12 March 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

కాణీ ఖర్చు లేకుండా రాజధాని నగరంలో చినబాబు ఖాతాలో ఖరీదైన హోటల్‌!

Written By news on Saturday, March 18, 2017 | 3/18/2017



స్టార్‌.. స్టార్‌... దగా స్టార్‌

విజయవాడ నడిబొడ్డున ముఖ్యనేత భూదందా
⇒ రూ.200 కోట్ల విలువైన ట్రాన్స్‌కో భూమికి ఎసరు
⇒ 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు టెండర్లు పిలవాలని ఆదేశం
⇒ సర్వే ప్రారంభించిన పర్యాటక శాఖ అధికారులు
 ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్‌ అభ్యంతరాలు బేఖాతరు
⇒ స్టార్‌ హోటల్‌ నిర్మాణం పేరిట బినామీ సంస్థకు ధారాదత్తం!
⇒ కొంతకాలం తర్వాత చినబాబుకు అప్పగించేలా ఒప్పందం


విజయవాడ నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన ఐదెకరాల ప్రభుత్వ భూమి. అందులో ఒక బ్రహ్మాండమైన ఐదు నక్షత్రాల హోటల్‌ నిర్మించే బాధ్యత ఓ ప్రముఖ హోటల్‌ నిర్వహణ సంస్థది. వాళ్లు ఆ హోటల్‌ నిర్మించి, కొంతకాలం పాటు లాభాల బాటలో నడిపించిన తర్వాత చినబాబుకు కట్టబెడతారు. ఇదీ చినబాబు వేసిన అదిరిపోయే స్కెచ్‌. అంటే కాణీ ఖర్చు లేకుండా రాజధాని నగరంలో చినబాబు ఖాతాలో ఖరీదైన హోటల్‌ పడబోతోందన్నమాట.

ఈ భూమి ప్రస్తుతం విద్యుత్‌ శాఖ అధీనంలో ఉంది. చినబాబు స్కెచ్‌ వేయగానే భూమిని స్వాధీనం చేసుకుని, ప్రైవేట్‌ సంస్థకు అప్పగించేందుకు పర్యాటక శాఖ అధికారులు సర్వే ప్రారంభించారు.

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో చినబాబు, ప్రభుత్వ పెద్దలు  ఏపీ ట్రాన్స్‌కో– ఏపీఎస్పీడీసీఎల్‌కు చెందిన రూ.200 కోట్ల విలువైన 4.80 ఎకరాల భూమిని బినామీల ముసుగులో హస్తగతం చేసుకునేందుకు పథకం వేశారు. లీజు పేరిట 99 ఏళ్లకు దక్కిం చుకునేందుకు పన్నాగం పన్నారు. అందు కోసం అన్ని నిబంధనలను బేఖాతరు చేస్తూ పర్యాటక శాఖ ద్వారా రంగంలోకి దిగారు. ట్రాన్స్‌కో, సదరన్‌ డిస్కం ఉద్యోగుల అభ్యం తరాలను కూడా వారు లెక్కచేయడం లేదు. మరోవైపు తాము ఈ భూదందాలో కేవలం పావులమేనని, అసలు బాగోతం అంతా ప్రభుత్వ ముఖ్యనేతదేనని పర్యాటక శాఖ వర్గాలు చెబుతుండడం గమనార్హం.

లోపాయికారీ ఒప్పందం
రాజధానిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిం చేందుకు స్టార్‌ హోటళ్లు నిర్మించే ముసుగులో ఆ 4.80 ఎకరాలను దక్కించుకోవాలని ముఖ్యనేత వ్యూహం పన్నారు. ఇప్పటికే స్టార్‌ హోటళ్లు నిర్వహిస్తున్న ఓ కార్పొరేట్‌ సంస్థతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం... సదరు సంస్థకు 99 ఏళ్ల లీజు పేరిట ఆ 4.80 ఎకరాలను కట్టబెడతారు. ఆ సంస్థ చినబాబుకు బినామీగా ఉంటూ స్టార్‌ హోటల్‌ను నిర్మించాలి. దాన్ని కొంతకాలం నిర్వహించిన అనంతరం పూర్తిగా చినబాబుకే అప్పగించాలి.

ట్రాన్స్‌కోకు సమాచారం లేదు
స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి వీలుగా 4.80 ఎకరాలను లీజుకు ఇచ్చేందుకు వెంటనే టెండర్లు పిలవాలని పర్యాటక శాఖను ముఖ్యనేత కార్యాలయం ఆదేశించింది. ట్రాన్స్‌కో, ఏపీ ఎస్పీడీసీఎల్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. భూమి అప్పగించకుండా తాము టెండర్లు ఎలా పిలుస్తామని పర్యాటక శాఖ అధికారి ఒకరు సందేహం వ్యక్తం చేశారు. అదంతా తాము చూసుకుంటామని, టెండర్ల ప్రక్రియకు సన్నాహాలు మొదలుపెట్టాలని ముఖ్యనేత స్పష్టం చేసినట్లు సమాచారం.


ఏదైనా ఉంటే పెద్దలతో మాట్లాడుకోండి
ముఖ్యనేత ఆదేశాలతో పర్యాటక శాఖ రంగంలోకి దిగింది. విద్యుత్తు సౌధ ప్రాంగణంలోని భూమిని శుక్రవారం సర్వే చేసింది. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. తమ సంస్థకు చెందిన భూమిని పర్యాటక శాఖ సర్వే చేయడమేమిటని ప్రశ్నించారు. ఆ భూమిని పర్యాటక శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఉంటే చూపించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే తాము సర్వే చేస్తున్నామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు ఏదైనా ఉంటే సచివాలయంలో పెద్దలతో మాట్లాడుకోవా లని, తమ సర్వేను అడ్డగించవద్దని తేల్చిచెప్పారు.

స్టార్‌ హోటల్‌పై చినబాబు మక్కువ
విజయవాడ ఏలూరు రోడ్డులోని గుణదలలో విద్యుత్తు సౌధ భవన ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణంలో దాదాపు 4.80 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. 1952 నుంచి అప్పటి రాష్ట్ర ఎలక్ట్రికల్‌ బోర్డు అధీనంలో ఈ భూమి ఉంటూ వచ్చింది. ఏపీఎస్‌ఈబీని విభజించిన తరువాత ఈ భూమిని ఏపీ ట్రాన్స్‌కో, సదరన్‌ డిస్కంలకు ఉమ్మడిగా కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా మార్కెట్‌ ధర రూ.40 కోట్లకు పైమాటే. ఆ లెక్కన మొత్తం భూమి మార్కెట్‌ విలువ దాదాపు రూ.200 కోట్లు. ఖాళీగా ఉన్న ఈ విలువైన భూమిపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న చినబాబు ఆ భూమిలో ఓ స్టార్‌ హోటల్‌ నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ముఖ్యనేత ఓ కార్పొరేట్‌ సంస్థ ముసుగులో చినబాబు స్టార్‌ హోటల్‌కు అడ్డంకుల్లేకుండా ఎత్తుగడ వేశారు.

ప్రైవేట్‌కు అప్పగిస్తే ట్రాన్స్‌కోకు తీవ్ర నష్టం
రాష్ట్ర విభజన అనంతరం మౌలిక వసతులు లేక ట్రాన్స్‌కో, ఏపీఎస్సీడీసీఎల్‌ సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగుల శిక్షణ కేంద్రం, ఆర్‌అండ్‌డీ కేంద్రం కూడా లేవు. విజయవాడలో నీటిపారుదల శాఖకు చెందిన స్థలంలో ఎస్పీడీసీఎల్‌ భవనం ఉంది. ఆ భవనాన్ని ఖాళీ చేయాలని నీటిపారుదల శాఖ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. విద్యుత్తు సౌధ ప్రాంగణంలోనే ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్‌లకు  భవనాలను నిర్మించాలని యోచిస్తున్నారు. కానీ, తమ సంస్థలకు చెందిన భూమిని ప్రైవేట్‌కు కట్టబెట్టడం ఏమిటని ట్రాన్స్‌కో, ఎస్పీ డీసీఎల్‌ అధికారులు, ఉద్యోగులు నిలదీస్తున్నారు. ట్రాన్స్‌కోకు నష్టాన్ని కలిగించే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ట్రాన్స్‌కో ఇంజనీర్ల అసోషియేషన్‌ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు,  సంఘ ప్రతినిధి కోటేశ్వరరావు డిమాండ్‌ చేస్తున్నారు.

సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం
‘‘ఈ భూమి ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్‌ ఉమ్మడి ఆస్తి. ఎస్పీడీసీఎల్‌కు సొంత భవనం లేదు. భవిష్యత్తులో ట్రాన్స్‌కో అవసరాలు పెరుగుతాయి. అప్పుడు మేము ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్లాలా? ట్రాన్స్‌కో చెందిన విలువైన ఆస్తిని ప్రైవేటుకు కట్టబెడతారా? ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం’’
– ఉదయ్‌కుమార్, ట్రాన్స్‌కో ఇంజనీర్ల సంఘం అదనపు కార్యదర్శి

http://www.sakshi.com/news/top-news/tourism-officials-are-starting-to-survey-on-land-scam-459493?pfrom=home-top-story

చేయని తప్పుకు రోజాకు 14 నెలలు శిక్షా?


చేయని తప్పుకు రోజాకు 14 నెలలు శిక్షా?
విజయవాడ: చేయని తప్పుకు ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి సస్పెండ్‌ చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. మహిళల సమస్యలపై నిలదీస్తున్న రోజా గొంతు నొక్కాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆమె శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త రాజధానిలో తెలుగుదేశం ప్రభుత్వం కొత్త సంప్రదాయాలకు తెర తీస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షానికి సభలో మాట్లాడటానికి అవకాశం ఇస్తుందని భావించాం. అయితే ప్రతిపక్ష నేతపై ఏ రకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తోందో గమనించే ఉంటారు. సమస్యలను లేవనెత్తితే...ఆ అంశాలను పక్కదాని పట్టించేందుకు ప్రభుత్వం వ్యక్తిగత దూషణలకు దిగుతోంది.

ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాదిపాటు సస్పెన్షన్‌ కొనసాగించాలని ప్రివిలేజ్‌ కమిటీ సిఫార్సు చేయడం దారుణం. చేయని తప్పుకు రోజా 14 నెలలు శిక్ష అనుభవించారు. మళ్లీ కొత్తగా ఎమ్మెల్యే అనిత అంశాన్ని తెరమీదకు తెచ్చి మరో ఏడాది సస్పెండ్‌ చేయాలని చూడటం దారుణం. రోజా చేసిన తప్పేంటి?. టీడీపీ సర్కార్‌ హయాంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, రితేశ్వరి ఆత్మహత్యం అంశం, కాల్‌మనీ  దారుణాలపై అసెంబ్లీ సాక్షిగా నిలదీశారనే కక్షపూరితంగా సస్పెండ్‌ చేశారు.
తాజాగా అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్‌ వర్గం ఓ మహిళపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ అంశాన్ని నిలదీసిందుకా? లేక విశాఖలో బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తామంటే అడ్డుకున్నందుకా రోజాను సస్పెండ్‌ చేసింది. రోజాను చూస్తే చంద్రబాబుకు ఎందుకంత భయం?. దళితల కోసం ఏనాడు పోరాటం చేయని అనితా ఈరోజు రాజకీయ మైలేజ్‌ కోసం రోజాను ఇరికిస్తున్నారు. హత్య చేసిన ఖూనీకోరుకు ఒకేసారి శిక్షవేస్తారు. అలాగే దోషికి శిక్ష విధించేటప్పుడు చివరి కోరిక అడుగుతారని... అలాంటిది ఏకపక్షంగా సస్పెన్షన్‌ చేసిన రోజాను... ప్రభుత్వం వివరణ అడగకపోవడం మహిళగా సిగ్గుపడుతున్నా. మహిళల పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు.’ అని అన్నారు.

రోజాపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?

Written By news on Friday, March 17, 2017 | 3/17/2017


రోజాపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
ఒంగోలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర జీడీపీ కంటే రాష్ట్ర జీడీపీ ఎక్కువగా ఉందని చెప్పడం, చంద్రబాబు దిగజారుడు మోసానికి నిదర్శనమన్నారు. 2018 నాటికి వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి... ఆ ప్రాజెక్ట్‌ పూర్తి అయ్యేందుకు రూ.2800 కోట్లు అవసరం ఉంటే... బడ్జెట్‌ లో మాత్రం రూ.200 కోట్లే కేటాయించారన్నారు.
బడ్జెట్‌ సాక్షిగా చంద్రబాబు ప్రత్యేక హోదాను సమాధి చేశారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాపై చంద్రబాబుకు ఎందుకంత వ్యక్తగత కక్ష అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రోజాను ఇప్పటికే ఏడాదిపాటు అసెంబ్లీకి దూరం చేసిన ప్రభుత్వం మరోసారి కుట్రకు తెర లేపుతోందని ఆయన అన్నారు. రోజా సస్పెన్షన్‌ పై న్యాయపోరాటం చేస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

కాగా ఎమ్మెల్యే రోజాను మరో ఏడాది పాటు ఏపీ శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయాలని శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రివిలేజ్‌ కమిటీ మార్చి 4న సమావేశమై రూపొందించిన నివేదికను గురువారం శాసనసభకు సమర్పించారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌పై అసెంబ్లీలో  ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినపుడు.. ఆమె ప్రవర్తనను తప్పు పడుతూ 2015, డిసెంబర్‌ 18న శాసనసభ నుంచి ప్రివిలేజ్‌ కమిటీకి పంపకుండానే నేరుగా సస్పెండ్‌ చేశారు.

ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్‌ జగన్‌


ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్‌ జగన్‌
జమ్మలమడుగు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. జమ్ములమడుగు పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ కూడా సాధారణ ఓటరులాగానే క్యూలో నిలబడి ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు జరుగుతున్న మూడు జిల్లాల్లోనూ (వైఎస్‌ఆర్‌ జిల్లా, నెల్లూరు, కర్నూలు) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ ఉందన్నారు. తమకు మెజార్టీ ఉన్న స్థానాల్లో టీడీపీ నేతలు పోటీ చేయడం సిగ్గుచేటు అని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.

టీడీపీకి బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పరిస్థితి కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. పార్టీ గుర్తుల మీద గెలిచిన తర్వాత కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి... అవహేళన చేయడం దారుణమన్నారు. జిల్లాలో 841మంది ఓటర్లు ఉంటే వారిలో 521మంది ఓటర్లు వైఎస్‌ఆర్‌ సీపీ గుర్తుపై గెలిచారన్నారు. ప్రలోభపెట్టి, భయపెట్టి ఓటు వేయించుకోవాలని చూడటం సరికాదన్నారు. పైన దేవుడు ఉన్నాడని, ప్రజల్లో ఇంకా అభిమానం, మంచితనం మిగిలే ఉందని వైఎస్‌ జగన్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు న్యాయమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బ్లాక్ లిస్టు అయిన కంపెనీలతో పనులు చేయిస్తున్నారు

Written By news on Thursday, March 16, 2017 | 3/16/2017




తొమ్మిదేళ్లలో ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదు

పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే
బ్లాక్ లిస్టు అయిన కంపెనీలతో పనులు చేయిస్తున్నారు
యనమల వియ్యంకుడు సహా అందరూ సబ్ కాంట్రాక్టర్లే
అసెంబ్లీలో కడిగేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

చంద్రబాబు నాయుడు ఇంతకుముందు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, అప్పట్లో ఈయన ఒక్క రూపాయి కూడా పోలవరం ప్రాజెక్టు మీద ఖర్చుపెట్టలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చంద్రబాబు ప్రసంగానికి స్పందనగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు స్పీచ్ వింటే, నిజంగా పోలవరం ప్రాజెక్టు ఆయన స్వప్నం అన్నట్లు అనిపిస్తుందన్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుకు ఖర్చయిన 8800 కోట్లలో 5540 కోట్లు చంద్రబాబు సీఎం కాకముందే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఖర్చయిందని తెలిపారు. ఆరోజు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదని, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం 172 కిలోమీటర్ల కుడికాల్వలో 144 కిలోమీటర్లు, ఎడమకాలువ 182 కిలోమీటర్లలో 135 కిలోమీటర్లు పూర్తిచేసిందని, ఆ ఘనత రాజశేఖరరెడ్డిదేనని అన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేసి మూడేళ్లవుతున్నా ఆయన 3300 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టడానికి సిగ్గుండాలని మండిపడ్డారు.

చంద్రబాబు పార్టీకి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ 110 కోట్ల పనులు మాత్రమే చేసి, తర్వాత బ్లాకౌట్ అయ్యిందని, అలాంటి కంపెనీని పక్కన పెట్టాల్సింది పోయి వాళ్లతోనే పనులు చేయిస్తూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడితో సహా అందరూ నామినేషన్ పద్ధతి మీద సబ్ కాంట్రాక్టుల పేరుతో ఇష్టం వచ్చిన వాళ్లకు ఇష్టం వచ్చినట్లు పనులు ఇస్తూ, ఖర్చును పెంచి చూపిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. పనులు ఇంత దారుణంగా జరుగుతున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతిచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు, తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా చేసిందని అన్నారు. నాటి సభలో కనీసం 148 మంది మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వం నిలబడని పరిస్థితి ఉన్నా, కిరణ్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు విప్ జారీ చేసి మరీ ఆయన ప్రభుత్వాన్ని కాపాడారన్నారు. ఆ విషయాన్ని ఆయన కన్వీనియెంట్‌గా మర్చిపోయారని తెలిపారు. ఇదే పోలవరం గురించి నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి కేంద్రం ఇచ్చేసిందని అంటున్నారని, కానీ అరుణ్ జైట్లీ ఇచ్చిన ప్రెస్‌నోట్‌లో.. రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు ఇచ్చినట్లు ఉందని గుర్తు చేశారు. ట్రాన్స్‌ట్రాయ్ బ్లాక్ లిస్టు అయిందని, బ్యాంకులు ఎన్‌పీఏ కింద దాని ఆస్తులు వేలం వేస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు దాన్ని తీసేసి కొత్త కాంట్రాక్టరును పిలిస్తే ప్రయోజనం ఉండేదని తెలిపారు. ఆ రోజుకు, ఈ రోజుకు  స్టీలు, సిమెంటు, డీజిల్ అన్ని ధరలూ తగ్గాయని తెలిపారు.

వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధం: వైఎస్‌ జగన్‌


వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధం: వైఎస్‌ జగన్‌
హైదరాబాద్‌ : గృహ నిర్మాణంపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి... ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోందని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. సభ పది నిమిషాలు వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం కాగానే గృహ నిర్మాణాలపై ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షా 35 వేల ఇళ్లు కట్టామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. రూరల్‌లో 44,895, అర్బన్‌ లో 2,687 ఇళ్లకు మాత్రమే మార్కింగ్‌ చేశారన్నారు.

ప్రభుత్వం లక్షా 35వేల ఇళ్ల కట్టామని చెబుతోందని, ఒక్కో ఇల్లుకు లక్షన్నర వేసుకున్నా రూ.6వేల కోట్లు కావాలని వైఎస్‌ జగన్‌ అన్నారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన నిధులు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా  హౌసింగ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మృణాళిని మాట్లాడుతూ  పది లక్షల ఇళ్లు పూర్తి చేయాలనుకుంటున్నామన్నారు. గృహ నిర్మాణ శాఖలో అవినీతి జరిగిందని, దానిపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో అవినీతిని అరికట్టేందుకు జియో ట్యాగింగ్‌ ను అమలు చేస్తున్నామన్నారు.

చంద్రబాబుదంతా అంకెల మాయ

Written By news on Wednesday, March 15, 2017 | 3/15/2017


చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌లో చూపించినదంతా అంకెల మాయేనని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
  • ఏపీ బడ్జెట్ సమావేశాలు చూసిన తర్వాత బడ్జెట్‌లో వీళ్లు చూపిస్తున్న లెక్కలు యావత్ ఆంధ్ర రాష్ట్రం ఆశ్చర్యపోయేలా ఉన్నాయి
  • ఈ బడ్జెట్‌లో చంద్రబాబు నాయుడు 2016-17కు సంబంధించి 11.61 శాతం వృద్ధిరేటు నమోదు కాబోతోందని అన్నారు
  • వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలన్నింటి అభివృద్ధితోనే మొత్తం వృద్ధిరేటు ముడిపడి ఉంటుంది
  • ఈ మూడు రంగాల్లో అభివృద్ధి కనిపిస్తే ముందుకెళ్లిందని, లేకపోతే తిరోగమనంలో ఉందని అంటారు
  • 2022, 29, 50 వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు కూడా చంద్రబాబు చూపించారు
  • అప్పటికి దేశంలో అత్యధికంగా వృద్ధిచెందిన రాష్ట్రం అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
  • ఈమధ్య కాలంలోనే ఐఎంఎఫ్ కొన్ని లెక్కలు విడుదల చేసింది. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సగటు జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతం అని, భారతదేశంలో 7.1 శాతం ఉందని చెప్పింది. దాని ప్రకారం దేశం బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పారు.
  • మరి ఆంధ్రప్రదేశ్ ఏకంగా 11.61 శాతం నమోదు చేసిందంటే ప్రపంచంలో ఇప్పటికే మనం నెంబర్ వన్ గా ఉన్నట్లు లెక్క
  • అలాంటప్పుడు 2020, 29, 50 వరకు లక్ష్యాలు పెట్టుకోవడం ఎందుకు?
  • బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేక హోదా గురించి కూడా చెప్పారు
  • ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం అభ్యంతరం చెప్పిందని అన్నారు, అందుకే దానికి సమానంగా ప్రత్యేక సాయం పొందామని కూడా తెలిపారు
  • 14వ ఆర్థిక సంఘం సభ్యులు డాక్టర్ గోవింద్ రావు, అభిజిత్ సేన్, చైర్మన్ వైవీ రెడ్డి లాంటివాళ్లు అసలు అలాంటి సిఫార్సులు ఏమీ చేయలేదని స్పష్టం చేశారు
  • రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకు, తమకు ఏమీ సంబంధం లేదన్నారు
  • రాయితీలకు సంబంధించి అవార్డు తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు
  • ఏపీ డిస్కంలకు 62.7 శాతం నష్టాలు పెరిగితే ఎవరైనా అవార్డు ఇస్తారా?
  • క్రిసిల్ రేటింగ్ గమనిస్తే డిస్కంలలో ఒకదానికి బి+ నుంచి బి కేటగిరీ వచ్చింది. మరో డిస్కంకు అలాగే రేటింగ్ ఉంది తప్ప పెరగలేదు
  • మరి ఇలాంటప్పుడు ఆయనకు ఐదు అవార్డులు ఎందుకు ఇస్తారు
  • శిథిలమైన భవనంలో చిన్న కిటికీ శుభ్రంగా ఉందని దానికి అవార్డు ఇచ్చినట్లు చంద్రబాబు చెబుతున్నారు
  • 2017-18కి సంబంధించి చంద్రబాబు 1.56 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు.. రాష్ట్రం విడిపోక ముందు 2013-14 చూసుకుంటే రెండు రాష్ట్రాలకు కలిపి మన బడ్జెట్ 1,40,742 కోట్లు.
  • తెలంగాణది, మనది కలిపితే మూడు లక్షల కోట్లకు పైగా బడ్జెట్లు ఉన్నాయి, అంత గొప్ప పాలన సాగుతోంది, అంత గొప్పగా అంకెలు చూపుతున్నారు
  • నిజంగా రెవెన్యూలు అంత అద్భుతంగా ఉన్నాయా అంటే, చంద్రబాబు కోర్ డాష్ బోర్డే చూద్దాం
  • అందులో ప్రభుత్వ ఆదాయాలు అన్నీ కలిపి 1,28,009 కోట్ల లక్ష్యం అయితే.. వచ్చింది మాత్రం 99,535 కోట్లు మాత్రమే.
  • ప్రభుత్వ వ్యయం చూస్తే.. 1,35,688 కోట్ల బడ్జెట్ కు గాను ఇప్పటివరకు 1,16,812కోట్లు మాత్రమే.
  • 2016 డిసెంబర్ 31 నాటికే 30,953 కోట్ల అప్పులు తెచ్చుకున్నారు. కానీ వాస్తవానికి ఎఫ్ఆర్‌బీఎం పరిమితి ప్రకారం 20 వేల కోట్లకు మించి అప్పు తెచ్చుకోడానికి వీల్లేదు
  • దీనిపై కేంద్రం చీవాట్లు పెట్టిందో ఏమో తెలియదు గానీ, చంద్రబాబు ఈ విధంగా అప్పులు చేస్తున్నారు
  • ఆర్‌బీఐ నిబంధనలు ఉంటాయి కాబట్టి పెన్షనర్ల సొమ్ములను అత్తగారి సొమ్ము అన్నట్లుగా తీసేసుకుంటున్నారు
  • ఇది రొటీన్‌గా జరుగుతోంది, చాలా ప్రమాదకరమైనది
  • నిబంధనల ప్రకారం 3 శాతానికి మించి అప్పు తీసుకోకూడదంటే 5 శాతానికి పైగా చేస్తున్నారు
  • ఇలా ఆర్థిక క్రమశిక్షణను పూర్తిగా ఉల్లంఘించారు
 

ఏపీ బడ్జెట్‌ హైలైట్స్‌ 2017-18


అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలకు ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులతోనే సరిపెట్టింది. రుణమాఫీకి మొండిచేయి చూపించి కేవలం 3600 కోట్లు కేటాయించింది. నిరుద్యోగ భృతిపై యువత పెట్టుకున్న ఆశలను ప్రభుత్వం మరోసారి వమ్ము చేసింది. నిరుద్యోగ భృతి అని కాకుండా.. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం పేరుతో కేవలం రూ. 500 కోట్లు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. బుధవారం శాసనసభలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌(2017-18)లోని ముఖ్యాంశాలను ఒకసారి చూస్తే..



బడ్జెట్‌ హైలైట్స్‌
 మొత్తం బడ్జెట్‌ రూ. 1,56,999 కోట్లు
► రెవిన్యూ వ్యయం రూ. 1,25,911 కోట్లు
► పెట్టుబడి వ్యయం రూ. 31,087 కోట్లు

► వ్యవసాయ రంగానికి రూ. 9,090 కోట్లు
► గ్రామీణాభివృద్ధికి రూ. 19,565 కోట్లు
► సాగునీటి రంగానికి రూ. 12,770 కోట్లు
► విద్యుత్ రంగానికి రూ. 4,274 కోట్లు

► పరిశ్రమలు, గనులకు రూ. 2,085 కోట్లు
► రవాణా శాఖకు రూ. 3,946 కోట్లు
► జనరల్‌ ఇకో సర్వీసెస్‌కు రూ 4,813 కోట్లు

విద్యారంగానికి రూ. 20,384 కోట్లు
క్రీడలు, యువజన శాఖకు రూ. 1,005 కో్ట్లు
► సాంకేతిక విద్యకు రూ. 765 కోట్లు
► ఆరోగ్యశాఖకు రూ. 7,020 కోట్లు

► నీటిపారుదల, పారిశుద్ధ్య రంగానికి రూ. 1,575 కోట్లు
►  హౌసింగ్‌ శాఖకు రూ. 1,456 కోట్లు
►  పట్టణాభివృద్ధి శాఖకు రూ. 5,207 కోట్లు
►  సంక్షేమ రంగానికి రూ. 11,361 కోట్లు
►  రుణమాఫీకి రూ. 3,600 కోట్లు

► హోంశాఖకు రూ. 5,221 కోట్లు
► రహదారులు, భవనాల శాఖకు రూ. 4041 కోట్లు
► నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం కోసం రూ. 500 కోట్లు.
► రాజధాని అభివృద్ధికి రూ. 1,061 కోట్లు
► ఐటీ శాఖకు రూ. 364 కోట్లు


► పౌరసరఫరాల శాఖకు రూ. 2,800 కోట్లు
► పింఛన్లకు రూ. 4,376 కోట్లు
► నిరుపేదల విద్యుత్‌ సబ్సిడీకి రూ. 3,300 కోట్లు
► ఆరోగ్య శ్రీకి రూ 1000 కోట్లు
► ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ. 3,528 కోట్లు

► గ్రామీణ రహదారులకు రూ. 262 కోట్లు
► డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి కింద రూ. 1,600 కోట్లు
► అన్నా క్యాంటీన్లకు రూ. 200 కోట్లు
► మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 100 కోట్లు

► కాపు కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు
► బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 75 కోట్లు
► క్రైస్తవ కార్పొరేషన్‌కు రూ. 35 కోట్లు
► ఎన్టీఆర్‌ సుజల స్రవంతికి రూ. 100 కోట్లు
► ఎన్టీఆర్‌ వైద్య సేవకు రూ. 100 కోట్లు

► సాంస్కృతిక శాఖకు రూ. 78 కోట్లు
► స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 17,073 కోట్లు
► వికలాంగుల సంక్షేమానికి రూ. 90 కోట్లు
► ఎల్‌పీజీ కనెక్షన్లకు రూ. 350 కోట్లు
► మత్స్యశాఖకు రూ. 282 కోట్లు

► విశాఖ, కాకినాడ, తిరుపతి అభివృద్ధికి రూ. 450 కోట్లు
► షాదీఖానాలకు రూ. 1500 కోట్లు
► వరద నివారణకు రూ. 700 కోట్లు
► పర్యావరణ శాఖకు రూ. 4,813 కోట్లు
► పశుగణాభివృద్ధికి రూ. 1,112 కోట్లు

► పన్నుల ఆదాయం రూ. 82,855 కోట్లుగా అంచనా
► బడ్జెట్‌లో కేంద్ర పన్నుల వాటా రూ. 29,138 కోట్లు
► బడ్జెట్‌లో రాష్ట్ర పన్నుల వాటా రూ. 53,717 కోట్లు
► పన్నేతర ఆదాయం రూ. 5,092 కోట్లు
► కేంద్రం ఇచ్చే నిధుల అంచనా రూ. 37,548 కోట్లు
► ఎక్సైజ్‌ ఆదాయం రూ. 5,886 కోట్లు
► సేల్స్‌ ట్యాక్స్‌ ఆదాయం రూ. 39,321 కోట్లు

ఆలయ భూములకు రక్షణ ఏదీ?


ఆలయ భూములకు రక్షణ ఏదీ?
అమరావతి: రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందిన భూములు కబ్జాలకు గురవుతున్నాయని అసెంబ్లీలో మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో బుధవారం ఉదయం ప్రశ్నోత‍్తరాల సమయంలో దేవాలయ భూముల అన్యాక్రాంతంపై ఆయన మాట్లాడారు. 
 
రాజకీయ నేతలు, ప్రైవేటు వ్యక్తులు దేవాలయ భూములను కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీటి పరిరక్షణకు బడ్జెట్‌లో నిధులు సరిగా కేటాయించడం లేదని, ఇలా అయితే వాటి పరిరక్షణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు గారికి దేవాదాయ ఆస్తులను కాపాడలనే చిత్తశుద్ధి ఉంటే వాటి పరిరక్షణకు బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
 

ఎకరం రూ. 70 కోట్లు విలువ చేసే భూములను...


‘అదిగో చార్మినార్.. ఇదిగో సేల్ సర్టిఫికెట్’
అమరావతి: దేవాదాయ భూములను ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అక్రమంగా కట్టబెట్టిందని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎకరం రూ. 70 కోట్లు విలువ చేసే భూములను సిద్ధార్థ విద్యాసంస్థకు కారు చౌకగా ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. ఎకరా లక్షన్నరకు లీజుకు రాటిఫై చేయడం ధర్మమేనా అని అడిగారు. 2006లో ప్రభుత్వం లీజును రద్దు చేసిందని, దీన్ని 2010లో హైకోర్టు సమర్థించిందని వెల్లడించారు. 10 శాతం మార్కెట్ విలువ ప్రకారం ఇస్తే లీజుకు ఇస్తే ఫర్వాలేదన్నారు. ఎకరా రూ. 7 కోట్లకు లీజుకు ఇస్తే ఆక్షేపణ ఉండదని చెప్పారు.

సదావర్తి భూముల విషయంలోనూ ప్రభుత్వం ఇదే వ్యవహరించిందని ఆరోపించారు. అన్యాక్రాంతం కాని 83 ఎకరాల భూములను ఎకరా రూ. 22 లక్షలకు అమ్మేసిందని దుయ్యబట్టారు. మార్కెట్ ధర రూ. 7 కోట్లు ఉంటే రూ. 22 లక్షలకు అమ్మడం సరికాదని దేవాదాయ ప్రాంతీయ కమిషనర్ రాసిన లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదు. సదావర్తి భూములను అప్పనంగా కట్టబెట్టడంపై కోర్టును ఆశ్రయిస్తే విచిత్రమైన సమాధానం ఇచ్చారు. ఎకరాకు రూ. 22 లక్షల కంటే ఎక్కువ ఇస్తే రిజిస్ట్రేషన్ చేయబోమని, సేల్ సర్టిఫికెట్ మాత్రమే ఇస్తామని టీడీపీ సర్కారు చెప్పింది. అదిగో చార్మినార్.. ఇదిగో సేల్ సర్టిఫికెట్ అన్నట్టుగా ప్రభుత్వ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. సదావర్తి భూముల పాపం కచ్చితంగా చంద్రబాబుకు తగులుతుందని వైఎస్ జగన్ అన్నారు.

భూమా చనిపోయాక బాబుకు గుర్తుకొచ్చాయా?

Written By news on Tuesday, March 14, 2017 | 3/14/2017


భూమా చనిపోయాక బాబుకు గుర్తుకొచ్చాయా?
విజయవాడ : మహాభారతంలో దుర్యోధనుడి మరణానికి శకుని కారణమైతే ...నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడే అని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ బతికున్నంతకాలం నాగిరెడ్డిని చంద్రబాబు పట్టించుకోలేదని, ఆయన చనిపోయిన తర్వాత మాత్రం కర్నూలు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మనిషిని పోగొట్టుకున్నాక చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. భూమా కోరిక అంటూ ఇప్పుడేమో నంద్యాల అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తండ్రి అంత్యక్రియల జరిగి 24 గంటలు గడవకముందే అఖిలప్రియను చంద్రబాబు అసెంబ్లీకి తీసుకు వచ్చారన్నారు. ఈ ఘటన చూస్తుంటే ఆయనకు మానవత్వం ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు.

భూమా నాగిరెడ్డికి సానుభూతి తెలపాల్సిన సభలో వైఎస్‌ జగన్‌ ను టార్గెట్‌ చేసుకుని మాట్లాడటం ఎంతవరకూ సమంజసమని ఎమ్మెల్యే నారాయణస్వామి ప్రశ్నించారు. సంతాప తీర్మానానికి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రాలేదంటూ, దుర్మార్గులంతూ సభ ద్వారా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ విలువైన సమాయాన్ని దుర్వినియోగం చేశారన్నారు. శకునిలాంటి చంద్రబాబును కాపాడేందుకు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారన్నారు.
వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో వైఎస్‌ జగన్‌ను తిట్టించారన్నారు.  తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌పై వైస్రాయ్‌ హోటల్‌ సాక్షిగా చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుది అని ఎమ్మెల్యే నారాయణస్వామి ధ్వజమెత్తారు. మంత్రి పదవి ఆశచూపి.... సంవత్సరం అయినా ఇవ్వకుండా భూమాను మానసిక క్షోభకు గురిచేసి ఆయన మృతికి చంద్రబాబే కారణమని అందరికీ తెలుసని నారాయణస్వామి అన్నారు.

ఏ కుటుంబాన్ని ఆదరించని విధంగా జగన్ ఆదరించారు


'నంద్యాల సీటు వైఎస్సార్ సీపీదే'
అమరావతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని వైఎస్సార్ సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే  వై. విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రెండేళ్లలో వ్యవధిలో శోభా నాగిరెడ్డి, ఆమె భర్త మరణించడం కలచివేసిందని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

భూమా కుటుంబం పడుతున్న బాధలో పాలుపంచుకుంటామని చెప్పారు. అసెంబ్లీలో సంతాపం పేరిట వైఎస్ జగన్ ను, వైఎస్సార్ సీపీని విమర్శించి వివాదస్పదం చేశారని తెలిపారు. తమ పార్టీకి భూమా అందించిన సేవల పట్ల గౌరవం ఉంది కాబట్టే ఏ కుటుంబాన్ని ఆదరించని విధంగా జగన్ ఆదరించారని గుర్తు చేశారు. భూమా కుటుంబానికి మూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించారని, నాగిరెడ్డికి పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారని తెలిపారు. శోభా నాగిరెడ్డి మరణించినప్పుడు జగన్, వారి కుటుంబం అందరికంటే ఎక్కువ బాధ పడిందని గుర్తు చేశారు.

ఏ సంస్కారంతో చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ఏ సంస్కారం ఉందని  ఫిరాయింపు ఎమ్మెల్యేలతో జగన్ పై విమర్శలు చేయిస్తున్నారని నిలదీశారు. నైతికత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు, టీడీపీకి లేదన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు, స్పీకర్‌ దగ్గర పోరాటం చేస్తున్నామని తెలిపారు. నంద్యాల సీటు వైఎస్సార్ సీపీదేనని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

భూమాను మోసం చేసినవారితో పాల్గొనకూడదనే


‘భూమాను మోసం చేసినవారితో పాల్గొనకూడదనే’
విజయవాడ: ఎమ్మెల్యే భూమా నాగిరెడ‍్డి ఆకస్మిక మరణం బాధాకరమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. అయితే ఏపీ అసెంబ్లీలో భూమా నాగిరెడ్డి సంతాప తీర్మాన కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ సీపీ పాల్గొనట్లేదని పార్టీ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంగళవారమిక్కడ తెలిపారు.  తమ పార్టీలో ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డికి పీఏసీ చైర్మన్‌ గా కేబినెట్‌ హోదా పదవి ఇచ్చి గౌరవంగా చూసుకున్నామన్నారు.
అయితే చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఆశ చూపి... ఇవ్వకపోవడం వల్లే మనస్థాపానికి గురై ఆ క్షోభతోనే ఆయన మరణించారన్నారు. భూమాను మోసం చేసిన వారితో కలిసి సంతాప కార్యక్రమ తీర్మానంలో పాల్గొనకూడదని తమ పార్టీ నిర్ణయించిందన్నారు. మానసిక క్షోభకు గురి చేయడం చంద్రబాబుకు అలవాటేనని, గతంలో ఎన్టీఆర్‌ ను, ఇప్పుడు భూమా నాగిరెడ్డికి అలాగే చేశారన్నారు. టీడీపీలో చేరిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉందని అన్నారు.

వైఎస్సార్సీపీ కీలక నియామకాలు

Written By news on Monday, March 13, 2017 | 3/13/2017


హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ప్రకటించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ‍్యక్షుడు డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌రెడ్డి 23 మంది అసెంబ్లీ కో-ఆర్డినేటర్లను నియమించారు. వీరితో పాటు పది జిల్లాలకు ఇన్‌చార్జీలు, ఐదు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు,  రాష్ట్ర పార్టీలో పలువురు కార్యదర్శులు, అధికార ప్రతినిధులను నియమించారు.
 
శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్తలు వీరే
డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌రెడ్డి (హుజుర్‌నగర్‌), జి.శ్రీధర్‌రెడ్డి (సంగారెడ్డి), మందడి సరోజ్‌రెడ్డి(దేవరకద్ర), డాక్టర్‌ నగేష్‌ (కరీంనగర్‌), అప్పం కిషన్‌ (భూపాలపల్లి), బీస మరియమ్మ (జడ్చర్ల), జెట్టి రాజశేఖర్‌ (అలంపూర్‌), ఇరుగు సునీల్‌కుమార్‌ (నకిరేకల్‌), సంగాల ఇర్మియా (వర్థన్నపేట), నాయుడు ప్రకాష్‌ (నిజామాబాద్‌), బి.అనిల్‌కుమార్‌ (ఆదిలాబాద్‌), వి.సతీష్‌ (మంచిర్యాల), బి.సంజీవరావు (ఆంథోల్‌), జి.రాంభూపాల్‌రెడ్డి (కొల్లాపూర్‌), ఎం.భగవంతురెడ్డి (నాగర్‌కర్నూలు), ఎం.విష్ణువర్థన్‌రెడ్డి (వనపర్తి), నాడెం శాంతికుమార్‌ (నర్సన్నపేట్‌), లక్కినేని సుధీర్‌బాబు (ఖమ్మం), బొబ్బిలి సుధాకరరెడ్డి (షాద్‌నగర్‌), సెగ్గం రాజేశ్‌ (మంథని), వెల్లాల రామ్మోహన్‌ (సనత్‌నగర్‌), కొండా రాఘవరెడ్డి (రాజేంద్రనగర్‌), డా.​‍ప్రఫుల్లారెడ్డి (జూబ్లీహిల్స్‌).
 
జిల్లాల ఇన్‌చార్జీలు
రాష్ట్ర పార్టీలోని పలువురు నాయకులను ఆయా జిల్లాలకు ఇన్‌చార్జీలుగా నియమించారు. వారు.. జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి (నల్లగొండ), మతిన్‌ ముజాదుద్దీన్‌ (మహబూబ్‌నగర్‌), కె.శివకుమార్‌ (రంగారెడ్డి), జి.రాంభూపాల్‌రెడ్డి (హైదరాబాద్‌), కొండా రాఘవరెడ్డి (నిజామాబాద్‌), నర్ర భిక్షపతి (ఆదిలాబాద్‌), బి.శ్రీనివాసరావు (కరీంనగర్‌), వేముల శేఖర్‌రెడ్డి (వరంగల్‌), డాక్టర్‌ ప్రఫుల్లారెడ్డి (ఖమ్మం), వెల్లాల రామ్మోహన్‌ (మెదక్‌).
 
ఐదు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు
గతంలోనే పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించగా, తాజాగా మరో ఐదు జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. మునగాల కళ్యాణిరాజ్‌ (జనగాం), బి.సంజీవరావు (మెదక్‌), కొళ్ల యాదయ్య (వికారాబాద్‌),  అతిక్‌ రెహామాన్‌ (గద్వాల), వొడ్లోజు వెంకటేష్‌ (యాదాద్రి).
 
రాష్ట్ర  కమిటీ
పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా జెట్టి రాజశేఖర్‌, ఇ. అవినాష్‌గౌడ్‌, సంయుక్త కార్యదర్శిగా డి.వేణుమాధవ్‌రావు, అధికార ప్రతినిధులుగా జె.మహేందర్‌రెడ్డి, మతిన్‌ ముజాదుద్దీన్‌, జి.రాంభూపాల్‌రెడ్డి, నర్ర భిక్షపతిలను నియమించారు.
 
అధికార ప్రతినిధులు
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా జే మహేందర్‌ రెడ్డి, మతిన్‌ముజాదుద్దీన్‌, జీ రాంభూపాల్‌ రెడ్డి, నర్ర భిక్షపతిలను నియమించారు.

నేడు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం

Written By news on Sunday, March 12, 2017 | 3/12/2017


నేడు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం
⇒ కేంద్ర కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు..
⇒ ఉదయం 10 గంటలకు పతాకావిష్కరణ


సాక్షి, హైదరాబాద్‌: ఆరేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం ఏడో సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి.

జిల్లా, మండల కేంద్రాల్లో....
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున భాగస్వాములై ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

Popular Posts

Topics :