07 August 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్సార్ సీపీ పదవుల నియామకం

Written By news on Saturday, August 13, 2016 | 8/13/2016


హైదరాబాద్: తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు విభాగాల్లో నేతలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటించింది.

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా బోయినపల్లి శ్రీనివాసరావు, గుండెరెడ్డి రాంభూపాల్ రెడ్డిని నియమించింది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన పారిపెల్లి వేణుగోపాల్ రెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా అదే జిల్లాకు చెందిన నందమల్ల నరేష్ ను నియమించబడ్డారు. రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులుగా రంగారెడ్డి జిల్లాకు కె.విశ్వనాథ్ చారిని నియమించింది. కొత్తగా నియమించబడిన నేతలకు పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

21వ శతాబ్దంలో కూడా ఇలాంటి ఘోరమా?: వైఎస్ జగన్

Written By news on Friday, August 12, 2016 | 8/12/2016


21వ శతాబ్దంలో కూడా ఇలాంటి ఘోరమా?: వైఎస్ జగన్
అమలాపురం: దళితులపై దాడి అమానుషమని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో గోవధకు పాల్పడ్డారన్న అపోహతో ఇటీవల దళితులపై దుండగులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడిలో గాయపడి అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం వైఎస్ జగన్ పరామర్శించారు.
అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. 'ఆస్పత్రిలో పేషెంట్లుగా ఉన్న దళితులను ఏం జరిగింది, ఎందుకు జరిగిందని అడిగితే వీళ్ల చెప్పిన విషాయాలు వింటే గుండె బరువెక్కుతుంది. ఇది ధర్మమేనా.. వ్యవస్థలో ఇంత దారుణం జరుగుతున్నా ప్రశ్నించకపోవడం ధర్మమేనా?. ఏం జరిగిందని అడిగినప్పుడు వాళ్లు చెప్పింది వింటే బాధ అనిపిస్తుంది. అరవింద్ అనే సామిల్ ఓనర్ తన ఆవు చనిపోతే, ఆ ఆవును తీసుకెళ్లాలని ఇక్కడున్న ఎలిషా, వెంకటేశ్వరరావులను కోరారు.

వీళ్లు జంతు చర్మం మీదే ఆధారపడి బతుకుతారు. వాళ్ల వృత్తే అది. అరవింద్ ఫోన్ చేసిన తర్వాత వాళ్లు ఆ ఆవును వ్యాన్‌లో శ్మశానం దగ్గరకు తీసుకెళ్లి, చర్మాన్ని ఒలిచి ఆవును పూడ్చిపెడుతున్నారు. అది వాళ్ల వృత్తి.. అది తప్ప వేరే ఆదాయమార్గం లేదు. దశాబ్దాలుగా అదే పని చేసుకుంటున్నారు. ముందుగా అక్కడకు ఇద్దరు వ్యక్తులు వచ్చి బండి నెంబరు నోట్ చేసుకున్నారు. వెంటనే పది - పదిహేను నిమిషాల్లో దాదాపు 15 మంది పైచిలుకు అక్కడకు వచ్చారు.

వచ్చీ రాగానే వీళ్లను నిర్దాక్షిణ్యంగా శ్మశానం నుంచి లాక్కుని బయటకు వచ్చి నడిరోడ్డు మీద చెట్టుకు కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. దుర్భాషలాడుతూ, చెప్పు తీసుకుని  మొహాన కొట్టారు. దెబ్బలు తిన్నవాళ్లలో పదోతరగతి పిల్లాడు కూడా ఉన్నాడు. ఆ సంగతి కూడా పక్కన పెట్టి పసివాడిని కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు.

మనం 21వ శతాబ్దంలో ఉన్నాం.. వాళ్లు చేసింది తప్పని అనిపిస్తే పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కేసులు పెట్టాలి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఆ నలుగురినీ కట్టేసి నడిరోడ్డు మీద చెప్పులతో కొట్టడం సభ్య సమాజం ఆమోదించాల్సిన విషయమేనా. పోలీసుల సమక్షంలోనే ఇంకా ఎక్కువ కొట్టారు. వీళ్లను కాపాడేందుకు పిల్లలు వస్తే వాళ్లను నడిరోడ్డు మీద మోకాళ్లపై కూర్చోబెట్టారు. వాళ్ల ముందు మళ్లీ కొట్టారు.అర్ధగంట తర్వాత పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. వీళ్లు చెప్పే మాటలను కూడా పోలీసులు వినే పరిస్థితి లేదు.

ఈ ఆవు యజమాని స్వయంగా చెబితేనే వెళ్లి ఆవు మృతదేహాన్ని తీసుకెళ్లినట్లు చెప్పినా, ఆ సామిల్లు ఓనర్‌తో మాట్లాడండని చెప్పినా కనీసం పోలీసులు ఆ మాటలు కూడా వినిపించుకోలేదు. పైపెచ్చు నడిరోడ్డు మీద చెప్పులతో కొట్టడం, హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే.. ఆయన సొంత ఊరు అయినా కూడా ఇక్కడే ఈ ఘటన జరగడం బాధాకరం. మర్నాడు ఆ అరవింద్ దగ్గరకు పోవాలని దళిత సంఘాలు గొడవ చేస్తే అప్పుడు వీళ్లను తీసుకెళ్లి ఏం జరిగిందో తెలుసుకున్నారు.
బాధితులకు రు.లక్ష పరిహారం ఇవ్వడం అన్యాయం. నిబంధనల ప్రకారం రూ.8 లక్షల 20వేలు చెల్లించాలి. రాజమండ్రి వరకూ వచ్చిన సీఎం చంద్రబాబు అమలాపురం వచ్చి ఉంటే బాధితుల్లో నైతిక స్థైర్యం పెరిగేది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

‘గోవధ అపోహ’ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ


‘గోవధ అపోహ’ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
అమలాపురం: ‘గోవధ అపోహ’ బాధితులను వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం మధ్యాహ్నం కలుసుకుని ఘటన పూర్వాపర్వాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు.

ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో గోవధకు పాల్పడ్డారన్న అపోహతో ఇటీవల ఇద్దరు దళితులపై దుండగులు అమానుషంగా దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో అమలాపురం పట్టణంలోని జానకిపేటకు మోకాటి ఎలీషా, అతని సోదరుడు మోకాటి వెంకటేశ్వరరావు, డ్రైవర్ లక్ష్మణకుమార్ తీవ్రంగా గాయపడ్డారు.

Sri YS Jagan Pushkara Snanam postponed

Sri YS Jagan Mohan Reddy Pushkara Snanam postponed to 18th in Vijayawada

వైఎస్ జగన్ పుష్కర స్నానం రేపు


సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలు పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13న విజయవాడలో స్నానమాచరిస్తారని పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..  వాస్తవానికి శుక్రవారం పుష్కర స్నానం చేయాలని జగన్ భావించారని, అయితే తొలిరోజు కావడంతో ప్రజలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో శనివారానికి మార్చుకున్నార ని వివరించారు. కృష్ణా పుష్కరాలు ప్రశాంతంగా జరగాలని, వీటి ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంతా శుభం జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

బిందు మౌనిక-గిరిధర్ కు వైఎస్ జగన్ ఆశీర్వాదం

Written By news on Thursday, August 11, 2016 | 8/11/2016


విశాఖ: ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు మనమరాలు బిందు మౌనిక వివాహానికి హాజరయ్యారు. నగరంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ హాల్ లో బిందు మౌనిక వివాహం జరిగింది. ఈ వేడుకకు హాజరైన వైఎస్ జగన్ నూతన వధూవరులు బిందు మౌనిక-గిరిధర్ లను ఆశీర్వదించారు. అనంతరం వైఎస్ జగన్ సర్క్యూట్ హౌస్ లో పార్టీ సమన్వయకర్తలతో సమావేశం అయ్యారు. గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంతో పాటు, పలు అంశాలపై చర్చించారు. రాత్రి 7.45 గంటలకు తిరిగి వైఎస్ జగన్ హైదరాబాద్ బయల్దేరతారు.

నయీంను పెంచి పోషించింది టీడీపీనే


'నయీంను పెంచి పోషించింది టీడీపీనే'
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీంను పెంచి పోషించింది టీడీపీనే అని అర్థమవుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నయీం లింకులన్నింటినీ ప్రజల ముందుంచాలన్నారు. నయీంను పెంచి పోషించింది చంద్రబాబు, టీడీపీ నాయకులేనన్న ఆధారాలు వెలువడడం చూస్తే...అధికారం కోసం టీడీపీ  ఎటువంటి అడ్డదారులైనా తొక్కుతుందని తెలుస్తోందని  మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఎంతమంది నయీంలను పెంచిపోషిస్తుందోనన్న భయాందోళనలు కలుగుతున్నాయని అన్నారు.

ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు తలో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై ఢిల్లీలో ఒకమాట...ఇక్కడ ఒకమాట మాట్లాడుతున్నారని పార్థసారధి వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ హోదాను సాధిస్తారన్న భయంతోనే లోకేష్ హోదాను తక్కువ చేసి చూపించేందుకు తాపత్రయపడుతున్నారని ధ్వజమెత్తారు.  హోదాపై టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన  విమర్శించారు.  బాబు ఢిల్లీకి 30సార్లు వెళ్లానని చెబుతున్నారని, ఆయన ఏపీకి ఏం సాధించి పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.

కోటీశ్వరులైన ముఖ్యమంత్రుల్లో ప్రథమ స్థానం


-నారావారి చరాస్తులు రూ. 134 కోట్లు, స్థిరాస్తులు రూ. 43 కోట్లు
- రెండో స్థానంలో అరుణాచల్ సీఎం పెమాఖండు
-ఆయన ఆస్తి రూ.129 కోట్లు
-మూడో స్థానంలో తమిళనాడు సీఎం జయలలిత
-ఆమె ఆస్తి రూ. 113 కోట్లు

సాక్షి, అమరావతి: 
దేశంలో కోటీశ్వరులైన ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. ఎన్నికల సంస్కరణలతో పాటు వివిధ అంశాలపై అధ్యయనం చేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు గత సాధారణ ఎన్నికలకు ముందు అభ్యర్థులు అందచేసిన అఫిడవిట్‌లను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాయి. ఆ నివేదిక ప్రకారం చంద్రబాబు అత్యధిక ఆస్తులు కలిగిన సీఎంల జాబితాలో తొలి స్థానంలో, దేశంలోని అన్ని రాష్ట్రాల మంత్రులతో పోల్చితే.. నాలుగో స్థానంలో నిలిచారు.

అత్యధిక ఆస్తులు కలిగిన మంత్రుల జాబితాలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పంగూరు నారాయణ తొలిస్థానంలో నిలిచారు. ఏడీఆర్ సంస్థ నివేదిక ప్రకారం చంద్రబాబుకు 134 కోట్ల 80 లక్షల 11 వేల 728 రూపాయల చరాస్థులు, 42 కోట్ల 68 లక్షల 83 వేల 883 రూపాయల స్థిరాస్తులున్నాయి. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పెమాఖండుకు రూ. 129 కోట్ల 57 లక్షల 56 వేల 014 రూపాయలు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు 113 కోట్ల 73 లక్షల 38 వేల 586 రూపాయల ఆస్తులున్నాయి. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న 20 మంత్రుల్లో 18 మంది కోటీశ్వరులే. ఏడీఆర్ సంస్థ ఈ నివేదికను ఆగస్టు తొలి వారంలో విడుదల చేసింది.

ప్రకటించేది మాత్రం రూ. లక్షల్లో
ఏటా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ నెలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. వెల్లడించే ఆస్తుల వివరాలకు.. అఫడవిట్ కు పొంతన లేదని ఈ రిపోర్టుతో తేలి పోయింది. గత కొద్ది ఏళ్లుగా ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ ఒక్కసారి కూడా అరకోటి దాటలేదు. కాగా.. 2014లో ఆయన ప్రకటించిన ఆస్తులు అంతకు ముందు ఏడాది కంటే.. తగ్గాయి కూడా.

చంద్రబాబు 1995 సెప్టెంబర్ నుంచి 2004 మే వరకూ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకు ముందు 1978లోనే ఆయన ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత తన ఎన్‌టీ రామారావు సీఎంగా ఉన్నపుడు కర్షక పరిషత్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అపుడే ఆయన పదవులు ఇప్పిస్తానని, పనులు చేసి పెడతానని పలువురి నుంచి లక్షల్లో వసూలు చేశారని తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయంగా తన పుస్తకంలో రాశారు.
చంద్రబాబు రెండెకరాల ఆసామి నుంచి రూ. రెండు వేల కోట్లు సంపాదించేంత స్థాయికి ఎదిగారని ఆయన తొలిసారి సీఎం అయిన తొలినాళ్లలోనే పత్రికలు ఘోషించాయి. ఐతే ఆయన మాత్రం అదంతా తూచ్ నా ఆస్తి లక్షల్లోనే, నా అంత నిజాయితీపరుడు ఈ దేశంలో లేరు అని ఏటా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్తుంటారు. ఈయన చెప్పే మాటల్లో నిజం లేదని తాజాగా ఏడీఆర్ సంస్థ వెల్లడించిన నివేదిక స్పష్టం చేస్తోంది.

2012లో....
చంద్రబాబు 2012 సెప్టెంబర్ రెండో వారంలో తన ఆస్తులను ప్రకటించారు. కుటుంబానికి ఉన్న అప్పులు పోగా ఆస్తులు రూ. 52.35 కోట్లు.
-చంద్రబాబు తన పేరిట ఆ ఏడాది ఆస్తులు రూ. 31.97 లక్షలుగా చూపారు. అప్పులు ఏమీ లేవని ప్రకటించారు. అదే సమయంలో అంతకు ముందు ఏడాది రూ. 39.88 లక్షలుగా ఉన్న ఆస్థి రూ. 31.97 లక్షలకు తగ్గిందని చెప్పారు.

-2012 సెప్టెంబర్‌లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆస్తి రూ. 41.74 కోట్లు, అప్పులు రూ. 17.21 కోట్లని చెప్పారు. ఆమె నికర ఆస్తి రూ. 24.52 కోట్లని వివరించారు. తన కుమారుడు లోకేష్ ఆస్తి రూ. 8.82 కోట్లు, ఆప్పులు రూ. 2.20 కోట్లు, నికర ఆస్తి రూ. 6.62 కోట్లుగా పేర్కొన్నారు. కోడ లు బ్రహ్మణి ఆస్తి రూ. 20. 9 కోట్లుగా, అప్పులు లేవని తెలిపారు.

-చంద్రబాబు కుటుంబం ఆస్తులు 2012 కంటే 2013కు రూ. 10 కోట్ల మేర పెరిగాయి. 2013 సెప్టెంబర్‌లో వెల్లడించే నాటికి చంద్రబాబు ఆస్తులు రూ. 42.06 లక్షలు, నారా భువనేశ్వరి రూ. 48.85 కోట్లు, లోకేష్ 9.73 కోట్లు, బ్రహ్మణి రూ. 3.3 కోట్లు.

-2014లో చంద్రబాబు ఆస్తి రూ. 70.69 లక్షలుగా ప్రకటించారు. భార్య భువనేశ్వరి పేరున రూ. 30 కోట్లు, లోకేష్ ఆస్తి రూ. 3.5 కోట్లు, బ్రహ్మణి ఆస్తి రూ. 90.71 లక్షలుగా పేర్కొన్నారు. ఇవన్నీ నికర ఆస్తులని వెల్లడించారు.

-2014లో ప్రకటించిన ఆస్తుల కంటే చంద్రబాబు ఆస్తులు 2015లో 40 శాతం తగ్గాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన తండ్రి ఆస్తులు తగ్గాయని లోకేష్ వెల్లడించారు. చంద్రబాబు ఆస్తి రూ 42.40 లక్షలు, తల్లి భువనేశ్వరి ఆస్తి రూ. 33.07 కోట్లు, తన ఆస్తి రూ. 7.67 కోట్లు, బ్రహ్మణి ఆస్తి రూ. 4.77 కోట్లని లోకేష్ వివరివచారు. 2014లో చంద్రబాబు ఆస్తి రూ. 70.69 లక్షలుగా ఉంది.

రిషికేశ్‌లో వైఎస్‌ జగన్‌ ఫొటోలు

Written By news on Wednesday, August 10, 2016 | 8/10/2016

దీక్షలో వైఎస్‌ జగన్‌ పాల్గొనడం సంతోషకరం

న్యూఢిల్లీ: రిషికేశ్‌లో నిర్వహించిన చాతుర్మాస్య దీక్షలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనడం చాలా సంతోషకరమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. బుధవారం స్వరూపానందేంద్ర స్వామి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలని వైఎస్‌ జగన్‌ దీక్షలో పాల్గొన్నారని ఆయన చెప్పారు.(రిషికేశ్‌లో వైఎస్‌ జగన్‌)

ఏపీకి ప్రత్యేక హోదా ఆకాంక్ష నెరవేరాలని వైఎస్‌ జగన్‌ యజ్ఞం కూడా చేసినట్టు తెలిపారు. కాగా, వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం డెహ్రాడూన్ వెళ్లి అక్కడనుంచి రిషికేశ్ కు చేరుకున్నారు. అనంతరం వైఎస్‌ జగన్‌ స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను తీసుకున్న విషయం తెలిసిందే.

రేపు రిషికేష్‌ వెళ్లనున్న వైఎస్ జగన్

Written By news on Tuesday, August 9, 2016 | 8/09/2016


ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం రిషికేష్ వెళ్లనున్నారు. అక్కడ స్వరూపానందేంద్రస్వామి వారి ఆశీస్సులను జగన్ తీసుకుంటారు.

ఏపీకి మంచి జరగాలని, ప్రత్యేక హోదా ఆకాంక్షిస్తూ స్వరూపానందేంద్ర స్వామి నిర్వహిస్తున్న పూజల్లో జగన్ పాల్గొంటారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం రెండో రోజుల పాటు ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలను జగన్ కలిసి చర్చించిన విషయం తెలిసిందే.

హోదా వచ్చే వరకు వదిలిపెట్టం: వైఎస్ జగన్


హోదా వచ్చే వరకు వదిలిపెట్టం: వైఎస్ జగన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకు కలిసికట్టుగా పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక  హోదా సాధించే వరకు పోరాటం వదిలి పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని వైఎస్ జగన్, వైఎస్సార్ సీపీ ఎంపీలు కలిశారు.

ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..  ప్రత్యేక హోదాపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా హామీ అమలు చేయకుంటే పార్లమెంట్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు పోరాటం చేస్తూనే, మరోవైపు ఇతర పార్టీలను కలుపుకుని పార్లమెంట్ లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం వదిలిపెట్టబోమని ఘంటాపదంగా చెప్పారు.

వైఎస్ జగన్ తో పాటు సీతారాం ఏచూరిని కలిసిన వారిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక, వైఎస్ అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులున్నారు.

జీఎస్టీ వల్ల ఏపీకి హోదా తప్పనిసరైంది: వైఎస్ జగన్


జీఎస్టీ వల్ల ఏపీకి హోదా తప్పనిసరైంది: వైఎస్ జగన్
న్యూఢిల్లీ: కీలకమైన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం అత్యావశ్యకంగా మారిందని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. త్వరలో చట్టంగా మారబోయే జీఎస్టీ వల్ల.. అమ్మకం పన్ను ప్రోత్సాహకాలు(సేల్స్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్) కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతాయని, తద్వారా మౌలిక వసతులు లేని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు క్షీణిస్తాయని చెప్పారు. అందుకే రాష్ట్రాన్ని బతికించాలంటే ప్రత్యేక హోదా ఇవ్వక తప్పదని, ఆమేరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి హోదా అంశంపై రాజ్యాంగ పెద్దలతోపాటు పలు పార్టీల ముఖ్యనేతల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సీపీఐ జాతీయ నేత డి. రాజాను కలుసుకున్నారు. వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ సీపీ ఎంపీలు కూడా ఉన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీ ప్రతిపక్షనేత పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

'థ్యాంక్స్ టు జీఎస్టీ. ఎందుకంటే ఆ బిల్లుతో ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అనివార్యమైంది. ఇన్నాళ్లూ పెడ్డుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు.. సేల్స్ ట్యాక్స్ మినహాయింపు తదితర ప్రోత్సాహకాలు ప్రకటించేవి. జీఎస్టీ బిల్లుతో ఇప్పుడా(ఇన్సెంటివ్స్) వ్యవహారం కేంద్రం చేతుల్లోకి పోయింది. అసలే మౌలిక వసుతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి ఇక పెట్టుబడులు మృగ్యం అవుతాయి. ఇప్పుడున్న నిరుద్యోగ సమస్య ఇంకా పెరిగిపోతుంది. ఈ విపత్కర సమస్యలన్నింటికి ఒక్కటే పరిష్కారం.. అదే ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా లభిస్తే పన్ను రాయితీ ప్రోత్సాహకాల్లో మనకు వెసులుబాటు దొరుకుతుంది. అప్పుడు ఏపీకి పెట్టుబడులు ధారాళంగా వస్తాయి. పరిశ్రమలు పుట్టుకొస్తాయి. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి' అని వైఎస్ జగన్ అన్నారు.

స్వాతంత్ర్య సాధనకే వందేళ్లు పట్టింది!
స్వాతంత్ర్యం కోసం దేశం యావత్తూ దశాబ్దాలపాటు పోరాడింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ కూడా ఎంతకాలమైనా పోరాడుతుంది. హోదా సాధించేదాకా వెనక్కి తగ్గేదేలేదు' అని వైఎస్ జగన్ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు.

హోదా సంజీవిని కాదనడం సరికాదు : అంబటి

Written By news on Monday, August 8, 2016 | 8/08/2016

హోదా సంజీవిని కాదనడం సరికాదు : అంబటి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సంజీవిని కాదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అనడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ....ఏపీకి ప్రత్యేక హోదా ముమ్మాటికీ సంజీవనేనని చెప్పారు.

రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నది వెంకయ్యనని అంబటి గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు పాడిన పాటను...ఇప్పుడు వెంకయ్య అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల ఆగ్రహంతో బాబు నోటికి ప్లాస్టర్ వేసుకున్నారని...వెంకయ్య కూడా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. ఏపీకి ప్యాకేజీ పేరుతో కేంద్రప్రభుత్వం మోసం చేస్తామంటే ప్రజలు సహించరని అన్నారు. చంద్రబాబుకు పోగాలం దాపురించిందని...శిషుపాలుడికి పట్టిన గతే బాబుకు పడుతుందని అంబటి అన్నారు.

Popular Posts

Topics :