16 October 2011 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Written By news on Friday, October 21, 2011 | 10/21/2011

టివి9, ఆంధ్రజ్యోతి, ఈనాడులకు సవాల్
హైదరాబాద్: టివి9లో ప్రసారం చేసిన తప్పుడు కథనాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఇంటిని గురించి ప్రసారం చేసిన కథనాలను రుజువు చేయాలని సవాల్ చేశారు. ఈరోజు వారు ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఆ ఇంటిలో ఏడు గదులు ఉంటే 70 గదులు ఉన్నాయని, బార్ ఉందని, స్విమ్మింగ్ పూల్ ఉందని తప్పుడు కథనాలు ప్రసారం చేశారని చెప్పారు. ఎవరి కోసం, ఏ ప్రయోజనాలు ఆశించి ఈ విధంగా ప్రసారం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. టివి9 రవిప్రకాష్, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, ఈనాడు రామోజీ రావులు వస్తే ఆ ఇంటిని పూర్తిగా చూపిస్తామని చెప్పారు. జగన్ ఇంట్లో బార్, విదేశీ మద్యం బాటిళ్లు ఉన్నాయని చెబుతున్నారు, ఒక్క విదేశీ మద్యం బాటిల్ చూపించాలని వారు సవాల్ చేశారు. వారు చేసిన ఆరోపణలు నిజమని రుజువు చేస్తే ఆ ఇంటిని వారికే రాసిస్తామన్నారు. అవి తప్పుడు కథనాలని రుజువైతే ప్రజల మధ్యలో జగన్మోహన రెడ్డికి క్షమాపణలు చెప్పండి చాలని వారు డిమాండ్ చేశారు.

పచ్చళ్ల వ్యాపారం చేసిన రామోజీరావు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే అది న్యాయమా? అంతకంటే లాభసాటి వ్యాపారాలు చేసి జగన్ సంపాదిస్తే అది దోపిడినా? అని వారు ప్రశ్నించారు. 1995లో సుప్రభాతం పత్రికలో 3వేల రూపాయల జీతానికి పని చేసిన టివి9 రవి ప్రకాష్ ఇప్పుడు ఎంత సంపాదించారు? అని ప్రశ్నించారు. దేశవిదేశాలలో వ్యాపారం చేయడానికి ఆయనకు డబ్బు ఎక్కడ నుంచి, ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. ఆంధ్రజ్యోతిపత్రిక మూసివేయడానికి ముందు అక్కడ ఏడు వేల రూపాయల జీతానికి పని చేసిన రాధాకృష్ణ ఇప్పుడు ఎంత సంపాదించారు? అని ప్రశ్నించారు. ఆయన వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించి, వ్యాపారాలు చేస్తున్నారో తెలపాలన్నారు. రామోజీరావు ఫిల్మిసిటీలో బుల్లెట్ ప్రూఫ్ భవనం నిర్మించారు. రాధాకృష్ణ కూడా పెద్ద ఇంటినే నిర్మించారు. వారు ఇళ్లు నిర్మించుకుంటే లేని తప్పు జగన్మోహన రెడ్డి ఇల్లు నిర్మించుకుంటే తప్పా? అని వారు ప్రశ్నించారు.

ఏ వ్యక్తినో ముఖ్యమంత్రిని చేయడానికో, ఏ పార్టీనో అధికారంలోకి తీసుకురావడానికో ఇటువంటి కథనాలు ప్రసారం చేస్తున్నారన్నారు. ఆరోపణలను రుజువు చేయలేకపోతే మీ ఛానెల్ ని మూసివేస్తారా? అని టివి9 ఛానెల్ ని ప్రశ్నించారు. రామోజీ ఫిల్మిసిటీ చుట్టూ రోడ్డు నిర్మించారు. అది ఎవరి స్థలంలో నిర్మించారు? ఆ విషయాలు రాసే దమ్ము ధైర్యం ఏ ఛానెల్ కు, ఏ పత్రికకు లేదన్నారు.

తమకు పత్రికా విలువల పట్ల గౌరవం ఉందన్నారు. ఈ విధంగా విలువలు లేకుండా తప్పుడు కథనాలను ప్రసారం చేయడాన్నే తాము ప్రశ్నిస్తున్నామని చెప్పారు.

ysr

Written By news on Wednesday, October 19, 2011 | 10/19/2011

Popular Posts

Topics :