09 June 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ప్రజల ఆశలన్నీ జగన్‌పైనే: గ్రంధి శ్రీనివాస్

Written By news on Saturday, June 15, 2013 | 6/15/2013

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రజలు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం ఖాయమని భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన శనివారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. ఈ సందర్భంగా జైలు వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చగలడని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు.

మహానేత చేపట్టిన సంక్షేమ పథకాలు తిరిగి జగన్ నాయకత్వంలో ప్రజలకు నేరుగా అందుతాయన్నారు. దర్యాప్తు పేరుతో నెలల తరబడి జైల్లో పెట్టడం సరికాదన్నారు. చార్జిషీట్లను అడ్డుపెట్టుకొని ఎన్నికల వరకు జగన్‌ను జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆకాంక్ష మేరకు జగన్ త్వరలో నిర్దోషిగా విడుదలవుతారన్నారు. జగన్‌ను కలిసిన వారిలో ఆదిలాబాద్ మాజీ ఎంపీ ఇంద్రకిరణ్‌రెడ్డి కూడా ఉన్నారు.
గుంటూరు: ఈ ప్రభుత్వంలో కరెంట్‌ను కాదు బిల్లు పట్టుకుంటేనే షాక్‌ కొడుతోందని వైఎస్‌ఆర్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. 2014లో ఓటమితో చంద్రబాబు మూడో హ్యాట్రిక్‌ సాధించబోతున్నాడని చెప్పారు. 

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. పత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత, జంగా కృష్ణమూర్తి, మర్రి రాజశేఖర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్‌గా స్వర్ణ

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకాశం జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్‌గా స్వర్ణ రవీంద్రబాబును నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రవీంద్రను నియమించినట్లు పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

వైఎస్ఆర్‌సీపీలోకి బాల్కొండ మాజీ జడ్పీటీసీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మాజీ జడ్పీటీసీ గంగాధర్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వైఎస్ఆర్‌సీపీలో చేరారు. బాల్కొండ మండలం పోచంపాడులో వైఎస్ఆర్‌సీపీ నియోజకవర్గ సమావేశం సందర్భంగా వీరు పార్టీలో చేరారు. - 

Sharmila's speech in Pithapuram, EGDT


స్థానిక ఎన్నికలంటే కాంగ్రెస్‌, టీడీపీలకు భయం పట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం చూసి ఈ రెండు పార్టీలకు నిద్దర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కుతంత్రాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచేందుకు వెనుకాడడం లేదన్నారు. సీఎం, విపక్ష నేత జిల్లాల్లో భారీగా బీసీ రిజర్వేషన్లు తగ్గించారని తెలిపారు. 

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా పిఠాపురం ఉప్పాడ సెంటర్ లో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. కిరణ్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని విమర్శించారు. చిరంజీవిలా చంద్రబాబు కూడా తన పార్టీని కాంగ్రెస్‌కు రాసిచ్చారని అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చకుండా చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. జగనన్న బయట ఉంటే తమ దుకాణాలు మూసుకోవాల్సివస్తుందనే భయంతో టీడీపీ, కాంగ్రెస్ కుట్రలకు పాల్పడ్డాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని ప్రజలను షర్మిల కోరారు.


వరంగల్ లో వైయస్సార్ సి‌పి హవాhttp://www.tupaki.com/news/view/Varangal-/28049

తెలంగాణ లోనూ జగన్ కి అదే కలిసోస్తుంది

http://www.tupaki.com/news/view/Jagan/28048

Godavari Gattuna 15th June 2013

మాకున్న ఏకైక ఆశ... జగనన్న

 రాజకీయ నాయకుడు ఇన్ని మంచి పనులు చేయొచ్చా అని తెలిసొచ్చింది. ఒక ఇంటిపెద్దగా, ఒక ‘మనసున్న మారాజు’లా ఆయన ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరిచారు. అంతా బాగుంది అని ఊపిరి పీల్చుకునేలోపు ఆంధ్రప్రదేశ్‌ని కంటతడి పెట్టించే దుర్వార్త. దేవుడు కనపడితే ఇప్పటికీ ఒకటే అడుగుతాను.

‘‘ఆకలేస్తే రాజన్న ఇంత అన్నం పెట్టాడు, అది తప్పా? మా గుండె జబ్బున పడితే ఉచితంగా ఆపరేషన్లు చేయించాడు, అది తప్పా? పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించాడు, అది తప్పా? ఇంకా ఎన్నో పథకాలు పెట్టి పేదవారి కళ్లలో ఆనందం చూడాలనుకున్నారు. అదే ఆయన చేసిన తప్పా? మంచి మనుషులు కరువైన ఈ ప్రపంచంలో మాకు ఇన్ని మంచి పనులు చేసిన ‘మా దేవుణ్ని ఎందుకు తీసుకెళ్లావ్ దేవుడా?’’ అని అడుగుతాను. కుట్రలు, కుతంత్రాలతో నిండిపోయిన ప్రస్తుత రాజకీయాలలో సామాన్యుడిని పట్టించుకునేవారే లేరు. మాకున్న ఒకే ఒక్క ఆశ ‘జగనన్న’. కచ్చితంగా రాజన్న ఆత్మ జగనన్నలో ఉంది. 

అందుకే రాత్రి పగలు, ఎండ వాన, తుఫానులు తేడా లేకుండా ఓదార్పు యాత్రలు, దీక్షలు చేశాడు. అందుకే ‘అత్యంత శక్తిమంతమైన వ్యక్తులలో ఒకరు’గా చోటు సంపాదించాడు. అది జగన్‌కే సాధ్యమైంది. ఆయన చిరునవ్వే మాకు కొండంత బలం. ఇప్పుడు రాజన్నని అభిమానించే ప్రతి ఒక్కరూ చేయాల్సింది షర్మిలమ్మ అడుగులతో అడుగు కలిపి 2014లో జగనన్నని సీఎంని చేసి, మంచి మనుషుల్ని, మనసున్న మనుషుల్ని కాపాడుకోవడం.

- గోపు మల్లికార్జున్‌రెడ్డి, చిన్న ఓబినేనిపల్లి, ప్రకాశం జిల్లా

వజ్రాయుధం సిద్ధంగా ఉంది!

మన ప్రియతమ నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్నా, ఆయన తనయుడు జగన్ అన్నా మాకెంతో అభిమానం. అందుకే మేము సీబీఐవాళ్లకి, టీడీపీ నాయకులకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఏదో చేసేద్దాం అని వీరంతా మా జగన్‌బాబును నానా ఇబ్బందులు పెడుతూ నిర్బంధించారు. అయితే, వారికి తెలిసో తెలీకో ముడి వజ్రాన్ని సానబెట్టినట్లుగా మా జగన్‌ను మిరుమిట్లుగొలిపే వజ్రంలా... కాదు కాదు.. వజ్రాయుధంలా మార్చేశారు. ‘వజ్రాయుధం’ అతి త్వరలో బయటకు వచ్చి, వీరందర్నీ తుత్తునియల్ని చేసి, బంగాళాఖాతంలో కలిపేస్తుంది.

అప్పుడు మన రాష్ట్రానికి, దేశానికి పట్టిన చీడ వదులుతుంది. ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా మేమంతా ఎదురుచూస్తున్నాం. మొన్నటికి మొన్న చంద్రబాబు తిరుపతి వెళ్లి వెంకన్నబాబును ప్రార్థించాడట అవినీతిని అంతమొందించమని! ఆ ఏడుకొండలవాడు ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడో! ఎందుకంటే, అవినీతి, నమ్మకద్రోహం, మోసం, దుర్మార్గం వీటన్నింటి ప్రతిరూపం చంద్రబాబే. భస్మాసురుడు వరం కోరినప్పుడు ఆ పరమేశ్వరుడు కూడా ఇలాగే ఆశ్చర్యపోయి ఉంటాడు. ‘తన గొయ్యి తనే తవ్వుకుంటున్నాడని, తన అంతం తానే కోరుకుంటున్నాడని. ఏది ఏమైనా అతి త్వరలో జగన్ బయటకొచ్చి ఈ చెత్త బ్యాచ్‌కి మోక్షం ప్రసాదించి, మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంచి పాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 

- పెదపాటి సూర్యప్రకాశరావు, వరలక్ష్మి, అగనంపూడి, విశాఖ

వైఎస్‌ఆర్‌సిపి ప్రాంతీయ సదస్సు సక్సెస్

http://andhrabhoomi.net/content/vijayamma-4

స్థానిక సంస్ధల ఎన్నికల నేపధ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రతినిధులతో శుక్రవారం తిరుపతి పిఎల్‌ఆల్ కనె్వన్షన్‌హాల్లో నిర్వహించిన సదస్సు సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సదస్సు సందర్భంగా పార్టీ గౌరవాధ్యక్షుడు వైఎస్ విజయమ్మ వైఎస్ మరణం నుండి ప్రతి అంశాన్ని ప్రతినిధుల దృష్టికి తీసుకువస్తూ సుమారు గంటకుపైగా అరళంగా ప్రసంగించి క్యాడర్‌లో జోష్ నింపారు. రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్ విజయమ్మ దిగినప్పటి నుండి తిరుపతి బయలుదేరే వరకూ ఆమె వెంట క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొన్నది. రేణిగుంట విమానాశ్రయం నుండి నేరుగా పద్మావతిపురంలోని తిరుపతి ఎమ్మెల్యే, ఆపార్టీ కేంద్ర కమిటి సభ్యులు భూమన్ కరుణాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన విజయమ్మ అక్కడ అల్పాహారం తీసుకున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు పిఎల్‌ఆర్ కనెక్షన్‌హాలుకు చేరుకున్నది. సుమారు 10 వేల మందికిపైగా ప్రతినిదులు పాల్గొన్న ఈ సభలో విజయమ్మకు ఘన స్వాగతం పలికారు. ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఆమె సదస్సును ప్రారంభించారు. రాయలసీమ కో- ఆర్డినేటర్ భూమానాగిరెడ్డి పర్యవేక్షణలో భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో ఉద్వేగానికి లోనైన అనేకమంది కార్యకర్తలు వైఎస్‌ఆర్ అమర్హ్రే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ న్యాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, భూమానాగిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, రైల్వే కోడూరు మాజి ఎమ్మెల్యే శ్రీనివాసులు, రాయచోట మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమర్‌నాధ్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డిలు ప్రసంగిస్తూ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి కార్యకర్తపైనా వుందని, లేని ఫక్షంలో రాష్ట్రంలోని పేద ప్రజానీకం కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు రాజకీయాలతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని నొక్కివక్కాణించారు. జూపూడి ప్రసంగిస్తున్నంత సమయం సభలో నిశబ్ధవాతావరణం నెలకొన్నది. అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్ ఒక చరిత్రకారుడని ఆయన పాలన ఒక్క జగన్ వల్లే సాధ్యమంటూ క్యాడర్‌లో జోస్ నింపాడు. ఇక తిరుపతికి చెందిన ఎస్‌కెబాబు, హనుమంతనాయక్, అనంతపురంకు చెందిన ఉష, పీలేరుకు చెందిన మదుసూదన్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. రాయచోటికి చెందిన నిషార్ అనే వ్యక్తి మాట్లాడుతూ రాయచోటిలో ఓటు అంటే ఏమిటో తెలియని వారందరికి 1984లోనే ఓట్లు రాయించి ధైర్యంగా ఓట్లు వేయించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. వైఎస్ స్టైల్లో చేతులు ఊపుతూ ఆయనకు చేసిన అభివృద్దిని కొనియాడుతూ రాజన్న రాజ్యం కోసం తమ ప్రాణాలైనా ఇస్తామంటూ సభికులను ఉత్సాహపరిచారు

బాబు మనస్తత్వం -1 , బాబు మనస్తత్వం -2

బాబు పచ్చి అవకాశవాది.

బాబు 1978 లో కాంగ్రెస్ MLA  గా మొదటిసారి గెలిచాడు  , కాంగ్రెస్ మంత్రి పదవి ఇచ్చింది.
1982 లో ఎన్టీఆర్ పార్టీ పెడుతున్న రా అల్లుడు అని కబురు పంపితే తిరస్కరించాడు, మంత్రి పదవి లో ఉన్న కాంగ్రెస్ ను వదలలేక.

పైగా ముకానికి రంగులేసుకోనేవాడికి, తైతక్కలాదెవల్లకి  ఎవరు వోట్లేస్తారు?
ఎన్టీఆర్ పరమ పిసినారి, ఎన్నికలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది, పార్టీ ని నడపలేదు అని చెప్పాడు.
కాంగ్రెస్ ఆదేశిస్తే మామ ఎన్టీఆర్ మీదే పోటీచేసి ఓడిస్తానంటూ బీరాలు పలికాడు.

సరే తర్వాత , 1983 లో ఎన్టీఆర్ తీదీపి పార్టీ మంచి మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది.

వెంటనే అంటే పట్టుమని 10 రోజులు కూడా లేకుండా తీదీపి లో చేరాడు బాబు.

పోనీ అక్కడన్నా పద్దతిగా ఉన్నాడా అంటే లేదు తనకంటూ ఒక గ్రూప్ ఏర్పాటుచేసుకోని ఎన్టీఆర్ ను రామోజీ సహాయముతో వెన్నుపోటు పొడిచి CM అయ్యాడు, ఎన్టీఆర్ బ్యాంకులో దాచుకొన్న 70 లక్షల రూపాయల కాష్ కూడా తీసేసుకొని ఎన్టీఆర్ ను మానసికంగా హింసించి అయన మరణానికి కారణమయ్యాడు. అసహ్య్హకరమైన  విషయమేమిటంటే బాబు తన MLA  లచే ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించాడు వైస్రాయ్ హోటల్ దగ్గర.నందమూరి  వంశం అని మీసాలు మెలేసి తొడలు కొట్టే పుత్రులు ఏమి చేసారు మరి అని మాత్రం అడక్కండి.

 

తర్వాత ఇండియా టుడే కిచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ లో నైతిక విలువలు లేవి అన్నాడు  , తను అధికారం లో ఉన్నంత కాలం ఎన్టీఆర్ ఫోటో కూడా ఉండటానికి లేదు అని పార్టీ కి ఆదేశించాడు.

బాబు CM  గా ఉన్నప్పుడు తీదీపి మద్దతు మెడ ఆధారపడ్డ NDA కేంద్రములో అధికారం లో ఉంది అప్పుడు స్పీకర్ గా తీదీపి  కి చెందిన బాలయోగి ఎన్టీఆర్ విగ్రహము పార్లమెంటులో పెట్టమని అనుమతి ఇచ్చాడు కానీ బాబు పట్టించుకోలేదు.

2004 ఎన్నికలలో ఓడిపోయాక బాబు బొమ్మకు వోట్లు పడవని గ్రహించి ఎన్టీఆర్ ఆదర్శ పురుషుడు, యుగపురుషుడు , కారణ జన్ముడు అని , NTR విగ్రహము పార్లమెంటు లో పెట్టాలి అని, భారత రత్న ఇవ్వాలి అని మొసలి కన్నీరు కార్చాడు .ఎందుకు?

బాబు CM  గా ఉన్నప్పుడు మేనరిక వివాహాలు చేసుకోకూడదు, పిల్లలు పుడితే జబ్బులతో పుడతరి అని చెప్పాడు.డాక్టర్ లు కూడా ఇదే చెబుతారు.
మరి 2004 ఓడిపోయాక బాబు తనకోడుక్కి బాలయ్య కూతుర్ని ఇచ్చి మేనరిక వివాహం చేసాడు కదా ఎందుకు? ఎన్టీఆర్ కుటుంబాన్ని దగ్గరికి తీసుకొంటే నాలుగు వోట్లు వస్తాయని.

బాబు CM గా ఉన్నప్పుడు ఉపఎన్నికలు జరిగితే ఒక్కో ఉప ఎన్నిక జరిగే నియోజక వర్గానికి సుమారు 80 మంది MLA లను పంపేవాడు ప్రచారానికి.
ఎన్నికలు జరిగే నియోజక వర్గములో  ఏ కులస్తులు ఎక్కడ ఉన్నారో చూసి ఆ కులపు MLA  లను  అక్కడికి పంపి వాళ్ళ వోట్లు సంపాదించేవాడు, ఆ విధంగా కులాల కుంపటి రగిల్చేవాడు.

ఒకసారి  సిపిఐ నారాయణ చెప్పాడు  బాబు గురించి.సిపిఐ నారాయణ తిరుపతి లో SFI  లీడర్ గా ఉన్నప్పుడు బాబు SV  యూనివర్సిటీ లో కమ్మ స్టూడెంట్స్ కి లీడర్ గా ఉండే వాడు అని.  

1995 లో ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కున్న బాబు మొట్టమొదటిసారిగా 1999 ఎన్నికలలో తన ఆద్వర్యములో యుద్దానికి వెళ్ళాల్సి వచ్చింది.బాబు మీద వ్యతిరేకత ఉంది అని సర్వే లు చెప్పాయి.
 అప్పుడు కార్గిల్ వార్ పుణ్యము, వాజపాయి గారి చరిస్మా బాగా ఉండడముతో దేశమంతా   BJP  గాలి వీస్తోంది.

అప్పటిదాకా ఎన్టీఆర్ వెన్నుపోటు లో సహకరించిన కమ్యూనిస్టులను  కాదని , BJP ని విమర్శించిన నోటితోనే వారిని పొగిడి రాత్రికి రాత్రి BJP  తో పొత్తు పెట్టుకొని గెలిచాడు (ఈనాడు అంచనా ప్రకారము BJP  కి 18 శాతము వోట్లు ఉనాయి అప్పుడు)

అప్పుడు బాబు వాడుకొని వదిలేసే స్వభావము బాగా అర్ధము చేసుకొన్న కేంద్ర కమ్యూనిస్టుల ఆదేశం మేరకు 'బాబు జమానా అవినీతి ఖజానా'   అనే పుస్తకము వ్రాసారు మన సిపిఎం రాగావులు గారు.

ఆ తర్వాత బాబు NDA  హయాములో చక్రము తిప్పాడు కానీ రాష్ట్రానికి  ఒక్క ప్రాజెక్టు కానీ పరిశ్రమ కానీ తేలేదు, మరి చక్రము తిప్పి ఏమి చేసాడు అని మీకు సందేహము రావచ్చు.ఏముంది తన పనులు చక్కపెట్టుకొని, తన అను 'కుల' వారిని న్యాయమూర్తులుగా నియమించుకొన్నాడు, డబ్బు ను విదేశాలలో దాచుకొన్నాడు, అందుకే ఇప్పటికీ రహస్య విదేశీయానాలు చేస్తుంటాడు.


సరే, BJP తో 1999 లో పొత్తు పెట్టుకొని ఎన్నికలలో గెలిచిన బాబు 2004 లో కూడా పొత్తు పెట్టుకొని ఓడిపోయాడు ,ఓడిపోగానే BJP ని మతతత్వ పార్టీ అని తెగతెంపులు చేసుకొన్నాడు.

పోనీ 1999 లో తెలీదు అనుకొన్నా 2004 లో BJP మతత్వ పార్టీ అని తెలీదా? మరి పొత్తు ఎందుకు పెట్టుకొన్నాడు?

ఓడిపోగానే నెపం అంతా BJP  మీద  వేసాడు. పచ్చి అవకాసవాది బాబు.
చంద్ర బాబు మనస్తత్వం  -2

బాబు CM  గా ఉన్నప్పుడు నేను రోజూ ఉదయం రెండు ఇడ్లీ తింటాను, మధ్యాహ్నము  రెండు పుల్కాలు, రాత్రిళ్ళు కొన్ని పళ్ళు ,మజ్జిగ తాగుతాను, అంత సింపుల్ జీవితము  నాది అని తానో రుషి అన్న లెవెల్ లో కలర్ ఇచ్చేవాడు.

కానీ వాస్తవమేమిటంటే అతను షుగర్ వ్యాది, బొల్లి అనే చర్మ వ్యాధులతో బాధ పడుతున్నాడు.

సహజంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు డాక్టర్లు తినమని చెప్పే ఆహారమే బాబు తిన్నాడు కానీ తనకు షుగర్  ఉందని దాచిపెట్టి తానో రుషి పుంగవున్ని అన్న లెవెల్ లో తన మితాహరపు అలవాట్లు గురించి చెప్పుకోనేవాడు.

ఆమధ్య  బాబు రైతు దీక్ష చేస్తానని ప్రకటించగానే టీడీపి MLC రాజేంద్ర ప్రసాద్ దీక్ష కు రెండు రోజుల ముందు టీవీ 9 వారధి ప్రోగ్రాం కు వచ్చాడు, నేను చూసాను.

మా బాబు గారికి షుగర్ వ్యాధి ఉంది కాబట్టి 2 రోజులకంటే ఆహారము లేకుండా ఉండలేదు కాబట్టి బాబు దీక్ష కు కూర్చోగానే ప్రభుత్వము స్పందించి  అయన డిమాండ్స్ నెరవేర్చి దీక్ష   విరామింపజేయాలి అని చెప్పాడు.

ఎవరికైనా అనుమానముంటే టీవీ 9 ను సంప్రదించండి.

సరే అన్నట్టుగానే బాబు రెండు రోజుల తర్వాత దీక్ష కు కూర్చున్నాడు.దీక్ష  ప్రారంభమైన  రెండు రోజులకి బాబు షుగర్ లెవెల్స్ డ్రాప్ అయి 71 కి వచ్చింది, బాబు ను తర్వాత నిమ్స్ కు తరలించారు. అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి, జగన్ కు బద్ద వ్యతిరేకి అయిన DL.Ravindra Reddy  నిమ్స్ కు వెళ్లి  పరామర్శించాడు (బాబు కి నిమ్స్ లో అన్నీ సమకూర్చాడు అని అప్పట్లో గుగుసగుసలు విన్పించాయి అంటే కెసిఆర్ కు నిమ్స్ లో ఇచ్చినట్టుగా ద్రవ పదార్ధాలు ఇచ్చారు అని టాక్.బాబు అప్పటికే కాంగ్రెస్ తో రహస్య ఒప్పందము చేసుకొని ఉన్నాడు. జగన్ దీక్ష చేసినప్పుడు కానీ ఈ మధ్య విజయమ్మ దీక్ష చేసినప్పుడు కానీ మంత్రులు ఎవరూ వెళ్ళలేదు కానీ బాబు దీక్ష చేస్తే వెళ్లి వచ్చారు.ఇంతకంటే మ్యాచ్ ఫిక్సింగ్ కు సాక్ష్యము అవసరమా?)

సరే , ఆ గుసగుసలు నిజమే సుమా అన్నట్టుగా బాబు 8 వ రోజు అనుకుంట దీక్ష విరమించాడు , దీక్ష విరమించిన రోజున బాబు షుగర్ లెవెల్ 91 ఉంది. ఇది ఈనాడు పేపర్ వ్రాసింది.

షుగర్ వ్యాధి   ఉన్నవాళ్ళు 2 రోజులు దీక్ష చేయడమే గొప్ప   ఎందుకంటే షుగర్ లెవెల్స్ పడిపోతాయి అటువంటిది 8 రోజుల తర్వాత బాబు షుగర్ లెవెల్స్ ఆరోగ్యవంతుని కంటే బాగా ఉంది.

మరి  ఈ విచిత్రము ఏంటి అని అంతా అనుకొన్నారు.

సరే, సాక్షి ఈ విషయమై చర్చ పెట్టింది. షుగర్ వ్యాధి  తో బాధ పడుతున్న బాబు కి రెండవ రోజు షుగర్ లెవెల్ 71 ఉంది నిమ్స్ లో చేరిన తర్వాత 8 వ రోజు షుగర్ రీడింగ్ 91 ఎలా సాధ్యము?
అక్కడ ఎమన్నా బాబు కు ద్రవ ఆహారము ఇచ్చి ఉండకపోతే  ఎలా సాధ్యము అని.

సాక్షి టీవీ లో డెక్కన్ క్రానికల్ సీనియర్ ఎడిటర్ MV  Krishna Rao గారు, ఒకరిద్దరు విలేఖరులు  , డాక్టర్లు కూర్చున్నారు చర్చకు.

డాక్టర్లు అంతా 8 రోజుల నిరాహార దీక్ష తర్వాత షుగర్ రీడింగ్ పెరగడము అనేది వైద్య  శాస్త్రములో వింత, తినకపోతే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి కానీ పెరగవు కాబట్టి బాబు కు రహస్యంగా ఏదో ఒక రూపములో ఆహారము ఇచ్చి ఉంటారు   అన్నారు.

DC  న్యూస్ చీఫ్ కృష్ణ రావు గారు తానూ 30 సం గా షుగర్ వ్యాదిగ్రస్తున్ని అని ఒక మనిషి ఆహారం తీసుకోకపోతే షుగర్ లెవెల్స్ పడిపోతాయి కానీ పెరగవు అని బాబు దీక్ష లో ఆహారము తీసుకోలేదంటే నమసక్యంగా లేదు అని చెప్పారు  . 

ఈ సాక్షి ప్రోగ్రాం చూస్తున్న తీదీపి వాళ్ళు బాబు ఇమేజ్ కు డ్యామేజ్   జరుగుతుంది అని కడియం శ్రీహరి చేత ప్రెస్ మీట్ పెట్టించి సాక్షి ని తిట్టించారు బాబు కు షుగర్ వ్యాధి లేదు అయిన సాక్షి అబద్దాలు ప్రసారం చేస్తోంది అని.

తర్వాత ఢిల్లీ నుంచి బాబు దీక్ష ను అభినందించడానికి వచ్చిన సిపిఐ నాయకుడు AB  Bardhan , బాబు కు ఎప్పటినుంచో షుగర్ ఉంది, ఢిల్లీ కి వచ్చినప్పుడు మా ఇంట్లో  భోజనము  చేస్తాడు అందువలన  నాకు తెలుసు అని చెప్పాడు.

బాబు కు షుగర్ వ్యాధి ఉండడము తప్పు కాదు కానీ దాన్ని దాచిపెట్టి దీక్ష లో ఆహారము తీసుకొని ఇన్ని అబద్దాలు ఆడడము అవసరమా?

ఇకపోతే బాబు CM  గా ఉన్నప్పుడు నేను రోజూ 18 గంటలు కష్టపడుతున్నాను  అనేవాడు.
నిజంగా ఒక మనిషికి ఇది సాధ్యమా?
ఎవరైనా ఒకటి  రెండు రోజులు 18 గంటలు పనిచేయచ్చు కానీ రోజూ అలా చేయగలమా?

కనీసము 7 గంటల నిద్ర, 2 గంటలు స్నానము, భోజనాలకు, 2 గంటలు కుటుంబ సభ్యులకు పోగా మిగిలేది రోజులో 13 గంటలే కదా, మరి బాబు రోజుకు 18 గంటలు ఎలా పనిచేస్తాడు?

బాబు CM గా ఉన్నప్పుడు ఎప్పుడూ నేను మీకోసం ప్రాణాలు అర్పిస్తా అనేవాడు, నిజంగా ఏ రాజకీయ నాయకుడు అయినా ప్రజల కోసం ప్రాణాలు ఇస్తాడా ?

అదే వైఎస్ ను చూడండి, నేను 10-11 గంటలు మిచి పనిచేయలేను అని చెప్పేవాడు, అంతే కాక ఎప్పుడుకూడా తను ప్రానాలిస్తాను అని చెప్పేవాడు కాదు.

వైఎస్ ఎప్పుడూ చేయకలిగిందే చెప్పవాడు, చెప్పింది చేసేవాడు కానీ బాబు అలాకాదు అదీ తేడా.

కొంత కాలం క్రితం ,కేంద్రము పెట్రోల్ ధరలు పెంచితే నిరసన తెలపడానికి తీదీపి రాష్ట్ర బంధు కు పిలుపిచ్చింది.
తీదీపి నాయకులు  హైదరాబాద్ లో అన్ని షాప్ లు మూయించారు.హెరిటేజ్ మాత్రము సగం షట్టర్  తెరిచి వ్యాపారము చేస్తుంటే సాక్షి వాళ్ళు షూట్ చేసి చూపించారు.

బాబు అన్ని షాప్ లు మూయించి తన హెరిటేజ్ ను మాత్రమూ దొంగ చాటుగా వ్యాపారం చేయించాడు, అదీ  మన  గ్రేట్ బాబు.

బాబు CM గా ఉన్నప్పుడు మేనరిక వివాహాలు మంచివి కావు, పిల్లలు అంగ వైకల్యం తో  పుడతారు అనేవాడు, ఇది నిజమే.డాక్టర్లు కూడా ఇదే చెబుతారు, మేనరిక వివాహాలు,దగ్గరి బంధువుల తో వివాహము మంచిది కాదు అని చెబుతారు.

మరి బాబు చేసిందేమిటి?

తన ఒక్కగానొక్క కొడుక్కి మేనరిక వివాహము చేయలేదా?ఎందుకు?
బాలకృష్ణ తో వియ్యమంది ,ఎన్టీఆర్ కుటుంబాన్ని దగ్గర చేసుకొంటే నాల్గు ఓట్లు పడతాయి, పార్టీ లో తన నాయకత్వానికి ఎసరు ఉండదనేగా?
అసలు ఎన్టీఆర్ ఫోటో వద్దన్నా పెద్ద మనిషి బాబు, అయన మనవరాలిని కేవలము వోట్ల కోసం, CM సీట్ కోసం చేసుకొన్నాడు.అంగవైకల్యం తో పిల్లలు పుట్టినా ఫర్లేదు కానీ వోట్లు కావాలి అనే కదా?

బాబు మాటలు చేతలకు పొంతనే ఉండదు.

అవునంటే  కాదనిలే, కాదంటే అవుననిలే బాబు గారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే.

పాపం బాబు మాత్రము ఏమి చేస్తాడు . 
బాబు కు ముని శాపమట , నిజం చెబితే తల వెయ్యిముక్కలవుద్ది అని. 

courtesy: CV Reddy

వైఎస్ అభిమాని ఆత్మబలిదానం


 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏడాదికి పైగా అక్రమంగా జైలులో నిర్బం ధించడాన్ని జీర్ణించుకోలేని ఓ అభిమాని ఆత్మబలిదానం చేసుకున్నాడు. వివరాలు.. నర్సాపూర్‌లోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన పొట్టి వీరారెడ్డి(32) గురువారం రాత్రి అదే కాలనీ లోని మాచర్ల రాజు ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరారెడ్డి కొంతకాలంగా జిన్నారం మండలంలోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మృతుడి జేబులో లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా 375 రోజులుగా జైలులో పెట్టడంతో వైఎస్సార్ అభిమానిగా ఆత్మబలిదానం చేసుకుంటున్నట్లు రాసి కింద తన పేరు రాశాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ అసెంబ్లీ టికెట్‌ను కొండా సురేఖ అక్కకు ఇవ్వాలని, వైఎస్ విజయమ్మ, కొండా సురేఖ, వైఎస్.భారతి, షర్మిలక్క తన అంత్యక్రియల్లో పాల్గొనాలని నోట్‌లో కోరాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

ప్రతి పంచాయతీలో పార్టీ జెండా ఎగరాలి

కాంగ్రెస్, టీడీపీల కుట్రలను భగ్నం చేయాలి
కనీసం 80 శాతం సీట్లలో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవాలి
నవంబర్, డిసెంబర్ నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే అవకాశం
కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలే సెలవిస్తారు

సాక్షి, తిరుపతి: కాంగ్రెస్, టీడీపీల కుట్రలను భగ్నం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించాలని, పార్టీ నేతలంతా ఇదే లక్ష్యంతో పనిచేయాలని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు ైవె ఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. కనీసం 80 శాతం సీట్లలో గెలిపించి, పార్టీకి క్యాడర్ లేదనే అపవాదు తొలగిపోయేలా చేయాలని కోరారు. ప్రతి పంచాయతీలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పారు. శుక్రవారం తిరుపతిలోని వైఎస్సార్ ప్రాంగణంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన జరిగిన ‘పంచాయతీ ఎన్నికలు - ప్రజా ప్రతినిధులు’ సదస్సు ప్రారంభ, ముగింపు సమావేశాల్లో ఆమె ప్రసంగించారు. తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి విజయమ్మ పుష్పాంజలి ఘటించారు. 

అనంతరం సదస్సులో పాల్గొన్న రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాకు చెందిన ప్రతినిధులనుద్దేశించి మాట్లాడారు. స్థానిక ఎన్నికలు పార్టీకి గట్టి పునాది అవుతాయని, తద్వారా భవిష్యత్తులో వైఎస్ సువర్ణయుగం వస్తుందని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాభిమానం ఉందని చెప్పారు. పల్లెల్లో జగన్‌మోహన్‌రెడ్డి గాలి వీస్తోందని నిర్లక్ష్యం చేయకూడదని హితవు పలికారు. పోటీలో దిగేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నా, అందరూ కలిసి ఒకరిని ఎంపిక చేసుకొని, విజయం కోసం పని చేయాలని సూచించారు. 

నామినేషన్ నుంచి ఫలితాలు వచ్చేవరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అన్ని పంచాయతీల్లో విజయం సాధించి, జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ముగిశాక విజయోత్సవ సభకు తిరిగి వస్తానని, దేవుడు కరుణిస్తే ఆ సభకు జగన్‌మోహన్‌రెడ్డి కూడా వస్తారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలుపొందాలని చూస్తున్నారని, వారి అక్రమాలను సమర్థంగా ఎదుర్కోవాలని చెప్పారు. సీఎం కిరణ్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే స్థితిలో లేరని అన్నారు. చంద్రబాబు అవినీతి, ఆయనపై ఉన్న కేసులు, కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలను, సీబీఐ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా పనిచేస్తోందనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం క్రాప్ హాలిడే, పవర్ హాలిడే ఇచ్చిందని, త్వరలో ప్రజలు కాంగ్రెస్, టీడీపీలకు హాలిడే ఇస్తారని అన్నారు. పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో రూ.350 కోట్ల డీఆర్‌డీఏ నిధులు, 2013-14 సంవత్సరానికి రావాల్సిన రూ. 2,400 కోట్ల నిధులు నిలిచిపోయాయని తెలిపారు. బీసీ జనాభా దామాషాను దృష్టిలో ఉంచుకుని వారిని పోటీకి దింపాలని జగన్‌ఏనాడో సూచించారని తెలిపారు. 

జైల్లో ఉన్నా జగన్‌ను వదలడంలేదు: జగన్‌మోహన్‌రెడ్డి జైలులో ఉన్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వదలడంలేదని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో చిన్న గదిలో మూడడుగుల మంచం మీద పడుకుంటున్న జగన్‌ని చూస్తే కళ్లల్లో నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఆయనకు పక్కకు తిరిగితే పడిపోయే మంచం, ఒక ఫ్యాన్ ఉంటుందని తెలిపారు. ఒక టాయిలెట్‌ను ముగ్గురు ఉపయోగించుకోవాలని చెప్పారు. అటువంటి జీవితం గడుపుతున్న జగన్‌పై టీడీపీ లేనిపోని ఆరోపణలు చేయడం దారుణమన్నారు. 

నీలి చిత్రాలు చూస్తున్నాడని, మద్యం సేవిస్తున్నాడని అనడం బాధ కలిగిస్తోందని అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లతోనే సాగుతోందన్నారు. 26 జీవోల విషయంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణలకు ఒక న్యాయం, మిగిలిన మంత్రులకు మరో న్యాయం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జగన్‌పై ఉన్న అరవిందో, హెటిరో, రామ్‌కీ, దాల్మియా, ఎమ్మార్, ఇండియా సిమెంట్స్ వంటి కేసులన్నీ తప్పుడువేనని చెప్పారు. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం సహజమేనని, ఇటీవల ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలో ఒక సంస్థకు 135 శాతం రాయితీలిచ్చారని తెలిపారు. 

రాజీవ్‌గాంధీ మరణించిన తర్వాత ఆయన పేరును బోఫోర్సు కేసు నుంచి తొలగించారని, అయితే వైఎస్ పేరును ఆయన మరణించినా నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపు కాక మరేమిటని ప్రశ్నించారు. జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటే కేంద్ర మంత్రో, ముఖ్యమంత్రో అయిఉండేవారని కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకులు గులాంనబీ ఆజాద్ చెబుతున్నారని, ఆ మాటలనుబట్టే కుట్ర అర్థమవుతోందని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా దేవుడు ఉన్నాడని, ఆయనే చూసుకుంటాడని కార్యకర్తలకు మనోధైర్యం నింపారు. జగన్ జైలులో ఉన్నా, ఆయన మనసంతా ప్రజల మీదే ఉందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం నిత్యం ప్రజల మధ్యే గడిపిన జగన్ జైలులో ఉన్నప్పటికీ, పార్టీకి దిశ, దశ నిర్దేశిస్తూ ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఇప్పటికే బొగ్గు, 2జీ స్పెక్ట్రమ్, కామన్‌వెల్త్ క్రీడలు, ఆదర్శ్ కేసుల్లో కూరుకుపోయిందని చెప్పారు. 

పంచాయతీ ఎన్నికలను సవాలుగా తీసుకుని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి కోరారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఒక్క నిమిషం విడుదల చేసి ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీకీ ఒక్క స్థానంలో కూడా డిపాజిట్లు దక్కవని పార్టీ రాయలసీమ కన్వీనర్ భూమా నాగిరెడ్డి అన్నారు. అంతకు ముందు స్థానిక ఎన్నికల్లో గెలుపొందేందుకు అందరూ కృషి చేస్తామని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నాయకుల చేత ప్రమాణం చేయించారు. ఈ సదస్సులో పార్టీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, కె.శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు ఏఎస్ మనోహర్, అమరనాథరెడ్డి, పార్టీ నేతలు విజయ్‌చందర్, ఆర్.కె.రోజా, బియ్యపు మధుసూదనరెడ్డి, నారాయణరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఐదు జిల్లాల కన్వీనర్లు పాల్గొన్నారు.

ఓట్లేసినందుకు ‘క్విడ్ ప్రో కో’ అని ప్రజలనూ అరెస్టు చేస్తారా?

జగన్‌కు ఓట్లేసినందుకు ‘క్విడ్ ప్రో కో’ అని ప్రజలనూ అరెస్టు చేస్తారా? 
409, 120(బి) సెక్షన్ కింద జననేతపై కేసు నమోదు అసంబద్ధం 
‘సాక్షి’ చైతన్యపథంలో వక్తలు, ఉద్యోగులు, విద్యార్థులు 

సాక్షి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజాస్వామ్య విరుద్ధంగా కొన్ని వ్యవస్థలు కుట్ర పన్నుతున్నాయని పలువురు మేధావులు, న్యాయవాదులు, విద్యార్థులు అభిప్రాయపడ్డారు. వైఎస్ కుటుంబం మా కుటుంబాలకు చేసిన మేలుకు కృతజ్ఞతగా భారీ మెజార్టీతో జగన్‌ను ఎంపీగా గెలిపిస్తే, అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టడం మమ్మల్ని అగౌరవపరిచినట్లే..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చైతన్య పథం’ శుక్రవారం వైఎస్సార్ జిల్లా కడపలోని అపూర్వ ఫంక్షన్ హాలులో జరిగింది. స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ 2009కి ముందు ప్రజాప్రతినిధి గానీ, ప్రభుత్వోద్యోగి గానీ కాని జగన్‌పై 409,120(బి) సెక్షన్ల కింద కేసు ఎందుకు నమోదు చేశారో సీబీఐ సమాధానం చెప్పాలన్నారు. 

మంత్రి పదవుల్లో ఉండి 26 జీవోల విడుదలకు కారణమైన వారికి ఈ సెక్షన్లు ఎందుకు వర్తించవో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడిటర్ సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినవారు తమను మోసం చేశారని ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టాలన్నారు. అదేమీ లేకుండానే జగన్‌ను అరెస్టు చేయడం కుట్రపూరితమేనంటూ సీబీఐ తీరును దుయ్యబట్టారు. ఇంటాక్ కన్వీనర్ ఇలియాస్‌రెడ్డి మాట్లాడుతూ. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధిపై కేసు నిర్ధారణ కాకుండానే ఏడాదిపైగా జైల్లో పెట్టడం ప్రజ లను అగౌరవ పరిచినట్లే అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి చిరంజీవి వియ్యంకుడి ఇంట్లో కోట్ల రూపాయలు దొరికితే ఎలాంటి విచారణ చేపట్టలేదేమని ప్రశ్నించారు. మత గురువు మహ్మద్‌అలీ మాట్లాడుతూ పులి లాంటి జగన్ ఎక్కడ ఉన్నా కడపవాసుల అండ, ముస్లింల మద్దతు ఉంటాయన్నారు. విద్యార్థిని హనీషా మాట్లాడుతూ మాకు, జిల్లాకు వైఎస్ కుటుంబం వల్ల చాలా మేలు జరిగిందన్నారు. మరి ఎన్నికల్లో వారికి ఓట్లేస్తే క్విడ్ ప్రో కో అని మమ్మల్నీ జైల్లో పెడతారా?’ అని ప్రశ్నించారు. జగన్‌కు ఎప్పటికీ తమ మద్దతు ఉంటుందని కడప వాసులు ముక్తకంఠంతో నినదించారు.

వారి కోసం ప్రాణాలైనా ఇస్తాం

పెద్దాయన ‘రిమ్స్’ఆస్పత్రి కట్టించినారు. 108 ప్రవేశపెట్టారు. పిల్లోళ్ల చదువుకు ఎంతో మేలు చేసినారు. అట్టాంటాయన బిడ్డను ఉత్తిపుణ్యానికి జైల్లో పెట్టినారు. బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. మేం ఓట్లేసి గెలిపించుకున్న మా నేత లేడు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి. ప్రభుత్వం ఎంత కుట్ర పన్నినా జగన్ వెంటే ఉంటాం. వాళ్ల కోసం ప్రాణాలైనా ఇస్తాం.
- నాగమణెమ్మ, కడప

ఈ నరకం మనకొద్దు

* చంద్రబాబు పాలనలో ప్రజల కష్టాలే ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి: షర్మిల
* వేసిన ప్రతి పంటా నష్టమొచ్చి అప్పుల పాలైపోయామని రైతులు అంటున్నారు..
* ఉప్పు, పప్పు.. ఏది ముట్టుకున్నా ధర ఆకాశాన్నంటుతోంది
* రాబోయే రాజన్న రాజ్యంలో రాష్ట్రం మళ్లీ కళకళలాడుతుంది..
* ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు కట్టించే బాధ్యత జగనన్నదే
* రైతుల కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రమంతా అల్లాడిపోయింది. ఆయన రైతుల్ని, పేదల్నీ అసలు మనుషుల్లా కూడా చూడలేదు. రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసిన ప్రతి పంటలోనూ నష్టమొచ్చి అప్పులపాలైపోయాం.. ఆదుకునేవారు లేరని ప్రతి రైతూ చెప్తున్నాడు. ఉప్పు, పప్పు, నూనె, చక్కెర ఏది ముట్టుకున్నా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. ఏదీ కొనేటట్టే లేదని ప్రతి మహిళా ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొన్ని నెలలు వేచి ఉండండి. మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మన రాష్ట్రం కళకళలాడుతుంది. 

రాజన్న రాజ్యం రాకపోతే మన రాష్ట్రం బాగుపడదు. గ్రామాలు బాగుపడవు. మన కుటుంబాలు బాగుపడ వు. మన పిల్లలు చదువుకోలేరు. ఆరోగ్యశ్రీ ఉండదు. ఇలా ధరలు పెరుగుతూ పోతుంటాయి..ఈ నరకం ఇక మనకొద్దు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికినిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో సాగింది. కాకినాడ రూరల్ తిమ్మాపురంలో జరిగిన రచ్చబండలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, విద్యార్థులు, మహిళలు, కూలీలు తమ గోడు చెప్పుకొన్నారు. వారి కష్టాలు విని ఉద్వేగానికి లోనైన షర్మిల మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు..
‘‘మళ్లీ మాకు రాజన్న రాజ్యం కావాలని ప్రజలందరూ కోరుతున్నారు. దీనికి కారణం రాజశేఖరరెడ్డి అద్భుతమైన పథకాలు ఒకటైతే.. పెద్ద మనసు చేసుకుని ఆయన ఒక్క రూపాయి చార్జీ కూడా పెంచకపోవడం ఇంకో కారణం. అందరూ కోరుతున్నట్లే త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్కరూ గుడిసెల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు అందించే బాధ్యత జగన్‌మోహన్‌రెడ్డి తన భుజాన వేసుకుంటారు. రైతన్న వాడు తను పండించిన పంటను మార్కెట్‌లో లాభానికి అమ్ముకోలేకపోతే.. ఆ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతారు. రైతులంతా లాభపడేలా చూస్తారు. రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. వడ్డీ లేకుండా రుణాలిచ్చే మాట సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్న మాట కాదు. ఆయనకు విలువ, విశ్వసనీయత లేదు. కనుకనే మాట ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నారు కానీ.. ఒక్కరికీ వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం లేదు. కానీ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి విలువలు, విశ్వసనీయత కోసం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా పడే మనిషి. జగనన్న సీఎం అయ్యాక రైతులకు, మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు ఇస్తారు. ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్య శ్రీ, అభయ హస్తం లాంటి పథకాలకు మళ్లీ జీవం పోస్తారు.

బెల్ట్ షాపులనేవే ఉండవు..: 
మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో మన ఊళ్లలో బెల్టుషాపులు ఉండవు.. ఒక నియోజకవర్గానికి ఒకే మద్యం షాపు ఉంటుందంతే. ప్రతి మహిళా తలెత్తుకుని మా కుటుంబం బాగుందనుకునే రోజు త్వరలోనే వస్తుంది. మన రాష్ట్రం, మన గ్రామం, మన కుటుంబాలు బాగుపడతాయి. రాజన్న రాజ్యం రావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఒకటి. రాబోయే ఎన్నికలన్నింటిలో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పి.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేస్తే తప్ప మనకు రాజన్న రాజ్యం రాదు. ’’

11.2 కిలోమీటర్ల నడక
179వ రోజు శుక్రవారం పాదయాత్ర ఉదయం 9.30 గంటలకు కాకినాడ సినిమారోడ్డులోని వెంకటేశ్వర ఫంక్షన్ హాలు నుంచి ప్రారంభమైంది. సినిమారోడ్డు, కొత్తపేట చిన్న మసీదు, టూటౌన్ పోలీస్ స్టేషన్, ఎస్పీ ఆఫీస్, నాగమల్లితోట జంక్షన్, బోటుక్లబ్, సర్పవరం జంక్షన్, భవానీ కాస్టింగ్స్, అచ్చంపేట జంక్షన్‌ల మీదుగా తిమ్మాపురం వరకు సాగింది. ఇక్కడ రచ్చబండలో పాల్గొన్న అనంతరం షర్మిల.. గోవర్ధన్ డెయిరీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బసకు రాత్రి ఏడు గంటల సమయంలో చేరుకున్నారు. 

శుక్రవారం నడిచిన 11.2 కిలోమీటర్లతో పాదయాత్ర 2,372 కిలో మీటర్లు పూర్తయింది. పాదయాత్రలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గనేత చలమలశెట్టి సునీల్, స్థానిక నేతలు చెల్లుబోయిన వేణు, కర్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

రోజుకి 4 గంటలే కరెంటు..
రచ్చబండలో ‘అమ్మా.. కరెంటు ఎన్ని గంటలు వస్తోంది?’ అని షర్మిల అడగ్గా.. మహిళలందరూ నాలుగు వేళ్లు చూపిస్తూ నాలుగు గంటలే వస్తోందని చెప్పారు. దీంతో షర్మిల ‘24 గంటలకు 4 గంటలు మాత్రమే వస్తుందా?’ అని అడిగితే ‘అవును, అవును’ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు భ్రష్టు పట్టిన తీరును షర్మిలకు వివరించారు. ‘‘అమ్మా.. మీ నాన్న మా కోసం ఎన్నో పథకాలు పెట్టారు. కానీ అవేవీ ఇప్పుడు అమలు జరగడం లేదమ్మా.

ప్రస్తుతం గ్రామాలలో చదువుకున్న వారందరూ ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నారమ్మా’’ అని పెందుర్తి సుందరి ఉద్వేగంగా చెప్పింది. దివ్య అనే యువతి మాట్లాడుతూ.. ‘‘మా నాన్న గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఇప్పటికే రెండు సార్లు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేశారు. మరోసారి ఆపరేషన్ చేయటం కుదరదంటున్నారు. మా నాన్నకు మేం ముగ్గురు ఆడపిల్లలం, ఒక తమ్ముడు ఉన్నాం. మా నాన్న లేకపోతే మాకు దిక్కులేదు. మా నాన్న కష్టమ్మీదే మేం బతుకుతున్నాం. మీరే మాకు సహాయం చేయాలమ్మా’ అంటూ కన్నీరుమున్నీరైంది. ఆమె కష్టాలు విని చలించిపోయిన షర్మిల వైద్యులతో మాట్లాడి వీలైనంత సాయం చేస్తామని ధైర్యం చెప్పారు. ‘‘పావలా వడ్డీ అన్నారు. తరువాత వడ్డీలేని రుణాలు అన్నారు. కానీ తీసుకున్న రుణాలకు రుపాయి వడ్డీ పడుతోంది. రాజశేఖరరెడ్డి సమయానికి అందించే డ్వాక్రా రుణాలు ఇప్పుడు ఇచ్చే వారు కనిపించటం లేదు’’ అంటూ సత్యవతి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

వైఎస్ జగన్‌కు మేం అండగా ఉంటాం


వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఏడాదికాలంగా జైల్లో పెట్టడం అక్రమమని.. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని జిల్లా ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. వైఎస్ జగన్‌ను అణచివేసేందుకే కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు కుట్రపన్ని సీబీఐని వాడుకుంటున్నాయని ధ్వజమెత్తారు. దీంతో సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని మరోసారి రుజువైందని విమర్శించారు. ఓట్లేసి గెలిపించుకున్న తమ నాయకుడిని అక్రమంగా నిర్బంధించారు.. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్‌కు తమ అండ ఉంటుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయి వైఎస్‌ఆర్ సువర్ణపాలన మళ్లీ తెస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. కడప నగరంలోని అపూర్వ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన ‘సాక్షి చైతన్యపథంలో’ పలువురు పై విధంగా స్పందించారు. 
- న్యూస్‌లైన్, కడప కార్పొరేషన్


ఎన్నికల కోసం కాచుకొని ఉన్నాం
ముస్లిం మైనార్టీలకు ఏ ప్రభుత్వాలు న్యాయం చేయలేదు. రాజశేఖర్‌రెడ్డి వచ్చాకే 4శాతం రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేశారు. ఆయన మరణానంతరం వైఎస్ జగన్ తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మృతిచెందిన కుటుంబాలను ఓదార్చడానికి వెళితే అడ్డుకొని కేసులు పెట్టి జైలుపాలు చేశారు. నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయంటే అది వైఎస్ చలువే. ఎన్నికలు ఎప్పుడొస్తాయా, ఈ ప్రభుత్వానికి ఎప్పుడు బుద్ధి చెబుతామా అని కాచుకొని ఉన్నాం.
- ఖాజావలీ 


మా గోడు ఎవరికి చెప్పుకోవాలి
మా సమస్యలు పరిష్కరిస్తాడని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాం. కానీ ఈ ప్రభుత్వం ఆయనను ఏడాదికిపైగా జైలులో పెట్టి వేధిస్తోంది. మా గోడు ఎవరికి చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వంలో అన్ని రకాల చార్జీలు పెరిగి సామాన్యుని బతుకు దుర్భరమైంది. మా కోసమైనా ఆయనకు బెయిల్ ఇప్పించండి.
- అబ్దుల్ కలాం,స్థానికుడు


ఇదేం న్యాయం
బ్రిటీష్ హయాంలో తెల్లదొరలు వారి పరిపాలనను సవ్యంగా సాగడం కోసం కొన్ని చట్టాలను రూపొందించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా మనదేశంలో అవే చట్టాలు అమలవుతున్నాయి. అందుకే ప్రభుత్వంలో ఉన్నవారు తమ పరిపాలన సవ్యంగా సాగడం కోసం తమను ఎదిరించిన వారిని జైళ్లలో పెడుతున్నారు. భారత శిక్షాస్కృతిని మార్చాల్సిన అవసరముంది. ఏ పదవిలో లేని జగన్‌మోహన్‌రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేస్తారట. బయట ఉన్న మంత్రులకు ప్రభుత్వమే న్యాయ సహాయం చేస్తుందట. ఇదేం న్యాయం?
- రాజేంద్రనాథ్ రెడ్డి, స్థానికుడు


వైఎస్ జగన్ వ్యక్తి కాదు.. వెలుగు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక వ్యక్తి కాదు. ఆయన ప్రజలకు ఒక వెలుగులాంటివారు. చట్ట ప్రకారం ఎవరికైనా 90రోజుల్లో బెయిలివ్వాలి. కానీ ఏడాదికాలంగా జగన్‌కు బెయిల్ ఇవ్వకపోవడం అన్యాయం. ఈ ప్రభుత్వం, అందులోని పెద్దలు రాబోయే తరాలకు ఏవిధమైన మార్గనిర్దేశం చేయదలచుకున్నారో అర్థం కావడంలేదు. వైఎస్ జగన్‌ను ఒక్క అడుగు అణచాలని చూస్తే జిల్లా ప్రజలు ఆయనను వంద అడుగులు పైకి తీసుకొస్తారు.
- గౌరి, స్థానిక మహిళ 


ఈ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది
దేశంలో ప్రజాస్వామ్యం ఉందా, లేదా అని అనుమానం కలిగే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. సీబీఐ పంజరంలో చిలుక అని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. ఈ నియంతృత్వ ప్రభుత్వం త్వరలో కూకటివేళ్లతో సహా కూలిపోవడం ఖాయం.
- ఎం.శ్రీనివాసులురెడ్డి 


ప్రజలు బాధపడుతున్నారండీ
మన బిడ్డ జైళ్లో ఉంటే ఎంత బాధ ఉంటుం దో... ప్రస్తుతం జిల్లా వా సులంతా అలానే బాధ పడుతున్నారు. జనాల కో సం ఓ బిడ్డ జైళ్లో... మరో బిడ్డ రోడ్డుపై ఉంది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో!
- సయ్యద్ అహ్మద్, ఆడిటర్ 


జగన్ చేసిన తప్పేంటి..
ఆ 26 జీవోలు తప్పని, అందుకే జైగన్‌ను జైళ్లో పెట్టామని సీబీఐ అంటోంది. 2009కి ముందు జగన్ ప్రజాప్రతినిధి కాదు...ఆ 26 జీవోలు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఆయన చేసిన తప్పేంటి?
- రాజేశ్‌కుమార్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు


ముమ్మాటికీ కక్ష సాధింపే
జగన్‌ను అరెస్టు చేయడం ముమ్మాటికి కక్షసాధింపు చర్యే. జగన్‌ను జైల్లో పెట్టడం అన్యాయం. ప్రభుత్వంతో పాటు సీబీఐ తీరుపై కూడా ప్రజల్లో అపనమ్మకం ఏర్పడింది.
- పోచంరెడ్డి సుబ్బారె డ్డి,
ఉపాధ్యాయ ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్సీఏడాదిగా నాన్చుతున్నారు..
కంపెనీల్లో పెట్టు బడులు పెట్టినవారు మాకు మోసం జరిగిందని చెప్పలేదు. పోనీ నష్టం వచ్చిందని బదులివ్వలేదు. మరి క్విడ్‌ప్రోకో అని జగన్‌ను ఎలా అరెస్టు చేస్తారు. పైగా ఏడాదిగా దర్యాప్తు అయినా సక్రమంగా చేయడం లేదు. ఏడాదిగా నాన్చుతూనే ఉన్నారు.
- ఇలియాస్ రెడ్డి, ఇంటాక్ కన్వీనర్


ముస్లింలకు ఆయన వల్లే రిజర్వేషన్లు
మహానేత వైఎస్‌ఆర్ వల్లే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు వచ్చాయి. ఆయన్ను మరిచేది లేదు. జగన్ చేయి విడిచేదీ లేదు. జగన్‌ను అక్ర మంగా అరెస్టు చేశారు. సింహం బోనులో ఉన్నా సింహమే.
- ముఫ్తీ మహమ్మద్ అలీ బగ్దాదీ, మతగురువు


జైలులో ఉన్నా.. ముఖ్యమంత్రి కావడం ఖాయం
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలను తన బిడ్డల్లా చూసుకున్నారు. కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలను అమలుచేసి లబ్ధి చేకూర్చారు. నేడు ఆయన కుటుంబం రోడ్డుపాలైంది. ఇది అన్యాయమని ప్రతి ఒక్కరి మనసుకు తెలుసు. జగన్ జైలులో ఉన్నా ముఖ్యమంత్రి కావడం ఖాయం.
- రకీబ్‌జాన్, గృహిణి 


జిల్లా ప్రజలను అవమానిస్తున్నారు
కడప ప్రజలు అత్యధిక మెజార్టీతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించారు. కానీ ఈ ప్రభుత్వం వారి అభిప్రాయాన్ని, ఆకాంక్షలను తుంగలో తొక్కి వైఎస్ జగన్‌ను ఏడాదిపాటు జైలులో పెట్టింది. తద్వారా జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నారు. ఇప్పటికైనా ఆయనను జైలు నుంచి విడిపించాలి.
- సాదిక్‌బాష, న్యాయవాది


జరిగేదాన్ని ఆపడం ఎవరి తరం కాదు
కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కుమ్మక్కై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైలులో పెట్టాయి. ఆయన బయటికొస్తే సీఎం అవుతారని ఇరుపార్టీలవారు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి వచ్చినా,రాకపోయినా ఆయనను సీఎం కాకుండా ఆపడం ఎవరి తరం కాదు.
- జ్యోతి, ఎంబీఎ, విద్యార్థిని


ఈ పరిణామాలను చూసి బాధేస్తుంది
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కేసులో ఇరికించడానికి లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఆ తర్వాత 43వేల కోట్లేనని చెప్పారు. ఇప్పుడు 70శాతం దర్యాప్తు పూర్తయిందని, రూ. 1063 కోట్లు అవినీతి జరిగిందని చెబుతున్నారు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదు. న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ వైఎస్ జగన్‌ను అక్రమంగా జైలులో ఉంచి ఆయన తల్లి, భార్యాబిడ్డలకేకాక రాష్ట్ర ప్రజలకు దూరం చేశారు.
- రియాజుద్దీన్, స్థానికుడు


ప్రజాదరణను ఓర్వలేకే జగనన్నను అరెస్టు చేశారు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నంత వరకు ఎలాంటి కేసులు గాని, ఆరోపణలు గాని లేవు. ఆయన కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిపార్టీ స్థాపించగానే ఆయనపై కేసులు వేసి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్‌జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారు.

- హనీషా, విద్యార్థిని

అవమానించినట్లే..!

 నేరం రుజువు కాకుండానే ఇంతకాలం జైళ్లో ఎలా నిర్బంధిస్తారు..!
* బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే ఆలస్యంగా చార్జిషీట్లు
* న్యాయవ్యవస్థను సీబీఐ తప్పుదోవ పట్టిస్తోంది
* ఎన్నికుట్రలు పన్నినా జగన్ ఎదుగుదలను అడ్డుకోలేరు... ఆయన నుంచి మమ్మల్ని విడదీయలేరు 
* ‘సాక్షి చైతన్య పథం’లో జిల్లా వాసులు

ప్రజాస్వామ్యయుతంగా వైఎస్ జగన్‌ను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకున్నాం.. మాకు సేవ చేయాల్సిన జగన్‌ను జైళ్లో పెడతారా.. ఇది ముమ్మాటికీ అన్యాయం చేయడమే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.. జిల్లా ప్రజలను అవమానించడమే.. అంటూ కడపవాసులు భగ్గుమన్నారు. జగన్‌కు అండగా మేముంటామంటూ మహిళలు యువకులు స్పష్టం చేశారు. సాక్షి చైతన్య పథం సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి వైఎస్ కుటుంబంపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. సీబీఐ తీరును ఎండగట్టారు. ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇంతమంది ఏకం కావాలా అని ప్రశ్నించారు.

సాక్షి, కడప: పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వకుండా నెలలతరబడి నిర్బంధించడం సరైందికాదని.. ఇది జిల్లాకే అవమానమని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి పైగా బెయిల్ రాకుండా జగన్‌ను అక్రమంగా నిర్బంధించిన నేపథ్యంలో శుక్రవారం నగరంలోని అపూర్వ కళ్యాణ మంటపంలో ‘సాక్షి చైతన్య పథం’ నిర్వహించారు. సాక్షి టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ చర్చావేదికలో ఉపాధ్యాయ ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారె డ్డి, ఇంటాక్ కన్వీనర్ ఇలియాస్‌రెడ్డి, ఆడిటర్ సయ్యద్‌అహ్మద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్‌కుమార్‌రెడ్డి, ముస్లిం మత గురువు ముక్తీ మహ్మద్ అలీ బగ్దాదీ, ఎంబీఏ విద్యార్థి జ్యోతి వక్తలుగా హాజరై తాము గెలిపించుకున్న ప్రజాప్రతినిధి ప్రజల నుంచి దూరం కావడం బాధాకరమన్నారు. 

జగన్ అక్రమ నిర్బంధంతో ఆయన తల్లి, చెల్లి, భార్య, బిడ్డలు..వారితో పాటు జిల్లా వాసులంతా బాధపడుతున్నారని రియాజుద్దీన్ అనే వ్యక్తి ఉద్వేగంతో అన్నారు. ఈ మాటలకు బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్‌కుమార్‌రెడ్డి స్పందించి‘26 జీవోలు తప్పని, అందుకే జైగన్‌ను జైళ్లో పెట్టామని సీబీఐ అంటోంది.. 2009కి ముందు జగన్ ప్రజాప్రతినిధి కాదు..ఆ 26 జీవోలు ఇవ్వలేదు.. అలాంటప్పుడు ఆయన చేసిన తప్పేంటి? ఇదేంటని ప్రశ్నిస్తే ‘క్విడ్‌ప్రోకో’ అని అంటగడతారు.. ఇదేనాప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. 

ఇంతలో అబ్దుల్‌కలాం అనే వ్యక్తి కలుగజేసుకుని ‘ మేడమ్.. అప్పట్లో వైఎస్ మా సీఎం.. ఇప్పుడు జగన్ మా ఎంపీ.. వారంతా మాకు చాలా మేలు చేశారు.. మా జగన్‌రెడ్డికి ఓట్లేస్తే ‘క్విడ్‌ప్రోకో’ అని అరెస్టు చేస్తారేమో’ అని అనడంతో చర్చావేదికలో చప్పట్ల వర్షం కురిసింది. ఇంతలో ఇంటాక్ కన్వీనర్ ఇలియాస్‌రెడ్డి కలుగజేసుకుని ‘ పెట్టుబడులు పెట్టినవారు మాకు మోసం జరిగిందని చెప్పలేదు.. నష్టం వచ్చిందనీ బదులివ్వలేదు.. మరి క్విడ్‌ప్రోకో అని ఎలా అరెస్టు చేస్తారు..పోనీ దర్యాప్తు అయినా సక్రమంగా చేసి చార్జిషీటు ఫైలు చేశారా? అంటే అదీ లేదు.. ఏడాది దాటినా నాన్చుడుధోరణితో వ్యవరిస్తున్నారన్నారు. ఇంతలో రాజేశ్‌కుమారెడ్డి మళ్లీ మైకందుకుని సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలన్నారు. ఆడిటర్ సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ మన బిడ్డ జైళ్లో ఉంటే ఎంత బాధఉంటుందో...జిల్లా వాసులంతా అలానే బాధపడుతున్నారని, జనాల కోసం ఓ బిడ్డ జైళ్లో...మరో బిడ్డ రోడ్డుపై ఉండటం.. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో!’ అని విచారం వ్యక్తం చేశారు. 

ఇంతలో ఎంబీఏ విద్యార్థిని జ్యోతి జోక్యం చేసుకుని జగన్ సీఎం కాకుండా అడ్డుకునేందుకే జైళ్లో పెట్టారన్నారు. దీనిపై మతగురువు బగ్దాదీ మాట్లాడుతూ‘ వైఎస్ రాష్ట్రంలోని అందరికీ మేలు చేశారు.. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు.. ఆయన్ను మరిచేది లేదు.. జగన్ చేయి విడిచేదీ లేదు’ అన్నారు. ఇంతలో రాజేందర్‌రెడ్డి అనే వ్యక్తి మైకు తీసుకుని ‘బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని అంటున్నారు.. సాధారణ ఎంపీగా ఉన్న వ్యక్తి ప్రభావితం చేస్తారా? కీలక పదవుల్లో ఉన్న హోంమంత్రి, ఇతర మంత్రులు ప్రభావితం చేస్తారా?అని ప్రశ్నించారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థదే!’ అన్నారు.

సీబీఐ పంజరంలో జగన్‌ను చిలుకగా మార్చారని మాలె శ్రీనివాసులరెడ్డి అనే వ్యక్తి మండిపడ్డారు. ఖాజావలి అనే ముస్లిం పెద్ద మాట్లాడుతూ. ‘మేడమ్! ఎవరైనా మాకు గ్లాసు పాలు ఇస్తే! వాళ్లకు కడుపునిండా బిర్యానీ పెట్టాలి’ అని మా పెద్దోళ్లు చెప్పారు., అలాంటిది వైఎస్ కుటుంబాన్ని మరుస్తామా? సమస్యే లేదు? అని అన్నారు. ఈ మాట అనగానే మళ్లీ చప్పట్లు మోగాయి. ముమ్మాటికీ జగన్ అరెస్టు కక్షసాధింపు చర్యేనని పోచంరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. ఇలా మేధావులు, ఉద్యోగులు, ప్రజలు అందరి మధ్య విశ్లేషణాత్మకంగా చర్చ సాగింది. చివరకు జగన్‌కు బెయిల్ రావాలని అందరూ ఆకాంక్షించారు. జగన్ కుటుంబానికి తుది వరకూ అండగా ఉంటామని తేల్చిచెప్పారు.

Sharmila Rachabanda in Thimmapur at East Godavari


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో శనివారం (180వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి శుక్రవారం ప్రకటిం చారు. తిమ్మాపురం నుంచి శని వారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. 4.6 కిలోమీటర్ల నడక అనంతరం చిత్రాడకు ముందు మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 7.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. పిఠాపురంలో రాత్రి బస చేస్తారు. శనివారం మొత్తం 12 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది. పర్యటించే ప్రాంతాలు : పండూరు, పి.వెంకటాపురం క్రాస్ రోడ్, పవర క్రాస్ రోడ్, చిత్రాడ, పిఠాపురం బ్రిడ్జి, ఉప్పాడ సెంటర్, కోటగుమ్మం జంక్షన్, పోలీస్ స్టేషన్ సెంటర్

'కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి అధికారం'

ప్రజా మద్దతు కోల్పోయిన కాం గ్రెస్‌కు ఇదే చివరి అధికారమని వైఎస్సార్ సీపీ జహీరాబాద్ నియోజకవర్గ సమన్వయకర్త మాణిక్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని గంగాపూర్‌లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కిరణ్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఈ పథకాలు మళ్లీ ప్రజల చెంత చేరాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అత్యధిక మెజార్టీ సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు.

ప్రత్యర్థుల గుండెల్లో దడపుట్టించాలి:విజయమ్మ

Written By news on Friday, June 14, 2013 | 6/14/2013

ఎన్నికల నగారా ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించేట్టుగా ఉండాలని కార్యకర్తలకు, నేతలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పిలువు ఇచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరిగిన వైఎస్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సదస్సు ముగిసింది. ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో గెలిచి జగన్‌కు కానుకగా ఇద్దాం అన్నారు. ప్రతి కార్యకర్త పట్టుదలతో కృషి చేసి వైఎస్ఆర్‌సీపీ గెలుపొందేలా కృషిచేయాలన్నారు. దేవుని దయవల్ల జగన్ త్వరలోనే విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాయతీ విజయోత్సవ సభలో జగన్ 
మీతో కలిసి పాల్గొనే అవకాశం దేవుడు కల్పిస్తాడన్నారు. 

రైతులు క్రాప్‌ హాలీడే, పరిశ్రమలవారు పవర్‌ హాలీడే ప్రకటించారు. దీంతో వేలాది మంది అన్నదాతలు, కార్మికులు రోడ్డున పడ్డారు. కాంగ్రెస్‌, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలకు మనం హాలీడే ప్రకటించాలని విజయమ్మ అన్నారు. ప్రతీ పంచాయతీ మీద వైఎస్సార్‌ సీపీ జెండా రెపరెపలాడించాలన్నారు. జగన్‌బాబు ఆధ్వర్యంలో రాజశేఖర్‌రెడ్డి గారి సువర్ణయుగం తెచ్చుకోవడానికి మనమంతా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు విజయమ్మ పిలుపునిచ్చారు.

Why Jagan is such a forceMany analysts believe that Jagan, as he is popularly known, will sweep the polls for the Andhra Pradesh assembly that will be held alongside the Lok Sabha elections in 2014. "I don't want to go overboard. But it's clear that he will win a simple majority," says a special chief secretary to the Andhra Pradesh government. The expectation is that Jagan's party,  the YSR Congress, will win something like 20-22 Lok Sabha seats out of the 42 in the state in 2014. That will make Jagan, a kingmaker at the Centre considering that the 2014 election is likely to throw up a fractured mandate with the support of every MP important for making the government. So strong is the expectation that Jagan will sit on the chief ministerial gaddi that MLAs from the ruling Congress and even the opposition Telugu Desam party (TDP) continue to flock to him. 

Those who are in the know of things are aware that many ruling Congress party MLAs and even ministers have pushed their sons, daughters or brothers to the YSR Congress in an effort to hedge their bets. This is even as Jagan continues to have a steady stream of visitors to jail, many probably seeking a party ticket for the next elections.

"The Jagan fever has reduced over the last one year that he has been in jail but is still enough to get him to power," admits a minister in the present Andhra Pradesh government. This is why analysts aver that the powers that be might push for Jagan's conviction in one of the many cases filed against him. This will render Jagan ineligible to contest elections.

continue........      PLZ post comments in below link

http://blogs.timesofindia.indiatimes.com/The-wonder-that-is-indian-politics/entry/why-jagan-is-such-a-force

16న వైఎస్ఆర్ సిపి ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశం

ఈనెల 16న విజయనగరంలో వైఎస్ఆర్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు బొబ్బిలి తాజా మాజీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు చెప్పారు.ఈ ప్రాంతీయ సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ప్రజల్లో ఎంత బలం ఉంది అనేది ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్ఆర్‌సీపీ నిరూపించుకుంటుందని చెప్పారు. సభ్యత్వ నమోదు ఒక డెడ్‌లైన్ విధించి గడువులోగానే పూర్తి చేస్తామన్నారు.

నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఒకరికంటే ఎక్కువ ఉండటం ఇబ్బందేమీకాదని వైఎస్ఆర్‌ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పెన్మత్స సాంబశివ రాజు చెప్పారు. ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నట్లు తెలిపారు. ప్రాంతీయ సదస్సుకు వైఎస్ఆర్ సిపి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు.

YSRCP will win elections: YS Vijayamma

Godavari Gattuna 14th June 2013

రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదే: విజయమ్మ

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల నగారాను శుక్రవారం తిరుపతి నగరం నుంచి మోగించింది. రానున్న స్థానిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను సమర్థంగా ఢీకొట్టేందుకు పార్టీ శ్రేణులకు గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ కర్తవ్యబోధ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తధ్యమని ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయానికి కార్యకర్తలే మూలమని అన్నారు. 

సదస్సుకు తరలి వచ్చిన రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి నాయకులు, ప్రతినిధులను ఉద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గ్రామ పంచాయతీలన్నీ కైవసం చేసుకోవాలని సూచించారు. అధికార పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడకుండా చూడాలని ఆమె అన్నారు. స్థానిక సమస్యలపై కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాకా ప్రతి ఎన్నికల్లోనూ పార్టీదే విజయమన్నారు.

వైఎస్ జగన్ ను దెబ్బ తీయడమే కాంగ్రెస్, టీడీపీల లక్ష్యమని విజయమ్మ అన్నారు. ఆరెండు పార్టీల ఎత్తుగడలను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని విజయమ్మ మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ సత్తా ఏంటో చూపేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఓ అవకాశమన్నారు. అంతకు ముందు సభా ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు.

బోనులో ఉన్నా...సింహం సింహమే...


డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వలన ఈ రాష్ట్రంలో ఎంతోమంది నిరుపేదల జీవితాలు మెరుగయ్యాయి. అయితే ఆయన హఠార్మరణం తర్వాత ప్రజాసమస్యలను పట్టించుకునే నాయకులే కరువయ్యారు. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా అన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది.

పేదల మనిషి, మహనీయుడు, ప్రజల ఆరాధ్య దైవం వైఎస్సార్‌పై ఈ వెన్నుపోటు చంద్రబాబు అండ్ కో ప్రతిరోజూ బురదచల్లుతూ, దుష్ర్పచారం చేస్తూ ఉంటే మనసుకు బాధ కలుగుతోంది. కాని ప్రజలకు తెలుసు ఎవరు రాజకీయ నాయకులో? ఎవరు ప్రజానాయకులో? కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ విశ్లేషకులు కూడా చంద్రబాబు బృందానికి తోడవుతున్నారు. అయితే వీళ్లందరికీ తెలియని విషయం ఏమిటంటే... సరైన సమయంలో ఓటు అనే ఆయుధంతో ప్రజలు వీరికి ముచ్చెమటలు పట్టే విధంగా సమాధానం చెప్పబోతున్నారు. ఇచ్చిన మాటకోసం గడిచిన మూడేళ్లుగా కష్టాలను అనుభవిస్తున్న నాయకుడు జగన్. ఆయన అంటే ఉన్న భయంతో రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు సీబీఐతో కలిసి కుట్ర పన్ని జైల్లో నిర్బంధించారు.

అలాగని మేము డీలాపడిపోలేదు. పాదయత్రలో షర్మిలక్క మాట్లాడుతూ ‘జగనన్న ఏ తప్పూ చేయలేదు. బోనులో ఉన్నా సింహం సింహమే. ఉదయించే సూర్యుణ్ని ఎవ్వరూ ఆపలేరు. అలాగే జగనన్నను కూడా ఎవరూ ఆపలేరు’ అని చెప్తుంటే రాష్ట్రంలోని వైఎస్సార్, జగన్ అభిమానులకు ఎంతో ధైర్యంగా, ఆనందంగా ఉంది. నేను చెప్పేదొకటే. ఈ రోజు అధికారం ఉంది కదా అని ఈ నమ్మకద్రోహ కాగ్రెస్ నాయకులు, వారితో చేతులు కలిపిన తెలుగుదేశం పార్టీ నేతలు విర్రవీగితే ఏమవుతుందో త్వరలో కాలమే నిర్ణయించబోతోంది. జగన్ త్వరలోనే బయటకు వస్తారు. అప్పటివరకు అభిమానులంతా ధైర్యంగా ఉండి, వైఎస్సార్ కుటుంబ సభ్యులకు మన అభిమానంతో ధైర్యాన్ని నింపాలి. జగన్‌పై జరుగుతున్న కుట్రలకు, కుతంత్రాలకు వచ్చే ఎన్నికలతో తెరపడి తీరుతుంది.

- ఎన్.జితేంద్ర, ఎం.బి.ఎ, నెల్లూరు

మ్యాచ్‌ఫిక్సింగ్‌పై మభ్యపెట్టేందుకే బాబు ఎత్తుగడ

- వైఎస్సార్ కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి ధ్వజం
- ప్రభుత్వాన్ని వదిలి స్పీకర్‌పై అవిశ్వాసం ఎందుకు?
- మ్యాచ్‌ఫిక్సింగ్‌పై మభ్యపెట్టేందుకే బాబు ఎత్తుగడ

సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్‌పై అవిశ్వాసం పెడతామంటూ తెలుగుదేశం పార్టీ ప్రకటించడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం సంధించడమే అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. సభను సజావుగా నడిపించడంలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ తన బాధ్యతను పూర్తిగా విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండుసార్లు కాపాడిన చంద్రబాబు, ఇప్పుడు ఎలాంటి కుమ్మక్కు లేదని ప్రజల్ని మభ్యపెట్టేందుకు స్పీకర్‌పై అవిశ్వాసమంటూ కొత్త ఎత్తుగడ వేశారని విమర్శించారు. ప్రభుత్వానికి ఉండే మెజార్టీయే స్పీకర్‌కు కూడా ఉంటుందని, అలాంటప్పుడు ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టడంలేదని సూటిగా ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘గతంలో అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్‌లో చిరంజీవి పీఆర్పీ విలీనం అయ్యేంత వరకు చంద్రబాబు వేచి చూశారు. 

కాంగ్రెస్‌కు సంఖ్యాబలం కుదిరిన తర్వాత అవిశ్వాసం పెట్టారు. రెండోసారి ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసం పెడితే కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రభుత్వాన్ని కాపాడారు. ఈ విధంగా రెండుసార్లు కాంగ్రెస్‌ను ఒడ్డుకు చేర్చింది చంద్రబాబే కదా..’ అని స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడ్డాక స్పీకర్‌పై అవిశ్వాసం అంటున్నారని వివరించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకముందు ఎందుకు ఈ పని చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో తాను చేసుకున్న మ్యాచ్‌ఫిక్సింగ్ ప్రజలకు స్పష్టంగా తెలిసిపోవడం వల్లే.. వారిని మభ్యపెట్టేందుకు చంద్రబాబు స్పీకర్‌పై అవిశ్వాసమంటూ కొత్త డ్రామాకు తెరదీశారని మైసూరా దుయ్యబట్టారు. చంద్రబాబుకు శాసనసభపై నమ్మకమున్నట్లయితే సమావేశాలు జరుగుతున్న సమయంలో అమెరికా ఎందుకు వెళ్తున్నారని నిలదీశారు. చంద్రబాబు గత సమావేశాల సందర్భంగా కూడా పాదయాత్ర అంటూ ఒక్క రోజు కూడా సభకు హాజరుకాని విషయాన్ని మైసూరా గుర్తుచేశారు. 

ఫ్రంట్‌లో బాబుకు స్థానం ఉండదు: వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒకటీ రెండు ఎంపీ స్థానాలు కూడా గెలిచే పరిస్థితి లేదని మైసూరా తెలిపారు. సంఖ్యాబలం ఉన్న వారినే పిలుస్తారు తప్ప రెండు స్థానాలు కూడా గెలవలేని చంద్రబాబుకు ఫెడరల్ ఫ్రంట్‌లో స్థానమెక్కడుంటుందని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. పిలువని పేరంటానికి వెళ్లిన చందంగా తనను ఎవరూ పిలవకముందే గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ‘జేడీయూ, బీజేడీ, మమతాబెనర్జీ కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు పత్రికల్లో కథనాలొచ్చాయి. మేము కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా లౌకికవాదులతో జతకలుస్తాం’ అని మైసూరా వెల్లడించారు.

కాంగ్రెస్ చానళ్ల పట్ల బాబుకు ప్రేమ!

మీడియా స్వేచ్ఛపై బాబు విధానమిదేనా?
‘సాక్షి’ని బహిష్కరించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనం

సాక్షి, హైదరాబాద్: భావప్రకటనా స్వేచ్ఛపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కనీస అవగాహన ఏమైనా ఉందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు ప్రశ్నించారు. ‘సాక్షి’ మీడియాను వారి పార్టీ సమావేశాలకు బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం ఆయన దివాలాకోరు తనానికి నిదర్శనమన్నారు. ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు పత్రికల పట్ల ప్రవర్తించే విధానం ఇదేనా? అని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జూపూడి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కు అలవాటు పడిన చంద్రబాబు.. ప్రజాస్వామ్యమన్నా, ప్రజాస్వామ్య హక్కులన్నా సహించలేరని అన్నారు. సాక్షి లేనప్పుడు తనకు బాకా కొట్టే మీడియాను అడ్డుపెట్టుకొని చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాటలా వ్యవహరించారని ధ్వజమెత్తారు. సాక్షితో బాబు నిజస్వరూపం బయటపడే సరికి తట్టుకోలేకపోతున్నారన్నారు. ‘వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మీడియాను మేనేజ్ చేసుకొని తనకు అనుకూలంగా కథనాలు రాయించుకున్నారు. తన హయాంలో పల్లెలు సర్వనాశనమవుతున్న సమయంలో సబ్సిడీలు తప్పని రాయించుకున్నారు. వ్యవసాయం దండగన్నారు. ఉచిత విద్యుత్‌ను తప్పు పట్టారు. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తోందంటూ ఎద్దేవా చేశారు.’ అని వివరించారు. సాక్షి వచ్చే సరికి వారి పప్పులు ఉడకటంలేదని బాబు గిలగిల్లాడుతున్నారన్నారు. 

అలాగని సాక్షి చంద్రబాబు యాత్రల్ని, టీడీపీ ప్రకటలను గానీ వారి పార్టీ కవరేజిని ఎక్కడా ఆపిందిలేదని గుర్తుచేశారు. అయితే పత్రిక స్వేచ్ఛను తట్టుకోలేని చంద్రబాబు, తనకు వ్యతిరేకంగా కథనాలు రావడానికి వీల్లేదని చెప్పడం దురదృష్టకరమన్నారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేతగా మూడు దశాబ్దాల ప్రస్థానంలో ఎల్లో మీడియా వారు ఆయన్ని టార్గెట్ చేసి రాసేవారు. వైఎస్‌ను ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా అధికారంలోకి వచ్చాక అడ్డదిడ్డంగా రాస్తున్నా ఆ రెండు పత్రికల రాతల గురించి అభ్యంతరం వ్యక్తం చేశారేకానీ ఎన్నడూ బహిష్కరించలేదు. వారికి ప్రకటనలు నిలిపివేయలేదు. కానీ చంద్రబాబు ఇందుకు పూర్తి విరుద్ధంగా ‘సాక్షి’ ఏర్పాటునే వ్యతిరేకించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై సాక్షికి ప్రకటనలు ఇవ్వకుండా జీవోలు తీసుకొచ్చారు’ అని జూపూడి దుయ్యబట్టారు. 

కాంగ్రెస్ చానళ్ల పట్ల బాబుకు ప్రేమ!

సీఎం కిరణ్ రెండు చానళ్లు (ఐ న్యూస్, ఏటీవీ), ఒక దిన పత్రిక (కృష్ణా పత్రిక) కొనుగోలు చేసినా, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఓ చానల్ (జీ 24గంటలు) కొనుగోలు చేసినా చంద్రబాబు పల్లెత్తుమాట అనడంలేదని జూపూడి అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడటమే తమ లక్ష్యమని చెప్పుకునే బాబు వారి చానళ్ల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. 

Popular Posts

Topics :