06 August 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

జనసంద్రంగా మారిన రైతు నగర్‌

Written By news on Wednesday, August 9, 2017 | 8/09/2017నంద్యాల: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు.  బుధవారం ఆయన నంద్యాల మండలం రైతునగర్‌ లో రోడ్‌ షో నిర్వహించారు. వైఎస్‌ జగన్‌ రాకతో రైతునగర్‌ జనసంద్రంగా మారింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ...‘ మీ అందరి దీవెనలు, ఆశీస్సులు వైఎస్‌ఆర్‌ సీపీకి ఉండాలి. పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డికి మద్దతు తెలపాలి. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నది నంద్యాల ఉప ఎన్నిక. నంద్యాల ఉప ఎన్నిక జరగకపోయి ఉంటే మంత్రులు నంద్యాలలో తిష్ట వేసేవారా?. చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు.

అబద్ధాలతో చంద్రబాబు అందరినీ మోసం చేశారు. చంద్రబాబులా మోసం చేయడం నాకు చేతకాదు. ఆయనలా నాకు అబద్ధాలు చెప్పడం రాదు. చంద్రబాబులా  అబద్ధాలు చెప్పి ఉంటే  ఆ స్థానంలో నేనే ఉండేవాడిని. ప్రతి పార్లమెంట్‌ను ఒక జిల్లా చేస్తూ 25 జిల్లాలు చేయబోతున్నాం. నంద్యాలను మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతాం. ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేస్తాం. ఏడాదిన్నరలో కురుక్షేత్ర యుద్ధం రాబోతుంది. నంద్యాల ఉప ఎన్నికలో వేసే ఓటు ఆ మహా సంగ్రామానికి నాంది పలకాలి. అందరికి ఉపయోగపడేలా నవరత్నాలను మనం ప్రకటించుకున్నాం. నవరత్నాలను ప్రతి ఇంటికి చేరాలి. 
కేసీ కెనాల్‌లో నీరు లేక సతమతమవుతున్నారు. చంద్రబాబుకు చూపించి అడగండి. ఆయన నోట్లో నుంచి ఒక్క నిజం కూడా రాదు. చంద్రబాబుకు ఒక ముని శాపం ఉంది. నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందట. నంద్యాలలో ధర్మానికి ఓటు వేస్తారనే సంకేతం అందరికీ వెళ్లాలి.’ అని కోరారు. వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డికి ఓటు వేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. కాగా వైఎస్‌ జగన్‌ ను చూసేందుకు వచ్చిన మహిళలను ఆయన వాహనం దిగి పలకరించారు.
 

వైఎస్‌ జగన్‌ ప్రకటన శుభ పరిణామం

Written By news on Tuesday, August 8, 2017 | 8/08/2017


హైదరాబాద్‌ : అధికారంలోకి రాగానే ఆర్యవైశ్యుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ పట్ల  పలువురు ఆర్యవైశ్య సంఘాల నేతలు సంతోషం ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కోలగట్ల వీరభద్రస్వామి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, గుబ్బా చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో మంగళవారం  వైఎస్‌ జగన్‌ను కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు.
2014 ఎన్నికల్లో ఆర్యవైశ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీని నిలబెట్టుకోలేదని ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల నేతలు గుర్తు చేశారు. కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానంటూ జగన్ ప్రకటించడం శుభ పరిణామమని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వరరావు అన్నారు. నంద్యాల ఎన్నికల్లో శిల్పా మోహన్‌ రెడ్డికి ఓటు వేయడం ద్వారా తమ స్పందనను తెలియజేస్తామని ఆయన స్పష్టం చేశారు.

నంద్యాలలో వైఎస్‌ జగన్‌ ప్రచారం


నంద్యాలలో వైఎస్‌ జగన్‌ ప్రచారం
హైదరాబాద్‌: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రచారం చేయనున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9వ తేదీన జరగనున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా వైఎస్‌ జగన్‌.. నంద్యాల మండలంలోని రైతునగరానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారని చెప్పింది.

ఆ తర్వాత మండలంలో గల రామకృష్ణా నగర్‌, కానాల, హెచ్‌ఎస్‌ కొట్టాల, బాబానగర్‌లో పర్యటిస్తారని వెల్లడించింది. అనంతరం గోసపాడు మండలంలో గల ఎం చింతలకుంట, జూలపల్లి, పసురపాడు గ్రామాల్లో పార్టీ తరఫున ప్రచారం చేస్తారని తెలిపింది.

Popular Posts

Topics :