01 May 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్సార్ సిపి తెలంగాణ నూతన కార్యవర్గం

Written By news on Saturday, May 7, 2016 | 5/07/2016

నేడు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జలజాగరణ


నేడు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జలజాగరణ
► హంద్రీ-నీవా ఆయకట్టుకు
 నీరివ్వకపోవడాన్ని నిరసిస్తూ
 ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పోరుబాట
► బెళుగుప్పలో నేటి సాయంత్రం 5 గంటల నుంచి దీక్ష


అనంతపురం: హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం మొదటిదశ ఆయకట్టుకు నీరివ్వకుండా.. సీఎం సొంత నియోజకవర్గం కుప్పానికి తీసుకుపోవడాన్ని నిరసిస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పోరుబాట పట్టారు. ఉరవకొండ నియోజకవర్గ రైతులతో కలిసి శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఎనిమిది వరకూ బెళుగుప్ప మండల కేంద్రంలో ‘జలజాగరణ’ దీక్షకు దిగుతున్నారు.  హంద్రీ-నీవా మొదటి దశ కింద 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చే సమయానికే మొదటి దశ పనులు 90 శాతం పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులపై దృష్టి సారించి ఉంటే గత రెండేళ్ల నుంచే మొదటి దశ ఆయకట్టు భూములు పంటలతో కళకళలాడేవి. కానీ సీఎం చంద్రబాబు ఆయకట్టు విషయాన్ని పక్కన పెట్టేసి.. తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీటిని తీసుకుపోవడానికి ప్రధాన కాలువపైనే దృష్టి సారించారు. దీంతో పాటు తమ వారికి లబ్ధి చేకూర్చడానికి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేశారు. రెండోదశలో రూ. 50 కోట్ల పనుల విలువను రూ. 300 కోట్లకు పెంచారు. 

గతేడాది జీవో  22ను విడుదల చేస్తూ.. ఆయకట్టు పనుల జోలికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.  ఈ నిర్ణయంతో ఉరవకొండ నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. మొదటి దశలో కర్నూలు జిల్లా పరిధిలోని 25 వేల ఎకరాలు పోనూ మిగిలిన ఆయకట్టంతా జిల్లాలోనే ఉంది. అత్యధికంగా ఉరవకొండ నియోజకవర్గంలో 75 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. జీడిపల్లి రిజర్వాయర్ కూడా బెళుగుప్ప మండలంలోనే నిర్మించారు. ప్రాజెక్టు కోసం వేల ఎకరాలను ఇక్కడి  రైతులు ఇచ్చారు. రిజర్వాయర్ నిర్మాణంతో  జీడిపల్లి  వాసులు తీవ్రంగా నష్టపోయారు. వారికి ఇప్పటికీ పునరావాసం కల్పించలేదు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఒత్తిడి తేవడంతో పాటు రాకెట్ల, ఆమిద్యాల ఎత్తిపోతల పథకాన్ని గతేడాది ఆగస్టులోగానే పూర్తి చేస్తామని ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చింది. అయితే ఇంత వరకూ అతీగతీ లేదు.

 ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి : విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే
 సీఎం చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ శనివారం సాయంత్రం బెళుగుప్పలో చేపడుతున్న జలజాగరణ  దీక్షకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, ప్రజలు తరలిరావాలి. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్‌రెడ్డి,  ఆలూరు ఎమ్మెల్యే జయరాం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ తదితరులు హాజరవుతున్నారు.

ఎంపీ మిథున్‌రెడ్డికి సెక్యూరిటీ తగ్గింపు


ఎంపీ మిథున్‌రెడ్డికి సెక్యూరిటీ తగ్గింపు
♦ 2+2 ఉన్న సెక్యూరిటీ 1+1కు తగ్గింపు
♦ అధికార పార్టీ ఎంపీ శివప్రసాద్‌కు మాత్రం కొనసాగింపు

సాక్షి, చిత్తూరు: వైఎస్సార్ సీపీపై అధికారపార్టీ కక్ష సాధింపు ధోరణి కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి సెక్యూరిటీ తగ్గించారు. ఇంతకుముందు 2+2 ఉన్న సెక్యూరిటీని 1+1కు తగ్గించారు. ఎస్సార్సీ(సెక్యూరిటీ రివైజ్డ్ కమిటీ) నుంచి చిత్తూరు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌కు గురువారమే ఆదేశాలు వచ్చాయి. దీన్ని వెంటనే అమలు చేయడానికి పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అదే సమయంలో అధికార  పార్టీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌కు మాత్రం 2+2 సెక్యూరిటీని కొనసాగించాలని ఎస్సార్సీ నిర్ణయించడం విమర్శలకు దారితీస్తోంది.

అలాగే ఏ చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించని టీడీపీ నేత బద్రీ నారాయణకు(చిత్తూరు ఎమ్మెల్యేకు బంధువు)కు సెక్యూరిటీని ఎలా కొనసాగిస్తారని పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎంపీ మిథున్‌రెడ్డి స్పందిస్తూ సెక్యూరిటీ తగ్గిస్తే భయపడతానని టీడీపీ నేతలు భావిస్తున్నారనీ,కానీ తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ప్రజలు గమనిస్తున్నారన్నారు.

స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం


స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే పార్టీ విలీనమైనట్లు కాదు: వైఎస్సార్‌సీపీ తెలంగాణ
సాక్షి, హైద రాబాద్: తమ పార్టీ తెలంగాణ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనం చేస్తూ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకోవడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్ పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు మరోపార్టీలో చేరడాన్ని రాజ్యాంగం పూర్తిగా నిషేధిస్తోందని వారు ఒక ప్రకటనలో గుర్తు చేశారు. వందకు వంద శాతం సభ్యులు వేరొక పార్టీలో చేరినా అది రాజ్యాంగ విరుద్ధమేనని స్పష్టం చేశారు. తన నిర్ణయానికి ఉన్న రాజ్యాంగ  బద్ధత ఏమిటో స్పీకర్ వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. శాసనసభ్యులు పార్టీ ఫిరాయించినంత మాత్రాన పార్టీ విలీనమైనట్లు కాదన్నారు. ఇటువంటి అనైతిక చర్యలకు తావివ్వడమంటే ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై గౌరవం లేకపోవడమేనని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని తాము సవాలు చేస్తామని వెల్లడించారు.

బాబు, కేసీఆర్ విలువల్ని పతనం చేశారు


బాబు, కేసీఆర్ విలువల్ని పతనం చేశారు
వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు నల్లా సూర్యప్రకాశ్

 శాలిగౌరారం: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ కలసి రాజకీయ విలువలను పూర్తిగా పతనం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అంబారిపేటలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.  రాజకీయ స్వార్థం కోసం ప్రతిపక్షం లేకుండా చేసేందుకు దిగజారుడుతనానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా పార్టీలు మారడం సరికాదని, పదవికి, పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలలో చేరాలన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని హామీ ఇచ్చారని, అధికారం చేతికందగానే ఆ హామీని విస్మరించారన్నారు.  ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపిణీ, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం తదితర పథకాలపై ఆచరణ తక్కువ.. ప్రచారం ఎక్కువ అన్న చందంగా మారిందన్నారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ స్వార్ధ రాజకీయాన్ని తిప్పికొట్టి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని గెలిపించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పాలేరు ప్రజలకు పిలుపునిచ్చారు.

మరో సేల్


మరో సేల్
♦ తాజాగా మరో విపక్ష ఎమ్మెల్యేకి టీడీపీ ఎర
♦ చెల్లింపులు రూ. 30 కోట్లకు పైమాటే!
♦ మొత్తం కొనుగోళ్లకు రూ.500 కోట్లకు పైనే..
♦ అవినీతి సొమ్ము వెదజల్లుతున్న చంద్రబాబు
♦ ఎక్కడ చూసినా బ్లాక్‌మనీ ప్రవాహం
♦ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఆగని ప్రలోభాలు
♦ విలువలు, విశ్వసనీయతలకు పాతర
♦ ప్రజాతీర్పు కోరే ధైర్యం లేదు.. అనర్హత వేటు వేయరు
♦ రాజీనామా చేసే దమ్ముందా?... వైఎస్సార్సీపీ ప్రశ్న


 సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
 తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘ఆకర్ష్ రాజకీయం’ అంతూ దరి లేకుండా కొనసాగుతోంది. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేయడం ఇంకా ఆగలేదు. తాజాగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వి మోహనరెడ్డికి తెలుగుదేశం కండువా కప్పబోతున్నారు. రూ. 30 కోట్ల నగదు, కాంట్రాక్టులతో పాటు రాజధానిలో విలువైన భూమి.. ఇలా ఎన్నో ఎరవేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న సంగతి తెల్సిందే. 17 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు రూ. 500 కోట్లకు పైగానే నల్లధనాన్ని ఖర్చు చేసినట్లు తెలుగుదేశం వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే ఓటుకు రూ. 5 కోట్లు నుంచి రూ. 20 కోట్లు వెదజల్లిన చంద్రబాబు నాయుడు ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకి రూ. 50 లక్షల అడ్వాన్సు ఇస్తూ ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ససాక్ష్యంగా పట్టుబడ్డారు. అయినా చంద్రబాబు మీదగానీ, ఆ పార్టీ నాయకుల మీద గానీ ఎలాంటి చర్యలూ లేవు. రెండేళ్లలో విచ్చలవిడి అవినీతితో ఆర్జించిన లక్షన్నరకోట్ల డబ్బును ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెచ్చిస్తున్నారు. కోట్లాది రూపాయల బ్లాక్‌మనీ ప్రవహిస్తున్నా రాష్ర్టంలో ఎలాంటి అడ్డూ అదుపూ లేకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.

 విలువలకు పాతర
 ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలోకి మారాలనుకుంటే రాజీనామా చేయడం సంప్రదాయం. తిరిగి ఆ పార్టీ గుర్తుపై పోటీ చేయడం పద్ధతి. కానీ అలాంటి సాంప్రదాయాలకు, పద్ధతులకు తెలుగుదేశం పార్టీ అధినేత తిలోదకాలిచ్చారు. విలువలకు పాతరేశారు. అనేక ప్రలోభాలతో పార్టీలోకి తీసుకొస్తున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించే సాహసం చేయడం లేదు. వారిపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయడం లేదు. దమ్ముంటే ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని, తిరిగి ప్రజాతీర్పు కోరాలని వైఎస్సార్సీపీ నాయకులు సవాల్ చేస్తున్నా చంద్రబాబు కిమ్మనడం లేదు. ప్రజాస్వామ్యాన్ని నట్టనడి బజారులో ఖూనీ చేస్తూ విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. బరితెగించినట్లుగా ఫిరాయింపుల పర్వానికి స్వయంగా ముఖ్యమంత్రే నాయకత్వం వహించడం, దగ్గరుండి పర్యవేక్షించడం గతంలో ఎన్నడూ ఎరగమని రాజకీయ విశ్లేషకులంటున్నారు. అంతేకాక ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలాంటి అనర్హత వేటు పడకుండా రాజ్యాంగ వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తుండడం గమనార్హం.

 అభివృద్ధిపై నమ్మకముందా...?
 ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి చూసి వస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెబుతున్నారు. తాము చేసిన అభివృద్ధిపై అంత నమ్మకం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించవచ్చు కదా అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ పేరు చెప్పి మోసం చేయడంతో రైతులు, డ్వాక్రా మహిళలు రగిలిపోతున్నారు. ఇంటికో ఉద్యోగమిస్తామని, లేదంటే నెలకు రూ. 2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసగించడంతో నిరుద్యోగులు ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు అన్నివిధాలుగా అప్రతిష్ట మూటకట్టుకున్నారు. అంతులేని అవినీతితో అన్ని రంగాలనూ భ్రష్టు పట్టించారు. రాజధాని అమరావతిని కూడా అవినీతికి ప్రతిరూపంగా మార్చేశారు. అందుకే ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించే సాహసం చేయలేకపోతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు.

ప్రత్యేక పోరులో అగ్రభాగాన వైఎస్సార్‌సీపీ

Written By news on Friday, May 6, 2016 | 5/06/2016


ప్రత్యేక పోరులో అగ్రభాగాన వైఎస్సార్‌సీపీ
ఢిల్లీనుంచి గల్లీ వరకూ నిరంతర పోరు
ప్రధాని, రాష్ట్రపతి కేంద్రమంత్రులకు జగన్ విజ్ఞప్తులు
హోదాకోసం జగన్ ఆమరణ దీక్ష, యువభేరి సదస్సులు
ప్రత్యేకహోదా సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్రం
మే 10న అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద వైఎస్సార్‌సీపీ ధర్నాలు

సాక్షి, హైదరాబాద్: విభజనతో అన్ని విధాలా దారుణంగా నష్టపోయిన ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా కల్పించడం ఒక్కటే పరిష్కారమని తొలి నుంచీ నమ్ముతూ వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పోరులో అగ్రభాగాన నిలిచింది.

సాధారణ ఎన్నికలు ముగియగానే ప్రధాని పదవి చేపట్టడానికి ముందే నరేంద్రమోదీని కలిసింది మొదలు నేటి వరకూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకహోదా కోసం నిరంతరం నినదిస్తూనే ఉన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఒక రోజు ధర్నా చేయడం మొదలుకొని ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ ప్రత్యేక హోదా కావాలని వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు జాతీయ స్థాయిలో ఆ ప్రాధాన్యతను ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు.

ప్రత్యేక హోదా రాదేమోనన్న ఆందోళనతో తిరుపతితో మునికోటి ఆత్మార్పణం చేసుకోవడం యావత్ రాష్ట్రాన్ని కుదిపివేసింది. మరో ముగ్గురు కూడా ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ దశలో జగన్ వారి కుటుంబాలను పరామర్శించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి తానే స్వయంగా నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్నారు. దీక్ష భగ్నం తరువాత కూడా జగన్ యువభేరీలను నిర్వహిస్తూ ప్రత్యేక హోదా సాధన ఆవశ్యకతను చాటి చెబుతూ వచ్చారు.

చివరకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా బుధవారం చేసిన ప్రకటనలో తేల్చి చెప్పడంతో ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి పెంచేందుకు మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని వైఎస్సార్‌సీపీ పిలుపు నిచ్చింది.   
 
హోదాకోసం వైఎస్సార్‌సీపీ...
2014, మే 19: ప్రధానిగా పదవి చేపట్టడానికి ముందే నరేంద్రమోడీని తమ పార్టీ ఎంపీలతో పాటుగా ఢిల్లీలో కలిసి ప్రత్యేక హోదా కావాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
2015 మార్చి: ఎంపీలతో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరాన్ని గుర్తు చేసిన జగన్.
మే: ప్రత్యేక హోదా కావాలని కోరుతూ పార్లమెంటు సమావేశాల సందర్భంగా గాంధీ బొమ్మ వద్ద నిరసన తెలిపిన పార్టీ ఎంపీలు.
జూన్ 3, 4: మంగళగిరిలో జగన్ చేసిన రెండు రోజుల సమర దీక్షలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గట్టిగా డిమాండ్ చేశారు.
జూన్ 9: ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి ప్రత్యేకహోదా అంశాన్ని ఆయన దృష్టికి తెచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి.
ఆగస్టు 10: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఒక రోజు ధర్నా చేసి రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదా ఆకాంక్షను జాతీయ స్థాయిలో చాటి చెప్పారు. అదే రోజు మార్చ్ టు పార్లమెంట్‌ను నిర్వహించి ఢిల్లీ వీధుల్లో అరెస్టయ్యారు.
ఆగస్టు 29: ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ బంద్‌ను విజయవంతంగా నిర్వహించారు.
సెప్టెంబర్ 15: తిరుపతిలో జగన్ యూనివర్శిటీ విద్యార్థులు, యువకులతో యువభేరి సదస్సులను నిర్వహించి ప్రత్యేక హోదాపై వారిని జాగృతం చేశారు.
సెప్టెంబర్ 22: విశాఖపట్టణంలో యువభేరి సదస్సు నిర్వహణ.
అక్టోబర్ 7: ప్రత్యేకహోదా కోసం జగన్ నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభం.
అక్టోబర్ 14: ప్రజల నుంచి భారీ స్పందన వస్తున్న నేపథ్యంలో జగన్ దీక్షను భగ్నం చేసిన ప్రభుత్వం.
2016 జనవరి 27: ప్రత్యేకహోదాకోస ఆవశ్యకతను వివరిస్తూ కాకినాడలో యువభేరి.
ఫిబ్రవరి 2: శ్రీకాకుళంలోనూ విద్యార్థులు, యువకులను సమీకరించి యువభేరీ సదస్సు నిర్వహణ.
ఫిబ్రవరి 23, 24: ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని, కేంద్ర హోంమంత్రిని కలిసి ప్రత్యేక హోదా ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసిన జగన్.

మా పార్టీ విలీనం కాలేదు: కొండా

Written By news on Thursday, May 5, 2016 | 5/05/2016


మా పార్టీ విలీనం కాలేదు: కొండా
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి - ఫారంపై గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యేలు తక్షణం రాజీనామా చేయాలని ఆ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీ వేరే ఏ పార్టీలోనూ విలీనం కాలేదని ఆయన స్పష్టం చేశారు. టి - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం గురువారం హైదరాబాద్ లో సమావేశమై.. ఆరు తీర్మానాలను ఆమోదించింది. ఆ సమావేశం ముగిశాక ఆ తీర్మానాలను టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి విలేకర్ల సమావేశంలో వివరించారు. టీ - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం రద్దు అయినట్లు ఆయన ప్రకటించారు.
నూతన అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అప్పగించినట్లు తెలిపారు. పార్టీ ఫిరాయించిన వారిపై పార్లమెంట్, అసెంబ్లీలో స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తెలంగాణలో అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.
అలాగే మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయాలని మరో తీర్మానం చేసినట్లుచెప్పారు. పాలేరు ఉపఎన్నికలో రాంరెడ్డి సుచరితారెడ్డికి మద్దతు ఇవ్వాలని మరో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. టీ - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనమైందంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ ఇంకో తీర్మానం చేసినట్లు కొండా రాఘవరెడ్డి తెలిపారు.

ప్రత్యేక హోదాపై వైఎస్సార్ సీపీ మరోసారి పోరుబాట


ప్రత్యేక హోదాపై వైఎస్సార్ సీపీ మరోసారి పోరుబాట
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి పోరుబాట పట్టనుంది.  ప్రత్యేక హోదా నిబంధనేదీ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో లేదని కేంద్రం స్పష్టం చేయటంతో ప్రతిపక్ష పార్టీ తన పోరాటాన్ని ఉధృతం చేయనుంది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 10న అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన తాము చాటి చెబుతామన్నారు. ప్రత్యేక హోదా వచ్చేవరకూ వైఎస్ఆర్ సీపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కేంద్రం ప్రకటన రాష్ట్రానికి చెంపపెట్టులాంటిదని, ఇప్పటికైనా టీడీపీ తన వైఖరోంటే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ఓ మాట...రాష్ట్రంలో మరోమాట మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదా ముఖ్యమా? వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమా అని సూటిగా ప్రశ్నించారు. ఏపీకి ఆర్థిక ప్యాకేజీ ఇస్తే సరిపోతుందనటం చాలా దురదృష్టకరమన్నారు. సీఎంకు ప్రాంతీయ అవసరాలు, అభివృద్ధి పట్టదని బొత్స ధ్వజమెత్తారు.
కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారని, పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను చూసి అయినా చంద్రబాబు నేర్చుకోవాలని హితవు పలికారు. కేసుల నుంచి బయటపడేందుకే చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. కేంద్రం దిగి వచ్చేలా అందరం కలిసి సకలం బంద్ చేద్దామని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.

అవసరమైతే బ్రాండిక్స్ కార్మికుల కోసం దీక్ష: వైఎస్ జగన్

Written By news on Wednesday, May 4, 2016 | 5/04/2016


అవసరమైతే బ్రాండిక్స్ కార్మికుల కోసం దీక్ష: వైఎస్ జగన్
అచ్యుతాపురం :
ఐదేళ్లకోసారి జీతాలు పెంచుతూ.. అది కూడా కేవలం 20 శాతమే ఇస్తున్నారని, బ్రాండిక్స్ ఫ్యాక్టరీలో పనిచేసే పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బ్రాండిక్స్ కార్మికులకు కనీస వేతనం రూ. 10వేలు ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వాళ్ల కోసం అవసరమైతే తాను స్వయంగా నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధమని చెప్పారు. ఇందుకోసం వాళ్లకు నెల రోజుల గడువు ఇస్తున్నానన్నారు. కార్మికులను కనీసం బాత్రూంకు కూడా సరిగా వెళ్లనివ్వకుండా తలుపులు కొట్టి పిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ఒత్తిడి తెస్తూ.. వాళ్ల ద్వారా బ్రాండిక్స్ మీద కూడా ఒత్తిడి తెచ్చి పరిష్కారం తెచ్చుకోడానికి ప్రయత్నించాలని చెప్పారు. విశాఖపట్నం అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నాడు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...

2006లో ఫ్యాక్టరీ పెట్టినపుడు ఐదేళ్ల తర్వాత వేతన సవరణ జరగాలి. 2011లో అలాంటి సవరణ జరిగింది. కానీ వీళ్లకు ప్రయోజనాలు మాత్రం దక్కలేదు.
రివిజన్ జరిగినప్పుడు ఫిబ్రవరిలో 326 జీవో ఇష్యూ చేశారు. అప్పుడు జీతాలు పెంచుతున్నట్లు చూపించారు. సెక్యూరిటీ, వాచ్‌మన్, స్వీపర్ లాంటి పోస్టులకు కూడా 6వేల రూపాయల వరకు ఇస్తున్నట్లు చెప్పారు.
మామూలుగా ఎక్కడైనా ఐదేళ్లకోసారి వేజ్ బోర్డు నుంచి వచ్చే ఉత్తర్వుల కోసం ఆశగా ఎదురు చూస్తాం. కానీ నవంబర్‌కు వచ్చేసరికి మళ్లీ అప్పటి ప్రభుత్వం అందులో మార్పులు చేసి, జీతాలు పూర్తిగా తగ్గించింది.
కనీసవేతనాలను రూ. 4,100కు తగ్గించారు. మామూలుగా అయితే 9 నెలల తర్వాత మరికొంత పెంచాలి. కానీ యాజమాన్యంతో కుమ్మక్కైన ప్రభుత్వం జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్న జీతాలను తగ్గించారు.
అంతకుముందు కంటే కేవలం 20 శాతం మాత్రమే జీతాలు పెంచారు.
ఒకవైపు కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. ధరలన్నీ పెరిగిపోయాయి. కందిపప్పు, మినప్పప్పు అన్నీ 150-200 వరకు ఉంటున్నాయి.
పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఐదేళ్లకోసారి, అది కూడా కేవలం 20 శాతం పెంచుతున్నారు.
పోనీ నిజంగానే ఇది నష్టాలతో కూడిన సంస్థ అయితేనో, ప్రభుత్వ సాయం లేకపోతేనో పోనీలే అనుకోవచ్చు.
కానీ ప్రభుత్వం ఈ కంపెనీకి భూములు ఇచ్చేటపుడు ముఖ్య ఉద్దేశం స్థానికులకు మంచి ఉద్యోగాలు రావాలని.
60వేల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు.. కనీసం 18 వేల ఉద్యోగాలైనా ఇచ్చారు, సంతోషం.
కానీ జీతాలు ఇలా ఇస్తే వీళ్లు ఏం తినాలి, ఏం బతకాలి, పిల్లలకు ఏం చదువులు చెప్పిస్తారు? ఈ విషయాలు పరిష్కరించకుండా వదిలేస్తే ఎలా?
ఇప్పుడు మళ్లీ జీతాలు రివైజ్ చేయాలి. గతంలోలా 20 శాతం మాత్రమే ఇవ్వకుండా న్యాయం చేయాలని పోరాడుతున్నాం.
మనం బతకడానికి, కనీసం పిల్లలను చదువులకు పంపాలంటే కనీసం నెలకు 10 వేల రూపాయలు ఉండాలని మహాలక్ష్మి అందరి తరఫున అడుగుతోంది.
బ్రాండిక్స్ యాజమాన్యానికి ఒకటే చెబుతున్నా.
ఇక్కడి దుస్తులను మీరు అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తారు. అక్కడ వాళ్లు పనిచేస్తే గంటకు 9 డాలర్లు ఇస్తారు. అంటే, 600 రూపాయలు. రోజుకు 8 గంటలు పనిచేస్తే... 4800! అంటే, నెలకు దాదాపు లక్ష రూపాయలు.
ఈవాళ మనకు నెలకు కనీసం పదివేలు ఇవ్వాలని అడగాల్సి వస్తోంది, చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తే తప్ప పని జరగని పరిస్థితి ఉంది.
ఇది అన్యాయం కాదా? పనిచేస్తున్న అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు రావాలి.
బాత్రూంకు వెళ్లి 5 నిమిషాల్లో రాకపోతే ఏమవుతుంది? తలుపులు కొట్టి పిలవాలా?
పని చేస్తుంటే కనీసం పక్కన తాగడానికి మంచినీళ్లు కూడా పెట్టడం లేదు.
ఈ పరిస్థితి మారాలి. పనులు చేసేవాళ్లు సంతోషంగా చేయాలి, చేయించుకునేవాళ్లు సంతోషంగా చేయించుకోవాలి.
ఇక్కడ మాట్లాడితే ఉద్యోగాలు తీస్తారని ఎవరూ భయపడక్కర్లేదు. అలా తీస్తే తర్వాత వాళ్లకు ఉంటుంది
సీఎం చంద్రబాబు ఈ జిల్లాలో ఉండగానే కార్మికులను కొట్టించారు. ఇంతకంటే అన్యాయం, దారుణం ఏమైనా ఉంటుందా?
ప్రజాస్వామ్యంలో ధర్నా చేస్తుంటే నీళ్లు, మైకులు కూడా ఇవ్వనివ్వకుండా అడ్డుకున్నారు
ధర్నా చేస్తుంటే మాలో 500 మందిని తీసుకెళ్లి ఎస్.రాయవరం స్టేషన్‌లో పెట్టారు. పొద్దున్నుంచి రాత్రిదాకా పెట్టారు
ఆడవాళ్లు, పిల్లల మీద తన ప్రతాపం చూపిస్తున్నారంటే చంద్రబాబు ఆ స్థానంలో కూర్చోడానికి కూడా అనర్హుడు
నేను కూడా కేంద్రానికి, రాష్ట్రానికి లేఖలు రాస్తాను. ధర్నాలు చేస్తాం
వాళ్లలో మార్పు రావాలి, మంచి విధానంలోకి రావాలి.
జీతాలు కూడా 10 వేల కంటే తక్కువ ఇస్తే ఒప్పుకునేది లేదు
పనిచేసే పరిస్థితులు కూడా సరిగా లేకపోతే ఎక్కడికెళ్లాలి, ఎటు పోవాలని అడుగుతున్నారు.. అందులో న్యాయం ఉంది
ఇక్కడికొచ్చి, ధైర్యం చేసి తమ సమస్యల మీద మాట్లాడిన ప్రతి చెల్లెమ్మకు అభినందనలు
బ్రాండిక్స్ సంస్థ వాళ్లమీద చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదని గట్టిగా చెబుతున్నాం
జీతాలు తక్కువగా ఉండి.. కష్టాలు అనుభవిస్తున్నారు. గతంలోలా 20, 30 శాతం పెంచుతామంటే కుదరదు
4 వేల జీతంతో ఎవరూ బతికే పరిస్థితి లేదు. వాళ్లకు అన్నీ తక్కువకు వస్తాయి. మనకు మాత్రం కూరగాయల నుంచి అన్నీ ధరలు పెరుగుతున్నాయి
ఈ డిమాండ్లు నెరవేరేవరకు వైఎస్ఆర్‌సీపీ మీకు అండగా ఉంటుంది
వేజ్‌బోర్డు రివైజ్ చేయించేలా ప్రభుత్వమే చూడాలి
అలా చేయకపోతే ప్రభుత్వానిది, చంద్రబాబుది తప్పు అవుతుంది
అవసరమైతే నేను కూడా ఇక్కడికొచ్చి వీళ్ల కోసం నిరాహార దీక్ష చేస్తా
ముందుగా వాళ్లకు నెలరోజుల గడువు ఇస్తున్నా.. ఆలోపు వీళ్ల జీతాలు పెంచాలి, పని చేసే పరిస్థితులు మెరుగుపరచాలి
గుడివాడ అమర్‌నాథ్ కూడా మీకు అన్నివిధాలుగా తోడుగా ఉంటారు
మీరు కష్టాల్లో ఉన్నా, బాధలను కడుపులో పెట్టుకుని ఇక్కడకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

విశాఖ చేరుకున్న వైఎస్ జగన్


విశాఖ చేరుకున్న వైఎస్ జగన్
విశాఖ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం  విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కనీస వేతనాల పెంపు, పీఎఫ్ అమలు డిమాండ్‌తో గత నెల 16 నుంచి బ్రాండెక్స్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్ బ్రాండెక్స్ కార్మికుల చేపట్టిన ఉద్యమంలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. ఇక హైదరాబాద్ నుంచి విమానంలో మధురవాడ విమానాశ్రయం చేరుకున్న ఆయన నేరుగా మిందిలోని పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఇంటికి వెళ్లారు.

అక్కడ భోజనం అనంతరం బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు అచ్యుతాపురం చేరుకుంటారు. తొలుత బ్రాండెక్స్ కార్మికులతో ఏర్పాటు చేసిన ముఖాముఖీలో పాల్గొంటారు. వారి కష్టసుఖాలు, సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం కార్మికులనుద్దేశించి మాట్లాడతారు. అక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుని సాయంత్రం 5.30 గంటలకు విమానంలో తిరిగి హైదరబాద్ పయనమవుతారు.

నేడు బ్రాండెక్స్ కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి


నేడు బ్రాండెక్స్ కార్మికులతో  వైఎస్ జగన్ ముఖాముఖి
బొత్స సత్యనారాయణ వెల్లడి

 మునగపాక: మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించేం దుకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎస్‌ఈజెడ్‌లు తీసుకువస్తే నేటి ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా చాకిరీ చేయించడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా మునగపాక మండలం నాగవరంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బ్రాండెక్స్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం బాధాకరమని, కార్మికులకు న్యాయం జరిగేలా తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామన్నారు. ఇందులో భాగంగానే బుధవారం మధ్యాహ్నం బ్రాండెక్స్ కార్మికులతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కార్మికులతో మాట్లాడేందుకు వస్తుంటే 144 సెక్షన్ అమలులో ఉందంటూ పోలీసు అధికారులు కుంటి సాకులు చెప్పడం తగదన్నారు. నిబంధనల పేరుతో వైఎస్ జగన్ సభకు అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

అది రాజకీయ వ్యభిచారమే: శ్రీకాంత్ రెడ్డి

Written By news on Tuesday, May 3, 2016 | 5/03/2016


అది రాజకీయ వ్యభిచారమే: శ్రీకాంత్ రెడ్డి
వాషింగ్టన్ డీసీ :
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 'వాషింగ్టన్ డీసీ మెట్రో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' ఆధ్వర్యంలో ఆదివారం 'సేవ్ డెమొక్రసీ' సంఘీభావ సభ నిర్వహించారు. ఈ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లోపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజకీయ వ్యభిచారమని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్లను కట్టడి చేయకుంటే వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, తాగునీటి ఎద్దడితోపాటు అవినీతి తదితర సమస్యలపై తమ పార్టీ ప్రజల తరపున నిలదీస్తుందని ఆయన స్పష్టం చేశారు. అందుకే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.

'తిరుగులేని నాయకత్వ పటిమ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నిజాయతీ గల ఎమ్మెల్యేగా తాను ప్రజల్లో ఉన్నానని... మీ ప్రలోభాలకు తలొగ్గి పార్టీ మారితే నీతిమాలిన ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతానని తనను పార్టీలోకి  రావాలంటూ సంప్రదించిన టీడీపీ నేతలకు స్పష్టం చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్'  పుస్తకాన్ని శ్రీకాంత్ రెడ్డి విడుదల చేశారు.
ఈ పుస్తకం చంద్రబాబు అవినీతి కుంభకోణాలకు అక్షర రూపమని పేర్కొన్నారు. తాము చెప్పేదే వేదం, చేసేదే అభివృద్ధి అంటూ మూర్ఖంగా ముందుకు పోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పక గుణపాఠం నేర్పుతారని టీడీపీ నేతలను శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా ఎన్‌ఆర్‌ఐ కమిటీ అడ్వైజర్ అండ్ మిడ్ అట్లాంటిక్ రీజియన్ ఇన్‌చార్జ్ వల్లూరు రమేష్ రెడ్డి, సెంట్రల్ రీజియన్ ఇన్ ఛార్జ్ శ్రీ సురేష్ రెడ్డి బత్తినపట్లతోపాటు వైఎస్సార్‌సీపీ అమెరికా ఎన్ఆర్ఐ క‌మిటీ కన్వీనర్ రత్నాకర్ పండుగాయల, స్టూడెంట్ వింగ్ లీడర్ సాత్విక్ రెడ్డి, పలు రాష్టాల నుంచి విచ్చేసిన తెలుగు ఎన్ఆర్ఐలు, విద్యార్థులు, వైఎస్‌ఆర్ అభిమానులు, వైఎస్‌ఆర్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీలో మెట్రో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరును సురేష్ రెడ్డి బత్తినపట్ల వివరించారు. అలాగే ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్న క్రమంలో పొందిన అనుభవాలను ఈ కార్యక్రమానికి హాజరైన వారితో  పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కాగానే దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. 

Popular Posts

Topics :