18 August 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

న్యాయం చేయలేకపోతే సమైక్యంగా ఉంచండి

Written By news on Saturday, August 24, 2013 | 8/24/2013

న్యాయం చేయలేకపోతే  సమైక్యంగా ఉంచండి
గన్నవరం : సమ న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. దీక్ష విమరణ అనంతరం ఆమె గన్నవరం విమానాశ్రయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. న్యాయం చేయలేనప్పుడు విభజించే హక్కు లేదని అన్నారు. అన్నదమ్ముల్లా ఉన్న రాష్ట్ర ప్రజల మధ్య విభజన చిచ్చు పెట్టారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
తన దీక్షను భగ్నం చేసినా... జగన్ జైల్లో దీక్ష చేపడతానన్నారని ఆమె తెలిపారు. తన ఆరోగ్య దృష్ట్యా దీక్ష విరమించాలని జగన్ కోరారని విజయమ్మ పేర్కొన్నారు. అన్నదమ్ములు లాంటి ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారనే జగన్ కలత చెందాడని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రజలందరి కోసం జగన్‌ దీక్ష చేస్తున్నాడని.... తన బిడ్డను ఆశీర్వదించాలని విజయమ్మ ఈ సందర్భంగా కోరారు.  రాష్ట్రానికి, జగన్‌ బాబుకు మంచి జరగాలని ఆమె అన్నారు.

రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ఎన్నో జల యుద్ధాలు ఉన్నాయని, వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని ప్రాంతాలను సమానంగా చూశారన్నారు. విభజిస్తే సీమాంధ్రకు ఉప్పునీళ్లే గతి అన్నారు.శ్రీశైలానికి, నాగార్జున సాగర్‌కు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటున్నారనొ దీనికి నీళ్లు ఎలా ఇస్తారని అన్నారు. మిగులు జలాల ఆధారంగా ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడవని....అందుకే కృష్ణానది ఉన్న ప్రాంతం ఒకే రాష్ట్రంలోఉండాలని విజయమ్మ కోరారు. అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని సూటిగా ప్రశ్నలు సంధించారు.

రాష్ట్ర బడ్జెట్లో 45 శాతానికిపైగా ఆదాయం హైదరాబాద్‌ నుంచే వస్తోందని...తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్‌ ఇస్తే.. మిగతావాళ్ల పరిస్థితి ఏంటని విజయమ్మ అడిగారు. అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసని...ఆదాయం అంతా ఒకే ప్రాంతానికి పోతే మిగతావాళ్ల పరిస్థితి ఏంటన్నారు. రాష్ట్రంలో సంక్షేమ రాష్ట్రాలు ఎలా నడవాలి... ఎలా నడిపించాలన్నారు. సీమాంధ్రలో చదువుకునే యువతకు ఉద్యోగాలు ఎక్కడనుంచి వస్తాయని, హైదరాబాద్‌లో ఉంటున్నవారికి ఎలా భద్రతను కల్పిస్తారని అడిగారు.
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలని విజయమ్మ డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంవల్ల గతంలో విభజన వెనక్కిపోయిందని విజయమ్మ అన్నారు. అయితే  ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆపని ఎందుకు చేయలేకపోయారని ఆమె అడిగారు. ఎమ్మెల్యేల చేత కూడా ఆయన ఎందుకు రాజీనామాలు  చేయించలేకపోయారని...సుమారు 89 మంది ఎమ్మెల్యేలు ఉండికూడా చంద్రబాబు ఆపని చేయలేకపోయారన్నారు. రాజీనామా చేసి చంద్రబాబు ప్రజల్లోకి వస్తే బాగుంటుందన్నారు.

రేపటి నుంచి జైలులోనే జగన్ ఆమరణదీక్ష

రేపటి నుంచి జైలులోనే జగన్ ఆమరణదీక్ష
హైదరాబాద్: వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు వైఎస్ జగన్మోహన రెడ్డి రేపటి నుంచి చంచల్ గూడ జైలులో ఆమరణదీక్ష చేపట్టనున్నారు.  రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆరు రోజుల పాటు సమరదీక్ష చేసిన విషయం తెలిసిందే. తల్లి ఆరోగ్యం క్షీణించడంతో జైలు అధికారుల అనుమతితో జగన్ ఆమెతో ఫోన్ లో మాట్లాడి నచ్చజెప్పి దీక్ష విరమింపజేశారు. ఈ నేపధ్యంలో జగన్ జైలులోనే రేపటి నుంచి ఆమరణదీక్ష చేపట్టాలని నిర్ణయించారు.

జగన్ సతీమణి వైఎస్ భారతి ఈరోజు ఉదయం జైలులో జగన్ ను కలిశారు. ఆమెతోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా జైలు లోపలకు జగన్ ను కలిసేందుకు వెళ్లారు. వారు బయటకు వచ్చిన తరువాత పూర్తి  వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ప్రజా ఉద్యమాలకు వైఎస్ ఆర్ సిపి నాయకత్వం వహిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు చెప్పారు

Jagan to take up indefinite fast from tomorrow

Jagan to take up indefinite fast from  tomorrow

'విజయమ్మ దీక్ష భగ్నానికి కాంగ్రెస్, టీడీపీల కుట్ర

'విజయమ్మ దీక్ష భగ్నానికి కాంగ్రెస్, టీడీపీల కుట్ర'
హైదరాబాద్: : రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన సమర భేరీ దీక్షను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుట్రపన్ని భగ్నం చేశాయని ఆ పార్టీ అధికర ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. శనివారం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
 
గత అర్థరాత్రి విజయమ్మ దీక్షపై పోలీసులు వ్యవహారించిన తీరు పట్ల జూపూడి ఆగ్రహాం వ్యక్తం చేశారు. సమరభేరి దీక్షతో తీవ్ర అనారోగ్యానికి గురైన విజయమ్మను పోలీసు వ్యాన్ లో తీసుకువెళ్లడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ముందుగా  అంబులెన్స్ ను ఎందుకు సిద్ధం చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులు, ప్రభుత్వం, ప్రతిపక్షం కుమ్మక్కు అయి విజయమ్మ దీక్షను భగ్నం చేశాయని ఆయన పేర్కొన్నారు.
 
రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతలకు సమన్యాయం కోసం ఒక్క వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీనే పోరాడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆ అంశంపై మిగతపార్టీలు గోడమీద పిల్లివాటంలా తయారయ్యాయని అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల నుంచి పుట్టిన మహా ఉద్యమంగా భావిస్తున్నామని జూపూడి ప్రభాకర్ రావు అభివర్ణించారు

జగన్ నచ్చజెప్పడంతో దీక్ష విరమించిన విజయమ్మ

జగన్  నచ్చజెప్పడంతో దీక్ష విరమించిన విజయమ్మవిజయమ్మవిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
గుంటూరు: వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమరదీక్షను విరమించారు. ఆమె ఆరోగ్యం పూర్తీగా క్షీణించిన పరిస్థితులలో పార్టీ అధ్యక్షుడు, కుమారుడు వైఎస్ జగన్మోహన రెడ్డి నచ్చజెప్పడంతో విజయమ్మ దీక్ష విరమించారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో విజయమ్మ
గుంటూరులో ఆమరణదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.  తీవ్ర ఉద్రిక్తతల మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.55 గంటలకు పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు.   ఆమె ఆరోగ్యం బాగా క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. తక్షణం దీక్ష విరమించాలన్న వారి విజ్ఞప్తిని ఆమె తిరస్కరించారు. దాంతో వారు బలవంతంగా పోలీస్ వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో కూడా ఆమె దీక్ష కొనసాగించారు.  ఇదే విధంగా దీక్ష కొనసాగిస్తే ప్రమాదకరం అని వారు హెచ్చరించారు. ఆమె మూత్రపిండాలు పాడయ్యే అవకాశముందన్నారు. తక్షణం వైద్యచికిత్స అందించకుంటే మెదడు మీదా ప్రభావం చూపుతుందని చెప్పారు. కీటోన్ బాడీస్ విడుదలవుతున్నట్లు తేలిందని, ఇది ప్రమాదకరమని  వైద్యులు తెలిపారు. కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరించారు. అయినా ఆమె వినలేదు. దీక్ష కొనసాగిస్తానని చెప్పారు.

ఈ పరిస్థితులలో జైలు అధికారుల సహకారంతో జగన్ ఫోన్ లో మాట్లాడారు. ఆరోగ్యకారణాల రీత్యా దీక్ష విరమించమని తల్లికి ఆయన నచ్చజెప్పారు. తొలుత ఆమె జగన్ చెప్పినా వినలేదు. ఉద్యమాన్ని కొనసాగిద్దామని, దీక్ష విరమించమని ఆయన కొద్దిసేపు నచ్చజెప్పిన తరువాత విరమించడానికి ఆమె అంగీకరించారు

సీమాంధ్ర అంతటా బంద్

విజయమ్మ దీక్ష భగ్నం:సీమాంధ్ర అంతటా బంద్
గుంటూరు: వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమరదీక్షను భగ్నం చేసినందుకు, ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లిన తీరుకు నిరసనగా సీమాంధ్ర అంతటా బంద్ పాటిస్తున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో విజయమ్మ గుంటూరులో ఆమరణదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్దరాత్రి దాటిన తరువాత పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేయడం పట్ల, అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా వైఎస్ఆర్ సిపి సీమాంధ్ర బంద్ కు పిలుపు ఇచ్చింది.  ఈ పిలుపుకు సీమాంధ్ర అంతటా అపూర్వ స్పందన లభిస్తోంది.

సీమాంధ్రలోని 13 జిల్లాలలో బంద్ పాటిస్తున్నారు. వ్యాపార సంస్థలను మూసివేశారు. వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. విజయవాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతి వంటి పట్టణాలలో వైఎస్ఆర్ సిపి నేతలు, కార్యకర్తలు ఆందోళనా కార్యక్రమాలు ఉధృతం చేశారు.

గుంటూరు జిల్లా  తెనాలిలో వైఎస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో   రాస్తా రోకో చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మాజీ జడ్పీ ఛైర్మన్‌ సుబ్రమణ్యంరెడ్డి ఆధ్వరంలో బంద్‌ నిర్వహిస్తున్నారు.
వైఎఎస్ఆర్ జిల్లా కడప అప్సర సర్కిల్‌ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. పులివెందులలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరులో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో బంద్‌ పాటిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో  బంద్‌ జరుగుతోంది. ఎమ్మెల్యే బాలరాజు   పశ్చిమ గోదావరి జిల్లా బంద్ కు పిలుపు ఇచ్చారు. తాడేపల్లి గూడెంలో పార్టీ  అధ్యక్షుడు తోట గోపి ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహిస్తున్నారు. అనంతపురంలో  వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు రహదారులను దిగ్బంధినం చేశారు. వారి ఆందోళనకు  ఉపాధ్యాయసంఘాలు  మద్దతు తెలిపాయి.  వైఎస్‌ఆర్‌సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహిస్తున్నారు.  గుత్తి, పామిడి, రాప్తాడు, పెనుకొండలలో రహదారులను దిగ్భందించారు. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్‌  వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్నారు.

విశాఖలోని మద్దిలపాలెం, జగదాంబ జంక్షన్, గాజువాకలో సమైక్యవాదుల రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంద్ జరుపుతున్నారు. నెల్లూరు జిల్లాలో  వ్యాపార సంస్థలు  స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.  నెల్లూరు బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్‌లో విద్యార్థులు రాస్తా రోకో చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను కదలనివ్వడంలేదు. విజయవాడలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో కళాశాలలు, దుకాణాలు బంద్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు.

ఆస్పత్రిలోనే విజయమ్మ దీక్ష కొనసాగింపు

గుంటూరు: వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సమరదీక్ష కొనసాగిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఆమె చేపట్టిన ఆమరణదీక్ష ఆరవ రోజుకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు.  బలవంతంగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. కనీసం అంబులెన్స్ కూడా తీసుకురాకుండా అవమానకరంగా ఆమెను పోలీస్ వ్యాన్ లోనే తరలించారు. శిబిరం వద్ద ఉన్న నేతల పట్ల కూడా పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.

అయిదు రోజుల నుంచి ఆమె నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్నందున  విజయమ్మ  ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రభుత్వ వైద్యులు చెప్పారు. తప్పనిసరిగా ఆమె ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే విజయమ్మ మాత్రం అందుకు నిరాకరిస్తున్నారు. ఆస్పత్రిలోనే ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేవరకు దీక్షను కొనసాగిస్తానని ఆమె చెప్పారు. ప్రాణాలైనా వదులుతాను గానీ దీక్ష మాత్రం ఆపనని తెగేసి చెప్పారు.

ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నారు. ఆస్పత్రి లోపలికి పోలీసులు  ఎవరినీ అనుమతించడంలేదు.
sakshi

మరింత క్షీణించిన విజయమ్మ ఆరోగ్యం

మరింత క్షీణించిన విజయమ్మ ఆరోగ్యంవిజయమ్మ
గుంటూరు: రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఆమరణదీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ  ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆమె చేపట్టిన సమరదీక్ష ఆరవ రోజుకు చేరుకుంది. విజయమ్మ ఆరోగ్యంపై  గుంటూరు  ప్రభుత్వాస్పత్రి  వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తక్షణం దీక్ష విరమించాలన్న తమ విజ్ఞప్తిని ఆమె తిరస్కరిస్తున్నట్లు చెప్పారు.

విజయమ్మ ఇదే విధంగా దీక్ష కొనసాగిస్తే ప్రమాదకరం అని వారు హెచ్చరించారు. ఆమె మూత్రపిండాలు పాడయ్యే అవకాశముందన్నారు. తక్షణం వైద్యచికిత్స అందించకుంటే మెదడు మీదా ప్రభావం చూపుతుందని చెప్పారు. కీటోన్ బాడీస్ విడుదలవుతున్నట్లు తేలిందని, ఇది ప్రమాదకరమని  వైద్యులు తెలిపారు.

 విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను తీవ్ర ఉద్రిక్తతల మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.55 గంటలకు పోలీసులు భగ్నం చేశారు.  పోలీసు బలగాలు శిబిరంలోకి దూసుకొచ్చాయి.  నీరసిం చిన విజయమ్మను తమతోపాటు రావాలని, ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు కోరారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు దీక్షవిరమించేది లేదని విజయమ్మ తేల్చి చెప్పారు. అక్కడ ఉన్న నేతలు, కార్యకర్తలు  పోలీసులను అడ్డుకున్నారు. జై జగన్, జై సమైక్యాంధ్ర నినాదాలతో దీక్షా ప్రాంగణం హోరెత్తింది.

కనీసం అంబులెన్స్ కూడా తీసుకురాని పోలీసులు 1.55 గంటలకు బలవంతంగా ఆమెను పోలీసు వ్యాన్‌లోనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సమయంలో పార్టీ  శ్రేణులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. కొందరు నేతలను పోలీసులు వేదికపై నుంచి ఎత్తి పడేశారు. కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని వేదిక పైనుంచి కిందికి తోసేశారు. దీంతో ఆయన కాలికి గాయమయింది.

పోలీసుల వైఖరిని నిరసిస్తూ విజయమ్మ ఆస్పత్రి నుంచి బయటికి వచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. 20 నిమిషాల తర్వాత వైద్యులు వచ్చి ఆమెను ఐసీయూలోకి తరలించారు. కాగా, సర్కారు తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఈరోజు సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

అయితే  ఆస్పత్రిలోనూ విజయమ్మ దీక్షను కొనసాగిస్తున్నారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఐవీ ప్లూయిడ్స్  తీసుకునేందుకు కూడా  ఆమె ఒప్పుకోవడం లేదని వెల్లడించారు. మహానేత సతీమణిని అమానుషంగా తరలించిన తీరుకు నిరసనగా బంద్ కు పిలుపునిస్తున్నట్టు చెప్పారు.  బంద్ కు అందరూ సహకరించాలని కోరారు.
గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను అర్ధరాత్రి దాటాక తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలీసులు భగ్నం చేశారు.



http://www.sakshi.com/news/andhra-pradesh/ys-vijayamma-health-problem-59784

ఉద్యమానికి భయపడే బాబు యాత్ర వాయిదా

ఉద్యమానికి భయపడే బాబు యాత్ర వాయిదా: శోభా నాగిరెడ్డి
 నయవంచనకు మారుపేరైన చంద్రబాబుకు ఎవరినైనా తాకట్టు పెట్టే అలవాటు ఉందని, ఇప్పుడు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. దీక్షా ప్రాంగణం వద్ద శోభా నాగిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం చూసి భయపడే చంద్రబాబు తన ఆత్మ గౌరవ యాత్ర వాయిదా వేసుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పేరు వింటేనే చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతుందని చెప్పారు.

రాష్ట్రం ఎడారిగా మారుతుంటే నోరు మెదపకుండా ఇంట్లో కూర్చున్న చంద్రబాబు తెలుగు జాతికి చేస్తున్న ద్రోహంతో చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. జగన్‌ను నిత్యం తిట్టడమే పనిగా పెట్టుకున్న బాబు, అతని బృందం చంచల్‌గూడ జైలు వద్ద కాపలా కాస్తే మంచిదని సూచించారు. నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న జగన్‌పై విమర్శలు చేయడం సూర్యుడిపై ఉమ్మేయడమేనన్నారు. సోనియా డైరక్షన్‌లోనే సీఎం కిరణ్, చంద్రబాబు యాక్షన్ చేస్తున్నారని, అందులో భాగంగానే అప్పుడప్పుడు తమ పాత్రలు కూడా మార్చుకుంటున్నారని దుయ్యబట్టారు.

వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీలు

రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమర దీక్షకు మద్దతుగా శుక్రవారం గుంటూరు నగరంలో  భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యం వహించిన ఈ ర్యాలీని ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. డప్పుల మోత.. పాటలు, నృత్యాలు.. సమైక్య నినాదాలతో నగరంలోని రోడ్లన్నీ  మార్మోగాయి. యువత, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మహిళలు, యువకులు, వృద్ధులు అందరూ కూడా జై జగన్ నినాదాలు చేస్తూ లాడ్జిసెంటర్ నుంచి నడుచుకుంటూ బస్టాండ్ వద్ద సమరదీక్ష శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలియజేశారు. 


సమన్యాయం చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు జాతికి ద్రోహం చేస్తుంటే.. నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ద్రోహపూరితంగా వ్యవహరిస్తోందంటూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ వైఖరులకు నిరసనగా నినాదాలు చేస్తున్నారు. వై.ఎస్.విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు శుక్రవారంతో ఐదు రోజులు పూర్తయ్యాయి. ఓ వైపు ఆరోగ్యం క్షీణిస్తున్నా, లెక్కచేయకుండా మొక్కవోని పట్టుదలతో ఆమె కొనసాగిస్తున్న దీక్షను అన్ని వర్గాల వారూ అభినందిస్తున్నారు. కేవలం సీమాంధ్ర జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి కూడా మహిళలు శుక్రవారం దీక్షకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

కూర్చోలేని స్థితిలో విజయమ్మ
సుగర్, బీపీ లెవల్స్ సాధారణ స్థాయి కంటే గణనీయంగా తగ్గడంతో విజయమ్మ శుక్రవారం పూర్తిగా నీరసంగా కనిపించారు. కూర్చోలేని స్థితిలోఆమె దీక్షా వేదికపై ఎక్కువ సేపు పడుకున్నారు. ఓ వైపు పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్యవాదులు గుంటూరుకు చేరుకుని దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఆమెను చూసేందుకు బారులు తీరారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు పలు దఫాలుగా విజయమ్మకు పరీక్షలు జరిపి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. పల్స్ రేటు పడిపోవడంతో విజయమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది. అయినప్పటికీ పట్టువదలని విజయమ్మ అకుంఠిత దీక్ష చూసిన రాజకీయ విశ్లేషకులు, సమైక్యాంధ్రను కాంక్షించే మేధావులు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధిపై వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధిని అభినందిస్తున్నారు.

కంటతడి పెడుతున్న జనం
దీక్ష ప్రారంభించి ఐదు రోజులు కావడంతో బాగా నీరసపడిన విజయమ్మను చూసి శిబిరంలో మహిళలు, వృద్ధులు కంటతడి పెట్టుకున్నారు. ఎవరికి వారు ఆమెను చూసేందుకు క్యూలో ముందుకు కదుల్తూనే ‘దేవుడా.. ఆ మహాతల్లికి ఏమీ జరగకుండా దీవించయ్యా..’ అంటూ వేడుకొన్నారు. ఒక్కొక్కరూ చేతులెత్తి నమస్కరిస్తూనే పూర్తిగా నీరసపడిన విజయమ్మను చూసి తట్టుకోలేక భావోద్వేగానికి లోనయ్యారు. వృద్ధులైతే అక్కడే ఏడ్చారు.

జనాల ఒత్తిడిలోనూ చంటిబిడ్డలను భుజాలకెత్తుకుని ఆమెకు అభివాదం చేయించారు. శుక్రవారం దీక్షకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు ఖమ్మంకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏలూరుకు చెందిన పసుపులేటి సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘ మహిళలంతా తరలివచ్చారు. కర్నూలు నగరానికి చెందిన వృద్ధురాలు ఒకరు.. జూనియర్ ఇంటర్ చదువుతున్న తన మనుమరాలిని తోడుగా తెచ్చుకుని మరీ విజయమ్మను చూసేందుకు వచ్చానని చెప్పింది. ఆమె చేస్తున్న దీక్ష వృథాకానివ్వమని.. రాష్ట్ర ప్రజలకు పూర్తిన్యాయం జరిగేంతవరకు విజయమ్మకు మహిళాలోకమంతా బాసటగా నిలుస్తుందని ఘంటాపథంగా చెప్పింది.

ఆకట్టుకుంటున్న ప్రసంగాలు
దీక్షలో పాల్గొంటున్న వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు, పొలిటికల్ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ నేతలు.. విభజనతో జరిగే నష్టాల్ని సోదాహరణగా వివరిస్తూ చేస్తున్న ప్రసంగాలను జనం ఆసక్తిగా వింటున్నారు. సాగు, తాగునీటి కష్టాలు, హైదరాబాద్‌లో ఉద్యోగాలపై నేతలు చేస్తున్న ప్రసంగాలు ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు దీక్షా వేదిక వద్దకు చేరుకుని విజయమ్మ దీక్షకు అండగా ఉంటామని ప్రతినబూనుతున్నారు.

‘‘కేవలం ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం విభజన ప్రక్రియపై తీసుకున్న నిర్ణయంతో మా భవిష్యత్తు అంధకారంగా మారడమేనా?’’ అని దీక్షా వేదిక వద్ద విజయమ్మను చూసేందుకు వచ్చిన ఉప్పలపాడుకు చెందిన ఇంటర్ విద్యార్థిని పద్మశ్రీ ప్రశ్నించింది. ఇప్పటికే సాగు నీరందక కరువుతో అల్లాడుతున్నామని, ఫ్లోరైడ్‌తో బాధ పడుతూ తాగునీటి కష్టాలు పడుతున్న తమకు ఈ విభజనతో చుక్క నీరు కూడా రాదని, ఏం పంటలు పండించుకోవాలో అర్థం కావడం లేదని ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం పెద్ద చెర్లోపల్లికి చెందిన రైతు కాకర్ల పెద్ద మస్తాన్ వాపోయారు.
 
గుంటూరులో భారీ ర్యాలీ
విజయమ్మ దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, పెదకూరపాడు, తాడికొండ, గుంటూరు నగరం, రూరల్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు తరలివచ్చాయి. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాల్లో లాడ్జి సెంటర్ నుంచి ఆర్టీసీ డిపో వద్ద ఉన్న దీక్షా వేదిక వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా తరలివచ్చిన జనంతో నగరంలో లాడ్జి సెంటర్, శంకర్‌విలాస్, ఫ్లై ఓవర్, హిందూ కళాశాల కూడలి, మార్కెట్ సెంటర్లు కిక్కిరిసిపోయాయి.

విజయమ్మ దీక్ష భగ్నం

* నేడు సీమాంధ్ర బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపు
* గుంటూరులోని దీక్షా శిబిరానికి అర్ధరాత్రి దూసుకొచ్చిన పోలీసులు
* ప్రతిఘటించిన విజయమ్మ, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు.. తీవ్ర ఉద్రిక్తత
* విజయమ్మను బలవంతంగా పోలీసు వ్యాన్‌లో ఆస్పత్రికి తరలించిన ఖాకీలు
 
సాక్షి, గుంటూరు: రాష్ట్ర విభజనంటూ జరిగితే అన్ని ప్రాంతాలవారికీ సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలీసులు భగ్నం చేశారు. గుంటూరులో విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్ష శుక్రవారం ఐదో రోజు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అర్ధరాత్రి దాటాక పోలీసు బలగాలు శిబిరంలోకి దూసుకొచ్చాయి.

ఐదు రోజులుగా నిరాహార దీక్షతో నీరసిం చిన విజయమ్మను తమతోపాటు రావాలని, ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు కోరారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు దీక్షవిరమించేది లేదని విజయమ్మ తేల్చి చెప్పారు. ఈ సమయంలో వైవీ సుబ్బారెడ్డి, వాసిరెడ్డి పద్మ, శోభానాగిరెడ్డి సహా పార్టీ నేతలు పోలీసులను అడ్డుకున్నారు. జై జగన్, జై సమైక్యాంధ్ర నినాదాలతో దీక్షా ప్రాంగణం హోరెత్తింది.

కనీసం అంబులెన్స్ కూడా తీసుకురాని పోలీసులు 1.55 గంటలకు బలవంతంగా ఆమెను పోలీసు వ్యాన్‌లోనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సమయంలో పార్టీ  శ్రేణులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. కొందరు నేతలను పోలీసులు వేదికపై నుంచి ఎత్తి పడేశారు. కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని వేదిక పైనుంచి కిందికి తోసేశారు. దీంతో ఆయన కాలికి గాయమయింది.

పోలీసుల వైఖరిని నిరసిస్తూ విజయమ్మ ఆస్పత్రి నుంచి బయటికి వచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. 20 నిమిషాల తర్వాత వైద్యులు వచ్చి ఆమెను ఐసీయూలోకి తరలించారు. కాగా, సర్కారు తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శనివారం సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

అయితే  ఆస్పత్రిలోనూ విజయమ్మ దీక్షను కొనసాగిస్తున్నారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఐవీ ప్లూయిడ్స్  తీసుకునేందుకు కూడా  ఆమె ఒప్పుకోవడం లేదని వెల్లడించారు. మహానేత సతీమణిని అమానుషంగా తరలించిన తీరుకు నిరసనగా బంద్ కు పిలుపునిస్తున్నట్టు చెప్పారు.  బంద్ కు అందరూ సహకరించాలని కోరారు. అధికార కాంగ్రెస్ కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు.

విజయమ్మ దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదు

Written By news on Friday, August 23, 2013 | 8/23/2013

విజయమ్మ దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని దళితుల ప్రయోజనాలను ఏ విధంగా పరిరక్షిస్తారో రాష్ట్ర విభజనకు ముందే కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగడానికేనని స్పష్టం చేశారు. విజయమ్మ దీక్ష తెలంగాణ ప్రజలకు, దళితులకూ వర్తిస్తుందన్నారు. విభజన ప్రకటనతో సీమాంధ్రులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు.ప్రస్తుతం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, జేఏసీ నాయకులు మాట్లాడుతున్న భాష దారుణంగా ఉందన్నారు. ‘తెలంగాణలో సీమాంధ్రులకు  రక్షణ కల్పించడం మా బాధ్యత అంటున్నారు. ఇంతకు రక్షణ కల్పించడానికి వారెవరు?’ అని ప్రశ్నించారు.

విభజన జరిగితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కాకుండా పోతాయనే భయం కలుగుతుందన్నారు. తెలంగాణ వచ్చినా, రాకున్నా దళితులకు కావాల్సింది సంక్షేమ పథకాలేనని చెప్పారు. తెలంగాణ పేరుతో దళితుల అభివృద్ధిని అడ్డుకుంటామంటే సహించే  పరిస్థితిలేదన్నారు. దొరలు, భూస్వామ్యుల పెత్తందారి వ్యవస్థను తాము ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోమని సూర్యప్రకాష్ స్పష్టం చేశారు.

ఐదురోజులుగా వైఎస్ అవినాష్ రెడ్డి దీక్ష, విషమంగా ఆరోగ్యం!

కడప

రాష్ట్రానికి సమన్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టినద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఆరోగ్యం విషమంగా మారింది. గత ఐదు రోజులుగా వైఎస్ అవినాశ్‌రెడ్డి ఆమరణ దీక్ష చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అవినాశ్ రెడ్డిని వైద్యులు పరీక్షించారు. ఐదు రోజుల దీక్షలో బ్లడ్‌ షుగర్‌, సోడియం లెవల్‌ ఎక్కువ మోతాదులో తగ్గాయని వైద్యులు తెలిపారు. 


దీక్ష విరమించాలని, లేకపోతే అవినాశ్ రెడ్డి ఆరోగ్యం మరింత విషమంగా మారే ప్రమాదముంది అని వైద్యులు హెచ్చరించారు. అయితే వైద్యుల, పార్టీ నేతల విజ్క్షప్తిని వైఎస్ అవినాష్ రెడ్డి తిరస్కరించారు. 

వైఎస్ విజయమ్మ దీక్షకు బాలశౌరి సంఘీభావం

గుంటూరు: సమన్యాయం కావాలంటూ వైఎఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షకు మాజీ ఎంపీ బాలశౌరి సంఘీభావం తెలిపారు. వందలాది అభిమానులతో దీక్షా ప్రాంగణానికి చేరుకుని తన సంఘీభావాన్ని ప్రకటించారు. గత కొన్ని రోజులుగా దీక్ష చేస్తున్న ఆమెకు శుక్రవారం పలువురు తెలిపారు. వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా నగరంలో శుక్రవారం భారీ సంఘీభావ ర్యాలీ  చేపట్టారు. భారీ ఎత్తున ప్రజలు విజయమ్మకు మద్దతు ప్రకటిస్తుంటడంతో రోడ్లన్నీ జన సందోహమైయ్యాయి. ఆమె చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొంటూ నిరసన చేపట్టారు. లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలమాల వేసి వైఎస్సార్‌సీపీ ర్యాలీ ఆరంభించారు. 
శంకర్ విలాస్, ఓవర్ బ్రిడ్జ్, ఏసీ కాలేజీ సెంటర్, మార్కెట్ సెంటర్, జిన్నా టవర్ సెంటర్‌లు మీదుగా దీక్షా ప్రాంగణానికి చేరుకుంది.  రోడ్లన్నీ సమైక్య నినాదం మార్మోగింది.

వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా భారీ ర్యాలీ

గుంటూరు: వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా నగరంలో శుక్రవారం భారీ సంఘీభావ ర్యాలీ  చేపట్టారు. భారీ ఎత్తున ప్రజలు విజయమ్మకు మద్దతు ప్రకటిస్తుంటడంతో రోడ్లన్నీ జన సందోహమైయ్యాయి. ఆమె చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొంటూ నిరసన చేపట్టారు. లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలమాల వేసి వైఎస్సార్‌సీపీ ర్యాలీ ఆరంభించారు.

శంకర్ విలాస్, ఓవర్ బ్రిడ్జ్, ఏసీ కాలేజీ సెంటర్, మార్కెట్ సెంటర్, జిన్నా టవర్ సెంటర్‌లు మీదుగా దీక్షా ప్రాంగణానికి చేరుకుంది.  రోడ్లన్నీ సమైక్య నినాదం మార్మోగింది.

విజయమ్మ ఆరోగ్యంపై అభిమానుల ఆందోళన

గుంటూరు 23 ఆగస్టు 2013:  సమన్యాయం చేయాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చేస్తున్న సమర దీక్ష శుక్రవారానికి అయిదో రోజుకు చేరింది. గత నాలుగు రోజులుగా ఆమె కేవలం మంచినీటిని మాత్రమే స్వీకరిస్తున్నారు. ఆమె ఆరోగ్యం బాగా క్షీణించినట్లు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు చెప్పారు. తక్షణమే దీక్షను విరమించాలంటూ సూచించారు. శ్రీమతి విజయమ్మ మాత్రం దీక్ష కొనసాగుతుందని  స్పష్టం చేశారు. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రభుత్వ వైద్యులు దీక్షా శిబిరానికి వచ్చి ఆమె ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. రక్త పోటు, చక్కెర స్థాయి బాగా తగ్గిపోయాయని వారు నిర్థారించారు.  ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పెదవి విప్పటంలేదు. మరోవైపు కూర్చొనే ఓపిక లేకపోవడంతో శ్రీమతి విజయమ్మ కొన్నిసార్లు పడుకునే ఉంటున్నారు.
శిబిరానికి తరలివచ్చిన ప్రజలకు అభివాదం కూడా చేయలేకపోతున్నారు. శక్తిని కూడదీసుకుని కూర్చోవడాన్ని  చూసి అక్కడకొచ్చిన వారి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. శ్రీహతి విజయమ్మ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ ఉండటంతో శిబిరం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

దటీజ్ జగన్!

21jagan1
ఎత్తుకు పై ఎత్తు.
వ్యూహానికి ప్రతి వ్యూహం.
తాడిని తన్నానని విర్రవీగేవాడి తలను తన్నటం.
ఇవన్నీ రాజకీయాలలో తలపండిన వారికే సాధ్యమనుకుంటారు. గజకర్ణ గోకర్ణ , టక్కు టమారా విద్యలు వారికే సొంతమని భావిస్తారు. తెల్లవారేలోగా తిమ్మిని బమ్మి చేయగల నేర్పు తమ సొంతమనే నమ్ముతారు.
కానీ ప్రత్యర్థుల మనసులో ఇంకా ఊహ రాకముందే గ్రహించి పాచికలు కదిపి ఓ యువనేత, కాంగ్రెస్ లోని రాజకీయ భీష్ములకు చెమట్లు పోయించాడు. దిగ్గీ రాజాల వంటి దిగ్గజాలను తత్తరపడేటట్లు చేశాడు. చిదంబరాల యెత్తుగడలను చిత్తు చిత్తు చేశాడు. అతడెవరో కాదు, పుకార్ల గాలి కూడా సోకని జైలు గోడల మధ్య కూర్చుని పాచిక వేశాడు.
తెలంగాణ ప్రకటనకు ఒక రోజు ముందే తన శాసన సభ్యులతో రాజీనామా చేశాడు.
తర్వాత అదను చూసి, తన తల్లి విజయమ్మతో పాటు, తాను కూడా చట్ట సభ సభ్యత్వానికి చెల్లు చీటీ ఇచ్చాడు.
ఇప్పుడు ఏకంగా తన మాతృమూర్తినే నిరాహార దీక్షలో కూర్చోబెట్టారు.
ఫలితం?
‘సమైక్యాంధ్ర’ కు తన పార్టీ( వైయస్సార్ కాంగ్రెస్)నే శాశ్వత విలాసం గా చేశాడు. ఇప్పుడిక ఎవరెంత గింజుకున్నా, మాట తప్పని నేతగా సీమాంధ్రగా నిలుస్తాడు. ఎలా? చదవండి.
చాలామంది అనుమానిస్తున్న విషయం ఒకటుంది. వైఎస్ జగన్మోహనరెడ్డికి ఢిల్లీలో వేగులు ఉన్నారు. ఆ వేగులు కూడా.. కాంగ్రెసు పార్టీ అధిష్ఠానం కదలికల్ని గమనించగల, పసిగట్టగల నేర్పురులు. వారు ఎప్పటికప్పుడు జగన్మోహనరెడ్డికి అందగలిగేలా సమాచారం చేరవేస్తున్నారు. ఇక్కడ ఆయన వ్యూహరచన చేస్తున్నారు.
విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. రాష్ట్ర విభజన సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమభావజాలాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కీలక భూమిక జగన్‌దే! కానీ అది అమలులో కొంత జాప్యం జరిగినట్లు సమాచారం. అధ్యక్షుడి ఆలోచనల్ని అందుకుని.. అమలు చేయడంలో రకరకాల సందేహాలకు పోయి.. అనుచరులే జాప్యం చేశారు. ఈ వ్యూహప్రతివ్యూహాల్లోని ప్రచారాలు, వాస్తవాలు ఎలాగైనా ఉండొచ్చుగాక.. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. న్యాయంగా ప్రజలకు జరగవలసిన తీర్పును వారికి దేక్కలా చేయడానికి కాంగ్రెసు సీట్ల రాజకీయాల్లో ఈ రాష్ట్రం బలైపోకుండా పోరాడడానికి ఇవాళ వైఎస్సార్ కాం్రెగెస్ చాలా స్పష్టంగా పోరుబాటను ప్రకటించింది. అన్య పార్టీలు రాజీపడిపోయినా.. జగన్ నిర్దేశకత్వంలో పార్టీ రంగంలోకి స్పష్టతతో దిగింది. అటో ఇటో తేల్చుకోబోతోంది.
వ్యూహాలను మించి వాస్తవాలు ఉంటున్నాయి. ప్రజాప్రయోజనాలే వ్యూహాల గమనాన్ని నిర్దేశిస్తున్నప్పుడు ఇక చింత అక్కర్లేదు. ఆ వ్యూహాలు విఫలమౌతాయేమోననే శంక కూడా అక్కర్లేదు. విజయమ్మ నిరవధిక నిరాహార దీక్షకు ఉపక్రమిస్తున్న ఇలాంటి కీలక నేపథ్యంలో ‘తెలంగాణ వేర్పాటు వాదం.. సమన్యాయం కోరుతున్న వాదం.. సమైక్య వాదం’ అంశాలపై తొలినుంచి ఈ దీక్షాప్రస్థానం వరకు విపులంగా వైకాపా విధానాల్ని సమీక్షించుకునే ప్రయత్నం ఇది.

వైఎస్సార్ వైఖరిపై వాస్తవాలు తెలియాలి..

వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనే వాదనను ప్రజల మెదళ్లలోకి చొప్పించడానికి.. తద్వారా సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను నిర్మించడానికి కాంగ్రెస్ వారు ఎన్ని కుయుక్తులు అయినా పన్నుతూ ఉండవచ్చు గాక! తెలుగుదేశం పాడిన పాటకు వీరు వంత వీరులుగా ఆలపిస్తూ ఉండవచ్చు గాక! కానీ, ప్రజల దృష్టిలో రాష్ట్రం సమైక్యంగా ఉండడం పట్ల వైఎస్‌ఆర్ నిబద్ధతకు ఒక నిర్దిష్టమైన గుర్తింపు ఉంది. చిన్నారెడ్డి ప్రభృతులతో రాష్ట్ర విభజన గురించి 2001లో ఒక వినతిపత్రం బనాయింపజేసినంత మాత్రాన అప్పటి రాజకీయ వ్యూహప్రతివ్యూహాల నేపథ్యంలో ఆయన అనుసరించిన చతురోపాయమే తప్ప.. మరో ఎత్తు కాదని అందరికీ తెలిసిన సంగతే! కానీ ఆ విషయాన్ని ఇప్పుడు సందర్భోచితంగా ఆయన మీదికి అంగా వాడుకుంటున్నారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత.. వేర్పాటు వాదం అనేది ఊపిరిపోసుకోని రీతిలో.. తెలంగాణ ప్రాంతంలో ఏ రీతిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో.. తన హయాంలో జరిగిన అనేకానేక కార్యక్రమాల్లో తెలంగాణ ప్రాంతానికి పెద్దపీట వేస్తూ రావడం ద్వారా.. ‘ప్రత్యేక రాష్ట్రం’ అనే వేర్పాటు వాద భావజాలంతో ప్రజల్లో విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్న వారికి ఠికానా లేకుండా.. రాజకీయ ఉపాధి దొరకకుండా చేయడంలో వైఎస్సార్ ఏం చేశారో అందరికీ తెలుసు!
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే జగన్మోహనరెడ్డి సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకుని లోక్‌సభలో ఎంపీ ెదాలో హల్‌చల్ చేసి వార్తల్లో వ్యక్తిగా కూడా నిలిచారు. ఇదంతా ‘రాష్ట్రంవేర్పాటువాదం’ అనే అంశం గురించి ‘వైఎస్సార్ కుటుంబం’ వైఖరిని ప్రతిబింబించే విషయాలు మాత్రమే. కానీ వైఎస్సార్ మరణం తర్వాత.. ఈ రాష్ట్రం దిక్కూమొక్కూ లేని రీతిలో సమర్థ నాయకత్వం లేకుండా గాలివాటుగా కొట్టుమిట్టాడుతున్నప్పుడు.. తెలంగాణ వాదం మళ్లీ జడలు విప్పుకుంది. తాండవనృత్యం ప్రారంభించింది. ఆ వాదంతో నిమిత్తం లేకపోయినా.. అనివార్యమైన రాజకీయ మార్పుచేర్పులు, పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురుడుపోసుకుంది. దాంతో విధానాల్లోనూ మార్పుచేర్పులు అనివార్యం అయ్యాయి.

సుదీర్ఘకాలం సందిగ్ధావస్థలోనే…

రాజకీయాల్లో శిలాసదృశమైన శాశ్వత విధానాలు ఉండవు గాక ఉండవు. ప్రజాభిప్రాయం ఎటు మారుతోంటే రాజకీయ పార్టీలు తదనుగుణంగా మాత్రమే తమ పథగమనాన్ని నిర్దేశించుకుంటూ ఉంటాయి. జగన్మోహనరెడ్డి ఒక వ్యక్తిగా ఉన్న దశనుంచి ఒక వ్యవస్థగా, రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తరువాత… ఆయన కూడా తన విధానాల విషయంలో పునరాలోచనలో పడాల్సిన అనివార్యమైన పరిస్థితి ఎదురైంది. తెలంగాణ ప్రాంతంలో కూడా వైఎస్సార్ అంటే ప్రాణసమానంగా ఎంచే నాయకులు అనేకులు. వారంతా పార్టీకి దన్నుగా నిలవడానికి ఉత్సాహపూరితంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వారందరికీ ఇబ్బంది కలిగించగల విధానంతో ముందుకు సాగడం ఆయనకు ఇష్టం లేదు. పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తన చేతుల్లో ఉన్నది కాదు. అందుకే కేంద్ర నిర్ణయానికి వదలిపెట్టి.. అదే తమ విధానంగా సాగారు. ఆ సందిగ్ధం పార్టీలో చాన్నాళ్ల వరకు ఉన్నది.
కానీ ప్రత్యర్థి పార్టీగా ఇలాంటి మెతక వైఖరిని వైకాపా అవలంబిస్తుండడానికి కాంగ్రెసు పార్టీ ఎడ్వాంటేజీగా తీసుకున్నది. రాష్ట్ర విభజన అన్నది తమ సీట్ల వ్యవహారంలాగా.. తమ ఇచ్చమొచ్చిన రీతిలో విచ్చలవిడిగా వ్యవహరించడానికి తెగబడింది. నిర్ణయం కేంద్రం తీసుకోగలిగినదే తప్ప.. దాని అర్థం.. తతిమ్మా రాజకీయ పక్షాలు అందరినీ.. ఉపేక్షించి.. బరితెగించమని కాదు! కానీ కాంగ్రెసు వ్యవహార సరళి అచ్చంగా అలాంటి అచ్చోసిన వైఖరినే తలపించింది. ఆ దుడుకుతనం వైఎస్సార్ కాంగ్రెస్‌కు సహజంగానే కంటగింపు కలిగించింది. ప్రజాభిప్రాయం నికరంగా నిర్దిష్టంగా.. నిర్మలంగా ఒకేవైపున ఉండేట్లయితే.. దానికి వ్యతిరేకంగా నడవడం వైకాపా మనోగతం కాదు. కానీ.. ఆ ముసుగులో కాంగ్రెస్ దుష్ట/ వక్ర రాజకీయ ప్రయోజనాలను ఈడేర్చుకునే కుట్రకు చెక్ పెట్టాలని మాత్రం అనుకున్నది. అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం వంటివి.. కాంగ్రెసుతో కుమ్మక్కుఅయి.. కాంగ్రెసు దుష్ట నిర్ణయానికి పోకడలకు చిడతలు వేస్తూ కూర్చున్న సమయంలో వైకాపా క్రియాశీలంగా రంగంలోకి దిగింది.
ఆ సమయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సందిగ్ధం తొలగింది. రాష్ట్ర భవిష్యత్తుకు ఎలాంటి హాని జరగకుండా ఉండాలంటే.. ప్రజాసంక్షేమం ఆశించే పార్టీగా నిర్దిష్టంగా తాను చేయవలసిన కృషి ఏమిటో జగన్‌కు స్పష్టత ఉంది. అందుకే ఆయన తన అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ విధానాలను పునర్నిర్వచించారు.

వేలెత్తి చూపలేని రుజునిర్ణయం

విభజనలో రాజకీయ ప్రయోజనాలు లక్ష్యించిన కాంగ్రెస్ వక్రనీతి తప్ప మరొకటి లేదని గుర్తించింది… దాన్ని ఎండగట్టదలచనిది వైకాపా ఒక్కటే. అందుకే పాలక పక్షం వారికి అవాంతరాలు సృష్టించడమూ ప్రారంభించింది. రాజకీయ కుట్ర లాగా రాష్ట్రాన్ని విభజించడం నీతిబాహ్యం అంటూ వైకాపాకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు.. పార్టీలోనే ముసలం పెట్టడానికి, తెలంగాణ ప్రాంతపు ఎమ్మెల్యేలలో వైకాపా పట్ల ఒక దురూహలను కలగజేయడానికి కాంగ్రెస్ తెగించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ ప్రాంత నాయకులతో రాజీనామాలు చేయించి.. ఆ పార్టీ ‘అయిపోతోందనే’ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, వారికి రకరకాల తాయిలాలు చూపించి తమవైపు ఆహ్వానించింది.
కానీ వైకాపాగానీ.. జగన్ గానీ వీసమెత్తు అయినా జంకలేదు. ఎలాంటి గొంకు లేకుండా.. ముందుకు సాగారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం తప్ప.. స్వార్థ, రాజకీయ ప్రయోజనాలు కాదనుకున్నారు. అందుకే తమ నిర్ణయానికి కట్టుబడ్డారు. కొందరు నాయకులు పార్టీనుంచి చేజారిపోవచ్చు గాక.. ప్రలోభాలకు లొంగవచ్చు గాక.. అంతమాత్రాన బేజారెత్తిపోవాల్సిన అగత్యం లేదనుకున్నారు. తమ నిర్ణయం నిష్కల్మషం అయినప్పుడు.. ప్రజల్లో కూడా దురూహలను నిలకడమీద నిర్మూలించవచ్చుననే పాజిటివ్ దృక్పథానికి వారు కట్టుబడ్డారు. తమ మీద నమ్మకంతో.. రకరకాల కుట్రలు కూహకాలకు బలైపోతున్న రాష్ట్రానికి తాము ఏదైనా స్పష్టమైన మార్గానుసరణతో పోరాడగలమనే విశ్వాసంతో చూస్తున్న ప్రజానీకానికి భరోసా కల్పించేలా… తమ ఆలోచనలు అన్నిటికీ.. ఒక ఏకరూపత కల్పించారు. ‘సమన్యాయం చేయలేనప్పుడు సమైక్యరాష్ట్రమే ముద్దు’ అనే నినాదానికి ప్రాణం పోశారు.
నిజానికి వేర్పాటు వాదులు వెకిలి విమర్శలు చేయడానికి ఆస్కారం వెతుక్కోగలరు గానీ.. వేలెత్తిచూపలేని నిర్ణయం ఇది. విభజనకు అడ్డు చెప్పకుండా… సమన్యాయం అడగడంలో తప్పేముందో ఎవ్వరికీ అర్థం కాని సంగతి! ఈ డిమాండు పట్ల సానుకూలంగా స్పందించని ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ఆలోచనలతో ఉన్నదో అని మనం అనుమానించాలి. సమన్యాయం అనేదానికి స్పందించకపోవడం అంటే.. వారి మనసులో ఏదో కుట్ర ఉన్నట్లే లెక్క! ఆ రీతిగా ఒక ప్రాంతంలో తమ పార్టీ పట్ల అనుమానాల్ని అపోహల్ని సృష్టించడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తారని చాలా స్పష్టంగా తెలిసినా కూడా రాష్ట్ర విసృ్తత ప్రయోజనాలే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తన విధానాన్ని విస్పష్టంగా తేల్చేసింది. కాంగ్రెస్ యథాపూర్వ, అవాటైన నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించేసరికి.. వైకాపా విధానం ఉద్యమరూపాన్ని సంతరించుకుంది.

‘విజయ’ ఉద్యమ జ్వాల

వైకాపా ఎమ్మెల్యేలు 16 మంది, ఆ తరువాత ఎంపీ ఒకరు రాజీనామా చేయడం ఒక ఎత్తు. ఏకంగా పార్టీ అధ్యక్షుడు జగన్, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా తమ పదవులను వదులుకోవడం మరో ఎత్తు. వారు కోల్పోయిన పదవి ఇక్కడ ప్రస్తావన కాదు, వారు పూర్తిగా తమ విధానాన్ని ఉద్యమ రూపంలోకి మార్చడానికి కట్టుబడి ఉండగల చిత్తశుద్ధికి ఆ చట్టసభల పదవులను అంతరాయంగా ఎంచడమే ప్రధానం.
విజయమ్మ నిరవధిక దీక్షను ప్రకటించారు. ఇది జగన్ మేథోజనిత వ్యూహం అని చెప్పాలి. ఆ వ్యూహం కాంగ్రెస్ ఎత్తుగడల్లాగా స్వల్ప రాజకీయ ప్రయోజనాలను మాత్రమే ఆశించేది కాదు. ఆ మాటకొస్తే రాజకీయ ప్రయోజనం లేకుండా.. ఏ పార్టీ కూడా ఏ పనీ చేయదు. అలాగే ఈ నిర్దిష్ట మార్గానికి కట్టుబడి ఉండడంలో వైకాపాకు కూడా రాజకీయ వ్యూహం ఉంది. కానీ అంతకంటె ముందుగా వారు చూసినది ప్రజా ప్రయోజనాన్ని..! జైలుగోడల మధ్య ఉంచినంత మాత్రాన మనో దౌర్బల్యం ఆవరించలేదని, ఆయన నిర్ణయాలు అచంచలంగానే ఉన్నాయనడానికి ఇది ప్రతీక!
ఇవాళ రాష్ట్రవ్యాపితంగా సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమ జ్వాలలు చెలరేగుతున్నాయంటే.. వారి డిమాండు సమైక్య రాష్ట్రమే కావచ్చు.. కానీ, మౌలికంగా వారిని ప్రేరేపిస్తున్న చోదక శక్తి మాత్రం సమన్యాయం జరగకపోవచ్చునన్న భయాందోళన. సరిగ్గా వారికి న్యాయం చేసే, వారు న్యాయంగా భావించే వాదనకు దన్నుగా నిలిచే ఏకైక పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని తీసుకుంది. ఏకంగా పార్టీ అధ్యక్షురాలు ఆత్మత్యాగానికైనా వెరవని నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు.
దీక్షలు ఇతర పార్టీ వారి ఆధ్వర్యంలోనూ జరుగుతున్నాయి. మంచి పని కోసం ఎవరు చేసే దీక్ష అయినా సమర్థించదగినదే. అయితే నోటితో పొగడి నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా… పార్టీ విధానం ఒక తీరుగా నడుస్తోంటే.. ఒక వ్యక్తిగా చేసే దీక్షలు వీధినాటకాలను మాత్రమే తలపిస్తూ ప్రజల్ని వంచించే మార్గంలో ఉన్నాయి. భర్తలు అధికార పదవులు వెలగబెడుతోంటే.. అతివలు దీక్షకు పూనుకోవడం, పార్టీ అధినేతలు రెండు కళ్లను రెండు నాల్కలను అలల్లాడిస్తోంటే.. అనుచరులు దీక్ష డ్రామాలను ప్లే చేయడం.. ఈ వంచనలతో ప్రజలు విసిగిపోయారు. ఇలాంటి సమయంలోనే యావత్తు సీమాంధ్ర ప్రాంతంలోనూ, రాజధాని నగరంలోనూ జరుగుతున్న ఉద్యమ నాదాన్ని మూర్తీభవింపజేస్తున్నట్లుగా విజయమ్మ దీక్ష రంగంలోకి వచ్చింది. విజయమ్మ దీక్షకు పార్టీ రహితంగా అందరూ మద్దతుగా నిలవాలని కాంగ్రెసు ఎమ్మెల్యేలే పిలుపు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే.. ఆమె దీక్ష మీద యావత్తు జాతి ఎంతగా విశ్వాసం ఉందచుకున్నదో అర్థం చేసుకోవచ్చు.

వక్రవ్యూహాలకు చెల్లుచీటీ ఖరారు

ఈ దీక్ష, తదనుగుణంగా బలోపేతం కానున్న ఉద్యమం మీద ఇప్పుడు ప్రజల్లో ఆశలు హెచ్చుతున్నాయి. కాంగ్రెసు వక్ర రాజకీయ వ్యూహాలకు ఇది చెక్ పెడుతుందని అందరూ భావిస్తున్నారు. విజయమ్మ దీక్ష ప్రకటనతోనే కాంగ్రెసు పార్టీలో అంతర్మధనం మొదలైంది. పార్టీ ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. యావత్తు సీమాంధ్ర ఉద్యమ జ్వాలలు తమకు చుక్కానిగా విజయమ్మ దీక్షను ఎంచుకోవడం అనేది కేంద్రాన్ని ఆత్మరక్షణలో పడేసే పరిస్థితి కనిపిస్తోంది.
తమ నిర్ణయాన్ని తాము అనుకున్న రీతిలో వక్రంగా విచ్చలవిడిగా ముందుకు తీసుకువెళ్లడానికి ఇప్పుడు వారిలో జంకు మొదలైంది. అందుకే పునరాలోచనలో పడ్డారు. అయితే క్రెడిట్‌ను విజయమ్మ దీక్ష ఖాతాలో పడకుండా చూడడానికి సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు ఆంటోనీ కమిటీకి రెప్రజెంట్ చేసే విషయంలోనూ సమన్యాయం అనే అచ్చంగా ఇదే పదాన్ని వాడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిన్నటిదాకా ఒక పాట పాడిన సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు ఇప్పుడు ‘సమన్యాయం’ అనే పదాన్ని జోడించి పాడుతున్నారు. ఇదంతా కేవలం విజయమ్మ ఖాతాలోకి విజయాలు చేరకుండా అడ్డుకోవచ్చుననే కుట్ర మాత్రమే.
అయితే ప్రజా కోర్టు, ప్రజల సంయమనం అన్ని పోకడలను చాలా సునిశితంగా గమనిస్తూనే ఉంటుందనడంలో ఎలాంటి సంశయం లేదు. వక్రనీతులన్నీ ఎండగట్టడం జరుగుతుంది. నిష్కల్మషంగా ప్రజలకోసం పోరాడుతున్న వారికే పట్టం కట్టడం జరుగుతుంది. తథ్యం!

http://greatandhrapaper.com/articles/news_/2799/

ఒక్క రీజే దీక్ష స్ధలికి 40 వేల మంది


క్షీణిస్తున్న విజయమ్మ ఆరోగ్యం

Photo: Doctors checking amma health condition. Amma said will continue the deekshaa whatever the health condition it may be.సమన్యాయం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న సమర దీక్ష నేటికి అయిదో రోజుకు చేరింది. గత నాలుగు నాలుగు రోజులుగా మంచినీళ్ల మీదే ఉండటంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించినట్లు విజయమ్మకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు చెప్పారు. తక్షణమే దీక్షను విరమించాలంటూ సూచించారు. అయినా విజయమ్మ మాత్రం పట్టదలతో దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రభుత్వ వైద్యులు దీక్షా శిబిరానికి వచ్చి విజయమ్మ ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. బీపీ, సుగర్ లెవల్స్ బాగా తగ్గిపోయాయని వైద్యులు నిర్థారించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పెదవి విప్పటంలేదు. మరోవైపు విజయమ్మ కూర్చొనే ఓపిక లేకపోవడంతో కొన్నిసార్లు పడుకునే ఉంటున్నారు.
శిబిరానికి తరలివచ్చిన ప్రజలకు అభివాదం కూడా చేయలేకపోతున్నారు. శక్తిని కూడదీసుకుని కూర్చోవడాన్ని చూసి అక్కడకొచ్చిన వారి కళ్లు చెమ్మగిల్లాయి. విజయమ్మ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ ఉండటంతో శిబిరం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.Photo: Vijayamma at Deekshaa. Johar YSR, Jai Jagan.Photo: Amma Vijayamma Health condition is serious and getting week hour by hour. Rastaa prayojanala kosam pranalu panam ga pettina na talli Vijayamaaa.

లోక్‌సభలో కాంగ్రెస్, టీడీపీ ఫిక్సింగ్ డ్రామా

లోక్‌సభలో కాంగ్రెస్, టీడీపీ ఫిక్సింగ్ డ్రామా
రెండు పార్టీల వల్లే సీమాంధ్ర అగ్నిగుండం: మేకపాటి
 సాక్షి, నెల్లూరు: లోక్‌సభలో 11 మంది కాంగ్రెస్, టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ఆ రెండు పార్టీలు ఆడుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలో భాగమేనని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం నెల్లూరులో మాట్లాడుతూ విభజనకు లేఖ ఇచ్చి చంద్రబాబు, రాష్టాన్ని విభజించి కాంగ్రెస్ ఇప్పటికే సీమాంధ్రను అగ్నిగుండం చేశాయని దుయ్యబట్టారు.
 
సీమాంధ్రులను మభ్యపెట్టేందుకు ఆ రెండుపార్టీల ఎంపీలు పార్లమెంట్ కార్యకలాపాలను భంగపరిచి ఆహారభద్రత బిల్లుకు అంతరాయం కల్పించారన్న సాకుతో సస్పెండయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు గతంలో ఒకటి రెండు మార్లు పార్లమెంట్ వెల్‌లోకి వెళ్లినా కాంగ్రెస్ పెద్దలు కన్నెర్ర చేయగానే తిరిగి వెళ్లి పోయేవారని, గురువారం ధైర్యంచేసి వెల్‌లోకి వెళ్లారంటే కాంగ్రెస్ హైకమాండ్ ఆడిస్తున్న నాటకంలో భాగమేనని అర్థమవుతోందని చెప్పారు.

విభజిస్తే జల యుద్ధాలే: వై.ఎస్.విజయమ్మ

* అన్నదమ్ముల్లా కలిసున్న తెలుగువారు తన్నుకునే దుస్థితి వస్తుంది: విజయమ్మ
కృష్ణా ఆయకట్టును ఒకవైపు ఉంచండి.. లేదా రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలి: విజయమ్మ
కృష్ణా ఆయకట్టును మొత్తం ఒకవైపు ఉంచండి.. లేదా రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించండి
సమైక్యంగా ఉన్నప్పుడే ఎగువ రాష్ట్రాల నుంచి నీటిని విడుదల చేయించలేకపోతున్నారు
మధ్యలో మరో రాష్ట్రం వస్తే.. దిగువ రాష్ట్రంలోని రైతుల పరిస్థితి ఏమిటి?
శ్రీశైలానికి, సాగర్‌కు నీళ్లెక్కడి నుంచి తెస్తారు?
పోలవరం అంతర్రాష్ట్ర జలవివాదంగా మారితే.. దాని పరిస్థితేంటి?
ఐదో రోజుకు చేరిన ఆమరణ దీక్ష

సాక్షి, గుంటూరు: ‘‘రాష్ట్రాన్ని విభజిస్తే నీటి కోసం భవిష్యత్తులో యుద్ధాలు జరుగుతాయి. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగు జాతి వారు తన్నుకునే పరిస్థితి వస్తుంది. సీమాంధ్ర మొత్తం ఎడారిగా మారుతుంది. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ఉప్పు నీరే దిక్కవుతుంది. ఆ దుస్థితి రానీయకండి. కృష్ణా ఆయకట్టును మొత్తం ఓ వైపు ఉంచండి.. లేదా రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గుంటూరులో విజయమ్మ కొనసాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష గురువారం నాలుగో రోజుకు చేరింది. ఉదయం దీక్షా వేదిక వద్ద విజయమ్మ కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయమ్మ కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు.
 
ఇప్పుడే నీటిని విడుదల చేయించలేకపోతున్నారు..
‘‘రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ఎగువ రాష్ట్రాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి రాష్ట్రానికి నీటిని విడుదల చేయించలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే కృష్ణా ఆయకట్టుపై ఆధారపడ్డ రైతాంగం అష్టకష్టాలూ పడుతోంది. ఇప్పుడు మధ్యలో మరో రాష్ట్రం ఏర్పాటు చేస్తే.. దిగువ రాష్ట్రంలోని రైతాంగం పరిస్థితి ఏమిటి? శ్రీశైలానికి, నాగార్జున సాగర్‌కు నీళ్ళెక్కడి నుంచి వస్తాయి?’’ అని విజయమ్మ ప్రశ్నించారు.

‘‘నికర జలాలపై నీటి విడుదల ఉన్న జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీ కూడా రాష్ట్రం విడిపోతే అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా మారి కేంద్రం చేతుల్లోకి పోతాయి. ఒక్కసారి అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటయ్యాక.. మిగులు నీరు మీద ఆధారపడ్డ ప్రాజెక్టులకు అటు రాయలసీమలోగానీ, ఇటు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకుగాని, అటు ప్రకాశం జిల్లాకుగానీ చుక్క నీరు ఉపయోగించుకునే అవకాశం ఉండదు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
 
ఇరు ప్రాంతాలకూ న్యాయం చేయలేనప్పుడు విభజించడమే తప్పు అని అన్నారు. విభజిస్తే ఒక్క కృష్ణా ఆయకట్టు రైతులకే కాకుండా.. గోదావరి ఆయకట్టు రైతులూ కష్టాల్లో కూరుకుపోతారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కూడా అంతర్రాష్ట్ర జలవివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టుకు గోదావరి నుంచి ఏ విధంగా నీరిస్తారని ఆమె ప్రశ్నించారు. జలయజ్ఞం ద్వారా కోటి ఎకరాలకు సాగునీరందించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేసి రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసేలా చేయాలని పరితపించిన వైఎస్సార్ ఆలోచనలకు కాంగ్రెస్ గండి కొట్టిందని విమర్శించారు.
 
మరి సంక్షేమ పథకాలు నడిపేదెలా?
‘‘విడగొట్టాలనుకునేవారికి రాజధాని ఇచ్చి.. కలిసి ఉండాలకునేవారిని కట్టుబట్టలతో బయటకు వెళ్ళగొడతారా? సీమాంధ్రలో ఎలాంటి ఆదాయమూ వచ్చే పరిస్థితి లేదు. అక్కడి వారు ఎలా బతకాలి?’’ అని విజయమ్మ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘‘అందరి హైదరాబాద్‌ను కొందరికే ఇస్తారా? 60 ఏళ్లుగా హైదరాబాద్‌ను మనదనే భావనతోనే అభివృద్ధి చేసుకున్నాం.

‘‘రాష్ట్ర ఆదాయంలో 45 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. రాయలసీమ, ఆంధ్రాల నుంచి ఎనభై, తొంభై శాతం మంది ఇక్కడే సంస్థలు ఏర్పాటు చేశారు. ఐటీ రంగంలో రాష్ట్ర ఆదాయం రూ. 55 వేల కోట్లయితే, అందులో రూ. 54,800 కోట్లు ఒక్క హైదరాబాద్‌లోనే వస్తోంది. విభజిస్తే.. ఇవన్నీ ఇటువైపు వెళ్లిపోగా.. సీమాంధ్రలో మళ్లీ కొత్త రాజధానిలో కట్టాలంటేలక్షల కోట్లు కావాలి.. రాజధాని కట్టుకునేందుకే ఉన్న డబ్బంతా పోతే మరి సంక్షేమ పథకాలను నడిపేదెలా?’’ అంటూ విజయమ్మ కేంద్రాన్ని ప్రశ్నించారు.

కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆమరణ దీక్ష భగ్నం

కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆమరణ దీక్ష భగ్నం
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు మద్దతుగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గత ఐదురోజులుగా చేస్తున్న ఆమరణ దీక్షను గురువారం అర్ధరాత్రి ఒంటి గంటకు పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ను పోలీసులు దీక్షాప్రాంగణం నుంచి నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను నెట్టి వేసి ఆయన్ను బలవంతంగా తీసుకెళ్లారు. శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా, ప్రశాంతంగా కొనసాగిస్తున్న దీక్షను పోలీసులు భగ్నంచేయడాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు తప్పుపట్టారు.
 
 తెలంగాణకు అనుకూలంగా ఉన్నా రా? అంటూ పోలీసులపై నాయకులు విరచుకుపడ్డారు. తమ నాయకుని తీసుకెళ్లేందుకు వీల్లేదని అడ్డుకున్నా, అందరినీ చెదరగొట్టి ప్రత్యేకంగా వచ్చిన బెటాలియన్  పోలీసులను రంగంలోకి దిం ప్రసన్నకుమార్‌ను పోలీసుల వాహనంలో తరలించారు. తమ నాయకుడ్ని బలవంతంగా తీసుకెళ్లడం సహించని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, కోవూరు జాతీయ రహదారిపై బైఠాయించి, రాస్తారోకో చేశారు.

జనం నెత్తిన గ్యాస్ బండ!

వంట గ్యాస్ సబ్సిడీ చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం దొంగదెబ్బ తీస్తోంది. పారదర్శకత ముసుగులో వినియోగదారుడిపై భారం మోపుతోంది. ఫలితంగా జిల్లాలోని 2.70 లక్షల మంది వినియోగదారులు సిలిండర్‌కు 89 రూపాయల చొప్పున సొంత జేబులోంచి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు.. ఇప్పటివరకు సిలిండర్‌కు 25 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కొనసాగుతుందో.. లేదో స్పష్టత లేదు. ప్రభుత్వం దీనిని ఉపసంహరించుకుంటే ఆ భారాన్ని కూడా వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది.
 
 టెక్కలి, న్యూస్‌లైన్: వంట గ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారుడికి చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ టు ఎల్పీజీ కన్జూమర్స్(డీబీటీఎల్) పథకాన్ని రూపొందించింది. తొలివిడతలో రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, అనంతపురం, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేసింది. సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, ఆదిలాబాద్, వైఎస్సార్ కడప, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో అమలు చేయనుంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులకు, గ్యాస్ ఏజెన్సీలకు ఉత్తర్వులు జారీ ఆయ్యాయి. పత్రికల్లో భారీ ప్రకటనలు కూడా వచ్చాయి. నగదు బదిలీ పథకం అమలుతో వినియోగదారుడికి నేరుగా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది.
 
 భారం పడేది ఇలా..
 ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీలతో కలిపి జిల్లాలో 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్‌ను 411 రూపాయలకు విక్రయిస్తున్నారు. సబ్సిడీ లేని సిలిండర్ ధర ప్రస్తుతం 935 రూపాయలు. ఆథార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్‌తో గ్యాస్ కనెక్షన్‌ను అనుసంధానం చేసిన వినియోగదారులకు వచ్చే నెల 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకం కింద ఒక్కో సిలిండర్‌కు 435 రూపాయలు చొప్పున బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కానుంది. ప్రస్తుతం సిలిండర్ మార్కెట్ ధర 935 రూపాయలు కాగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ 435 రూపాయలే. మిగిలిన 500 రూపాయలను వినియోగదారుడే భరించాలి. అంటే ప్రతి సిలిండర్‌కు 89 రూపాయలను సొంత జేబులోంచి ఖర్చుచేయాలి. మరోవైపు.. సిలిండర్ మార్కెట్ ధర ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇది పెరిగితే ఆ భారాన్ని కూడా వినియోగదారుడే భరించాలి.
 
 రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ చెల్లింపుపై అస్పష్టత
 గతంలో వంటగ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరగటంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో సిలిండర్‌పై 25 రూపాయలను రాష్ట్రప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించి ప్రజలకు ఊరట కలిగించారు. 
 
    ఇప్పుడు నగదు బదిలీ పథకం అమలవుతున్న నేపథ్యంలో మహానేత ఇచ్చిన 25 రూపాయల సబ్సిడీని ఎత్తివేసేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. అదే జరిగితే ఆ భారం కూడా వినియోగదారుడే భరించాల్సి వస్తుంది.
 
 ఆదేశాలను అమలు చేస్తాం..
 ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల అధికారి ఆనంద్‌కుమార్‌ను ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తామని చెప్పారు. జిల్లాలోని 2,69,471 మంది గ్యాస్ వినియోగదారుల్లో 2,58,327 మందికి సంబంధించి ఆధార్ అనుసంధానం పూర్తయిందని వెల్లడించారు. వీరందరికీ వచ్చే నెల 1 నుంచి నగదు బదిలీ పథకం వర్తిస్తుందని వివరించారు

డ్రామా బాబుల గుట్టురట్టు!

విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నామని  ఐదుగురు టీడీపీ సీమాంధ్ర ఎంపీల అర్భాట ప్రకటన
ఉత్తుత్తి రాజీనామాలు ఇచ్చి పార్లమెంటులో హడావిడి
హరికృష్ణ రాజీనామాతో మిగతావారి రాజీనామా డ్రామాగా తేటతెల్లం
నిబంధనల మేరకు రాజీనామాలు చేయలేదని బయటపెట్టిన నిమ్మల
 
సాక్షి, హైదరాబాద్: రాజీనామాలు, నిరసనలు అంటూ డ్రామాలాడుతున్న తెలుగుదేశం సీమాంధ్ర ఎంపీలు అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ వారు సమర్పించిన రాజీనామాలు ఉత్తుత్తి రాజీనామాలేనని, ఒక పథకం ప్రకారం ఆడిన నాటకమని తేలిపోయింది. వారు సమర్పించిన రాజీనామా లేఖలు నిబంధనల మేరకు స్పీకర్ ఫార్మాట్‌లో లేవని గురువారం రాజ్యసభ సాక్షిగా స్పష్టమయింది. రాజ్యసభ సభ్యుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ గురువారం తన పదవికి రాజీనామా చేస్తూ లేఖను రాజ్యసభ చైర్మన్ హమీద్‌అన్సారీకి అందచేశారు. కొద్దిసేపటికే ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ సభలో ప్రకటించటమే కాకుండా.. రాజీనామా ఆమోదం గురువారం నుంచే అమల్లోకి వస్తుందని చెప్పారు.
 
ఈ పరిణామం అనంతరం విజయ్‌చౌక్ వద్ద విలేకరులతో మాట్లాడిన ఆ పార్టీ ఎంపీ నిమ్మల కిష్టప్పను విలేకరులు హరికృష్ణ రాజీ నామా గురించి ప్రశ్నించగా.. ఆయన స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేశారని, తమ రాజీనామాలు ఆ ఫార్మాట్‌లో లేవని అసలు విషయం  బయటపెట్టారు. ఈ నెల 2న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగింది. ఈ సమావేశం ప్రారంభం కావటానికి గంట ముందు పార్టీ తరఫున లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొనకళ్ల నారాయణ, వై.సత్యనారాయణ చౌదరి (సుజనాచౌదరి), సి.ఎం.రమేష్‌లు జూబ్లీహిల్స్‌లోని సుజనాచౌదరి కార్యాలయంలో సమావేశమయ్యారు.

రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే రాజీనామా పత్రాలను టీడీపీపీ సమావేశంలోచంద్రబాబుకు చూపించి, అంతా బాగుందని అనుకున్న తర్వాతే స్పీకర్‌కు పంపారు. వాస్తవానికి అవేవీ స్పీకర్ ఫార్మాట్‌లో లేవని తాజాగా నిర్ధారణ అయింది. ఆ తరువాత టీడీపీ ఎంపీల అసలు డ్రామా ప్రారంభమైంది. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన టీడీపీ నేతలు ప్రతి రోజూ పార్లమెంటు ఉభయ సభలకు హాజరై సభా కార్యక్రమాలను అడ్డుకోవటం ప్రారంభించారు.
 
హరికృష్ణను ఇరకాటంలో పెట్టిన బాబు వ్యూహం
ఐదుగురు ఎంపీలు రాజీనామా ఎత్తుగడపై ముందుగానే ఒక అవగాహనకు వచ్చి సుజనాచౌదరి కార్యాలయంలో సమావేశమై రాజీనామాలు చేయనున్నట్లు ఒక ప్రకటన చేశారు. ఆ రోజు వారి రాజీనామా విషయాన్ని హరికృష్ణకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఇదంతా చంద్రబాబు డెరైక్షన్‌లోనే జరిగిందని సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు. అయితే ఎంపీల నిర్ణయం తెలియని హరికృష్ణ క్రమశిక్షణ కలిగిన టీడీపీ కార్యకర్తగా.. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తున్నానని అప్పటికే ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.

హరికృష్ణ ప్రకటన వెలువడ్డాక.. సుజనాచౌదరి తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశామని మీడియాకు సమాచారం పంపిన తరువాత.. సుజనాచౌదరితో పాటు టీడీపీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి టి.డి.జనార్దనరావులు హరికృష్ణకు ఫోన్ చేశారు. పార్టీ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారని, అందులో భాగస్వామి కావాలని కోరి ఆయనను ఇరకాటంలో పెట్టారు.
 
అప్పటికే హరికృష్ణ ప్రకటన చేయటంతో.. ఆయన్ను సీమాంధ్ర ప్రాంత నేతల్లో దోషిగా నిలెబట్టగలిగామని చంద్రబాబు, మిగతా ఎంపీలు సంబరపడ్డారని ఆ సీనియర్ నాయకుడు వివరించారు. చంద్రబాబు, సహచర ఎంపీల చర్యతో ఇరకాటంలోపడ్డ హరికృష్ణ రెండు రోజుల కిందట ఆత్మావిష్కరణ పేరుతో మరో ప్రకటన చేశారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని, త్వరలో ప్రజల్లోకి వెళతానని మొదటి లేఖకు భిన్నంగా రెండో ప్రకటనలో పేర్కొన్నారు. అందులో భాగంగానే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

తాజాగా హరికృష్ణ రాజీనామా చేయటం, దానిని వెంటనే ఆమోదించటంతో చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, ఇతర నేతలు కంగుతిన్నారు. 
 
కోట్లు పోసి కొన్న సీట్లకు రాజీనామా చేస్తారా?
హరికృష్ణ రాజీనామా ఆమోదం పొందటంతో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన కోటరీలోని సుజనాచౌదరి, సీఎం రమేష్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తారా? లేదా? అన్న విషయంపై టీడీపీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కోట్ల రూపాయలు వెచ్చించి మరీ రాజ్యసభ సీట్లు తీసుకున్నందున వారు రాజీనామాలు చేయలేరన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.

జగనన్న విడుదల కోసం దేవుడిని వేడుకుంటున్నాను

జగనన్న విడుదల కోసం దేవుడిని వేడుకుంటున్నాను
 పదిహేను నెలలుగా జగనన్న జైల్లో ఉన్నారు. జగనన్నను వ్యతిరేకించే పార్టీలకు, నాయకులకు, సీబీఐకి, న్యాయస్థానాలకు ఇదొక సాధారణ విషయంగా అనిపించవచ్చు. కానీ నాకు ఇంకా జగనన్న అరెస్టయిన రోజే గుర్తొస్తోంది. ఆ రోజు జగనన్నను అరెస్టు చేసిన వార్త విని నా గుండె గాయపడింది. ఇప్పటికీ నేను తేరుకోలేదు. అప్పుడు టీవీ చూస్తున్నాను. అంతకు కొద్దిరోజుల ముందే కొన్ని చానళ్లవారు ‘జగన్ అరెస్టు ఎప్పుడు?’ అంటూ అదేపనిగా ప్రసారం చేయడం, ఆ వరుసలోనే సీబీఐ జగనన్నను విచారణకు పిలిపించుకుని దొంగచాటుగా అరెస్టు చేయడం చూశాను. జగనన్నను వ్యతిరేకించే మీడియా, సీబీఐ కలిసి చేసిన ఆ అక్రమ అరెస్టును చూసి నా హృదయం భగ్గుమంది. మరీ దారుణం ఏమిటంటే, అరెస్టుకు ముందు జగనన్న తరఫున కోర్టులో దాఖలైన ముందస్తు బెయిలు పిటిషన్‌ని కోర్టు కొట్టివేయడం, కొట్టివేయడానికి ముందు న్యాయమూర్తి ఏమన్నారో నేను పేపర్లో చదివాను. ‘అరెస్టు చేస్తారని మీరు ఎందుకనుకుంటున్నారు?’ అని వారి ప్రశ్న. ఈ ప్రశ్నను ఎలా అర్థం చేసుకోవాలి.
 
  ఎవరైనా ఉత్తి పుణ్యానికే ముందస్తు బెయిలుకు విజ్ఞప్తి చేసుకుంటారా? అరెస్టు చేస్తారేమోనన్న అనుమానం ఉండబట్టే కదా! ఇంత చిన్న లాజిక్కు న్యాయస్థానానికి తెలియలేదా? ‘జగన్‌కి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారంటున్నారు? అలా ఎందుకనుకోవాలి?’ అని కోర్టువారు సీబీఐని ఎందుకు ప్రశ్నించలేకపోయారు? న్యాయం అందరికీ ఒకలా ఉండదా? చట్టం దృష్టిలో అందరూ సమానం కాదా? జగనన్న అరెస్టుకు ముందు జరిగిన, తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. పద్దెనిమిది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరగడానికి రెండురోజుల ముందు జగనన్నని అరెస్ట్ చేయడం చూడగానే కుట్ర ఈ స్థాయిలో ఉంటుందా అని ఆశ్చర్యపోయాను. కానీ ఎల్లో మీడియా, యాంటీ వై.ఎస్.ఆర్. ప్రముఖులు, టీడీపీ వర్గం పండుగ చేసుకుంది! వీళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలనుకున్నాను. ఎన్నికల ఫలితాల కోసం, ప్రజాతీర్పు కోసం నిరీక్షిస్తున్న టైమ్‌లో ఒకట్రెండు స్థానాలు తప్ప మిగతావన్నీ జగనన్న కైవసం చేసుకున్నారన్న వార్త తెలిసి ఓటర్లకు మనసారా కృతజ్ఞత చెప్పుకున్నాను.
 
  బెయిల్ ఇవ్వడంపై కూడా ప్రజాతీర్పు కోరే అధికరణం కనుక రాజ్యాంగంలో ఉంటే, ఈసరికి జగనన్నకు ఎప్పుడో బెయిల్ వచ్చి ఉండేది! కోర్టులు కూడా యాక్టులనీ, రూల్సనీ, రెగ్యులేషన్సనీ, ఫండమెంటల్ రైట్స్‌నీ పక్కనపెట్టి జగనన్నపై కక్ష సాధిస్తున్నాయా అనే సందేహం కలుగుతోంది. ఎవరో అన్నారు, న్యాయమూర్తుల గురించి సాధారణ పౌరులు బహిరంగంగా కామెంట్ చెయ్యడానికి వీల్లేదని! రాజ్యాంగంలో ఇలా ఉందా? ఉన్నట్లయితే వాక్‌స్వాతంత్య్రానికి అర్థం ఏమిటి? నేను ఈ హెచ్.ఆర్.సి.ని, సుప్రీంకోర్టును అడుగుతున్నాను... ‘జగనన్నపై నేరం నిరూపణ కాకముందే ఆయన జైలుశిక్ష ఎందుకు అనుభవించాలి’ అని. మా నాయకుడు మాతో ఉండవలసిన ‘అమూల్యమైన సమయాన్ని’ చట్టాలు ఎలా లాక్కుంటాయి? ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా అంతిమ లబ్ధిదారులు. వారిని నష్టపరిచే వ్యవస్థను ప్రజలెందుకు ప్రశ్నించకూడదు? ఇదేనా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.
 
  అంబేద్కర్ కలలుగన్న సమాజం? ఒక మనిషి తప్పు చేస్తే అరెస్టు చెయ్యడం చట్టబద్ధం అయినప్పుడు, అది నిర్థారణ కానప్పుడు ఆ మనిషికి బెయిల్ ఇవ్వడం అంతే చట్టబద్ధం కావాలి. జగనన్న విషయంలో ఎందుకని అన్ని నియమాలనూ, నిబంధ నలను, మానవ హక్కులను కాలరాస్తున్నారు? జగనన్న అక్రమనిర్బంధంపై ఆలోచనాపరులు, మేధావులు మనకెందుకులే అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. పైకి వారు నోరు మెదపలేక పోయినా, వారి మనసుకు తెలియకుండా ఉంటుందా ఇది అక్రమ నిర్బంధం అని. జగనన్నను త్వరగా ప్రజల మధ్యకు తెమ్మని ఆ దేవుడిని వేడుకుంటున్నాను.
 - ఉమామహేష్, శ్రీకాకుళం

మరో మలుపు తిరిగిన విభజన అంశం

Written By news on Thursday, August 22, 2013 | 8/22/2013

రాష్ట్ర విభజన అంశం మరో మలుపు తిరిగింది. మళ్లీ అఖిలపక్షం తెరపైకి వచ్చింది. విభజన వివాదాలు పరిష్కరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు చర్చించేందుకు పార్లమెంటులో ప్రతితిధ్యం వహించే పార్టీ సభ్యులతో ఒక కమిటీ వేయాలన్న యోచనలో కేంద్రం ఉంది. ఈ విషయమై ఈ రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన విషయమై ఎంపిల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత సీమాంధ్రలో ఉద్యమం ఉధృతం కావడంతో సమస్యను పరిష్కరించడం కేంద్రానికి మరింత జఠిలమైపోయింది. ఈ స్థితిలో ఏం చేయాలో అర్ధంకాని స్థితిలో కేంద్రం ఉంది. ఇందుకోసం పార్లమెంటులో ప్రతితిధ్యం వహించే పార్టీ సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్న కొత్త ఆలోచన చేస్తోంది.

ఆరోగ్యం క్షీణించినా దీక్ష విరమించనన్న విజయమ్మ


ఆరోగ్యం క్షీణించినా దీక్ష విరమించనన్న విజయమ్మ
గుంటూరు: విభజనకు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేకపోతే  రాష్ట్రాన్ని విభజించవద్దన్న డిమాండ్ తో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో చేస్తున్న సమరదీక్షకు సీమాంధ్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు ఆమెకు సంఘీభావం తెలుపుతూ దీక్షలు చేస్తున్నారు. రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. విజయమ్మ ఈరోజు  బాగా నీరసించారు. ఈరోజు ఆమెకు పరీక్షలు చేసిన డాక్టర్లు  పల్స్‌, బీపీ, షుగర్ లెవల్స్‌ బాగా తగ్గాయని చెప్పారు.  ద్రవాహారాన్ని తీసుకునేందుకు కూడా ఆమె నిరాకరిస్తున్నారు. తక్షణమే దీక్ష విరమించాలని  డాక్టర్లు సూచించారు. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుందన్న డాక్టర్లు హెచ్చరించారు. ఆమె వయసుకు ఈ విధంగా దీక్ష చేపట్టడం మంచిదికాదని చెప్పారు. వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయాలని వారు చెప్పారు. అయినా ఆమె మొక్కవోని పట్టుదలతో 4వ రోజు సమరదీక్ష కొనసాగిస్తున్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు వచ్చి ఆమెకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈరోజు కుటుంబ సభ్యులు వైఎస్ భారతీ, షర్మిల, వైఎస్ వివేకానందారెడ్డి వచ్చి ఆమె పరామర్శించారు. పార్టీ నేత మైసూరారెడ్డితోపాటు పలువురు నాయకులు వచ్చి సమరదీక్షకు మద్దతు తెలిపారు.

వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ బాధ్యుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో విజయమ్మ దీక్షకు మద్దతుగా  భారీగా నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. కృష్ణా జిల్లా పామర్రు నుంచి పార్టీ సీఈసీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో భారీగా  కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రకాశం జిల్లా  గిద్దలూరు వైఎస్ఆర్‌ సీపీ సమన్వయకర్త ముత్తుముల్ల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట, అర్దవీడులలో వైఎస్ఆర్ సీపీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. దీక్షలు చేస్తున్నారు.



విభజనకు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేకపోతే  రాష్ట్రాన్ని విభజించవద్దన్న డిమాండ్ తో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో చేస్తున్న సమరదీక్షకు సీమాంధ్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.








వై యస్ వెలుగునిస్తే ,కాంగ్రెస్ విపత్తులు ఇచ్చింది




http://www.tupaki.com/news/view/YsR/34679

విజయమ్మ సమర దీక్ష నాలుగవ రోజు ఫోటోలు



fb.com/ysrcpofficial

Popular Posts

Topics :