08 February 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

నీరుండీ వాడుకోలేని దుస్థితి!

Written By news on Saturday, February 14, 2015 | 2/14/2015


  • ప్రభుత్వం చొరవ చూపితే మెట్ట ప్రాంతానికి కరువు నుంచి విముక్తి
  • ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష
  • వైఎస్ హయాంలోనే గాలేరు-నగరి సుజల స్రవంతికి రూ.4,200 కోట్లు,హంద్రీ-నీవా సుజల స్రవంతికి రూ.6,700 కోట్ల వ్యయం
  • రూ.1,900 కోట్లు, రూ.1,700 కోట్లు వెచ్చిస్తే ఈ రెండూ పూర్తి.. ఆరు జిల్లాలకు మేలని వెల్లడి
సాక్షి ప్రతినిధి, కడప: ‘కృష్ణా, గోదావరి నదులు మూడు నెలలు ఉప్పొంగి ప్రవహిస్తాయి.. ఆ వరద నీటిని సద్వినియోగం చేసుకుంటే మెట్ట ప్రాంతంలో తిష్టవేసే కరువుకు విముక్తి కల్గించవచ్చు.. జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పూర్తిచేస్తే ఆరు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి.. నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా సకాలంలో స్పందించలేకపోతున్నాం.. సగానికి సగం నీటిలాస్ ఉంటున్నా అరికట్టలేకున్నాం.. తక్షణమే స్పందించండి.. ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితులు వివరించండి.. ప్రజాపక్షంగా అందరం ప్రాజెక్టుల సాధనకు కృషి చేద్దాం..’ అని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప స్టేట్ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఆయన జిల్లా ప్రాజెక్టులపై ఇరిగేషన్,ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రాజెక్టుల వారీగా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడితే మనుగడలోకి రాగలవనే వివరాలు తెలుసుకున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోట ప్రాజెక్టు వరకు నీరు వచ్చేందుకు ఉన్న అడ్డంకుల గురించి అధికారులు వివరించారు. వరదలను దృష్టిలో ఉంచుకుని మూడు నెలల్లో లభించనున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు సత్వర చర్యలపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచాలని వైఎస్ జగన్ సూచించారు. అధికారులుగా మీ స్థాయిలో మీరు కృషిచేయండి, ప్రభుత్వంపై మా పోరాటం ద్వారా ఒత్తిడి తెస్తాం.. అని ఆయన చెప్పారు.

ఆ ప్రాజెక్టులు వరప్రసాదం


మెట్టప్రాంతాలకు గాలేరి-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్), హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) పథకాలు వరప్రసాదమని, వాటిని సత్వరమే పూర్తిచేస్తే ఆరు జిల్లాల్లో మెట్టభూములు సస్యశ్యామలం అవుతాయని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పరిధిలో రూ.6,700 కోట్లు, జీఎన్‌ఎస్‌ఎస్ పరిధిలో రూ.4200 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఇంకా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పరిధిలో రూ.1,700 కోట్లు, జీఎన్‌ఎస్‌ఎస్ పరిధిలో రూ.1,900 కోట్లు వెచ్చించాల్సి ఉందన్నారు.

ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో రూ.3,600 కోట్లు ఖర్చు చేయగలిగితే ఆరు జిల్లాల్లో సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది ఉండదని వివరించారు. ఆ ప్రాజెక్టుల ద్వారా 3.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. పోతిరెడ్డిపాడు-బనకచర్ల, బనకచర్ల- గోరుకల్లు, గోరుకల్లు-అవుకు, అవుకు-గండికోట రిజర్వాయర్ల వరకు మధ్యలో అసంపూర్తి పనులు పూర్తి చేయగలిగితే సునాయాసంగా 1.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు లభిస్తుందని చెప్పారు. రూ.185 కోట్లు వెచ్చిస్తే ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు మనుగడలోకి వస్తాయని అధికారులు తెలిపారు.
 
రూ.150 కోట్లు వెచ్చిస్తే 26 టీఎంసీల నీరు నిల్వ

గండికోట ప్రాజెక్టు పూర్తయింది.. పునరావా సం, అభివృద్ధి (ఆర్‌అండ్‌ఆర్) ప్యాకేజీ పెం డింగ్‌లో ఉంది. కేవలం రూ.150 కోట్లు కేటాయిస్తే ఏకకాలంలో 26 టీఎంసీలు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆమాత్రం చొరవ కూడా చూపకపోవడం విచారకరం.. అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ సెటిల్ కాకపోవడం వల్ల ముంపు గ్రామాల ప్రజలు ఖాళీ చేయలేదన్నారు. వెంటనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. బ్రహ్మంసాగర్ పరిధిలో మరో రూ.54 కోట్లు కేటాయిస్తే లైనింగ్ పనులు కూడా పూర్తవుతాయని అధికారులు వివరించారు.

నీరున్నా తెచ్చుకోవడంలో విఫలం


సకాలంలో స్పందించి వృథాగా పోయే కృష్ణా, గోదావరి జలాలను తెచ్చుకోగలిగితే జిల్లాలో బ్రహ్మంసాగర్, గండికోట రిజర్వాయర్లలో నీరు నిల్వ చేసుకోవచ్చు.. తద్వారా భూగర్భజలాలు పెరిగి తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుంది.. అని జగన్ చెప్పారు. పెపైచ్చు డ్రా చేసిన నీటిలో 50 శాతం లాస్ అవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. చిత్రావతి 10 టీఎంసీల నీటికిగాను 4 టీఎంసీల నీరు డ్రా చేస్తే కేవలం 2 టీఎంసీలే ప్రాజెక్టుకు చేరిందని చెప్పారు. ఆ నీటి నుంచే కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పులివెందుల మున్సిపాలిటీలకు తాగునీరు ఇవ్వాల్సి ఉందన్నారు. వేసవి ప్రారంభమైనా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు నీరందలేదని తెలిపారు. బ్రహ్మం సాగర్‌కు 6.7 టీఎంసీల నీరు డ్రా చేస్తే కేవలం 4 టీఎంసీలే రిజర్వాయర్‌కు చేరిందన్నారు. మెయిన్ కెనాల్స్ ఇంతటి అధ్వానంగా ఉంటే పూర్తిస్థాయి నీరు ఎలా డ్రా చేయగలరని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజాపోరాటం నిర్వహిస్తామన్నారు. జిల్లాలో మైనర్, మీడియం ఇరిగేషన్ పరిధిలో 1.71 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఒక్క ఎకరాకు నీరు ఇచ్చిన పాపాన పోలేద ని విమర్శించారు.
 
మున్సిపాలిటీల ఆదాయం విద్యుత్ బిల్లులకే..

మున్సిపాలిటీల ఆదాయం విద్యుత్ బిల్లులకే సరిపోతోందని, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని జగన్ ప్రశ్నించారు. పులివెందుల మున్సిపాలిటీలో రూ.5 కోట్ల ఆదాయం ఉంటే రూ.2.5 కోట్లు విద్యుత్ బిల్లులకు చెల్లిస్తున్నారన్నారు. కడప కార్పొరేషన్‌లో ప్రతినెలా రూ.32 కోట్ల ఆదాయం ఉంటే దాదాపు రూ.20 కోట్లు విద్యుత్ బిల్లులకే పోతోందన్నారు. పంచాయతీల్లో తాగునీటి పథకాలదీ అదే పరిస్థితన్నారు. వైఎస్ హయాంలో తాగునీటి పథకాలకు ప్రభుత్వమే బకాయిలు చెల్లించేదని, స్థానిక సంస్థలకు భారం ఉండేదికాదన్నారు. జెడ్పీ తాగునీటి పథకాలకు రూ.10 కోట్ల బకాయిలు చెల్లించాల్సి వస్తోందని, అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

ఎంపీ ఫండ్స్ రూ.5 కోట్లు తాగునీటికే ఖర్చు చేస్తున్నా సమస్య తీరలేదని, ప్రభుత్వం నుంచీ తగిన నిధులు రావడం లేదన్నారు. నీటి ట్రాన్స్‌పోర్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడమే నిదర్శనమన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులతోపాటు జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే లు రవీంద్రనాథరెడ్డి, ఎస్‌బి అంజాద్‌బాషా, శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు తిరుపాల్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, కడప డిప్యూటీ మేయర్ అరీఫుల్లా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుష్కరాలకూ కన్సల్టెన్సీ కావాలా?


పుష్కరాలకూ కన్సల్టెన్సీ కావాలా?
  • చంద్రబాబు ప్రభుత్వ తీరుపై
  • కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: మన రాష్ట్రంలో పుష్కరాలను మనం నిర్వహించుకోవడానికి కూడా కన్సల్టెన్సీల అవసరం కావాల్సి వచ్చిందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు సర్కారుపై ధ్వజమెత్తింది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు, అధికారుల ప్రభుత్వం నడుస్తోందా? లేదంటే విదేశీ కన్సల్టెన్సీల ప్రభుత్వం నడుస్తోందా? అన్న అనుమానం కలుగుతోందన్నారు.

ప్రభుత్వంలోగానీ, రాష్ట్రంలోగానీ ఏదైనా రంగానికి సంబంధించి నిపుణులు లేకుంటేనే.. ఆయా రంగానికి విదేశీ కన్సల్టెన్సీల అవసరం ఏర్పడుతుందని, కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అన్నింటికీ విదేశీ కన్సల్టెన్సీలను నియమించుకునే తీరు కనబడుతోందని విమర్శించారు. ‘‘గోదావరి పుష్కరాల బాధ్యతలను కన్సల్టెన్సీకే ఇచ్చారు.. తాత్కాలిక రాజధాని నిర్మాణం ప్లాన్ రూపకల్పన బాధ్యతలు విదేశీ కన్సల్టెన్సీకి ఇచ్చారు.

ఇక రెవెన్యూ చట్టంలో మార్పులు తేవడానికి కన్సల్టెన్సీ.. సీఎం విదేశీ పర్యటన ప్రణాళిక రూపకల్పనకు కన్సల్టెన్సీ.. నీటి పారుదలశాఖలో అంశాలకు కన్సల్టెన్సీ..  ప్రభుత్వ ప్రచార బాధ్యతల నిర్వహణకు కన్సల్టెన్సీ.. చివరకు రోడ్ల పనుల నాణ్యతా తనిఖీలనూ కన్సల్టెన్సీకి ఇస్తున్నారు’’ అని ఆయన దుయ్యబట్టారు. సీఎంకు తన ప్రభుత్వంలోని మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌లపై నమ్మకం లేక కన్సల్టెన్సీల నియామకానికి వెళుతున్నారా? అని ప్రశ్నించారు.

ఒకవైపు రాష్ట్రంలో లోటు బడ్జెట్ అంటూ కన్సల్టెన్సీల పేరుతో రూ.వందల కోట్లను విదేశీ సంస్థలకు చెల్లించడమేమిటని తప్పుపట్టారు.చంద్రబాబు కుటుంబానికి సింగపూర్‌లో హోటళ్లు, కంపెనీలున్నాయన్న ప్రచారం ఉందని, ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలకు విదేశీ కన్సల్టెన్సీలను నియమించుకుని.. వాటిద్వారా అక్కడ తన సంస్థలకు క్విడ్ ప్రో కో జరుగుతోందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయని ఆయన చెప్పారు.
 
లోటు బడ్జెట్ అంటూనే..: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూనే చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్లా ప్రజాధనాన్ని వృథా చేస్తోందని మోహన్‌రెడ్డి విమర్శించారు. కన్సల్టెన్సీలకు రూ.వంద కోట్లు, సంక్రాంతి సంబరాలకు రూ.324 కోట్లు.. కేవలం సంచులపై చంద్రబాబు ఫొటో వేసుకోవడానికి రూ.15 కోట్లు.. ఇంకా విదేశీ పర్యటనలకు, వాస్తు పేరుతో కోట్లలో ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు.మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల నిధులను తేవడంలోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు.

అండగా ఉంటా!

Written By news on Thursday, February 12, 2015 | 2/12/2015


అండగా ఉంటా!
అంగన్‌వాడీ, డ్వాక్రా మహిళలతో ప్రతిపక్షనేత
పరామర్శలు..శుభకార్యాలలో బిజీబిజీ
శంఖవరం ఆలయ స్థలాల పరిరక్షణకు వినతి
కౌన్సిలర్ల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న జగన్
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఇతర నేతలతో చర్చ

 

సాక్షి, కడప/పులివెందుల : డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పులివెందులలో ఆయనను కలిసిన డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ వర్కర్లు తమ కష్టాలు వినిపించారు. 13నెలలుగా టీఏ బిల్లులు రాలేదని.. 8నెలలుగా అంగన్‌వాడీ భవనాలకు అద్దె బిల్లులు కూడా ఇవ్వలేదని వైఎస్ జగన్‌కు వివరించారు. మున్సిపాలిటీలో ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఒక్కొక్క అంగన్‌వాడీ కేంద్రానికి రూ.3వేలు ఇవ్వాలని.. రెండు నెలలుగా అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా సీడీపీవో వేధిస్తున్నారని వారు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే వారం రోజులుగా ఆందోళన చేస్తున్నామని.. కలెక్టర్, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోరుుందన్నారు. వారి కష్టాలన్నీ విని చలించిపోరుున జగన్‌మోహన్‌రెడ్డి తాను అండగా ఉంటానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఓదార్చారు. అప్పటికప్పుడే సంబంధిత అధికారిణితో మాట్లాడారు. పది రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లండి.. :

బుధవారం 10.15 గంటల ప్రాంతంలో పులివెందులకు చేరుకున్న ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా పలు వివాహాలకు హాజరయ్యారు. ముందుగా పార్నపల్లె రోడ్డులోని సాయిబాబా ఆలయంలో జరుగుతున్న వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తున్న గంగరాజు వివాహానికి హాజరై ఆశీర్వదించారు. అనంతరం తొండూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న కాంబల్లెకు చెందిన రామకృష్ణారెడ్డి కుమారుడు గంగాధర రెడ్డి, అనూషల వివాహ మహోత్సవానికి హాజరయ్యూరు. అనంతరం ఇటీవల వివాహం అరుున వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి బండి రమణారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, హరితలను ఆశీర్విదించేందుకు  తేలూరు తుమ్మలపల్లెలోని వరుని ఇంటికి వెళ్లి నిండు నూరేళ్లు చల్లగా వర్థిల్లాలని ఆశీర్వదించారు.

అనంతరం గ్రామంలో ఉన్న వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు బండి శ్రీనివాసులరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైఎస్ జగన్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. .అనంతరం నేరుగా పులివెందులకు చేరుకుని కడప రోడ్డులో ఉన్న విజయా హోమ్స్‌లో కాంట్రాక్టర్ వై.నారాయణరెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు రోజుల క్రితం వివాహమైన వేముల ఎంపీడీవో రాజశేఖరరెడ్డి కుమార్తె సాగర్మ్య్ర, అరుణ్‌రెడ్డి దంపతులను ఇంటికెళ్లి ఆశీర్వదించారు.

ఆ సమీపంలోనే ఉన్న డాక్టర్ రవీంద్రారెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కుశల ప్రశ్నలు అడిగారు. తర్వాత పులివెందులలోని సుజాత హాలు సమీపంలో నివసిస్తున్న మురారిచింతల మాజీ సర్పంచ్ ఓబుళరెడ్డి కుమారుడు, నూతన దంపతులైన శశిధర్‌రెడ్డి, జయలను, చెక్క డిపో హరి కుమార్తె కృష్ణవేణి, అల్లుడు అనంద్‌కుమార్‌లకు శుభాకాంక్షలు తెలియజే శారు. అలాగే సింహాద్రిపురం మండల వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు రామగిరి జనార్థన్‌రెడ్డి సోదరుడి కుమారుడు దామోదర్‌రెడ్డి, శాంతిల దంపతులను ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆశీర్వదించారు.

వైఎస్ జగన్‌పై పూలవర్షం :
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి తణుకులో దీక్షను విజయవంతమైన నేపధ్యంలో పులివెందులలో ఘన స్వాగతం లభించింది. శ్రీరామాహాలు రోడ్డులో నివసిస్తున్న కౌన్సిలర్ కోడి రమణ ప్రత్యేకంగా వైఎస్ జగన్ కాన్వాయ్ రాగానే భారీ ఎత్తున బాణా సంచా పేల్చుతూ స్వాగతం పలికారు. అంతేకాకుండా గజమాల వేసి వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడ నుంచి ఇతర వివాహ కార్యక్రమాలకు వెళుతున్న వైఎస్ జగన్‌పై పూల వర్షం కురిపిస్తూ.. భారీగా ముందుకు కదిలారు.

కౌన్సిలర్లతో కాసేపు :

పులివెందులలోని కడప రోడ్డులో ఉన్న విజయా హోమ్ వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, వైస్ చెర్మైన్ చిన్నప్పలతోపాటు కౌన్సిలర్లతో చర్చించారు. ప్రధానంగా వారికి ఎదురవుతున్న సమస్యలు, ప్రస్తుత పరిస్థితులు ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కలిసికట్టుగా పార్టీ కోసం కష్టపడాలని.. భవిష్యత్‌లో మంచి రోజులు రానున్నాయని వారికి భరోసా ఇచ్చారు.

శంఖవరం ఆలయ స్థలాలను పరిరక్షించండి :

కలసపాడు మండలం శంఖవరం గ్రామంలో ఉన్న చెన్నకేశవ, ఆంజనేయస్వామి, వీరభద్రస్వామి, శివాలయం తదితర ఆలయాలకు సంబంధించిన స్థలాలను పరిరక్షించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డికి గ్రామానికి చెందిన ఉద్దండం శివప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు ఆలయ మాన్యం భూములలో పశువులతోపాటు గడ్డి వాములు వేసి ఆక్రమించుకున్నారని.. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్‌ను కోరారు. ఆలయాలకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తెస్తామని శివప్రసాద్‌కు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు


పులివెందులలో ఉన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కలిశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు రైల్వేకోడూరు, కదిరి ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, అత్తార్ చాంద్ బాషా, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, డీసీసీబీ చెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఇ.వి.మహేశ్వరరెడ్డి, నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌పీ కన్‌స్ట్రక్షన్స్ అధినేత నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి తదితరులు వైఎస్ జగన్‌ను కలిసి  చర్చించారు.

వారికి పంట వేసుకునే అవకాశమివ్వాలి: ఆర్కే


వారికి పంట వేసుకునే అవకాశమివ్వాలి: ఆర్కే
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో భూసమీకరణకు స్వచ్ఛందంగా పొలాలను ఇచ్చిన రైతులకూ పంట వేసుకునే అవకాశమివ్వాలని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో భూములివ్వబోమని 9.2 ఫారం (అభ్యంతర పత్రం) దాఖలు చేసిన రైతులు పంటలు వేసుకోవచ్చని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. స్వచ్ఛందంగా పొలాలిచ్చిన వారికీ ఈ అవకాశం కల్పించాలని కోరారు.

బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంవద్ద ఆర్కే మీడియాతో మాట్లాడుతూ ఇకపై పంటలు వేసుకోరాదని శ్రీకాంత్ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఇప్పుడు శ్రీకాంత్‌కు, సీఎం చంద్రబాబుకు బుద్ధి వచ్చినట్లుగా ఉంది..అందుకే పంటలు వేసుకునేందుకు అనుమతించే విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా ఉంది’ అని అన్నారు.

పులివెందులలో వైఎస్ జగన్

Written By news on Wednesday, February 11, 2015 | 2/11/2015


పులివెందులలో వైఎస్ జగన్ బిజీ బిజీ
పులివెందుల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవడంతో పాటు పలు శుభకార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వైఎస్ఆర్ సీపీ నాయకుడు రామగిరి జనార్దన్ రెడ్డి అన్న కుమారుడు, ఇటీవల వివాహం చేసుకున్న దామోదర్ రెడ్డి, శాంతి దంపతులను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. పులివెందులలో నారాయణ రెడ్డి నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ ఇంటికి సమీపంలో కొత్తగా పెళ్లయిన అరుణ్ రెడ్డి, రమ్య దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. డ్వాక్రా మహిళలు, రుణమాఫీ గురించి జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించి ఆయన .. రుణమాఫీ గురించి దీక్షలు కూడా చే శామని, తనకు చేతనైనంత వరకు ప్రభుత్వంపై పోరాడతానని మహిళలకు హామీ ఇచ్చారు.

మధ్యతరగతికి విద్యుత్ షాక్

కొత్త విద్యుత్ చార్జీల ప్రతిపాదనలు బహిర్గతం
ఒక్కో యూనిట్‌పై కనిష్టంగా 10 పైసల నుంచి గరిష్టంగా 48 పైసల వరకూ వడ్డింపు
వంద యూనిట్లలోపు వినియోగిస్తే ప్రస్తుత చార్జీలే
200 యూనిట్ల వరకు 4% పెంపు.. ఆపై 5.75 శాతం వాత
26.30 లక్షల గృహాలపై చార్జీల పెంపు ప్రభావం
పరిశ్రమలపై 4.75% చార్జీల పెంపు
రూ. 1,088.68 కోట్ల వరకూ భారం
ఇంకా రూ. 6,476.23 కోట్ల లోటు చూపిన డిస్కంలు


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యతరగతికి విద్యుత్ షాక్ తగలనుంది.. తక్కువ విద్యుత్ ఉపయోగించే పేదలకు మాత్రం మినహాయింపు లభించినా... ఎక్కువ విద్యుత్ వినియోగించేవారిపై చార్జీల మోత మోగనుంది. వివిధ కేటగిరీల వారీగా నాలుగు శాతం నుంచి 5.75 శాతం వరకు పెంపును వడ్డించనున్నారు. మొత్తంగా కొత్త రాష్ట్రంలో తొలిసారిగా విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ప్రజలపై రూ. 1,089 కోట్ల భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

డిస్కంలు 2015-16 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను (ఏఆర్‌ఆర్‌లు) గత శనివారమే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి (టీఎస్‌ఈఆర్సీ) సమర్పించిన విషయం తెలిసిందే. ఈ కొత్త చార్జీల వివరాలను గోప్యంగా ఉంచిన డిస్కంలు... రెండు రోజుల పాటు హైడ్రామా నడిపించాయి. దీంతో ప్రతిపాదనల వివరాలను మంగళవారం రోజున వెబ్‌సైట్లో పెట్టాలని సోమవారం డిస్కంలకు ఈఆర్సీ మెమో జారీ చేసింది కూడా.

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ ఈఆర్సీ కార్యాలయంలో టీఎస్‌ఎస్పీపీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, డెరైక్టర్ శ్రీనివాసరావు, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ అధికారులతో సమావేశమయ్యారు. చార్జీల వివరాలు, ఏఆర్‌ఆర్‌లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని వారికి సూచించారు. భేటీ అనంతరం డిస్కంల ప్రతిపాదనల వివరాలను ఈఆర్సీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.

గరిష్టంగా 48 పైసల వరకూ..
వివిధ కేటగిరీల్లో చార్జీల పెంపు నాలుగు శాతం నుంచి 5.75 శాతం వరకు ప్రతిపాదించారు. ఒక్కో యూనిట్‌పై కనిష్టంగా 10 పైసల నుంచి గరిష్టంగా 48 పైసల వరకు పెంచుతూ రేట్ల పట్టికను తయారు చేశారు. ఈ కొత్త టారిఫ్ ప్రకారం వంద యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ప్రస్తుతమున్న చార్జీలే వర్తిస్తాయి. 101-200 యూనిట్ల మధ్య విద్యుత్ వినియోగించే గృహాలకు నాలుగు శాతం చార్జీలు పెరుగుతాయి. మిగతా అన్ని కేటగిరీలకు 5.75 శాతం చార్జీని వడ్డించారు. పరిశ్రమల కేటగిరీలో 4.75 శాతం పెంపును ప్రతిపాదించారు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం యథాతథంగా కొనసాగుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. డిస్కంలు ఏఆర్‌ఆర్‌లలో మొత్తంగా రూ. 7,564.91 కోట్ల లోటును చూపించాయి. ఇందులో రూ. 1,088.68 కోట్లను చార్జీల పెంపు ద్వారా భర్తీ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈఆర్సీని కోరాయి. ఈ పెంపు అమలైనా కూడా రూ. 6,476.23 కోట్లు నికరంగా లోటు ఉంటుంది. దీనిని పూడ్చుకునేందుకు డిస్కంలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకు రూ. 300 కోట్ల చొప్పున ఏటా రూ. 3,600 కోట్లు సబ్సిడీగా తెలంగాణ సర్కారు డిస్కంలకు చెల్లిస్తోంది. వచ్చే ఏడాది అదనంగా మరో రూ.2,876.23 కోట్లను సర్కారు నుంచి ఆశిస్తున్నట్లు డిస్కంల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక రాష్ట్రంలో సరిపడేంత విద్యుత్ అందుబాటులో లేకపోవటంతో పాటు, విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావటంతో.. గతంతో పోలిస్తే డిస్కంల ఖర్చులు పెరిగిపోయాయి. 2015-16లో మొత్తం రూ. 26,473.76 కోట్ల వ్యయం అవుతుందని.. ప్రస్తుత చార్జీల ద్వారా రూ. 18,908.85 కోట్లు ఆదాయం వస్తుందని.. పెంపుతో అదనంగా మరో రూ.1,088.68 కోట్లు ఆదా యం వస్తుందని డిస్కంలు పేర్కొన్నాయి.

పేదలకు ఊరట
చార్జీల పెంపుతో దాదాపు 70% మంది వినియోగదారులకు అదనపు భారమేమీ ఉండబోదని డిస్కంలు చెబుతున్నాయి. తెలంగాణలో వంద యూనిట్లలోపు వినియోగించే కుటుంబాలు సుమారు 62.10 లక్షలు ఉన్నాయి. వారందరికీ ప్రస్తుతం అమల్లో ఉన్న చార్జీలే వర్తించనున్నాయి. అంతకు మించి విద్యుత్ వినియోగించే 26.3 లక్షల కుటుంబాలపై చార్జీల భారం పడుతుంది. 200 యూనిట్లు దాటితే వాత: తాజా చార్జీల పెంపు ప్రతిపాదనలను పరిశీలిస్తే... వంద యూనిట్ల వరకు భారం లేకున్నా, విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే స్లాబ్ పద్ధతిలో రేట్లు వర్తిస్తాయి. దీంతో వినియోగదారులపై ఎక్కువగా భారం పడనుంది.

సాధారణంగా 200 యూనిట్లు వినియోగించే మధ్య తరగతి గృహాలకు ప్రస్తుత పెంపుతో విద్యుత్ బిల్లు రూ. 600 నుంచి రూ. 625కు పెరుగుతుంది. కానీ అంతకన్నా అదనంగా ఒక్క యూనిట్ వాడితే.. బిల్లు అమాంతం రూ. 872.75కు చేరుతుంది. 500 యూనిట్లు వాడే వినియోగదారులు ప్రస్తుతం రూ. 3,007 వరకు చెల్లిస్తుండగా.. ఈ మొత్తం రూ.3,180.50కు పెరగనుంది. అదే మరో యూనిట్ అదనంగా (501 యూనిట్లు) వాడితే.. బిల్లు మోత ఏకంగా రూ. 4,438.86కు చేరుతుంది.

హెచ్చు వినియోగానికి..
2015-2016 సంవత్సరానికి సంబంధించి డిస్కంలు ఎక్కువ విద్యుత్ వినియోగించేవారికి, పరిశ్రమలు, వ్యవసాయం వంటి పలు రంగాలకు చెందిన పెంపు ప్రతిపాదనలను సమర్పించాయి. గృహ లేదా వాణిజ్యావసరాలకు ఎల్‌టీ-2 కేటగిరీ కింద 50 యూనిట్ల వరకు రూ. 5.71 చార్జీగా నిర్ణయించారు.

ఇక ఎల్‌టీ-2 (బీ) కేటగిరీలో 0-50 యూనిట్ల వరకు రూ. 7.01, 51-100 యూనిట్ల వరకు రూ. 7.80, 101-300 యూనిట్ల వరకు రూ. 8.60, 301-500 యూనిట్ల వరకు రూ. 9.13, 500పైగా యూనిట్లకు రూ. 9.65 చొప్పున నిర్ధారించారు. ఇక ఎల్‌టీ-2(సి) కేటగిరీ కింద ప్రకటనల హోర్డింగ్‌లకు రూ.11.66 చార్జీగా నిర్ధారించారు.

ఎల్‌టీ కేటగిరి 3-కింద పరిశ్రమలకు యూనిట్‌కు రూ.6.43, సీజనల్ పరిశ్రమలకు రూ.7.14, చేప/రొయ్యల సాగుకు రూ. 4.90, చెరకు కర్మాగారానికి రూ. 4.90, కోళ్ల ఫారాలకు రూ. 5.95, పుట్టగొడుగులు/కుందేలు ఫారాలకు రూ. 5.95, గ్రీన్‌హౌస్‌లో ఫ్లోరికల్చర్‌కు రూ. 5.95కు చార్జీ పెంపును ప్రతిపాదించారు. ఎల్‌టీ కేటగిరీ 4- కుటీర పరిశ్రమలు  (10హెచ్‌పీపైగా) రూ. 3.97, ఆగ్రోబేస్డ్‌కు  (10హెచ్‌పీపైగా) రూ. 3.97; ఎల్‌టీ కేటగిరి 5 కింద వ్యవసాయానికి చార్జీలను మార్చలేదు.

ఎల్‌టీ కేటగిరి 6 కింద వీధి దీపాలు, పీడబ్ల్యుఎస్‌లకు స్వల్పంగా పెం చారు. ఎల్‌టీ కేటగిరి 7 (ఏ) కింద జనరల్ వినియోగానికి యూనిట్‌కు రూ. 6.91, ఎల్‌టీ 7(బి) కింద రిలీజియస్ ప్రాంతాల్లో రూ.4.97ను నిర్ధారించారు. ఎల్‌టీ కేటగిరి 8 కింద తాత్కాలిక సరఫరాకు రూ. 9.97, హెచ్‌టీ-1(ఎ) జనరల్‌లో 11 కెవీ, 33, 132 కేవీలకు సంబంధించి కొద్దిపాటి మార్పులు చేశారు.

వైఎస్సార్‌సీపీయే పోలీసుల టార్గెట్


వైఎస్సార్‌సీపీయే పోలీసుల టార్గెట్పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకులు
వాహనాల దహనం కేసులో 10 మంది అరెస్టు
 
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ, మండల పరిధిలో ఏం జరిగినా పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులనే అదుపులోకి తీసుకుంటూ.. విచారణ పేరుతో సంబంధం లేని ప్రశ్నలు వేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా.. వారు పార్టీలో తిరగకుండా చేసేందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని స్థానిక యువకులు అంటున్నారు.

తాడేపల్లి పట్టణ పరిధిలో సోమవారం తెల్లవారుజామున వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు చెందిన కొన్ని ద్విచక్ర వాహనాలను గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. వీరంతా రాజధానికి భూములు ఇచ్చేందుకు నిరాకరించినవారే. అరుుతే ఈ  కేసులో పోలీసులు నులకపేటకు చెందిన పదిమంది యువకులను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే కావడం గమనార్హం.

పగలంతా కష్టపడి ఇళ్ళల్లో నిద్రిస్తున్న సమయంలో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి, విచారణ పేరుతో తమ మెడలో పలకలు వేసి, ఫొటోలు తీయిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు వైఎస్సార్‌సీపీ పార్టీవారినే టార్గెట్ చేయకుండా కేసును అన్ని కోణాల్లో విచారించాలని కోరుతున్నారు.

నల్లగొండ జిల్లాలో ఐదు రోజుల యాత్ర


18 నుంచి షర్మిల రెండో దఫా పరామర్శ యాత్ర
నల్లగొండ జిల్లాలో ఐదు రోజుల యాత్ర
17 కుటుంబాలకు పరామర్శ
వైఎస్సార్‌సీపీ నేత శివకుమార్ వెల్లడి
15న పార్టీ తెలంగాణ కార్యాలయం ప్రారంభం
 

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి నల్లగొండ జిల్లాలో   రెండో విడత పరామర్శ యాత్రను చేపట్టనున్నారని పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. మంగళవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. షర్మిల రెండో విడత యాత్ర ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులు జరుగుతుందని చెప్పారు. ‘‘భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో షర్మిల 509 కిలోమీటర్లు పర్యటిస్తారు. దివంగత సీఎం, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతిని జీర్ణించుకో లేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నల్లకాల్వ సభలో ప్రజలకు మాటివ్వడం తెలిసిందే. ఆ మాట కోసమే షర్మిల పరామర్శ యాత్ర కొనసాగిస్తున్నారు.

రెండో విడత యాత్రలో 17 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు’’ అని శివకుమార్ వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా పరామర్శ యాత్ర ఉంటుందా అని ప్రశ్నించగా, నల్లగొండలో రెండో విడత యాత్ర పూర్తయ్యాక దానిపై ఆలోచిస్తామని బదులిచ్చారు. వైఎస్ మృతి పట్ల చలించి హైదరాబాద్‌లో 10 మంది, రంగారెడ్డిలో 20 మంది మరణించారని గుర్తుచేశారు. మరోవైపు, సచివాలయ మార్పును వైసీపీ వ్యతిరేకిస్తుందని శివకుమార్ చెప్పారు. దీనిపై త్వరలో తాము గవర్నర్‌ను కూడా కలుస్తామన్నారు. ఛాతీ ఆస్పత్రిని ఎర్రగడ్డ నుంచి మార్చొద్దంటూ వైఎస్సార్‌సీపీ ధర్నా నిర్వహించిందని గుర్తు చేశారు.

15న పార్టీ కార్యాలయం ప్రారంభం

బుధవారం (11వ తేదీన) జరగాల్సిన వైఎస్సార్‌సీపీ తెలంగాణ కార్యాలయ ప్రారంభోత్సవం వైఎస్ జగన్ అందుబాటులో లేని కారణంగా వాయిదా పడిందని శివకుమార్ తెలిపారు. కార్యాలయాన్ని 15వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు లోటస్ పాండ్‌లో ఆయన ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్ర పార్టీ యంత్రాంగమంతా హాజరవుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్ రెడ్డి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

18 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

Written By news on Tuesday, February 10, 2015 | 2/10/2015


హైదరాబాద్: ఈ నెల 18 నుంచి నల్లగొండ జిల్లాలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాలమరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబ సభ్యులను షర్మిల ఓదారుస్తారు.
పరామర్శ షెడ్యూల్ ను తెలంగాణ వైఎస్సార్సీపీ నేతలు శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవ రెడ్డి తెలియజేశారు. 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు ఆమె పరామర్శయాత్ర కొనసాగుతుందని తెలిపారు. భువనగిరి నియోజక వర్గం నుంచి ప్రారంభమై ఆలేరు, తుంగతుర్తి, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజక వర్గాల్లో ఆమె పరామర్శ యాత్ర కొనసాగుతుందని అన్నారు. అంతేకాకుండా బుధవారం ప్రారంభించాల్సిన తెలంగాణ వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఈ నెల 15 వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు.

రేపటి నుంచి వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటన

రేపటి నుంచి వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పదో తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరే ఆయన 11న తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు చేరుకుంటారు.

రెండు రోజులు నియోజకవర్గంలోనే ఉంటారు. 13వ తేదీన కడప జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసే పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

‘రాజధాని’ రైతులపై నిఘా!


‘రాజధాని’ రైతులపై నిఘా!
అన్నదాతల ఫోన్ల ట్యాపింగ్
స్వయంగా రంగంలోకి దిగిన జాయింట్ కలెక్టర్
కృష్ణాయపాలెంలో రైతుల నుంచి భూ సమీకరణ పత్రాల సేకరణ


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంత రైతులను నిఘా నేత్రం వెన్నాడుతోంది. వారి కదలికలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. వారిని కట్టడి చేసేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతోంది. ప్రభుత్వానికి తమ భూమిని ఇవ్వబోమని నిరాకరిస్తున్న రైతులతోపాటు వారికి నాయకత్వం వహించే వారి ఫోన్లపై నిఘా పెట్టింది. వారి ఫోన్లను ట్యాప్ చేస్తోంది. గుంటూరు జిల్లాలో రాజధానికి ఎంపిక చేసిన గ్రామాల్లో గత కొద్ది రోజులుగా రైతుల నుంచి నిరభ్యంతర పత్రాలను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.

అయితే, రాజధానికి భూ సమీకరణను పూర్తిచేసేందుకు నిర్దేశించిన గడువు పూర్తవుతున్నా ఆశించిన స్పందన రావడం లేదు. దీంతో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ రైతులతో చర్చలు జరిపారు. కొందరు అంగీకరించి తమ భూమి పత్రాలను అందచేశారు. కొందరు మాత్రం తమకు ప్రభుత్వం అందించే పరిహారం సరిపోదని.. ఆ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క దశలో ఆందోళనలకు సైతం దిగుతున్నారు.

దీంతో ఆందోళనలకు దిగిన రైతులతో పాటు వారికి నేతృత్వం వహించిన వారిపై ప్రభుత్వం నిఘా పెట్టింది. వారి కదలికలను ఎప్పటికపుడు తెలుసుకుంటోంది. వారి ఫోన్లపై నిఘా పెట్టి ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అనే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుంటోంది. వెంటనే వారికి ఫోన్ చేసి మీరు ఫలానా వారికి ఫోన్ చేసి ఇంతసేపు, ఫలానా అంశాలను మాట్లాడారని రాజధాని భూ సమీకరణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న పెద్దలు చెబుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

గ్రామాల్లో తాము ఎవరినీ ఎలాంటి ఇబ్బందీ పెట్టకుండా సాధారణ జీవితం గడుపుతుంటే ఈ బెదిరింపులు, భయాందోళనలకు గురిచేయడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన మల్లెల హరీంద్రనాథ్ చౌదరి, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన కారుమంచి అనిల్, ఇంద్రనీల్ తదితరులతో పాటు చాలా మంది రైతులు భూమిని అప్పగించేందుకు విముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిడులు వచ్చినా భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో ఇలాంటి వారిని ఎంపిక చేసుకుని ప్రభుత్వం నిత్యం వెంటపడుతోంది.

కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన బోయపాటి సుధారాణి అనే మహిళ భూ సమీకరణపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో గుంటూరు జిల్లాకు చెందిన నిఘా విభాగం పోలీసులు కృష్ణాయపాలెం గ్రామంలో ‘ఆమె ఎవరు?’ అంటూ ఆరా తీశారు. 2 రోజుల క్రితం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ స్థానిక ఎమ్మార్వోను ఆమె నివాసానికి పంపి.. గుంటూరుకు పిలిపించుకున్నారు. గుంటూరులో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్న ఆయన.. సుధారాణి కలెక్టరేట్‌కు వచ్చిన విషయం తెలుసుకుని మధ్యలో లేచి వచ్చి ఆమెతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఏం జరిగిందో కానీ సోమవారం భూ సమీకరణకు సమ్మతిస్తూ ఆమె నిరభ్యంతర పత్రం ఇచ్చినట్టు సమాచారం.

ఈ నిరభ్యంతర పత్రం స్వీకరించేందుకు సోమవారం జాయింట్ కలెక్టర్ స్వయంగా కృష్ణాయపాలెం గ్రామానికి వచ్చారు. ఇప్పటి వరకూ డిప్యూటీ కలెక్టర్లు మాత్రమే ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇదిలావుండగా, ఆయా గ్రామాల్లో భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతుల ఆందోళనలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లపైనా నిఘా అధికారులు పెట్టారు.

11న వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

Written By news on Monday, February 9, 2015 | 2/09/2015


11న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
కూకట్‌పల్లి: తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ఈనెల 11వ తేదీన ప్రారంభించనున్నట్లు రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం తెలిపారు. అదేరోజు రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని, కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, పార్టీ అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

కేంద్రంపై ఎందుకీ మౌనం?


కేంద్రంపై ఎందుకీ మౌనం?
  • రాష్ట్రాన్ని అథోగతిలోకి నెట్టడంలో తొలి ముద్దాయి కాంగ్రెసే
  • సీఎం చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టిన వైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టం ప్రకారం ఏపీ రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలను అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నప్పటికీ సీఎం చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. తాను సీఎం అయితేనే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఇంకెవరికి ఓటేసినా అభివృద్ధి సాధ్యం కాదని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కేంద్రం ఏ మాత్రమూ సాయం చేయకపోయినా మాట్లాడకపోవడానికి కారణం తెలియడం లేదని దుయ్యబట్టింది.

ఈ మేరకు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘ఇంత వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, ఇచ్చే అవకాశం లేదని స్పష్టంగా చెబుతున్నప్పటికీ మీరు(చంద్రబాబు) కిమ్మనకుండా ఎందుకు ఉంటున్నారు? మీ పార్టీ ప్రయోజనాల కోసం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కే్రందానికి తాకట్టు పెడుతున్నారు తప్ప గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. దీనిపై కనీసం ఒక్క లేఖ అయినా రాశారా? ఇస్తే ఇచ్చారు.. లేకపోతే లేదు అనే ధోరణితో మీరున్నారు. అడగలేకపోవడానికి.. మీపై ఏమైనా విచారణ చేస్తారని భయమా? లేక వారి నుంచి దూరంగా జరిగితే ప్రమాదం ఉందనుకుంటున్నారా?’ అని బాబుపై నిప్పులు చెరిగారు.

‘విభజన చట్టం ప్రకారం.. కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన మొదలు 6 మాసాల వ్యవధిలోనే వైఎస్సార్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అవకాశాలను సెయిల్ పరిశీలించాలి. ఏపీ గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై పరిశీలన చేసి కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాలి. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ అవకాశాలను పరిశీలించాలి. వంటి హామీలు స్పష్టంగా ఉన్నాయి’ అని గుర్తుచేశారు. ‘రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై మాటాడొద్దంటూ సహచర మంత్రులకు చెబుతున్న మీరు.. వారు మాట్లాడితే వచ్చే ప్రమాదమేమిటో చెప్పాలి’ అని ప్రశ్నించారు.

వెంకయ్య ఏమీ చేయలేకపోతున్నారు


విభజన హామీలు అమలు చేసే విషయంలో ఎన్నికలకు ముందుకు బ్రహ్మాండంగా మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చాక అంతే బ్రహ్మాండంగా పనులు చేయలేకపోతున్నారని అంబటి దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు తిరుపతిలో జరిగిన ప్రచార సభలో ‘స్వర్ణాంధ్ర కావాలంటే చంద్రబాబును సీఎం చేయండి. మీ కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం’ అని వేంకటేశ్వరస్వామి సాక్షిగా మోదీ చెప్పారన్నారు. ‘ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ చేసిన బాసలు, ఊసులు ఇప్పుడు మర్చిపోయారు. ఇది సరైన పద్ధతి కాదు’ అని అన్నారు.
 
సోనియా మాట్లాడరేం?

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ నేతలు కోటి సంతకాల సేకరణ మొదలు పెట్టారు కానీ, విభజన బిల్లులో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదో, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దీనిపై కేంద్రంలో ఎందుకు ఒత్తిడి తీసుకురావడంలేదో చెప్పాలని అంబటి అన్నారు. తెలుగు ప్రజలను అగాథంలోకి నెట్టడంలో ప్రథమ ముద్దాయి కాంగ్రేసేనని, దానికి బీజేపీ , టీడీపీ కూడా వంత కలిపాయని దుయ్యబట్టారు. పీఆర్సీ విషయంలో సీఎం వైఖరి సహేతుకంగా లేదన్నారు.

నారాయణ భూకబ్జాలపై విచారణ జరిపించండి

Written By news on Sunday, February 8, 2015 | 2/08/2015


'నారాయణ భూకబ్జాలపై విచారణ జరిపించండి'
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భూకబ్జాలపై విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సీపీ పార్టీ నేతలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

విద్యుత్ చార్జీల పెంపుతో పాటు చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామని మరో నేత కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ సీపీ వీడే ప్రసక్తేలేదని, కొన్ని చానల్స్ దుప్ప్రచారం చేస్తున్నాయని గూడురు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మండిపడ్డారు.

న్యూస్ రీడర్ బద్రి మృతిపట్ల వైఎస్సార్ సీపీ సంతాపం

హైదరాబాద్: ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి ఆకస్మిక మృతిపట్ల వైఎస్సార్ సీపీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పార్టీ తరుపున సానుభూతి తెలియజేశారు. బద్రి మృతి మీడియా రంగానికి లోటేనన్నఅంబటి పార్టీ తరపున సంతాపం తెలిపారు.

ద్వారకాతిరుమల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.  ఆయన వెళుతున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.  తొలుత ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పేలి పోవడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బద్రి మృతి చెందగా, ఆయన భార్య లక్ష్మీ సుజాత, ఇద్దరు పిల్లలు సాయి, సాత్విక్ లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని  ఏలూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 
ఆయన మృతిపట్ల  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఐదు అంటే... వెంకయ్య పది అన్నారు


'కాంగ్రెస్ ఐదు అంటే... వెంకయ్య  పది అన్నారు'
హైదరాబాద్: అధికారంలోకి రాకముందు పైసా విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పిన చంద్రబాబు... అధికారంలోకి రాగానే మాట మార్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. మాట తప్పడమే ఏపీ సీఎం చంద్రబాబు నైజమని ఆయన విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ లో అంబటి రాంబాబు మాట్లాడుతూ... విభజన చట్టంలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన ఆర్థిక సాయం ఏ మాత్రం సరిపోదన్నారు. 
ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తానని మోదీ, చంద్రబాబులు ఊదరగొట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఐదేళ్లు ప్రత్యేక హోదా అంటే... వెంకయ్యనాయుడు మాత్రం 10 ఏళ్ల ప్రత్యేక హోదా కావాలన్నారని... ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన హామీలపై ఎందుకు నోరుమెదపరని చంద్రబాబును ఈ సందర్బంగా అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో చేసిన స్కాంలపై బీజేపీ విచారణ చేస్తుందని భయపడుతున్నారేమోనని ఆయన సందేహాం వెలిబుచ్చారు.
ఎన్ టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నిలబెడితే... చంద్రబాబు దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఆదాయం పెంచాలని ఉద్యోగులను ఆదేశించడం తగదని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. వారే విధంగా ఆదాయం పెంచుతారని చంద్రబాబను నిలదీశారు. పీఆర్సీకి... ఆదాయ పెంపునకు సంబంధం ఏమిటి? వెంటనే పీఆర్సీని ప్రకటించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.

పెట్రోల్ ధరలు తగ్గించకుంటే పోరాటమే: మాజీ ఎమ్మెల్యే కాపు


పెట్రోల్ ధరలు తగ్గించకుంటే పోరాటమే: మాజీ ఎమ్మెల్యే కాపు
అనంతపురం: విద్యుత్, పెట్రోల్ ధరలు తగ్గించకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఎన్నికల హామీల అమలులో సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
పెట్రోల్ పై వ్యాట్ విధించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఆయన అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు సామాన్యుల పాలిట శాపమైందని కాపు ఎద్దేవా చేశారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. వైఎస్ జగన్ నేతృత్వంలో సమస్యలు పరిష్కిరంచుకుందామని కాపు రామచంద్రారెడ్డి అన్నారు.

భూ సమీకరణను విమర్శిస్తే ...పోలీసుల వేధింపులే!


వీడియోకి క్లిక్ చేయండి
  • భూ సమీకరణను విమర్శిస్తే ...పోలీసుల వేధింపులే
  • మొన్న శ్రీనాథ చౌదరి... నేడు బోయపాటి సుధారాణి
  • మూకుమ్మడి దాడికి దిగుతున్న పోలీసు యంత్రాంగం, టీడీపీ శ్రేణులు
  • భయం గుప్పిట్లో ‘రాజధాని’ గ్రామాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెండు నెలలుగా కంటి మీద కునుకు లేదు... ఎప్పుడు ఏ పోలీసు వస్తాడో తెలియదు.. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఎప్పుడు వదిలేస్తారో తెలియదు.. ఎప్పుడు ‘ప్రైవేటు’ గూండాలు వచ్చి బెదిరిస్తారో తెలియదు.. నోరు తెరిస్తే తప్పు.. ఏం మాట్లాడాలన్నా భయం.. ఇదేమిటని ప్రశ్నిస్తే వేధింపులు.. తప్పుడు కేసులు.. గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో రైతుల దీనావస్థ ఇది.. భూములు ఇవ్వబోమని చెబితే ఎదురయ్యే పరిస్థితి ఇది..
రాజధాని గ్రామాల్లో హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. రెండు నెలలుగా జరుగుతున్న సంఘటనలతో గ్రామాలు తల్లడిల్లిపోతున్నాయి. రాజధానికి భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న తుళ్లూరు, తాడేపల్లి మండలాలకు చెందిన ఆరు గ్రామాల్లోని పంట పొలాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల కేసు విచారణ పేరుతో పోలీసుల వేధింపులు.. భూ సమీకరణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎదురవుతున్న ‘కష్టాల’తో రైతుల కుటుంబాలు కలవరంలో మునిగిపోతున్నాయి.

ఇంతకుముందే తుళ్లూరు మండలం లింగాయపాలేనికి చెందిన శ్రీనాథ్ చౌదరి అనే యువకుడిని పోలీసు విచారణ పేరుతో స్టేషన్‌లు మార్చుతూ రోజుల తరబడి వేధించగా... తాజాగా తాడేపల్లి మండలం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన బోయపాటి సుధారాణికి ఇదే పరిస్థితి ఎదురైంది. భూ సమీకరణకు వ్యతిరేకంగా ఆమె చేసిన విమర్శ.. ఆ వెంటనే ప్రారంభమైన పోలీసు విచారణ రాజధాని గ్రామాల్లో చర్చనీయాంశమైంది. నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు.. ఆమెకు ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయే దుస్థితి వచ్చింది. కనీసం ఫోన్‌లో మాట్లాడేందుకూ ఆమె కుటుంబం ధైర్యం చేయడం లేదు. భూ సమీకరణను వ్యతిరేకించే వారికెవరికైనా ఈ దుస్థితి తప్పదనే రీతిలో అధికారుల చర్యలు ఉంటున్నాయి.

విమర్శించినందుకే...

రాజధాని భూసేకరణను విమర్శిస్తూ బోయపాటి సుధారాణి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో దృశ్యాలను... నాలుగు రోజుల కింద వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియాకు చూపించారు. సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌లను ఘాటుగా విమర్శించిన వీడియో అది. తర్వాతి రోజు ఈ వార్త దినపత్రికల్లో ప్రచురితం కావడంతోనే సుధారాణి కుటుంబానికి కష్టాలు ప్రారంభమయ్యాయి.

ఆ రోజు ఉదయం 10 గంటలకే ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలకు చెందిన పోలీసులు కృష్ణాయపాలెంలో ప్రత్యక్షమై ఆమె వివరాలు సేకరించారు. సుధారాణి ఇంట్లోలేని సమయంలో ఆమె అత్తమామలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సుధారాణి, ఆమె భర్త మంచిలకపూడి శ్రీనివాస్ పేరున ఆ గ్రామంలో వ్యవసాయ భూమి ఏమైనా ఉందా, ఎంత పొలం కౌలుకు చేస్తున్నారు, ఇతర ఆదాయ వనరులు ఏమిటి? తదితర వివరాలు సేకరించి అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్‌కు నివేదిక రూపంలో అందించారు.

శుక్ర, శనివారాలు పోలీసులు అక్కడే ఉండటంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు సుధారాణిని అభివృద్ధి నిరోధకురాలుగా చిత్రీకరిస్తూ... విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ మూకుమ్మడి దాడిని తట్టుకోలేక సతమతమైన ఆ కుటుంబం గ్రామం విడిచి వెళ్లిపోయింది. సుధారాణి, ఆమె భర్త శ్రీనివాస్ రెండు రోజులుగా బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. కనీసం ఫోన్‌లో అయినా మాట్లాడడానికి భయపడుతున్నారు. ఇలా అక్కడ ఆందోళన నెలకొంది.

సుధారాణి కుటుంబ నేపథ్యం

సామాన్య కుటుంబ నేపథ్యం కలిగిన సుధారాణి జర్నలిజంలో ఎంఏ చేశారు. తెలుగుదేశం పార్టీకి తాను వీరాభిమానని, టీడీపీ మినహా మరో పార్టీకి ఇంతవరకు ఓటు వేయలేదని ఆమెనే చెప్పుకొన్నారు. ఆ కుటుంబానికి 75 సెంట్ల సొంత భూమి ఉంది. మూడెకరాలను కౌలుకు తీసుకుని సాగుచేస్తూ ఏటా రూ. 2 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. వ్యవసాయం మినహా మరో వ్యాపకం తెలియని ఆమె కుటుంబం గ్రామంలో గౌరవంగా జీవనం సాగిస్తోంది. ఆమె కుమార్తె సివిల్స్‌కు సన్నద్ధమవుతుండగా, కుమారుడు టెన్త్ చదువుతున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం తనకున్న 75 సెంట్ల భూమిని తీసేసుకుంటే... తామెలా జీవించాలని, పిల్లలను ఎలా చదివించుకోవాలని ఆమె ప్రశ్నిస్తున్నారు.

అన్నదాతలకు ఇన్ని వేధింపులా..?

గత ఏడాది డిసెంబర్ 29వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ తెల్లవారుజాము వరకు ల్యాండ్ పూలింగ్‌కు ఎంపిక చేసిన ఆరు గ్రామాల్లోని 13 ప్రాంతాల్లో పంట పొలాలను కొంత మంది దుండగులు దహనం చేశారు. ఇందులో రైతులకు చెందిన వెదురు బొంగు లు, అరటి తోటలు, షెడ్లు, డ్రిప్ పరికరాలను కూడా తగలబెట్టడంతో.. రైతులు నిలువునా తీవ్రంగా నష్టపోయారు. ఇన్నిచోట్ల ఒకేసారి దుండగులు పంట పొలాలకు నిప్పుపెట్టడంతో... ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

భూసమీకరణకు వ్యతిరేకంగా ఉన్న రైతుల పొలాల్లోనే ఇలా జరగడం పై అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థ లు అధికార పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. కానీ ఈ దహనం ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదిస్తూ జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అడ్డగోలు ఆరోపణలు కూడా చేశారు. దీనిపై ఆగ్రహించిన రైతులు.. అదే రోజున పర్యటనకు వచ్చిన మంత్రిని నిలదీశారు. జగన్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు.

ఇలా మంత్రిని గట్టిగా ప్రశ్నించిన కల్లం సాంబిరెడ్డి అనే రైతును ఆ రోజు సాయంత్రమే పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించా రు. పంటల దహనం కేసు గురించి విచారించేందుకు తెచ్చామంటూ రాత్రంతా స్టేషన్‌లోనే ఉంచేశారు. అంతటితో ఆగకుండా ఇదే విచారణల పేరిట భూపరిరక్షణ కమిటీ ఏర్పడిన రైతులను, ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన సుమారు 70 మంది రైతులను చాలా రోజుల పాటు తీవ్రంగా వేధించారు.

రైతులంతా ఈ వేధింపులను తట్టుకోలేక రెండు సార్లు రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరుకు నిరసనగా ధర్నాలు కూడా చేశారు. అయినా పోలీసుల వైఖరిలో మార్పు లేకపోవడంతో... హైదరాబాద్‌కు వెళ్ళి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తమ కష్టాలు విన్నవించుకుని, ఆయన ఆధ్వర్యంలో గవర్నర్ నరసింహన్‌ను, మానవ హక్కుల సంఘాన్ని కలిసి రైతులంతా ఫిర్యాదులు చేశారు. ఇదే విధంగా తుళ్ళూరు మండలం లింగాయపాలేనికి చెందిన శ్రీనాథ్ చౌదరి అనే యువకుడిని సైతం పోలీసులు విచారణ పేరుతో స్టేషన్‌లు మార్చుతూ.. రోజుల తరబడి వేధించారు. చివరకు ఆయనపై కేసు కూడా నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.

వాస్తవాలు చెబితే తప్పా!

రాజధాని ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వం పాల్పడుతున్న ఎన్నో అడ్డగోలు పనులను సుధారాణి నిలదీశారు.ఆమె చెప్పిన అంశాల్లో కొన్ని ..

‘‘సీఆర్‌డీఏ చట్టాలు తీసుకువచ్చి చంద్రబాబు రైతులను మోసగిస్తున్నారు. నాకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబునాయుడుకు తప్ప ఎవరికీ ఓటు వెయ్యలేదు. అన్నం తినే వాడు ఎవడూ తమ భూములు ఇవ్వడు. చంద్రబాబు గారికి, మంత్రి నారాయణకు, ప్రత్తిపాటి పుల్లారావుకు ఉన్న ఆస్తులను రాజధానికి ఇచ్చేయమనండి. సీఆర్‌డీఏ కమిషనర్ దగ్గరకు, చంద్రబాబునాయుడు దగ్గరకు నన్ను తీసుకువెళ్తే.. వాళ్లతో నేను మాట్లాడతాను. మీరే (మీడియా) ఎవరైనా నన్ను తీసుకువెళ్లతారా..?’’

‘‘అసలు ఇక్కడి రైతులు ఏ విధంగానూ భూములు ఇవ్వడానికి ఇష్టపడరు. గ్రామంలో కొంతమందికి భయపడి చిన్న రైతులు భూములు ఇస్తున్నారు. సంవత్సరానికి 35 వేల రూపాయలు ఇస్తానంటున్నారు. దానిలో అత్తమామలకు మందులే కొనలేం. మేం మూడు ఎకరాలు కౌలుకు చేస్తున్నాం. మాకు సంవ త్సరానికి లక్షాడెబ్బై వేల రూపాయలు వస్తాయి. సింగపూర్, సింగపూర్ అంటున్నారు చంద్రబాబు. సింగపూర్‌లో అడుక్కునే వారు కూడా ఎక్కువే ఉన్నారు. మా భూములు లాక్కుని మాకు ఒక చిప్ప ఇస్తే రాజధాని ప్రాంతంలో బజారుల వెంట అడుక్కుంటాం. ..’’

Popular Posts

Topics :