21 May 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్సార్ సీపీలోకి కాంగ్రెస్‌ నేతలు

Written By news on Tuesday, May 23, 2017 | 5/23/2017


వైఎస్సార్ సీపీలోకి కాంగ్రెస్‌ నేతలు
పులివెందుల: ప్రజల పక్షాన నిరంతర పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు నేతలు, సామాన్యులు అమితాసక్తి కనబరుస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన అనిల్‌ చౌదరి, మంజునాథ చౌదరి సహా 500 కుటుంబాలకు చెందినవారు వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్‌ జగన్‌ పార్టీ కండువాలు కప్పి వీరికి సాదరస్వాగతం పలికారు. జగన్‌ నాయకత్వంలో వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేస్తామని వీరు తెలిపారు.

ఆ పదవులకు పోటీ వద్దు: వైఎస్‌ జగన్‌


ఆ పదవులకు పోటీ వద్దు: వైఎస్‌ జగన్‌
పులివెందుల: రాజ్యాంగపరంగా అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, స్పీకర్‌ పదవులకు పోటీ ఉండకూడదని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అత్యున్నత పదవులు ఏకగ్రీవమైతే వాటి హుందాతనం పెరుగుతుందన్నారు. తటస్థంగా ఉండే వారే ఆ పదవుల్లో ఉండాలని ఆశిస్తామని, అందుకే ఏకగ్రీవానికి మద్దతు పలుకుతామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావుకు అందుకే మద్దతు ఇచ్చామని, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. అన్ని పార్టీలు మద్దతు ఇస్తే తటస్థంగా ఉంటారన్న ఆశ కలుగుతుందని చెప్పారు. గతంలో రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ఇచ్చామని తెలిపారు. పదవుల్లో ఉన్న వారు ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలన్నారు. తమ పార్టీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసుపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే...
 • సీఎం పదవిలో ఇవాళ చంద్రబాబు ఉండొచ్చు రేపు మేం గెలవొచ్చు
 • ఎవరు అధికారంలో ఉన్నా 5 కోట్ల మంది ప్రజల్లో ఒకరికే సీఎంగా ఉండే అవకాశం దేవుడు ఇస్తాడు
 • అలాంటి పదవుల్లో ఉన్నవారు ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలి
 • ఎవరైనా ప్రజలకు మంచి చేయాలి
 • ప్రజల ఆశీస్సులతో, దేవుడి దీవెనలతో సీఎంగా ఎన్నిక కావాలి
 • ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం, వారిపై అనర్హత వేటు పడకుండా చూడటం సరికాదు
 • చంద్రబాబు పరోక్షంగా సహకరించబట్టే పత్తికొండలో హత్యలు జరిగాయి
 • డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి నియోజకవర్గంలో హత్య జరిగింది
 • నారాయణరెడ్డి లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం వెపన్‌ తీసుకున్నారు
 • ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినా వెపన్‌ తిరిగి ఇవ్వలేదు
 • దీన్నిబట్టి చూస్తే పథకం ప్రకారం హత్య జరిగినట్టు తెలుస్తోంది
 • ఇసుక మాఫియాపై నారాయణరెడ్డి యుద్ధం చేశారు
 • కేఈ కుమారుడిపై విచారణకు హైకోర్టు ఆదేశించింది
 • ఇలాంటి నేపథ్యంలో భద్రత కోసం నారాయణరెడ్డి పదేపదే వేడుకున్నారు
 • కోర్టు ఆదేశాలతో సెక్యురిటీ ఇస్తే మూడు నెలల్లో తొలగించారు
 • రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎదుటివారిని ప్రేమించడం కూడా చేయాలి
 • వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో పత్తికొండలో గెలిచే పరిస్థితి వస్తుంది
 • ఒకర్ని చంపితే అభ్యర్థి లేకుండా పోతారా? నాయకుడు లేకుండా పోతాడా?
 • నారాయణరెడ్డి హత్యపై సీబీఐతో దర్యాప్తు జరపాలి
 • నారాయణరెడ్డి హత్య కేసులో డిప్యూటీ సీఎం నిందితుడు
 • కేఈకి చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయి
 • సీబీఐతో విచారణ చేయిస్తేనే న్యాయం జరుగుతుంది
 • పోలీసులు విచారణ వల్ల ఎవరికీ మేలు జరగదు

నారాయణరెడ్డికి వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

Written By news on Monday, May 22, 2017 | 5/22/2017


కర్నూలు:  ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి భౌతికకాయానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నివాళులు అర్పించారు. ఈరోజు మధ్యాహ్నం  హైదరాబాద్‌ నుంచి నేరుగా చెరుకులపాడు చేరుకున్న వైఎస్‌ జగన్‌.... నారాయణరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. భర్తను కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న నారాయణరెడ్డి భార్య శ్రీదేవిరెడ్డిని ఓదార్చి, ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

మరోవైపు నారాయణరెడ్డిని కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వేలాదిమంది అభిమానులతో చెరుకులపాడు జనసంద్రమైంది. మరోవైపు నారాయణరెడ్డిని కాపాడేందుకు యత్నించి ప్రాణాలు కోల్పోయిన ఆయన అనుచరుడు సాంబశివుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఉదయం 9:30కు హత్య జరిగితే, మధ్యాహ్నం 2:30 దాకా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లకపోవడం..- టీడీపీకి మనుగడ ఉండదనే నారాయణరెడ్డిని హత్య చేశారు
- బాబు జైల్లోపడితేగానీ వ్యవస్థ మారదు: ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌
- వైఎస్సార్‌సీపీ నాయకులపై అధికార టీడీపీ రాక్షసకాండపై గవర్నర్‌కు ఫిర్యాదు


హైదరాబాద్‌:
 విపక్ష నాయకులను ప్రలోభాలకు గురిచేస్తూ, మాట వినకుంటే ప్రాణాలు తోడేస్తూ అధికార తెలుగుదేశం రాక్షస పరిపాలన సాగిస్తున్నదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి చెరకులపాడు నారాయణరెడ్డి హత్యలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన వైఎస్‌ జగన్‌.. ఏపీలో జరుగుతోన్న రాక్షసకాండపై ఫిర్యాదుచేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు జైలుకు పోతే తప్ప వ్యవస్థ బాగుపడే పరిస్థితి లేదని అన్నారు.

‘నారాయణరెడ్డి హత్యతో ఏపీలో మరోసారి ప్రజాస్వామ్యం హత్యకుగురైంది. పక్కపార్టీ నాయకులను కొనుగోలుచేయడం, ప్రలోభాలకు లొంగకపోతే ప్రాణాలు తీయడం తెలుగుదేశం పార్టీ విధానంగా మారింది. మరోవైపు వివిధ కేసుల్లో దోషులు, నిందితులుగా ఉన్న సొంత పార్టీ వారిని కేసుల నంచి తప్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 132 జీవోలు జారీచేసింది.

నారాయణరెడ్డి బతికుంటే టీడీపీకి మనుగడ ఉండదనే హత్యచేశారు. ఉద్దేశపూర్వకంగా గన్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయలేదు. కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కొడుకు నేతృత్వంలో సాగుతోన్న ఇసుక మాఫియాపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించేదాకా నారాయణరెడ్డి పోరాడారు. అందుకే ఆయను అడ్డుతప్పించారు. ఈ హత్యను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేయిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా సహకరించారు’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.

పోలీసులు ఆలస్యంగా వచ్చింది అందుకే..
కేఈ కుటుంబం ఇసుక దందాపై పోరాటం నేపథ్యంలో తన ప్రాణాలకు హానీ ఉందని, రక్షణ కల్పించాలని నారాయణరెడ్డి పలుమార్లు పోలీసులను అభ్యర్థించారని వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. సెక్యూరిటీ కల్పించకపోగా, లెసెన్స్‌ రెన్యూవల్‌ పేరుతో ఉన్న ఆయుధాన్ని కూడా తీసేసుకుకోవడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. నారాయణరెడ్డి ఓ నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జిగా, ఆయన భార్య కర్నూలు డీసీసీబీ చైర్‌పర్సన్‌గా జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నా రక్షణ కల్పించకపోవడం దారుణమని జగన్‌ అన్నారు.

నారాయణరెడ్డి హత్య తరువాత హంతకులను పట్టుకునే విషయంలో కూడా పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించారని, ఉదయం 9:30కు హత్య జరిగితే, మధ్యాహ్నం 2:30 దాకా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లకపోవడం, తద్వారా సాక్ష్యాధారాలు చెదిరిపోవాలన్న దురుద్దేశంతోనే పోలీసులు అలా వ్యవహరించారని వైఎస్‌ జగన్‌ అన్నారు. గడిచిన మూడున్నరేళ్ల కాలంలో టీడీపీ దారుణాలకు బలైపోయిన వైఎస్సార్‌సీపీ నేతల జాబితాను గవర్నర్‌కు అందించామని వైఎస్‌ జగన్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కూడా వైఎస్‌ జగన్‌ వెంట ఉన్నారు.

గవర్నర్‌ను కలిసిన వైఎస్‌ జగన్‌

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో కలుసుకున్నారు. ప్రత్తికొండ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హతమార్చిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాల్పడుతున్న హత్యా రాజకీయాలపై గవర్నర్‌కు వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు చేశారు. వైఎస్‌ జగన్‌తో పాటు పలువురు పార్టీ సీనియర్‌ నేతలు గవర్నర్‌ను కలిశారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు. నారాయణ రెడ్డి అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు.

బినామీల ‘బడా’ దోపిడీ!


బినామీల ‘బడా’ దోపిడీ!
► రాజధాని గ్రామాల లేఔట్ల పనుల టెండర్లలో గోల్‌మాల్‌
► నెక్కల్లు, శాఖమూరు లేఔట్లలో మౌలిక సదుపాయాలకు రూ.666.18 కోట్లతో టెండర్‌
► బడా సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్‌ నోటిఫికేషన్‌
► బినామీలకు సబ్‌ కాంట్రాక్టు కింద అప్పగించి కమీషన్లు కొట్టేసే ఎత్తుగడ
► మిగతా 27 గ్రామాల లేఔట్లకు రూ.13,500 కోట్లతో అంచనాలు సిద్ధం


సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం కింద కేటాయించిన ప్లాట్లకు మౌలిక సదుపాయాల పనులను బినామీలకు కట్ట బెట్టి భారీ ఎత్తున కమీషన్లు నొక్కేయడానికి ప్రభుత్వ పెద్దలు స్కెచ్‌ వేశారు. గుంటూరు జిల్లా నెక్కల్లు, శాఖమూరు గ్రామాల రైతులకు ప్లాట్లు ఇచ్చిన లేఔట్‌(జోన్‌–1)లకు మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు రూ.666.18 కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ పద్ధతిలో ఈ నెల 5న సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పనులు సింగపూర్‌ కన్సార్టియం (అసెండాస్‌–సిన్‌బ్రిడ్జ్‌–సెమ్బ్‌కార్ప్‌), ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ వంటి బడా సంస్థలకే దక్కేలా నిబంధనలు రూపొందించి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం గమనార్హం. ఆ సంస్థలకు పనులు దక్కాక తమ బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించి, కమీషన్లు కొట్టేయాలన్నదే ప్రభుత్వ పెద్దల పన్నాగం. ఇదే రీతిలో మిగతా 27 గ్రామాల లేఔట్లకు మౌలిక సదుపాయాలను కల్పించే పనులను రూ.13,500 కోట్లతో చేపట్టి, కమీషన్లు దండుకోవడానికి వ్యూహం రచించారు. ఈ మేరకు అంచనాలు సిద్ధం చేసినట్లు సమాచారం.

రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల ప్రజలకు నివాస, వాణిజ్య స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం లేఔట్‌లు ఏర్పాటు చేసింది. ఉండవల్లి, పెనుమాక మినహా మిగతా 27 గ్రామాల రైతులకు లేఔట్లలో ఇప్పటికే ప్లాట్లు  కేటాయించారు. ఆ లేఔట్లకు రహదారులు, తాగునీటి సరఫరా, మురుగునీటి కాలువలు, భూగర్భ విద్యుత్‌ లైన్లు, ఇంటర్నెట్‌ కేబుల్‌ లైన్లు, వరద నీటి కాలువలు,  సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించా లని సర్కారు నిర్ణయించింది. తొలుత నెక్కల్లు, శాఖమూరు గ్రామాల రైతులకు ప్లాట్లు కేటాయిం చిన లేఔట్లకు మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

నోటిఫికేషన్‌లోనే తిరకాసు
టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేవలం బడా కంపెనీలే టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు విధించారు. ఆ నిబంధనలు..

► 2007–08 నుంచి 2016–17 వరకూ ఇదే రకమైన (ఇండస్ట్రియల్‌ పార్కులు, టౌన్‌షిప్‌లు, సెజ్‌లు, ఐటీ పార్క్‌లు, రోడ్లు, ఎయిర్‌ఫీల్డ్స్, పట్టణ ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి సరఫరా, సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లువంటి పనులు) ఏటా రూ.111.03 కోట్ల విలువైన పనులు పూర్తి చేసి ఉం డాలి. జాయింట్‌ వెంచర్లలో ప్రధాన కాంట్రాక్టర్‌గా వ్యవహరించిన వారు ఇదే రీతిలో పనులు పూర్తి చేసి ఉండాలి.
 
► గత పదేళ్లలో ఏటా రూ.293 కోట్ల విలువైన భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ఉండాలి.
 
► గత ఐదేళ్లలో కనీసం మూడేళ్లపాటు వరుసగా లాభాలు గడించి ఉండాలి. బ్యాంకుల్లో రూ.74 కోట్ల నగదు నిల్వలు ఉండాలి.
 
► గత ఐదేళ్లలో సీడీఆర్‌ (కార్పొరేట్‌ డెట్‌ రీస్ట్రక్చర్‌), ఎస్‌డీఆర్‌ (స్ట్రాటజిక్‌ డెట్‌ రీస్ట్రక్చర్‌) అమలు చేసి ఉండకూడదు.
 
► గత పదేళ్లలో ఏటా కనీసం రూ.12,420 క్యూబిక్‌ మీటర్లకు తగ్గకుండా రహదారులు, సీసీ రోడ్ల పనులు చేసి ఉండాలి. వంద మీటర్ల వ్యాసార్ధంతో తాగునీరు, మురుగునీటి పైపులైన్‌ వ్యవస్థ ఏటా కనీసం 27.50 కి.మీ.లు వేసి ఉండాలి. 200 మీటర్లు, అంతకన్నా ఎక్కువ వ్యాసార్ధంతో కూడిన హెచ్‌డీపీఈ పైపులైన్‌ వ్యవస్థను ఏటా కనీసం ఎనిమిది వేల మీటర్లు వేసి ఉండాలి. విద్యుత్, ఇంటర్నెట్‌ కేబుల్‌ పనులు కనీసం 180 కి.మీ. పూర్తి చేసి ఉండాలి. ఏటా రోజుకు 3 లక్షల లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసే సామర్థ్యంతో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను నిర్మించి ఉండాలి.

► గత పదేళ్లలో ఆర్థికమాంద్యం వల్ల నిర్మాణ రంగం కుదేలైపోయింది. దేశీయ కాంట్రాక్టు సంస్థలు ఎస్‌డీఆర్, సీడీఆర్‌ అమలు చేశాయి. భారీ ఎత్తున పనులు చేసిన దాఖలాలు లేవు. వీటిని పరిశీలిస్తే బడా సంస్థలకు మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు స్పష్టమవుతోంది.

నెక్కల్లు గ్రామ పంచాయతీ లేఔట్‌ 

Popular Posts

Topics :