05 February 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Andhra Assembly relook

Written By ysrcongress on Saturday, February 11, 2012 | 2/11/2012

లోకేష్‌ను చదివించడానికి 60 లక్షలను వేరెవళ్లతోనో కట్టించిన దౌర్భాగ్య పరిస్థితి

‘టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడును నేటి యువత ఏం చూసి ఆదర్శంగా తీసుకోవాలి? . పిల్ల నిచ్చిన మామకు వెన్ను పోటు పొడిచినందుకా? తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావునూ, బావమరిది హరికృష్ణనూ, చివరకు రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడిని కూడా వాడుకుని వదిలేసినందుకా? లేక తొమ్మిదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేక పాలనను అందించినందుకా? ప్రజా ఉద్యమాలను అణచి వేసినందుకా? లేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయించి యువకులకు ఉద్యోగాలు లేకుండా చేసినందుకా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. ప్రతిష్టను కోల్పోతున్న తన పార్టీని కాపాడుకోవడానికి యువతరంగాలు పేరుతో బాబు నిర్వహిస్తున్న సభల్లో ‘నేను ముఖ్యమంత్రిగా ఉండగా...అవి చేశాను, ఇవి చేశాను...అని సొంత డబ్బా కొట్టుకుంటున్నారు’ అని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు ఎంతటి గొప్పవాడో.. పాపం, ఎవరూ చెప్పడం లేదని, అందుకే తనను తానే పొగుడుకునే దౌర్భాగ్య స్థితికి దిగజారాడని అంబటి పేర్కొన్నారు.

ఎన్టీఆర్ కుటుంబాన్ని తన రాజకీయాలతో చిందర వందర చేసిన బాబు అధికారం కోసం తాను ఏ గడ్డైనా కరుస్తానని యువతకు బోధిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు తన పాలన బ్రహ్మాండంగా ఉండేదని, కావాలంటే తమ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవాలని బాబు వారిని కోరుతున్నారని నిజంగా ఆయన పాలన అంత బాగుంటే ప్రజలు వరుసగా ఎందుకు చిత్తుగా ఓడించారో, ఇప్పటికీ డిపాజిట్లు గల్లంతయ్యేలా ఎందుకు తిరస్కరిస్తున్నారో చెప్పాలని రాంబాబు నిలదీశారు. ఇప్పటికే రెండు సార్లు బాబును ప్రజలు ఛీకొట్టారని, మరో మారు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. బాబు పాలన ఎలాంటిదో యువకుల తల్లిదండ్రులకు బాగా తెలుసునని, అందుకే వారు ఇలాంటి తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫీజు రీఇంబర్స్‌మెంట్ పథకం వల్లనో, తల్లిదండ్రుల కష్టార్జితం వల్లనో చదువుకుంటున్న యువకుల వద్దకు వెళ్లి తానే ఆదర్శవంతుడనని చెప్పుకోవడం దారుణమని ఆయన అన్నారు. 

తన కుమారుడు లోకేష్‌ను స్టాన్‌ఫోర్డు యూనివర్సిటీలో చదివించడానికి 60 లక్షల రూపాయలను వేరెవళ్లతోనో కట్టించిన దౌర్భాగ్య పరిస్థితి గురించి యువతకు ఎందుకు చెప్పడం లేదని ఆయన చంద్రబాబుని ప్రశ్నించారు. తానుండగా ఉద్యోగాలు కల్పించాననడంలో ఏ మాత్రం నిజం లేదని, దేశం మొత్తం 160 ప్రభుత్వ రంగ సంస్థలు మూత పడితే బాబు హయాంలో మన రాష్ట్రంలోనే 80 సంస్థలు మూతపడ్డాయని ఆయన గుర్తు చేశారు. అంతెందుకు, బాబు తాను రాసుకున్న ‘మనసులో మాట’ పుస్తకంలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారోయువత తెలుసుకోవాలని అంబటి సూచించారు. బాబు తాను రాసిన ఈ పుస్తకాన్ని మార్కెట్ నుంచి ఎందుకు మాయం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే యువతరంగానికి వచ్చిన యువకులందరికీ ఈ పుస్తకాన్ని పంచి పెట్టాలని, అది చూసిన వారు వచ్చిన దారినే తిరిగి పోతారని ఆయన సవాలు విసిరారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఖజానాకు భారమని చెప్పిన బాబు ఇపుడు ఉద్యోగాలు ఇస్తానంటే నమ్మేంతటి అమాయకులు యువకులు కారని ఆయన వ్యాఖ్యానించారు. జూనియర్ డాక్టర్ల సమ్మె వల్ల రాష్ట్రంలోని వైద్యశాలల్లో రోగుల మృతితో మరణ మృదంగం మోగుతోంటే ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం అమానుషం అని రాంబాబు దుయ్యబట్టారు. సమ్మె చేస్తున్న వారిదే బాధ్యత అన్నట్లుగా ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సరికాదని వారిని చర్చలకు పిలిచి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

1994 నుంచి విచారణ చేపట్టాలి: విజయమ్మ

భూ కేటాయింపుల సభా సంఘానికి సంబంధించి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ ఈరోజు ఒక లేఖ రాశారు. 1994 నుంచి అన్ని భూ కేటాయింపులపై సభా సంఘం విచారణ చేపట్టాలని ఆమె కోరారు. అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయని తెలిపారు. సభా సంఘం ఏర్పాటు తనను దిగ్ర్భాంతి కలిగించిందని పేర్కొన్నారు. కాగ్, లోకాయుక్తలే మహానేత డాక్టర్ వైఎస్ ని వేలెత్తి చూపలేదని గుర్తు చేశారు. నిర్ణయం తీసుకున్న 11 నెలలకు ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. కమిటీ విధివిధానాలలో ఇప్పటీకి స్పష్టతలేదన్నారు. టిడిపి హయాంలో జరిగిన భూకేటాయింపులపై కూడా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. కొందరు ఎమ్మెల్యేల డిమాండ్ కూడా ఇదేనని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం దీనికి సిద్ధంగా లేరని పేర్కొన్నారు. 

టిడిపి హయాంలో భారీగా భూ కేటాయింపులు జరిగాయి. కృష్ణపట్నం, గంగవరం పోర్టు, శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఎమ్మార్ ప్రాజెక్ట్, రహేజా, ఓడరేవు, విశాఖ ప్రాజెక్ట్, ఆరు పవర్ ప్రాజెక్టులకు, ఎంఐజి భారత్ లకు భారీగా భూములు కేటాయించారు. కాంగ్రెస్, టిడిపి మధ్య జరిగిన లోపాయకారీ ఒప్పందం ప్రకారమే ఇప్పుడు ఈ సభాసంఘాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఐఎఎస్ లను మాత్రమే సిబిఐ విచారించడం తనకు బాధ కలిగించిందన్నారు. ఇతరులను ఎందుకు విచారించడంలేదని ఆమె ప్రశ్నించారు.

YSR Party Leader Roja Strike on Flyover issue

Ambati Rambabu and Vasireddy Padma comments about chenetha deeksha

cheneta deeksha arrangements

YSR SCHMES






















నేతన్న భవితకు భరోసా!


సరళీకృత ఆర్థిక విధానాలను ఇష్టారాజ్యంగా అమలుచేసిన రోజులవి. ప్రపంచ వాణిజ్య సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు పామోలిన్, చైనీస్ సిల్క్ దేశంలోకి చొరబడి రాష్ట్ర వ్యాప్తంగా అటు రైతాంగాన్ని, ఇటు చేనేత రంగాన్ని ఏకకాలంలో సంక్షోభంలోకి నెట్టి వేసిన దుర్భర సన్నివేశం అది. పామోలిన్ పుణ్యమా అని అనంతపురం జిల్లాలో వేరుశనగ పండించిన రైతన్నకు గిట్టుబాటు ధర లభించకుండాపోయింది. సంప్రదాయ మగ్గాలకు పోటీగా మరమగ్గాలను ప్రవేశపెట్టే విధానాన్ని నాటి ప్రభుత్వం ఆ రోజుల్లో పెద్దఎత్తున చేపట్టింది. దిగు మతి చేసుకొన్న చైనీస్ సిల్క్‌తో మరమగ్గాలపై చేనేత చీర లను పోలిన చీరలను, ఇతర వస్త్రాలను పెద్దఎత్తున ఉత్పత్తి చేశారు. ఫలితంగా ధర్మవరం పట్టుచీరలకు ఆదరణ కరు వైంది. మరమగ్గంపై తయారు చేసిన నకిలీ నేతచీరలు, చేనేత చీరలకన్నా తక్కువ ధరకే మార్కెట్‌లో లభించడం ఈ పరిణామానికి దోహదం చేసింది. 

దక్షిణ భారతంలో మొట్టమొదటిసారిగా రైతులు, నేతన్నల ఆత్మహత్యలు అనంతపురం జిల్లాలో జరగడానికి గల తక్షణ నేపథ్యం ఇది. ఈ ఆత్మహత్యలను గుర్తించడానికి నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరా కరించారు. చేనేతరంగ ప్రముఖులు ఆనాటి రాష్ట్ర మంత్రి పరిటాల రవీంద్ర నాయకత్వంలో ప్రతినిధి బృందంగా ఏర్పడి చంద్రబాబును కలిసి మగ్గాలకు పోటీగా మరమ గ్గాలు (పవర్‌లూమ్స్) రావడంవల్ల చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను ఆయనకు వివరించారు. చేనేత రంగానికి రక్షణలు కల్పించాల్సిందిగా కోరుతూ అందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ జీఓ- 557ఈకి లోబడి చేనేత పరిశ్రమ ఉత్పత్తి చట్టం అమలు పరచాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు బదులుగా ‘గుంతల మరమగ్గాల స్థానే’ పవర్‌లూమ్స్ యంత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని, విజన్-2020లో అందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు వారికి ‘హితవు’ చెప్పారు. 

చేనేత రక్షణకు 11 రకాల వస్త్రాలపై 1986లో కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వశాఖ స్పష్టమైన ఆదేశాలను విడుదల చేసింది. చీర, ధోవతి, బెడ్‌షీట్లు, తువాళ్లు, గావంచ/ అంగోస్త్రం, లుంగీ, బెడ్‌షీట్, బెడ్ కవర్లు, షర్టింగ్, పరదా, జంపఖాన వంటివన్నీ ప్రత్యేకంగా చేనేత రంగంలో ఉత్ప త్తి కావాలని నిర్దేశించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ జీఓను యథేచ్ఛగా ఉల్లంఘించింది. వ్యవసాయ రంగం శుద్ధ దండగ అన్న చంద్రబాబు చేనేత రంగాన్ని కాలగ ర్భంలో కలిసిపోయిన జీవన విధానంగా తిరస్కరించడం మనకు ఆశ్చర్యం కలిగించదు. 

నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్, సంక్షేమ రంగాలను ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైనం మన కళ్లముందున్నదే. గతంలో ఎన్టీఆర్ చేనేతరంగానికి ఇచ్చిన చేయూత ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. రూ.2 కిలోల బియ్యంతో పాటు జనతా వస్త్రాలు-చీరలు, ధోవతులు పౌరసరపరాల విభాగం ద్వారా ప్రజలకు అందించారు. ఆ విధంగా చేనేత ఉత్పత్తులకు అధిక ప్రాముఖ్యం ఇచ్చారు. అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా చేనేత రంగాన్ని ప్రత్యేకించి ఖద్దరు దుస్తుల వినియోగాన్ని అమితంగా ప్రోత్సహించారు. ప్రభుత్వో ద్యోగులు విధిగా వారానికి ఒకమారు చేనేత దుస్తులు ధరించి కార్యాలయాలకు హాజరు కావాలని వైఎస్ ఏకంగా జీవో జారీచేశారు. ఎన్టీఆర్, వైఎస్ విధానాలకు విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరించడం వల్లే చేనేత సంక్షోభాన్ని పెంచి పోషించారు. బాబు అడుగుజాడల్లోనే ఈ రోజున కిరణ్ సర్కార్ పయనించడంలో విడ్డూరం ఏమీ లేదు.

రైతులు, చేనేత వృత్తి కళాకారుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న రోజుల్లో... ‘‘రైతన్నలారా... నేతన్న లారా! ఆత్మహత్యలు మానండి... మీకు కుటుంబం, భార్యాపిల్లలు ఉన్నారన్న సంగతి గుర్తుంచుకోండి. పౌర సమాజంగా, రాజకీయ పార్టీగా మేమంతా మీతో ఉంటాం. వేరుశనగ రైతులను ఆదుకోవడానికి మేము పోరాడతాం. మీ వెంట మేముంటాం. అధైర్యపడకండి. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోండి’’ అంటూ 2001లో వైఎస్ అనంతపురం జిల్లాలో రెండు రోజులు పర్యటించి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

‘‘సరళీకృత ఆర్థిక విధానాల ఫలి తంగా రంగప్రవేశం చేసిన పామోలిన్, చైనీస్ సిల్క్ దిగుమతుల అంశంపై మేము అధికారంలోకి వచ్చాక పునః పరిశీలన చేస్తాం’’ అంటూ ముదిగుబ్బ మండలంలో పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఆనాటి ‘ప్రజాశక్తి’ విలేకరి విశ్వేశ్వరరావు ‘‘సరళీకృత ఆర్థిక విధానాలకు సంబంధిం చిన ఒప్పందాలు ప్రపంచ వాణిజ్య సంస్థతో మీ నాయకుడు పి.వి.నరసింహారావు హయాం లో చేసుకున్నవే కదా’’ అని ప్రశ్నించగా ‘‘అయితే ఏమిటి? (సో వాట్?) ప్రజలకు ఉపయోగపడని, ప్రజల శ్రేయస్సుకు భంగం కలిగించే ఏ విధానమైనా మార్చుకుంటాం. ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థతో చేసుకున్న ఒప్పందాలను పునఃపరిశీలిస్తాం’’ అని బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడై ఉండి వైఎస్ ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం ఆ రోజుల్లో రాజకీయవర్గాల్లో అలజడి రేపింది. 1985 నాటి చేనేత రిజర్వేషన్ చట్టాన్ని చంద్రబాబు సర్కార్ ఉల్లంఘించిన ఫలితంగా రైతన్నలు, నేతన్నల ఆత్మహత్యలు జరిగాయన్నది దాచేస్తే దాగని సత్యం. కానీ, చంద్రబాబు మాత్రం కళ్లముందు కనిపిస్తున్న సత్యాన్ని చూసేందుకు సిద్ధపడలేదు.

వైఎస్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆత్మహత్య చేసుకున్న రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలకు తలా రూ.1,50,000 ఆర్థికసహాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికీ రూ.25,000 చొప్పున అందించారు. బాబు పాలనా కాలం లో ఒక్క అనంతపురం జిల్లాలోనే మొత్తం 33 మంది నేత న్నల ఆత్మహత్యలు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా పామిడి, రాయదుర్గంలో రూ.25 కోట్లతో టెక్స్‌టైల్ పార్కు ల ఏర్పాటుకు చొరవ చూపించారు. హిందూపురంలో 73 ఎకరాల విస్తీర్ణంలో రూ.104 కోట్ల పెట్టుబడితో హిందూపు రం వ్యాపార అపెరల్ పార్కును మంజూరు చేశారు. త ద్వారా 20 వేల మందికి ప్రత్యక్షంగానూ, పది వేల మందికి పరోక్షంగాను ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టారు. 
‘రైతు పోరు యాత్ర’ పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలతో రాష్ట్రంలో పర్యటిస్తున్న చంద్రబాబు... వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతులకు, చేనేత కార్మికులకు కల్పించిన భరోసా, ప్రోత్సాహం కారణంగా వారు సుఖసంతోషాలతో జీవించారనే అంశాన్ని అంగీకరించేం దుకు తిరస్కరిస్తున్నారు. తన పాలనలో జరిగిన వలసలు, రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యలను మరచి, అబద్ధాలను పుక్కిటపడుతూ తన ప్రతిపక్ష నాయకుని హోదా ను న్యూనపరుచుకుంటూ పర్యటన కొనసాగిస్తున్నారు. 

చేనేత కార్మికులకు నేడు వృత్తి కొనసాగించడానికి మగ్గాలు, ముడిసరుకు కావాలి. అందుకు రుణవసతి కల్పిం చాలి. ఉత్పత్తి చేసిన చేనేత సరుకులకు మార్కెట్ సృష్టిం చాలి. చేనేత కార్మికులను మధ్య దళారీల దోపిడీ నుంచి రక్షించాలి. మరోవైపు వైఎస్ ప్రవేశపెట్టిన సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ భద్రత లాంటి పథకాలు జతచేయాలి. 2009లో వైఎస్ నేతన్నల బకాయిలను రూ.312 కోట్ల మేర మాఫీ చేశారు. 

కానీ, నేటికీ ఆ రుణాల మాఫీకి గాను రూ.109 కోట్లకు మించి విడుదల చేయలేదు. మహిళా సంఘాలకు పావలా వడ్డీ లేదా వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లుగానే చేనేత కార్మికులకు వడ్డీలేని రుణాలను రాష్ట్ర సర్కార్ ఇవ్వాలి. చేనేత సహకార కార్మిక సంఘాలన్నీ పారదర్శకత లోపించి కార్మికేతరుల చెప్పుచేతుల్లోకి పోవడంపై అధ్యయనం జరగాలి. జయతీఘోష్ కమిషన్ లాగా చేనేత రంగం రక్షణకు చట్టబద్ధత ఉన్న కమిషన్ ఏర్పాటు చేయాలి. ఉచిత విద్యుత్తు, ఇంటిపన్ను పెంచకపోవడం, ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచకపోవడం, ఉచిత వివాహాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు ద్వారా నేతన్నలకు వైఎస్ సర్కార్ సామాజిక భద్రత కల్పించింది. కానీ, ఈ సంక్షేమ కార్యక్రమా లన్నీ నేడు ప్రశ్నార్థకంగా మారాయి.

కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధినాయకి సోనియా గాంధీని కాదని సొంత పార్టీని నెలకొల్పిన జగన్‌మోహన్‌రెడ్డిపై కేవలం పదవి కోసం కాంగ్రెస్‌ను వదిలారని ఆరోపణలు చేసిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ బాధ్యత మరచి ముఠాతత్వంతో ప్రజాప్రయోజనాలకు తిలోదకాలిచ్చా యి. ఈ నేపథ్యంలో నేతన్నల మేలు కోరుతూ జననేత జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా ధర్మవరంలో ‘చేనేత దీక్ష’ను 12 నుంచి చేపడుతున్నారు. వైఎస్సార్ పార్టీ స్థాపించి సంవత్సరం కూడా గడవక ముందే జగన్ విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు సహా, నీటిపారు దల, వ్యవసాయ, విద్యుత్ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలు చేపట్టారు. అదే వరసలో చేనేత కార్మికుల్లో ఏర్పడ్డ నిరాశ, నిస్పృహలను పారదోలడానికి, వారికి తాను వెన్నుదన్నుగా ఉంటానని చెప్పడానికి ఆయన ఇందుకు పూనుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి జీవనోపాధి కల్పించే రంగమిది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా వ్యవసాయం తరువాత చెప్పుకోదగ్గ ప్రాముఖ్యం కలిగిన ఈ రంగాన్ని కాపాడుకోవడం తప్పనిసరి.

మాటలకు ప్రాణం ఉంటే సిగ్గుతో నిలువునా చచ్చిపోయేవి

 భాషకే జీవం ఉంటే ఆత్మహత్య చేసుకొనేది. పదాలు... పరువు పోయినందుకు ప్రాణత్యాగం చేసేవి. మన రాష్ట్రంలో నేతల భాష చూసి రాజకీయం సిగ్గుతో తలవంచుకొంటోంది. నాయకులు కాట్లాడుకుంటున్న తీరు చూసి ప్రజానీకం నివ్వెరపోతోంది. ఒకప్పుడు రాయడానికి వీలుగాని భాషగా భావించే భాషను నిజమేంటో ఎవరి నైజమేంటోతేటతెల్లంగా చెప్పేందుకు ఇప్పుడు రాయక తప్పని పరిస్థితి. 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. రాజకీయ నాయకులు రాష్ట్రంలో బూతు పురాణానికి తెరతీశారు. నోటికి అడ్డూఅదుపూ లేకుండా.. మంచిమర్యాదా లేకుండా ఒకరిపై ఒకరు నోరుపారేసుకుంటున్నారు. అప్పుడెప్పుడో... జంధ్యాల బతికున్నప్పుడు తన సినిమాల్లో బ్రహ్మానందం, సుత్తి జంటతో పలికించినదానికన్నా విచిత్రమైన.. వింటేనే వికారం కలిగించేలా ఉండే కొత్త కొత్త తిట్లను సృష్టించి మరీ రాజకీయ ప్రత్యర్థులపై సంధిస్తున్నారు. నరంలేని నాలుకతో నవ్య విన్యాసాలు చేయిస్తున్నారు! 

ప్రజాసేవలో కనిపించని గొప్ప సృజనాత్మకతను తిట్లపురాణం లంకించుకోవడంలో చూపిస్తున్నారు. స్థాయి మరచి.. సభ్యతా సంస్కారాలను విడిచి ఒకరినొకరు కసితీరా దూషించుకుంటున్నారు. నాలుకలు కోస్తామంటూ అవే నాలుకలతో నోటికి వచ్చినట్లు పరస్పరం తిట్టుకుని నోటి తీట తీర్చుకుంటున్నారు. "అబద్ధానికి పెద్ద కొడుకువి, నరరూప రాక్షసుడివి, తాగుబోతువి, సన్నాసివి, దగుల్బాజీవి, గుంట నక్కవి, లంగవి, లఫంగివి, లుచ్ఛావి'' అంటూ వినరాని, వినలేని మాటలతో తిట్ల దండకం వల్లిస్తున్నారు. వాళ్లూవీళ్లూ అని లేదు... టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ అన్ని పార్టీల నేతలూ ఆ తానులో గుడ్డలే! 

బూతుపురాణంలో సరికొత్త అధ్యాయాల సృష్టికర్తలే! "కుట్రలకు కేరాఫ్ అడ్రస్ నువ్వు. నువ్వు చేసిన పాపాలు గంగా నదిలో మునిగినా.. పన్నీరుతో కడిగినా పోవు. నికృష్టమైన నాయకుడివి. విద్రోహంలో హీనమైన గతం నీది. వంచనలో అతి నికృష్టుడివి. బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో మనుషులను మాయం చేసిన మాయావివి. నీ బతుకే కుట్రలమయం'' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఘాటు విమర్శలపై.. టీడీపీ నేతలు అంతే ఘాటుగా స్పందించారు. "నీ నాలుకనూ, నిన్నూ రెండుగా చీలిస్తే తప్ప.. నీకు బుద్ధి రాదు'' అంటూ కేసీఆర్‌పై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. 

"ఈ యుగానికే నరరూప రాక్షసుడివి. వసూల్ రాజావి. నీ కన్నా నీచ నికృష్ట కుసంస్కారపు నేత మరొకరు లేడు'' అంటూ కేసీఆర్‌పై తలసాని శ్రీనివాస యాదవ్ ధ్వజమెత్తారు. "తాగుబోతూ.. జాగ్రత్త. నీ నోటిని ఫినాయిల్‌తో శుద్ధి చేసుకో. నీది నోరు కాదు.. మూత్రశాల'' అంటూ టీఆర్ఎస్ అధినేతపై దేవేందర్ గౌడ్ మండిపడ్డారు. "పిచ్చి కుక్క కరిచినందునే కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు'' అని తీగల కృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ నేతల తిట్లుకు కేసీఆర్ కూడా దీటుగానే స్పందించారు. 

"మీదే కుటిల నీతి, నీచ, దుష్ట సంస్కృతి'' అంటూ మండిపడ్డారు. ఇక.. 'మీరేనా తిట్టుకొనేది.. మేం మాత్రం తక్కువ తిన్నామా?' అన్న రీతిలో కాంగ్రెస్ నేతలూ తిట్లపురాణంలో భాగస్వాములయ్యారు. "తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న కుక్కవి కాబట్టి కుక్క బుద్ధులొచ్చాయి. కనీసం ఎలా మాట్లాడాలో నీకు తెలియడం లేదు'' అంటూ చంద్రబాబుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి నిప్పులు చెరిగారు. "చంద్రబాబు కారుకూతలు మానుకోకుంటే.. కుక్క నాలికను కోసినట్లు ఆయన నాలుక కోస్తాం. ఆయనను మించిన నక్క మరొకటి ఉండదు'' అని మండిపడ్డారు.

ys jagan in kadapa

10/02/2012 nellore tour images










బాబుకు షాకిచ్చిన యువత!

యువతరంగం సదస్సులో యువకులు పలుమార్లు తమ ప్రశ్నలు, వ్యాఖ్యలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు జర్కులిచ్చారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టించిందే తానని చంద్రబాబు పదేపదే చెప్పారు. దీంతో, మౌలిక వసతుల్లేని ప్రైవేట్ కాలేజీల్లో చదివి వెనకబడుతున్నామని శ్రీనిధి అనే విద్యార్థిని వాపోయింది. పక్క రాష్ట్రాల్లోని ప్రమాణాలు ఇక్కడ లేవనడమే గాక, అలాంటి కాలేజీలు ఎన్ని పెట్టి ఏం ప్రయోజనమంటూ సూటిగా నిలదీసింది! రాజకీయ అవినీతిపై పోరాడతానని తొలుత హడావుడి చేసిన బాబులో ఇప్పుడా జోరు కనపడటం లేదేమన్న అనిల్ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు చంద్రబాబు తడుముకున్నారు. హైదరాబాద్‌లో ఐటీ పార్కులూ అవి పెట్టి ఉద్యోగాలిచ్చారు. కానీ వెనకబడ్డ రాయలసీమ జిల్లాల వారి ఉపాధి కోసం ఏం చేశారు? ఈసారి గెలిస్తేనైనా ఈ ప్రాంత యువత ఉపాధికి ఏం చేస్తారో చెప్పండి’’ అంటూ లక్ష్మీపతి అనే విద్యార్థి ప్రశ్నించాడు. వాటిని అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తానని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడున్న అభివృద్ధంతా తాను చేసిందేనంటూ ఆయన చెప్పుకొచ్చారు..!

అత్యవసర సేవలను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు

డిమాండ్ల పరిష్కారంలో సర్కారు మొండి వైఖరికి నిరసనగా నిర్ణయం
కోర్కెల సాధనకు కొన్ని రోజులుగా సమ్మె, ఆమరణ దీక్షలు చేస్తున్న జూడాలు
సమ్మె విరమిస్తేనే చర్చలన్న ప్రభుత్వం
కనిపించని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు 
అత్యవసర సేవల బంద్‌తో అల్లాడుతున్న రోగులు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో సర్కారు అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా జూనియర్ డాక్టర్లు(జూడాలు) రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలను బహిష్కరించారు. తమ డిమాండ్ల సాధనలో భాగంగా వైద్య సేవలను బహిష్కరించి.. కొన్ని రోజులుగా సమ్మె బాట పట్టిన జూడాలు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి అత్యవసర వైద్య సేవలనూ బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఫలితంగా పేదోళ్ల పెద్దాసుపత్రులుగా పేరొందిన హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ; విశాఖపట్నంలోని కింగ్‌జార్జి(కేజీహెచ్), వరంగల్ ఎంజీఎం, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి సహా రాష్ట్రవ్యాప్తంగా పది ప్రభుత్వ బోధనాస్పత్రులతోపాటు వాటి అనుబంధ సర్కారీ దవాఖానాల్లోని వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది. జూడాలు సమ్మెకు వెళ్లడంతో కొన్ని రోజులుగా సరైన వైద్య సేవలు అందక రోగులు అల్లాడుతుండగా.. ఇప్పుడు అత్యవసర సేవలూ బంద్ కావడంతో వారి వేదన వర్ణనాతీతంగా మారింది. ఇన్‌పేషెంట్లనైతే.. పట్టించుకునేవారే కరువయ్యారు. మరోవైపు సమ్మె విరమించి రోగులకు సేవలు అందిస్తేనే.. జూడాలతో చర్చిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించినా.. ఎక్కడా వాటి జాడే కానరాలేదు. 

ప్రభుత్వంతో తాడోపేడో...

న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం మొండివైఖరి వీడనందున విధిలేని పరిస్థితుల్లోనే అత్యవసర సేవలను బహిష్కరించాల్సి వచ్చిందని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. తమకు మరో మార్గం లేనందునే.. రోగులకు ఇబ్బందని తెలిసినా అత్యవసర సేవలను బహిష్కరించక తప్పలేదని చెప్పారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. తమ డిమాండ్లను గొంతెమ్మ కోర్కెలుగా అభివర్ణిస్తూ ప్రజల్లో తమను చులకన చేయాలని ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోందని వారు దుయ్యబట్టారు. అవసరమైతే డిగ్రీలనైనా వదులుకుంటాం తప్ప.. ఎస్మావంటి నల్లచట్టాలకు బెదిరేది లేదని జూడాల సంఘ రాష్ట్ర కార్యదర్శి ఫణిమహేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వంతో జరిగే పోరాటంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. 

రోగుల విలవిల

జూడాలు అత్యవసర సేవలను బహిష్కరించడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రులతోపాటు వాటి పరిధిలోకి వచ్చే పలు సర్కారు ఆస్పత్రుల్లో రోగులు విలవిలలాడుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన పలు ఆపరేషన్లు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చెప్పినా.. ఆస్పత్రులకు వచ్చిన రోగులను పట్టించుకునే వారే కరువయ్యారు. హైదరాబాద్‌లో చావు బతుకుల మధ్య ఎమర్జెన్సీ వార్డుకు వచ్చిన రోగులకు సరైన వైద్య సేవలు అందకపోవడంతో రోగుల బంధువులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి డ్రెస్సింగ్ చేసేందుకు కూడా ఎవరూ లేకపోవడంతో రోగులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 

అటు వరంగల్‌లోని ఎంజీఎం, విజయవాడ ప్రభుత్వాసుపత్రితోపాటు విశాఖ కేజీహెచ్, తిరుపతి రుయా, గుంటూరు, కాకినాడ, కర్నూలు మెడికల్ కాలేజీల్లోనూ అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 350 మంది రోగులు చికిత్స పొందుతుండగా.. వారి పర్యవేక్షణకు నలుగురు వైద్యులు మాత్రమే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక అత్యవసర వైద్యం నిమిత్తం రోగులు వచ్చినా చేర్చుకునే పరిస్థితి ఉండదని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చెందిన ఓ ప్రొఫెసర్ ‘న్యూస్‌లైన్’తో అన్నారు. ‘ధనికులకేమీ ఇబ్బంది లేదు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళతారు. అత్యవసర వైద్యం నిమిత్తం సర్కారు ఆస్పత్రులకు వచ్చే రోగులకు మాత్రం కష్టాలు తప్పేలా లేవు’ అని హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కళాశాలకు చెందిన ఓ ప్రొఫెసర్ పేర్కొన్నారు. 

ఆస్పత్రుల్లో వీరే ‘అత్యవసరం’..

బోధనాస్పత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందించడంలో కీలక భూమిక జూనియర్ డాక్టర్లదే. రేయింబవళ్లు షిప్టులవారీగా విధులు నిర్వహిస్తూ ఇన్‌పేషెంట్లకు వైద్యం అందిస్తారు. అత్యవసర వైద్యం నిమిత్తం వచ్చే రోగులకు క్యాజువాలిటీలో వైద్య సేవలు అందించేది కూడా వీరే. రోగి పరిస్థితి మరీ విషమంగా ఉంటేనే.. సీనియర్ వైద్యులకు (ప్రొఫెసర్లకు) చూపిస్తారు. సాధారణ రోగులకు జూడాలే వైద్యం చేస్తారు. ఆరోగ్యం విషమంగా ఉన్న రోగులకు కూడా వైద్య పరీక్షల నిర్వహణ, వైద్య సేవల విషయంలో వైద్యులకు జూనియర్ డాక్టర్లు సహాయ సహకారాలు అందిస్తారు. ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోకంటే బోధనాస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగ్గా ఉండటానికి జూని యర్ డాక్టర్లు ఉండటమే ప్రధాన కారణమన్నది కాదనలేని సత్యం.

రాష్ట్రంలో పరిపాలన దారుణంగా

రాష్ట్రంలో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరం
జూనియర్ డాక్టర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళన
చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు
104, 108 సిబ్బంది ఉద్యోగాలు ఎప్పడు పోతాయో తెలియని స్థితి

నెల్లూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో పరిపాలన దారుణంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక.. పేదల కష్టాలు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడన్నారు. ప్రజలు తమ సమస్యలు తీర్చాలని ఎన్నిరకాలుగా ఆందోళనలకు దిగినా ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరంలో స్థానికులు ఏర్పాటు చేసుకున్న మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని శుక్రవారం ఆయన అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

రాముని రాజ్యం చూడలేదుగానీ..: జిల్లాలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు అనివార్య కారణాల వల్ల ఇక్కడ కొన్ని విగ్రహాలను అవిష్కరించేందుకు వీలుకలగలేదు. అయినప్పటికీ.. ఇప్పటివరకూ ఎదురుచూసిన మీ అభిమానం, ఆప్యాయతలను ఎన్నటికీ మరవలేను. రెండున్నర సంవత్సరాల క్రితం మృతి చెందిన మహానేతను ఇప్పటికీ మరిచి పోకుండా, ఆయన్ను ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకోవడం సంతోషం. రాముడి రాజ్యం మనం చూడలేదుగానీ, మహానేత డాక్టర్ వైఎస్సార్ పరిపాలనలో సువర్ణయుగాన్ని చూశాం.

మహానేత గుర్తుకు వస్తూనే ఉంటారు..: మహానేత మరణం తర్వాత పేదవాడి గురించి ఆలోచించే నాయకుడు రాష్ట్రంలో ఒక్కరూ కనిపించడం లేదు. ఇలాంటి దారుణమైన పరిపాలన చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికీ ఆ మహానేత గుర్తుకు వస్తూనే ఉంటారు. వ్యవసాయం చేయాలనుకునే ప్రతి రైతు దగ్గర నుంచి చదువుకోవాలనుకునే ప్రతి పేద విద్యార్థి వరకు, వయసు మీద పడిన ప్రతి అవ్వా, తాతల వరకు, అనారోగ్యం పాలైన ప్రతి పేదవాడి వరకూ.. ఇలా ప్రతి ఒక్కరి గురించీ ఆలోచించి, వారికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టి వారి హృదయాల్లో నిలిచిన వ్యక్తి వైఎస్సార్. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు.

రైతు భయపడుతున్నాడు: పేదవాడికి మేలు చేసే విషయంలో ఈ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో లక్ష ఎకరాలు బీడు పెట్టి రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే, వారి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జూనియర్ డాక్టర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ సమస్యలపై ఆందోళన చేస్తున్నా ఫలితం కానరావడం లేదు. చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని జీవనం సాగించే వారిపై కూడా పాలకులు ట్యాక్సులు విధించి వేధిస్తున్నారు. 104, 108 సిబ్బంది ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితులు బాధ కల్గిస్తున్నాయి. పేదల కష్టాలు తీర్చేందుకు ఆ మహానేత తిరిగి రాలేకపోవడం చాలా బాధగా ఉంది.

రోడ్లపై బారులు తీరిన జనం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో జరిపిన ఒక రోజు పర్యటనకు విశేష స్పందన లభించింది. వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలంలో విగ్రహాలు ఆవిష్కరించేందుకు ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు.. ఆయన వచ్చే దారి వెంబడి బారులు తీరి కనిపించారు. ప్రతి చోటా కాన్వాయ్‌ను ఆపి కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపారు. మోపూరు క్రాస్ వద్ద ఒక వృద్ధురాలు జగన్‌ను చూసి ఉద్వేగానికి లోనై.. ‘నువ్వు సీఎం అయితేనే మా కష్టాలు తీరతాయ’ంటూ తన ఆకాంక్షను బయటపెట్టింది. ఆమెను హత్తుకున్న జగన్ ‘త్వరలోనే అన్ని కష్టాలూ తీరుతాయ’ని భరోసా ఇచ్చారు. పొదలకూరు సమీపంలో అలోవిరా ఉత్పత్తుల పరిశ్రమకు చెందిన మహిళలు జగన్‌ను ఆపి తమ కష్టాలు చెప్పుకొన్నారు. అనంతరం రాపూరు మండలం వేపినాపి, సిద్ధవరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాలను జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. రాపూరు మండల కేంద్రంలోని మహానేత విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం చిత్తూరు జిల్లా సరిహద్దుల వరకూ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రయాణంలో ఆయనకు స్థానిక ప్రజలు, మహిళల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. అనంతరం జగన్ కడప వెళ్లారు. నెల్లూరు నుంచి కడపకు 300 కి.మీ. దూరం. ఉదయం 11 గంటలకు నెల్లూరులో బయల్దేరిన జగన్ సాయంత్రం 5 గంటలకల్లా కడప చేరుకోవాల్సి ఉండగా.. రాత్రి 10.30 గంటలకుగాని చేరుకోలేకపోయారు. అడుగడుగునా అభిమానులు కాన్వాయ్‌ను ఆపడం, కరచాలనాలకు పట్టుబట్టడం, పూల మాలలు, బాణసంచాల హడావిడి, అక్కడక్కడా చేలో పనులో వదిలేసి పరిగెత్తుకొచ్చిన కూలీలతో మాటామంతీ.. వెరసి ఆయన ఐదున్నర గంటల ఆలస్యంగా కడప చేరారు.

ఆఫ్ట్రాల్ స్టూడెంట్స్ అంటూ

 తమ డిమాండ్ల పరిష్కారం కోసం జూనియర్ డాక్టర్లు గత నెల 11వ తేదీ నుంచి సాధారణ వైద్య సేవలను బహిష్కరించి, సమ్మె చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆది నుంచీ నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శించింది. జూడాలు ఆమరణ దీక్షలు చేస్తున్నా.. పరిస్థితి విషమించి.. పలువురిని ఐసీయూల్లో చేర్చినా.. పట్టించుకోలేదు. జూడాల డిమాండ్లు న్యాయబద్ధమైనవేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో మద్దతిచ్చినా.. మొద్దునిద్ర వీడలేదు. పైగా.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసింది. ఎస్మా ప్రయోగిస్తామంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేయగా.. ఆఫ్ట్రాల్ స్టూడెంట్స్ అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అంతెత్తున లేచారు. 

ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పన, డాక్టర్లపై దాడుల నిరోధానికి చర్యలు లాంటి కొన్ని డిమాండ్ల విషయంలో జూడాలు, ప్రభుత్వం మధ్య అంగీకారం కుదిరినా.. స్టైపెండ్ పెంపు, గ్రామీణ వైద్య సేవల విషయంలోనే పీటముడి బిగిసింది. మనతో పోలిస్తే.. ఇతర రాష్ట్రాల్లో పీజీ విద్యార్థుల స్టైపెండ్ ఎక్కువగా ఉన్నందున.. ఇక్కడా పెంచాలన్న జూడాల డిమాండ్ న్యాయబద్ధమైనదేనని రాజకీయ పక్షాలు డిమాండ్ చేసినా.. ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపలేదు. ఇటు గ్రామీణ సర్వీసు విషయంలో కచ్చితంగా మూడేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చేయాలని ప్రభుత్వం తేల్చిచెప్పగా.. జూడాలు ఏడాదికే పరిమితం చేయాలని కోరారు. అయితే, స్టైపెండ్ విషయంలో సర్కారు సానుకూల నిర్ణయం తీసుకుంటే.. గ్రామీణ సర్వీసు విషయంలో వారిని ఒప్పించడం సులభమే. దీన్ని ఆమోదించడం వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారమూ తక్కువే అయినా పట్టించుకోలేదు.

జూడాల డిమాండ్లు-సర్కారు స్పందన

Popular Posts

Topics :