5/12/2012
Bypolls: Congress worried over crumbling Chiru vote bank(Times of India)
HYDERABAD: With the by-polls exactly a month away, more bad news has hit theCongress campaign. An internal report has expressed concern over the possible non-transfer of the Prajarajyam Party votes to the ruling party, and a worried PCC president Botsa Satyanarayana has directed the district Congress leaders to immediately coordinate a campaign with their erstwhile PRP leaders and ensure that the merger of the two parties gets reflected in the form of votes for the ruling party candidate in the by-polls.
Of the 18 assembly constituencies and one Lok Sabha seat going for the by-polls on June 12, the Kapu, Balija, Telaga, Ontari and Turpu Kapu communities have an influential say in almost 10 of them.
They include Narsannapet in Srikakulam, Payakaraopet in Visakhapatnam, Ramachandrapuram in East Godavari, Narsapuram and Polavaram in West Godavari, where they comprise nearly 18% of the electorate, and Rayachoti, Rajampet, Railway Koduru and Rayadurgam constituencies in Kadapa, Tirupati in Chittoor and Anantapur respectively where they command 24% or more of the total voter strength.
All the above-mentioned communities are said to have voted for the PRP in the last elections and with the Chiranjeevi party having merged with the Congress, the ruling party leaders have been in the firm belief that these votes would get transferred to them.
However, the filed report is indicating that it is not all that hunky dory for the Congress. "The PRP started as an anti-Congress and anti-TDP party and most of the Kapu-Balija members had moved to that party in the hope of ensuring an alternative leadership and voted in a big way for Chiranjeevi.
"However, the dislike for the Congress is still existing among many of these voters. Therefore, it is likely that not all of them will vote for the hand symbol," said a leader.
Thus according to the field report, in East and West Godavari districts, many of the PRP voters are moving towards the YSR Congress and a similar trend is also discernable in Kadapa, Kurnool and Anantapur districts.
In South costal Andhra region, the Balija and Kapu votes are getting divided between the YSR Congress and TDP, and according to the report, in Srikakulam, Vizainagaram and Visakhapatnam districts, the PRP vote bank is highly divided with many deciding to align with the YSR Congress.
Alarmed over the report, both chief minister N Kiran Kumar Reddy and the PCC chief are making desperate moves to set right the situation.
"Only if we get a big majority in these constituencies can it be said that the Congress-PRP merger has taken place at the ground level," the chief minister said during his Payakaraopet tour.
On his part, Botsa has directed the district Congress leaders to immediately coordinate the campaign with the erstwhile PRP leaders and ensure that the Chiranjeevi vote bank remains intact with the Congress.
"The local Congress and PRP voters should work in coordination and ensure that the votes are completely transferred in favour of the hand symbol," the PCC president told TOI.
However, it will be known only on June 15, when the results of the bypolls are declared, whether such a transfer has really happened.

IT Rides On Chiranjeevi's Big Daughter Sushmita
చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నివాసంలో సోదాలు జరిపిన ఆదాయ పన్ను శాఖ అధికారులు రూ. 80 కోట్లు నగదు, విలువైన వజ్రాభరణాలు దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి అల్లుడిని అధికారులు తమ కార్యాలయానికి పిలిచి వివరాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. చిరంజీవి కూతురు ఇంట్లో భారీ ఎత్తున నగదు బయటపడడం పలు అనుమానాలకు తావిస్తోంది.
5/12/2012
ఇలాగైతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం
జాతీయ జర్నలిస్టు సంఘాల హెచ్చరిక | |
|
5/12/2012
వేల ఎకరాలు ఆక్రమించిన రామోజీ దావూద్‌లా కనిపించడంలేదా? బియ్యం స్మగ్లింగ్ చేసిన రాధాకృష్ణ పత్రికెలా పెట్టారు?
వేల ఎకరాలు ఆక్రమించిన రామోజీ దావూద్‌లా కనిపించడంలేదా?
బియ్యం స్మగ్లింగ్ చేసిన రాధాకృష్ణ పత్రికెలా పెట్టారు?
హైదరాబాద్, న్యూస్‌లైన్:
సూట్‌కేసులు మోసి పదవి పొందిన కిరణ్‌కుమార్‌రెడ్డికి, తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలను గాలికి వదిలేసిన చిరంజీవికి... మాటకు కట్టుబడిన జగన్‌ను విమర్శించే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు 45 సార్లు ఢిల్లీకి వయా చెన్నై, బెంగళూరు మీదుగా సూట్‌కేసులు మోసుకెళ్లారని కిరణ్‌ను ఉద్దేశించి ఆయన మంత్రివర్గంలోని మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకోవాలని సూచించారు. జగన్ స్వార్థం వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని సీఎం కిరణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, మహిళలు ప్రతి ఒక్కరూ సమస్యలతో సతమతమవుతుంటే... సీఎం కిరణ్ మాత్రం ప్రతిపక్ష చంద్రబాబుతో కలిసి జగన్‌ను రాజకీయంగా ఏవి ధంగా అణచాలని కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుతో జగన్ కుమ్మక్కయారని కిరణ్ చెప్పడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అనే మూడో వ్యక్తిని లేకుండా చేయడానికి కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి కోర్టుమెట్లెక్కిన వైనం తెలుగు ప్రజలకు గుర్తుందన్నారు.
జగన్‌కు ఓటేస్తే క్రిమినల్‌కు వేసినట్లని సీఎం కిరణ్, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బాజిరెడ్డి ఖండించారు. ‘‘జగన్ ఏమైనా ఆయుధం పట్టుకొని తిరుగుతున్నారా? ఆయన అనునిత్యం రోజులో 20 గంటలు ప్రజల మధ్యే గడుపుతున్నారు. ప్రజల్లో తిరగలేక బాబు, కిరణ్ ఇద్దరూ కుమ్మక్కై జగన్‌ను ఏ విధంగా అప్రతిష్ట పాల్జేయాలనే ఆలోచన చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. సీఎం కిరణ్‌కు కళ్లు తెరిచినా మూసినా... కలలో కూడా సోనియా కాళ్లు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు.
రామోజీ, రాధాకృష్ణల బతుకేంటి?: టీడీపీ నేతలకు మదమెక్కి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను గజదొంగలతో, జర్నలిస్టులను దావూద్ ఇబ్రహీంతో పోలుస్తున్నారని బాజిరెడ్డి దుయ్యబట్టారు. పచ్చళ్లు అమ్మి వేల ఎకరాలు సంపాదించిన, అనేక రాష్ట్రాల్లో మీడియా చానళ్లు పెట్టిన రామోజీ.. దావూద్‌లా కనిపించడం లేదా? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. సైకిల్ తొక్కుతూ పక్క రాష్ట్రాలకు బియ్యం స్మగ్లింగ్ చేసిన రాధాకృష్ణ పేపర్, చానల్ ఎలా పెట్టగలిగారని నిలదీశారు. రామోజీ, రాధాకృష్ణల బతుకులు టీడీపీ నేతలకు కనిపించడం లేదా? అని మం డిపడ్డారు. సాక్షి ఖాతాలను ఫ్రీజ్ చేసే అధికారం సీబీఐకి ఎక్కడిదని ప్రశ్నించారు. న్యాయస్థానాల మాదిరిగా సీబీఐ తనకు తానే తీర్పు నిస్తుందా? అని నిలదీశారు. ‘‘సాక్షిలో పెట్టుబడి పెట్టిన వారు దొంగలో, లేదా అది బ్లాక్‌మనీ అయితేనో సీజ్‌చేసి రికవరీ చేసుకోవచ్చు. కానీ పెట్టుబడులు పెట్టిన వారంతా బడా పారిశ్రామికవేత్తలు. వారంతా నేరుగా షేర్లు కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టారు’’ అని తెలిపారు.

సర్కారుకు మద్దతివ్వడం సరికాదు: సోలిపేట
సాక్షిపై దాడి విషయంలో కొన్ని పత్రికలు సర్కారుకు మద్దతివ్వడం సరికాదని టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శుక్రవారం టీవీ చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. ‘జగన్ కేసు విషయంలో మా ప్రమేయం ఏమీ లేదు.. చట్టం తన పని తాను చేసుకొని పోతుందన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు.. అనంతరం సాక్షికి ప్రభుత్వం ప్రకటనలు ఆపడాన్ని బట్టి.. కాంగ్రెస్ పార్టీనే ఇదంతా చేయిస్తోందని స్పష్టమయింది. సాక్షిలో వెయ్యిమంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని అనడం సీఎం అవగాహన రాహిత్యాన్ని స్పష్టం చేస్తోంది. అంటే ఇద్దరే ఉంటే చంపేస్తారా? సీబీఐ పలు కేసుల్లో వ్యవహరిస్తున్న తీరుతో దాని ఇజ్జత్ పోతోంది. ఆదిలాబాద్‌లో హేమచంద్రపాండే అనే జర్నలిస్టును కాల్చి చంపడంపై నివేదిక ఇవ్వమంటే ఓ పోలీసు అధికారి రాసినదాన్నే యథాతథంగా ఇచ్చింది. సీబీఐని కాంగ్రెస్ నడుపుతోంది’ అని విమర్శించారు.
5/12/2012
సాక్షి మీడియాకు ప్రకటనలు నిలిపివేయడంపై మండిపడ్డ మేధావులు
ఫ్యాక్ట్ స్వచ్ఛంద సంస్థ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పాత్రికేయులు, ప్రముఖుల అభిప్రాయాలు ![]() వివిధ రంగాల నేతల ఏకాభిప్రాయం మేరకు సదస్సు రెండు తీర్మానాలను ఆమోదించింది. కార్యక్రమ సమన్వయకర్త టీవీ రావు ఈ తీర్మానాలను చదివారు. తీర్మానాల సారాంశమిదీ.. 1)భావ ప్రకటనా స్వేచ్ఛకు, జర్నలిస్టులు, ఇతర సిబ్బంది మాన ప్రాణాలకు, ముద్రణ, ప్రసార వ్యవస్థలకు అవరోధంగా, హానికరంగా తీసుకునే అన్ని చర్యలను సదస్సు తీవ్రంగా ఖండిస్తోంది. 2)దేశవ్యాప్తంగా ఉన్న సాక్షి జర్నలిస్టులు, ఇతర సిబ్బంది జీతాలకు అవరోధం కల్పించే విధంగా సాక్షి కరెంటు అకౌంట్లను సీబీఐ స్తంభింపజేయడాన్ని, ప్రభుత్వం సాక్షి పత్రికకు, మీడియాకు ప్రకటనలు (అడ్వర్టయిజ్‌మెంట్లు) నిలిపివేయడాన్ని సదస్సు తీవ్రంగా ఖండిస్తోంది. హైదరాబాద్, న్యూస్‌లైన్: సాక్షి పత్రిక, చానల్‌కు చెందిన బ్యాంకు అకౌంట్లను సీబీఐ స్తంభింపజేయడం, ప్రభుత్వం ప్రకటనలను నిలిపివేయడం సర్కారు నిరంకుశత్వ ధోరణికి పరాకాష్టని సీనియర్ పాత్రికేయులు, మేధావులు మండిపడ్డారు. పత్రిక ముద్రణకు ఆటంకం కలిగించే ఎలాంటి చర్య అయినా పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని, దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ఇదిలాగే కొనసాగితే మీడియా మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. ‘ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ’అనే అంశంపై ఫోరం ఫర్ అనలిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్ (ఫ్యాక్ట్) సంస్థ శుక్రవారం ఇక్కడ నిర్వహించిన చర్చాగోష్ఠిలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. సర్కారు తీరును తీవ్రంగా ఖండించారు. ఫ్యాక్ట్ సంస్థ ప్రతినిధి టి.వి.రావు సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రముఖ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలపక్షం వహించే పత్రికల గొంతు నొక్కడం అధికార పార్టీలకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. ఎమర్జెన్సీ నుంచి ఈ ధోరణి మొదలై నేడు సాక్షి వరకూ వచ్చిందని, ఇప్పుడైనా తీవ్రంగా ప్రతిఘటించకపోతే భవిష్యత్తులో ఇతర పత్రికలకు సైతం ముప్పు కలిగే ప్రమాదముందని హెచ్చరించారు. మినీ ఎమర్జెన్సీని తలపించేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ధోరణిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. కొన్ని పత్రికలు, చానళ్లు అవినీతి కేసుల్లో మంత్రులనెందుకు అరెస్టు చేయడంలేదన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలకు అసలు ప్రాధాన్యమివ్వకుండా, సాటి పత్రికపై చిన్నపాటి వ్యాఖ్యలకు ఎక్కడా లేని ప్రాధాన్యమిస్తుండటం దురదృష్టకరమని అన్నారు. సీబీఐ విచారణ పూర్తి కాకుండానే చార్జిషీట్ మీద చార్జిషీట్ దాఖలు చేస్తూ ఉద్దేశపూర్వకంగా సాక్షి పత్రికను ఇబ్బందిపెట్టడం ప్రభుత్వ నిరంకుశ ధోరణికి అద్దం పడుతోందన్నారు. ప్రముఖ పాత్రికేయులు హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తే ఆ పత్రికను ఎలా ఇబ్బందిపెడతారో ప్రస్తుతం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. ఇలాంటి సమయంలో జర్నలిస్టులు ఐక్యంగా ఒకే తాటిపైకి రావడం అవసరమని సూచించారు. పభుత్వానికి ఉన్నపళంగా ప్రకటనలు నిలిపివేసే హక్కు లేదని సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి గుర్తుచేశారు. సాక్షి మీడియా పెట్టుబడులపై సీబీఐ విచారిస్తోందనే సాకుతో ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయడం సరికాదన్నారు. సాక్షి పుట్టడమే తప్పు అన్నట్టు వ్యవహరించడం విచక్షణారాహిత్యమని విమర్శించారు. ప్రముఖ పాత్రికేయులు బండారు శ్రీనివాసరావు మాట్లాడుతూ సాక్షి బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడంలో ఏ పార్టీకి, మీడియా సంస్థలకు కూడా సంబంధం లేదని స్వయానా సీఎం చెప్పడం అనుమానాలకు తావిస్తోం దన్నారు. ఎలాంటి సంబంధం లేకుండా ప్రతిపక్షాలు, ఇతర మీడియా సంస్థలను సీఎం ప్రస్తావించాల్సిన అవసరమేముందని ప్రజలు అనుమానిస్తున్నారని పేర్కొన్నారు. సదస్సులో పాల్గొన్న మరికొందరు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. పాలకుల మనోవైకల్యమే కారణం పాలకుల మనోవైకల్యమే పత్రికలపై దాడికి కారణం. సాక్షిపై ప్రభుత్వ దమనకాండను వ్యతిరేకించడాన్ని కూడా కొందరు నాయకులు, కొన్ని పత్రికలు తప్పుపడుతున్నాయి. ఇది సరికాదు. సాక్షిలో వెయ్యి మంది ఉద్యోగులే ఉన్నారని హేళనగా మాట్లాడిన ముఖ్యమంత్రికి వెయ్యి కుటుంబాలు ఉపాధి కోల్పోవడమంటే లెక్కలేనట్టుంది. సాక్షిని అణచివేసేందుకు ప్రయత్నించడం కోటి మందికి పైగా పాఠకుల హక్కులను హరించడమే. రౌండ్ టేబుల్ సమావేశం కోసం బుక్ చేసిన జూబ్లీ హాల్‌ను రాత్రికి రాత్రే ప్రభుత్వం రద్దు చేయడంలో దమననీతి కనిపిస్తోంది. మూడు నాలుగు రోజులుగా కొన్ని రాజకీయ పక్షాలు, మీడియా సంస్థలు ఏకంగా జర్నలిస్టు సంఘాలపైనే గురిపెట్టాయి. సాక్షి విషయంలో ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టిన మాపై కొన్ని రాజకీయ పక్షాలు, కొందరు వ్యక్తులు తప్పుబడుతున్నారు. -దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్ ఇది పత్రికా స్వేచ్ఛపై దాడే పత్రికా స్వేచ్ఛ భావ ప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగం. గతంలో పలు కేసుల్లో కూడా సుప్రీం కోర్టు ఈ అంశాన్ని స్పష్టం చేసింది. పత్రిక ముద్రణకు ఎలాంటి ఆటంకం కలిగించినా అది పత్రికా స్వేచ్ఛపై దాడే. సాక్షి మీడియా బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడం, ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయడం పత్రికా స్వేచ్ఛపై నేరుగా దాడి చేయడమే. ఫ్యాక్ట్ సదస్సుకు జూబ్లీహాల్‌ను కేటాయించి తిరిగి రద్దు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. -శ్రీనివాసరెడ్డి, ఐజేయూ నేత ప్రకటనల్లోనూ రాజకీయమే పత్రికలకు కేటాయించే ప్రకటనల్లో కూడా ప్రభుత్వం రాజకీయాలకు పాల్పడుతోంది. ప్రభుత్వానికి వత్తాసు పలికే పత్రికలకు లబ్ధి చేకూర్చేందుకు, వారి అన్యాయాన్ని వ్యతిరేకించే వారి ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రకటనలను అడ్డంపెట్టుకుంటోంది. ప్రభుత్వం ప్రకటనలను ఛారిటీగా ఇవ్వడంలేదు. ఈ పరిస్థితుల్లో స్పందించకుంటే ప్రభుత్వం భవిష్యత్తులో పత్రికలపై దమనకాండను మరింత తీవ్రతరం చేస్తుంది. -కె.అమర్‌నాథ్, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు రెండో గొంతు ఉండకూడదా? సీబీఐ దర్యాప్తు రాజకీయ శక్తుల దర్యాప్తుగా మారింది. సీబీఐ దర్యాప్తులో, చార్జిషీట్‌లలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటోంది? ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారమే సాక్షి మీడియా పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి రాష్ట్రంలో మూడో శక్తి లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మీడియాలో రెండో గొంతు, రెండో బొమ్మ ఉండకూడదనే కుట్రలో అధికార, ప్రతిపక్ష పార్టీలు భాగస్వాములయ్యాయి. ఆదాయ పన్ను అధికారులు ఆదేశించారు కాబట్టి సాక్షిని మూసేయాలని అసెంబ్లీలో ప్రకటించిన లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్‌కు.. ఐటీ ఆదేశాలను పలుమార్లు సుప్రీం కోర్టు కొట్టేసిన విషయం తెలియకపోవడం దురదృష్టకరం. -జీవీడీ కృష్ణమోహన్, సీనియర్ జర్నలిస్టు ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ రాష్ట్రంలో మీడియా మనుగడకే ప్రమాదం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ సమాచారం ప్రజల్లోకి వస్తే వారి ఉనికికి, రాజకీయ మనుగడకు భంగకరమని భావిస్తున్న శక్తులు ఆ సమాచారాన్ని పాఠకులకు అందిస్తున్న మీడియాను అసలు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా జరుగుతున్న చర్యలను మనం పరిమిత దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. విస్తృత దృష్టితో చూడాలని చెబుతున్నవారు కూడా సంకుచితంగా, పరిమితంగా ఉందాం అని మాట్లాడుతున్నారు. కానీ నీ నెత్తిన రాయి పడ్డప్పుడు నువ్వు ఏడువు. నా నెత్తిన రాయిపడ్డప్పుడు నేను ఏడుస్తా. అవకాశం దొరికితే నేనూ రెండు రాళ్లేస్తా.. అనే ప్రయత్నాలను అడ్డుకునేందుకు పౌరసమాజం ముందుకు రాకపోతే ఇది పెడధోరణులకు దారి తీస్తుంది. మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో పడుతుంది. -ఆర్.దిలీప్‌రెడ్డి, సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ ఇది ఉద్యోగులను చంపడమే సాక్షి మీడియా అకౌంట్లను స్తంభింపజేయడం, ప్రభుత్వ ప్రకటనలను నిలిపివేయడమంటే ఆ సంస్థలోని ఉద్యోగులను చంపడమే. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ కోసం సాక్షికి ప్రజాసేవా సంఘాలన్నీ అండగా నిలుస్తాయి. -ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి గొంతునొక్కే ప్రయత్నం రాష్ట్రంలో ప్రత్యామ్నాయ అభిప్రాయాలు వ్యక్తీకరించే మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. -శివప్రసాద్, సీనియర్ జర్నలిస్టు మీడియాపై దాడికి పరాకాష్ట ఇది మీడియాపై దాడికి పరాకాష్ట. ప్రభుత్వం టార్గెట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడం వేరు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యహరించడం చాలా దురాగతం. -కె.బి.లక్ష్మి, సీనియర్ జర్నలిస్టు ఉదయం మూతపడినప్పుడు.. ఉదయం పత్రిక మూతపడినప్పుడు ఉద్యోగాలు కోల్పోయినవారిలో కొందరు నేటికీ హోటళ్లు, కిళ్లీ కొట్లు నడుపుకుంటూ ఇబ్బందుల్లో ఉన్నారు. పార్లమెంటులో 45% మంది డెకాయిట్లు ఉన్నారు. వారిపై చర్యలు తీసుకోవడంలేదు. సాక్షిలో ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా సహించేది లేదు. -ఎన్.సీతారాములు, సీనియర్ జర్నలిస్టు అందరి మాటా మీడియా పరిరక్షణే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు మీడియాను పరిరక్షించుకోవాలనే అందరూ చెప్పారు. స్వేచ్ఛకు జరుగుతున్న అవరోధాలను వివరించడమే కాకుండా, మీడియాను పరిరక్షించేందుకు పౌరసేవా సంఘాలుగా మేం కంకణబద్ధులై కృషిచేస్తాం. -టీవీ రావు, సమన్వయకర్త |
5/12/2012
‘సాక్షి’ని సాక్ష్యం చెప్పనీయండి!
|
5/12/2012
వైఎస్ చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాం ఆయన ఈనాడుకు ప్రకటనలు ఆపివేయలేదు
అసెంబ్లీ రికార్డులను కూడా తారుమారు చేస్తున్నారు
ఆనాడు వైఎస్ చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాం
ఆయన ఈనాడుకు ప్రకటనలు ఆపివేయలేదు
ఆంధ్రజ్యోతిపై మందకృష్ణ మనుషుల దాడులను ఖండించారు
రామోజీరావు సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టించారు
జగన్‌ను వేధిస్తున్నా మీడియాపై దాడిగా సాక్షి చెప్పలేదు
ఖాతాలను ఫ్రీజ్ చేసి, నల్లజీవోలు జారీ చేశాకే జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు
ఈనాడుకు ప్రకటనలు నిలిపేసే దమ్ము, ధైర్యం ఈ సీఎంకు ఉందా?
హైదరాబాద్, న్యూస్‌లైన్:
రిజర్వు బ్యాంకు చట్టాలకు విరుద్ధంగా రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ ద్వారా రూ.2,600 కోట్లు సేకరించిన అంశంపై అసెంబ్లీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాట్లాడిన అంశాలను తెలుగుదేశం పార్టీ నేతలు వక్రీకరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... అసెంబ్లీ రికార్డులను కూడా తారుమారు చేసి ప్రెస్‌మీట్‌లతో స్లైడ్స్ వేసి దుష్ర్పచారం చేస్తున్న తీరుపట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. రామోజీ విషయంలో మార్గదర్శి మీద రాష్ట్ర ప్రభుత్వమే సాక్ష్యాధారాలతో సహా క్రిమినల్ కేసును నడిపించినా... ఆ రూ.2,600 కోట్లు ఉషోదయా ద్వారా అచీవర్ కంపెనీలోకి వెళ్లి అక్కడి నుంచి మీడియాలోకి ప్రవహించాయని తెలిసినా... ఈనాడుకు ప్రకటనలు నిలిపివేయలేదని గుర్తుచేశారు.
మార్గదర్శి కేసునకు సంబంధించి వైఎస్ అసెంబ్లీలో చెప్పిన మాటలకు ఆయన వారసులుగా ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై విచారణకు ఆదేశిస్తే పత్రికా స్వేచ్ఛపై దాడి అని గొంతు చించుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు సాక్షి పత్రిక గొంతు నొక్కాలని ప్రభుత్వం దొంగదారుల్లో జీవోలు జారీ చేస్తుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు. రామోజీరావు కేసు విషయంలో అప్పట్లో సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టించారని చెప్పారు. అందువల్లే సుప్రీంకోర్టు ఈ కేసు వ్యాపారానికి సంబంధించినది కాబట్టి పత్రికాస్వేచ్ఛకు భంగం వాటిల్లినట్లు ఎందుకు చూడాలని ప్రశ్నించిందని గుర్తుచేశారు. ఆంధ్రజ్యోతిపై మందకృష్ణ మనుషులు దాడిచేస్తే దాన్ని ఖండించిన వ్యక్తుల్లో నాటి సీఎం వైఎస్ కూడా ఉన్నారని తెలిపారు. ఈ రోజు కిరణ్ ప్రభుత్వం అర్ధరాత్రి విడుదల చేసిన నల్ల జీవోపై చంద్రబాబు కానీ రాజ్యాంగం గురించి మాట్లాడే పెద్ద మనుషులు ఏమయ్యారని జూపూడి నిలదీశారు.
బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసి, నల్లజీవో జారీ తర్వాతే...
‘‘కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు కలిసి సీబీఐ చేత ఎనిమిది నెలలుగా జగన్‌ను వేధింపులకు గురిచేస్తూ, సాక్షి సంస్థలపై దాడులు చేసినప్పటికీ రామోజీరావు చెప్పినట్టుగా ఏనాడు సాక్షి యాజమాన్యంగానీ, జర్నలిస్టులుగానీ దాన్ని మీడియాపై దాడిగా చెప్పలేదు. కుట్ర రాజకీయాలకు జగన్ ధైర్యంగా ఎదురొడ్డి నిలబడ్డారు. కానీ మీరు చేస్తున్న వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయి. సాక్షిపై ఆరోపణలు రుజువు కాకముందే దాని పీకనొక్కే దుశ్చర్యలకు సిద్ధపడ్డారు. సాక్షి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం, నల్లజీవోలు విడుదల చేసిన తర్వాతే జగన్‌కానీ ఆ సంస్థ సిబ్బంది మీడియా స్వేచ్ఛపై ప్రశ్నించారు’’ అని జూపూడి వివరించారు. చంద్రబాబు చెంచాలు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులను దావూద్ గ్యాంగ్‌తో పోలుస్తూ మదమెక్కి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు అధికార, ప్రతిపక్షం కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని మండిపడ్డారు. సాక్షిపై కేసులున్నాయని, సీబీఐ అకౌంట్లు ఫ్రీజ్ చేసినందుకే ప్రకటనలు నిలిపివేస్తున్నామని చెబుతున్న కిరణ్ ప్రభుత్వం... మార్గదర్శిపై ఇప్పటికీ కేసు పెండింగ్‌లోనే ఉంది కనుక ఈనాడుకు ప్రకటనలు నిలిపేసే దమ్ము, ధైర్యం ఈ సీఎంకు ఉందా? అని జూపూడి నిలదీశారు.
ఆనాడు వైఎస్ చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాం
ఆయన ఈనాడుకు ప్రకటనలు ఆపివేయలేదు
ఆంధ్రజ్యోతిపై మందకృష్ణ మనుషుల దాడులను ఖండించారు
రామోజీరావు సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టించారు
జగన్‌ను వేధిస్తున్నా మీడియాపై దాడిగా సాక్షి చెప్పలేదు
ఖాతాలను ఫ్రీజ్ చేసి, నల్లజీవోలు జారీ చేశాకే జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు
ఈనాడుకు ప్రకటనలు నిలిపేసే దమ్ము, ధైర్యం ఈ సీఎంకు ఉందా?
హైదరాబాద్, న్యూస్‌లైన్:
12-5-12-41319.jpg)
మార్గదర్శి కేసునకు సంబంధించి వైఎస్ అసెంబ్లీలో చెప్పిన మాటలకు ఆయన వారసులుగా ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై విచారణకు ఆదేశిస్తే పత్రికా స్వేచ్ఛపై దాడి అని గొంతు చించుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు సాక్షి పత్రిక గొంతు నొక్కాలని ప్రభుత్వం దొంగదారుల్లో జీవోలు జారీ చేస్తుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు. రామోజీరావు కేసు విషయంలో అప్పట్లో సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టించారని చెప్పారు. అందువల్లే సుప్రీంకోర్టు ఈ కేసు వ్యాపారానికి సంబంధించినది కాబట్టి పత్రికాస్వేచ్ఛకు భంగం వాటిల్లినట్లు ఎందుకు చూడాలని ప్రశ్నించిందని గుర్తుచేశారు. ఆంధ్రజ్యోతిపై మందకృష్ణ మనుషులు దాడిచేస్తే దాన్ని ఖండించిన వ్యక్తుల్లో నాటి సీఎం వైఎస్ కూడా ఉన్నారని తెలిపారు. ఈ రోజు కిరణ్ ప్రభుత్వం అర్ధరాత్రి విడుదల చేసిన నల్ల జీవోపై చంద్రబాబు కానీ రాజ్యాంగం గురించి మాట్లాడే పెద్ద మనుషులు ఏమయ్యారని జూపూడి నిలదీశారు.
బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసి, నల్లజీవో జారీ తర్వాతే...
‘‘కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు కలిసి సీబీఐ చేత ఎనిమిది నెలలుగా జగన్‌ను వేధింపులకు గురిచేస్తూ, సాక్షి సంస్థలపై దాడులు చేసినప్పటికీ రామోజీరావు చెప్పినట్టుగా ఏనాడు సాక్షి యాజమాన్యంగానీ, జర్నలిస్టులుగానీ దాన్ని మీడియాపై దాడిగా చెప్పలేదు. కుట్ర రాజకీయాలకు జగన్ ధైర్యంగా ఎదురొడ్డి నిలబడ్డారు. కానీ మీరు చేస్తున్న వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయి. సాక్షిపై ఆరోపణలు రుజువు కాకముందే దాని పీకనొక్కే దుశ్చర్యలకు సిద్ధపడ్డారు. సాక్షి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం, నల్లజీవోలు విడుదల చేసిన తర్వాతే జగన్‌కానీ ఆ సంస్థ సిబ్బంది మీడియా స్వేచ్ఛపై ప్రశ్నించారు’’ అని జూపూడి వివరించారు. చంద్రబాబు చెంచాలు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులను దావూద్ గ్యాంగ్‌తో పోలుస్తూ మదమెక్కి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు అధికార, ప్రతిపక్షం కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని మండిపడ్డారు. సాక్షిపై కేసులున్నాయని, సీబీఐ అకౌంట్లు ఫ్రీజ్ చేసినందుకే ప్రకటనలు నిలిపివేస్తున్నామని చెబుతున్న కిరణ్ ప్రభుత్వం... మార్గదర్శిపై ఇప్పటికీ కేసు పెండింగ్‌లోనే ఉంది కనుక ఈనాడుకు ప్రకటనలు నిలిపేసే దమ్ము, ధైర్యం ఈ సీఎంకు ఉందా? అని జూపూడి నిలదీశారు.
5/12/2012
కర్ణాటకలో నమోదైన ఏఎంసీ కేసులోనూ బెయిల్ వస్తేనే బయటికి...
బళ్లారి వదిలి వెళ్లరాదు.. పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలి రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించాలి ఏ రకంగానూ దర్యాప్తును అడ్డుకోరాదు... సాక్షులను బెదిరించరాదు న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు బెయిల్‌కు షరతులు విధించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రెండు రోజులపాటు ఆపాలన్న సీబీఐ విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు కర్ణాటకలో నమోదైన ఏఎంసీ కేసులోనూ బెయిల్ వస్తేనే బయటికి... హైదరాబాద్, న్యూస్‌లైన్: ![]() ఇప్పటికి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసుకున్న ఐదు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేయగా... ఆరోసారి బెయిల్ లభించింది. బెయిల్ ఉత్తర్వుల సమయంలో గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు, బళ్లారి ఎమ్మెల్యే, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ గాలి సోమశేఖర్‌రెడ్డి కోర్టుకు వచ్చారు. కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుసుకున్న ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న ఆయన ఆనందంతో కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. తొమ్మిది నెలల తర్వాత తమ్మునికి బెయిల్ రావడం ఆనందంగా ఉందని సోమశేఖర్‌రెడ్డి మీడియాతో చెప్పారు. కర్ణాటకలో నమోదైన ఏఎంసీ కేసులోనూ బెయిల్ కోసం ప్రయత్నిస్తామన్నారు. ‘‘దేశంలోనే ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థగా చెప్పుకునే సీబీఐ... ఓఎంసీపై 2009 డిసెంబర్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు గత ఏడాది డిసెంబర్‌లో కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌కు పొంతన లేకుండా దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించింది. ఎఫ్‌ఐఆర్‌లో ఓఎంసీ, బళ్లారి ఐరన్ ఓర్ కంపెనీ (బీఐఓసీ)లను నిందితులుగా పేర్కొన్నా... బీఐఓసీని విస్మరించి సీబీఐ దర్యాప్తు చేసింది. ఎగుమతులతోపాటు ఇనుమ ఖనిజం పరిశ్రమ కోసం (క్యాప్టివ్) లీజులు కేటాయించాలని ఓఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తులో స్పష్టంగా పేర్కొన్నా సీబీఐ వాటిని పట్టించుకోలేదు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న దొంగతనం, దురాక్రమణ, ఫోర్జరీ తదితర అభియోగాలతోపాటు ఎంఎండీఆర్ యాక్టు, ఫారెస్ట్ యాక్టు కింద మోపిన అభియోగాలను కూడా చార్జిషీట్ నుంచి తొలగించారు. జనార్దన్‌రెడ్డి మంత్రిగా పనిచేశారని, ప్రస్తుతం శాసనమండలి సభ్యునిగా ఉన్నారని, ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉందంటూ సీబీఐ చేస్తున్న వాదనలో వాస్తవం లేదు. ఓఎంసీ కేసులో నిందితునిగానే లేని అలీఖాన్‌ను విచారించాల్సి ఉందని, అందుకే జనార్దన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వరాదని సీబీఐ వాదనలు వినిపించడం హాస్యాస్పదం. మొదటి, రెండవ చార్జిషీట్‌లలో అలీఖాన్‌ను కనీసం నిందితునిగా కూడా పేర్కొనలేదు, అలాంటి వ్యక్తిని విచారించాలనే సాకుతో జనార్దన్‌రెడ్డి బెయిల్‌ను అడ్డుకోవాలని సీబీఐ చూస్తోంది. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మి విచారణకు కేంద్రం ఇంకా అనుమతి మంజూరు చేయలేదు. ఇప్పట్లో తుది విచారణ ప్రారంభం అయ్యే అవకాశం లేదు. అవసరం లేకపోయినా సాక్షులకు రక్షణ కల్పించిన సీబీఐ... వారి భద్రతకు ప్రమాదముందనే సాకుతో బెయిల్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. దాదాపు తొమ్మిది నెలలుగా జనార్దన్‌రెడ్డి జైలులో ఉన్నారు...షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయండి’’ అని గాలి న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి జనార్దన్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కర్ణాటకలో నమోదు చేసిన ఏఎంసీ కేసులో నిందితునిగా ఉన్న జనార్దన్‌రెడ్డికి అక్కడి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తే తప్ప విడుదలయ్యే అవకాశం లేదు. |
5/12/2012
ఈ చేష్టలన్నిటికీ తెరవెనక సూత్రధారి సోనియాగాంధీ దీన్ని గుర్తుంచుకోవాలి. ఇది ఒక సంస్థపై దాడి మాత్రమే కాదు, రాజ్యాంగంపైనే దాడి. దీన్ని ఎవరూ చూస్తూ ఊరుకోలేరు.
వివేక భ్రష్టులైనవారి వరసెలా ఉంటుందో నీతి శతకంలో భర్తృహరి చక్కగా చెప్పాడు. ఆకాశంనుంచి బయల్దేరిన గంగ... శివుడి శిరస్సును చేరి అక్కడినుంచి క్రమేపీ కిందకు దిగుతూ చివరాఖరికి సముద్రం అట్టడుగునున్న పాతాళానికి చేరడాన్ని ఉదహరిస్తూ ‘... పెక్కుభంగుల్ వివేకభ్రష్టసంపాతముల్’ అని ఆయన అంటాడు. వివేకాన్ని కోల్పోయినవారు ఎంతకి దిగజారుతారో సవివరంగా ఆయన తెలిపాడు. ‘సాక్షి’పై ప్రారంభించిన ముప్పేట దాడి వెనక తమ పాత్ర లేదని, కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ వ్యవహరిస్తున్నదని ఇన్నాళ్లూ పాలకులు చెప్పుకున్నారు. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్‌ల ఖాతాలను స్తంభింపజేయడంపై కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ తరహాలోనే మాట్లాడారు. సీబీఐ చట్టపరిధిలో తన బాధ్యతను తాను నిర్వర్తిస్తోందని ప్రవచించారు.
24 గంటలు తిరగకుండానే ‘సాక్షి’ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు నిలిపేస్తూ జీవో జారీచేసి తన అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారు. ఇప్పుడిక ముసుగులు తొలగిపోయాయి. అటు పాలక పక్షం, ఇటు ప్రధాన ప్రతిపక్షం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ‘సాక్షి’కి వ్యతిరేకంగా యుగళగీతం పాడుతున్నారు. ఇద్దరూ ఏకమై నిప్పులు చెరుగుతున్నారు. తమ నిజరూపాల్ని బహిర్గతం చేస్తున్న... తమ అక్రమాలను, చీకటి బంధాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ మీడియా కనబడకూడదన్నదే వీరి ఉమ్మడి లక్ష్యం. అది సాధించుకోవడానికి వీరు ఎంతకైనా తెగించడానికి, దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు. వివేకభ్రష్టత్వం స్వభావమే అంత. చీకటి పనులు చేసేవారు ఎల్లకాలమూ అలా మర్యాదస్తుల్లా బతకడం సాధ్యం కాదు.
అందుకే ఉప ఎన్నికల నగారా మోగి, కోడ్ అమలవుతున్న వేళ వెనకా ముందూ ఆలోచించకుండా, కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడతాయన్న ఇంగితం కూడా లేకుండా ‘సాక్షి’ గొంతు నులమడానికి వీరు చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్రవ్యాప్తంగానే కాదు... దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకు తున్నాయి. అయినప్పటికీ సాక్షి మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఆపేయాలన్న జీవోను తీసుకురావడం వారి తెంపరితనానికి నిదర్శనం. ఒక టైం టేబిల్ వేసుకుని, పద్ధతి ప్రకారం ఈ చర్యలన్నిటికీ పాల్పడుతున్నట్టు తెలుస్తూనే ఉంది. ‘సాక్షి’కి ప్రకటనలు ఆపేస్తూ జీవో తీసుకురాబోతున్నారని వారంరోజుల నాడే మీడియాలో కథనం వచ్చింది. సీబీఐ ఆ తర్వాత బ్యాంకు ఖాతాలను స్తంభింప జేసింది. వాస్తవాలు ఇలావుండగా, నల్ల జీవో సీబీఐ చర్య పర్యవసానమన్నట్టు చెప్పడమంటే నయవంచన తప్ప మరేం కాదు. ఇంతకూ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలివ్వడం పాలకుల ఔదార్యం కాదు. స్వీయ విచక్షణతో ఇచ్చేది అంతకన్నా కాదు. వారి చిత్తభ్రమల ఆధారంగా ఇవ్వడం, ఇవ్వకపోవడం లాంటి నిర్ణయాలు తీసుకుంటామంటే ప్రజాస్వామ్యంలో చెల్లదు. అక్కడ సోనియా అయినా, ఇక్కడ కిరణ్‌కుమార్ రెడ్డి అయినా ఈ సంగతిని గుర్తుంచుకోవాలి. ‘సాక్షి’ ఏదో సాధారణ పత్రిక కాదు. 14.5 లక్షల సర్క్యులేషన్‌తో, 1.46 కోట్ల మంది పాఠకులతో దేశంలోనే 8వ స్థానాన్ని కైవసం చేసుకున్న తెలుగువారి మనస్సాక్షి అది.
‘సాక్షి టీవీ’ చానెల్‌కు రోజూ నాలుగు కోట్లమంది వీక్షకులున్నారు. ఈ రెండు మాధ్యమాలూ ప్రజాబాహుళ్యంలో ఆదరాభిమానాలను అంతకంతకూ పెంచుకుంటున్నాయి. ఈ రెండింటికీ ప్రభుత్వ ప్రకటనలు ఆపేయడమంటే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని కోట్లాది మందికి నిరాకరించడమే. ఈ ప్రకటనల ద్వారా మీడియాకు ఆదాయం వస్తుందన్నది వాస్తవమే గానీ, అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వానికి ప్రజల్లో ప్రచారం కూడా లభిస్తుంది. అంటే... ఇందులో పరస్పర ప్రయోజనం మాత్రమే కాదు... విశాల ప్రజానీకం ప్రయోజనం కూడా ఇమిడి ఉంది. అందువల్లే మీడియాకు ప్రకటనలు ఆపేయడమంటే సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రజలకున్న ప్రాథమిక హక్కును కాలరాయడమేనని, మీడియాకు ఉండే భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకపక్క దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదంటూ చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేస్తూనే, ఆరోపణల నిరూపణ పూర్తికాకుండానే ‘సాక్షి’ గొంతు నొక్కడానికి సీబీఐ ప్రయత్నించింది.
అసలు ఈ కేసులన్నింటికీ మూలం వైఎస్ ప్రభుత్వం జారీచేసిన 26 జీవోల్లో ఉందని ఒకపక్క చెబుతూ... అవి అక్రమమో, సక్రమమో తేల్చడానికి... మంత్రులు, ఐఏఎస్ అధికారులను విచారించడానికి అవసరమైన ప్రాథమిక చర్యలు కూడా తీసుకోకుండా సంస్థ రోజువారీ నిర్వహణకు వినియోగించే కరెంట్ అకౌంట్లపై పడిందంటే సీబీఐ దురుద్దేశం సుస్పష్టమే. ఆ సంస్థకు నిజంగా దురుద్దేశం లేకపోతే కనీసం ఖాతాల స్తంభనకు ముందస్తు నోటీసులు జారీచేసేది. లేదా దర్యాప్తు క్రమంలోనే ఈ చర్య అత్యవసరమంటూ కోర్టును ఒప్పించడానికి ప్రయత్నించేది. సీబీఐ ఈ రెండు మార్గాలనూ వదిలిపెట్టి ఖాతాల స్తంభన చర్యకు పాల్పడిందంటే ప్రాథమిక హక్కులను మాత్రమే కాదు, సహజ న్యాయసూత్రాలను సైతం అది విస్మరించిందన్నది స్పష్టంగానే తెలుస్తోంది.
మూడున్నర దశాబ్దాలక్రితం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన ఇందిరాగాంధీ సైతం తనకు నచ్చని మీడియాపై ఇంతస్థాయిలో తెగబడలేదు. ఈ చేష్టలన్నిటికీ తెరవెనక సూత్రధారి సోనియాగాంధీ దీన్ని గుర్తుంచుకోవాలి. ఇది ఒక సంస్థపై దాడి మాత్రమే కాదు, రాజ్యాంగంపైనే దాడి. దీన్ని ఎవరూ చూస్తూ ఊరుకోలేరు. అందుకే రాష్ట్రంలోనే కాదు... దేశవ్యాప్తంగానే దీనిపై నిరసన వ్యక్తమవుతున్నది. భిన్నాభిప్రాయాలను గౌరవించలేని ప్రభుత్వాలు బతికిబట్ట కట్టిన దాఖలాలు లేవని, మళ్లీ అధికారం వెలగబెట్టిన జాడలు లేవని మన పాలకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇందుకు సజీవ ఉదాహరణ చంద్రబాబే!

జగన్‌ను చూసేందుకు వెళ్లారని కూలి కట్
బ్రహ్మసముద్రం (అనంతపురం), న్యూస్‌లైన్: అటుగా వచ్చిన వైఎస్ జగన్‌ను చూడటానికి వెళ్లొచ్చారనే కారణంతో 130 మంది ఉపాధి కూలీలకు ఆబ్సెంట్ వేసిన వైనమిది. అనంతపురం జిల్లా మామిడూరు గ్రామంలో శుక్రవారం డ్రైలాండ్ హార్టికల్చర్ కింద 130 మంది కూలీలు ట్రెంచ్ పనులు చేస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం అటువైపుగా జగన్‌మోహన్‌రెడ్డి వచ్చారని తెలుసుకున్న కూలీలు పనులు ఆపి పరుగు పరుగున వెళ్లారు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చారు. తీరా ఇంటికి వెళ్లేటప్పుడు చూస్తే మస్టర్‌లో ఆ 130 మంది పేర్లు నమోదు కాలేదు. అంటే వారు పనికి రాలేదని నమోదు చేశారు. కూలీలు గోవిందు, రాజన్న, నాగరాజు, మంజునాథ, హనుమంతు, గంగాధర్ తదితరులు నిలదీయగా.. అధికారులు ఇక్కడకు వచ్చినపుడు మీరు కనిపించలేదని ఏపీఓ వెంకటేశ్ నాయక్ పేర్కొన్నారు. కొలత ప్రకారం కూలి ఇవ్వడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. కాగా రిజిస్టర్‌లో పేర్లు నమోదు కానందున తమకు ఒక రోజు కూలి రానట్లేనని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.
5/12/2012
నేటి నుంచి కర్నూలు జిల్లాలో జగన్ ప్రచారం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం నుంచి కర్నూలు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జిల్లాలోని ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి, ఎమ్మిగనూరులో ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి పోటీ చేస్తున్నారు. శనివారం ఎమ్మిగనూరు మండలం ఎర్రకోటలో జగన్ ప్రచారాన్ని ప్రారంభిస్తారని, 16న ఆళ్లగడ్డలో ప్రచారాన్ని ముగిస్తారని పర్యటన సమన్వయకర్త, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకట రెడ్డి వెల్లడించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 12, 13, 14 తేదీల్లో ప్రచారం నిర్వహించాక ఆళ్లగడ్డ నియోజకవర్గం చేరుకుంటారు. అక్కడ 14, 15తేదీల్లో ప్రచారాన్ని నిర్వహిస్తారు.
5/12/2012
ప్రభుత్వ చీకటి జీవోకు నిరసనగా సమాచార కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన పాత్రికేయులు
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పాత్రికేయులపై పోలీసుల దౌర్జన్యం
మెట్లపైనుంచి లాగేసి.. వ్యాన్లలోకి తోసివేత
పలువురికి గాయాలు.. అనేక మంది అరెస్టు
సాక్షికి మద్దతుగా మూడోరోజూ నిరసనలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సాక్షి మీడియాపై అణచివేత ధోరణులను నిరసిస్తున్న జర్నలిస్టులపై రాష్ట్రంలోని కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు శుక్రవారం దౌర్జన్యానికి దిగింది. హైదరాబాద్‌లోని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పాత్రికేయులపై ఖాకీలను ప్రయోగించింది. ప్రదర్శన జరుపుతున్న పాత్రికేయులను పోలీసులు మెట్లపైనుంచి అత్యంత దారుణంగా ఈడ్చుకెళ్లారు. పోలీసు వాహనాల్లోకి విసిరేశారు. పదిమందికి పైగా జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో ఓ మహిళా జర్నలిస్టు కూడా ఉన్నారు. సాక్షి మీడియాపై ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా మూడో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల నిరసనల హోరు మిన్నంటింది. ‘‘కలం.. గళం.. చూపిస్తాం జర్నలిస్టుల బలం’’ అంటూ జర్నలిస్టులంతా ఐక్యంగా ఉద్యమ బాటపట్టారు. జిల్లా కేంద్రాల్లో పౌర సంబంధాల అధికారుల కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. పాత్రికేయుల ఉద్యమానికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతోపాటు సామాన్య పౌరుల నుంచి కూడా మద్దతు వస్తోంది. వారంతా కూడా నిరసన ప్రదర్శనలు, ధర్నాలలో పాల్గొంటున్నారు.
హైదరాబాద్‌లో ఐ అండ్ పీఆర్ కార్యాలయం ముట్టడి
సాక్షి దినపత్రిక, టీవీ చానల్‌కు ప్రకటనలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన 2097 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయాన్ని జర్నలిస్టులు ముట్టడించారు. మహిళా జర్నలిస్టులతోసహా వందలాది మంది విలేకరులు, పత్రికా సిబ్బంది ఉదయం 9 గంటల నుంచే కమిషనర్ కార్యాలయం ద్వారాల వద్ద బైఠాయించారు. ప్రభుత్వం అర్ధరాత్రి ఇచ్చిన నల్ల జీవోను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. డప్పు వాద్యాలతో ధూంధాం నిర్వహించారు. ప్రభుత్వ కుట్రపూరిత వైఖరిని ఎండగడుతూ పాటలు పాడి, నృత్యాలు చేశారు. పోలీసులు ఒక్కసారిగా పాత్రికేయులపై విరుచుకుపడి బయటకు తోసివేసేందుకు ప్రయత్నించారు. మెట్లపై నుంచి కిందికి ఈడ్చుకుపోయి, వ్యాన్లలోకి విసిరేశారు.

పలువురు జర్నలిస్టులను అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పోలీసుల దాడిలో పాత్రికేయులకు గాయాలయ్యాయి. వీరిలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సమాచార, పౌర సంబంధాల కమిషనర్ కార్యాలయం ముందు పాత్రికేయులు ర్యాలీ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఆకుల అమరయ్య నేతృత్వంలో ప్రతినిధి బృందం సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌కు వినతిపత్రాన్ని సమర్పించేందుకు లోపలికి వెళ్లారు. అయితే, కమిషనర్ లేకపోవడంతో వెనుదిరిగారు.
సాక్షి మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల ఎదుట శుక్రవారంనాడు పాత్రికేయులు నిరసనలు చేపట్టారు. మండల కేంద్రాలు, నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. సాక్షి మీడియా ఖాతాలను స్తంభింపజేయడం, ప్రకటనలను నిలిపివేయడాన్ని ఖండించారు. జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలోని మంత్రి డీకే అరుణ ఇంటిని పాత్రికేయులు ముట్టడించారు. శ్రీకాకుళంలో డీపీఆర్వో కార్యాలయం సిబ్బందిని బయటకు పంపి, కార్యాలయానికి తాళం వేశారు. విజయనగరంలో కలెక్టరేట్ ప్రాంగణంలో మోకాళ్లపై బైఠాయించారు. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో డీపీఆర్వో కార్యాలయాలను ముట్టడించారు.
-న్యూస్‌లైన్ నెట్‌వర్క్

అనంతపురం, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘రాష్ట్రంలో కుళ్లు, కుతంత్రాలతో చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయతీకే మీ ఓటు.. పేదవాడికే మీ ఓటు.. రైతన్నకే మీ ఓటు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా నిజాయతీతో కూడిన రాజకీయాలు చేసి రైతులకు, పేదలకు అండగా నిలబడి పదవులను త్యాగం చేసిన వారికే ఓటేసి గెలిపించాలని కోరారు. ఉప ఎన్నికల్లో మీరు వేసే ఓటు ద్వారా రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు నాంది పలకాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి తరఫున వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా నాలుగో రోజు శుక్రవారం ప్రచారం చేశారు. గుమ్మఘట్ట, రాయదుర్గం మండలాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించి ప్రసంగించారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
ప్రజా సంక్షేమం పట్టదా?: రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. గిట్టుబాటు ధర దక్కక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులే కష్టాల్లో ఉండటంతో అక్కాచెల్లెమ్మలకు తగిన కూలీ కూడా ఇవ్వలేకపోతున్నారు. కనీస వేతనంగా రూ.137 ప్రకటించిన ప్రభుత్వమే.. ఉపాధి హామీ పనులను మాత్రం కాంట్రాక్టు తరహాలో క్యూబిక్ మీటర్ చొప్పున లెక్కించి రూ.60 నుంచి రూ.70 ఇస్తోంది. పేదవాడు అనారోగ్యం పాలై అప్పులపాలు కాకూడదని దివంగత నేత వైఎస్ ఓ స్వప్నం చూశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందించాలని భావించారు.

కానీ.. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఓ పథకం ప్రకారం కుదిస్తోంది. వైఎస్ మరణించాక ఈ మూడేళ్లలో ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటైనా కొత్త ఇల్లు నిర్మించిన పాపాన పోలేదు. యాక్సిడెంట్ అయ్యో.. గుండెపోటు వచ్చో 108కు ఫోన్ చేస్తే.. 20 నిమిషాల్లోపు రావాల్సిన అంబులెన్స్ ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు.. తమ తరఫున పోరాడుతుందేమోనని ఆశగా ప్రతిపక్షంవైపు చూస్తే.. అదేమో అధికారపక్షంతో కుమ్మక్కైంది. అధికార, విపక్షాలు రెండూ ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి.
త్యాగధనులకు పట్టం కట్టండి: రాజకీయాల్లో రెండు రకాల మనుషులు ఉంటారు. రైతన్నకు.. పేదవాడికి ఏమైనా కష్టమొస్తే.. తమకు కాదు కదా ఆ కష్టమొచ్చింది.. పోయేది రైతన్న.. పేదవాడే కదా అని చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఆ రైతన్న, పేదవాడితో ఐదేళ్లకు ఒకసారే కదా పని పడేది అనుకుంటున్నారు. కానీ.. రాజకీయాల్లో ఇంకో రకం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలా ఉంటారంటే.. రైతన్న కోసం.. పేదవాడి కోసం తమ పదవులను కూడా త్యాగం చేస్తారు. అవిశ్వాస తీర్మానంలో పేదవాడికి.. రైతన్నకు అండగా నిలబడేందుకు 17 మంది ఎమ్మెల్యేలు పదవులను త్యాగం చేశారు. ఉప ఎన్నికలకు సిద్ధమయ్యారు.
అవిశ్వాస తీర్మానానికి ముందు ఆ 17 మంది ఎమ్మెల్యేలతో నేను చెప్పిన మాటలు నా జీవితంలో మరచిపోలేను. ‘రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవాళ పదవులు ఉంటాయి.. రేపు పోతాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యం. ప్రతి కార్యకర్త, ఫలానా వ్యక్తి మా నాయకుడు అని సగర్వంగా చెప్పుకునే స్థాయిలో నాయకులుండాలి’ అని చెప్పా. పేదవాడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోవాలని, తాను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లోనూ తన ఫొటో ఉండేలా వారికి మేలు చేయాలని తపించే నాయకుడు ఏ ఒక్కడూ రాష్ట్రంలో కన్పించడం లేదు. రాష్ట్రంలో త్వరలో 18 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో మీరు వేసే ఓటు పేదవాడికి.. మీరు వేసే ఓటు రైతన్నకు అండగా నిలవాలి. ఉప ఎన్నికల్లో మీరు వేసే ఓటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి.. ఆ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా నడిపిస్తోన్న కాంగ్రెస్ పెద్దలకు కనువిప్పు కలిగించేలా ఉండాలి.
అడుగడుగునా నీరాజనం..
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయదుర్గంలో నాలుగు రోజులు పర్యటించిన జగన్‌మోహన్‌రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డంలో మంగళవారం రాయదుర్గం ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించిన జగన్.. శుక్రవారం రాయదుర్గం మండలం గుండ్లపల్లి క్రాస్ వద్ద ముగించారు. శుక్రవారం ఉదయం గుమ్మఘట్ట మండలం తాళ్లకెరలో సుబ్రమణ్యస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జననేత..ఆ తర్వాత రోడ్‌షో నిర్వహించారు. తాళ్లకెర ప్రజలు జగన్‌కు నీరాజనం పలికారు. ఆ తర్వాత రంగసముద్రం, కేపీ దొడ్డిల్లో రోడ్‌షోలు నిర్వహించారు. కేపీదొడ్డి నుంచి బీటీపీకి వచ్చే క్రమంలో కోనాపురం ప్రజలు తమ ఊరికి రావాల్సిందేనని జగన్‌ను పట్టుబట్టితీసుకెళ్లారు. ఆ తర్వాత బీటీపీ, గుమ్మఘట్ట, గోనబావి, పూలకుంట క్రాస్, వెంకటాపురం క్రాస్, కలుగోడు, రంగచేడు, బేలోడు, కొత్తపల్లి, నేత్రపల్లి, భూపసముద్రం, జుంజురాంపల్లి, కెంచానపల్లి, ఆవులదట్ల, గుండ్లపల్లి క్రాస్‌లలో పర్యటించారు. సమయాభావం వల్ల నేత్రపల్లి అనంతరం భూపసముద్రంలో జగన్ రోడ్‌షో ముగించి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రచారం నిర్వహించేందుకు అక్కడికి బయలుదేరి వెళ్లారు. శనివారం తెల్లవారుజామున ఎమ్మిగనూరు చేరుకోనున్న జగన్ అక్కడ పార్టీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి ఇంట్లో బసచేస్తారు.
ఉప ఎన్నికల తీర్పుతో రాజకీయ ప్రక్షాళనకు నాంది పలకండి

మరో బండ వేయబోతున్న రాష్ట్ర సర్కారు
వచ్చే ఏడాది ఫీజుల పథకానికి దరఖాస్తు చేయాలంటే ఆధార్ తప్పనిసరి
ఇప్పటిదాకా ఏడు జిల్లాల్లోనే ఆధార్ అదీ ఇంకా పూర్తి కాలేదు
మిగిలిన జిల్లాల్లో అసలే మొదలు పెట్టలేదు
పథకానికి, ఆధార్‌కు లింకు పెడితే
లక్షల మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం
హైదరాబాద్, న్యూస్‌లైన్: కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై మరో పిడుగు పడబోతోంది. వచ్చే ఏడాది నుంచి ఫీజుల పథకం కింద లబ్ధి పొందాలంటే విద్యార్థులు తప్పకుండా ఆధార్ (విశిష్ట గుర్తింపు సంఖ్య) ఉండాల్సిందేనని నిబంధనను విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో చర్చించి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతోంది. ఆధార్ నిబంధనను గతంలోనే విధిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పినా... అందుకు ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఈలోపు విద్యార్థులంతా ఆధార్ నంబరు పొందాలని మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ గతంలో వెల్లడించారు. విద్యార్థులకు ఇచ్చిన గడువు పూర్తయినందున వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆధార్ నిబంధనను తప్పనిసరి చేస్తామని, ఆధార్ నంబరు లేకుంటే.. వివరాలను నమోదు చేసుకున్నప్పుడు ఇచ్చే నమోదు సంఖ్య అయినా చెప్పాల్సిందేనని సాంఘిక సంక్షేమ శాఖ స్పష్టం చేస్తోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆధార్ నిబంధన విధించడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు పథకానికి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మన రాష్ట్రంలో ఆధార్ ప్రాజెక్టు కార్యకలాపాలు చురుగ్గా సాగడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో దాదాపు ఏడాది క్రితం ఆధార్ నమోదు ప్రక్రియ మొదలైంది. ఈ జిల్లాల్లో 80 శాతం పూర్తయినట్లు ఆధార్ నమోదును పర్యవేక్షిస్తున్న పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన 16 జిల్లాల్లో ఈ ఏడాది జనవరి నుంచి మొదలైనా... కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆధార్‌ను తాత్కాలికంగా నిలిపేయడంతో అన్ని జిల్లాల్లో నమోదు ప్రక్రియ ఆగిపోయింది. ఏప్రిల్‌లోనే మళ్లీ నమోదు మొదలుపెట్టాల్సి ఉన్నా సాంకేతిక సమస్యలు, కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో ఇంకా మొదలుకాలేదు.
త్వరలోనే మళ్లీ ప్రారంభించి వచ్చే ఏప్రిల్‌కల్లా దేశవ్యాప్తంగా ఆధార్ నమోదును పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ లెక్కన మన రాష్ట్రంలోనూ వచ్చే ఏప్రిల్ వరకు ఆధార్ వివరాల సేకరిస్తారు. ఈ నేపథ్యంలో ఫీజుల పథకానికి, ఆధార్‌కు లింకు పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ‘‘వివరాలు నమోదు చేసుకున్న వారికి కూడా ఇప్పటికీ ఆధార్ నంబరు రాలేదు. ఫీజుల పథకానికి ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తే ఆలోపు ఆధార్ నమోదు చేసుకోవడం విద్యార్థులందరికీ సాధ్యం కాదు. ఈ కారణంతో వారిని అనర్హులను చేయాలని నిర్ణయం తీసుకోవడం అన్యాయం’’ అని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫీజుల పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ ఆధార్ నంబరు ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆధార్ ప్రాజెక్టు మన రాష్ట్రంలో పూర్తయ్యేంతవరకు ఫీజుల పథకానికి, ఆధార్ కార్డుకు ముడిపెట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు.

ప్రకటనల నిలిపివేత కక్షసాధింపే: రాఘవులు
‘సాక్షి’ దినపత్రికకు ప్రకటనలు నిలిపివేస్తూ జీవో జారీచేయడం కక్షసాధింపేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విచారణ పేరిట సంస్థలను మూసివేసేందుకు శోధనాసంస్థలు ప్రయత్నించడం తప్పన్నారు. ఉద్యోగుల ఉపాధి పోవడానికి సీబీఐ కారణమైతే ఆ విచారణ ఆపేయడం మంచిదన్నారు. ఉద్యోగుల ఉపాధికి ప్రభుత్వం, సీబీఐ గ్యారెంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడ్వర్‌టైజ్‌మెంట్లను ఆపడం పత్రికా స్వేచ్ఛకు భంగమేనని వ్యాఖ్యానించారు.
5/12/2012
సీబీఐ చర్య అప్రజాస్వామికం: దత్తాత్రేయ
‘సాక్షి’ పై సీబీఐ తీసుకున్న చర్య పూర్తిగా అప్రజాస్వామికమని, ఇది ప్రభుత్వ కక్షసాధింపు చర్య అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ‘సాక్షి’కి ప్రకటనలు ఎందుకు నిలుపుదల చేసిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు, ఒంగోలుల్లో వేర్వేరుగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సాక్షి’కి సంబంధించి బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేయడం వెనుక రాజకీయ దృక్పథం కన్పిస్తోందన్నారు.
5/11/2012
Did Sonia propose any irrigation project like Bhakra Nangal;
Written By news on Friday, May 11, 2012 | 5/11/2012
We don't want rubbish politics; we want perfect progress of the country. Let us kick away politicians for only politics and let us elect those who WORK like GREAT YSR. The main problem is with the central leadership.
Did Sonia propose any irrigation project like Bhakra Nangal; did by the great Jawaharlal Nehru? or the Jalayagnam planned by Great YSR? Did she work for their fast implementation, by giving all necessary permissions? Now she is playing drama about Pranahita& Chevella to project that it is the achievement of simply HER. Such lies and dramas will encourage the currupt officers to go for that in a more intensive way. Thus the wrong politicians are the cause for corruption inthe bureaucracy.
So there is great task before us to send home the wrong politicians home, to develop our country fastest. Apex leaders are training the down level leaders in the filthy politics. They must be ashamed off for such meanest act. They are committing blunders one after the other like freezing SAKSHI accounts and all that. People are laughing at them.
: Laxminarayana Paladi

Support Sakshi by Signing the Petition
Support Sakshi by Signing the Petition in change.org |
Media freedom is the bedrock of India's democracy. Over the years, our free Press has braved many a grim challenge and has been a torch-bearer of values that define media standards. The freezing of the accounts of the Sakshi media Group by the CBI on Tuesday is a brazen attempt to gag the Media, It is also a clear move to muzzle and stifle the voice of of the most popular News paper and television channel in Telugu.The Sakshi newspaper published in Telugu has a Total Readership of 1.42 cores (Data as per IRS 2011 Q4 ) and the television channel has a viewership of over 2 crores.You would be shocked to know that the very next day GO RT No 2097 d 9.5.2012 was issued by General Administration Department by which it puts on hold GO MS No 226 GM (I and PR) Dt 24.4.2008. This GO withholds advertisements and notifications from being released to Sakshi Newspaper and Indira Television.The act of taking steps towards stopping the release of Government advertsements to the Sakshi Media Group were reported in Deccan Chronicle on the 30th of April and information about this GO being drafted much ahead of the CBI order freezing the accounts of Sakshi clearly indicates a conspiracy.The very magnitude of this manipulative agenda is shocking and shameful.We know that we will overcome this challenge mindful of the support of millions of people who are with the Sakshi and truth will triumph in the end. ..This assault on Press freedom must stop now. Every signature must be made to count, every voice heard, if freedom of the Press as enshrined in our Constitution has to survive. Sign now and also forward this mailer to Support Sakshi. |
5/11/2012
'ప్రకటనల నిలుపుదల సమంజసమా?'
సిన్సినాటి/ఒహియో: సాక్షి తెలుగు దినపత్రిక, సాక్షి టీవీల బ్యాంకు ఖాతాలు స్తంభించడానికి తోడు ఈ రెండు మాధ్యమాలకు ప్రకటనలు నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక ఎన్నారైలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వారు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సాక్షి దిన పత్రిక చేసిన కృషిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మర్చిపోయి స్వార్థ ప్రయోజనాలకు పాకులాడుతున్నారని వారు విమర్శించారు.
అక్రమ మార్గంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి.. ఆ పదవిని నిలుపుకొనేందుకు దొడ్డిదారిలో సాక్షిని అడ్డుకునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. కనీసం క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించకుండా.. అర్థాంతరంగా ప్రకటనల నిలిపివేత జీవో జారీ వెనుక రహస్యమేమిటో సులభంగానే అందరికీ అర్థమవుతోందన్నారు. సాక్షి పత్రిక, టీవీపై 20 వేలకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
అవసరమైతే, ఎన్నారైలంతా కలిసి ఒక నెల జీతాన్ని సాక్షి రిజర్వ్ ఫండ్ గా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులమంతా కలిసి సాక్షి పత్రికను నిలబెట్టుకుంటామని శివశంకర్ కొండా, వెంకటరమణారెడ్డి శనివారపు, శశిరెడ్డి పుల్లెలరేవు, పార్థసారథి గోర్ల, సునీల్, చిదంబర్ సిరిరాగం, వెంకట్ రెడ్డి వాక తదితరులు పేర్కొన్నారు.
అట్లాంటా: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని స్థానిక ఎన్నారైలు గురవారెడ్డి తదితరులు హెచ్చరించారు. ఇకనైనా కక్షపూరిత వైఖరి విడనాడి సాక్షి దినపత్రికకు ప్రకటనలు నిలుపుదల చేస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సాక్షిపై దాడులను అడ్డుకుంటాం: కాన్ఫెడరేషన్
న్యూఢిల్లీ: కాన్ఫెడరేషన్ ఆఫ్ ది నూస్‌పేపర్ ఎంప్లాయిస్ అండ్ ఏజేన్సీస్ అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐజేయూ, పీటీఐ, యూఎన్‌ఐ, ఐఎఫ్‌డబ్ల్యూజే ప్రతినిధులు పాల్గొన్నారు. పత్రిక, టెలివిజన్ మూసివేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని కాన్ఫెడెరేషన్ ప్రతినిధుల హెచ్చరించారు.
ఈ సమావేశంలో సాక్షిపై చేస్తున్న దాడులను ఏక్రగీవంగా ఖండించారు. ఏకపక్షంగా సాక్షిపై దాడుల చేస్తే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. సాక్షి ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బ తీయవద్దని సూచించారు.
పత్రిక అభిప్రాయాలు ఏమైనప్పటికి.. అణిచివేత చర్యలు సమర్ధనీయం కాదని కేంద్ర కార్మికశాఖ, సంబంధిత అధికారులకు లేఖలను అందిస్తామని కాన్ఫెడరేషన్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రభు అన్నారు.

Subscribe to:
Posts (Atom)