20 November 2011 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఎంపి జగన్నాథంకు గుండె నొప్పి

Written By news on Saturday, November 26, 2011 | 11/26/2011
http://www.cinejosh.com/newsimg/newsmainimg/1266398150_200-Manda-Jagannadham.jpgన్యూఢిల్లీ: ఎంపి మందా జగన్నాథం గుండె నొప్పితో బాధపడుతున్నారు. ఆయనకు ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేస్తున్నారు.

చంద్రబాబు సంబంధించి పీఈ నెం 7/2011తో కేసు నమోదు

 అక్రమాస్తుల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు సహా 12 మందిపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి పీఈ నెం 7/2011తో కేసు నమోదు చేసింది. భువనేశ్వరి, లోకేష్, నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్, మురళీమోహన్, రామోజీరావు, నాగరాజ నాయుడు, అహోబిలరావు, కేవీ రావు, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, హెరిటేజ్ ఫుడ్స్‌పై కేసులు నమోదు చేసింది.

బాలినేని ఫై దౌర్జన్యం

బాలినేని ఫై దౌర్జన్యం

15 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ ముమ్మరంగా సభ్యత్వం


హైదరాబాద్: సభ్యత్వ కార్యక్రమాన్ని వచ్చే నెల 15 నుంచి ముమ్మరం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగానే ‘గడప గడపకూ వైఎస్సార్’ అనే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. శుక్రవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో 12 జిల్లాల సమీక్ష సమావేశం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విజయవాడ సిటీ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, పరిశీలకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఓదార్పుయాత్ర శనివారం జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర శనివారం గుంటూరు జిల్లా బాపట్ల మండలం కంకటపాలెం నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

వివరాలు..

26-11-2011 శనివారం

బాపట్ల మండలం
* కంకటపాలెం నుంచి యాత్ర ప్రారంభం 
* వెదుళ్లపల్లిలో వైఎస్ విగ్రహావిష్కరణ
* స్టువార్టుపురంలో విగ్రహావిష్కరణ
* బేతపూడిలో నాలుగు విగ్రహాల ఆవిష్కరణ
* మురుకొండపాడులో పర్యటన
* కంకటపాలెంలో విగ్రహావిష్కరణ
* నరసాయపాలెంలో విగ్రహావిష్కరణ
* జమ్ములపాలెంలో నాలుగు విగ్రహాల ఆవిష్కరణఒకే రోజు 14 వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ

శుక్రవారం ఒకే రోజు అత్యధికంగా 14 వైఎస్సార్ విగ్రహాలను జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. బాపట్ల పట్ట ణంలో ఆరింటిని, రూరల్ మండల పరిధిలో ఎనిమిది విగ్రహాలను ఆవిష్కరించి ప్రసంగించారు. బాపట్ల పట్టణంలోని ప్యాడిసన్‌పేట, వెంగళ్‌విహార్, మున్సిపల్ కాంప్లెక్స్, ఉప్పరపాలెంరెడ్డినగర్, శాంతినగర్, దుగ్గుమల్లివారిపాలెం ప్రాంతాల్లో విగ్రహాలను ఆవిష్కరించారు. అలాగే రూరల్ మండలంలోని మచ్చావారిపాలెం, దరివాదకొత్తపాలెం, అసోదివారిపాలెం, మరుప్రోలువారిపాలెం, హనుమాన్‌నగర్, బసివిరెడ్డిపాలెం, పాండురంగాపురం, పోతురాజు కొత్తపాలెం గ్రామా ల్లో విగ్రహాలను ఆవిష్కరించారు.


జనం మేలు కోరేవారే నిజమైన నేతలు. వారినే ప్రజలు సుదీర్ఘకాలం ఆదరిస్తారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మహానేత అందుకు నిదర్శనం. ‘సమాజంలో అట్టడుగువర్గాల సమస్యలు అవగతమవ్వాలంటే వారి మధ్యకు వెళ్లాలి. వారితో మమేకం కావాలి..’ ఇది వైఎస్సార్ సూత్రం. అందుకే వేలకిలోమీటర్ల పాదయాత్రతో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. అదేమాదిరి ఇప్పుడు ఓదార్పు యాత్రలో జగన్ జనంతో కలసిపోతున్నారు. వారి కష్టాలను వింటున్నారు..నష్టాలనూ తెలుసుకుంటున్నారు.. ఆయన చెప్పినట్టు... పేదరికాన్ని అతి దగ్గరగా చూస్తున్నారు. రోజులు.. గంటలు.. నిమిషాలు.. ప్రజల కోసమే అలుపూసొలుపూ లేకుండా సాగిపోతున్నారు. ఓదార్పు యాత్రలో ప్రజలను ‘మేలు’కొలుపుతున్నారు.

బాపట్ల టౌన్, న్యూస్‌లైన్ : భావపురి ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. ఓదార్పుయాత్ర శుక్రవారం 27.7 కిలోమీటర్లు సాగింది. 14 వైఎస్సార్ విగ్రహాలను జననేత ఆవిష్కరించారు. అశేష జనవాహిని నడుమ శుక్రవారం రెండోవిడత పదోరోజు ఓదార్పుయాత్ర సాగిం ది. పట్టణంలోని టీచర్స్ కాలనీలో పార్టీనేత సలగల రాజశేఖర్‌బాబు నివాసం నుంచి ఉదయం 9.40గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్రకు బయలుదేరారు. అంతకుముందు సలగల నివాసంలో ప్రత్యేక క్రైస్తవ ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. అక్కడినుంచి ప్యాడసన్‌పేటకు చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వెంగళవిహార్‌కు చేరుకుని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పటేల్‌నగర్‌లోని దొంతిరెడ్డి జగదీష్‌కుమార్‌రెడ్డి నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు.

తర్వాత పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ సమీపంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 
చర్చిలో ప్రార్థనలు..: అనంతరం జమ్మేదార్‌పేటలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మేరీమాత విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం మక్కామసీదులో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడ మతపెద్దలు చౌకం, టోపీతో సత్కరించారు. అక్కడినుంచి ఉప్పరపాలెంరెడ్డినగర్ చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం శాంతినగర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. పార్టీ నాయకురాలు వసుంధర నివాసానికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. 

మార్గం మధ్యలో శాంతినగర్‌లో రైల్వేగేట్ వద్ద బాపట్ల రూరల్ మండలం మచ్చావారిపాలెం గ్రామస్తులు జగన్‌ను కలిసి తమ గ్రామంలో పర్యటించాలని పట్టుబట్టారు. వారి కోరిక మేరకు జననేత ఆ గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మచ్చావారిపాలెం శివారులోని మున్నంవారిపాలెం వాసులు తమ గ్రామానికి రావాలని జగన్‌ను కోరడంతో ఆ గ్రామంలోనూ పర్యటించి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. తిరిగి పట్టణంలో చేరుకుని ఏబీఎం చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నారు.

దగ్గుమల్లివారిపాలెంలో..: అక్కడినుంచి దగ్గు మల్లివారిపాలెం చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హయ్యర్‌నగర్ చేరుకుని చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. విలియం బూత్ జూనియర్ కళాశాల విద్యార్థులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు.
బాపట్ల రూరల్‌లో..: పట్టణంలో పర్యటన ముగించుకుని రూరల్ మండలంలోని దరివాదకొత్తపాలెం చేరుకున్న జగన్‌కు జనం ఘనస్వాగతం పలికారు. దారిలో పూలతివాచీ పరిచారు. గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. అక్కడినుంచి అసోదివారిపాలెం పయనమైన జగన్‌ను మార్గంమధ్యలో నాగేంద్రపురం గ్రామస్తులు స్వాగతం పలికి తమ గ్రామానికి రావాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఆ గ్రామంలోనూ పర్యటించారు. రామాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అసోదివారిపాలెం చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. 

మరుప్రోలువారిపాలెంలో..: గ్రామంలో మేడిబోయిన విష్ణునారాయణరెడ్డి నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు. అనంతరం మరుప్రోలువారిపాలెంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ్నుంచి హనుమాన్‌నగర్ చేరుకున్న ఆయన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బసివిరెడ్డిపాలెం చేరుకుని ఆ గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. పాండురంగాపురం చేరుకునే క్రమంలో చీరాల మండలంలోని దేవనూతల గ్రామస్తులు జగన్‌కు స్వాగతం పలికారు. పాండురంగాపురం చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి పోతురాజుకొత్తపాలెం చేరుకున్నారు. అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తిరిగి కంకటపాలెం చేరుకుని స్థానికుడు షేక్ ఇస్మాయిల్ నివాసానికి రాత్రి బసకు చేరుకున్నారు.

ముఖ్యనేతలు హాజరు..: విగ్ర హ ఆవిష్కరణలకు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, నగర కమిటీ కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, పార్టీ నాయకులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే), మేరుగ నాగార్జున, పార్టీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉషా, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, సలగల రాజశేఖర్, మోదుగుల బసవపున్నారెడ్డి, దొంతిరెడ్డి మురళీగోవిందరెడ్డి, మేరిగ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నా

నారా చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల కేసు

తనిఖీలకు సీబీఐ ప్రత్యేక బృందాల ఏర్పాటు 
ప్రభుత్వం నుంచి చంద్రబాబు హయాం రికార్డులు కోరే అవకాశం 
బినామీల సంస్థలు, లావాదేవీలపై ఐటీ, ఆర్‌ఓసీల నుంచి సమాచారం విశ్లేషణ 
దర్యాప్తుకు సన్నద్ధమవుతున్న రాష్ట్ర పోలీసుశాఖ, సీఐడీకి కేసు అప్పగింత! 
బాబు, బినామీల అక్రమాస్తులపై ఇప్పటికే రంగంలోకి దిగిన ఈడీ

 మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం దర్యాప్తు ప్రారంభించింది. హైకోర్టు నుంచి పిటిషనర్ కాపీలను సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ స్వయంగా తీసుకు వచ్చారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు జరిపి మూడు నెలల్లోగా సీల్డ్ కవర్‌లో నివేదిక అందిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. పిటిషనర్ కాపీలను పరిశీలించిన అనంతరం దర్యాప్తుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకుంటామని చెప్పారు. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావులతోపాటు చంద్రబాబు బినామీల అక్రమాలు, చర్యలపై స్వతంత్రంగా దర్యాప్తు జరపాలని హైకోర్టు ఈ నెల 14వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ), రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలు వేర్వేరుగా దర్యాప్తు జరిపి మూడు నెలల్లో నివేదిక అందించాలని హైకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈడీ ఇప్పటికే రంగంలోకి దిగింది. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్, టీడీపీ ఎంపీ సుజనాచౌదరి, రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎండీ, టీడీపీ ఉపాధ్యక్షుడు సి.ఎం.రమేష్, కాకినాడ సీ పోర్టు అధినేత కర్నాటి వెంకటేశ్వరరావులకు ఈడీ నోటీసులు జారీచేసింది. విదేశాలతో లావాదేవీలు జరిపిన వీరందరి వ్యవహారాన్ని ఫెమా (విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం) కింద ఈడీ విచారించనుంది. 

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ కూడా శుక్రవారం నుంచి రంగంలోకి దిగింది. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు బినామీల అక్రమ ఆస్తుల గుట్టును సీబీఐ రట్టుచేయనుంది. పిటిషనర్ హైకోర్టులో దాఖలుచేసిన 2,424 పేజీల కాపీని క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం సీబీఐ అధికారులు యాక్షన్ ప్లాన్‌ను రూపొందిం చుకోనున్నారు. సోమవారం నుంచి దర్యాప్తు ప్రారంభించి చంద్రబాబుతోపాటు ఆయన బినామీలకు సీబీఐ నోటీసులు జారీచేయనుంది. అక్రమ ఆస్తుల సంపాదన, అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఏమేమి అక్రమాలకు పాల్పడ్డారనే అంశాలపై సీబీఐ దృష్టిసారించనుంది. వారి ఆదాయ వనరులు ఏమిటి? ఏవిధంగా సంస్థలను ఏర్పాటుచేశారు? వాటికోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా? అనే అంశాలపై ప్రతివాదులు సమాధానం ఇవ్వాల్సి ఉంది. నోటీసులతోపాటు ప్రతివాదులను సీబీఐ బృందాలు నేరుగా విచారించనున్నాయి.

సమాచార సేకరణలో భాగంగా సీబీఐ ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగనున్నాయి. ప్రతివాదుల నివాసాలు, వారికి సంబంధించిన సంస్థల కార్యాలయాల్లో సోదాలు జరిపే అవకాశం ఉంది. అవసరానికి అనుగుణంగా సీబీఐ కేంద్ర కార్యాలయంతోపాటు ఇతర యూనిట్‌ల నుంచి అదనపు సిబ్బందిని రప్పిస్తున్నారు. చంద్రబాబు, ఆయన బినామీల అక్రమ ఆస్తుల సమాచారం సేకరించేందుకు కొన్ని బృందాలు విదేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉండొచ్చని సీబీఐ వర్గాల సమాచారం. చంద్రబాబు, ఆయన బినామీలకు మలేసియా, సింగపూర్‌లలో హోటల్ ఇతర వ్యాపారాలకు సంబంధించి కూడా సీబీఐ ఆరా తీయనుంది. సింగపూర్‌లో పార్క్ హోటల్ క్లార్క్‌క్వే అనే పేరుతో ఈగిల్ ఫోర్స్ ప్రాఫిట్స్ లిమెటెడ్ కంపెనీ పేరుతో చంద్రబాబు ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంపై సీబీఐ సమాచారం సేకరించనుంది. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ విదేశీ చదువులు, ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఎన్‌ఆర్‌ఐల విరాళాలపై కూడా ఆరా తీయనున్నారు. అత్యంత ఖరీదైన భూమిని ట్రస్ట్ పేరుతో తీసుకుని పార్టీ కార్యకలాపాలకు వినియోగించటంపై కూడా చంద్రబాబు సీబీఐ దర్యాప్తులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

13 మంది ప్రతివాదులు వీరే... 
చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన బినామీలందరికీ సీబీఐ నోటీసులు జారీ చేయనుంది. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్, హెరిటేజ్ ఫుడ్స్, అహోబలరావు, వి.నాగరాజనాయుడు, టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, మధుకాన్ సుగర్స్ అధినేత నామా నాగేశ్వరరావు, టీడీపీ నేత మురళీమోహన్, కాకినాడ సీ పోర్టు అధినేత కర్నాటి వెంకటేశ్వరరావు, టీడీపీ ఉపాధ్యక్షుడు సి.ఎం.రమేశ్‌లు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్నారు. వీరికి సంబంధించిన ఆదాయ వ్యయాలపై ఆదాయపన్ను శాఖ నుంచి కూడా వివరాలను సేకరించేందుకు సీబీఐ సన్నాహాలు చేస్తోంది. ఆదాయపన్ను శాఖకు వారు ఇచ్చిన వార్షిక నివేదికలను కూడా సేకరించనుంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) నుంచి ఆయా సంస్థల ఏర్పాటుకు సంబంధించిన అంశాలు, లావాదేవీల వివరాలను సీబీఐ అధికారులు తీసుకోనున్నారు. 

ప్రభుత్వ రికార్డులను పరిశీలించనున్న సీబీఐ 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఆయన అనుయాయులకు, బినామీలకు మేలు చేసే విధంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులను సీబీఐ కోరనుంది. కాకినాడ సీ పోర్టు ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అప్పటి రికార్డులను స్వాధీనం చేసుకోనున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో విద్యుత్ అవసరాల కోసం ప్రైవేటు రంగంలో ఎనిమిది విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం చంద్రబాబు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు).. అటు ప్రమోటర్లకు, ఇటు తనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే ప్రహసనంగా మార్చుకున్న వ్యవహారానికి సంబంధించిన రికార్డులను కూడా సీబీఐ కోరనుంది. 

చంద్రబాబు అక్రమ ఆస్తుల కేసు సీఐడీకి? 
చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, బినామీల ఆస్తుల వ్యవహారంపై దర్యాప్తు జరపాల్సిందిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. పోలీసుశాఖ అందుకు సన్నాహాలు చేస్తోంది. హైకోర్టుకు సంబంధించిన ఉత్తర్వులను పరిశీ లించాల్సి ఉందని పోలీసుశాఖ ఉన్నతస్థాయి వర్గాలు శుక్రవారం తెలిపాయి. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) ద్వారా దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. సీబీఐ, ఈడీతోపాటు పోలీసుశాఖ కూడా వేరొక నివేదికను హైకోర్టుకు అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఐడీ ఆర్థిక నేరాల విభాగం అధికారులతోపాటు చార్టెర్డ్ అకౌంట్లు, ఆర్థిక నిపుణుల సహకారంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేయనున్నారు.


పార్టీ సీనియర్ నేతలతో బాబు సమాలోచనలు 
వారి సూచనల మేరకే కోర్టుకెళుతున్నట్లు చెప్పాలని సూచన 
బినామీల వరకే కోర్టుకువెళితే.. తనకు ప్రయోజనం ఉండదని బాబు యోచన
సోమ, మంగళవారాల్లో వెకేట్ పిటిషన్ దాఖలుకు కసరత్తు 
కోర్టులో ఉపశమనం లభించకున్నా.. 
దర్యాప్తు సమయంలో సర్కారు సాయం చేస్తుందని బాబు భరోసా 

హైదరాబాద్, న్యూస్‌లైన్: హైకోర్టు తనతో పాటు బినామీల అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించాలని కోరుతూ వెకేట్ పిటిషన్ దాఖలు చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సోమ లేదా మంగళవారాల్లో వెకేట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం నగరానికి చేరుకున్న చంద్రబాబు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, రేవంత్‌రెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. సీబీఐ దర్యాప్తుపై కోర్టుకు వెళ్లవద్దని తాము తొలి నుంచీ చెప్తున్నామని, ఇపుడు కూడా అదే విధంగా ఉంటే బాగుంటుందని పలువురు నేతలు ఈ సందర్భంగా పార్టీ అధినేతకు సూచించినట్లు సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం కోర్టును ఆశ్రయిస్తానని, వారందరి ఒత్తిడి మేరకే తాను కోర్టుకు వెళ్లటానికి అంగీకరించానని మీడియాకు చెప్పాల్సిందిగా సూచించారు. 

బాబుతో పాటు ఆయన బినామీల ఆస్తులపై విచారణకు ఆదేశించాల్సిందిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించబోనని, ప్రజాకోర్టులో తేల్చుకుంటానని, తనపై 23 విచారణ కమిషన్‌లు, సభా సంఘాలు వేశారని, తన జీవితం తెరిచిన పుస్తకమని, తను ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని, ఏ దర్యాప్తుకూ భయపడేది లేదని చంద్రబాబు పలు సందర్భాల్లో ప్రకటించారు. అయితే బాబు బినామీలు సి.ఎం.రమేష్, నామా నాగేశ్వరరావు, రామోజీరావులు సుప్రీంకోర్టును ఆశ్రయించినపుడు ఆ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టులో తేల్చుకోవాల్సిందిగా సూచించిన విషయం తెలిసిందే. తాను కోర్టును ఆశ్రయించకపోతే సీబీఐ, ఈడీ, డీజీపీ, హోంశాఖ కార్యదర్శుల విచారణ యథాప్రకారం కొనసాగుతుందని, బినామీలు మాత్రమే కోర్టును ఆశ్రయించి తాము బాబు బినామీలం కాదని చెప్తే వారికే ఉపశమనం లభించే అవకాశం ఉంటుందని.. తనకు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదని టీడీపీ అధినేత చెప్తున్నారు. దీంతో సుప్రీం తీర్పును సాకుగా చూపి హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. శుక్రవారం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో తన నిర్ణయాన్ని ఆయన వెల్లడించారు. ఏదైనా ఒక కేసులో సింగిల్ జడ్జి లేదా ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్‌ను వెకేట్ పిటిషన్ అంటారు.

సర్కారు సాయం చేస్తుంది..!: హైకోర్టులో వేయాల్సిన వెకేషన్ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ఒకవేళ హైకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వకపోయినా సీబీఐ దర్యాప్తు సమయంలో ప్రభుత్వం తమకు తగిన సహకారం అందిస్తుందని చంద్రబాబు పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం. 


వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై కోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని గుర్తు చేస్తూ.. తన విషయంలో అలా చేయకపోవచ్చని, ఈ మధ్య జస్టిస్ కక్రూను మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమించేందుకు తాము సహకరించటం, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకారం అందిస్తుండటం వంటి వాటిని కాంగ్రెస్ పెద్దలు కూడా అర్థం చేసుకుంటారని బాబు చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించే విషయమై పార్టీ నేత ఎర్రన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తమకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. అయితే అది ఎప్పుడనేది నిర్ణయించలేదన్నారు. 

తెలంగాణ జిల్లాల్లో పర్యటన వాయిదా: రైతు పోరుబాటలో భాగంగా నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో చేపట్టాల్సిన పాదయాత్రను చంద్రబాబు వాయిదా వేసుకున్నారు. సీబీఐ దర్యాప్తుపై హైకోర్టును ఆశ్రయించేందుకు అవసరమైన కసరత్తు చేసేందుకు ఈ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. శని, ఆదివారాల్లో ఇదే అంశంపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు. అయితే పశ్చిమబెంగాల్‌లో మావోయిస్టు నేత కిషన్‌జీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లో పర్యటనను చంద్రబాబు వాయిదా వేసుకున్నారని పార్టీ నేతలు చెప్పారు. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఆయన ఆయా జిల్లాల్లో పాదయాత్ర చేస్తారని సమాచారం.

రేపు ఆరోగ్యశ్రీ ఆలోచన సోనియాది అంటారేమో!


పావలా వడ్డీ పథకం ఆలోచన కిరణే ఇచ్చానంటున్నారు
రేపు ఆరోగ్యశ్రీ ఆలోచన సోనియాది అంటారేమో!
పావలా వడ్డీ కిరణ్ బుర్రలో నుంచి వచ్చిందైతే.. రూ.800 కోట్ల బకాయిలు గుర్తులేవా?
15 లక్షల ఉద్యోగాలు ఇస్తారట.. 104 ఉద్యోగులకు, అంగన్‌వాడీలకు 2 నెలలుగా జీతాల్లేవ్..
ఆదర్శ రైతులకు 8 నెలలుగా, ఏఎన్‌ఎం నర్సులకు 5 నెలలుగా జీతాల్లేవ్..
ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద శని.. చంద్రబాబు రెండో శని..ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఒక మాట అన్నారని ఇవాళ పేపర్లో చదివాను.. పావలా వడ్డీ పథకం ఆలోచన తానే ఇచ్చానని ఆయన చెప్పారు. రేపు ఆరోగ్యశ్రీ ఆలోచన ఇంకో మంత్రో.. లేకుంటే సోనియా గాంధీయే ఇచ్చారని కూడా చెప్తారేమో!! ముస్లిం సోదరులకు నాలుగు శాతం రిజర్వేషన్లు తానే ఇచ్చానని మరో మంత్రో.. లేకుంటే పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చారని చెప్పుకుంటారేమో! ఆ దివంగత మహానేత చేసిన మంచి పనులను కూడా దొంగతనం చేస్తారా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 27వ రోజు శుక్రవారం ఆయన బాపట్ల పట్టణంతోపాటు, రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. 14 వైఎస్సార్ విగ్రహాలను అవిష్కరించారు. గ్రామస్తుల కోరిక మేరకు ఆయన ప్రతి గ్రామంలోనూ ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

బకాయిల సంగతేంటి: పావలా వడ్డీ పథకం కిరణ్ కుమార్‌రెడ్డి బుర్రలో నుంచి వచ్చిన ఆలోచనైతే ఇవాళ ఆ పథకానికి రూ.1,400 కోట్లు కావాల్సి ఉండగా.. ఈ ప్రభుత్వం రూ.600 కోట్లే ఇచ్చింది. ఇంకా రూ.800 కోట్ల బకాయిలు పక్కన పెట్టి పావలావడ్డీ పథకం నాదే అని గొప్పలు చెప్పుకోవడం చూస్తే బాధనిపిస్తోంది. ఇదే కిరణ్‌కుమార్‌రెడ్డి 15 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నానని.. ఇస్తానని గొప్పలు చెప్తున్నారు. ఒకవైపు 104 కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవని, 8 నెలలుగా డీఏ లేదని సమ్మెలు చేస్తున్నారు. 

డబ్బులు ఇవ్వకపోతే 108 నడపలేమని యాజమాన్యాలే కిరణ్ కుమార్‌రెడ్డికి లేఖలు రాశాయి. అంగన్‌వాడీ వర్కర్లకు రెండు నెలల నుంచి జీతాలు లేవు.. ఆదర్శ రైతులకు కొంత మందికి ఎనిమిది నెలల నుంచి, మరి కొంతమందికి నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. ఇవాళే తెలిసింది. పీహెచ్‌సీలో పనిచేసే ఏఎన్‌ఎం నర్సులకు రెండు నెలల నుంచి, అర్బన్‌హెల్త్‌సెంటర్‌లో పనిచేసే వారికి ఐదు నెలల నుంచి జీతాలు లేవు. పరిస్థితి ఇలా ఉంటే గొప్పలకు అన్ని లక్షల ఉద్యోగాలు, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నానని అంటున్నారు.

రాష్ట్రానికి వీళ్లే శని: ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద శని. ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు రెండో శని. వీళ్లకు ప్రజా సమస్యలు పట్టవు. ఇవాళ పొలానికి వెళ్లి రైతన్నలను పలకరిస్తే.. పంట కోతకొచ్చింది. కోయాలంటేనే భయమేస్తోంది అంటున్నారు. ఎందుకని అడిగితే.. ఇవాళ బస్తా వరి ధాన్యం ధర రూ.700 నుంచి రూ.800 మాత్రమే ఉంది.. ఈ ధరల్లో ధాన్యం అమ్ముకుంటే గిట్టుబాటు కాదని చెప్పారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని అధ్వానపు పరిస్థితులు ఉన్నాయి. మద్దతు ధర సంగతిలా ఉంటే.. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక్కడి రైతులకు ఎరువులు, పొటాష్ ఎక్కువ అవసరం. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు బ్లాక్‌లో టికెట్లు కొన్నట్లుగా రైతులు ఎరువులు కొనుక్కోవాల్సి వస్తోంది. గతంలో రూ.500 ఉన్న డీఏపీ ధర ఇవాళ రూ.వెయ్యికి పైగా పెరిగింది. ఇవాళ ఉన్న ధర రేపు ఉండదు. రోజు రోజుకు ఈ ధరలు పైపైకి పోతున్నాయి. రైతు పండించిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధర ఉండని అధ్వానపు పరిస్థితులు ఉన్నాయి. రచ్చబండ అన్నది మహానేత వైఎస్సార్ కన్న ఓ మంచి స్వప్నం. గ్రామాల్లోకెళ్లి ప్రతి పేదోడి గోడూ వినాలని ఆయన అనుకుంటే.. ఈ పాలకులు ఊళ్లల్లోకెళ్లడానికి భయపడి మండల కేంద్రాల్లోనే రచ్చబండ పెడుతున్నారు. ఎమ్మెల్యేలు సిఫార్సులు చేసిన వాళ్లకే కార్డులు, పింఛన్లు ఇస్తున్నారు.

తొమ్మిదేళ్లలో ఏనాడూ గుర్తుకు రాలేదా బాబూ?
చంద్రబాబు నాయుడూ.. ఇవాళ కాలేజీల్లోకి వెళ్లి విద్యార్థులకు లెక్చర్ల మీద లెక్చర్లు దంచుతున్నావు. నిన్ను ఒక్క మాట అడుగుతున్నా.. నువ్వు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒక్కసారి కూడా కాలేజీలకు వెళ్లాలని, అక్కడ చదువుతున్న పిల్లల బాధలు తెలుసుకొవాలని, ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఎన్ని బాధలు పడుతున్నారో తెలుసుకోవాలని ఏనాడూ నీకు అనిపించలేదా? ఇవాళ నువ్వు హూదా కమిషన్ అంటున్నావు.. స్వామినాథన్ కమిషన్ అంటున్నావు. తొమ్మిది గంటల ఉచిత కరెంటు అంటున్నావు. అర్థంకాని భాషలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ ఒక్క మాట అడుగుతున్నాను.. వ్యవసాయ పంపు సెట్టు హార్స్‌పవర్‌కు రూ.50 ఉన్న బిల్లును రూ.650కి పెంచిన ఘనత నీది కాదా? నీ పాలనలో మద్దతు ధర కేవలం రూ.370 నుంచి రూ.530కి పెంచావు. అదే దివంగత మహానేత ఐదేళ్ల కాలంలో రూ.530 నుంచి రూ.1,030కి పెంచారు. మద్దతు ధరకు మించి బస్తా వరి ధాన్యానికి రూ.1,400 నుంచి 1,500 వరకు ధర పలికిన ఆ దివంగత మహానేత సువర్ణయుగం ప్రతి రోజూ, ప్రతి ఘడియ మనకు గుర్తుకు వస్తూనే ఉంటుంది.

కాంగ్రెస్ ఒక శని అయితే, బాబు రెండవ శని: జగన్

Written By news on Friday, November 25, 2011 | 11/25/2011

రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఒక శని అయితే, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండవ శని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విమర్శించారు. అసోదివారిపాలెం గ్రామంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ అనంతరం ఆయన ప్రసంగించారు. చంద్రబాబు తన 9 ఏళ్ల పాలనలో విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచించారా? అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై ఆ దివంగత మహానేత వైఎస్ఆర్ పై కేసులు పెడుతున్నారని బాధపడ్డారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా తామున్నామని ప్రజలు తనకు భరోసా ఇస్తున్నారని చెప్పారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

హనుమాన్ నగర్ లో మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
బాపట్ల మండలం దగ్గుమల్లివారిపాలెంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఈ గ్రామానికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 
గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర 27వ రోజుకు చేరింది. శుక్రవారం ఉదయం ఆయన తన యాత్రను బాపట్లలోని టీచర్స్ కాలనీ నుంచి ప్రారంభించారు. ప్యాడిసన్ పేటలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

వెంగళ్ విహార్ లో 22 డ్వాక్రా సంఘాల మహిళలు వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వెంగళ్‌విహార్‌లోనూ మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

 

విదేశీ చదువులకు రూ.23 కోట్లు ఇచ్చిందెవరు?మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల అక్రమాస్తులు, విదేశాల్లోని బినామీల లావాదేవీల గుట్టును రట్టుచేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) సన్నద్ధమవుతోంది. బాబు తనయుడు లోకేశ్ విదేశీ చదువులకు చెల్లింపులెలా జరిగాయి, వాటినెవరు చెల్లించారనే కోణంలో పూర్తిస్థాయి ఆధారాలను సేకరిస్తోంది. మలేసియా, సింగపూర్‌లలో బాబు ఆస్తుల వివరాలతో పాటు ఆయన బినామీలైన సీఎం రమేశ్, సుజనా చౌదరి పలు దేశాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలను కూడా కూపీ లాగనుంది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ప్రకారం బాబు, ఆయన బినామీలు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లకు ఈడీ మంగళవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులకు వారంతా సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. వారందించే డాక్యుమెంట్ల తో ఈడీ సంతృప్తి చెందని పక్షంలో అదనపు సమాచారం కోరే అవకాశముంది. ఆ సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతుంది. ఇందుకోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు రాష్ట్రానికి వస్తున్నాయి.

విదేశీ చదువులకు రూ.23 కోట్లు ఇచ్చిందెవరు?

లోకేశ్ అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్, కార్నెగీ మిలన్ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఇంటర్‌లో మెరిట్ స్టూడెంట్ కాని ఆయనకు డొనేషన్లు కడితే తప్ప వాటిలో సీటు దక్కే అవకాశమే లేదు. దాంతో ఆ చదువులకు సుమారు రూ. 23 కోట్ల దాకా ఖర్చు చేశారు. లోకేశ్ చదువుకు, అక్కడ ఉండేందుకు అయిన ఖర్చును చంద్రబాబు గానీ, లోకేశ్ గానీ తమ రిటర్నుల్లో ఎన్నడూ చూపించలేదు. మరి అలాంటప్పుడు వాటికి చెల్లింపులు ఎక్కడ నుంచి జరిగాయనే గుట్టును ఈడీ రట్టు చేయనుంది. బాబు కుమారుని విదేశీ చదువుల కోసం సత్యం కంప్యూటర్స్ అధిపతి రామలింగరాజు డొనేషన్లు చెల్లించారని రాష్ట్ర రాజకీయ, కార్పొరేట్ వర్గాల్లో అంతా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఆ ‘చదివింపు’లను సత్యం రామలింగరాజు ద్వారా పొందలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత లోకేశ్, బాబులదే! అలా నిరూపించుకోవాలంటే డొనేషన్లను ఏ ఖాతాల నుంచి చెల్లించినదీ ఈడీకి ఆధారాలతో సహా చూపించాల్సి ఉంటుంది. 2001లో మేజర్ అయిన లోకేశ్‌కు హెరిటేజ్ ఫుడ్స్‌తో పాటు 15 కంపెనీల్లో షేర్లున్నాయి. హెరిటేజ్‌లో ఆయనకు ఏకంగా 9 శాతం వాటా ఉంది. నెల్లూరు జిల్లా నిండలిలో 2001కి ముందే భూములు కొనుగోలు చేశారు. 2006లో ముంబై, బె ంగళూరుల్లో ఎకరాల కొద్దీ కొనుగోలు చేసినట్టు కూడా సమాచారం. ఈ వ్యవహారాల గుట్టంతా ఈడీ దర్యాప్తుతో వెలుగులోకి రానుంది.

సింగపూర్‌లో బాబు హోటల్: బాబుకు 2001లోనే సింగపూర్‌లో హోటల్ ఉన్నట్టు తెహల్కా డాట్‌కామ్ వెల్లడించింది. పార్క్ హోటల్ క్లార్క్‌క్వే పేరుతో ఉన్న ఆ హోటల్‌లో 100 శాతం వాటా ఈగిల్ ఫోర్స్ ప్రాఫిట్స్ లిమిటెడ్ అనే కంపెనీదే! దాని తాలూకు అసలు లబ్ధిదారు బాబే అంటూ వచ్చిన వార్తలపైనా ఈడీ పూర్తిస్థాయి సమాచారం రాబట్టనుంది. బాబు హయాంలో రాష్ట్రంలో పనులు చేపట్టడానికి వచ్చిన ఐజేఎం కార్పొరేషన్, ఐఓఏ ప్రాజెక్ట్స్, జురాంగ్ ప్రాజెక్ట్స్ వంటివన్నీ నిధుల్ని మారిషస్ మార్గంలోనే తెచ్చుకున్నాయనే ఆరోపణలున్నాయి. వాటి భారతీయ ప్రతినిధులు టీడీపీ అత్యంత సన్నిహితులు కావడం ఈ అనుమానాలను మరింతగా బలపరుస్తోంది. ఐజేఎం ఇండియా రామలింగరాజు కుటుంబీ కులది. కాగా ఐఓఏ ఇండియా 2009లో టీడీపీ టికెట్‌పై అసెంబ్లీకి పోటీ చేసిన రమేశ్ సోదరుడు చుక్కపల్లి సురేశ్‌ది. ఆయనకు బంజారాహిల్స్‌లో అత్యంత ఖరీదైన రెండున్నర ఎకరాల స్థలాన్ని బాబు హయాంలో కారుచౌకగా ఏపీ జెమ్స్ అండ్ జ్యూయెలరీ పార్క్ కోసం కట్టబెట్టారు. అందులో ప్రభుత్వ వాటా 11 శాతం. కాగా మిగతాది సురేశ్‌ది. దీనికి మారిషస్ నుంచి నిధులు వచ్చాయి. ఈ వ్యవహారం మొత్తాన్నీ మనీ లాండరింగ్ (నగదు అక్రమ తరలింపు) కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. బాబు జీవితకాల ట్రస్టీగా ఉన్న ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు విదేశాల నుంచి అందిన విరాళాలు, వాటిని టీడీపీకి ఉపయోగించిన వైనం కూడా వెలుగులోకి రానుంది.

http://www.youtube.com/watch?v=iQXJgoewYg4&feature=player_embedded
నోటీసులతో బాబు బృందం హైరానా

తమకు ఈడీ నోటీసులు వచ్చాయని తెలియగానే చంద్రబాబు, ఆయన కుటుంబీకులు, బినామీలు నానా హైరానా పడ్డారు. ఈడీ ప్రతినిధులు మంగళవారం నేరుగా ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వెళ్లి నోటీసులు అందించారు. కానీ బాబు, లోకేశ్‌లకు నోటీసులు ఇచ్చేందుకు వారు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈడీ ప్రతినిధులు జూబ్లీహిల్స్‌లోని బాబు ఇంటికి వెళ్లగా, నోటీసులందుకునేందుకు అక్కడి సిబ్బంది ససేమిరా అన్నారు. ‘సార్ చెప్పనిదే నోటీసులు తీసుకోం’ అంటూ మొరాయించారు. తీసుకోకుంటే ఇంటికి అంటించి వెళ్తామని ఈడీ ప్రతినిధులు కరాఖండీగా చెప్పినట్టు సమాచారం. దాంతో బాబుతో సిబ్బంది ఫోన్‌లో మాట్లాడారు. తర్వాత నోటీసులను హెరిటేజ్ ప్రధాన కార్యాలయంలో ఇవ్వాల్సిందిగా ఈడీ ప్రతినిధులకు చెప్పారు. తీరా అక్కడికెళ్తే, ‘సార్ మాకు చెప్పలేదు’ అంటూ హెరిటేజ్ సిబ్బంది నుంచి సమాధానం వచ్చింది. దాంతో ఈడీ ప్రతినిధులు విసిగిపోయారు. మళ్లీ బాబు ఇంటికే వెళ్లి నోటీసులను గోడపై అంటించేందుకు సమాయత్తమయ్యారు. అప్పుడు ఎట్టకేలకు సిబ్బంది నోటీసులు తీసుకోవాల్సి వచ్చింది!

eenadu - congress friendship

ఈనాడు- కాంగ్రెస్ ల స్నేహం.క్రింద లింక్ చూడండి.ఎంత పాజిటివ్ గా ఉందో  తెలుస్తుంది.
ramoji house


సర్కారును పడగొట్టం!: చంద్రబాబు


విశాఖపట్నం, తుని/అన్నవరం, న్యూస్‌లైన్: ‘ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఉద్దేశం మాకు లేదు. మాకు కావలసింది ఎన్నికలు కాదు. అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకోవాలన్న ఆలోచన లేదు. మాకు ప్రజా సమస్యలే ముఖ్యం. ఆయారాం, గయారాంలకు బుద్ధి చెప్పడానికి, రైతు సమస్యలపై చర్చించడానికి.. అవసరమైతే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతాం. ఎవరో పెట్టమంటే పెట్టం’ అని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుండబద్దలు కొట్టారు. రాజ్యాంగబద్ధంగా అవిశ్వాసం పెట్టే అవకాశం ప్రతిపక్షానికుంటుందని, దానిని వీలునుబట్టి వినియోగించుకుంటామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో రైతు పోరుబాట పూర్తి చేసుకున్న ఆయన గురువారం ఉదయం అన్నవరంలో సత్యదేవుని దర్శించుకుని విశాఖ జిల్లా వచ్చారు. బుచ్చయ్యపేట మండలంలో పోరుబాట చేపట్టారు. ఇక్కడ సుమారు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. దిబ్బిడి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో, పలు రోడ్‌షోలలో, పలుచోట్ల విలేఖరులతో ఆయన మాట్లాడారు. కొంతమంది ఆయారాం, గయారాం ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారని, వైఎస్ హయాంలో ఆకర్ష్ పథకాన్ని పెడితే సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వికర్ష్ పేరిట ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ‘రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం మాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంపండి. బంగాళాఖాతంలో కలపండి. మీరూ, నేనూ కలిపి పోరుబాట పట్టాలి. ఇందుకోసం నెలకు రెండు రోజులు ఉద్యమానికి కేటాయించండి’ అని పిలుపునిచ్చారు. ఇంకా ఆయనేమన్నారంటే..

కిరణ్‌కు సిగ్గులేదు: ఈ సీఎంకు సిగ్గులేదు. రాష్ట్రంలో రైతులు తీవ్ర కష్టాల్లో ఉంటే నిద్రమత్తులో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాదుకే పరిమితమవుతున్నారు. వరదలు వచ్చినా, క్రాప్ హాలిడే ప్రకటించినా, పంటలు ఎండిపోతున్నా ఆపన్నహస్తం అందించేవారే కరువయ్యారు. రచ్చబండ ఓ రొచ్చుబండగా మారింది. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేం లేదు. గత ఎన్నికల్లో నేను తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ హామీని ఇచ్చి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేవాడిని. అలా ఇవ్వకే ఓటమి పాలయ్యాం. 

పందికొక్కుల్లా.. మంత్రులు: నా తర్వాత అవినీతిపరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుని ప్రజలు కష్టాలు కొనితెచ్చుకున్నారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక మంత్రులు, ఎమ్మెల్యేలు అందినకాడికి పందికొక్కుల్లా ప్రజల సొమ్మును దోచుకున్నారు. ఐఏఎస్‌లు సైతం భయంతో తప్పులు చేసి, కేసుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితిని సృష్టించారు. 
కక్రూ నియామకం సమంజసమే: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవికి రెండు పేర్లు ప్రతిపాదించారు. రెండో వ్యక్తి ఈ పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపకపోవడంతో కక్రూ పేరును బలపర్చాల్సి వచ్చింది. తెలుగులో ఎవరైనా ఫిర్యాదు చేయడం ఇబ్బందికాదా అంటే.. చీఫ్ జస్టిస్‌గా పని చేసినప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడేంటి?
(‘న్యూస్‌లైన్’ ప్రశ్నకు జవాబుగా ఈ వ్యాఖ్యలు చేశారు)

నన్నేం చేయలేరు..
‘పదవీ కాలం పూర్తయిన ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు నాపై అభియోగాలు మోపుతారా? అయినా మాకు ముందుగా నోటీసులివ్వకుండా హైకోర్టు మాపై సీబీఐ విచారణకు ఆదేశించడం రాజ్యాంగ విరుద్ధం. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మా వాదనలు వినిపిస్తాం. నాపై గతంలో 25 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. 24 విచారణలు, 65 ప్రాజెక్టులపై సమీక్షలు జరిపించారు. కాంగ్రెస్ నేతలు నన్నెప్పుడూ పనిచేసుకోనీయలేదు. కాంగ్రెస్ కుతంత్రాలు నన్నేం చేయలేవు’ అని బాబు వ్యాఖ్యానించారు.

బాబు సాక్షిగా నిరుద్యోగిపై దాడి

చోడవరం, న్యూస్‌లైన్: రైతు పోరుబాటలో చంద్రబాబు సాక్షిగా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పార్టీ నాయకులు ఒక నిరుద్యోగ యువకుడిని చితకబాదారు. బుచ్చయ్యపేట మండలం ఆర్.శివరాంపురంలో చంద్రబాబును కలిసి గోడు విన్నవించుకునేందుకు యన్నంశెట్టి రాజు అనే నిరుద్యోగి వచ్చాడు. దీంతో బాబు భద్రతాసిబ్బంది అతడిని బయటకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. సమస్యలు చెప్పుకోనివ్వాలంటూ అతడు ఎదురుతిరగడంతో నలుగురు సిబ్బంది పక్కకు తీసుకెళ్లి కిందేసి తన్నడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులిద్దరు దూసుకొచ్చి వారుకూడా ఆ యువకుడిని కొట్టారు.

Popular Posts

Topics :