2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

విజయనగరం వైఎస్సార్సీపీ అధ్యక్షునిగా బెల్లాన

Written By news on Saturday, December 31, 2016 | 12/31/2016


విజయనగరం వైఎస్సార్సీపీ అధ్యక్షునిగా బెల్లాన
కోలగట్లకు పీఏసీలో స్థానం
 విజయనగరం జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునిగా బెల్లాన చంద్రశేఖర్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కోలగట్ల వీరభద్రస్వామికి పార్టీ అత్యున్నత నిర్ణాయకమండలి అయిన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో స్థానం కల్పించినట్లు పేర్కొన్నారు. కోలగట్ల వ్యక్తిగత కారణాలతో జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను జగన్ ఆమోదించారని, జిల్లా పరిషత్‌ మాజీ అధ్యక్షుడు బెల్లానను ఆ స్థానంలో నియమించారని తెలిపారు.

చంద్రబాబు సాధించింది ఏమీలేదు


‘చంద్రబాబు సాధించింది ఏమీలేదు’
హైదరాబాద్‌ : ఈ ఏడాది (2016)లో ప్రజలు సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. ఆమె శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ  బాబు గొప్పలు చెప్పుకోవడం తప్ప, సాధించింది ఏమీ లేదన్నారు. ‘ప్రజలు ఇబ్బందులు పడుతూ, కష్టాల్లో ఉంటే మీకు సంతోషంగా ఉందా?. మీ నల్లడబ్బు వైట్‌ మనీ అయినందుకు మీరు సంతోషిస్తున్నారా?.
కేసుల నుంచి తప్పించుకుంటున్నందుకు సంతోషమా?. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ 21మంది వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు సంతోషమా?. ఇలాంటి ఏడాది మునుపెన్నడూ చూడలేదని ప్రజలు బాధపడుతున్నారు. 2016 సంవత్సరం ఏపీకి పెద్ద విపత్తు. వచ్చే ఏడాది అయినా కనీసం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి’ అని వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా చంద్రబాబుకు సూచించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాపక్షంగా ప్రజల గొంతుకై నిత్యం పోరాడుతోందని ఆమె పేర్కొన్నారు.

సోమిరెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు


సోమిరెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు..
హైదరాబాద్‌ : ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
సోమిరెడ్డి విదేశీ లావాదేవీలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేసినట్లు కాకాణి తెలిపారు. తన దగ్గరున్న అన్ని ఆధారాలు పంపానని, సోమిరెడ్డి జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. సోమిరెడ్డికి ధైర్యం ఉంటే విచారణకు ఎందుకు సిద్ధపడటం లేదని సూటిగా ప్రశ్నించారు. ఆయన ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకొని విచారణకు సిద్ధపడి, తన నిజాయితీని నిరూపించుకోవాలని కాకాణి డిమాండ్‌ చేశారు.

తనపై అక్రమ కేసులు పెడితే భయపడేది లేదని, దేనికైనా సిద్ధంగా ఉన్నానని కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. జైలుకు, కేసులకు భయపడే రకం కాదని ఆయన పేర్కొన్నారు. క్రిమినల్‌ కేసులు పెట్టాల్సి వస్తే సోమిరెడ్డిపై రెండు,మూడొందల కేసులు పెట్టాల్సి వస్తుందని కాకాణి వ్యాఖ్యానించారు. మంత్రిగా ఉన్న సమయంలో క్రికెట్‌ కిట్‌లు అమ్ముకున్న నీచ చరిత్ర సోమిరెడ్డిదని, చెట్టు-నీరు కార్యక్రమంలో కమిషన్లు తీసుకున్నారని అన్నారు.
తమ ప్రభుత్వమే అధికారంలో ఉందికదా అని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటానని కాకాణి తెలిపారు. వైఎస్‌ జగన్‌ పై ఆరోపణలు చేస్తే మంత్రి పదవి వస్తుందని సోమిరెడ్డి భ్రమలో ఉన్నారని అన్నారు. కాకాని ఈ సందర్భంగా సోమిరెడ్డి అక్రమాలపై ఈడీకి రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు.

పంటలు పండని పరిస్థితి, కరువుతో ప్రజల అవస్థలు

Written By news on Monday, December 26, 2016 | 12/26/2016


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డబ్బు పిచ్చి తప్ప రైతుల మీద అభిమానం ఏమాత్రం లేదని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాగునీరు, సాగునీటి కోసం వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
  • పులివెందుల మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టాం
  • పులివెందులలో తాగునీటి పరిస్థితి ఎలా ఉంది, రైతులు ఎలా బతుకుతున్నరన్న విషయాలు చంద్రబాబు దృష్టికి పోవాలి
  • పంటలు పండని పరిస్థితి, కరువుతో అలమటిస్తున్న పరిస్థితితో ప్రజలు అవస్థలు పడుతున్నారు
  • చిత్రావతిలో నీళ్లున్నా రైతులకు నీళ్లు వదలడం లేదు
  • చిత్రావతి డ్యాం సామర్థ్యం 10 టీఎంసీలు. దీనికి జరిగిన కేటాయింపు కేవలం 3.2 టీఎంసీలు
  • ఇందులోనూ మొదటి విడతగా ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 7 వరకు 1.8 టీఎంసీలు ఎంపీఆర్ నుంచి ఇచ్చారు
  • చివరకు చిత్రావతికి చేరిన నీరు 0.67 టీఎంసీలు మాత్రమే.. అంటే 63 శాతం నష్టమైంది.
  • రెండో విడతగా ఎంపీఆర్ నుంచి 1.4 టీఎంసీల నీళ్లు పంపారు. కానీ చేరినవి కేవలం 0.66 టీఎంసీలే, అంటే 53 శాతం నష్టాలు
  • ఇప్పుడు చిత్రావతిలో మొత్తం 1.15 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి
  • చిత్రావతి నుంచి సాగునీరు అందించాలంటే డ్రైవింగ్ హెడ్ కనీసం 0.9 టీఎంసీలు ఉంటే తప్ప సాధ్యం కాదు
  • ఇప్పుడు 1.15 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి కనీసం సాగునీరు అందించే అవకాశం ఉంది
  • కానీ ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 22 నుంచి చిత్రావతికి నీళ్లు ఇవ్వడం మానేసింది
  • డ్రైవింగ్ హెడ్ ఉన్నప్పుడు చిత్రావతికి కాస్తోకూస్తో నీరు పంపి, పులివెందుల స్టోరేజి ట్యాంకులు, లింగాల చెరువులు నింపుకొని రైతులకు ఉపయోగపడచ్చు
  • కానీ హడావుడిగా నీళ్లు ఇవ్వడం మానేశారు
  • కదిరి, ధర్మవరం మునిసిపాలిటీలకు కూడా తాగడానికి 41 క్యూసెక్కుల చిత్రావతి నీళ్లు ఇస్తున్నారు 
  • ఆ తర్వాత నీళ్లు ఇచ్చినా దాన్ని డ్రైవింగ్ హెడ్ పెంచుకోడానికి పనికొస్తుంది తప్ప సాగునీరు ఇవ్వడం కుదరదు
  • శ్రీశైలంలో నీళ్లున్నా గండికోట కట్టకపోవడంతో పులివెందులకు నీళ్లు రావాలని వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కలలు నెరవేరడం లేదు
  • తుంగభద్ర నీళ్లు ఏవిధంగానూ సరిపోవు కాబట్టి కనీసం కృష్ణా నీళ్లయినా వస్తే బాగుండేది
  • గండికోట, గాలేరు-నగరి ప్రాజెక్టులు పూర్తయితే నీళ్లు వచ్చేవి
  • చంద్రబాబు పాలనలోకి వచ్చి మూడేళ్లయినా చాలీచాలని కేటాయింపులతో ప్రాజెక్టులు కడుతున్నారు
  • గాలేరు - నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు తన తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నికల ముందొచ్చి ప్రాజెక్టుల ముందు టెంకాయలు కొట్టారే తప్ప ఏనాడూ పైసలు విదల్చలేదు. 
  • గాలేరు - నగరి 13 కోట్లు, హంద్రీనీవాకు 17 కోట్లు ముష్టి వేసినట్లు ఇచ్చారు
  • తర్వాత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు 
  • హంద్రీనీవా, గాలేరు నగరిలకు తలో 4వేల కోట్లు కేటాయించి 80 శాతం పనులు పూర్తిచేశారు
  • మిగిలిన 20 శాతం పనులు పూర్తిచేయడానికి కూడా చంద్రబాబు చాలీచాలని కేటాయింపులు చేస్తున్నారు. 
  • పట్టిసీమ నుంచి రాయలసీమకు ఏమైనా వచ్చాయా.. అక్కడినుంచి ఇక్కడకు ఏమనా కెనాల్ వేశారా?
  • పట్టిసీమ నుంచి 48 టీఎంసీలు ప్రకాశం బ్యారేజికి వచ్చాయి
  • శ్రీశైలం నుంచి కిందకు వాడుకోవచ్చని జీవో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నా
  • చివరకు ఏ స్థాయిలో అన్యాయాలు, మోసాలు ఉన్నయో చూద్దాం
  • గండికోట ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వాలని 22 గ్రామాల వాళ్లు అడుగుతుంటే, చంద్రబాబు సీఎం అయి మూడేళ్లయినా మాటలు చెబుతాడు గానీ రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు
  • గండికోటలో 26 టీఎంసీల సామర్థ్యం నిల్వచేయాల్సి ఉంది. ఇప్పటికి గాలేరు-నగరి పూర్తయి ఉంటే శ్రీశైలం నుంచి రోజుకు 22వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చేవి, గండికోట కళకళలాడేది
  • ఆ తర్వాత చిత్రావతి, పైడిపాలెం అన్నింటికీ కూడా పూర్తి సామర్థ్యంతో నీళ్లు వచ్చేవి
  • గొప్పగా నీళ్లు తెస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం ఎందుకని చంద్రబాబును అడుగుతున్నాం
  • ఇచ్చామన్నట్లుగా భిక్షం వేసినట్లు కాదు.. పెండింగులో ఉన్న ప్రతి ప్రాజెక్టు పనులు పూర్తి కావాలి
  • గండికోటకు 26 టీఎంసీల నీళ్లు తేవాలి
  • చిత్రావతి, పైడిపాలెం లకు కూడా పూర్తి సామర్థ్యంతో నీళ్లు అందించాలి
  • తుంగభద్ర నుంచి చిత్రావతికి మళ్లీ కేటాయిస్తూ ఆ తర్వాత పీబీసీ, లింగాల బ్రాంచి కెనాల్‌కు కూడా వెంటనే నీళ్లు వదలాలని డిమాండ్ చేస్తున్నాం
  • ఇప్పుడున్న పరిస్థితిని గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
  • రైతుల దుస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఇక్కడ ధర్నా చేస్తున్నాం
  • చంద్రబాబుకు రైతుల మీద ఏమాత్రం అభిమానం లేదు
  • కేబినెట్ సమావేశాల్లో రైతుల భూములు ఎలా లాక్కోవాలి, పెద్దలకు ఎలా ఇవ్వాలనే చూస్తాడు
  • రైతులకు రుణాలు ఇచ్చిన తీరును చూసి చంద్రబాబు సంతృప్తి చెందారట.. అది చూసి ఆయనకు బుద్ధి, జ్ఞానం ఉన్నాయా అనిపించింది
  • బ్యాంకులు రైతులకు 24వేల కోట్ల పంటరుణాలు, 10వేల కోట్ల టెర్మ్ లోన్స్ఇవ్వాల్సి ఉంటే మొత్తం కలిపి కేవలం 4700 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నాయి.
  • రబీలో 9 లక్షల హెక్టార్లలో కూడా పంట వేయకపోయినా.. ఈయనకు సంతృప్తికరంగా ఉందట
  • ఈ మనిషికి ఏం జరుగుతోందన్న అవగాహన లేదు. ఉండేదల్లా డబ్బు, డబ్బు డబ్బు అనే పిచ్చి తప్ప ఏమీలేదు
  • ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యి, చిత్రావతికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
  • రైతులు పడుతున్న అగచాట్లతో ఇప్పటికైనా బుద్ధి వస్తుందని ఆశిస్తున్నా
  • ఎంత ఎండ ఉన్నా, ధర్నా చేయకపోతే నీళ్లు రావేమోనని రైతులు వ్యక్తం చేసిన ఆవేదనను ఆయన గుర్తించాలి

హక్కుల కమిటీ గౌరవాన్ని కించపర్చడం శోచనీయం

Written By news on Saturday, December 24, 2016 | 12/24/2016


హక్కుల కమిటీ గౌరవాన్ని  కించపర్చడం శోచనీయం

స్పీకర్‌ కోడెలకు వైఎస్సార్‌సీఎల్‌పీ ఉప నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ హక్కుల కమిటీ గౌరవాన్ని కమిటీ సభ్యులే కించపర్చడం శోచనీయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష ఉప నాయకుడు, హక్కుల కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఈ మేరకు పెదిరెడ్డి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..

‘గౌరవనీయులైన సభాపతి గారికి,
ఆర్యా!

ఈ నెల 22న అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన శాసనసభా హక్కుల కమిటీ సమావేశంలో గత సెప్టెంబర్‌లో శాసనసభ లోపల జరిగిన పరిణామాలపై నోటీసులు అందుకున్న కొందరు సభ్యులను పిలచి విచారించారు. నోటీసులు అందుకున్న వారు తమ అభిప్రాయాలను చెబుతున్నçప్పుడు,  మధ్యలో.. నాతోపాటు సభ్యులుగా ఉన్న శ్రావణ్‌కుమార్, కె.రామకృష్ణ గారు మధ్యలో కలుగజేసుకొని మీరు చెప్పేది ఊరునంతా గజదొంగలు దోచుకుని.. ఎందుకు దొంగతనం చేశారు అంటే.. రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల కోసం మేము చేశాము అని చెప్పినట్లు ఉంది మీరు చెప్పేది అని వ్యాఖ్యానించారు. తోటి కమిటీ సభ్యులు అలా మధ్యలో కలుగజేసుకొని మాట్లాడటం బాధాకరం. నోటీసులు అందుకున్న సభ్యుడు తన వివరణ ఇస్తుండగా.. మధ్యలో కలుగజేసుకొని మీరు తప్పుచేసి కమిటీ ముందుకు వచ్చారు అని చెప్పడం.. చాలా విచారకరం.
తోటి శాసనసభ్యులను బందిపో టు దొంగలంటూ పరోక్షంగా మాట్లాడటం కమిటీ గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయి. కమిటీ సభ్యులుగా ఉన్న వ్యక్తులు హుందాగా, పెద్దతరహాగా ఉండాలి కానీ, ఇలా మాట్లాడటం భావ్యంకాదు, కమిటీకి గౌరవం కూడా కాదు. కావున తమరు దయచేసి ఇకపై నోటీసులు అందుకున్న తోటి సభ్యులు తమ వివరణ ఇస్తున్నప్పడు ఇలా మధ్యలో కలుగజేసుకొని, వారిని అగౌరవ పరిచేలా మాట్లాడవద్దని కమిటీలో సభ్యులుగా ఉన్న వారికి మీరు గట్టిగా సూచించవలసిదిగా కోరుతున్నాము.’

జీవిత పయనంలో కష్టమైనదే సరైన దారి: వైఎస్ జగన్


వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని పేదవారందరికీ మంచి విద్యను అందించాలనే సదుద్దేశంతో వెంకటప్ప స్కూలును ఏర్పాటుచేసినట్లు వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్‌ జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పులివెందులలోని వెంకటప్ప స్కూలు పదో వార్షికోత్సవంలో పాల్గొన్నారు. జీవిత ప్రయాణంలో రెండు దారులు కనిపిస్తాయని, వాటిలో ఒకదారి సులభమైనది, మరొకటి కష్టమైనదని చెప్పారు. అయినా కష్టమైనదే కరెక్టయిన దారి అన్నారు. సులభమైన దారి కాపీలు కొట్టడం, సులభంగా పాసయ్యే మార్గాలు, మార్కులు తెచ్చుకునే మార్గాలని.. కానీ ఆదారిలో వెళ్తే తాత్కాలికంగా సాధించగలమేమో గానీ, తర్వాత మాత్రం ఫెయిలవుతామన్నారు. 
 
కష్టమైనది అనిపించే దారిలో కష్టపడి మన జీవితంలో ఈరోజు పడే కష్టాన్ని జీవితంలో రేపు విజయంగా మార్చుకోవచ్చని, అందుకు చదువుతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. చదువు నుంచి జీవితం వరకు ఇలాగే జరుగుతుందన్నారు. జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయన్నారు. సులభమైన దారిలో పోతే క్యారెక్టర్, క్రెడిబులిలీ రెండూ పోతాయని.. అదే కొంచెం కష్టపడితే ఈ రెండు రావడంతో పాటు దీర్ఘకాలంలో విజయాలు సాధిస్తారని చెప్పారు. 
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గురువు వెంకటప్ప పేరుతో ఏర్పాటుచేసిన ఈ స్కూల్లో ఎవరి వద్ద నుంచి పైసా ఫీజు కూడా తీసుకోరని, వైఎస్ఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడుస్తోందని ఆయన చెప్పారు. ఇందుకు పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ అభినందనలు చెబుతున్నామన్నారు. ఈ పాఠశాలలలోని విద్యార్థులందరూ బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సాక్షి గ్రూపు ఛైర్‌పర్సన్ భారతీరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
 
 

రేపటి నుంచి వైఎస్సార్ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

Written By news on Friday, December 23, 2016 | 12/23/2016

24న ఇడుపులపాయలో కుటుంబసభ్యులు, బంధువులతో ప్రత్యేక ప్రార్థనలు
 25న క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొననున్న వైఎస్‌ జగన్‌
  మండల ఉపాధ్యక్షుడి కుటుంబసభ్యులకు పరామర్శ
 కడప, ప్రొద్దుటూరులలో పలు కార్యక్రమాలకు హాజరు
 26న పీబీసీ నీటి విషయమై ధర్నా  

పులివెందుల :  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపటి నుంచి జిల్లాలో పర్యటిస్తారని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి 24వ తేదీన ఉదయం 9గంటలకు పులివెందులలోని వెంకటప్ప మెమోరియల్‌ స్కూల్‌ పదో వార్షికోత్సవ వేడుకలలో పాల్గొంటారు. 9.30కు పులివెందులలోని వీజే ఫంక్షన్‌ హాల్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు రామట్లపల్లె భాస్కర్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా 10 గంటలకు ఇడుపులపాయకు చేరుకొని అక్కడ కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కాసేపు మాట్లాడతారు. క్రిస్మస్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. అక్కడ నుంచి 2 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుని అక్కడ పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనంతరం కడపకు చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 25వ తేదీ ఉదయం 8.30కు క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు వేంపల్లె మండలం అలవలపాడు గ్రామానికి చేరుకుని ఇటీవల ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన మండల ఉపాధ్యక్షుడు గజ్జెల రామిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. 5.30కు కడపలో కార్పొరేటర్‌ మక్బుల్‌ నివాసానికి చేరుకొని ఆయన కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి పులివెందులకు చేరుకుంటారు. 26వ తేదీ ఉదయం 9.30కు పీబీసీ నీటి విషయమై పులివెందుల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో పాల్గొంటారని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు.

వచ్చీరాని ఇంగ్లీష్‌ లో మాట్లాడితే రావు

Written By news on Monday, December 19, 2016 | 12/19/2016

విజయనగరం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు అమలు చేయకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో రాజీపడటం, విద్యార్థులను మోసం చేయడం వంటి విషయాలను విద్యార్థులు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా విజయనగరంలో సోమవారం నిర్వహించిన యువభేరిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. చంద్రబాబు చేసిన మోసాల గురించి విద్యార్థులు ఏం మాట్లాడారంటే..

హిమబిందు, బీటెక్‌ మూడో సంవత్సరం

రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకుని వస్తానని చెప్పి చంద్రబాబు వందలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశీ పర్యటనలు చేశారు. ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అన్నా?

వైఎస్‌ జగన్‌
  • చంద్రబాబు వచ్చీరాని ఇంగ్లీష్‌ లో మాట్లాడితే పరిశ్రమలు రావు
  • ప్రత్యేక హోదా వల్లే వస్తాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే పెట్టుబడులు వస్తాయి
  • వందల కోట్లు ఖర్చు చేసి చార్టెడ్‌ విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తే రావు
  • ప్రత్యేక హోదా కోసం అందరం కలిసికట్టుగా పోరాడుతాం
  • దేవుని దయ వల్ల మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుంది

ఫర్నాజ్‌, ఎంబీఏ
  • స్టూడెంట్స్‌ అందరూ చదవాలని వైఎస్‌ఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు
  • చంద్రబాబు ఏమో ఎన్నికలపుడు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ అమలు చేస్తామని చెప్పారు
  • ఎన్నికల్లో గెలిచాక అర్థపర్థంలేని పథకాలతో ఎలా తగ్గించాలా అని చూస్తున్నారు
  • మీరు సీఎం అయ్యాక మా అందరికీ స్కాలర్‌ షిప్‌ లు వచ్చేలా చూడండి

వైఎస్‌ జగన్‌
  • మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్ మెంట్‌ పథకాన్ని పూర్తిగా విప్లవాత్మకంగా అమలుచేస్తాం. అన్ని యువభేరిల్లో ఇదే మాట చెబుతున్నాం
  • ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ను తగ్గించేందుకు చంద్రబాబు లేనిపోని నిబంధనలు పెడుతున్నారు
  • బీసీలు, ఎస్సీలు, పేదలపై ప్రేమ ఉందంటారు. వాళ్లకు చేసింది మాత్రం ఏమీ లేదు

శౌర్య, ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌
  • ప్రత్యేక హోదా సంజీవిని కాదు అని టీడీపీ నాయకులు చెబుతున్నారు. సంజీవిని కానప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్‌, గల్లా జయదేవ్‌ వంటి వారు పక్క రాష్ట్రాల్లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారు?
  • ఇంకా ఎన్నాళ్లు మమ్మల్ని మోసం చేస్తారు. మోసపోవడానికి ఎవరూ రెడీగా లేరు
  • అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌ డే అన్నా

సూర్య, ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం
  • ప్రత్యేక హోదా విషయంలో రాజీపడేదిలేదని చంద్రబాబు చెప్పారు. కేంద్రం ప్యాకేజీ ఇవ్వగానే కరిగిపోయారు
  • చంద్రబాబుకు 30 ఏళ్లకుపైగా రాజకీయ అనుభవం ఉండి యువతను మోసం చేస్తున్నారు

వైఎస్‌ జగన్‌
  • చంద్రబాబు మోసం చేయడం వింత కాదు
  • ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. ఎంతోమందిని మోసం చేశారు
  • యువతనే కాదు చాలా మందిని మోసం చేశారు

ఎన్నికల సయమంలో చంద్రబాబు చేసిన వాగ్ధానాలను (ఎన్నికల సభల్లో రికార్డు చేసిన వీడియోలు) ఈ సందర్భంగా వినిపించారు. అప్పుడు చంద్రబాబు ఏం చెప్పారంటే..
  • ఐదేళ్లు కాదు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలి
  • రైతుల రుణాలను మాఫీ చేస్తాం
  • డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాం. వారి రుణాలను మాఫీ చేస్తాం
  • జాబు కావాలంటే బాబు రావాలి
  • నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది
  • చదువుకున్న వారికి  ఉద్యోగాలు రాకుంటే నిరుద్యోగ భృతి ఇస్తాం
  • బెల్ట్‌ షాపులను రద్దు చేస్తాం

వైఎస్‌ జగన్‌
  • చంద్రబాబు మోసం చేయనివారు ఎవరైనా ఉన్నారా?
  • రైతులను, డ్వాక్రా మహిళలను, చదువుకున్న యువతను మోసం చేశారు
  • నిజంగా చంద్రబాబు లాంటి వ్యక్తి ఎవరైనా స్వాతంత్ర్యం రాక ముందు ఉన్నట్టయితే స్వాతంత్ర్యం అవసరం లేదనే వారు
  • మనకంటే బ్రిటీషోళ్లు అద్భుతంగా పరిపాలిస్తారని చెప్పేవారు

నిఖిల, బీటెక్‌
 
  • మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన దేశం మనది. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మేం ఇంజినీరింగ్‌ చేస్తున్నాం
  • మన రాష్ట్రంలో ఇంజినీర్లు లేరని చంద్రబాబు రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌ వాళ్లకు అప్పగించారు
  • మన రాష్ట్రంలో ప్రతిభావంతులైన ఇంజినీర్లు లేరా?

వైఎస్‌ జగన్‌
 
  • నీకున్న తెలివితేటలు కూడా చంద్రబాబుకు లేవు తల్లీ
  • సింగపూర్‌ వాళ్ల కు కాంట్రాక్టు అప్పగిస్తే అవినీతికి పాల్పడవచ్చని చంద్రబాబు ఆలోచన
  • సింగపూర్‌ వాళ్లకు ఇస్తే కరెప్షన్‌ విషయం బయటకు రాదు. అటు నుంచి అటే చంద్రబాబు ఎకౌంట్‌ లో వేస్తారు

టాడా కేసు ఎందుకు పెట్టకూడదు?


చంద్రబాబుపై టాడా కేసు ఎందుకు పెట్టకూడదు?
విజయనగరం :
ప్రత్యేక హోదా గురించి అడుగుతుంటే పీడీ కేసులు పెడుతున్నారని, అలాంటి చంద్రబాబు మీద టాడా కేసు ఎందుకు పెట్టకూడదని వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా విజయనగరంలో సోమవారం నిర్వహించిన యువభేరిలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 
 
  • యువభేరిలో పాలుపంచుకునేందుకు వచ్చిన ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరుపేరునా కృతజ్ఞతలు
  • మన జీవితాలు బాగుపడాలంటే ప్రత్యేక హోదా డిమాండును ఒక విప్లవంలా, ఒక కెరటంలా ముందుకు కదిలించాలి
  • గతంలో చదువుల విప్లవం నాన్నగారి హయాంలో చూశారు
  • నాకు బాగా గుర్తు.. అప్పట్లో ఆయన ఒక మాట అనేవారు. పేదరికం పోవాలంటే చదువుల కోసం, ఆస్పత్రుల కోసమే ఏ పేదవాడూ అప్పుల పాలు అవుతారు
  • అలా కాకుండా ఉండాలన్నా, వాళ్లు తమ జీవితాలు మార్చుకోవాలన్నా ఈ రెండు రంగాలకు భరోసా ఉండాలి అనేవారు
  • ఆయన పాలన ఒక స్ఫూర్తి
  • అంతవరకు ముఖ్యమంత్రులుగా పనిచేసినవాళ్లు ఎవరైనా పేదలు, బీసీల మీద ప్రేమను మాటలకే పరిమితం చేసేవారు
  • నాలుగు ఇస్త్రీపెట్టెలు, నాలుగు కులవృత్తుల పరికరాలు ఇచ్చి బీసీలకు మేలు చేశామని ప్రకటించుకునేవారు
  • పేదరికం పోవాలంటే ఆ కుటుంబం నుంచి ఒక్కరైనా పెద్దచదువులు చదవాలని, అందుకు అప్పుల పాలు కాకూడదని రాజశేఖరరెడ్డి చదువుల విప్లవాన్ని తీసుకొచ్చారు
  • ఆ విప్లవంతో ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ.. ఇలా ఏం చదవాలన్నా పేదరికం అడ్డురాకుండా ఉండేది
  • ఇంజనీరింగ్‌కు లక్షన్నర అవుతుందన్నా.. తానున్నా చదివిస్తా అనేవారు. డాక్టర్ చదవాలంటే రెండున్నర లక్షలవుతుందన్నా చదివించారు
  • అప్పట్లో అలా భరోసా ఉండేది
  • ఆ చదువుల విప్లవం ఇప్పుడు తెరమరుగు అవుతోంది. పిల్లలను అలా చదివించాలన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రులకు లేకుండా పోయింది
  • ఇటువంటి చదువుల విప్లవాన్ని ఇప్పుడు దిగజార్చేశారు. 
  • ఇంజనీరింగ్ చదవాలంటే 70 వేల నుంచిలక్షన్నర వరకు అవుతోంది. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేది ముష్టి వేసినట్లు 35 వేలు. మిగిలింది మీరే కట్టుకుని, అప్పుల పాలు కండి అంటారు. 
  • కథ మళ్లీ మొదటికొచ్చింది. వీళ్లిచ్చేది పప్పు బెల్లాలకు కూడా సరిపోదు. మిగిలిన మొత్తం కోసం తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తోంది
  • రాజశేఖరరెడ్డి హయాంలో చదువుల విప్లవం.. ఇప్పుడు ఉద్యోగాల విప్లవం రావాలి: 
  • ఇది జరిగేది ఎప్పుడంటే, ప్రత్యేక హోదా వస్తే మాత్రమే
  • నిన్నటికంటే నేడు, నేటికంటే రేపు మనం బాగున్నామంటేనే అభివృద్ధి అంటారు
  • ప్రభుత్వం వచ్చి దాదాపు మూడేళ్లవుతోంది. అయినా మనం నిన్నటి కంటే నేడు, నేటి కన్నా రేపు బాగున్నామా.. బాగుండే పరిస్థితి ఉందా అనేది ఆలోచించాలి
  • రాష్ట్రాన్ని అప్పుడు విడగొట్టేటపుడు అప్పట్లో మనం బాగుపడతామని మాటలు ఇచ్చి విడగొట్టారు
  • రాష్ట్రం అభివృద్ధిలో పరిగెడుతోందని చంద్రబాబు అంటున్నారు. జీడీపీ వృద్ధిరేటు 12.20 శాతం ఉందని చెబుతున్నారు
  • దేశం మొత్తానికే 7.20 శాతం ఉంటే.. దానికంటే 5 శాతం ఎక్కువ వృద్ధి సాధించామని అంటున్నారు.. నిజంగా అలా జరుగుతోందా?
  • జీడీపీ వృద్ధిరేటుకు మూడు కారకాలు చూస్తారు
  • వాటిలో మొదటిది వ్యవసాయ రంగం, రెండోది పారిశ్రామిక రంగం, మూడోది సేవారంగం
  • ఈ మూడింటిలో పురోగతి ఉంటే దాన్ని గ్రోత్ రేట్ అంటారు
  • జాతీయ సగటు కంటే ఎక్కువగా రాష్ట్రంలో వృద్ధి ఉందని చంద్రబాబు అంటున్నారు
  • వ్యవసాయ రంగం ఎలా ఉందో, రైతుల పరిస్థితి ఏంటో చూద్దాం
  • ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ మూడేళ్లలో వరసగా కరువులు లేదా అతివృష్టి
  • వ్యవసాయం బ్రహ్మాండంగా జరిగిందా.. 130 కోట్ల జనాభాలో 65 శాతం మంది వ్యవసాయం మీదే ఆరపడి బతుకుతున్నారు
  • చంద్రబాబు సీఎం అవ్వకముందు.. రైతు రుణాలన్నింటినీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పారు.  
  • బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలన్నా చంద్రబాబు సీఎం కావాలన్నారు
  • ఆయన సీఎం అయ్యేనాటికి 87,612 కోట్లుగా ఉన్న రైతు రుణాలు.. ఇప్పుడు.. జూన్ నెలాఖరుకు 1,00,709 కోట్లకు చేరింది. 
  • రుణాలు మాఫీ కాకపోగా.. అపరాధ వడ్డీలతో తడిసి మోపెడయ్యాయి
  • రబీ పంటకు బ్యాంకులు 24వేల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యం పెట్టుకుంటే, 10వేల కోట్ల టెర్మ్ లోన్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే అందులో కేవలం 14 శాతం మాత్రమే రుణాలిచ్చారు
  • విశాఖపట్నం యువభేరి అవ్వగానే మంత్రులు టీవీలలోకి వచ్చి వాళ్ల ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పారు
  • సోషియో ఎకనమిక్ సర్వే నిజాలు చెబుతుంది
  • 2014-15లో పెద్ద పరిశ్రమలకు 1875కోట్లు, మధ్యతరహా పరిశ్రమలకు 2263 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. 4138 కోట్లు మొత్తం వచ్చాయి
  • 2015-16లో పెద్ద పరిశ్రమలకు 3969 కోట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 1592 కోట్లు. రెండూ కలిపి 4961 కోట్లు వచ్చాయి. 
  • చంద్రబాబు మాత్రం విశాఖపట్నంలో 4.67 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసేశామని డబ్బాలు కొట్టుకున్నారు
  • లేని జీడీపీ గ్రోత్‌రేటును చూపిస్తూ, కాస్తో కూస్తో వాళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలనుకున్నా ఇవ్వకుండా చేస్తున్నారు
  • ఇక సేవా రంగం.. అదే సాఫ్ట్‌వేర్ రంగాన్ని విషయాన్ని చూద్దాం
  • చదువుకున్నవాళ్లంతా ఉద్యోగాల కోసం బయోడేటాలు పట్టుకుని తిరుగుతున్నారు
  • ఈ మూడేళ్లలో రాష్ట్రానికి ఎన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు వచ్చాయని అడుగుతున్నా
  • వచ్చింది పెద్ద బోడి సున్నా మాత్రమే
  • అయినా చంద్రబాబు మాత్రం ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చూపిస్తారు
  • అసలు లెక్కలు మూడేళ్ల తర్వాతే వస్తాయి కాబట్టి ఇప్పుడు ఏం బొంకినా పర్వాలేదని అనుకుంటున్నారు
  • ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వస్తాయా అని ఈమధ్య చంద్రబాబు అంటున్నారు
  • అప్పట్లో అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ఉండాలని, అది కూడా ఐదేళ్లే ఇస్తే చాలదని.. పరిశ్రమలు కట్టడానికే రెండు మూడేళ్లు పడుతుందని, అది ప్రారంభమయ్యేలోపు హోదా అయిపోతే నష్టం జరుగుతుందని, కాబట్టి కనీసం 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని మోదీ సాక్షిగా చెప్పారు
  • వెంకయ్య నాయుడు కూడా కనీసం 10 సంవత్సరాలైనా కావాలని వెంకయ్య అడిగారు
  • వాళ్లు ప్రతి సందర్భంలోనూ పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలని చెప్పారు 
  • ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్లు ప్లేట్లు మారుస్తున్నారు
  • వీళ్లను చూస్తే.. అసలు వీళ్లకు ప్రత్యేక హోదా మీద పూర్తి అవగాహన ఉండా అని అనుమానం వస్తుంది
  • ఉండి కూడా తమ స్వార్థం కోసం, కేసుల నుంచి బయటపడేందుకు ఇలా చేశారా అని అనుమానం
  • చంద్రబాబు నల్లధనం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు గానీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనంతో ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో, వీడియో టేపుల సాక్షిగా దొరికేశారు
  • ఇంతలా జరిగినా ఆయనను అరెస్టు చేయకపోవడం, పదవి నుంచి తీసేయకపోవడం ఇక్కడ ఒక్కచోటే జరిగింది
  • ఇదే సీఎంగారికి ప్రత్యేక హోదా మీద అవగాహన ఉందా అనిపిస్తుంది
  • ఈ మూడేళ్లలో ఆయన చేసిన అవినీతి కార్యక్రమాల్లో దేన్నీ వదలలేదు
  • రాజధాని భూములు, ఆలయాల భూములు, అసైన్డ్ భూమలు దేన్నీ వదల్లేదు
  • చంద్రబాబు మైండ్‌సెట్‌లోనే ఉన్న ఆయన మంత్రులకు ఎకనమిక్స్ తెలుసా లేదా అని అనుమానం వస్తుంది
  • రగ్నర్ నర్క్స్ అనే ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త పేదరికం మీద మంచి సిద్ధాంతం చెప్పారు
  • పేద దేశాలు, రాష్ట్రాలు అలాగే ఉండటానికి కారణమేంటో వివరించారు
  • సమాజం గానీ, రాష్ట్రంగానీ, దేశం గానీ అభివృద్ధిలో ముందుకు వెళ్లలేకపోవడానికి కారణం పెట్టుబడులకు కావల్సినంత డబ్బు అందుబాటులో లేకపోవడం
  • దీన్ని లో కేపిటల్ ఫార్మేషన్ అంటారు
  • దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే.. ఆదాయాలు తగ్గుతాయి, దానివల్ల పొదుపు కూడా తగ్గుతుంది. పొదుపు తగ్గితే పెట్టుబడులకు డబ్బులు తగ్గుతాయి
  • పెట్టుబడులు తగ్గితే ఉత్పత్తి తగ్గి దాని ప్రభావం ఆదాయం మీద పడుతుంది
  • ఇదంతా ఒక విషవలయం లాంటిది
  • కొనుగోలు శక్తి ప్రభుత్వాలు పెంచకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆయన చెప్పారు
  • వస్తువులు, సేవలను కొనలేరు కాబట్టి డిమాండ్ తగ్గుతుందని, దాంతో పెట్టుబడులు తగ్గి, ఉత్పత్తి తగ్గుతుందని.. చివరకు ఉద్యోగావకాశాలు తగ్గి మళ్లీ ఆదాయం తగ్గిపోతుందని, దాంతో ప్రజలు వేటినీ కొనలేరని వివరించారన్నారు
  • రాజశేఖరరెడ్డి గారి హయాంలో రైతులకు శాశ్వతంగా ఆదాయం ఉండేలా దారి చూపించారు
  • అప్పట్లో కనీస మద్దతుధర 530 నుంచి 1030 రూపాయలకు కూడా పోయింది
  • రైతులకు ఉత్పత్తి వ్యయం తగ్గడం కోసం ఉచితంగా కరెంటు ఇచ్చారు
  • దాంతో రైతులు, ప్రజల ఆదాయస్థాయిని పెంచగలిగారు
  • ప్రజలు ఖర్చుపెట్టగల ఆదాయాన్ని కూడా పెంచారు
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా, ఆరోగ్యశ్రీ ద్వారా ఇది సాధ్యమైంది
  • దీంతో వాళ్లు పెట్టాల్సిన ఖర్చు తగ్గి, ఖర్చుచేయగల ఆదాయం పెరిగింది
  • మిగిలిన దేశం మొత్తం 47 లక్షల ఇళ్లు కడితే ఒక్క సమైక్యాంధ్రప్రదేశ్‌లోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు
  • జలయజ్ఞానికి 48వేల కోట్లు ఖర్చుచేశారు. అందువల్ల సిమెంటు, స్టీలు, లేబర్, ట్రాన్స్‌పోర్టు డిమాండ్ పెరిగింది
  • ఇలా డిమాండ్ పెరగడం వల్ల, ప్రజల ఆదాయం పెరగడం వల్ల ఏపీలో ఐదేళ్లలో నమోదైన గ్రోత్ రేటు దేశంలో ఎక్కడా, ఎప్పుడూ నమోదు కాలేదు
  • ఇప్పటికే చంద్రబాబు పుణ్యమాని గూండాయిజం, అవినీతి, వ్యవస్థలను మేనేజ్ చేయడం, దోచుకోవడం, ఎమ్మెల్యేల కొనుగోలు, వారికి ఉప ఎన్నికలు లేకుండా చూడటం, గ్రామాల్లో ఇసుక నుంచి ప్రతీదీ దోపిడీ చేయడంలో చంద్రబాబు గ్రోత్‌ రేటు త్రిబుల్ డిజిట్ చూపించారు. 
  • ప్రత్యేక హోదాను నీరుగార్చే వ్యవహారం గట్టిగా జరుగుతోంది
  • వాళ్ల స్వార్థం కోసం 5 కోట్ల ప్రజలను నడివీధిలో నిలబెడుతున్నారు
  • ప్రత్యేక హోదా వస్తే ఏపీ 29 రాష్ట్రాల్లో నెంబర్ వన్ అవుతుందనడంలో నాకు అనుమానం లేదు
  • లక్షల సంఖ్యలో ఉద్యోగాలు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయనేవి ఎవరూ ఖండించలేని సత్యం
  • ప్రత్యేక హోదా వస్తేనే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని, నో వేకెన్సీ బోర్డులు పోయి వాంటెడ్ బోర్డులు వస్తాయి
  • ఇలాంటి ప్రత్యేక హోదా మీద అబద్ధాలు చెబుతున్నారు
  • ఎవరైనా గట్టిగా అడిగితే, ఉద్యమిస్తే నిర్దాక్షిణ్యంగా పీడీ యాక్టులు పెడుతున్నారు
  • బంద్ పిలుపు ఇస్తే దగ్గరుండి బస్సులు తిప్పుతున్నారు
  • మనం ప్రత్యేక హోదా అడిగితే పీడీ యాక్టు పెట్టమని చెబుతున్న, హోదాను అమ్మేసిన ముఖ్యమంత్రి మీద టాడా యాక్టు పెట్టినా తప్పుందా అని అడుగుతున్నా
  • వీళ్లు చెబుతున్న అబద్ధాలకు సమాధానం చెబుతా
  • అరుణ్ జైట్లీ నుంచి, వెంకయ్య నుంచి చంద్రబాబు వరకు చేసిన ప్రధాన ఆరోపణలు ఇవీ
  • ఏ రాష్ట్రానికీ ఇవ్వని విధంగా 25 సంస్థలు ఏపీకి ఇచ్చామని, నిధులు ఇచ్చామని జైట్లీ అన్నారు
  • ఒక రాష్ట్రానికి ఇంత సాయం చేయడం ఎక్కడా చూడలేదని వెంకయ్య
  • ప్రత్యేక హోదా వల్ల కేంద్ర సాయంలో 90 శాతం కేంద్రం భరించడం తప్ప వేరే ఉపయోగం లేదని అన్నారు
  • మీరు చెబుతున్న ఐఐటీలు, ఐఐఎంల లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కోటి జనాభా దాటిన ప్రతి రాష్ట్రంలో ఉండాలని గతంలో యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
  • కోటి జనాభా దాటినవి 20 ఉన్నాయి. ఉన్నవి 22 ఐఐటీలు, 30 41 ఎన్ఐటీలు, 19 ఐఐఎంలు, 19 ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. 
  • ఆంధ్రప్రదేశ్‌కు ఇవి ఇవ్వడం ఇదేదో దానం చేయడమా అని అడుగుతున్నా.. అలా ప్రకటనలు చేసి అవమాన పరుస్తున్నారు
  • ఇటీవల గుజరాత్‌లో రైల్వే యూనివర్సిటీని ఎలా ఇచ్చారు? 
  • హైదరాబద్‌లో ఐఐటీసీ, సీసీఎంబీ, హెచ్ఐఎల్, మిథాని, బీడీఎల్, డీఎంఆర్ఎల్, డీఆర్‌డీఎల్, డీఆర్‌డీఓ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎలా కట్టారు?
  • గుజరాత్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో 60 మిలియన్ టన్నుల సాయంతో పెట్రో రిఫైనరీని ఎలా పెట్టారు?
  • చట్టంలో ఉన్నా మనకు చేయాల్సినవి చేయడం లేదు, రైల్వే జోన్ ఇవ్వడం లేదు
  • కనీసం హైదరాబాద్‌లో ఉన్న సంస్థలు ఏ చట్టంలో లేకపోయినా కట్టించారు. వాటన్నింటినీ సీమాంధ్రకు కూడా తెస్తామని కనీసం మీ నోటి నుంచి మాట కూడా రానప్పుడు ఇంత అభివృద్ధి చూడలేదని వెంకయ్య నాయుడు ఎలా చెబుతారు?
  • హైదరాబాద్‌లో ఉన్న సంస్థలన్నీ మన రాష్ట్రానికి ఇస్తామని కూడా చెప్పలేదు
  • ఇలాంటి వ్యక్తికి చంద్రబాబు శాలువాలు కప్పి సన్మానాలు చేస్తారు
  • అసలు హోదా పూర్తిగా ఎగ్గొట్టారు, ప్యాకేజి పేరుతో రోజూ అబద్ధాలు ఆడుతున్నారు
  • ఈ మధ్యకాలంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రణాళికా శాఖ నుంచి ఒక సమాధానం వచ్చింది
  • 2016 సెప్టెంబర్ 8న ప్రత్యేక ప్యాకేజి ఇచ్చామని, దాన్ని ఏపీ పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఇచ్చామని, అందులో పేర్కొన్న అన్నింటినీ నెరవేర్చామని చెప్పారు
  • మనకు ఏ ప్యాకేజి రాకపోయినా, మేలు జరగకపోయినా ఆ పేరుతో రోజూ అబద్ధాలు ఆడుతున్నారు
  • 12వ ఆర్థిక సంఘం 2004-09 వరకు అమల్లో ఉందని, ఆ సమయంలో 35 వేల కోట్లే వచ్చాయని, 13 వ ఆర్థిక సంఘం 2010-15 వరకు ఉందని, అప్పుడు వచ్చింది 69,298 కోట్లేనని, కానీ 14వ ఆర్థిక సంఘంలో ఇప్పటికి 2,03,100 కోట్లు ఇస్తున్నామని ఊదరగొట్టారు     
  • 14వ ఆర్థిక సంఘం నియామకం 2013 జనవరి 1వ తేదీన జరిగింది. వీళ్లు అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రాల అధ్యయనం కూడా పూర్తయింది
  • వీళ్లే కాదు.. ఎవరు అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్‌కు అందే సాయం ఒక ఫార్ములా ప్రకారం వచ్చేదే. 
  • ఐదేళ్లలో 1,69,969 కోట్లను మనకు డెవల్యూషన్ నుంచి (కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నులు) ఇస్తున్నారు
  • యూపీ, ఇతర రాష్ట్రాలకు ఇంతకంటే ఎక్కువే ఇస్తున్నారు
  • రెవెన్యూ లోటును పూడ్చే గ్రాంటును కూడా అందరితోపాటు 22,113కోట్లు ఇస్తున్నారు. 1.94 లక్షల కోట్లు మొత్తం అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు
  • పంచాయతీ రాజ్ వ్యవస్థలకు అన్ని రాష్ట్రాల్లాగే మనకు ఐదేళ్లలో 12వేల కోట్లు ఇచ్చారు
  • మిగిలిన రాష్ట్రాలతో పాటు కలిపి ఇవ్వాల్సింది ఇచ్చారే తప్ప ఒక్క రూపాయైనా అదనంగా ఇచ్చారా అని చంద్రబాబు, జైట్లీ, వెంకయ్య నాయుడులను అడుగుతున్నా
  • ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, లేనివాటి మధ్య వనరుల గ్యాప్ విషయంలో తేడా చూపలేదని మాత్రం అన్నారు.
  • ప్రత్యేక హోదా వద్దని తాము చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ లిఖితపూర్వకంగా చెప్పారు
  • ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు, మోసాలు చేస్తున్నారు
  • ప్రత్యేక హోదా వల్ల కేంద్ర పథకాల్లో 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రం భరించడం తప్ప వేరే ప్రయోజనాలు ఉండవని అంటున్నారు
  • ఆదాయపన్ను మినహాయింపు, సేల్స్ టాక్స్ మినహాయింపు లాంటివి వేరే రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా
  • చివరకు ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రానికి కూడా రాయితీలు కల్పించారు
  • ఇంత దారుణంగా పద్ధతి ప్రకారం మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు
  • ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా మాట్లాడుతున్న ఈ వ్యక్తులను చూసినప్పుడు.. సమాజంలో అనేక అనర్థాలకు కారణం మూర్ఖులు అబద్ధాలను నిజాలుగా చెప్పి వాదిస్తుంటే మేధావులు మౌనంగా ఉండటమే కారణమని బెర్ట్రండ్ రసెల్ అన్నారు
  • ఇప్పుడు నిజంగా అదే సమస్య. అందరం కలిసికట్టుగా గళం విప్పితే తప్ప సాధ్యమయ్యే విషయం కాదు
  • పక్కన అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు.   
  • మరి పార్లమెంటు సాక్షిగా మనకు మాట ఇచ్చినప్పుడు .. దాన్ని సాధించడానికి మనమంతా కలిసికట్టుగా పోరాటం చేయాలని, ఇందులో మీరంతా తోడుగా రావాలని కోరుతున్నా.
  • యూనివర్సిటీల నుంచి వచ్చి సంఘీభావం తెలిపిన ప్రొఫెసర్లు, విజయ్‌కుమార్, సత్యనారాయణ, ఇస్మాయిల్, జేవీ ప్రభాకరరావు, పసుమర్తి శ్రీనివాస సుబ్బారావు, బి. రామకృష్ణారావు, సాంబిరెడ్డి, ఇంకా డాక్టర్ సత్యారావు, అడ్వకేట్ ఈశ్వర్.. ప్రతి

ఒక్కో నిరుద్యోగికి 62 వేలు బకాయి


ఒక్కో నిరుద్యోగికి 62 వేలు బకాయి
హైదరాబాద్‌: చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకుండా అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తుందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ. 2 వేలు నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పి.. ఆ హామీని కూడా తుంగలో తొక్కారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 31 నెలలైనందున.. నెలకు రూ. 2 వేల చొప్పున ప్రతి నిరుద్యోగికి రూ. 62 వేలు బకాయి పడ్డారని భూమన పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు మొత్తం రూ. లక్షా 8 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలోని ఏ ఒక్క నిరుద్యోగికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా.. పెద్ద నిరుద్యోగి అయిన లోకేష్‌కు లక్షా 8 వేల కోట్ల కంటే ఎక్కువ మేలు ప్రభుత్వం చేసిందని భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికల హామీలు, ప్రసంగాలను యూ ట్యూబ్‌ నుంచి తొలగించడం వాస్తవమా కాదా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను తొలగించారన్నారు. 'మీరిచ్చిన వాగ్దానాలు, ప్రకటనలు టీడీపీ కార్యాలయానికి పంపుతాం.. చదివి సిగ్గుతో తలదించుకోండి' అని భూమన ధ్వజమెత్తారు.


ప్రసంగం కొనసాగినంత సేపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన

Written By news on Friday, December 16, 2016 | 12/16/2016


‘బాబును బంగాళాఖాతంలో కలపడం ఖాయం’
నరసరావు పేట: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మోసపూరిత, కుట్ర పూరిత ప్రభుత్వం కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోసపూరిత చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలిపే రోజు వచ్చిందనీ ఆయన హెచ్చరించారు. ప్రజలకు తోడుగా నిలబడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారని నిప్పులు చెరిగారు. గురజాల ఎమ్మెల్యే  చేస్తున్న ఆరాచకాలు అన్నీ ఇన్నీ కావని, రాష్ట్రంలో చాలా దారుణమైన పాలన ఉందని, అది చూసి బాబు కార్యకర్తలు కూడా సిగ్గుపడుతున్నారని తెలిపారు.

శుక్రవారం నరసరావుపేట రెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో అశేష జన సందోహం మధ్య కాసు మహేష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజల హర్షధ్వానాల మధ్య మహేష్ రెడ్డిని పార్టీలో చేర్పించుకుంటున్నట్టు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మషేష్ రెడ్డికి అన్ని వేళల్లో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హాజరైన జనవాహినిని ఉద్దేశించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ, చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత పరిపాలనపై నిప్పులు చెరిగారు.

జగన్ ప్రసంగం కొనసాగినంత సేపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన లభించింది. ప్రజలతో కిక్కిరిసిన రెడ్డి కాలేజీ మైదానం ఇసుకేస్తే రాలనంతగా హాజరయ్యారు. ఆ సభలో జగన్ చెప్పిన ప్రతి మాటకు ప్రజల నుంచి చప్పట్లు కేరింతలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు, అధికారం చేపట్టిన తర్వాత అమలు చేయకపోవడంపై పలు అంశాలను ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ఉటంకించగా అవును... అమలు చేయలేదంటూ ప్రజల నుంచి పెద్దపెట్టిన ప్రతిస్పందనలు వినిపించాయి.

నిజానికి ఈ సభ సాయంత్రం 4 గంటలకే జరగాల్సి ఉండగా, జిల్లాలో అడుగుపెట్టింది మొదలు మార్గమధ్యంలో అన్ని చోట్ల ప్రజలు జగన్ కలవడానికి పెద్ద ఎత్తున తరలిరావడం, ఆయనను నిలువరించి స్వాగతం పలకడం, ఆయనతో కరచాలనం చేయడానికి పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా ఎగబడటంతో ఆయన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకోవడానికి ఆలస్యమైంది. సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన సభ 8 గంటల సమయంలో మొదలైంది. జగన్ అక్కడికి చేరుకోవడం గంటల కొద్దీ ఆలస్యమైనప్పటికీ జనంలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ప్రత్యేకంగా యువకులు పెద్దఎత్తున హాజరు కావడం, ఆయన మాట్లాడుతున్నప్పుడు అడుగడుగునా చప్పట్లు చరుస్తూ, కేరింతలు కొడుతూ ఊత్సాహం ప్రదర్శించడం గమనార్హం.

ప్రస్తుతం రాష్ట్రం అనేక సమస్యలతో సతమతమవుతోందని, ఇలాంటి సమయంలో ప్రజలకు తోడుగా నిలవాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి చెప్పినప్పుడు జనం విశేషంగా స్పందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పినట్టుగా... ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. బతికినంత కాలం ఎలా బతికామన్నది నాయకుడికి ముఖ్యమని జగన్ గుర్తుచేస్తూ ప్రతి కార్యకర్త సగర్వంగా తలెత్తుకునేలా నాయకుడు ఉండాలన్నారు.

అయితే చంద్రబాబు నాయుడును చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని మండిపడ్డారు. నిత్యం అబద్దాలు ఆడటం... మోసాలు చేయడం... ఇదే ఆయన నాయకత్వం అని దుయ్యబట్టారు. చంద్రబాబు మోసాలు, అబద్దాలకు సంబంధించి పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. అవినీతిలో ఏపీని నెంబర్‌ 1 చేసిన ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు... చివరికి ఏమైంది... రైతులను నిలువునా మోసం చేశారు... అవునా... కాదా.. మీరేమంటారు? అని సభికులను ప్రశ్నించినప్పుడు అవును.. అవును అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు. అనంతరం వారినుద్దేశించి చంద్రబాబు పాలన బంగాళా ఖాతంలో పడేందుకు ఇక రెండేళ్ల గడువుందని, కాలం కలిసొస్తే ఏడాదిలోనే పడుతుందని, అప్పటి వరకు వేచి ఉండాలని కోరారు.

అధికారంలోకి వస్తే బ్యాంకుల్లో పెట్టిన బంగారం తెచ్చిస్తామన్నారు. మరి ఆయన ఇప్పుడేం చేశారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారు... మీరేమంటారని మళ్లీ ప్రశ్నించగా అవునంటూ దద్దరిల్లే సమాధానం సభ నుంచి వచ్చింది. ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి చెల్లించడానికి సంబంధించి,  ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన అనేక హామీలను ప్రస్తావించి అధికారం చెపట్టిన తర్వాత ఏ విధంగా మోసం చేశారన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టారు. ఈ రకంగా చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు... నోరు తెరిస్తే మోసం చేయడం మామూలైపోయిందని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

ఇలా అబద్ధాలు చెప్పే... ఈ రకంగా మోసం చేసే నాయకులను బంగాళాఖాతంలో కలపాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. ఇలాంటి నాయకులను బంగాళాఖాతంలో కలపడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కేసులకు భయపడి...
చంద్రబాబు తనపైన కేసులు ఎక్కడ వచ్చి పడుతాయోననీ, ఇప్పటికే ఇరుక్కున్న కేసుల్లో ఎక్కడ తెరమీదకు వస్తాయోనన్న భయంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా అటు కేంద్రంపైన గానీ ఇటు తెలంగాణ ప్రభుత్వంపైన గానీ నోరు మెదపడం లేదని జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పైన తెలంగాణ ప్రాజెక్టులు కట్టి నీటిని ఎత్తుకుపోతుంటే చంద్రబాబు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి ఎమ్మెల్యేలకు ఇక్కడి నుంచి బ్లాక్ మనీని తీసుకెళ్లి సూట్ కేసుల్లో పెట్టి ఇస్తుంటే... ఆ కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారని గుర్తుచేశారు.

ఆ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన ఆ కేసులకు, అవన్నీ బయట పడుతాయని భయపడి చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా మాట్లాడటం లేదని విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు బీజేపీతో కలిసి ప్రత్యేక హోదా తెస్తామన్నారని ఆనాటి ఘటనలను గుర్తూచేస్తూ, ఆ హామీతోనే ఆరోజు రాష్ట్రాన్ని విడదీశారని విడమరిచి చెప్పారు. అదే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు రాష్ట్రానికి అత్యంత ఆవశ్యకమైన ప్రత్యేక హోదా గురించి అడిగే పరిస్థితి లేరని పేర్కొంటూ అందుకు కారణాలను విశ్లేషించారు. గడిచిన రెండున్నరేళ్లలో చంద్రబాబు విచ్చలవిడి అవినీతి పాల్పడ్డారని, కేంద్రాన్ని ఏమనడిగినా తన అవినీతిపై సీబీఐ విచారణ జరిపిస్తారని భయపడి అడగటం లేదని చెప్పారు.

ఇప్పుడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారు. ప్రజలను విస్మరించిన చంద్రబాబు, ఆయన పాలన అంతం కావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజలిచ్చే తీర్పుతో నాయకులు ఇక అబద్దాలు చెప్పాలంటే... మోసం చేయాలంటే... భయపడే పరిస్థితి రావాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బాబు మోసాలకు, అబద్దాలకు ఫలితంగా ఆయనను బంగాళాఖాతంలో కలిపే రోజు తప్పదని చెప్పారు. ఈరోజు పార్టీలో చేరిన మహేష్ రెడ్డి తన తమ్ముడి లాంటి వాడని, ఆయనను అందరూ ఆశీర్వదించాలని జగన్ ప్రజల హర్షధ్వానాల మధ్య కోరారు. ఇక్కడ రాజకీయంగా ఎలాంటి గందరగోళం ఉండదని స్పష్టం చేశారు.

రైతుల కడుపుకొట్టి చెరువు మట్టితో టీడీపీ నేతల వ్యాపారాలు


మైనింగ్‌ ఆపకుంటే దీక్షకు దిగుతా: వైఎస్‌ జగన్‌
గుంటూరు: రైతుల కడుపుకొట్టి చెరువు మట్టితో టీడీపీ నేతలు వ్యాపారాలు చేస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుద్దపల్లిలో రైతుల దీక్షకు మద్దతు తెలిపిన వైఎస్‌ జగన్‌ అక్కడే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మూడు రోజులుగా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో రైతులు దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార పార్టీ నేతల అక్రమ క్వారీలకు వ్యతిరేకిస్తూ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. ఎమ్మేల్యే నరేంద్ర వ్యాపారానికి చంద్రబాబు మద్దతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకింత నీకింత అంటూ కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పారు. చెరువులో మైనింగ్‌ వెంటనే ఆపేయాలని లేదంటే తానే దీక్ష చేస్తానని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.  

వైఎస్ఆర్‌ సీపీలో చేరిన కాసు మహేష్‌ రెడ్డి


వైఎస్ఆర్‌ సీపీలో చేరిన కాసు మహేష్‌ రెడ్డి
నరసరావు పేట: రాజన్న రాజ్యం వచ్చే వరకు విశ్రమించబోమని అప్పటి వరకు వరకు వైఎస్‌ జగన్‌ వెంట ఉండి పోరాడుతా అన్నారు కాసు మహేష్‌ రెడ్డి.  ఆయన శుక్రవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున జేజేల నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.

గుంటూరు జిల్లా నరసరావు పేటలో శుక్రవారం సాయంత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలల్లో వచ్చారు. సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా కాసు మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. 'పౌరుషాలకు, ప్రతాపాలకు మారు పేరు పల్నాడు. ఏపీలో దుర్మార్గపు పాలన జరగుతోంది. చంద్రబాబు నియంతలా పాలిస్తున్నారు. నాగార్జున సాగర్‌ ను శ్మశానం చేసే కుట్ర చేస్తున్నారు. ప్రజల రుణం తీర్చుకునేందుకే వైఎస్‌ఆర్‌ సీపీలోకి వచ్చా. జగన్‌ ను సీఎం చేసి ఈ ప్రాంతానికి పట్టిన శని వదిలిద్దాం' అన్నారు.

ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్


ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్
విజయవాడ : గుండెకు సంబంధించిన సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందిగామ జెడ్పీటీసీ ప్రమీలారాణిని వైఎస్ స్సార్ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్, ఆమెకు ధైర్యం చెప్పారు. ప్రమీలారాణి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆమె రమేష్ ఆస్పత్రిలో చేరారు.
 
ప్రమీలారాణిని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ చేబ్రోలు మండలం నుద్దపల్లికి బయలుదేరారు. అధికార నేతల అక్రమ క్వారీలను వ్యతిరేకిస్తూ మూడు రోజులుగా రైతులు చేస్తున్న దీక్షకు మద్దతిచ్చేందుకు ఆయన నుద్దపల్లికి వెళ్లారు. రైతుల దీక్షకు మద్దతు తెలుపుతూ వైఎస్ జగన్ కూడా ఈ దీక్షలో పాల్గొననున్నారు. 
 
 
 
 

చంద్రబాబు ముందే సర్దేసుకున్నారు


'చంద్రబాబు ముందే సర్దేసుకున్నారు'
విజయవాడ :
పెద్దనోట్ల రద్దు చంద్రబాబుకు ముందే తెలుసని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాను క్రెడిట్ తీసుకుందామని ఆయన మోదీకి ముందుగా లేఖ రాశారని చెప్పారు. పెద్దనోట్ల రద్దు ప్రక్రియ అంతా సాఫీగా జరిగి ఉంటే చంద్రబాబు దాని క్రెడిట్ తీసుకునేవారని, కానీ ఇప్పుడు బాగా జరగలేదు కాబట్టి మోదీ బ్యాడ్ అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, ఆయన అనుయాయులు అన్నీ ముందే చక్కబెట్టేసుకున్నారని ఆరోపించారు. నోట్ల రద్దుకు సరిగ్గా రెండు రోజుల ముందే హెరిటేజ్ షేర్లను ఆయన ఫ్యూచర్ గ్రూపునకు అమ్మేశారని, ఇది ఎలా చేయగలరని ప్రశ్నించారు. ఐటీ దాడుల్లో పెద్దపెద్దోళ్ల ఇళ్లల్లో కోట్లకు కోట్ల కొత్తనోట్లు దొరుకుతున్నాయనని.. బీదవాళ్లు మాత్రం క్యూలో నిలబడి గట్టిగా రెండు వేలు తెచ్చుకోలేకపోతున్నారని ఆయన చెప్పారు. ఇది బ్లాక్‌మనీ మీద పోరాటమా లేక పేదలను కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలనే ఆరాటమా అని ప్రశ్నించారు. 
 
పెద్దనోట్ల రద్దు అనేది నల్లధనానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం కాదని, పన్నుల పరిధిలోకి మరింతమందిని తీసుకురావాలన్న దృక్పథంతోనే ఇది జరుగుతోందని అన్నారు. మొత్తం రద్దయిన 14.5 లక్షల కోట్లలో ఇప్పటికే 13 లక్షల కోట్లు వచ్చేశాయని, నెలాఖరులోగా మిగిలిన డబ్బులు కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. మన దేశంలో 90 శాతం నగదు ఆధార ఆర్థిక వ్యవస్థేనని తెలిపారు. వ్యవసాయ రంగం మొత్తం నగదు లావాదేవీల మీదే ఆధారపడి ఉందన్నారు.

అర్ధరాత్రి దౌర్జన్యం చేసినా పట్టదా?


ఒక సర్పంచి.. తనకు నచ్చిన పని చేసినందుకు అతడిని భయభ్రాంతులకు గురిచేసేలా అర్ధరాత్రి వచ్చి దుండగులు దౌర్జన్యం చేసినా రాజధాని ప్రాంతంలో ఉన్న పోలీసులకు పట్టదా అని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణాజిల్లా విజయవాడ శివారులోని నిడమానూరు సర్పంచ్ కోటేశ్వరరావు కారును కొంతమంది గుర్తుతెలియని దుండగులు తగలబెట్టడమే కాక.. ఆయన కార్యాలయానికి తాళం వేసి, పంచాయతీ ఆఫీసులోకి సర్పంచిని వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. తగలబడిన కారును పరిశీలించిన అనంతరం సర్పంచ్ కోటేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

నేడు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌


నేడు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌
గుంటూరు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావు పేటకు వెళుతున్నారు. అక్కడ ఆయన ప్రజలతో మమేకమవడమే కాకుండా పార్టీ కార్యకర్తలను కలుస్తారు.

వైఎస్‌ జగన్‌ సమక్షంలో మాజీ సీఎం కాసు బ్రహ్మనందరెడ్డి మనవడు కాసు మహేష్‌ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి వైఎస్‌ఆర్‌ సీపీలో చేరుతారు. అనంతరం నరసరావు పేట రెడ్డి కాలేజీ గ్రౌండ్‌ లో సా.4గంటలకు జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టనున్నారు.

9న విజయనగరంలో వైఎస్ జగన్ యువభేరి

Written By news on Thursday, December 15, 2016 | 12/15/2016

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19న విజయనగరంలో యువభేరీ జరగనుంది. పూల్ బాగ్ రోడ్డులోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు కోలగట్ల వీరభద్రస్వామి, ధర్మాన కృష్ణదాసులు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియజేసేందుకే యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్ సీపీ నేతలు పేర్కొన్నారు.

అనంతరం ఇటీవల హైదరాబాద్ లోని నానక్ రాంగూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో బాధితుల  కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ మేరకు చిలకపల్లి, సుభద్ర గ్రామాల్లోని బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ కలుసుకుంటారని వీదభద్రస్వామి, ధర్మాన కృష్ణ ప్రసాద్  తెలిపారు

రేపు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌


రేపు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌
గుంటూరు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావు పేటకు వెళుతున్నారు. అక్కడ ఆయన ప్రజలతో మమేకమవడమే కాకుండా పార్టీ కార్యకర్తలను కలుస్తారు.

ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి రేపు వైఎస్‌ జగన్‌ సమక్షంలో కాసు మహేష్‌ రెడ్డి వైఎస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారు. అనంతరం నరసరావు పేట రెడ్డి కాలేజీ గ్రౌండ్‌ లో సా.4గంటలకు జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టనున్నారు.

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల అరాచకం

Written By news on Wednesday, December 14, 2016 | 12/14/2016


గుంటూరు: రాష్ట్రంలో అధికార పార్టీల నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో టీడీపీ నేతలు మరోసారి బరి తెగించారు.

గ్రామంలోని చెరువులో టీడీపీ నేతలు అక్రమంగా క్వారీయింగ్ కు పాల్పడ్డారు. గమనించిన స్థానిక రైతులు బుధవారం వారిని అడ్డుకోవడానికి యత్నించగా రైతులపై నేతలు దాడులకు దిగారు. ఈ దాడుల్లో రైతులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసరావు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన రైతులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల తీరుపై రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

మంత్రి దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా చూసింది


'మంత్రి దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా చూసింది'
అనంతపురం :
చేతగాని మంత్రి పరిటాల సునీత చేసిన దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా చూసిందని వైఎస్ఆర్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. కనగానపల్లె ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన వ్యవహారాన్ని ఆయన తప్పుబట్టారు. పోలీసు వ్యవస్థ మీద తాము నమ్మకం ఉంచి.. ఇక్కడ ఏదో జరుగుతోందన్న విషయాన్ని డీజీపీకి, ఎస్పీకి, కలెక్టర్‌కు ముందుగానే చెప్పామని ఆయన అన్నారు. కానీ అసలు ఎన్నిక అన్నది జరగకుండానే ఆర్డీవో డిక్లరేషన్ ఇచ్చేశారని.. ఇది ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. అసలు ఎంపీపీ ఉప ఎన్నికలో ఎవరూ చేతులు ఎత్తలేదని, సంతకాలు చేయలేదని.. వాళ్లు తమ సభ్యులను బలవంతంగా ఒత్తిడి చేసి దౌర్జన్యం చేశారని అన్నారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికను రద్దు చేయాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
 
తమ తరఫున ఉన్న బిల్ల రాజేంద్ర, వెంకట్రామిరెడ్డి ఇద్దరినీ కొట్టారని చెప్పారు. సాక్షాత్తు సీఐ కూడా లోపలే ఉండి దౌర్జన్యం చేశారన్నారు. ఇప్పటికీ ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు తమతోనే ఉన్నారని ఆయన చెప్పారు. రాజేంద్ర, వెంకట్రామిరెడ్డి తమ జీపు ఎక్కేందుకు వస్తున్నా కూడా పోలీసులు వాళ్లను కొట్టి లాక్కెళ్లిపోయారన్నారు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే వైఎస్‌ఆర్‌సీపీ బీసీ అభ్యర్థి అయిన రాజేంద్రకు మద్దతిచ్చిందని, కానీ మంత్రి పరిటాల సునీత మాత్రం అగ్రవర్ణాల అభ్యర్థిని ఎంపీపీ చేయాలని పట్టుబట్టి, బలవంతంగా నెరవేర్చుకున్నారని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. 
 

పబ్లిసిటీ కోసమే పెద్దనోట్ల రద్దు


'పబ్లిసిటీ కోసమే పెద్దనోట్ల రద్దు'
నరసాపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పబ్లిసిటీ కోసమే ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. పేదలను రోడ్డుపాలు చేసి పెద్దలకు మేలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్యులను రోడ్డున పడేసిన ఘనత కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలకే దక్కిందన్నారు. ప్రధాని మోదీ తన తల్లి దగ్గరున్న బంగారానికి రశీదులు తేగలరా ? అని ప్రశ్నించారు.
 
కేంద్రం నుంచి అందిన లీకులతోనే నోట్ల రద్దు విషయంలో ముందే జాగ్రత్తపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు ఈ అంశంపై పబ్లిసిటీ స్టంట్ మొదలెట్టారన్నారు. నోట్ల రద్దు నిర్ణయానికి ముందే చంద్రబాబు హెరిటేజ్ వాటాలను అమ్మేసుకున్న విషయం వాస్తవం కాదా? అని  రోజా నిలదీశారు. అంతకు కొద్దిరోజుల ముందు పెద్దనోట్లు రద్దుచేయమని లేఖ రాయడం, ఇప్పుడు నగదురహిత లావాదేవీలు, డిజిటల్ ఏపీ అంటూ ప్రచారాలు చేయడం అంతా డ్రామా అంటూ దుయ్యబెట్టారు. దేశంలో వంద శాతం అక్షరాస్యులే లేనప్పుడు, వంద శాతం నగదురహిత లావాదేవీలు ఎలా సాధ్యమో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలన్నారు. తుందుర్రు ఆక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు.

వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

Written By news on Tuesday, December 13, 2016 | 12/13/2016


హైదరాబాద్‌: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ మంగళవారం వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. హైదరాబాద్‌ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు పాల్గొన్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ వైఎస్‌ఆర్‌ సీపీలో చేరనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

సోమవారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేత కందుల దుర్గేష్ వైఎస్ఆర్ సీపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కొడుకు మహేశ్‌ రెడ్డి ఇటీవల వైఎస్‌ జగన్‌ ను కలిసి పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. ఇతర పార్టీల నుంచి వైఎస్‌ఆర్‌ సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి.

వైఎస్సార్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ

Written By news on Monday, December 12, 2016 | 12/12/2016


వైఎస్సార్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ
హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. దుర్గేష్ తో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో వైఎస్‌ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్ పోరాటాల వల్లే సాధ్యమన్నారు. సీఎం చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. వైఎ‍స్ జగన్ ప్రజల పక్షాన నిలుస్తున్నారన్నారు. అందుకే జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. వైఎస్సార్ సీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని దుర్గేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నాబాబు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న కాలంలో దుర్గేష్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు.

 

Popular Posts

Topics :