదాయాన్ని గురించి ఆలోచన చేయడం లేదు
 • గిట్టుబాటు, మద్దతుధరలు లేక ఏ పంట చూసినా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉండటంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు
 • ఉల్లి కిలో రూపాయికి, రెండు రూపాయలకు అమ్ముకుంటున్నారు
 • గత సంవత్సరం 25-30కి అమ్మారు
 • కంది 8వేలు-8500 ఉంటే ఇప్పుడు మూడు, నాలుగు వేలకు కూడా కొనట్లేదు
 • పెసర గతంలో ఆరువేలు ఉంటే ఇప్పుడు  నాలుగువేలు పలుకుతోంది
 • మినుము గతంలో 12 వేలు అయితే ఇప్పుడు ఆరువేలు ఉంది
 • మిర్చి గత సంవత్సరం 12-14వేలు పలికితే ఇప్పుడు 800-4000 మధ్య అమ్ముకోవాల్సిన అధ్వానమైన పరిస్థితి ఉంది
 • పసుపు గత ఏడాది 9వేలు అమ్మితే ఈ ఏడాది 4000-4500 దాటడం లేదు
 • టన్ను మామిడి గత సంవత్సరం 45 వేలు పలికితే ఇప్పుడు 7వేలకు అమ్ముతున్నారు
 • కానీ రైతు కొనాల్సిన పశుగ్రాసం మాత్రం ఎకరా పదివేల రూపాయలు ఉంది.
 • ఒక గేదెకు ఒక ఎకరా కావాలి.. ఎండు గడ్డి రేటు ఎకరా పదివేలు
 • గత సంవత్సరం ఇది 5వేలు. చంద్రబాబు సీఎం అయ్యేనాటికి 2, 3 వేలు మాత్రమే ఉండేది
 • పరిస్థితి ఇంత దారుణంగా ఉండి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
 • చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతామన్నారు
 • మేం 3వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతాం అనగానే రైతులను మోసం చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు.. పూర్తిగా రుణాల మాఫీ చేస్తాను, బ్యాంకుల్లో బంగారం ఇంటికి తెస్తానని ఏ రకంగా మోసపూరిత మాటలుచెప్పాడో, వాటినే కొనసాగిస్తూ ధరల స్థిరీకరణ నిధి పెడతామన్నారు
 • మొన్న మిర్చి ధరల కోసం నిరాహార దీక్ష చేస్తున్నప్పుడే.. రైతు పరిస్థితి మారకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం అని చెప్పాం, ఇప్పుడూ అదే చెబుతున్నాం
 • రైతు పరిస్థితిని పట్టించుకోని చంద్రబాబుకు బుద్ధి వచ్చేందుకు రైతులకు తోడుగా నిలబడతాం
 • రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మార్కెట్లో దళారులు దారుణంగా ఉన్నారు
 • ఎవరైనా హెరిటేజ్ షాపుకు వెళ్లి మిర్చి కొనాలంటే 200 గ్రాముల ప్యాకెట్ 50 రూపాయలు. అంటే క్వింటాలు దాదాపు 25వేల రూపాయలు ఉంది.
 • కానీ రైతు దగ్గరకు వచ్చేసరికి 2వేల నుంచి 4 వేల మధ్యలో ఉంది
 • రైతు నుంచి వ్యాపారి వరకు పోయేసరికి ఇంత తేడా కనిపిస్తోంది
 • చంద్రబాబు రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదంటే.. హెరిటేజ్‌లో తన లాభాలు తగ్గుతాయని
 • హెరిటేజ్‌లో ఎక్కువ ధరలకు కొనాల్సి ఉంటుందని ఇంత దారుణంగా చంద్రబాబు దగ్గర నుంచి దళారులు, వ్యాపారులు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు
 • 92 లక్షల క్వింటాళ్లు పండాయి కాబట్టి కనీసం 50 లక్షల క్వింటాళ్లు కొంటేనే మార్కెట్లో పోటీ వస్తుంది, వ్యాపారులు కూడా రేటు పెంచి కొనుగోలు చేస్తారు
 • కేంద్రం కాస్తో కూస్తో ముందుకొచ్చి 5వేలు క్వింటాలుకు ఇస్తామని ముందుకొచ్చింది.. సంతోషం
 • కేంద్రం నుంచి అంత వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి.. మరో 3వేలు జతచేసి కనీసం 8వేలకు అయినా కొనుగోలు చేస్తే రైతులకు కనీసం ఖర్చులు వస్తాయి
 • ఎకరాకు రైతుకు లక్షా 30 వేల నుంచి లక్షా 60 వేల వరకు ఖర్చవుతుంది
 • ఎకరాకు 13-15 క్వింటాళ్లు కూడా రాలేదు, రైతులు ఎలా బతుకుతారు?
 • మిర్చి, ఉల్లి, మామిడి, టమోటా.. ఏ పంట చూసినా రైతులు బతికే పరిస్థితి లేదు
 • ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అందిన సహాయం కేవలం 2 కోట్లు.. చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి
 • ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అన్నిరకాలుగా అండగా నిలిచేందుకు, చంద్రబాబు ఇంత దారుణంగా పాలన చేస్తున్న నేపథ్యంలో రైతులకు అండగా నిలిచే దిశగా అడుగులు వేస్తూ, అసెంబ్లీని స్తంభింపజేస్తామని చెబుతున్నాం
 • 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెట్టాల్సిందే, గిట్టుబాటు ధరలకు పంటలను కొనాల్సిందేనని అల్టిమేటం ఇస్తున్నాం

వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారు...
 • ఫిబ్రవరి 17న ప్రధానికి లేఖ రాశాను.. దాన్ని కరుణాకర రెడ్డి కూడా చూపించారు
 • చంద్రబాబు తన అధికారంతో ఒకవైపు ప్రతిపక్షమే ఉండకూడదన్న దుర్బుద్ధితో నిస్సిగ్గుగా తన దగ్గర ఉన్న అధికారంతో వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటే.. అధికారులను ప్రలోభపెట్టి, వాళ్లతో తప్పులు చేయిస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
 • రాజ్యాంగ పరిధిలో ఉన్నాం.. ట్రంప్‌కో, అమెరికా గవర్నర్‌కో చేయలేం కదా, ప్రధానికే ఫిర్యాదు చేస్తాం
 • అధికారులు ఇలా చేస్తున్నారు, వాళ్లకు చంద్రబాబు నుంచి సూచనలు వస్తున్నాయి, వీళ్లు చేస్తున్న వేధింపుల మీద లోతుగా దర్యాప్తు చేయాలని ప్రధానమంత్రికే కాదు.. సీవీసీకి, అందరికీ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం
 • ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చి, ఆ బెయిల్‌ను రద్దు చేయాలని మళ్లీ కోర్టుకు పోవడం దేశంలో ఎక్కడా జరిగి ఉండదు
 • తప్పు చేశాడని రుజువు కాకుండా జైల్లో పెట్టడమే తప్పు, రాజ్యాంగం ప్రకారం 3 నెలల్లోపు విడుదల చేయాలి
 • కానీ చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై కేసులు పెట్టారు.. అక్కడి నుంచి కేసులు నడిపించేవరకు కూడా అంతా వాళ్లే
 • అప్పుడు చంద్రబాబు ఫోన్లలోనే అధికారులతో నడిపించారు, వాళ్లు మీడియాకు సెలెక్టివ్ లీకులు ఇచ్చారు
 • ఎంతవరకు చెప్పాలి, ఏ రకంగా చెడ్డపేరు రావాలని చూశారు
 • దర్యాప్తు అధికారులు ఇలా చేయకూడదు గానీ, వాళ్లతో ఈయన చేయించారు
 • అప్పుడు అలా చేశారు, ఇప్పుడు మళ్లీ తనకున్న మంత్రిని కేంద్రంలో కూర్చోబెట్టుకుని ఆయనతోను, చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్న మంత్రులను ఉపయోగించుకుని ఇదే కార్యక్రమం చేస్తున్నారు
 • టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాజీ సీఎస్ ఏదో చెబితే, నేను ప్రభావితం చేశానని, బెయిల్ రద్దు చేయాలని అన్నారు.
 • ఇలాంటి వ్యక్తి ఇంత దారుణంగా చేస్తున్నాడు.. ఎవరు ఎవరితో టచ్‌లో ఉన్నారు, ఎవరి దగ్గరకు వెళ్తున్నారు, ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నారో అన్నింటి మీదా దర్యాప్తు చేయాలని లెటర్లు రాయడం ప్రజాస్వామ్యంలో్ తప్పదు
 • అవతలివాడు కొడుతున్నా కొట్టించుకుంటే ఎవడూ బతకడు

బుద్ధి ఉన్నవాడెవడైనా పాత లేఖ తీసుకెళ్లి ఇస్తాడా?
 • చంద్రబాబు మీడియాను ఎంతలా మేనేజ్ చేస్తారంటే.. చివరకు ఒక మీడియా హౌస్ న్యాయం తరఫున మాట్లాడాల్సింది పోయి.. జరగనిది జరిగినట్లుగా కుకప్ చేసింది
 • నేను ఫిబ్రవరి 17న లేఖ రాస్తే, వాళ్ల దగ్గర నుంచి సమాధానం కూడా వచ్చింది.
 • మే 10న నేను ప్రధానమంత్రిని కలిశాను
 • బుద్ధి ఉన్నవాడెవడైనా పాత లెటర్ తీసుకెళ్లి ఇస్తాడా..
 • నేను మే 10న ఇచ్చిన లేఖను పక్కన పెట్టి, ఫిబ్రవరి 17న నేను రాసిన లేఖను ప్రస్తావించారు.
 • మొదటి పేజీ చూపిస్తే తేదీ చూపించాల్సి వస్తుందని చివర పేజీ వేశారు
 • ఇదే లేఖ పెట్టి మీడియా అబద్ధాలు చెబుతుంటే ఈ వ్యవస్థలో ఎవరైనా బతకగలరా?
 • ప్రతిపక్ష నాయకుడిగా ప్రధనమంత్రిని కలిసి సమస్యలు చెప్పడం తప్పా?

ప్రధానితో హోదా సహా అన్ని విషయాలూ మాట్లాడాం
 • గంట సేపు మాట్లాడితే సహజంగానే అన్నీ మాట్లాడతాం
 • ప్రత్యేక హోదా అంశం మీదే 10-15 నిమిషాలు చెప్పి ఉంటాం
 • నిజమా జగన్.. మరి 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు అని ప్రధాని అన్నారంటే ఈయన ఏ రకంగా మిస్‌లీడ్ చేశారో అర్థమవుతుంది.
 • అగ్రిగోల్డ్ గురించి మాట్లాడాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు చంద్రబాబు కొడుకు మీద కూడా ఆరోపణలు వచ్చాయన్నాను
 • మిర్చి రైతుల అవస్థల గురించి కూడా మోదీతో ప్రస్తావించాను
 • సహజంగా రాజకీయాలు కూడా మాట్లాడతాం
 • చంద్రబాబు ఎలా దోచుకుంటున్నాడు, అవినీతిలో ఏపీని నెంబర్ 1 అని ఎలా చెప్పారు, కాగ్ నివేదిక చంద్రబాబు మీద ఆరోపణలను ధ్రువీకరిస్తూ ఎలా నివేదిక ఇచ్చింది, రాజధాని కేంద్రంగా చంద్రబాబు చేస్తున్న స్కాంలు ఏంటి.. అన్నింటి మీదా కూలంకషంగా చెప్పాం
 • చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎలా చేస్తున్నాడో అన్నీ చెప్పాను
 • కానీ చంద్రబాబుకు ఉన్నట్టుండి మోదీ అంటరాని వాడు అయిపోయారు
 • మోదీ జగన్‌కు ఎందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని అడుగుతున్నారు
 • ప్రతిపక్ష నాయకుడికి మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం తప్పా, ప్రతిపక్ష నేత సమస్యలు చెప్పడం తప్పా?
 • నువ్వు మోదీ దగ్గరకు వెళ్లి ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు మాట్లాడావు, ఎప్పుడు ఒత్తిడి తెచ్చావు.. ఏరోజూ చెప్పలేదు
 • పైగా నువ్వు చెయ్యవు, ఎవరైనా చేస్తే వాళ్లమీద అభాండాలు వేయడం
 • నేను మోదీని కలవడం తప్పన్నట్లు, ఆయనకు విషయాలు చెప్పడం, ఆయన వినడం అన్నీ తప్పన్నట్లు చెబుతుంటే ఆశ్చర్యం వేసింది
 • ఏ ఈడీ అధికారి నుంచి ఆంధ్రజ్యోతికి ఆ లేఖ వచ్చిందో వాళ్లనే అడగండి
 • సోషల్ మీడియా పోస్టింగులకు సంబంధించి ఒక వ్యక్తిని 14 రోజులు జైల్లో పెట్టారు
 • నిజంగా మీరు చేస్తున్నది కరెక్టేనా?
 • వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారంటే.. కేసులు పెట్టడం దగ్గర నుంచి లోపల వేసేవరకు
 • ఎన్నికలకు ముందు నా గురించి ఎంత దారుణంగా నైతిక విలువలు మర్చిపోయి పోస్టింగులు చేయించారు
 • నక్కను పెట్టి, దాని ముఖానికి నా ఫొటో తగిలిస్తే తప్పు కాదా
 • జగన్‌ను ప్రేమించేవాళ్లు కూడా కడుపు మండి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాళ్లను బెదిరించి కేసులు పెడుతున్నారు
 • వ్యవస్థలను ఇంత దారుణంగా మేనేజ్‌ చేసేవాళ్లు సీఎం పదవిలో కూర్చోడానికి అర్హుడు కాడు
నా షెడ్యూల్ ఇదీ.. మరి బాబు ఎక్కడికెళ్లారు?
 • నాకైతే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాత్రి ఫోన్ వచ్చింది, పొద్దున్నే రమ్మన్నారు
 • ఉదయం 6.30 విమానానికి బయల్దేరి వెళ్లాం, అది సాంకేతిక సమస్య కావడంతో 7.30కి వేరే విమానంలోకి మారాం
 • అక్కడకు వెళ్లేసరికి సుమారు 10 అయ్యింది, వెంటనే ప్రెస్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్ ఉందని చెప్పాం
 • ఫ్రెషప్ అయ్యి వెంటనే ప్రధాని వద్దకు వెళ్లాం, ఆయనకు ఇచ్చిన అర్జీ సహా అన్నీ మీడియాకు చూపించాం.. అన్నీ పారదర్శకంగా చేశాం
 • చంద్రబాబు 2-3 గంటలకు వచ్చి, 11 గంటల వరకు ఎవరికీ కనపడలేదు
 • ఆయన ఈ మధ్య సమయంలో ఎక్కడకు వెళ్లారు, ఎవరిని కలిశారు, ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు?
 • ఎవరు చీకట్లో చిదంబరాన్ని కలిశారు, ఎవరు కాంగ్రెస్‌తో కలిసి నా మీద కేసులు పెట్టారు, ఎవరు విప్ జారీచేసి మరీ కిరణ్ సర్కారును కాపాడారు?
 • బీజేపీ ప్రభుత్వంలో తనవాళ్లను మంత్రులుగా పెడతాడు, ఇక్కడ ఆయన రహస్యంగా తిరుగుతాడు, ఎవరిని కలిశాడో కూడా చెప్పడు


కడుపు మండినవాళ్లే మెయిల్ పెట్టి ఉంటారు
 • అమెరికా గవర్నర్, అమెరికా అధ్యక్షుడు మన దేశానికి, మన రాష్ట్రానికి సంబంధించినవాళ్లా?
 • వాళ్లకు రాస్తే మాకు పార్టీపరంగా ఏమొస్తుంది? ఆ మెయిల్స్ మేం పెట్టలేదు.. కడుపు మండినవాడు ఎవడో పెట్టి ఉంటాడు
 • గోదావరి పుష్కరాల్లో షూటింగ్ కోసం 27 మందిని చంపేశాడు.. ఆ కేసులో జైలుకు వెళ్లాల్సిన చంద్రబాబు బయట తిరుగుతూనే ఉన్నాడు. ఆ గోదావరి జిల్లాల వాళ్లకు ఎవరికో కడుపు మండే ఉంటుంది
 • తమిళనాడుకు చెందిన 29 మంది కార్మికులను స్మగ్లర్లు అన్న పేరుతో పిట్టల్ని కాల్చినట్లు టపటపా కాల్చేశారు.. దాంతో తమిళనాడులో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. వాళ్ల కుటుంబాలలో ఎవరికో కడుపు మండే ఉంటుంది
 • ఓటుకు కోట్ల కేసులో నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియోటేపుల్లో దొరికిపోయినా ఆయనను అరెస్టు చేయలేదంటే, రాజీనామా చేయలేదంటే ఎవరికైనా కడుపు మండదా?
 • బయటకొచ్చి నీ అంత సత్య హరిశ్చంద్రుడు ఎవరూ లేరన్నట్లు కబుర్లు చెబుతారు
 • ఇవన్నీ చూసి ఎవరికో కడుపు మండి ఈ మెయిల్ పెడతారు.. దానిమీద వాళ్లకు ఖాళీ ఉంటే చదివి తీసుకోవాలనుకుంటే చర్య తీసుకుంటారు
 • దాన్ని ఈయనేదో కుట్ర అని బాధపడిపోతారు.. తప్పు చేసినందుకు కాకుండా, వాటిని ఎత్తి చూపించినందుకు ఎక్కువ బాధపడతారు
 • కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినందుకే నామీద కేసులు పెట్టారని ఆయనే ఒప్పుకున్నారు. కానీ ఆయన సగమే చెప్పారు. తాను కూడా ఆ కేసులో ఉన్నానని కూడా చెప్పి ఉండాల్సింది

ప్రధాని హోదా ఇస్తారన్న ఆశ ఉంది..
 • హోదా అనే విషయం మీద ప్రధానమంత్రికి కనీసం 10 నిమిషాల సేపు చెప్పాను. ఆయన చాలా సానుకూలంగా విన్నారు. నిజంగా ఇంత సానుకూలంగా ఆయన విన్న తర్వాత..
 • మోదీ పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలి. ఆయన గురించి భవిష్యత్తులో గొప్పగా మాట్లాడాలంటే, ప్రత్యేక హోదా విషయంలో ఆలోచించాలి.. పార్లమెంటు సాక్షిగా మాట ఇచ్చారు, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణతో్ను, బెంగళూరుతో కూడిన కర్ణాటకతోను, చెన్నైతో కూడిన తమిళనాడుతోను పోటీ పడలేమని చెప్పాం
 • ఆదాయ పన్ను కట్టాల్సిన పని లేదంటే, ఎక్సైజ్ డ్యూటీ అక్కర్లేదంటే ఎవరైనా వస్తారు, మీరు కూడా తిరుపతిలో మాటిచ్చారు, మాట తప్పొద్దని రిక్వెస్ట్ చేశాం
 • మాకు ఆశ ఉంది.. చేయగల కెపాసిటీ ఎవరికైనా ఉందంటే అది ప్రధానికే
 • పోరాటం చేసేటపుడు మూడు రకాల వ్యూహాలు ఉండాలి.. అవి దౌత్యం, లౌక్యం, పోరాటం
 • అన్నిరకాలుగా చేస్తేనే మన ప్రత్యేక హోదా పోగొట్టుకోకుండా ఉంటాం
 • నిజంగా ఆయన మనసు కరిగి అది జరిగితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది.. కాస్త సమయం ఇద్దాం, మంచి జరుగుతుందని ఆశిద్దాం
 • రాజీనామాలు చేయించడం చిన్న విషయం. ఒకసారి చేసిన తర్వాత ఇక ప్రత్యేక హోదా గురించి అడగగలిగింది ఎవరు?
 • కనీసం పార్లమెంటులో ఉన్నారు కాబట్టి అడుగుతారు, రాజ్యసభలో కూడా విజయసాయిరెడ్డి పట్టుబట్టారు
 • ఆ వ్యక్తి అక్కడ ఉంటేనే బిల్లు వస్తుంది, చర్చ జరుగుతుంది
 • మోదీ గారికి చెప్పాం కాబట్టి ఆయన కాస్తో కూస్తో మంచి చేస్తారని ఆశిద్దాం
 • పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లు మీద చర్చ కూడా ఆయన దృష్టికి వెళ్లచ్చు
 • ఈరోజు కాకపోతే ఆరు నెలల తర్వాత రాజీనామాలు చేయిస్తాం.. ఒత్తిడి చేయకుండా ఊరికే ఏ ఆలోచనా, దౌత్యం, లౌక్యం లేకుండా రాజీనామా చేస్తే మనకే నష్టం
 • ప్రత్యేక హోదా గురించి ఆరాటపడేది, సిన్సియర్‌గా పోరాటం చేసేది ఒక్క జగనే అని గర్వంగా చెప్పగలను
 • ఎన్నికల్లో కూడా దీన్ని ఇష్యూ చేస్తాం.. అది ఇచ్చేవారికి మా మద్దతు ఉంటుందని ఇప్పుడే చెబుతున్నాం
ఫిబ్రవరి 17న ప్రధానికి వైఎస్ జగన్ రాసిన లేఖ అసలు ప్రతి ఇదీ..

ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నాం: భూమన


ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నాం: భూమన
హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని రాజకీయంగా అణగదొక్కేందుకు పచ్చ మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఆంధ్రజ్యోతి దినపత్రిక పాత్రికేయ విలువలను పూర్తిగా వదిలేసిందని, పూర్తిగా దిగజారి లేనిది ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తోందని భూమన అన్నారు. ప్రధానమంత్రికి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన వినతి పత్రంపై అసత్యాలు ప్రసారం చేస్తోందని, సిగ్గువిడిచి ఆంధ్రజ్యోతి అసహ్యంగా వార్త రాసిందని ఆయన మండిపడ్డారు.

‘ఉమశంకర్‌ గౌడ్‌, గాంధీ అనే అధికారులు టీడీపీకి తొత్తులుగా మారారని వైఎస్‌ జగన్‌ ఫిబ్రవరి 17న ప్రధానికి లేఖ రాశారు. అయితే ఆ లేఖపై ఏప్రిల్‌ 13న కేంద్రం స్పందించి జవాబు ఇచ్చింది. ప్రధానికి జగన్‌ సమర్పించిన వినతిపత్రాన్ని అన్ని పత్రికలు ఇచ్చామని, అందులో అగ్రిగోల్డ్‌, ప్రత్యేక హోదా సహా అన్ని అంశాలను ప్రస్తావించారు. కానీ ఆంధ్రజ్యోతి విలువలకు తిలోదకాలు ఇచ్చి పిబ్రవరి 17న రాసిన లేఖను వైఎస్‌ జగన్‌ మే 10న ప్రధానికి ఇచ్చినట్లుగా చిత్రీకరించింది. నాటి లేఖను ఇప్పటి లేఖగా బురద జల్లుతోంది. ప్రజా సమస్యలపై వైఎస్‌ జగన్‌ ...ప్రధానిని కలిస్తే దిగజారి అవాస్తవాలను ప్రచురించింది.
ఒక పార్టీని, నాయకుడిని సర్వనాశనం చేయాలనే దుగ్ధతో ఆంధ్రజ్యోతి వ్యవహరిస్తోంది. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే శక్తిలేక ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తోంది.  టీడీపీ జెండాను ఆంధ్రజ్యోతి తన భుజాలపై మోస్తోంది. తప్పుడు వార్త రాసిన ఆంధ్రజ్యోతిపై ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తాం. లీగల్‌ నోటీసు ఇస్తాం. క్రిమినల్‌ డిఫమేషన్‌ (శిక్షార్హమైన పరువునష్టం) కేసు వేస్తాం.  ఏబీఎన్‌ చానల్‌, ఆంధ్రజ్యోతి పత్రిక గత మూడేళ్లుగా వైఎస్‌ జగన్‌తో పాటు వైఎస్‌ఆర్‌ సీపీపై విషం కక్కుతూనే ఉంది. ఉద్దేశపూర్వకంగా కుట్రతో జగన్‌ను బదనాం చేసే ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రజ్యోతి చేసింది నేరం తప్ప మరొకటి కాదు. ఆ నేరానికి క్షమాపణ కూడా లేదు.
ఆంధ్రజ్యోతి పత్రికతో పాటు, ఏబీఎన్‌ చానల్‌ను  పత్రికలపై గ్రామస్థాయి నుంచి అన్ని స్థాయిల వరకూ మేం బహిష్కరిస్తున్నాం. మా పార్టీ కార్యాలయాలకు ఆ పత్రికా విలేకర్లు రావాల్సిన అవసరం లేదు. ఆ పత్రిక అంత సిగ్గుమాలిన పత్రిక ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని వాస్తవాలు రాస్తే మంచిది. ఫిబ్రవరి 17న వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను, మే 10న ప్రధానికి ఇచ్చిన లేఖను ఆంధ్రజ్యోతికి పంపిస్తాం. వాస్తవాలు రాయాలని కోరుతున్నాం.’  అని అన్నారు.

చంద్రబాబు మాటలకు జనం నవ్వుకుంటున్నారు


‘చంద్రబాబు మాటలకు జనం నవ్వుకుంటున్నారు’
తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో థ్వజమెత్తారు. సోమవారం ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతం రోజా మాట్లాడుతూ...’ స్నానం చేయకుండా 24 గంటలపాటు రాష్ట్ర ప్రజల కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నానని చంద్రబాబు అన్న మాటలకు జనం నవ్వుకుంటున్నారు. బాబు ఎందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు.

దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి, విరాళాల కోసమే పర్యనటలు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. అమెరికాలో 300 కంపెనీల సీఈవోలను కలుస్తానని వెళ్లారు. అయితే చంద్రబాబు అవినీతి తెలుసుకుని 200మంది సీఈవోలు కలవడానికి భయపడ్డారు. చంద్రబాబు అవినీతిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారు. వైఎస్‌ జగన్‌ మగాడిలా మీడియా సమక్షంలో  ప్రధాని మోదీని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ గురించి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు.

విదేశీ పర్యటన నుంచి వచ్చిన అనంతరం చంద్రబాబు ఢిల్లీలో 6 గంటలు ఎక్కడి వెళ్లారో చెప్పాలి. అమిత్‌ షా కాళ్లు పట్టుకోవడానికా, హోంమంత్రి కాళ్లు పట్టుకోవడానికి వెళ్లారా? రెండున్నరేళ్లలో చంద్రబాబు అండ్‌ కో రూ.2 లక్షల కోట్లు దోచుకుంది. ప్రజలను డైవర్ట్‌ చేయడానికే ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సస్పెన్షన్‌ డ్రామా. సుజనా చౌదరి మారిషస్‌ బ్యాంకు వందల కోట్లు ఎగ్గొట్టారు. అలాంటివారికి కేంద్రమంత్రి పదవి ఇచ్చారు.
ఇక ఓటుకు కోట్లు కేసులో దోషిగా ఉన్న చంద్రబాబు అవినీతికి పాల్పడిన సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావు ముందు రాజీనామా చేయాలి. లోకేశ్‌కు 5 నెలల్లో 22 రెట్లు ఆస్తులు ఎలా పెరిగాయి?. వాకాటి నారాయణరెడ్డిపై సీబీఐ సోదాలను స్వాగతిస్తున్నాం. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదనడం అవివేకం.  చంద్రబాబు శ్రీవారి దర్శనానికి వచ్చి అనేక హామీలు ఇచ్చారు. చిత్తశుద్ధి ఎంటే ఆలయాల చుట్టూ ఉన్న బెల్ట్‌ షాపులు ఎత్తేయండి. ఐఏఎస్‌ అధికారులు ఏ ప్రాంతంవారైనా పర్వాలేదు. అయితే టీటీడీ అభివృద్ధికి దోహదపడేలా ఉండాలి.’ అని అన్నారు

రాజన్న క్యాంటీన్‌: భోజనం@రూ.4

Written By news on Sunday, May 14, 2017 | 5/14/2017


రాజన్న క్యాంటీన్‌: భోజనం@రూ.4
అమరావతి: అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ మాట మరిచిందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. తన సొంత ఖర్చుతో పేదలకు భోజనం పెడుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆర్కేను ఆయన అభినందించారు.

ఆదివారం తన నియోజకవర్గం మంగళగిరిలో రాజన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే ఆర్‌ రామకృష్ణా రెడ్డి ప్రారంభించారు. కేవలం రూ.4లతో సాంబారు అన్నం, పెరుగన్నం, కోడిగుడ్డుతో మీల్స్‌ను అందిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు, మూడు రోజులు అరటిపండు, ఒడియాలను భోజనంలో ఇస్తారు. ప్రభుత్వం చేయలేని పనిని ఒక ఎమ్మెల్యే తన సొంత ఖర్చుతో చేయడం హర్షణీయమని ఉమ్మారెడ్డి అన్నారు.

‘ఓటుకు నోట్లు’ చంద్రబాబా నీతులు చెప్పేది?


‘ఓటుకు నోట్లు’ చంద్రబాబా నీతులు చెప్పేది?
► ప్రధాన మంత్రిని జగన్‌మోహన్‌ రెడ్డి కలిస్తే తప్పేమిటి?
► చంద్రబాబుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం


గంగవరం: ఓటుకు నోటు కేసులో చిక్కిన మీరా మాకు నీతులు చెప్పేది అని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గంగవరం మండలంలోని కీలపట్ల కోనేటిరాయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం జరిగిన పుష్పయాగంలో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. తర్వాత  మోతుకుపల్లెలోని మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు సుబ్రమణ్యంరెడ్డి ఇంటికి వెళ్లి బంధువులను పలకరించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని కలవడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలను మోదీకి వివరిస్తే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. ప్రతిపక్షనేతగా జగన్‌ ప్రధానమంత్రిని కలిసి అధికార పక్షం చేస్తున్న అరాచకపాలనను వివరించినందుకే ఉలిక్కిపడుతున్నారన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు అండ్‌కో ఇప్పుడు నీతులు చెబుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాసమస్యలే ప్రధానాస్త్రంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారని స్పష్టంచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్తలు రాకేష్‌రెడ్డి, సీ.వీ.కుమార్,  రెడ్డెమ్మ, నాయకులు, వెంకటేగౌడు, మొగసాల కృష్ణమూర్తి, మోహన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు చుట్టూ విజయ్‌ మాల్యాలు


‘చంద్రబాబు చుట్టూ విజయ్‌ మాల్యాలు’
నెల్లూరు: ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్‌ చేయడం సరైందేనని నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వాకాటిపై ముందు నుంచే కేసులు ఉన్నా టికెట్‌ ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజల దృష్టిని మరల్చేందుకే వాకాటిని టీడీపీ సస్పెండ్‌ చేసిందని ఆరోపించారు. గంటా శ్రీనివాసరావు, సీఎం రమేశ్‌, రాయపాటి సాంబశిరావులపై కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుజనా చౌదరి వేల కోట్ల రూపాయలు ఎగ్గొడితే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

వాకాటిపై ఆరోపణల గురించి ముందే చెప్పామని, అయినా టికెట్‌ ఇచ్చి కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులతో ప్రజాప్రతినిధులను భయపెట్టిన ఘనత చంద్రబాబుదని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు చేయించుకుని క్లీన్‌చిట్‌ తెచ్చుకునే ధైర్యం ఉందా అని నిలదీశారు. చంద్రబాబు చుట్టూ వందల మంది విజయ్‌ మాల్యాలు ఉన్నారని విమర్శించారు. టీడీపీలో ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని సస్పెండ్‌ చేయాలని కాకాని డిమాండ్‌ చేశారు.

Popular Posts

Topics :