18 May 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

బాబూ.. 11 ఏళ్ల తర్వాత అలిపిరి ఘటన గుర్తుకొచ్చిందా?

Written By news on Saturday, May 24, 2014 | 5/24/2014

బాబూ..  11 ఏళ్ల తర్వాత అలిపిరి ఘటన గుర్తుకొచ్చిందా?
హైదరాబాద్: పదకొండేళ్ల క్రితం జరిగిన అలిపిరి ఘటనలో ముద్దాయి గంగిరెడ్డి గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట్లాడటం వెనుక అసలు కుట్ర ఏంటని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. అలిపిరిలో దాడి జరిగిన తర్వాత ఏడెనిమిది నెలలు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ సమయంలో ఆయన ఏం చేశారని నిలదీశారు.

ఆ తర్వాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానీ, వైఎస్ మరణాంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్న సమయంలో కానీ చంద్రబాబు ఈ అంశాన్ని ఎందుకు ప్రశ్నించలేదని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అలిపిరి ఘటన తర్వాత అందరికంటే ముందు చంద్రబాబును పరామర్శించింది వైఎస్‌ఆరేనని గుర్తు చేశారు. చట్టం ముందు అందరూ సమానమని వైఎస్ భావించారని, వైఎస్‌పై అభాండాలు వేయడం చంద్రబాబుకు తగదని గట్టు రామచంద్రరావు హితవు పలికారు.

టీడీపీ దాడి.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల పరిస్థితి విషమం

అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో ఇద్దరు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల పరిస్థితి విషమంగా మారింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఇటీవలి కాలంలో టీడీపీ వర్గాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ డాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కూడా టీడీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డాయి. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఏకంగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపైనే దాడులు చేశారు.

నన్ను కాదు.. ప్రజలను ఆకర్షిస్తే మంచిది

నన్ను కాదు.. ప్రజలను ఆకర్షిస్తే మంచిది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు : సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర

సాలూరు, న్యూస్‌లైన్ : ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా...తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర స్పష్టం చేశారు.  తానెప్పుడూ ప్రజాపక్షమే ఉంటానని, అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ ప్రభుత్వంతోనే పోట్లాడి ప్రజా సమస్యలను పరిష్కరించానని చెప్పా రు.

శుక్రవారం ఒక దినపత్రికలో రాజన్నదొర వైఎస్సార్ సీపీని వీడి, టీడీపీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వచ్చిన  కథనాన్ని ఆయన విలేకరులసమావేశంలో ఖం డించారు.  అధికారం కోసం పార్టీ మారే వ్యక్తిత్వం తనది కాదన్నారు. రెండుసార్లు కాం గ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసినా.. తానేమీ దోచుకోలేదు... దాచుకోలేదని తెలిపారు.

తనది అధికార పక్షమో.. ప్రతిపక్షమో కాదని, ఎప్పటికీ ప్రజా పక్షమేనని చెప్పారు. సాలూరు నియోజకవర్గంలో టీడీపీని ప్రజలు ఓడించారన్నారు. ఆ పార్టీ నాయకులు ఆకర్షించాలనుకుంటే ముం దుగా ప్రజలను ఆకర్షించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకపోతే ప్రజలు ఛీకొట్టడంతో పాటు వ్యతిరేకంగా ఉద్యమిస్తారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ,, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. లక్షా 50 వేల కోట్ల రూపాయలని, టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ల్లో కొంతమేరకైనా నెరవేర్చాలంటే దాదాపు రూ. 3 లక్షల 60 వేల కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

ప్రజలకు రుణపడి ఉంటాం

జిల్లా ప్రజలకు రుణపడి ఉంటాం
వైరా, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా తనను, ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లా ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరా మండలం ముసలిమడుగులోని పురాతన అభయాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం నిర్వహించిన హనుమజ్జయంతి ఉత్సవాల లో వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌తో కలిసి ఆయన పూజలు నిర్వహించారు.

 ఆ తర్వాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే ఎజెండాగా తమ పార్టీ పని చే స్తుందని చెప్పారు. జిల్లా ప్రజలు విజ్ఞులని, అందుకే వైరా, ఆశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించి మహానేత రుణం తీర్చుకున్నారని అన్నారు. పేద , మధ్య తరగతి కుటుంబాలు, రైతులు, కార్మికులకు నిత్యం అందుబాటులో ఉండి వారి పక్షాన పార్టీ పనిచేస్తుందన్నారు. తమను గెలిపించిన ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అండదండలతోనే గెలుపొందామని, వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు. నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారధ్యంలో పార్టీకి సేవలందిస్తామన్నారు. కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటానని, ఏ క్షణంలోనైనా వారి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

 పొంగులేటికి తొలి వినతిపత్రం...
 ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌కు మండలంలోని చెరుకు రైతులు, ముసలిమడుగు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. వైరా రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం సాగులో ఉన్న చెరకు పంటకు సాగు నీరు విడుదల చేయాలని, గ్రామంలో పెండింగ్‌లో ఉన్న ఇళ్లు, రహదారుల  నిర్మాణం చేపట్టాలని కోరారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. దీనికి స్పందించిన పొంగులేటి సాగునీటి సమస్యపై వెంటనే  నీటిపారుదల శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బొర్రా ఉమాదేవి, వైరా, గరికపాడు సర్పంచ్‌లు బాణోత్ వాలీ, శీలం కరుణాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు తన్నీరు జ్యోతి, తడికమళ్ల నాగేశ్వరరావు, నాయకులు బొర్రా రాజశేఖర్, గుమ్మా రోషయ్య, షేక్ లాల్‌మహ్మద్, తన్నీరు నాగేశ్వరరావు, చింతనిప్పు రాంబాబు, కొరివి నర్సింహరావు, సుబ్బిరెడ్డి, దేవరాజ్, కౌసర్, తేలప్రోలు నర్సింహరావు, బాణోత్ కృష్ణ పాల్గొన్నారు.

ఉద్యోగులకు అండగా ఉంటాం : వైఎస్‌ జగన్‌

Written By news on Friday, May 23, 2014 | 5/23/2014

ఉద్యోగులకు అండగా ఉంటాం : వైఎస్‌ జగన్‌
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగులే లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరికాదని, వాటిని కట్టిపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్జప్తి చేశారు. 
 
ఉద్యమ పార్టీగా ఉన్నంత కాలం అన్నదమ్ముల్లా విడిపోదాం అంటున్న కేసీఆర్‌ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరికాదని వైఎస్ జగన్మోహన్ సూచించారు. 
 
సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు ఉద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. జీతాలు, జీవితాలపై భయాందోళనతో ఉన్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం, గవర్నర్‌ భరోసా ఇవ్వాలన్నారు. భయాందోళనతో ఉన్న ఉద్యోగులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 
 
ఉమ్మడి రాజధానిలో పనిచేయాల్సిన ఉద్యోగుల మధ్య వాతావరణం కలుషితం చేయడం తీవ్రమైన అంశమని, విభజన సమస్యలపై మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నామని వైఎస్ జగన్ తెలిపారు.  ప్రాంతాల వారీగా రెచ్చగొట్టే వైఖరిని ఉపేక్షించడం తగదని, సుహృద్భావ వాతావరణంలో విభజన ప్రక్రియ సాగకుంటే ఊరుకునే పరిస్థితి ఉండదని వైఎస్ జగన్ హెచ్చరించారు. 

టీడీపీ దుర్మర్గమైన ప్రచారం

'టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోంది'
హైదరాబాద్ : ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడరని ఆపార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ  తమ పార్టీ తరపున ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున టీడీపీలోకి వెళ్లడానికి చూస్తున్నారంటూ టీడీపీ దుర్మర్గమైన ప్రచారం సాగిస్తోందని విమర్శించారు. ఇదంతా టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు వస్తుందని ...శనివారం లేదా సోమవారం దీనిపై స్పష్టత వస్తుందన్నారు.

రుణమాఫీపై టీడీపీ మీనమేషాలు లెక్కించటం తగదని ఉమ్మారెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే తొలి సంతకం రుణమాఫీ ఫైల్ పై చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా రుణమాఫీ అమలు చేయాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. బాబు తన నిజాయితీ నిరూపించుకోవాలంటే రుణమాఫీ చేయాలని ఆయన అన్నారు.

కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించనుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 70 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిదిమంది లోక్‌సభ సభ్యులను గెలుచుకోవడమే కాకుండా 45 శాతం మేరకు ఓట్లు సాధించడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో చేర్చనుంది.

వడ్డేపల్లి కుటుంబసభ్యులకు జగన్ పరామర్శ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వడ్డేపల్లి నర్సింగరావు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ లో  పరామర్శించారు. శుక్రవారం తెల్లవారుజామున వడ్డేపల్లి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం తెలిపారు.

చంపేస్తానంటూ టీడీపీ కార్పొరేటర్ వీరంగం

చంపేస్తానంటూ టీడీపీ కార్పొరేటర్ వీరంగంతన కుమారుడుని చితకబాదారని ఎస్ఐకి వివరిస్తున్న ఉషా
అనంతపురం : అనంతపురంలోని 34వ డివిజన్‌కు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన  నాయక్‌నగర్ నివాసి ఉష ఇంటిపై తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం దౌర్జన్యం చేశారు. ఇల్లు ఖాళీ చేయాలంటూ బెదిరించారు. బాధితురాలి కథనం మేరకు... గురువారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో టీడీపీ నాయకులు, కార్పొరేటర్ నరసింహులు, నాగరాజులు ఉష ఇంట్లోకి చొరబడ్డారు. లోపల ఉన్న ఆమె చిన్న కుమారుడు అభిషేక్‌ను చితకబాదారు. ‘ఏయ్ నీ పెద్ద కొడుకు జ్ఞానిగాడు ఎక్కడున్నాడే... వాడ్ని రమ్మని చెప్పు’ అంటూ కత్తి చూపి ఉషను బెదిరించారు.
 
 
 ‘ఎన్నికల్లో ఏజెంట్‌గా కూర్చోవద్దని చెప్పినా నీ కొడుకు జ్ఞానేశ్వర్ వైఎస్సార్ సీపీ తర ఫున పనిచేశాడు. రేపటిలోపు ఇళ్లు ఖాళీ చేయండి. లేకపోతే ప్రాణాలు తీస్తాం’ అంటూ అల్టిమేటం జారీ చేశారు. ఇంతలోనే  ఉష బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు. జనాలను చూసిన టీడీపీ నాయకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. బాధితురాలు ఉష టూటౌన్ ఎస్‌ఐ సుబ్బరాయుడు ఫోన్ చేసి ‘సార్ ఇలా మా ఇంటిపైకి దాడికి వచ్చారు. మీరు రండి’ అంటూ వేడుకున్నారు. అయితే స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేయమ్మా అంటూ ఎస్‌ఐ సూచించారు.
 
 
 నాయక్‌నగర్‌లో అక్కడక్కడ వాళ్ల వాళ్లున్నారు మీరేరండి అని వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు అదే స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని గుమిగూడిన జ నాన్ని చెదరగొట్టారు. ఎవరూ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో వివరాలను సేకరించారు. ఎవరిపైనైనా ఫిర్యాదు చేయాలనుకుంటే పోలీస్ స్టేషన్ రావాలన్నారు. ఇంటి వద్ద ఇద్దరు పోలీసులను ఉంచి ఎవరైనా ఆ ప్రాంతం కాని వారు వస్తే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. 

http://www.sakshi.com/news/andhra-pradesh/tdp-corporator-halchal-in-anantapur-city-133032?pfrom=home-top-story

గుర్తింపు పొందిన పార్టీగా వైఎస్సార్‌సీపీ!

గుర్తింపు పొందిన పార్టీగా వైఎస్సార్‌సీపీ!
ఈ విషయమై ఢిల్లీకి పార్టీ ఎంపీల ప్రతినిధి బృందం  
పార్టీకి త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
 
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించనుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 70 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిదిమంది లోక్‌సభ సభ్యులను గెలుచుకోవడమే కాకుండా 45 శాతం మేరకు ఓట్లు సాధించడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో చేర్చనుంది. పార్టీకి లభించిన ఓట్లు, సీట్ల వివరాలను తెలియజేస్తూ రాజకీయ పార్టీగా గుర్తింపు ప్రక్రియను తక్షణం పూర్తి చేయాలని పార్టీ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఆ ప్రక్రియ కొనసాగుతోందని, అతి త్వరలోనే పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో చేర్చనున్నట్టు అధికారులు తెలిపారు.
 
 
 గుర్తింపునివ్వడాన్ని మరింత వేగవంతం చేయాలని కోరడానికి పార్టీకి చెందిన ఎంపీల ప్రతినిధి బృందం శనివారం ఢిల్లీ బయలుదేరి వెళుతోంది. ఈ విషయంపై ఇప్పటికే వారు కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్‌కు లేఖ కూడా రాశారు. పార్టీకి త్వరలోనే గుర్తింపు లభిస్తున్న నేపథ్యంలో పార్టీ తరఫున ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులందరికీ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీల చైర్‌పర్సన్ల ఎన్నికల్లో విప్ జారీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించనుండటంతో తమ పార్టీ నేతలపై దుష్ర్పచారం సాగిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతల నోళ్లు మూతపడతాయని ఆ వర్గాలు చెప్పాయి.
 
 తమ పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పెద్దఎత్తున టీడీపీలోకి వెళ్లడానికి చూస్తున్నారంటూ టీడీపీ దుర్మార్గమైన ప్రచారం సాగిస్తోందని పార్టీ సీనియర్ నేత డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి విమర్శించారు. గుర్తింపు ఉన్నా లేకున్నా ఒక రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన అభ్యర్థి మరోపార్టీలోకి వెళ్లడానికి చట్టం అనుమతించదని, దానికి రాజకీయ పార్టీకి గుర్తింపు ఉండాల్సిన అవసరం కూడా లేదని ప్రజా ప్రాతినిథ్య చట్టం చాలా స్పష్టంగా చెబుతోందని ఆయన చెప్పారు. అలా వెళితే అనర్హత వేటు పడి వెంటనే తమ పదవుల కోల్పోతారన్న విషయం టీడీపీ నేతలకు తెలిసినా కావాలని ఒక గందరగోళం సృష్టించాలన్న ఉద్దేశంతోనే దుష్ర్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

 ఇడుపులపాయలో జరిగిన శాసనసభా పక్షం సమావేశంలో తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఒక్కతాటిపైనే నిలబడిన విషయం తెలుగుదేశం పార్టీ నేతలకు అర్థమైందని, అయితే అధికారంలోకి వచ్చాం కదా అనే మిడిసిపాటుతో తమ పార్టీ ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటింరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. పార్టీకి గుర్తింపు లేదు కాబట్టి ఎమ్మెల్యేలు ఎటువైపైనా వెళ్లొచ్చన్న దుర్మార్గమైన తప్పుడు ప్రచారం చేసిందని, అది సాగకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ తరఫున గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
 
 ప్రత్యర్థి రాజకీయ పక్షాన్ని మట్టుపెట్టాలనే దుర్మార్గపు ఆలోచనతో వారీ దుష్ర్పచారం చేస్తున్నప్పటికీ, నిజానికి తమ పార్టీలో ఏ స్థాయి నాయకులకు కూడా పార్టీ మారే ఉద్దేశం లేదని వైఎస్సార్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. తెలుగుదేశం పార్టీ కుయుక్తుల్ని దుష్ర్పచారాన్ని అడ్డుకోవడంతో పాటు స్థానిక సంస్థల చైర్‌పర్సన్ ఎన్నికల్లో తమ పార్టీ నిలిపే అభ్యర్థులకే ఓటు వేయాలని పార్టీ తరఫున ఎన్నికైన ప్రతినిధులందరికీ విప్ జారీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి

వైఎస్ఆర్ సీపీ నేత వడ్డేపల్లి కన్నుమూత

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వడ్డేపల్లి నర్సింగరావు (64) అనారోగ్యంతో మృతి చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడుగా మెలిగిన వడ్డేపల్లి నర్సింగరావు  2005లో  రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పని చేశారు. కాగా వడ్డేపల్లి మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నేతలు సంతాపం తెలిపారు

శిల్పారామంలో తెలుగు తమ్ముళ్ల వీరంగం

Written By news on Thursday, May 22, 2014 | 5/22/2014

అనంతపురం : తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. నిన్న కాక మొన్న తిరుపతిలో టీడీపీ నాయకులు మద్యం తాగివచ్చి దుకాణాలను ధ్వంసం చేయగా, ఇప్పుడు అనంతపురంలో కూడా అదే తరహాలో ప్రవర్తించారు. (చదవండి: తిరుమలలో తెలుగు తమ్ముళ్ల వీరంగం)

అనంతపురం పట్టణంలో ఉన్న శిల్పారామానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు అక్కడున్న ఫర్నిచర్ ను, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపైన, ఇతర కార్యకర్తలు, నాయకులపైన శిల్పారామం కాంట్రాక్టర్ వేణుగోపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు.

వైఎస్ జగన్ పై కక్ష సాధిస్తే సహించేది లేదు

'వైఎస్ జగన్ పై కక్ష సాధిస్తే సహించేది లేదు'
అనంతపురం : తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై.విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం అనంతపురంలో విశ్వేశ్వరరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. పార్టీలోని సంస్థాగత లోపాలుంటే వాటిని సవరించుకుంటామన్నారు.
 
మే 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 శాసనసభ స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉరవకొండ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వై. విశ్వేశ్వరరెడ్డి... ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవుపై గెలుపొందిన విషయం విదితమే.

బలంగా వీచిన వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గాలి

బలంగా వీచిన వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గాలి
* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నాలుగేళ్లు కూడా నిండకుండానే సార్వత్రిక ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేసి తన సత్తా చాటింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన కొద్ది కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలలోనూ, సార్వత్రిక ఎన్నికలలోనూ తొలిసారి పోటీ చేసి మంచి ఫలితాలను సాధించింది. దేశంలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభంజనం ముందు అనేక పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి.  దశాబ్దాల చరిత్రగల పార్టీలు ఒక్క లోక్ సభ స్థానం కూడా గెలుచుకోలేక ఘోర పరాభవాన్ని చవిచూశాయి.   వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గాలి బలంగా వీచి మోడీ ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడగలిగింది.   రాష్ట్రంలో  బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ  అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, సినిమా హీరో పవన్ కళ్యాణ్ ను వెంటబెట్టుకొని తిరిగారు.   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు.  ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, నాయకురాలు షర్మిలలు మాత్రమే  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి గణనీయమైన ఫలితాలు సాధించారు. వారి శ్రమకు ఫలితం దక్కింది.  గ్రామీణ ప్రాంతాల ఓట్లర్లు ఆ పార్టీ పట్ల మంచి ఆదరణ చూపారు.

* 2014 స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రంలోని 2571 మునిసిపల్ వార్డులకు ఎన్నికలు జరిగాయి. సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 53 వార్డులను, సిపిఐ 16,  బిజెపి 12, సిపిఎం 8, బిఎస్ పి 5 వార్డులను మాత్రమే గెలుచుకోగా, తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసిన  వైఎస్ఆర్ సిపి 942 వార్డులను గెలుచుకుంది. టిడిపి 1428 వార్డులను గెలుచుకుంది.

కార్పోరేషన్లలో అయితే టిఆర్ఎస్ 48, బిజెపి 4, కాంగ్రెస్ 2, సిపిఎం 3, సిపిఐ 2, బిఎస్ పి ఒక్క స్థానంలో మాత్రమే గెలవగా, వైఎస్ఆర్ సిపి 124 స్థానాలను గెలుచుకుంది. మునిసిపల్ ఎన్నికలలో పోలైన ఓట్లలో టిడిపికి 45.18 శాతం ఓట్లు పోల్ కాగా, వైఎస్ఆర్ సిపికి 40.54 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ రెండు పార్టీల మధ్య 4.64 శాతం ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.
 ఈ ఎన్నికలలో 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయింది. 30 ఏళ్ల అనుభవం గల టిడిపి 5,216 ఎంపిటిసి స్థానాలను, 373 జడ్ పిటిసి స్థానాలను గెలుచుకోగా, తొలిసారి పోటీ చేసిన వైఎస్ఆర్ సిపి 4,199 ఎంపిటిసి స్థానాలను, 275  జడ్ పిటిసి స్థానాలను గెలుచుకుంది. ఇంత చేసి ఈ రెండు పార్టీలకు పోలైన ఓట్ల మధ్య వ్యత్యాసం 3.07 శాతం మాత్రమే.
 పార్టీ ఆవిర్భవించి కొద్ది కాలమే అయినా ఈ ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి క్రమశిక్షణ గల పార్టీగా పేరు తెచ్చుకుంది. ఎటువంటి గొడవలకు తావులేకుండా లోక్ సభ, శాసనసభ సీట్లను కేటాయించింది. కొత్తవారికి అనేకమందికి టిక్కెట్లు ఇచ్చినా ఎటువంటి వివాదాలకు తావులేకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ అభ్యర్థులకు సహకరించారు.  టిక్కెట్ల కేటాయింపు విషయంలో టిడిపి, బిజెపిలలో వివాదాలు చెలరేగాయి. ఈ పార్టీల తరపు తిరుగుబాటు అభ్యర్థులు  పోటీ చేశారు. ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో టిడిపి  తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

 వైఎస్ఆర్ సిపి విద్యావంతులకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు అన్ని వర్గాల టిక్కెట్లు ఇచ్చింది. తిరుపతి, కుప్పంలలో మాజీ ఐఏఎస్ అధికారులను, మల్కాజ్ గిరిలో మాజీ ఐపిఎస్ అధికారిని, అరకులో మాజీ గ్రూప్1 అధికారిని నిలిపింది. ఇంకా పిహెచ్ డి, పిజి చేసిన అనేక మంది విద్యావంతులకు అవకాశం ఇచ్చింది.
టిక్కెట్ల కేటాయింపులో అన్ని వర్గాల వారికి ప్రధాన్యత. కాపులకు, బిసిలకు, మైనార్టీలకు తగిన స్థాయిలో అవకాశం.
 కొత్తవారికి, యువతకు అవకాశం ఇచ్చింది. ఎంపిలుగా గెలిచిన 9 మందిలో ఏడుగురు కొత్తగా లోక్ సభలో అడుగుపెట్టనున్నారు.  శాసనసభకు ఈ పార్టీ తరపున 45 మంది కొత్తవారు ఎన్నికయ్యారు. వీరిలో 12 మంది గతంలో ఇతర పార్టీల తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తరపున నిలిచి గెలిచారు. అటువంటి వారిలో సినీనటి రోజా, విశ్వేశ్వర రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి వంటి వారు ఉన్నారు.

పార్టీ కోసం శ్రమించిన శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డలో నామినేషన్ దాఖలు చేసిన తరువాత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పార్టీ తరపున మరో వ్యక్తిని నిలబెట్టే అవకాశం లేకపోవడంతో బ్యాలెట్ పేపర్లో ఆమె పేరునే ఉంచారు. మరణించినా జనం ఆమెనే 17,928 ఓట్ల మెజార్టీతో ఎన్నుకొని ఘన నివాళులర్పించి  దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించారు.

 ఏపిలో అత్యధిక స్థానాలు గెలుచుకొని ముఖ్యమంత్రి కాబోతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ సిపి అధిక స్థానాలను గెలుచుకోవడం విశేషం. ఆ జిల్లాలో మొత్తం 14 శాసనసభ స్థానాలు ఉండగా, 8 స్థానాలలో  వైఎస్ఆర్ సిపి విజయం సాధించింది.

బిజెపి మొదటి సారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు రెండు లోక్ సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 30 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆ పార్టీ 282 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. 2001లో ప్రారంభమైన టిఆర్ఎస్ 2004లో ఎన్నికలలో పోటీచేసి 26 శాసనసభ స్థానాలను, 5 లోక్ సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ఎన్నికలలో పోటీచేసి 16 శాసనసభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగారు.  ఆర్ఎస్ వంటి పార్టీ 63 స్థానాలను గెలుచుకొని అధికారంలోకి రావడానికి 14 ఏళ్లు పట్టింది. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వేవ్ లో 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక్క లోక్ సభ సీటును గానీ, ఒక్క శాసనసభ స్థానాన్ని గానీ గెలుచుకోలేకపోయింది. ఉభయ కమ్యూనీస్టు పార్టీలు,  లోక్ సత్తా పార్టీ పరిస్థితి కూడా అంతే. అవి ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయాయి. ఇటు దక్షిణాదిలో డిఎంకె(ద్రవిడ మున్నెట్ర కజగం), అటు ఉత్తరాదిలో బహుజన సమాజ్ వాది పార్టీ, ఆస్సాం గణపరిషత్, నేషనల్ కాన్షరెన్స్ పార్టీలు  ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక ఘోర పరాభవానికి గురయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న సమాజ్ వాది పార్టీ కేవలం 5 స్థానాలతో, బీహార్ లో అధికారంలో ఉన్న జెడి(యు) 2 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో కొత్తగా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించింది. టిడిపికి గట్టి పోటీ ఇచ్చి 70 శాసనసభ స్థానాలను, 9 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. నాలుగేళ్లు (29.11.2010) కూడా నిండని వైఎస్ఆర్ సిపి అనతి కాలంలోనే ఇంతటి పోటీని తట్టుకొని ఇన్ని స్థానాలను గెలుచుకోవడం  గొప్ప విజయంగా భావించవచ్చు. మోడీ గాలిలో కూడా  ప్రజలు ఈ పార్టీని ఇన్ని స్థానాలతో గెలిపించి బలమైన ప్రతిపక్షంగా నిలిపారు.

sakshi

నేను మాట తప్పలేను: వైఎస్ జగన్

' అందుకే అబద్ధపు హామీలు ఇవ్వలేదు
వైఎస్సార్ సీపీ తొలి శాసనసభా పక్ష భేటీలో జగన్ స్పష్టీకరణ
సాధ్యంకాని హామీలిచ్చిన బాబు బండారం త్వరలోనే బయటపడుతుంది
ఈ ఎన్నికల్లో గెలుపు ఓటముల మధ్య తేడా ఐదు లక్షల అరవై వేల ఓట్లు మాత్రమే
బాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
మా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి టీడీ పీలోకి రమ్మని కోరుతున్నారు

 
 ఈ ఎన్నికల్లో గెలుపు ఓటముల మధ్య తేడా ఐదు లక్షల అరవై వేల ఓట్లు మాత్రమే. అంటే 1.90 శాతం తక్కువ ఓట్లతో మాత్రమే మనం ఓడిపోయాం. అయినా 45 శాతం ఓట్లను మనం సాధించాం. టీడీపీ, బీజేపీ కలిసిపోవడం, టీడీపీ అబద్ధపు హామీలు, నరేంద్ర మోడీ గాలి అన్నీ కలిపితే ప్రత్యర్థులు అధికంగా సాధించింది ఈ ఐదు లక్షల అరవై వేల ఓట్లు మాత్రమే. నేను కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసినపుడు నాకు వచ్చిన ఐదు లక్షల నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీకి ఈ తేడా సమానం. దొంగహామీలు ఇచ్చి ఉంటే ఆ తేడాను అధిగమించడం ఏమంత కష్టమయ్యేది కాదు. కానీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే ప్రతి రైతన్న తిట్టే పరిస్థితి వచ్చేది.’’                - వైఎస్ జగన్
 
 ఇడుపులపాయ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి బండారం త్వరలో బయటపడుతుందని, ఆయనను ప్రజలు ఛీకొట్టే రోజు వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పది స్థానాలు కూడా దక్కని అధ్వాన పరిస్థితుల్లోకి టీడీపీని నెట్టి వేయాలని, అందుకోసం ఇప్పటి నుంచే పార్టీ నేతలు, కార్యకర్తలంతా కలిసికట్టుగా ఐకమత్యంగా ప్రజా పోరాటాలు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.
బుధవారం ఇడుపులపాయలో వైఎస్సార్ కాంగ్రె స్ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆయన ఎమ్మెల్యేలనుద్దేశించి ప్రసంగించారు. శాసనసభాపక్ష నేతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేలందరికీ శిరస్సు వంచి, చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని జగన్ అన్నారు. ‘‘చంద్రబాబులా ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి ఉంటే నేను ఇవాళ ముఖ్యమంత్రిని అయ్యేవాడిని. కానీ నేనలా చేయలేదు. ఎందుకంటే నేను రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అనే రెండు పదాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతే ప్రజల మాట అటుంచండి.. సొంత భార్యకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి తలెత్తుతుంది. ఆ పరిస్థితి నేను తెచ్చుకోలేను’’ అని ఆయన స్పష్టంచేశారు.
 
 నేను సీఎం కావాలనుకోవడానికి ఓ ఉద్దేశం ఉంది
 ‘‘నేను ముఖ్యమంత్రి కావాలనుకోవడానికి ఓ ఉద్దేశం ఉంది. ఈ రోజు మా నాన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో ప్రతి ఇంట్లో ఎలాగైతే ఉందో నేను మరణించిన తరువాత కూడా ఆయన ఫొటో పక్కన నా ఫొటో కూడా ఉండాలనే భావన నాలో ఉంది. అందుకే విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయాలు చేయదల్చుకున్నాను’’ అని జగన్ స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తాననే పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఉండే వాడినని, ఎందుకంటే గత నాలుగేళ్లుగా ప్రజల తరఫున జరిగిన అన్ని పోరాటాల్లోనూ తాను ముందు నిలిచానని ఆయన గుర్తుచేశారు.
 
చేనేత కార్మికుల మరణాలు సంభవించినా, రైతన్నలు క్రాప్ హాలిడే (పంటల విరామం) ప్రకటించినా, విద్యార్థుల ఫీజుల చెల్లింపు సమస్యలున్నా అక్కడ తానే కనిపించానుతప్ప టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా కనిపించలేదన్నారు. ప్రజల తరఫున నిరాహార దీక్షలు జరిగితే అక్కడ జగనే కనిపించారు తప్ప చంద్రబాబు కనిపించలేదని గుర్తుచేశారు. ‘‘ముమ్మడివరం నియోజకవర్గంలో మత్స్యకారుల ఇళ్లు కాలిపోతే అక్కడికి జగన్ వెళ్లి పరామర్శించాడు తప్ప మరెవరూ వెళ్లలేదు. ప్రతి పేదవాడి విశ్వాసం మనపై ఉంది కనుక అధికారంలోకి వస్తామనుకున్నాను. కానీ, దేవుడు ఇంకా ఆలస్యం చేయాలనుకున్నాడేమో అందుకే సాధ్యం కాలేదు. దేవుడు ఎప్పుడూ తప్పుచేయడు’’ అని అన్నారు.
 
 ఆ రోజులు నాకింకా గుర్తున్నాయి
 తన రాజకీయ ప్రస్థానంలో తిరిగిన ఒక్కొక్క మలుపును జగన్ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి మరణించినపుడు తాను ఏ ఒక్కరినీ అడక్కపోయినా 152 మంది ఎమ్మెల్యేలు తనను ముఖ్యమంత్రిని చేయాలని సోనియా గాంధీకి వినతిపత్రం ఇచ్చారని, ఆ రోజు తనకు ఇంకా గుర్తుందని ఆయన అన్నారు. విలువలకోసం, మాట కోసం కాంగ్రెస్ పార్టీని వీడి తాను, తన తల్లి విజయమ్మ బయటకువచ్చిన రోజు కూడా తనకు గుర్తుందన్నారు. పార్టీని వీడి తన తండ్రి సమాధి వద్దకు వచ్చిన రోజున ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి ఇద్దరూ తామూ వెంట వస్తామని తనను అడిగిన రోజు కూడా గుర్తుందన్నారు.
 
  ‘‘కాంగ్రెస్ పార్టీ ఇంకా నాలుగేళ్లపాటు అధికారంలో ఉంటుందని, ఈ క్రమంలో తనను తెరమరుగు చేయడానికి పన్నాగం పన్నుతుందని ఎందరో చెప్పారు. ‘కొండను ఢీకొంటున్నావు.. నిన్ను సర్వనాశనం చేస్తారు’ అని హెచ్చరించిన వారు కూడా ఉన్నారు. ఆ సమయంలో.. మాటకు కట్టుబడాల్సిన అవసరం లేదని మెదడు చెప్పింది. గుండె మాత్రం విలువలకు కట్టుబడి ఉండాలని, విశ్వసనీయతతో రాజకీయాలు చేయాలని చెప్పింది. నేను మాత్రం మెదడు మాట వినకుండా గుండె చెప్పిందే విని ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకున్నాను’’ అని జగన్ గుర్తుచేసుకున్నారు.
 
 నాన్నా కొండను ఢీకొంటున్నాను
 ‘‘నేను కాంగ్రెస్ పార్టీని వదిలి వచ్చి నా తండ్రి సమాధి వద్ద ప్రార్థించినపుడు ‘నాన్నా నీవు దేవుడు దగ్గర ఉన్నావు. నేనిక్కడ కొండను ఢీకొంటున్నాను. నా తరఫున నీవు దేవుని దగ్గర ప్రాధేయపడి దేవుడి దయ, ఆయన కరుణ నాపై ఉండేటట్లు చూడు.. నా రాజకీయం తెరమరుగు అయ్యే విధంగా కాకుండా నేను రాజకీయాన్ని శాసించే స్థాయికి తీసుకువెళ్ల’మని ప్రార్థించాను. ఆ రోజునుంచి ఈరోజుటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాను’’ అని జగన్ ఆవేదనతో అన్నారు. ‘‘ఆ తర్వాత వరుసగా కాంగ్రెస్, టీడీపీ కుట్రలు చేశాయి.. సీబీఐని అడ్డం పెట్టుకుని కోర్టులను తప్పుదోవ పట్టించడానికి యత్నించాయి.
 
 నాపై కుట్ర పన్నారు. నన్ను 16 నెలలపాటు జైలులో పెట్టారు. ఇక్కడ చంద్రబాబుకు ఒక న్యాయం, నాకు మాత్రం మరో న్యాయం జరిగింది. మమ్మల్ని సర్వనాశనం చేయాలని అప్పటి నుంచి చూస్తున్నారు. అయినా కూడా మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. ఆ రోజున నేను, మా అమ్మ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేగా బయటకు వస్తే, తదుపరి జరిగిన ఉప ఎన్నికల్లో దేవుడు మా బలాన్ని ఇద్దరు ఎంపీలు, 17 మంది ఎమ్మెల్యేలకు పెంచాడు. ఆ తర్వాత ఇప్పుడు తొమ్మిది మంది ఎంపీలు, 70 మంది ఎమ్మెల్యేలకు పెరిగాం. దేవుడు ఎప్పుడు మా బలాన్ని హెచ్చిస్తూనే పోయాడు’’ అని జగన్ అన్నారు.
 
 మోడీని కలిస్తే వక్రీకరణలా!
 తాను మోడీని కలసి రాష్ట్ర ప్రయోజనాల కోసం వినతిపత్రం సమర్పించిన విషయంపై కూడా మీడియా, టీడీపీ వక్రీకరణలు చేస్తున్నాయని జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయగానే బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు వేటికీ బడ్జెట్ కేటాయింపులు లేవు. చట్టబద్ధత లేదు. అందువల్ల నేను మోడీని కలసి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కావాలని అడిగాను. సింగరేణి కాలరీస్‌లో మనకు వాటా ఏమీ లేనందున కేజీ బేసిన్‌లో లభ్యమయ్యే గ్యాస్ నుంచి కేంద్రం వాటాను మనకు ఇవ్వాల్సిందిగా కోరాను. రాష్ట్రానికి 15 ఏళ్లపాటు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని కోరాను. ఇందులో తప్పేమిటి? కానీ, నాపై టీడీపీ, మీడియా అభాండాలు వేస్తున్నాయి.
 
 ఈరోజు పోరాటం జరుగుతున్నది మనకూ, చంద్రబాబుకూ మధ్య మాత్రమే కాదు. మనకు, టీవీ9, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలకు మధ్య కూడా. ఈ పోరాటం మున్ముందు కూడా కొనసాగుతుంది. మనం ఏం చేసినా వాళ్లు వక్రీకరిస్తూనే ఉంటారు. బీజేపీకి అంశాల వారీ మద్దతు ఇస్తానన్నా వక్రీకరించడమేనా? అంటే.. ఈ దేశ ప్రయోజనాల కోసం ఎన్డీయే ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే దానిని కూడా వ్యతిరేకించాలా? ఈ వక్రీకరణలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడాలి’’ అని జగన్ సూచించారు.
 
 చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు
 ‘‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వారం రోజులకే మైండ్‌గేమ్ ఆడుతున్నారు. వేరే పార్టీ బీ ఫామ్‌పై ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా ఎన్నికైన వారిని తమ పార్టీలోకి లాక్కోవాలని చూస్తున్నారంటే ఎంత దిగజారి వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ తర ఫున ఎన్నికైన 30 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారు. ఇదెంత దారుణం? ఓ వైపు మన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రమ్మని పిలుస్తూ ఉంటే మరోవైపు ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’ పత్రికల్లో మాత్రం మన ఎమ్మెల్యేలే చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతూ పార్టీలోకి వస్తామని కోరుతున్నట్లు వార్తలు వస్తాయి. ఎవరెన్ని ఎత్తులు వేసినా మన పార్టీని అణచలేరనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఆచరణ సాధ్యంకాని హామీలు నెరవేర్చలేక  చంద్రబాబు ప్రజాదరణను కోల్పోవడం ఖాయం.’’
 - వైఎస్ జగన్

మన్యంపై వైఎస్‌ఆర్‌సీపీ పట్టు

Written By news on Wednesday, May 21, 2014 | 5/21/2014

మన్యంపై వైఎస్‌ఆర్‌సీపీ పట్టు
సీతంపేట: సీమాంధ్ర పరిధిలోని మన్యంపై వైఎస్‌ఆర్‌సీపీ పట్టు సాధించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి మినహా అన్ని చోట్లా ఆ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. తెలంగాణ విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాల పరిధిలో ఏడు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఆరుచోట్ల వైఎస్సార్‌సీపీకే ఏజెన్సీ వాసులు పట్టం కట్టారు.

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో మాత్రమే టీడీపీ అభ్యర్థి ముడియం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున  శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి విశ్వాసరాయి కళావతి, విజయనగరం జిల్లా కురుపాం నుంచి పాముల పుష్పశ్రీవాణి, సాలూరు నుంచి పీడిక రాజన్నదొర, విశాఖ జిల్లా పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, అరకు నుంచి కిడారి సర్వేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో గిరిజనులకు సంబంధించిన పథకాల అమలు, పర్యవేక్షణలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల పాత్ర కీలకం కానుంది.

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిబంధనల ప్రకారం గిరిజన సలహా మండలిని ఏర్పాటుచేయాలి. దీనికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్‌గా ఉంటారు. వివిధ శాఖలకు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉంటారు. నాన్ అఫీషియల్ సభ్యులుగా ఎస్టీ ఎమ్మెల్యేలు ఉంటారు. వీరంతా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కార్యచరణ ప్రణాళిక రూపొందించి, దాని అమలును పర్యవేక్షిస్తారు. అలాగే.. నిధుల వ్యయం, ఇతరత్రా అంశాల్లో సలహాలు, సూచనలు ఇస్తారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా గిరిజన సలహా మండలిలో సభ్యులుగా ఉండేవారు. ప్రతిపక్షానికి చెందిన ఒకరిద్దరినే నియమించేవారు. అది కూడా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జరిగేది. ఇప్పుడు పరిస్థితి వేరు.

కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీలో ఒక్కరే ఎస్టీ ఎమ్మెల్యే ఉండటం, మిగిలిన వారంతా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీకే చెందిన వారు కావడంతో ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారిని సలహా మండలి సభ్యులుగా నియమించక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు శాసనసభ ఎస్టీ కమిటీలోనూ వీరికే ఎక్కువ ప్రాతినిధ్యం లభించనుంది. ఫలితంగా గిరిజన సమస్యలపై స్పందించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసే అవకాశం వైఎస్‌ఆర్‌సీపీకి దక్కనుంది.

తిరుమలలో టిడిపి కార్యకర్తల వీరంగం


తిరుమల పుణ్య క్షేత్రాన్ని క్షాళన చేస్తానని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన మరుసటి రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మద్యం సేవించి వీరంగం వేశారన్న కధనాలు వస్తున్నాయి. తాగి కొందరు దుకాణదారులపై దౌర్జన్యాలకు పాల్పడ్డారట.గోవింద నామ స్మరణ తప్ప మరొకటి వినిపించకుండా చేస్తానని చంద్రబాబు చెబితే , టిడిపి కార్యకర్తలు కొందరు మాత్రం తమ పాత కక్షలను ఈ విదంగా తీర్చుకున్నారని సమాచారం వచ్చింది.

Kommineni.infoమనసు చెప్పినట్లే విన్నా: వైఎస్ జగన్

ఇడుపులపాయ : తనపై నమ్మకం ఉంచి  శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆయన బుధవారం ఇడుపులపాయలో మాట్లాడుతూ ఆనాడు విలువల కోసం తాను, అమ్మ విజయమ్మ మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చామన్నారు. కొండను ఢీకొని నాశనమైపోతామని అందరూ అన్నారని, అధికార పార్టీపై పోరాటం కష్టమని వ్యాఖ్యలు చేశారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

రాజకీయం ఉన్నా, లేకున్నా మనిషి మనిషిగా బతకాలని తన మనసు చెప్పిందని వైఎస్ జగన్ అన్నారు. ఆరోజు మెదడు చెప్పిన మాట కన్నా... మనసు చెప్పిన మాటనే విన్నానని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు కట్టుబడి ఉన్నానని జగన్ స్పష్టం చేశారు. నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేశామని, కుట్రలు, కుతంత్రాలను చూశామన్నారు. సీబీఐ అనే ఆయుధాన్ని వాడి, అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నారు.

16 నెలలు జైల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేశారని జగన్ అన్నారు. అయితే ఏ ఒక్క శాసనసభ్యుడు తనను విడిచి వెళ్లలేదని ఆయన తెలిపారు. 20మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు అలానే పార్టీ వెంట ఉన్నారన్నారు. రాజకీయ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా నాలుగేళ్లు పోరాడమని, అందుకే అధికారంలోకి వస్తామనే విశ్వాసం కలిగిందన్నారు.

అనేక అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాటాలు చేయగలిగిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. గడిచిన నాలుగేళ్లలో బాధితులకు అండగా నిలబడింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు. గెలుపుకి..ఓటమికి తేడా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే అని జగన్ వ్యాఖ్యానించారు. ఇవాళ 9మంది ఎంపీలు, 67మంది ఎమ్మెల్యేలను దేవుడు ఇచ్చారని, భగవంతుడు మనకేమీ తక్కువ చేయలేదన్నారు.

చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తున్నప్పుడు ....తనను కూడా అలాంటి హామీలు ఇవ్వమని చాలామంది చెప్పారని, అయితే తాను అలా చేయలేదన్నారు. రాజకీయాల్లో తాను నమ్మిన సిద్ధాంతం విశ్వసనీయత, విలువలు అని అన్నారు. వాటికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. మనిషిలో విశ్వసనీయత, విలువలు లేకపోతే కట్టుకున్న భార్యకు కూడా సమాధానం చెప్పుకోలేమన్నారు. చేయలేనిదాన్ని చేస్తానని తాను చెప్పలేనని జగన్ అన్నారు.

శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవ ఎన్నిక

శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవ ఎన్నిక
ఇడుపులపాయ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇడుపులపాయలో బుధవారం  జరుగుతున్న ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ నేతలు వైఎస్ జగన్ ను వైఎస్ఆర్ సీఎల్పీ నేతగా ఎన్నకున్నారు. ఈ సమావేశానికి సీమాంధ్ర, తెలంగాణ నుంచి ఎన్నికైన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు హాజరు అయ్యారు. వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశం అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో  వైఎస్ జగన్ భేటీ కానున్నారు.

కీలక ఘట్టానికి వేదిక...ఇడుపులపాయ

కీలక ఘట్టానికి వేదిక...ఇడుపులపాయ
ఇడుపులపాయ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కీలక రాజకీయ ఘట్టానికి ఇడుపులపాయ మరోమారు వేదిక అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వీరంతా వైఎస్ఆర్ సీపీ శాసనసభా పక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎన్నుకోనున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ సమీపంలో వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధుల భేటీ జరుగుతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లోని 66మంది ఎమ్మెల్యేలు, 8మంది ఎంపీలతో పాటు తెలంగాణకు చెందిన ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకు ముందు వైఎస్ ఘాట్ వద్ద మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు.

సార్వత్రిక ఎన్నికల్లో 67మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ లోనూ, ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యే స్థానాలు తెలంగాణలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా పోలింగ్ కంటే ముందే రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

కాగా వైఎస్ఆర్ సీపీ శాసనసభా పక్ష సమావేశాన్ని ముందుగా రాజమండ్రిలో నిర్వహించాలని భావించినా గెలుపొందిన ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు ఇడుపులపాయలో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.శాసనసభా పక్ష నేత ఎన్నికతోపాటు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించేందుకు కూడా వీలుంటుందని వారు భావించటంతో ఇడుపులపాయకు ఈ కార్యక్రమాన్ని మార్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ శాసనసభా పక్షనేత ఎన్నికతో పాటు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహం, రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపై కూడా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు సమాచారం.

మహానేతకు జగన్, విజయమ్మ నివాళులు

ఇడుపులపాయ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ లోని ఆయన సమాధి వద్ద అంజలి ఘటించారు. కాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం(వైఎస్సార్ సీఎల్పీ) తొలిసారి బుధవారం సమావేశం కానుంది. ఇందుకోసం ఇడుపులపాయలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ సమావేశంలో పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శాసనసభలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశంలో నేతలకు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్ర ఏర్పాటు, ఎదురయ్యే సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో గట్టి ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన నిలవాలన్నదే సమావేశం ప్రధాన ఎజెండాగా నిర్ణయించారు. సభలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో మరింత గట్టిగా ప్రజల పక్షాన పోరాటాలు చేయాలన్న ఆలోచనలో పార్టీ నేతలున్నారు.

ప్రబల శక్తిగా ఆవిర్భవించాం

ప్రబల శక్తిగా ఆవిర్భవించాంవీడియోకి క్లిక్ చేయండి
ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ వెంటే నిలిచారు: పార్టీ సీనియర్ నేతల విశ్లేషణ

గెలుపుపై పార్టీ నేతల్లో అతివిశ్వాసం అనేక చోట్ల దెబ్బతీసింది
పార్టీ నిర్మాణం ఉండివుంటే ఆశ్చర్యకరమైన ఫలితాలే వచ్చేవి
పట్టణ ప్రాంతాల్లో మోడీ హవా టీడీపీకి కలిసివచ్చింది
అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల తేడా కేవలం 1.96 శాతం మాత్రమే
జాతీయంగా టీడీపీ - వైఎస్సార్ సీపీ మధ్య తేడా లక్ష ఓట్లే
ఈ ఎన్నికల్లో అధికారం రాకపోయినా.. మంచి భవిష్యత్ ఉంది
పరాజయంపై వైఎస్సార్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సమీక్షలు
స్వల్ప ఓట్ల తేడాతో ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్న నేతలు

 
 హైదరాబాద్: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో అధికారం దక్కించుకోవడానికి అవసరమైన అసెంబ్లీ సీట్లు గెలవలేకపోయినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ప్రబల శక్తిగా ఆవిర్భవించింది. సుదీర్ఘ కాలం రాజకీయ మనుగడ సాగిస్తున్న అనేక పార్టీలను మట్టికరిపించింది. కాంగ్రెస్‌తో పాటు ప్రతి ఎన్నికల్లోనూ తమ రాజకీయ ఉనికిని చాటుకునే అనేక పార్టీలు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా కొట్టుకుపోయాయి. అధికారానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయినా అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా ప్రధాన ప్రతిపక్షంగా కీలక బాధ్యతలను ఆ పార్టీ చేపట్టబోతోంది. అనేక ఆటుపోట్ల మధ్య.. పార్టీ పరంగా ఎలాంటి నిర్మాణం లేకుండానే.. తొలిసారి ఎదుర్కొన్న సార్వత్రిక ఎన్నికల్లోనే ఏకంగా 45 శాతం ఓట్లను సాధించడం ఆ పార్టీకి సానుకూల అంశంగా మారింది. కేవలం 1.9 శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయినప్పటికీ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందన్న అంచనాకు ఆ పార్టీ నేతలొచ్చారు. గత నాలుగు రోజులుగా ఎన్నికల ఫలితాలను పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నేతల్లో నెలకొన్న అతి విశ్వాసం, పార్టీకి నిర్మాణం లేకపోవడం, పొత్తుల వల్ల టీడీపీకి ఓట్లు పెరగడం, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ హవా పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేయడం, కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో పూర్తిగా చేతులెత్తేయడం, ఆచరణ సాధ్యమయ్యే అవకాశాలు లేనప్పటికీ రుణమాఫీ, ఇంటింటికో ఉద్యోగం వంటి చంద్రబాబు ఇచ్చిన హామీలు.. తదితర అంశాలు పార్టీ ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషించారు. చంద్రబాబు రుణమాఫీ హామీ అనంతపురం, ఉభయగోదావరి జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిందన్న అంచనాకొచ్చారు. దీనికి తోడు 30 ఏళ్ల కిందట ఏర్పడిన టీడీపీకి సంస్థాగత నిర్మాణం ఉండటంతో మిగతా అంశాలన్నీ ఆ పార్టీకి కలిసొచ్చాయని విశ్లేషించారు. ప్రత్యర్థులు అనేక అస్త్రాలతో ఎన్నికల్లో దిగినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ 45 శాతం ఓట్లు సాధించడం మామూలు రాజకీయ పార్టీలకు సాధ్యం కాదని, సంఖ్యాపరంగా ఓడిపోయామే తప్ప తమ పార్టీకొచ్చిన ఫలితాలు భవిష్యత్తుకు మంచి సంకేతంగా భావిస్తున్నామని సీజీసీ సభ్యుడొకరు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో 90 శాతం స్థానాల్లో ఓడినా, టీడీపీకి వచ్చిన ఓట్లతో పోల్చితే పెద్ద తేడా లేకపోగా మరికొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వచ్చి ఉండేవని సీనియర్లు తేల్చారు.

అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు...

1994 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ కేవలం 26 స్థానాల్లో మాత్రమే గెలిచి శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఆ తర్వాత కోలుకున్న కాంగ్రెస్ దేశంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్రంలో గెలిచిన ఎంపీలే కారణమయ్యేలా 33 మంది సభ్యులను గెలుచుకుంది. అలాంటి పార్టీ ఇప్పుడు సీమాంధ్రలో ఊసు లేకుండా పోగా కేంద్రంలో కూడా ప్రతిపక్ష హోదా దక్కని దయనీయస్థితికి పడిపోయింది. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడగా, మార్పు కోరుకున్న ప్రజలు కేంద్రంలో నరేంద్రమోడీకి పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా మోడీ గాలిలో సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్‌వాది పార్టీ, వామపక్ష పార్టీలు సైతం దెబ్బతిన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలోని బీఎస్‌పీ ఈ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్‌వాది కేవలం 5 ఎంపీ సీట్లకే పరిమితం కావలసి వచ్చింది.  బీహార్‌లో బీజేపీ పొత్తును వదులుకొని ఎన్నికల్లో పోటీచేసిన అధికార జనతాదళ్ (యూ)కి ఈ ఎన్నికల్లో తలబొప్పికట్టింది. ఆ రాష్ట్రంలోని 40 స్థానాల్లో కేవలం రెండే సీట్లు దక్కాయి. ఈ పరిణామం ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్ రాజీనామాకు దారితీసింది. మహారాష్ట్రలో కూడా అధికార కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు అక్కడి 48 స్థానాలకు గాను కేవలం 6 స్థానాలనే దక్కించుకున్నాయి. తక్కినవన్నీ బీజేపీ, శివసేన కూటమికే దక్కాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాగేజరగ్గా పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశాలో మాత్రమే ఇందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలు నరేంద్రమోడీ గాలిని తట్టుకొని నిలబడ్డాయి. అదే పరిస్థితి సీమాంధ్రలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనబరిచింది. అక్కడ ఆ పార్టీలు అధికార పార్టీలుగా ఉండటంతో పాటు.. క్షేత్రస్థాయిలో బలమైన పునాదులతో గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం ఉండడంతో మెరుగైన ఫలితాలు సాధిం చాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆ పార్టీల మాదిరి నిర్మాణం లేనేలేదు. పార్టీ ఏర్పాటైనది మొదలు కాంగ్రెస్, టీడీపీలు కుట్రపూరితంగా దాన్ని అణచేసేందుకు ప్రయత్నించాయి. అయినా వాటన్నిటినీ తట్టుకొని పార్టీ సాధారణ ఎన్నికలకు వెళ్లింది. బీజేపీతో పొత్తుపెట్టుకొని పోటీకి దిగిన టీడీపీకి ఆర్థిక, అంగబలాలతో పాటు మోడీ గాలి కలసి వచ్చాయి.

ఏమాత్రం తీసిపోని ప్రజాదరణ...

 వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన ఓట్ల శాతాలు చూస్తే ప్రజాదరణలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆ పార్టీతో ఏమాత్రం తీసిపోనిదిగా నిలిచింది. టీడీపీకి, వైఎస్సార్ కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా రెండు శాతం కూడా లే దు. కేవలం సీట్ల సంఖ్యలో ఆధిక్యతను సాధించి టీడీపీ అధికారంలోకి రాగలిగింది. అనేక సానుకూలాంశాలు కలసి వచ్చినప్పటికీ ఆ పార్టీ సాధించిన ఓట్లను బట్టి చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్సే గట్టిపోటీ ద్వారా ముందంజలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఎన్నికల్లో జాతీయస్థాయిలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం చూస్తే టీడీపీతో సమానంగా వైఎస్సార్ కాంగ్రెస్ 2.5 శాతం ఓట్లు సాధించింది. అత్యధిక ఓట్లు సాధించిన పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయస్థాయిలో పదో స్థానంలో నిలిచింది. టీడీపీ 1,40,94,545 ఓట్లు రాబడితే వైఎస్సార్ కాంగ్రెస్ 1,39,91,280 ఓట్లు సాధించింది. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం లక్ష మాత్రమేనని ఎన్నికల సంఘం తేల్చింది. జాతీయస్థాయిలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం చూస్తే టీడీపీకి 14, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 14 స్థానాలు రావలసి ఉందని ‘ద హిందూ’ పత్రికలో విశ్లేషణలు వచ్చాయి.

కొంచెం జాగ్రత్త పడి ఉంటే...

రాష్ట్రంలో పార్టీ ఏర్పాటైన అతి తక్కువ కాలంలోనే టీడీపీకి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా 67 ఎమ్మెల్యే, 9 ఎంపీ స్థానాలను గెల్చుకోవడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలనే సాధించినట్లు ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. పోల్ మేనేజ్‌మెంటులో కానీ, ఆర్థికపరమైన వ్యవహారాలను చాపకిందనీరులా చక్కబెట్టడంలో కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు సిద్ధహస్తులు కావడంతో అది ఈ ఎన్నికల్లో వారికి కలసివచ్చింది. పార్టీకి ప్రజాదరణ ఉందని, ఎట్టిపరిస్థితుల్లో తమదే గెలుపు అని చాలా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు, నేతలు ఒకింత అతివిశ్వాసంతో వ్యవహరించడంతో ఆ స్థానాలను స్వల్ప ఓట్ల తేడాతో తెలుగుదేశానికి వదులుకోవలసి వచ్చింది. ఇలాంటి నియోజకవర్గాలు దాదాపు 30కి పైగా ఉన్నాయని గుర్తించారు. ఈ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఒకింత అప్రమత్తతతో వ్యవహరించి ఉంటే ఓట్లలోనే కాకుండా సీట్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌దే పైచేయిగా ఉండేదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
 

ఎప్పటికీ వైఎస్సార్‌సీపీలోనే..

ఎప్పటికీ వైఎస్సార్‌సీపీలోనే..
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్:తాము ఎప్పటికీ వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతామని, జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తామని పినపాక ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, బాణోత్ మదన్‌లాల్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

వైఎస్సార్‌సీపీకి జిల్లాలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని కొన్ని శక్తులు, పత్రికలు కావాలనే ఊహాజనిత కథనాలతో గందరగోళం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. జిల్లాలో అత్యధికంగా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుని పెద్ద పార్టీగా నిలవడంతో జీర్ణించుకోలేని శక్తులు ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారని, తాము టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నామంటూ ప్రచురించిన అసత్య కథనాలను ఖండిస్తున్నామని తెలిపారు. తమకు పార్టీ మారే ఆలోచన ఏమాత్రం లేదన్నారు.

తాము విజయం సాధించిన తరువాత నియోజకవర్గ ప్రజలను కలువకముందే, కొన్ని గంటల్లోనే ఇలాంటి దుష్ర్పచారం చేయడం దిగజారుడుతనమన్నారు. గిరిజన ప్రజాప్రతినిధులమైన తమను కించపరిచేలా, కనీస మర్యాద లేకుండా అగౌరవంగా వ్యవహరించడం సరికాదన్నారు. మైండ్‌గేమ్ ఆడే ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచరించే సంస్కృతిని మానుకోవాలన్నారు.

కష్టకాలంలో జగన్‌తో ఉన్న తాము ఎప్పటికీ జగన్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో జిల్లాలో, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు. జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు నవ తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకుంటామన్నారు. సమావేశంలో ఖమ్మం, ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు కూరాకుల నాగభూషణం, రవిబాబు నాయక్, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముస్తఫా, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తోట రామారావు, ఆకుల మూర్తి, వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు కొండల్‌రావు, దుర్గాప్రసాద్, ఎస్.వెంకటేశ్వర్లు, మార్కం లింగయ్యగౌడ్, ఎంఏ.సమద్ పాల్గొన్నారు.

ఇడుపులపాయ చేరుకున్న వైఎస్ జగన్, విజయమ్మ

ఇడుపులపాయ చేరుకున్న వైఎస్ జగన్, విజయమ్మవీడియోకి క్లిక్ చేయండి
ఇడుపులపాయ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం ఇడుపులపాయ చేరుకున్నారు.  వైఎస్ జగన్ ఇడుపులపాయలో తండ్రి వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు.

కాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం(వైఎస్సార్ సీఎల్పీ) తొలిసారి నేడు సమావేశం కానుంది. ఇందుకోసం ఇడుపులపాయలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశంలో పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శాసనసభలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశంలో నేతలకు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులతో వైఎస్ జగన్ సమీక్షించనున్నారు.

మరోవైపు  వైఎస్ జగన్ బుధవారమంతా ఇడుపులపాయలోనే గడపనున్నారు. గురువారం పులివెందులలో తనను కలిసిన ప్రజలతో మమేకం కానున్నారు. 23న పులివెందులలో వైఎస్ రాజారెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొననున్నారు.

మొనగాడు పార్టీలను తలదన్నిన వైకాపా!రాష్ట్రంలో ఓడిపోవడంతోనే.. అధికారం దక్కించుకోకుండా ఉండిపోతున్నంతనే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖేల్‌ ఖతం అయిపోయినట్లేనని మురిసిపోతూ ఉండే అనేకానేకమందికి ఈ వార్త ఒక చేదు గుళిక. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారు సమర్థించుకునే వివరాలు కాదు.. సాక్షాత్తూ ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంక వివరాల ప్రకారమే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఈ దేశంలో అనేక ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకంటె ఎంతో మెరుగైన స్థితిలో ఉంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కంటె వెనుకబడి ఉన్న పార్టీల్లో కొమ్ములు తిరిగిన మొనగాడు పార్టీలు ఎన్నో ఉన్నాయి. చిన్న చిన్న వ్యత్యాసాలు అధికారం అందుకునే విధిరాతను నిర్ణయించే రాజకీయాల్లో.. వారికంటె ఎంతో మెరుగైన దశలో ప్రస్తుతం ఓడిపోయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉన్నదన్నమాట నిజం.

వివరాల్లోకి వెళితే..

దేశంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన రెండు పార్టీలు మాత్రమే ఒక కోటికంటె ఎక్కువ ఓట్లు సాధించాయి. ఆ పార్టీలు ఒకటి ఆమ్‌ఆద్మీ పార్టీ అయితే రెండోది వైఎస్సార్‌ కాంగ్రెస్‌. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన తేడా ఉంది. ఆమ్‌ఆద్మీ పార్టీ దేశంలో 400 స్థానాల్లో పోటీచేసి ఈ మాత్రం ఓట్లు సంపాదించింది. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మాత్రమే పోటీచేసి ఈ మాత్రం గరిష్టమైన ఓట్లను సాధించింది.

ఇంతా కలిపి ఆమ్‌ఆద్మీ సాధించింది 2 శాతం ఓటుషేర్‌ మాత్రమే. ఆ మాత్రానికి వారికి 1,13,25,635 ఓట్లు లభించాయి. అదే. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ 2.5 శాతం ఓట్‌షేర్‌ సాధించింది. 1,39,91,280 ఓట్లను సొంతం చేసుకుంది. ఈ రెండుపార్టీల్లో వైకాపా ఏకంగా 9 ఎంపీసీట్లు గెలుచుకోగా, ఆప్‌ సాధించింది కేవలం నాలుగు స్థానాలే.
పోల్చిచూస్తే.. 18సీట్లు సాధించిన శివసేన, సున్న సీట్లున్న డీఎంకే, 20 సీట్లు గెలిచిన బిజూ జనతాదళ్‌, ఆరు సీట్లు గెలిచిన ఎన్సీపీ, 11 సీట్లు గెలిచిన తెరాస, రెండు సీట్లు గెలిచిన జెడియూ వీటన్నింటికంటె.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చాలా ముందంజలో ఉన్నట్లు లెక్క. పై చెప్పిన పార్టీల్లో టాప్‌ పొజిషన్లో ఉన్న శివసేనకు వచ్చింది... 1.9 ఓట్‌ షేర్‌ మాత్రమే. వారు సాధించింది.. 1,02,62,982 ఓట్లు మాత్రమే. అంటే వైకాపా కంటె ఏకంగా 38 లక్షల ఓట్లు వెనుకబడి ఉన్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ విడతలో అధికారం అందుకోలేకపోయి ఉండవచ్చు.. కానీ ప్రజాదరణలో మాత్రం వెనకబడిన పార్టీ కాదనే వాస్తవాన్ని ఎన్నికల సంఘం ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.


- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/monagadu-party-lanu-thannina-52797.html#sthash.0CXELuVt.dpuf

జగన్ అంటే టీడీపీ నేతలకు ఎందుకంత వణుకు

Written By news on Tuesday, May 20, 2014 | 5/20/2014

'జగన్ అంటే టీడీపీ నేతలకు ఎందుకంత వణుకు'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే టీడీపీ నేతలకు ఎందుకంత వణుకని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేయాలని టీడీపీ నేతలకు హితవు పలికారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకే ఆరోపణలు చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.


70 మంది ఎమ్మెల్యేలు, 9మంది ఎంపీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరోత్సాహంతో ముందుకు వెళుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ, వైఎస్ జగన్  మధ్య జరిగిన ఏకాంత చర్చలు ఈనాడు దినపత్రికకు ఎలా తెలిశాయని ఆయన ప్రశ్నించారు. కోర్టులను కించపరిచేలా ఈనాడు కథనం రాసిందన్నారు. అటువంటి రాతలపై న్యాయస్థానాలు చర్యలు తీసుకోవాలని శ్రీధర్ రెడ్డి కోరారు.  సభ్య సమాజం తలదించుకునేలా తిరుమలలో టీడీపీ కార్యకర్తలు వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మద్యం సేవించి తిరుమలలో దుకాణదారులపై దాడులు చేసిన విషయం తెలిసిందే.

ఎప్పటికీ జగన్ నాయకత్వంలోనే ఉంటా...

ఎప్పటికీ జగన్ నాయకత్వంలోనే ఉంటా...
ఖమ్మం: వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తాము ఎప్పటికీ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తామని, పార్టీ మారాల్సిన అవసరం తమకు లేదని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ స్పష్టం చేశారు. గిరిజన ప్రజాప్రతినిధులైన తమపై కావాలనే కుట్రపూరితంగా కొన్ని శక్తులు దుష్ర్పచారం చేస్తున్నాయని అన్నారు. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసమే మొదటి నుంచి వైఎస్సార్ సీపీలో అంకితభావంతో పని చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానం గెలిచి వైఎస్సార్ సీపీ జిల్లాలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. జిల్లా పార్టీని బలోపేతం చేసేందుకు మరింతగా కృషి చేస్తున్నామన్నారు. దీన్ని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేయడం తగదని హితవు పలికారు.

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం జగన్‌తో కలిసి ఢిల్లీలోనే ఉన్నారని చెప్పారు. పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు రాజన్న ముఖ్యమంత్రిగా ఉండగా పట్టాలు ఇచ్చి ఆదుకున్నారని, దీంతో ప్రజలు జిల్లాలో వైఎస్సార్‌సీపీని ఆదరించారన్నారు. 2019లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గిరిజన ప్రజాప్రతినిధులను అవమానించే విధంగా కథనాలు ప్రచురించే పత్రికలపై చట్టపరమైన చర్యలకు సైతం వెనుకాడేది లేనది హెచ్చరించారు.
 

వైఎస్ జగన్ మద్దతును స్వాగతించిన దత్తాత్రేయ

వైఎస్ జగన్ మద్దతును స్వాగతించిన దత్తాత్రేయ
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్ డీఏకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించడాన్ని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ స్వాగతించారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని వైఎస్ జగన్ కోరారని దత్తాత్రేయ వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని దత్తాత్రేయ స్పష్టం చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని బీజేపీ పార్లమెంటరీ నేత నరేంద్రమోడీని వైఎస్ జగన్ కలిసిన సంగతి తెలిసిందే. అంశాల వారీగా ఎన్ డీఏకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఉంటుందని వైఎస్ జగన్ సోమవారం దేశ రాజధానిలో స్పష్టం చేశారు. 

నరేంద్ర మోడిని కలిసిన వైయస్ జగన్ photos

Popular Posts

Topics :