26 February 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ముందు అరెస్టు చేయాల్సింది జేసీ బ్రదర్స్‌నే

Written By news on Saturday, March 4, 2017 | 3/04/2017


‘దగ్గుపాటి, హరికృష్ణ, తమ్ముడ్ని కూడా మోసం‌’
హైదరాబాద్‌: కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని, కేసులంటూ పెడితే ముందు బస్సు ప్రమాదంతో 11మంది ప్రాణాలు బలితీసుకున్న జేసీ బ్రదర్స్‌పైనే పెట్టాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లో జేసీ బ్రదర్స్‌ పదజాలం దారుణంగా ఉందని, వారి చరిత్ర ఏమిటో అందరికీ తెలుసని ఆయన మండిపడ్డారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై చాలా దారుణంగా ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వర్ల రామయ్య భాష కూడా చాలా అభ్యంతరకరంగా ఉందన్న ఆయన జేసీ బదర్స్‌, వర్ల రామయ్య, చింతమనేని మాటలు సరికాదని అన్నారు. మూడేళ్లు పరిపాలన చేసిన ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం టీడీపీకి లేదని చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీ నేత శ్రీకాంత్‌రెడ్డిపై నోరు పారేసుకున్నారని, చంద్రబాబు సాక్షిగా జేసీ నోరు జారారని, ఇంకా అలాగే చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ముందు అరెస్టు చేయాల్సింది జేసీ బ్రదర్స్‌నేనని అన్నారు. హత్యారాజకీయాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకునే మనస్తత్వం చంద్రబాబుదేనని, ఎన్టీఆర్‌ మరణానికి కారణం చంద్రబాబే ధ్వజమెత్తారు. వంగావీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.


బంధువులను నమ్మించి మోసం చేసిన ఘనత చంద్రబాబుదని, దగ్గుపాటి, హరికృష్ణ, ఆఖరికి సొంత తమ్ముడిని కూడా మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని తీవ్ర ధ్వజమెత్తారు. రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు అని, ఇతరులకు చెప్పేముందు చంద్రబాబు ముందు తన సంగతి చూసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు ఎంతో మందిని బెదిరించారని, ఆయన పెట్టే పిచ్చి కేసులకు ఎవరూ భయపడరని, రోజాను అడ్డుకోవడంతో చంద్రబాబు అరాచకం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, సోనియా ఏకమై కేసులు పెట్టినా వైఎస్‌ జగన్‌ బెదిరిపోలేదని, కుట్రలు, కుతంత్రాలను వైఎస్‌ జగన్‌ ఒంటిచేత్తో ఎదుర్కొన్నారని అంబటి గుర్తు చేశారు.

'ఓటుకు కోట్లు' వీడియోను చూడలేదేం?


'ఓటుకు కోట్లు' వీడియోను చూడలేదేం?
⇒ బాబుకు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ప్రశ్న
⇒ మంత్రివర్గం చూడాల్సిన వీడియోలు చాలా ఉన్నాయని ఎద్దేవా


గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌):  కేబినెట్‌ సమావేశంలో రోడ్డు ప్రమాద ఘటన బాధితులను విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించడానికి సంబంధించిన వీడియోలను చూశామని చెబుతున్న సీఎం చంద్రబాబు మంత్రివర్గం అసలు చూడాల్సిన వీడియాలు చాలానే ఉన్నాయని వైఎస్సార్‌సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా ఎద్దేవా చేశారు.

‘రాష్ట్రంలో ఏ సీఎం చేయని దౌర్భాగ్యమైన పని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డిని పంపించి రూ.5 కోట్లతో ఎమ్మెల్యేను కొంటూ పట్టుబడిన వీడియోలను చూడాలి. ‘మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ’ అంటూ అందరి పరువు తీసిన వ్యక్తి కేబినెట్‌ హెడ్‌గా ఏవిధంగా పనికొస్తాడు? మీలాంటి వాళ్లు మాకెందుకంటూ కేబినెట్‌ లో తీర్మానం చేయండి. గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో తొక్కిసలాటకు కారణమై 29 మందిని చంపేశా రు. కేబినెట్‌ ఆ వీడియో చూడాలి..’ అని రోజా అన్నారు.

శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె విలేకరుల తో మాట్లాడారు. ‘చింతమనేని ప్రభాకర్‌ ఇసుకను అడ్డ దిడ్డంగా దోచుకుంటుంటే అడ్డుకున్న తహశీల్దార్‌ వనజా క్షిని ఆయన ఏవిధంగా కొట్టాడో ఆ వీడియోలు చూడండి. అలాగే చింతమనేనిని అరెస్ట్‌ చేయాలని కేబినెట్‌ తీర్మానం చేస్తే ప్రజలు హర్షిస్తారు. టీడీపీకే చెందిన గుంటూరు జెడ్పీ చైర్మన్, మైనార్టీ మహిళ జానీమూన్‌.. మంత్రి రావెల కిషోర్‌బాబు వల్ల తన కుటుంబానికి ప్రాణ గండం ఉందని బోరున విలపిం చారు. అందువల్ల ఆయన్ను బర్తరఫ్‌ చేయాలని కేబినెట్‌లో తీర్మానిస్తే ప్రజలు హర్షిస్తారు..’ అని రోజా అన్నారు. నారాయణ కాలేజీలో తమ పిల్లలు చనిపో తుంటే ఆ తల్లులు కడుపుకోతతో  ఏడు స్తున్న వీడియోలు కూడా చూడాలన్నారు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు వచ్చిన జగన్‌ తీరును ఖండిస్తున్నామని కేబినెట్‌ తీర్మానం చేయడం సిగ్గుమాలిన రాజకీయాలకు నిదర్శనమని ఎద్దేవాచేశారు.

‘లోకేష్‌కు అండగా ఉన్నాడని కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ కేసులో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను కాపాడింది మీరు కా దా? ఆ రాకెట్‌లో 200 సీడీలు దొరికితే సీపీ గౌతంసవాంగ్‌ ఆ సీడీలు ఎందుకు కేబినెట్‌కు ఇవ్వలేదు? వాటి మీద చర్చ ఎందుకు జరగలేదు?’ అని రోజా నిలదీశారు.‘మీ మనవడిని ఎత్తుకుని ముద్దాడాడని పది మంది మృతికి కారణమైన దివాకర్‌ ట్రావెల్స్‌ అధినేత, ఎంపీ జె.సి.దివా కర్‌రెడ్డిని కాపాడుతున్నారా?’ అని చంద్రబాబును రోజా ప్రశ్నించారు. తక్షణమే దివాకర్‌ ట్రావెల్స్‌ యాజ మాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

కలెక్టర్, డాక్టర్‌పై చర్యలు తీసుకోండి..
వైఎస్‌ జగన్‌ భుజం మీద చేయి వేసి లాగిన కలెక్టర్‌పై, చేతిలో ఉన్న పేపర్స్‌ లాక్కున్న డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నాయకుడు తన బాధ్యత నిర్వర్తిస్తుంటే ఆ పనికి విఘాతం కలిగించిన కలెక్టర్, డాక్టర్‌పై విచారణ చేపట్టాలన్నారు.

చంద్రబాబే మానసిక రోగి


చంద్రబాబే మానసిక రోగి
వైఎస్సార్‌సీపీ నేత కరుణాకర్‌రెడ్డి ధ్వజం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబే ఒక మానసిక రోగి అని, రాష్ట్రానికి పట్టిన పీడ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఎంపీ బస్సు ప్రమాదానికి గురై అనేకమంది చనిపోతే యాజమాన్యాన్ని శిక్షించాల్సిందిపోయి.. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన, గాయపడిన వారి పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాజకీయం చేయడం దుర్మార్గమని అన్నారు. పైగా అధికారులపై ఎగబడినట్టు కేబినెట్‌లో తీర్మానాలు చేయించటం హాస్యాస్పదమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ప్రమాద స్థలానికి సమీపంలోనే ఉండి కూడా అక్కడికి రాలేదని గుర్తుచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం భూమన విలేకరుల తో మాట్లాడారు. బస్సు ఘటనకు బాధ్యుడైన డ్రైవర్‌ చనిపోయినప్పడు పోస్టుమార్టం చేయాల్సిన చట్టబద్ధ వ్యవహారాన్ని పక్కనపెట్టి శవాన్ని తరలించడం అన్యాయమని ప్రశ్నించి, వివరణ కోరడం తప్పా...? అని నిలదీశారు. చంద్రబాబు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను అంతు చూస్తానని గతంలోబెదిరించింది వాస్తవం కాదా అని నిలదీశారు. ‘అధికారులను జైలుకు పంపిస్తానంటూ బెదిరించాడు, ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు..’ అంటూ ప్రతిపక్ష నేతపై కేబినెట్‌లో తీర్మానం చేయడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని భూమన ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయని, అధికారులు మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు.

వెల్లంపల్లి శ్రీనివాస్ సహా 20 మంది అరెస్ట్

Written By news on Thursday, March 2, 2017 | 3/02/2017


వెల్లంపల్లి శ్రీనివాస్ సహా 20 మంది అరెస్ట్
విజయవాడ: వైఎస్ఆర్ సీపీ నేతలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద సంఘటనకు సంబంధించి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా ధర్నాకు దిగిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ సహా 20 మందిని అరెస్ట్ చేశారు. వారిని ఈ రోజు ఉదయం నుంచి ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.

వెల్లంపల్లి శ్రీనివాస్‌పై నాన్‌బెయిలబుల్‌ కేసు పెట్టామని పోలీసులు చెప్పారు. కాగా కేసుల విషయంలో పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. పోలీసుల వైఖరికి నిరసనగా ఉంగుటూరు పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.

చంద్రబాబే అధికారులతో మాట్లాడిస్తున్నారు


చంద్రబాబే అధికారులతో మాట్లాడిస్తున్నారు
హైదరాబాద్: దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని రక్షించేందుకే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం విషయంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా తరలించేందుకు ప్రయత్నించారని, వైఎస్ జగన్ ఈ విషయం గురించి డాక్టర్, కలెక్టర్‌ను అడిగారని చెప్పారు. పోస్టుమార్టం చేయకపోవడం చట్టవిరుద్ధమని, పోస్టుమార్టం చేయకుండా మృతదేహాన్ని పంపిస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని వైఎస్ జగన్ అన్నారని, చట్టం గురించి మాట్లాడటం తప్పా అని అంబటి ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రశ్నించాకే డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారని చెప్పారు.  


ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో నీతినిజాయితీ ఉన్నవారు ఉన్నారని, పోస్టుల కోసం కక్కుర్తిపడేవారు ఉన్నారని అంబటి అన్నారు. ముఖ్యమంత్రులు పదవిలో ఐదేళ్లే ఉంటారని, ఐఏఎస్‌లు చాలాకాలం ఉంటారని చెప్పారు. వ్యవస్థలు శాశ్వతం తప్ప వ్యక్తులు కాదన్న విషయం మరిచిపోవద్దని, చంద్రబాబు చెప్పినట్టు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు చేయడం సరికాదని అన్నారు. చంద్రబాబు జేబులో బొమ్మల్లా ఉండొద్దని, ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. ప్రొటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై ఉందని, ప్రతిపక్ష నేతను గౌరవించాలని అన్నారు. దివాకర్ ట్రావెల్స్ నిబంధనలు పాటించకపోవడం వల్లే దుర్ఘటన జరిగిందని, అసలు నేరస్తులను వదిలి వైఎస్ జగన్‌ను నేరస్తునిగా చిత్రీకరించే యత్నం సరికాదనన్నారు. చంద్రబాబే అధికారులతో మాట్లాడిస్తున్నారని, వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని అంబటి పేర్కొన్నారు. చంద్రబాబుకు జైలు భయం పట్టుకుందని, ఓటుకు కోట్లు కేసులో తప్పించుకునేందుకు ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుని తిరుగుతున్నాని విమర్శించారు.

వైఎస్‌ఆర్‌ సీపీలోకి నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు


వైఎస్‌ఆర్‌ సీపీలోకి నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు
హైదరాబాద్‌ : నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ఇందుకూరుపేట ఎంపీపీ కైలాసం రేణుకతో పాటు పలువురు ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్‌ తదితరులకు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాగా జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌ సీపీ  నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా  వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. కాగా  హిందూ ధర్మ ప్రచార సమితి ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు, రాష్ట్ర బీజేపీ నేత ఏలేశ్వరపు జగన్‌ మోహన్‌ రాజు సహా పలువురు బ్రాహ్మణ నేతలు నిన్న వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన విషయం తెలిసిందే.

ప్రతిపక్షనేత చేసిన నేరమేమిటి?


నందిగామ ఆస్పత్రిలో ఏం జరిగింది?

 
వైఎస్‌ జగన్ ఏదో చేశారంటూ గగ్గోలు పెడుతున్న టీడీపీ నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవమెంత? ప్రాణాలు పోగోట్టుకున్న వారిని పరామర్శించాల్సింది పోయి ఘటనా స్థలికి వెళ్లిన ప్రతిపక్షనేతను ఎందుకు తప్పుబడుతున్నారు? వాస్తవాలేంటీ? వక్రీకరణలేంటీ? ఓ పెద్ద ప్రమాదం జరిగినపుడు బాధ్యతగలిగిన ప్రతిపక్షనేతగా హుటాహుటిన అక్కడకు వెళ్లడం, బాధితులను ఓదార్చడంతోపాటు వారికి న్యాయం జరిగేందుకు ప్రయత్నించడమే ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ చేసిన నేరం!

జగన్‌ అక్కడకు వెళ్లకపోయి ఉంటే అసలు డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేవారా? పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాలను తరలించేసేందుకు అధికారయంత్రాంగం, డాక్టర్లు ప్రయత్నించడం నిజం కాదా? కృష్ణాజిల్లాలోనే ఉన్న ప్రభుత్వాధినేత చంద్రబాబునాయుడు నందిగామ ఎందుకు వెళ్లలేకపోయారు? పైగా అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ప్రతిపక్షనేతపై కేసులు నమోదు చేయడం చూస్తేనే ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన ఉన్నదో, ఎవరి మేలు కోసం పనిచేస్తున్నదో అర్ధమౌతున్నదని విశ్లేషకులంటున్నారు.
ప్రతిపక్షనేతగా కేబినెట్‌ మంత్రి హోదా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఆస్పత్రిలో ఉన్న అధికారుల విధులకు ఆటంకం కలిగించడమేమిటి? ప్రొటోకాల్‌ ప్రకారం కలెక్టర్‌ కన్నా ప్రతిపక్షనేతది పెద్ద హోదాయే కదా? పైగా జగన్‌ వస్తున్నాడంటూ అధికారులే హడావిడి చేశారని, ఆగమేఘాలపై అన్ని కార్యక్రమాలూ పూర్తిచేసి శవాలను తీసుకెళ్లాల్సిందిగా తమను వత్తిడి చేశారని మృతుల బంధువులు చెబుతున్నారు. జగన్‌ ఎవరినీ బెదిరించలేదని, దూషించలేదని, ఎవరి విధులకూ ఆటంకం కలిగించలేదని వారు వివరించారు. మొదట నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు జగన్‌ వస్తున్నారని తెలుసుకునే ఆగమేఘాలమీద స్పందించారని వారు తెలిపారు.

వాస్తవాలనెందుకు మరుగుపరుస్తున్నారు?
నిజానికి హాస్పటల్‌కు వెళ్లడానికి ముందే జగన్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. డివైడర్‌ను ఢీకొన్న బస్సు గాలిలో 100 అడుగులు ప్రయాణించి కల్వర్టులో పడిపోయింది. దానికి కారణం మితిమీరిన వేగం లేదా డ్రైవర్‌ తాగి ఉండాలని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఆయన హాస్పటల్‌కు వెళ్లారు. అక్కడ ఒక పెద్ద హాలులో కొన్ని మృతదేహాలను కట్టకట్టి ఉంచారు. ఒకటి రెండు మృతదేహాలను సుమోలలో ఎక్కిస్తున్నారు. బాధితుల బంధువులతో జగన్‌ మాట్లాడారు. తరలించడానికి సిద్ధంగా ఉన్న మృతదేహాలలో డ్రైవర్‌ మృతదేహం కూడా ఉందని డాక్టర్లు చెప్పారు. ‘పోస్టుమార్టం అయిపోయిందంటున్నారు.. డ్రైవర్‌ తాగి ఉన్నాడా’ అని డాక్టర్‌ను జగన్‌ అడిగారు. జవాబిచ్చేందుకు డాక్టర్‌ తడబడ్డారు. పోస్టుమార్టం చేయలేదు అని చెప్పారు. పోస్టుమార్టం చేయాల్సిందిగా అభ్యర్థించే పత్రాల నకళ్లలో ఒకదానిని జగన్‌కు డాక్టర్‌ అందించారు. అదే సమయంలో జగన్‌ వెనక ఉన్న కలెక్టర్‌.. చెప్పవద్దు అంటూ డాక్టర్‌కు సైగలు చేయడం కనిపించింది. దాంతో అక్కడే ఉన్న మీడియాతో జగన్‌ మాట్లాడుతూ ‘ఇదీ పరిస్థితి. డాక్టర్‌ పోస్టుమార్టం చేయలేదు అని చెబుతున్నారు. మరోవైపు డ్రైవర్‌ మృతదేహాన్ని పంపించివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని చెప్పారు.

ఆ సందర్భంలోనే జగన్‌ కలెక్టర్‌తో మాట్లాడుతూ ‘మీరు తప్పు చేస్తున్నారు.. ఇంత పెద్ద సంఘటన జరిగినపుడు విచారణతో సహా అన్నీ పద్ధతి ప్రకారం జరిగేలా చూడాల్సిన మీరు నిబంధనలకు విరుద్ధంగా చేస్తే మీకే నష్టం. బాధితుల పక్షాన నిలబడకపోతే అందరూ జైలుకు పోవలసి వస్తుంది.’ అని అన్నారు. కేసు విచారణకు సంబంధించిన కీలకమైన అంశాన్ని జగన్‌ లేవనెత్తడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఆయన ప్రశ్నించిన తరువాత వెంటనే డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. విజయవాడకు చెందిన ప్రభుత్వ ఫోరెన్సిక్‌ వైద్యుడు శ్రీనివాస్‌ నాయక్‌ పోస్టుమార్టం చేశారు. కొన్ని శరీర భాగాలను పరీక్షల కోసం రీజనల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ముండ్లపాడు బస్సు ప్రమాద ఘటనలో వాస్తవాలివీ.. మరి వీటిని ఎందుకు మరుగునపరుస్తున్నారు.. ప్రశ్నించిన ప్రతిపక్షనేతపై కేసులు పెట్టడమేమిటని ప్రజలంతా విస్తుపోతున్నారు.

Popular Posts

Topics :