06 October 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

'సీమాంధ్రులను పోలీసులు అవమానించారు'

Written By news on Saturday, October 12, 2013 | 10/12/2013

'సీమాంధ్రులను పోలీసులు అవమానించారు'
హైదరాబాద్: సంఘ విద్రోహ శక్తులంటూ సీమాంధ్రులను పోలీసులు అవమానించారని వైఎస్సార్ సీపీ నేత శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ సమైక్య శంఖారావం సభకు అనుమతిని నిరాకరిచడం సీమాంధ్ర ప్రజలను అవమానించడామేనన్నారు. సభకు అనుమతి నిరాకరణపై మీడియాతో ఆమె మాట్లాడారు.  సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఓ గేమ్ ను ఆడుతుందని.. ఆ గేమ్ లో భాగంగానే సభకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు. 
 
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఏపీ భవన్ లో దీక్ష దిగిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.  చంద్రబాబుకు ఏపీ భవన్ లో అనుమతి ఇచ్చి.. సమైక్య సభకు హైదరాబాద్ లో అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.

తుపాన్ సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొనండి

https://www.facebook.com/ysrcpofficial
తుపాను సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు  పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి పిలుపు ఇచ్చారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నేతలతో ఆయన ఫోన్ లో మాట్లాడారు.

 ఉత్తరాంధ్ర జిల్లాలలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోయాయి. ఈ జిల్లాలో ఎక్కువ భాగం అంథకారంలో ఉంది. సహాయ కార్యక్రమాలలో పార్టీ నేతలు చురుకుగా పాల్గొనాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నెల రోజుల్లోనే రెండు సార్లు నిరవధిక నిరాహార దీక్ష చేసిన శ్రీ జగన్‌ ఆరోగ్యం బాగా దెబ్బతిన్న కారణంగా కొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నిమ్సు వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయమే నిమ్సు ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఆయన పై లిన్‌ తుపాను ప్రభావం రాష్ట్రంలోని లక్షలాది మందిపై పడుతుందన్న వార్తలతో కలత చెందారు. దీనితో ఈ ఉదయం నుంచే ఆయన ఆయా జిల్లాల ఇన్‌చార్జిలతో ఫోన్‌లో మాట్లాడారు. ధర్మాన కృష్ణదాసు (శ్రీకాకుళం), పెన్మత్స సాంబశివరాజు, సుజయ కృష్ణ రంగారావు (విజయనగరం), కొణతాల రామకృష్ణ, వంశీకృష్ణ శ్రీనివిస్ (విశాఖపట్నం), టి. బాలరాజు (పశ్చిమ గోదావరి), కుడుపూడి చిట్టబ్బాయి (తూర్పు గోదావరి)లతో శ్రీ జగన్‌ మాట్లాడారు.


కాగా, పై లిన్‌ ప్రభావిత జిల్లాల నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, నాయకులతో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ కూడా ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్కారు.

POLICE DENIAL TO JAGAN MEETING IRKS YSRCP

POLICE DENIAL TO JAGAN MEETING IRKS YSRCP

.
The Hyderabad police on Saturday denied the permission for YSR Congress Party president YS Jagan Mohan Reddy's proposed 'Samaikya Sankharavam' meeting in Hyderabad.
Jagan proposed to hold a massive public meeting in Hyderabad on October 19 to oppose the bifurcation of Andhra Pradesh.
YSR CP moved a petition in the High court seeking court permission for the meeting. Responding to the petition, the court directed the West Zone DCP to submit his opinion before October 12.
The West Zone DCP in his three -page letter to YSR CP rejected the permission for the meeting citing law and order problems.
Taking serious exception on the police denial to the meeting, YSR CP leaders accused the police of biased attitude.
"It is absolutely against the spirit of democracy. When the meetings of Modi, Telangana Congress, AP NGOs and TJACs were not problematic to the law and order situation, how could our meeting be a threat to it? We will definitely seek the court to get permission," they said.
- Sakshipost

'ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి సభకు అనుమతి తెచ్చుకుంటాం'

పోలీసుల ద్వంద వైఖరి.. 'సమైక్య శంఖారావం' సభకు నిరాకరణవిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
హైదరాబాద్ : సభలకు అనుమతి మంజూరు చేసే విషయంలో రాష్ట్ర పోలీసులు అవలంభిస్తున్న వైఖరి విమర్శలకు తావిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో నిర్వహించదలచిన 'సమైక్య శంఖారావం' సభకు శాంతి భద్రతల సమస్య సాకుతో అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం, పోలీసులు కలసి ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి సభకు అనుమతి తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తర్వాత హైదరాబాద్ లో నాలుగు సభలకు అనుమతిచ్చారని, జగన్ సభకు శాంతిభద్రతల సమస్య పేరుతో అనుమతి నిరాకరించడం విడ్డూరమని ధ్వజమెత్తారు. బీజేపీ నేత నరేంద్ర మోడీ, ఏపీఎన్జీవోల సమావేశాలు నిర్వహించినపుడు వైసీపీకి ఎందుకు అనుమతివ్వరని జూపూడి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాది ముసుగులో ఉన్న విభజన వాదని, కుట్రలో భాగంగానే శాంతియుత పద్ధతిలో నిర్వహించదలచిన సభను అడ్డుకున్నారని మరో నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

నిమ్స్ నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జ్

నిమ్స్ నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జ్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం ఉదయం నిమ్స్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో నిమ్స్ కు తరలివచ్చారు. జై జగన్‌  అంటూ నినాదాలతో హోరెత్తించారు.  జగన్ సతీమణి వైఎస్ భారతి, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పలువురు నిమ్స్ కు వచ్చారు.

కీటోన్స్‌ మినహా... చక్కెరస్థాయి తదితరాలన్నీ సాధారణస్థాయికి వచ్చినట్టు  వైద్యపరీక్షల్లో తేలటంతో వైద్యులు...జగన్ ను డిశ్చార్జ్‌ చేశారు.  కీటోన్స్‌ సాధారణంగా జీరో శాతం ఉండాలని, ఈ స్థాయికి చేరుకునేందుకు మరో రెండు, మూడురోజులు పట్టే అవకాశముందని వైద్యులు శనివారం తెలిపారు. మూడు రోజుల పాటు విశ్రాంతి  తీసుకోవాలని సూచించారు.

సమైక్యాంధ్ర డిమాండ్‌తో  ఐదు రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన జగన్‌ ఆరోగ్యం క్షీణించటంతో ఈనెల 9న అర్ధరాత్రి పోలీసులు బలవంతంగా నిమ్స్‌కు తరలించారు. అయితే జగన్‌ తీవ్రంగా ప్రతిఘటించినా వైద్యులు బలవంతంగా  ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు.  ఆయన ఎంత ప్రతిఘటించినా పోలీసులు, వైద్యులు కలసి జగన్‌ దీక్షను భగ్నం చేశారు.

విస్తుగొలిపిన బాబు ఆరోగ్యం

విస్తుగొలిపిన బాబు ఆరోగ్యం
న్యూఢిల్లీ: నాలుగురోజులు నిరవధిక దీక్ష చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య వివరాలను అటు వైద్యులు కానీ, ఇటు పార్టీవారు కానీ పూర్తిగా బయటకు చెప్పకపోవడడం అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని, ఆసుపత్రికి తరలించాలంటూ జేడీ (హాస్పిటల్స్), డీసీపీ (న్యూఢిల్లీ), రెసిడెంట్ కమిషనర్ (ఏపీభవన్), డీజీహెచ్‌ఎస్ (న్యూఢిల్లీ)కు గురువారం రాం మనోహర్ లోహియా (ఆర్‌ఎంఎల్) ఆస్పత్రి డెరైక్టర్ నుంచి లేఖలు వెళ్లాయి. బాబు ఆరోగ్యం క్షీణించిందనే విషయం తప్ప, ఇతరత్రా వివరాలేవీ లేఖలో లేవు. అయితే శుక్రవారం బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆర్‌ఎంఎల్ నుంచి కేంద్రానికి వెళ్లిన నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘నిరవధిక దీక్షలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు శుక్రవారం ఉదయం 10.19 గంటలకు ఆర్‌ఎంఎల్ ఆసుపత్రి వైద్యులు దీక్ష శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఇచ్చిన ప్రాథమిక ఆరోగ్య నివేదిక (ఓపీడీ రిజిస్ట్రేషన్ నంబరు 20130711950) ప్రకారం.. చంద్రబాబు ఏడవ తేదీ నుంచి దీక్షలో ఉన్నారు.
 
 ఆయనకు వికారం, వాంతులు, తలనొప్పి, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు బైర్లు కమ్మడం, చెమట పట్టడం, ఆందోళనగా ఉండడం వంటి సమస్యలేవీ లేవు. పల్స్ రేటు నిమిషానికి 82గా ఉంది. ఇది సాధారణం, మంచి పరిమాణం (గుడ్ వాల్యూమ్). రెస్పిరేటరీ రేటు సాధారణంగా ఉంది. రక్తపోటు 140/80. గ్లూకో మీటర్‌తో పరీక్షించగా బ్లడ్‌షుగర్ 83 ఎంజీగా ఉంది..’ ఇదీ ఆ నివేదిక సారాంశం. వాస్తవానికి చంద్రబాబు దీక్ష ప్రారంభించిన తర్వాత మూడోరోజైన బుధవారం నాడు సుగర్ లెవల్స్ 75 ఎంజీగా ఉన్నట్లు టీడీపీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. గురువారం సాయంత్రానికి చక్కెర స్థాయి 79 ఎంజీగా నమోదైందని చెప్పారు. తాజాగా శుక్రవారం ఆర్‌ఎంఎల్ వైద్యులు పరీక్షలు జరపగా చక్కెర స్థాయి 83 ఎంజీగా నమోదు అయ్యింది. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు మొత్తం నాలుగురోజులు దీక్ష చేశారు. సుగర్ లెవల్స్ నానాటికీ తగ్గుతూ శుక్రవారానికి బాగా పడిపోవాల్సి ఉండగా రోజురోజుకూ పెరగడం వెనుక రహస్యం ఏమిటని ఢిల్లీలోని దేశం నాయకుడొకరు విస్మయం వ్యక్తం చేశారు.

పై-లీన్ తుపాను వేగం.. దేశంలో సగం సైజు!

పై-లీన్ తుపాను వేగం.. దేశంలో సగం సైజు!


* ఒడిశా, ఉత్తరాంధ్రలను వణికిస్తున్న ‘ఇంద్రనీలం’
* నేటి సాయంత్రం తీరం తాకనున్న పెను తుపాను
* పారాదీప్ - కళింగపట్నం మధ్య తీరం దాటనున్న పై-లీన్
* శ్రీకాకుళం సహా ఒడిశాలోని నాలుగు జిల్లాలకు పెను ముప్పు
* గంటకు 220 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి
* తీరం దాటేటపుడు 25 సెంటీమీటర్ల వర్షపాతం అంచనా
* విశాఖ - ఒడిషాల మధ్య నేడు రైలు సర్వీసులు రద్దు

 
 ప్రస్తుతం ఎక్కడుంది?
 పై-లీన్ తుఫాను శుక్రవారం సాయంత్రానికి గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. థాయ్ భాషలో ‘పై-లీన్’ అంటే ఇంద్రనీలం అని అర్థం.
 
 దూసుకొచ్చేదెప్పుడు?
 శనివారం సాయంత్రం ఒడిశాలోని పారాదీప్ - ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం (శ్రీకాకుళం జిల్లా) మధ్య ఈ పెను తుపాను తీరాన్ని తాకనుంది. గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్ వద్ద ఇది తీరం దాటుతుంది.
 
 ఏ జిల్లాలకు నష్టం?
 తీరం దాటే సమయంలో గంటకు 220 కి.మీ వేగంతో పెను గాలులు వీస్తాయి. ఈ సమయంలో సముద్రం మూడు మీటర్ల వరకూ ఉప్పొంగుతుంది. తక్కువ సమయంలోనే 25 సెంటీమీటర్ల వర్షపాతం కురవవచ్చు. ఒడిశాలోని గంజాం, ఖుర్దా, పూరి, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
 
 పెను ముప్పు?
 1999లో ఒడిశాను వణికించిన తుపాను 9,885 మందిని బలితీసుకుంది. గంటకు 220 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. తాజా తుపాను గాలుల వేగం 240 కి.మీ.పైగా ఉండొచ్చని అమెరికా అంచనా.
 
 కుండపోతే!
 వచ్చే 48 గంటల్లో ఉత్తరాంధ్రలో రోజుకు 25 సెం.మీ. వరకూ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురవవచ్చు.
 
 
భువనేశ్వర్/విశాఖపట్నం/హైదరాబాద్, సాక్షి:  పెను తుపాను పై-లీన్ పడగ విప్పుతోంది. తూర్పు తీరాన్ని కబళించేందుకు వేగంగా దూసుకొస్తోంది. శనివారం సాయంత్రం ఒడిషాలోని పారాదీప్ - ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం మధ్య ఈ పెను తుపాను తీరాన్ని తాకనుంది. గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్ వద్ద ఇది తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తీరం దాటే సమయంలో దాదాపు గంటకు 220 కిలోమీటర్ల వరకూ వేగంతో పెను గాలులు వీస్తాయని హెచ్చరించింది. అతి తక్కువ సమయంలోనే దాదాపు 25 సెంటీమీటర్ల వర్షపాతం కురవవచ్చని వెల్లడించింది.
 
ఈ తుపాను ఒడిషాలోని ఐదు తీర ప్రాంత జిల్లాలతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో అపార విధ్వంసం సృష్టించనుందని అప్రమత్తం చేసింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు నిలువెల్లా వణికిపోతున్నారు. అధికార యంత్రాంగం ఒడిషాలోని 14 తీర జిల్లాలతో పాటు.. ఉత్తరాంధ్రలోని లోతట్టు ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలు, జాతీయ విపత్తు సహాయ దళం, సైనిక బలగాలు, వాయుసేనలు.. తుపాను ప్రభావంతో ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు, సహాయ చర్యలు చేపట్టేందుకు సన్నద్ధంగా ఉన్నాయి.  8 ఓడ రేవుల్లో (కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కృష్ణపట్నం) మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీచేశారు.
 
 సముద్రం ఉప్పొంగుతుంది...
 థాయ్ భాషలో ‘పై-లీన్’ అంటే అంటే ఇంద్రనీలం అని అర్థం.   ఈ తుపాన్ ప్రభావంతో విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయి. రోడ్లు కొట్టుకుపోతాయి. ఒడిషాలోని గంజాం, ఖుర్దా, పూరి, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలపై ‘ఇంద్రనీలం’ తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని వాతావరణ విభాగం అధిపతి డాక్టర్ ఎల్.ఎస్.రాథోడ్ తెలిపారు. ఇది శుక్రవారం సాయంత్రం గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో (కళింగపట్నం తీరానికి తూర్పు, ఆగ్నేయ దిక్కున 410 కిలోమీటర్ల దూరంలో) బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని.. గంటకు 45 కి.మీ. వేగంతో కదులుతోందన్నారు.

ఇది దిశ మారుతూ ఒడిశా తీరంలో శనివారం సాయంత్రం 6 గంటలకు కళింగపట్నం-పారాదీప్ మధ్యలో తీరం దాటే అవకాశాలున్నాయన్నారు. తీరం దాటే సమయంలో తీవ్ర ప్రభావానికి గురయ్యే జిల్లాల్లో సముద్రం 3 మీటర్ల వరకూ ఉప్పొంగుతుందని రాథోడ్ వివరించారు. ఇది పెను తుపానే కానీ.. సూపర్ సైక్లోన్‌గా మారబోదని రాథోడ్ ఢిల్లీలో పేర్కొన్నారు. 1999లో ఒడిశాను అతలాకుతలం చేసిన సూపర్ సైక్లోన్ 9,885 మందిని బలితీసుకుంది. అప్పుడు గంటకు 220 కి.మీ.కి పైగా వేగంతో పెనుగాలులు వీచాయని.. తాజా తుపాను గాలుల వేగం 240 కి.మీ.పైగా ఉండవచ్చని అమెరికా నౌకాదళం అంచనా వేసింది కాబట్టి.. ఇది కూడా సూపర్ సైక్లోనేనని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పి.కె.మహాపాత్రా భువనేశ్వర్‌లో పేర్కొన్నారు.
 
 తీర ప్రాంతాలు ఖాళీ...
 తుపాను కారణంగా ఏ ఒక్కరూ చనిపోకుండా చూడాలన్న లక్ష్యంతో ఏడు కోస్తా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు ఐదు లక్షల మంది ప్రజలను వేగంగా ఖాళీ చేయించాలని ఒడిశా సర్కారు ఆదేశించింది. గంజాం, గజపతి, పూరి, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపర, నయాగఢ్, ఖుద్రా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను శుక్రవారం సాయంత్రానికల్లా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. భద్రక్, బాలాసోర్ జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో తీరంలోని లోతట్టు ప్రాంతాల నుంచి 64 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
   
 సర్వసన్నద్ధంగా సైనిక, సహాయ బృందాలు
 తుపాన్ నేపథ్యంలో వాయుసేనకు చెందిన రెండు ఐఎల్-76 విమానాల్లో విపత్తు సహాయ దళం బృందాలను, పరికరాలను భువనేశ్వర్‌కు తరలించారు. సహాయ చర్యల కోసం వాయుసేన బలగాలను రాయ్‌పూర్, నాగ్‌పూర్, జగ్దల్‌పూర్, బారక్‌పూర్, రాంచి, గ్వాలియర్ తదితర వైమానిక స్థావరాల్లో సంసిద్ధంగా ఉంచారు. తుపాను తీరాన్ని తాకగానే సహాయ, రక్షణ చర్యలు చేపట్టటం కోసం నౌకాదళం, వాయుసేన, జాతీయ విపత్తు సహాయ దళం, ఒడిషా విపత్తు సహాయ దళాలు సంసిద్ధంగా ఉన్నాయి. 28 ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలను ఒడిషా ప్రభుత్వానికి అందుబాటులో ఉంచారు.
 
 గంజాం గజగజ...
 తుపాను ప్రభావంతో ఒడిశా తీరంలో శుక్రవారం ఉదయం నుంచే గంటకు 65 కిలోమీటర్ల వరకూ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. సాయంత్రానికి ఈ గాలుల తీవ్రత 100 కిలోమీటర్ల వేగం దాటింది. భువనేశ్వర్, బరంపురం, కటక్  తదితర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. పారాదీప్‌లో సాయంత్రం 7 గంటలకు వర్షం అధికమైంది. భువనేశ్వర్, కటక్ నగరాలతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లోనూ సాయంత్రం 4.30 గంటల నుంచే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుపాను కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. మరోవైపు ప్రధాన నగరాల్లో నిత్యావసర వస్తువులను నిల్వ ఉంచుకునేందుకు ప్రజలు పోటీ పడడంతో దుకాణాల్లో సరుకులు ఖాళీ అయిపోయాయి. అనేకచోట్ల సాయంత్రం నుంచి దుకాణాలు మూతపడ్డాయి. గంజాం జిల్లా గోపాల్‌పూర్ సమీపంలో తుఫాన్ తీరం దాటనుండటంతో.. ఆ జిల్లాతో పాటు బరంపురం నగరానికి ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
 
 భయం గుప్పిట సిక్కోలు...
 పై-లీన్ తుపాను ఉత్తరాంధ్ర జిల్లాల్లో వణుకు పుట్టిస్తోంది. క్షణక్షణానికీ పెరిగిపోతున్న గాలుల ఉధృతి.. అంతకంతకూ ఎగసిపడుతోన్న కెరటాలతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. ఉత్తరాంధ్రలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ప్రత్యేకంగా హెచ్చరికలు పంపారు. తూర్పు నావికాదళం తీర ప్రాంతాల్లో ప్రత్యేక హెలికాప్టర్లతో గస్తీ చేపట్టింది. శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి చిన్నపాటి ఈదురుగాలులతో ప్రారంభమైన చినుకులు క్రమంగా వర్షంగా మారాయి. ఉద్దానం ప్రాంతంలోని ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. సముద్రం సాయంత్రం 4 గంటల నుంచి అల్లకల్లోలంగా మారింది. గార మండలం కళింగపట్నం, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట, కంబాలరాయుడు పేట తదితర ప్రాంతాల్లో సముద్రం 30 నుంచి 70 మీటర్ల ముందుకు వచ్చేసింది. అలలు ఐదు, పది మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో అధికారులు, మెరైన్ పోలీసులు ఆయా ప్రాంతాలకు చేరుకుని మత్స్యకారులను, బోట్లను తీరం నుంచి వెనక్కి తరలించారు. అలల ఉధృతికి తీరం కోతకు గురవుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తీరంలో ఉన్న పడవలను గ్రామాల్లోకి తరలించారు. 

పలు గ్రామాల్లో స్థానికులు గంగమ్మ తల్లికి పూజలు చేశారు. జిల్లాలోని 193 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న 11 మండలాల పరిధిలోని 237 గ్రామాలను తుపాను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఈ గ్రామాల్లోని సుమారు 47 వేల మందిలో శుక్రవారం సాయంత్రానికి 12,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను రక్షిత భవనాలు, ప్రభ్వుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 137 పునరావాస కేంద్రాల్లో మూడు రోజులకు సరిపడే విధంగా బియ్యం, కిరోసిన్, నిత్యావసరాలు సిద్ధం చేశారు. మరోవైపు ఎగువన ఒడిశాలో భారీ వర్షాల కారణంగా జిల్లాలోని నాగావళి, వంశధార నదీ తీర గ్రామాలకు వరద ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తోటపల్లి, మడ్డువలస రిజర్వాయర్లలో నీటిని నాగావళి నదిలోకి విడిచిపెట్టారు. గొట్టా బ్యారేజీ గేట్లన్నింటినీ ఎత్తివేసి నీటిని కూడా వంశధార నదిలోకి వదిలారు.

 విజయనగరం, విశాఖ జిల్లాల్లో...

 విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ, చింతపల్లి, తిమ్మయ్యపాలెం, తిప్పలవలసల వద్ద సముద్రం 30 అడుగులు ముందుకు వచ్చింది. భోగాపురం మండలం ముక్కాంలో 50 అడుగుల మేర ముందుకు వచ్చింది. తీర గ్రామాలైన భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో తీరప్రాంతాల ప్రజలను ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం చేసింది. విశాఖ జిల్లా పరవాడలోని ముత్యాలమ్మపాలెం తీరంలో సముద్రం 20 మీటర్ల ముందుకొచ్చింది. భీమిలిలోని తీరం ప్రమాదకరంగా మారింది. బోయివీధి తీరానికి సమీపంలోని రక్షణ గోడ ఏక్షణానైనా కూలిపోయే ప్రమాదముంది. సముద్రంపై వేటకు వెళ్లిన వారు సుమారు 1,500 మందికి పైగానే ఉంటారన్న సమాచారంతో.. వారందరినీ వెంటనే వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
 
 కృష్ణా, గుంటూరు జిల్లాలపైనా ప్రభావం...
 పై-లీన్ ప్రభావంతో మచిలీపట్నం సమీపంలో సముద్రం అల్లకల్లోలంగా మారి ఆరడుగుల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి.  మంగినపూడిబీచ్‌లోకి పర్యాటకులను శుక్రవారం అనుమతించలేదు. గురువారం నాటికి 40 బోట్లు చేపలవేట సాగిస్తుండగా వాటిలో 16 బోట్లు గిలకలదిండి హార్భర్‌కు చేరాయి. మరో 24 బోట్లు తిరిగి రావాల్సి ఉంది. వెలగలేరు వద్ద కుంపిణివాగులో గురువారం గల్లంతైన ఎన్.పావని (14) మృతదేహం శనివారం లభ్యమైంది. వాగుల్లో కొట్టుకుపోయి మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. గుంటూరు జిల్లా నిజాంపట్నం, నగరం, రేపల్లె, బాపట్ల, కర్లపాలెం మండలాల్లోని 116 గ్రామాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటున్నందున లోతట్టు వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ డెల్టాలోని వరి, పసుపు, వేరుశనగ పంటలు ముంపుబారిప పడకుండా సాగునీటి కాల్వల్లో నీటి విడుదలను తగ్గించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు.
 
 ‘ఇంద్రనీలం’ తీవ్రత ఇదీ...
 శుక్రవారం సాయంత్రం నుంచే గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురు గాలులు వీయటం మొదలయింది. అర్ధరాత్రి నుంచి గాలుల వేగం పెరుగుతూ పోతుంది. శనివారం ఉదయానికి ఈ గాలుల వేగం గంటకు 150 కిలోమీటర్లు దాటుతుంది.
తుపాను శనివారం సాయంత్రం 5:30 గంటల నుంచి 8:30 గంటల మధ్య చిలుకా సరస్సు దక్షిణ ప్రాంతాన్ని తాకుతుంది. చిలుకా సరస్సుకు దక్షిణంగా 20 కిలోమీటర్ల పరిధిలో తుపాను పెను విధ్వంసం సృష్టిస్తుంది. పారాదీప్‌లో తుపాను వాతావరణం కొన్ని గంటల పాటు కొనసాగుతుంది.
 ఒడిశాలోని గంజాం, ఖుర్దా, పూరి, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాపై తుపాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది.
*  అతి తక్కువ సమయంలోనే 25 నుంచి 50 సెంటీమీటర్ల వరకూ వర్షపాతానికి అవకాశముంది. 48 గంటలపాటు ఉత్తరాంధ్రలో కుండపోతగా వర్షం కురుస్తుంది. వడగండ్ల వాన ఉంటుంది.  
*  తుపాను తీరం దాటే సమయంలో తీరంలో గాలుల ఒత్తిడికి సముద్రం 3.3 మీటర్ల వరకూ ఉప్పొంగుతుంది. దీనివల్ల తీరంలోని కొన్ని ప్రాంతాలు నీట మనుగుతాయి.
*  విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయి. భారీ స్థాయిలో రోడ్లు కొట్టుకుపోతాయి. చెట్లు నేలకూలుతాయి. రైలు, రోడ్డు, రవాణా స్తంభిస్తుంది.
*  ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లలోనూ భారీ వర్షాలు కురుస్తాయి.
 *  తుపాను తీవ్రత ఆదివారం నాటికి క్రమంగా తగ్గుతుంది. సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుంది.బంగాళాఖాతంలో క్రమంగా బలోపేతం అవుతూ తూర్పు తీరం వైపు వేగంగా కదులుతున్న పై-లీన్ తుపాను ఏకంగా మనదేశం సైజులో సగం వరకూ ఉందట. తీరాన్ని తాకేదాకా పైలీన్ పరిమాణం, బలం తగ్గే అవకాశాలు లేవని హవాయిలో అమెరికా నేవీకి చెందిన ‘జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్(జేటీడబ్ల్యూసీ)’ వెల్లడించింది. పై-లీన్ తీరాన్ని దాటితే భారీ వర్షాలు, వరదలు ముంచెత్తి పెను విలయం సృష్టించే ప్రమాదం ఉందని ఆ సంస్థ తెలిపింది. అయితే పైలీన్ పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ ఉందని, అది దేశంలో సగం సైజులో లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డెరైక్టర్ పేర్కొన్నారు.


 220 కి.మీ. వేగంతో తీరం దాటే అవకాశం....
 ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం, ఒడిశాలోని పారాదీప్‌ల మధ్య శనివారం రాత్రి గంటకు 220 కి.మీ. వేగంతో వీచే గాలులతో పై-లీన్ తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది. అయితే తుపాను గంటకు 315 కి.మీ. వేగంతో వీచే గాలులతో విరుచుకుపడే అవకాశముందని ‘జేటీడబ్ల్యూసీ’, లండన్‌లోని ‘ట్రాపికల్ స్టార్మ్’ సంస్థల నిపుణులు హెచ్చరించారు. 1999 నాటి ఒడిశా సూపర్ సైక్లోన్ 220 కి.మీ. వేగంతో కూడిన గాలులతో విరుచుకుపడిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.

 వెంటనే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోకపోతే గనక.. అనూహ్యరీతిలో ప్రాణనష్టం, లక్షలాది మందిపై ప్రభావం పడే అవకాశముందని చెబుతున్నారు. 1999లో వచ్చిన ఒడిశా సైక్లోన్ ధాటికి సుమారు 10 వేల మంది మృత్యువాత పడగా.. 450 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఆ తుపాను తీరం దాటిన ప్రదేశం వైపుగానే దాదాపు అదే తీవ్రతతో పై-లీన్ కూడా సాగుతోంది. అయితే హరికేన్ హంటర్ విమానాలు లేకపోవడంతో పై-లీన్ ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా.. ఈ తుపాను 300 కి.మీ. వేగాన్ని మించి విజృంభించనుందని, అదే జరిగితే బంగాళాఖాతంలో ఏర్పడిన అత్యంత పెను తుపానుగా ఇది రికార్డులకు ఎక్కనుందని చెబుతున్నారు.

 ‘కత్రినా’ను మించే విలయం..?
 అమెరికాను 2005లో వచ్చిన కత్రినా హరికేన్ అతలాకుతలం చేసింది. వేల కోట్ల డాలర్ల నష్టాన్ని కల్గించడమే కాకుండా 1,800 మందిని ఆ హరికేన్ పొట్టనపెట్టుకుంది. అయితే ఆ హరికేన్ కన్నా పై-లీన్ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఉపగ్రహ చిత్రాల సమాచారాన్ని బట్టి చూస్తే.. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వేసిన అంచనాలకు మించి పైలీన్ తీవ్రత పెరగవచ్చని జేటీడబ్ల్యూసీ, ట్రాపికల్ స్టార్మ్ నిపుణులు భావిస్తున్నారు.


శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాకు పొంచి ఉన్న ‘పై-లీన్‌’ పెను తుపాను ముప్పును ఎదుర్కొని సహాయ చర్య లు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మరోవైపు  సముద్ర తీరంలో ఇప్పటికే 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో కెరటాలు వస్తున్నాయి. తుపాను ప్రభావితం చేసే 11 మండలాల్లో 237 గ్రామాలు గుర్తించారు. దాంతో 134 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కవిటి మండలం ఇత్తివానిపాలెం, గార మండలం బందరువాణి పేట వద్ద సముద్రం 100 అడుగుల ముందుకు వచ్చింది. 12,500మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలుల ధాటికి చెట్లు, టెలిఫోన్‌, విద్యుత్‌ స్తంభాలు, ఇళ్లు కూలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చని తెలిపారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం నెంబర్లు :
నంబర్లు-08942 240557, 96528 38191

ఉదయం 9.30గం. నిమ్స్ నుంచి జగన్ డిశ్చార్జ్

ఉదయం 9.30గం. నిమ్స్ నుంచి జగన్ డిశ్చార్జ్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 9.30 గంటలకు నిమ్స్ నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఆమరణ నిరాహార దీక్ష భగ్నం తర్వాత ఆయన నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రానికి సమన్యాయం చేయాలంటూ చేపట్టిన జగన్ దీక్షను పోలీసుల భగ్నం చేసి నిమ్స్  ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. కాగా కొద్ది రోజుల వ్యవధిలోనే జగన్ రెండోసారి దీక్ష దిగడంతో అది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో జగన్ ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచేందుకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

plz join rescue and relief operations in view of the impending cyclone philin

Written By news on Friday, October 11, 2013 | 10/11/2013


ఫైలిన్ పొంచి ఉంది.. అప్రమత్తంగా ఉండండి: వైఎస్ జగన్

ఫైలిన్ పొంచి ఉంది.. అప్రమత్తంగా ఉండండి: వైఎస్ జగన్
హైదరాబాద్ : ఫైలిన్ తుఫాను నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తుఫాను సహాయ, పునరావాస కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనాలని పార్టీ శ్రేణులు, అభిమానులను జగన్ మోహన్ రెడ్డి కోరారు.

ఫైలిన్ తుఫాను కాస్తా తీవ్ర పెను తుఫాను అని భారత వాతావరణ శాఖ నిర్ధారించింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి సుమారు 530 కిలోమీటర్ల దూరంలో.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జగన్ మోహన్ రెడ్డి కోరారు.

మెరుగుపడుతున్న జగన్ ఆరోగ్యం

మెరుగుపడుతున్న జగన్ ఆరోగ్యంవిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఆరోగ్యం క్రమేపి మెరుగవుతుందని నిమ్స్ వైద్యులు తెలిపారు. వైఎస్ జగన్ రాత్రి నుంచి తేలికపాటి ఆహారం తీసుకుంటున్నారన్నారు. జగన్ ఆరోగ్యంపై మీడియాతో మాట్లాడిన వైద్యులు ఆయన ఆరోగ్యం క్రమేపి మెరుగుపడుతుందన్నారు. ఆయన శరీరంలోని కీటోన్ బాడీస్ క్రమంగా సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని  తెలిపారు.  బుధవారం రాత్రి  పోలీసుల సాయంతో జగన్ కు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించి,  క్రమేపి జగన్ కు వైద్యం అందిస్తున్నారు.

 
కొద్ది రోజుల వ్యవధిలోనే జగన్ రెండోసారి దీక్ష దిగడంతో అది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో జగన్మోహనరెడ్డి ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచేందుకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రానికి సమన్యాయం చేయాలంటూ చేపట్టిన జగన్ దీక్షను పోలీసుల భగ్నం చేసి నిమ్స్  ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

'దిగ్విజయ్ మాటొకటి.. షిండే ప్రకటన మరొకటి'

'దిగ్విజయ్ మాటొకటి.. షిండే ప్రకటన మరొకటి'
హైదరాబాద్ : రాష్ట్రం అల్లకల్లోలంగా మారినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తోందని వైఎస్‌ఆర్ సీపీ నేత కొణతాల రామకృష్ణ విమర్శించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్ ఒక ప్రకటన చేస్తే, కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మరో ప్రకటన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.

తెలంగాణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతలను తప్పుదారి పట్టిస్తున్నారని కొణతాల ఆరోపించారు. తీర్మానాన్ని ఓడిద్దామంటూ రాజీనామా చేయకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు. తెలంగాణపై కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. రెండో ఎస్సార్సీ అన్న కాంగ్రెస్ పార్టీయే యూటర్న్‌ తీసుకుని మాకు స్పష్టత లేదని విమర్శించడం విడ్డూరమన్నారు. ఫైలిన్ తుఫాన్ ముప్పు నేపథ్యంలో రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం, అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కొణతాల కోరారు.

బెయిల్ షరతులు సడలించాలని జగన్ పిటిషన్

బెయిల్ షరతులు సడలించాలని జగన్ పిటిషన్
హైదరాబాద్ : బెయిల్‌ షరతులను సడలించాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయని... వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేతగా, ఎంపీగా ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సిన భాద్యత తనపై ఉందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందుబాటులోఉండాలని...ప్రజల మనోభావాలను ,వారి కష్ట నష్టాలను తెలుసుకోవాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఓదార్పు యాత్రను కూడా కొనసాగించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి నివ్వాలని జగన్‌ కోర్టును కోరారు.

'కిరణ్ పై నమ్మకం లేకే రాజీనామా చేశా'

'కిరణ్ పై నమ్మకం లేకే రాజీనామా చేశా'
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నమ్మకం లేకే రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి విశ్వరూప్ అన్నారు. ఆయన శుక్రవారం నిమ్స్ లో  వైఎస్ జగన్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి విశ్వరూప్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వరూప్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కేంద్రం ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గటం లేదన్నారు.

రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కట్టుబడి ఉందన్నారు. అందుకే వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్లు విశ్వరూప్ తెలిపారు. అసెంబ్లీ తీర్మానాన్ని ఓడిస్తామంటూ పదవిలో కొనసాగేందుకు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విశ్వరూప్ ఈనెల 18న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే.

జగన్ ను చూసేందుకు నిమ్స్ చేరుకున్న విజయమ్మ

జగన్ ను చూసేందుకు నిమ్స్ చేరుకున్న విజయమ్మ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు వైఎస్ విజయమ్మ శుక్రవారం ఉదయం నిమ్స్ కు చేరుకున్నారు. ఆయనను విజయమ్మ పరామర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలంటూ  జగన్ మోహన్‌ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను బుధవారం అర్థరాత్రి భగ్నం చేసిన పోలీసులు ఆయనను నిమ్స్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ వైద్యులు జగన్ కు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన వైద్యులు వెను వెంటనే రెండు సార్లు నిరాహార దీక్ష చేపట్టడం జగన్ ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిందని పేర్కొన్నారు.

 నెల రోజుల క్రితం జగన్ మోహన్‌ రెడ్డి  దీక్ష చేసినప్పుడే కీటోన్స్ ఎక్కువగా ఉన్నాయని, తిరిగి నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ దీక్ష చేయడం, అదే స్థాయిలో కీటోన్స్ విడుదల కావడం శరీరంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ప్రస్తుతం కీటోన్స్ ఎక్కువగా ఉన్నాయని, అవి తగ్గడానికి సమయం పడుతుందన్నారు. వైద్య పరీక్షల తర్వాత షుగర్ లెవల్ 113కు పెరిగిందని, సాధారణస్థాయికి చేరుకునేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు.

 ప్రస్తుతానికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని, పళ్లరసాలు తీసుకోవాలని జగన్‌కు సూచించామని చెప్పారు. శ్వాస తీసుకోవడం, పల్స్ రేటు, రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని వైద్యులు వెల్లడించారు. కాగా  జగన్ డిశ్చార్జిపై ఈరోజు ఉదయం నిర్ణయం ఉంటుందని సమాచారం.

రాజకీయాలను శాసించేది వైఎస్సార్ సీపీనే

Photo
 తెలంగాణ వచ్చినా, రాకున్నా ఈ ప్రాంతంలో రాజకీయాలను శాసించబోయేది వైఎస్‌ఆర్ సీపీయేనని  పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం వైరాలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమది తెలంగాణ కోసమో, సీమాంధ్ర కోసమో పుట్టిన పార్టీ కాదన్నారు. దివంగత మహానేత వైఎస్‌ఆర్ సంక్షేమ ఫలాలను రాష్ట్ర ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో ఆయన కుమారుడు వైఎస్ జగన్ పార్టీని స్థాపించారని చెప్పారు.  తెలంగాణ ఏర్పడితే వైఎస్సార్ సీపీకి మనుగడ ఉండదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా పార్టీకి ఎలాంటి ఢోకా ఉండదని చెప్పారు. రాష్ట్రం ఎన్ని ముక్కలైనా అన్నిచోట్లా వైఎస్‌ఆర్ సీపీ ఉంటుందన్నారు. జిల్లాలో పార్టీకి ఎదురులేదని, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపర్చిన అభ్యర్థుల విజయమే ఇందుకు నిదర్శనమని అన్నారు. 
 
రాష్ట్ర ప్రజలకు జగన్‌మోహన్‌రెడ్డిని దూరం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ అంశాన్ని తెరమీదకు తెచ్చింది తప్ప, ఈ ప్రాంతంపై చిత్తశుద్ధితో కాదని విమర్శించారు. పార్టీ వైరా నియోజకవర్గ సమన్వయకర్త బాణోత్ మదన్‌లాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలన్నదే జగన్ అభిమతమన్నారు. దివంగత వైఎస్‌ఆర్ సంక్షేమ పథకాలతో తెలంగాణ వాసులే ఎక్కువగా లబ్ధి పొందారని చెప్పారు. చంద్ర బాబు రెండు కళ్ల సిద్ధాంతం అవలంబిస్తున్నారని, అయినా తెలంగాణలో టీడీపీ ఉన్నప్పుడు తమపార్టీ ఎందుకు ఉండదని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకుని మిగితా ఎన్నికల్లోనూ సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

విభజనపై ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానిదే పూర్తి అధికారం.అసెంబ్లీ పరిశీలనకు మాత్రమే బిల్లు!

అసెంబ్లీ పరిశీలనకు మాత్రమే బిల్లు!
విభజనపై ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానిదే పూర్తి అధికారం
 సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రాల ఏర్పాటు లేదా రాష్ట్రాల విభజనకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు ఎటువంటి నిర్ణయాధికారమూ లేదని రాజ్యాంగంలోని 3వ అధికరణ స్పష్టం చేస్తోంది. ఈ విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంటు పరిధికి లోబడే ఉంటుంది. ఈ అధికరణ ప్రకారం.. రాష్ట్ర విభజనకు సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించే అవకాశం ఎక్కడా లేదు. విభజనపై కేంద్ర ప్రభుత్వం రూపొందించి పంపే ముసాయిదా బిల్లు మాత్రమే రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీ పరిశీలనకు వస్తుంది. అసెంబ్లీ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా విభజనపై పార్లమెంటే తుది నిర్ణయం తీసుకుంటుంది. అయితే, ఏదైనా రాష్ట్రం నుంచి తమ రాష్ట్రాన్ని విభజించాలని లేదా తమ రాష్ట్రాలను విలీనం చేసి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు కేంద్రానికి ప్రతిపాదించి, తమ అభీష్టాన్ని నెరవేర్చుకున్న సందర్భాలున్నాయి. అటువంటి సందర్భాల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీలు విభజనకు లేదా విలీనానికి సంసిద్ధత తెలుపుతూ తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపే సంప్రదాయం కూడా లేకపోలేదు. ఇది కేవలం సంప్రదాయమే. ఇటువంటి తీర్మానానికి ఎటువంటి రాజ్యాంగబద్ధతా లేదు.
 
  కొన్ని ఏళ్ల క్రితం జార్ఖండ్, చత్తీస్‌ఘఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఈ సంప్రదాయం ప్రకారం ఏర్పాటైనవే. స్వాతంత్య్రానంతరం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విలీనం జరిగి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా ఇటు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో, అటు హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలోనూ.. విలీనానికి సంసిద్ధత తెలియజేస్తూ ఈ సంప్రదాయం ప్రకారమే తీర్మానాలు చేశారు. మహారాష్ట్ర నుంచి విదర్భను వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, ఉత్తరప్రదేశ్‌ను 4 రాష్ట్రాలుగా విభజించమని కోరుతూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఏళ్లు గడచిపోతున్నాయి. అయినప్పటికీ, ఈ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ పట్టించుకోలేదు.  ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ విభజన తీర్మానం రెండుసార్లు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పదే పదే నమ్మబలుకుతున్నారు. అయితే, రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం వీరి మాటలకు ఎటువంటి హేతుబద్ధతా లేదన్నది గమనించదగిన విషయం.
 
 ఇంతకీ 3వ అధికరణ ఏం చెబుతోందంటే..?
 కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రస్తుత రాష్ట్రాల్లో ప్రాంతాల, సరిహద్దుల, పేర్ల మార్పులను పార్లమెంటు చట్టం ద్వారానే చేయాలి. ఎ. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, ఉన్న రెండు, మూడు రాష్ట్రాలను కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్రంలోని ప్రాంతాలను కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. బి. రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడం. సి. రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించడం. డి. రాష్ట్ర సరిహద్దులను మార్చడం. ఈ. రాష్ట్రం పేరు మార్చాలంటే... రాష్ట్రపతి సిఫారసు ఆధారంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలి. బిల్లు ప్రభావం రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతం, సరిహద్దులు, పేరు మార్పులపై ఉంటే బిల్లును ఆ రాష్ట్ర శాసనసభకు, రాష్ట్రపతికి పంపి, నిర్దిష్ట గడువులోగా అభిప్రాయాలు కోరవచ్చు.

వెనువెంటనే దీక్షతో తీవ్ర దుష్ర్పభావం

వెనువెంటనే దీక్షతో తీవ్ర దుష్ర్పభావం
* వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులు
* కీటోన్స్ స్థాయి ఇంకా ఆందోళనకరం* సాధారణ స్థితికి రావాలంటే సమయం పడుతుంది
 
 సాక్షి, హైదరాబాద్:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెను వెంటనే రెండుసార్లు నిరాహార దీక్ష చేపట్టడంతో అది ఆయనఆరోగ్యంపై తీవ్ర దుష్ర్పభావం చూపిందని నిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని పోలీసులు బుధవారం అర్ధరాత్రి బలవంతంగా నిమ్స్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మీడియాతో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి నెల రోజుల కిందట దీక్ష చేసినప్పుడే కీ టోన్స్(గ్లూకోజ్ నిల్వలు తగ్గి, కొవ్వులు శక్తిరూపంలో వినియోగమవుతున్నప్పుడు విడుదలయ్యే చెడు పదార్థాలు) ఎక్కువగా ఉన్నాయని, తిరిగి నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ దీక్ష చేయడం, అదే స్థాయిలో కీటోన్స్ విడుదల కావడం శరీరంపై తీవ్ర ప్రభావం చూపించిందని అన్నారు. ప్రస్తుతం కీటోన్స్ అధికంగా ఉన్నాయని(బుధవారం రాత్రి నిమ్స్‌కు వచ్చే సమయానికి కీటోన్స్ 4 ప్లస్‌గా ఉన్నాయి) అవి తగ్గడానికి సమయం పడుతుందని అన్నారు.
 
 పళ్లరసాలు తీసుకోవాలని సూచన..
 వైద్య పరీక్షల అనంతరం సుగర్ లెవల్ 113కు పెరిగిందని, (నిమ్స్‌కు తీసుకొచ్చే సమయానికి సుగర్ లెవల్ 54గా ఉంది) సాధారణ స్థాయికి చేరుకునేందుకు మరికొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతానికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని, ఇంకా ఆయన ఎలాంటి ఆహారమూ తీసుకోవడం లేదని, పళ్లరసాలు తదితరం ఏవైనా (ఓరల్ ఫ్లూయిడ్స్) తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. తిరిగి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, త్వరగా కోలుకునేందుకు తాము కృషి చేస్తున్నామని వైద్య బృందం పేర్కొంది. ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం వలన మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉందని ఓ వైద్యుడు పేర్కొన్నారు. శ్వాస తీసుకోవడం, పల్స్ రేటు, రక్తపోటు తదితరాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు తెలిపారు. పదే పదే కీటోన్స్ శరీరంలో విడుదల అవుతుండటం భవిష్యత్‌లో శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని సీనియర్ వైద్యులొకరు ‘సాక్షి’తో అన్నారు. ప్రస్తుతం నిమ్స్ వైద్యులు డా. ఎం.నాగేశ్వరరావు(జనరల్ మెడిసిన్), డా.శేషగిరిరావు(కార్డియాలజీ), డా.గంగాధర్(నెఫ్రాలజీ), డా.లక్ష్మీభాస్కర్ తదితరులు జగన్‌మోహన్‌రెడ్డిని పర్యవేక్షిస్తున్నారు.
 
 వైద్యుల సూచనల మేరకే డిశ్చార్జి: వైఎస్ భారతి
 వైద్య పరీక్షల ఫలితాలు, వైద్యుల నిర్ణయం తర్వాతే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని డిశ్చార్జి చేస్తారని ఆయన సతీమణి వైఎస్ భారతి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం అర్ధరాత్రి పోలీసులు బలవంతంగా నిమ్స్ ఆస్పత్రికి తరలించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్స్ ఆస్పత్రిలో గురువారం జగన్‌ను భారతి పరామర్శించారు. ఈ సందర్భంగా తనను కలిసిన పలు జాతీయ టీవీచానళ్ల ప్రతినిధులతో ఆమె మాట్లాడారు. ‘‘దీక్ష భగ్నం సమయంలో కీటోన్ బాడీస్ అత్యంత ఉన్నతస్థాయికి చేరాయి. రక్తంలో చక్కెర స్థాయి 50కి పడిపోయింది. అనంతరం వైద్యులు జగన్‌కు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన నుంచి రక్తం నమూనాలు సేకరించారు. ఈ ఫలితాల వచ్చిన తర్వాత రేపు(శుక్రవారం) ఉదయం డిశ్చార్జిపై నిర్ణయం ఉంటుంది’’ అని ఆమె తెలిపారు.

జగన్, చంద్రబాబుకు ఎన్ డీఎమ్ఏ లేఖ

Written By news on Thursday, October 10, 2013 | 10/10/2013

జగన్, చంద్రబాబుకు ఎన్ డీఎమ్ఏ లేఖ
న్యూఢిల్లీ: ఫైలిన్ తుఫాన్ తీవ్రరూపం దాల్చచడంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ డీఎమ్ఏ) అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు పొంచివుండడంతో ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. సహాయక చర్యలు కొనసాగించేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఎన్ డీఎమ్ఏ ఉపాధ్యక్షుడు కోరారు.

మానవతా దృక్పథంలో ఆందోళన కార్యక్రమాలు 15 రోజులు వాయిదా వేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇరువురు నేతలకు లేఖలు రాశారు. ఢిల్లీలో దీక్ష చేస్తున్న చంద్రబాబుకు లేఖ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సిబ్బంది తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొనాల్సివుందని తెలిపారు.

ఫైలిన్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కళింగపట్నం - పారాదీప్ ల మధ్య ఈనెల 12న ఫైలిన్ తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు ఎన్ఎమ్ డీఏ సహాయక బృందాలు పంపింది. ఒడిశాకు 8, ఆంధ్రప్రదేశ్ కు 9 బృందాలు పంపింది. అలాగే ఎయిర్ ఫోర్స్, నావికాదళం, ఆరోగ్య శాఖల సహకారం కూడా ఎన్ఎమ్ డీఏ కోరింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసింది. ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచింది.
శ్రీకాకుళం: 08942 240557, 9652838191
గుంటూరు : 08644 - 223800
తూర్పుగోదావరి: 08856 - 233100
పశ్చిమగోదావరి: 08812 230617
నెల్లూరు: 1800 425 2499, 08612 331477

జగన్ ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచేందుకే చికిత్స

జగన్ ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచేందుకే చికిత్స
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచేందుకే చికిత్స అందిస్తున్నామని నిమ్స్ వైద్యులు తెలిపారు. కొద్ది రోజుల వ్యవధిలోనే జగన్ రెండోసారి దీక్ష దిగడంతో అది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం మందగించే అవకాశం ఉండటంతో వైద్య పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నామన్నారు. గత రాత్రి  పోలీసుల సాయంతో జగన్ కు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించినట్లు వైద్యులు తెలిపారు. కిటోన్ బాడీస్ ఇంకా ఎక్కువగానే ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఇంకా రెండు రోజుల్లో జగన్ శరీరాన్నిసాధారణ స్థాయికి తెచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు.
 
బుధవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు జగన్ మోహన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి బలవంతంగా నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు.
 

బాబు దీక్షకు సర్కారు సహకారం

వేదిక ఖాళీ చేయూలంటూ పైపైకి నోటీసులు.. చాటువూటుగా అండదండలు
ప్రభుత్వ పెద్దలతో టీడీపీ నేతల ఎడతెగని మంతనాలు
దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్న ఏపీ భవన్ అధికారులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ:
 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడు రోజులుగా ఏకంగా ప్రభుత్వ కార్యాలయమైన ఏపీ భవన్‌లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, చంద్రబాబు దీక్ష వూత్రం అక్కడ కొనసాగుతూనే ఉంది.  దీక్షకు అనుమతి లేదంటూ ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు పైకి నోటీసులిచ్చినా,  దీక్ష విజయవంతవుయ్యేందుకు తమ వంతుగా సహకరిస్తున్నారు. ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలలో ఎలాంటి సభలు, సావుూహిక కార్యకలాపాలు నిర్వహించినా కోడ్ ఉల్లంఘనే అవుతుంది. కోడ్ అవులులో ఉన్నపుడు ప్రభుత్వ అతిథి గృహాలను జడ్ ప్లస్ భద్రత ఉన్న వారికి మినహా ఇతరులకు ఇవ్వరాదు. ఏపీ భవన్ అధికారులు మాత్రం ప్రభువును మించిన భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఏపీభవన్‌లోని సుమారు 40 గదులను చంద్రబాబు దీక్షకు వచ్చిన నేతలకే కేటాయించినట్లు సమాచారం. పైగా వారికి ఏ లోపం రాకుండా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏపీ భవన్ పరిపాలనాధికారి రామ్మోహన్ టీడీపీ నేతలతో టచ్‌లో ఉంటూ ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారానికి చంద్రబాబు దీక్ష మూడవ రోజుకు చేరింది. తొలిరోజు నుంచి పూర్తి సహకారం అందిస్తున్న ప్రభుత్వం వుూడవ రోజు వురింత సహకారం అందించింది.
 అడుగడుగునా సహకారం
 ఏపీ భవన్‌లోని గురజాడ హాల్‌లో చంద్రబాబు విలేకరుల సమావేశానికి మాత్రమే తొలిరోజు అనుమతి తీసుకున్నారు. ఆ వెంటనే చంద్రబాబు ఏపీ భవన్  ఆవరణలోని వేదికపై దీక్ష మొదలెట్టారు. ఆ తరువాత వేదికపై పరుపులు, ఏసీలు, మైకులు, షామియానాలను పార్టీ నేతలు ఏర్పాటు చేసుకున్నారు. ఏపీ భవన్ పరిపాలనాధికారి రామ్మోహన్, భద్రతాధికారి సుబ్బన్న స్వయుంగా ఈ ఏర్పాట్లు చూశారు. కొందరు సిబ్బందిని ఇందుకే కూడా కేటాయించారు. మొదటి రెండు రోజులు చంద్రబాబు దీక్షకు అంత స్పందన కనిపించలేదు. దీంతో.. వుద్దతుదార్లతో తాము ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ైరె ళ్లు బుధవారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటాయని, ఈ లోగానే దీక్షను భగ్నం చేస్తే చేసిన ఖర్చు బూడిదలో పోసినట్టే అవుతుందని టీడీపీ నేతలు ఢిల్లీ పోలీసు అధికారులు, ఏపీ భవన్ అధికారులకు విన్నవించుకున్నారు. పార్టీ కార్యకర్తలు ఢిల్లీ చేరేంతవరకూ దీక్షను భగ్నం చేయబోమంటూ హామీ ఇచ్చారు. అయితే వనంగా ఉంటే ప్రభుత్వంతో టీడీపీ కుమ్మక్కు బయుటపడవచ్చు కాబట్టి, తావుు నోటీసులిస్తూ  ఉంటామని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ మంగళవారం ఒక నోటీసు అందచేసి, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తర్వాత, బుధవారం ఢి ల్లీ పోలీస్ కమిషనర్‌కు లే ఖ రాశారు.  నిరవధిక దీక్ష చేస్తున్న చంద్రబాబును పరామర్శించేందుకు పెద్దసంఖ్యలో జనం వస్తున్నారని, ఈ అనధికార దీక్ష వల్ల ఇబ్బందులు ఉంటారుు కాబట్టి, దీక్షా శిబిరాన్ని తొలగించాలని గోయుల్ కోరారు. తగిన చర్య కోసం ఢిల్లీ పోలీసులను సంప్రదించాల్సిందిగా ప్రభుత్వం తనను ఆదేశించిందని, దీక్షా శిబిరాన్ని తొలగించాలని కోరారు.  దీక్షకు తావుు అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖలో తెలిపారు. ఇక, బాబు దీక్ష ఏర్పాట్లు తొలగించామని చెప్పుకునేందుకు, ఏపీ భవన్ ఆవరణలోని టీడీపీ ఫ్లెక్సీలను, ఆ పార్టీవారి వంట ఏర్పాట్లను తొలగించారు. మెయిన్ గేట్‌కు తాళం వేశారు. తరువాతే అసలు కథ మొదలైంది. మీడియాను కూడా ఏపీభవన్‌లోకి అనుమతించలేదు. పరామర్శకు వచ్చిన ఎల్‌ఐసీ ఏజెంట్లను బయుటే నిలిపేయుడంతో వారు ధర్నాకు దిగారు. టీడీపీ నేతలు సీఎం రమేష్, కొత్తకోట దయాకర్‌రెడ్డి, పల్లె రఘునాథ రెడ్డి,  తదితరుల నేతృత్వంలో నినాదాలు చేశారు. ప్రధాన ద్వారం వద్దనే కారు దిగి లోపలికి నడిచి  రావాల్సిందిగా సీఎం రమేశ్, నామా నాగేశ్వరరావులను భద్రతా సిబ్బంది కోరటంతో కొద్దిసేపు ధర్నా చేశారు. కారును లోపలికి అనుమతించిన తరువాత గేటుకు తాళం వేశారు. వెంటనే టీడీపీ నేత ఒకరు సిబ్బంది నుంచి తాళం చెవిని లాక్కుని గేటు తెరిచారు. పార్టీ కార్యకర్తలందరినీ లోపలకు పంపించారు. ఇక ప్రత్యేక రైళ్లలో వచ్చిన వారిని పోలీసులు దగ్గరుండి లోనికి పంపించారు. ప్రభుత్వం, టీడీపీ మధ్య వుుందస్తు అవగాహన మేరకే ఇదంతా జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. వైఎస్ జగన్ దీక్షను ప్రభుత్వం విరమింపజేసిన తర్వాతే బాబు దీక్షను కూడా విరమింపజేయాలని టీడీపీ నేతలు అధికారులతో మాట్లాడుకున్నట్లు సమాచారం.

భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్న వైఎస్ఆర్ సీపీ

భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్న వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేడు తదుపరి కార్యాచరణను ప్రకటించనుంది. అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష భగ్నం నేపథ్యంలో నేడు భవిష్యత్‌ కార్యచరణను ప్రకటిస్తామని ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ చెప్పారు. దీని కోసం ఇవాళ సమావేశమవుతున్నట్టు ఆయన వెల్లడించారు.
కాగా నిమ్స్ లో దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా నీరసంగా కనిపిస్తున్నారని పార్టీ నేత వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఆయనకు వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్లు చెప్పారు.

వెనువెంటనే దీక్షలతో ప్రమాదం..

జగన్ దీక్ష భగ్నం
బలవంతంగా నిమ్స్‌కు తరలింపు..
బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్: 
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు బుధవారం అర్ధరాత్రి భగ్నం చేశారు. బలవంతంగా ఆయన్ను నిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పోలీసుల సహాయంతో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు.  దీక్షలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారంనాడు వైద్యులు రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం బాగా క్షీణించిందని, తక్షణం ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే ప్రమాదకర స్థాయికి చేరుతుందని నివేదించారు. నెల రోజుల వ్యవధిలో రెండోసారి ఆమరణ దీక్షకు దిగిన నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం ఆందోళనకర స్థితికి చేరిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్ దీక్ష సాగిస్తున్న లోటస్‌పాండ్ ప్రాంతానికి రాత్రి 10 గంటల ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులు చేరుకున్నారు. ఒకవైపు వర్షం కురుస్తుండగా, పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని అంబులెన్స్ రప్పించారు.
రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు పెద్దసంఖ్యలో దీక్షా శిబిరం వేదికపైకి చొచ్చుకువచ్చి జగన్‌ను బలవంతంగా తరలించడానికి ప్రయత్నించగా ఆయన ప్రతిఘటించారు. మొదట నగర సంయుక్త పోలీస్ కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) మల్లారెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ పరిస్థితిని వివరించి దీక్ష విరమించాలని కోరారు. తనకు ఏమీ కాదంటూ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష కొనసాగిస్తానని చెబుతున్నప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. శిబిరం పరిసర ప్రాంతాల్లో ఉన్న నేతలు, కార్యకర్తలు పోలీసుల ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటించారు. వేదికపైకి చేరుకున్న పోలీసు అధికారులు తొలుత జగన్‌తో చర్చించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక్కసారిగా జగన్‌ను ఎత్తుకుని వేదిక నుంచి అంబులెన్స్ వరకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. అన్యాయంగా, నిరంకుశంగా వ్యవహరించి జగన్ దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ అక్కడున్న నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలోనే జగన్‌ను అంబులెన్స్‌లో ఎక్కించి అక్కడి నుంచి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
 
ఫ్లూయిడ్స్ వద్దని ప్రతిఘటించిన జగన్..
ఆసుపత్రిలో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి యత్నించగా.. జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిఘటించారు. సమైక్యాంధ్ర కోసం తన ఆమరణ దీక్షను కొనసాగించనివ్వాలని వైద్యుల్ని, పోలీసులను కోరారు. ఈ పరిస్థితుల్లో నిమ్స్ వైద్యులు డాక్టర్ లక్ష్మీ భాస్కర్, డాక్టర్ వంశీకృష్ణారెడ్డి అర్ధరాత్రి 12.20 గంటల సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వైద్యానికి ఆయన తిరస్కరిస్తున్నారని చెప్పారు. అయితే  ఆయన ఆరోగ్యం దృష్ట్యా బలవంతంగానైనా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులకు తెలిపినట్లు చెప్పారు. తర్వాత 12.30 గంటల సమయంలో పోలీసుల సాయంతో వైద్యులు బలవంతంగా జగన్‌మోహన్‌రెడ్డికి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. దీంతో ఐదు రోజులుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష భగ్నమైంది.
 
 ఆసుపత్రికి చేరుకున్న విజయమ్మ, భారతి
 బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తల్లి విజయమ్మ.. జగన్‌ను ఆస్పత్రికి తరలించిన విషయం తెలుసుకుని హుటాహుటిన నిమ్స్‌కు బయలుదేరారు. 11.25 గంటల ప్రాంతంలో ఆమె, జగన్‌మోహన్‌రెడ్డి భార్య భారతి.. పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డితో కలిసి ఆస్పత్రికి వెళ్లి జగన్‌ను పరామర్శించారు. కాగా జగన్‌మోహన్‌రెడ్డిని చూడడానికి వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున వస్తారని తెలిసి పోలీసులు ముందస్తుగా ఆస్పత్రి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్‌ను ఆస్పత్రి లోనికి తరలించగానే గేట్లు మూసివేసి లోనికి ఎవరినీ అనుమతించకుండా కట్టడి చేశారు.
 
 వెనువెంటనే దీక్షలతో ప్రమాదం..
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండడంతో జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం బుధవారం బాగా క్షీణించింది. రాత్రి దీక్ష భగ్నానికి ముందు బుధవారం ఉదయంపూట.. ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి చెందిన డా.రఫీ (ఆర్‌ఎంఓ), డా.రామచంద్రరావు (జనరల్ ఫిజీషియన్), డా.అభిమన్యుసింగ్ (అనస్థీషియా), డా. వలీ(నెఫ్రాలజిస్ట్) తదితరులతో కూడిన వైద్య బృందం రెండు దఫాలుగా జగన్‌మోహన్‌రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించింది. ఐదురోజులుగా దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆయన రక్తంలో చక్కెర స్థాయి పడిపోవడంతో పాటు కీటోన్ బాడీస్ వేగంగా పెరిగాయని, ఇది ఆందోళనకర అంశమని హెచ్చరించింది. ఫ్లూయిడ్స్ తీసుకొని తక్షణం దీక్ష విరమించకపోతే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని వైద్య నిపుణులు పరీక్షల అనంతరం జగన్‌కు తెలిపారు. అయినప్పటికీ దీక్ష విరమించడానికి జగన్ ఒప్పుకోలేదు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి జైలులోనే ఆగస్టు 25న ఆమరణ దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే జైలు అధికారులు ఆయనను నిమ్స్‌కు తరలించారు. అక్కడా దీక్ష కొనసాగించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 31న బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్ష భగ్నంచేశారు. బెయిల్‌పై బయటకొచ్చాక మళ్లీ ఆమరణ దీక్షకు కూర్చున్నారు. కేవలం మధ్యలో నెల రోజుల వ్యవధిలో ఇలా రెండోసారి జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష చేయడం ఏమాత్రం మంచిది కాదని, భవిష్యత్తులో ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారు.
 
 4 ప్లస్ స్థాయికి కీటోన్స్..
 నెలరోజుల వ్యవధిలోనే రెండు సార్లు దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కీటోన్స్ పెరగడంతో పాటు సుగర్ లెవల్స్ పడిపోయాయని, ఆయన వెంటనే ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వైద్యులు తేల్చిచెప్పారు. దీక్ష నాలుగోరోజైన మంగళవారం 3 ప్లస్ స్థాయిలో ఉన్న కీటోన్స్ బుధవారం 4 ప్లస్ స్థాయికి చేరుకోవడాన్ని బట్టి ఆరోగ్యం వేగంగా క్షీణిస్తున్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. దీక్ష కొనసాగితే కిడ్నీలపై దుష్ర్పభావం చూపుతుందని హెచ్చరించారు. అయితే రాష్ట్ర ప్రజల కోసం తాను దీక్ష కొనసాగిస్తానని జగన్ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో వైద్య బృందం జగన్ సంబంధీకులతో పాటు పార్టీ నేతలతోనూ చర్చలు జరిపి ఆరోగ్య రీత్యా దీక్ష విరమిస్తే మంచిదని సూచించారు. బీపీ స్థాయి 120/90, చక్కెరస్థాయి 54 శాతం, కీటోన్స్ 4+, పల్స్‌రేటు నిమిషానికి 72 స్థాయిగా ఉన్నాయని తెలిపారు. వైద్య బృందంలోని డాక్టర్ రఫీ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం క్షీ ణిస్తుందన్న కారణంగా దీక్ష విరమింపచేయాలని జగన్‌కు సూచించామన్నారు. రాష్ట్ర సమైక్యత కంటే తన ప్రాణం ముఖ్యం కాదని జగన్ తెలిపినట్లు చెప్పారు.
 
అభిమానుల్లో ఆందోళన..
ఉదయం దీక్షాస్థలికి వచ్చిన శ్రేణుల ముఖాల్లో తమ అభిమాన నాయకుడి ఆరోగ్యం పట్ల ఆందోళన స్పష్టంగా కనిపించింది. కొందరు మహిళలయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని తలుచుకుంటూ, మహానేత బాటలో ఆయన తనయుడు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందని కంటతడి పెట్టుకున్నారు. వైఎస్సార్ మరణం తర్వాత ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆయన నిత్యం ప్రజల్లోనే ఉండడం, ఆ తర్వాత అక్రమంగా కేసులు బనాయించి టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయి ఆయనను జైలుకు తరలించడం, ఇప్పుడు ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత కూడా ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టాలను తలుచుకుని ఉద్విగ్నానికి లోనయ్యారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి పడుతున్న శ్రమ తన సొంతం కోసం కాాదని, నిత్యం రాష్ట్ర ప్రజల సంక్షేమమే ఊపిరిగా ఆయన నడుస్తున్నారని గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళా కార్యకర్త వ్యాఖ్యానించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి వర్షం పెద్ద ఎత్తున పడుతున్నప్పటికీ అభిమానుల సందోహం తగ్గలేదు. వర్షంలోనూ వారు దీక్షా వేదిక ముందు నిల్చొని తమ అభిమాన నాయకుడికి సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలకు లెక్కచేయకుండా జగన్  దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం ఆందోళనకర స్థితికి చేరిందని ఈ సందర్భంగా దీక్షస్థలి వద్ద పలువురు ప్రజలు, అభిమానులు కంటతడి పెట్టుకున్నారు.
 
 దీక్షకు మద్దతుగా రక్తదానం శిబిరం...
 జగన్‌మోహన్‌రెడ్డిదీక్షకు మద్దతుగా పార్టీ యువజన విభాగం స్టీరింగ్ కమిటీ సభ్యుడు రాచమల్లు రవి శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రారంభించిన రక్తదాన శిబిరంలో పార్టీ నేతలు, అభిమానులు రెండు వందల మందికి పైగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిలో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తదితరులున్నారు.
 
 సంఘీభావం తెలిపిన నాయకులు...
 పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథరెడ్డి, టి.బాలరాజు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గొల్ల బాబురావు, బి.గుర్నాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, నేతలు పేర్ని నాని, భూమా నాగిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఆళ్ల నాని, మద్దాల రాజేశ్ కుమార్, ఎస్వీ మోహన్‌రెడ్డి, జంగా కృష్ణమూర్తి, వాసిరెడ్డి పద్మ, కె.శివకుమార్, ద్వారకనాథరెడ్డి, అంబటి రాంబాబు, జ్యోతుల నెహ్రూ, నూకసాని బాలాజి, సామినేని ఉదయభాను, వై.విశ్వేశ్వరరెడ్డి, అడుసుమిల్లి జయప్రకాశ్, వీఎల్‌ఎన్ రెడ్డి, ఎల్వీ కృష్ణారెడ్డి, గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొల్లి నిర్మలకుమారి, మేరిగ మురళి తదితరులు ఉన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి తనయుడు గౌతమ్‌రెడ్డి జగన్‌ను పరామర్శించారు.
 
 ప్రభుత్వం స్పందించాలి: వాసిరెడ్డి పద్మ
 సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కోరుతూ దీక్ష చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటం రాష్ట్ర ప్రజలతో పాటు పార్టీ శ్రేణులు, కుటుంబసభ్యులకు ఆవేదన కలిగిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రాణాలను లెక్కచేయకుండా తక్కువ సమయంలోనే రెండో సారి దీక్షకు పూనుకోవడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. విశాల ప్రయోజనాల రీత్యా దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుండటాన్ని దృష్టిలో పెట్టుకొనైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.

నిమ్స్ లో వైఎస్ జగన్ ను కలిసిన విజయమ్మ!

నిమ్స్ లో వైఎస్ జగన్ ను కలిసిన విజయమ్మ!
హైదరాబాద్ :
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ గత ఐదు రోజులుగా చేస్తున్న దీక్షను భగ్నం చేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైఎస్ విజయమ్మ కలుసుకున్నారు. గురువారం ఉదయం నిమ్స్ ఆస్పత్రికి విజయమ్మ చేరుకుని వైఎస్ జగన్ తో మాట్లాడారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని.. ఇంకా నీరసంగా ఉన్నారని తెలిసింది. గత నెలరోజుల్లో రెండు సార్లు నిరాహారదీక్ష చేపట్టడంతో వైఎస్ జగన్ ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు వెల్లడించారు. 
 
బుధవారం రాత్రి నిమ్స్ వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. పోలీసులతో పాటు నర్సులు కూడా వైఎస్ జగన్ చేతిని గట్టిగా పట్టుకుని మరీ ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అంతకుముందు బుధవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు జగన్ మోహన్ రెడ్డిని బలవంతంగా నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీక్ష ఐదో రోజుకు చేరుకోగా, జగన్ ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది. వెంటనే ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచించినా, ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. నిమ్స్ ఆస్పత్రిలో వైఎస్ జగన్ ను కొణతాల రామకృష్ణ, వాసిరెడ్డి పద్మలతోపాటు పలువురు నేతలు కలిశారు. 

బలవంతంగా ఫ్లూయిడ్స్: జగన్ దీక్ష భగ్నం

బలవంతంగా ఫ్లూయిడ్స్: జగన్ దీక్ష భగ్నం
బలవంతంగా ఫ్లూయిడ్స్: జగన్ దీక్ష భగ్నం
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నిమ్స్ వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. భారీ సంఖ్యలో పోలీసులను కూడా వార్డులోకి అనుమతించారు. పోలీసులతో పాటు నర్సులు కూడా వైఎస్ జగన్ చేతిని గట్టిగా పట్టుకుని మరీ ఫ్లూయిడ్స్ ఎక్కించారు.
అంతకుముందు బుధవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు జగన్ మోహన్ రెడ్డిని బలవంతంగా నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీక్ష ఐదో రోజుకు చేరుకోగా, జగన్ ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది. వెంటనే ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచించినా, ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. జగన్ ను ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పినా ఆయన ససేమిరా అనడంతో బలవంతంగా నిమ్స్ కు తరలించారు. అయితే, పోలీసుల ప్రయత్నాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగన్ అభిమానులు తీవ్రంగా ప్రతిఘటించారు. కొడాలి నాని తదితరులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, పోలీసులు ఆయనను బలవంతంగా అంబులెన్సులో ఎక్కించి దీక్షా ప్రాంగణం నుంచి తరలించారు.

నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు దీక్ష చేయడం వల్ల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. సమైక్య దీక్ష మొదలు పెట్టి నూట అయిదు గంటలు దాటిపోయింది. జగన్ ను మధ్యాహ్నం పరీక్షించిన వైద్యులు హార్ట్ బీట్ 72గా ఉందని తెలిపారు.  సుగర్ లెవల్స్ నిన్నటికీ ఈరోజుకు తగ్గిపోయాయని చెప్పారు. జగన్ షుగర్‌ లెవల్స్ 54కు పడిపోయినట్లు,  బీపీ 120/90, కీటోన్స్‌ 4+ గా ఉన్నట్లు వివరించారు.  శరీర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని   హెచ్చరించారు. ఏ క్షణంలోనైనా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్ హెచ్చరించారు. ఈ పరిస్థితులలో ఆయన దీక్ష విరమించడం మంచిదని సలహా ఇచ్చారు. అభిమానులు కూడా ఆయన చేత దీక్ష విరమింపజేసేందుకు కృషి చేయాలని కోరారు.

ఈ నేపధ్యంలో సతీమణి భారతి, మామ గంగిరెడ్డి వచ్చి జగన్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం క్షీణించిడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ఆరోగ్యం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ దగ్గర నుంచి జాతీయ నాయకులు, పార్టీ నేతలు, బంధువులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీక్ష విరమించాలని కోరుతున్నారు.  ఆయన మాత్రం ససేమీరా అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం దీక్ష కొనసాగిస్తానని చెప్పారు.

నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష



నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష
హైదరాబాద్ : రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించడానికి వీల్లేదని, ఆంధ్ర ప్రదేశ్ ను యథాతథంగా ఉంచాలంటూ లోటస్ పాండ్ లోని తన నివాసం వద్ద గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పోలీసులు బుధవారం రాత్రి బలవంతంగా నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 1066 అంబులెన్సులో ఆయనను లోటస్ పాండ్ లోని దీక్షా ప్రాంగణం నుంచి నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అక్కడ కూడా ఆయన తన దీక్ష కొనసాగింపునకే మొగ్గు చూపారు. వైద్యులు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేశారు. కానీ జగన్ మాత్రం చికిత్స తీసుకునేందుకు నిరాకరించారు.

వాస్తవానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య రాష్ట్రం కోసం నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఇంతకుముందు చంచల్ గూడ జైల్లో ఉన్న ఆయన జైల్లోను, తర్వాత ఆస్పత్రిలోను కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. తొలుత జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. అక్కడినుంచి మళ్లీ నిమ్స్ కు తరలించి అక్కడ చికిత్సలు అందించిన విషయం తెలిసిందే.

నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని వైద్యవర్గాలు తెలిపాయి. ఆయన శరీరం అందుకు సహకరించకపోయినా, సంకల్పం మాత్రం దృఢంగా ఉండటం వల్లనే ఇన్ని రోజుల పాటు దీక్ష చేయగలిగారని, ఇక మీదట ఆయన దీక్ష కొనసాగించడం ఆయన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్యులు పదే పదే చెప్పారు. అయినప్పటికీ జగన్ మాత్రం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దీక్ష చేసేందుకే మొగ్గు చూపారు తప్ప విరమించే ప్రసక్తి లేదన్నారు.రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పోలీసులు బలవంతంగా నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీక్ష ఐదో రోజుకు చేరుకోగా, జగన్ ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది

Popular Posts

Topics :