
సాక్షి, హైదరాబాద్ : 'వైఎస్‌ఆర్ కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానించడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే మీ చెంతకు వస్తోంది. వైఎస్‌ఆర్ కుటుంబంలో భాగస్వామ్యులు కావాలని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను' అని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Our party will be coming to your door to enroll you into YSRKutumbam. I personally extend my invitation to you, to be a part of YSR's family
కాగా సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం’ ప్రారంభమైన విషయం తెలిసిందే. పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్టోబర్ 2 వరకు ప్రతీ బూత్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరు రోజుకు రెండు కుటుంబాలను కలసి, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్నారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
అలాగే వైఎస్సార్ కుటుంబంలో చేరాలనుకునే వారు 9121091210 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఇలా మిస్డ్‌కాల్ ఇస్తే వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడి కార్యాలయంతో నేరుగా సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుంది. చంద్రబాబు పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులు, తాము ఎదుర్కొంటున్న కష్టాలను ప్రజలు తెలియజేయవచ్చు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీవరకు 20 రోజులపాటు వైఎస్‌ఆర్ కుటుంబం కార్యక్రమం కొనసాగనుంది.