02 February 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

YSRCP to protest at Jantar Mantar on 17 Feb

Written By news on Saturday, February 8, 2014 | 2/08/2014

YS Jagan speech in Chodavaram, Visakhapatnam

గాజువాకలో జగన్ సమైక్య శంఖారావం సభకు పోటెత్తిన జనం

Photo: ప్రతి పేదవాడి మనసెరిగిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. సమైక్యశంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి గుండెలో ఆ మహానేత బతికే ఉన్నారని చెప్పారు. గాజువాకలో శనివారం రాత్రి జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమైక్య శంఖారావం సభకు జనం పోటెత్తారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల రాకతో గాజువాక జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో వైఎస్‌ఆర్‌ సువర్ణయుగాన్ని మళ్లీ తెద్దామని పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత ఆ మహానేతపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతకుముందు విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన సమైక్యశంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరా క్రాంతి పదం(ఐకెపి) ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని  జగన్మోహన రెడ్డి హామీ ఇచ్చారు. ఐకెపి మహిళలు వచ్చి జగన్ ను కలిశారు. వారు తమ సమస్యలను ఆయనకు తెలిపారు. జగన్ వెంటనే స్పందించి 47వేల మంది ఐకెపి ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలిరోజునే ఆ ఫైలుపై  సంతకం చేస్తానని చెప్పారు.

అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సిపి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీకి అండగా ఉంటుంది అక్కచెల్లెమ్మలేనని, వారిని తప్పక ఆదుకుంటామని చెప్పారు. విఏఓలు, సంఘమిత్ర ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఐకెపి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం: జగన్

ఐకెపి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం: జగన్
విశాఖపట్నం: తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరా క్రాంతి పదం(ఐకెపి) ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి హామీ ఇచ్చారు. చోడవరంలో జరిగిన సమైక్యశంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐకెపి మహిళలు వచ్చి జగన్ ను కలిశారు. వారు తమ సమస్యలను ఆయనకు తెలిపారు. జగన్ వెంటనే స్పందించి 47వేల మంది ఐకెపి ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలిరోజునే ఆ ఫైలుపై  సంతకం చేస్తానని చెప్పారు.

అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సిపి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీకి అండగా ఉంటుంది అక్కచెల్లెమ్మలేనని, వారిని తప్పక ఆదుకుంటామని చెప్పారు. విఏఓలు, సంఘమిత్ర ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

పేదవాడి మనసెరిగిన నేత వైఎస్: జగన్

పేదవాడి మనసెరిగిన నేత వైఎస్: జగన్చోడవరంలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
విశాఖపట్నం: ప్రతి పేదవాడి మనసెరిగిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. చోడవరంలో జరిగిన సమైక్యశంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి గుండెలో ఆ మహానేత బతికే ఉన్నారని చెప్పారు.

చంద్రబాబు భయానక పాలన మరచిపోలేమన్నారు. ఆయన పాలనలో పేదవాడు పడ్డబాధలు తనకు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. ఆయన ఎప్పుడూ పేద విద్యార్థి గురించి పట్టించుకోలేదన్నారు. అదే వైఎస్ అయితే ప్రతి పేద విద్యార్థి ఇంజనీర్ కావాలని కలలుగన్నారని చెప్పారు.  రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటే, తిన్నది అరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు అవహేళన చేశాన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గీసిన గీత దాటరని విమర్శించారు.

ఇసుకవేస్తే రాలని విధంగా బహిరంగ సభకు జనం తరలి వచ్చారు. చోడవరం జనసంద్రమైంది. వీధులన్నీ జనంతో నిండిపోయాయి.  దాదాపు అయిదు గంటలు ఆలస్యమైన

17న ఢిల్లీలో వైఎస్ఆర్ సిపి మహాధర్నా

17న ఢిల్లీలో వైఎస్ఆర్ సిపి మహాధర్నాఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో  భారీ ధర్నా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈనెల 17 వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ  సుమారు 7వేల మందితో ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు.

ఈ నెల15న రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ వెళ్తామని చెప్పారు. తిరుపతి నుంచి ఒకటి,  రాజమండ్రి నుంచి మరొక రైలు బయల్దేరుతుందని వివరించారు. ఒక్కొక్క రైలులో సుమారుగా 1800 మంది కార్యకర్తలు, రెండీంటిలో కలిపి మొత్తం 3600 మంది ఢిల్లీ వెళతారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులన్నీ పాల్గొనాలని విజ్ఙప్తి చేశారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి నిమిషం వరకు పోరాడుతామని  ఉమ్మారెడ్డి చెప్పారు.
 రాష్ట్రంలో మెజారిటి ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీలు పథకం ప్రకారం రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తున్నాయన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజను మొదటి నుంచి  వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఇప్పటికీ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు వైఎస్ జగన్ శతవిధాల ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆర్టికల్ 3ను సవరించాలని,  రాష్ట్రాల అసెంబ్లీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని విభజన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభలో బిల్లు పెట్టడానికి సాంకేతికపరమైన అడ్డంకులున్నాయని తెలిపారు.

విశాఖ లో జగన్ కు ఘన స్వాగతం

విశాఖ లో జగన్ కు ఘన స్వాగతం
విశాఖ: జిల్లాలోని సమైక్యశంఖారావంలో భాగంగా విశాఖకు చేరుకున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. జగన్ రాక కోసం ఎదురు చూసిన అభిమానులు, కార్యకర్తలు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. ఈ రోజు మధ్యాహ్నం విశాఖకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి నేరుగా చోడవరం బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో జగన్ ప్రసంగిస్తారు.
అనంతరం ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్ద ఉన్న కింగ్స్ గార్డెన్స్‌లో జరిగే మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మనుమడి వివాహానికి హాజరవుతారు.
 

జగన్ సమక్షంలో రేపు ధర్మాన చేరిక

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వెళ్లిపోతున్నారంటూ వస్తున్న కథనాలను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని ఆపార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె శనివారమిక్కడ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనప్ రెడ్డి సమక్షంలో ఆదివారం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తైనాల విజయ్ కుమార్, జగన్నాయకులు పార్టీ చేరుతున్నట్లు తెలిపారు. అలాగే నందమూరి లక్ష్మీ పార్వతి కూడా రేపు జగన్ సమక్షంలో  శ్రీకాకుళంలో జరిగే సభలో పార్టీ సభ్యత్వం తీసుకుంటారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అనేమంది సీనియర్లు ఉత్సాహం చూపుతున్నారని ఆమె తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఝలక్! వైఎస్సార్ సీపీలోకి

కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఝలక్!వీడియోకి క్లిక్ చేయండి
విశాఖపట్నం : కేంద్ర మంత్రివర్గం తెలంగాణ బిల్లును ఆమోదించిన మర్నాడే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టారు. రాష్ట్ర విభజన విషయంలో పార్టీ, కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
సమైక్య ఉద్యమాన్ని కాంగ్రెస్ అవమానపరిచిందని, సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని తాను నిర్ణయించుకున్నానని ఆయన ప్రకటించారు. వాస్తవానికి తాను జూలై 30నే కాంగ్రెస్‌ను వీడిపోవాలని నిర్ణయించుకున్నానని, అయితే బాధ్యతాయుత ప్రజాప్రతినిధిగా ప్రజల వెనుక ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్నాళ్లూ ఆగానని ఆయన అన్నారు. ఆదివారం నాడు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరనున్నారు.

నేడు విశాఖ జిల్లాలో జగన్ ‘సమైక్య శంఖారావం’

నేడు విశాఖ జిల్లాలో జగన్ ‘సమైక్య శంఖారావం’
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘సమైక్య శంఖారావం’ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శనివారం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి నేరుగా చోడవరం వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సభలో ప్రసంగిస్తారని పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు.

చోడవరం నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్ద ఉన్న కింగ్స్ గార్డెన్స్‌లో జరిగే మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మనుమడి వివాహానికి హాజరవుతారు.

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ బంధువుల చీప్ ట్రిక్స్!

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ బంధువుల చీప్ ట్రిక్స్!
కడప, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ సీఎం రమేష్ బంధువులు రూ. 4 కోట్ల విలువైన 35 వాహనాలను అసలు ఓనర్‌కు తెలియకుండా అక్రమంగా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.  రమేష్ బంధువులు తమ సంస్థకు చెందిన వాహనాలను రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారని ఆర్‌కే ఇన్‌ఫ్రా, ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ రవికల్యాణ్‌రెడ్డి ఆరోపించారు. ట్రాన్స్‌ఫర్ పత్రాల్లో సంతకాలు తమవి కాదన్నారు. రమేష్ ఒత్తిడివల్లే వాహనాలను ట్రాన్స్‌ఫర్ చేసినట్లు అధికారులు చెబుతున్నారని తెలిపారు.
 
  రవికల్యాణ్‌రెడ్డి శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. 2008లో తాను కొన్న 35 వాహనాలను రిత్విక్ ప్రాజెక్ట్స్ వారు చింతకుంట జయప్రకాశ్‌నాయుడు పేరుతో ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నారని తెలిపారు. ఇందులో కొన్ని ఆర్‌సీలను కూడా అప్పుడే తీసుకున్నారని చెప్పారు. ట్రాన్స్‌ఫర్ అయిన వాహనాలన్నీ తమ వద్దే ఉన్నాయన్నారు. ఈ ట్రాన్స్‌ఫర్ విషయం తమకు ఈనెల 2న తెలిసిందని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. రమేష్ ఒత్తిడి వల్లే ఇలా చేశానని ఆర్‌టీవో  చెబుతున్నారన్నారు. ఈ విషయమై ఆర్టీవో కూడా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారని తెలిపారు.
 
 అధికారంలోకి వస్తే ఆస్తులు లాక్కుంటారేమో..!
 సీఎం రమేష్ బంధువులు టీడీపీ అధికారంలోకి వస్తే అందరి ఆస్తులు లాక్కుంటారేమోనని రవికల్యాణ్‌రెడ్డి ఆందోళ వ్యక్తంచేశారు. వాహనాల అక్రమ ట్రాన్స్‌ఫర్ విషయాన్ని సరైన సమయంలో తెలుసుకోగలిగామని చెప్పారు. వెంటనే రవాణాశాఖకు, డీటీసీ, ఆర్టీవోలకు చెప్పి వాహనాలు ట్రాన్స్‌ఫర్  కాకుండా ఆపగలిగామని, లేదంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తాము, రమేష్ బంధువులు అలహాబాద్ ఎన్‌టీపీఎల్‌లో జాయింట్ వెంచర్ నిర్వహించే వారమని, వారి దగ్గరి నుంచి  డబ్బు రావాల్సి ఉంటే ఆ వివాదం కోర్టులో నడుస్తోందని చెప్పారు. తమ యంత్రాలను స్వాధీనం చేసుకునేందుకే ఈ ప్రయత్నం చేశారని వివరించారు.

రాజ్యసభ ఎన్నికల్లో బట్టబయలైన కుమ్మక్కు

కాంగ్రెస్ డైరెక్షన్‌లో బాబు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
రాజ్యసభ ఎన్నికల్లో బట్టబయలైన కుమ్మక్కు: గడికోట
జగన్‌ను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని వ్యాఖ్య

 
 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో నాలుగున్నరేళ్లుగా కుమ్మక్కు రాజకీయాలు నెరుపుతున్న చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల్లోనూ కొనసాగించారని  వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా కాంగ్రెస్ హైకమాండ్ డెరైక్షన్‌లో భాగంగానే ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టారని విమర్శించారు. ఈ ఎన్నికల కోసం పార్టీ ఎమ్మెల్యేలందర్నీ ఏకతాటిపైకి తె చ్చి ఓట్లేయించుకున్న బాబు.. విభజన విషయంలో రెండు కళ్ల సిద్ధాంతమని ఎందుకంటున్నారని ప్రశ్నించారు.
 
  పదవి విషయంలో ఉమ్మడి విధానం, ప్రజాసమస్యలపై ద్వంద్వ వైఖరా? అని నిలదీశారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత పెంచడానికి ప్రయత్నిస్తున్న జగన్‌ను విమర్శించే అర్హత బాబుకు లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులతో కలసి  విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే...  మా పార్టీకి తగిన సంఖ్యాబలం లేనందున రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టబోమని ముందే ప్రకటించాం. ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్‌లో పాల్గొనరని చెప్పాం. చంద్రబాబు మాత్రం వైఎస్సార్‌సీపీపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు.
 
  శాసనసభ ఎన్నికల తర్వాత రాజ్యసభ ఎన్నికలు జరిపితే మూడు సీట్లు రావని కాంగ్రెస్, రెండు సీట్లు కూడా రావని టీడీపీలు ఉమ్మడి అభిప్రాయానికి వచ్చి ఎన్నికలు ముందు జరిపేలా ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తీసుకొచ్చాయి. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై వారి డెరైక్షన్‌లోనే పనిచేస్తూ విభజన విషయంలో ఆ పార్టీ మాదిరిగానే రెండు విధానాలు వినిపిస్తున్నారు.  కేంద్రంలో అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌సీపీని స్పీకర్ మీరాకుమార్ తొలిసారి ఆహ్వానించారు. అయితే రేపు ఉదయం సమావేశమనగా, సాయంత్రం లేఖ పంపారు. వెళ్లడానికి తగిన సమయం లేకే వారికి లేఖ పంపించాం.  ఆల్‌పార్టీ మీటింగ్ విషయంలో తమను తప్పుబడుతున్న చంద్రబాబు... రాష్ట్రంలో బీఏసీ సమావేశాలకు ఎందుకు హాజరుకాలేదు? అసెంబ్లీలో కూర్చుండి కూడా ఇరుప్రాంత నేతల చేత డ్రామాలు ఆడించిన వ్యక్తి... నీతి, నిజాయితీల గురించి మాట్లాడటం సిగ్గుచేటు.  చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ పార్టీకి హోల్‌సేల్‌గా అమ్మితే, చంద్రబాబు టీడీపీని విడతల వారీగా  రిటైల్‌గా అమ్ముకుంటున్నారు. నాలుగున్నర ఏళ్లుగా ప్రతీ అంశంలో కూడా కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుంటున్నారు.

YSRCP leader Srikanth Reddy press meet on February 7

Written By news on Friday, February 7, 2014 | 2/07/2014

రేపట్నుంచి విశాఖలో జగన్ సమైక్య శంఖారావం

రేపట్నుంచి విశాఖలో జగన్ సమైక్య శంఖారావం
విశాఖపట్నం: సమైక్యశంఖారావం యాత్రలో భాగంగా ఈ నెల 8 వతేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.  శనివారం మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొనే జగన్ అక్కడినుంచి నేరుగా చోడవరం వెళ్లి మధ్యాహ్నాం 3 గంటలకు జరిగే సభలో ప్రసంగిస్తారని ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు.
 
చోడవరం నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో జగన్ ప్రసంగిస్తారు. ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్ద ఉన్న కింగ్స్ గార్డెన్స్  రాత్రి జరిగే మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు  మనుమడి వివాహానికి హాజరౌతారు.

చిరంజీవి హోల్ సేల్..చంద్రబాబు రిటైల్

'చిరంజీవి హోల్ సేల్..చంద్రబాబు రిటైల్'
కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కు రాజకీయాలు చేసే మీరా మమ్మల్ని విమర్శించేది అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్ఆర్ సీపీని ఉద్దేశించి సిగ్గు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు అని అన్నారు. 
 
నైతికత గురించి మాట్లాడే హక్కులేదని చంద్రబాబును శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. రాజ్యసభకు ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టడానికి కాంగ్రెస్‌ పార్టీతో ఒప్పందం చేసుకున్నది వాస్తవం కాదా? అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.  శాసనసభలో ఉండి కూడా బీఏసీకి రాని మీరా మమ్మల్ని విమర్శించేది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి హోల్‌సేల్‌గా అమ్మితే, నువ్వు రిటైల్‌గా అమ్ముతున్నావు అని చంద్రబాబుపై శ్రీకాంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. 
 

మంత్రుల కాళ్లు కాదు ... బాబు కాళ్లు పట్టుకోండి

'మంత్రుల కాళ్లు కాదు ... బాబు కాళ్లు పట్టుకోండి'
హైదరాబాద్ : రాష్ట్ర విభజన వద్దని కేంద్ర మంత్రుల కాళ్లు పట్టుకోవడం కాదని, ముందు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని గతంలో  కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడును శోభా నాగిరెడ్డి  డిమాండ్ చేశారు. ఎవరిని నమ్మించడానికి పార్లమెంట్ లో పగటి వేషాలు వేస్తున్నారని టీడీపీ నేతలను ఆమె ప్రశ్నించారు. శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు.
 
చంద్రబాబుకు సహాయం చేయాలనుకేంటే మంచిదే చేయండని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఈ సందర్భంగా హితవు పలికారు. చేతనైతే జగన్ను రాజకీయంగా ఎదుర్కొండి, అంతేకానీ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై మాత్రం దిగజారి వార్తలు రాయడం మంచిది కాదన్నారు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నీచంగా కథనాలు రాస్తున్నారని శోభా నాగిరెడ్డి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. రాజ్యసభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి వేంకటేశ్వరరావు వ్యాఖ్యాలను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు శోభానాగిరెడ్డి తెలిపారు.
 
విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా సహకరించారని ఆరోపించారు. అలాంటి ఆయన ఇప్పుడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఏం సాధించబోతున్నారంటూ సీఎం కిరణ్ ను ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అపాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతోపాటు పలువురు నేతలు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి, జీవోఎంలో సభ్యుడు జైరాంరమేష్ కాళ్లు పట్టుకుని వేడుకున్న సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు గతంలో కేంద్రానికి లేఖ ఇచ్చారు. దాంతో పార్టీ అధ్యక్షుడు అనుకూలమని లేఖ ఇచ్చిన బాబు కాళ్లు పట్టుకోకుండా కేంద్ర మంత్రులు కాళ్లు పట్టుకోవడం వల్ల ఏం లాభం ఉంటుందంటూ శోభానాగిరెడ్డి టీడీపీ నేతలను శుక్రవారం బహిరంగంగా ప్రశ్నించారు

శరద్‌పవార్‌తో YS జగన్‌ భేటీ

శరద్‌పవార్‌తో YS జగన్‌ భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా కృషిచేస్తున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో జగన్ భేటి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని పవార్ దృష్టికి తీసుకెళ్లారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని జగన్ కోరారు.
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జగన్.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సహా పలువురు జాతీయ నాయకులను కలిసిన సంగతి తెలిసిందే. జగన్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ, సీపీఎం నేత ప్రకాశ్ కారత్ తదితర జాతీయ నేతలను జగన్ కలిశారు.

విశాఖ జిల్లాలో సమైక్య శంఖారావం

సమైక్య శంఖారావం రేపు
  •  8వ తేదీన విశాఖ జిల్లాలో సమైక్య శంఖారావం.
  • వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ జిల్లా పర్యటన
  •  మధ్యాహ్నం 3 గంటలకు చోడవరంలో..
  •  సాయంత్రం 5కు గాజువాకలో సభలు
  •  విజయవంతం చేయాలని పార్టీ జిల్లా, నగర అధ్యక్షుల పిలుపు
 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన చోడవరంలో జరిగే సభలో ప్రసంగిస్తారని పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు చొక్కాకుల వెంకట్రావు, వంశీకృష్ణ శ్రీనివాస్‌లు తెలిపారు. అక్కడి నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారని చెప్పారు. శనివారం రాత్రి విశాఖలోనే బస చేస్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జిల్లాలో నిర్వహిస్తున్న ఈ సభలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని వారు కోరారు.

మొబైల్‌లో వైఎస్సార్ సీపీ సభ్యత్వం

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుకుగాను పార్టీ ఐటీ విభాగం సరికొత్త ప్రక్రియ ప్రారంభించింది. పార్టీ అభిమానులెవరైనా సరే ఇక తమ మొబైల్ ఫోన్ నుంచి 88866 62266 నెంబర్‌కు ‘మిస్డ్ కాల్’ చేయడం ద్వారా లేదా ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా వైఎస్సార్ సీపీలో సభ్యత్వం పొందవచ్చని ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదనరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ నెంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే అవతలి నుంచి సభ్యత్వ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలన్నీ ఎస్‌ఎంఎస్ ద్వారా.. కాల్ వచ్చిన నెంబరుకు పంపుతారు. ఆ ఎస్‌ఎంఎస్ పొందిన వ్యక్తి ఆ తరువాత 88866 67711 నెంబరుకు మళ్లీ తన వివరాలను పంపితే సభ్యత్వ నెంబర్‌ను కేటాయించడమే కాక, దానిని ధృవీకరిస్తూ ఒక సందేశం పంపుతారు. మిస్డ్ కాల్‌తో నిమిత్తం లేకుండా నేరుగా తమ పేరు, ఊరు పిన్‌కోడ్ వివరాలను 88866 67711 నెంబరుకు ఎస్‌ఎంఎస్ పంపినా కూడా ఆ వ్యక్తి సభ్యత్వం నమోదవుతుంది.

అదిగో నవలోకం

అదిగో నవలోకం
ఇటీవల వైఎస్సార్ సీపీ ప్లీనరీ సమావేశంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలు మేధావులనే కాదు సామాన్యుడినీ ఆలోచింపచేయిస్తున్నాయి. గతంలో ఆగిపోయిన పథకాలు ఊపిరిపోసుకోనున్నాయి...  జనం చెంతకు చేరని పథకాలు వడివడిగా నడవనున్నాయనే ఆనందం జనంలో కనిపిస్తోంది. విద్యార్థి, ఉద్యోగలోకం, వ్యవసాయ, కార్మిక, కర్షక సోదరులకు అండగా ... మహిళామణులకు మమకారం పంచుతూ అందరి మన్ననలు అందుకున్నాయి ప్లీనరీలో ప్రకటించిన హామీలు . ఇచ్చిన మాట తప్పని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగనన్న కూడా అదే అడుగుజాడల్లో నడుస్తారన్న నమ్మకం ప్రజల్లో ప్రబలంగా ఉండడంతో మిగతా రాజకీయ నేతలు ఇచ్చిన హామీల మాదిరిగా వీటిని జనం తీసుకోవడం లేదు. .  ఇవి ఆచరణలోకి వస్తే జిల్లాలో ఎంతమంది లబ్ధి పొందనున్నారు అనే కోణంలో ప్రత్యేక,
 
 వ్యవసాయం
 ధాన్యానికి మద్దతు ధర కల్పించేం దుకు వైఎస్ జగన్ రూ.3వేల కోట్లతో వ్యవసాయ స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. దీనివల్ల జిల్లాలో 3.5 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూరుతుంది.

 వికలాంగుల పింఛన్లు

 జిల్లాలో 45,614 మంది వికలాంగులు నెలకు రూ. 500  పింఛన్ అందుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ దాన్ని రూ.1000కి పెంచనుంది.
 
 గ్యాస్‌పథకం
 వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 12 సిలిండర్లు ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 100 సబ్సిడీ భరిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు.
 
 రేషన్ బియ్యం
 తెల్లరేషన్‌కార్డులోని ప్రతి సభ్యుడికి నెలకు ఆరు కిలోల బియ్యాన్ని కిలో రూపాయికే అందజేస్తామని  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
 
 డ్వాక్రా
 డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన రుణాలను రద్దు చేస్తామని జగన్ ప్రకటించారు.     5.80 లక్షల మంది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
 
 విద్యుత్ సరఫరా
 తమ పార్టీ తొమ్మిది గంటల పాటు నిరంతరంగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తుందని జగన్ హామీ ఇచ్చారు.
 
 ఫీజు రీయింబర్స్‌మెంట్
 తాము అధికారంలోకి వస్తే ఫీజు రీయిం బర్స్‌మెంట్  అవసరాల కోసం రూ.6వేల కోట్లు ఖర్చు పెడతామని జగన్ స్పష్టం చేశారు.
 
 108, 104
 108,  104 వాహనాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని జగన్ చెప్పారు.  104లో మందులు అందుబాటులో ఉంచుతామన్నారు.
 
 ఆరోగ్యశ్రీ
 ఈ పథకం నుంచి తొల గించిన 133 వ్యాధులను తిరిగి చేరుస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీనివల్ల జిల్లాలోని పలువురికి ప్రయోజనం చేకూరనుంది.

పోలింగ్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దూరం

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ ఆవరణలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనడం లేదు. రాజ్యసభ  అభ్యర్థిని గెలిపించుకునేంతటి సంఖ్యాబలం తమకు లేదు కనుక తమ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంటుందని ఫిబ్రవరి 23వ తేదీన పార్టీ నేత ఎం.వి.మైసూరారెడ్డి ప్రకటించిన విషయం విదితమే!

పోలింగ్‌లో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనరాదని విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి విప్ కూడా జారీ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రాష్ట్రపతితో పాటు వివిధ పార్టీల అగ్రనేతలను కలిసి గురువారం రాత్రి నగరానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానుసారం పోలింగ్ కు గైర్హాజరు కావాలని నిర్ణయించారు.

'మోసానికి మారుపేరు చంద్రబాబు నాయుడు

Written By news on Thursday, February 6, 2014 | 2/06/2014

'మోసానికి మారుపేరు చంద్రబాబు నాయుడు'
ప.గో: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోసానికి మారుపేరని ఎమ్మెల్యే బాలరాజు విమర్శించారు. జిల్లాలోని జీలుగుమిల్లిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ఈ సమావేశానికి బాలరాజుతో పాటు, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ తోట చంద్రశేఖర్ హాజరైయ్యారు.  విశ్వసనీయతకు మారుపేరు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే మోసానికి మారుపేరు చంద్రబాబు అని బాలరాజు పేర్కొన్నారు..
 
రాష్ట్రానికి సమైక్యంగా ఉంచే సత్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని బాలరాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కుక్కలు చించిన విస్తరిలాగా తయారైందన్నారు.

ఈనెల 9న వైఎస్సార్ సీపీ లో చేరనున్నధర్మాన

శ్రీకాకుళం:ఈ నెల 9వ తేదీన పట్టణంలో జరిగే సమైక్యశంఖారావం సభలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. త్వరలో విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం చేపట్టనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన విశాఖ జిల్లాలోని చోడవరం, గాజువాకల్లో జగన్ సమైక్యశంఖారావం కార్యక్రమం ఉంటుంది. అనంతరం మరుసటి రోజు బోగాపురం, శ్రీకాకుళంలలో బహిరంగ సభలు ఉంటాయి. శ్రీకాకుళంలో జరిగే బహిరంగ సభలో ధర్మాన వైఎస్సార్ సీపీ లో చేరనున్నారు.
 
జగన్ సమక్షంలోనే సుమారు లక్షమందితో  వైఎస్సార్ సీపీలో చేరుతానని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఇచ్ఛాపురంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీని వైఎస్సార్‌సీపీలో కలిపేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్‌ను, దానికి సహకరిస్తున్న టీడీపీని వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించాలంటే ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌సీపీలో చేరాలన్నారు.

కె. సురేష్ బాబు వైయస్సార్ కాంగ్రెస్ వై.యస్.ఆర్. జిల్లా అధ్యక్షు డిగా ఎన్నికైనందుకు హర్షం వ్యక్తం చేసిన కువైట్ వైయస్సార్సిపి సభ్యులు






కువైట్: కువైట్ హవెల్లి ప్రాంతములో సీనియర్ నాయకులు మరియు కమిటీ  సభ్యులైనా టి జి బాస్కర్ రెడ్డి,చింత శివా రెడ్డి  రాష్ట్ర ఎన్.ఆర్.ఐ. వర్కింక్ కమిటి సభ్యులు యమ్.వి. నరసా రెడ్డి, తెట్టు రఫీ ఆధ్వర్యములో కమిటి సభ్యులు గోవింద్ నాగరాజ్, నాయని మహేష్ రెడ్డి, ఆకుల ప్రభాకర్, రెహమాన్ ఖాన్, కె రమణ యాదవ్ , రవీంద్ర  బాబు నాయుడు ,కె వాసు దేవా రెడ్డి ,మహుబ్ బాషా ,యన్ వి  సుబ్బా  రెడ్డి. గార్లు  కె. సురేష్ బాబు గారి ఎంపికపై హార్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భముగా నరసా రెడ్డి, రఫీ మాట్లాడతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా సామాన్య కార్యకర్త నుండి జిల్లా నాయకుడి వరకు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పేరుతో పిలిచి ఎంతో ప్రేమతో పలకరించే వ్యక్తి కార్య కర్తలకు అజాత శత్రువు  సురేష్ బాబు గారు. పార్టీ కోసం అంకిత భావంతోపనిచేస్తున వ్యక్తీ సురేష్ బాబు గారు వై యస్ రాజశేఖర్ రెడ్డి గారిని మరిచి పోకుండా  వై యస్ కుటుంభంనకు అండ నిలిచి మంచి మనిషి కువైట్ కమిటి సభ్యులు అంటే ప్రత్యేక అభిమానం కలిగిన సురేష్ బాబు గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అధిష్టించాలని ఆశిస్తూ కమిటి సభ్యులు అందరు పత్రిక ముఖంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమములో వైయస్సార్ పార్టీ అభిమానులు అజీజ్,మర్రి కళ్యాణ్, నియాజ్ ,జోగి పెంచల్ రెడ్డి,షేఖ్ హుసెన్,గంగాధర్,ప్యారుల్,అలీ,కృష్ణరెడ్డి.జావిద్,సజాద్ ,ఆరిఫ్ పాల్గోన్నారు.

Gadapa Gadapaku YSRCP running successfully

Jagan seeks Karat's support for 'Samaikyandhra'

టీడీపీ ఎమ్మెల్యేపై మరోసారి భార్య ఫిర్యాదు

టీడీపీ ఎమ్మెల్యేపై మరోసారి భార్య ఫిర్యాదు
విజయవాడ : కృష్ణాజిల్లా  కైకలూరు టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణపై ఆయన భార్య సునీత మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆయన భార్య సునీత తన భర్త నుంచి ప్రాణభయం ఉందని రెండో సారి పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నారని, ప్రాణభయం ఉందంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం సునీత తన భర్త నుంచి వేరుగా ఉంటున్నారు. మూడు నెలల పాటు మెయింటెనెన్స్‌తో పాటు భార్య, పిల్లల ను చక్కగా చూసుకోవాలని  గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను పాటించకుండా.. మళ్లీ వేధింపులు ప్రారంభించారని సునీత చెబుతున్నారు.
 కుటుంబ కలహాల నేపథ్యంలో ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ గతంలో రెండు కేసులు నమోదు అయ్యాయి. భార్య సునీత ఫిర్యాదు మేరకు కైకలూరు పోలీసులు ఆయనపై తొలుత గృహహింస చట్టం-498 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విషయం న్యాయస్థానానికి వెళ్లిన తర్వాత మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నానికి ప్రయత్నించారనే ఆరోపణపై 307, బలవంతంగా విడాకుల పత్రాలపై సంతకాలు తీసుకున్నారనే ఆరోపణపై 384 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
2012లో భార్యభర్తలు ఇద్దరు తమకు విడాకులు మంజూరు చేయాలని సీనియర్ సివిల్ జడ్జిని ఆశ్రయించటంతో వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార్యా భర్తలిద్దరూ కోర్టుకు హాజరవగా, తనకు విడాకులు వద్దని సునీత జడ్జికి విన్నవించిన విషయం తెలిసిందే.

విజయవాడ: నగర టీడీపీ నేత నాగుల్ మీరా తనయుడు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. వ్యభిచార గృహాలపై పోలీసులు చేసిన దాడిలో  మీరా తనయుడు దొరికిపోయాడు. సత్యనారాయణపురంలోని శ్రీనగర్ కాలనీలోని ఓ ఇంటిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్నారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు అకస్మికంగా దాడి చేశారు. ఈ ఘటలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో టీడీపీ నేత తనయుడు కూడా ఉండటం గమనార్హం.
 

కేంద్రమంత్రులకు దమ్ము, ధైర్యం లేదా?

కేంద్రమంత్రులకు దమ్ము, ధైర్యం లేదా?వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : రాష్ట్ర విభజనను జరగనివ్వమంటూ గతంలో ప్రగల్భాలు పలికిన కేంద్రమంత్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విభజనపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం కేంద్రమంత్రులకు లేదా అని ఆమె గురువారమిక్కడ సూటిగా ప్రశ్నించారు. జీవోఎంకు సవరణలు ఇవ్వటం అవమానకరమని వాసిరెడ్డి మండిపడ్డారు.

 తెలుగు ప్రజల కత్తి పడుతుంటే ...మరోవైపు ఎంపీలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం లాబీలు చేయటం దురదృష్టకరమన్నారు. కేంద్రంలో వారు లాలూచీ పడకపోతే వారు విభజనను ప్రశ్నించేవారని అన్నారు. ప్రజలు ఏమైనా పరవాలేదు...మా వ్యాపారాలు, కంపెనీలు ఉండాలి... అనే ధోరణిలో సీమాంధ్ర ఎంపీలు ఉన్నారని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. కేంద్రంతో ఎందుకు తేల్చుకోలేకపోతున్నారని ఆమె ప్రశ్నించారు.

బిల్లును అడ్డుకోండి: కారత్ కు జగన్ విజ్ఞప్తి

బిల్లును అడ్డుకోండి: కారత్ కు జగన్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కు  విజ్ఞప్తి చేశారు. పార్టీకి చెందిన నెల్లూరు లోక్ సభ సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి, ఇతర నాయకులతో కలసి ఆయన ఈ రోజు కారత్ ను కలిశారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా రాష్ట్ర విభజనకు సిద్దపడుతున్నట్లు వివరించారు.  సమైక్య రాష్ట్ర పరిరక్షణకు సహకరించాలని వారు కారత్ ను కోరారు.

రాష్ట్ర సమైక్యత కోసం గతంలో కూడా జగన్మోహన రెడ్డి బృందం జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలిసింది. రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టనుండటంతో జగన్ మళ్లీ జాతీయ నాయకులను కలిసి అభ్యర్థిస్తున్నారు.

యుపిఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్ సిపి అవిశ్వాస తీర్మాన నోటీస్

యుపిఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్ సిపి అవిశ్వాస తీర్మాన నోటీస్
న్యూఢిల్లీ: యుపిఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆ పార్టీ వాయిదా తీర్మానం నోటీస్ కూడా ఇచ్చింది. ఈ నోటీస్ లను ఆ పార్టీ నెల్లూరు లోక్ సభ సభ్యుడు  మేకపాటి రాజమోహన రెడ్డి స్పీకర్ కు అందజేశారు.

 ఇదిలా ఉండగా, పార్లమెంటులో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈరోజు తెలంగాణపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.

నాలుగు గంటల సేపు దీక్ష చేశాడా? చాలా గొప్పోడు కదయ్యా..!

* అసెంబ్లీ తిరస్కరించినా కేంద్రం మొండిగా ముందుకెళ్తోంది..
రాష్ట్రపతికి జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు  
దేశ ప్రథమ పౌరుడిగా మీరైనా అడ్డుకోండి..
దేశంలో మునుపెన్నడూ లేని విధంగా కేంద్రం రాష్ట్ర విభజన చేస్తోంది..
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోంది
గతంలో అసెంబ్లీ ఆమోదంతోనే కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది
బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా చూడాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి
బిల్లును బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ  వ్యతిరేకిస్తాయని ధీమా
కేంద్రంపై అవిశ్వాసం ఎవరు పెట్టినా ముందు తామే లేచి నిలబడతామని వెల్లడి
 
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీ తిరస్కరించినా కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోందని, దేశ ప్రథమ పౌరుడిగా మీరైనా ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. గతంలో రాష్ట్రాల విభజన ఆయా రాష్ట్ర అసెంబ్లీల ఆమోదంతో జరగ్గా ఆంధ్రప్రదేశ్ విషయంలో అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని వివరించారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం వైఎస్ జగన్, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల బృందం రాష్ట్రపతితో భేటీ అయింది. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పార్టీ తరఫున జగన్ నాలుగు పేజీల వినతిప్రతాన్ని అందించారు.
 
 అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా తమ పార్టీ బిల్లును వ్యతిరేకిస్తూ అఫిడవిట్లు సమర్పించిన విషయాన్ని, సభా నిబంధనల కింద పలుమార్లు బిల్లును వెనక్కి పంపాలంటూ కోరిన విషయాన్ని వినతి పత్రంలో గుర్తు చేశారు. బిల్లును తిప్పి పంపాలని అసెంబ్లీ తీర్మానం చేసిందని వివరించారు. గతంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆయా మాతృ రాష్ట్రాల అసెంబ్లీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన అంశాలను రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.
 
  శ్రీకృష్ణ కమిటీ సైతం విభజనను వ్యతిరేకించినా, బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసినా కేంద్ర ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకు వెళుతూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని వివరించారు. ఈ దృష్ట్యా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా చూడాలని విజ్ఞపి చేశారు. తాము చెప్పిన విషయాలన్నీ విన్న రాష్ట్రపతి.. విభజన విల్లు విషయంలో ఏది మంచిదో అది చేస్తామని, తాను చేయగలిగిందంతా చేస్తానని హామీ ఇచ్చినట్లు జగన్ వివరించారు. రాష్ట్రపతితో సమావేశం అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు.
 
 దేశంలో ఎక్కడా లేని అన్యాయం..
 రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తీరును రాష్ట్రపతికి వివరించామని జగన్ చెప్పారు. దేశచరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా కేంద్రం రాష్ట్ర విభజనకు దిగుతోందని విమర్శించారు. ‘‘రాష్ట్రపతితో సుదీర్ఘంగా అన్ని అంశాలపై చర్చించాం. దేశంలో కనీవినీఎరుగని రీతిలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. గతంలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన తర్వాతే కేంద్రం రాష్ట్రాలను విడగొట్టింది. కానీ ఇప్పుడు మొదటిసారి విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించినా, దాన్ని తిప్పిపంపినా కేంద్రం అన్యాయంగా విభజన చేసేందుకు ముందుకు వెళుతోంది. ఈ అన్యాయాన్ని ఆపాలి. దీనిపై రాష్ట్రపతి సావధానంగా విన్నారు. ఈ విషయంలో ఏది మంచో అది చేస్తానని చెప్పారు. మాకైతే దేవుడిపై నమ్మకం ఉంది. విభజన జరగదనే విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
 
 అన్ని పార్టీలు విభజనను వ్యతిరేకిస్తాయి: పార్లమెంట్‌లో విభజన బిల్లును ప్రవేశపెడితే అన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తాయని తమకు గట్టి నమ్మకం ఉందని జగన్ చెప్పారు. ‘‘ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో తిరిగి జాతీయ పార్టీల అధ్యక్షులను కలిశాం. చూస్తూ ఊరుకుంటే.. ఈ అన్యాయం మీకు కూడా జరుగుతుందని చెప్పాం. కాంగ్రెస్ అడ్డగోలుగా బిల్లు తేవాలని ప్రయత్నిస్తే ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై నిలిచి బిల్లును వ్యతిరేకిస్తాయనే నమ్మకం ఉంది. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని మాకు విశ్వాసం ఉంది..’’ అని వివరించారు. తాము మద్దతిస్తామని బీజేపీ కచ్చితంగా చెబుతున్నప్పుడు బిల్లు ఆగుతుందని ఎలా చెప్పగలరని విలేకరులు అడగ్గా.. ‘‘గతంలో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ను కలిశాం. ఈ రోజున పార్లమెంట్‌లో అరుణ్‌జైట్లీని కలిశాం. ప్రతి ముఖ్య నేతను కలుస్తున్నాం. మరోసారి కూడా అందరినీ కలుస్తాం. బిల్లును అడ్డుకోవాలని కోరతాం. బీజేపీ అయితే బిల్లుకు మద్దతు ఇస్తుందని అనుకోం’’ అని వ్యాఖ్యానించారు.
 
 అవిశ్వాసం ఎవరు పెట్టినా ముందు లేచి నిలబడతాం
 పార్లమెంట్‌లో పార్టీ తరఫున అవిశ్వాసం పెడతారా అని విలేకరులు ప్రశ్నించగా ‘‘20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంటిదారి పట్టక తప్పదు. ఎన్నికలు వస్తున్న తరుణంలో అవిశ్వాసానికి అర్థం లేదు. ఎన్నికల తరుణంలో లబ్ధి పొందేందుకు టీడీపీ అవిశ్వాసం ఇచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు అవిశ్వాసం పెట్టినా మా పార్టీ తరఫున ముగ్గురం ఎంపీలం ముందు లేచి నిలబడతాం’’ అని జగన్ స్పష్టంచేశారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, సుచరిత, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, కృష్ణదాస్, విశ్వరూప్, ఆది నారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి తదితరులు ఉన్నారు.
 
 రాష్ట్రపతికి వైఎస్సార్‌సీపీ సమర్పించిన వినతి పత్రం సారాంశం..
 రాజ్యాంగ నిబంధనలను, సంప్రదాయాలను కాలదన్నుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 2013, డిసెంబర్ 26న హైదరాబాద్‌లో మా పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు మీకు అఫిడవిట్లను సమర్పించాం. గతంలో ఏర్పాటు చేసిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలోనూ.. ఆయా అసెంబ్లీలు విభజనకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానాలు చేసిన తరువాతే ఆయా రాష్ట్రాలను విభజించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాం.
 
  మిగతా రాష్ట్రాల ఏర్పాటు కూడా సంబంధిత కమిషన్ లేదా కమిటీ సిఫారసుల ఆధారంగానే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ కూడా విభజనను వ్యతిరేకించింది. విభజన కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ నుంచి కూడా ఎలాంటి తీర్మానం రాలేదు. అయినప్పటికీ, రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా.. పదేళ్ల పాలన ముగుస్తున్న ఘడియల్లో రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం తొందరపడుతోంది. భాషాప్రాతిపదికన ఏర్పడిన 57 ఏళ్ల చరిత్ర కలిగిన రాష్ట్రాన్ని విభజించడానికి సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని టేబుల్ ఐటమ్‌గా తీసుకుని కేంద్ర కేబినెట్ చర్చించింది. ఇది కేబినెట్ సమిష్టి బాధ్యతను అగౌరవపర్చడమే అవుతుంది.
 
     ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించిన బిల్లులోనూ అత్యంత ముఖ్యమైన అంశాలైన.. లక్ష్యాలు, కారణాలు.. ఆర్థిక మెమొరాండం, విభజన అనంతర పరిణామాలు.. మొదలైనవి లేకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఇది కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనం.
 
     మా పార్టీ అసెంబ్లీ నిబంధన 77, 78 కింద రెండు తీర్మానాలను ప్రతిపాదించింది. అవి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ ఒకటి, బిల్లును వెనక్కి పంపించాలని కోరుతూ మరొకటి. అలాగే, అసెంబ్లీలోనూ బిల్లుకు వ్యతిరేకంగా మా పార్టీ సభ్యులు తమ లిఖితపూర్వక అభిప్రాయాలను తెలిపారు. అలాగే, బిల్లులోని మొత్తం 108 క్లాజులను, 13 షెడ్యూళ్లను తొలగించాలని కోరుతూ సవరణలు ప్రతిపాదించారు. అసెంబ్లీలోని మొత్తం 279 సభ్యుల్లో 157 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ అభిప్రాయాలు తెలిపినట్లు మాకు తెలిసింది.
 
     అలాగే, బిల్లును తిరిగి పంపించడానికి చివరి రోజైన జనవరి 30, 2014 నాడు దాదాపు అందరు సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపినట్లు ప్రకటించారు. అదే రోజు మేము ప్రతిపాదించిన అనధికార తీర్మానాలే కాకుండా.. రాష్ట్ర  సీఎం కిరణ్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిరస్కరిస్తున్నట్లుగా తీర్మానం ఇచ్చారు. అలాగే, ఎలాంటి కారణం, ప్రాతిపదిక లేకుండా, ఏకాభిప్రాయం కుదరకుండానే రాష్ట్రాన్ని విభజిస్తున్నందున ఆ బిల్లును పార్లమెంటుకు పంపవద్దని కూడా రాష్ట్రపతిని కోరుతూ తీర్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానం మూజువాణి ఓటుతో సభ ఆమోదం పొందిందని స్పీకర్ ప్రకటించారు. అందువల్ల పూర్తి మెజారిటీతో అసెంబ్లీ, శాసనమండలి తిరస్కరించిన బిల్లును పార్లమెంటుకు సిఫారసు చేయకూడదని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాము.
 
 అరెరెరె.. 4 గంటలు దీక్ష చేశాడా?
 విభజనను వ్యతిరేకిస్తూ సీఎం కిరణ్ దీక్ష చేశారు, దీన్ని ఎలా చూస్తారు? అని విలేకరులు అడగ్గా అందుకు జగన్ స్పందిస్తూ... ‘‘ఎంతసేపు దీక్ష చేశాడు.. అబ్బ.. నాలుగు గంటల సేపు దీక్ష చేశాడా? చాలా గొప్పోడు కదయ్యా..! అరెరెరె.. నాలుగు గంటలు చేశాడా? చాలా చాలా గొప్ప.. అరెరెరె.. ఎప్పుడైనా నిరాహార దీక్ష 8 రోజులు చేశాడో ఒక్కసారి ఆయనను అడగండి.. కడుపు మాడ్చుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం 8 రోజులు తిండి తినకుండా ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి అడిగి కనుక్కోండి.. నాలుగు గంటలు చేశాడట! ఎన్నికలకు కరెక్టుగా మూడు వారాల్లో షెడ్యూల్ వస్తోంది.
 
  ఎట్లాగూ ఎన్నికలకు పోక తప్పదని చెప్పి.. 4 గంటలసేపు 200 మందితో దీక్ష చేశాడట! దానికో పబ్లిసిటీ.. దానికో బిల్డప్పు..’’ అని అన్నారు. కేసీఆర్ 9 రోజులు దీక్ష చేసిన విషయాన్ని ప్రస్తావించగా.. ‘‘నాకు బీపీ లేదు.. షుగర్ లేదు.. ఎటువంటి రోగాలు లేవు. కేసీఆర్‌కు షుగర్ ఉంది.. చంద్రబాబుకు షుగర్ ఉంది.. కిరణ్ కుమార్‌రెడ్డి దీక్ష చేయలేదు. నేను రాసిస్తా.. 36 గంటలు కూర్చోమని చెప్పండి.. తినకుండా.. తాగకుండా.. ఏమీ చేయకుండా.. షుగర్ పేషెంట్లు ఎలా తట్టుకుంటారో చూడనైనా చూస్తా..!’’ అని అన్నారు.

అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతిస్తాం

అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతిస్తాం: మైసూరారెడ్డి
వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి
 సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాసం ఎవరు పెట్టినా వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత  ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. బుధవారం ఢిల్లీలో పార్లమెంటు వెలుపల వైఎస్సార్ సీపీ నేత బాలశౌరితో కలిసి మైసూరారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘అవిశ్వాసంపై ఒక్క సభ్యుడు నోటీసు ఇచ్చినా సరిపోతుంది. గత పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు.
 
 అధికార పార్టీలోనే అసంతృప్తి ఉందని దేశ, రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేయడానికి మా మద్దతు తెలుపుతూ వరుసగా ఏడు రోజులు వారితో పాటే నోటీసులిచ్చాం. అయితే, అవిశ్వాసాన్ని సభలో ప్రవేశపెట్టడానికి50 మంది సభ్యుల మద్దతు సేకరించడంలో విఫలమయ్యారు. మద్దతు సేకరించకుండా ఇప్పుడు కూడా నోటీసు ఇచ్చినా ప్రయోజనం ఉండదు’’ అని చెప్పారు. టీడీపీ అధినేత జాతీయ పార్టీల నేతలను ఎందుకు కలుస్తున్నారో ఆయనే చెప్పాలని అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణ గురించి, ఆంధ్ర నేతలు ఆంధ్ర గురించి మాట్లాడుతున్నారని, దానికి వారే జవాబు చెప్పాలని అన్నారు.

వైఎస్సార్‌సీపీ ఐటీ కమిటీ నియామకం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర కమిటీలో 20 మంది సభ్యులను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి బుధవారం తెలిపారు.

సవాల దేవదత్ (కృష్ణా), ఆర్. వీరభద్రరావు, పుట్టా శివశంకర్, శివ పోతుల, ముండ్ల చంద్రశేఖర్, నారు ఉమా మహేశ్వరరెడ్డి(వైఎస్సార్), కూరపాటి బ్రహ్మానందరెడ్డి(ప్రకాశం), మహేష్ జీను (తూర్పు గోదావరి), తియ్యగూర చంద్రశేఖర్, ఎం. శ్రీనివాసరెడ్డి (గుంటూరు), కె. రాకేష్ తేజ్‌కుమార్ (నెల్లూరు), సీహెచ్ లావణ్య (విశాఖపట్టణం), బి. గోపీనాథ్, కె. గిరిధర్‌రెడ్డి, ఎం. అబ్దుల్ ఖాదర్ (హైదరాబాద్), బి.శ్రీవర్ధన్ (మహబూబ్‌నగర్), జి. దినేష్, అరవింద్ చప్పిడి, చంద్రమౌళి (చిత్తూరు), కిరణ్‌కుమార్ మాచినేని (కర్నూలు)లను కమిటీలో నియమించినట్లు ఆయన వెల్లడించారు.

TDP false campaign in facebook

Written By news on Wednesday, February 5, 2014 | 2/05/2014


విశ్వసనీయత అంటే ఇదేనా? 

నలందా కాలేజీ విద్యార్థులు అన్నా హజారే కి మద్దతు ఇస్తుంటే, మహిళలు ఉద్యోగం కోసం పోరాడుతున్నట్టుగా..., తెలుగు దేశం పార్టీ ఒక్కటే మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. 
ఆంధ్రా హజారే అని చెప్పుకుంటూ లోక్ పాల్ బిల్లుకు మద్దతుగా పోరాడిన అందరూ తెలుగు దేశం పార్టీ కోసమే పోరాడారు అని కూడా ప్రచారం చేసుకుంటారేమో?

http://www.thehindu.com/news/cities/Vijayawada/students-support-agitation-against-corruption/article2387840.ece

విజయవాడ లో అన్న హజారే కి మద్దతుగా నిలిచిన మహిళల ఫోటో ని తెలుగు దేశం పార్టీ ప్రచారం కోసం ఇలా వాడుకుంది.

https://www.facebook.com/photo.php?fbid=787907114556215&set=a.204264039587195.57871.192136870799912&type=1&stream_ref=10


YS Jagan press meet in Delhi on Feb 5

ఎప్పుడైనా ఎనిమిది రోజులు సీఎం దీక్ష చేశారా?

సమైక్య రాష్ట్రం కోసం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు గంటలు దీక్ష చేశాడా? అంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశాడు.  ఎప్పుడన్నా ఎనిమిది రోజులు అన్నం తినకుండా దీక్ష చేశాడా అనే విషయాన్ని కిరణ్ అడిగి తెలుసుకోండి.  సమైక్య రాష్ట్రం కోసం తాను ఎనిమిది రోజులు కడుపు మాడ్చుకుని దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు ఎలాంటి బీపీ, షుగర్ లేవని.. కేసీఆర్, చంద్రబాబులకు షుగర్ ఉన్నాయి. సీఎం కిరణ్ దీక్ష చేయలేదు. తనతోపాటు 36 గంటలు దీక్ష చేయమని చెప్పండి.. షుగర్ ఉన్న పేషంట్ 36 గంటలు దీక్ష చేస్తే...  అప్పుడు తెలుస్తుంది దీక్షల సంగతి అని వైఎస్ జగన్  అన్నారు. 
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. ఈ భేటికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకలు వైఎస్ జగన్ వెంట ఉన్నారు. 

Popular Posts

Topics :