30 July 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

జిల్లాల సంఖ్య పెంచుతాం: వైఎస్‌ జగన్‌

Written By news on Thursday, August 3, 2017 | 8/03/2017


నంద్యాల: ఉప ఎన్నిక సమరం నేపథ్యంలో గురువారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ మోసపూరిత జీవోలు ఇస్తూ అబద్ధపు వాగ్దానాలు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

బహిరంగ సమావేశంలో వైఎస్‌ జగన్ సుదీర్ఘ ప్రసంగం‍ చేశారు. ఈసందర్భంగా అన్నవస్తున్నాడు, నవరత్నాల హామీలతో పాటు పలు హామీలు ప్రకటించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయని, కానీ అథికారం లోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంట్‌ స్థానాన్ని ఒక జిల్లాగా మార్చుతామని, మొత్తం 25 జిల్లాలుగా మార్పు చేస్తామని ప్రకటించారు. నంద్యాల పట్టణాన్ని కలెక్టరేట్‌,ఎస్సీ కార్యాలయాలతో జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.  2018లో వచ్చే ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానానికి నంద్యాల నుంచే ముస్లిం మైనారీటికి అవకాశం ఇస్తామని ప్రకటించారు.

సభకు వెళ్లొద్దంటూ నోట్ల పంపిణీ


సభకు వెళ్లొద్దంటూ నోట్ల పంపిణీ
సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక విషయంలో మొదటి నుంచి కుట్రలు, కుతంత్రాలతో వ్యవహరిస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ మరింతగా భరితెగిస్తోంది. ఈ ఉపఎన్నిక షెడ్యూలు విడుదల కాకముందు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి పర్యటించి నియోజకవర్గానికి వేల కోట్ల ప్యాకేజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత అధికార వ్యవస్థను ఒకవైపు దుర్వినియోగం చేస్తూ మరోవైపు డబ్బులు వెదజల్లడం ప్రజలను ప్రలోభపెట్టాలన్న ఎత్తుగడ ఎంచుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుండటంతో అధికార పార్టీ అనేక అప్రజాస్వామిక చర్యలకు దిగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కి మద్దతుగా నియోజకవర్గంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనబోయే తొలి ప్రచార సభను విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు అమలులో పెట్టింది. జగన్ పాల్గొనే ప్రచార సభకు పెద్దగా జనం రాలేదని ప్రచారం చేసుకోవాలన్న చీప్ టెక్నిక్ తో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. జగన్ మోహన్ రెడ్డి సభలో పాల్గొనరాదంటూ అనేక చోట్ల బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది.

నంద్యాల ఎస్పీజీ మైదానంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటే మీ రేషన్ కార్డులు తొలగిస్తామని, పెన్షన్లలో కోత పెడుతామంటూ బెదిరింపులకు దిగారు. మరికొన్ని చోట్ల సభకు వెళ్లకుంటే డబ్బు ఇస్తామంటూ అనేక మందికి డబ్బులు పంపిణీ చేశారు. కొన్ని చోట్ల ప్రజలను ఒకచోటికి చేర్చి మరీ డబ్బులు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి కుట్రలు, కుయుక్తులపై నంద్యాలలోని అనేక ప్రాంతాల నుంచి పార్టీ నేతల నుంచి సమాచారం రాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు ఇలాంటి సిగ్గుమాలిన, నీతి మాలిన చర్యలకు దిగుతున్నారని ఘాటుగా విమర్శించారు. జగన్ పర్యటనను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలకు రహస్యంగా సమాచారం ఇచ్చారని, ఆ మేరకు టీడీపీ నేతలు డబ్బుల పంపిణీతో పాటు బెదిరింపులకు దిగారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటం చంద్రబాబు నాయుడుకు కొత్తకాదనీ, అధికారం ఉందికదా అని ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ తమ పార్టీ పట్ల ప్రజల్లో అభిమానాన్ని దూరం చేయలేరని, ఈ ఉపఎన్నికలో ప్రజలు టీడీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పి రాబోయే రోజుల్లో చంద్రబాబు ఓటమికి నాంది పలకడం ఖాయమని భూమన అన్నారు.
వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకోవాలని టీడీపీ కుట్ర చేస్తోందని భూమన కరుణాకరెడ్డి ఆరోపించారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. జగన్‌ పర్యటనను అడ్డుకోవాలని చంద్రబాబు రహస్య పిలుపునిచ్చారని ఆరోపించారు. చంద్రబాబు ఏంచేసినా తాము భయపడబోమని స్పష్టం చేశారు.
 

నంద్యాల గెలుపును జగన్‌కు బహుమతిగా ఇస్తాం

Written By news on Wednesday, August 2, 2017 | 8/02/2017


టీడీపీలో నన్ను తీవ్రంగా అవమానించారు..
కర్నూలు: తెలుగుదేశం పార్టీ తనను తీవ్రంగా అవమానపరిచిందని శిల్పా చక్రపాణిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం టీడీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు చక్రపాణిరెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్‌ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘  రేపు నంద్యాల బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతా. సాయంత్రంలోగా వైఎస్‌ జగన్‌ను కలుస్తా. ఏ పార్టీలో ఉన్నా పార్టీ కోసం కృషి చేశాను. అలాగే రెండేళ్లుగా టీడీపీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమించా.
మంత్రి అఖిలప్రియ సహా టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు. చీమకు కూడా హాని చేయని వ్యక్తి మా సోదరుడు. డబ్బులకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు కూడా మామీద విమర్శలు చేస్తున్నారు. రాజీనామాను జేబులో పెట్టుకుని తిరుగుతున్నా. దమ్ముంటే రండి అందరం రాజీనామా చేద్దాం. నంద్యాల ఉప ఎన్నిక ద్వారా మేమేంటో చూపిస్తాం. నంద్యాల గెలుపును జగన్‌కు బహుమతిగా ఇస్తాం.’  అని అన్నారు.


 

3న నంద్యాలలో వైఎస్‌ జగన్‌ బహిరంగ సభ

Written By news on Sunday, July 30, 2017 | 7/30/2017


3న నంద్యాలలో వైఎస్‌ జగన్‌ బహిరంగ సభ
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయబోతోంది. ఇందులో భాగంగా వచ్చేనెల 3న నంద్యాలలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. నంద్యాలలోని ఎస్పీజీ మైదానంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ బహిరంగ సభ జరుగుతుందని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌ రెడ్డి తెలిపారు. ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

వచ్చేనెల 23న నంద్యాల ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌ సీపీ విజయం తథ్యమని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. వైఎస్‌ జగన్‌ బహిరంగ సభతో నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో మరింత ఊపు వస్తుందని, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం మరింత ఉరకలెత్తుతుందని భావిస్తున్నారు.

Popular Posts

Topics :