04 August 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

జగన్,విజయమ్మల బహిరంగ లేఖ

Written By news on Saturday, August 10, 2013 | 8/10/2013

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి కడప లోక్ సభ సభ్యత్వానికి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు రాసిన బహిరంగ లేఖను యథాతథంగా ఈ దిగువ ఇస్తున్నాం.


 హైదరాబాద్, ఆగస్టు 10, 2013. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి,  అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు. వైఎస్ విజయమ్మ, గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే.
 బహిరంగ లేఖ


 రాష్ట్రానికి సంబంధించిన సమస్యను కాంగ్రెస్ పార్టీ మరింత జటిలం చేస్తోంది. ఎవరికీ అన్యాయం జరగకుండా, అన్ని ప్రాంతాలవారికీ ఆమోదయోగ్యమైన రీతిలో కేంద్ర ప్రభుత్వం ముందుగా తన స్టాండ్‌ను ఇక్కడి పార్టీలముందు ఉంచి, ఆ తరవాత అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరికీ అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మేం పదేపదే విజ్ఞప్తి చేశాం. అలాంటి వాతావరణం కనపడలేదు. కాంగ్రెస్ పార్టీ తానే ప్రభుత్వాన్ని అన్నట్టుగా నిర్ణయం తీసుకుంటూ, ఇక సంప్రదింపులు లేవని చెప్పటంతో మా పార్టీ ఎమ్మెల్యేలంతా గత నెల 25నే రాజీనామా సమర్పించటం జరిగింది. ఆ తరవాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీయే సమావేశాల్లో కూడా అదే నియంతత్వ ధోరణి కొనసాగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆంధ్ర, రాయలసీమల్లో ప్రజలు తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేయటాన్ని మనమంతా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ చదరంగంలో భాగంగా రాష్ట్ర విభజన పేరిట ఇక్కడి ప్రజల ప్రయోజనాలను బలిపెడుతున్న నేపథ్యంలో ఇక్కడి ప్రజల ఆగ్రహానికి, ఇక్కడి ప్రాంతాల అభిప్రాయాలకు విలువ ఇస్తూ భారత ప్రభుత్వం తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేసి సమన్యాయం చేయాల్సింది పోయి... కాంగ్రెస్ పార్టీ వారు ఎటువంటి చిత్త శుద్ధీ లేకుండా తమ పార్టీకే చెందిన సభ్యులతో, తమ పార్టీ కమిటీ అంటూ మరో డ్రామాకు తెరతీశారు.


 అలాగే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు వద్దకు ఏపీ ఎన్జీవోలు కలవటానికి వెళితే... వారు ప్రాధేయపడినా, తాను రాష్ట్ర విభజనకు బ్లాంక్ చెక్‌లా ఇచ్చిన ఉత్తరాన్ని వెనక్కు తీసుకునేది లేదని ఆయన తెగేసి చెప్పేశారు. అడ్డగోలు విభజనను ఆమోదిస్తూ నాలుగు లక్షల కోట్లతో  రాజధాని కట్టుకోవచ్చంటూ ఓ ప్రెస్‌మీట్ పెట్టారు. అవతలి ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందని తెలిసినా, స్పందిస్తే ఓట్లూ సీట్లూ తగ్గుతాయని... క్రెడిట్ రాకుండా పోతుందని స్పందించటానికి కూడా వెనకడుగు వేస్తున్న- చంద్రబాబు ఒక వైపు, రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు మరోవైపు  కోట్ల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వారు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకుని నష్టం జరగబోతున్న ప్రాంతం ప్రజలకు మద్దతు పలుకుతారని... ఆ పార్టీల పెద్దలు మా తరహాలోనే స్పందిస్తే నష్టం  జరగకుండా ఆపగలుగుతామని ఆశిస్తూ... ముందుకు వచ్చి మేం మా చట్టసభల సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నాం. ఇదే చిత్తశుద్ధిని వారు కూడా తమ రాజీనామాలతో కనబరచాలని కోరుకుంటున్నాం.


 మా ఈ రాజీనామాతో పాటు జరుగుతున్న అన్యాయాలు ఎత్తి చూపుతూ ముఖ్యమైన కొన్ని అంశాలను ప్రజలముందు ఉంచేందుకే ఈ  లేఖ రాస్తున్నాం. అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవ్వరికీ అన్యాయంగా జరగకుండా రాష్ట్రానికి సంబంధించిన అంశంలో పరిష్కారం చేయండి అని మా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించాం. అలాంటి ఆలోచనను పక్కన పెట్టి, ఇప్పుడు రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితిని ఎలా తయారు చేశారంటే...  నెత్తిన  తుపాకీ పెట్టి- ఒప్పుకుంటారా... చస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరిస్తున్నట్టుగా ఉంది.  ఒప్పుకోకపోయినా తాము చేయాల్సింది మేం చేస్తాం అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నమీదట... సీట్లూ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనాలోచిత విభజన రాజకీయం వల్ల వచ్చే సమస్యలేమిటో అందరికీ తెలిసేలా మరోసారి చెప్పకపోతే, కోట్ల మందికి తరతరాలపాటు అన్యాయం జరిగిపోతుందేమో అని మా పదవులకు రాజీనామా చేశాం. ఇప్పటికైనా అధికారంలో ఉన్నవారు కళ్ళు తెరవండి అని అడుగుతున్నాం.
 ఈ రాష్ట్ర విభజన తప్పదు అని కేంద్ర ప్రభుత్వం భావిస్తే, తెలుగు ప్రజల్ని విభజించటం కంటే వేరే దారి లేదు అని వారు అనుకుంటే...  ఒక రాజకీయ నాయకుడు తన వ్యక్తిగత లాభాల కోసమో, ఒక పార్టీ రాజకీయ లాభాల కోసమో, రాజకీయ కోణాలతోనో ఆ పని చేయకూడదు. తెలంగాణ అంశం కేంద్ర ప్రభుత్వం ఒక తండ్రిలా ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా, ఇక్కడి ప్రాంతాలు అన్నదమ్ముల్లా ఇక ముందు కూడా ఎప్పుడూ కలిసి ఉండేలా పంపకాలు చేయవలసిన సున్నితమైన అంశం. అలా అందరికీ న్యాయం చేయలేకపోతే, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నవారు విభజించే అధికారం తమ చేతుల్లోకి తీసుకోకూడదు.


 ఇక్కడ ఒకసారి ఈ రాష్ట్రం చరిత్రను గుర్తుకు తెచ్చుకోవాలి. ఏ ప్రాంతానికీ, ఏ జిల్లాకూ అనాదిగా ఒకే పరిస్థితులు లేవు. ఉదాహరణకు- భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కొన్ని మార్పులు జరిగాయి. మద్రాసు ప్రెసిడెన్సీ అన్న పదం నుంచి మద్రాసు దూరమైంది. కోస్తాంధ్ర ప్రాంతంలోని గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న భద్రాచలం ప్రాంతం అంతా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు బదలాయించారు. అలాగే మద్రాసు ప్రెసిడెన్సీలోని మన ఉత్తరాంధ్రలోని భాగమైన కోరాపుట్, రాయగఢ్ ప్రాంతాలను ఒడిస్సాలోకి బదలాయించడం జరిగింది. అలాగే రాయలసీమలో భాగమైన బళ్ళారి జిల్లాను కర్ణాటకకు చేరుస్తూ, కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని గద్వాల, అలంపూరు ప్రాంతాలను మహబూబ్‌నగర్‌కు చేర్చారు.


 అలాగే హైదరాబాద్ స్టేట్ నాలుగు డివిజన్‌లు- 1 ఔరంగాబాద్ డివిజన్, 2. గుల్బర్గా డివిజన్, 3. మెదక్ డివిజన్, 4. వరంగల్ డివిజన్ మార్పు చేర్పులకు గురయ్యాయి. ఇందులో ఔరంగాబాద్ డివిజన్ మహారాష్ట్రలోకి, గుల్బర్గా డివిజన్- మద్రాసు ప్రెసిడెన్సీలోని   బళ్ళారితో కలిసి కర్ణాటకకు పోవడం జరిగింది. ముందు చెప్పినట్లుగా గుల్బర్గా డివిజన్‌లోని రాయచూరు జిల్లాలోని కొంత భాగాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో కలపటం జరిగింది. అదే విధంగా కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని కొడంగల్, తాండూరు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చి చేరాయి. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్న నడిగూడెం, మునగాల ప్రాంతాలు గతంలో బ్రిటీష్ ఇండియాలో భాగంగా కృష్ణా జిల్లాలో ఉండేవి. కృష్ణా జిల్లాలో కంచికచర్ల దగ్గర ఉన్న పరిటాల గ్రామం నైజాం సంస్థానంలో భాగంగా ఉండేది. ఇలా అన్ని ప్రాంతాలు కూడికలు, తీసివేతలు తరువాత, మిగిలిన దానితో సంతప్తిపడి...మనం ఈ రోజున మన ప్రాంతాలను వివిధ పేర్లతో పిలుచుకోవడం జరుగుతోంది.
 ఇక్కడ ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల చారిత్రక నేపథ్యాన్ని, ఆ తరవాత మార్పు చేర్పుల్ని, ఆయా ప్రాంతాల అవసరాల్ని, ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా పరిష్కారం ఇవ్వాలి.  అన్నిటికంటే ముందు రెండు ప్రధాన సమస్యలు అధిగమించాలి.
 అనేక సమస్యలతో పాటు... 1. నీటి సమస్య 2.  హైదరాబాద్ మహానగరం అంశాలపై పరిష్కారాలు కావాలి.
 ముందు చెప్పినట్లు, ఏ పరిష్కారమైనా ఎలా ఉండాలి అంటే ఒక తండ్రి తన పిల్లలకు పంపకాలు చేసినట్లుగా ఉండాలి. ఎప్పుడూ ఆ అన్నదమ్ముల మధ్య గొడవలు పడే పరిస్థితి రాకూడదు. అలా చేయగలిగితేనే చేయాలి. ఈ దిశగా ఆలోచన చేసినప్పుడు కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా నది ప్రవాహం కర్ణాటకలోని రాయచూరు నుంచి, మహబూబ్‌నగర్ గుండా గద్వాల్, ఆలంపూర్ ప్రాంతాల ద్వారా కర్నూలులోని శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. ఆ తరువాత నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుతుంది.

 అదే విధంగా మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్‌కే పరిమితమైన నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. 1. భీమా 2. నెట్టెంపాడు 3. కల్వకుర్తి 4. కోయిల్ సాగర్. ఇలాంటి అంశాలు ముందుగానే ఆలోచించుకుని తరవాత నిర్ణయాలు తీసుకోవాలి. అలా జరగటం లేదని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రే ప్రెస్‌మీట్ పెట్టి చెపుతున్నాడు అంటే అధికారంలో ఉన్నవారు స్టేట్స్‌మన్‌లా తీసుకోవాల్సిన నిర్ణయాన్ని  ఎలాంటి ఆలోచనా లేకుండా, కేవలం నాలుగు సీట్ల కోసమో, పది సీట్ల కోసమో తీసుకుంటున్నారని అర్థం అవుతోంది.

 ఆరు దశాబ్దాలు కలిసి ఉన్న మూడు ప్రాంతాల ప్రజలు నీటి కోసం వారిలో వారు కొట్టుకునే పరిస్థితి, తన్నుకునే పరిస్థితి రాకూడదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సివస్తోందంటే... ప్రస్తుతం ఉన్న నీటి పంపకాల తీరు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతోంది. కృష్ణా నీటి పంపకాలనే చూడండి...  మన రాష్ట్రానికి అధికారికంగా కేటాయించిన నీటి పంపకాల నిష్పత్తి ఎలా ఉన్నా ట్రిబ్యునల్స్ ఏమి చెప్పినా, కోర్టులు ఏమి చెప్పినా మన ఎగువన ఉన్న కృష్ణా నీరు, మహారాష్ట్ర అవసరాలను తీర్చిన తరువాత కర్ణాటకలోకి వస్తుంది. అక్కడ ఆల్మట్టి, నారాయణపూర్  జలాశయాలు నిండితే తప్ప చుక్క నీరు కిందికి నీరు వదలని పరిస్థితి. అంటే కరువు వచ్చినా, వరదలు వచ్చినా నష్టపోయేది అనింటికన్నా చివరి రాష్ట్రమే. అయినా ఈ సమస్య గురించి ఎన్నిసార్లు గొంతు చించుకుని కేకలు వేసినా వినేవాడు లేడు. ఆర్తనాదాలు పట్టించుకునే నాథుడు లేడు.

 ఇటువంటి పరిస్థితుల మధ్య, మన మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా విడగొట్టబడ్డ క్రింద రాష్ట్రం పరిస్థితి ఏమిటి? శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయి? నాగార్జున సాగర్‌కు నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయి? దిగువన ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న  రాష్ట్రానికి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీళ్ళు తప్ప మంచి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? అటు గోదావరి చూసినా, ఇటు కావేరి చూసినా రాష్ట్రాల మధ్య తగాదాలే. కర్ణాటక, తమిళనాడులో రోజూ కొట్టుకునే పరిస్థితి. కోర్టులు చెప్పినా.. ప్రధాన మంత్రులు చెప్పినా.. ఆ గొడవలు మాత్రం గొడవలే. ప్రతి సంవత్సరం బంద్‌లు, సమ్మెలు! అటువంటి పరిస్థితి మనకు రాకూడదని కోరుకున్నాం.


 ఇక మన రాష్ట్రంలో ప్రవహిస్తున్న మరో ప్రధాన నది గోదావరి. గోదావరి నదికి నాలుగు పాయలున్నాయి. వీటి ద్వారా వచ్చే పరిమాణం ఎంతో చూస్తే     1. నాసిక్ నుంచి వచ్చే పాయ ద్వారా సుమారు 28 శాతం, ఇది నిజామాబాద్, అదిలాబాద్ మీదుగా వస్తుంది.     2. ప్రాణహిత నుంచి 37 శాతం, ఇది కరీంనగర్‌లో వచ్చి కలుస్తుంది.     3. ఇంద్రావతి నుంచి 22 శాతం, ఇది కరీంనగర్‌లో వచ్చి కలుస్తుంది.     4. శబరి నుంచి 13 శాతం, ఇది ఖమ్మంలో వచ్చి కలుస్తుంది.


 ఇది కొంచెం అటూ ఇటుగా మొత్తంగా గోదావరి నది నుంచి వచ్చే నీటి ప్రవాహం. కాంగ్రెస్ పెద్దలు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి మాట్లాడారుగానీ అంతకు ముందు సమాధానం రావాల్సిన మరో అంశం ఉంది.   రెండు రాష్ట్రాలు అయితే పోలవరం ప్రాజెక్టుకు నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయి..? ముంపు, పరిహారం వంటి అంశాలకు సంబంధించి ఏం ఆలోచించారు? నీటి కోసం గొడవలు తప్పని పరిస్థితేనా? ఇంకొక విషయం వారికి తట్టలేదా? గోదావరి ఆవలి ఒడ్డున ఉన్న భద్రాచలం ప్రాంతమంతా ఇంతకుముందు మద్రాసు ప్రెసిడెన్సీలో గోదావరి జిల్లాలోని భాగం కాదా? అది ఆ తరవాత ఖమ్మం జిల్లాకు   బదలాయింపు చేసిన ప్రాంతం కాదా? ఇలాంటి అంశాలమీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పదలచుకుంది? గోదావరి ఏయేజిల్లాలనుంచి ప్రవహిస్తోంది? దానికి వస్తున్న నీరు ఎక్కడెక్కడినుంచి ఎంతెంత శాతం చేరుతోంది? న్యాయం అంటే ఎంత శాతం కింది రాష్ట్రానికి ఇవ్వాలి? భవిష్యత్తులో తగాదాలు లేకుండా ఎలా ఇవ్వాలి వంటివి ఆలోచించకుండా విభజన నిర్ణయాలు ఎలా ప్రకటించారు?


 హైదరాబాద్ విషయానికి వస్తే- ప్రాంతాలకు అతీతంగా జాతులకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈ నగరంలో అందరూ నివాసముంటున్నారు. దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంతో వారి జీవితాలు ముడిపడి ఉన్నాయి. నేటి  హైదరాబాద్ నగరం ఇంతగా అభివద్ధి చెందిందంటే అందులో గత 60 ఏళ్ళుగా మూడు ప్రాంతాలవారి కష్టం, శ్వేదం అందుకు దోహదపడ్డాయి. దేశంలో అన్ని నగరాల కంటే గత 60  ఏళ్ళలో వేగంగా అభివద్ధి ఇక్కడే జరిగింది. ఈవాళ రాష్ట్ర బడ్జెట్‌లో ఒక్క హైదరాబాద్‌నగరమే దాదాపుగా 60 శాతం సమకూరుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చదువుకున్న పిల్లవాడయినా, తాను చదువు అయిపోయిన తరువాత ఉద్యోగం కోసం మొట్టమొదటగా చూసేది రాజధానిగా ఉన్న ఈ హైదరాబాద్ వైపు.  మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి గతంలో మద్రాసును దూరం చేశారు. మళ్ళీ ఈ రోజున 60 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడిగా అభివద్ధి చేసిన తరవాత, ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా ఆంధ్ర-రాయలసీమ వారికి దూరం చేసి పదేళ్ళలో వీడాలని అంటున్నారు. కట్టడానికి 60 ఏళ్ళు సమయం పట్టిన ఉమ్మడి రాజధాని నగరాన్ని పదేళ్ళలో వేరే చోట కట్టుకోండి... అని అంటున్నారు. గతంలో ఎక్కడా దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా... కలిసి ఉండాలనుకునేవారిని వెళ్ళగొడుతున్నారు. విడిపోవాలనుకున్నవారికి మాత్రమే చెందేలా ఉమ్మడిగా అభివద్ధి అయిన రాష్ట్ర రాజధానిని పంపకం చేస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఏమిటి?


హైదరాబాద్ ప్రస్తుతం ఏటా రూ. 90,000 కోట్లు (రాష్ట్ర పన్నులకు రూ.40,000 కోట్లు, కేంద్ర పన్నులకు రూ.35,000 కోట్లు, స్థానిక ఆదాయంగా రూ.15,000 కోట్లు) రాష్ట్ర బడ్జెట్‌లో జనరేట్ చేస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 55 శాతం, కేంద్రానికి రాష్ట్రం నుంచి వెళుతున్న పన్నుల్లో 65 శాతం కేవలం హైదరాబాద్ నగరం నుంచే జమ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌నుంచి ఇంత డబ్బులు ఖజానాకు రాకపోతే... లేదా హైదరాబాద్‌నుంచి వచ్చే ఈ డబ్బును వేరేచోట ఇంకొక నగరం కట్టటానికి డైవర్ట్ చేస్తే... అలాంటప్పుడు వద్ధాప్య పింఛన్ల దగ్గరనుంచి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఉచిత విద్యుత్తు వరకు, రూపాయి కిలో బియ్యం దగ్గరనుంచి ఇతరత్రా సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు... అమలు చేస్తున్న వాటికి, అమలు చేయదలచుకున్నవాటికి  డబ్బు ఎక్కడినుంచి వస్తుంది? భావోద్వేగాలతో కూడిన సంబంధాలను ఎందుకు దష్టిలోకి తీసుకోలేదు?  వీటన్నింటినీ గమనిస్తే అడ్డగోలుగా ప్రకటన చేసిన అధికారంలో ఉన్నవారికి ఇక్కడ ఉన్న ప్రజల బాగోగులమీద స్పష్టత లేదు. హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు చేస్తున్న సీమాంధ్ర ప్రజల బాగోగులకు సంబంధించిన స్పష్టతకూడా లేదు. ఇప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు వినిపిస్తున్నా వాటిని పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే విభజన తరవాత పరిస్థితి ఏమిటి? ఇలాంటి సున్నితమైన అంశాలను అధికారం ఉంది కదా అని సీట్లూ ఓట్ల కోసం విభజన నిర్ణయాలు తీసుకుంటున్నవారు ఎప్పుడైనా ఆలోచించారా? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతిపాదన ప్రకారం హైదరాబాదును 10 సంవత్సరాలపాటు జాయింట్ క్యాపిటల్‌గా ఉంచితే, వారి ప్రతిపాదన మేరకు రాష్ట్రాన్ని విడగొడితే... ఆ విడగొట్టబడ్డ దిగువ ప్రాంతానికి హైదరాబాద్‌నుంచి సంబంధాలు ఎలా నెరపాలి? ప్రజలకు ఏదైనా పనిపడితే... లేదా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవాలనుకుంటే, 200 కిలో మీటర్లకు పైగా వేరే రాష్ట్రం ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. 

 ఆ రాష్ట్రంలో పొరపాటున గొడవలు జరిగితే అక్కడికి చేరినవారికి  ఏ సంబంధం, ఆసరా లేకుండా ఎక్కడో ఓ ద్వీపంలో ఉన్నట్టే అనిపిస్తుంది.  కాబట్టి హైదరాబాద్ విషయంలో ఇవన్నీ దష్టిలో పెట్టుకుని సరైన పరిష్కారం దిశగా అడుగులు వేయాలి.  వనరులు ఇప్పుడు ఉన్నట్టుగానే కొనసాగేలా చూడాలి. ఉద్యోగులు, అన్ని ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలు ధైర్యంగా గుండెలమీద చేయి వేసుకుని నిర్భయంగా జీవించే పరిస్థితి ఉండాలి.
 ఏ రాష్ట్రానికి అయినా అంతర్గత భద్రత ముఖ్యమే. పాంతాల మధ్య అడవులు విస్తరించి ఉన్నాయి. తీవ్రవాద సమస్యలు లాంటి అంశాలమీద కాంగ్రెస్ పెద్దలకు ఆలోచన ఉన్నట్టు కనిపించటం లేదు. ఇలాంటి అంశాలమీద సరైన ఆలోచన చేయకుండా విభజన నిర్ణయాలు తీసుకుంటే అంతర్గత భద్రతను సాధించటం అసాధ్యం అవుతుంది.


 ఇప్పుడు వినిపిస్తున్న మాటల్ని బట్టి చూస్తుంటే, రాష్ట్రాన్ని పైభాగం ఒకరికి, కింది భాగం ఒకరికి అని అడ్డగోలుగా విభజిస్తే.. కింది భాగంలో ఉన్న వారికి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రం నీరు తప్ప మంచి నీళ్లెక్కడ ఉన్నాయి? ఇలాంటి పరిస్థితులమధ్య ఇంకా ఆశ్చర్యకరమైన వదంతి కూడా వినిపిస్తోంది- రాయల తెలంగాణ అని. ఇక్కడ మేం ఒక ప్రశ్న అడగదలచుకున్నాం. అసలు ఎందుకు తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌నుంచి విడగొడుతున్నారు? దీనికి మీరు చెప్పే సమాధానం... సెంటిమెంటు అని. మరి సెంటిమెంటు కారణం అయితే రాయలసీమను సగంగా విడగొట్టేటప్పుడు రాయలసీమ ప్రజలకు సెంటిమెంటు ఉండదా? అదీగాక, శ్రీశైలం డ్యాం ఒకవైపున, నాగార్జునసాగర్ డ్యామ్ మరోవైపున ఉంటే నాగార్జునసాగర్ డ్యాముకు నీళ్ళు ఎలా ఇస్తారు? ఎలా వస్తాయి? దిగువ ప్రాంతమైన కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా పరిస్థితి మారదు కదా? సముద్రం నీళ్ళు తప్ప మంచి నీళ్ళు ఉండవు కదా? మరి ఎందుకు ఇలా ఓట్ల కోసం.. సీట్ల కోసం ఎంతకైనా దిగజారటం? ఇది ఏ మేరకు న్యాయం? కష్ణా ఆయకట్టును విడగొడితే రోజూ గొడవలు తప్పని పరిస్థితి రాదా? రాష్ట్రాన్ని విభజిస్తే ఇవన్నీ జల నియంత్రణ బోర్డుల ఆధ్వర్యంలోకి వెళతాయి. అలాంటప్పుడు నికర కేటాయింపులు ఉన్నవాటికే నీరిస్తారు.


రాష్ట్రం విభజిస్తే అటు శ్రీశైలం, నాగార్జునసాగర్ కూడా జల నియంత్రణ బోర్డు పరిధిలోకి వస్తాయి. ఒక్కసారి అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటు అయ్యాక మిగులు నీరు మీద ఆధారపడ్డ ప్రాజెక్టులకు అటు రాయలసీమలోగానీ, ఇటు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు గానీ, అటు ప్రకాశం జిల్లాకుగానీ చుక్క నీరు ఉపయోగించుకునే అవకాశం ఉండదు. తుంగభద్ర బోర్డునే చూడండి. బోర్డు ఉన్నా మన రాష్ట్రానికి చట్టబద్ధంగా ఉన్న నీరు కూడా రావటం లేదు. ఆ పరిస్థితిలో కృష్ణా ఆయకట్టు రైతాంగం భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ సమస్య పరిష్కారానికి కష్ణ ఆయకట్టు ప్రాంతం అంతా ఒకవైపున అయినా ఉంచాలి, లేదా యథాతథ స్థితిని కొనసాగించాలి. ఏం చేయదలచుకున్నారంటే సమాధానం లేదు. విభజన ద్వారా ఒక వైపు ప్రాంతానికి బొగ్గు లేకుండా చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్యాస్ ఉన్నా ఇక్కడి అవసరాలకు ఇవ్వరు. కనీసం ప్రాణాలు నిలబెట్టే నీరు కూడా లేకుండా ఆ రాష్ట్రంలో ప్రజలు ఎలా బతికేది, అభివద్ధి చెందేది ఎలా?
 రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజనకు సంబంధించి సర్వాధికారాలూ కేంద్ర ప్రభుత్వానికే ఉన్న నేపథ్యంలో ఆ అధికారంతో కాంగ్రెస్ వారు ఈ రాష్ట్రంలోని కోట్ల మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్నవారు అన్ని ప్రాంతాల వారికి న్యాయం చేయలేని పరిస్థితి ఉంటే రాష్ట్రాన్ని యథావిధిగా వదిలేయాలని అర్థిస్తున్నాం. అందరికీ న్యాయం చేయలేకపోతే విడగొట్టే అధికారం చేతుల్లోకి తీసుకోవడం తప్పు. కాంగ్రెస్ పార్టీవారు ఇక్కడి ప్రజల స్థానంలో ఉండి ఆలోచనలు చేయాలి. ఎందుకు ఈ రోజున  కోట్ల మంది ఆందోళనకు గురవుతున్నారా అన్నది గమనించాలి. వారు పన్నే రాజకీయ పన్నాగం వల్ల, ఓట్ల కోసం సీట్ల కోసం ఆడే ఈ రాజకీయ క్రీడవల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే... దిగువన ఏర్పడే రాష్ట్రం మనిషి చేసిన ఎడారి అవుతుంది. తమ నిర్ణయాల వల్ల జరిగే కష్టనష్టాలను బేరీజు వేసుకోకుండా అధికార కాంగ్రెస్ పెద్దలు నియంతత్వ పోకడతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. మా రాజీనామాలతో, మా పార్టీ వారు చట్ట సభలకు చేసిన రాజీనామాలతో నిరంకుశ నిర్ణయంలో ఏమైనా మార్పు తీసుకురాగలుగుతామేమో అన్న ఆశతో నిరసన తెలుపుతూ రాజీనామాలు చేస్తున్నాం. 


(సాక్షి సౌజన్యంతో)

Dadi lashes out at resignation dramas of Congress leaders

Vasireddy Padma says Naidu shedding crocodile tears over Seema Andhra concerns

న్యాయం చేయలేకపోతే వదిలేయండి: జగన్

న్యాయం చేయలేకపోతే వదిలేయండి: జగన్
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సమ న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా వదిలేయాలని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి  వైఎస్ జగన్మోహన రెడ్డి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ కోరారు. రాష్ట్ర  విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా వీరిద్దరూ తమ  పదవులకు ఈరోజు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రజలకు ఆరు పేజీల బహిరంగ లేఖ రాశారు.

రాజకీయ కోణాలతో విభజన చేయొద్దని వారు కోరారు. అడ్డగోలు విభజన జరిగితే ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. రాజీనామాలతోనైనా ఓ తండ్రిలా   జరగబోయే నష్టాన్ని ఆపాలన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్య ధోరణికి నిరసనగానే తాము  రాజీ నామాలు చేసినట్లు  జగన్, విజయమ్మ వివరించారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి నియమించిన ఆంటోని కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందేనని వైఎస్ఆర్ సిపి పేర్కొంది. అందరికీ న్యాయం చేయాలన్నదే తమ పార్టీ కోరికని తెలిపింది. తెలంగాణ ప్రజలపై తమకు గౌరవం ఉందని పేర్కొంది.  కాంగ్రెస్ పార్టీకి చేతనైతే సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరింది.

YS Jagan, YS Vijayamma resign over Telangana

అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో కేంద్రం వ్యవహరించాలి

ఆంధ్ర ప్రదేశ్ విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఎంపీ పదవికీ, పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యే పదవికీ రాజీనామాలు సమర్పించారు. ఈ విషయాన్ని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి శనివారం సాయంత్రం లోటస్ పాండ్‌లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. వారిద్దరూ స్పీకర్ ఫార్మాట్లో తమ రాజీనామాలను పంపినట్లు వివరించారు.  తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన రెడ్డి తన రాజీనామా లేఖను లోక్సభ స్పీకరుకు ఫాక్సు ద్వారా పంపారని చెప్పారు.  తెలుగు ప్రజల పట్ల కాంగ్రెస్ విధానాలకు నిరసనగా వారు రాజీనామా చేసినట్లు తెలిపారు.  శ్రీ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. తమ రాజీనామాకు కారణాలను వివరిస్తూ రాష్ట్ర ప్రజలకు శ్రీ జగన్మోహన్ రెడ్డి, శ్రీమతి విజయమ్మ బహిరంగ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తాను ఎంపీ పదవికీ, మా పార్టీకి చెందిన 16మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో కేంద్రం వ్యవహరించాలని తమ పార్టీ ఎప్పటినుంచో చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మేకపాటి ప్రస్తావించారు. అలా చేయలేని పరిస్థితి ప్రస్తుతం ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్నారు. పరిస్థితిలో మార్పులేకపోవడంతో రాజీనామాలు చేయక తప్పలేదని ఆయన వివరించారు. తెలంగాణ పట్ల తమకు పూర్తి గౌరవముందని స్పష్టంచేశారు. ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిందనీ, ప్రభుత్వ కమిటీకి పూర్తిగా సహకరిస్తామన్నారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీల పట్ల తమకు ఎంతో గౌరవముందన్నారు. ఎవరో సంఘ విద్రోహ శక్తులు వాటి ధ్వంసానికి పాల్పడి తమపై ఆరోపణలు చేస్తున్నారనీ, తమ పార్టీ అలాంటి పనులు చేయదనీ మేకపాటి స్పష్టంచేశారు. ప్రజలను ఇరుకులో పెట్టేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. జగన్మోహన్ రెడ్డిగారిని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ఆ పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. 

కేంద్ర ప్రభుత్వ ఒంటెద్దు పోకడలకు తాము నిరసన తెలుపుతున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు  డాక్టర్ ఎం.వి. మైసూరా రెడ్డి చెప్పారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆయన ఆరోపించారు.  ఏ పరిష్కారం చూపకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని మండిపడ్డారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండు చేస్తోందన్నారు. పరిష్కారం చూపిన తరువాతే రాష్ట్రాన్ని విభజించాలని ఎప్పుడో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తాము  లేవనెత్తిన అభ్యంతరాలనే పది రోజుల తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలిపారు. మీడియా  సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు. సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, జ్యోతుల నెహ్రూ, మేకతోటి సుచరిత, అమర్నాథరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, రాజేష్, జోగి రమేష్, వాసిరెడ్డి పద్మ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, గుర్నాధరెడ్డి, శ్రీనివాసులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

http://www.ysrcongress.com/news/top_stories/jagan-vijayamma-resigns.html

https://www.facebook.com/ysrcpofficial

పరిష్కారం చూపిన తరువాతే......

 రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానానికి నిరసనగా  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి కడప లోక్ సభ సభ్యత్వానికి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. వారు ఇద్దరూ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసినట్లు ఆ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన రెడ్డి రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ కు ఫాక్స్ ద్వారా పంపినట్లు తెలిపారు. తెలుగు ప్రజల పట్ల కాంగ్రెస్ విధానాలకు నిరసనగా వారు రాజీనామా చేసినట్లు తెలిపారు.  జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే డ్రామాలు ఆడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్, విజయమ్మ ఆరు పేజీల లేఖ రాసినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడులుపోతోంది, దానికి తాము నిరసన తెలియజేస్తున్నామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి చెప్పారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజిస్తున్నారన్నారు. ఏ పరిష్కారం చూపకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని తాము కోరుతున్నట్లు తెలిపారు. పరిష్కారం చూపిన తరువాతే రాష్ట్రాన్ని విభజించాలని తాము ఎప్పుడో చెప్పినట్లు తెలిపారు.

ఓట్లు, సీట్లు ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజిస్తున్నారన్నారు. ఏ పరిష్కారం చూపకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని  తాము కోరుతున్నట్లు చెప్పారు. పరిష్కారం చూపిన తరువాతే రాష్ట్రాన్ని విభజించాలని తాము ఎప్పుడో చెప్పినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో వైఎస్ఆర్ సిపిది ఒకటే విధానం అని చెప్పారు. తాము  లేవనెత్తిన అభ్యంతరాలనే పది రోజుల తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలిపారు.

విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు.

పదవులకు జగన్, విజయమ్మలు రాజీనామా

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు వారు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖలను ఫాక్స్ చేశారు.ఇరు ప్రాంతాలలో కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

కమల్‌ హాసన్‌ను మించి టీడీపీ ఎంపీల నటన!

కాంగ్రెస్, టీడీపీలు రాజీనామా డ్రామాలు: దాడి
హైదరాబాద్ : సీమాంధ్ర ఉద్యమంతో కాంగ్రెస్‌ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దాడి  వీరభద్రరావు అన్నారు.  ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్‌, టీడీపీ నేతలు రాజీనామాలతో  డ్రామాలాడుతున్నారని విమర్శించారు. 
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా విభజన నిర్ణయాన్ని తప్పుబట్టారని విమర్శించారు. ఆంటోనీ హైలెవల్ కమిటీ కాంగ్రెస్ పార్టీ కమిటీ అని... ప్రభుత్వ కమిటీ కాదని దాడి వీరభద్రరావు అన్నారు.  టీడీపీ ఎంపీల నటన కమల్‌ హాసన్‌ను మించిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

చంద్రబాబువి హైలెవెల్ డ్రామాలు

చంద్రబాబువి హైలెవెల్ డ్రామాలు: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: : రాష్ట్ర విభజనపై ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాయడం ద్వారా కొత్త డ్రామాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెరతీశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ  ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రకటన చేసి 10 రోజుల తర్వాత బాబు స్పందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.


ప్రధానికి లేఖ రాసి చంద్రబాబునాయుడు అప్పుడే మెలకువ వచ్చిన వ్యక్తిలా వ్యవహారిస్తున్నారని ఆమె ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలకు భయపడి చంద్రబాబు ఆ లేఖ రాశారన్నారు. రంగులు మార్చడంలో చంద్రబాబు ఊసరవెల్లిని మించిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు విజన్ ట్వంటీ-20 కాదు... డివిజన్ 420 అని ఆమె అభివర్ణించారు. సీమాంధ్ర ప్రజల్లో బాబు ఓ విరోధిలా మారిపోయారని ఆమె పేర్కొన్నారు.

సీడబ్ల్యూసీ ప్రకటన కంటే ముందే చంద్రబాబుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటవుతుందన్న విషయం తెలుసని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఓ విధంగా వెన్నుపోటు పోడిచారన్నారు. తెలంగాణపై క్రెడిట్ పొందటంలో భాగంగానే చంద్రబాబు పలుమార్లు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారని పద్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీట్లు, ఓట్లు కోసమే ప్రణబ్ కమిటీకి గతంలో బాబు తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చారన్నారు. ఆ లేఖను ఆమె ఓ బ్లాంక్ చెక్కుగా ఆభివర్ణించారు.

పూర్తి బాధ్యతారాహిత్యంగా కాంగ్రెస్ హైకమాండ్ కధ నడుపుతుందా?





రాష్ట్రంలో రాజకీయం వికృతంగా మారుతోంది.వైషమ్యాలు పెరుగుతున్నాయి. ఎవరికి వారికి తమ రాజకీయ స్వార్ధంపైన దృష్టి తప్ప, నిజాయితీగా ఉద్రిక్తతలు తగ్గించడానికి ఎవరూ ప్రయత్నిస్తున్నట్లు కనబడడం లేదు.తెలంగాణ సమస్య గత కొద్ది సంవత్సరాలుగా తీవ్ర రూపం దాల్చిన తర్వాత కాంగ్రెస్ హై కమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది.దానికి అనుగుణంగా కేంద్రం ప్రక్రియ ఆరంభించింది.నిజమే. ఇందులో చాలా కష్టనష్టాలు ఉన్నాయి. సీమాంధ్రులను కేంద్రం నడిరోడ్డుమీద వదలివేసిందన్న బాధ కలుగుతుంది.కేంద్రం వద్ద స్పష్టమైన హామీలు ఉంటాయని ఆశించినవారికి అది నిరాశ కలిగించింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీల మాదిరే పూర్తి బాధ్యతారాహిత్యంగా కేంద్రంలోని కాంగ్రెస్ కూడా వ్యవహరిస్తోందా అన్న అనుమానం కలుగుతోంది.సీమాంధ్ర ప్రాంతంలో ఇంత రచ్చ జరుగుతుంటే, అన్నదమ్ముల్లా ఉండవలసిన ఉభయ ప్రాంతాల ఉద్యోగులు పరస్పరం తలపడుతుంటే చోద్యం చూస్తోంది. రాష్ట్రంలో అసలు పాలన అనేది లేకుండా చేసిందా అన్న అనుమానం కలుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో తెలంగాణ ఆందోళనల సందర్భంగా కట్టుదిట్టంగా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది. అదే మాదిరి ఇప్పుడు కూడా వ్యవహరించవలసి ఉంది.ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వరాదు. ఒకవేళ ఆయనకు ఈ పరిణామ క్రమం ఇష్టం లేకపోతే వెంటనే తప్పుకోవాలి , తప్ప పరిస్థితి అదుపు తప్పేలా చూస్తూ కూర్చోవడం సరికాదు.నిజానికి కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తరవాత జరిగిన పరిణామాలను ఆయన మీడియా ద్వారా ప్రజలకు వివరించి ఉండవలసింది.అసలు ఏమి జరిగిందో, ఏమి జరుగుతుందో చెప్పడానికి, అందులో ఆయన వైఖరి ఏమిటో వివరించి ఉండవలసింది.పిసిసి అధ్యక్షుడు బొత్స మీడియాతో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదో తెలియదు.అసలు వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్ర తీర్మానంపై కిరణ్, బొత్సలు సంతకాలు చేయడం అంటే నే పార్టీ వైఖరిని వ్యతిరేకించినట్లు.అలాంటప్పుడు పార్టీ హై కమాండ్ ఎలా ఒప్పుకుంటుంది.వీరు ఎలా సమర్ధించుకుంటారు.లేకుంటే ఇద్దరు కలిసి కధ నడుపుతున్నారని అనుకోవాల్సి ఉంటుంది.సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఉద్యమిస్తున్న తీరు ఆశ్చర్యంగానే ఉంటుంది.సీమాంధ్రలో ఉన్నంత సేపు ప్రశాంతంగానే ఉంటారు. ఒక్కసారి ఆవేశం వచ్చిందంటే రెచ్చిపోతారు. జై ఆంధ్ర ఉద్యమం కూడా ఇలాగే సాగింది.అప్పట్లో సమైక్యవాదుల సమావేశాలపై కూడా దాడులు చేశారు.విజయవాడ విమానాశ్రయానికి సమైక్య వాదం నిమిత్తం సభ నిర్వహించడానికి హైదరాబాద్ నుంచి బయల్దేరిన మంత్రి మండలి తదితరుల విమానాన్ని దిగకుండా ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారంటే, ఆ రోజులలో ప్రత్యేక ఉద్యమం ఎంత తీవ్రంగా జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.ఆ రోజే విజయవాడలో జరిగిన కాల్పులలో కొంతమంది యువకులు మరణించారు.అప్పటికే మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చిన కాకాని వెంకటరత్నం కాల్పులలో పిల్లలు మరణించిన సంగతి విని గుండెపోటుకు గురై అమరులయ్యారు. ఒక్క విజయవాడలోనే కాదు. సీమాంధ్ర అంతటా ప్రత్యేక ఉద్యమ జ్వాల రగిలింది.ఆ రోజులలో ఇలా టీవీలు, ప్రచార సాధనాలు కూడా లేవు. అయినా ఎక్కడికక్కడ జన జీవితం రోజుల తరబడి స్తంభించిందంటే ఆశ్చర్యం కాదు.అలాంటిచోట ఇప్పుడు సమైక్య ఉద్యమం రగలడం ఆశ్చర్యంగానే ఉంటుంది.ఇందులో నదీ జలాల అంశం కన్నా, హైదరాబాద్ తో అక్కడి ప్రజలకు ఏర్పడిన అనుబంధమే కారణంగా కనిపిస్తుంది.హైదరాబాద్ మన అందరిది అన్న నినాదం వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది. అందుకే రాజకీయ నాయకులు కూడా హైదరాబాద్ పట్టుబడుతున్నారు.కేంద్ర మంత్రి చిరంజీవి హైదరాబాద్ ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా గాని, కేంద్ర పాలిత ప్రాంతంగా గాని చేయాలని డిమాండ్ చేశారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఏకంగా హైదరాబాద్ ను తెలంగాణకు ఎలా ఇస్తారని ప్రశ్నించడం ద్వారా తమ వైఖరిని తెలియచెప్పారు.అలాగే ఆమె కుమార్తె ఏకంగా తల ఒకరికి మెండెం మరొకరికి ఇచ్చి సీమాంధ్రకు అన్యాయం చే్స్తారా?అంటూ ప్రశ్నించారు.దీనిపై తెలుగుదేశం నేతలు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు.పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ విధానానికి కట్టుబడి ఉన్నప్పట్టికీ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్.పిలు విభజన తీరును నిరసిస్తూ ఉద్యమిస్తున్నారు.పార్లమెంటును స్తంభింప చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్.పిలు కూడా పార్లమెంటులో పోరాడుతున్నారు.మొత్తం అందరి భావాలను జాగ్రత్తగా గమనిస్తే హైదరాబాద్ విషయంలో నిర్దిష్టమైన హామీ ఇస్తే ఉద్యమం చల్లబడే పరిస్థితి కనబడుతోంది.అయితే హైదరాబాద్ తెలంగాణ లో భాగంగానే ఉంటుందని పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ తరహాలో పోలీసు,రెవెన్యూ యంత్రాంగం కేంద్రం చేతిలో ఉండేలా చట్ట సవరణ చేస్తామని చెబుతున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రుల రక్షణకు సంబందించే అందరూ ఆందోళన చెందుతున్నారు.తెలంగాణకు చెందిన నేతలు జైపాల్ రెడ్డి,జానారెడ్డి డి.శ్రీనివాస్ తదితరులు ఎంతగా ఇక్కడివారు కూడా తమవారే నని, వారికి ఎలాంటి డోకా ఉండదని చెబుతున్నా,టిఆర్ఎస్ అదినేత కె.చంద్రశేఖరరావు చేసిన వివాదాస్పద ప్రకటన మొత్తం పరిస్థితికి ఆజ్యం పోసింది. ఆయన రాజకీయం ఆయనది.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనతో సంప్రదించకుండా, తనను అసలు పట్టించుకోకుండా రాజకీయం నడుపుతోందన్న బాధతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది.ఇదే సమయంలో కెసిఆర్ ను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని హరీష్ రావు,ఈటెల రాజేందర్ లు సంచలన ఆరోపణ చేశారు.ఇందులో నిజమెంతో నిగ్గు తేల్చవలసి ఉంది. అది నిజమైతే వికృత రాజకీయాలకు పరాకాష్ట అవుతుంది.వెంటనే అందుకు సంబందించినవారిని ఖైదు చేయాలి. అందులో నిజం లేకపోతే టిఆర్ఎస్ నేతలు ఎలాంటి దారుణమైన ఆరోపణలకైనా వెనుకాడరన్న భావన వస్తుంది.కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ పత్రికలలో సైతం వ్యతిరేక వ్యాసాలు వచ్చాయి.ముంబైలో శివసేన మాదిరి హైదరాబాద్ లో కూడా టిఆర్ఎస్ మాట్లాడుతోందని ఒక వ్యాసకర్త వ్యాఖ్యానించారు.ఇలా మాట్లాడుతున్న టిఆర్ఎస్ తో కలిసి చేస్తే సీమాంధ్రలో మరీ ఎక్కువ సమస్య వస్తుందేమోనని కాంగ్రెస్ భయం. పైగా రాజకీయం కోసమే విభజన చేశారన్న విమర్శను జనం పూర్తిగా నమ్మవచ్చు. అందువల్ల వారు టిఆర్ఎస్ ను పట్టించుకోవడం లేదు.పైగా టిఆర్ఎస్ ఎమ్.పి విజయశాంతితో పాటు మరికొందరు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే తెలంగాణ అంశంలో మళ్లీ రాజకీయ క్రీడ కూడా జరుగుతోందన్న మాట.ఒకపక్క రాష్ట,జాతీయ స్థాయిలో నేతలు తెలంగాణ వివాదంతో తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతుంటే, క్షేత్ర స్థాయిలో మాత్రం తమకు ఏమవుతుందోనని ప్రజలు అల్లాడుతున్నారు.చివరికి హైదరాబాద్ బీమా భవన్ వద్దకాని, తాజాగా ఎర్రమంజిల్ జలసౌధ భవనం వద్ద కాని సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు కలహించుకున్న తీరు, పరస్పరం నినాదాలు చేసుకుంటూ వివాద పడిన తీరుకు సంబందించిన దృశ్యాలు చూసినవారికి మనసు కలుక్కుమంటుంది.ఇంత జరిగాక కూడా ఎందుక సమైక్యం అంటున్నారా అన్న భావన ఒకవైపు కలుగుతుంది. మరో వైపు భావ స్చేచ్చ ఉన్న దేశంలో తమ అభిప్రాయాలను చెప్పుకుంటే కూడా అడ్డుకుంటారా అన్న భాద కలుగుతుంది. అయినప్పట్టికీ పరిస్థితిని గమనించి ఉద్రిక్తతలను పెరగకుండా చూడవలసిన బాధ్యత ఉభయ ప్రాంతాల ఉద్యోగ నాయకులపై ఉంటుంది. తమ ప్రయోజనాల పేరుతోనో, మరో కారణంగానో పరిస్థితి విసమిస్తుంటే చూస్తూ కూర్చోకూడదు.దీనివల్ల సమాజం లో మొత్తం వాతావరణం కలుషితం అవుతుంది. హైదరాబాద్ లో తమకు ఇప్పుడే తమ అభిప్రాయాలను చెప్పుకునే స్వేచ్చ ఇవ్వకపోతే రేపు తెలంగాణ ఏర్పాటు అయ్యాక తమకు భద్రత ఉంటుందా అన్న సీమాంధ్ర నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఎలాగూ కేంద్రం తెలంగాణ ప్రకటన చేసింది కనుక,ఇప్పుడు వెనక్కి పోయే పరిస్థితి లేదు కనుక ఎవరైనా హైదరాబాద్ లో సమైక్యాంద్ర అని నినాదం చేసుకుంటే వచ్చే నష్టం ఏమిటో తెలియదు.దానివల్ల వచ్చిన తెలంగాణ వెనక్కి పోతుందా?ప్రస్తుతం లక్షల మంది సీమాంద్రులు హైదరాబాద్ హెచ్.ఎమ్.డి.ఎ పరిధిలో నివసిస్తున్నారు.కారణం ఏదైనా , మన నేతల దూరదృష్టి లోపం వల్ల అన్నీ సంస్థలను హైదరాబాద్ లోనే పెట్టి ఇతర నగరాలను నిర్లక్ష్యం చేశారు.దాని ఫలితంగా అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతం అవడం, మొత్తం ఆదాయ వనరులలో ఎక్కువ భాగం ఇక్కడ నుంచే వస్తుండడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది.దీనికి సంబంధించిన చిక్కుముడులను కేంద్రం విడదీయడానికి కృషి చేయాలి.ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం దీనిని కేంద్రపాలిత ప్రాంతం చేయగలిగితే బాగానే ఉంటుంది. కాని అందుకు హైదరాబాద్ నగరంలోని నేతలతో పాటు తెలంగాణ నేతలు అంగీకరించరు. అందువల్ల పోలీసు,భూమి పాలన వ్యవస్థలు కేంద్రం చేతిలో ఉండడం ద్వారా ఏ కేసు అయినా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతాయన్న నమ్మకాన్ని ,ఎవరూ సీమాంద్రులపై దాడులు చేయరన్న భరోసాను ఇవ్వగలిగితే ఇబ్బంది ఉండదు.అతేకాదు.రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే చర్యలు తీసుకునే ధైర్యం ప్రభుత్వాలకు ఉండాలి.లేకుంటే మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది.నిజానికి ఇప్పుడు సీమాంధ్రలోని నేతలందరికి ఒక వాస్తవం తెలుసు.విభజన నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశం దాదాపు లేదని.కాని సీమాంధ్రలో తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల దృష్ట్యా వారంతా సమైక్య రాష్ట్రం కోరుతున్నట్లు చెబుతున్నారు.లోపల దిగ్విజయ్ సింగ్ వద్ద సమావేశంలో హైదరాబాద్ స్థాయి గురించి పట్టుబడుతున్నారు.ఇది ఒక దురదృష్టకర పరిస్థితి . ఒక అభివృద్ది చెందిన నగరం ఒక ప్రాంతానికి చెందినది కాదని అంటే వినడానికి బాధగానే ఉంటుంది.కాని విభజన వాస్తవం అయితే నగరం సీమంధ్రులది కాదన్నది అంతే వాస్తవం.ఈ నిజాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పడుతుంది.అయినప్పట్టీకి మొక్కవోని ధైర్యంతో మరో రాజధాని నిర్మాణానికి ప్రయత్నించాలి తప్ప,ఇదే తమకు గతి అన్నట్లుగా దైన్యంగా ఉండడం, మాట్లాడడం యోధుడి లక్షణంగాదు.కనుక మరో మహానగరాన్ని నిర్మించుకోవాలి. తెలంగాణ కు పోటీగా అభివృద్ది సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి.ఆరంభ శూరత్వంగా కాకుండా, ఆచరణలో చేసి చూపిన నాడు ఒక హైదరాబాద్ కాదు..నాలుగు హైదరాబాద్ లు సీమాంధ్రలో తయారవుతాయి. దానికి ధృఢ సంకల్పం కావాలి.గట్టి నాయకుడు కావాలి.అంతవరకు మాత్రం హైదరాబాద్ లోని సీమాంధ్రుల భద్రతకు అన్ని ఏర్పాట్లు తీసుకోకపోతే చరిత్ర ఈ రాజకీయ నాయకులను కాని,అంతిమ నిర్ణయానికి కారణమైన సోనియాగాందీని కాని క్షమించదు.

source:kommineni

ఒకసారి మోసపోయాం చాలదా?

‘చరిత్ర పునరావృతమవుతుంది. తొలిసారి విషాదంగా, తదుపరి ప్రహసనంగా’ - అన్నాడు కార్ల్ మార్క్స్.
ఉమ్మడి రాజధాని గొడవ అరవై ఏళ్ల తరవాత మళ్లీ మొదలైంది. రాష్ట్రాన్ని ఆంధ్ర, తెలంగాణాలుగా విడగొట్టాలని కేంద్ర ప్రభువులు పట్టుపడితే- పోనీ! ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు హైదరాబాదు కొనసాగటానికి దయతో అనుమతించారు కదా? అదే పదివేలు. హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికే చెందనీ! ఆ నగరం మీద అధికారాలు యావత్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉండనీ! ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలమూ ఆ నగరంలో ఆంధ్రా సర్కారు పనికి ఇబ్బంది రాకుండా కట్టుబాట్లు కోరదాం. వీలైతే హైదరాబాదు మహానగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయిద్దాం. అది కుదరకపోతే ఉమ్మడి రాజధాని యోగాన్ని ఇంకో ఐదేళ్లో, పదేళ్లో, శాశ్వతంగానో పొడిగించమందాం - అని మహా తెలివిగల తెలుగు కేంద్రమంత్రులు, వారికి తోడుబోయినవారు వ్యూహాలు పన్నుతున్నారు. ఆపసోపాలు పడుతున్నారు.
ఒక రాష్ట్రంలోని ప్రాంతం వేరే రాష్ట్రంగా విడిపోయిన సందర్భాలు దేశంలో చాలానే ఉన్నాయి. వేరుపడిన ప్రాంతం తనకు అనువైన వేరేచోట రాజధానిని ఏర్పరచుకోవటం రివాజు. ఒక ప్రాంతం విడిపోదలిచింది కాబట్టి మిగతా రాష్ట్రం చిరకాలంగా ఉన్న రాజధానిని దానికి వదిలేసుకుని వేరేచోటికి తరలిపోవలసి రావటం మునె్నన్నడూ జరగలేదు. ఎప్పటినుంచో నడుస్తున్న రాష్ట్రం తనకు వేరే రాజధాని అమరేదాకా ఉన్నచోటే పనిచేసుకోనివ్వండని తనతో తెగతెంపులు చేసుకున్న చిన్న ప్రాంతం వారిని దేబిరించాల్సి రావటం విధి వైచిత్రి. అనేక దశాబ్దాలుగా సాగుతున్న రాజధాని నగరాన్ని, దాని పరిసర ప్రాంతాలను విభజన మూలంగా డిస్టర్బ్ చేయటం, చిరకాల నివాసం చేస్తున్న పౌరులను అకారణంగా అస్తవ్యస్త అభద్రతకు గురి కావించటం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిది. అలాగే ఒక రాష్ట్రం రాజధాని వేరే రాష్ట్రంలో అదీ వందల కిలోమీటర్ల దూరంలో పనిచేయటమనేది రాజకీయ శాస్త్రంలో ఎవరూ ఊహించని కొత్త పుంత!
అయినా - సందేహించాల్సిన పనిలేదు. ఎవరికీ ఈ లోటూ ఉండదు. ఎటు నుంచీ ఏ చిక్కూ రాదు. మాదీ భరోసా. అంతా మేము చూసుకుంటాం. అన్ని రక్షణలూ కల్పిస్తాం. మా మాట నమ్మి నిశ్చింతగా నిద్రపోండి - అని మరుగుజ్జు మహానేతలు అడక్కుండానే వరాలిస్తున్నారు. అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు.
ఇలాంటి కబుర్లను విని, విని - ఔను కదా, అలా చేస్తే పోతుందేమో - అని లేనిపోని ఐడియాలు దరిచేరనిచ్చేముందు - గతంలో ఇలాంటిదే సంకటంలో ఏమి జరిగిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఉమ్మడి రాజధానిని నమ్ముకుంటే ఏమైందో, మహామహులు చెప్పిన మాటలు నిజమని నమ్మి ఎలా మోసపోయామో గుర్తు పెట్టుకోవాలి.
తెలుగు వారికి ఇప్పుడు హైదరాబాదు ఎలాగో అరవై ఏళ్ల కిందటి వరకూ మద్రాసు అలాగ. నిజాం రాజ్యం దాదాపుగా వేరే దేశమైనట్టుగా ఉండేది. అదంతా ఉర్దూమయం. అక్కడి కరెన్సీ వేరు. సంస్కృతి వేరు. కాబట్టి నైజాం రాజధాని హైదరాబాదుతో మిగతా ఆంధ్ర జిల్లాల వారికి ఏమంత సంపర్కం ఉండేది కాదు. వారికి అనుబంధం, మమకారం అంతా మద్రాసుతోనే. పై చదువులకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు ప్లీడరీ లాంటి వృత్తులకు అన్ని జిల్లాల వారూ అత్యధికంగా మద్రాసుకే పోయేవారు.
చంద్రగిరి రాజు అప్పయ్య నాయకుడు తన తండ్రి చెన్నప్ప నాయకుడి పేర కట్టించిన చెన్నపట్టణం పదహారణాల తెలుగు పట్నం. మొదటినుంచీ అక్కడ నివసించిన వారిలో ఇంచుమించు అందరూ తెలుగువారేనని ఈస్టిండియా కంపెనీ రికార్డులు చెబుతాయి. 1891 నాటికి మద్రాసు జనాభా నాలుగు లక్షలు కాగా వారిలో అత్యధికులు తెలుగువారే. క్రమేణా చుట్టుపట్ల తమిళ జిల్లాల నుంచి అరవలు విస్తృతంగా వలసవెళ్లి, పథకం ప్రకారం తెలుగు వీధులకు అరవపేర్లు పెట్టి, జనాభా లెక్కల్లో తమిళం మాట్లాడగలిగిన తెలుగువారిని అరవల కింద చూపించి తిమ్మిని బమ్మి చేశారు. అయినా మద్రాసులో తెలుగు వారికి తమిళులతో సమానంగా పట్టు ఉండేది. కాబట్టే మద్రాసు రాజధానిగా 12 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచాలని 1918 నుంచి ప్రతి వార్షిక సభలోనూ ఆంధ్ర మహాసభ తీర్మానించేది. ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజధాని కావాలన్న తీర్మానం 1933లో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిలులో ఒకే ఒక్క ఓటు తేడాతో వీగిపోయింది. మద్రాసు విషయంలో ఆంధ్రులపట్టు ఎంత గట్టిగా ఉండేదో దాన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. దేశానికి స్వతంత్య్రం వచ్చిన తొలి ఏళ్లలో ‘మద్రాసు మనదే’ అంటూ పెద్ద ఉద్యమమే నడిచింది. తెలుగు నాయకుడు ప్రకాశం -గాంధీని కూడా ధిక్కరించి, అన్ని భాషా వర్గాల మద్దతును కూడగట్టి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఏకంగా ముఖ్యమంత్రే అయ్యాడు.
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దానికి మద్రాసే రాజధాని అవుతుందని యావదాంధ్రులూ... కొంపదీసి అలా అవుతుందేమోనని రాజాజీలాంటి అరవ పెద్దలూ అనుకుంటున్న తరుణంలో - ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచెయ్యాలీ అంటే మద్రాసు నగరం మీద క్లెయిమును ఆంధ్రులు వదిలేసుకోవాలని జె.వి.పి. కమిటీ మెలికపెట్టింది. తెలుగు వాడివై ఉండీ, అన్నీ తెలిసీ, తెలుగు వాళ్లకు అన్యాయం ఎందుకు చేశావని పదుగురూ నిలదీస్తే ఆ కమిటీ మెంబరైన పట్ట్భా సీతారామయ్యగారు గొప్ప వివరణ ఇచ్చాడు. ఆంధ్ర రాష్ట్రంలో మద్రాసును చేర్చకూడదన్నామేగాని అది ఉమ్మడి రాజధాని కాకూడదని మేము చెప్పలేదు గదా? ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసునే రాజధానిగా కొంతకాలం నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. లేదా - మద్రాసు నగరాన్ని ఎవరికీ చెందకుండా ప్రత్యేక రాష్ట్రంగానూ చేయవచ్చు - అని పట్ట్భా భరోసా ఇచ్చాడు. అలాగైతే అభ్యంతరం లేదని ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షుడు రంగా అన్నాడు. పట్ట్భా వివరణతో సంతృప్తి చెంది, ఆ మేరకు జె.వి.పి. నివేదికను ఆమోదిస్తున్నామని ఎ.పి.సి.సి. 1949 నవంబరు 14న తీర్మానం చేసింది.
ఇక అడ్డంకులన్నీ తొలిగాయి - మద్రాసు ఉమ్మడి రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం వచ్చేస్తున్నదని అందరూ ఆశపడుతూండగా పెద్ద మనిషి పట్ట్భా ఇచ్చిన ఉమ్మడి రాజధాని మాట గంగలో కలిసింది. మద్రాసు లేకుండా అయితేనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇస్తామని కాంగ్రెసు వర్కింగు కమిటీ అడ్డం తిరిగింది.
తరవాత - మద్రాసు సిటీ కోసమే, మద్రాసు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం కోసమే పొట్టి శ్రీరాములు బలిపీఠం ఎక్కి, 58 రోజుల ప్రాయోపవేశంతో ఆత్మార్పణ చేశాక, ఆంధ్రదేశమంతా అల్లర్లతో అట్టుడికాక ప్రధాని నెహ్రూకు ఎట్టకేలకు దయకలిగి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని పార్లమెంటులో ప్రకటించాడు. అదికూడ పొట్టి శ్రీరాములు ప్రాణాలను ధారపోసిన మద్రాసు నగరాన్ని మినహాయంచి! కొత్త రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక సర్దుబాట్లను, సాధక బాధకాలను పరిశీలించడానికి జస్టిస్ ఎ.ఎన్.వాంఛూను నియమించారు. ఉన్నపళాన వేరే రాజధానిని వెతుక్కోవటం కష్టం కాబట్టి కొత్త రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిని మద్రాసు నగరంలోనే మూడు నుంచి ఐదేళ్ల వరకు ఉండనివ్వాలని వాంఛూ కమిటీ సూచించింది. ఆంధ్రా పి.సి.సి. కూడా అదే అభ్యర్థన చేసి, మద్రాసును చీఫ్ కమిషనరేట్ ప్రాంతంగా ప్రకటించాలని డిమాండు చేసింది.
కనీసం దానికైనా నెహ్రూ సర్కారు ఒప్పుకుందా? మద్రాసు గడ్డమీద ఆంధ్ర రాజధానికి సూది మోపినంత స్థలం కూడా ఇవ్వరాదని తమిళులు కత్తికట్టారు. తాత్కాలిక రాజధానిని అనుమతిస్తే మద్రాసు నగరం యుద్ధ్భూమి అవుతుంది. తమిళనాట మిగతా ప్రాంతాల్లో అల్లర్లు లేస్తాయి. అక్కడి ఆంధ్రులు ప్రశాంతంగా బతకలేరు అంటూ 32 మంది ఆంధ్రేతర ఎం.పి.లు మెమొరాండం ఇచ్చారు. మద్రాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారేమో వాంఛూ సిఫారసును ఆమోదిస్తే రాజీనామా చేస్తానని బెదిరించాడు. ఇప్పటికిప్పుడు వెళ్లిపొమ్మంటే ఎక్కడికి పోతాం? ఎల్లకాలం ఇక్కడ తిష్ఠ వేయం. కాలూ చెరుూ్య కూడదీసుకునేంత వరకైనా మద్రాసు నుంచి పనిచేసుకోనివ్వండి అని ఉపరాష్టప్రతి రాధాకృష్ణన్, కార్మికమంత్రి వి.వి.గిరి లాంటి పెద్దలు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా - ఆంధ్రులకు అన్యాయం చేయటంలో ఎప్పుడూ ముందుండే నెహ్రూ పండితుడు వినలేదు. ‘మద్రాసు నుంచి కొంతకాలమైనా పనిచేయనిచ్చే ప్రసక్తే లేదు. తాత్కాలిక రాజధానిని ఆంధ్ర ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకోవాలి’ అని 1953 మార్చి 25న లోక్‌సభలో నిర్దాక్షిణ్యంగా అనుశాసించాడు. ఇక చేసేది లేక అప్పటికప్పుడు తట్టాబుట్టా సర్దుకుని, తమదనుకున్న మద్రాసుకు వదిలేసి, ఆంధ్రులు కాందిశీకుల్లా బయటికి పోయారు.
నెహ్రూ అంతటి ప్రియతమ నాయకుడు ప్రధానిగా ఉండి... ప్రకాశం అంతటి ధీరుడు ఆంధ్రులకు పెద్దదిక్కుగా ఉన్నప్పుడే... రాధాకృష్ణన్ అంతటివాడు కలగజేసుకున్నా ప్రయోజనం లేక... కాంగ్రెసు పెద్దలు ఇచ్చిన హామీలకు విలువలేక... రాజధాని విషయంలో దగాపడి తెలుగు వాళ్లు రోడ్డున పడ్డారంటే-
మరికొద్ది నెలల్లో అధికారం గడువు తీరే యు.పి.ఎ. సర్కారు మాటలను, దాన్ని నడిపించే సోనియాగాంధి బాసలను నమ్ముకుని ఇప్పుడు తెలుగు రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చటానికి సమ్మతిస్తే తెలుగు జాతి గతి ఏమవుతుంది? ఆంధ్రులపట్ల నాడు అరవలు చూపిన ద్వేషం రేపు తెలంగాణ్యులు కనపరచరన్న గ్యారంటీ ఏమిటి? కె.ఎస్.రావు, చిరంజీవి, చంద్రబాబు లాంటి ఊసరవెల్లులు తెలుగువారిని కాపాడేవారా?!

http://www.andhrabhoomi.net/content/telugu-tagavu-1

విభజనతో రాష్ట్ర ప్రాజెక్టులను వదులుకోవాల్సిందే!

నీటి కేటాయింపు, వాడకంలో వివాదం తలెత్తితే.. పరిష్కారం అంత సులభంగా రావటం లేదు. ఆయా నదులపై ఆధారపడ్డ రాష్ట్రాలు తవుకు అన్యాయుం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తే.. సవుస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తోంది. అరుుతే ఈ ట్రిబ్యునల్‌లో ఆయూ రాష్ట్రాలు తవుతవు వాదనలను వినిపించటం, తర్వాత ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించటం, అది అవుల్లోకి రావటం, తీర్పుపై వుళ్లీ అభ్యంతరాలు రావటం సర్వసధారణమైంది. దాంతో రాష్ట్రాల వుధ్య నెలకొన్న జల వివాదం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఫలితంగా సదరు నదులపై ఆధారపడ్డ ప్రజల వుధ్య శత్రుత్వం పెరిగిపోతోంది. ఉదాహరణకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వుధ్య కొనసాగుతున్న కావేరి జల వివాదం తరచుగా ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఈ వివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పడి సువూరు 24 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంకా పరిష్కారానికి రాలేకపోతున్నారు. ఆఖరికి దేశ ప్రధాన వుంత్రి కల్పించుకునే దశకు చేరినా.. సవుస్యకు పరిష్కార వూర్గం కనిపించటం లేదు.
 
 పదేళ్లుగా సా...గుతున్న కృష్ణా ట్రిబ్యునల్: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వుహారాష్ట్రల వుధ్య నెలకొన్న కృష్ణా జల వివాద పరిష్కారానికి ఉద్దేశించినరెండో కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పడి పదేళ్లు. వుధ్యంతర తీర్పును వెల్లడించినా.. దీనిపై అన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటంతో వుళ్లీ సవరణల కోసం వాదనలు కొనసాగుతున్నాయి. వంశధార ట్రిబ్యునల్  పరిస్థితి కూడా ఇంతే. వంశధార నదిపై వునకు, ఒరిస్సాకు ఉన్న అభ్యంతరాలను పరిశీలించటానికి ఉద్దేశించిన ఈ ట్రిబ్యునల్ ఏర్పడి నాలుగేళ్లయినా వాదనల ప్రక్రియ ముగియలేదు. 
 
 ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి: ఇతర రాష్ట్రాల్లోని ట్రిబ్యునళ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పంజాబ్, హర్యానాల వుధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించటానికి రావి - వియూస్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. కొందరు దుండగులు ట్రిబ్యునల్ సభ్యుడిని హత్య చేయుటంతో ఆ వివాదం ముందుకు కదలటం లేదు. కర్ణాటక - గోవా వుధ్య జల వివాద పరిష్కారం కోసం వుహాదారుు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఇలా పలు ట్రిబ్యునళ్లు విడివిడిగా ఆయూ రాష్ట్రాల జల వివాదాలను పరిశీలిస్తున్నారుు. అరుుతే ఇవి తుది తీర్పును ప్రకటించటం, దానిని అవులు పరచటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
 
  • శతాబ్దాలు గడిచినా పరిష్కారం కష్టమే!
  • సాగర్, శ్రీశైలంతో పాటు జూరాలపై నియంత్రణ బోర్డులు తప్పవు
  • కృష్ణా జలాలపై ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలతో ఏళ్లుగా వివాదాలు
  • ఆంధ్రప్రదేశ్ విభజనతో జల వివాదాలు మరింత సంక్లిష్టమవుతాయి
  • ప్రత్యేక అథారిటీలతో కేంద్ర పర్యవేక్షణలోకి ప్రాజెక్టులు
  • నికర జలాల కేటాయింపులు లేని కొత్త ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకం
  • జల వివాదాలు రేగితే ట్రిబ్యునళ్ల ఏర్పాటు.. పరిష్కారానికి దశాబ్దాలు
  • తమిళనాడు - కర్ణాటక మధ్య పాతికేళ్లుగా చల్లారని ‘కావేరి’ చిచ్చు
  • కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఎదుట కూడా పదేళ్లుగా సాగుతున్న వాదనలు
  • దేశంలోని ఇతర రాష్ట్రాల మధ్య జల పంపిణీ వివాదాలదీ ఇదే పరిస్థితి
 

ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో కుట్ర ఉందేమో.....

 సమైక్యాంధ్ర ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో 9 రోజుల అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించడం వెనుక ఏదైనా కుట్ర దాగుందేమోనని, ఈ విషయంపై సమైక్యవాదులు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన పట్టణంలోని లక్ష్మీబజార్‌లో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో పాలొని దీక్షాదారులకు పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏమి చేసినా కుట్రతోనే చేస్తుందని, దీంతో సీఎం వ్యాఖ్యల్ని సందేహించాల్సి వస్తోందని అన్నారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికా, లేక సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడారా? అనే విషయం అర్థం కావడం లేదన్నారు. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణిచి వేసే దిశగా పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే రైల్ రోకో చే సే వారిపై కేసులు పెడతామంటూ డీజీపీ హెచ్చరించారని ఆరోపించారు. 
 
 హైదరాబాదులో మిలియన్ మార్చ్ నిర్వహించినపుడు విగ్రహాలు ధ్వంసం చేస్తే ఎంత మందిపై కేసులు పెట్టారని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై దాడి కేసులోను కొందరిని విడుదల చేయించార ని గుర్తు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణచి వేసేందుకు ఇలా మాట్లాడుతున్నారని, కేసులు పెట్టినా భయపడే వారు ఎవరూ లేరన్నారు. ఎన్‌జీఓలపై ఉద్యమం ఆధారపడి ఉందని, వీరే ప్రభుత్వానికి గుండెలాంటి వాళ్లని అన్నారు. రాష్ర్ట అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మరింత పటిష్టంగా ఉద్యమాన్ని చేపట్టాలని, తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. మన భవిష్యత్తు, భావి తరాల సంక్షేమం కోసం పోరాటాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉపాధ్యాయ సంఘం నాయకుడు పరమేశ్వరప్ప మాట్లాడుతూ ఉద్యమం విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, స్థానిక నాయకులు తలో మాట మాట్లాడుతున్నారని, దీంతో వారిని ఎవరూ నమ్మడం లేద న్నారు. ప్రజలకు నమ్మకం కలిగేలా రాజకీయ నాయకులు వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ర్ట కమిటీ సభ్యుడు పేర్మి బాలాజీ, గోనబావి శర్మాస్, సంజీవులు, జేఏసీ చైర్మన్ కెంచె లక్ష్మీనారాయణ, నాయకులు టీ.రామాంజనేయులు, వెంకటరామిరెడ్డి, సత్యనారాయణ, ఉబేదుల్లా, జలజాక్షి, బాబు తదితరులు పాల్గొన్నారు. 

కృష్ణమ్మపై కేంద్రం పెత్తనం?

కృష్ణమ్మపై కేంద్రం పెత్తనం?

రాష్ట్ర విభజనతో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులు రెండు ప్రాంతాల అధీనంలో లేకుండా.. కేంద్రం కర్రపెత్తనం కిందకు వెళతాయా? ఇప్పటివరకూ అంతర్రాష్ట్ర జల వివాదాల పరిణామాలను పరిశీలిస్తే అవుననే స్పష్టమవుతోంది. రెండు రాష్ట్రాల నడుమ నీటి ప్రాజెక్టుల విషయంలో వివాదం తలెత్తితే.. ఆ ప్రాజెక్టులపై ఆ రెండు రాష్ట్రాలూ పెత్తనం వదిలేయాల్సిందే. జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఓ బోర్డును ఏర్పాటు చేయటం షరామామూలుగా మారింది. ఫలితంగా సదరు ప్రాజెక్టుపై ఆధారపడ్డ రెండు రాష్ట్రాలకూ ఎడతెగని ఇబ్బందులు తప్పవని సాగునీటి నిపుణులు చెప్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా నది జలాల వివాదం రోజు రోజుకు ముదురుతున్న నేపథ్యంలో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందనే దిశగా ఇప్పుడు విసృ్తత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిధిలో నీటి పంపకాలు సంక్లిష్టంగా మారితే కేంద్రం జోక్యం చేసుకుని ప్రత్యేక అథారిటీ (బోర్డు) ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ నదీ జలాల విషయంలో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలతో తలెత్తిన వివాదాలు ఏళ్ల తరబడి కొనసాగుతున్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనతో ఏర్పడే కొత్త రాష్ట్రాలతో ఈ వివాదాలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 
 
 శ్రీశైలం, సాగర్, జూరాలకు ప్రత్యేక బోర్డులు!
 కృష్ణా నదిపై ఇప్పటికే ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లోని ఆయకట్టుకు నీరు అందుతోంది. రాష్ట్రం విడిపోతే.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా మారతాయి. దాంతో వీటి నిర్వహణకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటయ్యే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అదే జరిగితే ఎగువ ప్రాంతంలో ఉన్న జూరాల కూడా బోర్డు పరిధిలోకే వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. జూరాల నుంచే శ్రీశైలంలోకి నీరు విడుదల కావాల్సి ఉండటం.. అలాగే దీనిని ఆధారం చేసుకుని నెట్టెంపాడు (నీటి కేటాయింపు లేదు) చేపట్టటంతో ఈ ప్రాజెక్టును కూడా బోర్డు పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ బోర్డులను స్వయం ప్రతిపత్తితో కానీ, కేంద్ర పర్యవేక్షణలో ఉండే విధంగా కానీ రూపొందించే అవకాశం ఉంది. అంటే ఈ ప్రాజెక్టులపై కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకు ఎటువంటి అధికారం ఉండే అవకాశం లేదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేంద్రమే పెత్తనం చేస్తుంది. 
 
 తుంగభద్రపై బోర్డున్నా తీరని వెతలు: ప్రస్తుతం మన రాష్ట్రంతోపాటు కర్ణాటకకు సాగునీరు అందిస్తున్న తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రత్యేక బోర్డు ఉంది. ప్రతి ఏటా సీజన్‌కు ముందు బోర్డు సమావేశమై నీటి విడుదలపై షెడ్యూలును ప్రకటిస్తుంది. ఈ షెడ్యూల్ ప్రకారమే నీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే పలు సందర్భాల్లో మనకు న్యాయంగా రావాల్సిన నీరు కూడా రావటం లేదు. ఆ నీటి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల్లో ప్రాజెక్టుపై ఆధారపడ్డ రైతులు తీవ్రంగా నష్టం పోవాల్సి వస్తోంది. ప్రాజెక్టుకు దగ్గరలోని కర్ణాటక ఆయకట్టుకు నీరు అందుతుండగా.. మన రాష్ట్రంలోని పంటలు ఎండిపోతున్నాయి. ఒక్కోసారి ఒకటి, రెండు టీఎంసీల కోసం కూడా తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితులున్నాయి. గత రబీ సీజన్‌లో పంటల రక్షణ కోసం 3 టీఎంసీల నీటి విడుదల కోసం కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు కేంద్రాన్ని కూడా జోక్యం చేసుకోవాల్సిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సి వచ్చింది.
 

సోనియా డెరైక్షన్‌లోనే బాబు, కిరణ్

సోనియా డెరైక్షన్‌లోనే బాబు, కిరణ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దర్శకత్వంలోనే ముఖ్యమంత్రి, కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు పనిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి ధ్వజమెత్తారు. బ్రిటిష్ పాలకుల మాదిరిగా విభజించు, పాలించు చందంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, టీడీపీలను రాష్ట్ర ప్రజలు తరిమికొట్టే రోజు అతి దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా నిర్ణయం వెలువడగానే ప్రతిపక్షనేత చంద్రబాబు స్వాగతిస్తారు. రాజధాని కోసం నాలుగు లక్షల కోట్లు కావాలంటారు. సీఎం కిరణ్ తీరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత బయటకువచ్చి ప్రతిపక్షనేతలా మాట్లాడుతున్నారు. ఆయన తాజాగా లేవనెత్తిన అంశాలన్నీ సీడబ్ల్యూసీ ముందు ఎందుకు చెప్పలేదు? రాష్ట్రాన్ని ముక్కలు చేసేది కాంగ్రెస్ పార్టీనే... దాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేసేదీ ఆ పార్టీనేతలే... ఉద్యమాల్లో పాల్గొనేదీ వారే. ఎందుకీ డ్రామాలు?’’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికే సోనియా దర్శకత్వంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. 
 
 వైఎస్‌పై అభాండాలు అన్యాయం...
 రాష్ట్ర విభజనకు బీజం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వేశారని, అందుకే నిర్ణయం జరిగిందంటూ కిరణ్ చేసిన వ్యాఖ్యలు ఎవర్ని మభ్యపెట్టడానికని శోభ సూటిగా ప్రశ్నించారు. విభజనకు రాజశేఖరరెడ్డే బీజం వేసుంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు అమలు జరగలేదని ప్రశ్నించారు. మహానేత మరణించిన వంద రోజుల్లోనే లేఖ పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా? అని నిలదీశారు. ‘‘2000 సంవత్సరంలో సీఎల్పీ లీడర్‌గా రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు వెళ్లి సోనియాగాంధీకి లేఖ ఇచ్చారని కిరణ్ చెబుతున్నారు. అప్పుడు ఎమ్మెల్యేగా మీరు కూడా ఉన్నారు కదా! ఆ రోజు అదే జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించలేదు. ప్రతీదానికి ఉచిత విద్యుత్‌కు, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ పథకాలకు నేనే సలహాలు ఇచ్చానంటూ చెబుతున్నావు... విభజన విషయానికొచ్చేసరికి బీజం వేసింది వైఎస్ అంటూ ఆయనపై నిందలు వేస్తారా? మీరు చేస్తున్న డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు... మీకు కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారు’’ అని హెచ్చరించారు. రాజశేఖరరెడ్డి దగ్గరుండే ఎమ్మెల్యేల చేత సోనియాగాంధీకి లెటర్ ఇప్పించినట్లయితే, ఆయనకు వ్యతిరేకంగా ఎన్నో మీడియా సంస్థలున్నా... పత్రికల్లో కథనాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చిన్నారెడ్డి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి లేఖ ఇచ్చేటప్పుడు పార్టీ అధ్యక్షురాలు రాష్ట్రానికి వచ్చారనే రాజశేఖరరెడ్డితోపాటు మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, అప్పటి పీసీసీ చీఫ్ ఎం.సత్యనారాయణ అక్కడికి వెళ్లినట్లు ఆమె వివరించారు. 
 
 మాకున్న దూరదృష్టి మీకేదీ?
 రాష్ట్ర విభజన జరిగితే నీటి పంపకాలు, రాజధాని, ఉద్యోగులు తదితర అంశాలలో తలెత్తే అంశాలను వివరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెలరోజులకిందటే కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేకు లేఖ రాస్తే, అధికార యంత్రాంగం చేతిలో పెట్టుకొని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పని ఎందుకు చేయలేకపోయారని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. కిరణ్ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, నిర్ణయం వెలువడిన తర్వాత తొమ్మిది రోజులకు తీరిగ్గా బయటకొచ్చి ఇతరులపై బురద చల్లుతూ అభాండాలు వేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీకున్న ఆలోచన, దూరదృష్టి అధికారంలో ఉన్న పార్టీకి లేదా? కిరణ్ కళ్లు మూసుకొని పరిపాలన చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
 
  సీమాంధ్రలో ఉద్యమం ఉధృతమైన తొమ్మిది రోజులకు మీడియా ముందుకొచ్చి సీఎం చేసిన వ్యాఖ్యలు వింటుంటే ఒక సామాన్య వ్యక్తిని తలపించేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానంటూ హైకమాండ్‌కు చెప్పి, తానేదో గొప్పగా బ్యాటింగ్ చేశానంటూ మీడియాకు లీకులిచ్చి, ఇప్పుడు సిగ్గులేకుండా దివాలాకోరు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్‌మ్యాప్‌లతో పలు కోర్‌కమిటీలలో పాల్గొన్న మీకు ఏ విషయం చెప్పకుండానే సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారా? అనేది సీఎం కిరణ్ రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్‌ను సంప్రదించిన వ్యక్తులు.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మీకు చెప్పకుండానే జరిగిందా? అని ప్రశ్నించారు. మీ అనుమతి లేకుండానే నిర్ణయం జరిగినట్లయితే గౌరవం లేని పార్టీలో ఎందుకున్నారని నిలదీశారు. వెంటనే రాజీనామా చేసి బయటకు రాకుండా ఎవర్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని శోభ మండిపడ్డారు.

కార్పొరేషన్ గెలుపే లక్ష్యం

ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: కార్పొరేషన్‌ను గెలుపొందడమే వైఎస్‌ఆర్ సీపీ లక్ష్యమని ఆ పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఖమ్మం కార్పొరేషన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్పొరేషన్‌లోగల 50 డివిజన్లలో అత్యధిక స్థానాలను గెలుపొంది, మేయర్ పదవి సాధించేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే కృషి చేయాలని కోరారు. ఆయా డివిజన్ నాయకులు తమ పరిధిలోని ఓటర్లందరినీ కలుసుకుని, వైఎస్‌ఆర్ అందించిన సంక్షేమ పాలనను గుర్తు చేసి... దానిని తిరిగి తీసుకురాగల సత్తా వైఎస్‌ఆర్ సీపీకి మాత్రమే ఉందన్న విషయాన్ని వివరించాలని కోరారు.
 
  అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను, కుట్రలు.. కుతంత్రాలను వివరించాలని కోరారు. నిరుపేదలకు నిలువ నీడనిచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆయన హయాంలో ఎంత సమర్థవంతంగా అమలైందీ.. ఆ తరువాత ఎలా నిర్వీర్యమైందీ వివరించాలని చెప్పారు. కార్పొరేషన్‌గా ఏర్పాటైన తరువాత కూడా ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైన విషయాన్ని సోదాహరణంగా వివరించాలని కోరారు. రాజన్న రాజ్యాన్ని తిరిగి సాధించేందుకు ఇకపై జరిగే ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిపించాల్సిన అవసరాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. కాంగ్రెస్-టీడీపీ కలిసి జగన్‌మోహన్‌రెడ్డిని కుట్రపూరితంగా జైలుకు పంపడాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారని, అందుకే వారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పక్షాన నిలిచి.. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్యాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారులు గెలుపొందడమే దీనికి నిదర్శనమని అన్నారు. ఖమ్మం జిల్లాను వైఎస్‌ఆర్ సీపీ ఖిల్లాగా మార్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు.
 
 సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, యువజన విభాగం మూడు జిల్లాల సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేషన్‌లోని ముఖ్య నాయకులు హెచ్.వెంకటేశ్వర్లు, ఎస్.వెంకటేశ్వర్లు, మెండెం జయరాజ్, బానోత్ శారద, పద్మాజారెడ్డి, జమలాపురం రామకృష్ట, మందడపు వెంకటేశ్వరావు, మార్కం లింగయ్య, కొంగర జ్యోతిర్మయి, శ్రీలక్ష్మి, తిరుపతిరావు, షర్మిలా సంపత్, తుమ్మా అప్పిరెడ్డి, అరవింద్, మైపా కృష్ణ, బాలాజీ, సాము వెంకటరెడ్డి, వాలూరి సత్యనారాయణ, బాజిన్ని తిరుపతిరావు, జిల్లేపల్లి సైదులు, వాలూరి సత్యనారాయణ, కృష్టవేణి తదితరులు పాల్గొన్నారు.

బాబు లేఖలు.. కిరణ్ లెక్కలు...హై డ్రామా!

బాబు లేఖలు.. కిరణ్ లెక్కలు...హై డ్రామా!
సాక్షి, హైదరాబాద్: :
రాష్ట్ర ప్రజల్లో రగులుతున్న ఆవేశకావేశాలు, ఉద్యమాలు, ఆకాంక్షల సమస్యను పక్కదారి పట్టించటానికి అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు మళ్లీ కుమ్మక్కయ్యాయి. రాష్ట్రంలో ఆందోళనలు, ఉద్యమాలకు మూల కారణమైన ఆ రెండు పార్టీలే ఇప్పుడు మొసలికన్నీళ్లు కారుస్తూ సరికొత్త డ్రామా మొదలుపెట్టాయి. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకోబోతోందని ముందుగానే తెలిసిన సమయంలోగానీ... సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన తర్వాత గానీ... లేదా గత పది రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతున్న సమయంలోగానీ... తమకేమాత్రం సంబంధం లేనట్టు ప్రేక్షక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. ఒకరి తర్వాత ఒకరు ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఒలకబోయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఈ సమస్య రాకుండా ఇరు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరక్కుండా.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేలా కాంగ్రెస్ నాయకత్వాన్నీ కేంద్ర ప్రభుత్వాన్నీ ఒప్పించే స్థాయిలో ఉన్న ఈ ఇద్దరు నేతలు అప్పుడేమీ మాట్లాడకుండా.. సీమాంధ్రలో ఉద్యమం తీవ్రతరమైన నేపథ్యంలో మరో కొత్త నాటకానికి తెరతీశారు. ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లో ఒక పథకం ప్రకారం జరుగుతోందని ఆ పార్టీల్లోనే వినిపిస్తోంది. ఇరు ప్రాంతాల్లో రాజకీయంగా దెబ్బతినడంతో ఇప్పుడు సమస్యలకు పరిష్కారం చెప్పకుండా విభజన ఎలా చేస్తారంటూ కొత్త రకం డ్రామా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. 
 
 వారిద్దరికీ ముందు నుంచి అంతా తెలుసు...
 తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతున్న విషయం ముఖ్యమంత్రి కిరణ్‌కు ముందుగానే తెలుసు. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబుకూ తెలుసన్న విషయం హిందుస్థాన్ టైమ్స్ సైతం స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని, దీనికి మూల కారణం తమ రెండు పార్టీలే అని తెలిసినా ఇంతకాలం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి ఇప్పుడు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని సరికొత్త డ్రామాను మొదలుపెట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది. జూలై 30 న సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన తర్వాత సీమాంధ్రలో తీవ్ర నిరసన వ్యక్తం కావడమే కాకుండా ప్రజల్లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడింది. ఈ పరిస్థితుల్లో పార్టీలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకవైపు రాజీనామాలని.. మరోవైపు సోనియాగాంధీని కలిసి తామేదో అడ్డుకుంటున్నామని హైడ్రామా నడపడం కొంతకాలంగా సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సైతం పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలను ఉద్యమాల్లో పాల్గొనాలంటూ తెరవెనుక కథ నడపడం తెలిసిందే. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన తర్వాత ఇటు కిరణ్‌కుమార్‌రెడ్డిగానీ, అటు చంద్రబాబుగానీ గత పది రోజులుగా బహిరంగ వ్యాఖ్యలేవీ చేయలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరెళ్లి అడిగినా పట్టించుకోని ముఖ్యమంత్రి తొమ్మిది రోజుల తర్వాత ఒక్కసారిగా నిద్రలేచి సమస్యలను పరిష్కరించకుండా విభజన ఎలా చేస్తారంటూ విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పారు. అది జరిగి 24 గంటలు తిరక్కముందే చంద్రబాబు మౌనముద్ర వీడి సీమాంధ్ర ప్రజలపై ప్రేమను ఒలకబోస్తూ ప్రధానమంత్రికి లేఖ రాశారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను, రాష్ట్రం విభజిస్తే ఎదురయ్యే సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర విభజన చేయకుండా అడ్డుపడే స్థాయిలో ఉన్న ఈ నేతలే అంతా జరిగి సీమాంధ్రలో ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమబాట పట్టిన తర్వాత.. అదికూడా వారంతా రోడ్లపై ఉద్యమాలు చేస్తున్న పది రోజులకు నోరు విప్పటం.. అంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్న వ్యవహారంగా స్పష్టమవుతోంది. 
 
 ఇన్నేళ్లుగా ‘విభజన’ సమస్యలు తెలీదా?
 రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశంపై 2008లో టీడీపీ పొలిట్‌బ్యూరో తీర్మానం చేసినప్పుడుగానీ, ఆ తర్వాత ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ అందించినప్పుడుగానీ మహానాడులో తీర్మానం చేసిన సందర్భంలోగానీ, తెలంగాణ అంశాన్ని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని కోరుతూ గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రధానమంత్రికి రాసిన లేఖలోగానీ ఎక్కడా సీమాంధ్ర ప్రజల సమస్యలనూ రాష్ట్రం విభజిస్తే ఉత్పన్నమయ్యే సమస్యలనూ పరిష్కారాల గురించి ఒక్కమాట మాట్లాడని చంద్రబాబు ఉన్నట్టుండి శుక్రవారం ప్రధానమంత్రికి రాసిన లేఖలో సీమాంధ్ర సమస్యలను లేవనెత్తడం ఆ పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేసింది. అది కూడా సీఎం కిరణ్ మాట్లాడిన మరుసటి రోజు ఆయన అవే సమస్యలను ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాయడం రాజకీయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఇరు ప్రాంతాల్లో మనుగడ ప్రశ్నార్థకంగా కావడంతో ఇప్పుడు ఇరు పార్టీలు కలిసి కుమ్మక్కయి ఈ కొత్త డ్రామాను మొదలుపెట్టినట్టు ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సోనియాగాంధీని కలిసినప్పుడు, కోర్ కమిటీ ముందు హాజరైనప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ ఇవే విషయాలను చెప్పానని ఆ రోజే చెప్పకుండా సీమాంధ్ర ఉద్యమం తీవ్రతరమైన నేపథ్యంలో నోరు విప్పడం, అలా చెబుతూనే పరిష్కారం చూపలేని పార్టీలోనూ పదవిలోనూ ఉండే విషయం చెప్పకుండా దాటవేయడం, అదే వాదనను 24 గంటల్లోనే చంద్రబాబు ఎత్తుకోవడం.. అంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నదేనని ఆ వర్గాలు చెబుతున్నాయి. 
 
 పథకం ప్రకారమే వైఎస్ పేరు తెరపైకి
 సీమాంధ్రలో పెద్దఎత్తున ఉద్యమం ప్రారంభమైన పరిస్థితుల్లో కాంగ్రెస్, టీడీపీల రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారటంతో.. ఆ రెండు పార్టీలూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని టార్గెట్ చేస్తూ కొత్త డ్రామా మొదలుపెట్టాయి. ఇరు ప్రాంతాల మనోభావాలను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు చేసిన కాంగ్రెస్, అలా చేయడానికి అవకాశమిచ్చిన టీడీపీలే.. ఇప్పుడు కుమ్మక్కై అదే అంశాన్ని పక్కదారి పట్టించటానికి ఒక పథకం ప్రకారం వైఎస్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. మారిన పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు విశ్వసనీయత కోల్పోగా.. బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఈ కొత్త కుమ్మక్కు డ్రామాను మొదలుపెట్టినట్లు ఇట్టే అవగతమవుతోంది. పైగా ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లోనే సాగుతోందన్న విషయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ మాటల్లో స్పష్టమవుతోంది. తెలంగాణ విభజన అంశంపై ముందుగానే స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ ఇంతకాలం ఏమీ మాట్లాడకుండా తొమ్మిది రోజుల తర్వాత స్పందించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం తొలిసారి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను వివాదంలోకి లాగాలని ప్రయత్నించారు. అది జరిగిన 24 గంటలకే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేత చంద్రబాబు స్పందిస్తూ కిరణ్ మాట్లాడిన కోణంలోనే పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రికి లేఖ రాశారు. 
 
 మాట మార్చింది వైఎస్ కాదు.. ఇప్పటి నేతలే...
 నిజానికి సీఎల్పీ నాయకుడిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2009లో రోశయ్య నేతృత్వంలో కమిటీ వేసేంతవరకు అనేక సందర్భాల్లో తెలంగాణ అంశంపై విడమరిచి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ సీఎల్పీ నేతగా ఉన్న సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న వైఖరితో అన్నిప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఆ తరుణంలో ఆ ప్రాంత నేతల, ప్రజల మనోభావాల మేరకు.. తెలంగాణ కాంగ్రెస్ ఫోరం నేత చిన్నారెడ్డి కోరటంతో తెలంగాణపై లేఖను పార్టీ అధినేత్రి సోనియాకు పంపించారు. ఆ లేఖపై సీడబ్ల్యూసీ రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని తీర్మానించి అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వానికి పంపింది. ఎన్‌డీఏ దాన్ని తోసిపుచ్చింది. ఆ తరువాత 2004, 2009 ఎన్నికల్లో కూడా వైఎస్ కాంగ్రెస్‌ను ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకురాగలిగారు. 2004లో ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా రెండో ఎస్సార్సీనే కాంగ్రెస్ ప్రస్తావించింది. 2009 ఎన్నికలకు ముందు తెలంగాణపై అప్పటి ఆర్థికమంత్రి రోశయ్య ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటుచేసి, విభజన వల్ల తలెత్తే అనేక అంశాలపై ముందుగా చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరముందని స్పష్టంచేశారు. ఆ రెండు ఎన్నికల్లోనూ వైఎస్ కాంగ్రెస్‌ను గెలిపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఈ విషయాలేవీ గుర్తులేదా? అని కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.
 
అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలు, అభిప్రాయాలు తెలుసుకోవటానికి రోశయ్య నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన విషయం మరిచారా? ఆ కమిటీ పరిశీలించాల్సిన అంశాలపై అటు పార్టీ కానీ, ప్రభుత్వం కానీ స్పష్టతకు రాకుండానే నిర్ణయానికి వచ్చినా.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటివరకు ఎందుకు మౌనంగా ఉన్నారు? అన్న అనుమనాలు తలెత్తుతున్నాయి. కోర్ కమిటీ సమావేశం జరగటానికి ముందునుంచే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పెద్దలు హడావుడి చేస్తున్నట్లు సంకేతాలు వచ్చాయి. కోర్ కమిటీ సమావేశానికి హాజరైన కిరణ్‌కుమార్‌రెడ్డి రోశయ్య కమిటీ ప్రతిపాదించిన అంశాలపై ఎందుకు గట్టిగా వాదించలేకపోయారు? పార్టీ నిర్ణయం తీసుకుంటోందని తెలిశాక వెంటనే ఆ విషయాన్ని నిరసిస్తూ పదవిని ఎందుకు త్యజించలేకపోయారు? అన్న విమర్శలు కాంగ్రెస్ నేతల నుంచే వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి వచ్చే స్పందనను అనుసరించి ముందుకు వెళ్లాలన్న ఆలోచనతోనే అటు చంద్రబాబు, ఇటు కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఆలస్యంగా స్పందించటం, ఆపై ఇరువురూ వైఎస్సార్ కాంగ్రెస్‌నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయటం వెనుక అంతా కాంగ్రెస్ హైకమాండ్ మార్గనిర్దేశంలోనే జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు తొలుత స్పందిస్తూ.. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొనటం గమనార్హం. రాష్ట్ర విభజనపై కేంద్రం ప్రకటన చేశాక ప్రధాన ప్రతిపక్షనేతగా దానిపై తన అభిప్రాయాన్ని చెప్పటం కాకుండా ఏకంగా కాంగ్రెస్ తీర్మానాన్నే చంద్రబాబు సమర్థించినట్లు ప్రకటన చేశారంటే ఆ పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే బాబు నడుస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఇదంతా కాంగ్రెస్, టీడీపీల మ్యాచ్‌ఫిక్సింగ్‌కు తార్కాణంగా నిలుస్తోంది. 

Mysura says YSRCP will withdraw all cases against agitators after comig to power

Written By news on Friday, August 9, 2013 | 8/09/2013

దొంగలు పడ్డ ఆరు నెలలకు..

గుంటూరు : రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి సుదీర్ఘ వివరణ ఇవ్వడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందని ఆయన విమర్శించారు.

పైపెచ్చు, విభజన గురించి అటు అనుకూలంగా గానీ, ఇటు వ్యతిరేకంగా గానీ ఏమీ మాట్లాడకుండా ఆయన గోడమీద పిల్లి వాటంగా వ్యవహరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాలతో రాష్ట్రంలో చిచ్చు రేపారని ఆయన అన్నారు.

ఆంటోనీ కమిటీతో ఒరిగేదేంలేదు: బాలినేని

ఆంటోనీ కమిటీతో ఒరిగేదేంలేదు: బాలినేని
ఒంగోలు : ఏకే ఆంటోనీ కమిటీతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా సీమాంధ్ర మంత్రులంతా రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజనకు నిరసనగా ఒంగోలులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి బాలినేని శ్రీనివాస రెడ్డి పాలాభిషేకం చేశారు. వైఎస్సార్ పేరెత్తే అర్హత సీఎం కిరణ్ కు లేదన్నారు. వైఎస్సార్ గురించి అసత్యాలు ప్రచారం చేయడం తగదన్నారు. రాష్ట్ర విభజనపై కిరణ్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు.

చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే...

చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే...: శోభ
హైదరాబాద్ : ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటయిన నలుగురు సభ్యుల కమిటీ కాంగ్రెస్ పార్టీ కమిటీ, ప్రభుత్వ కమిటీనా అనేది కేంద్రం స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ అధికారికంగా ప్రకటించారు కాబట్టే అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు కమిటీకి చెప్పాయని గుర్తు చేశారు. ఏకే ఆంటోనీ కమిటీ ప్రభుత్వ కమిటీ అయితే అన్ని పార్టీలు తమ వైఖరి స్పష్టం చేస్తాయన్నారు.  

సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ డైరెక్షన్ లో పనిచేస్తున్నారని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్‌ పార్టీ కొట్టుకుపోతుందని భావించి సీఎం మీడియా ముందుకు వచ్చారని అన్నారు. విభజనకు వైఎస్‌ బీజం వేశారంటూ సీఎం మాట్లాడటం దారుణమన్నారు. ఒకవేళ వైఎస్సే విభజన చేయాలనుకుంటే .. ఆపని ఎప్పుడో చేసేవారని చెప్పారు. వైఎస్‌ఆర్‌లాంటి బలమైన నాయకుడు వల్లే విభజన జరగలేదని ప్రతి సామాన్యుడికి తెలుసునని అన్నారు.

తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే వైఎస్సార్ పై సీఎం కిరణ్ నిందలు వేస్తున్నారని అన్నారు. విభజన ప్రకటన ముందే కిరణ్ స్పందించాల్సివుందన్నారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కొలేకే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలంతా రాజీనామాలు చేసి సంక్షోభం సృష్టించివుంటే పార్టీ నిర్ణయం తీసుకునేదా అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన లో బాబు తొలి ముద్దాయి-NTV స్టోరీ బోర్డు "అమావాస్య చంద్రుడు".

వైయస్ఆర్ చేవ పై చేతకానితనం నిందలా?


http://www.tupaki.com/news/view/Kiran-Kumar/33322

వైఎస్ పై నిందలు వేయటం సరికాదు: గుత్తా

వైఎస్ పై నిందలు వేయటం సరికాదు: గుత్తా
నల్గొండ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు విరుచుకు పడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిలుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. సొంత జిల్లాలో సర్పంచ్ లను గెలిపించుకోలేని ముఖ్యమంత్రి సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు.... ముఖ్యమంత్రి కార్యక్రమాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. విభజనకు ఆధ్యుడు ... చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డే కారణమంటూ అపనిందలు వేయటం సరికాదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని వారు సూచించారు.

తెలంగాణలో బలమైన శక్తిగా వైఎస్‌ఆర్ సీపీ

 తెలంగాణ ఏర్పాటు అంశంపై వైఎస్‌ఆర్ సీపీ గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉందని పార్టీ రాష్ట్రనేతలు గట్టు రాంచందర్‌రావు, బాజిరెడ్డి గోవర్ధన్ పునరుద్ఘాటించారు. తెలంగాణలోని పది జిల్లాల్లో బలమైన శక్తిగా ఉందని స్పష్టంచేశారు. ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు పట్ల కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని ప్రకటించనందుకు మాత్రమే వైఎస్‌ఆర్ సీపీ ఎమ్యెల్యేలు పదవులకు రాజీనామాలు చేశారని గుర్తుచేశారు. గురువారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోగల పార్టీ కేంద్ర కార్యాలయంలో పాలమూరు జిల్లా నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం దక్కాలని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పలుసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని అన్నారు.
 
 కాంగ్రెస్ పార్టీ సొంత లాభం కోసం ఏళ్లతరబడి సమస్యను జఠిలం చేసినందుకు ఇరుప్రాంతాల్లో అనవసరంగా విద్వేశాలు రగిలాయని వివరించారు. ఆయా ప్రాంతాల సామాన్య ప్రజలు రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని, తెలంగాణ ప్రాంతంలో కూడా పార్టీ శ్రేణులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొందని గుర్తుచేశారు. కొంతమంది నేతలు సొంత ఎజెండాతో పార్టీని వీడారని, అంతమాత్రాన ఎలాంటి నష్టం జరగదని స్పష్టంచేశారు.
 
 గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ కుటుంబం పట్ల ఆదరణ చెక్కుచెదరలేదని, రాష్ట్ర విభజన వల్ల పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రముఖులు రామకృష్ణారెడ్డి, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, సీజీసీ, సీఈసీ సభ్యులు వంగూరు బాలమణెమ్మ, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు సురేందర్‌రెడ్డి, బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, మల్లెపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శివకుమార్‌రెడ్డి, బి.హర్షవర్ధన్‌రెడ్డి, రైతు, యువజన, వైద్య, విద్యార్థి విభాగాల జిల్లా కన్వీనర్లు విష్ణువర్ధన్‌రెడ్డి, రవిప్రకాశ్, డాక్టర్ శివరాంనాయక్, కృష్ణవర్ధన్‌రెడ్డి, నేతలు తిరుమల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రాంరెడ్డి, చిల్కమర్రి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


నల్లగొండ: ‘తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్ గూడుకట్టుకుని ఉన్నారు. ఆయనను మా గుండెల్లో పెట్టుకున్నాం. ఎన్ని అవాంతరాలు వచ్చినా పార్టీని బలోపేతం చేసేందుకు శ్రమిస్తాం. తెలంగాణలో పార్టీ పని అయిపోందని మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీటిని కార్యకర్తలు నమ్మొద్దు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ‘ప్లీనరీ’ తీర్మానానికి పార్టీ కట్టుబడి ఉంది.
 
 రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే మా ప్రధాన డిమాండ్’... అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకత్వం పేర్కొంటోంది. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అగ్రనాయకత్వానికి జిల్లా నాయకులు ఈ మేరకు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీ మనుగడకు వచ్చిన ముప్పేమీ లేదని, జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు తమ నియోజకవర్గాల్లో శ్రమిస్తామని పలువురు నాయకులు హామీ ఇచ్చారు.
 
 రెండు రాష్ట్రాలు ఏర్పడితే జాతీయ పార్టీగా రెండు రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు ఉంటాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమైందని పార్టీ వర్గా లు చెప్పాయి. ‘పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాటలో నడుస్తాం. పార్టీనీ పటిష్టం చేస్తాం. జిల్లా ప్రజలు ఎదుర్కొనే  ప్రతి సమస్యపైనా పోరాటాలు చేస్తాం. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెడతాం. వైఎస్‌ఆర్ అభిమానులు ఎందరో ఉన్నారు. కష్టపడతాం. పార్టీ అభ్యర్థులం గెలి పించుకుంటాం..’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా క న్వీనర్ బీరవోలు సోమిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత అంశాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
 
 సమావేశంలో సీఈసీ సభ్యుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పాదూరి కరుణ, సీనియర్ నాయకుడు గాదె నిరంజన్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దేవరకొండ కో ఆర్డినేటర్ సురేష్ నాయక్, మునుగోడు నియోజకవర్గ నాయకుడు బోయపల్లి అనంత్‌కుమార్‌గౌడ్, నకిరేకల్ నియోజకవర్గ నాయకుడు నకిరేకంటి స్వామి పాల్గొన్నారు. అదే మాదిరిగా పార్టీ ఇతర నాయకులు అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, మేకల ప్రదీప్‌రెడ్డి, చామల భాస్కర్‌రెడ్డి, గట్టు మధుసూదన్‌రావు, చామల భాస్కర్‌రెడ్డి, ఇరుగు వెంకటేశ్వర్లు, వడ్లోజు వెంకటేశ్వర్లు, ఇరుగు సునీల్, గూడూరు జైపాల్‌రెడ్డి హాజరయ్యారు.  

నాడు నోరెత్తలేదేం? : మైసూరారెడ్డి

నాడు నోరెత్తలేదేం? : మైసూరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: :  ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తిన మైసూరారెడ్డి
 సీడబ్ల్యూసీ ముందు సమస్యలన్నింటినీ వివరించారా?
 మీరు చెప్పినా కాంగ్రెస్ అధిష్టానం పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుందా?
 మీ మాటల్ని ఖాతరు చేయకపోతే మీరెందుకు రాజీనామా చేయలేదు?
రాష్ట్రాన్ని విభజిస్తే రాజధాని, నీటిపంపకాలు, విద్యుత్, ఉద్యోగుల సమస్యలున్నాయంటున్నారు
ఈ సమస్యలన్నీ కొద్దిరోజులుగా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ చెబుతున్నవే
విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడటంలో అర్థమేముంది?
 ఇతర పార్టీలవి దొంగనాటకాలంటున్నారు... అసలు మీ నాటకమేమిటి?
 రాష్ట్రాన్ని విభజిస్తే చాలా ప్రాజెక్టులు స్మారక చిహ్నాలుగా మిగిలిపోతాయి..
రాష్ట్ర విభజన నెపాన్ని వైఎస్‌పై నెట్టడం తగదు  
 రాష్ట్రాన్ని విభజిస్తే రాజధాని, నీటి పంపకాలు, విద్యుత్, ఉద్యోగుల సమస్యలున్నాయని మీకు తెలుసుకదా?
 మీరు చెప్పినా అధిష్టానం పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుందా?..  అయితే మీరెందుకు రాజీనామా చేయలేదు?
 విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడటంలో అర్థమేముంది?

 
రాష్ట్రాన్ని విభజిస్తే రాజధాని, నీటి పంపకాలు, విద్యుత్ సమస్యలు, ఉద్యోగులు, తదితర అంశాలపై సమస్యలున్నాయని చెప్తున్న ముఖ్యమంత్రి సీడబ్ల్యూసీ ముందు నోరెందుకు ఎత్తలేదని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం రాత్రి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి  మీడియా సమావేశానంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అన్ని విషయాలపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలేమిటో తెలిసే ఉంటుంది. విభజన ప్రకటనకు ముందు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మీరూ పాల్గొన్నారు.
 
 అప్పుడు ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావించారా? మీరు చెప్పినా కాంగ్రెస్ అధిష్టానం పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుందా? అలా చేసుంటే మీరు వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుండాల్సింది. కానీ అలా చేయకుండా విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడటంలో అర్థమేముంది?’’ అని నిలదీశారు. ఇతర పార్టీలవి దొంగ నాటకాలంటున్న కిరణ్... ఆయన ఆడుతున్న నాటకమేదో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇది తాను మంచివాడినని చెప్పుకోవడం కోసమో లేదా ప్రజల ఆగ్రహావేశాలనుంచి పార్టీని కాపాడేందుకో సీఎం కిరణ్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
 
 ప్రజలను మభ్యపెట్టడానికే ఆ కమిటీ..
 ఆంటోనీ నేతృత్వంలో వేసిన హైలెవెల్ కమిటీకి సమస్యలు చెప్పుకోవాలని ముఖ్యమంత్రి సూచించడాన్ని మైసూరా తప్పుబట్టారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో సీడబ్ల్యూసీ అత్యున్నత కమిటీ. ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సబ్ కమిటీ ఎలా సవరించగలుగుతుంది. యజమాని చేసిన నిర్ణయంపై గుమాస్తా పంచాయతీ చేయగలడా? ఒక పార్టీ వేసుకున్న కమిటీకి మిగతా పార్టీలు అభిప్రాయాలెందుకు చెప్తాయి? ఒకవేళ చెప్పినా చెవికెక్కుతుందా? ఎవరెన్ని చెప్పినా ఆఖరికి వారి అధినేత్రి సోనియా చెప్పిన విషయాలనే రిపోర్టులో పొందుపరుస్తారు’’ అని విమర్శించారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య లక్ష్మణరేఖ ఉంటుంది.
 
 దాన్ని విస్మరించినట్లు కాంగ్రెస్‌పార్టీ ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. చట్టబద్ధంగా నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికనే తుంగలో తొక్కేసిన వారు ఎలాంటి అధికారాలు లేని ఆంటోనీ కమిటీ సూచనలను పాటిస్తారని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన కమిటీని నియమిస్తేనే అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలు వినిపిస్తారని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యనెలా పరిష్కరిస్తారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ చాలాకాలంగా ప్రశ్నిస్తోందని మైసూరా గుర్తుచేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కావేరీ, ఆల్మట్టి జల వివాదాలు ఇప్పటికీ పరిష్కారం కావడంలేదు. ఈ సమస్యను హైపవర్ కమిటీ ఎలా పరిష్కరిస్తుందని నిలదీశారు.
 
 కాంగ్రెస్‌కు పది తలలుంటాయి...
 కాంగ్రెస్ పార్టీ పది తలల రావణాసురుడులాంటిదని, అందులో ఒక్కో తల ఒక్కొక్క మాట చెబుతోందని మైసూరా ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నాలుగేళ్లుగా కాంగ్రెస్ తన వైఖరి చెప్పకుండా రాజకీయ దుష్టచింతనతో ప్రవర్తించింది. హోంమంత్రి షిండేతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా రెండు ప్రాంతాల ప్రతినిధులు రెండు రకాలు చెప్పారు. పార్టీ వాదన చెప్పాలని తాము నిలదీస్తే... అధిష్టానం చెప్పేదే అంతిమ నిర్ణయమని షిండే చెప్పారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే సీడబ్ల్యూసీ ఇప్పుడు నిర్ణయం తీసుకుంది.
 
 రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది. దాన్ని చల్లార్చేందుకే కమిటీలంటూ నాటకాలాడుతోంది. తాజాగా సీఎం కిరణ్ మాట్లాడుతూ... విభజన పార్టీకే పరిమితం తప్ప, కేంద్రం నిర్ణయం కాదంటూ ఇరుప్రాంతాల్లో సమస్యను మరింత జఠిలం చేశారు. వారి వాలకం చూస్తుంటే ఎలాంటి నిర్ణయమైనా ముందు, వెన క్కి తీసుకునే సౌలభ్యాన్ని చేతిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఓట్లు, సీట్ల కోసమే ఎన్నికల ముందు ఎత్తులు వేస్తున్నారు’’ అని మైసూరా విమర్శించారు. ఇది రాజకీయ లబ్ధికోసం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారని తెలిపారు.
 
 మాది ఒకే మాట...
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకే మాటకు కట్టుబడి ఉందని మైసూరా చెప్పారు. ప్లీనరీ నుంచి షిండే ఏర్పాటు చేసిన అఖిలపక్షం వరకు ఒకే మాట చెప్పామని, ఒక తండ్రిలా సమస్యను పరిష్కరించాలని కోరామని వివరించారు. అవేవీ చేయకుండా ఇతరులపై బురద చల్లడం సరైంది కాదన్నారు. నీటి పంపకాలు, రాజధాని, ఉద్యోగులు తదితర అంశాలపై తాము వారం రోజులుగా అనునిత్యం మీడియా సమావేశంలో చెబుతున్న వాటినే సీఎం ప్రస్తావించారని చెప్పారు.
 
 రాష్ట్ర విభజన నెపాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై నెట్టడాన్ని మైసూరా తప్పుపట్టారు. ‘‘ఆనాడు ఎమ్మెల్యేలందరూ వెళ్లి సోనియాగాంధీని కలిసినప్పుడు సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశారు. రెండోఎస్సార్సీ ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. అప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి అదే తీర్మానాన్ని అందజేసింది తప్ప అంతకుమించి మరేమీ జరగలేదు’’ అని మైసూరారెడ్డి వివరించారు.

Popular Posts

Topics :