29 October 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పాదయాత్రపై టీడీపీ సర్కారు కుట్ర

Written By news on Saturday, November 4, 2017 | 11/04/2017


వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్పం’ పాదయాత్రపై టీడీపీ సర్కారు కుట్రలను వేగవంతం చేసింది. అనుమతుల పేరుతో మెలిక పెట్టేందుకు యత్నిస్తోంది. శుక్రవారం సాయంత్రం ఏపీ పోలీస్‌ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు ఫోన్‌ చేసి, పాదయాత్రకు అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాకి తెలిపారు.
పాదయాత్రకు అనుమతులేంటి? : పోలీస్‌ అధికారి ప్రశ్నకు బదులిస్తూ వైవీ సుబ్బారెడ్డి.. ‘‘పాదయాత్రలకు సంబంధించి గతంలోనూ అనుమతుల ప్రస్తావన లేదు. ఇప్పుడు కూడా ఆ అంశం ఉత్పన్నం కాబోదు. అయినా, పాదయాత్ర సమాచారాన్ని ఇదివరకే డీజీపీకి తెలియజేశాం’’ అని స్పష్టం చేశారు.

రెండో సారీ అదే మాట : సదరు అధికారి ఫోన్‌లో రెండోసారి కూడా ‘అనుమతులు తీసుకోవాలి కదా’ అని అనడంతో వైవీ సుబ్బారెడ్డి సహనంగా సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. ‘‘అసలు అనుమతి అంశమే తలెత్తబోదు. పాదయాత్రకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చేందుకు రేపు(శనివారం) మా పార్టీ తరఫున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పార్థసారథిలు వచ్చి వివరాలు ఇస్తారు’’ అని బదులిచ్చారు.
బహిరంగ సభలకు కూడా అంతే : వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలు నిర్వహిస్తే అప్పుడైనా అనుమతి కావాలికదా అని పోలీసు అధికారి అనగా, ‘ఆ విషయం మా స్థానిక నేతలు అక్కడి అధికారులతో మాట్లాడతారు’ అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

ప్రజా సంకల్ప యాత్ర విశేషాలు

Written By news on Friday, November 3, 2017 | 11/03/2017


 ఓ మహా సంకల్పంతోనే  వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ కీలక నేత తలశిల రఘురామ్‌ తెలిపారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజా సంకల్ప యాత్ర విశేషాలను ఆయన వివరించారు. 
నవంబర్ 6వ తేదీన ఉదయం 9 గంటలకు వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులర్పిస్తారని, ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసగించాక జగన్ పాదయాత్ర మొదలౌతుందని రఘురామ్‌ చెప్పారు. కడప జిల్లాలో 7 రోజులపాటు  మొత్తం వంద కిలోమీటర్లు యాత్ర కొనసాతుందన్నారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు.. ఇలా ఐదు నియోజకవర్గాల కొనసాగే యాత్ర ఆపై కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు మీదుగా శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురంతో ముగుస్తుందని పేర్కొన్నారు. 13 జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తారని.. ప్రజలందరినీ ఆయన కలుస్తారని రఘురామ్‌ తెలిపారు. 

గతంలో వైఎస్సాఆర్‌సీపీ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహించామని.. అన్నీ దిగ్విజయంగా పూర్తయ్యాయని, ఇప్పడు కూడా శాంతియుత వాతారణంలోనే కొనసాగుతుందన్న నమ్మకం ఆయన వ్యక్తంచేశారు. అయితే ప్రభుత్వం మాత్రం యాత్రకు అవరోధాలు కల్పించాలని చూస్తోందని రఘురామ్‌ చెప్పారు. వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతం అయితే తమ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడట్లేనన్న భయంతో తెలుగుదేశం నేతలు కుట్రలకు తెరలేపుతున్నారన్నారు. పాదయాత్ర ప్రాధాన్యత తగ్గించేలా ప్రయత్నాలు ఏస్తున్నారని.. వాటిని తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.  
ప్రజా స్వామ్య దేశంలో పాదయాత్రలు చేసుకునేందుకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ముద్రగడ పద్మనాభం యాత్రతో ప్రజా సంకల్ప యాత్రకు సంబంధం లేదని. ముద్రగడ చేపట్టింది కాపు హక్కుల పోరాటం అని, కానీ, ప్రతిపక్ష నేతగా, వైఎస్ జగన్  ప్రజా హక్కుల కోసం.. వారి సమస్యలు వినిపించేందుకు పాదయాత్ర చేపట్టబోతున్నారని.. జన నేతకి ఆహ్వానం పలికేందుకు 13 జిల్లాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని రఘురామ్‌ చెప్పారు.  చంద్రబాబు పాలనలో జాబులు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన చెప్పారు.  ఏపీని అభివృద్ధిలో ముందుంచాలన్నదే వైఎస్‌ జగన్‌ లక్ష్యమని.. దివంగత నేత వైఎస్‌ఆర్‌ పాలనలోని స్వర్ణయగం కోసమే ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని రఘురామ్‌ స్పష్టం చేశారు.

నేడు తిరుమలకు వైఎస్‌ జగన్‌

తిరుపతి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శుక్రవారం సాయంత్రం తిరుమలకు రానున్నట్లు వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి  తెలిపారు. 6.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుని కరకంబాడి, మంగళం మీదుగా తిరుమల కొండకు వెళతారు.  రాత్రికి అక్కడే బస చేసి శనివారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆదివారం కడపకు చేరుకుని పెద్దదర్గాను దర్శించుకుంటారు. సోమవారం ఇడుపులపాయనుంచి ప్రజా సంకల్పయాత్రను చేపడతారు. 8 నెలల పాటు చేపట్టనున్న ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో...  లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చదువుతున్న తన పెద్ద కుమార్తె హర్షను చూసేందుకు ఇటీవల లండన్‌ వెళ్లిన వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం రోజంతా పార్టీ నేతల సమావేశాలతో గడిపారు

జగన్‌ పాదయాత్రకు రక్షణ కల్పించండి


సాక్షి, హైదరాబాద్‌: ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6వ తేదీ నుంచి పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆయనకు, పార్టీ నేతలకు అవసరమైన రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావును ఆ పార్టీ కోరింది. ఈ మేరకు డీజీపీకి గురువారం లేఖ రాసింది. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో మొదలయ్యే ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగుతుందని, 13 జిల్లాల్లో దాదాపు 3 వేల కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర కొనసాగుతుందని ఆ లేఖలో పేర్కొంది. జగన్‌ ప్రతీరోజూ 15 నుంచి 16 కిలోమీటర్లు నడిచి, రాత్రిపూట అక్కడే బస చేస్తారని తెలిపింది. పాదయాత్ర సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆయనతో కలసి నడుస్తారని పేర్కొంది. పాదయాత్ర నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలను వైఎస్‌ జగన్‌ కలుస్తారని, వారితో సంభాషిస్తారని వివరించింది. ఈ నేపథ్యంలో ‘జెడ్‌’ కేటగిరీ భద్రతలో ఉన్న వైఎస్‌ జగన్‌కు అవసరమైన భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను జిల్లా పోలీసులకు అందజేస్తామని లేఖలో వైఎస్సార్‌సీపీ తెలిపింది.

నేడు తిరుమలకు వైఎస్‌ జగన్‌
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శుక్రవారం సాయంత్రం తిరుమలకు రానున్నట్లు వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి  తెలిపారు. 6.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుని కరకంబాడి, మంగళం మీదుగా తిరుమల కొండకు వెళతారు.  రాత్రికి అక్కడే బస చేసి శనివారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆదివారం కడపకు చేరుకుని పెద్దదర్గాను దర్శించుకుంటారు. సోమవారం ఇడుపులపాయనుంచి ప్రజా సంకల్పయాత్రను చేపడతారు. 8 నెలల పాటు చేపట్టనున్న ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో...  లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చదువుతున్న తన పెద్ద కుమార్తె హర్షను చూసేందుకు ఇటీవల లండన్‌ వెళ్లిన వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం రోజంతా పార్టీ నేతల సమావేశాలతో గడిపారు.

Popular Posts

Topics :