29 March 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పోలీస్ శాఖనే ప్రక్షాళన చేయాలి : వైఎస్ఆర్ సీపీ

Written By news on Saturday, April 4, 2015 | 4/04/2015


పోలీస్ శాఖనే ప్రక్షాళన చేయాలి : వైఎస్ఆర్ సీపీకొండా రాఘవరెడ్డి
హైదరాబాద్: పో్లీస్ శాఖకు కొత్త ఇన్నోవా వాహనాలు కాదు, మొత్తం పోలీస్ శాఖనే ప్రక్షాళన చేయాలని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. ఇటువంటి ఘటనలు జరిగిన సమయంలో పరామర్శలు, సానుభూతి, ఎక్స్ గ్రేషియాలతో చేతులు దులుపుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. ఎన్ కౌంటర్ పై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్ కౌంటర్ లో మరణించింది దోపిడీ దొంగలేనని హొం మంత్రి, పోలీసులు నిర్ధారిస్తే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. నల్గొండ గ్యాస్ పైప్ లైన్ బాధితులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని రాఘవ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణ సాకుతో ఏపీలో పన్ను వేసే పథకం


తెలంగాణ సాకుతో ఏపీలో పన్ను వేసే పథకం
  • బాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేత మైసూరారెడ్డి మండిపాటు
  • ఎంట్రీ ట్యాక్స్‌పై కోర్టుకెందుకు వెళ్లలేదని నిలదీత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేసిందని సాకు చూపి.. ఆంధ్రప్రదేశ్‌లోనూ రవాణా వాహనాలపై ఎంట్రీ ట్యాక్స్ వేయాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశంపై కనీసం కోర్టును ఆశ్రయించలేదని వైఎస్సార్‌సీపీ తప్పుపట్టింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 15ను సవాలు చేస్తూ కొందరు వాహనాల యజమానులు, ప్రైవేట్ ఆపరేటర్లు కోర్టుకు వెళ్లారేగానీ.. ఇప్పటివరకు ఆ జీవోను ఏపీ ప్రభుత్వం కోర్టులో ఛాలెంజ్ చేయలేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి విమర్శించారు.

శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎద్దులు పోట్లాడితే దూడ కాళ్లు విరిగాయన్న చందంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తెలుగు ప్రజలు అల్లాడుతున్నారు. ఇద్దరూ వారు చెప్పిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించడానికి లేనిపోని వివాదాలు ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉన్నారు. కానీ ప్రజలపై బాదుడు కార్యక్రమాన్ని మాత్రం ఇద్దరూ మాట్లాడుకునే చేస్తారు. రెండు ప్రభుత్వాలూ ఒకేరోజు పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ పెంచాయి. ఒకట్రెండు రోజుల తేడాతో విద్యుత్ చార్జీలను పెంచాయి. దీంట్లో మాత్రం తగాదాలు లేవు. చూస్తే ఇద్దరూ మాట్లాడుకునే పన్నులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏ చిన్నసాకు దొరికినా ప్రజలపై పన్ను బాదుడు మానడం లేదు. రవాణా వాహనాలపై వేస్తున్న ఎంట్రీ ట్యాక్స్ ఇలాంటిదే’’ అని  దుయ్యబట్టారు.
 
అడ్డుకునేందుకు ఏ ప్రయత్నం చేయలేదు..

ఎంట్రీ ట్యాక్స్‌ను అడ్డుకునేందుకు అనేక అవకాశాలున్నప్పుటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరి నిమిషం వరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని మైసూరారెడ్డి విమర్శించారు. ‘‘విభజన చట్టంలో సెక్షన్ 72 ప్రకారం.. రెండు రాష్ట్రాల మధ్య ఎంట్రీ ట్యాక్స్‌కు అవకాశం లేదు.. కానీ రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ జారీ చేసిన జీవో ప్రకారం ఈ ఏడాది మార్చి 31 తరువాత రెండు ప్రభుత్వాలు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, గడువు ముగిసేవరకు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణతో ఎలాంటి చర్చలకు చొరవ చూపలేదు’’ అని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ మంత్రులు గవర్నర్ వద్దకు వెళ్లి ఆర్జీ పెట్టెలో వినతులు వేస్తున్నారని.. కానీ ఆయన రెండు రాష్ట్రాల్లోని దేవాలయాలకు ముత్యాలు తీసుకుపోవడం తప్ప అంతకుమించి చేస్తున్నది ఏమీ కనిపించట్లేదని మైసూరా విమర్శించారు.
 
అందరి ఇటుకలతో ఏం కడతారట!

ప్రజలనుంచి విరాళాలుగా ఇటుకలు సేకరించి చంద్రబాబు సింగపూర్ తరహా రాజధాని ఏం కట్టగలరని మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. విలేకరులడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘అందరి ఇటుకలు తెచ్చి కడితే.. సింగపూర్ రాజధాని ఏం కడతారట ఆయన. నేను పరిపాలన దక్షుడిని. నేనే ఈ రాష్ట్రాన్ని గటెక్కిస్తానన్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కేంద్రం సాయం చేయట్లేదంటున్నారు. కేంద్రం సాయం చేస్తే నీ పాలనా దక్షత ఏంటీ? ఉన్న సంసారం పొదుపుగా చేసి గట్టెక్కిస్తే మంచిగా సంసారం చేసినట్టు. అంతేగానీ ఎవరో డబ్బిస్తే నేను సంసారాన్ని బాగా చేస్తానంటూ.. రోజూ లగ్జరీ హోటళ్లలో తిరగడం చందంగా చంద్రబాబు తీరు ఉంది’’ అని చమత్కరించారు.

అంగరంగ వైభవం..రాములోరి రథోత్సవం


అంగరంగ వైభవం..రాములోరి రథోత్సవం
♦ భారీగా తరలి వచ్చిన భక్తజనం
♦ రామనామస్మరణతో మార్మోగిన ఏకశిలానగరం


ఒంటిమిట్ట :  ‘జయ జయ రామ.. జానకి రామ.. పావన రామ.. పట్టాభి రామ’ అంటూ అంటూ భక్త జనం రామ నామ స్మరణ చేస్తుండగా సీతా లక్ష్మణ సమేతంగా కోదండ రామయ్య ఒంటిమిట్ట వీధుల్లో రథంలో ఊరేగారు. ఆ కమనీయ దృశ్యం తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. అంతకు ముందు సీతారామ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలకు ఆలయంలో వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథం వద్దకు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఆశీనులను చేశారు. స్థానిక తహశీల్దార్ కనకదుర్గయ్య పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. రామనామస్మరణ మిన్నంటుతుండగా రథ చక్రాలు ముందుకు కదిలాయి.

ఏకశిలా నగరం భక్తజనంతో పోటెత్తింది. రాములోరి ఎత్తయిన ఆలయ ప్రధాన గోపురానికి ధీటుగా, గంభీరంగా భక్తుల జేజేలు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుండగా  జనసంద్రం మధ్యన సాగిన జగన్నాయకుని రథం ఒంటిమిట్ట కోదండ రామయ్య బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టం. రథంపై కొలువుదీరిన స్వామి, అమ్మవార్లను ఒళ్లంతా కళ్లు చేసుకుని తిలకించి పరవశించిన భక్తజనం...చూసిన వారికి పుణ్యఫలం. రథ సేవ చేసిన వారి జన్మధన్యం.    - ఒంటిమిట్ట

వైఎస్‌ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడి రథోత్సవం శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రామయ్యకు విశేష పూజలు నిర్వహించి రథోత్సవం ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం మధ్య కోదండరాముడు రథంపై ఊరేగాడు. సీతారామలక్ష్మణుల దివ్య మంగళ రూపాన్ని భక్తులు దర్శించి తరించారు.     - ఒంటిమిట్ట

16 టీఎంసీలు అవసరమైతే.. 2.55 టీఎంసీలు ఇచ్చి గొప్పలకు పోతున్నారు


  • చంద్రబాబు తీరుపై ప్రతిపక్ష నేత జగన్ విమర్శ
  •  పీబీసీకి 1.5 లక్షల ఆయకట్టుకు 12 వేల ఎకరాలకే ఏడాదిలో ఒక తడి నీరిచ్చారు
  •  16 టీఎంసీలు అవసరమైతే.. 2.55 టీఎంసీలు ఇచ్చి గొప్పలకు పోతున్నారు
  •  ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ

సాక్షి ప్రతినిధి, కడప: ‘చేసింది గోరంత.. చెప్పేది కొండంతలా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. ఇక్కడ పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు 1.52 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే అందులో 12 వేల ఎకరాలకు ఏడాది కాలంలో ఒకే ఒక తడి నీరిచ్చారు. మరోవైపు పులివెందుల ప్రజల తాగునీటి ఇక్కట్లూ తీర్చట్లేదు. ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే.. ఆయన ప్రభుత్వం చాలా గొప్పగా పని చేస్తోందని పులివెందుల నుంచి రైతులు వచ్చి చంద్రబాబుకు శాలువాలు కప్పి సన్మానాలు చేశారని చెప్పుకొంటున్నారు’’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యంగ్యోక్తులు విసిరారు. చంద్రబాబువన్నీ ఆర్భాటపు మాటలేనని విమర్శించారు.

శుక్రవారం ఆయన వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రాముడిని దర్శించుకుని, కమలాపురంలో ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నీటి కేటాయింపులపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
 
‘‘చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 10 టీఎంసీలు. పైడిపాలెం రిజర్వాయర్ ఆరు టీఎంసీలు. పులివెందుల ప్రాంతంలో అవసరమైన 16 టీఎంసీలకుగాను చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది 2.55 టీఎంసీలు మాత్రమే. ఈ నీటిలో కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పులివెందుల మున్సిపాలిటీలకు తాగునీరు, యూసీఐఎల్‌కు కేటాయింపులకుగాను 1.5 టీఎంసీలు అవసరం అవుతాయి. ఇక ఉన్న ఒక టీఎంసీలో 0.55 టీఎంసీల నీరు పీబీసీ ఆయకట్టుదారులకు విడుదల చేశారు. దాదాపుగా 1.52 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఏడాది కాలంలో కేవలం 12 వేల ఎకరాలకు ఒక తడి మాత్రమే నీరందించారు. మరోవైపు 1 టీఎంసీ సామర్థ్యమున్న సమ్మర్ స్టోరేజి ట్యాంకులో ప్రస్తుతం 0.1 టీఎంసీ మాత్రమే నిల్వ ఉంది.

అంటే ప్రస్తుతం పది శాతం మాత్రమే నీరు చేరింది. ఇంకా 90 శాతం నీరు చేరాల్సి ఉంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.55 టీఎంసీ నీరు ఉంది. అయితే ఇందులో కనీస నీటిమట్టంగా 0.95 టీఎంసీల నీరు నిల్వ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన మరో 0.63 టీఎంసీలు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ నీటి ద్వారా సమ్మర్ స్టోరేజీ ట్యాంకును 30 శాతం నింపవచ్చు. ఎటుచూసినా పులివెందుల ప్రాంత ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పనిసరి. ఇంతటి దారుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటే, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి చంద్రబాబులకు పులివెందుల రైతులు శాలువాలు కప్పి సన్మానం చేశారని అసెంబ్లీలో చెప్పార’ని అన్నారు.
 
బ్రహ్మంసాగర్‌కు చుక్క నీరు ఇవ్వలేదు

‘పది సంవత్సరాలుగా బ్రహ్మంసాగర్ నీటితో కళకళలాడింది. 10 నుంచి 12 టీఎంసీల నీరు నిల్వ చేసిన చరిత్ర ఉంది. సీఎం చంద్రబాబు హయాంలో ఒక చుక్క నీరు ఇవ్వలేద’ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. ఇదే విషయాన్ని శుక్రవారం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాకు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కలసి స్వయంగా వివరించారని చెప్పారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీరు ఉందంటే, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా 0.5 టీఎంసీల నీరు డ్రా చేసుకుని రాగలిగామంటే ఆ ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే సాధ్యమైందని తెలిపారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పథకానికి సీఎంగా తొమ్మిదేళ్ల హయాంలో చంద్రబాబు కేవలం రూ.13 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు కోసం రూ. 6,500 కోట్లకుగాను 5,800 కోట్లు వెచ్చించి పనులు చేపట్టారన్నారు. కాబట్టే చిత్రావతిలో ఈ నీరైనా సాధ్యమైందన్నారు.
 
దర్గాలో చాదర్ సమర్పణ
 
విపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి కమలాపురంలోని దర్గా-యే-గప్ఫారియాలో శుక్రవారం నుంచి ప్రారంభమైన ఉరుసు ఉత్సవాలకు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఠాధిపతి హజరత్ ఫైజుల్ గఫ్ఫార్ సాహెబ్ దర్గా మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. గురువుల మజార్ వద్ద గంధం, పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా గురువుల చరిత్ర, ఉరుసు ఉత్సవాల నిర్వహణ గురించి పీఠాధిపతిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, జయరాములు, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, అంజద్‌బాషా, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్లు గూడూరు రవి, రాఘవేంద్రారెడ్డి (నెల్లూరు), ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
 
కోదండరాముడిని దర్శించుకున్న ప్రతిపక్ష నేత

ఒంటిమిట్ట కోదండ రాముడిని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం ఆయన సీతా లక్ష్మణ సమేత రాముల వారిని దర్శించుకున్నారు. ఏకశిలా నగరం విశిష్టతను అక్కడి వేద పండితులు వివరించారు. కోదండరాముని ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇంతటి చరిత్ర కలిగిన ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అధికారికంగా కల్యాణోత్సవం నిర్వహించడం హర్షించదగ్గ పరిణామమన్నారు. అనంతరం కోదండ రాముని రథానికి ఆయన పూజలు నిర్వహించారు.

నీటి కష్టాలు ఏవిధంగా తీరుస్తారు: వైఎస్ జగన్

Written By news on Friday, April 3, 2015 | 4/03/2015

కడప: పది టీఎంసీల నీరు ఉండాల్సిన చిత్రావతి రిజర్వాయర్ లో ఒక టీఎంసీ నీరుందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చిత్రావతి రిజర్వాయర్ లో నీటిమట్టాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాగునీటి కోసం పులివెందుల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును కనీసం 10 శాతం కూడా నింపలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షన్నర ఎకరాల సాగుభూమి ఉంటే కనీసం కనీసం 12 వేల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇప్పుడు ఉన్న ఒక్క టీఎంసీ నీటితో 0.95 టీఎంసీ నీరు డెడ్ స్టోరేజీలో ఉండాల్సిందే. ఇక ఏవిధంగా పులివెందుల సాగు, తాగు నీటి కష్టాలు తీరుస్తారని జగన్ ప్రశ్నించారు.

ఇటువంటి పరిస్థితులు పులివెందులలో ఉంటే రైతులకు సన్మానం చేస్తామంటూ చంద్రబాబు, దేవినేని చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. బ్రహంసాగర్ రిజర్వాయర్ కు 12 టీఎంసీల నీరు వైఎస్సార్ ఇస్తే.. చంద్రబాబు ఏ ఈడాది చుక్కనీరు కూడా ఇవ్వలేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఒ౦టిమిట్ట రథోత్సవ౦లో వైఎస్ జగన్









రథోత్సవంలో పాల్గొననున్న వైఎస్ జగన్


రథోత్సవంలో పాల్గొననున్న వైఎస్ జగన్
కడప : కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్మామి రథోత్సవంలో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గోనున్నారు. శుక్రవారం నిర్వహించే స్వామివారి రథోత్సవంతో పాటు కమలాపురం దర్గా ఉరుసు ఉత్సవంలో ఆయన పాల్గొంటారు. చిత్రావతి రిజర్వాయర్, నక్కలపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఆయన పరిశీలించనున్నారు.

ఒంటిమిట్ట మరో తిరుమల కావాలి: వైఎస్ జగన్


ఒంటిమిట్ట:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి రథోత్సవంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఆలయ అర్చకులు ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు.

ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని వైఎస్ జగన్ అన్నారు.  ప్రభుత్వం అధికారికంగా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించటం శుభపరిణామం అని అన్నారు. రాబోయే రోజుల్లో ఒంటిమిట్ట కూడా తిరుమల స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు.

చంద్రబాబూ.. కళ్లు తెరవండి


చంద్రబాబూ.. కళ్లు తెరవండిఐజీ కార్ల్ నమూనాను పరిశీలిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డి తదితరులు
  • ఐజీ కార్ల్‌కు నిధులున్నా పట్టించుకోని ప్రభుత్వం
  • మీడియాతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, కడప: అంతర్జాతీయ పశుపరిశోధన కేంద్రంలో అద్భుతమైన భవనాలు, పరిశోధనలకు అనువైన వాతావరణం ఉన్నప్పటికీ కేవలం దివంగత వైఎస్సార్  స్వప్నాన్ని నాశనం చేయాలన్న సంకల్పంతో రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

వైఎస్సార్ జిల్లా పులివెందులలోని పెద్దరంగాపురం సమీపంలో ఉన్న ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ (ఐజీ కార్ల్)ను గురువారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, ఐజీ కార్ల్ డిప్యూటీ సీఈవో కేడీ ప్రసాద్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ గొప్ప సంకల్పంతో వైఎస్సార్ అంతర్జాతీయ స్థాయిలో, అధునాతన హంగులతో పశుపరిశోధన కేంద్రాన్ని నెలకొల్పారని చెప్పారు.

అందులో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ టెక్నాలజీతో అత్యుత్తమమైన బ్రీడ్స్‌ను తయారు చేసి ప్రజలకు అందించాలని సంకల్పించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు చేసి.. ప్రస్తుత వ్యవసాయ రంగంలో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు పశుసంపద పరంగా కూడా ఆదాయాన్ని అందించి ధైర్యంగా బతికే అవకాశం కల్పించేలా వైఎస్సార్ దీనికి రూపకల్పన చేశారని చెప్పారు.

కొత్త జాతుల సంరక్షణతోపాటు పురాతన జాతుల అభివృద్ధి, ఇతర అనేక జంతు జాలానికి సంబంధించి పరిరక్షణకు ఐజీ కార్ల్ నిర్మించారని, అందులో భాగంగా రూ.247 కోట్లు ఏపీఐఐసీకి విడుదల చేసి పనులకు ఖర్చు పెట్టారని తెలిపారు. మరో రూ.123 కోట్లు తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీ, వెటర్నరీ కళాశాలల పీడీ అకౌంట్‌లో ఉన్నాయన్నారు. నిధుల కొరత లేనప్పటికీ టీడీపీ ప్రభుత్వం నాటకమాడుతూ నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

దీనిపై జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులను కలిపి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు పంపినా స్పందించలేదని దుయ్యబట్టారు.  ఇక్కడ అధునాతన వసతులు, టెక్నాలజీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో దీనిపై దృష్టి సారించాలని   ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లేఖ రాసినా చంద్రబాబు సర్కార్ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మూడు నెలలవుతున్నా ఏదీ అనుమతి?

ఐజీ కార్ల్‌కు సంబంధించి పరిశోధనలు చేసేందుకు జినోమిక్స్, బయోటెక్స్, గ్లోబెల్, బిజినెల్, ఇంక్యుబేటర్ కంపెనీలు ఆసక్తి చూపినా.. చంద్రబాబు మూడు నెలలుగా తాత్సారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. మూడు నెలల కిందటే ఈ కంపెనీలకు చెందిన పత్రాలు అనుమతి కోసం బాబు టేబుల్ వద్ద ఉన్నా.. పట్టించుకోలేదని చెప్పారు.

సీఈవో కాదు... స్వీపర్ కూడా లేడు: వైఎస్ జగన్

Written By news on Thursday, April 2, 2015 | 4/02/2015


సీఈవో కాదు... స్వీపర్ కూడా లేడు: వైఎస్ జగన్
పులివెందుల: కోట్ల కొద్దీ నిధులున్నా పశుగణ పరిశోధనా కేంద్రానికి రెగ్యులర్ సీఈవో మాట దేవుడెరుగు, కనీసం రెగ్యులర్ స్వీపర్ కూడా లేడని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం వైఎస్సార్ జిల్లా పులివెందులలోని పశుగణ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే....

''వ్యవసాయం గిట్టుబాటు కాని దుస్థితి ఉంది. లైవ్ స్టాక్ ద్వారా వచ్చే ఆదాయంతో రైతు బాగా బతకగలడు. ఆ ఆదాయం రైతుకు సపోర్ట్ చేసేలా ఉండాలని వైఎస్సార్ సంకల్పించారు. అప్పుడే ఆయన రూ. 240 కోట్లను విడుదల చేసి, 236 కోట్లు ఖర్చుపెట్టి ఈ కేంద్రానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజుల్లోనే మరో రూ.123 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి విడుదల చేశారు.

ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత లేదు. అయినా ఈ ప్రాజెక్టు ఎందుకీ స్థాయిలో ఉంది? కిరణ్ సర్కారూ పట్టించుకోలేదు. ఆ రోజుల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ముగ్గురిని సీఎం వద్దకు దీని గురించి అడగాలని పంపాం. అప్పట్లో వచ్చిన కంపెనీలు కూడా ప్రభుత్వ తోడ్పాటు లేకపోవడంతో వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఎవ్వరూ దీని గురించి పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత వచ్చిన చంద్రబాబు సర్కారు కూడా అలాగే ఉన్నాయి.

ఇప్పటికీ మొత్తం డబ్బులు రూ. 247 కోట్లు అందుబాటులో ఉన్నాయి. అయినా ఎందుకీ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది? 6 రీసెర్చి ల్యాబ్స్ కట్టి.. అసలు ఏరకంగానూ ఉపయోగించకుండా వదిలేశారు. 2 బయోసేఫ్టీ ల్యాబ్స్ నిరుపయోగంగా ఉన్నాయి. హాస్టళ్లు, శాస్త్రవేత్తల క్వార్టర్లు అన్నీ ఉన్నాయి. ఆడిటోరియం కూడా సిద్ధంగా ఉంది. అన్నీ ఉన్నా, వాడుకోడానికి ప్రభుత్వం వైపు నుంచి ఆసక్తి కనపడటం లేదు. దాదాపు 7.06 లక్షల చదరపు అడుగుల భవనాలు కట్టి ఉంచారు. వీటిలో మూడు కంపెనీలు కలిపి కేవలం 9 శాతం స్పేస్ ను అంటే... 60 వేల అడుగులే వాడుకుంటున్నారు. మిగిలినదంతా నిరుపయోగంగా వదిలేశారన్నమాట.

వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ తెలంగాణకు వెళ్లిపోయింది. అలాంటిదాన్ని ఎందుకు మన రాష్ట్రానికి తేవట్లేదు? రైతుల గురించి, పశుసంపద గురించి మనం ఆలోచించేది ఇదేనా? ఇప్పటికీ చంద్రబాబు టేబుల్ మీద రెండు మూడు నెలల నుంచి అమెరికా కంపెనీ ప్రతిపాదన ఫైలు క్లియర్ కాలేదు. మరో కంపెనీ ప్రతిపాదన కూడా అలాగే మూలుగుతోంది.

రాష్ట్రానికి చెందిన నిపుణుల కమిటీ ఈ ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ మంత్రికి పంపితే, అక్కడి నుంచి సీఎం టేబుల్ మీదకు వెళ్లి 2, 3 నెలలు అయినా పట్టించుకోవట్లేదు. ఈ కేంద్రానికి రెగ్యులర్ సీఈవో దేవుడెరుగు.. రెగ్యులర్ స్వీపర్ కూడా లేడు. ఒకే ఒక్క అధికారిని తీసుకొచ్చి ఇక్కడ పారేశారు. కరెంటు కూడా తాత్కాలిక కనెక్షనే. బోర్లున్నాయి గానీ, మోటార్లు లేవు. బ్యాంకుల్లో డబ్బులున్నా ఖర్చుపెట్టరు. కంపెనీలు ముందుకొచ్చి, పరిశోధన చేస్తామన్నా.. వారికి అనుమతులు ఇవ్వరు. ఇదీ మన రాష్ట్ర పరిస్థితి.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి 3 పేజీల లేఖ, 28 ఫొటోలతో నివేదిక పంపారు. అయినా ఇంతవరకు చేసింది సున్నా. చంద్రబాబు కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నం కాబట్టి పక్కన పెట్టాలని అనుకోకుండా.. దీన్ని ఉపయోగంలోకి తీసుకురండి. డబ్బులున్నా, వాడేందుకు మీకు మనసు రాదు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి, రైతులకు మంచి చేయాలని కోరుతున్నా. ఇది 650 ఎకరాల క్యాంపస్. ఇది ఉపయోగంలోకి వస్తే రైతులకు మేలు జరుగుతుంది

వైఎస్ జగన్ ను కలిసిన సీపీఐ నేతలు


వైఎస్ జగన్ ను కలిసిన సీపీఐ నేతలు
పులివెందుల: కరువు ప్రాంతానికి వరంగా మారిన హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ కోసం రాజీలేని పోరాటం చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల వెళుతున్న ఆయనను గురువారం సీపీఐ నేతలు కలిశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన హంద్రీ-నీవా ప్రాజెక్ట్ పై ఉద్యమించాలని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు.

అంతకు ముందు వైఎస్ జగన్ ఓబులదేవరచెరువులో పశుగ్రాసం పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. మరింత నాణ్యమైన పశుగ్రాసం పంపిణీ చేయాలని ఆయన... అధికారులకు  సూచించారు.  కాగా నేటి నుంచి రెండు రోజుల పాటు వైఎస్ జగన్ పులివెందులలో ఉండనున్నారు.

ఐజీ కార్ల్ ను సందర్శించనున్న వైఎస్ జగన్


ఐజీ కార్ల్ ను సందర్శించనున్న వైఎస్ జగన్
పులివెందుల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాలో  పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన పులివెందుల చేరుకున్నారు. స్థానికంగా ఉన్నఇందిరాగాంధీ అంతర్జాతీయ పశుపరిశోధన కేంద్రం  (ఐజీ కార్ల్) ను ఆయన సందర్శిస్తారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అలాగే శుక్రవారం ఉదయం 10 గంటలకు ఒంటిమిట్ట శ్రీ కోదండరాము స్వామివారిని వైఎస్ జగన్ దర్శించుకుంటారు.
మధ్యాహ్నం 12 గంటలకు కమలాపురంలో జరిగే దర్గా ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత 3.00 గంటలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను వైఎస్ జగన్ సందర్శించనున్నారు. అనంతరం నక్కలపల్లె ఎస్ఎస్ ట్యాంకును పరిశీలించనున్నారు. శనివారం పులివెందులలోని క్యాంపు క్యారాలయంలో ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.

పబ్లిసిటీకోసం బాబు ఎంతైనా ఖర్చు చేస్తారు.సాయమంటే చేతులు రావు


సాయమంటే బాబుకు చేతులు రావు: వైఎస్ జగన్విశాఖ జిల్లా గోకులపాడులో బాణసంచా పేలుడు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎప్ జగన్
* వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజం
* పబ్లిసిటీకోసం బాబు ఎంతైనా ఖర్చు చేస్తారు
* రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దమ్మిడీ సాయం చేయలేదు
* కార్మికులు మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తామని అసెంబ్లీలో చెప్పారు..
* కానీ రూ.2 లక్షలిచ్చి చేతులు దులుపుకున్నారు
* విశాఖ జిల్లాలో బాణసంచా పేలుడు
* మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ
* పార్టీ తరఫున ఆదుకుంటామని భరోసా
* ప్రభుత్వం నుంచి పూర్తి సాయం కోసం పోరాడతామని ప్రకటన

 
 
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘చంద్రబాబు పబ్లిసిటీ కోసమైతే ఎంతైనా ఖర్చు చేస్తారు. కానీ బాధితులకు సాయం చేయమంటే గింజుకుపోతారు. అందుకు చేతులు రావు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దమ్మిడీ సాయం చేయలేదు. పైగా రైతు ఆత్మహత్యలు ఎక్కడ జరిగాయని అన్నారు. చంద్రబాబుకు పబ్లిసిటీయే కావాలి. అందుకు ఎంతైనా ఖర్చు చేస్తారు. పబ్లిసిటీ వస్తుందంటే రూ.5 లక్షలు అయినా ఇస్తారు. అదే పబ్లిసిటీ రాదంటే శనక్కాయలు విసిరినట్లు విసురుతారు. అది కూడా ఒక్కొక్కరికీ ఒక్కోలా ఇస్తారు తప్ప బాధితులకు సరైన న్యాయం చేయరు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విశాఖపట్నం జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలో బాణసంచా పేలుడు ప్రమాదంలో మృతిచెం దిన వారి కుటుంబాలను, క్షతగాత్రుల కుటుంబాలను జగన్ బుధవారం పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఆయన రోడ్డుమార్గంలో పాయకారావుపేట చేరుకున్నారు.
 
 పేలుడులో మృతిచెందిన భూపతి సత్యన్నారాయణ కుటుంబాన్ని,తీవ్రంగా గాయపడిన బంగారి అప్పారావు కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. అనంతరం ఎస్.రాయవరం మండలం గోకులపాడు చేరుకుని.. మృతులు నూతి సత్యవతి, లింగపల్లి శేషమ్మ, సమ్మింగి రమణ, కడారి దుర్గాప్రసాద్, భూపతి లోవరాజు కుటుంబాలను ఆయన ఓదార్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కశిరెడ్డి విశ్వనాథం, నానేపల్లి దుర్గ, శెలంశెట్టి లక్ష్మి, కశిరెడ్డి కృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాణసంచా పేలుడు సంభవించిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ పర్యటన సందర్భంగా గోకులపాడులో జగన్‌మోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యంపై విరుచుకుపడ్డారు. ఆయన ఏమన్నారంటే...
 
 రూ.2 లక్షలిచ్చి చేతులు దులుపుకున్నారు
 ‘‘రాష్ట్రంలో ఏ ఫ్యాక్టరీలో కార్మికుడు చనిపోయినా రూ.5 లక్షలు పరిహారం ఇస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. గోకులపాడులో బాణసంచా ఫ్యాక్టరీ 20 ఏళ్లుగా నడుస్తోంది. ఈ ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు రూ.2 లక్షలే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇదెక్కడి న్యాయం? గాయపడిన వారికి ఏమీ ఇవ్వలేదు. గాయపడ్డ వారందరూ రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. సంపాదించే ఇంటిపెద్ద.. ఆసుపత్రిలో ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటన్న ఆలోచన ప్రభుత్వానికి లేకుండా పోయింది.
 
 ప్రజలకోసం.. ముందుండేది జగనే
 ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ప్రమాదం జరిగినా ముందుండేది జగనే. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం జరిగితే ముందుగా నేనే వెళ్లాను. ఆ తరువాతే మంత్రులు, సీఎం వచ్చారు. ఇప్పుడు గోకులపాడుకు కూడా సీఎం రాలేదు. నేనే వచ్చాను. పార్టీ తరఫున బాధితులకు సాయం చేస్తూనే ఉన్నాం. ఇవాళే కాదు ఐదారేళ్లుగా ఎలా సాయం చేస్తోంది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడూ చేస్తాం. బాధితులకు న్యాయం చేయడంకోసం ఇప్పుడూ పోరాడతాం. ఈ వ్యవహారాన్ని వదిలే ప్రసక్తే లేదు. మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో మాట్లాడిన రికార్డులు తెప్పించి సీఎంకు, కలెక్టర్‌కు లేఖలు రాస్తాను.
 
 మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలి. గాయపడినవారికి కూడా పరిహారం చెల్లించి ఆదుకోవాలి. అందుకోసం పార్టీ తరఫున పోరాడతాం. ప్రభుత్వం మెడలు వంచైనాసరే బాధితులకు న్యాయం జరిగేలా చేస్తాం’’ అని జగన్ అన్నారు. ఈ పర్యటనలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, కిడారి సర్వేశ్వరరావు, సుజయ్‌కృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యేలు చెంగల వెంకట్రావు, గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, నియోజకవర్గ సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర్ గణేష్, తిప్పల నాగిరెడ్డి, ప్రగడ నాగేశ్వరరావు, వంశీకృష్ణ యాదవ్, కోలా గురువులు, ఆదీప్‌రాజ్, బొడ్డేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 
 దిక్కులేని వాళ్లమయ్యాం..
 జగన్ వద్ద వాపోయిన బాణసంచా పేలుడు బాధిత కుటుంబాలు
 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గోకులపాడు బాణసంచా పేలుడు మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యుల ఆవేదన చూసి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. తమకోసం వచ్చిన జగన్‌ను చూసి బాధిత కుటుంబాలు కన్నీటిపర్యంతమయ్యాయి. పాయకారావుపేటలోని మృతుడు భూపతి సత్యన్నారాయణ నివాసానికి జగన్ వెళ్లగా.. ఆయన్ను చూసి సత్యన్నారాయణ భార్య అప్పలనర్సు, కుమార్తె భవాని, కుమారుడు శ్రీనులు ఒక్కసారిగా రోదించారు. ‘ప్రమాదం ఎలా జరిగిందమ్మా’ అని జగన్ అడిగేసరికి కన్నీటిపర్యంతమై తమ బాధను వెళ్లగక్కారు. ‘‘పండ్ల వ్యాపారం కలసి రాలేదని పొట్టకూటి కోసం పదేళ్లుగా బాణసంచా పనిలోకి వెళుతున్నారు. వేతనం కొంత ఎక్కువ వస్తుందని ఆశపడ్డారు.
 
  కానీ అదే ప్రాణాలమీదకు తెచ్చింది. దిక్కులేని వాళ్లమైపోయాం’’ అని వాపోయారు. ‘కూతురు పెళ్లి కుదిరింది. డబ్బులు సర్దుబాటు చేసుకుని ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నాం. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది’’ అని ఆవేదన వెళ్లగక్కారు. ఆ కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయిన జగన్ వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున ఏమైనా సాయం అందిందా? అని ప్రశ్నించారు. రూ.2లక్షలే ఇచ్చారని అప్పలనర్సు బదులిచ్చారు. జగన్ స్పందిస్తూ.. పార్టీ తరఫున ఆదుకోవడమే కాదు.. ప్రభుత్వం నుంచి పూర్తి పరిహారం రూ.5 లక్షలు అందేలా పోరాడతానని భరోసాఇచ్చారు. ఇదిలా ఉండగా బాణసంచా పేలుడు ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బంగారి అప్పారావు కుటుంబ సభ్యులను కూడా జగన్ ఈ సందర్భంగా పరామర్శించారు.
 
 అప్పారావు పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. ‘‘కాలు బాగా దెబ్బతింది. కాలు తీసేయాలని డాక్టర్లు చెబుతున్నారు. మాకు ఏం చేయాలో తెలీడం లేదు’’ అని వారు వాపోయారు. ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా? అని వారిని జగన్ అడిగారు. తమకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని ఆ కుటుంబ సభ్యులు చెప్పడంతో జగన్ నిర్ఘాంతపోయారు. అనంతరం ఆయన గోకులపాడు చేరుకుని మృతురాలు లింగపల్లి శేషమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె భర్త అర్జబాబు, ఇద్దరు కుమారులను పరామర్శించారు. అలాగే సమ్మింగి రమణ, కడారి దుర్గాప్రసాద్, భూపతి లోవరాజు కుటుంబీకులను కూడా ఓదార్చారు.

లోవరాజు ముగ్గురు చిన్నపిల్లలను చూసి జగన్ చలించిపోయారు. పాయకారావుపేట నుంచి దార్లపూడి వచ్చి బాణసంచా తయారీ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని, ప్రమాదంలో ఇంటి పెద్ద దిక్కు లేకుండా పోయాడని లోవరాజు భార్య బోరున విలపించింది. వారి కుటుంబ పరిస్థితి తెలుసుకుని.. అధైర్యపడొద్దని, ప్రభుత్వ మెడలు వంచి మీకు సరైన న్యాయం జరిగేలా చూస్తానని జగన్ హామీఇచ్చారు. పార్టీకూడా అండగా నిలుస్తుందన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కశిరెడ్డి విశ్వనాథం, నానేపలి ్లదుర్గ, శెలంశెట్టి లక్ష్మి, కశిరెడ్డి కృష్ణ కుటుంబీకులను కూడా ఆయన ఓదార్చారు.

పట్టిసీమ అవినీతిని ప్రధానికి చెప్పారనే జగన్‌పై నిందలు


పట్టిసీమ అవినీతిని ప్రధానికి చెప్పారనే జగన్‌పై నిందలు
  • టీడీపీపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి రోజా ధ్వజం
సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి గురించిన అంశాలను తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి సమగ్రంగా వివరించడంతోనే టీడీపీ నేతలు ఉడుక్కొని ఆయనపై లేనిపోని నిందలు మోపుతున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆర్‌కే రోజా దుయ్యబట్టారు. ఆమె బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఒకవైపు రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నాయని చెబుతూనే పట్టిసీమ పేరిట రూ.1,300 కోట్లు వృథా చేస్తున్నారని మండిపడ్డారు.

ఇది లోకేష్‌కో, చంద్రబాబుకో న్యాయం చేయడానికి ఉద్దేశించిందేగానీ సీమ ప్రజలకోసం కాదని ఆమె స్పష్టం చేశారు.  పోలవరం నిర్మాణం కేంద్రం చేసేది కాబట్టి అందులో డబ్బులు రావనే ఈ పట్టిసీమను తెచ్చారేతప్ప ఇందులో ప్రజల ప్రయోజనం లేదన్నారు. ఇవన్నీ వాస్తవం కాకపోతే జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన తరువాత టీడీపీ నేతల్లో కలవరమెందుకని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ప్రధానిని కలిస్తే..  తన కేసుల కోసమని బురద జల్లుతున్నారని ఆమె తూర్పారబట్టారు.
 
మోదీపై నమ్మకం లేదా?

అసలు మీరు కలసి పోటీ చేసిన బీజేపీపై మీకు నమ్మకం లేదా? అని ఆమె సూటిగా టీడీపీ నేతలను ప్రశ్నించారు. జగన్ కలిస్తేనే మోదీ ఆయనపై కేసులు మాఫీ చేస్తారని మీరు అంటున్నారంటే.. ప్రధాని కోర్టు కేసులు తారుమారు చేస్తారని మీరు భావిస్తున్నారా?, మోదీని అనుమానిస్తున్నారా? స్పష్టంగా చెప్పాలని రోజా నిలదీశారు. బాబు, టీడీపీ నేతల మాదిరిగా జగన్‌కు కూడా కాళ్లు పట్టుకునే నీచమైన బుద్ధి ఉంటే ఈరోజు ఆయన ‘తెలుగు కాంగ్రెస్’ పెట్టిన కేసుల్లో ఇరుక్కునే వారు కాదని స్పష్టం చేశారు. జగన్ ఢిల్లీలో ఎవరిని కలసినా.. ఆ వెంటనే అక్కడే జాతీయ మీడియా ముందే మాట్లాడారని, కానీ బాబు మోదీని కలసిన తరువాత ఢిల్లీలో మాట్లాడకుండా రాష్ట్రానికి వచ్చి తనకు అనుకూల మీడియాలో కేంద్రం  అన్యాయం చేస్తున్నట్టుగా ప్రకటన చేస్తుంటారని ఆమె దుయ్యబట్టారు. బాబును కాపాడడంకోసం ఆనాడు తన స్పీకర్ పదవిని కూడా పణంగా పెట్టి ఎన్టీఆర్‌ను సీఎంగా తన చివరి ప్రసంగం చేయకుండా ఆయన మైక్ కట్ చేసిన వ్యక్తి యనమల  అని రోజా దుయ్యబట్టారు.
 
జగన్ వెళ్లిన వేళా విశేషమో ఏమో..

జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన వేళా విశేషమో ఏమో.. అదేరోజు రాష్ట్రానికి నిధులు వచ్చినప్పటికీ తాము ఆ విషయాలపై ఏమీ మాట్లాడలేదుగానీ..  కేంద్రమంత్రి నిధుల విడుదల ప్రకటన చేయగానే టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహనరావు, సుజనా చౌదరిలు చేసిన హడావుడిని అంతా టీవీల్లో చూశారన్నారు.

ట్యాక్స్ పై కేసీఆర్ సర్కార్ ఆలోచించాలి

Written By news on Wednesday, April 1, 2015 | 4/01/2015


ట్యాక్స్ పై కేసీఆర్ సర్కార్ ఆలోచించాలి
హైదరాబాద్ : ఏపీ వాహనాలపై ట్యాక్స్ విషయంలో పునరాలోచించాలని కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్ లో కొండా రాఘవరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలతో ప్రజలపై భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ సర్కార్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే ఏపీ వాహనాలకు పన్ను చెల్లించాలనే అంశంపై రెండు ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని కొండా రాఘవరెడ్డి సూచించారు.

ప్రభుత్వం చెబుతున్నదేంటి చేస్తున్నదేంటి


'ప్రభుత్వం చెబుతున్నదేంటి చేస్తున్నదేంటి'
విశాఖపట్నం :
ప్రభుత్వం చెబుతున్నదేంటి.. చేస్తున్నదేంటని ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  మండిపడ్డారు. విశాఖపట్నంలోని పాయకరావుపేట చేరుకొని గోకులపాడు బాణసంచా పేలుళ్ల ఘటనలో మృతిచెందిన భూపతి సత్యనారాయణ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని స్వయంగా కార్మికశాఖ మంత్రే తెలిపారని, కానీ  రూ.2 లక్షలు ఇవ్వడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీలో కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటనను జిల్లా కలెక్టర్ కి అందజేస్తామని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. రమణ, భూపతి లోవరాజు, కేదారి దుర్గ, లింగంలపల్లి శేషమ్మ, నూతి సత్యవతి కుటుంబాలను కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. పేలుళ్ల తర్వాత క్షతగాత్రులు, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుంటోందన్న విషయాలను కూడా ఆయన ఆరా తీస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, తగిన సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కుటుంబాలు ఎలా గడుస్తున్నాయన్న విషయాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.

మోదీపై మీకేమైనా అనుమానమా?


'మోదీపై మీకేమైనా అనుమానమా?'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేతలు ఎందుకు కలవరపడుతున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ ప్రజాసమస్యలపై ప్రధాని మోదీని కలిస్తే దాన్ని వక్రీకరించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మీరు కలిసి పోటీ చేసిన బీజేపీపైనే నమ్మకం లేదా, మోదీపై మీకేమైనా అనుమానమా అని సూటిగా ప్రశ్నించారు.

దొడ్డిదారిన మంత్రి అయిన యనమల రామకృష్ణుడు.. వైఎస్ జగన్ ను విమర్శించడం వింతగా ఉందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు బండారం బయటపడుతుందని టీడీపీ నేతలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. పట్టిసీమ వల్ల ప్రయోజనం రాయలసీమకు కాదు.. చంద్రబాబు, లోకేశ్ లకేనని రోజా అన్నారు.

జ్యోతుల నెహ్రుకు వైఎస్ జగన్ పరామర్శ


జ్యోతుల నెహ్రుకు వైఎస్ జగన్ పరామర్శ
రాజమండ్రి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రు కుటుంబాన్ని పరామర్శించారు. ఈరోజు ఉదయం ఆయన  హైదరాబాద్ నుంచి విమానంలో మధురవాడ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో జగ్గంపేట  మీదగా ఇర్రిపాక వెళ్లారు. ఇటీవల నెహ్రు సోదరుడు సత్తిబాబు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా వైఎస్ జగన్ తో పాటు పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు జ్యోతుల నెహ్రును పరామర్శించారు.

జైట్లీకి వినతిపత్రం సారాంశమిదీ...

జైట్లీకి వినతిపత్రం సారాంశమిదీ...
 
 ూ విభజన తర్వాత ఏపీకి ఐదేళ్ల పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వర్తింపజేస్తామన్న నాటి ప్రధాని హామీని సత్వరం నెరవేర్చాలి.
 
 ఇచ్చిన హామీ మేరకు ఏపీ వాస్తవిక రెవెన్యూ లోటును రీయింబర్స్ చేయాలి.
 ూ ప్రకాశం జిల్లా వంటి తక్కువ తలసరి ఆదాయమున్న ఇతర జిల్లాలకూ ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇవ్వాలి.
 
 పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేయాలి. ఆచరణ సాధ్యం కాని పట్టిసీమ ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి.
 
 రాష్ట్ర రాజధాని నిర్మాణానికి డీగ్రేడెడ్ అటవీ భూములను డీనోటిఫై చేస్తానని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గుంటూరు జిల్లాలో వేలాది ఎకరాల డీగ్రేడెడ్ అటవీ భూములు ఉన్నా.. బహుళ పంటలు సాగయ్యే 30 వేల ఎకరాలను భూములను భూ సమీకరణ పేరుతో సేకరించటాన్ని రైతులతో పాటు, ప్రతిపక్షంగా మేమూ వ్యతిరేకిస్తున్నాం.
 
  కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం 2015-16 బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. రాష్ట్ర రాజధాని కోసం భారీ మొత్తంలో నిధులు కేటాయించాలి.
 
  హిమాచల్‌ప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు పారిశ్రామిక వృద్ధి కోసం ఇచ్చిన పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను ఆంధ్రప్రదేశ్‌కూ ప్రకటించాలి.
 
 పన్ను ప్రోత్సాహకాలను మొత్తం రాష్ట్రానికి వర్తించేలా ప్రకటించాలి.
 
 కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖల్లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ, తిరుపతి, విజయవాడలోని విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయికి అభివృద్ధి చేయడం, విశాఖ, విజయవాడ మెట్రో రైలు వసతి ఏర్పాటుచేయడం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, చిత్తూరు జిల్లాలో ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్ మన్నవరం ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలి.
 
 రెండు రాష్ట్రాల్లో ఏర్పాటుచేయాల్సిన విద్యాసంస్థలు, వైద్య సంస్థలకు ఇతోధికంగా నిధులు కేటాయించి సత్వర నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలి.
 
 సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, తదితర రైల్వే రంగ హామీలన్నీ నెరవేర్చాలి.
 ూ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నింటినీ త్వరగా నెరవేర్చాలి. ప్రాణహిత - చేవెళ్ల, దుమ్మగూడెం - నాగార్జునసాగర్ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలి.
 
 తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.


కేసీఆర్.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి
ఏపీ నుంచి వచ్చే వాహనాలపై పన్ను విధించటం సరికాదు: వై.ఎస్.జగన్
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై పన్ను విధించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు పెరిగేలా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ విప్ వై.వి.సుబ్బారెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, పి.వి.మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాశ్‌రెడ్డిలతో కలసి వై.ఎస్.జగన్ మంగళవారం సాయంత్రం ఆర్థికమంత్రి జైట్లీని ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో ఆయన కార్యాలయంలో కలిశారు. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించేందుకు వీలుగా భారీగా నిధులు కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అమలుచే సి రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించిన 8 పేజీల వినతిపత్రాన్ని జైట్లీకి కూడా అందించారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నిన్న (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చెప్పిన అంశాలను అరుణ్‌జైట్లీకి కూడా నివేదించాం. రాష్ట్రానికి మంచి చేయాలని కోరాం. ఆయన సానుకూలంగా విన్నారు. మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం...’’ అని పేర్కొన్నారు.
 
 రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నారు...
 ‘పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నిధుల దుర్వినియోగంపై ఏమైనా చెప్పారా?’ అని మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘పట్టిసీమ గురించి ఆర్థికమంత్రికి కూడా చెప్పాం. 21.9 శాతం ఎక్సెస్‌కు కోట్ చేయడం, టెండర్లు వేసిన తరువాత ఎక్సెస్‌ను బోనస్‌గా మార్చడం, టెండరు పిలవకముందు బోనస్ అనే క్లాజ్ లేకపోవడం, కోట్ చేసిన తరువాత ఎక్సెస్‌లో 16.9 శాతం బోనస్‌గా ప్రకటించడం వంటి అంశాలన్నీ తెలియజేశాం. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని నిబంధనలు ఏవిధంగా ప్రభావితం చేయనున్నాయో వివరించాం...’’ అని పేర్కొన్నారు. ‘గోదావరి ప్రజలు పట్టిసీమ వద్దని అంటున్నారు.
 
 వారిని కూడగడతారా?’ అని మరో విలేకరి అడిగిన ప్రశ్నకు.. ‘‘మేం పట్టిసీమపై మొదటి నుంచీ స్పష్టంగా ఉన్నాం. జరుగుతున్నది అన్యాయం. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగానే.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని 7(ఇ) క్లాజ్ ప్రకారం 35 టీఎంసీల నీళ్లు వెళ్లిపోతాయి. ఇప్పుడు పట్టిసీమ పనులు మొదలుపెట్టగానే 7(ఎఫ్) క్లాజ్ వల్ల మరో 35 టీఎంసీలు వెళ్లిపోతాయేమోనన్న భయం మాలో చాలా ఎక్కువగా ఉంది. ప్రాజెక్టులు మొదలుపెట్టగానే.. కృష్ణాకు వచ్చే 70 టీఎంసీల నీళ్లు దూరమవుతాయేమోనన్న భయం ఉంది. ఎటువంటి స్టోరేజీ కెపాసిటీ నిర్మాణం లేకుండా కేవలం డబ్బులు సంపాదించుకోవాలన్న ఒకే ఒక్క కారణంతో ఈమాదిరిగా రాష్ట్రాన్ని పణంగా పెట్టడం తప్పు అని స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి దీనిని ప్రతి వేదికపైనా కచ్చితంగా వ్యతిరేకిస్తాం...’’ అని బదులిచ్చారు.
 
 కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి...
 
 తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వాహనాలపై పన్ను విధించడాన్ని ఎలా చూస్తారని ఇంకో విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా ‘‘పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు చేయనప్పుడు.. ఒకే భాష మాట్లాడుకుంటున్న మనం చేయడమన్నది సరికాదని మేం మొదటి నుంచీ చెప్తున్నాం. ఒకే భాష మాట్లాడుతాం. మనుషులమంతా కలిసే ఉంటాం. మనం మనం పెరగాలనే చూడాలి తప్ప.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే కరెక్టు.. కేసీఆర్ కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకుని ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు పెంచాలి...’’ అని జగన్ స్పందించారు.

జగ్గంపేట, విశాఖకు నేడు జగన్
 
 వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటకు ఆయన వెళతారు. అక్కడ ఆయన వైఎస్సార్‌సీ శాసనసభాపక్షం ఉప నేత జ్యోతుల నెహ్రూ సోదరుడి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. నెహ్రూ సోదరుడు ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. అక్కడ పరామర్శించిన తరువాత జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నానికి బయల్దేరి వెళతారు. గోకులపాడులో జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబీకులను జగన్ ఓదారుస్తారు.

పట్టిసీమ వల్ల పోలవరానికి ప్రమాదం: వైఎస్ జగన్

Written By news on Tuesday, March 31, 2015 | 3/31/2015


పట్టిసీమ వల్ల పోలవరానికి ప్రమాదం: వైఎస్ జగన్ఏపీ సమస్యలు అరుణ్ జైట్లీకి వివరిస్తున్న వైఎస్ జగన్, ఎంపీలు సుబ్బారెడ్డి, మేకపాటి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో  వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీకి వివరించిన అంశాలను అరుణ్ జైట్లీకి వివరించినట్లు చెప్పారు. పట్టిసీమ వల్ల పోలవరం కోల్డ్ స్టోరేజీకి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పినట్లు తెలిపారు. పట్టిసీమలో ఎక్సెస్ టెండర్లు వేసిన అంశాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై తమ ఆందోళనను మంత్రి ముందు ఉంచినట్లు చెప్పారు. ఎలాంటి రిజర్వాయర్ లేకుండా కేవలం డబ్బు కోసం ఈ టెండర్లు పిలిచినట్లు తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు, రాజధాని నిర్మాణంపై చర్చించినట్లు వివరించారు. తాను చెప్పిన సమస్యలు అరుణ్ జైట్లీ సానుకూలంగా విన్నారన్నారు. రాష్ట్రానికి మంచి చేయాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. మంచి జరుగుతుందన్న ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు. ప్రతి వేదిక వద్ద పట్టిసీమ అంశంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పన్నుపై పునరాలోచన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని కోరుతున్నట్లు తెలిపారు. ఏపీ వాహనాలపై పన్నును ఉపసంహరించుకోవాలని కేసీఆర్ ని కోరతామని చెప్పారు.  రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని వైఎస్ జగన్ అన్నారు.

ఏపీ వాహనాలపై పన్ను వద్దు: కేసీఆర్ కు వైఎస్ జగన్ వినతి


ఏపీ వాహనాలపై పన్ను వద్దు: కేసీఆర్ కు వైఎస్ జగన్ వినతిఢిల్లీలో విలేకరులతో మాట్టాడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డివీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్:  ఏపీ వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం ఈ అర్ధరాత్రి నుంచి  పన్ను విధించనున్నట్లు తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఏపీ వాహనాలపై పన్ను విధించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని కోరనున్నట్లు తెలిపారు. ''రాష్ట్రాలు విడిపోయినా మనది ఒకే భాష.మనం అందరం కలిసే ఉంటాం. రెండు రాష్ట్రాలూ ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోకూడదు'' అని  వైఎస్ జగన్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే అన్ని రకాల వాణిజ్య వాహనాల నుంచి ప్రవేశ పన్ను (ఎంట్రీ ట్యాక్స్) వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ రాష్ట్రంలో త్రైమాసిక పన్ను చెల్లించినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలో తిరిగేందుకు ఉన్న వెసులుబాటు మార్చి 31తో ముగుస్తోంది. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ప్రస్తుత విధానాన్ని కనీసం మరో ఐదేళ్లైనా కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం చేసిన విన్నపాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని  ప్రైవేట్ బస్సుల యజమానులు ఈ అర్ధరాత్రి నుంచి తెలంగాణకు వచ్చే బస్సులను ఆపివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.

ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో  సమావేశం ముగిసిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాష్ట్రాల మధ్య పన్నుపై పునరాలోచన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని కోరుతున్నట్లు తెలిపారు. ఏపీ వాహనాలపై పన్నును ఉపసంహరించుకోవాలని కేసీఆర్ ని కోరతామని చెప్పారు. 

రేపు వైఎస్ జగన్ తూ.గో, విశాఖ జిల్లాల పర్యటన


రేపు వైఎస్ జగన్ తూ.గో, విశాఖ జిల్లాల పర్యటనవైఎస్ జగన్ మోహన్ రెడ్డి
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు(బుధవారం) విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు.  ఈ నెల 29న జరిగిన గోకులపాడు బాణాసంచా పేలుడు ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ చెప్పారు.

విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడినవారిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. దీంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో కూడా వైఎస్ జగన్ పర్యటించనున్నారు. గత కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించిన జ్యోతిల నెహ్రూ సోదరుడు సత్యనారాయణ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.

వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య


అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ భాస్కర్ రెడ్డిని టీడీపీ వర్గీయులు దారుణంగా హతమార్చారు. పెద్ద వడుగూరు మండలం కిష్టిపాడు గ్రామ సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్న అతనిపై  మంగళవారం ఉదయం టీడీపీ వర్గీయులు కొడవళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు.
 
సొసైటీ కార్యాలయంలో  విజయ్ భాస్కర్ రెడ్డి సమావేశం నిర్వహిస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. దాంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కలెక్టర్ గైర్హాజరు: నిలదీసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు


కలెక్టర్ గైర్హాజరు: నిలదీసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
కడప: వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటన మంగళవారం కడప జడ్పీ సమావేశంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో జడ్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరుకాలేదు. దీంతో జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు... కలెక్టర్ కె.వి.రమణ ఎందుకు ఈ సమావేశానికి హజరుకాలేదంటూ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులను నిలదీశారు.
ఈ అంశంపై ఉన్నతాధికారులు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉండి కలెక్టర్ ఈ సమావేశానికి హాజరుకాకపోవడం సరైనది కాదని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. పోలీసులు, అధికారులు జిల్లాకు చెందిన తమ పార్టీ ఎమ్మెల్యేలను అడుగడుగునా అవమానపరుస్తున్నారని ఆయన ఆరోపించారు.  సీఆర్ఎఫ్ నిధుల విషయంలో కలెక్టర్ సమాధానం చెప్పాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.
పారిశ్రామికవేత్తలు కడప రావాలంటే భయపడుతున్నారని జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ అంశం కడప జిల్లా వాసుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అన్నారు.

ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణ ఆపకండి

  • శాంతకుమార్  కమిటీ సిఫారసులను తిరస్కరించండి
  • ప్రధానమంత్రికి వైఎస్సార్ కాంగ్రెస్ వినతిపత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఎఫ్‌సీఐ ద్వారా చేపట్టే ధాన్యం సేకరణను నిలిపివేసే ప్రయత్నలను ఉపసంహరించుకోవాలని.. ఎరువుల సబ్సిడీని పరిమితం చేయరాదని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని వైఎస్సార్ కాంగ్రెస్ కోరింది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు సోమవారం ప్రధానిని కలిసి ఈమేరకు ఒక వినతిపత్రం అందించారు. ‘‘ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)ను పునర్‌వ్యవస్థీకరించేందుకు వీలుగా శాంతకుమార్ కమిటీ చేసిన సిఫారసుల నివేదికను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే వ్యవసాయాధారిత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులకు ఇది పెద్ద దెబ్బగా పరిణమిస్తుంది. చివరకు దేశ ఆహార భద్రతకు కూడా ముప్పు తెస్తుంది. ఆ సిఫారసులను ఆమోదిస్తే అటు ఆహార భద్రతతో పాటు.. దేశంలో వ్యవసాయరంగంపై ఆధారపడిన 50 శాతం మంది ప్రజల జీవనోపాధి కూడా దెబ్బతింటుంది’’ అని ఆ వినతిపత్రంలో ఆందోళన వ్యక్తంచేశారు. వినతిపత్రంలోని ముఖ్యాంశాలివీ...
 
ఎఫ్‌సీఐ సేకరించకపోతే...

‘‘రైతులు తమ పంటలను మంచి ధర వచ్చేంతవరకు గిడ్డంగుల్లో దాచుకునే పరిస్థితి లేదు. పంట పండిన కొద్ది రోజుల్లోనే వారు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ పంటను ఎఫ్‌సీఐ సేకరించలేదంటే తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతయి. ఇది మానవ తప్పితమైన విషాదంగా మారుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితినే చూస్తే 2010-11లో మంచి దిగుబడులు వచ్చాయి. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఎఫ్‌సీఐ కూడా కనీస మద్దతు ధర రైతులకు అందేలా చేయడంలో విఫలమైంది. రైతులు క్వింటాలు ధాన్యాన్ని రూ. 300 ధరకు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. ఇది రైతులను తీవ్రంగా కుంగదీసింది. దీంతో వారు క్రాప్ హాలిడే ప్రకటించారు.
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌సీఐ 80 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 35 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించారు. పైగా పంట చేతికి వచ్చిన అక్టోబరు, నవంబరు మాసాల్లో సేకరణ జరగలేదు. దీని కారణంగా రైతులు కనీస మద్దతు ధర కంటే రూ. 150 తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. అలాగే సరైన సమయంలో పత్తి పంట సేకరించడంలో సీసీఐ పూర్తిగా విఫలమైంది. రైతులు తక్కువ ధరకే మధ్యవర్తులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎఫ్‌సీఐల విధులను రాష్ట్రాలు నిర్వర్తిస్తాయని కేంద్రం ఎలా నమ్ముతోంది? గడిచిన పదేళ్లలో 75 శాతం ధాన్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్‌సీఐ బాధ్యతలను స్వీకరించేందుకు ఆర్థిక వనరులెక్కడివి? ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 2015-16 బడ్జెట్‌లో మార్కెట్ నిర్వహణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలుస్తోంది.’’
 
స్వామినాథన్ సిఫారసులు అమలుచేయండి

‘‘మద్దతు ధరను నిర్ధారించేందుకు ఎం.ఎస్.స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలుచేయాలని నాడు ఎన్‌డీయే కూడా కోరింది. కానీ 2014-15 సంవత్సరంలో ఎన్‌డీయే అతి తక్కువగా కనీస మద్దతు ధరను పెంచింది. పంట ఉత్పత్తికి అయ్యే వ్యయంతోపాటు 50 శాతం లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని ఎంఎస్‌పీని ఖరారుచేయాలని ఆ కమిషన్ సూచించింది. ఉత్పత్తి వ్యయాలు అధికమవుతున్న నేపథ్యంలో 2015-16 ఖరీఫ్ సీజన్‌లో వరికి కనీసం రూ. 1,700 ఎంఎస్‌పీగా ఖరారుచేయాల్సిన అవసరముంది. లేదంటే రైతులు దురవస్థలోనే కొనసాగుతారు. మా రాష్ట్రంలో రైతులు వరస తుఫాన్లతో, వరద్లతో గడిచిన నాలుగేళ్లుగా నష్టపోతున్నారు. రాయలసీమ ప్రాంతం,  తెలంగాణ రాష్ట్రం తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఒక తుపాను నుంచి కోలుకోకముందే మరో తుపానులో రైతు కొట్టుకుపోతున్నాడు. ఇలా దెబ్బతిన్న రైతుల్లో ఒక శాతం వారినీ రాష్ట్రం ఆదుకోవడం లేదు. ఉదాహరణకు ఇటీవల హుద్‌హుద్ తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం రూ. 21 వేల కోట్ల మేర నష్టపోతే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కనీసం దీనిలో 10 శాతం కూడా పునరావాసానికి, సహాయ చర్యలకు ఖర్చుపెట్టలేకపోయాయి.’’
 
ఎరువుల సబ్సిడీని పరిమితం చేయకండి

 ‘‘శాంతకుమార్ కమిటీ ప్రస్తుతం ఉన్న పద్ధతిని రద్దు చేసి హెక్టారుకు రూ. 7వేల చొప్పున ఎరువుల సబ్సిడీ ప్రకటించాలని సిఫారసు చేసింది. ఏపీ వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎన్‌పీకే వినియోగం చాలా ఎక్కువ. హెక్టారుకు రూ. 7 వేలకు పరిమితి విధిస్తే మాలాంటి రాష్ట్రాల్లో ఒక్క పంటకు కూడా సరిపోదు.  రెండో పంటకు రైతులు సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరకు కొనుక్కోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల శాంతకుమార్ నివేదికను తిరస్కరించండి. కనీస మద్దతు ధరను ఖరారు చేసేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలుచేయండి.’’

ఆ రోజు చంద్రబాబును ఈ ప్రశ్న అడగలేదేం?


పోలవరం వేగం పెంచండి
ప్రాజెక్టుపై భయాలను తొలగించండి.. ‘పట్టిసీమ’ను ఆపించండి ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినతి
 ‘పట్టిసీమ’ పేరుతో చంద్రబాబు నిర్వాకాన్ని ప్రధానికి వివరించాం
 డబ్బులు దండుకోవడానికే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారు
 తన వారికి టెండర్ ఇప్పించి.. ఎక్సెస్‌ను బోనస్‌గా సమర్థించుకున్నారు
 ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 70 టీఎంసీల నీళ్లు కోల్పోయే ప్రమాదం
 ప్రత్యేక హోదా, రాజధానికి నిధులు వంటి హామీలను
 కచ్చితంగా అమలు చేయాలన్నాం
 మోదీతో భేటీ తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించిన జగన్
 
 సాక్షి, న్యూఢిల్లీ: పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న విధానాలు.. ఆ ప్రాజెక్టు కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తలెత్తుతున్న ఆందోళనలు, భయాల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరించామని.. వీటి ని నివృత్తి చేయాలని కోరామని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా నిర్మించటంతో పాటు.. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేసేలా జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ‘‘గతంలో ఓసారి ప్రధానమంత్రిని కలిసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విషయాలపై విన్నవించాం. వాటినే మళ్లీ ఒకసారి గుర్తుచేయాలని వచ్చాం. కచ్చితంగా వాటిని అమలు చేయాలని విన్నవించాం.
 
 ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అమలు చేయాలని కోరాం. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని అడిగాం. రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తిచేశాం. పారిశ్రామికాభివృద్ధి, ప్రత్యేక ప్రోత్సాహకాలు, రైల్వే జోన్ అడిగాం. ఎయిమ్స్ తదితర జాతీయ స్థాయి విద్యాసంస్థలను సత్వరం ఏర్పాటు చేయాలన్నాం. వీటన్నింటి కీ తోడు.. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చాం’’ అని ఆయన వివరించారు. సోమవారం ఢిల్లీలోని 7 రేస్ కోర్సు రోడ్డులో ప్రధాని నివాసంలో నరేంద్రమోదీని.. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, పి.వి.మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాశ్‌రెడ్డిలతో పాటు కలిసిన జగన్‌మోహన్‌రెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
 
 పట్టిసీమపై భయాలను నివృత్తి చేయాలని కోరాం...
 
 ‘‘పట్టిసీమ అన్న ప్రాజెక్టు ఏరకంగా పోలవరం ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్‌లో పడేసే పరిస్థితి తీసుకొస్తుందేమోనని మా భయాలు, ఆందోళనలు చెప్పాం. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాల్సిన ఆవశ్యకతను చెప్పాం. గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ చెప్పినట్టుగా 7(ఇ), 7(ఎఫ్) నిబంధనల మేరకు ఏ రకంగా రాష్ట్రానికి అన్యాయం జరగనుందో వివరించాం. 7(ఇ) ప్రకారం పోలవరం పనులు మొదలుపెట్టిన వెంటనే, సీడబ్ల్యూసీ అనుమతి వచ్చిన వెంటనే 35 టీఎంసీల నీటిని పైన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలు ఇవ్వడం మానేసే ప్రమాదం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి తో సంబంధంలేకుండా 35 టీఎంసీలు పోతాయని ఓవైపు ఆందోళన ఉంది. మరోవైపు 7(ఎఫ్) క్లాజ్ ఇంకా ప్రమాదకరమైంది. గోదావరి నుంచి ఎన్ని నీళ్లు మళ్లిస్తారో.. వాటికి సమానంగా కర్ణాటక, మహారాష్ట్రలు కూడా వాటా అడిగే హక్కు ఉంటుందని ఆ క్లాజ్ చెబుతోంది. వీటిని కూడా ప్రధానమంత్రికి వివరించాం. పట్టిసీమకు పునాది రాయి వేశారు కాబట్టి ఈ క్లాజ్ చూపి 35 టీఎంసీల నీటిని ఆపేస్తాయని భయంగా ఉంది. మా భయాల మధ్య ఈ ప్రాజెక్టు సాగుతోంది. వీటిని నివృత్తిచేయాలని విన్నవించాం. పైగా పట్టిసీమ ప్రాజెక్టును స్టోరేజీ కెపాసిటీ లేకుండా కడుతున్నారు. స్టోరేజీ కెపాసిటీ ఉంటేనే వరద వచ్చినప్పుడు నిల్వ చేసుకోగలుగుతాం.
 
 అలా స్టోరేజ్ చేసుకునే సామర్థ్యమే పోలవరం ప్రాజెక్టు. 119 టీఎంసీల నీటిని స్టోర్ చేసుకునే సామర్థ్యం పోలవరం ఇస్తుంది. మరి పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ఎందుకు ఇంత తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇది రాయలసీమ ప్రజలపై ఉన్న ప్రేమ ఎంతమాత్రం కాదు. ఆయనకు నిజంగా రాయలసీమపై ప్రేమ ఉంటే.. అక్కడి ప్రాజెక్టులు పూర్తయ్యేలా నిధులు కేటాయించేవారు. ఆయనకు ఎంత ప్రేమ ఉందో రాయలసీమ ప్రాజెక్టుకు కేటాయిం చిన నిధులను పరిశీలిస్తే అర్థమవుతుంది. గాలేరు-నగరి ప్రాజెక్టు పూర్తికావాలంటే రూ. 2,600 కోట్లు కావాలి. కానీ ఇచ్చింది రూ. 169 కోట్లు మాత్రమే. హంద్రీ - నీవా పూర్తికావాలంటే రూ. 1,100 కోట్లు కావాలి. కానీ ఇచ్చింది రూ. 200 కోట్లు. వెలిగొండకు రూ. 150 కోట్లు కేటాయించారు. కానీ పూర్తికావాలంటే రూ. 1,500 కోట్లు కావాలి. బాబు చేసిన కేటాయింపులు నిర్వహణకే సరిపోతాయి. ప్రాజెక్టుల పూర్తికి సరిపోవు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
 
 బియ్యం సేకరణ జరగాలి...
 
 ‘‘ఇదికాకుండా శాంతకుమార్ కమిటీ నివేదికను అమలుచేయరాదని ప్రధానిని కోరాం. ఎఫ్‌సీఐ బియ్యం సేకరణను ఆపేస్తే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోతారు. కనీస మద్దతు ధర దిగజారిపోతుంది. 2010-11లో ఎఫ్‌సీఐ ఇదేమాదిరిగా వెనకడుగు వే సినప్పుడు రైతులకు కనీస మద్దతు ధర దొరకక, క్వింటాలుకు రూ. 300 కూడా దొరకని పరిస్థితిలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన సంగతిని ప్రధాని దృష్టికి తెచ్చాం. ఈ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని కోరాం. సానుకూలంగా స్పందించారు. మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని జగన్ వివరించారు.
 
 ఆ రోజు చంద్రబాబును ఈ ప్రశ్న అడగలేదేం?
 
 ‘ఇది ముఖాముఖి సమావేశమా? అందరూ కలిశారా?’ అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘చీకట్లో చంద్రబాబు చిదంబరంను కలిసినప్పుడు మీరు ఎందుకు అడగలేదు? చిదంబరమే స్వయంగా పార్లమెంటులో ఈ విషయం చెప్పారు. ఆ రోజు ఎఫ్‌డీఐ అంశంపై పార్లమెంటులో ఓటింగ్ జరుగుతున్నప్పుడు మన కళ్ల ముందే చంద్రబాబు తన ఎంపీలను గైర్హాజరు చేయించారు. నేను ఏడు మంది ఎంపీలతో కలిశాను. కలిసి వచ్చాక నోట్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఏం మాట్లాడామో చెబుతున్నాం. మీరు ఎందుకు ఆ రోజు చంద్రబాబును అడగలేదు. ఏ నాయకుడైనా ఇంకొక నాయకుడిని కలిసినప్పుడు డెలిగేషన్ ఇచ్చిన తరువాత కచ్చితంగా ఓ ఐదు నిమిషాల పాటు కుశల ప్రశ్నలు వేసి.. సంబంధాలు బాగుండాలని చెప్పి చూసుకుని వస్తారు..’’ అని పేర్కొన్నారు.
 
 అధికారంలో ఉన్న
 చంద్రబాబు ఏం చేస్తున్నారు?
 
 ‘స్పెషల్ స్టేటస్ వస్తుందంటారా?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘స్పెషల్ స్టేటస్‌పై నరేంద్రమోదీని రెండు సార్లు కలిశాం. ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులను గతంలో కలిశాం. చేయగలిగిందంతా చేస్తాం. అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ఏం చేస్తున్నారు? మాది చిన్న బలం. అడగగలుగుతాం. మేం చేయగలిన ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాం. మంత్రివర్గంలో మేం లేం కదా..! బయటకు రావడానికి...’’ అని జగన్ పేర్కొన్నారు. రాయలసీమ ప్రగతిని వైఎస్సార్ సీపీ కోరుకోవడం లేదని బాబు ఆరోపిస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘నేనిప్పటివరకు చాలా స్పష్టంగా చెప్పాను. 7 ఈ, 7 ఎఫ్ అని చెప్పాను. చంద్రబాబు పుణ్యంగా రేపు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు 70 టీఎంసీల నీటిని ఆపేస్తే.. మేం ఎక్కడికిపోవాలి? ఎవరి దగ్గరికి పోవాలి? ఏంచెప్పాలి మా భయాలు? చంద్రబాబు వేరే ప్రాజెక్టులు చేస్తానంటే మేం అడ్డుపడలేదే. చేయండనే చెబుతాం. ఇంకా ఎక్కువ నిధులు కేటాయించాలనే చెబుతాం. కానీ ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న దానిని మనం కాపాడుకోవాలి కదా...’’ అని వ్యాఖ్యానించారు.
 
 
 ‘‘చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టును ఎం దుకు చేపడుతున్నారంటే.. తనకు సంబంధించిన కాం ట్రాక్టర్లకు వర్క్ ఇప్పించుకున్నాడు. అది కూడా టెండరుకు ఉండాల్సిన అవశ్యమైన నిబంధనలను మార్చేసి.. పోటీ లేకుండా చేసి.. తనకు సంబంధించిన కాంట్రాక్టర్లు మాత్రమే కోట్ చేసేలా చేసి.. తన సంబంధిత వ్యక్తులకు టెండర్లు వచ్చేలా చేసుకున్నారు. ఆ టెండర్లలో కూడా 21.9 ఎక్సెస్ కోట్ చేస్తే.. ఆ ఎక్సెస్ కోట్ చేసిన దాంట్లో అనుమతించదగిన 5 శాతం మేరకు ఒప్పుకుంటూ.. మిగిలిన 16.9 శాతాన్ని బోనస్‌గా డిక్లేర్ చేశారు. టెండర్లు పిలిచేటప్పుడు ఆ బోనస్ అంశం లేదు. కోట్ చేసిన తరువాత ఆ ఎక్సెస్ అమౌంట్‌ను బోనస్‌గా సమర్థించుకోవటం ఇంతవరకు దేశచరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అది కూడా ఒక  ఏడాదిలో పూర్తిచేయాలని పిలిచి.. టెండర్లు దాఖలయ్యాక అదే సంవత్సరంలో పూర్తిచేస్తే బోనస్ ఇస్తామని పేర్కొనడం ఇంతవరకు రాష్ట్ర చరిత్రలోనూ, దేశచరిత్రలోనూ, టెండర్ చరిత్రలోనే బహుశా ఎప్పుడూ లేని అంశం. ఇది పూర్తిగా చంద్రబాబు డబ్బులు దండుకునేందుకు చేశారని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లాం’’ అని జగన్ చెప్పారు.

Popular Posts

Topics :