16 February 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

జగన్‌కు ఉన్నంత దమ్ము, ధైర్యం నీకుందా చంద్రబాబు?

Written By news on Saturday, February 22, 2014 | 2/22/2014

చంద్రబాబు జగన్  నామస్మరణ!దాడి వీరభద్రరావు
హైదరాబాద్:  టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సిపి నేత దాడి వీరభద్రరావు మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు కళ్లు మూసినా, తెరిచినా తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి  కనిపిస్తున్నారన్నారు. ఆయన జగన్ నామ జపం చేస్తున్నారని చెప్పారు.  జగన్‌కు ఉన్నంత దమ్ము, ధైర్యం నీకుందా చంద్రబాబు? జగన్‌ను విమర్శించడానికి నీకు సిగ్గులేదా? అని దాడి అడిగారు.

తెలుగు జాతి రెండు మక్కులవడానికి కారకుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  పార్లమెంట్‌లో కాంగ్రెస్, బిజెపితో పాటు టిడిపి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నారు.  పార్లమెంటులో ఒక్క సవరణ ఇవ్వలేకపోయారన్నారు. తెలంగాణకు కెసిఆర్ ఫాదర్ అయితే, బాబు గ్రాండ్ ఫాదర్‌ అని చెప్పారు. తెలుగు దేశం అధినేతగా ఉండడానికి ఆయన అర్హులు కారన్నారు. ఆ పార్టీ పేరును తెలంగాణ పేరుగా మర్చుకుని  అధ్యక్షులుగా ఉండమని దాడి సలహా ఇచ్చారు.

రాజధానికి లక్ష కోట్ల రూపాయలు కావాలన్న చంద్రబాబు ఇప్పుడు నోరు మెదపరే? అని ప్రశ్నించారు. సీమాంధ్ర తగలబడుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. విభజన సమస్యను సృష్టించింది చంద్రబాబు కాదా? అని దాడి అడిగారు.

రాష్ట్ర విభజనతో ఎన్నికలకు సంబంధం లేదు

రాష్ట్ర విభజనతో ఎన్నికలకు సంబంధం లేదు: భన్వర్ లాల్
హైదరాబాద్: ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో ఎన్నికలకు సంబంధం లేదని భన్వర్‌లాల్‌ తేల్చి చెప్పారు. ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామా అనే విషయాన్ని ఎన్నికల కమిషన్ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

ఈ నెల 25లోపు ఎన్నికల బదిలీలు పూర్తి చేయమని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు చెప్పారు. ఓటర్ లీస్టులో పేరుందో లేదో ప్రతి ఒక్కరూ ముందుగా చెక్ చేసుకోవాలని భన్వర్ లాల్ సూచించారు. కాగా, 9246 2800 27 అనే నంబర్‌కు VOTE స్పెస్‌ ఇచ్చి EPIC కార్డు నంబర్ ఎంటర్ చేసి ఎస్‌ఎమ్ఎస్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చనని భన్వర్‌లాల్‌ చెప్పారు.

జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం

జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం.
 ూచిపూడి(అమృతలూరు)
 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల అమలు జగన్‌తోనే సాధ్యమని నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జున శుక్రవారం అన్నారు.
 
 నాలుగో రోజు గడపగడపకూ వైఎ స్సార్‌సీపీ ప్రచారంలో భాగంగా భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఇంటింటికీ తిరిగారు. పార్టీ అధికారంలోకి వస్తే చేయనున్న పథకాలు, కార్యక్రమాలు వివరిం చారు. ఆరోగ్యశ్రీ పూర్తిస్థాయిలో అమలు, పేదలకు నేరుగా సంక్షేమ పథకాలు అందేలా పార్టీ కృషి చేస్తుందన్నారు.
 
 కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ రాపర్ల నరేంద్ర, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ గాజుల వర్తి బెన్హర్, యువజన విభాగ మండ కన్వీనర్ గర్నెపూడి అజయ్‌కుమార్, వీవర్స్ సొసైటీ అధ్యక్షుడ బట్టు వీరాస్వామి, నాయీబ్రాహ్మణ సంఘ జిల్లా కార్యదర్శి వక్కలగడ్డ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చవ్వాకుల రాఘవరావు, కూచిపూడి మోషే, ఇంటూరు, తురుమెళ్ళ సర్పం చులు బట్టు మోషే, పేర్ల వెంకట సుబ్బారావు, పార్టీ నాయకులు యల వర్తి రామ్మోహనరావు, యలవర్తి సురేష్ పాల్గొన్నారు

సీఎం రమేష్ కార్యాలయం సీజ్

బకాయిలు చెల్లించాక తొలగింపు
 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన కార్యాలయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. సామగ్రిని తరలించేందుకు కూడా సిద్ధం కాగా కార్యాలయ సిబ్బంది అప్పటికప్పుడు చెక్కులు అందించడంతో సీజ్‌ను తొలగించారు. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం బంజారాహిల్స్ రోడ్ నెం. 2 సాగర్ సొసైటీ పక్కన ఉన్న నవోదయ కాలనీలోని ప్లాట్ నం. 37,39లలో కొనసాగుతోంది.
 
 అయితే గత రెండేళ్లుగా ఈ కార్యాలయానికి సంబంధించిన రూ. 10 లక్షల 21 వేల ఆస్తి పన్ను చెల్లించకుండా ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ తప్పించుకుంటున్నారు. బకాయిలు చెల్లించాలని గడిచిన ఏడాది కాలంగా మూడుసార్లు రెడ్ నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. దీంతో శుక్రవారం జీహెచ్‌ఎంసీ సర్కిల్-10 డిప్యూటీ డీఎంసీ బాబయ్య, వ్యాల్యుయేషన్ అధికారి ముకుందరెడ్డి సహా ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఆస్తిపన్ను జప్తు వాహనంతో వచ్చి కార్యాలయాన్ని సీజ్ చేశారు. సామగ్రిని కూడా తరలించేందుకు యత్నిస్తుండగా కార్యాలయ మేనేజర్ బకాయిపడ్డ డబ్బుకుగాను చెక్కులను అందజేశారు. దీంతో అధికారులు కార్యాలయానికి వేసిన సీజ్‌ను తొలగించారు.

మా కాళ్లు విరగ్గొట్టినా మళ్లీ పైకి లేస్తాం

Written By news on Friday, February 21, 2014 | 2/21/2014

YS Jagan press meet on AP Division Live from Delhi part 2

YS Jagan press meet on AP Division Live from Delhi part 1

ఇది న్యాయమేనా?

ఇది న్యాయమేనా?: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో విభజన జరిగిందని అన్నారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నమా, భారతదేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. జగన్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

నియంత అంటే ఇంతకుముందు హిట్లర్ గుర్తుకు వచ్చేవారని ఇప్పుడు మాత్రం సోనియా గాంధీ గుర్తుకు వస్తారని జగన్ అన్నారు. అసెంబ్లీ వద్దన్న బిల్లును పార్లమెంట్ లో అప్రజాస్వామికంగా ఆమోదించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఎంపీలే లేకుండా 23 నిమిషాల్లో లోక్ సభలో బిల్లును ఆమోదించారని తెలిపారు. లోక్ సభలో జరుగుతున్న సన్నివేశాలు బయటకు రాకుండా ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి అంధకారమయంలో రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. రాజ్యసభలో ఓటింగ్ పెట్టకుండానే బిల్లును ఆమోదించారని చెప్పారు. ప్రధాని ఒకటిన్నర పేజీలు చదివి మమ అనిపించారని దుయ్యబట్టారు.

కొత్త రాజధానికి ఎంత డబ్బు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎంతకాలం ఇస్తారన్న ప్రస్తావనే లేదని జగన్ విమర్శించారు. ఇది న్యాయమేనా అని ఆయన  ప్రశ్నించారు. హైదరాబాద్ మినహాయిస్తే ఏడాదికి సీమాంధ్రలో 15 వేల కోట్ల రెవెన్యు లోటు ఉంటుందని, దీన్ని ఎలా భర్తీ చేస్తారో చెప్పలేదన్నారు. స్పెషల్ ప్యాకేజీ తర్వాత పరిస్థితి ఏంటని నిలదీశారు. స్పష్టత లేకుండా మీ చావు మీరు చావండి అన్నట్టుగా కేంద్రం వ్యవహరించిందని ధ్వజమెత్తారు.

ఓట్లు, సీట్లు కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. అధికార, ప్రతిపక్షం కలిసిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయన్నారు. టీడీపీ ద్వంద్వ వైఖరితో ప్రజలను మోసం చేస్తోందన్నారు. విభజనపై రాష్ట్రపతిని కలుస్తామని, అన్యాయాన్ని వివరిస్తామని చెప్పారు. న్యాయస్థానంలోనూ పోరాటం కొనసాగిస్తామన్నారు.

సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ హవా

సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ హవా

ఇండియూ టుడే/సీఓటర్ సర్వే స్పష్టీకరణ
సీమాంధ్రలో వై ఎస్సార్‌సీపీకి 18 ఎంపీ సీట్లు

 
 న్యూఢిల్లీ: ‘ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు కంచు కోట అనేది ఇక చరిత్రకే పరిమితం కానుంది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించనున్నారుు..’ అని ఇండియూ టు డే గ్రూపు/ సీఓటర్ తాజా సర్వే తేల్చింది. తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికలు సైతం జరగనున్న ఈ ప్రాంతంలోని ఓటర్ల మనోగతంపై ఈ సర్వే నిర్వహించారు. దీని ప్రకారం.. ఈ ప్రాంతంలో జాతీయ పార్టీలు వెనుకబడిపోరుు తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్‌ల్లో మాదిరి ప్రాంతీయ పార్టీలు ముంద ంజలో నిలువనున్నారుు.
 
  సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనుంది. 25 లోక్‌సభా స్థానాలకు గాను ఆ పార్టీ 18 చోట్ల విజయదుందుభి మోగించనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సమైక్యాంధ్రప్రదేశ్ ప్రజల్లో అధికశాతం మంది ఇప్పటికీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే తమకు ఇష్టమైన ముఖ్యమంత్రి అని చెప్పడం. వైఎస్ జీవించి ఉంటే తెలంగాణ ఏర్పడేది కాదని క్షేత్రస్థారుులో ప్రజలు భావిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చు. సీమాంధ్రలో కంటే తెలంగాణ ప్రాంతంలో ఆయనకు ఎక్కువ ప్రజాదరణ ఉండటం మరింత ఆసక్తి కలిగించే అంశం.

వైఎస్ రాజశేఖరరెడ్డినే ఉత్తమ ముఖ్యమంత్రి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మన మధ్య ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అసాధ్యమనే అభిప్రాయం అన్నివర్గాల నుంచి, ఇరు ప్రాంతాల నుంచి ఒకే భావన వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో ఇరు ప్రాంతాల అభివృద్దికి ఎనలేని కృషి చేశారనేది నూటికి నూరుపాళ్లు వాస్తవం. పేద ప్రజల సంక్షేమం, ప్రాంతాల అభివృద్ది అంశాల్లో సమతూకం పాటించి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముందు రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది. అయితే మహానేత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని తన పాలనతో ప్రజల దృష్టి నుంచి మరల్చడంలో సఫలమయ్యారు. అయితే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తర్వాత వేర్పాటువాదం ఊపందుకుంది. 
 
వైఎస్సార్ మరణానంతరం సీఎంలుగా వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని, తెలంగాణ ప్రాంతంలో మళ్లీ తెర మీదకు వచ్చిన రాజకీయ ఉద్యమాలను కట్టడి చేయలేక పోవడం వల్లే  ఈ దుస్థితి వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారు. పైకి దీన్ని అంగీకరించలేని ఇతర రాజకీయ పక్షాల నేతలు సైతం ఆఫ్‌ది రికార్డ్‌గా వైఎస్సార్ బతికి ఉండింటే రాష్ట్రం చీలిపోయేది కాదని అంగీకరిస్తున్నారు. వైఎస్సార్ ఉన్నన్నాళ్లూ తెలంగాణ నేతలు ప్రత్యేక ఉద్యమం గురించి నోరెత్తలేక పోయారని, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీ ఆర్ సైతం తెరమరుగైన విషయం మరచిపోలేనిదని గుర్తు చేస్తున్నారు.
 
ఓట్ల కోసం, సీట్ల కోసమే కాకుండా.. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక.. అత్యధిక ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటి అడ్డగోలుగా విభజించడానికి  నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంగ్ల టెలివిజన్ చానెల్ జరిపిన సర్వేలో పలు ఆసక్తికరమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముఖ్యమంత్రుల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డినే ఉత్తమ ముఖ్యమంత్రి అని అత్యధిక ప్రజలు సర్వేలో తమ మనోగతాన్ని వెల్లడించారు. సీమాంధ్రలో 56 శాతం మంది, తెలంగాణ ప్రాంతంలో 60 శాతం మంది వైఎస్ఆర్ ఉత్తమ ముఖ్యమంత్రి అని సర్వేలో తెలిపారు. రాష్ట్రంలోని  కోస్తా, రాయలసీమ, తెలంగాణ మూడు ప్రాంతాల ప్రజల్లో మహానేత వైఎస్ఆర్ కు ఎనలేని ఆదరణ ఉందని సర్వేలో తేటతెల్లమైంది. ప్రాంతాలకతీతంగా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని సర్వేలో అత్యధికమంది స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కు దారిదాపుల్లో చంద్రబాబు, ఇతర ముఖ్యమంత్రులు కూడా లేకపోవడం గమనార్హం. 
మహానేత ఉంటే విభజన అసాధ్యమే! 
దివంగత నేత వైఎస్ఆర్ బ్రతికి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది అసాధ్యం అని సర్వేలో అడిగిన ఓ ప్రశ్నకు మూడు ప్రాంతాల్లో అత్యధిక మంది స్పందించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న సమైక్య ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ దే కీలక పాత్ర అని 44 శాతం మంది వెల్లడించారు. 
 
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫిబ్రవరి 18, 19 తేదిల్లో ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లో 1500 మందితో సీఓటర్ సర్వే నిర్వహించింది.  

ఖాళీ దిశగా ‘దేశం’

ఖాళీ దిశగా ‘దేశం’
 టీడీపీకి జిల్లా అధ్యక్షుడు గొడాం నగేష్ గుడ్‌బై
 
 సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కేడర్ చాలావరకు పార్టీకి దూరం అయింది. తాజాగా, తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేక వైఖరి, పార్టీలో ఆధిపత్య పోరుతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే గొడాం నగేష్ టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన స్వగ్రామమైన బజార్‌హత్నూర్ మండ లం జాతర్లలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేసిన అనంతరం, టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతానని కూడా వెల్లడించారు. చంద్రబాబు టీ-బిల్లును అడ్డుకునేందుకు చేసిన ఒత్తిళ్లు, కార్యకర్తల అభిమతం మేరకు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.

 బీజేపీ వైపు ‘పాయల్’ చూపు..

 ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాయల్ శంకర్ కూడా తెలుగుదేశం పార్టీకి అధికారికంగా రాజీనామా చేసేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు. బుధవారం నియోజకవర్గంలోని జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల నాయకులతో ఆదిలాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన త్వరలోనే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించి, బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర పడి న వెంటనే జిల్లా రాజకీయ ముఖచిత్రంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ బిల్లు విషయమై ఇన్నాళ్లు వేచి చూసే ధోరణితో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు.

 ఎంపీ రాథోడ్ రమేష్‌తో విభేదాలు

 ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్, బోథ్ ఎమ్మెల్యే గొడాం నగేష్‌ల మధ్య ఆధిపత్య పోరు చాలాకాలంగా కొనసాగుతోం ది. ఈ ఇద్దరు పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిం చారు. ఎంపీ నెల రోజుల క్రితం చేపట్టిన పల్లెనిద్ర విషయం లో కూడా వీరి మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యా యి. పార్టీ అంతర్గత సమావేశాల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నగేష్ వ్యతిరేకించినట్లు చర్చ జరిగింది. మరోవైపు ఎంపీ రమేశ్ బోథ్ నియోజకవర్గంలో నగేష్ వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషించారనే విమర్శలు ఉన్నాయి. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఆ వర్గం నాయకులకు పనులు ఇవ్వడం వంటివి చేశా రు. ఒక్కో సందర్భంలో ఇరువురు పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదులు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బుధవారం నగేష్ జాతర్లలో నిర్వహించిన ఈ సమావేశానికి రాథోడ్ రమేష్ వర్గం నాయకులకు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. ఈ సమావేశానికి వెళ్లవద్దని ఢిల్లీలో ఉన్న రాథోడ్ రమేష్ తన వర్గం నేతలకు ఫోన్లు చేసి చెయడం స్థానికంగా చర్చనీయాంశమమైంది.

 బోథ్‌కు టీడీపీ అభ్యర్థి కరువు

 నగేష్ టీడీపికి గుడ్‌బై చెప్పడంతో బోథ్ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు పర్యాయాలు నగేష్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఆయన తండ్రి రామారావు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు.
 

ప్రజా కోర్టులో ఆ మూడు పార్టీలకు శిక్ష తప్పదు

కాంగ్రెస్, బీజేపీ, టీడీపీపై ఎమ్మెల్సీ జూపూడి ధ్వజం
 
 కొండపి, న్యూస్‌లైన్ :
 రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కుమ్మక్కై తెలుగుజాతికి ద్రోహం చేశాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. స్థానిక పీఆర్ అతిథి గృహంలో గురువారం ఆయన వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని నిట్ట నిలువునా చీల్చేందుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు కంకణం కట్టుకున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో మహానేత వైఎస్‌ఆర్ సెంటిమెంటును తగ్గించేందుకు విభజన అంశాన్ని ఆ మూడు పార్టీలూ తెరపైకి తెచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయన్నారు. బీజేపీ అగ్రనాయకులతో చంద్రబాబు అనేక రహస్య సమావేశాలు జరిపిన విషయాన్ని ఈ సందర్భంగా జూపూడి గుర్తు చేశారు. రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించిన తర్వాత చంద్రబాబు ముఖం వెలిగిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు ఐదు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తు చేశారు. కాంగ్రెస్ విందు రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని విభజించిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చీల్చే కుట్రలో బీజేపీ భాగస్వామ్యం కావడం విచారకరమన్నారు. బీజేపీకి దగ్గరగా జరిగిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జూపూడి డిమాండ్ చేశారు.
 
  ఎన్నికల నోటిఫికేషన్ పది రోజుల్లో పెట్టుకుని రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. విభజనను నిస్సిగ్గుగా సమర్థించిన కాంగ్రెస్ దానికి వంత పాడిన బీజేపీ, దానికి పక్కలో ఉన్న టీడీపీలను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో శుక్రవారం నుంచి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇక నుంచి అధికారులు భయపడన వసరంలేదని ధైర్యం చెప్పారు. దేశ పార్లమెంటరీ వ్యవస్థ గురించి సోనియా, రాహుల్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ను వదిలి బయటకు వచ్చిన జగన్‌పై సోనియా బీజేపీ సాయంతో రాష్ట్ర విభజన చేసి కక్ష తీర్చుకుందన్నారు. రాష్ట్ర విభజనకు వంతపాడిన పార్టీలు ప్రజా కోర్టులో ఓడిపోతారని జూపూడి హెచ్చరించారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ఉపేంద్ర, జిల్లా నాయకులు డాకా పిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆరికట్ల వెంకటేశ్వర్లు, టంగుటూరు, పొన్నలూరు, సింగరాయకొండ మండలాల కన్వీనర్‌లు రామారావు, వెంకటేశ్వర్లు, చుక్కా కిర ణ్‌కుమార్ బీసీ, ఎస్సీ సెల్ కన్వీనర్‌లు రాజారపు సుబ్బారావు, గర్నిపూడి రమేశ్, విభజన విభాగం నాయకుడు రవికుమార్‌రెడ్డి, అచ్చకాయల శైలజ పాల్గొన్నారు.

రాజన్న రాజ్యమే ధ్యేయం:పొంగులేటి

వైఎస్‌ఆర్ సీపీ  ‘ప్రజాచైతన్య యాత్ర’ ప్రారంభసభలో పార్టీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి
 
 పాలడుగు (వైరా), న్యూస్‌లైన్:
 రాజన్న కలలుగన్న రాజ్యాన్ని స్థాపించడమే ధ్యేయంగా వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ నేత, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జగనన్న సారధ్యంలో రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు. వైరా నియోజకవర్గస్థాయి ప్రజాచైతన్య యాత్ర(బైక్ ర్యాలీ)ను ఆయన గురువారం వైరా మండలం పాలడుగు గ్రామంలో ప్రారంభించారు.  ఈ యాత్రలో వందల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిళ్లతో పాల్గొన్నారు.
 ఈ సందర్భంగా జరిగిన సభలో పొంగులేటి మాట్లాడుతూ.. మహానేత ఆశించిన సువర్ణ యుగంలో త్వరలోనే వస్తుందని, ప్రజలందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని అన్నారు. మహానేత వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను మళ్ళీ ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు వైఎస్‌ఆర్ సీపీ కృషి చేస్తోందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన అనంతరం పార్టీ చేపట్టిన ఈ ప్రజా చైతన్య యాత్రకు విశేష స్పందన రావడం.. పార్టీపట్ల ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచిందని అన్నారు. దీని స్ఫూర్తితో రానున్న ఎన్నికలలో పార్టీ గెలుపునకు శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఫ్యాను గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి వైఎస్సార్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
 
 ఈ కార్యక్ర మంలో పార్టీ వైరా నియోజకవర్గ సమన్వయకర్త బాణోత్ మదన్‌లాల్, సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నంబూరి రామలింగేశ్వరరావు, విధ్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ అయిలూరి మహేష్‌రెడ్డి; వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాల కన్వీనర్లు షేక్ లాల్‌మహ్మద్, రాయ ల పుల్లయ్య, నల్లమల్ల శివకుమార్, పొన్నెకంటి వీరభద్రం, రావూరి శ్రీనివాసరావు, నాయకులు గుమ్మా రోషయ్య, సూతకాని జైపాల్, తన్నీరు నాగేశ్వరరావు, పాముల వెంకటేశ్వర్లు, పూర్ణకంటి నాగేశ్వరరావు,  శాఖమూడి లోకేశ్వరరావు; ఖానాపురం, గరికపాడు సర్పం చులు మారబోయిన ఏడుకొండలు, శీలం కరుణాకర్‌రెడ్డి, చింతనిప్పు వెంకటేశ్వరరావు, బోసు, కౌసర్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
 
 ఏన్కూరు మండలంలో విశేష స్పందన
 ఏన్కూరు: ప్రజాచైతన్య యాత్రకు ఏన్కూరు మండలంలో విశేష స్పందన కనిపించింది. ర్యాలీ అగ్రభాగాన నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాణోత్ మదన్‌లాల్, నంబూరి రామలింగేశ్వర్‌రావు తదితరులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైరా మండలం నుంచి జన్నారం మీదుగా కోనాయపాలెం, ఏన్కూరుకు ర్యాలీ చేరుకుంది. అక్కడి నుంచి రేపల్లెవాడ, నాచారం, ఒంటిగుడిసె, భద్రుతండా మీదుగా జులూరుపాడు వెళ్లింది. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ముక్తి వెంకటేశ్వర్లు, నాయకులు నల్లమల శివకుమార్, వెంకటేశ్వర్‌రావు, సక్రునాయక్, తంబల్ల రవి, గిదిగిరి సత్యనారాయణ, కట్టా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
 కొణిజర్ల మండలంలో ఉత్సాహంగా...
 
 కొణిజర్ల: వైఎస్‌ఆర్ సీపీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాణోత్ మదన్‌లాల్ నేతృత్వంలో గురువారం చేపట్టిన మోటర్ బైక్ ర్యాలీ(ప్రజా చైతన్యయాత్ర) కొణిజర్ల మండలంలో ఉత్సాహంగా సాగింది. కొణిజర్ల మండలంలోని శాంతి నగర్ వద్ద పార్టీ శ్రేణులు సుమారు 400 ద్విచక్ర వాహనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ యాత్ర పల్లిపాడు, లాలాపురం, తీగలబంజర, మంగాపురం, గుబ్బగుర్తి, అంజనాపురం మీదుగా ఏన్కూర్ మండలానికి వెళ్లింది. ఈ యాత్రను మండల క న్వీనర్ రాయల పుల్లయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పాముల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు దొడ్డపిన్ని రామారావు సమన్వయపరిచారు. కార్యక్రమంలో నాయకులు వడ్లమూడి కృష్ణార్జునరావు, తాళ్లూరి చిన్నపుల్లయ్య, ప్రతాపనేని నరసింహారావు, ప్రతాపనేని లక్ష్మినారాయణ, చల్లా నరసింహారావు, మోహన్‌రావు, గుండ్ల వెంకన్న, మోష, చింతల వాసు, చల్లగుండ్ల రామయ్య, తంబి, జాలాది భద్రయ్య, తెల్లబోయిన వెంకయ్య, కాటేపల్లి సీతారామయ్య, రావుల వెంకటనారాయణ, రోషన్ బేగ్, కన్నేటి వెంకటేశ్వర్లు, తల్లపురెడ్డి హనుమారెడ్డి, కావూరి నాగేశ్వరరావు, అయూబ్‌ఖాన్, బండి శ్రీను, రాజా , బానోత్ రవి, మాన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
 
 కారేపల్లి మండలంలో ఘన స్వాగతం
 
 కారేపల్లి: వైరా మండలం పాలడుగు నుంచి కారేపల్లి మండలంలోని పాటిమీదిగుంపు గ్రామానికి గురువారం సాయంత్రం చేరుకున్న యాత్రకు ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బానోతు మదన్‌లాల్ ఆధ్వర్యంలో సాగిన ఈ యాత్ర (బైక్ ర్యాలీ) పాటిమీదిగుంపు, బాజుమల్లాయిగూడెం, చీమలపాడు, మొట్లగూడెం, మాణిక్యారం, గాదెపాడు, చర్లపల్లి, బస్వాపురం, సీతారాంపురం, ఉసిరికాయలపల్లి, భాగ్యనగర్‌తండా గ్రామాల మీదుగా కారేపల్లి బస్టాండ్ సెంటర్‌కు చేరుకుంది. పాటిమీదిగుంపులో పొంగులేటి, మదన్‌లాల్‌కు  బాజుమల్లాయిగూడెం సర్పంచ్ గుగులోతు సుజాత తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. బస్టాండ్ సెంటర్‌లో జరిగిన సభలో పొంగులేటి మాట్లాడుతూ.. పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చిన వైఎస్‌ఆర్‌ను గిరిజనులు తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 2004లోనే వైఎస్‌ఆర్ బీజం నాటారని అన్నారు. ఆయన సంక్షేమ పథకాలు తెలంగాణలోని ప్రతి గడపకు అందాయన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించటం తెలంగాణ బిడ్డగా అనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి వైఎస్‌ఆర్ రక్త సంబంధీకులే నాయకత్వం వహిస్తారని అన్నారు. అంతకు ముందు ఆయనకు మహిళలు హారతితో ఘన స్వాగతం ఫలికారు.

 పాపకొల్లులో వైఎస్‌ఆర్ విగ్రహావిష్కరణ
 
 జూలూరుపాడు, న్యూస్‌లైన్: నిరుపేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల కష్టాలను తీర్చిన మహనీయుడు దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అని వైఎస్‌ఆర్ సీపీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాచైతన్య యాత్ర జూలూరుపాడు మండలంలోని పాపకొల్లుకు చేరింది. ఈ గ్రామంలో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బానోతు మదన్‌లాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ పాలనలో జరిగిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు మరువలేనివని అన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి, జల యజ్ఞం పథకానికి అత్యధిక నిధులను కేటాయించారని అన్నారు. తెలంగాణలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాజన్న రక్త సంబంధీకులే చేపడతారని ఆయన స్పష్టం చేశారు. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీని ఆదరించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. పార్టీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సైనికుల్లా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి  చేయాలని పిలుపునిచ్చారు.
 
 పార్టీ వైరా నియోజకవర్గ సమన్వయకర్త బానోతు మదన్‌లాల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం తరువాత పార్టీ తొలిసారిగా చేపట్టిన ఈ బైక్ ర్యాలీకి విశేష స్పందన లభించడం.. శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం, ఏన్కూరు మీదుగా కారేపల్లి మండలానికి బైక్ ర్యాలీ తరలి వెళ్లింది.
 కార్యక్రమంలో పార్టీ జూలూరుపాడు, కొణిజర్ల, ఏన్కూరు, వైరా మండలాల కన్వీనర్లు పొన్నెకంటి వీరభద్రం, రాయల పుల్లయ్య, ముక్తి వెంకటేశ్వర్లు, ఎస్‌కె.లాల్‌మహ్మద్, నాయకులు అయిలూరి మహేష్‌రెడ్డి, పూర్ణకంటి నాగేశ్వరరావు, నల్లమల శివకుమార్, దారావతు నాగేశ్వరరావు, రామారావు, గుమ్మా రోశయ్య, శీలం ఆదిరెడ్డి, శంకర్‌రెడ్డి, జయపాల్, సురేందర్‌రెడ్డి, చక్రధర్, రాంశెట్టి వీరయ్య, నల్లపాటి రామారావు, చింతా జగన్నాధం, ఆంగోతు ధనమ్మ, బానోతు అనిత, చెవుల కృష్ణారావు, అల్లాడి నరసింహారావు, బానోతు నాగేశ్వరరావు, బిక్కు, తాళ్లూరి లక్ష్మయ్య, అనంతరామయ్య, వాంకుడోతు కృష్ణ, సత్యనారాయణ, కొలిపాక వెంకటేశ్వర్లు,  బానోతు సక్రు, బాదావత్ బాలు, చందర్, సుందర్, మాచినేని శేషగిరి, హేమ్లా, మంగిలాల్, కొర్రా సామ్యా,  మోహన్, సూర్యం, బిక్కు, జానీ, ధర్మా తదితరులు పాల్గొన్నారు

ప్రజాస్వామ్యం బతికుందా?

ప్రజాస్వామ్యం బతికుందా?: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ, రాజ్యసభ వ్యవహరించిన తీరు చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం బతికుందా? నిలువునా హత్య చేశారా? అనే అనుమానం కలుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. లోక్‌సభ, రాజ్యసభ తెలుగుజాతిని అవమానించే కౌరవ సభలుగా తయారయ్యాయన్నారు. అన్ని వ్యవస్థలనూ దిగజార్చి, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తలా ఒక చెయ్యేసి ప్రజాస్వామ్యాన్ని ఖండఖండాలుగా నరికేశారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
 వెంకయ్యనాయుడు రాజ్యసభలో బిల్లుకు సవరణలు సూచించినట్లు,  ప్రభుత్వం వాటికి అంగీకరించినట్లు ఇలా డ్రామాను రక్తి కట్టించారన్నారు. విభజనకు వ్యతిరేకంగా సీపీఎంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు గళం విప్పగా, రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ టీడీపీ మాత్రం కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తిందన్నారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విభజనకు వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్శిస్తే, ఆ పక్కనే టీడీపీకే చెందిన గుండు సుధారాణి విభజనకు అనుకూలంగా ప్లకార్డు ప్రదర్శించడం దేనికి సంకేతం? ఒకే పార్టీకి చెందిన సభ్యులు ఇలా తెలుగుజాతి పరువును బజారుకీడ్చారని మండిపడ్డారు.

వైఎస్ ఉంటే విభజన జరిగేదా?

 నెల్లూరు: బలమైన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి లేక పోవడం వల్లే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా చీలిపోయిందని జిల్లా జనం ఆవేదన చెందుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న ఐదున్నరేళ్లు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తెర మరుగైన విషయాన్ని జనం చర్చించుకుంటున్నారు. వైఎస్సార్ మరణానంతరం రాష్ట్రంలో బలమైన రాజకీయ నాయకత్వం లేక పోవడమే రాష్ట్ర చీలికకు కారణమైందని జిల్లా వాసులు గట్టిగా నమ్ముతున్నారు. జిల్లాలో ఎక్కడ నలుగురూ కలిసినా ఇదే చర్చ. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి అక్కడి ప్రజలు, రాజకీయ నేతలు విభజన వాదన వినిపించకుండా చేసిన విషయం జిల్లా వాసులు గుర్తు చేస్తున్నారు.
 
 వైఎస్సార్ మరణానంతరం సీఎంలుగా వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని, తెలంగాణ ప్రాంతంలో మళ్లీ తెర మీదకు వచ్చిన రాజకీయ ఉద్యమాలను కట్టడి చేయలేక పోవడం వల్లే  ఈ దుస్థితి వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారు. పైకి దీన్ని అంగీకరించలేని ఇతర రాజకీయ పక్షాల నేతలు సైతం ఆఫ్‌ది రికార్డ్‌గా వైఎస్సార్ బతికి ఉండింటే రాష్ట్రం చీలిపోయేది కాదని అంగీకరిస్తున్నారు. వైఎస్సార్ ఉన్నన్నాళ్లూ తెలంగాణ నేతలు ప్రత్యేక ఉద్యమం గురించి నోరెత్తలేక పోయారని, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీ ఆర్ సైతం తెరమరుగైన విషయం మరచిపోలేనిదని గుర్తు చేస్తున్నారు.
 
 రాజశే ఖరరెడ్డి లాంటి ప్రజాబలం లేని నాయకుడు లేక పోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుందని జనం బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) తీర్మానం చేసిన రోజు నుంచే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాగా సమైక్యాంధ్ర వాదంతోనే రాజకీయం నడిపి ఉంటే కేంద్ర ప్రభుత్వం ధైర్యంగా ముందడుగు వేసి ఉండేది కాదనే బాధ జిల్లా వాసుల్లో వ్యక్తం అవుతోంది.
 
 సీఎం సహా ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు పైకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు నటించినా, లోలోపల విభజనకు అనుకూలంగా వ్యవహరించడం తమ కళ్ల ముందే కదలాడుతూ ఉందని రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. విభజన ప్రక్రియ సరిగా లేదని గట్టిగా  వాదిస్తూ వచ్చిన బీజేపీ కూడా చివరి దశలో కాంగ్రెస్‌కే జై కొట్టి లోక్‌సభ, రాజ్యసభల్లో విభజన బిల్లును ఆమోదించి సీమాంధ్రులకు ద్రోహం చేసిందని జిల్లా జనం మండిపడుతున్నారు.
 
 కాంగ్రెస్ పార్టీ లాగే చంద్రబాబునాయుడు కూడా అటు జై తెలంగాణ అని, ఇటు సమన్యాయం అనే నినాదాలు అందుకుని రాజకీయ నాటకం ఆడటం వల్లే విభజన జరిగిందని జనం మండిపడుతున్నారు. సీమాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా విభజించడం వల్ల ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, నీరు, విద్యుత్ పంపకాలు ఇతర సమస్యలపై గురువారం రాజ్యసభలో ప్రధాని, కేంద్ర మంత్రుల మాటల హామీలు ఇచ్చినా ప్రభుత్వం మారితే అవి ఏ మేరకు ఆచరణకు నోచుకుంటాయనే భయం జిల్లా ప్రజల్లో వ్యక్తం అవుతోంది. విభజన  నాటకాలు ఆడిన పార్టీలకు ప్రజలు ఎన్నికల్లో  తమ తీర్పు ద్వారా గుణపాఠం చెప్పక తప్పదని జనం బహిరంంగానే హెచ్చరిస్తున్నారు.

ఆవేదనతో కంటతడి పెట్టిన వాసిరెడ్డి పద్మ

Written By news on Thursday, February 20, 2014 | 2/20/2014

ఆవేదనతో కంటతడి పెట్టిన వాసిరెడ్డి పద్మవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: రాజ్యసభ సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు జాతిని దారుణంగా అవమానించారని, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన స్ర్కీప్టు చదివిన చిరంజీవికి వైఎస్‌ఆర్‌సీపీని విమర్శించే అర్హత లేదని వాసిరెడ్డి పద్మ అన్నారు. 
 
చిరంజీవి కాంగ్రెస్‌కు హోల్‌సెల్‌గా పార్టీని అమ్ముకున్నారని,  సభలో సీమాంధ్ర కేంద్రమంత్రులు దద్దమ్మలా కూర్చున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశమని పార్టీ పేరు పెట్టుకుని,  తెలుగు ప్రజలకు ద్రోహం చేశారు అని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన నేరం క్షమించరానిదని అన్నారు. 
 
బీజేపీ నేత సుష్మాస్వరాజ్ చిన్నమ్మ కాదు..విచ్ఛిన్నమ్మ అని.. వెంకయ్యనాయుడు కాదు..వేర్పాటునాయుడు అని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తీవ్ర ఆవేదనతో వాసిరెడ్డి పద్మ కంటతడి పెట్టారు. 

సోనియా మాఫియా డాన్: కొణతాల

సోనియా మాఫియా డాన్: కొణతాల
విశాఖపట్నం : తెలుగుజాతిని విచ్ఛిన్నం చేయడానికే యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ కంకణం కట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు కొణతాల రామకృష్ణ ఆరోపించారు. గురువారం ఆయన విశాఖపట్నంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరుపై మండిపడ్డారు.
 
సోనియా మాఫియా డాన్ గా అభివర్ణించారు. సీఎం కిరణ్ ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర విభజనకు అన్ని విధాల సహకరించి తెలుగు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసి మరోసారి ప్రజలను మోసగించాలని చూస్తున్నారని కిరణ్ పై ఈసందర్భంగా కొణతాల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.   

వీర బొబ్బిలి కోటలో ఎన్నికల సమర శంఖం

వీర బొబ్బిలి కోటలో ఎన్నికల సమర శంఖంఅభ్య బొత్స సత్యనారాయణ కు ఈసారి జరిగే ఎన్నికలతో రాజకీయ సన్యాసం తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు అ న్నారు. తొమ్మిదేళ్లుగా జిల్లాలో బొత్స దుర్మార్గపు పాల నను ప్రజలు చూశామని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పారు. బొబ్బిలి కోట లోని దర్బార్ మహాల్‌లో బుధవారం ఆ పార్టీ నాయకులు వేలాది మందితో ఎన్నికల శంఖారావం పూరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొత్స బొబ్బి లి నియెజకవర్గం ఇచ్చిన మెజార్టీతో రెండు సార్లు ఎంపీగా గెలిచారని, ఈసారి అదే భారీ మెజార్టీతో ఆయన్ను ఓడించి రాజకీయ సన్యాసం చేయించాల న్నారు. 30 ఏళ్లపాటు వర్గాలుగా ఉన్న తెర్లాం, బాడం గి మండలవాసులు పునర్విభజనలో పార్టీలకతీతతం గా బొబ్బిలి రాజులు వెంట నడవడం ఎన్నటికీ మరువలేమన్నారు. వచ్చే మూడు నెలలు చాలా కీలకమని నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చే యూలని పిలుపునిచ్చారు. పార్టీ అధికారంలోకి రాగా నే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుం దామని చెప్పారు.
 
 పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివ రాజు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి కష్టకాలంలో ఉన్నప్పుడు బొబ్బిలి ఎమ్మెల్యేగా సుజయ్ కృష్ణ రం గారావు అండగా నిలబడ్డారన్నారు. జిల్లాలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా బేబీనాయన అండగా నిలుస్తున్నారని తెలిపారు. విజయనగరం ఎం పీతో పాటు జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలను అఖండ మెజార్టీతో గెలిపించాలని కో రారు. అందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అరుకు పార్లమెంటు పరిశీలకుడు ఆర్‌వీ ఎస్‌కేకే రంగారావు(బేబీనాయ న) మాట్లాడుతూ మరో బొబ్బిలి యుద్ధానికి నాయకు లు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. ఈ యుద్ధంలో బొబ్బిలికే విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు రాజకీయ గురువు అని, తమను ఇంతవారిని చేసిన ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన నైతిక బాధ్యత తమపై ఉందన్నారు. రాజ కీయంలో ఉన్నంత వరకూ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. అనంతనం అర్బన్ బ్యాం కు మాజీ చైర్మన్ గునాన వెంకటరావు, సుజయ్ యువసేన చీఫ్ చెలికాని మురళీకృష్ణ, ఎన్‌జీఓ సంఘ నాయకుడు రౌతు రామ్మూర్తి, మాజీ ఎంపీపీ తమ్మిరెడ్డి దా మోదరరావు, బెవర సూర్యనారాయణ, బంకురు బా బూరావు, చింతల రామకృష్ణ, కిర్ల అప్పలరాం, పెద్దిం టి రామారావు, బోను శ్రీనివాసరావు మాట్లాడారు.
 
 పార్టీలో చేరిన పర్తాపు
 ఈ సందర్భంగా పట్టణంలోని మూడో వార్డుకు చెంది న టీడీపీ రాష్ట్ర యువత సభ్యుడు పర్తాపు చంద్రశేఖర్ 500 కుటుంబాలతో వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స కండువా వేసి స్వాగతం పలికారు. బొబ్బిలి మండలం సీతయ్యపేటమాజీ సర్పంచ్ బోను సత్యంనాయుడు, బాడంగి మండలం పినపెంకి వార్డు సభ్యుడు అల్లు సీతంనాయుడు కూడా తమ అనుచరులతో పార్టీలో చేరారు.  
 
 పెనుమత్సకు సత్కారం
 పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెనుమత్స సాంబశివరాజు  రెండోసారి కూడా ఎన్నిక కావడంతో బొబ్బిలి రాజులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. అలాగే పంపాన శ్రీనివాసరావు, బోను శ్రీనివాసరావు, బొబ్బిలి అప్పారావు కూడా సత్కరించారు. సమావేశంలో నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు పెనుమత్స సురేష్‌బాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆదాడ మోహనరావు, సేవా దళ్ జిల్లా అధ్యక్షుడు తూముల రాంసుధీర్, నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  
 

విభజన చట్టబద్ధం కాదు: మేకపాటి

విభజన చట్టబద్ధం కాదు: మేకపాటి
 స్టే ఇవ్వాలని సుప్రీంలో మేకపాటి పిటిషన్
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా, బలవంతంగా విభజిస్తోందని... విభజనపై స్టే ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్‌ను దాఖలు చేశారు. ‘అసెంబ్లీ తిరస్కరించినప్పటికీ కేంద్రం విభజిస్తోంది. రాష్ట్ర ప్రజలకు దీనిపై న్యాయపోరాటం మినహా మరే ప్రత్యామ్నాయం లేకుండా చేసింది. శ్రీకృష్ణ కమిటీ సిఫారసులనూ పట్టించుకోకుండా విభజన చేస్తోంది. రాజధాని చుట్టూ పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు ఏర్పడ్డాయి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలు ఈ విషయంలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. గత 50 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే పెట్టుబడులన్నీ  కేంద్రీకృతమయ్యాయి. వాటిలో 90 శాతం  సీమాంధ్ర వారివే. 99 శాతం ప్రభుత్వరంగ సంస్థలన్నీ ఇక్కడే నెలకొన్నాయి.
 
   పైగా 2012-13 సాఫ్ట్‌వేర్ పరిశ్రమ టర్నోవర్ రూ. 55,000 కోట్లు అయితే.. ఒక్క హైదరాబాద్ టర్నోవరే రూ. 54,800 కోట్లు. మరి మిగిలిన సీమాంధ్ర పరిస్థితి ఏంటి? అమ్మకపు పన్నులో 75 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు రెవెన్యూ లోటు తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే ఎగువ రాష్ట్రాలు తమ అవసరాలు నిండితే గానీ నీళ్లు వదలట్లేదు. వీటిపై అనేక న్యాయవివాదాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగితే కింది ప్రాంతమైన సీమాంధ్ర తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక ఆర్టికల్ 371(డి)ని కూడా కేంద్రం విస్మరిస్తోంది...’ అని పిటిషన్‌లో విన్నవించారు. అందువల్ల ఈ బిల్లు చట్టబద్ధంగా లేద ని ఆదేశాలివ్వాలంటూ కోరారు. అయితే ఈ విషయంలో చర్యలు తీసుకునేందుకు సరైన సమయం కాదంటూ కోర్టు గతంలో మేకపాటి దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే

అభినవ కీచకులు ఆ ముగ్గురు

అభినవ కీచకులు ఆ ముగ్గురు
అభినవ కీచకులు ఆ ముగ్గురు
 బుచ్చిరెడ్డిపాళెం, :
 సోనియాగాంధీ, చంద్రబాబు, బీజేపీ నాయకులు రాష్ట్ర విభజన విషయంలో అభినవ కీచకులుగా మారారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.
  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పి లుపు మేరకు  పార్టీ శ్రేణులు పట్టణం లోని వైఎస్సార్ విగ్రహం వద్ద బుధవా రం రాస్తారోకో నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంట్‌లో మంగళవారం టీబిల్లును ప్ర వేశపెట్టడం నర్తనశాలను తలపించిందన్నారు.  రెండు ప్రాంతాల్లో రాజకీయం గా పార్టీ ఎదుగుదలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇరు ప్రాంతాల నాయకులను   రెచ్చగొట్టారన్నారు.
 త మ నాయకుడి వల్లే తెలంగాణ వచ్చిం దని టీడీపీ తెలంగాణ నేతలు నామా నాగేశ్వరరావు, యర్రబల్లి దయాకర్‌రా వు చెప్పడం దీనికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు రాజకీయ వ్యభిచారులుగా మారాయని దుయ్యబ ట్టారు.  రాహుల్‌గాంధీని ప్రధాని చేసేం దుకు సోనియా, రెండు ప్రాంతాల్లో పా ర్టీ ఎదుగుదలకు చంద్రబాబు రాష్ట్ర విభజనకు కారకులయ్యారన్నారు.
  తొలి నుంచి సమైక్యాంధ్ర కోసం పోరాడిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే స మైక్యవాదిగా మిగిలారన్నారు.  జొన్నల గడ్డ నారాయణరావు, కోడూరు మధుసూదన్‌రెడ్డి, యామాల మోహన్, కత్తి శేషయ్య, పిడుగు మధు, మల్లు జయరామిరెడ్డి, నెల్లూరు నాగేశ్వరరావు, చెల్లాయపాళెం, ఉప సర్పంచ్ మురళీ, నాగాయగుంట సర్పంచ్ రాజశేఖర్, వెంకట్రావు, చిన్న అల్లాబక్షు, తాజుద్దీన్, మున్నా పాల్గొన్నారు.
 సీఎం రాజీనామా చేసి ఏం లాభం
 సీడబ్ల్యూసీ తీర్మానం చేసినపుడే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసి ఉం డాల్సిందని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో టీ బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాజీనామా చేసి ఏం ఉపయోగమని ఆయన ప్రశ్నిం చారు. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి, పార్టీ నే తలు మేనకూరు సీతారామిరెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి, గుమ్మా సుధాకరయ్య, షేక్ కరీముల్లా(బాబు), జబీవుల్లా, ఫ యాజ్‌బాషా, అహ్మద్‌బాషా, గుమ్మా సు దాకరయ్య, నాగేశ్వరరావు, బొంతా హరిబాబుయాదవ్ పాల్గొన్నారు.
 రాష్ట్ర విభజన దారుణం
 ఇందుకూరుపేట: సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని వి భజించడం దారుణమని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మం డలంలో బుధవారం బంద్ నిర్వహిం చారు. ఆరోమైలు కూడలిలో రాస్తారో కో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తీరు అప్రజాస్వామికమన్నారు. దుర్మార్గంగా రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీ తగిన  మూల్యం చెల్లించక తప్పదన్నారు. నాయకులు వెంకటకృష్ణారెడ్డి, వెంకటరమణారెడ్డి, కుమార్‌రెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణప్రసాద్, మల్లికార్జునరెడ్డి, బాబయ్య, కృష్ణ, మహి, ఉమ, రవి, సర్పంచ్‌లు బాలబొమ్మ వెంకటేశ్వర్లు, గూడూరు జయరామయ్య, తాతా సురేంద్ర పాల్గొన్నారు. అలాగే జీ ఎస్సార్ యువసేన ఆధ్వర్యంలో ఇందుకూరుపేట, కొత్తూరు గ్రామాల్లో దుకాణలు, పాఠశాలలు, బ్యాంకులు, ప్రభు త్వ కార్యాలయాలను మూసివేయించా రు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.  గురజాల జ్ఞానస్వరూప్, సూదలగుంట వెంకటేశ్వరనాయుడు, భాస్కర్‌నాయుడు, గోళ్ల రవీంద్రరావు, శ్రీకాంత్‌రెడ్డి, చక్రి, ఉపసర్పంచ్ వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.
 వైఎస్సార్‌సీపీ రాస్తారోకో
 కోవూరు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సాయిబాబా గుడి సమీపంలో జాతీయరహదారిపై బైఠాయిం చి వాహనాల రాకపోకలను అడ్డుకున్నా రు. దీంతో సుమారు 8 కిలోమీటర్ల మే ర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీమాం ధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు. సోనియాగాంధీ నియంతలా వ్యవహరించి లోక్‌సభలో బిల్లును ఆ మోదింపజేయడం దుర్మార్గమన్నారు.  పదవుల కోసం పాకులాడే సీమాంధ్ర నే తలు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. నాటి బ్రిటిష్ పాలకులు ఇండియా నుంచి  పాకిస్తాన్‌ను విభజిస్తే ప్రస్తుతం  ఇటలీ నియంత సోనియాగాంధీ రాష్ట్ర విభజనకు పాల్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ములమూడి వినోద్‌రెడ్డి, రా ధాకృష్ణారెడ్డి, సర్పంచ్ కూట్ల ఉమ, ఉపసర్పంచ్ మల్లారెడ్డి, నిరంజన్‌బాబురె డ్డి, మల్లికార్జున్‌రెడ్డి, నరసింహులురెడ్డి, అట్లూరి సుబ్రహ్మణ్యం, మంచి శ్రీనివాసులు,డాక్టర్ శీనయ్య, సీతారామిరెడ్డి, మారం వినయ్‌కుమార్‌రెడ్డి, జనార్దన్‌రె డ్డి,శ్రీనివాసులురెడ్డి, బాబురె డ్డి,సుబ్బారెడ్డి,ఉయ్యూరువేణు ఉన్నారు.
 లేగుంటపాడులో...
 రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మండలంలోని లేగుంటపాడులో వైఎస్సార్‌సీ పీ నాయకులు నిరసన తెలిపారు. ఇనమడుగు-ముదివర్తి రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మారం వినయ్‌కుమార్‌రెడ్డి, సాయిరెడ్డి, మనోజ్, సూర్యారెడ్డి, రాజా ,వంశీనాయుడు, మోహన్‌సాయినాయుడు, సందీప్, మనోజ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
 బిల్లు ఆమోదం అప్రజాస్వామికం
 విడవలూరు: పార్లమెంట్‌లో టీ బిల్లు ఆ మోదించిన తీరును చూస్తే సామాన్య మానవునికి కూడా అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే ప్రశ్న తలెత్తుతుందని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ విడవలూరులో వైఎస్సార్‌సీపీ నాయకు లు చేపట్టిన బంద్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు. చెన్నారెడ్డి హయాంలో  పెద్దఎత్తున తెలంగా ణ ఉద్యమం నడిచినా రాష్ట్ర విభజన మంచిదికాదని ఇందిరాగాంధీ స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. ఆమె కోడలు సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజిం చ డం దారుణమన్నారు. సమైక్యాంధ్ర కో సం వైఎస్సార్‌సీపీ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోని అన్ని ప్రాంతాల నాయకులను కలుసుకుని పోరాడినట్లు గుర్తుచేశారు. పార్టీ మండల కన్వినర్ బె జవాడ గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర యువజన వి భాగం సభ్యుడు ఓగు నాగేశ్వరరావు, నాయకులు కొండూరు వెంటకసుబ్బారె డ్డి, వీరిచలపతిరావు, మాతూరు శ్రీని వాసులరెడ్డి, అనపల్లి ఉదయ్‌భాస్కర్,  నిరంజన్‌బాబురెడ్డి,  పాల్గొన్నారు.
 వైఎస్సార్‌సీపీ బంద్ విజయవంతం
 కొడవలూరు:  రాష్ట్ర విభజనను నిరసిస్తూ  వైఎస్సార్‌సీపీ నాయకులు మం డలంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆ ద్వర్యంలో నార్తురాజుపాళెంలో జాతీ య రహదారిపైకి చేరుకుని వాహనాలను నిలిపి వేశారు. దీంతో సుమారు పది కిలో మీటర్ల దూరం వాహనాలు బారులు తీరి నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించాయి.జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వీరి చలపతిరావు, నల్లావుల శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ పిట్టి సూరి,  మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, నాయకులు పెనాక శ్రీనివాసులురెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, నందకుమార్‌రెడ్డి పాల్గొన్నారు

చీకట్లో కుట్రేంటి చిన్నమ్మా?

చీకట్లో కుట్రేంటి చిన్నమ్మా?: అంబటి
 సుష్మా స్వరాజ్‌కు వైఎస్సార్ సీపీ నేత అంబటి సూటి ప్రశ్న 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును ఈ నెల 13వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీరును తీవ్రంగా తప్పుపడుతూ ఇలా అయితే సహకరించబోమని చెప్పిన బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ అంతలోనే మాటమార్చి సభలో ఎలా మద్దతిచ్చారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. బుధవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఎందుకు మాట మార్చారు... చిన్నమ్మా (సుష్మాస్వరాజ్)? చీకట్లో ఏం కుట్ర జరిగింది చిన్నమ్మా? లోక్‌సభ ప్రసారాలు నిలిపివేసి మరీ చీకట్లో కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఏం ఆశించి బీజేపీ ఇలా చేసింది?’ అని ప్రశ్నించారు. ‘ఆంధ్రప్రదేశ్ విభజన అన్యాయం, అక్రమం... అన్నదమ్ములు, మిత్రుల మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెడుతోందని గావుకేకలు పెట్టిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఎందుకు మౌనంగా ఉండిపోయారు.
 
 అప్రజాస్వామికంగా బిల్లును ఆమోదించుకునేందుకు ఎందుకు సహక రించారో తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని అంబటి డిమాండ్ చేశారు. సోనియాగాంధీ, బీజేపీ, టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం పదవి నుంచి వైదొలగిన కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర చేసి రాష్ట్ర విభజనను సజావుగా సాగించారన్నారు. విభజనకు పూర్తిగా సహకరించి అంతా అయ్యాక కిరణ్ ఇపుడు రాజీనామా ఎందుకు చేశారని ప్రశ్నిం చారు. కిరణ్ అసమర్థత, సంకుచితత్వం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని మండిపడ్డారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి బలమైన నాయకుడు ఉండి ఉంటే తెలుగు ప్రజలను ఇలా చీల్చే వారా? అని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
-    కిరణ్ ఇన్నాళ్లూ అధిష్టానం చెప్పినట్లు నటించి ఇపుడు రంగు తీసేసి బయటకు వెళుతున్నారు.
-   తెలుగు ప్రజలకు కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన నమ్మక ద్రోహం అంతాఇంతా కాదు.
-    సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న నాడే సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేయకుండా చివరి బంతి అని చెబుతూ లక్షల ఫైళ్లపై చివరి సంతకం వరకూ చేసి లక్షల కోట్లు గడించారు.
-   ఇపుడిక కిరణ్ రాజీనామా చేస్తే ఏంటి? చేయకుంటే ఏంటి?
-   రాష్ట్ర విభజన దారుణమైన రీతిలో అప్రజాస్వామికంగా జరిగిపోతుంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిందేమిటి? రోజుకో విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడ్డం తప్ప.
-    చంద్రబాబుకు ఏ మాత్రం సిగ్గూ, ఎగ్గూ, నీతి, నిజాయితీలు ఉంటే ఆయన నిర్వహించిన పాత్రకు సిగ్గుపడి రాజకీయాలు వదిలి వెళ్లి పోవాలని అంబటి రాంబాబు సూచించారు

ఆ ఇద్దరూ నయవంచకులు..: భూమన

ఆ ఇద్దరూ నయవంచకులు..: భూమన
 కిరణ్, చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు:  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన
చిత్తూరు జిల్లా వాసులను తలదించేకునేలా చేసిన చరిత్రహీనులు
సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చిన సోనియా తొత్తు కిరణ్

 
 సాక్షి, హైదరాబాద్: ఇద్దరు నయవంచకులు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు చీడ పురుగుల మాదిరిగా తయారై రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. వీరిద్ద రూ కలిసి చిత్తూరు జిల్లా వాసులను తలదించుకునేలా ప్రవర్తించి చరిత్రహీనులుగా మిగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
 కాంగ్రెస్  కోర్‌కమిటీ, సీడబ్ల్యూసీ సమావేశాలలో రాష్ట్ర విభజనకు గంగిరెద్దులా తలూపిన కిరణ్ ఆర్భాటపు మాటలతో ప్రజలను నిట్ట నిలువునా మోసగించారన్నారు. ఉద్యోగులు చేపట్టిన మహోగ్ర ఉద్యమాన్ని నీరుగార్చి విభజనకు అన్ని రకాలుగా రహదారులు వేసి సోనియా తొత్తులా వ్య వహరించారని దుయ్యబట్టారు. రాజకీయ సంక్షోభం సృష్టిద్దామని వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి చెబుతుంటే పెడచెవిన పెట్టి, తమ నిజాయితీనే శంకిస్తూ కిరణ్ ఎదురు దాడికి దిగారని గుర్తుచేశారు.
 
 అడపాదడపా ప్రెస్‌మీట్లు పెట్టి నాలుగు మాటలు చెప్పేసి తన తాబేదార్లు, ఉద్యోగస్తుల నాయకుడి చేత ‘సమైక్య సింహం’ అనిపించుకున్నారే తప్పితే ఏనాడు కూడా రాష్ట్ర సమైక్యత కోసం కిరణ్ కృషి చేయలేదన్నారు. సమైక్య ముసుగులో కిరణ్ ఆరు నెలలుగా రెండు చేతులతో సంతకాలు చేస్తూ డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మరో నయవంచకుడైన చంద్రబాబు రాష్ట్రంలో ఇరు ప్రాంత నేతలను ఉసిగొల్పి రసవత్తరమైన నాటకంలో విదూషకుడిగా మిగిలారన్నారు. ఏ ఒక్కరోజూ సీమాంధ్రకు జరిగే నష్టాన్ని ప్రస్తావించకుండా కొబ్బరికాయల సిద్ధాం తంలో ప్రజలకు బాబు తీరని ద్రోహం తలపెట్టారన్నారు. సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన తర్వాతి రోజు ప్రెస్‌మీట్ పెట్టి సీమాంధ్రకు నాలుగైదు లక్షల కోట్లు కావాలంటూ ప్రజల మనోభావాలను తాకట్టుపెట్టారని బాబుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం మొదటి నుంచి చిత్తశుద్దితో పనిచేస్తున్నది వైఎస్సార్‌సీపీనే అని ఉద్ఘాటించారు. ఇప్పటికీ అదే ఆశతో సుప్రీంకు వెళ్లామన్నారు.
 
 బాబు లేఖలతోనే విభజన: ఉమ్మారెడ్డి, దాడి

 రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రానికి పదేపదే గుర్తుచేస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖలు రాయడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని  వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దాడి వీరభద్రరావు మీడియాతో పేర్కొన్నారు. టీడీపీని ప్రజలు తిరస్కరించినా పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి కోసం కేంద్రాన్ని రెచ్చగొట్టే విధంగా ‘విభజన మీరు చేస్తారా? నన్ను చేయమంటారా? అసెంబ్లీలో మీరు తీర్మానం పెట్టకపోతే మేం పెడతాం’ అన్న చంద్రబాబు వ్యాఖ్యల వల్లే 2009 డిసెంబర్ 9న విభజన ప్రకటన వచ్చిందన్నారు. కేంద్రం వెనక్కి తగ్గిన తర్వాత అఖిలపక్షం అంటూ ప్రకటనలు చేసి రాష్ట్ర విచ్ఛిన్నానికి కారకుడయ్యారని బాబుపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏపీఎన్జీవోలు కోరితే.. ‘ఏం మనవారు బెంగళూరు, చెన్నై వెళ్లి బతకడం లేదా?’ అంటూ విభజనను సమర్థించేలా మాట్లాడారన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న జూలై 30నే కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, విపక్ష సభ్యులంతా రాజీనామా చేసి ఉంటే ఈ రోజు విభజన జరిగేదే కాదన్నారు. డిసెంబర్ 9న చిదంబరం టీ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పినప్పుడు మూకుమ్మడి రాజీనామాలు చేయటంతో విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు.
 
  కేంద్ర కేబినేట్ సమావేశాల్లో మౌనం దాల్చిన మంత్రులు ఇప్పుడు పార్లమెంటులో నిరసనల పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు కారకులైన నిందితులలో ఎ-1 సోనియా, ఎ-2 చంద్రబాబు, ఎ-3 కిరణ్‌కుమార్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. సోనియాగాంధీ చెప్పినందు వల్లే గతంలో రాజీనామా చేయలేదని అంటున్న కిరణ్ ఇప్పుడు ఆమె పచ్చజెండా ఊపినందునే తప్పుకున్నారా? అని ప్రశ్నించారు.

రానున్న ఎన్నికల్లో బొత్స కుటుంబం భూస్థాపితం

'రానున్న ఎన్నికల్లో బొత్స కుటుంబం భూస్థాపితం'
విజయనగరం: రానున్న ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని భూస్థాపితం చేయడం ద్వారా అరాచక రాజకీయాలకు స్వస్తి చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.
 
బొబ్బిలి దర్బార్‌ మహాల్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది, ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయకృష్ణరంగారావు, జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, బేబినయనలు హాజరయ్యారు. 
 
ఈ సందర్బంగా సుజయకృష్ణరంగారావు మాట్లాడుతూ.. బొబ్బిలిలో మేమిచ్చిన మెజార్టీతోనే బొత్స కుటుంబం రెండు సార్లు ఎంపీ పదవి పొందారు అని అన్నారు. ఈసారి ఎన్నికల్లో అదే మెజార్టీని వైఎస్‌ఆర్‌సీపీకి ఇవ్వడం ద్వారా బొత్సను రాజకీయ సన్యాసం చేయిద్దాం అని పిలుపునిచ్చారు. 
 
మేం రాజకీయాల్లో ఉన్నంతకాలం రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం. భవిష్యత్ లో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే కొనసాగుతాం అని నేతలు స్పష్టం చేశారు. రానున్న బొబ్బిలి యుద్ధంలో విజయం మాదే  బేబినయన ధీమా వ్యక్తం చేశారు. 

దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా విభజన

Written By news on Wednesday, February 19, 2014 | 2/19/2014

కువైట్: ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ, బిజెపిలు కుమ్మక్కై తెలుగు ప్రజలను నిట్ట నిలువునా అతి దారుణంగా చీల్చారు అని కువైట్ లోని ప్రవాసాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకసభలో విభజన తీరు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఉంది అని ప్రవాసాంధ్రులు నాయని మహేశ్వర్ రెడ్డి, గోవింద్ నాగరాజులు ఆరోపించారు. 
 
పార్లమెంట్ లో అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి తెలంగాణ బిల్లును అప్రజాస్వామ్యంగా ఆమోదించిన తీరుపై కువైట్లోని హవెల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ కువైట్ విభాగం సభ్యులు   నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో నాయని మహేశ్వర్ రెడ్డి, గోవింద్ నాగరాజు పలువురు నేతలు మాట్లాడారు. 
 
కేవలం ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్, బీజేపీలు కలిసి సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తెలంగాణ బిల్లును అప్రజాస్వామ్య పద్దతిలో ఆమోదించడం హేయమైన చర్య అని అన్నారు. 
 
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చరిత్ర హీనులుగా మిగులి పోతారని విమర్శించారు.  చంద్రబాబు, కిరణ్ లకు ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమన్నారు. 
 
ఈ కార్యక్రమములో యంవి నరసారెడ్డి, ఆకుల ప్రభాకర్ రెడ్డి, రమణ యాదవ్, రహ్మాన్ ఖాన్, తెట్టు రఫీ, కె వాసు దేవారెడ్డి, మహబూబ్ బాషా, దుగ్గి గంగాధర్, నియాజ్, సజాద్, మర్రి కళ్యాణ్లు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణకు వ్యతిరేకంగా సుప్రీంలో మేకపాటి పిటిషన్!

తెలంగాణకు వ్యతిరేకంగా సుప్రీంలో మేకపాటి పిటిషన్!
న్యూఢిల్లీ: లోకసభ ఆమోదించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణను 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రతిపాదన ఆమోదిస్తూ అక్టోబర్ 3 తేదిన కేబినెట్ తీర్మానం చేయడం రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని పిటిషన్ లో మేకపాటి పేర్కోన్నారు. 
 
ప్రతిపాదిత ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ నిబంధనలు అతిక్రమించినట్టు ప్రకటించి.. ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టుకు మేకపాటి విజ్క్షప్తి చేశారు. లోకసభలో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు ఇంకా రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. 
 
బిల్లుకు ఆమోదం తెలుపకముందు ముందుగా విచారణ చేపట్టడం సరికాదని.. సరియైన సమయంలో మళ్లీ పిటిషన్ దాఖలు చేయాలని.. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఫిబ్రవరి 7, 17 తేదిల్లో సుప్రీం కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు ఫిబ్రవరి 18 తేదిన లోకసభ ఆమోదించిన తీర్మానాన్ని సవాల్ చేస్తూ ఫిబ్రవరి 19న మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. 

అమ్మ డైరెక్షన్ లోనే....

అమ్మ డైరెక్షన్ లోనే....
ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌ హడావిడి చూస్తుంటే ఎలాగైనా మ్యాచ్‌ గెలిపిస్తాడని అనుకున్నారు ప్రేక్షకులు. అయిదు బంతులు అయిపోయాయి. ఒక్క పరుగూ రాలేదు. చివరి బంతికైనా సిక్స్‌ కొడతాడని అనుకున్నారందరూ. ఆ చివరి బంతి పడకుండానే మ్యాచ్‌ అయిపోయింది.

మ్యాచ్ మొత్తం అయిపోయింది. ప్రేక్షకులైన తెలుగు ప్రజలు దారుణంగా మోసానికి గురయ్యారు. యావత్ తెలుగుజాతి ఓడిపోయింది. అయినా ఆట అయిపోలేదని ఒక ప్లేయర్ గ్రౌండ్‌లో దిగారు. అతనెవరో కాదు....నన్‌ అదర్‌ దేన్.. తెలుగు రాని..తెలుగు ప్రజల ..చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి.

నిన్నటి దాకా లాస్ట్ బాల్ మిగిలే ఉంది.. సిక్స్ కొడతా.. ఫోర్ కొడతా.. భూకంపం ఆపుతా.. సునామీని ఆపలేకపోవచ్చు  కానీ... విభజనను ఆపుతా అంటూ బీరాలు పోయిన కిరణ్‌కుమార్ రెడ్డి ఇప్పుడు అమ్మ డైరెక్షన్‌లో కొత్త డ్రామా మొదలుపెట్టారని యావత్ లోకం కోడై కూస్తోంది. అతని సన్నిహిత ఎమ్మెల్యేలు కూడా ఇదే మాటను నొక్కి వక్కాణించి చెబుతున్నారు.

సోనియమ్మ డైరెక్షన్‌లోనే రాజీనామా చేసి కొత్తపార్టీ పెట్టి పోటీ చేస్తే ఎలక్షన్ ఖర్చులు.. మొత్తం ఇస్తానని హైకమాండ్ హామీ ఇచ్చిందంట.. అంతే.. మరోసారి ఆలోచించకుండా రాజీనామా డ్రామాకి తెరతీసారు. ఈ విషయం ఢిల్లీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంకో భయంకరమైన జోక్ ఏంటంటే .. పెట్టిన ప్రెస్ మీట్‌లో కూడా అంతా సోనియా మేడమ్‌ చెప్పినట్లే చేశాను.. నాదేమీ లేదని అపరిపక్వతను ప్రదర్శించారు.

అయితే ఢిల్లీ పెద్దలు ఆడించినట్లే ఆడుతున్నాం కాబట్టి.. కనీసం ఎలక్షన్లలో పోటీ చేయటానికి ఫండ్ అయినా ఇస్తారుగా ... కనీసం అది అయినా మిగులుతుందిగా.. ఎలాగు ఇప్పుడు వేరే పార్టీకి పోయినా టిక్కెట్ దొరకడం కష్టం. అందుకే సీఎంతో ఉండి కనీసం పోటీ అయినా చేద్దామని చాలామంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారట.

లాస్ట్ బాల్ అంటూ కోట్లు దండుకున్నారు

'లాస్ట్ బాల్ అంటూ కోట్లు దండుకున్నారు'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
హైదరాబాద్ : సీఎం పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ వరకు విభజనపై పోరాటం చేస్తానని చెప్పి చివరి క్షణం వరకు లక్షల సంతకాలు పెట్టి రూ. కోట్లు దండుకున్నారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ... కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేయడం ద్వారా సమైక్య సింహం ముసుగు తొలగిందన్నారు. తెలుగు జాతి విభజనలో ఏ1 ముద్దాయి కిరణ్ కుమార్ రెడ్డి అని అభివర్ణించారు. మీ వ్యక్తిగత స్వార్థం కోసం తెలుగు ప్రజలను ఇంతలా మోసం చేయాలని అంటూ కిరణ్ ను సూటిగా ప్రశ్నించారు.
 
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి నీతి, నిజాయితీలు లేవన్నారు. అవే ఉంటే వెంటనే రాజకీయాలకు స్వస్తి పలకాలని చంద్రబాబుకు అంబటి సూచించారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం కోసం సోనియా, బీజేపీ, చంద్రబాబు, కిరణ్ లు ఒకరికొకరు సహకరించుకున్నారని విమర్శించారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టలేదన్న బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా పిన్నమ్మ ఎందుకు మాట మార్చిందంటూ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

ఎ1 ముద్దాయి సోనియా గాంధీ

'ఎ1 ముద్దాయి సోనియా గాంధీ'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: చంద్రబాబు, కిరణ్ ఇప్పటికీ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ నేతలు దాడి వీరభద్రరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు పదేపదే కేంద్రానికి గుర్తు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. విభజన విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక మోసం చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేశారని ధ్వజమెత్తారు.

విభజన వ్యవహారంలో ఎ1 ముద్దాయి సోనియా గాంధీ, ఎ2 ముద్దాయి చంద్రబాబు, ఎ3 ముద్దాయి కిరణ్ కుమార్ రెడ్డి అని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో కొందరు సభ్యులు దేశప్రతిష్టను మంటగలిపే విధంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు.

Popular Posts

Topics :