04 March 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్

Written By ysrcongress on Saturday, March 10, 2012 | 3/10/2012

కోవూరు ఎన్నికల ప్రచారం అనంతరం వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్నారు. సింహపురి ట్రైన్‌లో సికింద్రాబాద్‌ చేరుకున్న ఆయనకు అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. కోవూరులో నాలుగురోజుల పాటు పల్లెపల్లెన జగన్‌ ఎన్నికల ప్రచారం సాగింది. ఆయన పర్యటన విజయవంతం కావడం కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపింది.

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు

* కాంగ్రెస్ నాయకులు, చంద్రబాబు కలిసి కోర్టుల్లో కేసులు వేశారు
* ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కయ్యారు.. ఆర్‌టీఐ పదవులు పంచుకున్నారు
* వీరికి రాజకీయాలు తప్పపజా సమస్యలు పట్టడం లేదు

కోవూరు నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: అధికార కాంగ్రెస్ పెద్దలు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లోపాయకారీ ఒప్పందాలతో ఒక్కటై ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రత్యేక పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పేద ప్రజల గురించి, వారి సమస్యల గురించి ఆలోచించాల్సిన అధికార, ప్రతిపక్షాలు వారిని పట్టించుకోకుండా కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కోవూరు ఉప ఎన్నికల ప్రచారం ఐదోరోజు శుక్రవారం ఆయన విడవలూరు, కోవూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. రోడ్‌షోలో పలుచోట్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌ను ఎండగట్టారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

కలిసి కేసులు వేశారు.. పదవుల్ని పంచుకున్నారు
కాంగ్రెస్ నాయకులు, చంద్రబాబు పరిస్థితి ఎలా తయారైందంటే.. వీళ్లిద్దరూ కలిసి కోర్టుల్లో కేసులు వేస్తున్నారు.. చనిపోయిన వై.ఎస్.రాజశేఖరరెడ్డిని అప్రతిష్టపాలు చేసేం దుకు ప్రయత్నిస్తున్నారు. అసలు రాజకీయ వ్యవస్థ ఎంతగా చెడిపోయిందంటే చనిపోయిన వైఎస్‌కు ఒక న్యాయమట.. బతికి ఉన్న చంద్రబాబుకు మరో న్యాయమట! వీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కవుతారు.. ఆర్టీఐ కమిషనర్ పదవులను పంచుకుంటారు.. ఇంకా ఎంత దూరం వెళతారంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన జీఎన్ నాయుడు అనే వ్యక్తికి హైదరాబాద్ నడిబొడ్డున ఐదెకరాల భూమిని కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కేటాయిస్తారు. వీరిద్దరూ కలిసి చేస్తున్న కుతంత్రాలు చూస్తుంటే బాధేస్తోంది. రాష్ట్రంలో వారి రెండు పార్టీలూ తప్ప మూడో పార్టీయే ఉండకూడదనే విధంగా ఆలోచనలు చేస్తున్నారు.

ప్రజల అనురాగాన్ని కొనాలని చూస్తారు
ఉప ఎన్నికలంటే మంత్రులంతా మోహరిస్తారు. డబ్బు మూటలు తీసుకొచ్చి ఆత్మీయానురాగాలను వేలం పాటలో కొనుగోలు చేసేం దుకు ప్రయత్నిస్తారు. అధికారపక్షాన్ని ఎదుర్కోవాల్సిన భయం ఉంటుంది. అధికార పక్షం చెప్పుచేతల్లో పోలీసులు ఉంటారు. అంతేకాదు అరెస్టు చేస్తారనే భయం ఉంటుంది. కుమ్మక్కయిన అధికార, ప్రతిపక్షాలు రెండింటితోనూ పోరాడాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ భయాలన్నింటినీ పక్కన బెట్టి సాహసోపేతంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీ పదవికీ, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికీ రాజీనామాలు చేశారు. ఈ ఉప ఎన్నికలో పోటీ జరుగుతున్నది విలువలు, విశ్వసనీయతకూ, కుళ్లు, కుతంత్రాల రాజకీయాలకూ మధ్యే.

వైఎస్ ఉంటే బాగుండని..
చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మళ్లీ గౌరవం ఇనుమడింపజేయాల్సిన అవసరం ఉంది. ఫలానా వ్యక్తి తమ నాయకుడని ప్రజలు గర్వంగా చెప్పుకునే స్థాయికి రాజకీయాలు చేరుకోవాలి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విలువలను వెనక్కి తీసుకు రావడానికీ, నిజాయతీని నింపడానికీ, రైతన్నకు, పేద ప్రజలకు అండగా నిలవడానికీ పదవులు వదులుకున్న ఈ ఇద్దరికీ ప్రజలు చల్లని ఆశీస్సులు, చల్లని దీవెనలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్లి పోయాక రాష్ట్రంలో పేదల గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనీ, చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో పదిలంగా ఉండి పోవాలనీ తపనపడే నాయకుడొక్కరంటే ఒక్కరు కనిపించని పరిస్థితి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆ దివంగత నేత బతికి ఉంటే ఎంత బాగుండును అనుకోని రోజు లేదు.

కార్యకర్తల్లో ఉత్సాహం..
కోవూరులో జగన్ ఐదు రోజుల పర్యటన విజయవంతం

ఉప ఎన్నికలు జరుగుతున్న కోవూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తరఫున పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఐదు రోజుల పాటు చేసిన ప్రచారం కార్యకర్తల్లో ఊపు, ఉత్సాహాన్ని నింపింది. ఈ నెల 5న ప్రారంభమైన జగన్ తొలి విడత పర్యటన శుక్రవారంతో ముగిసింది. ఎక్కువ భాగం గ్రామీణ నియోజకవర్గమైన కోవూరులోని పల్లెల్లో జగన్ విసృ్తతంగా పర్యటించారు. రోడ్‌షోలు, అవసరమైన చోట్ల బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. తొలుత 5 నుంచి 7వ తేదీ వరకే ప్రచారం చేయాలని నిర్ణయించినప్పటికీ ప్రజలు అడుగడుగునా అభిమానంతో అడ్డుతగులుతూ తమ ఊర్లకు రావాల్సిందేనని పట్టుబట్టడంతో తీవ్రజాప్యమై షెడ్యూల్లో కొన్ని గ్రామాలకు ఆయన వెళ్లలేకపోయారు.

మిగిలిపోయిన గ్రామాల్లో పర్యటించేందుకు పర్యటనను మరో రెండు రోజుల పాటు అదనంగా పొడిగించారు. జగన్ తొలిరోజు కొడవలూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. అడుగడుగున అభిమానం అడ్డుతగలడంతో చివరలో నాలుగు గ్రామాలు మిగిలిపోయాయి. రెండో రోజు ఇందుకూరు పేట మండలంలో కూడా మరో నాలుగు గ్రామాలకు వెళ్లలేక పోయారు. మూడోరోజు విడవలూరు మండలం పర్యటనలో కూడా కొన్ని గ్రామాలు మిగిలాయి. ఈ మిగిలిపోయిన గ్రామాలన్నింటినీ 8, 9 తేదీల్లో సందర్శించి ప్రచారం నిర్వహించారు.

జగన్ కూడా తన పర్యటనలో చాలా ఓపిగ్గా ఎక్కడ జనం తన కోసం వేచి ఉన్నా ప్రచార రథాన్ని ఆపి కిందకు దిగి వారిని పలకరించారు. జగన్ ఇంకా బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. కాగా శుక్రవారం జరిగిన జగన్ రోడ్‌షోలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, నాయకులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి, డాక్టర్ బాలచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉప ఎన్నికలు జాప్యం జరిగేలా వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై మరో కుట్ర

* ఈ నెల 2న స్పీకర్ అనర్హత వేటు... 5వ తేదీన అసెంబ్లీలో ప్రకటన
* వారం దాటినా ఎన్నికల సంఘానికి అందని ఖాళీల వివరాలు
* స్పీకర్ ప్రకటన వెంటనే ఈసీకి వివరాలు పంపామన్న అసెంబ్లీ కార్యదర్శి
* ఇంతవరకూ తమకు అందలేదని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
* రాష్ట్రపతి ఎన్నికల లోగా ఉప ఎన్నికలు రాకూడదని కాంగ్రెస్ ఎత్తుగడ

హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానిస్తున్న ఎమ్మెల్యేలను మాజీలను చేసిన తర్వాత కూడా వారిపై కుట్రలు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. కోవూరుతో పాటు తెలంగాణలోని ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలతో పాటు వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే స్థానాలకు ఎన్నికలు జరగకుండా వ్యూహం అమలు చేసిన కాంగ్రెస్.. తాజాగా మరో కుట్రను అమలు చేస్తోంది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం ఖాళీ అయిన స్థానాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ద్వారా ఆ సమాచారం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరుతుంది. ఖాళీల సమాచారం అందాకే ఆ స్థానాల్లో ఉప ఎన్నికల విషయమై కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి, నిర్ణయం ప్రకటిస్తుంది. కానీ ఆ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎంత వీలైతే అంత ఆలస్యం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న అధికార కాంగ్రెస్.. ఖాళీల సమాచారం ఈసీకి వెంటనే అందకుండా తెరవెనుక అనేక వ్యూహాలు రచిస్తోంది.

అనర్హత నిర్ణయానికే మూడు నెలలు
రైతులు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా 17 మంది ఎమ్మెల్యేలు పార్టీల విప్‌లను ధిక్కరించి డిసెంబర్ 5వ తేదీన జరిగిన అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. విప్ ధిక్కరించటం వల్ల అనర్హతకు గురవుతామని తెలిసినా వారు రైతులు, రైతు కూలీల పక్కన నిలిచారు. ఇలా విప్ ధిక్కరించిన వారిపై కాంగ్రెస్ శాసనసభా పక్షం స్పీకర్‌కు ఫిర్యాదు చేయటానికి కూడా వారం పాటు కాలయాపన చేసింది. ఉపఎన్నికలను ఎదుర్కోవటానికి భయపడి కాంగ్రెస్ జాప్యం చేయగా.. స్పీకర్ కూడా సత్వరం నిర్ణయం తీసుకోకపోవటం పట్ల విమర్శలు వచ్చాయి. పైగా 17 మంది ఎమ్మెల్యేలు స్వయంగా స్పీకర్‌ను కలిసి అనర్హత వేటు వేయాల్సిందిగా లిఖితపూర్వకంగా లేఖలు అందజేశారు. అయినప్పటికీ అంతా ఊహించినట్టే.. ఒక పథకం ప్రకారమే జరిగింది.

ప్రస్తుతం ఉపఎన్నికలు జరుగుతున్న 7 స్థానాలతో పాటే ఈ 17 స్థానాలకు కలిపి మొత్తం 24 సెగ్మెంట్లలో ప్రతికూల ఫలితాలు తప్పవని ఆయా పార్టీలు చేయించుకున్న సర్వేలు తేల్చటంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 7 స్థానాల ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాకే 17 మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం ప్రకటించారు. అది కూడా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు రోజు రాత్రి అనర్హత నిర్ణయం వెలువడింది. రాజ్యసభ ఎన్నికల్లో అసెంబ్లీలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితి వస్తుందని.. రాత్రికి రాత్రి అనర్హత నిర్ణయం వెలువడేలా చేశారు. మార్చి 2న 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి.. శోభా నాగిరెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటన జారీ చేశారు. మార్చి 5న అసెంబ్లీలో ప్రకటన చేశారు.

ఇదీ సంప్రదాయం..
సాధారణంగా ఒక నియోజకవర్గానికి ఖాళీ ఏర్పడితే శాసనసభ సచివాలయం వెనువెంటనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సమాచారం తెలియజేస్తుంది. భారత రాజ్యాంగం 190 ప్రకరణ మేరకు రాజీనామా ఆమోదించినట్లు కానీ లేదా అనర్హత వేటు వేసినట్లుగా కానీ స్పీకర్ ప్రకటించిన రోజునే ఆ స్థానం ఖాళీగా ఉన్నట్టు. అయితే దానిపై శాసనసభ సచివాలయం సమాచారం ఇవ్వాలని కానీ ఇవ్వకూడదని కానీ రాజ్యాంగంలో స్పష్టత లేదు. అయినప్పటికీ పార్లమెంటరీ సంప్రదాయాల మేరకు అటు లోక్‌సభలోనూ ఇటు అసెంబ్లీలోనూ ఈ రకంగా ఖాళీలు ఏర్పడిన వెంటనే ఎన్నికల సంఘానికి సంబంధిత సమాచారం ఇస్తున్నారు.

తాజాగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదించిన వెంటనే.. ఆ స్థానం ఖాళీ అయినట్లు తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (రాష్ట్ర పరిధిలోని లోక్‌సభ స్థానం అయినందున)కి సమాచారం పంపించారు. అంతెందుకు ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించిన వెంటనే శాసనసభ సచివాలయం ఆ ఖాళీల వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెలియజేసింది.

ఉప ఎన్నికల భయంతోనే..
ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు ఈ 17 స్థానాలకు ఉపఎన్నికలు రాకుండా చేయాలన్న కాంగ్రెస్ ఎత్తుగడ ఇప్పటికే ఫలించింది. అలాగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన కాంగ్రెస్ నాయకత్వం 17 మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం ప్రకటించటంతో ఆ ప్రమాదం నుంచి కూడా బయటపడింది. అయితే రాబోయే రాష్ట్రపతి ఎన్నిక కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. వచ్చే జూలై 24 నాటికి ప్రస్తుత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పదవీ కాలం ముగుస్తోంది. నిబంధన ప్రకారం కాలపరిమితి ముగిసే సమయానికి 60 రోజుల ముందు ఎన్నికల షెడ్యూలు ప్రకటిస్తారు. అంటే మే నెల మూడో వారం లోగా రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూలు విడుదల చేయటానికి వీలుంది.

రాష్ట్రపతి ఎన్నికలో దేశ పౌరులందరి అభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో దేశంలోని ఏ ఒక్క అసెంబ్లీ, లోక్‌సభ, రాజ్యసభ స్థానం ఖాళీ ఉంచకూడదన్న సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే దేశంలో ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూలును ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. పైగా త్వరలోనే రాజ్యసభ ఖాళీలకు కూడా షెడ్యూలు ప్రకటించనున్నారు. ఈ తరుణంలో రాష్ట్రం నుంచి మరో 17 అసెంబ్లీ స్థానాల వివరాలు పంపిస్తే వాటికి ఎక్కడ వెంటనే ఉప ఎన్నికలు నిర్వహిస్తారోనన్న ఆందోళన కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. ఉప ఎన్నికలు జరిగి ప్రతికూల ఫలితాలొస్తే కాంగ్రెస్ సంక్షోభంలో కూరుకుపోవటం ఖాయమన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఆ కారణంగానే ఈ స్థానాలకు ఉపఎన్నికలను గరిష్ట కాలపరిమితి వరకు జరక్కుండా సాగదీయాలని కుట్ర చేస్తున్నారు.

నెల్లూరు లోక్‌సభ స్థానం సమాచారమే అందింది: ఎన్నికల సంఘం
రాష్ట్రంలో ఖాళీ అయిన 17 అసెంబ్లీ నియోజకవర్గాల సమాచారం శుక్రవారం వరకు తమకు అందలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారవర్గాలు ధ్రువీకరించాయి. నెల్లూరు లోక్‌సభ స్థానం ఖాళీ అయినట్లు లోక్‌సభ సచివాలయం నుంచి సమాచారం అందిందని స్పష్టం చేశారు. శాసనసభ కార్యదర్శి డాక్టర్ రాజసదారాంను ఇదే విషయంపై ‘సాక్షి’ ప్రతినిధి ఫోన్‌లో సంప్రదించగా.. శాసనసభ స్పీకర్ నిర్ణయం ప్రకటించిన వెంటనే ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంపామని పేర్కొన్నారు. బహుశా ఎన్నికల సంఘం వద్ద ఇంకా రిజిస్టర్ కాకపోయి ఉండొచ్చని అన్నారు.

నీ పిచ్చి రాతల వల్లే ముప్పు

* జగన్‌ను అరెస్టు చేస్తారని రామోజీకి అంత ఖచ్చితంగా ఎలా తెలుసు?
* తమకు పోలీసు బందోబస్తు కావాలంటూ సీఎంకు రామోజీ లేఖ రాశారు
* అరెస్ట్ చేస్తామని రామోజీకి సీబీఐ చెప్పిందా? సీబీఐకి రామోజీ చెప్పారా?.. జగన్‌ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆధారాలున్నాయా?
* రెండున్నరేళ్లుగా జగన్‌పై విషం చిమ్ముతున్నా.. ఒక్క ఘటన జరిగిందా?
* వైఎస్‌పై ఎన్ని అసత్య కథనాలు రాశారు.. ఏనాడైనా వైఎస్ రాళ్లు వేయించారా?.. రామోజీకి మా వల్ల కాదు.. ప్రజల వల్లే ప్రమాదం
* మా కార్యకర్తలను కుక్కలు, పందులతో పోల్చి చిత్రీకరిస్తారా?

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతిస్తున్న ‘ఈనాడు’ సంస్థల అధినేత రామోజీరావు మరో విషప్రచారానికి తెరదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేస్తారని, దానివల్ల తన సంస్థలపై దాడులు జరిగే అవకాశముందని పేర్కొంటూ.. పోలీసు బందోబస్తు కోసం పోలీసు శాఖకు, ముఖ్యమంత్రికి రామోజీ లేఖలు రాశారు. జగన్‌ను అరెస్టు చేస్తారని రామోజీకి అంత పక్కాగా ఎలా తెలుసు? సీబీఐ రామోజీకి చెప్పిందా? ఈయనే సీబీఐకి సూచించారా? లేక కాంగ్రెస్ నేతలేమైనా చెప్పారా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిలదీశారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొన్ని ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్తలను ఉటంకించారు. ‘‘రాష్ట్రంలో ఏదైనా జరిగితే ఎక్కడ ఎవరికి బందోబస్తు ఇవ్వాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అలాంట ప్పుడు రామోజీరావు ముందుగానే ఎందుకంత ఉలిక్కిపడుతున్నారు?’’ అని నిలదీశారు. ‘‘అయినా జగన్‌ను సీబీఐ ఎందుకు అరెస్టు చేస్తుంది? సీబీఐ వద్ద ఏ విధమైన ఆధారాలున్నాయి? ఏమీ లేనప్పుడు అరెస్టు ఎందుకు చేస్తారు?’’ అని ప్రశ్నించారు.

తండ్రిని అంతమొందించి.. కొడుకును జైలుకు పంపుతారా?
‘‘రాష్ట్రాన్ని ఐదేళ్ల మూడు నెలలు విజయవంతంగా పాలించిన మహానేత వై.ఎస్‌ను అందరూ కలిసి రాజకీయ కుట్ర చేసి అంతమొందించారు. ఆయన కుమారుడు జగన్‌పై దొంగ అనే ముద్రవేసి జైలుపాలు చేసి రాష్ట్రాన్ని దోచుకోవాలని కాంగ్రెస్ - చంద్రబాబు - రామోజీ కుట్ర చేస్తున్నారు’’ అని అంబటి ఆరోపించారు. ‘‘అసెంబ్లీలో సీపీఐ సభ్యుడు ప్రస్తావించిన విషయాన్ని మేం చాలా కాలంగా చెప్తున్నాం. వైఎస్ మరణం ప్రమాదం కాదు.. నూటికి నూరు పాళ్లు రాజకీయ కుట్ర అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే వైఎస్ మరణం తర్వాత ఆయన కొడుకును అణచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని చూస్తున్న ప్రజలకు అర్థమవుతుంది. దేశంలో ఎంతో మందిపై సీబీఐ విచారణ జరగుతోంది. ఎవరిపై లేనంతగా జగన్ విష యంలో సీబీఐ ఎందుకంత దూకుడుగా వ్యవహరిస్తుంది?’’ అని ప్రశ్నించారు.

జగన్‌పై కుట్ర జరుగుతుందనటానికి అనేక ఆధారాలున్నాయన్నారు. ‘‘వైఎస్ కాలం నాటి 26 జీవోలపై హైకోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎందుకు సమాధానం ఇవ్వలేదు? జీవోలు విడుదల చేసిన సచివాలయ సిబ్బందికి, మంత్రులకు ఎలాంటి సంబంధం లేదట! కేవలం సీఎంగా వైఎస్‌కు, ఎక్కడో బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్న జగన్‌కు సంబంధం ఉందట! జగన్ ఏనాడైనా సచివాలయానికి వెళ్లారా? ఏ అధికారికైనా ఫోన్లు చేసి ఫలాన పనిచేయని చెప్పారా? వీటితో ఎలాంటి సంబంధంలేని జగన్‌ను ఎందుకు వేధిస్తున్నారు? వైఎస్ కడుపున పుట్టటమే జగన్ చేసిన పాపమా?’’ అని నిలదీశారు. జగన్‌పై కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న వారికి, వీటన్నింటినీ గమనిస్తున్న ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

నీ పిచ్చిరాతలే నీకు ప్రమాదం!
‘‘దివంగత వైఎస్ హయాంలో ఆయనకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు పత్రిక ద్వారా ఎన్ని అసత్య కథనాలు రాశావో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. విజయవంతంగా పాలిస్తున్న వైఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎన్ని టక్కుటమార విద్యలు చేశావో పాఠకులు గమనించారు. అయినా ఏనాడైనా వైఎస్ నీపై రాళ్లు వేయించారా? ఒక్క మట్టిపెళ్ల నీపై పడిందా? కనీసం ఒక్క మాటైనా అన్నారా? లేదే..! ‘ఆ రెండు పత్రికలు అబద్ధాలు రాస్తున్నాయి’ అని మాత్రమే అన్నారు. అలాంటి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్‌పై ఎందుకు అభాండాలేస్తున్నారు? రెండున్నరేళ్లుగా జగన్‌పై అనునిత్యం విషం చిమ్ముతున్నారు మీరు.. ఏనాడైనా ఒక్క సంఘటనైనా జరిగిందా? లేదే’’ అని రామోజీపై అంబటి ధ్వజమెత్తారు.

‘‘రామోజీకి మా వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ రామోజీకి ఆయన రాసే పిచ్చిరాతలు, కూతల వల్ల ప్రజల నుంచి ప్రమాదం ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ‘‘రామోజీకి ప్రజలంటే ఎంత చులకన భావనంటే.. జగన్‌ను అరెస్టు చేస్తారంటూ వదంతులు విని వేలాది మంది కార్యకర్తలు వెళ్తే.. చేతిలో పేపరుందని వారిని కుక్కలు, పందులతో పోల్చి చిత్రీకరిస్తావా? నీ పాపం పండిన రోజున ఆ ప్రజలే తగిన బుద్ధి చెప్తారు’’ అని హెచ్చరించారు. చంద్రబాబు-రామోజీ ఇద్దరూ కలిసి తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న విధానాన్ని ప్రజలు గమనించినందు వల్లే.. బాబును రెండు సార్లు ఛీకొట్టారని మండిపడ్డారు. పేదల పొట్టకొట్టి స్టూడియోలు నిర్మించుకున్న రామోజీ పాపం పండిన రోజు ఆ భగవంతుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు.

జగన్‌ను అరెస్టు చేస్తారంటూ ప్రజల్లో భయాందోళన రేకెత్తించి కోవూరు ఉప ఎన్నికల్లో టీడీపీకి లబ్ధిచేకూర్చేందుకు రామోజీ మరో కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కడప లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల సందర్భంగా కూడా రామోజీ ఇలాంటి విషప్రచారాలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూశారని.. అక్కడ తన పాచిక పారకపోయే సరికి ప్రస్తుతం అదే కోవలో మరో కుట్రకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్యాయం జరుగుతుంటే గొంతు ఎత్తాల్సిన పత్రికలే వ్యక్తిగత కక్షలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రవర్తించటం దురదృష్టకరమన్నారు.

కాంగ్రెస్, టీడీపీ చేతులెత్తేశాయి...
రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ముందుగానే చేతులెత్తేశారని అంబటి ఎద్దేవా చేశారు. ‘‘బొత్స మాట్లాడుతూ... ఏడు ఉప ఎన్నికల్లో టీడీపీకి మూడో స్థానమే అంటారు. చంద్రబాబు కూడా అదే విధంగా కాంగ్రెస్‌కు మూడో స్థానమే అంటున్నారు. అంటే ఈ రెండు పార్టీలు ఎన్నికలకు ముందుగానే చేతులెత్తేశాయని తేటతెల్లమవుతోంది’’ అని వ్యాఖ్యానించారు. జగన్‌పై చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని.. ఎవరు నీతిమంతులనే దానిపై ఈ నెల 21న కోవూరు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని ఆయన పేర్కొన్నారు. కోవూరు ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. ఫలితాల తర్వాత జగన్ చెప్తున్న సువర్ణయుగానికి నాంది పలుకుతుందని చెప్పారు.

ప్రసన్నకు 50వేల మెజార్టీ: జూపూడి

కోవూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి 50 వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించనున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు పేర్కొన్నారు. కోవూరు ఉపఎన్నికల ప్రచారంలో ఉన్న జూపూడి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోవూరులో విస్తృత ప్రచారం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ అమోఘమన్నారు. పార్టీ అధ్యక్షుని ఆదేశానుసారం నాలుగురోజులుగా తనతోపాటు పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాష్‌రావు, మారెప్ప, నిర్మలాకుమారిలు దళిత వర్గాల్లో విస్తృత పర్యటన జరిపి ఓటర్లను చైతన్యపరుస్తున్నట్లు వివరించారు.

రెఫరెండంగా భావించలేని ఆ రెండు పార్టీలు పోటీ నుంచి తప్పుకొని పరువు కాపాడుకోవాలని

Written By ysrcongress on Friday, March 9, 2012 | 3/09/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజల మద్దతుతో ఎదుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు పేర్కొన్నారు. పైరవీల ద్వారా పదవులు పొందినవారికి జగన్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోవూరు ఉప ఎన్నిక దగ్గరపడుతున్నకొద్దీ జంట పక్షులు కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబులు కుట్రలు, కుతంత్రాలతో జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జగన్‌ను అప్రతిష్టపాలు చేసి ఎన్నికల్లో మెజార్టీ తగ్గించాలనే కుటిలనీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రస్తుత ఉప ఎన్నికలను రెఫరెండంగా భావించ డానికి వెనకడుగు వేస్తున్న కిరణ్- చంద్రబాబుల దీనస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. రెఫరెండంగా భావించలేని ఆ రెండు పార్టీలు పోటీ నుంచి తప్పుకొని పరువు కాపాడుకోవాలని సూచించారు. సొంత రాష్ట్రంగా భావించే యూపీలోనే సోనియా, రాహుల్‌లు తెల్లమొహం వేశారని గట్టు ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు రాజకీయంగా కాలం చెల్లిందని, ఆయన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ సైకిల్ గుర్తుతో గెలిచింది.. ఇక్కడా సైకిల్ హవా కొనసాగుతుందని బాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. యూపీలో ములాయం సొంతగా పార్టీ పెట్టుకున్నారని, బాబు మాదిరిగా మామను వెన్నుపోటు పొడిచి పార్టీని, గుర్తును లాక్కోలేదని ఎద్దేవా చేశారు.

యూపీలో ప్రజలు అవినీతిని తరిమికొట్టారని బాబు చెబుతున్నట్టుగా... తెలుగు ప్రజలు ఆ పని 2004లోనే చేశారని, బాబు చేసిన అవినీతికి ఇప్పటికే రెండుసార్లు ఛీకొట్టారని అన్నారు. బాబు ఇంట్లో రెండు గదులు ఎప్పుడూ తెరవర నే ఆరోపణ ఉందని, అవి ఎందుకు తెరవడం లేదో, అందులో ఏముందో చెప్పగలరా? అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. జాతీయస్థాయిలో థర్డ్‌ఫ్రంట్ అంటున్న చంద్రబాబు పరిస్థితి ఉట్టికెగరలేనమ్మ నింగికెగిరినట్లుందని గట్టు ఎద్దేవా చేశారు.

జగన్ పేరు, ఫొటో లేనిదే.. ‘ఈనాడు’ అమ్ముడుపోదా?

జగన్‌పై ప్రతిరోజూ అవాస్తవ కథనాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు
రోజూ జగన్‌ను విమర్శించే బదులు.. ఫలానా పార్టీకి ఓటేయండని నేరుగా చెప్పేయండి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు.. ప్రతిరోజూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నారు. జగన్ పేరుతో ఉన్న బ్యానర్ కథనం లేకుండా ఈనాడు పత్రికను బయటకు తెచ్చే పరిస్థితే లేనట్లుంది. ఏ రోజైనా బ్యానర్ ఐటమ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి పేరు లేదంటే ఇది ‘ఈనాడు’ పత్రిక కాదే మో అనే అనుమానం వచ్చే పరిస్థితి సృష్టిస్తున్నారు. జగన్ పేరుగాని, ఆయన ఫొటోగాని వేసుకోకపోతే మీ పత్రిక అమ్ముడుపోవడం లేదా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి(సీఈసీ) సభ్యురాలు శోభానాగిరెడ్డి.. రామోజీరావును ప్రశ్నిం చారు. గురువారం ఆమె ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ రామోజీరావుపై, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

మీ సంస్థల్లో పెట్టుబడులపై నోరెత్తరేం?: ‘సాక్షి’ పెట్టుబడులపై అసత్య కథనాలు వండివార్చుతున్న రామోజీ తన సంస్థల్లో అక్రమ పెట్టుబడులపై నోరెత్తరేమని శోభానాగిరెడ్డి నిలదీశారు. ‘వంద రూపాయల ముఖ విలువ చేసే ‘ఈనాడు’ షేరును రిలయన్స్ సంస్థ రూ.5 లక్షలకుపైగా వెచ్చించి ఎందుకు కొనుగోలు చేసిందో ప్రజలకు వివరించగలుగుతారా? మీరు ఏది చేసినా న్యాయమైన వ్యాపార మా?.. ఇతరులు ఏం చేసినా అన్యాయమా?’ అని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్న రామోజీకి.. తనపై వచ్చిన ఆరోపణల మీద దర్యాప్తు జరిపించుకునే ధైర్యం ఉందా అని ఆమె నిలదీశారు. ధైర్యం ఉంటే జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవాలని, అంతే తప్ప చేతిలో పత్రిక ఉందని పాఠకులను మభ్యపెట్టే విధంగా వార్తలు రాయడం సరైంది కాదని అన్నారు. ‘జగన్‌పై అనునిత్యం అసత్య వార్తలు ఎందుకు రాస్తున్నారు? మీరేమైనా రాజ కీయ పార్టీ పెట్టుకున్నారా?’ అని రామోజీరావును సూటిగా ప్రశ్నిం చారు. జగన్‌ను విమర్శించే బదులు.. బయటకొచ్చి ఫలానా పార్టీకి ఓటేయండని ప్రజలకు చెబితే మీ పత్రికపై ఓ స్పష్టత వస్తుందన్నారు.

బాబు స్థాయేంటో అర్థమవుతోంది..: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ‘సాక్షి’ పేపరు చదవొద్దని, ‘సాక్షి టీవీ’ చూడొద్దని చెప్పడాన్ని బట్టి ఆయన స్థాయేంటో ప్రజలకు అర్థమవుతోందని శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘ఈరోజు జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యంగా పత్రిక పెట్టుకున్నారు.. పార్టీ పెట్టుకున్నారు. మీరు కూడా ‘ఈనాడు’లో నా పెట్టుబడులు ఇన్ని ఉన్నాయి.. ఈ పత్రిక నాది అని బయటకొచ్చి చెప్పండి’ అని చంద్రబాబుకు సూచించారు.

ఆ రోజులు పోయాయి రామోజీ..: ‘‘మీడియాను అడ్డం పెట్టుకుని ఇన్ని సంవత్సరాలూ రాజకీయంగా చక్రం తిప్పారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి’’ అని శోభానాగిరెడ్డి అన్నారు. మొన్న కడప పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలో ఇష్టమొచ్చినట్లు కథనాలు రాసి ప్రజలను ప్రభావితం చేయాలని రామోజీ ప్రయత్నించారని గుర్తుచేశారు. ‘‘కడప ఉప ఎన్నికల సందర్భంగా రామోజీ ఎన్ని కట్టుకథలు రాశారో తెలుగు ప్రజలకు ఇప్పటికీ గుర్తుంది. ఒక రోజు జగన్ ఓటర్లను డబ్బుతో కొనేశారని రాశారు. ఇంకోసారి జగన్ డబ్బులు తీయకపోవడం వల్ల నాయకుల్లో నిర్లిప్తత, నిరుత్సాహం వచ్చిందన్నారు. చివరకు ఓటర్లను, లీడర్లను ఆఖరికి అధికారులను జగన్ కొనేశారని పిచ్చి రాతలు రాశారు. కడప పార్లమెంటు పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకే పట్టుందని ఇంకోసారి రాశారు. ఎన్నికల తర్వాత ఆ ఆరు నియోజకవర్గాల్లో టీడీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. రామోజీరావుగారు ఇప్పటికైనా వాస్తవానికి దగ్గరగా వార్తలు రాయండి’’ అని శోభానాగిరెడ్డి సూచించారు.

కోవూరు ఫలితాలు చూసైనా మారాలని కోరుకుంటున్నా..

మీరు ఏది రాసినా ప్రజలు నమ్ముతారన్న భ్రమతో వార్తలు రాయొద్దని శోభానాగి రెడ్డి.. రామోజీకి హితవు పలికారు. ‘కోవూరులో చంద్రబాబు ప్రచారానికిగాను రిలయన్స్ కంపెనీ బాగా డబ్బులు పం పిం దని బయట అనుకుం టున్నారు. రాష్ట్ర ఎన్నికలకూ బాబుకు అక్కడి నుంచే డబ్బులు వస్తుం టాయని చెప్పుకొంటున్నారు. దానికేం చెప్తారు మీరు? కోవూరు ఫలితా ల తర్వాతైనా మీ ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని ప్రజలు, మేం కోరుకుంటున్నాం’ అని అన్నారు.

16న హైదరాబాద్‌లో ‘బీసీ మహాగర్జన’

హైదరాబాద్, న్యూస్‌లైన్: బీసీలకు చట్లసభల్లో 55 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఈనెల 16వ తేదీన రాష్ట్ర స్థాయి బీసీ మహా గర్జన నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఉదయం 10 గంటలకు మహా గర్జన ప్రారంభమవుతుందని గురువారమిక్కడ చెప్పారు.

మహిళా బిల్లులో బీసీలకు ఉపకోటా ఇవ్వాలి

మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీలకు సబ్‌కోటా కల్పించకుంటే లక్షలమంది బీసీ మహిళలతో పార్లమెంటును ముట్టడిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ సంక్షేమసంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు.

ప్రధానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ

* పత్తి ఎగుమతులపై నిషేధం.. రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది
* వ్యాపారులు కొనుగోళ్లు నిలిపేశారు.. రైతు ఆదాయానికి గండి పడింది
* వ్యవసాయ నిర్ణయాలు తీసుకునేటపుడు రాష్ట్రాలను సంప్రదించే విధానం తెండి

హైదరాబాద్, న్యూస్‌లైన్: పత్తి ఎగుమతుల మీద విధించిన నిషేధాన్ని తక్షణం తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం లేఖ రాశారు. నిషేధం తొలగించాలని రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చాక కూడా.. ఈ అంశాన్ని మంత్రుల బృందానికి నివేదించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. లేఖ పూర్తి పాఠమిదీ..

గౌరవనీయ ప్రధానమంత్రి,
పత్తి ఎగుమతుల మీద నిషేధం విధించిన నేపథ్యంలో రైతుల నుంచి పత్తి కొనుగోలును వ్యాపారులు నిలిపివేశారు. అత్యధికంగా పత్తి పండిస్తున్న గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రైతుల మీద కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. పత్తి రైతుల ఆదాయ మార్గాలకు గండిపడింది. పత్తి ఎగుమతుల మీద కేంద్ర వాణిజ్య శాఖ విధించిన నిషేధాన్ని సమీక్షించే బాధ్యతను ఆర్థిక మంత్రి నేతృత్వంలోని మంత్రుల బృందానికి మీరు అప్పగించినట్లు మీడియా ద్వారా తెలిసింది.

నిషేధం తొలగించాలని పత్తి రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. తక్షణం నిషేధం ఎత్తేస్తూ నిర్ణయం తీసుకోకుండా ఈ అంశాన్ని మంత్రుల బృందానికి నివేదించాల్సిన అవసరం ఏమిటనే విషయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. పత్తి ఎగుమతుల మీద తక్షణం నిషేధం తొలగించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వ్యవసాయం, రైతుల మీద ప్రభావం చూపించే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ముందు సంబంధిత రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొనే విధానాన్ని అమలు చేస్తే.. తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితులను తప్పించుకోవచ్చు.

మీ..
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి

జగన్‌పై చెయ్యేస్తే ఉప్పెనే

వైఎస్ తనయుడికి అండగా ఉంటామని ప్రతిన
వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : మహిళా సాధికారత, స్వావలంబనకు అహరహం శ్రమించిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటామంటూ స్త్రీలోకం ఎలుగెత్తి చాటింది. ఆయనపై కుట్రలు చేసి, అరెస్టు చేయాలని ప్రయత్నిస్తే మాడి మసైపోతారంటూ హెచ్చరించిం ది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల్లో వేడుకలా చేశారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న స్త్రీలు తమకోసం వైఎస్‌ఆర్ చేపట్టిన పలు పథకాలను గుర్తు చేసుకున్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా నేతలు ప్రస్తావించారు. వితంతు, వృద్ధాప్య పింఛన్లను రూ. 75 నుంచి రూ.200కు, ఆడపిల్ల పుడితే రూ.లక్ష పథకం, 104 పథకం ద్వారా గ్రామాల్లో మహిళలకు సేవలు తదితర ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. ఆ మహానేత ఫొటోను పెట్టుకుని గెలిచిన మంత్రులు అసెంబ్లీలో వైఎస్ విజయమ్మను హేళనగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలని వైఎస్ తపన పడేవారని, స్త్రీల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. పేదల సంక్షేమంతో పాటు మహి ళా సంక్షేమాన్ని కొడిగట్టేలా చేస్తోందని ధ్వజమెత్తారు. మహానేత ఆశయంతో మహిళాభివృద్ధి కోసం తపిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్రలుచేస్తే మహిళలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మహిళలు స్వీట్లు పంచుకుని, హోలీ సందర్భంగా రంగులు జల్లుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

అంతకుముందు వైఎస్. రాజశేఖరరెడ్డి ఫోటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారితో పాటు నేతలు బాజిరెడ్డి గోవర్దన్, గట్టు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ లో వేలాదిమంది మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించారు. తామంతా జగన్‌కు అండగా ఉంటామని,ఎలాంటి కష్టమొచ్చినా పోరాడేందుకు సిద్ధంగా ఉ న్నామని వారంతా నినాదాలు చేశారు. పార్టీనగర కన్వీనర్ జలీల్‌ఖాన్, మహిళా నేతలు తాతినేని పద్మావతి, ఎల్. సునీత తదితరులు పాల్గొన్నారు. అనంతపురంలో పార్టీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిందలు మోపితే మహిళలే తగిన బుద్ధి చెబుతారని కర్నూలు జిల్లా కన్వీనర్ నారాయణమ్మ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ మహిళా సంఘం ఆధ్వర్యం లో స్థానిక ఎస్‌బీఐ సర్కిల్‌లోని వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరగాలంటే జగనన్న పాలన రావాలన్నారు. విశాఖలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా క న్వీనర్ గొల్ల బాబురావు సమక్షంలో సమాజం లో ఉత్తమ సేవలందించిన ఐదుగురు మహిళలను సత్కరించా రు.‘కట్నాలు తీసుకోం. ఆడపిల్లలను బాగాచదివిసామ’ని మహిళలు ప్రతిజ్ఞ చేశారు. స్థానిక సుబ్బలక్ష్మి కల్యాణ మంటపంలో పార్టీ నేత బులుసు జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ సబ్బం హరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రజలే తిప్పి కొడతారు: జ్యోతుల, జక్కంపూడి

రాజమండ్రిలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కం పూడి విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన మహిళా సదస్సుకు అపూర్వ స్పందన లభించింది. వివిధమండలాల నుంచి సుమారు 2000 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల జగన్‌ను అరెస్టు చేస్తారంటూ వస్తున్న వార్తలను నేతలు తీవ్రంగా ఖండించారు. ‘ప్రజలే అటువంటి చర్యలను తిప్పికొడతారు. ఉవ్వెత్తున ఎగసిపడే మహిళా ఆగ్రహ జ్వాలల్లో కుట్రదారులు మాడి మసైపోతారు’ అని హెచ్చరిం చారు. విజయలక్ష్మి మాట్లాడుతూ జగన్‌పై చర్యలకు దిగితే మహిళా లోకం ఉద్యమిస్తుందన్నారు. ఏదో ఓ కుట్ర చేసి జగన్‌ను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని చిత్తూరు జిల్లా మహిళా నేతలు మండిపడ్డారు. తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లి పంచాయతీలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ మార్గాల్లో వైఎస్ కుటుంబాన్ని అణచి వేయాలనుకోవడం అవివేకమన్నారు.

వైఎస్ కుమార్తెపైనా విషం చిమ్మిన రామోజీ

* ‘జగతి’ షేర్లపై కట్టుకథల ప్రచారం
* ‘సాక్షి’ ఆవిర్భావం నుంచీ కక్ష కట్టి విషం చిమ్ముతూనే ఉన్న రామోజీ
* 2009లో వైఎస్ మరణించాక మరింత రెచ్చిపోయిన ఎల్లో బృందం
* వైఎస్ వ్యతిరేకుల్ని కూడగట్టుకుని మరీ ‘ఈనాడు’ రోత కథనాలు
* ఆ దుష్ర్పచారంతో జగతి షేర్లు విక్రయించిన ఒకరిద్దరు ఇన్వెస్టర్లు
* సీబీఐ విచారణకు భయపడి అమ్ముకున్నారని నిస్సిగ్గు రాతలు
* ఇది జరిగింది 2010 ఆగస్టులో... అప్పటికి సీబీఐ ఊసే లేదు
* షేర్లలో హెచ్చుతగ్గులు మామూలేనని తెలిసినా... అబద్ధాల వంటకాలు
* ఒకవైపు అవి డమ్మీ కంపెనీలని రాతలు... వాటికే నష్టమంటూ కథనాలు
* తొలుత షేర్లు కొన్న కంపెనీలను.. షర్మిలకు ముడిపెట్టి విషప్రచారం
* ఉప ఎన్నికల సమయంలో జగన్‌పై రామోజీ రోత రాతలు కొత్త కాదు
* కడప ఎన్నికల్లోనూ ఇదే కుతంత్రం.. ఇప్పుడూ అదే తీరు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిపైన, ఆయన కుటుంబం పైన కక్ష కట్టి.. వారి ప్రతిష్టను దిగజార్చటమే లక్ష్యంగా అబద్ధపు రాతలతో ఆరేళ్లుగా అనుదినం విషం చిమ్ముతున్న ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు మరో నైచ్యానికి దిగజారారు. మహిళాదినోత్సవం రోజున.. మహానేత కుమార్తె అయిన షర్మిలపైనా బురదజల్లేందుకు పడరానిపాట్లు పడ్డారు. షర్మిలకు ఏ మాత్రం సంబంధం లేని వ్యవహారాన్ని ఆమెతో ముడిపెట్టి కట్టుకథలు అల్లుతూ.. ఆమె ఫొటోతో సహా తమ పచ్చ పత్రికలో పతాక శీర్షకల్లో అచ్చేసి.. ఆమెనూ తమ కుటిల కుతంత్రాల్లోకి లాగేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు చెందిన కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు వేరే కంపెనీల్లో కూడా డెరైక్టర్లుగా ఉన్నారని.. ఆ వేరే కంపెనీలు ‘జగతి పబ్లికేషన్స్’ షేర్లను కొని ఐదు రూపాయల లాభానికి కోల్‌కతా కంపెనీలకు విక్రయించేశాయని.. ఆ కోల్‌కతా కంపెనీలు తర్వాత ‘సీబీఐ విచారణకు భయపడి’ 2010 ఆగస్టులోనే నష్టానికి అమ్ముకున్నాయని.. ఇష్టానుసారం రాసిపారేశారు.

అసలు ఏ మాత్రం సంబంధం లేని వ్యవహారంతో షర్మిలకు ముడిపెట్టి.. ‘షేర్మిళ’ అన్న శీర్షిక పెట్టి మరీ కథనం ప్రచురించటం ఒక నీచమైతే.. ఏ కంపెనీలైతే తమ షేర్లను నష్టానికి అమ్ముకున్నాయని రామోజీ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారో.. ఆ కంపెనీలు డమ్మీ కంపెనీలంటూ అదే కథనంలో పొంతనలేని కథలల్లటం మరో నైచ్యం! షర్మిల కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్న వారు.. వేరే కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉండకూడదా..? షేర్లు కొనుక్కున్న కంపెనీలు డబ్బులు అవసరమయ్యో.. మరే అవసరమయ్యో.. లాభానికో, నష్టానికో ఆ షేర్లు మళ్లీ అమ్ముకోవటం ఎక్కడా జరగదా? అలా అమ్ముకోకూడదా? జగన్ విషయంలో 2011 జూలైలో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. దానికి ఏడాది ముందుగా 2010 ఆగస్టులోనే ఆ కంపెనీలు సీబీఐ విచారణ భయపడ్డాయా? అసలు ఆ కంపెనీలే డమ్మీవంటున్నప్పుడు.. డమ్మీ కంపెనీలు షేర్లు అమ్ముకోవాల్సిన అగత్యం ఏమిటి? ఇక లాభ నష్టాల మాట ఎక్కడి నుంచి వస్తుంది? జనం తాను ఏం రాసినా విచక్షణ లేకుండా నమ్మేస్తారన్న బరితెగింపు.. అదే గుడ్డితనంతో.. బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టి ఇష్టమొచ్చినట్లు విషం కక్కటం తప్ప.. ఈ రాతల్లో రామోజీ ఇం గిత జ్ఞానం కాస్తంతైనా ఉపయోగించినట్లు కనిపించటం లేదు!!

‘‘పిటిషనర్ ఆరోపణలు మా కంపెనీ షేరు ధరపై తీవ్ర ప్రభావం చూపించాయి. షేరు ధర పడిపోయింది. అందుకే మమ్మల్ని ఈ కేసులో ప్రతివాదిగా పేర్కొనకపోయినా మేం కోర్టుకు రావాల్సి వచ్చింది’’ - ఇదీ... ఇటీవల చంద్రబాబునాయుడి అక్రమాస్తుల కేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాయరు హరీష్ సాల్వే చేసిన వాదన. ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు ఈ వాదనను తన పత్రికల్లో పతాక శీర్షికల్లో ప్రచురించారు. మరి ఇలాంటి వాదన వేరే వాళ్లకు వర్తించదా? అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కలిసిపోయి మరీ పనిగట్టుకుని ఒక సంస్థపై అదే పనిగా ఆరోపణలు చేస్తుంటే ఆ కంపెనీ ఇన్వెస్టర్లు ఒకరిద్దరిలోనైనా గుబులు రేగదా? ఈ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా తను చెప్పిందే వేదమన్న స్థాయికి చేరి చెలరేగిపోతున్న ఆధిపత్య మీడియా కూడా ఈ నాయకులకు తోడై సదరు సంస్థను టార్గెట్ చేస్తే.. ఆ ఒకరిద్దరు ఇన్వెస్టర్లు ఈ గొడవలన్నీ తమకెందుకులే అనుకోవటం అసహజమా? అలా అనుకుని ఎంతో కొంత నష్టానికి తమ షేర్లు అమ్మేసుకుంటే.. అదంతా అక్రమమని రామోజీ గుండెలు బాదేసుకుంటున్నారెందుకు?

వైఎస్ మరణంతో దాడులు ఉధృతం...
ఈ రాష్ట్రంలో తాను, తన తోకలు తప్ప మరో పత్రికేదీ ఉండకూడదని బీష్మించుకున్న రామోజీ... ‘సాక్షి’ ఆవిర్భవించినప్పటి నుంచీ దాన్ని తుంచేయాలన్న కక్షతో నీచపు రాతలు రాస్తూనే ఉన్నారు. ఎందరు ఎన్ని సమాధానాలిచ్చినా పట్టించుకోకుండా అవే రాతల్ని మళ్లీ మళ్లీ ప్రచురిస్తూ కాలకూట విషం చిమ్ముతూనే ఉన్నారు. వాటన్నిటినీ దీటుగా ఎదుర్కొని.. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రజా న్యాయస్థానంలో సైతం విజయం సాధించారు. దురదృష్టవశాత్తూ ఆయన 2009 సెప్టెంబర్‌లో మరణించారు. ఆయన మరణం తర్వాత రామోజీ తన దాడిని మరింత ఉధృతం చేశారు. దివంగత వైఎస్‌ను, ఆయన కుమారుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని వ్యతిరేకించే శక్తులన్నిటినీ కూడగట్టుకుని మరీ దాడిని పెంచారు.

మరి అలాంటి సమయంలో ఒకరిద్దరు ఇన్వెస్టర్లు భయపడి తమ షేర్లు ఎంతో కొంత నష్టానికైనా అమ్ముకుని బయటపడదామనుకోవటం అసహజమెలా అవుతుంది? లిస్టెడ్ కంపెనీలైతే దాన్లోని ఇన్వెస్టర్లకు తమ షేర్లను ఏ క్షణమైనా విక్రయించుకునే అవకాశం ఉంటుంది. అన్‌లిస్టెడ్ కంపెనీలకు అలా విక్రయించే అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి. అందులోనూ వారు పెట్టుబడులు పెట్టిన కంపెనీలపై విపరీతంగా ఆరోపణలు వస్తున్నపుడు.. వాటిని కొనటానిక్కూడా సహజంగానే ఎవ్వరూ ముందుకు రారు. రామోజీ పేర్కొన్న కోల్‌కతా కంపెనీల విషయంలో కూడా ఇదే జరిగి ఉండొచ్చు. రాష్ట్రంలో ‘సాక్షి’పై జరుగుతున్న ఈ దాడిని చూసి.. అవి భయపడి నష్టానికైనా విక్రయించి వైదొలగుదామని అనుకుని ఉండొచ్చు.

సూట్‌కేసు కంపెనీలంటూ... నష్టంపై రాతలా?
కోల్‌కతా కంపెనీలంటూ... సూట్‌కేసు కంపెనీలంటూ... డమ్మీ కంపెనీలంటూ... జగన్‌మోహన్‌రెడ్డి డబ్బులే అటూ ఇటూ తిరిగాయంటూ... రామోజీ కక్కిన విషం అపారం. షేర్లు కొన్న కంపెనీలు డమ్మీ అని చెప్తున్న రామోజీ.. అదే డమ్మీ కంపెనీలకు నష్టం వచ్చిందంటూ గుండెలు బాదుకోవటమేమిటి? అసలు నకిలీ కంపెనీలు ఎక్కడైనా తమ షేర్లను నష్టానికి విక్రయిస్తాయా? షేర్లు కొన్నవి నిజంగా డమ్మీ కంపెనీలే అయినా నష్టభయం లేకుండా కావాల్సినంత కాలం తమవద్దే అట్టేపెట్టుకుంటాయి కదా? రామోజీ విష ప్రచారాన్ని నమ్మి.. నష్టానికి ఎందుకు విక్రయించేస్తాయి? ఇక్కడ గమనించాల్సిందేమిటంటే అవి సూట్‌కేసు కంపెనీలని ప్రచారం చేసిందీ రామోజీ అండ్‌కోనే.. వాటికి నష్టం వచ్చిందంటూ గగ్గోలు పెడుతున్నదీ ఆ బృందమే. మరి వీళ్ల మాటల్లో... రాతల్లో నిజమెంత? విషమెంత?

అప్పటికి శంకర్రావు పిటిషనే వెయ్యలేదు...
రామోజీ రాసిన కథనం ప్రకారం చూసుకున్నా.. కోల్‌కతా కంపెనీలు తమ షేర్లను నష్టానికి విక్రయించుకున్నది 2010 ఆగస్టులో. అది కూడా.. సీబీఐ విచారణకు భయపడి.. దాన్నుంచి తప్పించుకోవటానికట!! పోటీ పత్రికపై రాసేటపుడు నిజానిజాల్ని కనీసం ఒకసారైనా సరిచూసుకోవాల్సిన అవసరం లేదా? అసలు 2010 ఆగస్టు నాటికి ‘ఈనాడు’, దాని పచ్చతోకలు కలిసి చేస్తున్న ఆరోపణలు తప్ప.. వారితో జట్టుకట్టి శంకర్రావు హైకోర్టుకు లేఖ రాయటం కూడా జరగలేదు. ఆయన లేఖ రాయటం.. దానికి బాబు అండ్ కో తోడవటం అన్నీ మొదలైంది 2010 అక్టోబర్ తరవాత. దానిపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది 2011 జూలైలో. మరి రామోజీ అండ్ కో ఆరోపణలతో ఆందోళన చెందటం తప్ప సీబీఐ విచారణ జరుగుతుందనే భయం అప్పట్లో ఆ కంపెనీలకు ఎందుకుంటుంది? ఈ మాత్రం కనీస జ్ఞానం రామోజీకి లేకపోవటం ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం కాదా?

అసలు షర్మిలకేం సంబంధం?
జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు చెందిన కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు వేరే కంపెనీల్లో కూడా డెరైక్టర్లుగా ఉన్నారని, ఆ కంపెనీలు ‘జగతి పబ్లికేషన్స్’ షేర్లను కొని ఐదు రూపాయల లాభానికి విక్రయించేశాయన్నది ‘ఈనాడు’ కథనం సారాంశం. వాటిని కొనుక్కున్న కోల్‌కతా కంపెనీలు 2010 ఆగ స్టులో వేరొక లిస్టెడ్ కంపెనీకి నష్టాలు విక్రయించాయని, ఇదంతా సీబీఐ విచారణకు భయపడే జరిగిందన్నది రామోజీ రాతల వివరం. అసలు షర్మిలకు చెందిన కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్నవారు వేరే కంపెనీల్లో కూడా డెరైక్టర్లుగా ఉంటే.. ఆ కంపెనీలు ఏవో లావాదేవీలు జరిపితే అదంతా షర్మిలకేం సంబంధం? వాటి కోసం షర్మిల ఫోటో వేసి మరీ.. ‘షేర్మిల’ అంటూ మహిళా దినోత్సవంనాడు ‘ఈనాడు’లో బేనర్ వార్తను వండి వార్చటంలోనే రామోజీ కుట్రంతా బయటపడుతోంది. మరి రామోజీ కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్నవారు వేరే కంపెనీల్లో ఎక్కడా డెరైక్టర్లుగా లేరా? ఆ కంపెనీల లావాదేవీలన్నిటితోనూ రామోజీకి సంబంధం ఉన్నట్టేనా? చంద్రబాబునాయుడికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌లో డెరైక్టర్‌గా ఉన్న ‘డాగా’ ఓ స్మగ్లింగ్ కేసులోనూ ఉన్నట్లు గతంలో అసెంబ్లీ సాక్షిగా తీవ్ర ఆరోపణలొచ్చాయి. మరి చంద్రబాబుకూ ఆ స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్నట్టా? అసలు ఇవేం రాతలు?

షేరు ధరల్లో హెచ్చుతగ్గులుండవా?
నష్టాల్లో ఉన్న రామోజీ కంపెనీలో రూ. 2,600 కోట్లు పెట్టుబడి పెట్టి మరీ ఆదుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌నే తీసుకుంటే.. 2008లో దాని ధర రూ. 1,625. ప్రస్తుతం ఆ కంపెనీ షేరు ధర రూ. 760. అంటే సగానికన్నా తక్కువ. మరి రూ. 1,625 దగ్గర విక్రయించకుండా.. ఇపుడు రూ. 760 దగ్గర విక్రయించిన వారు నష్టపోయినట్లేగా? రామోజీ రాతల ప్రకారం అలా విక్రయించి వారు నష్టపోవటం వెనక ఏదో మతలబు ఉందనుకోవాలా? ఏదో కుంభకోణం ఉందనుకోవాలా? ఇదంతా చిన్న మాయను కమ్మేసే పెనుమాయ అనుకోవాలా?

పోనీ రామోజీకి సియామీ కవల లాంటి చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌నే తీసుకుందాం. 2008లో దాని షేరు ధర రూ. 360. ప్రస్తుతం ఆ షేరు ధర రూ.154. మరి అప్పట్లో విక్రయించకుండా ఇప్పుడు విక్రయించినవారు నష్టపోయినట్లేగా? దాని వెనక ఏ మతలబు ఉంది? ఏ కుంభకోణం దాగుంది? గురువారం రామోజీ తన పత్రికలో వండిన కథనం కూడా ఇంత హేతురహితమైనదే. కనీస జ్ఞానం లేనిదే. లిస్టెడ్ కంపెనీలైతే స్టాక్ మార్కెట్ అనే వేదిక ఉంటుంది కనక ఈ లావాదేవీలు తెలుస్తాయి. అన్‌లిస్టెడ్ కంపెనీల్లో జరిగే లావాదేవీలు ఇతరులకు అనవసరం కనక బయటకు రావు. అన్‌లిస్టెడ్ కంపెనీల్లో ఇన్వెస్టర్లు వేచి చూడటం.. అనుకున్నది జరగకో, డబ్బులు అవసరమయ్యో, ఇతరత్రా కారణాల వల్లో నష్టానికి విక్రయించుకోవటం చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది. కాకపోతే రామోజీరావు ‘సాక్షి’ని, జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేశారు కాబట్టి.. సహజంగా జరిగే పరిణామాల్ని కూడా తనకు నచ్చిన రీతిలో, ఎల్లో మిత్రులు మెచ్చే రీతిలో వక్రీకరించి ప్రచురిస్తూనే ఉంటారు.

ఎన్నికలప్పుడు విష ప్రచారం మామూలే...
ఎన్నికలప్పుడు తాను టార్గెట్ చేసిన వ్యక్తి ప్రతిష్టను దిగజార్చటానినికి శర్వశక్తులూ కేంద్రీకరించి మరీ నీచపురాతలు రాయటం రామోజీకి కొత్తేమీ కాదు. కడప లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికలప్పుడు చేసిందీ అదే. ఇపుడు ఉప ఎన్నికల సందర్భంగా చేస్తున్నదీ అదే. కాకపోతే కడప ఎన్నికల్లో రామోజీ తప్పుడు రాతలకు బుర్ర అదిరే సమాధానమిచ్చారు అక్కడి ఓటర్లు. ఇపుడు కోవూరు, ఇతర నియోజకవర్గాల్లోనూ అదే చేయబోతున్నారు. అది తెలుసు కాబట్టే రామోజీ తన విషానికి మరింత పదును పెడుతున్నారు. ఎంత చేసినా చరిత్ర పునరావృత్తమవుతుందన్నదే ఆయన వందిమాగధుల భయం.

రిలయన్స్’ బంధంపై రామోజీ నోరు మెదపరేం?
‘సాక్షి’పై, తనపై వచ్చే ప్రతి ఆరోపణకూ పత్రికా ముఖంగానో, నేరుగానో ఆది నుంచీ సమాధానమిస్తూనే వస్తున్నారు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి. దీన్లో భాగంగానే ‘ఈనాడు’ రాతల్లోని రోతను ఎత్తిచూపుతూ ‘సాక్షి’ పలు కథనాల్ని ప్రచురించింది. మరి రామోజీనో..? మొదట్నుంచీ మడుగులో దాక్కున్న ధుర్యోధనుడి వ్యవహారమే. నష్టాల్లో ఉన్న రామోజీ కంపెనీల్లోకి మాయ కంపెనీల ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 2,600 కోట్లు పెట్టుబడి పెట్టిందని సాక్ష్యాలతో సహా ‘సాక్షి’ ప్రచురించే దాకా ఆ విషయం బయటి ప్రపంచానికి తెలియనే తెలియదు. ‘సాక్షి’ ప్రచురించాక కూడా రామోజీ నోరెత్తిన పాపాన పోలేదు.

చివరికి ఆ విషయం కోర్టు దాకా వచ్చి.. రిలయన్స్ ఉల్లంఘనలన్నీ బయటపడేసరికి.. దానికి తృణమో పణమో ఇచ్చి బయటకు పంపే ప్రయత్నం చేశారు. రూ. 2,600 కోట్లు పెట్టిన కంపెనీ.. పనికిమాలిన ఈటీవీ చానళ్లు తీసుకుని ఎందుకు చెల్లు చేసింది? స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీ ఎక్స్ఛేంజీలకు సైతం చెప్పకుండా రామోజీ కంపెనీల్లో అంత గోప్యంగా ఎందుకు పెట్టుబడులు పెట్టింది? రామోజీకి - అంబానీకి మధ్య ఉన్న బంధమేంటి? మధ్యలో బాబు పోషించిన పాత్రేంటి? దీనిపై రామోజీ ఇప్పుడు కాదుకదా... ఎప్పటికీ నోరెత్తరు. ఎందుకంటే ఆయన పాపాల పుట్ట పగులుతుందని భయం. బాబుతో కలిసి చేసిన దందా బయటపడుతుందని భయం.

పరువు భయం లేకే... బరితెగింపు..!
రామోజీ ఇంత నిస్సిగ్గుగా ఎందుకు బరితెగించి వార్తలు రాస్తున్నారు? ఇలాంటి వార్తలు రాసిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం లేదా? అనే సందేహాలు చాలా మందిలో సహజం. నిజానికి ఒక వ్యక్తి తన ప్రతిష్టకు భంగం కలిగినపుడు కోర్టులో నేరపూరిత పరువునష్టం దావా వేసే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడో చిక్కుంది. ఇలాంటి కేసుల్లో ఫలితం వెలువడటానికి ఏళ్లూ ఊళ్లూ పడుతోంది. పెపైచ్చు కేసు దాఖలు చేసిన వ్యక్తి ప్రతి వాయిదాకూ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. ప్రతివాది మాత్రం తన తరఫున ఎవరిని పంపినా సరిపోతుంది. ఒకవేళ కేసు దాఖలు చేసిన వ్యక్తి కనుక కొన్ని వాయిదాలకు వరసగా హాజరుకాకుంటే తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. పెపైచ్చు ప్రతివాది కనుక రామోజీ మాదిరి కాసులకు లోటులేని వ్యక్తి అయితే.. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా లాయర్లను పెట్టి దశాబ్దాల పాటు సాగదీసే అవకాశం ఎటూ ఉంటుంది.

ఇలాంటి లొసుగుల్ని జాగ్రత్తగా కనిపెట్టి సొమ్ము చేసుకునే రామోజీ.. తనకు గిట్టనివారిపై బరితెగించి రాతలు రాయటానికి కారణమిదే. ఈ రాష్ట్రంలో రామోజీ మాదిరి కొందరు మీడియా ఉగ్రవాదులు చెలరేగిపోవటానికీ కారణమిదే. ఎన్‌డీఏ హయాంలో రాజకీయంగా కీలక పరిణామాలు జరుగుతున్న తరుణంలో కూడా ఎన్‌డీఏ పెద్దల్ని తన ఫిల్మ్ సిటీకి రప్పించుకుని, చంద్రబాబు తరఫున మంతనాలు జరిపిన ఘనత రామోజీది. అందుకే ఈ దేశంలో తాను పన్ను కట్టకున్నా, తాను భూముల్ని దిగమింగినా, లిస్టెడ్ కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించినా, ఏ రకమైన దందా సాగించినా తననెవ్వరూ ఏమీ చేయలేరన్నది రామోజీ అండ్ కో ధీమా. కాకపోతే వీటన్నిటికీ చెక్ పడేది ప్రజా క్షేత్రంలోనే. వైఎస్సార్ హయాంలో రెండుసార్లు రుజువైన ఈ సత్యం... రామోజీ అక్రమాలు సాగినన్నాళ్లు మళ్లీ మళ్లీ బయటపడుతూనే ఉంటుంది.

వైఎస్ పథకాలు నిర్వీర్యం

* ఇప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోతే.. విద్యార్థుల గతేంకావాలి?
* ఇప్పటికిప్పుడు వేలకు వేలు తేవాలంటే తల్లిదండ్రులేమైపోవాలి?
* ఆరోగ్యశ్రీ, 108, 104 అస్తవ్యస్తం
* రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడుతున్నారు

కోవూరు నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు చేరాలని వైఎస్ ఆలోచన చేస్తే.. ఆ పథకాలన్నింటినీ ఎలా నిర్వీర్యం చేస్తే.. ప్రజల మది నుంచి మహానేతను పూర్తిగా తొలగించగలమన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. కోవూరు ఉప ఎన్నికల ప్రచారం నాలుగోరోజు గురువారం ఆయన ఇందుకూరుపేట, కొడవలూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. అడుగడుగునా స్వాగతం పలికిన అభిమానులకు అభివాదం చేస్తూ,కరచాలనం చేస్తూ రోడ్‌షో నిర్వహించారు. పలుచోట్ల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

విద్యార్థులను ఇబ్బందుల్లో పడేస్తున్నారు
పేదల పిల్లలు సైతం ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులు చదువుకోవాలని దివంగత నేత భావించారు. అందుకే ఉన్నత చదువుల కోసం అయ్యే ఫీజును ప్రభుత్వమే భరించేలాఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం కళాశాలల యాజమాన్యాలకు బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందుల్లో పడేస్తోంది. పరీక్షల సమయానికి రూ.30 వేలో, రూ.70 వేలో కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వబోమని యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికిప్పుడు తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి తేగలరన్న స్పృహ ప్రభుత్వానికి లేక పోయింది.

ఆరోగ్యశ్రీ అస్తవ్యస్తమైపోయింది..
గతంలో నిరుపేదలకు గుండె, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులు వస్తే మెరుగైన చికిత్స చేయించుకోలేక ఇబ్బందులు పడేవారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ అలాంటి వారిని ఆదుకునేది. అనేక మంది అపరేషన్లు చేయించుకుని ప్రాణాలను నిలుపుకోవడానికి దోహదపడింది. లక్షలు ఖర్చుపెట్టి ఆరోగ్యంగా చిరునవ్వుతో ఇంటికి సాగనంపేందుకు దివంగత నేత ఈ పథకాన్ని ప్రవేశ పెట్టా రు. అలాంటి పథకం నేడు అస్తవ్యస్తమైపోయింది. ప్రమాదం సంభవించినపుడు అత్యవసరమైన చికిత్స కోసం 108కు ఫోన్ చేస్తే కుయ్.. కుయ్..అంటూ 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేది. ప్రస్తుతం ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందో.. రాదో తెలియదు. ఫోన్ చేస్తే.. ఈ రోజు మా అంబులెన్స్ రిపేరులో ఉందని, డీజిల్ లేదని సమాధానం వస్తోంది. 104 పథకం పరిస్థితి దారుణంగా ఉంది. 104 సిబ్బందికి ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియని పరిస్థితి.

రచ్చబండలో భిక్షం వేస్తున్నారు
మహానేత రాజశేఖరరెడ్డికి ఒక స్వప్నం వచ్చింది. దానికి రచ్చబండ అని పేరు పెట్టారు. ఈ రచ్చబండ ద్వారా గ్రామాల్లోకి రావాలని ఆ గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయో తెలుసుకోవాలని భావించారు. గ్రామానికి వెళ్ళిన తరువాత అక్కడ రచ్చబండపై నిలబడి.. ఇక్కడ అర్హులై ఉండీ.. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, ఇళ్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ అందనివారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఒక్క చేయి కూడా పైకి లేవకూడదనేది దివంగత నేత స్వప్నం. అంతలా కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు చేరాలన్నది ఆ నేత ఆలోచన.

ఈ రోజు ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమంలో గ్రామాలకు వెళ్లే ధైర్యం చేయడం లేదు. కష్టసుఖాలు వినడానికి మనస్సూ రాదు. మండల కేంద్రాల్లో మీటింగులు పెట్టి భిక్షం వేసినట్లుగా పెన్షన్లు, ఇళ్లు పంపిణీ చేస్తున్నారు. అది కూడా అధికార పార్టీకి చెందిన వారైతేనే ఇస్తున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ప్రతిపక్షమైనా తమ తరఫున పోరాటం చేస్తుందని ప్రజలు ఆశగాచూస్తే రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబు అధికార పక్షంతో కుమ్మక్కైపోయారు.

రైతుల గోడు పట్టడం లేదు
ఇప్పుడు రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడుతున్నారు. వ్యవసాయం చేయకపోతే పరువు పోతుందేమోనన్న ఆందోళనతో అప్పులు చేసి పంట వేస్తుంటే.. ఈ ప్రభుత్వ నిర్వాకంతో రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. పరువు పోతుందని మొహమాటానికి పోతే ప్రాణాలే ఆగిపోయే పరిస్థితులు తలెత్తాయి. వరి రైతు పంట కోసేటపుడు రూ.700కు తగ్గిపోతున్న ధాన్యం ధర.. మిల్లర్ల చేతికి వెళ్లిన తరువాత రూ.900 పలుకుతోంది.

జగన్‌ను ఆపే శక్తి ఎవరికీ లేదు: జీవన్‌రెడ్డి

సీమాంధ్ర ప్రాంతంలో జరిగే ఉపఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రభంజనాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలపై రాజ్యసభ ఎన్నికల ప్రకటనకు ముందే అనర్హత వేటు వేశారని చెప్పారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి ప్రకటిస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలుంటాయన్నారు. 2006, 2008లలో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యం తగ్గి, కాంగ్రెస్ బలం పెరిగిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరమన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమిపాలవుతామని సీఎం ముందే అంచనాకు వచ్చినట్లు ఆయన మాటల్లోనే వెల్లడవుతోందని చెప్పారు.

పరకాలలో విజయం మాదే: సురేఖ

కడప ఎన్నికల్లో వైఎస్సా ర్ పార్టీ ఎంతమెజారిటీ సాధించిందో ప్రజలకు తెలుసునని.. రేపు కొవ్వూరులో...తర్వాత వచ్చే పరకాల ఉప ఎన్నికల్లోనూ అదే మెజారిటీ పునరావృత మవుతుందని మాజీ మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలకు తామెన్నడూ భయపడలేదని, పరకాల ప్రజలు తనను ఆదరించి గెలిపించేందుకు ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. తమకు సుశిక్షుతులైన సైనికుల్లాంటి కార్యకర్తలున్నార ని,వారే కొండంత అండగా నిలబడతారని తెలి పారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన గీసుకొండ మండలంలోని కొమ్మాల జాతర వేడుకగా.. మాజీమంత్రి కొండా సురేఖ ప్రచారశంఖం పూరించారు. పరకాల ఉపఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే దుష్ర్పచారం జరుగుతోందని.. ఆయన కాంగ్రెస్‌లో చేరాల్సిన అవసరం రానే రాదని.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌పార్టీనే వైఎస్‌ఆర్ పార్టీలో వీలనమయ్యే పరిస్థితి వస్తుందని సురేఖ జోస్యం చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో జరి గిన ఎన్నికల ఫలితాలు దేశంలో కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితిలో ఉందో.. ఎంత పతనమైం దో తేల్చి చెప్పాయని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ భావి ప్రధాని, సోనియా త్యాగశీలి అని ఊదరగొట్టిన ఆ పార్టీ నేతలు... వారి సొంత స్థానాలైన రాయ్‌బరేలీ, అమేథీలో ఎందుకు ఓడిపోయారో ప్రశ్నించుకోవాలన్నారు. రాష్ట్రం లో జగన్ చరిష్మా ముందు రాహుల్ చరిష్మా నిలబడదని తేల్చిచెప్పారు. గతంలో ఓదార్పుయాత్ర సందర్భంగానే కాంగ్రెస్ దుష్ట రాజకీయాలు చేస్తోందని, పూర్తిగా పతనమవుతోం దని తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

వైఎస్‌ఆర్‌పై ఉన్న అభిమానంతోనే మంత్రి పదవికి రాజీనామా చేశానని, ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి శాసనసభ్యత్వాన్ని వదులుకున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయాలు నీచస్థితికి చేరుకున్నాయని, అధికార దాహంతో వరంగల్ జిల్లాకు చెందిన మంత్రు లు సీఎం కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘మేం ప్రజల మనుషులం... రేపు కూడా ప్రజల్లోనే ఉంటాం. కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చివరి శ్వాసవరకు కార్యకర్తలను కాపాడుకుంటాం.. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం...’ అని సురేఖ స్పష్టం చేశారు.

యుపి ఫలితాలు వైయస్ జగన్‌కు బూస్ట్

Written By news on Thursday, March 8, 2012 | 3/08/2012

www.oneindia.in   Article:


సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చరిష్మా పని చేయలేదని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా ఓ అవగాహనకు రావచ్చు. కాంగ్రెసు పార్టీతో ప్రజలు విసిగిపోయారనేది అర్థమవుతోంది. అన్నా హజారే కావచ్చు, వైయస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కాంగ్రెసు వేధింపు రాజకీయాలకు పాల్పడుతోందనేది తెలిసిపోతోంది. కాంగ్రెసు అత్యంత బలహీనమైన స్థితికి చేరుకుంది. ఇప్పటికిప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే లోకసభలో కాంగ్రెసుకు వంద సీట్లు కూడా వచ్చే స్థితి లేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసు స్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. బీహార్ ఓటమి తర్వాత యుపి కాంగ్రెసుకు గుణపాఠం. దేశవ్యాప్తంగా కాంగ్రెసు పునాదులు కోల్పోతోంది. ప్రధాన రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెసు గెలిచే స్థితి లేదు. 


వైయస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసును రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన తర్వాత ఇప్పుడు దయనీయమైన స్థితిని ఎదుర్కుంటోంది. అమేథీ, రాయబరేలీల్లోని పది సీట్లలో ఎనిమిది సీట్లలో ఓడిపోవడం కాంగ్రెసుకు ఎదురులేని దెబ్బ. ఇది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌‌లో విశ్వాసాన్ని పెంచుతుంది. జగన్‌కు, వైయస్సార్ కాంగ్రెసుకు, ఆ పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చే అంశం. అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ చేసిన పనే వైయస్ జగన్, వైయస్సార్ ఎందుకు చేయరనేది ప్రశ్న. యుపిలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు బలహీనంగా ఉంది. యుపిలో మాయావతి బిఎస్పీ కన్నా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. యుపిలో సైకిల్ దూసుకుపోవచ్చు గానీ ఇక్కడ దానికి అంత సీన్ లేదు. 


ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ వల్లనే కాంగ్రెసు రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని, సోనియా గాంధీకి గానీ రాహుల్ గాంధీకి గానీ కాంగ్రెసు పార్టీకి గానీ ఏ సంబంధమూ లేదని ప్రస్తుత ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. వైయస్సార్ చరిష్మాతో వాళ్లు లాభపడి కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. కాంగ్రెసు పార్టీ వైయస్సార్ సేవలను గుర్తించడానికి బదులు విహెచ్, కెకె వంటి నాయకులతో వైయస్సార్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై బురద చల్లిస్తోంది. 


ప్రస్తుత పరిస్థితిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. 2014కు ముందే ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ములాయం గానీ మమతా బెనర్జీ గానీ ప్రధాని అయి సమర్థమైన పాలనను అందించడానికి వీలుంది. మాయావతి కూడా ఈ కూటమిలో భాగస్వామి అయితే ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా మూడో కూటమి స్వీప్ చేస్తుంది. కాంగ్రెసు, బిజెపిలతో విసిగిపోయినందున మూడో కూటమి ప్రత్యామ్నాయంగా ప్రజల విశ్వాసం పొందుతుంది. జాతీయ రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న మమతా బెనర్జీ, ములాయం సింగ్ ఆ పని సులభంగా చేయగలరు. ఈ ప్రయత్నాలు మూడో కూటమి ద్వారా పాత సోషలిస్టులు ఏకం కావడానికి పనికి వస్తుంది. 


కమ్యూనిస్టు, మార్క్సిస్టు పార్టీలతో కలిసి మూలాయం (యుపి - 80), జయలలిత (తమిళనాడు - 39), జగన్ (ఎపి - 42), నవీన్ (ఒరిస్సా - 21), నితీష్ (బీహార్ - 40) మూడో కూటమి భాగస్వాములు అవుతారు. ఎన్నికలకు ముందు మూడో కూటమి ఉమ్మడి ఎజెండాను, ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలి. దానికి తర్వాత కట్టుబడి పనిచేయాలి. దేశంలో మూడో కూటమి ఏర్పాటుకు ఇది సరైన సమయం. 


- గురువారెడ్డి, అట్లాంటా

'పల్లం' బాధితులకు వైఎస్సార్ పార్టీ వితరణ

 పల్లం అగ్ని ప్రమాద బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సమకూర్చిన ఆర్థిక సాయం, కిట్లను రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే పిల్లి సుభాష్‌చంద్రబోస్ పంపిణీ చేశారు. 682 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు నగదు, టంకుపెట్టె, చీర, పంచె, దుప్పటి, 5 కేజీల బియ్యం తదితర వస్తువులతో కూడిన కిట్లను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్‌పార్టీ కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, గుత్తుల సాయి, పెండెం దొరబాబు, జక్కంపూడి విజయలక్ష్మి, కర్రి పాపారాయుడు, పీకే రావు, మోకా ఆనందసాగర్, మిండగుదిటి మోహన్, విత్తనాల వెంకటరమణ, వెంట్రు సుధీర్, పెమ్మాడి ప్రసాద్, పాలెపు ధర్మారావు, మట్ట శైలజా, వేగుళ్ల నీరజారాణి, సంసాని గంగాధరం, కె.నరేంద్ర రెడ్డి, కేవీ, తదితరులు పాల్గొన్నారు.

'కడప మోజార్టీ కోవూరులోనూ పునరావృతం'

సోనియా నాయకత్వం హిట్లర్ పరిపాలనను తలపిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు
భూమా నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు వ్యాఖ్యానించారు. సొంత రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ గల్లంతైన ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని వారు విమర్శించారు. కోవూరులో టీడీపీ,కాంగ్రెస్ లు కుమ్మక్కు అయ్యాయని, అయినప్పటికి కడప మెజార్టీలే కోవూరులో కూడా పునరావృతం అవుతుందని నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

జగన్ బ్యానర్ ఐటమ్ లేకుంటే ఈనాడు పేపర్ సేల్ కాదన్నట్టుగా

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామోజీ బహిర్గతంగా వచ్చి ఒక పార్టీకి ఓటేయమని అని చెప్పాలి. లేదా ఒక పార్టీ పెట్టుకోవాలి కాని జగన్ గురించి అసత్య ప్రచారాలు చేయొద్దని ఆమె హెచ్చరించింది. జగన్ బ్యానర్ ఐటమ్ లేకుంటే ఈనాడు పేపర్ సేల్ కాదన్నట్టుగా జగన్ గురించి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని శోభానాగిరెడ్డి మండిపడ్డారు.

రామోజి వంద రూపాయల షేర్లను 5వేలకు అమ్మినప్పుడు లేనిది జగన్ షేర్ల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు సాక్షి పేపర్ ,టివీ చూడొద్దని ప్రకటనలు చేస్తున్నారన్నారు. కోవూరు ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతైనా ఈ దుష్పచారాలకు తెరపడుతుందన్నారు. లేదంటే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని శోభానాగిరెడ్డి అన్నారు.

అంబానీ కుట్ర వల్ల వైఎస్సార్ చనిపోయారని వార్తలు వచ్చాయి

అంబానీల ప్రభావం ఎంతుందో చెప్పటానికే ఉదహరిస్తున్నా: కూనంనేని

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘అధ్యక్షా..! ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం వెనుక కుట్ర ఉందని అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చాయి. అది వాస్తవమా? అవాస్తవమా? అన్న చర్చలోకి నేను వెళ్లటం లేదు. అంబానీ కుట్ర వల్ల వైఎస్సార్ చనిపోయారని వార్తలు వచ్చాయి...’’ అని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు శాసనసభలో పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలపై బుధవారం జరిగిన చ ర్చ సందర్భంగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి స్పందిస్తూ.. ఇప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించటం దారుణమని.. అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. చీఫ్ విప్ తన వ్యాఖ్యలను ఆక్షేపించటాన్ని కూనంనేని తప్పుపట్టారు. ‘‘అంబానీ కుటుంబాల ప్రభావం అంత బలంగా ఉందని చెప్పటం నా ఉద్దేశం. ఆ ప్రమాదానికి అంబానీలే కారణమని నేను చెప్పలేదే? మీరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? గ్యాస్ కేటాయింపులకు సంబంధించిన అంశం ఇది...’’ అని కూనంనేని ఎదురు దాడికి దిగారు. ‘‘గ్యాస్ మన బేసిన్‌లో ఉంటే అంబానీలు పెత్తనం చేస్తారా? ప్రభుత్వం చెల్లిస్తున్న ధర సరిపోలేదని గ్యాస్ సరఫరా నిలిపేస్తారా? మరి ఆయనపై ఎందుకు చర్య తీసుకోవటం లేదు? మనం అంబానీకి భయపడుతున్నామా?’’ అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

19 నుంచి గుంటూరు జిల్లాలో ఓదార్పుయాత్ర

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర ఈ నెల 19నుంచి గుంటూరు జిల్లాలో ప్రారంభం కానుంది. చిలకలూరిపేట పట్టణంలోని భాస్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని 19న ఆవిష్కరించి అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మలివిడత ఓదార్పుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటివరకు 71 రోజులపాటు 13 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగింది. యాత్రద్వారా జగన్ మొత్తం 1790.5 కి.మీ పర్యటించి 611 మహానేత వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. 

అడుగడుగునా పట్టుబట్టి అభిమానంతో జగన్‌ను గ్రామాల్లోకి తీసుకెళ్లడంతో షెడ్యూల్‌లో లేని గ్రామాలనుసైతం పర్యటించాల్సి వచ్చింది. దీంతో నిర్ణీత షెడ్యూల్ కంటే ఆలస్యంగా ఓదార్పుయాత్ర కొనసాగుతోంది. ఈ నెల 9 నుంచి చిలకలూరిపేటలో యాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కోవూరు ఉపఎన్నికల ప్రచారం షెడ్యూలు కంటే కొంత ఆలస్యంగా సాగుతోంది. దీంతో జిల్లాలో ఓదార్పుయాత్రను కొద్ది రోజులు వాయిదా వేశారు. 

19వ తేదీ నుంచి యాత్ర ప్రారంభించేలా షెడ్యూలు ఖరారు చేశారు. ఈ క్రమంలో బుధవారం పార్టీ నేతలు చిలకలూరిపేటలో జరిగే బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మండల నేతలతో సమావేశమై గ్రామాల వారీగా పరిస్థితిని సమీక్షించి విగ్రహాల ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చించారు. జిల్లాలో ఓదార్పుయాత్ర షెడ్యూలులో లేని గ్రామాల్లో కూడా పర్యటించాల్సి వస్తోందని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. 

మార్చి ఒకటిని వినుకొండ నియోజకవర్గంలో రూపొందించిన షెడ్యూలు కాకుండా ప్రజలు పట్టుబట్టి మరీ జగన్ పర్యటించాల్సిందేనని కోరడంతో షెడ్యూలు లేని గ్రామాల్లో పర్యటించారని వివరించారు. చిలకలూరిపేట, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడులోని మిగిలిన రెండు మండలాలు, వినుకొండ నియోజకవర్గంలో మిగిలిన మండలాల్లో యాత్ర కొనసాగుతుందని వివరించారు. 

బహిరంగసభ ఏర్పాట్లు పరిశీలన.. జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘరామ్, పార్టీ నాయకులు తేళ్ళ సుబ్బారావుతో కలసి భాస్కర్ సెంటర్‌లో ఉన్న వైఎస్సార్ శిలాఫలకం వద్ద సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ నిర్వహించే ప్రదేశాన్ని, పార్కింగ్ వసతి, పట్టణంలోని ప్రధాన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నేతలు విలేకరులతో మాట్లాడుతూ కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న జననేత వైఎస్ జగన్‌మోహనరెడ్డికి ప్రజల అభిమానం అడుగడునా అడ్డుపడుతూ ఉండటంతో ఈ నెల 9 తేదీ చిలకలూరిపేటలో జరగాల్సిన పర్యటన వాయిదా పడిందన్నారు. 

19 తేదీ భాస్కర్ సెంటర్‌లో ఉన్న వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారని వివరించారు. కార్యకర్తలు, పార్టీ నాయకులు, అభిమానులు మార్పును గమనించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైఎస్ ైచె ర్మన్ షేక్ అబ్దుల్లా, మాజీ కౌన్సిలర్లు గేరాలింకన్, గ్రంధి ఆంజనేయులు, మాజీ యార్డు డైరక్టర్ కొండవీటి ఆంజనేయులు, పార్టీ నాయకులు హిదయతుల్లా, లక్ష్మణ, అంజిరెడ్డి, రిక్షా జిలానీ, జాన్ ఉన్నారు.

Jgana kovvurr 07/03/2012

ఫ్యాన్‌దే జోరు.సొంత సర్వేల్లో వెల్లడి సీఎం, చంద్రబాబు బేజారు

 కోవూరు ఉప ఎన్నికల ఫలితంపై ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమారెడ్డి, ప్రతిపక్షనేత ఎన్ చంద్రబాబునాయుడుజరిపించుకున్న సర్వేల్లో మింగుడుపడని ఫలితాలు వచ్చినట్టు తెలిసింది. తమకు అత్యంత నమ్మకమైన ప్రభుత్వ ఉద్యోగులతో ఈ సర్వే జరిపించారు. ఎవరికి వారు జరిపించుకున్న సర్వే ఫలితాలు తమకు వ్యతిరేకంగా ఉన్నట్టు స్పష్టంగా తెలియజేశాయి. ముఖ్యమంత్రి సూచనల మేరకు రెవెన్యూ వర్గాలు ఒక సర్వే జరిపించినట్టు ఉన్నతస్థాయి అధికారుల్లో ప్రచారం జరుగుతోంది. న్యూస్‌లైన్ ప్రతినిధి సేకరించిన సమాచారాన్ని బట్టి ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్నట్టు తెలిసింది. 

సేకరించిన శాంపిల్స్‌లో 65 శాతానికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లాకు చెందిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఒక సర్వే జరిపించారు. ప్రభుత్వ సర్వీసుల్లోని పార్టీ సానుభూతిపరులను ఈ రహస్య సర్వేకు వినియోగించుకున్నారు.

ఈ సర్వే ఫలితాలు కూడా తెలుగుదేశానికి నిరాశ కలిగించేవేనని తెలిసింది. ఆ పార్టీకి అంతోఇంతో ఓట్లు రాలుస్తాయని ఆశించిన బుచ్చిరెడ్డిపాళెంం, ఇందుకూరుపేట మండలాల్లోనూ చేదు ఫలితాలు వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కంటే టీడీపీ పరిస్థితి కొద్దిగా మొరుగ్గా ఉన్నట్టు ఈ సర్వే ఫలితాల్లో వెల్లడైనట్టు చెబుతున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జరుపుతున్న కోవూరు ఉప ఎన్నికల ప్రచారం తీరు, జనం హాజరుపై కూడా చంద్రబాబు ఆరా తీయిస్తున్నారు. సర్వేకు ఉపయోగించిన బృందాలను జగన్ పర్యటించే సమయంలోనే పంపుతున్నారు. అక్కడికి వచ్చిన వారి నుంచి రకరకాల ప్రశ్నలతో అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా దివంగత నేత రాజశేఖరరెడ్డిపై ప్రజల్లో ఉన్న కృతజ్ఞతాభావంపై గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

జగన్ నేడు, రేపు పర్యటించే గ్రామాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కొడవలూరు, ఇందుకూరుపేట మండలాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఉదయం 9 గంటలకు ఇందుకూరుపేట మండలం లేబూరు నుంచి ప్రారంభించి పున్నూరు, రావూరు, కొమరిక గ్రామాలకు వెళతారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు కొడవలూరు మండలం రామన్నపాళెం నుంచి ప్రారంభించి రెడ్డిపాళెం, మానెగుంటపాడు, ఆలూరుపాడు, రాజుపాళెం బహిరంగసభల్లో పాల్గొం టారు. 

రేపు పర్యటించే గ్రామాలు 
వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విడవలూరు, కోవూరు మండలాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఉదయం విడవలూరు మండలం చౌకచెర్ల, దంపూరు, వావిళ్ల, దిన్నె గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తారు. మధ్యా హ్నం కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం, గంగవరం గ్రామాల్లో పర్యటించనున్నారు.

ఉప ఎన్నికలకు కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్

హైదరాబాద్, న్యూస్‌లైన్: అధికార కాంగ్రెస్ - ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య గత రెండేళ్లుగా తెరవెనుక సాగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్‌లో మరో ఎపిసోడ్! రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న 7 స్థానాల ఉప ఎన్నికలు, త్వరలో రాబోయే 17 స్థానాల ఉప ఎన్నికల్లో.. కాంగ్రెస్, టీడీపీలు పరస్పరం ఒక అవగాహనకు వస్తున్నాయని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే.. తమ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన చెందుతున్న ఈ పార్టీలు రెండూ ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. శత్రువుకు శత్రువు మిత్రుడన్న సిద్ధాంతంతో.. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ వైఎస్సార్ కాంగ్రెస్‌ను తమ ప్రధాన ఉమ్మడి శత్రువుగా నిర్ణయించుకుని.. ఆ పార్టీని దెబ్బతీయటానికి ఉమ్మడి కార్యాచరణను రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలతో పాటు రానున్న ఉప ఎన్నికల్లో దీన్ని అమలు చేయటానికి ఇప్పటికే ఉభయులూ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. 

మాచర్లలో టీడీపీని గెలిపిస్తామన్న కాంగ్రెస్!
గుంటూరు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించాలంటే.. పరస్పరం అవగాహనకు రావాలని కాంగ్రెస్, టీడీపీ నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇరు పార్టీల జిల్లా స్థాయి నాయకులు కూడా ఈ మేరకు తమ తమ పార్టీల అధినేతలకు వివరించారు. ‘మాచర్ల నుంచి కొమ్మారెడ్డి చలమారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలి. అలా చేస్తే కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యేలు కుర్రి పున్నారెడ్డి, పిన్నెల్లి లకా్ష్మరెడ్డిల్లో ఒకరికి టికెట్టు ఇవ్వాలి. అలా చేయటం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థులు టీడీపీ తరఫున బరిలో ఉన్న వ్యక్తికి సహకరిస్తారు. అలా అవగాహనకు వస్తే తప్ప పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించలేం...’ అంటూ జిల్లాకు చెందిన ఇరు పార్టీల నేతలు ప్రతిపాదించటం, దానికి నాయకులు అంగీకరించటం జరిగిపోయినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిపాదన చేశారని తమ అధినేత చంద్రబాబు స్వయంగా మంగళవారం రాత్రి పార్టీ నాయకుల సమావేశంలో చెప్పినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ‘ఈ విషయంపై కుర్రి పున్నారెడ్డి, పిన్నెల్లి లకా్ష్మరెడ్డిలు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావుతో అసెంబ్లీ లాబీల్లో ఇదివరకే చర్చించారు. జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేతో ఈ అంశంపై బుధవారం చర్చించారు. మాచర్ల నుంచి చలమారెడ్డిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలన్న జిల్లా నేతల ప్రతిపాదనను చంద్రబాబు అంగీకరించారు’ అని ఆ వర్గాలు వివరించాయి. 


నర్సాపురంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తామన్న టీడీపీ
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాదరాజును ఓడించటానికి పరస్పరం అవగాహనతో ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. టీడీపీ ఈ స్థానం నుంచి పురపాలక సంఘం మాజీ చైర్మన్ డాక్టర్ చినమిల్లి సత్యనారాయణను బరిలోకి దించాలని నిర్ణయించినప్పటికీ.. తాజాగా కాంగ్రెస్‌తో అవగాహన మేరకు అభ్యర్థిని మార్చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించటానికి టీడీపీ మరో బలహీనమైన అభ్యర్థిని ఎంపిక చేయాలన్న ఆలోచనలో పడింది. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు నిర్ధారించారు. 


కోవూరులో టీడీపీకి కాంగ్రెస్ సహకారం! 
కాంగ్రెస్ - టీడీపీల మధ్య ఈ రకంగా నియోజకవర్గాల వారీగా ‘సమన్వయం’ చేయటంలో ఒక వ్యాపారవేత్త కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 18న జరగనున్న కోవూరు ఉపఎన్నిక విషయంలో మొదట ఎవరి దారి వారన్నట్లు వ్యవహరించినప్పటికీ గడువు దగ్గరపడుతున్న తరుణంలో ఇక్కడ కూడా ఎవరు వెనక్కి తగ్గాలన్న చర్చలు మొదలైనట్లు చెప్తున్నారు. కోవూరులో కాంగ్రెస్ అభ్యర్థి అంతగా పోటీ ఇచ్చే పరిస్థితి లేనందున ఇక్కడ టీడీపీ అభ్యర్థికి లాభించేలా వ్యవహరించాలన్నది పరస్పర అంగీకారం. అందుకు ప్రతిఫలంగా త్వరలో రాబోయే నెల్లూరు లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ బలహీనమైన అభ్యర్థిని నిలుపుతుందని చెప్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఒక మంత్రి ప్రతిపాదించగా మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యాపారవేత్త టీడీపీ నేతకు వివరించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. 

కాంగ్రెస్ మునిగిపోయే పడవే
పార్టీ సీనియర్ల అంతర్మథనం
హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ మునిగిపోయే పడవేనని, నడిసంద్రంలో ఉన్న ఈ తరుణంలో అందులోనుంచి దూకినా, దాన్లోనే ఉన్నా ఫలితం ఒక్కటేననే భావన పార్టీ సీనియర్ నేతల అంతర్మథనంలో వ్యక్తమైంది. బుధవారం కె.జానారెడ్డి చాంబర్లో మంత్రులు టీజీ వెంకటేశ్, కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి తదితరులు భేటీఅయ్యారు. యూపీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర విశ్లేషణ సాగింది. సమైక్యవాదానికి అనుగుణంగా సమాజ్‌వాది పార్టీకి యూపీ ప్రజలు ఓట్లు వేశారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని అధిష్టానం ఏపీని కూడా సమైక్యంగా ఉంచితేనే భవిష్యత్తులో పార్టీ నిలదొక్కుకుంటుందని జేసీ అభిప్రాయపడ్డారు. మరో నేత కల్పించుకుంటూ తెలంగాణపై ఇచ్చిన హామీకి కట్టుబడకుంటే ప్రజల ముందుకు పార్టీ వెళ్లలేదన్నారు. పార్టీ పరిస్థితి మునిగిపోయే పడవలా ఉందని, ఈ సమయంలో ప్రాంతాలవారీగా మనం ఒకరిపై ఒకరం పోరాడుతూ కూర్చుంటే పడవ ముందే మునిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Popular Posts

Topics :