11 June 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

చంద్రబాబు అలా మాట్లాడితే ఎలా?

Written By news on Thursday, June 15, 2017 | 6/15/2017


‘చంద్రబాబు అలా మాట్లాడితే ఎలా?’
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో కుల వివక్ష విపరీతంగా పెరిగిపోయిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు దళిత జాతిని అవమానించారని, ఆయన వారిని అవమానిస్తూ మాట్లాడితే ఎలా ప్రశ్నించారు. ఒక్క చిత్తూరులోనే కాకుండా రాష్ట్రంలోని పలుచోట్ల చంద్రబాబు తీరువల్ల కుల వివక్ష పెరిగిపోయి దళితులు, బలహీన వర్గాల వారిపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామాల్లో కుల వివక్ష విపత్కర పరిస్థితికి దారి తీస్తోందన్నారు. ఎన్నికల హామీల్లో పెరిగే చార్జీలకు అనుగుణంగా దళిత విద్యార్థులకు, బలహీన వర్గాలకు చెందినవారికి మెస్‌చార్జీలు పెంచుతామని చెప్పిన చంద్రబాబు.. మూడేళ్లలో వాటిని పెంచకపోగా హాస్టళ్లను మూసివేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ రోజుకారోజు పెట్రోల్‌ ధరలు పెరుగుతాయని తాజాగా ప్రకటనలు వచ్చాయని, వాటిని అమలుచేయాలని ప్రభుత్వాలు చెప్పాయని, అలాంటిది పేద విద్యార్థుల మెస్‌ చార్జీల విషయంలో అలాంటి ప్రకటనలు ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని నిలదీశారు. మూడేళ్ల కాలంలో కుటుంబాలు పెరిగినా రేషన్‌కార్డుల సంఖ్య పెరగలేదని, పైగా 2014తో పోలిస్తే 2015లో తగ్గాయని చెప్పారు. దళిత వర్గాలకు మూడేళ్లలో చంద్రబాబు ఒక్క ఇల్లును నిర్మించలేదని, వైఎస్‌ఆర్‌ హయాంలో 48లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందని అన్నారు.

వైఎస్‌ఆర్‌ 31లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి అందులో దళితులకే ఎక్కువగా ఇస్తే చంద్రబాబు మాత్రం అలా చేయకుండా 10లక్షల ఎకరాలను భూసేకరణ పేరుతో సేకరించి దళితుల భూములు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు సంక్షేమ నిధులు ప్రవాహం లాగా అందాలి కానీ అలా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు సక్రమంగా ఖర్చు చేయలేదని కాగ్‌ చెప్పిందని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం రూ. పది కోట్లు బడ్జెట్‌ కేటాయిస్తామని బలహీన వర్గాలకు హామీ ఇచ్చి గడిచిన మూడేళ్లలో రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు.

కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: వైఎస్‌ జగన్‌


పులివెందుల: మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల సమస్యలను శాసనసభలో ప్రస్తావించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీయిచ్చారు. వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో పర్యటిస్తున్న ఆయనను గురువారం మహిళలు కలిశారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని బడా సంస్థలకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మహిళలు ఆయనకు తెలిపారు. ఏడు నెలలుగా జీతాలు, బిల్లులు ఇవ్వక పోగా తమను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. వారు చెప్పిన విషయాలను వైఎస్ జగన్‌ శ్రద్ధగా విని, రాసుకున్నారు. మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని హామీయిచ్చారు.

కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్సార్‌ సీపీ నాయకుడు రామకృష్ణారెడ్డిని వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రామకృష్ణారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఒకే దర్యాప్తుతో చంద్రబాబు జీవితాంతం జైలులో


‘ఒకే దర్యాప్తుతో చంద్రబాబు జీవితాంతం జైలులో..’
విజయవాడ‌: సిట్‌ అనేది కోరులు లేని పాములాంటిదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎమ్మెల్యే రోజా అన్నారు. విశాఖ భూముల కబ్జాపై కచ్చితంగా సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేశారు. భూకబ్జాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హస్తం ఉందని చెప్పారు. లక్ష ఎకరాల భూకబ్జా దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని అన్నారు. ప్రతిపక్షాలు, మంత్రలు, మీడియా, మిత్రపక్షమైనా బీజేపీ కోరుతున్నా బాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

భూములు కబ్జా చేసిన మంత్రి గంటా కూడా సీబీఐ విచారణ కోరుతున్నారని అయినా చంద్రబాబు,లోకేశ్‌ భూదందాలు బయటపడతాయనే వారు జరిపించడం లేదని అన్నారు. తెలంగాణలో భూకబ్జాలపై సీబీఐ విచారణ కోరుతున్న టీడీపీ ఇక్కడ ఎందుకు అలా కోరడం లేదని ప్రశ్నించారు. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుదుద్‌ తుఫాను సమయంలో చంద్రబాబు, టీడీపీ నేతలు రాత్రిపూట తిరిగింది రికార్డులు తారుమారు చేయడానికని ఇప్పుడర్ధమవుతోందని చెప్పారు. మహానాడులో సవాల్‌ విసిరిన లోకేశ్‌ ఇప్పుడెందుకు సీబీఐ విచారణపై నోరు మెదపడం లేదని నిలదీశారు. టీడీపీ నేతలను తప్పించేందుకే ప్రస్తుతం సిట్‌ విచారణ చేయిస్తున్నారని, దానితో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేల ఎకరాలు భూములు కబ్జా అయ్యాయని స్వయంగా టీడీపీ నేత, ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పడం, అది నిజమే అని కలెక్టర్‌ సైతం చెప్పినా లెక్కచేయకుండా సీబీఐ దర్యాప్తు వేయకుండా సిట్‌తో సరిపుచ్చడం చంద్రబాబు తప్పించుకోవాలని చూడటమే తప్ప మరొకటి కాదని దుయ్యబట్టారు.  వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై ఆరోపణలు వస్తే వాటిపై వెంటనే సీబీఐ విచారణ వేసేవారని, అలాంటి దమ్ము మాత్రం చంద్రబాబుకు లేకుండా పోయిందని, ఒకసారి దర్యాప్తు వేస్తే జీవితాంతం జైలులో ఉండాల్సి వస్తుందనే విషయం చంద్రబాబు, లోకేశ్‌కు ముందే తెలుసని అందుకే వారు అలా చేయడం లేదని విమర్శించారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా చంద్రబాబు, లోకేశ్‌ విశాఖ భూములను కబ్జా చేస్తున్నారని రోజా ధ్వజమెత్తారు.

నేటి నుంచి వైఎస్సార్‌ జిల్లాలో జగన్‌ పర్యటన


నేటి నుంచి వైఎస్సార్‌ జిల్లాలో జగన్‌ పర్యటన
పులివెందుల: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నుంచి రెండు రోజులపాటు వైఎస్సార్‌ జిల్లాలో పర్యటిస్తారని కడప ఎంపీ వైఎస్‌ అవి నాష్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీ తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం పులివెందులకు చేరుకుంటారు.

సాయంత్రం కడపలో ఎమ్మెల్యే అంజద్‌బాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు. శుక్రవారం మైదుకూరులో ముస్లిం పెద్దలు ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందులోనూ పాల్గొంటారు. అలాగే రెండు రోజులపాటు పలు కార్యక్రమాల్లోనూ వైఎస్సార్‌సీపీ అధినేత పాల్గొంటారని అవినాష్‌రెడ్డి తెలిపారు.

నంద్యాల సీటుపై వైఎస్‌ జగన్‌ మాటే వేదం

Written By news on Wednesday, June 14, 2017 | 6/14/2017


నంద్యాల సీటుపై వైఎస్‌ జగన్‌ మాటే వేదం

- అధినేత ఎలా చెబితే అలా నడుచుకుంటా: శిల్పా మోహన్‌రెడ్డి
- కాన్ఫరెన్స్‌లు తప్ప మూడేళ్లలో చంద్రబాబు చేసింది శూన్యం
- భారీ అనుచరగణంతో వైఎస్సార్‌సీపీలోకి చేరిన నంద్యాల నేత


హైదరాబాద్‌:
 పదవులకు ఆశపడి కాదు.. ఆత్మగౌరవం కోసమే పార్టీ మారానని అన్నారు మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి. భారీ సంఖ్యలో మద్దతుదారులు వెంటరాగా ఆయన బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. శిల్పా, ఇతర కీలక నాయకులకు కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీలోకి స్వాగతం పలికారు. పార్టీలో చేరిక అనంతరం మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నంద్యాల సీటు విషయంలో అధినేత జగన్‌ ఎలా చెబితే అలా నడుచుకుంటానని అన్నారు.

చంద్రబాబు ధోరణితో విసిగిపోయాం: ‘‘వైఎస్సార్‌ సీపీలో గెలిచిన భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరినప్పటి నుంచి అంతర్గత విబేధాలు హెచ్చుమీరాయి. ఆ కారణంగా నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే ఫిర్యాదుచేశా. ఒకటికాదు, వందలసార్లు మొరపెట్టుకున్నా. అయినాసరే, ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసం పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల సమస్యలైనా తీర్చమని అడిగా ఫలితం లేదు. మాపట్ల టీడీపీ అధిష్టానం నిర్లక్ష్యధోరణికి విసిగిపోయాం. ఫరూఖ్‌, అఖిలప్రియలు మాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నా చంద్రబాబు స్పందించలేదు. పర్సనల్‌ ఎజెండాలు లేకుండా పనిచేసే మనం ఇక పార్టీలో ఉండటం అనవసరమని క్యాడర్‌ అభిప్రాయపడింది. సమర్థవంతుడైన జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే వైఎస్సార్‌సీపీలో చేరాం’’ అని శిల్పా మోహన్‌రెడ్డి చెప్పారు.

చిన్నపిల్లల్ని మంత్రులు చేస్తే సహకరించాం
భూమా చనిపోయిన తర్వాత ఆయన కూతురు అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు తమను స్పంప్రదించారని, అప్పుడు తామేమీ అభ్యంతరం చెప్పలేదని శిల్పా మోహన్‌రెడ్డి గుర్తుచేశారు. ‘‘వయసులో మాకంటే చిన్నపిల్లలైన కొందరిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. మంచికే అనుకున్నాం. కానీ వాళ్లు స్థానిక నేతలను అస్సలు పట్టించుకోలేదు. ఎంపీపీలు, జెడ్సీటీసీలు, మున్సిపల్‌ చైర్మన్లు, సర్పంచ్‌లు.. ఎవ్వరినీ లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. దీంతో స్థానిక నాయకత్వంలో తీవ్ర అసంతృప్తి రగిలింది. ఈ సమస్యలను ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్లినా సీఎం స్పందించలేద’’ని వివరించారు శిల్పా.
కాన్ఫరెన్స్‌లు తప్ప పని జరగట్లేదు
భూమా మరణం తర్వాత ఆయన కూతురు మంత్రి అయింది కానీ నంద్యాల సమస్యలు మాత్రం ఎప్పటిలాగే ఉన్నాయని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. ఎంతోకొంత పని చేయాలనే ఉద్దేశంతో నంద్యాల టికెట్‌ సంగతేమిటని అడగ్గా చంద్రబాబు దాటవేత ధోరణి ప్రదర్శించారని శిల్పా వాపోయారు. రాష్ట్రస్థాయి నాయకులతో పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం రాలేదని, ‘అమెరికా నుంచి తిరిగొచ్చాక చెబుతా’న్న బాబు మాట చివరికి నీటిమూటే అయిందని ఆవేదన చెందారు. టికెట్‌ ఇవ్వడం, ఇవ్వకపోవడం కంటే అధిష్టానం నిర్లక్ష్యధోరణే తమను తీవ్రంగా బాధించిందని శిల్పా అన్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్సులు తప్ప పనులేవీ చేయలేదని విమర్శించారు. ‘ఎంతసేపూ పోలవరం, అమరావతి అంటారేగానీ రాయలసీమ సంగతి పట్టించుకోరా? పరిశ్రమలు స్థాపించామని ఘనంగా చెప్పుకుంటున్న మీరు వాటిలో ఎన్ని ప్రారంభమయ్యాయో చెప్పగలరా?’ అని చంద్రబాబును నిలదీశారు.

వైఎస్సార్‌ నా గురువు
దివంగత వైఎస్సార్‌ను గురువుగా అభివర్ణించిన శిల్పా మోహన్‌రెడ్డి.. ఆ మహానేత దయవల్లే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీలో చేరడం సొంతింటికి తిరిగొచ్చినట్లుందని అన్నారు. వైఎస్‌ కుటుంబానికి అండగా ఉండాలని బలంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నంద్యాల టికెట్‌ విషయంలో జగన్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ప్రస్తుతం టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్న తన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డితో విబేధాలు లేవని, పార్టీలు వేరైనా కుటుంబ వ్యవహారాల్లో తేడాలు రావని స్పష్టం చేశారు.

వైఎస్సార్‌ సీపీలో చేరిన శిల్పామోహన్‌ రెడ్డి


హైదరాబాద్‌: మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి బుధవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. లోటస్‌ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తన మద్దతుదారులతో కలిసి వైఎస్సార్సీపీలోకి వచ్చారు. పార్టీ కండువా వేసి జగన్‌ సాదర స్వాగతం పలికారు.

నంద్యాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచన, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, పార్టీ నేతలు గోస్పాడు ప్రహ్లాదరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డితో సహా కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. శిల్పామోహన్‌రెడ్డి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.

Popular Posts

Topics :