07 October 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైయస్ యాత్రతో బాబు పాదయాత్రకు పోలికా?

Written By news on Saturday, October 13, 2012 | 10/13/2012


పాదయాత్రను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయంలో చివరి అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. 2004 ఎన్నికలకు ముందు 2003లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మండుటెండల్లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1500 మైళ్ల పాదయాత్ర నిర్వహించారు. ఆయన తన పాదయాత్ర ద్వారా ప్రజల మనసులను దోచుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర విజయవంతం కావడానికి చాలా కారణాలున్నాయి.
ఆ కారణాల్లో కొన్ని - 1. వైయస్ రాజశేఖర రెడ్డి 25 ఏళ్ల పాటు అధికారంలో లేరు. ఉత్తమ ఆలోచనలు కలిగిన ప్రత్యామ్నాయ నేతగా ప్రజలు వైయస్సార్‌ను చూశారు. 2. వైయస్ పాదయాత్రను ప్రజలు అధికారం కోసం చేపట్టినట్లుగా ప్రజలు భావించలేదు. దాన్ని అధికారం కోసం యాత్రగా వారు చూడలేదు. 3. రాష్ట్రం కరువుతో, రైతుల ఆత్మహత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ప్రభుత్వం ప్రతిపక్షాల మాటలను వినడం లేదు. ప్రజలను పట్టించుకోవడం లేదు. వ్యవసాయంపై కాకుండా పాలకులు ఐటి వంటివాటిపై దృష్టి పెట్టారు. రైతుల కష్టాలు, వ్యవసాయ ఇబ్బందులు తెలిసిన నేతగా రైతుల ముంగిట్లోకి వైయస్ వెళ్లారు.
4. సంప్రదాయబద్దమైన వస్త్రధారణ, ఎదుటి వారు చెప్పేది సహనంతో వినే వైయస్ లక్షణం ప్రజలను ఆకర్షించింది. తక్కువ మాట్లాడి ఎక్కువ వినే పద్ధతిని వైయస్ అనుసరించారు. 6. ప్రస్థానం వల్ల కాంగ్రెసు కార్యకర్తలు తెలుగదేశం పార్టీని ఓడించే శక్తిగల నాయకుడిగా గుర్తించి వైయస్ నాయకత్వంపై విశ్వాసం పెంచుకున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానం అతి సాధారమైంది. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి చేపట్టిన ఒక కార్యక్రమం. దానికి దర్శకుడు లేడు, స్క్రిప్టు రైటర్ లేడు. మానసిక నిపుణుల సలహాలు లేవు. ప్రజల చెంతకు ఎలా వెళ్లాలనే విషయాన్ని పనిగట్టుకుని సిద్ధం చేసుకున్న వ్యవహారాలు ఏవీ లేవు. సాధారణమైంది, అద్భుతమైంది, అంతే...
చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర సినిమా లాగానో, డ్రామాలాగానో ఉంది. ప్రముఖ సినీ దర్శకులు, రచయితలు ఇందులో పాలు పంచుకున్నారు. తన రాజకీయ జీవితంలో మొదటిసారి చంద్రబాబు తన భార్యను భాగస్వామిని చేశారు. హిందూపురంలో హారతి ఇచ్చి చంద్రబాబును ఆమె పాదయాత్రకు సాగనంపారు. ముసలి వాళ్లను, యువకులను కౌగలించుకుంటూ, వారిని ముద్దాడుతూ యాత్ర సాగిస్తున్నారు. పరిస్థితి అనుగుణంగా తమ నాయకుడు నడుచుకోవడం పట్ల తెలుగుదేశం కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు.
మొదటిసారి విక్టరీ సింబల్ వదిలేసి నమస్కారం పెడుతున్నారు. ఐటిని వదిలేసి ప్రజల ముందుకు వచ్చారు. అయితే, అత్యంత నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఆ స్థితికి రావాల్సి వచ్చిందని తటస్థ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు ఉత్సాహంగానే ఉంది, కానీ సాధారణ ప్రజలు అంత ఆసక్తి చూపడం లేదు. తొమ్మిదేళ్ల పాటు తమ పట్ల చంద్రబాబు నిర్దయగా వ్యవహరించిన తీరును, తమ సమస్యలను పట్టించుకోకపోవడాన్ని వారు మరిచిపోలేకపోతున్నారు.
కాంగ్రెసు దుష్టపాలనకు వ్యతిరేకంగా ఎందుకు పాదయాత్ర చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. రాజ్యాంగపరంగా సంక్రమించిన అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ఆయన ముందుకు రావడం లేదు. వైయస్ జగన్ దూకుడుని కాంగ్రెసుతో కుమ్మక్కయి నిలువరించడానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
చంద్రబాబు ఓటు బ్యాంకు క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు 1994లో 44.14 శాతం ఉండగా 2010 - 2012 19. 5 శాతానికి తగ్గిపోయింది. వైయస్సార్ కాంగ్రెసు ఓటు బ్యాంకు 54 శాతం ఉంది. వివిధ వర్గాలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాయి. 2009 నుంచి 45 అసెంబ్లీ లేదా పార్లమెంటు స్థానాల్లో చాలా చోట్ల తెలుగుదేశం డిపాజిట్లు కోల్పోయింది. తెలుగుదేశం పార్టీ విశ్వసనీయతను కోల్పోయింది. ఇదంతా చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు, విధానాల వల్లనే జరిగింది.
బ్యాండ్ ఎయిడ్ ద్వారా తెలుగుదేశం పార్టీ పైకి లేస్తుందని అనుకుంటున్నారు. కానీ శస్త్రచికిత్స చేసినా ఫలితం ఉండదని గ్రహించలేకపోతున్నారు. తమ తప్పుడు కథనాలతో ప్రజలను ప్రభావితం చేస్తామని ఎల్లో మీడియా భావిస్తోంది. చంద్రబాబు చాలా వాటికి ఆద్యుడైనా చాలా పాతవాటిని వదిలించుకోలేకపోతున్నారు. బొంబాయిలో అన్ని సౌకర్యాలతో రూపుదిద్దిన ఎసి బస్సు చంద్రబాబుకు కావాల్సి వచ్చింది. మరో ఎసి బస్సులో ప్రయాణించే వంటవాడు కావాలి. ప్రత్యేకంగా చంద్రబాబుకు వంటలు చేసి పెట్టాలి. ప్రత్యేకంగా జ్యూస్‌లు, స్నాక్స్ కావాలి. ఇప్పటికీ గంట, గంటన్నర పాటు అర్థం పర్థం లేని ప్రసంగాలు సాగిస్తున్నారు. ప్రజలు చెప్పేది వినడానికి బదులు ఆయన ప్రసంగాలు చేస్తున్నారు.
తాను తప్ప అందరూ అవినీతిపరులు, దుర్మార్గులు అని చెప్పడానికి చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు వల్లనే ఈ రోజు ప్రజలు నలిగిపోతున్నారు. గత తరాల కన్నా ప్రజలు ఇప్పుడు తెలివి పెంచుకున్నారు. చంద్రబాబు ఏం అనుకున్నా ప్రజలు మాత్రం ఆయనకు తగిన విధంగానే సమాధానం చెబుతున్నారు. దాన్ని 45 సార్లు ప్రజలు ఆయనకు చూపించారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్ర తెలుగుదేశం అవకాశాలు పెంచుతుందనేది కల్ల మాత్రమే.
గురువారెడ్డి, అట్లాంటా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ

‘ప్రజా ప్రస్థానం’ కార్యాచరణ కమిటీ

కడప ఎంపీ జగన్మోహరెడ్డి సోదరి షర్మిల త్వరలో చేపట్టబోయే మరో ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రకు సమన్వయ, కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు శనివారం సమన్వయ, కార్యాచరణ కమిటీ సభ్యులను నియమించారు. ‘ప్రజా ప్రస్థానం’ కమిటీ సభ్యులుగా భూమా నాగిరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, తలశిల రఘురాం, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బాజిరెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ప్రసాదరాజు, శివశంకర్ రెడ్డి, నల్లా సూర్య ప్రకాశ్, కేకే మహీందర్ రెడ్డిలను నియమించారు.

జగన్ సీఎం కావడం ఖాయం: మేకపాటి

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా యువనేత వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాజన్న రాజ్యం తిరిగి వస్తుందని తాము ధీమాగా చెప్పగలమని, మీ పాలన మళ్లీ తీసుకొస్తామని ధైర్యంగా చెప్పగలరా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రశ్నాస్త్రం సంధించారు. అసమర్థ కిరణ్ సర్కారుపై అవిశ్వాసం పెట్టేందుకు చంద్రబాబు ఎందుకు జంకుతున్నారని నిలదీశారు. 

వైఎస్ విజయమ్మకు అవిశ్వాసం అంటే ఏంటో తెలియదని బాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ సహధర్మచారిణిగా, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షనేతగా విజయమ్మకు అన్నీ తెలుసునని చెప్పారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నిర్వర్తించాల్సిన బాధ్యతనే విజయమ్మ గుర్తుచేశారని అన్నారు. వైఎస్ విజయమ్మ వ్యాఖ్యలకు విపరీత అర్థాలు తీస్తున్నారని విమర్శించారు. 

వైఎస్ జగన్‌ను నిర్బంధంలో ఉంచి కాంగ్రెస్, టీడీపీలు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాయని అన్నారు. 2009 ఎన్నికల తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ ఒక్కచోటైనా గెలిచిందా? అంటూ మేకపాటి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు అనవసర విమర్శలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. షర్మిల పాదయాత్ర అనగానే చంద్రబాబుకు అంత భయం ఎందుకని ఎద్దేవా చేశారు. 'మరో ప్రజా ప్రస్థానం'తో షర్మిల చరిత్ర సృష్టించబోతున్నారని తెలిపారు.

ఇడుపులపాయ నుంచి ‘మరో ప్రజా ప్రస్థానం’

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టనున్న ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఈనెల 18న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభంకానుంది. మొదటి రోజు యాత్ర వేంపల్లిలో ముగుస్తుంది. వైఎస్సార్ జిల్లాలో షర్మిల పాదయాత్ర వివరాలివి... 

*2వ రోజు వేంపల్లిలో ప్రారంభమై వేములలో ముగుస్తుంది
*3వ రోజు వేములలో ప్రారంభమై పులివెందులకు చేరుకుంటుంది
*4వ రోజు పులివెందులలో ప్రారంభమై లింగాలకు చేరుకుంటుంది
*5వ రోజు లింగాలలో ప్రారంభమై తార్నపల్లిలో చేరుకుంటుంది
*6వ రోజు తార్నపల్లిలో ప్రారంభమై అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తుంది

షర్మిల పాదయాత్ర చారిత్రాత్మకం: సురేఖ

వరంగల్: టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలను బట్టబయలు చేస్తూ ప్రజసమస్యలపై పోరాడేందుకే వైఎస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్ర చేపట్టారని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. షర్మిల చేయనున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యేంతవరకు తమ పోరాటం ఆగదన్నారు. చంద్రబాబు పాదయాత్ర కొంగజపాన్ని తలపిస్తోందని సురేఖ ఎద్దేవా చేశారు.

Y S Sharmila's Padayatra begins from Idupulapaya

Mekapati Rajamohan Reddy press meet at ysrcp office

YS Vijayamma console Dharmana Krishnadas's Family

'పాదయాత్ర పేటెంట్ వైఎస్ కుటుంబానిదే'

పాదయాత్రపై పేటెంట్ హక్కు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానిదేనని తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే షర్మిలమ్మ ప్రజా ప్రస్థానం చేపట్టారని ఆయన శనివారమిక్కడ పేర్కొన్నారు. చరిత్రలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఘటన ఆమెకే దక్కుతుందన్నారు. ప్రజాప్రస్థానం ప్రారంభం రోజున ఇడుపులపాయలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారని భూమన వెల్లడించారు.

వైఎస్ మరణం తర్వాత ప్రజలను ప్రభుత్వం రాబందుల్లా పీక్కుతింటోందని భూమన మండిపడ్డారు. వైఎస్ఆర్‌ ఆశయాలను, లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. పదవి కోసమే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నరని ఎద్దేవా చేశారు. బాబు పాదయాత్రను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. 

పార్టీ నేతలు అంతకు ముందు మహానేత వైఎస్ఆర్‌ సమాధిని సందర్శించి అంజలి ఘటించారు. మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు అమరనాథ్‌ రెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డితో సహా పలువురు నేతలు మహానేత వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు ఘన నివాళి అర్పించారు.

సీఎంది మిడిమిడి జ్ఞానం: గోనె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు మండిపడ్డారు. జాక్ పాట్‌తో ముఖ్యమంత్రి అయిన కిరణ్‌, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే షర్మిల పాదయాత్ర చేపట్టారని ఆయన అన్నారు. అలాంటి పాదయాత్రపై విమర్శలు చేయడం సీఎం అపరిపక్వతకు నిదర్శనమని గోనె వ్యాఖ్యానించారు.

Patent Right only forYSR Family on Padayatra

విశాఖలో విజయమ్మకు ఘన స్వాగతం

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ శనివారం మధ్యాహ్నం విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ కుటుంబాన్ని విజయమ్మ పరామర్శించనున్నారు. కృష్ణదాస్‌ తల్లి సావిత్రమ్మ ఈనెల 4వ తేదీన చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్‌ విజయమ్మ పోలకి మండలం మబుగాంలో కృష్ణదాస్‌ ఇంటికి వెళ్లి ఆకుటుంబాన్ని పరామర్శించనున్నారు.

YS Vijayamma Reach Vizag for console Dharmana Krishnadas

Students demand to give Doctorate to YSR at Yogi Vemana University

మందకృష్ణా.. టీడీపీలో చేరు

హైదరాబాద్, న్యూస్‌లైన్: నిజాలు చెప్పడం చేతకాక, నిత్యం అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మాదిరిగానే ఆయనకు వంతపాడుతున్న మంద కృష్ణమాదిగ కూడా వ్యహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు ఎం.మారెప్ప దుయ్యబట్టారు. చంద్రబాబుపై అభిమానం ఉంటే ఆ పార్టీలో చేరి, పచ్చచొక్కా తొడుక్కోవాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌తో కలిసి శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే మాదిగలకు అత్యంత లబ్ధి చేకూరిందని మారెప్ప వివరించారు. 

మాదిగలపై వైఎస్‌కు ప్రత్యేక అభిమానం ఉండేదని అందుకే 2009 ఎన్నికల్లో జనరల్ స్థానాలైన మల్కాజ్‌గిరి పార్లమెంటుకు, జడ్చర్ల శాసనసభ స్థానానికి మాదిగ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా వైఎస్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా చేసి కేంద్రానికి పంపించిన విషయాన్ని గుర్తుచేశారు. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా వర్గీకరణకు మద్దతిస్తూ లేఖపై సంతకం చేశారని చెప్పారు. తమ పార్టీ మొదటి ప్లీనరీలో కూడా వర్గీకరణపై తీర్మానం చేశామన్నారు. 

మందకృష్ణ వాటన్నింటినీ విస్మరించి మహానేత వైఎస్‌పై అవాకులు చవాకులు మాట్లాడటం సరైందికాదని, ఇలాగే వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తన హయాంలో ఏబీసీడీల ద్వారా మాదిగలకు 22 వేల ఉద్యోగాలు కల్పించానంటూ చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దాదాపు రూ.17 వేల కోట్లు చంద్రబాబు పాలనలోనే పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఫోన్‌ల ద్వారా ప్రధానులను, రాష్ట్రపతులను నియమించానని చెప్పుకునే చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత ఎందుకు తీసుకురాలేదని మారెప్ప ప్రశ్నించారు.

చిత్తశుద్ధి, విశ్వసనీయతలేని చంద్రబాబుకు చెక్క భజన చేస్తున్న మందకృష్ణను మాదిగలు కూడా నమ్మడంలేదని పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో వృద్ధులకు, వితంతువులు, వికలాంగులకు కేవలం రూ.75 పెన్షన్ అందజేయడమే కాకుండా దాన్ని సైతం మూడునెలలకొకసారి ఇచ్చింది నిజం కాదా? అని మందకృష్ణను సూటిగా ప్రశ్నించారు. వృద్ధులకు రూ.200లు, వికలాంగులకు రూ.500 నెలనెలా వచ్చేటట్లు చేసిన ఘనత వైఎస్‌దేనని చెప్పారు. అయితే మందకృష్ణ వాస్తవాలను దాచిపెట్టి చంద్రబాబు మాదిరిగానే అసత్యాలను చెప్తున్నారని విమర్శించారు.

నేడు కృష్ణదాస్ కుటుంబాన్ని పరామర్శించనున్న విజయమ్మ

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ శనివారం శ్రీకాకుళం జిల్లా వెళ్లనున్నారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు మాతృమూర్తి సావిత్రమ్మ ఈ నెల 4న మరణించిన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విజయమ్మ వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. విజయమ్మ శనివారం ఉదయం 9.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నర్సన్నపేటలోని మబజాల గ్రామానికి వెళ్లి ధర్మాన కుటుంబ సభ్యులను కలుస్తారు. సాయంత్రం 6.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.

శ్రీకాకుళం జిల్లాకు నేడు విజయమ్మ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు మాతృమూర్తి సావిత్రమ్మ ఈనెల 4వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. కృష్ణదాసు కుటుంబాన్ని విజయమ్మ పరామర్శించనున్నారు.

విద్యార్థుల ఆకలికేకలు పట్టవా?

9 జిల్లాల్లో హాస్టళ్లు పరిశీలించిన నేతలు

నల్లగొండ, న్యూస్‌లైన్ ప్రతినిధి: అరకొర వసతులు, చాలీ చాలని మెస్‌చార్జీలతో, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం విరుచుకుపడింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలు.. నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్, గుంటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురంలలో పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు వండి వడ్డిస్తున్న మధ్యాహ్నం భోజనం, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. నల్లగొండ ఎస్టీ బాలికల కళాశాల హాస్టల్‌ను వైఎస్‌ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి సందర్శించారు. వసతి గృహంలో అన్నం, కూర, చారు, ఇతర సౌకర్యాలను పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు. మెస్‌చార్జీలు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.17 ఇస్తే ఎలా సరిపోతాయని ఈ సందర్భంగా పుత్తా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల ఆకలికేకలు సర్కారుకు పట్టవా..? అని నిలదీశారు. నల్లగొండ హాస్టల్‌లో ఉన్న 150మంది విద్యార్థులకు కేవలం రెండు బాత్‌రూంలు, రెండు మరుగుదొడ్లు ఎలా సరిపోతాయో సంక్షేమ శాఖ అధికారులు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. 

అవిశ్వాసమంటే జంకెందుకు బాబూ?హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో ఎందుకు అవిశ్వాసం పెట్టడంలేదో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిలదీశారు. ప్రజల పాలిట గుదిబండలా తయారైన ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అవిశ్వాసం పెట్టమంటే టీడీపీ నేతలు ఎందుకంత ఉలికిపాటుకు గురవుతున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందాన్ని బయటపెట్టాలని పద్మ డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

వాస్తవాల్ని దాచిపెట్టి పాదయాత్ర పేరు తో చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు ‘వస్తున్నా మీ కోసం’ అంటూ రోడ్లవెంబడి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దద్దమ్మ, చేతకానిది అంటూ శాపనార్థాలు పెడుతూ విమర్శలు చేస్తారు. కానీ తన చేతిలో ఉన్న అవిశ్వాస అస్త్రాన్ని మాత్రం ప్రయోగించరు. ఒక చేత్తో ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ, మరోపక్క విమర్శలు చేస్తూ ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారు’’ అని విమర్శించారు.

నిజ స్వరూపం బయటపడుతోంది..

అసమర్థ ప్రభుత్వాన్ని పారదోలేందుకు అవిశ్వాసం పెట్టాలని తాము డిమాండ్ చేస్తే ప్రతిపక్ష స్థానంలో ఉన్న టీడీపీ వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీ అసలు రంగు బయటపడుతోందని పద్మ పేర్కొన్నారు. తాము ఇన్నాళ్లూ చెబుతున్న వాటికి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయన్నారు. ‘‘జగన్ బెయిల్ కోసం అవిశ్వాసం పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ బెయిల్‌కు అవిశ్వాసానికి లింకేంటి? అంటే ఇన్నాళ్లు అవిశ్వాసం చుట్టూనే జగన్ కేసులు, బెయిల్ ముడిపడి ఉన్నాయా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో బేరసారాలాడటానికే చంద్రబాబు అవిశ్వాసం పెట్టడంలేదా?’’ అని సూటిగా ప్రశ్నించారు. జగన్ బెయిల్‌కు సంబంధించి కాంగ్రెస్, టీడీపీ ఎంత పెద్ద స్థాయిలో కుట్ర పన్నుతున్నామో వారి మాటల్లోనే బయటపడిందన్నారు.

జగన్ బయటకు రాకుండా ఉండాలనే సింగిల్ ఎజెండాతో రెండూ పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. అవిశ్వాసం పెడితే ప్రభుత్వం ఏమవుతుందోననే ఆలోచనతో చంద్రబాబుకు వణుకు పుడుతోందని, అందుకే అవిశ్వాసం పెట్టనుగాక పెట్టనంటూ భీష్మించుకు కూర్చున్నారని ధ్వజమెత్తారు. ‘‘ఆరుగురు రాష్ట్ర మంత్రులపై అవినీతి ఆరోపణలతో చార్జీషీట్లు కూడా దాఖలయ్యాయి. ఒక మంత్రి స్వయంగా బెయిల్ పొందినా కనీసం నిలదీయలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. చేయాల్సిన పనులు చేయకపోగా తగుదునమ్మా అంటూ చంద్రబాబు వీధుల వెంబడి తిరుగుతూ లెక్చర్లు ఇస్తున్నారు’’ అని ఎద్దేవా చేశారు.

తొమ్మిదేళ్ల పాలన తెస్తానని చెప్పొచ్చుగా..

చంద్రబాబుకు చేతనైతే తన తొమ్మిదేళ్ల పాలనను తిరిగి అందిస్తానని ప్రజలకు చెప్పగలరా? అని పద్మ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలో ప్రజలు అనుభవించిన కష్టాలు వారికిప్పటికీ గుర్తున్నాయని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహానేత వైఎస్‌ఆర్ సువర్ణ యుగాన్ని, సంక్షేమ రంగాన్ని అందిస్తామని ప్రజలకు సగర్వంగా చెప్పగలమన్నారు. కానీ చంద్రబాబు తమ మాదిరిగా చెప్పలేరని, అలా చేస్తే ప్రజలు ఆయన నుంచి వంద మీటర్ల దూరం పరుగెడతారని పద్మ ఎద్దేవా చేశారు.

'షర్మిల పాదయాత్ర చరిత్రలో నిలుస్తుంది'

Written By news on Friday, October 12, 2012 | 10/12/2012

 దేశ రాజకీయ చరిత్రలో ఓ మహిళ మరో ప్రజా ప్రస్థానంలో పాదయాత్ర చేయడం సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు అన్నారు. కాంగ్రెస్ మనుగడకు చంద్రబాబు సహకరిస్తున్నారని అంబటి ఆరోపించారు. అవిశ్వాసం పెట్టకుండా కాంగ్రెస్‌తో చంద్రబాబు లాలూచీ పడుతున్నారని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, సాక్షిని అణచాలని టీడీపీ, కాంగ్రెస్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాయని అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

సీఎం వ్యాఖ్యలు అభ్యంతరకరం: గోనే

షర్మిల పాదయాత్రపై చేసిన విమర్శలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాశ్‌రావు డిమాండ్ చేశారు. సీఎం కిరణ్‌ రాజకీయ అనుభవం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మందకృష్ణ మాదిగ వైఎస్‌ఆర్‌ను విమర్శించడం సరికాదన్నారు. వైఎస్‌ ఉన్నప్పుడు పొగిడిన మందకృష్ణ నేడు విమర్శించడం అవకాశవాదమని అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ కుట్రలను బహిర్గతం చేసి.. ప్రభుత్వాన్ని నిలదీయడానికే మహానేత కూతురు హోదాలో షర్మిల పాదయాత్ర చేయబోతున్నారని గోనె ప్రకాశ్‌రావు అన్నారు.

'పాదయాత్రతో బాబు మోసం చేస్తున్నారు'

గుంటూరు: పాదయాత్రతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. గతంలో చంద్రబాబుకు ప్రజలు గుర్తు రాలేదా అని రాయపాటి ప్రశ్నించారు.

బాబుకు విశ్వసనీయత లేదు: సంకినేని

 తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు విశ్వసనీయత లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. చంద్రబాబుది మాటపై నిలబడని మనస్తత్వమని సంకినేని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భ్రష్టుపట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో వచ్చేనెల 11 లేదా 15న వైఎస్‌ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరతానని సంకినేని వెంకటేశ్వరరావు తెలిపారు.

'బాబు పాదయాత్రకు ప్రజాస్పందన లేదు'

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేయొచ్చని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న పాదయాత్రకు ప్రజా స్పందన లేదని నల్లపురెడ్డి అన్నారు. తొమ్మిది ఏళ్ల పాలనలో ఉచిత కరెంట్ ఇవ్వని బాబు ఇప్పుడు ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం కుర్చీ కోసం బాబు పడరాని పాట్లు పడుతున్నారని ఆయన విమర్శించారు. ఏపీలో చంద్రబాబు అంత అవినీతిపరుడు మరొకరు లేరని నల్లపురెడ్డి అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీలో అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టాలని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

YSRCP Leader VasiReddy Padma Press Meet In Ysrcp

NAIDU SEES RED, AS SHARMILA ANNOUNCES PADAYATRA


.
The YSRCP is turning out to be a stye in Chandrababu Naidu's eye. To top it all, Naidu is beginning to see red everywhere.
Sources in the Telugu Desam party, revealed that Naidu is suffering from an eye infection on the tenth day of his padayatra. According to reliable sources, doctors who tested him and informed him about the nature of the eye ailment, because of which they have become red and moist with tears.
Naidu seems to have got an eye infection because he sees anything and everything the YSRCP does, through a magnifying glass. His eyes had already gone red with the infection, but after listening to the news that YS Jagan Mohan Reddy's sister Sharmila, is to embark on a padayatra starting from the 18 th of this month, Naidu's eyes have become teary. The TDP leaders, sources say, are giving us the laughable explanation that Naidu developed an eye infection due to the flowers that were thrown by the crowds on him!
Naidu is jittery about the large turnout that Sharmila's meetings would draw, according to reliable sources. Scenes of the massive gatherings, including the huge participation of women, at the meetings of YS Vijayamma and Sharmila during the campaigning for the June by-polls are fresh in Naidu's memory. He certainly does not want to see a repeat, and even as he thought his padayatra was going well, news of Sharmila's walkathon has left poor Naidu a worried man. Each meeting of his thus far, has ended on a whimper, in the eyes of his cadre, and his own eyes are getting redder as they see Sharmila and Vijayamma drawing huge crowds wherever they go—without any enticements and allurements. Naidu, who is eying the reins of power, is going red with simmering discontent and green with envy.
- Siva@sakshipost

http://www.sakshipost.com/index.php/news/state/4701-naidu-sees-red-as-sharmila-announces-padayatra

Sakshi Vedika with YSRCP leader Vijayareddy

అవిశ్వాసం ఎందుకు పెట్టవు బాబూ?: సబ్బం

హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎంను ఎండగడుతున్నారే తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె నుంచి దించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదని ఎంపీ సబ్బం హరి ప్రశ్నించారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టే దిశగా ఎందుకు అడుగులు వేయటం లేదని ప్రశ్నించారు. అలాంటప్పుడు ప్రజలు చంద్రబాబు యాత్రను ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. చంచల్‌గూడ జైల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం హరి ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో కూడా మాట్లాడారు. యావత్ ప్రజల అభిమానం జగన్ కుటుంబ సభ్యులకు ఉందన్నారు. మధ్యంతర ఎన్నికలు రాకుండా కాలయాపన చేయడమే బాబు వ్యూహమన్నారు. ఎన్నికలొస్తే గెలవలేమనే ప్రభుత్వం పడిపోకుండా ప్రతిపక్షం సహకారం అందిస్తోందన్నారు. 

పేదల కోసమే షర్మిల పాదయాత్ర: భూమన


పేద, బడుగు, బలహీనవర్గాలతో పాటు రైతుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల పాదయాత్ర చేపట్టనున్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి అర్బన్ మండలం రాఘవేంద్రనగర్‌లో గురువారం ఆయన ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షర్మిల దాదాపు 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నారని వెల్లడించారు. వైఎస్‌ఆర్ పాదయాత్ర ద్వారా పేదల సమస్యలను తెలుసుకుని, అధికారంలోకి రాగానే వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆయన మరణానంతరం పేదల అభ్యున్నతే ధ్యేయంగా పోరాడిన జగన్‌ను కుట్రలు కుతంత్రాలతో జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరో ‘ప్రస్థానం’

*ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 18 నుంచి షర్మిల పాదయాత్ర..
*కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్‌ను ప్రజలకు వివరించాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయం
*అవిశ్వాసం పెట్టకుండా యాత్రలు చేస్తున్న బాబు నాటకం బయటపెట్టేందుకు సిద్ధం
*పార్టీ అధినేత వైఎస్ జగన్ బయట లేనందున అన్న తరఫున ప్రజల్లోకి సోదరి షర్మిల
*మహానేత వైఎస్ అడుగుజాడల్లో.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా యాత్ర
*పేరు ‘మరో ప్రజా ప్రస్థానం’.. 3,000 కిలోమీటర్ల మేర కాలినడక
*జైలు నుంచి రాగానే యాత్రను వైఎస్ జగన్ కొనసాగిస్తారని విజయమ్మ వెల్లడి
*ప్రభుత్వ వైఖరికి, కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా నల్లబ్యాడ్జీ ధరించనున్న షర్మిల

‘‘అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? అసలు పరిపాలన ఉందా? ప్రతిపక్షం ఉందా? ప్రజల పరిస్థితి ఇలా ఉండటానికి మూలం ప్రధాన ప్రతిపక్షం. టీడీపీ సరిగ్గా పనిచేసి ఉంటే ప్రభుత్వానికి భయం ఉండేది. ప్రజల పట్ల చిత్తశుద్ధి ప్రభుత్వానికీ లేదు, ప్రతిపక్షానికీ లేదు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఓ వైపు బాబు విమర్శిస్తారు. ప్రజల పట్ల మొసలి కన్నీరు కారుస్తారు. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టరు. ఇది ప్రభుత్వంతో కుమ్మక్కు కాక మరేమిటి? అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోయేది. అలా చేయకుండా పాదయాత్ర అంటూ తిరుగుతున్నారు.’’

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజా సమస్యల పరిష్కారంలోనూ, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలోనూ ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాన్నిఎండగట్టేందుకు ప్రజల్లోకి వెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అన్నింటా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి పడగొట్టే అవకాశం ఉన్నా, అలా చేయకుండా మొసలి కన్నీరు కారుస్తూ పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుమ్మక్కు రాజకీయాలను కూడా ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకుంది. 

ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పేరుతో ఈ నెల 18 నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి(ఇడుపులపాయ) నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల మీదుగా సాగుతూ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంతో ముగుస్తుంది. మొత్తం 3,000 కిలోమీటర్ల మేర ఈ యాత్ర ఉంటుంది. ప్రజల పట్ల ప్రభుత్వ వైఖరి, అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు కుట్రకు నిరసనగా షర్మిల ఈ యాత్రలో నల్లబ్యాడ్జీ ధరించనున్నారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తే అప్పటి నుంచి ఆయనేనేరుగా ఈ పాదయాత్రను కొనసాగిస్తారని, పూర్తి చేస్తారని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి పన్నిన రాజకీయ కుట్ర ఫలితంగా జైలు పాలైన జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను కలుసుకునే పరిస్థితి లేనందున షర్మిల ఈ పాదయాత్ర చేపడుతున్నారని వెల్లడించారు. ఆమె గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సమస్యలతో అల్లాడుతూంటే కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార, ప్రతిపక్షాలపైనే పోరాటం

ప్రజాపక్షంగా తమ పార్టీ పోరాటం ప్రధానంగా అధికార, ప్రతిపక్షాలపైనేనని విజయమ్మ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు తీర్చలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న ప్రభుత్వంపై బాబు అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించేందుకు ప్రయత్నించకుండా రోడ్డెక్కి మొసలి కన్నీరు కార్చితే ప్రయోజనం ఏమిటని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టబోమని చెప్పడం ద్వారా చంద్రబాబు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజాలకెత్తుకున్న విషయం స్పష్టమైందని, అదే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళతామని ఆమె ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం, అలాగే సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ జగన్‌తో పాటు తాను దీక్షలు చేపట్టినా ప్రభుత్వంలో చలనం లేదని, ఆ నిరసనలకు కొనసాగింపుగా పాదయాత్ర ఉంటుందని ఆమె వివరించారు.

పాదయాత్ర ఎందుకు?

‘‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా...! అసలు పరిపాలన ఉందా? అన్పిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం పరిస్థితీ అలాగే ఉంది. అసలు ప్రతిపక్షం ఉందా? లేదా? అని అనుమానంగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలోని ఏ వర్గానికి చెందిన ప్రజలూ సంతోషంగా లేరు. ఈ రోజు ఒక్క రేషన్ కార్డు ఇవ్వడం లేదు. ఒక్క పెన్షన్ మంజూరు కావడం లేదు. ఒక ఇల్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేక పోతోంది. కానీ ఖజానా నింపుకొనేందుకు ప్రజలపై పన్నులు వేసి భారం మోపుతోంది. కరెంటు చార్జీలు పెంచారు. సర్‌చార్జి సర్దుబాటు పేరుతో ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ రేట్లను పెంచేశారు. నిత్యావసర వస్తువులైతే కొండెక్కి కూర్చున్నాయి. 

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలేవీ అమలు కావడం లేదు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు. అందులోని చాలా వ్యాధులను ప్రభుత్వ ఆసుపత్రుల జాబితాలో చేర్చారు. అక్కడ ఆపరేషన్లు చేయడానికి పరికరాల్లేవు, వసతులు లేవు. 108 అంబులెన్స్‌లు చూస్తే డీజిల్ లేకుండా ఉంది. 104 అసలుకే లేదు. వడ్డీలేని రుణాలు ఇస్తామంటున్నారు. కానీ ఎక్కడా ఆ ఊసే లేదు. వైఎస్ హయాంలో పావలా వడ్డీకి ఎంతో మందికి రుణాలు ఇచ్చారు. వైఎస్ పాలనలో ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే ఆయన ముందుకు నిత్యావసర సరుకుల ధరల వివరాలు వచ్చేవి. కరెంటు సరఫరా, జలాశయాల్లో నీటి నిల్వలు ఇలాంటి వివరాలన్నీ ఆయన టేబుల్ మీద ఉండేవి. ఆయన మానిటర్ (పర్యవేక్షణ) చేసే వారు. ఈరోజు దేని మీదా ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుంది. అన్నీ ఆగి పోయాయి. సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయాయి. కరెంటు లేక పారిశ్రామిక రంగం కుప్పకూలింది. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. 

వారంతా తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే మనం పాదయాత్ర చేయాలని జగన్ చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లి వాళ్లకు మన ప్రభుత్వం వస్తుంది, వైఎస్సార్ సువర్ణయుగం వస్తుంది అని చెప్పి భరోసా ఇవ్వాలని అన్నారు. ప్రధానంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం గురించి చెప్పాలన్నారు. ఫీజుల పథకంపై జగన్‌బాబు, నేను దీక్షలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదు’’ అని విజయమ్మ తెలిపారు. ‘‘కరెంటు సరఫరా గ్రామాల్లో అధ్వానంగా ఉంది. రెండు గంటలు కూడా రావడం లేదని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నపుడు ఏడు గంటల పాటు సరఫరా చేయడమే కాక ఉచితంగా ఇచ్చారు. పేద ప్రజల కోసం ప్రజా పక్షంగా ఈ యాత్ర చేస్తున్నాం’’ అని ఆమె అన్నారు.

ప్రతిపక్షం బాగా పని చేసి ఉంటే...

‘‘అసలు రాష్ట్రం ఇలా ఉండటానికి మూలం ప్రధాన ప్రతిపక్షం. టీడీపీ సరిగ్గా పనిచేసి ఉంటే ప్రభుత్వానికి భయం ఉండేది. మా పార్టీ చాలా చిన్న పార్టీ, మేం ఏమీ చేయలేం. ఈరోజు అసెంబ్లీ చూస్తే ఐదు రోజుల సమావేశాల్లో ప్రతిపక్ష నేత కీలకమైన బీఏసీ సమావేశానికి కూడా రాలేదు. అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వానికీ లేదు, ప్రతిపక్షానికీ లేదు. మమ్మల్ని బయటకు పంపి అసెంబ్లీ నిర్వహించుకోండి అని టీఆర్‌ఎస్ వాళ్లు కూడా చెప్పారు. చంద్రబాబు ఐదు రోజుల్లో అపుడపుడూ ఐదు నిమిషాలు వచ్చి కూర్చుని వెళ్లి పోయారు. ఒక్క సంతాపం మాత్రమే అసెంబ్లీలో చర్చకు వచ్చింది. చంద్రబాబు కాంగ్రెస్‌తో ఎంతగా కలిసి పోయారంటే జగన్‌బాబును జైలుకు పంపే విషయంలో కుమ్మక్కు అయ్యారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి కోర్టుకు వెళ్లాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించుకున్నారు. నిన్నటికి నిన్న బెయిల్ పిటిషన్ విచారణకు రావడానికి ఒక్క రోజు ముందు టీడీపీ ఎంపీలు ఆర్థిక మంత్రి చిదంబరంను కలిశారు. ఈడీ రెండు, మూడు గంటల్లోనే అటాచ్‌మెంట్ నోటీసులు ఇచ్చింది’’ అని విజయమ్మ అన్నారు.

అవిశ్వాసం పెట్టరేం చంద్రబాబూ?

‘‘చిరంజీవి కాంగ్రెస్‌తో కలవనంతటి వరకూ బాబు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టలేదు. తర్వాత అవిశ్వాసం పెట్టినా అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి మాత్రమే. మరి ఈ రోజు రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యకర పరిస్థితులు ఉంటే ఎందుకు చంద్రబాబునాయుడు అవిశ్వాసం పెట్టడం లేదు? ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఓ వైపు బాబు విమర్శిస్తారు. ప్రజల పట్ల మొసలి కన్నీరు కారుస్తారు. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టరు. ఇది ప్రభుత్వంతో కుమ్మక్కు కాక మరేమిటి? ఈ రోజు బాబు రోడ్డున పడి పాదయాత్ర చేస్తున్నారు, 9 ఏళ్లు అధికారంలో ఉండగా ప్రజల కోసం ఒక్క మంచి కార్యక్రమమైనా ఆయన చేశారా? వైఎస్ చేసిన పథకాలు కొనసాగించాలంటారు. మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లి వైఎస్‌ను, జగన్‌ను తిట్టడం ప్రారంభిస్తారు. దానికి బదులు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోయేది. వేరే ప్రభుత్వం వచ్చేది. అపుడు ప్రభుత్వానికి భయం ఉండేది. అలా చేయకుండా పాదయాత్ర అంటూ తిరుగుతున్నారు.

వైఎస్‌ను అనుకరిస్తున్న చంద్రబాబు

దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్రను చంద్రబాబు అనుకరిస్తున్నారని విజయమ్మ అన్నారు.‘‘అసలు ఆయన వైఎస్‌ను అనుకరిస్తున్నారా... లేక జగన్‌బాబు ఓదార్పు మాదిరిగా వ్యవహరిస్తున్నారా అనేది అర్థం కావడం లేదు. ఏది ఏమైనా మేం మాత్రం ఈ ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టేలా ఒత్తిడి చేయాలన్న ఉద్దేశంతో కూడా ఈ పాదయాత్ర చేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రధానంగా పాదయాత్రలో ప్రజలకు చెబుతాం’’ అని విజయమ్మ వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో బాబు యాత్రకు పోలికే లేదని, ఎక్కడైనా, ఎప్పుడైనా(ఎనీ వేర్, ఎనీటైం) సాటి రాదని విజయమ్మ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

చంద్రబాబు కూడా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నపుడు విమర్శించడం దేనికి? అని విలేకరులు ప్రశ్నించినపుడు ‘‘ఆయన తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ కార్యక్రమం చేయలేదు. ప్రజలు ఆయన్ను నమ్మని పరిస్థితి ఉంది. మాకు విశ్వసనీయత ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులుగా మాకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది’’ అని విజయమ్మ అన్నారు. షర్మిల ఏ హోదాతో పాదయాత్ర చేస్తారని ప్రశ్నించినపుడు ‘షర్మిల వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తెగా, జగన్ సోదరిగా చేస్తుంది’ అని సమాధానం ఇచ్చారు. 

విలేకరుల సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్, బి.గుర్నాథరెడ్డి, వై.బాలనాగిరెడ్డి, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మల, వై.వి.సుబ్బారెడ్డి, ఎస్.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

అనంతలో వైఎస్ఆర్సీపీ నేతలపై వేధింపులు

Written By news on Thursday, October 11, 2012 | 10/11/2012

అనంతపురం: జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధింపులకు దిగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన కాంగ్రెస్ నేతల ఇళ్లను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. మున్సిపల్ రిజర్వ్ సైట్ల పేరుతో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను ఖాళీ చేయించడానికి అధికార పార్టీ నేతలు ..అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. జగన్ పార్టీలో చేరడమే తాము చేసుకున్న పాపామా అంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. పట్టణంలో ఖరీదైన భవనాలను విడిచిపెట్టి ఇలా అమాయకుల జోలికి వస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని అధికారులకు , కాంగ్రెస్ నేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు.

Idupulapaya to Ichapuram another political masterstroke by Jagan


Carrying forward the legacy of her father Dr Y S Rajasekhara Reddy’s mass contact programme, Sharmila will undertake padayatra from Idupulapaya in Dr YSR district to Ichapuram in Srikakulam on October 18.
The 3,000 km march, which is longer than Dr Reddy’s padayatra undertaken in 2003 and the first by a woman in the country, will traverse through 110 Assembly segments in YSR, Anantapur, Kurnool, Telangana and coastal Andhra districts and the road map and other details are being worked out.
Christened “Maro Praja Prasthanam,” which is akin to her father’s historic Praja Prasthanam, the padayatra had the blessings of YSRC president Y S Jaganmohan Reddy and is expected to give a run for the money of Congress and Telugu Desam.
Though the party leaders resolved that Sharmila should take up the padayatra, a final decision was announced only after YSRC honorary president Y S Vijayamma met Jaganmohan Reddy in the Chanchalguda jail this morning.
Despite being incarcerated in jail for over four months, Jaganmohan Reddy did not lose heart and instead, has been devising innumerable “behind the scene” strategies to keep the party alive and kicking.
Asking Sharmila to undertake the march to raise the heckles of Congress and Telugu Desam leaders is nothing but another political masterstroke by him.
One can see his signature in every decision taken by the party, right from organising protests on people’s issues to meeting Prime Minister Dr Manmohan Singh and other national leaders like Sharad Pawar and Sharad Yadav besides President Pranab Mukherjee a couple of days ago.
This is one reason why the Congress and Telugu Desam do not want him to be free and the decisions of various courts in not granting bail to him and the probes by different agencies has limited the damage to a certain extent.
TDP president N Chandrababu Naidu is roaming on the streets saying that he was calling on distressed sections of the society to console them and not for returning to power or to introduce his US educated former World Bank executive son Nara Lokesh Naidu into politics.
If at all Chandrababu Naidu did this during his nine-year-rule, when the monsoon failed for six years, the Congress would have been buried 20 feet below the ground with no hopes of resurrection. Now there is no point in crying over spilled milk and Naidu has a long way to go before regaining people’s confidence.
Plagued by dissension from his own ranks, Chief Minister N Kiran Kumar Reddy, who occupied the seat by default and not by merit or sheer hard work, has been touring the state only to prove that he is still in the same post.
The leaders of both the parties seem to be working with a single motto of sharing power by turns and are reluctant to provide room for third and emerging forces like YSRC and Telangana Rashtra Samithi (TRS) to challenge their hegemony.
But they were proved wrong on at least four times when by-elections were held in the state.
While Telugu Desam drew blank on all four occasions, the Congress managed to save its face by winning two seats in the last by-election. Still, the two parties persist with old agenda unmindful of the public opinion.
Sharmila, during the course of her padayatra, will highlight the failure of state government and its nexus with TDP in targeting Jaganmohan Reddy who approved the road map prepared by the party’s Political Affairs Committee (PAC).
“Sharmila will carry out the programme and will be joined with other family members and when Jagan babu is released from jail, he will take over from us,” Vijayamma told reporters at her Lotus Pond residence in Hyderabad on Thursday.
The proposed padayatra will focus on the lack of governance and the anarchy prevailing in the state, the dilution of welfare schemes launched by Dr Rajasekhara Reddy, the indifferent attitude of the rulers towards issues all sections of the society including farmers, workers, students, women and minorities on one hand and the nexus between Congress and the TDP, she said.
The YSRC will create a public opinion forcing the TDP to move a no-confidence motion against the state government which neither governs nor cares for the common man. “Watering down fee reimbursement scheme, erratic power supply to farmers and why TDP is not playing its role as the main Opposition will be raised during the march,” she said.
The YSRC has been fighting on public issues ever since it came into existence and will continue to do so in future. “Our programme will aim at raising public opinion against the thick-skinned state government and an equally numb and compromising TDP and force a no-confidence motion at the earliest,” she added.


http://www.frontpageindia.com/head-line-one/idupulapaya-to-ichapuram-another-political-masterstroke-by-jagan/40571

జగన్ సీఎం అవ్వడం ఖాయం: కొమ్మూరి

 వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వడం ఖాయమని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనం సృష్టించనుందని ప్రతాప్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగిపోయారన్నారు. వైఎస్‌ఆర్ పాదయాత్రను ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు ఆదరించారో షర్మిల పాదయాత్రను కూడా అలానే ఆదరిస్తారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

షర్మిల మరో ప్రజాప్రస్థానం: విజయమ్మ

హైదరాబాద్, న్యూస్‌లైన్ : అన్ని రంగాల్లోనూ విఫలమైన సర్వభ్రష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ వైఫల్యానికి నిరసనగా ఈ నెల 18వ తేదీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల రాష్ట్రంలో పాదయాత్రను చేపడుతున్నారు. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమాధి (ఇడుపులపాయ) నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకూ సాగుతుంది. కాంగ్రెస్, టీడీపీ చేసిన కుట్ర వల్ల అక్రమంగా జైలు పాలై తాను ప్రజలను కలుసుకునే పరిస్థితుల్లో లేనందున జగన్‌బాబు ఈ పాదయాత్ర చేయాలని చెప్పారని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ వెల్లడించారు. ఆమె గురువారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సమస్యలతో అల్లాడుతూంటే కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పక్షంగా తమ పార్టీ పోరాటం ప్రధానంగా అధికార, ప్రతిపక్షాలపైనేనని ఆమె అన్నారు. ప్రజా సమస్యలు తీర్చలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న ప్రభుత్వంపై బాబు అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించేందుకు ప్రయత్నించకుండా రోడ్డెక్కి మొసలి కన్నీరు కార్చితే ప్రయోజనం ఏమిటని విజయమ్మ టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు. 

నేనే చేయాలనుకున్నా...

‘మామూలుగా అయితే బెయిలుపై విడుదలైన తరువాత పాదయాత్ర చేస్తూ తానే జనం మధ్యకు వెళ్లాలని జగన్‌బాబు భావించారు. ఆ ప్రకారం రోడ్‌మ్యాప్ కూడా రూపొందించారు. ఇవాళ ఆయన రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక ప్రజల మధ్య పార్టీ ఉండాలని ఆయన భావిస్తున్నారు. మనలో ఎవరో ఒకరం ప్రజల మధ్య ఉండాలమ్మా...అని జగన్‌బాబు నాతో అన్నారు. ఆయన చెప్పినపుడు నేనే పాదయాత్ర చేయాలనుకున్నా. కానీ నాకు ఆర్థరైటిస్ (మోకాలి నొప్పులు) సమస్య ఉంది. అంత దూరం నడవాలంటే ఇబ్బంది అవుతుంది. పార్టీలో ఉండే పెద్దలు కూడా వద్దన్నారు. ఈ సంభాషణ జరిగేటపుడు అక్కడే ఉన్న షర్మిల ‘నేను చేస్తానమ్మా....’ అని ముందుకు వచ్చారు. ముందు తాను పాదయాత్ర ప్రారంభిస్తానని అన్న (జగన్) జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన దానిని కొనసాగిస్తారని షర్మిల అందరిలో అన్నారు. అన్న వచ్చేంత వరకూ నేనే చేస్తానని షర్మిల చెప్పారు. అందువల్ల షర్మిల పాదయాత్ర చేయాలని అందరమూ నిర్ణయించాం’ అని విజయమ్మ వెల్లడించారు. షర్మిల పాదయాత్ర ప్రారంభించాక వారంలో రెండు మూడు రోజుల పాటు ఆమెతో నేను కూడా ఉంటాను. అపుడపుడూ మధ్యలో భారతమ్మ కూడా వస్తూ ఉంటారని ఆమె వివరించారు. ఏరోజైతే జగన్ బయటకు వస్తారో ఆ రోజు నుంచి ఆయనే కొనసాగిస్తారు. పూర్తి చేస్తారని ఆమె అన్నారు. 

పాదయాత్ర ఎందుకు?

‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా...! అసలు పరిపాలన ఉందా? అన్పిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం పరిస్థితీ అలాగే ఉంది. అసలు ప్రతిపక్షం ఉందా? లేదా? అని అనుమానంగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలోని ఏ వర్గానికి చెందిన ప్రజలూ సంతోషంగా లేరు. ఈ రోజు ఒక్క రేషన్ కార్డు ఇవ్వడం లేదు. ఒక్క పెన్షన్ మంజూరు కావడం లేదు. ఒక ఇల్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేక పోతోంది. కానీ ఖజానా నింపుకునేందుకు ప్రజలపై పన్నులు వేసి భారం మోపుతోంది. కరెంటు ఛార్జీలు పెంచారు. సర్‌ఛార్జి సర్దుబాటు పేరుతో ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ రేట్లను పెంచేశారు. నిత్యావసర వస్తువులైతే కొండెక్కి కూర్చున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారు పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలేవీ అమలు కావడం లేదు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు. అందులోని చాలా వ్యాధులను ప్రభుత్వ ఆసుపత్రుల జాబితాలో చేర్చారు. అక్కడ ఆపరేషన్లు చేయడానికి పరికరాల్లేవు, వసతులు లేవు. 108 అంబులెన్స్‌లు చూస్తే డీజిల్ లేకుండా ఉంది. 104 అసలుకే లేదు. వడ్డీలేని రుణాలు ఇస్తామంటున్నారు. కానీ ఎక్కడా ఆ ఊసే లేదు. వై.ఎస్ గారు పావలా వడ్డీకి ఎంతో మందికి రుణాలు ఇచ్చారు. వైఎస్ పాలనలో ప్రతిరోజు ఉదయం 5 గంటలకే ఆయన ముందుకు నిత్యావసర సరుకుల ధరల వివరాలు వచ్చేవి. కరెంటు సరఫరా, జలాశయాల్లో నీటి నిల్వలు ఇలాంటి వివరాలన్నీ ఆయన టేబుల్ మీద ఉండేవి. ఆయన మానిటర్ (పర్యవేక్షణ) చేసే వారు. ఈరోజు దేని మీదా శ్రద్ధ లేనట్లుంది. అన్నీ ఆగి పోయాయి. సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయాయి. కరెంటు లేక పారిశ్రామిక రంగం కుప్పకూలింది. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వారంతా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మనం పాదయాత్ర చేయాలని జగన్ చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లి వాళ్లకు మన ప్రభుత్వం వస్తుంది, వైఎస్సార్ స్వర్ణయుగం వస్తుంది అని చెప్పి భరోసా ఇవ్వాలని అన్నారు. ప్రధానంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం చెప్పాలన్నారు. ఈ సమస్యపై జగన్ వారం రోజుల దీక్ష చేశారు. మళ్లీ ఒకరోజు ఒంగోలులో దీక్ష చేశారు. నేనూ రెండు రోజుల పాటు దీక్ష చేశాను. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. దీక్ష చేసినందుకైనా ప్రభుత్వం దిగివస్తుందేమో అనుకున్నాం. కానీ అదేమీ జరుగలేదు. ఈ దీక్షలకు కొనసాగింపుగానే ప్రజా సమస్యలపై పాదయాత్ర చేయాలనుకున్నాం. కరెంటు సరఫరా గ్రామాల్లో అధ్వాన్నంగా ఉంది. రెండు గంటలు కూడా రావడం లేదని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నపుడు ఏడు గంటల పాటు సరఫరా చేయడమే కాక ఉచితంగా ఇచ్చారు. పేద ప్రజల కోసం ప్రజా పక్షంగా ఈ యాత్ర చేస్తున్నామని ఆమె అన్నారు. 

ప్రతిపక్షం బాగా పని చేసి ఉంటే...

అసలు రాష్ట్రంలో ఇలా ఉండటానికి మూలం ప్రధాన ప్రతిపక్షం. టీడీపీ సరిగ్గా పనిచేసి ఉంటే ప్రభుత్వానికి భయం ఉండేది. మా పార్టీ చాలా చిన్న పార్టీ, మేం ఏమీ చేయలేం. ఈరోజు అసెంబ్లీ చూస్తే ఐదు రోజుల సమావేశాల్లో ప్రతిపక్షనేత కీలకమైన బీఏసీ సమావేశానికి కూడా రాలేదు. అసెంబ్లీ జరుపుకోవాలని ప్రభుత్వానికీ లేదు, ప్రతిపక్షానికీ లేదు. మమ్మల్ని బయటకు పంపి అసెంబ్లీ నడుపుకోండని టీఆర్‌ఎస్ వాళ్లు కూడా చెప్పారు. చంద్రబాబు ఐదు రోజుల్లో అపుడపుడూ ఐదు నిమిషాలు వచ్చి కూర్చుని వెళ్లి పోయారు. ఒక్క సంతాపం మాత్రమే అసెంబ్లీలో చర్చకు వచ్చింది. చంద్రబాబు కాంగ్రెస్‌తో ఎంతగా కలిసి పోయారంటే జగన్‌బాబును జైలుకు పంపే విషయంలో కుమ్మక్కు అయ్యారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి కోర్టుకు వెళ్లారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించుకున్నారు. నిన్నటికి నిన్న బెయిల్ పిటిషన్ విచారణకు రావడానికి ఒక్క రోజు ముందు టీడీపీ ఎంపీలు ఆర్థిక మంత్రి చిదంబరంను క లిశారు. ఇడి విచారణ జరిపిందో లేదో రెండు మూడు గంటల్లోనే అటాచ్‌మెంట్ నోటీసులు ఇచ్చింది. అంటే వారెంత బాగా కలిసి పనిచేస్తున్నారో దీన్ని బట్టి అర్థం అవుతుంది. చిరంజీవి కాంగ్రెస్‌తో కలవనంతటి వరకూ బాబు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టలేదు. రెండోసారి అవిశ్వాసం పెట్టినా అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి మాత్రమే. మరి ఈ రోజు ఇంత దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ఉంటే ఎందుకు చంద్రబాబునాయుడు అవిశ్వాసం పెట్టడం లేదు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఓ వైపు బాబు విమర్శిస్తారు. ప్రజల పట్ల మొసలి కన్నీరు కారుస్తారు. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టరు. ఇది ప్రభుత్వంతో కుమ్మక్కు కాక మరేమిటి? ఈ రోజు బాబు రోడ్డున పడి పాదయాత్ర చేస్తున్నారు, 9 ఏళ్లు అధికారంలో ఉండగా ప్రజల కోసం ఒక్క మంచి కార్యక్రమమైనా ఆయన చేశారా? వై.ఎస్ చేసిన పథకాలు మంచి, కొనసాగించాలంటారు. మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లి వై.ఎస్‌ను, జగన్‌ను తిట్టడం ప్రారంభిస్తారు. దాని బదులు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోయేది. మళ్లీ వేరు ప్రభుత్వం వచ్చేది. అపుడు ప్రభుత్వానికి భయం ఉండేది. అలా చేయకుండా పాదయాత్ర కు తిరుగుతున్నారు.

వై.ఎస్ పాదయాత్రకు నకలు

బాబు దివంగత వై.ఎస్.పాదయాత్రను అనుకరిస్తున్నారని విజయమ్మ అన్నారు. అసలు ఆయన వై.ఎస్‌ను అనుకరిస్తున్నారా...లేక జగన్‌బాబు ఓదార్పు మాదిరిగా వ్యవహరిస్తున్నారా అనేది అర్థం కావడం లేదు. ఏది ఏమైనా మేం మాత్రం ఈ ప్రభుత్వంపైన ప్రతిపక్ష టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టే విధంగా ఒత్తిడి చేయడానికి కూడా పాదయాత్ర చేస్తున్నాం, ఈ విషయాన్ని ప్రధానంగా పాదయాత్రలో ప్రజలకు చెబుతామని విజయమ్మ వివరించారు. షర్మిల చేసే ఈ పాదయాత్రను ‘మరో ప్రజాప్రస్థానం’ అని పేరు పెట్టామన్నారు. ఆమె తండ్రి వై.ఎస్.ఆర్ స్ఫూర్తితో ఈ యాత్రలో ముందుకు వెళతామని ఆమె అన్నారు. వై.ఎస్ పాదయాత్రతో బాబు యాత్రకు పోలికే లేదని ‘ఎక్కడైనా ఎప్పుడైనా (ఎనీ వేర్, ఎనీటైం) సాటి రాదని విజయమ్మ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బాబు కూడా ప్రజాసమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నపుడు విమర్శించడం దేనికి ? అని విలేకరులు ప్రశ్నించినపుడు ఆయన తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ కార్యక్రమం చేయలేదు. ప్రజలు ఆయన్ను నమ్మని పరిస్థితి ఉంది. మాకు విశ్వసనీయత ఉంది. వై.ఎస్ వారసులంగా మాకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది అని విజయమ్మ అన్నారు. షర్మిల ఏ హోదాతో పాదయాత్ర చేస్తారని ప్రశ్నించినపుడు ‘షర్మిల వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారెతగా, జగన్ సోదరిగా చేస్తుంది’ అని సమాధానం ఇచ్చారు. విలేకరుల సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్థన్, బి.గురునాథరెడ్డి, వై.బాలనాగిరెడ్డి, అంబటిరాంబాబు, వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మల, వై.వి.సుబ్బారెడ్డి, ఎస్.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

వాద్రా చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వాద్రా, డీఎల్ఎఫ్ సంస్థలపై సీబీఐ విచారణ జరిపించాలని దాఖలైన పిటీషన్‌పై అలహాబాద్‌ హైకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. డీఎల్ఎఫ్, వాద్రా మధ్య క్విడ్‌ ప్రో కో లావాదేవీలు జరిగాయని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపిస్తోన్న నేపధ్యంలో ఈ పిటిషన్‌ దాఖలైంది. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్‌ 21కి వాయిదా పడింది.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=467029&Categoryid=14&subcatid=0

Kadapa people respond on Sharmila's Padayatra

Sabbam Hari Comments on Chandrababu

Sharmila's Padayatra begins from Idupulapaya

Pitapuram people respond on Sharmila's Padayatra

Vizag people respond on Sharmila's Padayatra

Tirupati people respond on Sharmila's Padayatra

Vijayawada people respond on Sharmila's Padayatra

Srikakulam people respond on Sharmila's Padayatra

వైఎస్ పథకాలు తుంగలో తొక్కారు: భూమన

తిరుమల: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. అన్నిరంగాల్లోనూ కిరణ్ సర్కార్ విఫలమైందని ఆయన విమర్శించారు. చంద్రబాబు పాదయాత్ర అధికారదాహంతో కూడుకుందని భూమన అన్నారు. ప్రజల కడగండ్లు తుడిచేందుకే షర్మిలమ్మ మరో ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. వైఎస్ జగన్‌ సీఎం అయితే ఎలాంటి పాలన అందిస్తారో షర్మిలమ్మ భరోసా ఇస్తారని భూమన వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్ ను కలిసిన సబ్బం హరి!

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ వైఎస్‌ జగన్‌కు తెలుసని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. కిరణ్ సర్కార్ పనికిమాలినదని తెలిసే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని సబ్బం వ్యాఖ్యానించారు. కిరణ్ ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఉన్నా చంద్రబాబు ఎందుకు కూల్చడం లేదని సబ్బం హరి ప్రశ్నించారు. చంద్రబాబు మాటల్ని ప్రజలు విశ్వసించరని ఎంపీ సబ్బంహరి అన్నారు. చంచల్‌గూడ జైల్లో గురువారం వైఎస్‌ జగన్‌ను ఎంపీ సబ్బం హరి కలిశారు.

రాజన్న దారిలోనే...

Written by Rajababu On 10/11/2012 5:04:00 PM
విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేసిన రైతులను నిట్టనిలువునా బషీర్ బాగ్ లో కాల్పి చంపిన కాలం.. అంగన్ వాడీ కార్యకర్తలను నడిరోడ్డు మీద గుర్రాలతో తొక్కించిన పాలన అది.. భవిష్యత్ కానరాక చేనేత కార్మికులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న రోజులవి.. పాలకులకు ప్రజల సమస్యలంటే అసహ్యం వేసిన సమయం.. డబ్బుల కోసమే రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రజల మనోభావాలను దెబ్బ తీసిన ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి మహా కార్యక్రమాన్ని చేపట్టారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా.. తెలుగుదేశం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి మహానేత 'ప్రజాప్రస్థానం' పేరుతో పాదయాత్రకు స్వీకారం చుట్టారు. ప్రజా ప్రస్థానంలో 16 వందల కిలో మీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి ప్రారంభమైన ప్రజా ప్రస్థానం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం లో ముగిసింది. సుదీర్ఘంగా సాగిన పాదయాత్రలో ప్రజల కష్టాలను మహానేత స్వయంగా చూశారు.. విన్నారు.. ఆకలింపు చేసుకున్నారు.. దాని ఫలితమే తొమ్మిదేళ్ల ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా జనం తీర్పు ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పదవీ బాధ్యతల్ని చేపట్టాక... ప్రజలకు ఇచ్చిన మాటను మరవకుండా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, పావలా వడ్డీ, 108 సర్వీసు, వృద్యాప్య, వికలాంగ పెన్షన్ పథకాలను వైఎస్ విజయవంతంగా అమలు చేశారు.

ప్రజల్లో భరోసా కల్పించిన వైఎస్ కు మరోసారి పట్టం కట్టారు జనం. అయితే విధి ఆడిన నాటకంలో మహానేత ప్రజలకు దూరమయ్యారు. మహానేతతోపాటే ప్రజా సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు దూరమయ్యాయి. ప్రజలు గతంలో కంటే ప్రస్తుతమే ప్రజలు ఎక్కువ ఇబ్బందులకు లోనవుతున్నారని విజయమ్మ అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాం నాటి సువర్ణయుగం త్వరలోనే వస్తుందని ప్రజల్లో భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతోనే మరో 'ప్రజా ప్రస్థానం' పాదయాత్ర చేపట్టనున్నట్టు వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. వైఎస్ చేపట్టిన 'ప్రజాప్రస్థానం' ను షర్మిలా మరోసారి కొనసాగించనున్నట్టు విజయమ్మ తెలిపారు.

ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ గృహాలు, వడ్డీ లేని రుణాలు, 108 సర్వీసుల పథకాలు నిర్వీర్యం అయ్యారని.. నిత్యవసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయని.. ప్రభుత్వ అభివృద్ధి పథకాల ఊసే లేదని.. ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని.. 104 సర్వీస్ ఉద్యోగాలు కల్పించలేకపోయిందని మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇలాంటి సమస్యలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో పాదయాత్ర చేసి ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో పాదయాత్రను చేపడుతున్నామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలుకు బాసటగా నిలువాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకుల అభిప్రాయం మేరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని విజయమ్మ తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టినందున షర్మిలా పాదయాత్ర చేయడానికి ముందుకు వచ్చారని ఆమె అన్నారు. మహానేత ప్రజల దగ్గరికి ఎలా వచ్చారో.. ప్రజలకు ఎలా భరోసా ఇచ్చారో అదే విధంగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి స్పూర్తితో పాదయాత్ర చేయాలని నిర్ణయించామన్నారు. పాదయాత్ర అక్టోబర్ 18 తేదిన వైఎస్ఆర జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభమై ఇచ్చాపురం వరకు సుమారు 3 వేల కిలోమీటర్లకు పైగా సాగుతుందని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్య ఉండాలని జగన్ చెప్పారని.. బెయిల్ పై విడుదలయ్యాక జగన్ పాదయాత్రను కొనసాగిస్తారని.. అప్పటి వరకు షర్మిల పాదయాత్రను నిర్వహిస్తారన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని సాధారణ ప్రజల్లో అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో విశ్వసనీయతకు, ప్రజా సంక్షేమ పథకాలు కేరాఫ్ అడ్రస్ గా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి పాదయాత్రతో వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రజా వ్యతిరేక పాలన సాగించిన ఏ ప్రభుత్వాన్నైనా ప్రజలు హర్షించరు అని ఎన్నో సంఘటనలు చరిత్రలో మనకు సాక్ష్యంగా నిలిచాయి. ప్రజలతో మమేకమైన, ప్రజా సమస్యల పరిష్కారానికి అండగా నిలిచి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంగా మారి ఎలుగెత్తి పోరాటం చేస్తోంది. ప్రజలు సమస్యలుపై పోరాటం చేయడానికి.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, జనానికి భరోసా ఇవ్వడానికి.. వైఎస్ అందించిన స్పూర్తితో మరో ప్రజాప్రస్థానానికి వైఎస్ఆర్ సీపీ ముందుడుగు వేస్తోంది. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం.. విశ్వసనీయత అనేది వైఎస్ రక్తంలోనే ఉందని విజయమ్మ చేసిన వ్యాఖ్యలు షర్మిలకు అండగా ఉన్నాయి. షర్మిల ప్రజాప్రస్తానం యాత్ర ప్రజలకు సువర్ణయుగాన్ని అందిస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా షర్మిల పాదయాత్రకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=50617&Categoryid=28&subcatid=0

It’s padayatra and Sharmila to undertake YSRCP mass contact programme on Oct 18

hursday, 11 October 2012 16:29.
Putting an end to the nerve-breaking suspense, YSR Congress party honourary president Y S Vijayamma today announced that her daughter Sharmila would undertake the mass contact programme and it is going be a padayatra.
Addressing media persons at her Lotus Pond residence after the party’s Political Affairs Committee meeting, Vijayamma said that Sharmila would begin her padayatra on October 18 at Idupulapaya in her home district of Kadapa and walk throughout the State to reach Itchapuram, bordering Odisha. A detailed road map is being drawn, she explained.
“Soon after Jagan is freed, he will begin the padayatra where Sharmila will end. However, as along as Sharmila is on the yatra I will be addressing the rallies off and on, at least once in a couple of days,” Vijayamma added. “In fact, the party leaders have advised me to take up the exercise. Since I am suffering from health problems like arthritis and on the medical advise I have decided not to venture,” she explained.
The decision was taken at the Political Affairs Committee meeting and it had the approval of party president Jaganmohan Reddy, Vijayamma added. Jagan wanted Sharmila to undertake the yatra till he is freed and once Jagan comes out, he will take up from Sharmila, she noted.
“Jagan wanted us to be always with the people and mingle with them so that we will have the first hand information on their problems. Both the ruling Congress and the main Opposition Telugu Desam Party (TDP) had miserably failed in meeting the aspirations of the people,” she said adding that it is only the YSRCP that can rise upto their (people’s) expectations. “People have reposed immense faith in us. And, we will stand by them at all the times,” she stated.
Listing out the failures of the Congress Government in the State, Vijayamma said that the prices of essential commodities have skyrocketed, the basic facility of diesel is not available for the 104 ambulances, utter unhealthy conditions are prevailing in government hospitals with doctors rarely being present, not even a single ration card was issued after YSR’s demise and even a single house was constructed in the recent past.
Pavala Vaddi scheme is no longer relevant and farmers and women are not getting their due benefits from the Government. “No one can predict when power supply will be stopped and when it will be restored. YSR had promised nine-hour supply to the farming sector. But now power is not available even for an hour in the day,” she narrated. “All these schemes are closer to the heart of YSR and the party will reactivate all the departments that are now in deep slumber,” she observed.
Stating that total injustice is done to Jagan, she said both the State unit of the Congress and the TDP are hand-in-glove in preventing Jagan from getting bail. “We will expose all their evil designs during our padayatra and also the failures of the post-YSR dispensations and how the people suffered under Chandrababu Naidu’s rule.”
People are eagerly waiting for the golden rule of YSR “and we promise that we will live upto their expectations,” Vijayamma added.  
Prasad@sakshipost

http://www.sakshipost.com/index.php/news/state/4682-it-s-padayatra-and-sharmila-to-undertake-ysrcp-mass-contact-programme-on-oct-18

కనీసం వచ్చే ఎన్నికల వరకు జగన్ బయటకు రాకుండా సిబిఐ .....

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఆస్తుల కేసులో దర్యాప్తు ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేమని సిబిఐ డైరెక్టర్ ఎకె సింగ్ అన్నట్లు కధనాలు వస్తున్నాయి. ఈ కేసులో విదేశాల నుంచి సమాచారం రావలసి ఉందని ఆయన అన్నారు. అయితే వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన చెబుతున్నారు.దర్యాప్తునకు కాలపరిమితి చెప్పలేమన్నారు.దీనిని బట్టి చూస్తే జగన్ ను ఇప్పట్లో జైలు నుంచి విడుదల అవడం కష్టమే కావచ్చు. సిబిఐ దర్యాప్తు పూర్తి అయ్యేవరకు బెయిల్ దరఖాస్తు చేసుకోవద్దని ఎన్నడూ లేని విదంగా సుప్రింకోర్టు ఆదేశం ఇవ్వడం, ఎప్పటికి దర్యాప్తు పూర్తి అవుతుందో చెప్పలేనని సిబిఐ డైరెక్టర్ అనడం చూస్తుంటే జగన్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.కనీసం వచ్చే ఎన్నికల వరకు జగన్ బయటకు రాకుండా సిబిఐ అడ్డుకుంటుందా అన్న సందేహాలు వస్తున్నాయి.

http://kommineni.info/articles/dailyarticles/content_20121011_13.php

Jalagam Venkat Rao meets YS Jagan

Sharmila to go on Padayatra: YS Vijayamma

18 నుంచి షర్మిల పాదయాత్ర: విజయమ్మ

హైదరాబాద్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాం నాటి సువర్ణయుగం త్వరలోనే వస్తుందని ప్రజల్లో భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతోనే పాదయాత్ర చేపట్టనున్నట్టు వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. వైఎస్ చేపట్టిన 'ప్రజాప్రస్థానం' ను షర్మిలా మరోసారి కొనసాగించనున్నట్ఉ విజయమ్మ తెలిపారు. 

ఇబ్బందుల్లో ఉన్న ప్రజలుకు బాసటగా నిలువాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకుల అభిప్రాయం మేరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని విజయమ్మ తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టినందున షర్మిలా పాదయాత్ర చేయడానికి ముందుకు వచ్చారని ఆమె అన్నారు. 

మహానేత ప్రజల దగ్గరికి ఎలా వచ్చారో.. ప్రజలకు ఎలా భరోసా ఇచ్చారో అదే విధంగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి స్పూర్తితో పాదయాత్ర చేయాలని నిర్ణయించామన్నారు. పాదయాత్ర అక్టోబర్ 18 తేదిన వైఎస్ఆర జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభమై ఇచ్చాపురం వరకు సుమారు 3 వేల కిలోమీటర్లకు పైగా సాగుతుందని అన్నారు. 

సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్య ఉండాలని జగన్ చెప్పారని.. బెయిల్ పై విడుదలయ్యాక జగన్ పాదయాత్రను కొనసాగిస్తారని.. అప్పటి వరకు షర్మిల పాదయాత్రను నిర్వహిస్తారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని సాధారణ ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పన్నులు, సర్ ఛార్జీల పేరుతో ప్రజలను ఇబ్బందుల్లోకి ప్రభుత్వం తోసిందని విజయమ్మ అన్నారు. వైఎస్ పథకాలను కొనసాగించాలని అంటూనే మహానేతపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాజశేఖరరెడ్డి పాదయాత్ర, జగన్ ఓదార్పుయాత్రను అనుకరించడానికే తప్ప చంద్రబాబు పాదయాత్రతో జరిగేమిలేదని ఆమె అన్నారు. 

ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ గృహాలు, వడ్డీ లేని రుణాలు, 108 సర్వీసుల పథకాలు నిర్వీర్యం అయ్యారని.. నిత్యవసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయని.. ప్రభుత్వ అభివృద్ధి పథకాల ఊసే లేదని.. ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని.. 104 సర్వీస్ ఉద్యోగాలు కల్పించలేకపోయిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. 
ఇలాంటి సమస్యలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో పాదయాత్ర చేసి ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో పాదయాత్రను చేపడుతున్నామన్నారు. 

ఫీజు దీక్షపై హైదరాబాద్, ఒంగోలు ప్రాంతాల్లో జగన్ దీక్ష చేశారని.. తాను కూడా ఏలూరు, హైదరాబాద్ లో దీక్ష చేపట్టినా ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. విద్యుత్ సంక్షోభంతో రైతులు ఇబ్బందులకు లోనవుతున్నారని అన్నారు. తమ పార్టీ చిన్నపార్టీ అని.. ప్రభుత్వాన్ని ఎదురించే శక్తి తమకు లేదని.. అందుకే ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉన్నా ఏమి చేయలేకపోతున్నామని.. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వం కుమ్మక్కైందన్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ స్పందించడంలేదని విజయమ్మ విమర్శలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడంలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు చిదంబరం కలువగానే విచారణ లేకుండానే ఈడీ నోటీసులు జారీ చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ తో కుమ్మక్కైందనడానికి ఇంతకంటే రుజువు ఏమి అక్కర్లేదన్నారు.

జగన్ ను కలిసిన జలగం వెంకట్రావ్

మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావ్ గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను చంచల్‌గూడ జైల్లో కలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ కుటుంబంతో తమకు సన్నిహత సంబంధాలు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలో పాలక, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై జగన్‌ ఇబ్బందుల పాల్జేస్తున్నాయని జలగం అన్నారు. వైఎస్ ఆశయసాధనలో వెనకడుగు వేయని జగన్‌కు అండగా నిలివాలని నిర్ణయించుకున్నానని తెలియజేశారు. త్వరలోనే పార్టీలో చేరాతానని స్పష్టం చేశారు. వెంకట్రావ్ గతంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశం

హైదరాబాద్ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ భేటీ గురువారమిక్కడ మొదలైంది. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ భేటీ కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీకి సంబంధించి భవిష్యత్‌ కార్యచరణ ప్రణాళికను కాసేపట్లో విడుదల చేసే అవకాశాలున్నాయి. 

నిత్యం ప్రజా సమస్యలపై ప్రజల్లో ఉండే పోరాడాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నిర్ణయించింది. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు లోటస్ పాండ్ నుంచి మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

YS Vijayamma meets YS Jagan

Coming soon YS Jagan ruling government

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి జలగం వెంకటరావు!

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పట్టికీ ఆయన పార్టీలో చేరేవారు చేరుతూనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ ను కలుసుకోవడం చర్చనీయాంశం అయింది. ఆయన జగన్ పార్టీలో చేరుతున్నరని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే పార్టీలో క్రియాశీలకంగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ కు వెంకటరావు నుంచి పోటీ వస్తుందా అన్న చర్చ కూడా ఉంది.జలగం వెంకటరావు రెండువేల నాలుగులో సత్తుపల్లి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గం రిజర్వుడ్ నియోజకవర్గంగా మారితే ఖమ్మం నుంచి పోటీచేశారు. కాకపోతే టిక్కెట్ రాకపోవడతో ఆయన తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేసి టిడిపి నేత తుమ్మల నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరబోతున్నారు.

source: komineni

దున్నపోతు ఈనిందంటే..అన్నట్లుగా వార్తలా!

జర్నలిజంలో రాగద్వేషాలకు అతీతంగా వార్తలు రాయాలన్నది ప్రాధమిక సూత్రం.ఆ పరిస్థితి మన రాష్ట్రంలో ఎప్పుడో దాటిపోయాం. ఎవరికి కావలిసిన చందంగా రాజకీయ అవసరాలకు అనుగుణంగా వార్తలు రాసే పరిస్థితి వచ్చింది. కాని వాటిని మించి పత్రికలు తమ విశ్వసనీయతను కూడా దెబ్బతీసుకునే విదంగా కూడా వార్తలు రాస్తుండడం ఓ విషాదం. తన ప్రత్యర్ధి పై కోపమో, ద్వేషమో ఉండవచ్చు. కాని అందుకోసం తమ సొంత ప్రతిష్టను పణంగా పెట్టుకోకూడదు. ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో రెండువేల కోట్ల ఆస్తుల జప్తు అన్న వార్తను చదివితే ఈ పరిస్థితి కళ్లకు కనిపించినట్లుగా ఉంటుంది.ఒకదానికి, ఒకదానికి పొంతన లేకుండా వార్త రాసినట్లు అనిపిస్తుంది. ముందు అదేదో జగన్ ఆస్తి జప్తేమో అనిపిస్తుంది. తీరా చూస్తే వాన్ పిక్ ప్రాజెక్టు ఆస్తిని ఇడి జప్తు చేయవచ్చన్నది కధన సారాంశం.ఇందులో చిత్రమైన వాదనలు కనిపిస్తాయి.మరి సిబిఐ అధికారులు చెప్పారో,లేక ఇడి అధికారులు చెప్పారో, లేక సొంతంగా ఊహించి రాశారో తెలియదు కాని వార్త చదివితే నవ్వు వచ్చేలా ఉంది.ఒక పక్క వాన్ పిక్ సేకరించిన భూముల విలువ 1426 కోట్లు అని చెబుతారు.అంటే ఇంత ఖర్చు పెట్టి వాన్ పిక్ అదినేత నిమ్మగడ్డ ప్రసాద్ భూమి ని కొన్నారన్న మాట. ఇదంతా ప్రభుత్వానికి నష్టం అని వీరు చెబుతారు. ప్రసాద్ డబ్బుతో ప్రైవేటు భూములు కొంటే ప్రభుత్వానికి నష్టం వచ్చిందని సిబిఐ వాదించడం ఏమిటో, దానిని కొన్ని పత్రికలు గుడ్డి గా రాయడమేమిటో తెలియదు.అన్నిటికి మించి వాన్ పిక్ సేకరించిన భూమి విలువే 1426 కోట్లు అయితే మరి రెండువేల కోట్ల ఆస్తిని ఎలా స్వాధీనం చేసుకుంటారో తెలియదు .అయితే ఇదే వార్తలో జగన్ కంపెనీలలో పెట్టుబడులు ఐదు వందల కోట్లకు సమానంగా ఆస్తిని జప్తు చేయవచ్చని రాశారు.అసలు వాన్ పిక్ సేకరించిన భూమి ఎంత? ఇందులో ప్రభుత్వం ఏమైనా ఖర్చు చేసిందా?మొత్తం నిమ్మగడ్డ ప్రసాద్ లేదా ఆయన కు చెందిన కంపెనీలు చెల్లించాయా? ప్రపంచంలో ఎక్కడైనా ప్రైవేటు భూమిని మరో ప్రైవేటు సంస్థ కొనుగోలు చేస్తే ప్రభుత్వానిక నష్టం వచ్చిందని ఎంత తెలివిమంతుడైనా చెబుతారా? అసలు ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా మారి, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి శాపంగా మారిందని పలువురు బాధపడుతుంటే, పత్రికలు కూడా దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా వార్తలు రాస్తే మనం ఇదంతా రాష్ట్రం ఖర్మ అనుకోవడం తప్ప ఏమి చేయగలుగుతాం.నిజంగానే వాన్ పిక్ ప్రాజెక్టు రాష్ట్రానికి మంచిది కాదనుకుంటే మొత్తం ప్రాజెక్టును రద్దుచేసి భూమి అంతా స్వాధీనం చేసుకోవచ్చు. మరి ప్రభుత్వం ఇంతవరకు ఆ పని ఎందుకు చేయదు.సిబిఐ మానాన సిబిఐ,ప్రభుత్వం మానాన ప్రభుత్వం వ్యవహరిస్తూ రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తున్నాయి.

source: kommineni.info

వైఎస్ జగన్ ను కలిసిన విజయమ్మ

హైదరాబాద్ : చంచల్ గూడ జైల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం ఉదయం వైఎస్ విజయమ్మ కలిశారు. పార్టీకి సంబంధించి భవిష్యత్‌ కార్యచరణ ప్రణాళికను నేడు విడుదల చేయనున్న నేపథ్యంలో విజయమ్మ ఈ సందర్భంగా జగన్ తో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు వై ఎస్‌ జగన్‌ సలహాలు, సూచనలతో ఈ మధ్యహ్నం తర్వాత కార్యచరణను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.

Sakshi Vedika with YSRCP Leader BalaManemma

పాదయాత్రవైపే మొగ్గు...

* ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయం
* రథయాత్ర, ఓదార్పు యాత్రపైనా వైఎస్సార్ సీపీ నేతల సమాలోచనలు
* వయసురీత్యా విజయమ్మతో యాత్ర వద్దని సూచన.. 
* నేడు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ.. 
* అనంతరం జగన్‌తో సంప్రదింపులు.. ఆపై కార్యాచరణ వెల్లడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు ప్రజల్లోకి వెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ కేంద్ర పాలక మండలి(సీజీసీ), కార్య నిర్వాహక మండలి(సీఈసీ) సభ్యులు, ఎమ్మెల్సీల సంయుక్త సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్లోకి వెళ్లడానికి జగన్ కుటుంబీకులు పాదయాత్ర చేయడం మంచిదని సమావేశంలో మెజారిటీ నేతలు సూచించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ సమావేశానంతరం విలేకరులతో మాట్లాడుతూ పాదయాత్రవైపే ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపినట్లు వెల్లడించారు.

విజయమ్మ పాదయాత్ర వద్దన్న సీనియర్లు
కొందరు సీనియర్ నేతలు మాత్రం ఆరోగ్య పరిస్థితులు, వయసు రీత్యా విజయమ్మ పాదయాత్ర చేయరాదని వారించారని, అయితే జగన్ కుటుంబీకులే దీనిని చేపట్టాలని కోరారని కూడా రామకృష్ణ తెలిపారు. పాదయాత్ర, ఓదార్పు యాత్ర, రథయాత్ర చేయాలని నాయకుల నుంచి సూచనలు వచ్చాయని రామకృష్ణ అన్నారు. ఢిల్లీ వెళ్లి పార్లమెంటు వద్ద నిరసన వ్యక్తం చేయాలని, జిల్లాల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని కూడా మరిన్ని అభిప్రాయాలు వచ్చాయని చెప్పారు. ఈ సూచనలన్నింటిపైనా గురువారం ఉదయం విజయమ్మ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆ తరువాత పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని చర్చించాక సాయంత్రం కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన వివరించారు. వైఎస్ జగన్‌ను జైల్లో పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదగకుండా చేయాలని కాంగ్రెస్, టీడీపీలు పన్నిన కుట్రలను ఛేదిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని ఆయన అన్నారు.

విత్తనాల్లేవ్, ఎరువుల్లేవ్, కరెంటు లేదు..
రైతులకు విత్తనాలు, ఎరువులు అందడం లేదని, మరోవైపు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రకటించిన విధంగా ఉచిత విద్యుత్ సరఫరా జరగడం లేదని రామకృష్ణ విమర్శించారు. విద్యుత్ కొరత వల్ల పరిశ్రమలు ప్రొడక్షన్ హాలిడేలు ప్రకటించే పరిస్థితి నెలకొందన్నారు. ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చినందువల్ల లక్షలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరమయ్యారని పేర్కొన్నారు. ప్రజలు ఇన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉంటే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రం ‘రోమ్ నగరం తగులబడుతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా’ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షం పూర్తిగా విఫలమైంది..
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షం ఘోరంగా విఫలమైందని రామకృష్ణ అన్నారు. వైఫల్యాలతో పాలిస్తున్న కిరణ్ సర్కారును గద్దె దించడానికి అవిశ్వాస తీర్మానాన్ని పెట్టకుండా చంద్రబాబు పాదయాత్రకు వె ళ్లి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎపుడూ జనం మధ్యలో ఉండాలనేది తమ పార్టీ నేత జగన్ అభిమతమని, ఆయన అభీష్టానికి అనుగుణంగా పార్టీ తరపున ఏదో ఒక యాత్ర చేపడతామని అన్నారు. చంద్రబాబు పాదయాత్రను చూసే వైఎస్సార్ కాంగ్రెస్ కూడా అదే కార్యక్రమాన్ని చేపడుతోందా? అని ప్రశ్నించగా ‘ఆయన్ను చూసి మేం చేసేదేమిటి! అసలు పాదయాత్ర అంటే వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిందే... పాదయాత్ర పేటెంట్ ఆయనదే! మండుటెం డలో వైఎస్ ప్రాణాలకు తెగించి యాత్ర చేశారు... వైఎస్‌తో బాబు యాత్రకు పోలికేంటి?’ అని రామకృష్ట జవాబిచ్చారు.

పార్టీ సమావేశంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రులు కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎస్.సంతోష్ రెడ్డి, ఎమ్మెల్యేలు టి.బాలరాజు, కె.శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, గొల్ల బాబూరావు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బి.గురునాథరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు, ఆళ్ల నాని, కొడాలి నాని, వై.బాలనాగిరెడ్డి, మేకతోటి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు, చదిపిరాళ్ల నారాయణరెడ్డి, ముఖ్య నేతలు వై.వి.సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, భూమా నాగిరెడ్డి, ఎస్.రామకృష్ణారెడ్డి, ఎం.వి. మైసూరారెడ్డి, ఎం.ప్రసాదరాజు, డి.రవీంద్రనాయక్, కె.కె.మహేందర్‌రెడ్డి, కణితి విశ్వనాథం, బాల మణెమ్మ, ఆర్.రవీంద్రనాథ్ రెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి, కొల్లి నిర్మల కుమారి, అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ, జనక్‌ప్రసాద్, వై. విశ్వేశ్వరరెడ్డి, పువ్వాడ అజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Popular Posts

Topics :