13 May 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Congress Govt. Shaking: Roja

Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012

YS Jagan By Elections Campaign at Ongole

Baton Rally to Support Sakshi at Tank Bund

'సీఎం రాయదుర్గం పర్యటన విఫలం'

అనంతపురం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాయదుర్గం పర్యటన పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార సభలకు జనం రాకపోవడంతో సీఎం ఇష్టమొచ్చినట్లు ప్రసంగించారని ఆయన విమర్శించారు. అభివృద్ధి సంగతి మరిచి తనను, జగన్‌ను విమర్శించడానికే ముఖ్యమంత్రి పరిమితమయ్యారని పేర్కొన్నారు. మంత్రి రఘువీరా రెడ్డి కులాలను రెచ్చగొట్టేవిధంగా ప్రవర్తిస్తున్నారని రామచంద్రారెడ్డి ఆరోపించారు.

'సాక్షి'కి మద్దతుగా కాగడాల ప్రదర్శన

సాక్షి మీడియా అకౌంట్స్ ఫ్రీజ్‌ను నిరసిస్తూ శనివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై జర్నలిస్టులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల యూనియన్ సంయుక్త అధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై గల స్వామి వివేకానంద విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ప్రదర్శన చేపట్టారు. 'సాక్షి'కి మద్దతుగా పెద్ద ఎత్తున జర్నలిస్టులు, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీల నాయకులు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. 'సాక్షి'పై ప్రభుత్వ దమనకాండను ముక్త కంఠంతో ఖండించారు.


న్యూఢిల్లీ: 'సాక్షి' మీడియాకు నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(ఇండియా) బాసటగా నిలిచింది. హరిద్వార్‌లో ప్రారంభమైన 2 రోజుల ఎన్ యూజే(ఐ) జాతీయ కార్యవర్గ సమావేశంలో సాక్షిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అణచివేత ధోరణిని ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎన్ యూజే(ఐ) పశ్చిమబెంగాల్ శాఖ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని ఒడిశా విభాగం బలపరిచింది. సాక్షిపై జరుగుతున్న దాడులపై జాతీయ కార్యవర్గం చర్చించింది. సాక్షి మీడియాపై జరుగుతున్న దాడులతో జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షిపై వేధింపులు మానాలని ఎన్ యూజే(ఐ) హితవు పలికింది.

21 నుంచి మాచెర్లలో జగన్ ప్రచారం

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 21 నుంచి 24 వరకూ వరుసగా నాలుగు రోజుల పాటు గుంటూరు జిల్లా మాచెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. మాచెర్ల వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తరపున జగన్ ప్రచారం నిర్వహిస్తారని ఆయన వివరించారు.

YS Jagan by election Campaign at Ongole

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాకతో ఈతముక్కల గ్రామం జన ప్రభంజనంగా మారింది. మండుతున్న ఎండను లెక్క చేయకుండా ఆత్మీయ నేతను చూసేందుకు ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా జగన్ వారిని ఉద్దేశించి ప్రసంగించారు. విశ్వసనీయతకు నిలబడిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి గెలిపించవల్సిందిగా ఆయన ప్రజల్ని కోరారు.


'నాయకత్వం గుర్తించటంలో హైకమాండ్ విఫలం'

రాష్ట్రంలో సరైన నాయకత్వాన్ని గుర్తించటంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ అన్నారు‌. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అధిష్టానం ఇన్నాళ్లకు పొరపాటు చేశామన్న భావన గ్రహించిందన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ విషయం తనకు అర్థమైందన్నారు. దేశ రాజకీయాల్లో అప్పటికి ఇప్పటికీ ఎంతో మార్పొచ్చిందని నాదెండ్ల అన్నారు.

జనం నుంచి అక్రమంగా 40వేల కోట్లు వసూలు చేసి భయంకర ఆర్థిక సామ్రాజ్యాన్ని రామోజీ.....

ప్రభుత్వం జారీ చేసిన అటాచ్ మెంట్లను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని దక్కన్ క్రానికల్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి అన్నారు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడికి నిరసనగా జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ ఈనాడు బొమ్మ అయితే సాక్షి బొరుసు వంటిదన్నారు. ప్రత్యామ్నాయ గొంతును నొక్కడం తప్పు అని... సాక్షి చదవటం పాఠకుల హక్కు అన్నారు. 

సాక్షిపై ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అన్నారు. సాక్షిపై ప్రభుత్వ చర్యలు అనవసరమన్నారు. రిజర్వ్ బ్యాంక్ చట్టాలను ఉల్లంఘించిన రామోజీపై ఎలాంటి చర్యలు లేవని ఆయన గుర్తు చేశారు. జనం నుంచి అక్రమంగా 40వేల కోట్లు వసూలు చేసి భయంకర ఆర్థిక సామ్రాజ్యాన్ని రామోజీ సృష్టించారన్నారు. సాక్షి మీడియాపై జరిగిన దాడి నిస్సందేహంగా పత్రికా స్వేచ్ఛపై జరిగిందేనన్నారు. సాక్షి మీడియాపై దాడి పత్రికలపై దాడి కాదనటం శోచనీయమన్నారు.

'పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించరాదు'

రాజకీయాల్ని రాజకీయంగానే ఎదుర్కొవాలే తప్ప ప్రజా ప్రయోజనాల్ని దెబ్బతీసే విధంగా వ్యవరించరాదని ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న వాతావరణం ఎంత మాత్రం మంచిది కాదన్నారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించకుండా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు.

వ్యక్తిగత, రాజకీయ కక్షలతో పాలకులు అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారని వార్త బిజినెస్ ఎడిటర్ ప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వివాదాలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. సెజ్ ల వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర చాలా తక్కువన్నారు. వ్యక్తిగత కక్షలతో పత్రికా స్వాతంత్ర్యాన్ని హరించటం మంచిది కాదని ప్రసాద్ రెడ్డి సూచించారు.

జర్నలిస్ట్ ల మధ్య చీలిక తేవడాని ప్రయత్నించేకన్నా తమ ఛానెల్లో, పత్రికలో పనిచేసే ఉద్యోగులను సరిగ్గా చూసుకునే విషయంపై దృష్టి పెట్టాలని జర్నలిస్ట్ సంఘ నేత అమర్ అన్నారు. మీడియా ప్రచారంతో రాజకీయ పార్టీలు గెలుస్తాయంటే.. ఇందిరా గాంధీ ఓడిపోవడానికి ఏ మీడియా సహకరించినది ప్రశ్నించారు. మీడియాలో వస్తున్న పెట్టుబడులన్నింటిపై విచారణ జరిపించాలని అభిప్రాయపడ్డారు. 

సాక్షిపై సీబీఐ చర్యలు ప్రతికాస్వేఛ్చకు ఆటంకం కలగించడమేనని ఐజేయూ నేత శ్రీనివాసరెడ్డి అన్నారు. సాక్షిపై దాడులకు తమ బాధ్యత లేదన్న రాష్ట్ర సర్కారు రాత్రికి రాత్రే జీవో ఎందుకు జారీ చేయాల్సివచ్చిందని ప్రశ్నించారు.

ఆ వ్యక్తిది పైశాచిక ఆనందం:'నమస్తే తెలంగాణ' సీఈవో

రాష్ట్రంలో ఒక పత్రిక నిర్వహిస్తోన్న వ్యక్తి తన చేష్టల ద్వారా పైశాచిక ఆనందం పొందుతున్నారని 'నమస్తే తెలంగాణ' సీఈవో కట్టా శేఖర్‌రెడ్డి మండిపడ్డారు. జర్నలిస్టుల ర్యాలీలో పాల్గొంటే ఉద్యోగాలు పోతాయని ఆవ్యక్తి తమ ఉద్యోగులను హెచ్చరించారని విమర్శించారు.


ఆయనకు మనసు లేదా అంటూ శేఖర్‌రెడ్డి నిలదీశారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండు టేబుల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'సాక్షి' పత్రికకున్న కోటి 40 లక్షల మంది పాఠకుల స్వేచ్ఛమీద దాడి జరుగుతున్నందున ఈ దాడిని ప్రతిఘటిస్తున్నామని అన్నారు. పత్రిక నిర్వహణకు ఆటంకం కలిగించే ఏ చర్యనైనా వ్యతిరేకిస్తామని కట్టా శేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.

వణుకుతున్న కాంగ్రెస్ సర్కారు: రోజా

'సాక్షి' అంటేనే కాంగ్రెస్‌ సర్కార్‌కు వణుకుపుడుతోందని, అందుకే అర్ధరాత్రి జీఓలు విడుదల చేస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు రోజా విమర్శించారు. జగన్‌పై కక్షసాధింపుతో 'సాక్షి'ని అణగదొక్కాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. వివాదాస్పద జీవోలకు సంబంధించి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌ జీవోపై సంతకం చేయటం సిగ్గుచేటన్నారు. 'సాక్షి'ని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భయపడుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు.

వణుకుతున్న కాంగ్రెస్ సర్కారు: రోజా

'సాక్షి' అంటేనే కాంగ్రెస్‌ సర్కార్‌కు వణుకుపుడుతోందని, అందుకే అర్ధరాత్రి జీఓలు విడుదల చేస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు రోజా విమర్శించారు. జగన్‌పై కక్షసాధింపుతో 'సాక్షి'ని అణగదొక్కాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. వివాదాస్పద జీవోలకు సంబంధించి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌ జీవోపై సంతకం చేయటం సిగ్గుచేటన్నారు. 'సాక్షి'ని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భయపడుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు.

Poltics Revenge on Sakshi Media:Murali, sakshi editor

సీబీఐని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది: ఏబీకే

సీబీఐని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రముఖ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ అన్నారు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడికి నిరసనగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారం జరుగుతున్న రౌండు టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాక్షి పత్రికకు ప్రకటనలు నిలిపివేయటం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రభుత్వం సీబీఐని ఉపయోగించుకుంటున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. సాక్షి సిబ్బంది అంతిమంగా విజయం పొందుతారని ఏబీకే ఆకాంక్షించారు.


సంక్షోభం వచ్చినప్పుడు జర్నలిస్టులంతా ఏకతాటిపైకి రావాలని సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచారి పిలుపునిచ్చారు. పత్రికను అమ్ముకోవటం, ప్రకటనలు తెచ్చుకోవటం పత్రికా స్వేచ్ఛలో భాగమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని పలు కోర్టులు తీర్పులు చెప్పాయని వరదాచారి గుర్తు చేశారు. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు మాత్రమే పత్రిక ఖాతాలు ఫ్రీజ్ చేయవచ్చని ఆయన అన్నారు.


రాజకీయ కారణాలతో మీడియాపై దాడులు చేయకూడదనే సంకేతాలను ప్రజల్లోకి వెళ్లాలని సాక్షి దినపత్రిక ఎడిటర్ మురళి అన్నారు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడికి నిరసనగా శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండు టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాక్షి పత్రిక, ఛానల్ ను మూసివేస్తున్నారనే వదంతులతో తమ సంస్థ ఉద్యోగులు ఆందోళనకు గురి అవుతున్నారన్నారు.

Sakshi Vedika with YSR CP Leader PNV Prasad

Special Edition on "DharmaYuddam" 19th May 2012

YS Jagan by election Campaign at Ongole

ఒంగోలు నియోజకవర్గంలో జగన్ ప్రచారం


వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి ఒంగోలు ప్రజలు నీరాజనాలు పలికారు. ఆయన శనివారం ఉదయం వైవీ భద్రారెడ్డి నివాసం నుంచి ఉప ఎన్నికల ప్రచారానికి బయల్దేరారు. రాజన్న బిడ్డను చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ పలకిస్తూ జగన్‌ ముందు కదిలారు.

ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కొత్తపట్నం మండలం ఈతముక్కల, మడనూరు గ్రామాల్లో జరిగే ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.


అనంతరం ఒంగోలు మండలం పరిధిలోని చెరువు కొమ్ముపాలెం, యరజర్ల, సర్వేరెడ్డిపాలెం, వెంగముక్కపాలెంలో పర్యటిస్తారు. ఆ తర్వాత ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్‌లో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో జగన్ ప్రసంగిస్తారు. అక్కడ నుంచి పాత మార్కెట్ సెంటర్‌లో జరిగే రోడ్‌షోలో మాట్లాడతారు. తదనంతరం కర్నూలు రోడ్డులోని సెయింట్ జేవియర్స్ సమీపంలోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత గాంధీనగర్‌లోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.

గుంటూరులో జర్నలిస్టుల అర్థనగ్న ప్రదర్శన

సాక్షి సంస్థలపై సీబీఐ దాడులను నిరసిస్తూ గుంటూరులో జర్నలిస్టులు శనివారం అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. విజ్ఞాన మందిరం సెంటర్‌ నుంచి కార్పొరేషన్‌ మీదుగా గాంధీపార్క్‌ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. గాంధీ విగ్రహం ముందు జర్నలిస్టులు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి గొంతు నొక్కాలని చూడటం ప్రభుత్వానికి తగదని జర్నలిస్టు సంఘాల నేతలు హెచ్చరించారు.

Jagan speech railway kodur

కొరముట్లను ఆశీర్వదించండి


రైల్వేకోడూరు అర్బన్/కడప, న్యూస్‌లైన్: పేదలు, రైతుల కోసం పదవీ త్యాగం చేసిన కొరముట్ల శ్రీనివాసులును ఉప ఎన్నికలలో ఆశీర్వదించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పలుచోట్ల ప్రసంగించారు. జగన్ రాకకోసం జనాలు గంటల తరబడి వేచి చూశారు. శుక్రవారం రైల్వేకోడూరులో వైఎస్ జగన్ పర్యటన అనుకున్న షెడ్యూల్ మేరకు సాగలేదు. మంగంపేట వరకే పర్యటన కొనసాగించి రైల్వేకోడూరు రోడ్‌షోతో ముగించారు.

ఎక్కడ చూసినా రోడ్ల వెంబడి జనాలు ఉండడంతో కాన్వాయ్ ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. జ్వరాన్ని లెక్కచేయక ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా చిరునవ్వుతో పలుకరిస్తూ ఎవరినీ నిరాశపరచకుండా జగన్ ముందుకు కదలడంతో పర్యటన ఆలస్యంగా సాగింది. ప్రతి పల్లెలో జననేతకు పూలవర్షం కురిపించారు. జనాభిమానంతో జగన్ తడిసి ముద్దయ్యారు. వెళ్లెస్తాను తల్లీ...బాయ్ అమ్మా.. బాయ్ అంటూ మందుకు కదిలారు. మంగంపేటలో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అక్కడ హరినాథరెడ్డి, రమణారెడ్డి ఇళ్లకు జగన్ వెళ్లి తేనీటి విందును స్వీకరించారు.

జగన్ ప్రసంగానికి స్పందన
వైఎస్ జగన్ ప్రసంగానికి జనాలు జేజేలు పలికారు. ఆయన అభివాదం చేయగానే ప్రజలు ప్రతివాదం చేస్తూ చేతులు పెకైత్తి తమ అభిమానాన్ని చాటారు. మంగంపేట తనకు మరో ఇళ్లని జగన్ అభివర్ణించారు. త్వరలో సువర్ణయుగం వస్తుందని, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని సమస్యలు లేకుండా చూస్తానన్నారు. 

రైల్వేకోడూరులో పోటెత్తిన జనం
రైల్వేకోడూరులో జనాలు పోటెత్తారు. వేలాది మంది ప్రజలు రోడ్ల వెంబడి జగన్ వెంట నడిచారు. జగన్ ఒంటరి వాడు కాదు...అందరివాడు అని వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి కొరముట్ల అన్నప్పుడు జనాలు మేమున్నామంటూ తమ మద్దతును తెలిపారు. నియోజకవర్గంలో రెండు రోజులపాటు జరిగిన జగన్ పర్యటన ప్రజల ఆప్యాయత, అనురాగాల మధ్య సాగింది.

సర్వమత ప్రార్థనలు
రైల్వేకోడూరు పట్టణంలో తొలుత ముస్లింలతో జగన్ సమావేశమై కొద్దిసేపు వారితో గడిపారు. ఆర్యవైశ్య అన్నసత్రంలో, గంగమ్మ తల్లి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. చిన్నరాజుపోడులో రాజు కులస్తులతో సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు వైఎస్ కొండారెడ్డి, రూపానందరెడ్డి, డీసీసీబీ చైర్మన్ కొల్లం బ్రహ్మనందరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి పంజం సుకుమార్‌రెడ్డి, క్షత్రియ నాయకుడు హేమనవర్మ, మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్, చెవ్వు శ్రీనివాసులురెడ్డి, సాయి కిశోర్‌రెడ్డి,తదితరులు జగన్ వెంట పాల్గొన్నారు.

Rajanna Rajyam Ravali 18th May 2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్య

దుర్గి(గుంటూరు), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాదాసు సాంబశివరావు(40)ను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి తుపాకీతో కాల్చి చంపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. దుర్గి మండలం కంచరగుంటకు చెందిన సాంబశివరావు రాత్రి ఇంట్లో ఒక్కరే నిద్రిస్తుండగా, భార్యా పిల్లలు డాబా పై నిద్రిస్తున్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో కొందరు వచ్చి సాంబశివరావుపై దాడి చేసి తుపాకీతో కాల్చడం వల్లే మృతి చెందాడని భార్య రాణి రోదిస్తూ తెలిపింది. మృతుని ఎడమ ఛాతిపై బుల్లెట్ గాయాలున్నట్టు తెలుస్తోంది. మాచర్ల తాజా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దుర్గి చేరుకుని బాధిత కుటుంబీకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

లిక్కర్ అంటేనే బొత్స.చిరు మెగాస్టార్ కాదు..డబ్బులు దాచిన మెగాస్టోర్

ఢిల్లీ పెద్దల కాళ్లుమొక్కారు: జనక్‌ప్రసాద్
చిరు మెగాస్టార్ కాదు..డబ్బులు దాచిన మెగాస్టోర్

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో లిక్కర్ పేరు వినగానే ప్రజలకు గుర్తొచ్చేది పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఏసీబీ రిపోర్టులో పేరు తొలగించుకోవడానికి ఢిల్లీ పెద్దల కాళ్లను మొక్కిన నీచ చరిత్ర ఉన్న బొత్సకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బొత్సనుద్దేశించి కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను జనక్‌ప్రసాద్ గుర్తుచేశారు. ‘బొత్స మద్యం సిండికేట్ నిర్వహిస్తూ పేదల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. ఆయన ఒక్క మద్యమే కాదు ల్యాండ్ మాఫియా చేస్తూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. బినామీలను పెట్టి సినిమా తీయిస్తున్న చరిత్ర కూడా ఆయనదే’ అని హర్షకుమార్ చెప్పారన్నారు. చంద్రబాబుతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కుమ్మక్కయారని మీడియాకు లీకులిచ్చిన బొత్స... ఇప్పుడు ఏసీబీ రిపోర్టులో తన పేరు తొలగించగానే సీఎంతో కలిసి జగన్‌ను విమర్శిస్తూ ప్రజల్ని వంచిస్తున్నారని మండిపడ్డారు. పీఆర్పీని కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా అమ్మేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ డబ్బును బెడ్ కింద దాచిన మెగాస్టోర్ అని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తికి కూడా జగన్‌ను విమర్శించే స్థాయి ఉందా? అని నిలదీశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు నేపథ్యంలో జగన్‌పై సీబీఐ విచారణ చేపట్టి పది నెలలు కావొస్తున్నా.. ఏ ఒక్కటైనా నిరూపించగలిగారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన వివాదాస్పద 26 జీవోలు చట్టబద్దంగానే జరిగాయని చెప్పే దమ్ము బొత్సకు ఉందా? అని నిలదీశారు. ఒక వేళ చట్టప్రకారం లేకపోతే వాటిని రద్దు చేసే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఆ జీవోలు విడుదలవుతున్నప్పుడు మంత్రిగా ఉన్న బొత్స డీసెంట్ నోట్ ఇవ్వకుండా గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా అని ఎద్దేవా చేశారు. 

జగన్ సీఎం కావాలని సంతకాలు చేయించిందెవరు?

వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత జగన్ సీఎం కావాలంటూ ఎమ్మెల్యేల చేత సంతకాలు చేయించింది ఎవరని బొత్సను జనక్‌ప్రసాద్ నిలదీశారు. పదవుల కోసం ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకొని ఊడిగం చేసే నీచ చరిత్ర కాంగ్రెస్ నేతలదేనని విమర్శించారు. అలాంటి వ్యక్తులకు జగన్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. జూన్ 12 ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి గాల్లో దీపంలా మారనుందన్నారు.

ఆ వైపు చూడని సీబీ‘ఐ’ (must read)

రెండెకరాల నుంచి రూ.లక్షన్నర కోట్లకు బాబు ఎలా ఎదిగారు?
ప్రజాహితం లేకపోయినా వేల ఎకరాల సంతర్పణ
పచ్చి దోపిడీ ధ్యేయంగా భూముల కేటాయింపు
ఉపాధి ఊసు లేకుండా ఆశ్రీతులకు అందినంత ‘చేయూత’
వైఎస్ హయాంకు, బాబు జమానాకు మధ్య తేడా ఇదే..


పరిశ్రమల స్థాపన కోసం భూములివ్వడం, రాయితీలు కల్పించడం నేరమేమీ కాదు. అయితే భూములు, రాయితీలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా... అవి పొందిన సంస్థలు పరిశ్రమలను స్థాపించాయా... ఉపాధి కల్పనకు దోహదపడ్డాయా అన్నదే ప్రధానమైన ప్రశ్న. పారిశ్రామిక విధానం ప్రకారం ఆయా పరిశ్రమలకు ఇస్తున్న భూములు సద్వినియోగం కాకపోతే వెనక్కి తీసుకునే హక్కు రాష్ర్ట ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న జగన్ ఆస్తుల కేసులో పదినెలలుగా సాగుతున్న సీబీఐ విచారణ ఈ మౌలిక అంశాలను పట్టించుకోవడం లేదు. సంస్కరణలు ఉధృతంగా అమలు చేసిన తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ప్రపంచబ్యాంకుకు ప్రయోగశాలగా మార్చారు. 

తనను తాను రాష్ట్ర సీఈవోగా అభివర్ణించుకున్న ఆయన.. కన్వెన్షన్ సెంటర్లు, గోల్ఫ్‌క్లబ్బులపై కేంద్రీకరించినంతగా పరిశ్రమల స్థాపన, సామాన్యుల ఉపాధి అవకాశాలపై దృష్టిపెట్టలేదు. ఆయన హయాంలో జరిగిన భూ కేటాయింపులు, చోటు చేసుకున్న కుంభకోణాలు ఇందుకు నిదర్శనం. నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిన వందలాది ప్రాజెక్టులు కట్టబెట్టారు. వేల ఎకరాలు ధారాదత్తం చేశారు. 

వివిధ సంస్థలకు, సెజ్‌లకు, పోర్టులకు, ఫార్మా కంపెనీలకు చంద్రబాబు కేటాయించిన భూముల విలువ నాటి లెక్కలను బట్టి చూసినా 1.60 లక్షల కోట్లకు పైమాటే. ముఖ్యమంత్రే సొంత ట్రస్టుకు భూమి కేటాయించుకున్న ఉదంతం చంద్రబాబు హయాంలో తప్ప మరెక్కడా కనిపించదు. అనేక పరిమితులున్నా సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టించిన వైఎస్‌కు, దోపిడీయే ధ్యేయంగా పాలన సాగించిన చంద్రబాబుకు మధ్య తేడా తెలియాలంటే 1995 నుంచి జరిగిన భూ కేటాయింపులన్నిటిపైనా దర్యాప్తు జరగాలి. అప్పుడే మౌలికమైన చిక్కుముడులన్నీ విడిపోతాయి. ప్రజాహితానికి, పచ్చిదోపిడీకి మధ్య తేడా తెలుస్తుంది. చంద్రబాబు ఏలుబడిలో జరిగిన భూ కేటాయింపుల తీరును పరిశీలించేందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం...

బాబు - బిల్లీ బాగోతం

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్రీడాప్రాంగణాల ఏర్పాటు పేరుతో ఐఎంజీ అకాడమీస్ భారత అనే బోగస్ సంస్థకు కోట్ల విలువైన 850 ఎకరాల భూములను 2003లో నాటి సీఎం చంద్రబాబు కట్టబెట్టారు. ఐఎంజీ సంస్థను ఏర్పాటు చేసిన అహోబలరావు (బిల్లీరావు), ప్రభాకరరావు (పేటరావు) బాబుకు అత్యంత సన్నిహితులు. ఈ ఇద్దరికీ చెందిన బీహెచ్‌సీ ఆగ్రో సంస్థకు కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ అమలు చేసే ప్రాజెక్టును చంద్రబాబు అంతకుముందు అప్పగించారు.

2003 ఆగస్టు 5న లక్షరూపాయల క్యాపిటల్‌తో బిల్లీరావు, పేటరావు ఐఎంజీ సంస్థను ఏర్పాటు చేశారు. కనీసం కార్యాలయం కూడా లేని ఈ సంస్థకు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, మామిడిపల్లి గ్రామం సమీపంలోని 450 ఎకరాలను కేటాయిస్తూ రూపొందించిన 40 పేజీల అవగాహనా ఒప్పందానికి ఆగస్టు 6న బాబు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అంటే కంపెనీ ఏర్పాటైన ఒక్క రోజులోనే ఒప్పందం రూపకల్పనతో పాటు ఆమోదం లభించిందన్నమాట. 9న సంతకాలు జరిగాయి. దాంతోపాటు ఆ సంస్థకు రకరకాల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తూ బాబు జీవోలు విడుదల చేశారు. 

2004 ఫిబ్రవరిలో తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగానే ఐఎంజీకి 400 ఎకరాల భూమిని చంద్రబాబు రిజిస్టర్ చేయించారు. అక్కడ మార్కెట్‌విలువ ఎకరం రూ. 5 కోట్లు ఉండగా బాబు ఆ సంస్థకు ఎకరం రూ. 50 వేలకే విక్రయించారు. మామిడిపల్లిలో 450 ఎకరాలను ఎకరం రూ.50 వేలకే (రిజిస్ట్రేషన్ సమయంలో రూ.25 వేలు మాత్రమే చెల్లించేలా) విక్రయించేందుకు నిర్ణయించారు. వాస్తవానికి అక్కడ ఎకరం విలువ రూ. కోటి ఉంది. 

అదే ఒప్పందం కింద హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ చంద్రబాబు ఐఎంజీకి 45 ఏళ్లపాటు లీజుకివ్వాలని నిర్ణయించారు. ఉద్యోగుల జీతభత్యాలకు, నిర్వహణ ఖర్చులకు ఏటా రూ.2.5 కోట్ల ప్రజాధనాన్ని ఇవ్వజూపారు. 45 ఏళ్ల తర్వాత ఆ స్టేడియాలను కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఐఎంజీకి కల్పించారు. 

సంస్థ ఏర్పాటు తేదీల నుంచి ఒప్పందంలోని క్లాజుల వరకు అన్ని విషయాల్లోనూ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నా సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదు? 

కంపెనీ ఏర్పడిన మూడు రోజుల్లో.. అదీ సరిగ్గా ఆఫీసు కూడా లేని సంస్థకు 850 ఎకరాలు కట్టబెట్టిన ఉదంతం ఎక్కడైనా ఉందా? ఇందులో ఏ గూడుపుఠాణీ లేదంటారా?

హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా భూమి మార్కెట్ ధర రూ.5 కోట్లుగా ఉన్నపుడు 850 ఎకరాలను ఎకరా కేవలం రూ.50వేల ధరకే కట్టబెట్టాలని చంద్రబాబుకు ఏ ధరల కమిటీ నిర్ణయించి చెప్పింది? సీబీఐకి ఇది తప్పుగా కనిపించడం లేదా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే కీలక నిర్ణయాలు తీసుకోవడం తప్పని సీబీఐ ఎందుకు భావించడం లేదు?

ఎల్ అండ్ టీపై ఎంత ప్రేమ

బాబుకు ఈ కంపెనీతో ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలుసు. బాబు జమానాలో ఈ సంస్థ ఏది కోరితే అది క్షణాల్లో సమకూరేది. 

పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న సీఎం పదవి చేపట్టారు. 4 రోజుల్లోనే ఎల్‌అండ్‌టీకి హైదరాబాద్‌లోని అత్యంత విలువైన ప్రాంతమైన మాదాపూర్‌లో 148 ఎకరాలు ధారాదత్తం చేశారు. ఏడాది వ్యవధిలో మరో 18 ఎకరాలు దానికి దక్కాయి. 

హైటెక్ సిటీ నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు లేకుండానే అప్పనంగా కాంట్రాక్టూ అప్పగించారు. కారుచౌకగా మాదాపూర్‌లోనే మరో 78 ఎకరాలను ఇచ్చారు. అప్పట్లో అక్కడ చదరపు గజం రూ.3 వేల నుంచి రూ.5 వేలు పలుకుతుండగా కారుచౌకగా రూ.1,282 లెక్కన ఖరీదు కట్టారు. దీనివల్ల ఖజానాకు రూ.120 కోట్లు నష్టం వాటిల్లింది.

చదరపు అడుగుకు రూ.2,200 చొప్పున నిర్మించి ఇస్తామని గ్లోబల్ టెక్నో ఇండస్ట్రియల్‌పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చినా వద్దని రూ.2,700 లెక్కన ఎల్ అండ్ టీకే అప్పజెప్పారు. 

సచివాలయంలోని డీ బ్లాక్ నిర్మాణమూ ఈ కోవలోనిదే. విశాఖ లోని హైటెక్ సిటీ నిర్మాణంలోనూ బా బు ప్రేమ ఈ కంపెనీపైనే. ఇలాంటివి బోలెడు. వీటికి ప్రతిగానే ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ను ఎల్‌అండ్‌టీ ఉచితంగా కట్టించి ఇచ్చిందని ఆరోపణలు వచ్చాయి.

సీఎం పదవి చేపట్టిన నాలుగురోజుల్లోనే ఎల్ అండ్ టీకి భూములప్పగించడం చూస్తే చంద్రబాబు ఆతృత కనిపించడం లేదా?

తక్కువకే నిర్మిస్తామన్న కంపెనీని వద్దని ఎల్‌అండ్‌టీకే హైటెక్ సిటీ కాంట్రాక్టు ఇవ్వడంలో సీబీఐకి ఏ లొసుగూ కనబడడం లేదని అనుకోవాలా?

బాబు సేవలకు ప్రతిఫలంగా హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయాన్ని ఎల్‌అండ్‌టీ సంస్థ ఉచితంగా నిర్మించి ఇవ్వడం ‘క్విడ్ ప్రో కో’ కిందకు రాదా? ఆ విషయం సీబీఐకి పట్టదా?

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 5,500 ఎకరాలు

వేల కోట్ల విలువైన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుకు చంద్రబాబు 5,500 ఎకరాలు కేటాయించారు. ఎయిర్‌పోర్టు అనుమతుల కోసమే కాదు. జీఎంఆర్‌కు వివిధ రకాల రాయితీలు ఇప్పించేందుకూ చంద్రబాబు తనకున్న పలుకుబడిని ఉపయోగించారు. నాటి ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ ప్రాజెక్టులో భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో బినామీ పేర్లతో బాబు, ఆయన అనుయాయులు భూములు కొనుగోలు చేశారు. వాస్తవానికి రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట ఈనాడు గ్రూపు కొనుగోలు చేసిన వేల ఎకరాల వివాదాస్పద భూములకూ రియల్ ఎస్టేట్ విలువ పెరగడానికి వీలుగా ఆ ఫిల్మ్ సిటీ వైపే విమానాశ్రయం నెలకొల్పేందుకువిశ్వప్రయత్నం చేశారు. కానీ రక్షణశాఖ అంగీకరించలేదు. శంషాబాద్ సమీపంలో రామోజీకి 431 ఎకరాలు ఉండడం వల్లనే చివరకు ఆ ప్రాంతాన్ని చంద్రబాబు ఖరారు కానిచ్చారు. అయితే ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యంతోనే ఎయిర్‌పోర్టును నిర్మించాలని బాబు జీఎంఆర్‌పై ఒత్తిడి తెచ్చారు. 

ప్రపంచంలో ఎక్కడా అంతర్జాతీయ విమానాశ్రయానికి వెయ్యి నుంచి రెండువేల ఎకరాలకు మించి కేటాయించడమే లేదు. అటువంటిది బాబు ఏకంగా 5,500 ఎకరాలు ఎందుకు కేటాయించినట్లు?

శంషాబాద్ దగ్గర విమానాశ్రయం ప్రాజెక్టు రావడానికి ముందు ఆ ప్రాంతంలో బినామీ పేర్లతో రామోజీరావు భూములు కొనుగోలు చేయడం నిజం కాదా? అంటే ఎయిర్‌పోర్టు విషయం రామోజీకి ముందుగా తెలిసిందన్న ఆరోపణకు బలం చేకూరడం లేదా?ఇది సీబీఐకి పట్టవా?

సెజ్‌లకు ఆదిపురుషుడు బాబే కదా!

చంద్రబాబు అధికారంలో ఉండగా 1996లో 295 ఎకరాల్లో కాకినాడ సెజ్‌కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 1999 చివర్లో భూసేకరణ కోసం ఎకరాకు రూ.3 లక్షలు చెల్లించాలని అప్పటి జిల్లా యంత్రాంగం సూచించింది. అయితే ఎకరాకు రూ.1.25 లక్షలకు మించి చెల్లించాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. 

విశాఖలో రాంకీ సంస్థకు ఫార్మా సెజ్‌ను కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వమే. విశాఖలోని పరవాడ ఫార్మా సెజ్‌లో 2,100 ఎకరాలు కేటాయించిన చంద్రబాబునాయుడును సీబీఐ పట్టించుకోనేలేదు. 

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి, గుండ్లగడ్డ తండాల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం పోలేపల్లి సెజ్‌కోసం 2002లో సేకరించింది. మొత్తం 320 మంది నిరాశ్రయులయ్యారు. ఎకరాకు రూ.60 వేల నుంచి లక్ష వరకూ పరిహారమిచ్చారు. అసైన్డ్ భూములకు ఎకరాకు రూ.18 వేలే చెల్లించారు. 

రాంకీ విషయంలోనూ సీబీఐది అదే ధోరణి. ఎమ్మార్‌లో అనుసరించిన వైఖరే! విశాఖ ఫార్మా సెజ్‌ను కేటాయించిన చంద్రబాబు హయాంలోకి తొంగి చూసేందుకు అది ఎందుకు సిద్ధపడడం లేదు?

విశాఖ సెజ్‌లో గ్రీన్‌బెల్ట్‌ను తగ్గించడానికి వైఎస్ ప్రభుత్వం అనుమతించడం వల్ల రాంకీ సంస్థకు 150 ఎకరాల మేర ప్రయోజనం చేకూరిందని, అందువల్ల అది జగతి సంస్థల్లో రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టిందని సీబీఐ వాదిస్తోంది. 150 ఎకరాలు కలసి వచ్చినందుకు రాంకీ సంస్థ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టి ఉంటే మరి 2,100 ఎకరాలు కేటాయించినందుకు చంద్రబాబుకు ఏమిచ్చి ఉండాలి? ఇవన్నీ సీబీఐకి పట్టవా?

బినామీలకు ‘హైటెక్’ సాయం

హైదరాబాద్ శివార్లలో ఐటీ/సాఫ్ట్‌వేర్ కేంద్రంగా హైటెక్‌సిటీ నిర్మాణం గురించి అధికారికంగా ప్రకటించకముందే నాటి సీఎం చంద్రబాబు బినామీగా ఆయన మిత్రుడు, సినీ నటుడు మురళీమోహన్ అక్కడ భూముల కొనుగోళ్లు మొదలుపెట్టారు. 1996లో గచ్చిబౌలిలో రు.10 లక్షలు చెల్లించి 2.34 ఎకరాల భూమిని ఆయన కొన్నారు. కొద్ది కాలానికే కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్‌లలో హైటెక్‌సిటీ ప్రాజెక్టును చంద్రబాబు ప్రకటించారు. తక్షణం ఆ గ్రామాల్లోని భూముల ధరలు నాటకీయంగా పెరిగిపోయాయి. మురళీమోహన్ ఈ గ్రామాల్లో పలు డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఐటీ, సాఫ్ట్‌వేర్ సంస్థల కోసం అంటూ బాబు కేటాయించిన భూముల్లో చాలా వరకూ ఆయన తన బినామీ సంస్థలకు కేటాయించారు. ఉదాహరణకు వల్లూరిపల్లి ఆగ్రోటెక్, అర్జున్ కంప్యూటర్స్ వంటి సంస్థలు ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరలకు భూములు సంపాదించుకున్నాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి సంస్థలనూ స్థాపించకుండా వాటిని మురళీమోహన్‌కు, ఆయన గ్రూపు కంపెనీలకు బదిలీ చేశాయి. 

సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాలన్నిటినీ దాని పరిధిలోకి తెచ్చిన బాబు మధ్యలో ఉన్న కొండాపూర్‌ను మినహాయించారు. తద్వారా అక్కడి మురళీమోహన్ భూములకు చార్జీల భారాన్ని తప్పించి ఖజానాకు గండికొట్టారనే ఆరోపణలున్నాయి. 

ఐటీ పార్క్ డెవలప్‌మెంట్ కోసం రహేజాకు హైదరాబాద్‌లోని మాదాపూర్ సమీపంలో అత్యంత విలువైన 110 ఎకరాల భూములు అప్పగించారు. వాటి విలువ ఆనాడే రూ.1,100 కోట్లు. అంతేకాదు.. ఏపీఐఐసీకి 11 శాతం వాటాను మిగిల్చి 89% వాటాను రహేజాకు కట్టబెట్టారు.

నగరం మధ్య తమ స్థలాన్ని ఎవరైనా డెవలప్‌మెంట్‌కి ఇస్తే కనీసం 35 నుంచి 40%వరకూ వాటా సొంతదార్లకు ఉండడం ఆనవాయితీ. కానీ రహేజాకు 89% వాటా ఇచ్చి ఏపీఐఐసీ వాటాను 11 శాతానికే ఎందుకు పరిమితం చేసినట్లు? 
అదే సమయంలో ఏపీఐఐసీ వాటా మిగిలిన సంస్థల్లో 49% వరకు నిర్ణయిస్తున్నపుడు రహేజాలకు ఇచ్చిన భూముల్లో ఏపీఐఐసీ వాటాను చంద్రబాబు ప్రభుత్వం ఏమాశించి 11 శాతానికి తగ్గించుకుంది? ఇలాంటి కుంభకోణాలను సీబీఐ పట్టించుకోదా?

సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ కొండాపూర్‌ను మినహాయించడం మురళీమోహన్‌కు లబ్ధిచేకూర్చడం కోసం కాదా?

గనుల ఘనుడు

విజయనగరం జిల్లా గరివిడి మండలంలో గడబవ వలస, ఐతం వలస, బగువలస గ్రామాల పరిధిలో మాంగనీసు నిల్వలు ఉన్న 223.84 ఎకరాల భూమిని 2001 ఫిబ్రవరి 20వ తేదీన ఒకేరోజు మూడు జీవోల ద్వారా ఎస్.కె.స్వరాగి అండ్ కంపెనీకి చంద్రబాబు లీజుకిచ్చారు. విశేషమేమంటే ఈ భూమిని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ ఎండీసీకి 1999లోనే కేటాయించారు. ఏపీఎండీసీకి 2019 వరకూ లీజు అగ్రిమెంటు ఉంది. ప్రభుత్వ రంగ సంస్థకు ఉన్న ఈ అగ్రిమెంటును రద్దు చేస్తూ అదే భూమిని ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించే సమయానికి ఆ భూమిలో దొరికే మాంగనీసు ఖరీదు టన్ను అక్షరాలా రూ.40వేలు. ప్రభుత్వానికి ప్రైవేట్ కంపెనీ చెల్లించే రాయల్టీ నామమాత్రం. గనుల గోల్‌మాల్‌లలో ఇదొక ఉదాహరణ మాత్రమే. అలాంటి చంద్రబాబు నిర్వాకాలపై సీబీఐ విచారణ జరగాలంటారా లేదా?

‘ఏలేరు’ దోపిడీ

ఏలేరు కుంభకోణం బయటపడి 15 ఏళ్లు కావస్తోంది. ఏలేరు కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని పెంచి చెల్లిస్తామన్న పేరుతో నేతలు, ఉన్నతాధికారులు కోట్లు మింగేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వ్యవస్థల్ని నాశనం చేసిన ఈ వ్యవహారంపై ఆది నుంచీ సాంకేతికాంశాల ఆధారంగానే చంద్రబాబు తప్పించుకుంటూ వస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పీలా పోతినాయుడు తూర్పు గోదావరి జిల్లా వెల్లలోని వైశ్యా బ్యాంకులో 1996లో జాయింట్ అకౌంట్ తెరిచి అందులో రూ.2 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. రైతులకు నష్టపరిహారం పేరుతో నాటి బాబు సర్కారు రూ.6.5 కోట్లు విడుదల చేసిన వెంటనే ఆయన ఈ ఖాతా తెరిచారు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు రెండు పేర్లు ఇవ్వాల్సి ఉండగా రెండో బెనిఫిషియరీగా పోతినాయుడు పేరు పెట్టారు. మొదటి బెనిఫిషియరీ పేరును ఖాళీగా ఉంచారు. దీన్ని నాటి సీఎం బాబు కోసం ఖాళీగా వదిలారని ఆరోపణలొచ్చాయి. ఈ కుంభకోణంపై ఏర్పాటైన జస్టిస్ సోమశేఖర కమిషన్ నియామకాన్ని హైకోర్టు సాంకేతిక అంశాల ఆధారంగా కొట్టేసింది. ప్రజాప్రయోజనాలను, రాష్ర్ట ఖజానాకు జరిగిన నష్టాన్ని పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు వ్యవహార శైలిపై ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇంతవరకూ ఓ సబ్‌జడ్జి మాత్రం డిస్మిస్ అయ్యారు. అసలు సూత్రధారులు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. 

పోర్టులన్నీ ప్రైవేట్‌కు ధారాదత్తం...

ప్రైవేట్ సంస్థలకు పోర్టులను అప్పగించడంలో చంద్రబాబు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. బాబు హయాంలో కాకినాడ ఓడరేవు కాంట్రాక్టును సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సీ పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్‌సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ అప్పటి మలేసియా ప్రధాని మహతీర్ మహ్మద్ కొడుకు ఫర్జాన్ అహ్మద్ బినామీ సంస్థ అనే ప్రచారం ఉంది. 
కృష్ణపట్నం పోర్టును అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని 1997లో బాబు నిర్ణయించారు. నాట్కో సంస్థకు ఆ బాధ్యతను అప్పగించారు. 

గంగవరం పోర్టును 2003 ఆగస్ట్‌లో చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరించింది. ఈ పోర్టును డీవీఎస్ రాజు కన్సార్షియానికి అప్పగించారు.

ఇపుడు వాన్‌పిక్‌గా సీబీఐ దర్యాప్తు చేస్తోన్న ‘వాడరేవు నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్’ (వాన్‌పిక్) పునాదులు తవ్వింది చంద్రబాబే. ప్రకాశం జిల్లాలోని వాడరేవు పోర్టు నిర్మాణ పనులను ఇండియన్ బెరైటీస్ అండ్ కెమికల్స్, వామ్‌మేనేజ్‌మెంట్‌సర్వీసెస్, షిప్ స్టీల్‌ఇండియా ఆధ్వర్యంలోని కన్సార్షియానికి బాబు అప్పగించారు. వారు గిట్టుబాటు కాదని చేతులెత్తేశారు. నిజాంపట్నం పోర్టుదీ ఇలాంటి నేపథ్యమే. చెకొస్లోవేకియాకు చెందిన స్కోడా ఎక్స్‌పోర్ట్ కంపెనీకి అప్పగించాలని 2003లోనే చంద్రబాబు నిర్ణయించారు. అదీ ముందుకు సాగలేదు. వాడరేవు, నిజాంపట్నం కాంట్రాక్టర్లిద్దరూ చేతులెత్తేయడంతో రెండింటినీ కలిపి సమీకృతంగా అభివృద్ధి చేయాలని వైఎస్ ప్రభుత్వం తలపెట్టింది. పోర్టులను మాత్రమే అభివృద్ధి చేస్తే లాభదాయకం కాదని బాబు ప్రభుత్వమే ఆమోదించిన నివేదికల నేపథ్యంలో పోర్టులతో పాటు ఆ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్‌నూ అభివృద్ధి చేయాలని వైఎస్ ప్రభుత్వం సంకల్పించింది. జీటూజీ (గవర్నమెంట్ టు గవర్నమెంట్) పద్ధతిలో రాష్ర్ట సర్కారు, రస్ అల్ ఖైమా ప్రభుత్వాల మధ్య వాన్‌పిక్ ఒప్పందం కుదిరింది. బాక్సైట్ తవ్వకాల కోసం గతంలో రస్ అల్ ఖైమాను మన రాష్ట్రానికి తీసుకువచ్చింది చంద్రబాబు సన్నిహితుడైన కోనేరు ప్రసాదే. వాన్‌పిక్‌లో స్థానికంగా భాగస్వామిని తీసుకునే యోచనతో నిమ్మగడ్డ ప్రసాద్‌కి చెందిన ‘మ్యాట్రిక్స్ ఎక్స్‌పోర్టు’ సంస్థతో రస్ అల్‌ఖైమా ప్రభుత్వం జతకట్టింది. వైఎస్ ప్రభుత్వం నేరుగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు భూములిచ్చిందే లేదు. 

వాన్‌పిక్‌పై సీబీఐ ఎందుకు అడ్డగోలు వాదనలు చేస్తున్నట్లు? ఈ ప్రాజెక్టులోని వాడరేవు, నిజాంపట్నం పోర్టులను ప్రైవేట్ కన్సార్షియాలకు అప్పగించింది చంద్రబాబు కాదా?

ఈ ప్రాజెక్టులో రాష్ర్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది రస్ అల్‌ఖైమా ప్రభుత్వం. రస్ అల్‌ఖైమాను బాక్సైట్ తవ్వకాల కోసం రాష్ట్రానికి తీసుకువచ్చింది చంద్రబాబే కదా?

నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య కుదిరిన వాన్‌పిక్ ఒప్పందంలో తొలుత నిమ్మగడ్డ లేనే లేరు. రస్ అల్‌ఖైమాలో ఆ తర్వాత భాగస్వామిగా చేరారు. నిమ్మగడ్డకు వైఎస్ ప్రభుత్వం భూములిచ్చిందెక్కడ?


ఇది క్విడ్ ప్రో కో కాదా?

చంద్రబాబు సీఎంగా ఉండగా జరిగిన లాలూచీ వ్యవహారాలు సీబీఐకి క్విడ్ ప్రో కోగా కనిపించవు. రిలయన్స్ వంటి పేరు మోసిన సంస్థలకు చంద్రబాబు కుప్పలు తెప్పలుగా రాయితీలు ఇచ్చారు.. అదే రిలయన్స్ సంస్థ.. నష్టాల్లో ఉన్న ఈనాడుకు ఆపన్నహస్తం అందించింది. 100 రూపాయలున్న షేరును 5,28,000 రూపాయలు పోసి కొనుగోలు చేసింది.. అలా ఈనాడుకు అవసరమైనప్పుడల్లా కోట్ల కొద్దీ పెట్టుబడులు ప్రవహించాయి. ఇందుకు ప్రతిగానే ఈనాడు పత్రికలోనూ, చానెల్ లోనూ చంద్రబాబును ఆకాశానికెత్తుతూ వరుస కథనాలు వస్తుంటాయి. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన క్విడ్ ప్రో కోకు ఇదొక ఉదాహరణ మాత్రమే... మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు వందల కోట్ల రూపాయలు ఉన్నాయని రామోజీరావే స్వయంగా ఒప్పుకున్నారు. ఆ డబ్బులన్నీ చంద్రబాబే బినామీ పేర్లతో మార్గదర్శిలో పెట్టారన్న ఆరోపణలకు ఇప్పటివరకూ అటు రామోజీరావుగానీ, చంద్రబాబు గానీ జవాబివ్వలేకపోయారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రయోజనం పొందిన అనేకమంది పారిశ్రామిక వేత్తలు బినామీ పేర్లతో ఇలా మార్గదర్శికి నిధులు ప్రవహింపజేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. 

బాబు బండారంపై ‘సెస్’

చంద్రబాబు హయాంలో సెజ్‌ల పేరిట పెట్టుబడులను ఆకర్షించే దిశగా పన్ను రాయితీలు, చౌకగా భూములు కట్టబెట్టడం వెనక ఉన్న అసలు రహస్యాన్ని ‘సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్’(సెస్) విశ్లేషిస్తూ రూపొందించిన మోనోగ్రాఫ్ (ఏక విషయక నివేదిక)ను ఇటీవల విడుదల చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రూపొందించిన పారిశ్రామిక, సెజ్ విధానాలు ప్రైవేట్ వ్యక్తులు ఆస్తులు సమకూర్చుకోవడానికి ఉపయోగపడ్డాయే తప్ప పారిశ్రామిక ప్రగతికి దోహదపడలేదని ‘సెస్’ విశ్లేషించింది. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడాన్ని.. టీడీపీలో జరిగిన సాధారణ మార్పుగా మాత్రమే చూడటానికి లేదని సెస్ నివేదిక తేల్చింది. 

తెలుగుదేశంలోని సంక్షోభాన్ని తారస్థాయికి చేర్చడంలో పెట్టుబడిదారీవర్గం విజయం సాధించిందని పేర్కొంది. ఈ వర్గంలో రామోజీరావు ప్రధాన పాత్ర పోషించారు. ‘‘పెట్టుబడిదారీవర్గం అండతో చంద్రబాబు అధికారంలోకి రావడంతో.. పెట్టుబడిదారుల అనుకూల రాష్ట్రంగా పేరు తీసుకురావడంలోనూ ఈ వర్గం తమదైన పాత్ర పోషించింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే.. సీఎం కార్యాలయం పని తీరునే మార్చేశారు. పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి నేరుగా, ముఖాముఖి మాట్లాడానికి సీఎంవో వేదికైంది’ అని నివేదిక వెల్లడించింది. 

‘తమ వల్ల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో చూపించడానికి ఒక మోడల్ స్టేట్, ఒక రోల్ మోడల్ సీఎం కావాలని ప్రపంచబ్యాంకు, డీఎఫ్‌ఐడీ లాంటి అంతర్జాతీయ సంస్థలు వెతుకుతున్న రోజుల్లో.. పెట్టుబడిదారీ అనుకూల విధానాలు, పారిశ్రామికవేత్తలతో భేటీల కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు చూపిస్తున్న అత్యుత్సాహం.. ప్రపంచబ్యాంక్ ‘పోస్టర్ బాయ్’కి అతికినట్టు సరిపోయాయి. దీంతో అంతర్జాతీయ సంస్థలు సంస్కరణవాదిగా చంద్రబాబుకు పాశ్చాత్య మీడియాలో అత్యంత ప్రచారం కల్పించాయి. సెజ్‌లతో సహా తమ ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి ఆయన్ను వినియోగించుకున్నాయి’’ అని వివరించింది. 

దర్యాప్తు సంస్థలు ఇవెందుకు చేయవు?

రాజకీయ నాయకులు, పార్టీల ఆరోపణలు.. సరే... సెస్ వంటి ఉన్నత ప్రమాణాలుగలిగిన సామాజిక సంస్థలు నిగ్గు తేల్చిన నిజాలను కూడా దర్యాప్తు సంస్థలు పట్టించుకోవా?

చంద్రబాబు హయాంలో భూముల కేటాయింపులు ఏ తీరు సాగాయో... అవి ఎవరికి ఉపయోగపడ్డాయో సెస్ నివేదిక సోదాహరణంగా బట్టబయలు చేసినా ఆవైపు ఎందుకు దృష్టి సారించడం లేదు?

స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీబీఐ వంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలు కళ్లెదురుగా అక్రమాలు జరిగినా పట్టించుకోకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల డెరైక్షన్‌లోనే నడవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ఏది తప్పు? 

శ్రీమంతులు గోల్ఫ్ ఆట ఆడుకోవడానికి, విలాసవంతమైన విల్లాలు - ఫైవ్ స్టార్ హోటళ్లు కట్టుకోవడానికి హైదరాబాద్ నడిబొడ్డున చంద్రబాబు ఎమ్మార్ సంస్థకు 535 ఎకరాలను ధారాదత్తం చేశారు. ఎకరం రూ.4 కోట్ల విలువైన భూమిని రూ.29 లక్షలకే కట్టబెట్టారు. దీనివల్ల పేదలకు ఎటువంటి ఉపయోగమూ లేదు. ఉపాధికీ ఉపయోగపడే అవకాశమూ లేదు. అయినా అదెవరికీ తప్పుగా కనిపించడం లేదు.

వెనకబడిన మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పరిశ్రమల స్థాపన కోసం రెండు సంస్థలకు 75 ఎకరాల చొప్పున వైఎస్ కేటాయించారు. వాస్తవానికి ఆ భూములను ఫార్మాసెజ్ కోసం చంద్రబాబు హయాంలోనే సేకరించారు. అవి చాలాకాలం ఖాళీగా పడి ఉన్నాయి కూడా. ఎకరం రూ.15 లక్షల విలువైన భూమిని రూ.8 లక్షలకు వైఎస్ హయాంలో ఇచ్చారు. నాటి పారిశ్రామిక విధానం ప్రకారం ఇచ్చిన ఈ రాయితీ వల్ల పరిశ్రమలునెలకొల్పుకోగలుగుతామన్న విషయాన్ని, వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్న అంశాన్ని విస్మరిస్తున్నారు. దీనినే తప్పుగా చూస్తున్నారు.

ఈ రెండు ఉదంతాలలో ఏది తప్పు.. ఏది ఒప్పు..? దీనిని తేల్చాల్సిన సీబీఐ ఒకవైపే ఎందుకు చూస్తున్నది? రెండోవైపు ఎందుకు చూడడం లేదు?

ఓటర్ గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు!


ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అంతా వెబ్‌కాస్టింగ్
ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీకి రాష్ట్రం ప్రసిద్ధి చెందిందంటూ వ్యాఖ్య
ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్

హైదరాబాద్, న్యూస్‌లైన్: నెల్లూరు లోక్‌సభతో పాటు 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు నిర్వహించనున్న ఉప ఎన్నికల్లో ఓటర్ గుర్తింపు కార్డు లేదా బూత్ స్థాయి ఆఫీసర్లు పంపిణీ చేసిన ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్ ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ హరిశంకర బ్రహ్మ తెలిపారు. ఇకపై పాన్‌కార్డు, రేషన్‌కార్డు వంటి ఇతర గుర్తింపు కార్డులు చెల్లవని చెప్పారు. రాష్ట్రంలో ఓటర్లందరికీ ఫొటో గుర్తింపు కార్డుల పంపిణీ నూరు శాతం పూర్తయినందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఫొటో ఓటర్ స్లిప్‌తో పాటు గుర్తింపు కార్డును కూడా తీసుకువెళ్లాలని, గుర్తింపు కార్డు లేకపోతే ఓటర్ స్లిప్‌తోనైనా ఓటు వేయవచ్చునని వివరించారు.

పోలింగ్‌కు ఇంకా సమయం ఉన్నందున గుర్తింపు కార్డు లేనివారు బూత్ స్థాయి ఆఫీసర్లకు దరఖాస్తు చేస్తే మంజూరు చేస్తారని తెలిపారు. ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్‌లను పోలింగ్ తేదీకి ముందుగానే బూత్‌స్థాయి ఆఫీసర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయిస్తామన్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేయడమంటే ఓటర్లు అందరూ తప్పకుండా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ఆహ్వానించడమేనని విశ్లేషించారు. ఉప ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్, డీజీపీ దినేశ్‌రెడ్డిలతో కలిసి బ్రహ్మ శుక్రవారం సచివాలయం నుంచి 12 జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మతం, కులం పేరుతో ఎవరు ఎన్నికల ప్రచారం నిర్వహించినా తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేశారు. ఫలానా మతానికి, కులానికి ఓటు వేయమని అడిగినా నేరమేనన్నారు. ఇలాంటి వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించి ఈసీకి పంపించిన కేసులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పోలింగ్ ప్రక్రియంతా వెబ్‌కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు వేసినా బోగస్ ఓట్లు వేసినా వెబ్ కాస్టింగ్ ద్వారా కనుగొని అరెస్టు చేస్తామన్నారు. అలాంటి చోట్ల రీపోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధికెక్కిందని బ్రహ్మ వ్యాఖ్యానించారు. డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నవారి గురించి సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే రూ.15.40 కోట్లు స్వాధీనం చేసుకున్నారని, మరో గంట అయితే అది రూ.16 కోట్లకు చేరవచ్చంటూ వాఖ్యానించారు.

రాష్ట్రంలో పెయిడ్ న్యూస్ ఎక్కువగా ఉందన్నారు. అభ్యర్థి వ్యయంలో 30 శాతం మీడియాకే వెళ్తోందని చెప్పారు. రాష్ట్రంలోని చానల్స్ అన్నీ ఏదో ఒక రాజకీయ పార్టీతో ముడిపడి ఉన్నాయన్నారు. సాధారణంగా మీడియాలో ఇస్తున్న ప్రకటనలను, చేస్తున్న ప్రసారాలను అంచనా వేస్తామని, ఏదో ఒక అభ్యర్థికి అనుకూలంగా ఎక్కువగా ప్రసారం చేస్తే ఆ వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలో చేస్తామని బ్రహ్మ వివరించారు. మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.
రెడీ అవుతున్న భావితరం ఈవీఎంలు: భావితరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) ఈసీఐఎల్‌లో తయారు చేస్తున్నారని బ్రహ్మ చెప్పారు. ఆ ఈవీఎంల తయారీ ప్రక్రియను శనివారం పరిశీలించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుత ఈవీఎంల ద్వారా ఎవరికి ఓటు వేయాలనుకుంటే వారికి వేస్తున్నామని, అయితే ఆ ఓటు తాము వేసిన వారికి పడిందో లేదో అనే అనుమానం ఉంటోందన్నారు. ఈ నేపథ్యంలో ఓటు ఎవరికి పడిందో కూడా కనిపించే విధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తయారు చేస్తున్నారన్నారు. మనం ఎవరికి ఓటు వేశామో ఆ పార్టీ గుర్తు ఓటింగ్ యంత్రంపై డిస్‌ప్లే అవుతుందని, ఆ మేరకు స్లిప్ కూడా వస్తుందన్నారు. అయితే ఆ స్లిప్ ఓటర్‌కు అందుబాటులో ఉండదన్నారు. అన్నివిధాలుగా పరీక్షించాకే వీటిని వినియోగంలోకి తెస్తామని చెప్పారు.

జీవోలు కాన్ఫిడెన్షియలా?: జీవో అంటేనే పబ్లిక్ డాక్యుమెంట్ అని అలాంటి వాటిని కాన్ఫిడెన్షియల్ అని ఎలా అంటారని బ్రహ్మ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జీవోలను కాన్ఫిడెన్షియల్ పేరుతో బయటకు తెలియనివ్వడం లేదన్న ఒక విలేకరి ప్రశ్నకు బ్రహ్మ స్పందించారు. బదిలీలు చేయడం, పోస్టింగ్స్ ఇవ్వడం, కొత్త పథకాలు, నిధుల మంజూరులాంటివి చేస్తూ జీవోలు ఇస్తే కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. అలాంటి కాన్ఫిడెన్షియల్ జీవోలను మీడియా వెలుగులోకి తెస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

భారతదేశ చరిత్రలో మీడియా అటాచ్‌మెంట్ ఇదే ప్రథమం .‘సాక్షి’ గొంతు నొక్కటానికి విడుదల చేస్తున్న జీవోలన్నీ అర్ధరాత్రే విడుదల


‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
సునీల్‌రెడ్డి, కోనేరు ప్రసాద్ ఆస్తులు కూడా అటాచ్‌మెంట్ 
శుక్రవారం సాయంత్రం మూడు రహస్య జీవోలు విడుదల 
ఉత్తర్వుల తయారీ నుంచి సంతకాల దాకా అంతా గోప్యమే 
జీవోల్లోని సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు
హోంమంత్రి ఇంటికెళ్లి సంతకం పెట్టించిన ప్రిన్సిపల్ సెక్రటరీ 
అంతా స్వయంగా దగ్గరుండి చూసుకున్న ముఖ్యమంత్రి 
‘సాక్షి’కి సత్వర న్యాయం అందకూడదనే వారాంతంలో విడుదల 
జీవోల ఆధారంగా అటాచ్‌మెంట్‌కు కోర్టు అనుమతి కోరనున్న సీబీఐ 
సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులనుబట్టి తదుపరి చర్యలు 
కోర్టు అనుమతించినా ‘సాక్షి’ రోజువారీ కార్యకలాపాలు యథాతథం
ఆస్తుల క్రయవిక్రయాలు, బదలాయింపులు మాత్రమే నిషేధం 
భారతదేశ చరిత్రలో మీడియా అటాచ్‌మెంట్ ఇదే ప్రథమం 
{బిటిష్ పాలనలోనూ లేని నిర్ణయాలకు కిరణ్ సర్కారు ఓకే 
{పకటనల నుంచి అటాచ్‌మెంట్ వరకూ అన్నీ అర్ధరాత్రి చర్యలే

హైదరాబాద్, న్యూస్‌లైన్: కుట్రలు పదునెక్కుతున్నాయి. కుయుక్తులు తీవ్రమవుతున్నాయి. ‘సాక్షి’ గొంతులో కత్తులు దించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. స్వతంత్ర భారత చరిత్రలోనే కాదు.. బ్రిటిష్ వారి హయాంలో సైతం జరగని ఘోరాలకు రాష్ట్రం వేదికవుతోంది. అర్ధరాత్రి జీవోలు, చీకటి జీవోల పంచన రహస్య జీవోలూ వచ్చి చేరుతున్నాయి. నల్ల జీవోతో ‘సాక్షి’కి ప్రకటనలివ్వటాన్ని నిషేధించి ఆర్థికంగా దెబ్బకొట్టాలని చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకున్నా రాష్ట్ర ప్రభుత్వం తీరు మారలేదు. 24 గంటలు కూడా తిరక్కముందే మరో చీకటి జీవోను విడుదల చేసింది. ‘సాక్షి’ పత్రిక, టెలివిజన్ చానల్ ఆస్తుల్ని అటాచ్ చేసుకోవటానికి సీబీఐకి అనుమతినిస్తూ శుక్రవారం రహస్య జీవోను విడుదల చేసింది. అంతే రహస్యంగా ప్రత్యేక దూత ద్వారా దీన్ని సీబీఐకి అందజేసింది. సీబీఐ ఇప్పుడు ఈ జీవో ఆధారంగా జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల ఆస్తుల్ని అటాచ్ చేసుకోవటానికి (తన కస్టడీలోకి తీసుకోవటానికి) అనుమతివ్వాలని కోర్టును కోరుతుంది. అనుమతి ఇవ్వటమా.. నిరాకరించటమా.. అన్నది కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కోర్టు గనక అనుమతిస్తే.. ఆ తరవాత సీబీఐ తాను పేర్కొన్న ఈ మూడు సంస్థల ఆస్తుల్ని తన కస్టడీలోకి తీసుకుంటుంది. అంటే అప్పటి నుంచి వీటిని విక్రయించటం కానీ, వేరొకరికి బదలాయించటం కానీ వీలుపడదన్న మాట. అయితే ఇవి ఉద్యోగులతో, రోజువారీ కార్యకలాపాలతో నడిచే సంస్థలు కాబట్టి ఆ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవన్నది న్యాయ నిపుణుల మాట. ‘‘అటాచ్‌మెంట్ అంటే.. ఆస్తుల బదిలీ, విక్రయాల నిషేధం మాత్రమే. సంస్థల రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు’’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. 

ఇప్పుడంత అవసరం ఉందా? 

నిజానికి ప్రభుత్వాధికారులు, పబ్లిక్ సర్వెంట్లు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని విక్రయించేస్తారనో వేరొకరికి బదలాయిస్తారనో భయపడినప్పుడు.. ఒకరకమైన అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు మాత్రమే దర్యాప్తు సంస్థలు ఆ ఆస్తుల్ని అటాచ్ చేసుకోవటానికి (కస్టడీలోకి తీసుకోవటానికి) ప్రభుత్వం అనుమతిస్తూ ఉంటుంది. ‘సాక్షి’ విషయంలో అలాంటి పరిస్థితులేవీ లేవు. ‘సాక్షి’ ఆస్తుల్ని వేరొకరికి బదలాయిస్తారన్న భయాలూ లేవు. కానీ మీడియా గొంతు నొక్కాలనే ఏకైక ఉద్దేశంతో ఈ జీవోను జారీ చేశారన్నది సుస్పష్టం. ఎందుకంటే సీబీఐ కస్టడీకి ప్రభుత్వం అనుమతించిన మూడు సంస్థలూ మీడియాతో ముడిపడినవే. జగతి పబ్లికేషన్స్ సంస్థ ‘సాక్షి’ని ప్రచురించేది కాగా.. ఇందిరా టెలివిజన్ సంస్థ ‘సాక్షి’ చానల్‌ను నడుపుతోంది. ఇక ‘సాక్షి’ భవనాల యాజమాన్యం జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేతిలోనే ఉంది. అందుకే ఈ మూడు సంస్థల్నీ టార్గెట్ చేశారన్నది ఇక్కడ సుస్పష్టం. దీంతో పాటు ఎమ్మార్ కేసులో అరెస్టయిన సునీల్‌రెడ్డి, కోనేరు ప్రసాద్‌ల ఆస్తుల్ని కూడా సీబీఐ అటాచ్ చేసుకోవటానికి ప్రభుత్వం సమ్మతించింది. ఈ మేరకు సీబీఐ ఎస్‌పీ సి.హెచ్.వెంకటేష్‌కు అనుమతిస్తూ జీవో నంబర్లు 87, 88, 89 లతో విడుదల చేసిన ఈ ఉత్తర్వుల్ని ప్రభుత్వం తన వెబ్‌సైట్లో పెట్టింది కానీ.. వాటిని ‘కాన్ఫిడెన్షియల్’ అన్న కేటగిరీలో ఉంచింది. అంటే రహస్య జీవోలన్న మాట. వాటిలోని వివరాలు బయటకు చెప్పరు.

అన్నీ చీకటి చర్యలే... 
ఎందుకో తెలియదు కానీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ‘సాక్షి’ గొంతు నొక్కటానికి విడుదల చేస్తున్న జీవోలన్నీ అర్ధరాత్రే విడుదలవుతున్నాయి. ‘సాక్షి’ బ్యాంకు ఖాతాలను ఈ నెల 8న సీబీఐ స్తంభింపజేయగా.. ఆ మర్నాడు అర్ధరాత్రి ‘సాక్షి’కి ప్రభుత్వం తరఫున ప్రకటనలన్నిటినీ నిలిపివేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మరుసటి రోజు ఉదయానికి ఈ విషయం బయటపడింది. ఇపుడు ‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి త్వరలో జీవో రాబోతోందంటూ రెండు రోజులుగా రామోజీ పుత్రిక ‘ఈనాడు’, దాని తోకపత్రిక, తోక చానెల్ ఊదరగొట్టేస్తున్నాయి. మరో గంటలో జీవో.. మరికొద్ది నిమిషాల్లో జీవో అంటూ రెండ్రోజులుగా రాత్రీపగలూ ఇదే వార్తను ప్రసారం చేస్తున్నాయి. ఎట్టకేలకు శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ జీవోల నంబర్లను వెబ్‌సైట్లో పెట్టారు. జీవోల్లో ఏముందో మాత్రం తెలియనివ్వలేదు. ‘కాన్ఫిడెన్షియల్’ అని పెట్టేశారు. అసలు ఒక మీడియా సంస్థ ఆస్తుల్ని అటాచ్ చేసుకోవటానికి దర్యాప్తు సంస్థకు అనుమతివ్వటమనేది భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా ఎన్నడూ జరగలేదు. మామూలుగా ఏసీబీ అవినీతి కేసుల్లో పట్టుబడిన అధికారుల ఆస్తుల విషయంలో ఇలాంటి అనుమతులిస్తూ ఉంటారు. ఆ అనుమతులిస్తూ విడుదల చేసే జీవోలను ఎన్నడూ కాన్ఫిడెన్షియల్‌గా ఉంచరు. అంతా బహిరంగమే. కానీ ‘సాక్షి’ విషయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముందెన్నడూ లేని సంప్రదాయాలకు తెర తీశారు. అత్యంత రహస్యంగా.. మంత్రులకు సైతం తెలియకుండా అత్యంత గోప్యంగా వ్యవహరించారు. హైడ్రామా నడిపించారు. అదెలాగంటే...

హోంమంత్రి ఇంటికి ప్రిన్సిపల్ సెక్రటరీ...

‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్ విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి కిరణ్‌తో హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయేంద్ర పాల్ గురువారం మధ్యాహ్నం, సాయంత్రం రెండు దఫాలుగా సమావేశమయ్యారు. అక్కడే ఈ జీవోలు ప్రాణం పోసుకున్నాయి. విషయం బయటకు పొక్కుతుందనే అనుమానంతో కిందిస్థాయి ఉద్యోగుల జోక్యం ఏమాత్రం లేకుండా పాల్ స్వయంగా ఈ జీవో బాధ్యతలు చూశారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో అజయేంద్ర నేరుగా హోంమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి నివాసానికి ఫైలు తీసుకుని వెళ్లారు. అప్పటికే డ్రాఫ్ట్ జీవోను తయారుచేసి, ఆ ఫైలుపై హోంమంత్రి సంతకం తీసుకున్నారు. తరవాత దానిపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. కావాలంటే అదే రోజు రాత్రి జీవోలను విడుదల చేయొచ్చు. కానీ ప్రభుత్వం ఇక్కడ అత్యంత కుట్రపూరితంగా వ్యవహరించింది. గురువారం రాత్రి గనక జీవో వెలువడితే శుక్రవారం కోర్టులు పనిచేస్తాయి. ‘సాక్షి’ సంస్థలు న్యాయం కోసం తక్షణం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అందుకే శుక్రవారం సాయంత్రం కోర్టు సమయం పూర్తయ్యేవరకూ వేచి చూసి.. సాయంత్రం 7-8 గంటల మధ్యలో ఈ జీవోను విడుదల చేశారు. ప్రత్యేక దూత చేతికిచ్చి సీబీఐకి పంపించారు. శనివారం సీబీఐ దర్యాప్తు అధికారులు ఈ జీవోను కోర్టులో దాఖలు చేసి.. అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతారు. మర్నాడు ఆదివారం కనుక ‘సాక్షి’కి అప్పటికప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉండదు. ఇదీ... కిరణ్ కుట్ర. 

అధికారులంతా గప్‌చుప్... 

జీవోలు వెల్లడైనట్లు తెలిసినా.. అవి రహస్యం కేటగిరీలో ఉండటంతో వాటిలో ఏముందనేది వెల్లడించటానికి అధికారులు సైతం ఇష్టపడలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము వీటిపై మాట్లాడకూడదని కూడా కొందరు అధికారులు చెప్పారంటే పరిస్థితి తెలియకమానదు. నిజానికి సత్యం కంప్యూటర్స్ వ్యవహారం తీసుకున్నా.. కృషి బ్యాంక్ తదితర ఆర్ధిక నేరాలను చూసినా ఆయా కేసుల్లో సైతం అటాచ్‌మెంట్‌కు సంబంధించిన జీవోల పూర్తి వివరాలను వెబ్ సైట్లో పెట్టారు. కానీ.. సాక్షి మీడియా విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరించటం గమనార్హం. నిజానికి జీవోల వివరాలను బయటపెట్టకుండా జాగ్రత్త వహించిన ప్రభుత్వం వాటిని రామోజీ తోక పత్రికకు మాత్రం తెలియజేసింది. ఈ వార్తను లీక్ చేయటం ద్వారా సాక్షి ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయటమనేది ప్రభుత్వ ప్రణాళికగా కనిపిస్తున్నట్లు న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. 

రేపు మరొకరిపై జరుగుతుంది


సాక్షి ఖాతాల స్తంభన, ఇతర చర్యలు భావ ప్రకటన, వ్యక్తీకరణపై జరిగిన తీవ్రమైన దాడి. ఈ దాడిని సమైక్యంగా తిప్పికొట్టాలి. వ్యక్తిగత కక్షలు తీర్చుకోడానికి సీబీఐని పత్రికపైకి ప్రయోగిస్తున్నారు. వాస్తవానికి సీబీఐ ఇలాంటి చర్యలకు దిగరాదు. ఎందుకంటే..పత్రిక అనేది సాధారణ ప్రజానీకం అభిప్రాయాలను ప్రతిఫలిస్తుంది. ఎవరైనా తప్పుచేసి ఉంటే వారిపై చర్యలకు వెళ్లాలే తప్పించి పత్రికపై చర్యలకు పాల్పడటం సరికాదు. అవినీతి జరిగి ఉంటే ఇన్నాళ్లు ఎందుకు కిమ్మనలేదు? వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడినప్పటి నుంచే ఇవన్నీ ప్రారంభం కావడాన్ని బట్టి అసలు అంతర్యం అర్ధమవుతోంది. సీబీఐ దురుద్దేశాలేమిటో కళ్లకు కడుతున్నాయి. వ్యక్తిగత కక్షను తీర్చుకోడానికి సీబీఐని ఉపయోగిస్తూ మీడియాపై సాగిస్తున్న ఈ దాడిని మేం ఖండిస్తున్నాం. దీన్నందరూ ముక్తకంఠంతో ఖండించాలి. లేకపోతే ఈ రోజు జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో జరుగుతున్నది రేపు మరొకరికి ..ఎల్లుండి ఇంకొకరికి జరిగే ప్రమాదం ఉంది. అది పత్రికా స్వేచ్ఛకు అతిపెద్ద సవాల్‌గా పరిణమించే ఆస్కారం ఉంది.
- పరమానంద పాండే
ప్రధాన కార్యదర్శి, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్

జర్నలిస్టు సంఘాల కొవ్వొత్తుల ర్యాలీ


సాక్షి బ్యాంకు ఖాతాల స్తంభనకు నిరసనగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ’సాక్షి’ సిబ్బంది. పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు ఈ ర్యాలీలో పాలుపంచుకున్నారు.

‘సాక్షి’లో లగడపాటి తమ్ముడూ పెట్టుబడులు పెట్టారు.. ఆయన్ను అరెస్టు చేయగలరా

సీబీఐ, కాంగ్రెస్, చంద్రబాబుకు సూటి ప్రశ్న
కాంగ్రెస్, చంద్రబాబు సీబీఐ దర్యాప్తునూ మేనేజ్ చేస్తున్నారు
సీబీఐ చార్జిషీటును కోర్టు ఇవ్వకముందే ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో వస్తోంది
‘సాక్షి’ని మూసేయించాలని అందరూ కలిసి కుట్ర చేస్తున్నారు

కడప, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి కుమ్మకై అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తనను రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాక.. అణగదొక్కాలని చూస్తున్నారని, వీరిద్దరూ కలిసి చివరకు సీబీఐ దర్యాప్తును సైతం మేనేజ్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ‘ఈ రోజు కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9.. అందరూ ఒక్కటై సాక్షి పత్రిక, సాక్షి టీవీని మూసేయించాలని కుట్ర పన్నుతున్నారు. 

నేను ఒక్కటే అడుగుతున్నా.. ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టారని ప్రసాద్ గారిని(నిమ్మగడ్డ ప్రసాద్) తీసుకుపోయి జైల్లో పెట్టారు. ‘సాక్షి’లో ల్యాంకో గ్రూప్‌కు చెందిన లగడపాటి రాజగోపాల్ తమ్ముడు కూడా పెట్టుబడులు పెట్టారు. ఆయన్ను తీసుకుపోయి జైల్లో పెట్టే ధైర్యముందా మీకు అని నేను సీబీఐని, కాంగ్రెస్ పెద్దలను, చంద్రబాబును ప్రశ్నిస్తున్నా’ అని జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కె.శ్రీనివాసులు తరఫున జగన్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. మంగంపేట, రైల్వేకోడూరుతో పాటు పలు చోట్ల ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

కోర్టు ఇవ్వకముందే ‘ఈనాడు’లో...

బాధెక్కడ అనిపిస్తోందీ అంటే.. కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు కలిసి సీబీఐ దర్యాప్తును కూడా మేనేజ్ చేస్తున్నారు. సాధారణంగా.. సీబీఐ ఒక చార్జిషీటు ఫైల్ చేసి కోర్టుకు ఇస్తుంది. తర్వాత సంబంధిత వ్యక్తులకు ఆ చార్జిషీటు ఇవ్వాలని ఆ కోర్టు చెప్తుంది. కోర్టు దాన్ని ఇచ్చే వరకు అందులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఆశ్చర్యం ఏమిటంటే.. కోర్టు ఇవ్వకముందే చార్జిషీటులో ఏముందో మొత్తం ‘ఈనాడు’ పేపర్ పతాక శీర్షికల్లో వచ్చేస్తోంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అధికార, ప్రతిపక్షాలు కలిసి కుమ్మక్కయ్యాయి. కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు ఇద్దరూ కలిసి కోర్టులకు వెళతారు. వెళ్లి కలిసి కేసులు వేస్తారు. చనిపోయిన వైఎస్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకుని పోటీలు చేస్తారు. ఆర్‌టీఐ కమిషనర్ పదవులను చెరిసగం పంచుకునే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆయనకు సన్నిహితుడైన జీఎన్ నాయుడు అనే వ్యక్తికి హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేటలో ఐదెకరాల భూమిని ధారాదత్తం చేశారంటే.. వీరి కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి నాయకుడే లేడు..

వైఎస్ మన మధ్య నుంచి వెళ్లిపోయాక.. ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వు చూడాలని తపించే నాయకుడే కరువయ్యాడు. తాను చనిపోయాక కూడా ప్రతి పేదవాడి ఇంట్లో తన ఫొటో ఉండాలని, అంతగా ఆ పేదవాడికి మేలు చేయాలన్న తాపత్రయం ఏ నాయకుడిలోనూ కనిపించడం లేదు. 

రెండు మూడు నెలల కిందట నేను కడపకు వచ్చినప్పుడు టమాటా కిలో అర్ధరూపాయికే అమ్ముకుంటున్న రైతన్నను పరామర్శించా.. ఉల్లిపాయలు కిలో రూ.2కే అమ్ముకుంటున్న రైతన్ననూ కలిశా. క్వింటాలు పసుపు రూ.2,500 నుంచి రూ.3,000 మధ్య మాత్రమే పలుకుతున్న దయనీయ స్థితిలో ఉన్న పసుపు రైతుతోనూ మాట్లాడా. వైఎస్ మరణించాక ఏ రైతును కదిలించినా.. ‘ఈ పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం కంటే ఉరి వేసుకోవడం మేలనిపిస్తోందన్నా’ అని అంటుంటే చాలా బాధనిపిస్తోంది. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టదు. క్రాప్ హాలిడే ప్రకటించి లక్ష ఎకరాలు బీడుగా వదిలేసినా పట్టించుకునే నాథుడు లేడు. ఇక కూలి పనులు చేసుకునే అక్కచెల్లెమ్మల పరిస్థితి మరీ దయనీయం. కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, శ్రీకాకుళం జిల్లాల నుంచి అక్కాచెల్లెమ్మలు పిల్లా పాపలతో కలిసి వలసపోయి పొలాల్లో పని చేసుకుంటున్నారు. 

జిల్లాలకు వెళ్లినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. వారిని ఎందుకమ్మా ఇంత దూరం వచ్చారు.. మీకు ఉపాధి పనులు కూడా దొరకడం లేదా అని అడిగితే... ‘కనీస వేతనం రూ.137 ఇవ్వాలని ఓ వైపు ప్రభుత్వమే చెప్తోంది.. మరోవైపు అదే ప్రభుత్వం క్యూబిక్ మీటర్ చొప్పున కాంట్రాక్ట్ ఇస్తోంది.. దీంతో రూ.60 నుంచి రూ.70 కూడా మాకు రావడం లేదన్నా’ అని చెప్తుంటే చాలా బాధనిపించింది.

దున్నపోతు మీద వానలా.. సర్కారు వైఖరి: ప్రతి ఇంటి నుంచీ కనీసం ఒక్కరైనా ఇంజినీరో, డాక్టరో అవ్వాలని, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలని.. అప్పుడే ఆ ఇంటి నుంచి పేదరికం పోతుందన్న ఉద్దేశంతో వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్రవేశపెట్టారు. ఇవాళ చదువుకునే ఏ పిల్లాడిని అడిగినా.. ‘అన్నా నేను కాలేజీకైతే పోతున్నాను కానీ.. ఈ ప్రభుత్వం ఫీజు కడుతుందో కట్టదో అన్న భయంతోనే చదువుతున్నా. మీరు ఈ ఏడాది ఫీజు గురించి అడుగుతున్నారు... కానీ మాకు నిరుటి స్కాలర్‌షిప్పు డబ్బులే రాలేదన్నా’ అంటున్నాడు. విద్యార్థుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలు చేశాం.. దీక్షలు చేశాం.. అయినా దున్నపోతుమీద వర్షం కురిసినట్లుగా ప్రభుత్వ వైఖరి ఉంది. ఇక వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చూస్తే.. దాన్ని ఓ పథకం ప్రకారం నాశనం చేస్తోందీ ప్రభుత్వం. రాష్ట్రంలో 18 స్థానాలకు జరుగుతున్నఉప ఎన్నికలు ఈ పాలకులకు గుణపాఠం నేర్పాలి. రాబోయే మహాసంగ్రామానికి నాంది పలకాలి. మనం వేసే ప్రతి ఓటు.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయతీకే పట్టం కట్టాలి.

సీఎం పీఠంపై మీ బిడ్డే కూర్చుంటాడు..

త్వరలో ఓ సువర్ణయుగం వస్తుంది. ఆరోజు మీ బిడ్డ సీఎం పీఠంపై కూర్చుంటాడు. అప్పుడు నేను మంగంపేటకు వ స్తా! రచ్చబండ నిర్వహిస్తా! ఎవరికైనా పింఛను రాలేదా? ఇల్లు లేదా? చదవాలనే కోరిక ఉండి ఎవరైనా ఆర్థిక స్తోమత అనుకూలించక చదవలేకపోతున్నారా? ఎవరికైనా ఆరోగ్యశ్రీ కార్డు లేదా? అని అడిగితే ఒక్క చేయి కూడా పైకి లేవని స్థాయిలో సువర్ణ పాలన అందిస్తా. అప్పుడే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మకు నిజమైన శాంతి. 
- మంగంపేటలో జగన్‌మోహన్‌రెడ్డి

తీవ్ర జ్వరం.. అయినా ఆగని రోడ్‌షో

మండుతున్న ఎండలనూ లెక్కచేయకుండా జనంతో మమేకమవుతూ రోడ్‌షోలు నిర్వహిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం తీవ్ర జ్వరం వచ్చింది. శుక్రవారం కూడా ఎండ వేడిమి తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ ఆయన ప్రచారం ఆపలేదు. యథావిధిగా రోడ్‌షో నిర్వహించారు. ప్రతీ పల్లెలో ప్రచార రథం దిగి వచ్చి మహిళలను ఆప్యాయంగా పలకరించి, చిన్న పిల్లలు, వృద్ధులకు ముద్దులు పెడుతూ అభిమానాన్ని పంచారు. 

జగన్ పట్టుదలను చూసి ప్రజలు నివ్వెరపోయారు. కాగా రెండు రోజులపాటు రైల్వే కోడూరు నియోజకవర్గంలో జగన్ నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అడుగడుగునా జగన్‌కు జనాభిమానం అడ్డుపడడంతో ఆయన కాన్వాయ్ ముందుకు కదలడమే కష్టమైంది. సమయాభావం వల్ల చాలా గ్రామాలకు జగన్ వెళ్లలేకపోయారు. శుక్రవారం పర్యటనను ముగించుకుని జగన్ నేరుగా రేణిగుంట చేరుకుని అక్కడి నుండి రైల్లో ఒంగోలు వెళ్లిపోయారు. అక్కడ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రైల్వే కోడూరు పర్యటనలో జగన్ వెంట.. మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్, డీసీసీ బ్యాంకు చైర్మన్ బ్రహ్మానందరెడ్డి తదితరులున్నారు.

Popular Posts

Topics :