03 September 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

గౌతంరెడ్డిపై సస్పెన్షన్ వేటు

Written By news on Sunday, September 3, 2017 | 9/03/2017


గౌతంరెడ్డిపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్ సీపీ నాయకుడు పూనూరు గౌతంరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దివంగత నేత వంగవీటి మోహన్‌రంగా సహా వైఎస్సార్‌ సీపీ నాయకులపై గౌతంరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. గౌతంరెడ్డిపై సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. వైఎస్సార్‌ జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన వైఎస్‌ జగన్‌ ఆదివారం రాత్రి పార్టీ నాయకులతో ఈ అంశంపై చర్చించారు. గౌతంరెడ్డి వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా కమిటీని ఆదేశించారు.
కాగా, గౌతంరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఈ మధ్యాహ్నం వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి మీడియాతో చెప్పారు. గౌతంరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వంగవీటి మోహన్‌రంగా అంటే తమకెంతో గౌరవమని చెప్పారు.

గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన వైఎస్సార్‌ సీపీ


గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన వైఎస్సార్‌ సీపీవిలేకరులతో మాట్లాడుతున్న పార్థసారధి
సాక్షి, హైదరాబాద్‌: వంగవీటి రంగాపై తమ పార్టీ నేత పూనూరు గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌ సీపీ ఖండించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. గౌతంరెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్టీ నేతలు ఏ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డికి వంగవీటి రంగా మంచి స్నేహితుడని గుర్తు చేశారు. వంగవీటి రంగాను తాము ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటామన్నారు. గౌతంరెడ్డి వ్యాఖ్యలపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని పార్థసారధి తెలిపారు.

Popular Posts

Topics :