13 November 2011 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

చేతగాని ప్రభుత్వమిది: వైఎస్ జగన్

Written By news on Saturday, November 19, 2011 | 11/19/2011

గుంటూరు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లల చదువుల్లోనూ కోత విధిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. గతేడాది స్కాలర్‌షిప్‌లతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేని చేతగాని ప్రభుత్వమిదని విమర్శించారు. దివంగత మహానేతపై కేసులు పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. రచ్చబండ పేరుతో ప్రజలను కిరణ్ సర్కారు మోసం చేస్తోందన్నారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు అందాలన్న వైఎస్ ఆశయాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వైఎస్ హయాంలో మిగతా రాష్ట్రాల్లో 48 లక్షల ఇళ్లు నిర్మిస్తే ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత మహానేతకు దక్కుతుందన్నారు.

కాంగ్రెస్ సర్కారును మోస్తున్న బాబు: జూపూడి

ఒంగోలు: దద్దమ్మ ప్రభుత్వమని కిరాణ్‌కుమార్‌రెడ్డి సర్కారును విమర్శిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు మోస్తున్నారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలను పార్లమెంట్ తరహాలో రెండు వారాలు కొనసాగించాలన్నారు. అసెంబ్లీని సరిగా నడిపిస్తే ఈ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలవుతాయని జూపూడి అన్నారు.

రిలయన్స్ మరో షాక్!
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రానికి రిలయన్స్ మళ్లీ ‘షాక్’ ఇచ్చింది. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో గ్యాసు ఉత్పతి తగ్గిపోయిందనే సాకుతో.. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు రోజుకు ఒక మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) చొప్పు న గ్యాసు సరఫరాను తగ్గించింది. దీంతో 200 మెగావాట్ల (సుమారు 5 మిలియన్ యూనిట్లు) విద్యుత్ ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. ఈ మేరకు విద్యుత్ కొరతను తీర్చేందుకు బయటి మార్కెట్ నుంచి అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యూనిట్‌కు అదనంగా రూ.2 చొప్పున చెల్లించాల్సి ఉండటంతో రోజుకు 5 ఎం.యూలకు గాను సుమారు కోటి రూపాయల వ్యయం అవుతుంది. రోజుకు కోటి చొప్పున నెలకు రూ. 30 కోట్ల అదనపు భారం ప్రభుత్వ ఖజానాపై పడుతుందన్న మాట. 

70% పీఎల్‌ఎఫ్‌కు తగ్గిన గ్యాసు సరఫరా
రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ ప్లాంట్లకు (జీవీకే, వేమగిరి, ల్యాంకో, కోనసీమ) ఫాల్ బ్యాక్ (తాత్కాలిక ప్రాతిపదికన) కింద కేటాయించిన 2.36 ఎంసీఎండీల గ్యాసుకు గత ఏడాది అక్టోబర్‌లో రిలయన్స్ కోత కోసింది. ఫలితంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. తాజాగా ఒక ఎంసీఎండీ చొప్పున గ్యాసు సరఫరా తగ్గడంతో మరో 200 మెగావాట్ల విద్యుత్‌కు నష్టం వాటిల్లింది. రాష్ర్టంలోని నాలుగు విద్యుత్ ప్లాంట్లకు 75 శాతం ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)కు రిలయన్స్ గ్యాసు సరఫరా చేస్తోంది. మరో 15 శాతం పీఎల్‌ఎఫ్‌కు ఫాల్ బ్యాక్ గ్యాసును కేటాయించింది. తొలుత ఈ ఫాల్ బ్యాక్ గ్యాసుకు కోత విధించింది. ప్రస్తుతం 75 శాతం పీఎల్‌ఎఫ్ గ్యాసులో కోత కోసింది. దీంతో ఇప్పుడు కేవలం 70 శాతం పీఎల్‌ఎఫ్‌కు మాత్రమే ప్రస్తుతం గ్యాసు సరఫరా అవుతోంది. దీంతో ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ గ్యాసు లేకపోవడంతో విద్యుత్ ప్రాజెక్టులు తక్కువ విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కావాల్సి వస్తోంది. 

రబీ సాగుపైనా ప్రభావం!: కేజీ బేసిన్‌లో గ్యాసు ఉత్పత్తి 48 ఎంసీఎండీల నుంచి 41 ఎంసీఎండీలకు తగ్గిపోయిందని రిలయన్స్ చెబుతోంది. ఈ నేపథ్యంలో కోత పడిన గ్యాసును ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. ఇదే పరిస్థితి భవిష్యత్తులోనూ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నా రు. హైదరాబాద్‌లో 3 గంటలు, జిల్లా కేంద్రాల్లో 4 గంటలు, మండల కేంద్రాల్లో 6, గ్రామాల్లో 8 గంటల పాటు విద్యుత్ కోత అమలవుతోంది. పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు కోత అమలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రిలయన్స్ గ్యాసు సరఫరా తగ్గించడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనిపక్షంలో ప్రజలు చలికాలంలోనూ విద్యుత్ కోతలతో అవస్థలు పడకతప్పదు. రబీలో రైతులు విద్యుత్ కోతలతో సతమతంకాక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

బాబు పై మూడ్రోజుల్లో కేసులుఆయన బినామీలపై కూడా.. ఆ వెంటనే విచారణ మొదలు
అదే బాటలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్
దర్యాప్తు బృందాల ఏర్పాటుపై సీబీఐలో పైస్థాయిలో జరుగుతున్న కసరత్తు

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన బినామీల వ్యాపారాలు, ఆర్జనలు, ఆస్తులపై దర్యాప్తుజరిపి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో మూడు నాలుగు రోజుల్లో సీబీఐ వారిపై కేసులు నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు రాజకీయాల్లో అడుగు పెట్టింది మొదలు మోసాలు, వంచనలు, అబద్ధాలతో దేశ విదేశాల్లో విపరీతంగా ఆస్తులు పోగేశారని, సన్నిహితులను బినామీలుగా చేసుకుని వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించారని, వీటన్నింటిపైనా సమగ్ర విచారణ జరపాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వై.ఎస్.విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దాన్ని పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం అందులో ఆరోపణలకు ఆధారాలున్నాయని భావించిన మీదట ఈ నెల 14న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ), రాష్ట్ర డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శితో దర్యాప్తునకు ఆదేశించిన విషయం విదితమే. మూడు నెలల్లోగా విడివిడిగా నివేదికలివ్వాలని దర్యాప్తు సంస్థలకు హైకోర్టు గడువు నిర్దేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన బినామీలపై కేసులు నమోదుచేసి దర్యాప్తు ఆరంభించడానికి సీబీఐ సమాయత్తమవుతోంది. ఇందుకోసం సీబీఐలో పైస్థాయిలో కసరత్తు శుక్రవారం ఆరంభమైంది. ఈ కసరత్తు వచ్చే రెండుమూడు రోజుల్లో పూర్తవుతుందని, ఆ వెంటనే కేసులు నమోదుచేసి విచారణ ఆరంభిస్తారని సీబీఐలోని విశ్వసనీయ ఉన్నతస్థాయి వర్గాలు ఢిల్లీలో వెల్లడించాయి.

సిద్ధమవుతున్న ఈడీ..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ)లోనూ ఇదే తరహా కసరత్తు జరుగుతోందని అందులోని వర్గాలు చెబుతున్నాయి. కేసుల నమోదు, దర్యాప్తు మొదలు ఎప్పుడు ఉండవచ్చో వెల్లడించడానికి ఈడీ వర్గాలు నిరాకరించాయి. ‘‘ప్రతిదీ సమయానుసారం ముందుకు కదులుతుంది. వివరాలు ఇవ్వడం సాధ్యం కాదు’’ అని ఆ వర్గాలు స్పష్టంచేశాయి.

సీబీఐ డెరైక్టర్‌తో లక్ష్మీనారాయణ భేటీ
ఢిల్లీ వచ్చిన జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ శుక్రవారం సీబీఐ డెరైక్టర్ ఎ.పి.సింగ్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి దేశంలోని వివిధ జోన్లకు చెందిన సీబీఐ కీలకాధికారులు హాజరయ్యారు. సమావేశం ముగిశాక లక్ష్మీనారాయణ విడిగా డెరైక్టర్‌తో భేటీ అయ్యారని, రాష్ట్ర కేసుల్లో పురోగతిపై చర్చలు జరిపారని తెలుస్తోంది. ఓఎంసీ, ఎమ్మార్ ప్రాపర్టీస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కేసుల్లో దర్యాప్తు సంగతులను లక్ష్మీనారాయణ ఆయనకు వివరించినట్టు సమాచారం. కొత్తగా చంద్రబాబు, ఆయన బినామీల ఆస్తులపై దర్యాప్తునకు అదనంగా అవసరమైన సిబ్బంది, ఇతర సౌకర్యాలను సత్వరమే కల్పించాలని కోరినట్లు తెలియవచ్చింది.

దర్యాప్తు టీమ్‌ల ఏర్పాటుపై తీవ్ర చర్చ..
చంద్రబాబు ఆస్తుల దర్యాప్తు కోసం చేయాల్సిన ఏర్పాట్లపై లక్ష్మీనారాయణతో డెరైక్టర్ విసృ్తతంగానే మాట్లాడారని చెబుతున్నారు. ప్రధానంగా దర్యాప్తు టీమ్‌ల ఏర్పాటుపైనే వీరిద్దరూ చర్చించుకున్నారని, చాలామందిని విచారించాల్సిన పరిస్థితి ఉన్నందున ఎక్కువమంది అధికారులే అవసరమని లక్ష్మీనారాయణ తెలిపారని అంటున్నారు. ఈ సమావేశం తర్వాత సీబీఐ ఉన్నతస్థాయి వర్గాలు పేరు వెల్లడించవద్దన్న షరతుపై మాట్లాడుతూ, వచ్చే వారం మొదట్లో కేసు నమోదు చేస్తారని, ఆ వెంటనే దర్యాప్తు మొదలుపెట్టవచ్చని పేర్కొన్నాయి. కొత్త కేసుల దర్యాప్తు బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై పైస్థాయిలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, బహుశా కేసుల నమోదు సమయానికి ఆ విషయమై స్పష్టత రావొచ్చని ఆ వర్గాలు చెప్పాయి.

రామోజీకి హైకోర్టు షాక్
విశాఖ ఈనాడు స్థల వివాదంపై మూడు పిటిషన్లు కొట్టివేత
రామోజీ లేవనెత్తిన అంశాల్లో నిజాయితీ లేదన్న వాదనలతో కింది కోర్టు ఏకీభవించే ఉత్తర్వులు జారీ చేసిందని... అందులో తప్పు ఏమీ లేదన్న న్యాయమూర్తి
లీజు స్థలం విస్తీర్ణమెంతో మొదటి నుంచీ 
రామోజీకి తెలుసునని హైకోర్టు వ్యాఖ్య

హైదరాబాద్, న్యూస్‌లైన్: రామోజీరావుకు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. విశాఖలో ఈనాడు కార్యాలయం ఏర్పాటు నిమిత్తం తీసుకున్న భూమిని తిరిగి అప్పగించకుండా భూయజమానిని ముప్పుతిప్పలు పెడుతున్న రామోజీరావు చర్యలను తప్పుబట్టింది. ఈనాడు కార్యాలయ స్థల వివాదంలో తనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన మేజిస్ట్రేట్‌పై ఆరోపణలు చేస్తూ.. తన కేసును మరో జడ్జికి బదిలీ చేయాలంటూ రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇదే సమయంలో కింది కోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్, కౌంటర్లలో సవరణలకు సదరు కోర్టు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ రామోజీ దాఖలు చేసిన మరో రెండు పిటిషన్లను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గోడా రఘురాం శుక్రవారం 74 పేజీల తీర్పును వెలువరించారు. అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో 1974 నుంచి ఇప్పటివరకు రామోజీరావు చేస్తూ వచ్చిన పలు అవకతవకలను, కోర్టులకు చెప్పిన అవాస్తవాలను న్యాయమూర్తి తన తీర్పులో ఎండగట్టారు. ఇదే సమయంలో కింది కోర్టు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ రఘురాం సమర్ధించారు. 

అంతేకాక మేజిస్ట్రేట్‌పై రామోజీరావు చేసిన పలు ఆరోపణలను తోసిపుచ్చారు. 1974లో ఈనాడు కార్యాలయం ఏర్పాటు నిమిత్తం మంతెన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణ వర్మ (ఎం.ఎ.ఇ.కె.కె.వర్మ) నుంచి 2.70 ఎకరాల భూమిని రామోజీరావు లీజుకు తీసుకున్నారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో వర్మ నుంచి తీసుకున్న స్థల విస్తీర్ణాన్ని తగ్గించి చూపడం.. వర్మ స్థలాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసి, ప్రతిగా ప్రభుత్వం నుంచి ఉషోదయా పేరు మీద స్థలం పొందడం.. తనకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసిన మేజిస్ట్రేట్‌పై ఆరోపణలు చేయడం తదితర అంశాలపై రామోజీ చర్యలను న్యాయమూర్తి దుయ్యబట్టారు. స్థలాన్ని లీజుకు తీసుకునే సమయంలో దాని విస్తీర్ణం ఎంతో తనకు తెలియదంటూ రామోజీ చెప్పడాన్ని తప్పుపట్టారు. లీజుకు తీసుకున్న స్థలం 11,034.78 చదరపు మీటర్లన్న విషయం రామోజీకి మొదటినుంచి స్పష్టంగా తెలుసునని పేర్కొన్నారు. వర్మకు పంపిన నోటీసుల్లో లీజు విస్తీర్ణం 9,200 చదరపు మీటర్లుగా రామోజీ పేర్కొనగా వర్మ దీనిపై అభ్యంతరం కూడా తెలిపారని గుర్తు చేశారు. 

వివిధ సందర్భాల్లో పలు ప్రభుత్వ సంస్థలు సర్వే చేసి, విస్తీర్ణం 9,200 చదరపు మీటర్లకు పైనేనని తేల్చిన విషయాన్ని కూడా న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో సైతం రామోజీ తాను లీజుకు తీసుకున్న స్థలం విస్తీర్ణం 11వేల చదరపు మీటర్లని చెప్పడాన్ని కూడా గుర్తుచేశారు. దీనికి సంబంధించి రామోజీకి వ్యతిరేకంగా కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎటువంటి దోషం లేదని స్పష్టంచేశారు. మేజిస్ట్రేట్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. ఆ తరువాత మరో కేసులో సవరణలు చేసేందుకు అనుమతివ్వాలన్న రామోజీ పిటిషన్‌ను తోసిపుచ్చిన మేజిస్ట్రేట్‌పై ఆరోపణలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి సవివరంగా తీర్పులో చర్చించారు.

సవరణ పిటిషన్‌ను తోసిపుచ్చడానికి మేజిస్ట్రేట్ చూపిన కారణాలు సరైనవని జస్టిస్ రఘురాం తేల్చి చెప్పారు. మేజిస్ట్రేట్ పక్షపాతంతో, ముందుగానే నిర్ణయానికి వచ్చి ఉత్తర్వులు జారీ చేయలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రామోజీ లేవనెత్తిన అంశాలు దురుద్దేశపూర్వకమని, నిజాయితీగా లేవని వర్మ చేసిన వాదనలతో కింది కోర్టు ఏకీభవించే అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసిందని, అందులో తప్పేమీ కనిపించడం లేదని న్యాయమూర్తి తెలిపారు. మేజిస్ట్రేట్ పక్షపాతంతో ఉత్తర్వులు జారీ చేశారన్న రామోజీ ఆరోపణలకు ఆధారం లేదని తేల్చారు. తన ముందున్న ఆధారాలు, వాస్తవాల ఆధారంగా కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ మూడు వ్యాజ్యాలను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ రఘురాం తీర్పులో పేర్కొన్నారు. ఈ మూడు వ్యాజ్యాల్లో తామిచ్చిన తీర్పు కింది కోర్టుకు ఎటువంటి అడ్డంకి కాదని తేల్చి చెప్పారు.

ఇదీ రామోజీ అక్రమాల కథ...

విశాఖపట్నంలోని సీతమ్మధార సర్వే నంబర్ 50/4లో మంతెన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణ వర్మకు చెందిన 2.70 ఎకరాల భూమి (13,078 చదరపు గజాలు)ని 33 సంవత్సరాల లీజు ఒప్పందంతో ఉషోదయ పబ్లికేషన్స్ పేరు మీద 1974, మార్చి 30న రామోజీ తీసుకున్నారు. లీజు గడువు ముగిసిన వెంటనే భూమిని తిరిగి అప్పగించేటట్లు ఇరుపక్షాలు ఒప్పందం చేసుకున్నాయి. మొదటి 14 సంవత్సరాలు రూ.2,500లను అద్దెగా, మిగిలిన సంవత్సరాలకు రూ.3వేలుగా అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆ స్థలంలో రామోజీ ‘ఈనాడు’ కార్యాలయం ఏర్పాటృ చేశారు. అయితే స్థల యజమాని వర్మకు తెలియకుండానే, ఆయనకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రామోజీరావు తాను లీజుకు తీసుకున్న స్థలం నుంచి 517 చదరపు మీటర్ల స్థలాన్ని రోడ్డు వెడల్పు నిమిత్తం ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. దానికి ప్రతిఫలంగా సీతమ్మధార సర్వే నంబర్ 52లోని 872 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలని 1985, జనవరి 17న ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఆ స్థలాన్ని వర్మ పేరు మీద కాకుండా ‘‘డెరైక్టర్, ఈనాడు’’ పేరు మీద కేటాయించాలని కోరడం గమనార్హం. రామోజీ కోరిన వెంటనే, అప్పటి కలెక్టర్ ఎస్.వి. ప్రసాద్ ఆగమేఘాల మీద స్పందించారు. ఆ భూమి స్వాధీనానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశిస్తూ 1985, ఏప్రిల్ 17న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారం భూయజమాని వర్మకు సమాచారం అందించకుండానే జరపడంలో రామోజీ దురుద్దేశం స్పష్టమవుతోంది. 

పదివేలిస్తా.. పండగ చేసుకో...

వర్మ నుంచి 33 సంవత్సరాల లీజు ఒప్పందం ద్వారా భూమిని పొందిన రామోజీరావు, తిరిగి మరో 33 సంవత్సరాలకు లీజును పొడిగించాలంటూ 2006, సెప్టెంబర్ 27న వర్మకు నోటీసులు పంపారు. 1973లో చేసుకున్న ఈ ఒప్పందం 2007, మార్చి 31తో ముగుస్తుండటంతో.. నెలకు కేవలం రూ.10వేల చొప్పున అద్దె చెల్లిస్తానని రామోజీ ప్రతిపాదించారు. మరోసారి లీజు పొడిగింపునకు వర్మ తిరస్కరించారు. అంతేకాక తనకు పంపిన నోటీసుల్లో భూమికి కొత్త సరిహద్దులుండటం గుర్తించారు. దీంతో తన భూమి సరిహద్దులు తెలుసుకునేందుకుగాను లీజుకిచ్చిన ప్రాంతాన్ని ఓసారి సందర్శిస్తానని రామోజీకి సమాచారం పంపారు. వర్మ లీజు ప్రాంతాన్ని సందర్శిస్తే, తన అక్రమాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదనను రామోజీ తోసిపుచ్చారు. అంతేకాక లీజు ప్రాంగణంలోకి వర్మ అడుగుపెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ విశాఖపట్నం 7వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో సివిల్ సూట్ దాఖలు చేశారు. దీంతో రామోజీ అసలు రంగు తెలుసుకున్న వర్మ, తన స్థలం నుంచి రామోజీరావును ఖాళీ చేయించేటట్లు ఆదేశాలు ఇవ్వాలంటూ 2007లో రెంట్ కంట్రోలర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికే రామోజీ మూడు నెలలకుగాను రూ.9వేల మేర అద్దె బాకీ పడ్డారు. దీనిపై ఈనాడు చీఫ్ ఎడిటర్, చైర్మన్ హోదాలో రామోజీరావు, ఉషోదయ పబ్లికేషన్స్ మేనేజింగ్ డెరైక్టర్ హోదాలో కిరణ్‌లపై 2007, సెప్టెంబర్ 19న వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వర్మ ఫిర్యాదుపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వర్మ విధిలేని పరిస్థితుల్లో విశాఖపట్నం కోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను పరిశీలించిన విశాఖ కోర్టు.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. అటు తరువాత పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైకోర్టుకు చేరింది. హైకోర్టు ఆదేశాలతో రామోజీరావు, ఆయన కుమారుడు కిరణ్‌లపై విశాఖ పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

రామోజీ తీరుతో 123 సార్లు కేసు వాయిదా

విశాఖపట్నంలో ఈనాడు స్థలానికి సంబంధించి అక్కడి న్యాయస్థానంలో మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. స్థలం లీజు కాల పరిమితి 2007 మార్చితో ముగిసినా, కాలపరిమితిని పొడిగించాలని కోరుతూ జిల్లా కోర్టులో రామోజీ కేసు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు 9వ అదనపు జిల్లా కోర్టులో ఉంది. తన స్థలాన్ని రామోజీరావు ఖాళీ చేసి ఇవ్వాలని కోరుతూ స్థల యజమాని మంతెన ఆదిత్య బాలాజీవర్మ 2007లో కేసు వేశారు. ఈ కేసు ఈనెల 28వ తేదీన కోర్టు ముందుకు వస్తుంది. రామోజీరావు తీరు వల్ల ఇప్పటికి ఈ కేసులో 123 వాయిదాలు నడిచాయి. 2008లో రామోజీరావు తన ప్రింటింగ్‌ప్రెస్‌ను ఆటోనగర్‌కు తరలించడంతో ఆదిత్యవర్మ ఇదే కారణాన్ని చూపిస్తూ ఆర్‌సీసీ (ఆర్‌సీసీ 49/2008) కోర్టులో మరో కేసు వేశారు. ఈ కేసులో ఇప్పటికి 110 వాయిదాలు నడిచాయి. రామోజీరావు వేసిన కేసులో కోర్టుకు సమర్పించిన పత్రాల్లో 1986, అక్టోబర్ 25వ తేదీన ఈనాడు భూమిగా చెబుతూ ప్రభుత్వానికి సమర్పించిన పత్రాలను ఉటంకిస్తూ వర్మ మూడవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2010 దాకా ఈ కేసుపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వర్మ హైకోర్టులో రిట్ పిటిషన్ (క్రైం నం. 1160/2007) దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలతో కదిలిన పోలీసులు 2010, మే 18న చార్జిషీటు వేశారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాలతో రామోజీరావు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు, నాల్గవ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం 9వ అదనపు జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓఎస్ 212/2007లో రామోజీరావు హైకోర్టులో దాఖలు చేసిన సీఆర్‌పీలను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. వీటితో పాటు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులను ధ్రువీకరించింది.

జగనన్నకు నీరా‘జనం’

గుంటూరుసెంట్రల్, న్యూస్‌లైన్ : ఓదార్పుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే చూసి ఓర్వలేక ఎల్లో మీడియాలో అసత్య కథనాలు ప్రచురించి, ప్రసారం చేస్తున్నారని వైఎస్సార్‌కాంగ్రెస్ కృష్ణాజిల్లా నాయకుడు శీలం రాజా విమర్శించారు. అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌మోహనరెడ్డిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి అసత్యకథనాలు ప్రచురించడాన్ని నిరసిస్తూ పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా శీలం రాజా మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహనరెడ్డిని గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో ప్రజలు అపూర్వంగా ఆదరిస్తున్నారని చెప్పారు.

వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకుడు దర్శనపు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్‌జగన్‌మోహనరెడ్డి, వైఎస్ విజయమ్మలను కించపరిచే విధంగా కొన్ని పత్రికల్లో కథనాలు వెలువడడాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్ జగన్ ఓదార్పుయాత్రకు విద్యార్థులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విద్యార్థులు పానుగంటి చైతన్య, ఈశ్వరరెడ్డి, నరేంద్ర, తియ్యగూర వంశీ, అజయ్, దర్శనపు అశోక్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. 


జగనన్నకు నీరా‘జనం’


 
కర్లపాలెం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పుయాత్రకు గ్రామగ్రామాన జనం నీరాజనం పడుతున్నారని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం చెప్పారు. శుక్రవారం స్థానిక ఆర్యవైశ్య కల్యాణమండపంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రఘురాం మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగనన్న ప్ర భుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్ పథకాలకు తూట్లు పొడిచిందని విమర్శించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించకపోవడం, ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడం, ఇందిరమ్మ గృహాలకు కోత పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జగన్ ఓదార్పుయాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు.

అధికార, ప్రతిపక్షపార్టీలతో పాటు ఎల్లోమీడియా, సీబీఐ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నా లెక్కచేయకుండా ఓదార్పు కుటుంబాలకు అం డగా నిలుస్తానంటూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ స్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎం.శివరామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), యు.ఎస్.రామిరెడ్డి, మోదుగుల బసవపున్నారెడ్డి, సలగల రాజశేఖర్‌బాబు, దొంతిరెడ్డి జగదీష్‌కుమార్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, జి.శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాణం ఉన్నంత వరకూ జగన్‌వెంటే..

రాయవరం(తూర్పుగోదావరి)/ ఎమ్మిగనూరు(కర్నూలు)/విశాఖపట్నం/ చెరుకుపల్లి(గుంటూరు), న్యూస్‌లైన్:తామంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటామని వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు పలువురు శనివారం పునరుద్ఘాటించారు. తన రాజకీయ జీవితమంతా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతోనే ముడిపడి ఉంటుందని మాజీమంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పష్టం చేశారు. శనివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారా? అన్న ప్రశ్నకు... ఎవరెవరు ఎటు వెళుతున్నారన్న విషయం తనకు తెలియదని జవాబిచ్చారు. తాను మాత్రం జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉంటానని పునరుద్ఘాటించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగడానికి ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశం ఎప్పుడు జరిగేది త్వరలో వెల్లడిస్తామన్నారు. జగన్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలందర్నీ ఆహ్వానిస్తామని, ప్రస్తుత పరిస్థితులపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

వైఎస్ కుటుంబాన్ని విస్మరించను..


తాను కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు కొన్ని పత్రికలు, చానళ్లు తప్పుడు ప్రచారం చేయడం విచారకరమని, వైఎస్ కుటుంబాన్ని విస్మరించే ప్రసక్తే లేదని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తెలిపారు. ఆయన ఎమ్మిగనూరులో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ.. జగన్ బాటలోనే నడుస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల మనోగతాన్ని కాదని ఏ నిర్ణయం తీసుకోనన్నారు. వైఎస్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చటంవల్లే రాజీనామా చేశానని, ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కానని అన్నారు. మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాన్ని నమ్మిన వ్యక్తినన్నారు. 

స్పీకర్‌ను మర్యాద పూర్వకంగానే కలిశాం: కొర్ల భారతి, కృష్ణదాసు

తాము జగన్ వెంటే ఉంటామని, ఆయన ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యేలు కొర్ల భారతి, ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ తొలిసారి ఉత్తరాంధ్రకు వచ్చారని, ఈ నేపథ్యంలో తాము కేవలం మర్యాదపూర్వకంగానే ఆయన్ను శనివారం విశాఖ విమానాశ్రయంలో కలిసినట్టు వారు వివరించారు. స్పీకర్ ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ఆయన్ను ఎవరైనా కలవవచ్చని అన్నారు. రాజీనామాలపై ఆయనతో మాట్లాడలేదని వారు స్పష్టం చేశారు.

చీలిక తేవడానికి చేస్తున్న గోబెల్స్ ప్రచారం: సుచరిత

తాను రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్‌వెంటే కొనసాగుతానని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. జగన్‌వర్గం ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చి అధికారపార్టీకి లబ్ధి చేకూర్చాలని కొందరు గోబెల్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం ఆమె ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ తనతో మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ఫోన్‌లో మాట్లాడారనేది అవాస్తమన్నారు. కాంగ్రెస్, టీడీపీలు జగన్‌ను ఎదుర్కోలేక ఆయనకు నైతికంగా మద్దతిస్తున్న ఎమ్మెల్యేలపై వదంతులు సృష్టించి ప్రతిష్ట దిగజార్చే పనులు చేస్తున్నాయని దుయ్యబట్టారు. జిల్లాలో జరుగుతున్న జగన్ ఓదార్పుయాత్రలో తాను పాల్గొంటున్నానని, మరోవారం తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రారంభమయ్యే ఓదార్పుయాత్ర కోసం ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

నగరం, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుకూల ఎమ్మెల్యేలపై కాంగ్రెస్, టీడీపీ నాయకులు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని మానుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హితవు పలికారు. రాజకీయంగా వైఎస్ జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. నగరంలో శుక్రవారం జరిగిన ఓదార్పుయాత్రలో వైఎస్ జగన్‌ను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కలిశారు. 

యాత్ర జరిగినంత వరకూ జగన్ వెంటే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ తాను జగన్‌మోహన్‌రెడ్డికి దూరమవుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కావాలని పదేపదే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ వెంటే నడుస్తాను. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ రాజీనామా చేశాను. దానికే కట్టుబడతాను’ అని పిన్నెల్లి స్పష్టం చేశారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో కుట్ర చేసి ప్రస్తావించడంతో మనస్థాపం చెంది ఎమ్మెల్యేలుగా మేమంతా రాజీనామా చేశాం. ఇప్పటికీ వాటికి కట్టుబడి ఉన్నాం. జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఎట్టిపరిస్థితిలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. రాజకీయ భిక్ష ప్రసాదించిన వైఎస్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మేం ఎట్టి పరిస్థితిల్లోనూ జగన్‌తోనే ఉంటాం’’ అని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. గొంతులో ప్రాణం ఉన్నంతవరకు, రాజకీయాల్లో కొనసాగినంతకాలం వైఎస్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

తాము తిరిగి కాంగ్రెస్ వైపు వెళ్తున్నామంటూ ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారాన్ని వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు తోసిపుచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రస్తుతం దృష్టి సారిస్తున్నామని, కష్టాలు, ఇబ్బందులు వస్తే మాత్రం తామంతా జగన్‌వెంటే నడుస్తామని జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి తెలిపారు. 

కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచినందున ప్రభుత్వం పడిపోకుండా వయా మీడియాగా ఉండాలంటూ ప్రభుత్వంలోని వారినుంచి తమకు విన్నపాలున్నాయని, అదే సమయంలో ప్రజాసమస్యలూ పరిష్కార బాధ్యతా తమపై ఉందని వివరించారు. జగన్ కాంగ్రెస్‌లోకి వెళ్లే ప్రసక్తే ఉండదని, వాళ్లే ఆయన వద్దకు రావచ్చని అభిప్రాయపడ్డారు. జగన్ తమకు 20 కోట్లు, 50 కోట్లు ఇచ్చి ప్రలోభపెడుతున్నారంటూ కొందరు కాంగ్రెస్‌నేతలు విమర్శించడాన్ని ఖండించారు. జగన్ డబ్బుతో రాజకీయాలు చేసే వ్యక్తి కాదని చెప్పారు. వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా మొదట రాజీనామా చేసిన తాను దానికే కట్టుబడి ఉన్నట్లు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి చీమకుర్తిలో తెలిపారు. రాజకీయాల్లో ఉన్నా, లేకున్నా తమ కుటుంబం మొత్తం జగన్ వెంటే ఉంటామని ఉద్ఘాటించారు. తామంతా రాజీనామాలు ఆమోదించమనే కోరుతున్నామని, బంతి స్పీకర్ కోర్టులో ఉందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రకాశం జిల్లా పామూరులో మాట్లాడుతూ చెప్పారు.

తన కంఠంలో ప్రాణమున్నంతవరకు జగన్‌తోనే నడుస్తానని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుంటూరుజిల్లా నగరంలో చెప్పారు. జగన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారన్న ప్రచారం వాస్తవం కాదని, అదంతా మీడియా సృష్టేనని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రకటించారా? అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా ఉండడం లేదని ఆయన తప్పుబట్టారు.వెనిగళ్లవారిపాలెం(నగరం), న్యూస్‌లైన్ : నగరం మండలంలోని వెనిగళ్లవారి పాలెంలో శుక్రవారం చిలకా నిర్మల కుటుం బాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్చారు. అధైర్యపడవద్దు.. మీకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. నిర్మల కుమారులు మరి యదాస్, జాన్‌పాల్‌ను కుశల ప్రశ్నలు వేశారు. జగన్ రాకపై జాన్‌పాల్ చెప్పాడిలా..

ఓదార్పుకు ముందు..
ఐదేళ్ల కిందటే మా తండ్రి డేవిడ్‌రాజు మృతిచెందారు. అప్పటినుంచి అమ్మ నిర్మల కూలీ చేస్తూ మా ఇద్దర్నీ పోషించింది. వైఎస్సార్ మరణవార్త విని అమ్మ గుండెపోటుతో తనువు చాలించింది. జగనన్నయ్య వస్తారని ఎప్పటి నుంచో చెపుతున్నారు. ఆయన రాకకోసం అన్నయ్య నేను వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం.

ఓదార్పు తర్వాత..
అమ్మ నిర్మల మృతితో అనాధలమైన మాకు జగనన్నయ్య ఇచ్చిన భరోసా కొండంత అండగా ఉంది. నా చదువుకు సహాయం అందించి ఆదుకుంటానని ఆయన చెప్పారు. ఎప్పుడు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానన్నారు. ఈరోజును అన్నయ్య డేవిడ్, నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం.

పోస్టర్ ఆవిష్కరణ
నగరం, న్యూస్‌లైన్: తాడికొండ నియోజకవర్గంలో జరిగే ఓదార్పుయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ రూపొందించిన పోస్టర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, నగర కన్వీనర్లు మర్రి రాజశేఖర్, లేళ్ళ అప్పిరెడ్డి, నాయకుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) శుక్రవారం ఆవిష్కరించారు. నగరం మండలం గాలివారిపాలెంలో జగన్ బస చేసిన ఇంట్లో ఈ కార్యక్రమం జరిగింది. తాడికొండ నియోజకవర్గ నేత మందపాటి శేషగిరిరావు పోస్టర్‌ను రూపొందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చిన్నపరెడ్డి, అమర్, అప్పిరెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణారావు. వి.ప్రకాష్, ఎల్.శివరామిరెడ్డి, చిట్టా శివరామకృష్ణారెడ్డి, అల్లు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

మాపక్షాన పోరాడన్నా..
జగన్‌కు కాంట్రాక్టు అధ్యాపకుల వినతి
అన్నా.. మాపక్షాన నిల బడి పోరాడన్నా.. ఈ ప్రభుత్వం మా బాధల ను పట్టించుకోవడం లేదు. మన పార్టీ తరఫు న మా సమస్యలపై పోరాడి న్యాయం చేయన్నా.. అంటూ కాంట్రాక్టు అధ్యాపకులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయభాస్కరరెడ్డి నేతృత్వంలో కాంట్రాక్టు అధ్యాపకులు శుక్రవారం వైఎస్ జగన్‌ను చిన్నమట్టపూడి గ్రామంలో కలిశారు. త్వరలో అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో తమకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వాన్ని కోరితే ఎలాంటి స్పందన లేదని వారు వాపోయారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు అధ్యాపకులుగా చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నార ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడితే కచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ అంశంపై పోరాడ తానని జగన్ అధ్యాపకులకు భరోసా ఇచ్చారు.

జగన్‌ను కలసిన పీహెచ్‌సీ సిబ్బంది
నగరం, న్యూస్‌లైన్: అభిమానానికి అవధులు ఉండవు. వైద్యు లు, ఆర్యోగ సిబ్బంది, డిఫెన్స్ విద్యార్థులు ఇలా పలువురు జగన్‌కు విభిన్న రీతిలో స్వాగతం పలికారు. ఓదార్పుయాత్రలో భాగంగా నగరం గ్రామానికి వచ్చిన జగన్‌కు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఎం.సుహాసిని, సిబ్బంది పువ్వలు అందజేశారు. జగన్‌తో కరచాలనం చేయడానికి సుబ్బారెడ్డి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు బారులు తీరారు. అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

ఈ వరిపంట చూడయ్యా..
‘అయ్యా వరి పంట ఎండిపోతోంది. వేలకు వేలు అప్పులు తెచ్చి మరీ పంట సాగుచేసి కష్టపడి పండిస్తే మార్కెట్‌లో సరైన ధర లేక నష్టపోతున్నాం..’ అంటూ ఓ రైతు జగన్ వద్ద ఆవే దన వ్యక్తం చేశారు. ఈదుపల్లిలో విగ్రహావిష్కర ణకు వచ్చిన జగన్‌ను స్థానిక రైతు పిట్టు రామిరెడ్డి కలసి వరికంకులు చూపి అన్నదాతల దుస్థితి విన్నవించారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది కష్టాలు తొలిగిపోతాయని జగన్ భరోసా ఇచ్చారు.
-న్యూస్‌లైన్, నగరం

జగన్ ప్రత్యేక ప్రార్థనలు
అభిమానుల కోరిక మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఆలయాల్లో, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. జగన్ సీఎం కావాలని అర్చకులు దీవించారు. రెడ్లపాలెం, పూడివాడ రెడ్లపాలెంలోని రామమందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్తుపల్లి ఎస్సీకాలనీ, పూడివాడ లూథరన్ చర్చిలలో, బొరమాదిగపల్లిలోని చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని పాస్టర్లు ఆశీర్వదించారు.

చిన్నారికి నామకరణం
ఈదుపల్లిలో ఓ చిన్నారికి శుక్రవారం జగన్‌మోహన్‌రెడ్డి నామకరణం చేశారు. స్థానికులు మేరుగ బాల, అలేఖ్య దంపతులు తమ నాలుగునెలల చిన్నారికి నామకరణం చేయాలని కోరారు. పాపకు విజయమ్మగా పేరు పెట్టారు. జగన్ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.

నాడు తండ్రి.. నేడు తనయుడు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో నగరం గ్రామం పులకించింది. నాడు వైఎస్సార్ పర్యటించిన మార్గంలోనే ఓదార్పుయాత్ర సాగింది. గతంలో వైఎస్ ప్రసంగించిన సెంటర్‌లోనే శుక్రవారం ఆయన విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఈ ఘటన యాదృచ్ఛికమే అయినా నాటి సంగతులను గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా 2009 జనవరి 28న నగరంలో పర్యటించిన మహానేత రాజీవ్ గాంధీ సెంటర్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇప్పుడు జగన్ అదే సెంటర్‌లో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రసంగిం చారు. జగన్ ఈదుపల్లి, నగరంలో పర్యటించిన విధంగానే ఆనాడు వైఎస్సార్ కూడా ఒకేరోజు ఈరెండు గ్రామాల్లో పర్యటించారు.

మంచినీళ్లు తాగు అవ్వా..
‘వైఎస్సార్ అంటే మాకు ప్రాణం. ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నా అంతే. మొదటిసారిగా మా ఊరికి వస్తున్న జగన్ మంచి చెడ్డలు చూసుకోవడం మా బాధ్యత..’ నగరం మండలం ఈదుపల్లి గ్రామానికి చెందిన చింతల లక్ష్మీతిరుపతమ్మ అనే వృద్ధురాలు చెప్పిన మాటలివి. ఓదార్పుయాత్రలో భాగంగా వచ్చిన జగన్‌కు ఆమె ఎదురేగి స్వాగతం పలికింది. దిష్టితీసి కొబ్బరికాయ కొట్టింది. జగన్ కారు దిగి నడిచివచ్చి ఆప్యాయంగా అవ్వా బాగున్నావా అని పలకరించారు. కారులో నుంచి మంచినీళ్ల బాటిల్ తెప్పించి అవ్వా మంచినీరు తాగూ అనడంతో ఆమె ఉప్పొంగిపోయింది.

ఆత్మీయ పలకరింపు
నగరం, న్యూస్‌లైన్: నగరంలో జగన్‌మోహన్‌రెడ్డి ఓ వికలాంగుడిని ఆత్మీయంగా పలకరించారు. తన కోసం ఎదురుచూస్తున్న ఎస్టీ కాలనీకి చెందిన శ్రీనును చూసిన జగన్ కాన్వాయ్ దిగి వచ్చారు. నీ పేరేంటీ.. పింఛను వస్తుందా.. అని ప్రశ్నించారు. జగన్ తనను పలకరించడం చాలా ఆనందంగా ఉందని శ్రీను తెలిపాడు.

మహిళలకు జగన్ భరోసా
నగ రం, న్యూస్‌లైన్: ‘అయ్యా, కాల్వకట్టపై మేం ఎన్నో ఏళ్ళుగా చిన్న పాకలు వేసుకుని ఉంటున్నాం. ఏఒక్కరికి ఇల్లు, పట్టాలు ఇవ్వలేదు. మీరే మాకు న్యాయం చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వాలయ్యా’ అని నగరం మండలం మట్టుపల్లి గ్రామానికి చెందిన ఎస్టీకాలనీ మహిళలు వైఎస్ జగన్‌ను కోరారు. ఓదార్పుయాత్రలో భాగంగా మట్టుపల్లిలో పర్యటించిన జగన్‌కు మహిళలు ఘన స్వాగతం పలికారు. సుమారు 30 కుటుంబాలకు చెందిన మహిళలు తమకు ఇళ్లపట్టాలు ఇప్పించాలని జగన్‌ను కోరగా ‘త్వరలో మన ప్రభుత్వం వస్తుందమ్మా మీకష్టాలన్నీ పూర్తిగా తీరతాయమ్మా. కచ్చితంగా ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా చూస్తా’ అని భరోసా ఇచ్చారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవు.

పార్టీలో చేరిన శివరామకృష్ణారెడ్డి
నగరం, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం టీడీపీ నేత పిట్టు శివరామకృష్ణరెడ్డి పార్టీలో చేరారు. నగరంలో బహిరంగసభ ముగియగానే శివరామకృష్ణరెడ్డి జగన్‌ను కలి శారు. ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కల్లు మోకు, ముంత బహూకరణ
నగరం, న్యూస్‌లైన్: నగరం గ్రామంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గీత కార్మికులు కల్లు మోకు, ముంతను బహూకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మత్తి దివాకర రత్నప్రసాద్ నేతృత్వంలో గీత కార్మికులు జగన్‌ను కలిశారు. తమ స్థితిగతులను ఆయనకు వివరించి, సమస్యలు పరిష్కరించాలని కోరారు.

మారాజు.. మరిక లేడని..
నేటి ‘ఓదార్పు’ కుటుంబం
పేరు: తురుమెళ్ల అర్జునరావు(38)
గ్రామం: గూడవల్లి, చెరుకుపల్లి మండలం
వృత్తి: వ్యవసాయ కూలీ
చెరుకుపల్లి మండలం గూడవల్లి పంచాయతీ పరిధిలోని అంబేద్కర్‌కాలనీకి చెందిన తురుమెళ్ల అర్జునరావుది నిరుపేద కుటుంబం. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై ఆయనను స్మరిస్తూ ఉండేవాడు. మహానేత మరణవార్త విని కలత చెందాడు. ఆయన మరణాన్ని తట్టుకోలేక 2009 సెప్టెంబర్ తొమ్మిదిన గుండెపోటుతో మృతి చెందాడు. అంతకు ముందే ఆయన భార్య మృతి చెందింది. అర్జునరావుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు సురేష్ రేపల్లె ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ రెండోసంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడు సుధీర్ రేపల్లె ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నారు. కుమార్తె జ్యోతి ఏడోతరగతి చదువుతోంది. వారంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ ఇంటికి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు.

నేటి ఓదార్పుయాత్ర షెడ్యూల్

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శనివారం గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి నుంచి ప్రారంభమవు తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

వివరాలు..
19-11-2011 శనివారం

చెరుకుపల్లి మండలం
* గూడవల్లిలో యాత్ర ప్రారంభం

నగరం మండలం
* పెదవరంలో వైఎస్ విగ్రహావిష్కరణ

చెరుకుపల్లి మండలం
* ఆళ్లవారిపాలెంలో పర్యటన
* పిట్టుపాలెంలో విగ్రహావిష్కరణ
* కనగాలలో విగ్రహావిష్కరణ
* గూడవల్లిలో తురుమెళ్ల అర్జునరావు కుటుంబానికి ఓదార్పు, వైఎస్ విగ్రహావిష్కరణ
* నడింపల్లిలో పర్యటన
* కొండపల్లిలో మూడు విగ్రహాల ఆవిష్కరణ
* గుళ్లపల్లిలో విగ్రహావిష్కరణ
* చెరుకుపల్లిలో విగ్రహావిష్కరణ, బహిరంగసభ
గుంటూరు : నాన్న ఇచ్చిన ఇంత కుటుంబం ఉన్నంతవరకు ఎంతమంది ఏకమై ఎన్ని కుట్రలు చేసినా తనని ఎవరూ ఒంటరిని చేయలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి చంద్రబాబు వరకు, చంద్రబాబు నుంచి ఈనాడు వరకు, ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతి వరకు, ఆంధ్రజ్యోతి నుంచి టివి9 వరకు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా తనని ఎవరూ ఒంటరిని చేయలేరన్నారు

బాబుకు బెయిల్ దొరకదు: వైఎస్‌ఆర్ యువసేన

అమెరికా: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణను అమెరికాలోని వైఎస్‌ఆర్ యువసేన స్వాగతించింది. ఈ విచారణ నిష్పక్షపాతంగా జరిగితే బాబుకు బెయిల్ కూడా లభించదని అభిప్రాయపడింది. 30 ఏళ్ల రాజకీయ జీవన ప్రస్థానంలో బాబు సంపాదించిన ఆస్తులపై ప్రజలకు జవాబు చెప్పవలసిన బాధ్యత ఉందని పేర్కొంది. అందుకు ఈ తొమ్మిది ప్రశ్నలను బాబుకు ఎన్నారై యువసేన సంధించింది. 


1) రెండు ఎకరాల అసామి 30 ఏళ్లలో వేలాది కోట్లు ఏలా సంపాదించారు?
2) స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో లోకేష్ విద్యాభ్యాసం కోసం డోనేషన్ కింద ఫీజు ఏలా చెల్లించారు?
3) ఏటువంటి ఆదాయం లేని బాబు తల్లి అమ్మణమ్మ లోకేష్‌తో పాటు ఇతర మనుమలు మనమరాళ్లుకు రూ.75 లక్షలు బహుమతిగా ఏలా ఇవ్వగలిగారు?
4) సినీ నటుడు మురళీమోహన్ వందలాది ఎకరాల కోనుగోలు చేసిన తర్వాతే హైటెక్ సిటీ అక్కడ ఏర్పాటు చేశారు ఇది నిజం కాదా?
5) మీ ఇంటిలో మూడు గదులు మాత్రమే ఉన్నాయని చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటారా?
6) హెరిటేజ్ సంస్థ కోసం ఎనభై కోట్లు విలువ చేసే భూములను కేవలం రెండు కోట్లకే కోనుగోలు చేశారు ఇదేలా సాధ్యం? దీని వేనక ఉన్న మతలబు ఏమిటి?
7) 1984 లో 40 లక్షల లోన్ తీసుకుని 14 ఏళ్ల తర్వాత కేవలం 11 లక్షలు చెల్లించారు. ప్రజల సోమ్మును ఇలా కైంకర్యం చేయడం సమంజసమా? ఇది ప్రజలను మోసం చేయటం కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? 
8) ఇతర రాజకీయ నాయకులపై విచారణ అనగానే స్వాగతించే మీరు మీ పై విచారణ అనగానే ఎందుకు స్వాగతించలేక పోతున్నారు? 

9)అన్నా హజారే తమ్ముడని చెప్పుకునే మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీ
పై సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో విచారణను ఎందుకు స్వాగతించడంలేదు?పై ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెంటనే జవాబు చెప్పాలని వైఎస్‌ఆర్ యువసేన డిమాండ్ చేసింది.

janam leni chandrababu

Written By news on Friday, November 18, 2011 | 11/18/2011


జగన్ వెంటే ఉంటాo:ఆదినారాయణరెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, పూతలపట్టు రవి

హైదరాబాద్ : రాజీనామాలపై వివరణ ఇచ్చేందుకు జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, పూతలపట్టు రవి శుక్రవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కలిశారు. తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే గొల్ల బాబురావు విలేకర్లతో మాట్లాడుతూ రాజీనామాలపై స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, తాము జగన్ వెంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు


ఈదుపల్లిలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ
గుంటూరు : ఓదార్పు యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా నగరం మండలం ఈదుపల్లిలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శుక్రవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అంతకు ముందు తమ ప్రియతమ నాయకుని కుమారుడు గ్రామానికి వస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ఎదురు వెళ్లి జగన్ కు స్వాగతం పలికారు. ఓదార్పు యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాల్గొన్నారు.

4000 గజాల స్థలాన్ని 30 ఏళ్ల నామ మాత్రపు అద్దెతో లీజుకు


‘‘స్వచ్ఛంద సంస్థ పేరుతో ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌ను 1997లో స్థాపించారు. దానికి ట్రస్టీగా చంద్రబాబు ఉన్నారు. తమ ట్రస్టుకు భూమి కావాలని ప్రభుత్వానికి చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఆ దరఖాస్తును ఆమోదించుకున్నారు. అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో 4000 చదరపు గజాల స్థలాన్ని 30 ఏళ్ల కాలానికి నామ మాత్రపు అద్దెతో లీజుకు కేటాయించుకున్నారు. అయితే.. ఈ స్థలాన్ని ఎలాంటి రాజకీయ, వాణిజ్య కార్యకలాపాలకూ ఉపయోగించరాదన్న స్పష్టమైన నిబంధన ఉంది. 

కొన్ని వారాలకే ఈ భూమిని రాజకీయ కార్యకలాపాలకు అద్దెకు ఇవ్వటానికి అనుమతి ఇవ్వాలని ఎన్‌టీఆర్ ట్రస్ట్ తరఫున ప్రభుత్వానికి చంద్రబాబు అర్జీ పెట్టుకున్నారు. అప్పుడప్పుడూ రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ.. ఆ భూమిని నిరంతరం రాజకీయ కార్యకలాపాలకే వాడుతున్నారు. తద్వారా స్వచ్ఛంద సంస్థ ప్రాధమిక లక్షణాన్నే పక్కనపెట్టేశారు. 

ఆ తర్వాత రెండేళ్లకు ఈ స్థలంలో భారీ భవనాన్ని నిర్మించారు. హైటెక్ సిటీ ప్రాజెక్టు కాంట్రాక్టులో చంద్రబాబు చూపిన ఉదారతతో ప్రయోజనం దక్కించుకున్న ఎల్ అండ్ టీ సంస్థ ఈ భవనం మొత్తాన్నీ ఉచితంగా కట్టి ఇచ్చింది. ట్రస్టు ఆదాయం కేవలం రూ. 8 లక్షలు కాగా భవన నిర్మాణ వ్యయం రూ. కోట్లలో ఉండటం గమనార్హం. 

1999లో భవన నిర్మాణం పూర్తయిన తర్వాత అది.. చంద్రబాబు రాజకీయ పార్టీ టీడీపీకి అధికారిక కేంద్ర కార్యాలయంగా మారింది. అప్పటి నుంచీ దానిని రాజకీయ కార్యకలాపాలకే వినియోగిస్తున్నారు. ఎన్‌టీఆర్ ట్రస్టుకు టీడీపీ అద్దె కూడా చెల్లిస్తుండటం విశేషం. 

చంద్రబాబుకు చెందిన ట్రస్టు, పార్టీ ఒకే భవనం నుంచి పనిచేస్తుండటంతో.. ట్రస్టుకు భారీ మొత్తంలో విదేశీ నిధుల ప్రవాహం జరుగుతూ, ఆ నిధులను లెక్కల్లో చూపకుండా పార్టీకి తరలించి ఉపయోగించటం యథేచ్ఛగా సాగిపోతోంది. ఇది విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం రెండింటినీ ఉల్లంఘించినట్లే. 

ట్రస్టుకు ఏటా రెండు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకూ విరాళాలు వస్తున్నాయి. దేశీయంగా వచ్చిన గణనీయమైన విరాళాల్లో సత్యం గ్రూప్ ఇచ్చిన రూ. కోటి, మధుకాన్ షుగర్స్, హయగ్రీవా ఎస్టేట్స్ ఇచ్చిన రూ. 20 లక్షలు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రయోజనం పొందిన సంస్థలే. 

ఇక ఎన్‌టీఆర్ ట్రస్ట్‌కు జీవితకాల ట్రస్టీగా చంద్రబాబును మాత్రమే ప్రకటించారు. ఈ ట్రస్టుకు ఆయన రాజకీయ పార్టీ టీడీపీ నుంచి ఎవరూ వారసులు ఉండబోరు. ప్రస్తుతం ట్రస్టులో ఇతర సభ్యులుగా చంద్రబాబు భార్య, చంద్రబాబు ఆడిటర్‌లు మాత్రమే ఉన్నారు. అంటే ట్రస్టు మొత్తం బాబు గుత్తాధిపత్యంలోనే ఉండిపోయింది.’’ 

సర్కారు సంస్థలను అమ్మేసుకున్నారు

‘‘సంస్కరణల పేరుతో చంద్రబాబు తన హయాంలో ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల్లోకి నెట్టి వాటిని తన అనుయాయులకు కారుచౌకగా అమ్మేశారు. ఈ విక్రయాల్లో కోట్ల రూపాయల ముడుపులు స్వీకరించారు. చంద్రబాబు హయాంలో 87 రాష్ట్ర స్థాయి ప్రభుత్వరంగ సంస్థల్లో ‘సంస్కరణలు’ చేపట్టాలని గుర్తించారు. వాటిలో 1999 - 2004 మధ్య కాలంలో 22 సంస్థలను మూసేశారు. 12 సంస్థలను పునర్వ్యవస్థీకరించారు. 11 సంస్థలను ప్రయివేటీకరించారు. 9 సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించారు. మొత్తం 54 సంస్థల తలరాతలు మార్చేశారు. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి విలువను నిర్ణయించే పనిని ఏ మాత్రం అనుభవం లేని సంస్థలకు అప్పగించారు. ఎంతో విశ్వసనీయత గల క్రిసిల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను పక్కనపెట్టి.. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఓ చిన్న ఫ్లాట్లో భార్యాభర్తలే యజమానులుగా నిర్వహిస్తున్న మెస్సర్స్ విగ్నేశ్వర టెక్నికల్ అండ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ వంటి అనామక సంస్థల సాయం తీసుకున్నారు. జిల్లాల కలెక్టర్లు, ఆయా సంస్థల ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలను పక్కన పెట్టి మరీ.. మార్కెట్ విలువ రూ. 636 కోట్ల వరకూ ఉన్న రాష్ట్ర స్థాయి సంస్థలు, కో ఆపరేటివ్ సంస్థలను కేవలం రూ. 209 కోట్లకే అధికార పార్టీ నేతలు, వారి అనుచరులకు కట్టబెట్టిన ఉదంతాలు ఉన్నాయి. హనుమాన్, ఏఎస్‌ఎం కో-ఆపరేటివ్ షుగర్ మిల్స్‌ను 2002 డిసెంబర్ 31న డెల్టా పేపర్ మిల్స్‌కు కారుచౌకగా కట్టబెట్టారు. ప్రస్తుత టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ షుగర్స్‌కు పలైర్ షుగర్స్‌ను కట్టబెట్టారు. నిజాం షుగర్స్ ఆస్తుల్ని కూడా పప్పు బెల్లాలు అమ్మేసినట్లు అమ్మేశారు. మండవ ప్రభాకరరావుకు చెందిన ఎన్‌ఎస్‌ఎల్ గ్రూప్‌కు ఒక షుగర్ మిల్లు, ఒక స్పిన్నింగ్ మిల్లు ధారాదత్తం చేశారు.

విద్యుత్ పీపీపీలతో దోచిపెట్టారు

‘‘రాష్ట్రంలో విద్యుత్ అవసరాల కోసం ప్రయివేటు రంగంలో ఎనిమిది విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం చంద్రబాబు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు).. అటు ప్రమోటర్లకు, ఇటు తనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే ప్రహసనంగా మారాయి. 1997లో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రెండేళ్లలో 8 ప్రాజెక్టులనూ నిర్మించాల్సి ఉంది. కానీ బాబు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ప్రమోటర్లను మారుస్తూ, కాల పరిమితిని పెంచుతూ, వినియోగించే ఇంధనాన్ని మార్చుతూ, రాయితీలు ప్రకటిస్తూ.. సర్కారుకు తీవ్ర నష్టం కలిగించారు. ఒప్పందం జరిగినప్పుడు ఉన్న ప్రమోటర్లందరూ మారిపోయారు. ఒప్పందం జరిగిన ఐదేళ్ల తర్వాత కూడా ఒక్క ప్రాజెక్టూ నిర్మాణం కాలేదు. లేని గ్యాస్ ఆధారంగా తన అనుయాయులకు విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులిచ్చేసి స్థిర చార్జీల పేరుతో ఖజానాను వారికి దోచిపెట్టారు. కోనసీమ ఓక్వెల్ కంపెనీ వ్యవహారానికి సంబంధించి బిగ్‌బాస్‌కు ముడుపులు ముట్టాయంటూ సదరు కంపెనీ రాసిన లేఖను అప్పట్లో అసెంబ్లీలో మైసూరారెడ్డి బయటపెట్టారు.’’

తీరం దాటిన బాబు అవినీతి

‘‘చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌లో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంపై సదస్సులు నిర్వహించినప్పటికీ, ఆయన యూరప్, అమెరికాల్లో అధికారిక పర్యటనలు జరిపినప్పటికీ.. ఆ దేశాల నుంచి రాష్ట్రానికి చెప్పుకోదగిన విదేశీ పెట్టుబడులు రాలేదు. అయితే విచిత్రంగా కాకినాడ సీ పోర్టు మొదలు ఎమ్మార్ టౌన్ షిప్ వరకు దాదాపు అన్ని కాంట్రాక్టులూ మలేసియా, సింగపూర్, అరబ్ దేశాలకే దక్కాయి. 

కాకినాడ సీ పోర్టు కాంట్రాక్టు దక్కించుకున్న ఇంటర్నేషనల్ సీ పోర్ట్స్ కన్సార్షియం చైర్మన్, అందులో అగ్రవాటాదారు అయిన మీర్జాన్ బిన్ మహతిర్.. చంద్రబాబుకు సన్నిహితుడైన మలేసియా మాజీ ప్రధాని కుమారుడు. మలేసియా, సింగపూర్‌లలోని ఆతిథ్య రంగంలో చంద్రబాబుకు పెట్టుబడులు ఉన్నాయంటూ తెహల్కా తదితర పత్రికలు బయటపెట్టాయి. ఇలాంటి కేసుల్లో లంచాలను స్వదేశంలో కాకుండా విదేశాల్లో తీసుకుని అక్కడే పెట్టుబడులు పెడతారన్న సంగతి అందరికీ తెలిసిందే. బాబు హయాంలో రాష్ట్రంలో పనులు చేపట్టడానికి వచ్చిన ఐజేఎం కార్పొరేషన్, ఐఓఐ ప్రాజెక్ట్స్, జురాంగ్ ప్రాజెక్ట్స్ వంటివన్నీ నిధుల్ని మారిషస్ మార్గంలోనే తెచ్చుకున్నాయి. 

వాటి భారతీయ ప్రతినిధులు మాత్రం టీడీపీకి సన్నిహితులు కావడం గమనార్హం. ఐజేఎం రామలింగరాజు కుటుంబీకులది కాగా, ఐఓఐ ఇండియా చుక్కపల్లి సురేశ్‌ది. ఆయన సోదరుడు రమేష్ 2009 ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. సురేశ్ కంపెనీకి బంజారాహిల్స్‌లో రెండున్నర ఎకరాల స్థలాన్ని బాబు హయాంలో చౌకగా ఏపీ జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ కోసం కట్టబెట్టారు. ఈ కంపెనీకి నిధులు ఐఓఐ మారిషస్ నుంచి వచ్చాయి. ఆ ఐఓఐ మారిషస్‌కు బాబే యజమాని. ఇవన్నీ మనీ లాండరింగ్ మార్గాలే. 2001లోనే చంద్రబాబుకు సింగపూర్‌లో హోటల్ ఉన్నట్లు తెహల్కా డాట్ కామ్ వెల్లడించింది. ఆ హోటల్ పేరు ‘పార్క్ హోటల్ క్లార్క్ క్వే’ అని తెలిసింది. దాన్లో 100 శాతం వాటా ఉన్నది ‘ఈగిల్ ఫోర్స్ ప్రాఫిట్స్ లిమిటెడ్’ అనే కంపెనీకని, దాన్ని ఏర్పాటు చేసింది లాండరింగ్ మనీకి కేంద్రం లాంటి బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్‌లోనని తెలిసింది. ఈ కంపెనీ అసలు లబ్ధిదారు బాబేనన్న ఆరోపణలో నిజాలు ఈడీ విచారణలో మాత్రమే నిగ్గు తేలగలవు.’’ 

హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీకి పాతరేశారు

‘‘చిత్తూరు ప్రభుత్వ సహకార డెయిరీని చంద్రబాబు తన హెరిటేజ్ ఫుడ్స్ డెయిరీ కోసం నాశనం చేశారు. ఈ విషయంలో బాబు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందీ పలు అధ్యయనాల్లో తేటతెల్లమైంది. దీనికి సంబంధించి జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) ఒక కేస్ స్టడీ నివేదికను కూడా ప్రచురించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మూడు వారాలకే.. తన హెరిటేజ్ ఫుడ్స్ డెయిరీకి అమ్మకం పన్ను 14 సంవత్సరాల వాయిదా రాయితీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వివిధ సబ్సిడీలు, అమ్మకం పన్ను రాయితీల ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ 1996 - 2004 మధ్య కాలంలో రూ. 15.23 కోట్ల మేర ప్రయోజనం పొందింది.’’ 


కాకినాడ పోర్టును కాజేశారు

‘‘కాకినాడ సీ పోర్టును ప్రయివేటీకరించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ కాంపిటీటివ్ బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్లను కేంద్ర ప్రభుత్వ సంస్థ రైట్స్ పరిశీలించి కొన్ని సూచనలు చేసింది. కానీ.. ఈ పోర్టును నాటి మలేసియా ప్రధాని మహతిర్ మహమ్మద్ తనయుడు మిర్జాన్ బిన్ మహతిర్ నేతృత్వంలోని కన్సార్షియానికి అప్పగించటానికి.. రైట్స్ సూచనలకు కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీళ్లొదిలారు. 

రైట్స్ నివేదికలో అసలు మహతిర్ కన్సార్షియం ఊసే లేకపోవటంతో.. ఆ నివేదికను పూర్తిగా మార్చివేశారు. టీడీపీ మాజీ మంత్రి పద్మావతి కుమారుడు కూడా భాగస్వామిగా ఉన్న ఈ కన్సార్షియానికే పోర్టును అప్పగించారు. ప్రయివేటు డెవలపర్లకు ప్రయోజనం చేకూర్చేలా కాంట్రాక్టు నియమ నిబంధనలను పలుమార్లు మార్చారు. ఫలితంగా ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లింది. కాంట్రాక్టు ప్రకారం కన్సార్షియం ప్రతి ఏటా మినిమం గ్యారంటీ అమౌంట్ (కనీస మొత్తం) చెల్లించాల్సి ఉంది. మహతిర్ కన్సార్షియం తొలి రోజు నుంచీ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ ఆ మొత్తాన్ని చెల్లించలేదు. దీనిని ‘కాగ్’ తప్పుపట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో ఎన్నో మారిషస్ కంపెనీలు కీలకపాత్ర పోషిం చాయి. తప్పుడు సమాచారమిచ్చిన ‘ఎవర్‌లింక్ ఏసియా ఇన్వెస్ట్‌మెంట్స్’ వంటి కంపెనీల షేర్లు ఆ తరవాత ఎల్ అండ్ టీ చేతిలోకి వచ్చేశాయి. దీని అసలు లబ్ధిదారు చంద్రబాబే. అసలు పోర్టు రంగంతో ఏమాత్రం సంబంధం లేని బోళ్ల బుల్లిరామయ్యకు చెందిన ‘సౌతిండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీ’కి వాటాలు కేటాయించారు. బుల్లిరామయ్య 1999-2004 మధ్య ఏలూరు నుంచి టీడీపీ ఎంపీగా ఉన్నారు. అంతేకాదు.. ఆయన చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపక సభ్యుడు కూడా. ప్రస్తుతం కాకినాడ సీపోర్ట్స్‌కు సారథ్యం వహిస్తున్న కర్నాటి వెంకటేశ్వరరావు కూడా బాబు వివాదాస్పద లావాదేవీలకు ప్రతినిధే. సింగపూర్, మలేసియా, మారిషస్‌లలో వివిధ పేర్లతో నెలకొల్పిన కంపెనీల్లో చంద్రబాబు ప్రయోజనాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు.’’

Popular Posts

Topics :