09 February 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

జగన్‌ను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపిన అరుణాచల్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అపాంగ్

Written By news on Saturday, February 15, 2014 | 2/15/2014


రాహుల్ కు కోపం వచ్చి బిల్లు చించితే ఏంచేశారు?

రాహుల్ కు కోపం వచ్చి బిల్లు చించితే ఏంచేశారు?ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
విజయవాడ: ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి  కోపం వచ్చి బిల్లును చించి, రాష్ట్రపతిని అవమానపరిస్తే ఏం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను విమర్శించడం నీచరాజకీయం అన్నారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతంతో కాంగ్రెస్ చేతిలో పావుగా మారారని విమర్శించారు. రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టులోనైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ఉమ్మారెడ్డి తెలిపారు.

రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి వైఎస్ఆర్ సీపీ శ్రేణులు

రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి  వైఎస్ఆర్ సీపీ శ్రేణులు
హైదరాబాద్ : దేశ రాజధానిలో సమైక్యవాణిని గొంతెత్తి చాటేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హస్తినకు దండు కడుతున్నారు.  ప్రజల మనోభావాలకు విరుద్ధంగా యూపీఏ ప్రభుత్వం మూర్ఖంగా తీసుకున్న విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ... ఈ నెల 17న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో పెద్దఎత్తున ధర్నా చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం వైఎస్ఆర్ సీపీ రెండు ప్రత్యేక రైళ్లను వేశారు. శనివారం ఉదయం10 గంటలకు రేణిగుంట నుంచి బయల్దేరగా, సాయంత్రం 4:30 గంటలకు రాజమండ్రి నుంచి ప్రత్యేక రైళ్లు బయలుదేరనుంది.

రేణిగుంట నుంచి బయల్దేరిన రైలు ఆగే ప్రాంతాలు
గుత్తి  మధ్యాహ్నం 3:30 గంటలకు
కర్నూలు సా. 5:20 గంటలకు
కాచిగూడ రా. 9:30 గంటలకు
ఖాజీపేట అర్థరాత్రి 12గం.లకు
రామగుండం తెల్లవారు జామున 2:15గంటలకు
రాజమండ్రి నుంచి బయల్దేరిన రైలు ఆగే ప్రాంతాలు
రాజమండ్రిలో సా.4:30 గంటలకు బయల్దేరనున్న రైలు
ఏలూరులో సా. 6:30 గంటలకు
విజయవాడలో రా. 7:40 గంటలకు
ఖమ్మంలో రాత్రి. 8:15 గంటలకు
మంచిర్యాలలో తెల్లవారుజామున 2:00 HQ

మహిళలపై టీడీపీ నేత దాడి

  • బాధితులు వెఎస్సార్ సీపీ సానుభూతి పరులు
  •  టీడీపీ ఎమ్మెల్యే సోదరుడి ఘాతుకం
  •  నిరసనగా దళితుల రాస్తారోకో
అవనిగడ్డ/నాగాయలంక, న్యూస్‌లైన్ : అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ బాబాయ్ కొడుకు, సర్పంచి అంబటి శ్యామ్‌ప్రసాద్ దళితవర్గానికి చెందిన ముగ్గురు వైఎస్సార్‌సీపీ మహిళా సానుభూతిపరులపై శుక్రవారం దాడిచేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత పంచాయతీ ఎన్నికల్లో ఈ ముగ్గురూ వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థికి మద్ధతు ఇచ్చినందుకే దాడిచేసినట్లు బాధితులు పేర్కొన్నారు.  ఘటనకు నిరసనగా అవనిగడ్డలో దళితులు రాస్తారోకో చేశారు.

వివరాల్లోకి వెళితే... నాగాయలంక పోలీసుస్టేషన్ పరిధిలోని బ్రహ్మానందపురానికి చెందిన  వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యుడు మునిపల్లి భాస్కరరావు తల్లి మునిపల్లి కళావతి, బంధువులైన కొక్కిలిగడ్డ మార్తమ్మ, ఆళ్లకూరి మరియమ్మ  గ్రామంలోని బంధువుల ఇంట జరుగుతున్న సంవత్సరికం కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది తెలుసుకున్న వక్కపట్లవారిపాలెం సర్పంచి అంబటి శ్యామ్‌ప్రసాద్, నాని, మరో వ్యక్తి కలసి కులంపేరుతో దూషించి రాడ్లతో వారిపై దాడిచేసి గాయపరచి పరారయ్యారు. గాయాలైన ముగ్గురు మహిళలను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నారు.
 
 వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చినందునే...
 
గత పంచాయతీ ఎన్నికల్లో వక్కపట్లవారిపాలెం గ్రామ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థికి  మునిపల్లి కళావతి మద్దతు ఇచ్చినందునే సర్పంచి శ్యామ్‌ప్రసాద్ దాడిచేశాడని వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యులు మునిపల్లి భాస్కరరావు ఆరోపించారు. ఆ ఎన్నికల నాటి నుంచి తమపై కక్ష పెట్టుకున్న సర్పంచి మహిళలని  చూడకుండా రాడ్డుతో దాడిచేసి గాయపరిచాడని చెప్పారు.
 
రాస్తారోకో....
 
బ్రహ్మానందపురంలో దళితులపై దాడిచేసి తీవ్రంగా గాయపరచిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండుచేస్తూ మాలమహానాడు, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక ఏరియా ఆస్పత్రి ఎదుట రాస్తారోకో నిర్వహించారు.   దళిత నాయకులు దోవా గోవర్ధన్, నలుకుర్తి రమేష్, నలుకుర్తి రాజేష్, సీపీఎం నాయకుడు బండి ఆదిశేషు తదితరులు మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో దళితసంఘాల ఐక్యవేధిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.  అవనిగడ్డ, నాగాయలంక ఎస్‌ఐలు శివరామకృష్ణ, నరేష్ రంగప్రవేశం చేసి నిందితులను అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
 

పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు

విభజనను ప్రతిఘటించాలి: వైఎస్ జగన్
* కాంగ్రెస్ అన్యాయాన్ని అడ్డుకోవాలి
ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలి
బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు వైఎస్ జగన్ విజ్ఞప్తి

 సాక్షి, న్యూఢిల్లీ: అన్యాయంగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ విభజనను ప్రతిఘటించటానికి ప్రతిపక్షాలు ఒక్కటిగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రాల విభజన అనేది మొదలుపెడితే.. రేపు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లతో పాటు మరో రాష్ట్రంలోనూ ఇలాగే జరుగుతుందని ఆయన రాజ్‌నాథ్‌కు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ విభజనను ప్రతిపక్షాలు గట్టిగా ప్రతిఘటించాలని కోరారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, పార్టీ నేత ఎం.వి.మైసూరారెడ్డి, మాజీ ఎంపీ బాలశౌరిలతో జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో కలిశారు. దాదాపు అరగంట పాటు చర్చించారు.

 భేటీ అనంతరం జగన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అన్యాయంగా చేస్తున్న రాష్ట్ర విభజన విషయమై రాజ్‌నాథ్‌ను కలిసి మళ్లీ సవివరంగా చెప్పాం. విభజన విషయంలో అసెంబ్లీ తీర్మానం లేకుండా.. విభజన బిల్లును అసెంబ్లీ వ్యతిరేకించినప్పటికీ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈ రకంగా రాష్ట్రాన్ని విభజించటం ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైతే.. ఆ తరువాత తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రంలోనూ ఇంకొక రాష్ట్రంలోనూ ఇలాగే జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ రకంగా కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని ప్రతిపక్షాలు ఒక్కటిగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్‌కు విన్నవించినట్లు తెలిపారు. దీనిపై పార్టీ సహచరులతో మాట్లాడి త్వరగానే సరైన నిర్ణయం తీసుకుంటామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారన్నారు.

 బీజేపీ నుంచి మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. దేవుడు కూడా వీళ్లందరిలో మంచి చేసే ఆలోచన పుట్టిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘నాకు ఇంకా నమ్మకం ఉంది. ప్రతిపక్షాలన్నీ ఒక్కటి అవుతాయని, ఒక్కటై గట్టిగా వ్యతిరేకిస్తాయని, మంచి జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. దేవుడు కూడా పై నుంచి చూస్తున్నాడు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ‘పార్లమెంటులో ఘర్షణ నేపథ్యంలో విభజన బిల్లు పెట్టుకుండా పునరాలోచించుకోవాలంటారా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘నిన్న జరిగిన అన్యాయమైతే.. నిజంగా ప్రజాస్వామ్యం బతికి ఉందా? లేదా? అర్థంకాని పరిస్థితి. విభజన వద్దని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వ్యతిరేకించిన పరిస్థితుల్లో.. ఏ రాష్ట్రమైతే విభజనకు ఒప్పుకోవటంలేదో.. ఆ రాష్ట్రాన్ని విడగొట్టటానికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’’ అని ఆయన మండిపడ్డారు.


 పదే సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టారట...
 ‘‘పది సెకన్లలో బిల్లు ప్రవేశపెట్టేశామని ముగించేస్తారు. సాధారణంగా ఒక బిల్లు ఎక్కడైనా పెట్టినప్పుడు.. దానిని ప్రవేశపెట్టటానికి సభ అంగీకరిస్తోందా? లేదా? చేతులు ఎత్తాలని మొదట అడుగుతారు. అవును.. ప్రవేశపెట్టటానికి అంగీకరిస్తున్నామని సభ్యులు చేతులు పైకి ఎత్తుతారు. లేదు.. ప్రవేశపెట్టటానికి అంగీకరించటం లేదంటూ ‘నో’ అని చేతులు పైకి ఎత్తుతారు. అంగీకరిస్తున్నాం అన్న చేతులు, నో (అంగీకరించటం లేదు) అన్న చేతుల కన్నా ఎక్కువ లేస్తేనే.. బిల్లును సభలో ప్రవేశపెట్టటమనేది జరగాలి. అది సంప్రదాయం. ఆ పద్ధతిలోనే జరగాలి. కానీ ఇక్కడ ఎక్కడ ఎవరు మూవ్ చేశారో తెలియదు. సభకు అంగీకారం అవునా? కాదా? అని అడిగిందీ లేదు. చేతులు పైకి ఎత్తిన దాఖలాలూ లేవు. అయినా పదే సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టటమైందని చెప్పటం నిజంగా చాలా అన్యాయం’’ అని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.

 అందరూ షాక్ అయ్యారు...
 ‘అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానంపై కూడా అలానే జరిగింది కదా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అసెంబ్లీలో ఏం జరిగిందనేది దేశం మొత్తం చూసింది. పార్లమెంటులో ఏం జరిగిందన్నది నా కళ్లెదుటే సాక్షాత్తుగా జరిగితే.. దాని తరువాత ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ,  ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ అందరూ షాక్ అయ్యారు. ఇంత అన్యాయంగా జరిగిన దాఖలాలు వారు ఎప్పుడూ చూడలేదు. సుష్మా, అద్వానీ, నేను, ఎస్‌పీ, బీజేడీ, ఏఐఏడీఎంకే నేతలు అందరం కలిసికట్టుగా వెళ్లి దీన్ని వ్యతిరేకించాం. ఈ రకంగా చేయటం అన్యాయమని చెప్పి వాకౌట్ చేసిన సందర్భం ఇంతవరకు పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. తొలిసారిగా అది కూడా గురువారం జరిగింది’’ అని ఆయన పేర్కొన్నారు.

 ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేతకు సహకరిస్తా: బీహార్ సీఎం నితీశ్
 రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సంఘీభావం తెలిపారు. విభజనను అడ్డుకునేందుకు జాతీయ నేతల మద్దతు కూడగడుతున్న ప్రయత్నంలో భాగంగా శుక్రవారం నితీష్‌తో జగన్ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రాల విభజనను అడ్డుకునేందుకు జాతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరాన్ని నితీష్‌కు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును అడ్డుకోవాలని విన్నవించారు. ఈ సందర్భంగా జగన్ పోరాటానికి నితీష్ సంఘీభావం తెలిపారు. అలాగే లోక్‌సభలో సీమాంధ్ర సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నేడు వైఎస్సార్‌సీపీ చలో ఢిల్లీ

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నిర్విరామంగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... తన వాణిని దేశ రాజధాని ఢిల్లీలో బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 17న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘సమైక్య ధర్నా’ నిర్వహించనుంది. తద్వారా అడ్డగోలుగా విభజనకు పాల్పడుతున్న యూపీఏ ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలిగేలా చేయాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తలపెట్టిన ఈ ధర్నాలో భారీ ఎత్తున పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి.
 
 ఈ మేరకు శనివారం రెండు ప్రత్యేక రైళ్లలో బయలుదేరనున్నాయి. ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నేతలు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో నేతలు వాసిరెడ్డి పద్మ, కె.శివకుమార్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఈ ధర్నా ఢిల్లీ అహంకారానికి, తెలుగుజాతి పౌరుషానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో చేపట్టనున్న ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలిపారు.
 
  ఢిల్లీ నడిబొడ్డున సమైక్యధర్నా ద్వారా యూపీఏ పెద్దలకు తెలుగుప్రజల మనోభావాలను తెలియజేస్తామని చెప్పారు. రెండు రోజులుగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమైక్యబంద్ విజయవంతమైందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో వ్యవహరించిన తీరుకు నిరసనగా ఇప్పటికే 8 పార్టీలు గళం విప్పాయని వివరించారు. ఇప్పటికైనా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ‘‘చంద్రబాబు తన వాదనను స్పష్టం చేయాలి. అటుఇటు కాని వాదనతో కొబ్బరిచిప్పల సిద్ధాంతం ద్వారా తెలుగుప్రజలకు తీరని నష్టం కలిగిస్తున్నారు. కాంగ్రెస్ ఒకరకంగా నష్టం కలిగిస్తే, బాబు తానిచ్చిన విభజన లేఖను ఉపసంహరించుకోకుండా ఇక్కడిదాకా తెచ్చారు. తెలుగుజాతికి మద్దతుగా బాబు సమైక్య జెండా పట్టుకోవాలి. చివరిక్షణంలోనైనా బాధ్యత తీసుకుని మాతోపాటు ధర్నాకు కూర్చొని తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలి’’ అని ఆమె సూచించారు.

బంద్ సంపూర్ణం

బంద్ సంపూర్ణం
సాక్షి నెట్‌వర్క్: ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సీమాంధ్ర బంద్ రెండోరోజు శుక్రవారం విజయవంతమైంది. అన్ని జిల్లాల్లో ర్యాలీలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలతో నిరసన కార్యక్రమాలను హోరెత్తించారు. దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను మూయించారు. విద్యాసంస్థలను బంద్ చేశారు. ఆర్టీసీ బస్సులు రెండోరోజు కూడా డిపోలకే పరిమితమయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోలుబంకులు మూసేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 
 
అనంతపురంలో వైఎస్సార్‌సీపీ నేత ఎర్రి స్వామిరెడ్డి, మహిళా విభాగం నేతలు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపైకి మహిళలు కోడిగుడ్లు, టమాటాలు విసిరి నిరసన వ్యక్తం చేశారు. ఎస్కేయూలో విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. హిందూపురం, కళ్యాణదుర్గంలో ఏపీఎన్జీఓలు ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
  కడపలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సురేశ్‌బాబు ఆధ్వర్యంలో అప్సర సర్కిల్‌లో టైర్లుకాల్చి నిరసన తెలిపారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకోగా, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో  పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ తీయగా, జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో దుకాణాలు, పాఠశాలలను మూయించారు.
 
   చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, పుత్తూరులో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.నారాయణస్వామి బంద్‌ను పర్యవేక్షించారు. తిరుపతిలో రమణమ్మ, గీత అనే మహిళా కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు వారించి అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులో కళ్లకు గంతలు కట్టుకుని పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
 
   తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 16వ నంబర్ హైవేపై కేంద్రమంత్రి జేడీ శీలంను ఏపీఎన్జీవోలు, న్యాయవాదులు అడ్డుకోబోయారు. అనంతరం మంత్రి ప్రారంభించిన సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. కోటగుమ్మం, పుష్కర్‌ఘాట్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సోనియా, రాహుల్‌ల ఫ్లెక్సీలను చించివేశారు. 214 జాతీయ రహదారిపై ముమ్మిడివరం, మామిడికుదురు, పిఠాపురంలలో రాస్తారోకో చేశారు. అనపర్తిలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, అమలాపురంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు బంద్‌లో పాల్గొనగా, జగ్గంపేట నియోజకవర్గంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కార్యకర్తలు బంద్ నిర్వహించారు.
 
   పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో  వైఎస్సార్‌సీపీ నాయకులు  ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. యువకులు  దుకాణాలను మూయించారు. పలు కళాశాలల విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. భీమవరంలో మానవహారం, కొవ్వూరులో ధర్నా చేశారు. గోపాలపురంలో మూడు రోడ్ల సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం చేపట్టగా, తణుకులో మోటార్ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.
 
   విజయనగరం జిల్లా బొబ్బిలిలో వైఎస్సార్ సీపీ పార్టీ నేత  సుజయకృష్ణ రంగారావు నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు బొబ్బిలికోట నుంచి ర్యాలీ చేపట్టారు. నెలిమర్లలో మొయిద జంక్షన్ వద్ద విజయనగరం -పాలకొండ రహదారిపై రాస్తారోకో, మానవహారం చేపట్టారు. విజయనగరం, ఎస్. కోట, చీపురుపల్లి, గజపతినగరం, కురుపాం నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు.
 
  శ్రీకాకుళంలో  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సులను అడ్డుకున్నారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. పార్టీనేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూర్యమహల్ కూడలి వరకు జరిగిన ర్యాలీ, మానవహారాల్లో పాల్గొన్నారు.
 
   విశాఖ నగర వైఎస్సార్‌సీపీ నేత వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మద్దిలపాలెం కూడలి నుంచి బైక్‌లు, వాహనాలతో తూర్పు నియోజకవర్గమంతా భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో టీ-బిల్లు ప్రతులు కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట రాస్తారోకో నిర్వహించి, షిండే దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
  విజయవాడ హనుమాన్ జంక్షన్ వద్ద కేంద్రమంత్రి జేడీ శీలం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు సమైక్యవాదులు యత్నించారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు  సామినేని ఉదయభాను బైక్‌ర్యాలీ నిర్వహించి, ఆర్టీసీ బస్‌డిపో గేట్ ఎదుట ఆందోళన చేశారు. అవనిగడ్డలో ఒంటికాలిపై నిల్చుని నిరసన తెలపగా,  చల్లపల్లిలో మోటార్‌సైకిల్ ర్యాలీ తీశారు. కంచికచర్లలో 65వ నంబర్ జాతీయ రహదారిపై రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. విజయవాడ రామవరప్పపాడుసెంటర్‌లో  మానవహారం నిర్మించారు.
 
  నెల్లూరులో వైఎస్సార్‌సీపీ  కార్యకర్తలు మోటార్ బైక్‌లపై ర్యాలీ నిర్వహిస్తూ బంద్‌ను పర్యవేక్షించారు.  పొదలకూరులోని సంగం రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. గూడూరు పోటుపాళెం కూడలి ప్రాంతం, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో, వెంకటగిరి, సూళ్లూరుపేట, కావలి తదితర ప్రాంతాల్లో రాస్తారోకో నిర్వహించారు.
 
   ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను డిపోల వద్దే అడ్డుకున్నారు. కనిగిరిలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి రిలేనిరాహార దీక్షలకు కూర్చున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు జరిగాయి.
 
   గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటలో బస్టాండ్ వద్దకు చేరుకుని బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి గురజాల, పిడుగురాళ్లలో రాస్తారోకో చేశారు. కేంద్రపాలక మండలి సభ్యుడు కోన రఘుపతి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు

బీహార్ సీఎం నితీష్ కు వైఎస్ జగన్ ఫోన్

Written By news on Friday, February 14, 2014 | 2/14/2014

బీహార్ సీఎం నితీష్ కు వైఎస్ జగన్ ఫోన్
న్యూఢిల్లీ: సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని బీహార్ సీఎం నితీష్‌కుమార్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. నితీష్ కు వైఎస్ జగన్ ఫోన్ చేసి సమైక్యాంధ్రకు మద్దతు తెలపమని అడిగారు. నిబంధనలకు విరుద్దంగా బిల్లు ప్రవేశపెట్టినందుకు వ్యతిరేకించిన ఎంపీలపై సస్పెన్సన్ వేటు వేసిన అంశాన్ని నితీష్ దృష్టికి తీసుకువచ్చారు.  ఎంపీలపై విధించిన సస్సెన్షన్ వేటు ఎత్తివేతకు సహకరించాలని వైఎస్ జగన్ విజ్క్షప్తి చేశారు. వైఎస్ జగన్ విజ్క్షప్తికి నితీష్ కుమార్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. 
 
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని దేశ రాజధానిలో వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. సమైక్యాంధ్ర కోసం పలు రాజకీయ పార్టీల నేతలను వైఎస్ జగన్ కలుస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టే ప్రక్రియలో భాగంగా బీహార్ సీఎం నితీష్ కు వైఎస్ జగన్ ఫోన్ చేశారు. 

Vasireddy Padma press meet on Feb 14

మీ ఎంపీలే...మిమ్మల్ని కొడుతుంటే బాబు ఏం చేస్తున్నారు?

మీ ఎంపీలే...మిమ్మల్ని కొడుతుంటే బాబు ఏం చేస్తున్నారు?
హైదరాబాద్ : నరసరావు పేట ఎంపీ, టీడీపీ నాయకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్ లే దాడి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు తెలిపారు. అంతేకాని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన టీడీపీ ఎంపీ  మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి హితవు పలికారు.
 
అయిన మీ పార్టీ ఎంపీలే మిమ్మల్ని కొడుతుంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏం చేస్తున్నారని గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. చంద్రబాబుతో ఇప్పటికేనా  జై సమైక్యాంధ్ర అనిపించగలరా అంటు మోదుగులకు ఆయన సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ బ్రోకర్ పార్టీగా మారిందని గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు.

ఢిల్లీ అహంకారానికి, తెలుగు ఆత్మగౌరవానికి మధ్య పోరాటం

ఢిల్లీ అహంకారానికి, తెలుగు ఆత్మగౌరవానికి మధ్య పోరాటం'వీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ: ఢిల్లీ అహంకారానికి, తెలుగు జాతి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం అని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. 'చంద్రబాబు ఇప్పటికైనా మీరు రెండు కళ్ల సిద్ధాంతాన్ని పక్కనపెట్టండి' అని అన్నారు. 'రాష్ట్ర విభజనపై మీ నిర్ణయం ఏంటో ఇప్పటికైనా చెప్పండి' పద్మ మండిపడ్డారు. 
 
ఢిల్లీ వేదికగా సమైక్య పోరును వినిపిద్దాం అని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. జంతర్‌మంతర్‌ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలోజరిగే సమైక్యధర్నాలో పార్టీ శ్రేణులు పాల్గొనాలి అని విజ్ఞప్తి చేశారు. 
 
ఛలో ఢిల్లీ పేరుతో నిర్వహించే సమైక్య ధర్నా కోసం రాష్ట్రం నుంచి రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. శనివారం ఉదయం10 గంటలకు రేణిగుంట నుంచి, సాయంత్రం 4:30 గంటలకు రాజమండ్రి నుంచి ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయని ఆమె వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య ధర్నా పోస్టర్ ను పార్టీ నేతలు విడుదల చేశారు. 

అంగన్ వాడీ ఉద్యోగులకు విజయమ్మ భరోసా

అంగన్ వాడీ ఉద్యోగులకు విజయమ్మ భరోసా
హైదరాబాద్ : అంగ న్ వాడీ ఉద్యోగుల చేస్తున్న న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్ వాడీ ఉద్యోగులు కోరుతూన్న డిమాండ్ న్యాయబద్దంగా ఉన్నాయని తెలిపారు. నగరంలోని ఇందిరాపార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్ వాడీ ఉద్యోగులను కలసి విజయమ్మ తన సంఘీభావాన్ని ప్రకటించారు.

గతంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంగన్ వాడీ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను విజయమ్మ ఈ సందర్బంగా గుర్తు చేశారు. త్వరలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని విజయమ్మ ఈ సందర్భంగా అంగన్ వాడీ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని వారికి భరోసా ఇచ్చారు.

వైఎస్ విజయమ్మతోపాటు ఆ పార్టీ నేతలు శోభానాగిరెడ్డి, గట్టు రామచంద్రరావులు అంగన్ వాడి ఉద్యోగులను కలసిన వారిలో ఉన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోరుతూ గత నాలుగు రోజులుగా అంగన్ వాడీ ఉద్యోగులు ఇందిరా పార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

రాజ్ నాథ్ సింగ్ తో వైఎస్ జగన్ భేటీ

ప్రజాస్వామ్యం ఉనికే ప్రశ్నార్థకం అయ్యింది: జగన్వీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ : బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తోందో ఆయనకు వివరించారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాకులు విభజనను వ్యతిరేకిస్తున్నా, సొంత పార్టీ మనుషులు కూడా విభజన వద్దంటున్నా కూడా కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు కేవలం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని.. చివరకు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయంలో కూడా అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించారని రాజ్ నాథ్ దృష్టికి జగన్ మోహన్ రెడ్డి తీసుకెళ్లారు. వారి భేటీ సుమారు అరగంట పాటు సాగింది. అనంతరం జగన్, రాజ్ నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. జగన్ మీడియాతో మాట్లాడిన అంశాలిలా ఉన్నాయి..

''రాజ్ నాథ్ సింగ్ తో చాలా వివరంగా మాట్లాడాం. ఆయన మాకు హామీ ఇచ్చారు. ఈ విషయంపై తన పార్టీ సభ్యులతో చర్చించి, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మొత్తం ప్రతిపక్షాలన్నీ ఒక్కటిగా నిలిచి, ఈ అన్యాయంపై స్పందిస్తాయని ఆశిస్తున్నాను. ఆయనతో చాలా సుదీర్ఘంగా చర్చించాము. ఈ రకంగా రాష్ట్రాన్ని విభజించడం మొదలైతే, అసెంబ్లీ తీర్మానం వ్యతిరేకించినా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇలా చేయడం మొదలైతే రేపు అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతుందని ఆయనకు చెప్పాం. ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలని, అందరూ కలిసి ప్రతిఘటించాలని ఆయనకు విన్నవించాం. దేవుడు కూడా వీరందరికీ మంచి చేసే ఆలోచనలు ఇస్తాడని ఆశిస్తున్నాం. అసలు నిన్న జరిగిన అన్యాయం అయితే.. నిజంగా ప్రజాస్వామ్యం బతికుందో లేదో అర్థం కావట్లేదు.

తమకు విభజన వద్దని అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా.. పది సెకన్లలో బిల్లు ప్రవేశపెట్టామని చెప్పేస్తారు, ఆమోదం పొందిందని కూడా చెప్పేస్తారు. మామూలుగా అయితే బిల్లు పెట్టినప్పుడు చేతులు పైకెత్తాలని మొదట అడుగుతారు. ఆమోదయోగ్యం అవునో కాదో తెలుసుకుంటారు. ఆమోదించినట్లు ఎక్కువ చేతులు పైకి లేస్తేనే బిల్లును ప్రవేశపెట్టాలి. ఇక్కడ మాత్రం ఇలా అడగలేదు, ఎవరూ చేతులు పైకెత్తలేదు. అయినా బిల్లును ప్రవేశపెట్టేశామని చెప్పడం తీవ్ర అన్యాయం. అసెంబ్లీలో ఏం జరిగిందో అందరూ చూశారు. పార్లమెంటులో జరిగిన విషయాలను ప్రతిపక్ష సభ్యులు కూడా తీవ్రంగా విమర్శించారు. మాతోపాటు సమాజ్ వాదీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీజేపీ.. అన్ని పార్టీలూ కూడా వాకౌట్ చేసిన సంఘటన ఇంతవరకు పార్లమెంటులో ఎప్పుడూ జరగలేదు. అందుకే ప్రతిపక్షాలన్నీ ఒక్కటిగా నిలిచి ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తాయన్ననమ్మకం మాకుంది''.

మేకపాటి, ఎస్పీవై రెడ్డి, మైసూరారెడ్డి, బాలశౌరి తదితరులు కూడా వైఎస్ఆర్ సీపీ బృందంలో ఉన్నారు. గతంలో అద్వానీ, సుష్మా స్వరాజ్ లతో కూడా భేటీ అయిన జగన్, ఇప్పుడు పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో ఈరోజు సమావేశమయ్యారు

దేశాన్ని కూడా విభజిస్తారా?

దేశాన్ని కూడా విభజిస్తారా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన రాజకీయ స్వార్థం కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని, ఇదే తీరులో రేపటి రోజున దేశాన్ని కూడా విభజిస్తారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు భూమా శోభానాగిరెడ్డి, మేకతోటి సుచరిత, కె.శ్రీనివాసులు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, జుట్టు జగన్నాయకులు మాట్లాడారు. విదేశీ వ్యక్తుల ఆధిపత్యానికి పార్లమెంటు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్ ఆత్మ ఘోషించేలా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ తీసుకొచ్చిన సోనియాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి తరిమికొట్టాలన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఇంకా ఏమన్నారంటే...
 
  దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నన్నాళ్లూ ఢిల్లీ నాయకులు రాష్ట్రంవైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోయారు. ఆయన మరణం తర్వాత అసమర్థ సీఎం, చేతకాని ప్రధాన ప్రతిపక్షం వల్ల రాష్ట్రం ముక్కలయ్యే పరిస్థితి తలెత్తింది.
 
 గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వంపై మేము అవిశ్వాసం పెట్టినప్పుడు చంద్రబాబు మద్దతిచ్చుంటే ఈరోజు రాష్ట్రాన్ని విభజించే పరిస్థితి వచ్చేదికాదు.
 
 రాష్ట్ర విభజనకు కుట్రపన్నిన చంద్రబాబు, కాంగ్రెస్‌తో కుమ్మక్కై అసెంబ్లీ వేదికగా డ్రామా నడిపించారు. సమైక్య తీర్మానం కూడా చేయకుండా అడ్డగించారు.
 
 కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లో పనిచేస్తున్న సీఎం కిరణ్‌ను, టీడీపీ అధినేత చంద్రబాబు పల్లెత్తు మాట కూడా అనడంలేదు. కిరణ్ అవినీతిని బాబు ఎందుకు ప్రశ్నించడంలేదు?
 
 దొంగతనంగా పెడతారా?: వాసిరెడ్డి పద్మ
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని భారీ ఎత్తున ఉద్యమం సాగుతూంటే లెక్క చేయకుండా దొంగతనంగా దొడ్డిదారిన విభజన బిల్లును లోక్‌సభలోకి  ఎందుకు తెచ్చారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. గురువారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ బిల్లు వస్తుందో రాదోనన్న సందిగ్ధంలో ఉన్నపుడు చివరి నిమిషంలో అనూహ్యంగా తీసుకురావడాన్ని రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో కూడా ఎవరూ హర్షించరని అన్నారు. ఈ విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరి పూర్తిగా బయట పడిందని ఆమె విమర్శించారు. ఆరు నెలల క్రితం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లుగా ఆనాడే ఎమ్మెల్యేలు, మంత్రులంతా రాజీనామాలు చేసి ఢిల్లీలో ధర్నాకు కూర్చుని ఉంటే విభజన వ్యవహారం ఇంత దాకా వచ్చి ఉండేది కాదన్నారు. 

తొలి ఎంపీ జగనే

దుర్దినం: స్పీకర్‌కు జగన్ లేఖ
లోక్‌సభలో గురువారం జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని, ప్రజాస్వామ్యానికి ఇదొక దుర్దినమని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోకసభలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ స్పీకర్‌తో భేటీ సందర్భంగా జగన్ ఒక లేఖ ఇచ్చారు. ‘బిల్లును ప్రవేశపెట్టిన తీరు పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం. సభ ఎజెండాలో తెలంగాణ అంశం లేదు. బిజినెస్ లిస్ట్‌లో లేదు. ఇలా ముందుగా తెలుపకుండా బిల్లు ప్రవేశపెట్టడమైందని చెప్పడం పార్లమెంట్ సంప్రదాయం కాదు. పార్లమెంట్ సంప్రదాయాల పరిరక్షకులుగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడే వ్యక్తిగా ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లుగా మీరు అంగీకరించొద్దు.
 
 ఇది సాంకేతికంగా బిల్లు పెట్టినట్టు కానేకాదు. సభ్యులకు ముందస్తు సమాచారం లేకుండా ఇలా బిల్లు పెట్టే ప్రయత్నం చేయడం సరికాదు. పైగా బిల్లును ప్రవేశపెట్టకుండానే ‘ప్రవేశపెట్టాం’ అని చెప్పుకుంటున్నారు..’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. బిల్లుకు అవుననో, కాదనో చేతులెత్తకుండానే బిల్లును ప్రవేశపెట్టామని చెప్పడం సమంజసం కాదని వివరించారు. ఈ వాదనను పట్టించుకోని స్పీకర్ బిల్లును ప్రవేశపెట్టినట్లేనని చెప్పడంతో జగన్ అక్కడినుంచి వాకౌట్ చేశారు. సస్పెండయిన ఎంపీలు లేఖలిస్తే తీసుకోబోమంటూ జగన్ ఇచ్చిన లేఖను కూడా స్పీకర్ కార్యాలయం తిరస్కరించింది. దీంతో అదే లేఖను స్పీకర్ కార్యాలయానికి మెయిల్ ద్వారా జగన్ మరోమారు పంపారు.
 
 తొలి ఎంపీ జగనే
 తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టామని యూపీఏ సర్కారు చెప్పుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. బిల్లును ప్రవేశపెట్టడంపై గురువారం సభలో అందరికంటే ముందుగా లేచి అభ్యంతరం వ్యక్తం చేసిన ఎంపీ ఆయనే.

హొరెత్తిన గడపగడపకు వైఎస్సార్ సీపీ

హొరెత్తిన గడపగడపకు వైఎస్సార్ సీపీ
హొరెత్తిన గడపగడపకు వైఎస్సార్ సీపీ
 గుడివాడ, :
 గుడివాడ పట్టణంలో చేపట్టిన గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనం గురువారం పోటెత్తారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)కి ఘన స్వాగతం పలికారు. తొలుత  పెద ఎరుకపాడుకు చెందిన మాజీ కౌన్సిలర్ అడపా బాబ్జీ ఇంటి వద్ద నుంచి ప్రచారం ప్రారంభించారు. కార్మిక నగర్, చెంచుపేట తదితర ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే నేతలకే ఆదరణ ఉంటుందని, ఈ ప్రచారం ద్వారా రుజువైందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను మరింత సమర్థవంతంగా అమలు పరుస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ, 108, పేదలకు పక్కా ఇళ్లు నిర్మించే సత్తా జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు పలు సమస్యలు నాని దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన తక్షణమే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 26 వవార్డులో ఉన్న నిరుపేదలు, ముస్లింలు, మైనార్టీ వర్గాల వారు కొడాలి నాని వెంట కదిలారు. ప్రచారం అనంతరం పార్టీ సీనియర్ నేత పాలేటి చంటి ఇంటి వద్ద మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్నారు.
 పెద ఎరుకపాడులో జన సందోహం
 గురువారం మధ్యాహ్నం నుంచి పట్టణంలోని పెదఎరుకపాడులో  గడపగడపకు వైఎస్సార్ సీపీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వార్డు ప్రముఖుల నేతృత్వంలో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రయ్య కాలువ గట్టుమీదుగా ఈ ప్రచారం సాగింది. అనంతరం పెద ఎరుకపాడులోని దళిత యువకులంతా కొడాలి నానికి స్వాగతం పలికారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆపి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.  ఈ సందర్భంగా పెద ఎరుకపాడు యువకులు గూడపాటి ప్రకాష్, అబ్బూరీ దాసు తదితరులు మాట్లాడుతూ దిళితుల కమ్యూనిటీ హాలు శిథిలావస్థకు చేరిందని తెలిపారు. శ్మశానానికి వెళ్లే దారి లేదని చెప్పారు. వెంటనే నాని స్పందించి సొంత నిధులతో శ్మశానానికి దారి వేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు ఇంటివద్ద నానికి పూర్ణకుంభంతో వేదమంత్రాలతో ఘన స్వాగతం పలికారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు, డాక్టర్ కె.విజయ్‌కుమార్‌రెడ్డి, ఎం.వి.నారాయణరెడ్డి,  బాణావత్ ఇందిరారాణి, పెద్ది రమణ, పార్టీ టౌన్ కన్వీనర్ మరీదు కృష్ణమూర్తి, గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు,  పార్టీ నేత పాలేటి చంటి, మాజీ కౌన్సిలర్లు అడపా బాబ్జీ,  దారపురెడ్డి నాగలలిత,  చింతల భాస్కరరావు, బొజ్జగాని కోటమ్మ, సూరపనేని అజయ్, మూడెడ్ల ఉమా,   గంధం రాజేంద్ర ప్రసాద్, గణపతి లక్ష్మణరావు, వెంపల అప్పారావు,  తోట ప్రసాద్, సనపల ఆది (ఆది మిల్క్), మహిళా, యువజన, ఎస్సీ సెల్ పట్టణ కన్వీనర్లు కాటాబత్తుల రత్నకుమారి, లోయ రాజేష్, మెండా చంద్రపాల్, యూత్  జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బట్రాజు బ్రదర్స్, బార్ అసోసియేషన్ సెక్రటరీ కె.మురళి, వార్డుల నేతలు దారపురెడ్డి వాసు,  చంద్రగిరి శారద, వాసుపల్లి చంద్రమోహన్ (నాని), గూడపాటి ప్రకాష్, దారం ఉపేంద్ర, అన్నవరపు నోము, రేమల్లి నాని, సురేష్ పాల్గొన్నారు.

హిట్లర్ కంటే దారుణంగా...

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
జగన్ మండిపాటు.. నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపు
 
 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్పీకర్ కేవలం పది సెకన్లలో బిల్లును చదివి, అదే పది సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టామని చెప్పారని, దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పార్లమెంట్‌లో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజున పార్లమెంట్‌లో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. కొన్ని టీవీ చానళ్లలో స్పీకర్ వ్యాఖ్యలు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారని స్పీకర్ అంటున్నారు. వాస్తవానికి లోక్‌సభలో ప్రజాస్వామ్యం ఖూనీ మా అందరి ముందే జరిగింది. పదే పది సెకన్లలో స్పీకర్ వ చ్చారు.. వచ్చి బిల్లును ప్రవేశపెట్టడం అయిపోయిందని అన్నారు. బిల్లును సభలో పెట్టాలంటే.. అలా ప్రవేశపెట్టడం తమకు ఆమోదయోగ్యమో, కాదో చెబుతూ సభ్యులు చేతులు పెకైత్తాలి. చేతులు ఎంతమంది పెకైత్తారో చూసుకొని దాన్ని బట్టి బిల్లు ప్రవేశపెట్టామని లేక ప్రవేశపెట్టలేదు అని చెప్పాలి. కానీ సభలో సభ్యులు అవుననో, కాదనో చెప్పింది ఎక్కడ? అలాంటిది ఏమీ జరుగకుండానే పదే సెకన్లలో బిల్లు పెట్టేశారట. ఇంతకన్నా అన్యాయమైన ప్రజాస్వామ్యాన్ని ఎక్కడా చూడలేదు’ అని విమర్శించారు. గురువారం లోక్‌సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరిలతో కలిసి జగన్‌మోహన్‌రెడ్డి విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘ఢిల్లీలో 272 మంది ఎంపీలతో ప్రధాని కుర్చీలో కూర్చుంటే చాలు.. ఆ తర్వాత అడ్డగోలుగా ఏ రాష్ట్రాన్నైనా విభజిస్తామన్న కొత్త నడవడికకు నేడు నాంది పలుకుతున్నారు. ఇది అన్యాయం. దీన్ని అందరూ ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రతిఘటిస్తూ రేపు(శుక్రవారం) వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నాం’ అని తెలిపారు.
 
 హిట్లర్ కంటే దారుణంగా...
 
 బిల్లు పెట్టిన తీరుపై తాము స్పీకర్‌ను కలిస్తే.. బిల్లు పెట్టడం అయిపోయిందంటూ నిర్మొహమాటంగా చెప్పారంటూ జగన్ విమర్శించారు. ‘నేను, బీజేపీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అద్వానీ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన శైలేంద్ర కుమార్, జేడీయూ అధినేత శరద్ యాదవ్, ఏఐడీఎంకే నేత తంబిదొరైలు కలిసి స్పీకర్‌ను ఆమె చాంబర్‌లో కలిసి ఇలా బిల్లు ప్రవేశపెట్టడం చాలా అన్యాయమని చెప్పాం. అయితే స్పీకర్ మీరా కుమార్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, కేంద్ర హోంమంత్రి షిండే ముగ్గురూ కలిసి ‘బిల్లు పెట్టేశాం, అయిపోయింది’ అని నిర్మొహమాటంగా చెప్పారు. దీంతో నేను, సుష్మా, అద్వానీ, తంబిదొరై, రాజ్‌బబ్బర్ బయటకొచ్చేశాం’ అని జగన్ వెల్లడించారు.  ఏకంగా 16 మందిని సభ నుంచి సస్పెండ్ చేశారని, వారిలో 14 మంది సీమాంధ్రకు చెందినవారని చెప్పారు.
 
 పజాస్వామ్య పద్ధతుల్లో బిల్లు పెట్టకున్నా.. పెట్టినట్లు చెబుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం బతికుందా? లేదా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర కు చెందిన 14 మందిని సస్పెండ్ చేస్తే ఓటింగ్ జరిగితే ఎవరూ అడ్డుకోకుండా చేయాలనే ఓ పథకం ప్రకారం వ్యవహరించారని అన్నారు. నిజంగా హిట్లర్ ఇంత అన్యాయంగా చేస్తారో, చెయ్యరో తెలియదు కానీ మనదేశంలో సోనియాగాంధీ హిట్లర్‌ను మించి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వీళ్లు మనుషులా? రాక్షసులా? అని ప్రశ్నించారు. ఇటువంటి అన్యాయమైన విషయాన్ని మీడియా, సోషల్ మీడియా, ప్రతిపక్షాలు కలసిక ట్టుగా అడ్డుకోవాలని కోరారు. అలా చేయకుంటే నేడు ఏపీలో జరుగుతున్నదే రేప్పొద్దున తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్ లేదా మరో రాష్ట్రానికి జరుగుతుందని హెచ్చరించారు.
 
 లేదంటే రెండు ప్రాంతాలవాళ్లం దెబ్బతింటాం
 
 ఇదే సమయంలో లోక్‌సభలో ఎంపీలు కొట్టుకున్నారు, దీన్ని ఎలా చూస్తారు అని అడగ్గా ‘ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కొట్టుకున్నట్లు ఎవరో తీసిన వీడియో క్లిప్పింగ్‌లు చూస్తే తెలుస్తోంది. పొద్దున్నే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వచ్చారు. తన పార్టీకి చెందిన తెలంగాణ వారితోనూ, సీమాంధ్ర వారితోనూ మాట్లాడారు. ఇద్దరూ కలిసి మీ ఇష్టమొచ్చింది చేసుకోండని సూచించారు. అక్కడికి వెళ్లాక కొట్టుకున్నది ఎవరో కాదు, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, రమేశ్ రాథోడ్‌లే. టీడీపీకి చెందిన ఈ ఇద్దరే పార్లమెంట్‌లో కొట్టుకున్నట్లుగా వీడియోలో కనిపించింది’ అని జగన్ అన్నారు. ఇదే సమయంలో ఇలాంటి వ్యవస్థ మారాలని అన్నారు. ‘సమైక్యం అంటే దానర్థం తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర అని. మూడు ప్రాంతాల్లోనూ అన్నదమ్ములమని చెప్పేదే సమైక్యం. అందరం కలిసికట్టుగా ప్రయాణం చేయకుంటే.. బంగారంలాంటి రాష్ట్రం నాశనం అవుతుంది. రెండు ప్రాంతాల వారం దెబ్బతింటాం’ అని పేర్కొన్నారు.
 బీజేపీ కలిసొస్తుందన్న నమ్మకం ఉంది..
 
 విభజన బిల్లును వ్యతిరేకించే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ కలిసొస్తుందా అని అడగ్గా.. ‘బీజేపీ మాతో కలిసొస్తుందన్న నమ్మకం చాలా ఉంది. ప్రతిపక్షాలన్నీ జరుగుతున్న అన్యాయాన్ని చూశాయి. వారంతా ముందుకొస్తారని నమ్మకం ఉంది. ఈ రెండు రోజుల్లో మిగతా నాయకులను కలిసే ప్రయత్నం చేస్తాం. అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తాం. విభజనను ఆపేందుకు అంతా కలిసిరావాలి’ అని అన్నారు. చంద్రబాబు సైతం మీతో కలిసి రావాలని అంటున్నారా? అని ప్రశ్నించగా ‘ఆయన నోటితో జై సమైక్యాంధ్ర అంటూ ముందుకొచ్చి పార్టీ నేతలందరికీ ఒకే రకమైన విప్ జారీచేసే మార్పు ఆయనలో రావాలి. ఆయనలో మార్పు రావాలని, చరిత్రహీనుడిగా మారొద్దని దేవున్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా’ అని అన్నారు.

YS Jagan calls for state-wide bandh tomorrow

Written By news on Thursday, February 13, 2014 | 2/13/2014

లగడపాటి మంచి పనే చేశారు

లగడపాటి మంచి పనే చేశారు
న్యూఢిల్లీ : విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేసి మంచిపనే చేశారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లును ఎవరి ఆమోదం లేకుండానే లోక్ సభలో ప్రవేశపెట్టేసినట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించినప్పుడు ఆయన తనకు తోచినట్లుగా నిరసన వ్యక్తం చేయాలనుకున్నారని, అందుకోసమే పెప్పర్ స్ప్రే చేశారని చెప్పారు.

''లగడపాటి గారు చేసినది మంచిపని. పెప్పర్ స్ప్రే తీసుకుని కొట్టారు. దానివల్ల ఎవరికీ హాని జరగదు, ఎవరూ చనిపోరు. ఈ మధ్యకాలంలో అక్కచెల్లెమ్మలు ఒంటరిగా పోయేటప్పుడు తమ ఆత్మ రక్షణ కోసం దాన్ని తీసుకెళ్తున్నారు. అది చల్లినప్పుడు కాస్త కళ్లు మండుతాయి, దగ్గు వస్తుంది. అంతేగానీ, ఎవరూ చనిపోరు. అన్యాయాన్ని ప్రతిఘటించడానికి ఒక నిరసన వ్యక్తం చేయాలని ఆయన ఇలా చేసి చూపించారు. అదేం తప్పుకాదు'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ..

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ : పట్టపగలు పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ''ప్రజాస్వామ్యం బతికుందా లేదా అని ప్రశ్నిస్తున్నాను. హిట్లర్ కూడా ఇంత అన్యాయంగా చేస్తాడో లేదో నాకు తెలీదు. మన దేశంలో.. సాక్షాత్తు సోనియా గాంధీ గారు హిట్లర్ లా ప్రవర్తిస్తుంటే, వీళ్లు మనుషులా, రాక్షసులా అనిపిస్తోంది. అందరం కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. రేప్పొద్దున్న తమిళనాడుకైనా, కర్ణాటకకైనా, ఉత్తరప్రదేశ్ కైనా ఇలాగే చేస్తారు. ఇది చాలా చాలా అన్యాయం. దీన్ని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలి. రేపు వైఎస్ఆర్ సీపీ తరఫున రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నాం.

ఎంపీలు కొట్టుకోవడం ఇంతవరకు ఎప్పుడూ లేదు. వీడియో క్లిప్పింగులు ఒక్కసారి చూస్తే తెలుస్తుంది. చంద్రబాబు తెలంగాణ, సీమాంద్ర ప్రతినిధులతో మాట్లాడారు. ఇద్దరూ కలిసి ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నారు. అక్కడ కొట్టుకున్నది వేణు, రాథోడ్. ఇద్దరూ టీడీపీ వాళ్లే. వాళ్లలో వాళ్లే కొట్టుకున్నట్లు చిత్రీకరించారు. ఈ వ్యవస్థ మారాలి. సమైక్యం అంటే దానర్థం తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర. మూడు ప్రాంతాల వారు అన్నదమ్ముల్లా వెళ్లాలి. లేకపోతే బంగారం లాంటి రాష్ట్రం రెండువైపులా దెబ్బతింటుంది. బీజేపీ మాతో కలిసొస్తుందన్న నమ్మకం చాలా ఉంది. జరుగుతున్న అన్యాయం చూసి ప్రతిపక్షాలన్నీ కూడా కలిసొస్తాయన్న నమ్మకముంది. ప్రతి ఒక్కరినీ కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తాం. నేనొక్కడినే కాదు.. అందరూ కలిసి ఆపుదాం. చంద్రబాబు ఇప్పటికైనా తన నోటి నుంచి 'జై సమైక్యాంధ్ర' అనే ఒక్క మాట అని, రెండు ప్రాంతాలకు మేలు చేసేలా ఆయన ప్రవర్తన, మనసు మారాలని దేవుడిని ప్రార్థిస్తున్నా'' అని ఆయన అన్నారు.

రేపు రాష్ట్ర బంద్ కు జగన్ పిలుపు


తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్ర బంద్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సెకన్లలో తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టేశారని ఆయన తెలిపారు.

బిల్లు పెట్టడానికి ఎవరూ ఆమోదం తెలపకపోయినా కాంగ్రెస్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు కలిసి రావాలని ప్రచార సాధనాలు, ప్రతిపక్షాలను కోరారు.

బిల్లు ప్రవేశపెట్టిన తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని జగన్ తెలిపారు. విభజన బిల్లును అడ్డుకోవడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. బిల్లు ఓటింగ్‌కు వచ్చేంతవరకూ దాన్ని అడ్డుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని చెప్పారు. ఇందుకోసం ప్రతి ఎంపీ సహకారాన్ని అర్థిస్తామని జగన్ తెలిపారు.

18మంది ఎంపీల సస్పెన్షన్

సభలో ఆందోళన చేస్తున్నారంటూ 18 మంది ఎంపీలపై స్పీకర్ మీరాకుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే స్పీకర్ మీరాకుమార్.... సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రకటించారు. 374(ఎ) సెక్షన్ కింద వారిని ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు.  ఎంపీలను  సస్పెండ్ అయిన ఎంపీల వివరాలు:

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ :
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
మేకపాటి రాజమోహన్ రెడ్డి
ఎస్ పీవై రెడ్డి

కాంగ్రెస్ :
రాయపాటి సాంబశివరావు
సబ్బం హరి
లగడపాటి రాజగోపాల్
అనంత వెంకట్రామిరెడ్డి
ఉండవల్లి అరుణ్ కుమార్
కనుమూరి బాపిరాజు
మాగుంట శ్రీనివాసరెడ్డి
సాయిప్రతాప్
కోమటిరెడ్డి రాజగోపాల్
గుత్తా సుఖేందర్ రెడ్డి
పొన్నం ప్రభాకర్

టీడీపీ :
శివప్రసాద్
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
కొనకళ్ల నారాయణ
నిమ్మల కిష్టప్ప

రాజీనామా అంటూ నాటకాలా ?

రాజీనామా అంటూ నాటకాలా ?
చిత్తూరు : రాష్ట్ర విభజనకు సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులు సహకరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా ఆరోపించారు. గురువారం చిత్తూరులో రోజా మాట్లాడారు. రాష్ట్ర విభజనపై వారిద్దరు అవలంభించిన వైఖరిపై రోజా ఈ సందర్భంగా దుమ్మెత్తిపోశారు. తాను తెలంగాణకు అనుకూలం అంటూ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చి సహకరించారని గుర్తు చేశారు.
 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసినప్పుడు నోరు మెదపని సీఎం ఇప్పుడు రాజీనామా అంటూ నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. అంధ్రప్రదేశ్ ను సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అకుంఠిత దీక్షతో పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తిగా రోజా అభివర్ణించారు

Jagan meets Advani


YSR Congress president and Kadapa MP, Jaganmohan Reddy met veteran BJP leader L.K. Advani and urged the BJP not to support the AP Reorganisation Bill in Parliament.
It is learnt that Mr. Jagan wanted the BJP not to fall into Congress’ trap and listed various infirmities in the Bill and the need to carry out constitutional amendments on issues relating to common capital and Article 371 (d).
Mr. Jagan was closeted with Mr. Advani for about 

http://www.thehindu.com/todays-paper/jagan-meets-advani/article5683366.ece

మా చిత్తశుద్ధినా టీడీపీ ప్రశ్నించేది ?

మా చిత్తశుద్ధినా టీడీపీ ప్రశ్నించేది ?అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న శోభా నాగిరెడ్డి
హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి సమర్థవంతమైన నాయకుడు లేని లోటు నేడు స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్ఆర్ సీపీ స్పీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి వెల్లడించారు. ఆ మహానేత ఉండి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. ఆయన అకాల మరణంతో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందన్నారు.
 
గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ...రాష్ట్ర విభజనపై ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ నేతల డ్రామాలు చూసి జాతీయ నేతలు నవ్వుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ తో కుమ్మకైన మీరా మమ్మల్నీ ప్రశ్నించేది అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులపై శోభానాగిరెడ్డి నిప్పులు చెరిగారు.
 
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేత సమైక్యమన్న మాట అనిపించ గలిగే దమ్ము, ధైర్యం ఆ పార్టీ సీమాంధ్ర టీడీపీ నేతలకు ఉందా అని శోభా నాగిరెడ్డి ఈ సందర్భంగా సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా ఉంచే క్రమంలో తమ పార్టీ చిత్తశుద్ధిని ప్రశ్నించే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు.

లోక్ సభలో వైఎస్ఆర్ సీపీ అవిశ్వాస తీర్మానం

లోక్ సభలో వైఎస్ఆర్ సీపీ అవిశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి  యుపిఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి అవిశ్వాస తీర్మానం నోటీసును గురువారం స్పీకర్ కు అందజేశారు. మరోవైపు టీడీపీ సీమాంధ్ర ఎంపీలు కూడా సభలో అవిశ్వాస తీర్మానం ఇచ్చారు.
నర్సరావు పేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నివాసంలో ఎంపీలు భేటీ అయ్యారు. సభలో తెలంగాణ బిల్లును అడ్డుకునే అంశంపై చర్చించారు. సభలో బిల్లును అడ్డుకుంటామని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ సాయి ప్రతాప్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇచ్చారు.

జగన్‌తోనే రాష్ట్రంలో స్వర్ణయుగం

జగన్‌తోనే రాష్ట్రంలో స్వర్ణయుగం
జగన్‌తోనే రాష్ట్రంలో స్వర్ణయుగం
 
 చావలి(వేమూరు)
 రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితోనే స్వర్ణయుగం రాబోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జున అన్నారు. మండలంలోని చావలి గ్రామంలో బుధవారం  గడపగడపకూ వైఎస్సార్‌సీపీ ప్రచారం నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ  ప్రతి ఒక్కరి కళ్లల్లో ఆనందం చూడాలంటే జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం ఆది నుంచి పట్టువీడని విక్రమార్కుడిలా పోరాడుతున్న ఏకైక వ్యక్తి కూడా జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనన్నారు.
 
గ్రామంలో పార్టీ కరపత్రాలు పంచారు. కార్యక్రమంలో వేమూరు, భట్టిప్రోలు మండలాల పార్టీ కన్వీనర్లు చందోలు డేవిడ్‌విజయ్‌కుమార్, పడమట వెంకటేశ్వరరావు, మండల యువజన కన్వీనర్ గాజుల భాను, పార్టీ నాయకులు గాజుల పట్టాభిరామయ్య, మాజీ సర్పంచ్ చవ్వాకుల రాఘవరావు, బిట్రగుంట సత్యనారాయణ, గోపాలం రాము, ఉప సర్పంచ్‌లు సోమరౌతు సాంబశివరావు, ఈపూరి కృపావరప్రసాదు, తలతోటి జిగినిబాబు, విష్ణుమొలకల వెంకటేశ్వరరావు, దొప్పలపూడి జ్యోతిబాబు, కూచిపూడి రవిబాబు, బోడపాటి రాంబాబు, తోటకూర సత్యనారాయణ, నీటి సంఘాల మాజీ అధ్యక్షుడు యక్కటి పాములు, సోమరౌతు సాంబశివరావు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు యల్లమాటి దేవసహాయం, కూచిపూడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
గడపగడపకూ వైఎస్సార్‌సీపీ ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి చావలిలో నిర్వహించిన కార్యక్రమంలో  డాక్టర్ మేరుగ నాగార్జున సమక్షంలో 500 మంది గ్రామస్తులు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో గ్రామ ఉపసర్పంచ్ సోమరౌతు సాంబశివరావు, యల్లమాటి  సునంద, చావలి నీలిమ, బొర్రా శ్రీనివాసరావు, బలగాని వీరాంజనేయులు, చొప్పర ఆనందపాల్, విష్ణుమొలకల వెంకటేశ్వరరావు, తోటకూర సత్యనారాయణ తదితరులు చేరారు.

రేపటి నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి పాదయాత్ర

 కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శుక్రవారం నుంచి పాదయాత్ర చేయనున్నారు. తొలుత మండలంలోని తీర ప్రాంత పంచాయతీ రామచంద్రాపురం నుంచి ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు.
 
 పాదయాత్ర ఇలా
 రామచంద్రాపురం పంచాయతీలోని పొన్నపూడి పెదపాళెంలో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కొత్తూరు, దళితవాడ, లక్ష్మీపురం, ప్రశాంతగిరి, వెంకటనారాయణపురం, పొన్నపూడి, బుసిగాడిపాళెం, గిరిజనకాలనీ, చంద్రశేఖరపురం, రవీంద్రపురం, రామచంద్రాపురం వరకు సాయంత్రం ఐదు గంటల దాకా నిర్విరామంగా పాదయాత్ర సాగుతుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంతో పాటు స్థానిక సమస్యలు ఆయన తెలుసుకుంటారు.
 
 15వ తేదీ మండలంలోని దండిగుంట, వరిణి, వీరారెడ్డిపాళెం, గాదెలదిన్నె గ్రామాల్లో పాదయాత్ర సాగుతుంది. 16, 17, 18వ తేదీల్లో కోవూరు , 22, 23 తేదీల్లో బుచ్చిరెడ్డిపాళెం , 24, 25 తేదీల్లో కొడవలూరు , 26, 27, 28 తేదీల్లో ఇందుకూరుపేట మండలాల్లో పాదయాత్ర సాగుతుంది. ఈ పాదయాత్రకు కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, ఇందుకూరుపేట మండలాల నుంచి భారీగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు.  

చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో భారీగా ఓట్ల తొలగింపు

చీరాల, పర్చూరు, న్యూస్‌లైన్: ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచిపట్టున్న గ్రామం. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో  వైఎస్సార్ సీపీ బలపరచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో మొత్తం 640 మంది ఓటర్లున్నారు. అయితే తాజాగా గ్రామంలోని పోలింగ్ కేంద్రం నం.175 పరిధిలో ఏకంగా 159 ఓట్లు తొలగించారు. వీరి తొలగింపునకు సంబంధించి ఎలాంటి దరఖాస్తులు చేయలేదు. బీఎల్వో విచారణ కూడా చేపట్టలేదు. అయినా జాబితాలో ఓట్లు మాత్రం తీసేశారు. ఈ జాబితా చూసిన గ్రామస్తులు అవాక్కయ్యారు. అన్ని విధాలా
 అర్హత ఉన్నా ఓట్లు తొలగించడంపై పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బుధవారం పర్చూరు తహసీల్దార్ కార్యాలయానికి గుర్తింపు కార్డులతో వచ్చి నిరసనకు దిగారు.

 వేటపాలెం మండలం వడ్డెరసంఘం, ప్రసాద్‌నగరంలోని 141వ నంబరులోని పోలింగ్ బూత్‌లో మొత్తం 948 ఓట్లు ఉండగా ఎలాంటి కారణం చూపకుండా వరుసగా 470 మంది ఓట్లను తొలగించారు.

 చీరాల రూరల్ మండలం గవినివారిపాలెం గ్రామంలో గత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన 350 మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి.

 చీరాల పట్టణంలోని పదో వార్డుకు చెందిన షేక్ సుబాని రెండుసార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు. అతని ఓటును తీసేశారు.

 పాపాయిపాలేనికి చెందిన వార్డు సభ్యుడు ఆతిని చినవెంకటేశ్వర్లు ఓటూ జాబితాలో గల్లంతైంది. అదే గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ భర్త గవిని పోతురాజు గత పంచాయతీ ఎన్నికల్లో ఓటువేశాడు. ప్రస్తుతం ఓట్ల జాబితాలో ఆయన పేరు లేదు.
 ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా పల్లె..పట్నం అన్న తేడా లేకుండా బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపడంతో పాటు ఏ కారణం లేకుండా వేలాది ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. అధికార పార్టీకి అనుకూలంగా లేని వారి ఓట్లనే ఎక్కువగా తీసేశారు. అధికార పార్టీ అండదండలున్న అధికారులు, సిబ్బంది ప్రమేయంతోనే ఈ ఓట్లు తొలగించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 ఓట్ల తొలగింపుపై అధికారులు, బూత్‌లెవల్ ఆఫీసర్లు చెబుతున్న మాటలు వింటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. గవినివారిపాలెంలోని 23వ బూత్‌కు బూత్‌లెవల్ అధికారిగా ఉన్న ప్రేమ్‌కుమార్ ఏం చెబుతున్నారంటే తన బూత్ పరిధిలో కేవలం నాలుగు ఓట్లు మాత్రమే తిరస్కరించినట్లు నివేదిక ఇచ్చానని, కానీ జాబితా వచ్చాక చూస్తే 20 ఓట్లు తిరస్కరించినట్లు ఉందని చెప్పారు. ఓట్ల తొలగింపునకు, తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు.  


 చీరాల తహసీల్దార్ బీ సాంబశివరావు నియోజకవర్గంలో 4,500 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయని, అందులో 2 వేల ఓట్లను బూత్‌లెవల్ అధికారులు, వీఆర్వోలు ఇచ్చిన నివేదికల మేరకే తొలగించామని చెప్పారు. మిగిలిన ఓట్లు తాము తొలగించకపోయినా జాబితాలో తొలగించినట్లుగా రావడం తమకే అర్థం కావడం లేదన్నారు. కంప్యూటర్‌లో సాంకేతిక లోపం కావచ్చని అనడం చూస్తే ఓట్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలు ఇట్టే స్పష్టమవుతున్నాయి. చీరాల రూరల్ గ్రామాలైన అక్కాయిపాలెం, గవినివారిపాలెం, పాపాయిపాలెం, బోయినవారిపాలెం, దేవినూతల, దేశాయిపేటల్లో అధికంగా ఓట్లు గల్లంతయ్యాయి.

 చీరాల నియోజకవర్గంలో చీరాల పట్టణంతో పాటు చీరాల రూరల్, వేటపాలెం మండలాల్లో మొత్తం 198  పోలింగ్ కేంద్రాలున్నాయి. నియోజకవర్గంలో 1,78,502 మంది ఓటర్లున్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం ఎన్నికల కమిషన్ కొత్త ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఓట్ల నమోదు కార్యక్రమం డిసెంబర్‌తో ముగిసింది. అయితే కొత్త ఓటరు జాబితాను స్థానిక అధికారులు బయట పెట్టడంలేదు. కేవలం ప్రతిపక్ష పార్టీలకు హైదరాబాద్ నుంచి ఓటర్ల జాబితాలు అందాయి. వీటిని పరిశీలించిన నాయకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

 అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల ఓట్లతో పాటు అక్కడక్కడా టీడీపీకి చెందిన వారి ఓట్లు సైతం తొలగించారు. అయితే మొత్తం ఎన్ని వేల ఓట్లు తొలగించారని అధికారికంగా తేలకపోయినా పది వేలకు పైగా ఓట్లు తొలగించినట్లు సమాచారం. ముఖ్యంగా గత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారి ఓట్లు తొలగించిన జాబితాలో అధికంగా ఉన్నాయి. దీంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన లకు సిద్ధమవుతోంది. కేవలం అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ ఓట్ల జాబితా రూపొందిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

  ఈ వ్యవహారంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పాలేటి రామారావు, కార్యకర్తలు ఇప్పటికే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు ఉడ్‌నగర్‌లోని స్థానిక తహశీల్దార్ ఇంటిని ముట్టడించి ఆందోళన నిర్వహించారు. తమ ఓట్లను ఎందుకు తొలగించారో చెప్పాలని మాజీ మంత్రి పాలేటి రామారావు డిమాండ్ చేశారు. అలానే నియోజకవర్గంలో జరిగిన ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్‌తో పాటు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు.  

 వైఎస్సార్ సీపీ కార్యకర్తలే లక్ష్యంగా...
 పర్చూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఓట్లే లక్ష్యంగా తొలగించినట్లు తేటతెల్లమవుతోంది. 500 ఓటర్లకు మించి లేని గ్రామాల్లో సైతం వంద ఓట్లకుపైగా తొలగించడం..పంచాయతీల్లో ఉన్న ఓట్లలో కూడా వందల సంఖ్యలో ఓట్లు జాబితాల్లో మాయం కావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఆగ్రహం పెళ్లుబికింది.  నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 1828 ఓట్లు తొలగించారు. వీటిల్లో అధిక శాతం వైఎస్సార్ సీపీకి పట్టున్న గ్రామాలే కావడం గమనార్హం. దళితుల ఓట్లు కూడా అధిక సంఖ్యలో తొలగింపుల జాబితాలో చేరాయి.


 ఇలాంటి సంఘటనే పర్చూరు మండలం రమణాయపాలెంలో కూడా చోటుచేసుకుంది. ఈ గ్రామంలో 485 మంది ఓటర్లకు గాను 121 ఓట్లు ఎలాంటి దరఖాస్తులు, విచారణ లేకుండా తొలగించారు. వాటిలో పది ఓట్లు మరణించిన వారివి కాగా మిగతా ఓటర్లందరూ నూరుశాతం అర్హులే. చిన్న గ్రామంలో ఒకేసారి 111 మందిని జాబితాలో తొలగించడాన్ని బట్టి చూస్తే సైబర్ నేరం ఏ స్థాయిలో జరిగిందో తేటతెల్లమవుతోంది.

ఇదే విధంగా పర్చూరు మండలంలోని నూతలపాడు, బోడవాడ, ఉప్పుటూరు, ఇంకొల్లు మండలంలోని భీమవరం, ఇడుపులపాడు, గొల్లపాలెం, ఇంకొల్లు, మార్టూరు మండలంలోని కోలలపూడి, కోనంకి, నాగరాజుపల్లి, ఇసుకదర్శి, మార్టూరు, వలపర్ల, యద్దనపూడి మండలంలోని యద్దనపూడి, జాగర్లమూడి, చినగంజాం మండలంలో మున్నంవారిపాలెం, రాజుబంగారుపాలెం, కారంచేడు మండలంలోని స్వర్ణ, యర్రంవారిపాలెం గ్రామాల్లో ఓటర్ల జాబితాల్లో భారీగా ఓట్లు తొలగించారు.

 అసలేం జరిగిందంటే...
 ఆన్‌లైన్ ఓటరు తొలగింపులు, సవరణలు, చేర్పులకు సంబంధించిన పాస్‌వర్డ్ ఆధారంగానే ఈ తతంగం జరిగినట్లు నిర్ధారణవుతోంది. కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ సిబ్బంది ద్వారానే అక్రమాలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 23 నాటికి వచ్చిన దరఖాస్తులన్నింటినీ బీఎల్వోలు విచారించి ఇచ్చిన జాబితాపై 31న తుదిజాబితా రూపొందించారు. ఈ మధ్యకాలంలో దరఖాస్తులు, బీఎల్వోల విచారణతో పనిలేకుండానే ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించారు. కొన్ని చోట్ల చేర్పులు కూడా జరిగాయి.

ఇప్పటికే అధికారులు నిర్ధారించిన దాని ప్రకా రం మార్టూరు మండలంలో 715, యద్దనపూడి మండలంలో 30, పర్చూ రు మండలంలో 178, కారంచేడు మండలంలో 50, ఇంకొల్లు మండలంలో 624, చినగంజాం మండలంలో 231 ఓట్ల చొప్పున సైబర్ నేరం ద్వారా తొలగించినట్లు ధ్రువీకరించారు.

 లోపాలు జరిగిన మాట వాస్తవమే...
 జిల్లా ఎలక్ట్రోరల్ అధికారి  కే మోహన్‌కుమార్
 ఎన్నికల జాబితాల్లో లోపాలు జరిగిన మాట వాస్తవమేనని జిల్లా ఎలక్ట్రోరల్ అధికారి కే.మోహన్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్రరాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామని, లోపాలను వీలైనంత త్వరగా సవరిస్తామని చెప్పారు. వీటిపై ఇప్పటికే విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. మోసానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

అన్ని రాజకీయ పార్టీల నుంచి వివరాలు సేకరిస్తున్నామని ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తామన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే అద్దంకి, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తలు గొట్టిపాటి రవికుమార్, గొట్టిపాటి భరత్‌లు కలెక్టరును కలిసి వివరించారు. బుధవారం హైదరాబాద్‌లో గొట్టిపాటి భరత్ ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలిసి జరిగిన అక్రమాన్ని వివరించారు.

Popular Posts

Topics :