25 June 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

చనిపోతుంటే పట్టించుకోరా..?: వైఎస్‌ జగన్‌

Written By news on Friday, June 30, 2017 | 6/30/2017


కాకినాడ/రంపచోడవరం: మరణాలు సంభవిస్తున్నా గిరిజన ప్రాంతాలను పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేకుండా పోయిందని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లప్పుడు మాత్రమే వారిని గుర్తు చేసుకుంటారా అని మండిపడ్డారు. పదుల సంఖ్యలో గిరిజనులు రోగాల బారిన పడుతున్నా వారివైపు 108గానీ, 104గానీ వచ్చే దిక్కు లేకుండా పోయిందని, కనీసం ఏఎన్‌ఎం సౌకర్యాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి గిరిజన గ్రామ విష జ్వర బాధితులను వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారికి పౌష్టికాహార లోపం వల్లే జ్వరం బారిన పడ్డారని వైద్యులు వైఎస్‌ జగన్‌కు తెలిపారు. ఉదయం కొంతమందిని ఉన్నపలంగా డిశ్చార్జి చేయడంపై ప్రశ్నించగా వారికి జ్వరం తగ్గిందని అందుకే పంపించామని ప్రస్తుతం ఉన్నవారు కాస్త నీరసంగా ఉండటంతో పౌష్టికాహారం అందిస్తూ వైద్యం చేస్తున్నామని తెలిపారు. అనంతరం జ‍్వర బాధితులను వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తూ వారి జీవన పరిస్ధితులు, ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకున్నారు. ముఖ్యంగా మౌళిక సదుపాయాలైన విద్య, వైద్యం, విద్యుత్‌, రోడ్డు సౌకర్యం, ఆహారంవంటి అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయగా బాధితులు బోరుమన్నారు. తమకు విద్యుత్‌ సౌకర్యం లేదని, రోడ్లు కూడా లేవని, సాగునీరు లేక, ఆహారం కూడా సరిగా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గతంలో (వైఎస్‌ హయాంలో) ఉచితంగా బియ్యం ఇచ్చేవారని ఇప్పుడు వాటిని కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికే పదిమందికి పైగా తమ గిరిజన ప్రాంతాల్లో చనిపోయారని, పలువురు రోగాల బారిన పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వారు వైఎస్‌ జగన్‌కు ఏకరువు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు తాను అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే గిరిజనులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను వైఎస్‌ జగన్‌ పరామర్శించిన విషయం తెలిసిందే. అక్కడ జరిగిన సంఘటనల పర్వాన్ని తెలుసుకున్న ఆయన వివాద పరిష్కారానికి వైఎస్సార్‌ సీపీ తరపున కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరిన వైఎస్‌ జగన్‌ సాయంత్రం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి విషజ్వర బాధితులను పరామర్శించారు.
 

వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీకి 30 వేల మంది ప్రతినిధులు


'వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీకి 30 వేల మంది ప్రతినిధులు'
హైదరాబాద్: జులై 8, 9 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న 12 ఎకరాల స్థలంలో ఈ భారీ ప్లీనరీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 'జాతీయ స్థాయి ప్లీనరీకి 30 వేల మంది దాకా ప్రతినిథులు వస్తారు. మూడు అంచెల్లో వైఎస్ఆర్ సీపీ ప్లీనరీలు జరపాలని నిర్ణయించాం. భారీ ప్లీనరీ నిర్వహణకు 18 కమిటీలు ఏర్పాటు చేశాం. ప్లీనరీ తొలిరోజు 8న పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నాం. ప్లీనరీ రెండో రోజైన 8వ తేదీన పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది.

ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు గ్రామీణ స్థాయి నేతలకే ఎక్కువ తెలుస్తాయి. అందువల్లే జిల్లా స్థాయి ప్లీనరీలు, నియోజవర్గ స్థాయి ప్లీనరీలు విజయవంతమయ్యాయి. ఆయా ప్లీనరీల్లో తీర్మనాలు మాకు ఎప్పటికప్పుడు అందుతున్నాయి. ఈ తీర్మానాల ప్రాతిపదికనే ఇక్కడి ప్లీనరీలో చర్చిస్తాం. దశ దిశ కోల్పోయిన వ్యవసాయం, ప్రజా సంక్షేమం, మహిళా, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం సమస్యలు, డ్వాక్రా మహిళలు వారి ఇబ్బందులు, ఎన్నికల హామీల వైఫల్యం, ప్రత్యేక హోదా అంశం, మానవ వనరులు, ఇసుక మాఫియా, మద్యం టెండర్ల అవకతవకలు, రాజధాని భూ సేకరణపై జరుగుతున్న అక్రమాలు లాంటి ఎన్నో అంశాలపై ప్లీనరీలో చర్చకు రానున్నాయని' ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరించారు. భోజనం, తీర్మానాలు, సభ నిర్వాహణ, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కమిటీ, మీడియా కమిటీ, కల్చరల్, రవాణా, పార్కింగ్ సహా మొత్తం 18 కమిటీలు ఉన్నట్లు ఆయన తెలిపారు.

వైఎస్‌ జగన్‌ వస్తున్నారని.


వైఎస్‌ జగన్‌ వస్తున్నారని..
కాకినాడ/రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లాలో విషజ్వర బాధితులను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలియగానే టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న జ్వర బాధితులను హడావుడిగా ఇంటికి పంపించేశారు.

రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 25 మంది చాపరాయి విషజ్వర బాధితులను శుక్రవారం డాక్టర్లు డిశ్చార్జ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ రాకముందే బాధితులను పంపించేయాలన్న టీడీపీ నేతలు ఒత్తిళ్లకు వైద్యులు తలొగ్గారు. జ్వరం నయంకాక ముందే తమను డిశ్చార్జ్‌ చేశారని గిరిజనులు మీడియా ముందు వాపోయారు.

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలోనూ వైద్యులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో జ్వర బాధితులను డిశ్చార్జ్‌ చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ డాక్టర్ల తీరుపై బాధితులు మండిపతున్నారు. వ్యాధి పూర్తిగా నయంకాకుండా తమను పంపించేయాలనుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతాన్ని మరిచి అంతా ముందుకెళ్లాలి: వైఎస్‌ జగన్‌




ఏలూరు : ఊరంటే అందరూ ఉండాలి, అంతా కలిసి ఉండాలని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన  సంఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తమను అన్యాయంగా సాంఘిక బహిష్కరణ చేశారని, పనుల్లో నుంచి తొలగించారని దళితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని పెట్టడమే తమ పొరపాటా అని వారు ప్రశ్నించారు. 50 ఏళ్లుగా ఇతర కులాలతో బంధువుల్లా మెలిగామని, గత మూడు నెలలుగా వివాదం జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. స్థానిక నేతలతో పాటు, అధికారులు కూడా తమను పట్టించుకోలేదన్నారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.... ‘సమాచార లోపం వల్లే వివాదం పెరిగిందని దళితేతరులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. ఊరు ఉంటే... అంతా ఉండాలి, ఇరుపక్షాలు ఊళ్లో ఉండాలి. రోజు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. ఇష్టం ఉన్నా, లేకున్నా జీవితాలు ఇక్కడే గడపాలి. చట్టప్రకారం ఏం జరగాలో అది జరగాలి. వివాదం పరిష్కారానికి నాలుగు అడుగులు ముందుకేయాలి. అన్ని మరిచిపోయి కలిసి ఉండాలన్నదే మా ఆశ. అందరు చెడ్డవాళ్లు కాదు. ఎవరైనా తప్పు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుంది. విచారణ తర్వాత ఎమ్మార్వోను, సెక్రటరీనీ సస్పెండ్‌ చేశారు.

ఇలాంటి పరిణామాలు మళ్లీ రాకూడదని వాళ్లు కూడా (దళితేతరులు) ఆశిస్తున్నారు. తప్పు చేసిన వారికే శిక్షలు పరిమితం కావాలని మీరు (దళితులు) అంటున్నారు. ఊరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. పార్టీ తరఫున కమిటీని ఏర్పాటు చేస్తున్నా. రెండు వర్గాలు కలిసిమెలిసి ఉండటానికి కమిటీ కృషి చేస్తుంది. గతాన్ని మరిచిపోయి అంతా ముందుకు వెళ్లాలి.’ అని సూచించారు. తమకు హామీ ఇస్తే అందుకు సిద్ధమేనని దళితులు తెలిపారు. అన్ని విగ్రహాలు తీసేస్తే...అంబేద్కర్‌ విగ్రహాన్ని కూడా తీసేయలని వారు కోరారు.  కాగా అంతకు ముందు వైఎస్‌ జగన్‌ దళితేతరులను కలిసి ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
 

గరగపర్రులో వైఎస్‌ జగన్‌ పర్యటన


గరగపర్రులో వైఎస్‌ జగన్‌ పర్యటన
ఏలూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు. సాంఘిక బహిష్కరణ ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ...‘ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చా.
నేను రెండు పక్షాలతోను మాట్లాడతా. సమాజంలో అంతా కలిసి ఉండాలన్నదే నా భావన. దాని కోసమే ఈ ప్రయత్నం. ప్రతి కులంలో మంచి, చెడు రెండు ఉంటాయి. ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులం అంతటికీ ఆపాదించడం సరికాదు. ఇది అన్నివర్గాలకు వర్తిస్తుంది. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే...దాన్ని సరిదిద్దుకుందాం. దానివల్ల ఔన్నత్యం పెరుగుతుందే తప్ప తగ్గదు.’ అని అన్నారు.

ఈ సంఘటనపై గరగపర్రు దళితేతరులు మాట్లాడుతూ... సోదరభావంతోనే తాము బతకాలనుకుంటున్నామన్నారు. కొందరు వల్ల ఈ సమస్యవ వచ్చిందని, తమ గ్రామం ఆదర్శ గ్రామంగా ఇప్పటివరకూ నిలిచిందన్నారు. సమస్యను గ్రామస్తులకే వదిలేస్తే వెంటనే పరిష్కారం అవుతుందన్నారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, తప్పులు రెండువైపులా ఉన్నాయన్నారు.

నేడు గరగపర్రుకు వైఎస్‌ జగన్‌


నేడు గరగపర్రుకు వైఎస్‌ జగన్‌

♦ సాంఘిక బహిష్కరణకు గురైన వారిని పరామర్శించనున్న ప్రతిపక్ష నేత
♦ సాయంత్రం కాకినాడ ఆస్పత్రిలో గిరిజనులకు జగన్‌ పరామర్శ  


సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పరామర్శించనున్నారు. వైఎస్‌ జగన్‌ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లిగూడెం, పిప్పర మీదుగా 11 గంటలకు గరగపర్రు చేరుకుంటారని వైఎస్సార్‌ సీపీ ప్రోగ్రామింగ్‌ కమిటీ ఛైర్మన్‌ తలశిల రఘురామ్‌ తెలిపారు. అనంతరం జగన్‌ గరగపర్రు నుంచి బయలుదేరి తాడేపల్లిగూడెం, రావులపాలెం మీదుగా తూర్పు గోదావరి జిల్లా చేరుకుంటారు.

 సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని విషజ్వరాలు, అంతుచిక్కని వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులను పరామర్శిస్తారు. రాత్రికి జగన్‌ రంపచోడవరం చేరుకుని అక్కడ బస చేస్తారని తలశిల రఘురామ్‌ తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ఉండి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జ్‌ కొయ్యే మోషేన్‌రాజు,  యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మంతెన యోగీంద్రకుమార్‌ తదితరులు గరగపర్రులో ప్రతిపక్ష నేత జగన్‌ పర్యటన ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు

హడావుడిగా కదిలిన యంత్రాంగం  
దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన ఘటనపై రెండు నెలల పాటు మీనమేషాలు లెక్కించిన అధికార యంత్రాంగం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ శుక్రవారం గరగపర్రులో పర్యటించనున్న నేపథ్యంలో ఆగమేఘాలపై కదిలింది. ప్రజాప్రతినిధులు గ్రామానికి వరుస కట్టడం ప్రారంభించారు. అధికారులు ఎప్పటిప్పుడు పరిస్థితులను ఆరా తీశారు. ఇన్నాళ్లూ విచారణ జరుపుతున్నామని, అరెస్ట్‌కు సమయం పడుతుందని చెబుతూ వచ్చిన పోలీసు అధికారులు.. నిందితులను అరెస్ట్‌  చేసినట్టు గురువారం ఉదయం భీమవరంలో విలేకరుల సమావేశం నిర్వహించి చెప్పారు. 60 మంది సాక్షులను విచారించి నిందితులు ఇందుకూరి బాలరామకృష్ణంరాజు, ముదునూరి రామరాజు, కొప్పుల శ్రీనివాస్‌లను అరెస్ట్‌ చేసినట్టు ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ ప్రకటించారు. గరగపర్రు గ్రామంలో ఏప్రిల్‌ 23న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు మంచినీటి చెరువు గట్టుపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని పెట్టేందుకు యత్నించటంతో Ðవివాదం మొదలైన సంగతి తెలిసిందే.

క్షీణిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోగ్యం

Written By news on Thursday, June 29, 2017 | 6/29/2017


క్షీణిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోగ్యం
♦  పడిపోతున్న బీపీ, షుగర్‌
♦  ఫోన్‌లో పరామర్శించిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌
 
తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వేలాది మంది ప్రజల ఆరోగ్యలకు ముప్పుగా మారిన డంపింగ్‌ యార్డును తరలించాలని దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుంది. దీక్ష బుధవారం నాలుగో రోజుకు చేరింది. మూడు రోజులుగా చిత్తూరు సబ్‌జైలులో దీక్ష చేసిన ఆయన అక్కడ నుంచి బెయిల్‌పై విడుదల అయ్యాక తిరుపతి రూరల్‌ మండలం కేసీపేటలో దీక్షను కొనసాగిస్తున్నారు.
 
నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్రమేణ క్షిణిస్తుంది. బుధవారం రాత్రి దీక్ష శిబిరంలో ప్రభుత్వ వైద్యులు కాజల్‌ ఆనంద్‌ ఎమ్మెల్యేకు పరీక్షలు నిర్వహించారు. బీపీ 106/67కు, షుగర్‌ లెవల్‌ 79కి పడిపోయినట్లు గుర్తించారు. దీక్ష ఇలాగే కొనసాగిస్తే ఆరోగ్యం మరింత క్షిణించే ప్రమాదం ఉందని, కోమాలోకి పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు ఆయన వ్యక్తిగత వైద్యులు హరినాథ్‌రెడ్డి, కృష్ణప్రశాంతి వైద్య పరీక్షలు చేశారు. చెవిరెడ్డిని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. డంపింగ్‌ యార్డును తరలిస్తామని వ్రాత పూర్వక హామీ ఇచ్చే వరకు దీక్షను కొనసాగిస్తానని ఎమ్మెల్యే చెవిరెడ్డి పేర్కొన్నారు.

30న గరగపర్రుకు వైఎస్‌ జగన్‌

Written By news on Wednesday, June 28, 2017 | 6/28/2017


30న గరగపర్రుకు వైఎస్‌ జగన్‌
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన గంగపర్రు గ్రామంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. జూన్‌30న వైఎస్‌ జగన్‌.. పాలకోడేరు మండలం గంగపర్రుకు రానున్నట్లు మంగళవారం వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తలశిల రఘురాంలు ఈ మేరకు ప్రకటనలు చేశారు.

30న(శుక్రవారం) గరగపర్రులో బాధితులను జగన్‌ పరామర్శిస్తారని, మరుసటిరోజు జులై1(శనివారం) తూర్పుగోదావరి జిల్లాలోని చాపరాయికి వెళ్ళి విషజ్వరాల బారినపడినవారిని పరామర్శిస్తారని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు.

పార్టీ ముఖ్యనేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం

Written By news on Tuesday, June 27, 2017 | 6/27/2017


హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం ఉదయం పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.  లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై చర్చిస్తున్నరు. వచ్చే నెల 8,9 తేదీల్లో వైఎస్‌ఆర్‌ సీపీ జాతీయ స్థాయి ప్లీనరీ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. విజయవాడ, గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదుట ప్లీనరీ నిర్వహించనున్నారు. ప్లీనరీ కమిటీలపై వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.

జైల్లో ఎమ్మెల్యే దీక్ష

Written By news on Sunday, June 25, 2017 | 6/25/2017


జైల్లో ఎమ్మెల్యే దీక్ష
చిత్తూరు: ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన చెత్త డంపింగ్‌యార్డు తరలింపు కోసం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జైల్లోనూ నిరాహాదీక్ష కొనసాగిస్తున్నారు. మంచినీళ్లు ముట్టకుండా చిత్తూరు సబ్‌జైలులో దీక్ష చేస్తున్నారు. ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. తన పోరాటాన్ని అణచివేసే కుట్రలో భాగంగానే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.

రామాపురంలో చెత్త డంపింగ్‌యార్డును తరలింపు డిమాండ్‌తో నిరాహారదీక్ష చేపట్టిన చెవిరెడ్డిని శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను శనివారం పుత్తూరు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచగా 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. దీంతో ఆయనను పోలీసులు చిత్తూరు సబ్‌జైలుకు తరలించారు. చెవిరెడ్డితో పాటు మరో 35 మందికి కోర్టు వచ్చే నెల 7 వరకు రిమాండ్‌ విధించింది. తమ తరపున పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్‌కు నిరసనగా రామాపురం గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వీరికి రామచంద్రాపురం, తిరుపతి రూరల్‌ ప్రజలు మద్దతు పలికారు.

Popular Posts

Topics :