24 February 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

విద్యార్థులకు, నిరుద్యోగులకు జగనన్న న్యాయం

Written By news on Saturday, March 2, 2013 | 3/02/2013

వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో శనివారం పాదయాత్ర సాగింది. ధూళిపాళ్లలో ఇంజినీరింగ్ విద్యార్థులతో షర్మిల మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కష్టాలను ఈ సందర్భంగా షర్మిలకు విద్యార్థులు వివరించారు. జగనన్న సీఎం అయితే ఆర్థికంగా వెనకబడినవారి అగ్రకులాల వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తారని షర్మిల హామీయిచ్చారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు జగనన్న న్యాయం చేస్తారని చెప్పారు.

ఇది గుడ్డి ప్రభుత్వం:భూమానాగిరెడ్డి

ప్రజల ఇబ్బందులు చూడలేని గుడ్డి ప్రభుత్వం ఇదని వైఎస్ఆర్సీపీ నేత భూమా నాగిరెడ్డి అన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం దున్నపోతు తీరున వ్యవరిస్తోందని విమర్శించారు. పెరిగిన ధరలు, విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి మాత్రం ఇవేమీ పట్టడంలేదన్నారు.

ఇలాంటి చీకటిరోజులు ఎప్పడూ లేవు: గోనె

బాబ్లీ ప్రాజెక్ట్‌పై ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఉందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా విద్యుత్ కోతలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. 50ఏళ్ల చరిత్రలో ఇలాంటి కరెంట్‌ కోతల చీకటి రోజులను ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు.

కరెంట్ కోతలపై ఉద్యమం: పొంగులేటి

ఖమ్మం: విద్యుత్ కోతలు, కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలకు నిరసనగా తమ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లాలో ఎండుతున్న పంటలకు ఆఖరి తడి అందించేందుకు వెంటనే ఎన్‌ఎస్‌సీ కాలువకు నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Maro Praja Prasthanam: Sharmila reaches Reddigudem, Guntur

జగనన్న త్వరలో బయటకువస్తారు:షర్మిల

 జగనన్న త్వరలోనే బయటకు వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ప్రజలకు హామీ ఇచ్చారు. జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె ఈరోజు రెడ్డిగూడెం గ్రామం చేరుకున్నారు. గ్రామంలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు రానున్నాయన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్‌ఆర్‌దేనని చెప్పారు. ఎరువుల ధరలు తగ్గించి రైతులను ఆదుకున్నది కూడా వైఎస్ఆరేనని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని గతంలో చంద్రబాబు విమర్శించారన్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చి వైఎస్‌ఆర్ మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యుత్ కష్టాలు వచ్చాయన్నారు. విద్యుత్ కోతలతో రైతులు, పరిశ్రమల యజమానులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అవిశ్వాసం పెట్టమంటే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని షర్మిల విమర్శించారు.

వైఎస్సార్ సీపీలో 200 మంది చేరిక

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఇంద్రకరణ్‌రెడ్డి, జనక్‌ప్రసాద్, బోడ జనార్దన్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 200 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికను పార్టీ నేతలు స్వాగతించారు.

YSRCP leader Udaya bhanu Press Meet 2nd March 2013

MP Mekapati addressing Media 2nd March 2013

YS Sharmila fires on Congress,TDP

Sharmila assurance to Kidney victim

YSRCP activist meeting in Kurnool

Sharmila padayatra starts from Gangi Reddy palem

జనసంద్రం మధ్య మరో ప్రజాప్రస్థానం

 గుంటూరు జిల్లాలో షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర జనసంద్రం మధ్య కొనసాగుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గం గంగిరెడ్డిపాలెంలో 79వ రోజు యాత్రను ప్రారంభించిన ఆమె రాజుపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజుపాలెం ప్రజలు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. ఆమె చూసేందుకు, మాట్లాడేందుకు వచ్చిన అభిమానులతో రాజుపాలెం కిక్కిరిసిపోయింది. షర్మిలతో పాటు పెద్దఎత్తున వైఎస్‌ఆర్‌ అభిమానులు పాదయాత్రలో పాల్గొన్నారు. మహానేత తనయకు తమ కష్టసుఖాలు చెప్పుకుంటున్నారు.

విశాఖలో వైఎస్ఆర్ సీపీ ర్యాలీ విశాఖ

 విశాఖ జిల్లాలో కోట్లాది రూపాయల పెండింగ్ పనులు ఆగిపోయాయని, వాటిని వెంటనే పూర్తిచేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. 

వైఎస్ హాయాంలో ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు, రహదారుల నిర్మాణం, అండర్ డ్రైనైజ్ పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ పనులను పూర్తిచేయాలని వారు డిమాండ్ చేశారు

గంగిరెడ్డి పాలెం నుంచి షర్మిల యాత్ర

 మహానేత తనయకు గుంటూరు జనం నీరాజనం పడుతున్నారు. షర్మిల పాదయాత్ర సాగుతున్న దారులన్ని జన గోదారులవుతున్నాయి. షర్మిల శనివారం సత్తెనపల్లి నియోజకవర్గంలోని గంగిరెడ్డి పాలెం నుంచి యాత్రను ప్రారంభించారు. రాజుపాలెం మీదుగా ఆమె భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడినుంచి రెడ్డిగూడెం, ధూళిపాళ్ల మీదుగా సాగుతారు. అనంతరం బస చేసిన ప్రాంతానికి చేరుకుంటారు.

జనం గుండెలో జగనన్న. జగన్ కోసం- 280 రోజులు


ఓర్పురా జగనన్న - ఓదార్పురా జగనన్న
మార్పురా జగనన్న - ప్రజా తీర్పురా జగనన్న
నేతరా జగనన్న - ప్రాణదాతరా జగనన్న
తలరాతరా జగనన్న - జననేతరా జగనన్న ॥

ఓదార్పు యాత్రలో జన్మించాడు
జనంతో జగనన్న జీవించాడు
కష్టాలను ఇష్టంగా ప్రేమించాడు
మన గుండెల్లో కలకాలం కొలువయ్యాడు ॥

బాల్యాన్ని ముద్దాడి పులకించాడు
వృద్ధుల్ని కావులించి ఓదార్చాడు
మాట ఇచ్చినాడు మడమ తిప్పనోడు
నవ్వులతో జనం మనస్సు జయించాడు ॥

పండిచ్చిన తిన్నాడు
పాలిచ్చిన తాగాడు
పెరుగన్నం కలిపి పెడితె
కన్నబిడ్డలా జుర్రాడు ॥

రాజన్న బాటరా జగనన్న
విజయమ్మ మాటరా జగనన్న
షర్మిలమ్మ పాటరా జగనన్న
జనం గుండెలో కోటరా జగనన్న ॥

- అమృత, ఎస్.ఇ, నెల్లూరు

కోతలతో వేలకొద్దీ పరిశ్రమలు మూతపడుతున్నాయి

ఈ కోతలతో వేలకొద్దీ పరిశ్రమలు మూతపడుతున్నాయి
లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు
సీఎంకు ముందు చూపు లేకనే రాష్ట్రంలో కరెంటు సంక్షోభం
31 మంది ఎంపీలున్నా మన రైతులకు ఒరిగింది శూన్యమే
ఈ కాంగ్రెస్ పెద్దలు ప్రతిరోజూ ఢిల్లీకి వెళ్లొస్తుంటారు..
అక్కడ మన రాష్ట్ర సమస్యలు మాత్రం చర్చించరు
ప్రజలను ప్రభుత్వం గాలికొదిలేసినా.. బాబు అవిశ్వాసం పెట్టరు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 78, కిలోమీటర్లు: 1,100.8
 ‘‘రైతులకు కనీసం మూడు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదు. ఎప్పుడు ఇస్తారో.. ఎప్పుడు తీస్తారో ఎవ్వరికీ తెలియదు. గ్రామాల్లో మహిళలంతా అల్లాడిపోతున్నారు. పొద్దంతా కష్టం చేసి రాత్రి పూట ఇంటికి వస్తే అరగంట కూడా కరెంటు ఉండట్లేదట. పొయ్యి వెలుతురుతోనే వంట చేసుకుంటున్నారట. ఇంతవరకు ఉన్న ఈ అనధికారిక కోతలు సరిపోవన్నట్టు సర్కారు మళ్లీ పల్లెల్లో అధికారికంగా విద్యుత్తు కోత పెట్టింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటిగా 12 గంటల వరకు కరెంటు ఉండదట.. ఇదే జరిగితే పల్లెలన్నీ ఇక చీకట్లోనే ఉండిపోతాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కోతలు అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో సాగింది. పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ మండల కేంద్రంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

పరిశ్రమలెలా బతికేది?

‘‘పరిశ్రమలకు 12 గంటలు అధికారికంగానే కరెంటు కోతఉంది. ఇప్పుడు మళ్లీ కోత పెడతారట.. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో పరిశ్రమలు బతకగలవా? వేల కొద్దీ పరిశ్రమలు మూతపడుతున్నాయి... లక్షల మంది యువకులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. రాష్ట్రంలో కరెంటు సమస్య ఇంత ఘోరంగా ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్ల, ఆయనకు ముందు చూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ర్టం నుంచి 31 మంది ఎంపీలనిచ్చాం. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు బొత్స.. ఇతర కాంగ్రెస్ నాయకులంతా ఇక్కడి నుంచి ఢిల్లీకి.. అక్కడి నుంచి ఇక్కడికి.. పైకీ.. కిందకీ రివ్వున తిరుగుతూనే ఉంటారు. అధిష్టానంతో ప్రజా సమస్యలు ప్రతీదీ చర్చిస్తామంటారు. మరి ఏ సమస్య గురించి చర్చించారని ఏ రోజూ కూడా ఏ ఒక్క నాయకుడూ చెప్పనే చెప్పరు. మన రాష్ట్రానికి విద్యుత్తు సమస్య ఉంటే దాన్ని పట్టించుకోరు.. గ్యాస్ అవసరం ఉంటే అది తీసుకురారు.. బొగ్గు కావాలంటే వినిపించుకోరు. ఢిల్లీలో వీళ్లు చర్చించేది ప్రజా సమస్యలు కాదు. వాళ్ల పదవులు ఎలా కాపాడుకుందామనే వాళ్ల చర్చలు ఉంటాయి. వీళ్లకు పదవిని కాపాడుకోవడంలో ఉన్న శ్రద్ధలో కనీసం 10 శాతం చూపించినా మన రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ప్రజలను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసినా.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాత్రం అవిశ్వాసం పెట్టరు.

సీఎం కిరణ్ ఆనందపడిపోయారట..

గోదావరి నదిపై మహారాష్ట్ర వాళ్లు బాబ్లీ ప్రాజెక్టు కట్టుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది కనక దాన్ని తొలగించడానికి వీలు లేదని, 2.7 టీఎంసీల నీళ్లు వాడుకోవచ్చని కోర్టు చెప్పింది. దానిగాను ఒక కమిటీని వేసిందట.. ఈ కమిటీలో ఒకరు మన రాష్ట్రం నుంచి కూడా ఉంటారట. ఆ కమిటీలో మన వాళ్లు కూడా ఒకరు ఉన్నారు కదా అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆనందపడిపోయారట... ఇందులో సంతోషపడాల్సిన విషయం ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. పైరాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటే మనకు నీళ్లు ఎలా వస్తాయని అడుగుతున్నా. నారాయణపూర్, ఆల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టులన్నింటినీ చంద్రబాబు హయాంలోనే కట్టారు. ఇవాళ గోదావరి నీళ్లయినా, కృష్ణా నీళ్లయినా మనకు రాలేదు అంటే అందుకు కారణం చంద్రబాబే.

చంద్రబాబుకు ఈ జన్మకు అర్థం కాదు..

చంద్రబాబుకు మాట ఇవ్వడం అంటే ఏమిటో..! ఆ మాట మీద నిలబడటం అంటే ఏమిటో ఈ జన్మకు అర్థం కాదు. బాబు 1999 ఎన్నికల్లో చాలా వాగ్దానాలు చేశారు. ప్రతి మహిళకూ బంగారు మంగళ సూత్రం ఇస్తానన్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకూ రూ. 5 వేలు డిపాజిట్ చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారు. మళ్లీ ఇప్పుడు అధికారంలోకొస్తే.. పుట్టిన ప్రతి ఆడపిల్లకు రూ.25 వేలు ఇస్తానని చెప్తున్నారు.’’

15.6 కిలోమీటర్ల యాత్ర..

శుక్రవారం 78వ రోజు పాదయాత్ర గుంటూరు జిల్లా కొండమోడు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి అనుపాలెం, చౌటప్పయ్యపాలెం, నందిరాజుపాలెం, నాగిరెడ్డిపాలెం మీదుగా బెల్లంకొండ మండల కేంద్రానికి చేరింది. ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఇక్కడే ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం 15.6 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. షర్మిల వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆర్‌కే, అంబటి రాంబాబు, తలశిల రఘురాం, స్థానిక నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, పి.గౌతంరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, వెంకటలక్ష్మీరాజ్యం, నన్నపునేని సుధ, బండారి సాయిబాబు మాదిగ, దేవళ్ల రేవతి, నూతలపాటి హన్మయ్య తదితరులు ఉన్నారు.

నిర్వాసితులకు అండగా ఉంటా

‘‘నేను పాదయాత్ర చేసుకుంటూ జిల్లాల వెంట తిరుగుతున్నప్పుడు చాలా మంది నిర్వాసితులు ‘ఇంకా మాకు నష్ట పరిహారం అంద లేదమ్మా’ అని చెప్పారు. ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులు కూడా తమకు నష్టపరిహారం రాలేదని చెప్తున్నారు. జల ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన కుటుంబాలను ఈ రోజు వరకు కూడా సర్కారు పట్టించుకోలేదు. జగనన్న ద్వారా మళ్లీ రాజన్న రాజ్యం వచ్చినప్పుడు.. భూములిచ్చిన అన్ని కుటుంబాలకూ ఇళ్లయితేనేమి, నష్టపరిహారం అయితేనేమి, ఉద్యోగాలైతేనేమి.. అన్నీ తప్పకుండా అమలు చేస్తామని మాటిస్తున్నా.’’
- షర్మిల

జగన్‌ను విచారణ పేరుతో 9 నెలలు జైల్లో పెట్టడం హక్కులను హరించడమే

అమలాపురం (తూర్పుగోదావరి): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి తొమ్మిది నెలలుగా జైల్లో ఉంచడం ద్వారా ఆయన హక్కులను హరిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) విచారణకు స్వీకరించింది. అమలాపురానికి చెందిన ప్రముఖ న్యాయవాది కుడుపూడి అశోక్ గత నెల 18న ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ 261/1/7/2013 కింద కేసు ఫైల్ నంబర్ జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను అశోక్ శుక్రవారం ఇక్కడ మీడియాకు వివరించారు. ‘‘జగన్ సంస్థల్లోకి క్విడ్‌ప్రోకో కింద పెట్టుబడులు వచ్చాయని ఆరోపిస్తూ 2011 ఆగస్టు 10న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత నేత ఎర్రన్నాయుడు అందులో ఇంప్లీడ్ అయ్యారు. 

పిటిషన్ దాఖలైన వారంలోనే హైకోర్టు ప్రాథమిక విచారణకు సీబీఐని ఆదేశించింది. జగన్‌తోపాటు 73 మందిపై సీబీఐ 120/బి, 409, 420, 477ఎ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. సీబీఐ గత ఏడాది మే 27న జగన్‌ను విచారణకు పిలిపించి, 29న అరెస్టు చేసింది. ప్రాథమిక న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఈ అరెస్టు జరిగింది. అప్పటి నుంచి తొమ్మిది నెలలుగా ఉద్దేశపూర్వకంగా ఫైనల్ చార్జిషీటు దాఖలు చేయకుండా జాప్యం చేస్తున్నారు. తద్వారా జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు’’ అని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 22, 32 ప్రకారం ఏ వ్యక్తినీ విచారణ పేరుతో నెలలు, ఏళ్ల తరబడి జైలులో ఉంచడానికి వీల్లేదని, అలా చేయడం మానవ హక్కులను హరించడమేనని తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు అశోక్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఫైనల్ చార్జిషీటు దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని, తద్వారా జగన్‌కు బెయిల్ వచ్చే అవకాశం కల్పించాలని పిటిషన్‌లో కోరానన్నారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను ప్రతివాదిగా పేర్కొన్న ఈ పిటిషన్‌ను ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణకు స్వీకరించిందని తెలిపారు.

టీడీపీ నుంచి వలసలు

మాజీమంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మేనల్లుడు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గ నాయకుడు కంచేటి సాయిబాబు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెల్లంకొండలో మరోప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కేంద్ర కార్యనిర్వాక కమిటీ సభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే), రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, నియోజకవర్గ నాయకులు నూతలపాటి హనుమయ్య, గుత్తికొండ అంజిరెడ్డి, తదితరులు కంచేటి సాయిబాబును అభినందించారు.

నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని సాయిబాబు ఈ సందర్భంగా షర్మిలకు తెలిపారు. ఆయనతో పాటు పానెం హనిమిరెడ్డి, మేకల హనుమంతరావు, అంకిరెడ్డి, పిల్లకతుపుల రామయ్య, ఆలీషా, ఊటుకూరు ప్రభాకరరెడ్డి, మరియదాసులు, మద్దతుదారులు సుమారు మూడు వేలమంది టీడీపీకి గుడ్‌బై చెప్పి షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు. అధికార పార్టీకి టీడీపీ వంత పలుకుతూ ప్రజాసమస్యలను విస్మరించిందని ఈ సందర్భంగా సాయిబాబు చెప్పారు. వైఎస్సార్ సీపీలో చేరడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటి నడవాడలని నిర్ణయించుకున్నానని తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంతోపాటు జిల్లావ్యాప్తంగా పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. సాయిబాబు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 

ఎటు చూసినా జన సమూహమే.. జనసందోహమే...


ఇసుకేసినా రాలనంతగా.... ఊళ్లకు.. ఊళ్లు పోటెత్తినట్టుగా.... చెట్లూ చేమలూ 
చాలనట్టుగా.... బళ్లు.. బస్సులు పట్టనట్టుగా.... మేడలు..మిద్దెలు వెన్ను 
విరుగుతున్నట్టుగా.... రోడ్లు..రోళ్లు కుంగుతున్నట్టుగా.... భూమ్యాకాశాలు 
ఏకమైనట్టుగా, ఎటు చూసినా జన సమూహమే.. జనసందోహమే... 
జనసంద్రమే. నేలపైనా.. నింగిపైనా. ఒక్కరి కోసమే అంతా.
ఒక్కసారి చూడాలని.. గుండెల నిండుగా సంతోషం నింపుకోవాలని,
ఒక్కసారి మాట్లాడాలని... బాధల భారం దించుకోవాలని,
ఒక్కసారి కరచాలనం చేయాలని.. ఆత్మీయత పంచుకోవాలని,
ఒక్క పువ్వు ఇవ్వాలని..నవ్వు చూడాలని..మమతను పెంచుకోవాలని
ఒక్కసారి మాటలు వినాలని..సాంత్వన పొందాలని,
ఒక్క ఫొటో తీసుకోవాలని.... హృదయాంతరాళాలలో నిక్షిప్తం చేసుకోవాలని,
అడుగులో అడుగు వేయాలని.... 
ఆశయ సాధనలో భాగస్వాములం కావాలని..
రాజన్న ముద్దు బిడ్డ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పాదయాత్రలో
కదిలివస్తున్న ఊళ్లు జనసాగరాన్ని తలపిస్తున్నాయి... వైఎస్ కుటుంబంపై 
వున్న ప్రేమాభిమానాలకు నిలువుటద్దాలవుతున్నాయి.

బెల్లంకొండ నిన్నమొన్నటి వరకు పెదకూరపాడు నియోజకవర్గంలో ఒక సాధారణ గ్రామం. శుక్రవారం ఆ గ్రామం జనసాగరమైంది. మహానేత రాజన్న ముద్దుబిడ్డ షర్మిలకు ఆ గ్రామంలో బ్రహ్మరథం పట్టారు. ఆ గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు బెల్లంకొండను జనకొండగా మార్చేశారు. మునుపెన్నడూ ఏ రాజకీయ పార్టీనేతకు దక్కని అరుదైన గౌరవాన్ని ఇచ్చి షర్మిలకు ఆత్మీయ స్వాగతం పలికారు.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానికి అంటకాగుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో సాగింది. సాయంత్రం బెల్లంకొండలో జరిగిన బహిరంగ సభకు అనూహ్యరీతిలో స్పందన లభించింది. మాచర్ల రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్లంకొండను చేరుకోవడానికి నలు దిక్కుల నుంచి ప్రజలు తరలి రావడంతో రెండు గంటలకుపైగానే సమయం పట్టింది. వ్యవసాయ ఆధారమైన పెదకూరపాడు నియోజకవర్గంలో రైతులు సాగునీరు విద్యుత్ సరఫరాలేక పడుతున్న ఇబ్బందులపై షర్మిల ప్రసంగించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై ప్రసంగించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ముందు చూపులేకపోవడంతో విద్యుత్ కొరత ఏర్పడిందని వివరించారు. ఈ నియోజకవర్గం పరిధిలోని అచ్చంపేట మండలం కృష్ణానదిపై ప్రాజెక్టు నిర్మిస్తే రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని భావించిన మహానేత చేపట్టిన పులిచింతలను పూర్తిచేయడంలో ప్రభుత్వం అలక్ష్యం వహిస్తుందన్నారు. పులిచింతల నిర్వాసితులకు జగనన్న రాజ్యంలో న్యాయం జరుగుతుందని, బాధితులకు నష్టపరిహారంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేం దుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ ప్రభుత్వంలో రోజుకు మూడు గంటలే విద్యుత్ సరఫరా ఉండటం వల్ల రైతులకు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందక మిర్చి పంటలు ఎండిపోతున్నాయని వివరించారు.కృష్ణానదిపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మిస్తున్నా, అప్పటి సీఎం వీటిని నియంత్రించక పోవడం వల్లనే సాగునీటి కొరత ఏర్పడిందన్నారు. రైతులు పడుతున్న సాగునీటి ఇబ్బందులకు చంద్రబాబే కారణమని పేర్కొన్నారు. అంతకు ముందు సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అనుపాలెంలో షర్మిల రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

టీడీపీ నుంచి వలసలు
షర్మిల సమక్షంలో టీడీపీ నేతలు, వారి అనుచరులు అధిక సంఖ్యలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించడంతో కాంగ్రెస్, టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో దాదాపు నాలుగు వేల మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు.











నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా...

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర శనివారం సత్తెనపల్లి నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

తొలిరోజు బసచేసిన ప్రాంతం నుంచి శనివారం ఉదయం బయలు దేరి సత్తెనపల్లి నియోజకవర్గంలోని గంగిరెడ్డిపాలెం, రాజుపాలెం మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడినుంచి రెడ్డిగూడెం, ధూళిపాళ్ల మీదుగా సాగుతారు. అనంతరం బస చేసిన ప్రాంతానికి చేరుకుంటారు.

పర్యటించే ప్రాంతాలు
సత్తెనపల్లి నియోజకవర్గం: గంగిరెడ్డిపాలెం, రాజుపాలెం, 
రెడ్డిగూడెం, దూళిపాళ్ల

ముగిసిన షర్మిల 78 రోజు పాదయాత్ర

Written By news on Friday, March 1, 2013 | 3/01/2013

నాగిరెడ్డిపాలెం: గుంటూరు జిల్లాలోని నాగిరెడ్డిపాలెం వద్ద 78వ రోజు షర్మిల పాదయాత్ర ముగిసింది. శుక్రవారం రోజున షర్మిల 15.6 కి.మీ నడిచారు. ఇప్పటివరకు షర్మిల మరోప్రజా ప్రస్థానం పాదయాత్రలో 1100 కి.మీ పూర్తి చేశారు. 

జగన్ నినాదాలతో హోరెత్తిన బెల్లంకొండ

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల బెల్లంకొండ చేరుకున్నారు. బెల్లంకొండలో జనతరంగాలు ఎగిసిపడ్డాయి. జై జగన్‌ నినాదాలతో బెల్లంకొండ హోరెత్తింది. 


కిరణ్ అసమర్థతవల్లే ఈ దుస్థితి: షర్మిల
రాష్ట్రంలో విద్యుత్ కోత వేళలు దారుణంగా పెంచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థత వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈరోజు ఆమె గుంటూరు జిల్లా బెల్లంకొండ గ్రామం చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. నీచమైన కుట్రలు పన్ని జగనన్నపై అబద్దపు కేసులు పెట్టి, జైలు పాలు చేశారన్నారు. కాంగ్రెస్ చేతిలో సిబిఐ కీలుబొమ్మ అని విమర్శించారు. కాంగ్రెస్ వారు, చంద్రబాబు కలిసి రాష్ట్రంలో వేరే పార్టీ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుకు స్వార్థ రాజకీయాలు తప్ప మరేవీ పట్టవన్నారు. 

చంద్రబాబుకు మాట ఇవ్వడం, మాటమీద నిలబడటం తెలియదని విమర్శించారు. బాబు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఎత్తివేశారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ వాగ్దానాన్ని నిలుపుకోలేదన్నారు. బాబు హయాంలోనే బాబ్లీ ప్రాజెక్టు మొదలు పెట్టారని గుర్తు చేశారు. ఆయన అడ్డుకోకపోవడం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు

జగన్ అందరికీ న్యాయం చేస్తారు:శ్రీకాంత్

రైతులకు, బిసిలకు, మైనార్టీలకు అందరికీ న్యాయం చేసే వ్యక్తి వైఎస్ జగన్మోహన రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారులు బాగుండాలని ఆలోచించిన వ్యక్తి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ అని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏ వర్గానికి న్యాయంచేయలేదన్నారు. బాబు మాటలను ప్రజలు ఎవరూ నమ్మేపరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు దారుణంగా ఉన్నాయన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు విధిస్తే విద్యార్థులు ఎలా చదువుకోగలుగుతారని ఆయన ప్రశ్నించారు.

'చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే బాబ్లీ నిర్మాణం' - కేటీఆర్

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. బాబ్లీ అంశంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి సమస్యను ప్రధానమంత్రికి వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు.

'పరువు' కేసులో ఆంధ్రజ్యోతికి ఎదురుదెబ్బ

వైఎస్ఆర్ జిల్లా : ఆంధ్రజ్యోతి పత్రికపై పరువునష్టం కేసులో వైఎస్ఆర్ జిల్లా మొదటి అదనపు జిల్లా కోర్టు తీర్పును వెల్లడించారు. 2009లో నిరాధార వార్తలు రాశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు దాఖలు చేసిన కేసులో 50 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పును వెల్లడించింది. 

త్వరలో మంచిరోజులు వస్తాయి: షర్మిల

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల శుక్రవారం అనుపాలెంలో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లు, ఇళ్లు, విద్యుత్ సమస్యలపై గ్రామస్తులు తమ గోడును వెలిబుచ్చారు. షర్మిల మాట్లాడుతూ బాబు హయాంలో రైతులు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేదని, అదే వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రైతులకు అంతా మంచే జరిగిందని అన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ లేక విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న రాజ్యంలో రైతులకు, విద్యార్థులకు మళ్లీ మంచిరోజులు వస్తాయని, విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపవద్దని షర్మిల సూచించారు.

Sharmila gets grand welcome in piduguralla constituency at guntur

YSRCP MLA Srikanth Reddy press meet

YSRCP Leader Ambati Rambabu speech in Sharmila's padayatra

YSRCP Leader Mahender Reddy speaks to media in YSRCP Office

Bhuma Nagi Reddy fire on Congress and TDP

78వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభం

 మరో ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటికి 78వ రోజుకు చేరింది. శుక్రవారం ఆమె సత్తెనపల్లి నియోజకవర్గంలోని కొండమోడు క్రాస్ నుంచి యాత్రను ప్రారంభించారు. అనుపాలెం, చౌటపాపాయపాలెం, నందిరాజుపాలెం, నాగిరెడ్డిపల్లె, బెల్లంకొండ మీదగా షర్మిల పాదయాత్రను కొనసాగించనున్నారు. నాగిరెడ్డిపాలెం మీదుగా బెల్లంకొండ చేరుకుని అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం బసచేసిన ప్రాంతానికి చేరుకుంటారు.

Group politics of CM Kiran and Babu?

ఈ ప్రభుత్వం వల్ల రైతులమంతా నష్టపోయాం.

పిడుగురాళ్ళ రూరల్: రాజన్న సీఎంగా ఉన్నప్పుడు విత్తనాలు సక్రమంగా అందాయి.. ఎరువులు ధరలు అందుబాటులో ఉన్నాయి.. ఈ ప్రభుత్వ పాలనలో ఎరువుల ధరలు చుక్కలనంటాయి.. పంటకు ఎరువులు వేద్దామంటేనే భయమేస్తోంది.. ఈ ప్రభుత్వం వల్ల రైతులమంతా నష్టపోయాం.
- జానపాడు గ్రామానికి చెందిన రైతు బ్రహ్మయ్య అవేదన

పంటలకు నీరు పెట్టేందుకు రేయింబవళ్ళు మగవాళ్లు పొలాల మీదే ఉంటున్నారు.. నీళ్లు వస్తాయో రావో తెలియదు.. కరెంటూ సక్రమంగా ఇవ్వడంలేదు.. మీ నాన్న వైఎస్ ఉన్నంత కాలం ఏ కష్టం అనుభవించలేదు.. ఈ పాలనలో అన్ని విధాలా ఇబ్బందిపడుతున్నాం.
- మహిళా రైతు బెరైడ్డి లక్ష్మి బాధ

నేను డిప్లొమో చదువుతున్నాను.. స్కాలర్‌షిప్ రాక ఇబ్బంది పడుతున్నాను.. స్కాలర్‌షిప్‌లు అందక నాలాంటి ఎంతోమంది పేద విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. వైఎస్సార్ దయతో ఫీజు రీయంబర్స్‌మెంట్ మాకు వరంగా మారింది. జగనన్న సీఎం అయితే ఈ పథకంను మరింతగా పెరుగుపరుస్తాడు. 
-పేద విద్యార్థి నాగరాజు ఆశ

వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర మండలంలోని జానపాడులో గురువారం జరిగింది. ఈ సందర్భంగా రామాలయం సెంటర్‌లో షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని, సమస్యలను అసలు పట్టించుకోవడం లేదని వాపోయారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను తీసివేస్తూ పేద విద్యార్థులకు, ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 

ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందుదామని వెళితే ఏదో ఒక కారణం చెప్పి పట్టించుకోవడం లేదు, పింఛన్లు ఇవ్వడం లేదు, బాలిక సంరక్షణ పథకాన్నీ నీరుగారుస్తున్నారు, ఫీజురీయంబర్స్‌మెంట్ పథకం ఎత్తివేయాలని చూస్తున్నారంటూ సమస్యలు ఏకరువు పెట్టారు. ‘నాన్న గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నా భర్తకు గుండె అపరేషన్ జరిగింద’ని అంగన్‌వాడీ కార్యకర్త దుర్గ వివరించింది. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్ పథకాన్ని ఎత్తివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, ఇలా జరిగితే పేద విద్యార్థులు నష్టపోతారని ఇంజినీరింగ్ విద్యార్థి పలకల సురేష్ ఆవేదన వ్యక్తంచేశాడు. 

పభుత్వ స్కూళ్లలో సక్రమంగా పాఠాలు చెప్పడం లేదని ఉస్తేల రోజారాణి ఆరోపించారు. రైతులను పట్టించుకోని ఈ ప్రభుత్వం త్వరలోనే నాశనమైపోతుందని అంకాళమ్మ శాపనార్థాలు పెట్టారు. తీరిక లేకుండా మాతో పనిచేరుుంచుకుంటున్నారని, జీతాలు మాత్రం పెంచడం లేదని అంగన్‌వాడీ కార్యకర్త డి.లత ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న సీఎం అరుుతే తమ కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరి సమస్యను షర్మిల ఓపికతో విని, వారిని ఓదార్చారు. మనసులేని ఈ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోదని, త్వరలోనే మన రాజన్నరాజ్యం వస్తుందని భరోసా ఇచ్చారు. 

జగనన్న నాయకత్వంలో రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంటలకు సాగునీరు అందుతుందని, ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపుతారని, మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తారని, పేద విద్యార్థుల చదువులకు అటంకం కలుగకుండా జగనన్న అన్ని చర్యలు తీసుకుంటారని హామీఇచ్చారు. రాజన్న సువర్ణయుగంలో ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. అందరి ఆశీస్సులతో జగనన్న త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని చెప్పారు. అన్న బయటకు వచ్చిన తరువాతే ఎన్నికలు జరుగుతాయని, జగనన్న మనమంతా బలపరుద్దామని పిలుపునిచ్చారు. షర్మిలమ్మ ప్రసంగాన్ని శ్రద్ధతో ప్రజలు విని హర్షధ్వానాలు చేశారు.

అదిగదిగో షర్మిలమ్మ..
పడుగురాళ్ళ రూరల్, న్యూస్‌లైన్: రాజన్న సీఎంగా ఉన్నప్పుడు విత్తనాలు సక్రమంగా అందాయి.. ఎరువులు ధరలు అందుబాటులో ఉన్నాయి.. ఈ ప్రభుత్వ పాలనలో ఎరువుల ధరలు చుక్కలనంటాయి.. పంటకు ఎరువులు వేద్దామంటేనే భయమేస్తోంది.. ఈ ప్రభుత్వం వల్ల రైతులమంతా నష్టపోయాం.
- జానపాడు గ్రామానికి చెందిన రైతు బ్రహ్మయ్య అవేదన

పంటలకు నీరు పెట్టేందుకు రేయింబవళ్ళు మగవాళ్లు పొలాల మీదే ఉంటున్నారు.. నీళ్లు వస్తాయో రావో తెలియదు.. కరెంటూ సక్రమంగా ఇవ్వడంలేదు.. మీ నాన్న వైఎస్ ఉన్నంత కాలం ఏ కష్టం అనుభవించలేదు.. ఈ పాలనలో అన్ని విధాలా ఇబ్బందిపడుతున్నాం.
- మహిళా రైతు బెరైడ్డి లక్ష్మి బాధ

నేను డిప్లొమో చదువుతున్నాను.. స్కాలర్‌షిప్ రాక ఇబ్బంది పడుతున్నాను.. స్కాలర్‌షిప్‌లు అందక నాలాంటి ఎంతోమంది పేద విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. వైఎస్సార్ దయతో ఫీజు రీయంబర్స్‌మెంట్ మాకు వరంగా మారింది. జగనన్న సీఎం అయితే ఈ పథకంను మరింతగా పెరుగుపరుస్తాడు. 
-పేద విద్యార్థి నాగరాజు ఆశ

వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర మండలంలోని జానపాడులో గురువారం జరిగింది. ఈ సందర్భంగా రామాలయం సెంటర్‌లో షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని, సమస్యలను అసలు పట్టించుకోవడం లేదని వాపోయారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను తీసివేస్తూ పేద విద్యార్థులకు, ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందుదామని వెళితే ఏదో ఒక కారణం చెప్పి పట్టించుకోవడం లేదు, పింఛన్లు ఇవ్వడం లేదు, బాలిక సంరక్షణ పథకాన్నీ నీరుగారుస్తున్నారు, ఫీజురీయంబర్స్‌మెంట్ పథకం ఎత్తివేయాలని చూస్తున్నారంటూ సమస్యలు ఏకరువు పెట్టారు. ‘నాన్న గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నా భర్తకు గుండె అపరేషన్ జరిగింద’ని అంగన్‌వాడీ కార్యకర్త దుర్గ వివరించింది.

వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్ పథకాన్ని ఎత్తివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, ఇలా జరిగితే పేద విద్యార్థులు నష్టపోతారని ఇంజినీరింగ్ విద్యార్థి పలకల సురేష్ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రభుత్వ స్కూళ్లలో సక్రమంగా పాఠాలు చెప్పడం లేదని ఉస్తేల రోజారాణి ఆరోపించారు. రైతులను పట్టించుకోని ఈ ప్రభుత్వం త్వరలోనే నాశనమైపోతుందని అంకాళమ్మ శాపనార్థాలు పెట్టారు. తీరిక లేకుండా మాతో పనిచేయిచుకుంటున్నారని, జీతాలు మాత్రం పెంచడం లేదని అంగన్‌వాడీ కార్యకర్త డి.లత ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న సీఎం అయితే తమ కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరి సమస్యను షర్మిల ఓపికతో విని, వారిని ఓదార్చారు. మనసులేని ఈ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోదని, త్వరలోనే మన రాజన్నరాజ్యం వస్తుందని భరోసా ఇచ్చారు.

జగనన్న నాయకత్వంలో రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంటలకు సాగునీరు అందుతుందని, ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపుతారని, మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తారని, పేద విద్యార్థుల చదువులకు అటంకం కలుగకుండా జగనన్న అన్ని చర్యలు తీసుకుంటారని హామీఇచ్చారు. 

రాజన్న సువర్ణయుగంలో ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. అందరి ఆశీస్సులతో జగనన్న త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని చెప్పారు. అన్న బయటకు వచ్చిన తరువాతే ఎన్నికలు జరుగుతాయని, జగనన్న మనమంతా బలపరుద్దామని పిలుపునిచ్చారు. షర్మిలమ్మ ప్రసంగాన్ని శ్రద్ధతో ప్రజలు విని హర్షధ్వానాలు చేశారు.

చిడతలతో చిందేస్తూ..
పిడుగురాళ్లరూరల్: మండలంలోని జానపాడుకు చెందిన కోటయ్య తనకొచ్చిన చిడతల నృత్యంతో షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. 75 ఏళ్ల వయస్సులోనూ హూషారుగా నృత్యం చేసుకుంటూ, చిడతలు వాయిస్తూ షర్మిలతోపాటు నడుస్తున్నాడు. పందిటివారిపాలెంలోని బస ప్రాంతం నుంచి పిడుగురాళ్ల వరకు పాదయాత్రలో పాల్గొన్నారు.

ఇది రైతు పట్టని రాజ్యం

ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ..మట్టినే నమ్ముకుంటూ...ఆ మట్టి నుంచి ముద్దను సృష్టించి లోకానికి పట్టెడన్నం పెట్టె రైతు... దేశానికి వెన్నెముక. రైతు లేనిదే రాజ్యం లేదని గుర్తించిన నేత... వైఎస్ రాజశేఖరరెడ్డి. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని త్రికరణశుద్ధిగా నమ్మిన మహావ్యక్తి...రాజన్న. కర్షకుల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేసిన తొట్టతొలి నాయకుడు...వైఎస్. 2003 ఏప్రిల్ 9 నుంచి జూన్13 వరకు 1700 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రాజశేఖరుడు...అన్నదాతల కష్టాలను అతి దగ్గరగా చూశారు... సీఎంగా పగ్గాలు చేపట్టగనే మాట తప్పక... మడమ తిప్పక... ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేసి రైతులపై వున్న ప్రేమను చాటుకున్నారు. వ్యవసాయంపై వున్న మమకారాన్ని పంచుకున్నారు.

ఆయన కల సాకారమైంది...రైతు రాజయ్యాడు....రాజశేఖరుడు రాజన్న అయ్యాడు. రాజన్న దుర్మరణంతో రైతులకు గతమెంతో ఘనకీర్తిగా మిగిలింది. ఉచితం దేవుడెరుగు అసలు విద్యుత్తే లేకుండా పోయింది. పంటలు పోయాయి. అప్పులు మిగిలాయి. ఆత్మహత్యలు పెరిగాయి. మరో ప్రజాప్రస్థానంలో షర్మిల ఎదుట రైతన్నలు బోరు మంటున్నారు. రాజన్న పోవడంతోనే తమ బతుకులూ పోయాయంటూ కంటతడిపెడుతున్నారు. జగనన్న వస్తాడు..రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాడు ఓపిక పట్టాలంటూ ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు షర్మిల.

 గుంటూరు:‘జగనన్న పాలనలో మహానేత రాజన్న రాజ్యం రానుంది. అప్పుడు రైతే రాజు. విద్యార్థుల పైచదువులకు ఢోకా ఉండదు.వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు, పేదవారికి నెలనెలా రేషన్, పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది అప్పటి వరకు ఓపిక పట్టండని’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల కోరారు. ఈ దొంగల రాజ్యం ప్రజా సమస్యలు పట్టించుకోకుండా రోజుకో విధంగా పన్నుల భారాన్ని మోపుతోంది. విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని రైతుల్ని జైలుకు పంపుతోంది. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు చీకటి ఒప్పందం కుదుర్చుకుని మీ కోసం పాదయాత్ర అంటూ కాలక్షేపం చేస్తున్నాడని షర్మిల విరుచుకుపడ్డారు.

ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’పాదయాత్ర గురువారం గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామ సమీపంలోని బస కేంద్రం నుంచి ప్రారంభమైంది.దారిలో ఆమెను కలిసిన రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులను అడిగి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. శనగ, మొక్కజొన్న పంటలు నీళ్లు అందక ఎండిపోయాయని రైతులు పోట్లచెరువు నాగేశ్వరరావు, మన్నెం సుబ్బయ్యలు వివరించారు. 

జానపాడులో రచ్చబండ...
జానపాడులో జరిగిన రచ్చబండలో రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం వల్ల నాశనమై పోతున్నామన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు. . కరెంటు లేకపోవడంతో చదువులు సాగడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ పాలనలో చల్లగా ఉన్నామని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తన భర్తను బతికించుకున్నట్టు దుర్గ అనే అంగన్‌వాడీ కార్యకర్త వివరించారు. మహిళల సమస్యలు ఆసాంతం విన్న షర్మిల జగనన్న వస్తాడు, మీ సమస్యలు తీరుస్తాడు అంటూ భరోసా ఇచ్చారు. ఈ రచ్చబండలో షర్మిలతోపాటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కూడా పాల్గొన్నారు. నేరేడు మల్లయ్య అనే వృద్ధుడు గురువారం షర్మిలను కలిసి ఆశీర్వదించాడు. మూడు రోజుల నుంచి ప్రయత్నించడంతో ఈ రోజు షర్మిలమ్మను కలవగలిగానని ఆనందం వ్యక్తం చేశాడు.

విద్యార్థులతో ముఖాముఖి...
మధ్యాహ్నం భోజన విరామం తరువాత పిడుగురాళ్లలోని నవీన విద్యాసంస్థల విద్యార్థులతో షర్మిల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా అందడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై షర్మిల మాట్లాడుతూ జగనన్న సీఎం అయిన తరువాత మీ చదువులకు ఢోకా లేకుండా ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం మళ్లీ వస్తుందని హామీ ఇచ్చారు.అక్కడి నుంచి బయలుదేరగా, పిడుగురాళ్ల ఐలాండ్ సెంటర్ వద్ద భారీ ఎత్తున స్వాగతం లభించింది. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ, పిడుగురాళ్లలో తాగునీటి సమస్య పరిష్కారానికి వైఎస్ చేసిన కృషిని గుర్తు చేశారు. 

రూ. 37 కోట్లతో 2006లోనే తాగునీటి పథకం ప్రారంభించి 80 శాతం పూర్తి చేసినా మిగిలిన పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. బొగ్గు, కరెంటు లేక సున్నం పరిశ్రమలు మూతపడి వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. వైఎస్ హయాంలో ఈ నియోజకవర్గంలో రూ.500 కోట్ల విలువైన పనులు జరిగాయన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ఈ దొంగల ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. జగనన్న పాలనలో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, పంటలకు గిట్టుబాటు కల్పించడంతోపాటు ఎరువులు, క్రిమి సంహారక మందుల ధరలు పెరగకుండా నియంత్రిస్తామని చెప్పారు.

సీఎంకు ముందు చూపులేకే కోతలు..
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌కు ముందుచూపు లేకపోవడం వల్ల కరెంటు కోత ఏర్పడిందన్నారు. ఇప్పటి సాగునీటి సమస్యలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కారణమని తెలిపారు. ప్రజల్లో జగనన్నకు పెరుగుతున్న ఆదరణకు భయపడి కేంద్రం సీబీఐతో కేసులు పెట్టించి జైలులో ఉంచిందని, ఆయన ఎక్కడ ఉన్నా పులి పులేనన్నారు. ఉదయించే సూర్యుడిని ఎలా ఆపలేరో జగనన్నను సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నారు. అప్పటి వరకు పార్టీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్,రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,పార్టీ శాసనసభాపక్ష ఉపనేత మేకతోటి సుచరిత, గుంటూరు, కృష్ణా జిల్లాల కో ఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), జిల్లా పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి, కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, నాయకులు యెనుముల మురళీధరరెడ్డి, డాక్టర్ నన్నపనేని సుధ, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, బీసీ సెల్ జిల్లా కన్వీనరు దేవెళ్ల రేవతి, ఎస్‌సీ సెల్ కన్వీనరు బండారు సాయిబాబు, నూనె ఉమామహేశ్వరరెడ్డి,అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. 

పోటెత్తిన పిడుగురాళ్ల...
పిడుగురాళ్ల: షర్మిల పాదయూత్ర పిడుగురాళ్ళకు చేరడంతో పట్టణవుంతా జనసంద్రంగా మారింది. రాజన్న బిడ్డను చూసేందుకు, ఆమెకు తవు సవుస్యలను విన్నవించుకునేందుకు పట్టణానికి జనం పోటెత్తారు. దీంతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ కిక్కిరిసి పోయూయి

Popular Posts

Topics :